
పశు వ్యాధులపై అవగాహన అవసరం
నల్లగొండ టౌన్ : పశువులకు వచ్చే వ్యాధ్యులపై అవగాహన ఉండాలని పశు సంవర్థక శాఖ రిటైర్డ్ రాష్ట్ర డైరెక్టర్ వై.తిరుపతయ్య అన్నారు. శనివారం ప్రపంచ పశు వైద్య దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పశు వైద్యం, పశువుల్లో వ్యాధుల నివారణ, జునోటిక్ వ్యాధుల నివారణలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ జేడీ రమేష్, డాక్టర్ టి.నర్సింహులు, డాక్టర్ వెంకటయ్యనాయుడు, ఎం.శ్రీనివాసులు, ఎం.చరిత, సతీష్‌రెడ్డి, యాదగిరి పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో
ఎన్‌రోల్‌మెంట్ పెంచాలి
నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన టీఎస్‌యూటీఎఫ్ ఉద్యమ తరగతుల్లో ఆయన మాట్లాడారు. హక్కులు, బాధ్యతలు రెండు కళ్లుగా పనిచేస్తున్న టీఎస్ యూటీఎఫ్.. ఉద్యమ తరగతుల్లో ప్రభుత్వ విద్యారంగ రక్షణకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల ఎక్కడివక్కడే ఉన్నాయని.. ఇప్పటికే ఐదు డీఏలు, పీఆర్‌సీలు పెండింగ్ లో ఉన్నాయని, పెండింగ్ బిల్లులు రెండు సంవత్సరాల నుంచి విడుదల కాలేదన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి, రాష్ట్ర కార్యదర్శులు ఎం.రాజశేఖర్‌రెడ్డి, జి.నాగమణి, జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షులు బి.అరుణ, నర్రా శేఖర్‌రెడ్డి, కోశాధికారి వడిత్య రాజు, నల్ల నరసింహ, ఎడ్ల సైదులు, సిహెచ్.అరుణ, రామలింగయ్య, శ్రీనివా స్‌రెడ్డి, నరసింహ, రమాదేవి, వెంకన్న, చిన వెంకన్న, సైదులు, మురళయ్య పాల్గొన్నారు.