Top Stories
ప్రధాన వార్తలు

Earthquake Updates: ఎటు చూసినా విషాదమే!
Earthquake Live Rescue OP Updates👉మయన్మార్‌లో మళ్లీ భూకంపంమయన్మార్‌ను వణికించిన మరో భూకంపంసహాయక చర్యలు కొనసాగుతుండగానే గతరాత్రి మళ్లీ భూకంపం4.2 తీవ్రతతో మళ్లీ ప్రకంపనలునిన్నటి భూకంపం ధాటికి 200 మంది మరణించినట్లు ప్రకటించిన అధికారులుఇంకా భారీగా మృతులు ఉండే అవకాశంవెయ్యి మంది మరణించి ఉండొచ్చని అంచనా వేస్తున్న అమెరికా భూకంపం సర్వే సంస్థ👉 థాయ్‌లాండ్‌లో కొనసాగుతున్న ఎమర్జెన్సీథాయ్‌లాండ్‌లో భూకంపంతో అత్యవసర పరిస్థితి ప్రకటనఉత్తర థాయ్‌లాండ్‌లో తీవ్ర నష్టంరాజధాని బ్యాంకాక్ అతలాకుతలంకొనసాగుతున్న శిథిలాల తొలగింపు భారీ సంఖ్యలో మృతులు ఉండే అవకాశం👉హృదయ విదారకం మయన్మార్, థాయ్‌లాండ్‌ల్లో హృదయవిదారకంగా భూకంప దృశ్యాలు పలుచోట్ల కుప్పకూలిన భవనాలు, నిర్మాణాల కింద నుంచి హాహాకారాలు స్కూల్స్, ఆఫీసులు, ఆస్పత్రులు.. ఇలా అన్ని కుప్పకూలిన వైనంశిథిలాల నడుమ తమవారి కోసం కన్నీటి మధ్యే వెదుక్కుంటున్న జనం కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు 👉మయన్మార్, థాయ్‌లాండ్‌ను కుదిపేసిన భారీ భూకంపంకుప్పకూలిన భవనాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టంఇంకా శిథిలాల కిందే పలువురు.. కొనసాగుతున్న సహాయకచర్యలుమయన్మార్‌లో ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటనథాయ్‌లాండ్‌లో భారతీయుల సహాయార్థఇండియన్ ఎంబసీ హెల్ప్‌లైన్‌థాయ్‌లాండ్‌లో హెల్ఫ్‌లైన్ నెంబర్ +66618819218ఊహించని ప్రకృతి వికృతి చర్య.. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్ పాలిట భారీ భూకంపం గోరుచుట్టుపై రోకటిపోటుగా మారింది.టిబెట్ పీఠభూమి ప్రాంతంలో సంక్లిష్టమైన టెక్టానిక్ ఫలకాలపై ఉన్నందున మయన్మార్‌కు భూకంప ముప్పు ఎక్కువే. ఇక్కడ హెచ్చు తీవ్రతతో కూడిన భూకంపాలు పరిపాటి. భూమి పై పొరలోని ఇండో, బర్మా టెక్టానిక్ ఫలకాలు సమాంతరంగా కదలడమే తాజా భూకంపానికి కారణమని సైంటిస్టులు తేల్చారు. భూ ఫలకాల అంచులను ఫాల్ట్‌గా పిలుస్తారు. లక్షలాది ఏళ్ల కింద భారత ఉపఖండం ఆసియాను ఢీకొట్టడం వల్ల ఏర్పడ్డ సాగయింగ్ ఫాల్ట్‌గా పిలిచే పగుళ్ల వెంబడే తాజా భూకంపం చోటుచేసుకుంది. ఇక్కడ టెక్టానిక్ ఫలకాలు ఏటా 0.7 అంగుళాల చొప్పున పరస్పర వ్యతిరేక దిశలో కదులుతున్నాయి. ఫలితంగా పుట్టుకొచ్చే ఒత్తిడి భూకంపాలుగా మారుతుంటుంది. ఇక్కడ దశాబ్దానికి ఒక్క భారీ భూంకంపమన్నా నమోదవుతుంటుంది. మయన్మార్‌లో గత వందేళ్లలో 6కు మించిన తీవ్రతతో 14కు పైగా భూకంపాలు నమోదయ్యాయి. 1946లో 7.7, 1956లో 7.1 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. 1988 నాటి భూకంపానికి వేలాది మంది బలయ్యారు. 2011, 2016ల్లో కూడా 6.9 తీవ్రతతో భూకంపాలొచ్చాయి. 👉ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకుల్లా వణికిపోయిన థాయ్‌లాండ్, మయన్మార్‌మార్చి 28 శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇటు మయన్మార్‌లో.. 7.4 తీవ్రతతో సంభవించిన ప్రకంపనలు అటు థాయ్‌లాండ్‌లోనూ భారీ విధ్వంసం సృష్టించాయి. మయన్మార్‌లో 6.4 తీవ్రతతో మరోసారి భూమి కంపించగా తర్వాత కూడా మరో నాలుగైదు ప్రకంపనాలు వణికించాయి. ఇటు మయన్మార్‌లో.. అటు థాయ్ రాజధాని బ్యాంకాక్‌లో భారీ భవనాలు కళ్లముందే పేకమేడల్లా కుప్పకూలాయి. మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

వద్దనుకున్నవాడే... ఆపద్బాంధవుడయ్యాడు!
ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను అభిమానులు అంత త్వరగా మరచిపోలేరు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేస్తే... ఛేదనలో చెలరేగిపోయిన రైజర్స్ 9.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 167 పరుగులు చేసి విజయం సాధించింది!దూకుడే మంత్రంగా సాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... ఈ సీజన్లో రాజస్తాన్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనూ 286 పరుగులతో విజృంభించింది. రెండో మ్యాచ్‌లో లక్నోతో తలపడాల్సి రావడంతో మరింత భారీ స్కోరు ఖాయమే అని అభిమానులంతా అంచనాకు వచ్చేశారు. అందుకు తగ్గట్లే రైజర్స్‌కు మొదట బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. ఇంకేముంది మరోసారి పరుగుల వరద ఖాయం అనుకుంటే... ఒకే ఒక్కడు హైదరాబాద్ జోరుకు అడ్డుకట్ట వేశాడు!! ఐపీఎల్ వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయని ఆ ప్లేయర్... అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న రైజర్స్ జోరుకు కళ్లెం వేశాడు. ప్రమాదకర ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు క్రితం మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్‌ను వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపి ఆరెంజ్ ఆర్మీని నిలువరించాడు. చివర్లో మరో రెండు వికెట్లు తీసిన అతడే భారత సీనియర్ ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్. అనూహ్య అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటున్న శార్దుల్‌పై ప్రత్యేక కథనం... జాతీయ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 80కి పైగా మ్యాచ్‌లు ఆడిన అనుభవం... మీడియం పేస్‌తో పాటు లోయర్ ఆర్డర్లో విలువైన పరుగులు చేయగల నైపుణ్యం... తాజా రంజీ ట్రోఫీలో అటు బంతితో పాటు ఇటు బ్యాట్‌తో చక్కటి ప్రదర్శన చేసినప్పటికీ... శార్దుల్ ఠాకూర్‌ను ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసుకోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శార్దుల్‌పై ఏ జట్టు ఆసక్తి కనబర్చలేదు. దీంతో కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్న ఈ ఆల్‌రౌండర్‌కు... భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ నుంచి పిలుపు వచ్చిoది. ‘ప్రయత్నాలు విడిచిపెట్టకు. నిన్ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రిప్లేస్‌మెంట్‌గా నువ్వు టీమ్‌లో చేరితే తొలి మ్యాచ్ నుంచే బరిలోకి దిగాల్సి ఉంటుంది’ అని లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ జహీర్ ఖాన్ చెప్పిన మాటలతో శార్దుల్ తనను తాను టి20 ఫార్మాట్‌కు సిద్ధం చేసుకున్నాడు. లక్నో పేసర్ మొహసిన్ ఖాన్ గాయంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌కు దూరం కావడంతో... అతడి స్థానంలో ప్రత్యామ్నాయంగా శార్దుల్‌ను జట్టులోకి తీసుకున్నారు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న శార్దుల్ తొలి మ్యాచ్ నుంచే తనదైన ముద్ర వేశాడు. తొలి మ్యాచ్‌లో 2 ఓవర్లే... విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన పోరులో శార్దుల్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. భారీ స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే శార్దుల్ 2 వికెట్లు పడగొట్టి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. ఇన్నింగ్స్ మూడో బంతికి మెక్‌గుర్క్‌ను ఔట్ చేసిన ఈ ముంబైకర్... ఐదో బంతికి అభిõÙక్ పొరెల్‌ను బుట్టలో వేసుకున్నాడు. దీంతో భారీ ఛేదనలో ఢిల్లీ ఆరంభంలోనే తడబడింది. అయితే ఆ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్... శార్దుల్‌ను సరిగ్గా వినియోగించుకోలేదు. 2 ఓవర్ల తర్వాత అతడికి అసలు తిరిగి బౌలింగే ఇవ్వలేదు. దీంతో పంత్ సారథ్యంపై సర్వత్ర విమర్శలు వ్యక్తం కాగా... రెండో మ్యాచ్‌లో హైదరాబాద్‌పై దాన్ని పునరావృతం కానివ్వకుండా చూసుకున్నాడు. దాని ఫలితమే శార్దుల్ ఐపీఎల్లో తన అత్యుత్తమ గణాంకాలు (4/34) నమోదు చేసుకోవడంతో పాటు లీగ్‌లో 100 వికెట్ల మైలురాయిని సైతం దాటాడు. షార్ట్‌బాల్‌తో అబిషేక్‌కు బైబై చెప్పిన శార్దుల్... తదుపరి బంతికే ఇషాన్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ బాట పట్టించాడు. చివర్లో మరోసారి బౌలింగ్‌కు వచి్చన అతడు... అభినవ్ మనోహర్, మొహమ్మద్ షమీని ఔట్ చేశాడు. రైజర్స్‌కు కళ్లెం... హిట్టర్లతో దట్టంగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగినట్లు శార్దుల్ వెల్లడించాడు. ‘రైజర్స్ బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లపై తీవ్ర ఒత్తిడి పెంచి భారీ షాట్లు ఆడుతూ మ్యాచ్‌ను లాగేసుకుంటున్నారు. అలాంటిది వారిపై ఒత్తిడి పెంచితే ఫలితాలు రాబట్టవచ్చు అని ముందే అనుకున్నా. చాన్స్ తీసుకోవాలనుకున్నా.ఫ్లాట్ పిచ్‌పై ఆరంభంలోనే ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకోవడం సన్‌రైజర్స్ ప్లేయర్లకు అలవాటు. అలాంటిది వారిని భారీ స్కోరు చేయకుండా మొదట్లోనే అడ్డుకోవాలని భావించా. నా ప్రణాళికలకు తగ్గట్లే బౌలింగ్ చేశాను. మెరుగైన ఫలితాలు రావడం ఆనందంగా ఉంది. నేనెప్పుడు వ్యక్తిగత ప్రదర్శనను పట్టించుకోను. జట్టు విజయంలో నా వంతు పాత్ర ఉండాలని భావిస్తా’ అని శార్దుల్ అన్నాడు. ఐపీఎల్‌లోని అన్నీ జట్లలో బౌలింగ్ లైనప్ బలహీనంగా ఉందని విమర్శలు మూటగట్టుకున్న లక్నో... ఇప్పుడు శార్దుల్ మ్యాజిక్‌తో ముందుకు సాగుతోంది. లీగ్‌లో మున్ముందు కూడా ఇదే ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నుట్లు ఈ ఆల్‌రౌండర్ వెల్లడించాడు. జహీర్ ఫోన్ కాల్‌తో.. ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసుకోకపోవడంతో... శార్దుల్ దేశవాళీల్లో మరింత పట్టుదలగా ఆడాడు. 2024–25 రంజీ సీజన్లో ముంబై జట్టు తరఫున ఈ ఆల్‌రౌండర్ 35 వికెట్లు తీయడంతో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగి 500 పైచిలుకు పరుగులు చేశాడు. ‘రంజీ నాకౌట్ మ్యాచ్‌ల సమయంలో జహీర్ ఖాన్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో సాధన కొనసాగించా. వేరే జట్లు కూడా సంప్రదించినప్పటికీ... జహీర్ ముందు ఫోన్ చేయడంతో అతడి మాటకు విలువ ఇచ్చి లక్నో జట్టులో చేరేందుకు అంగీకరించా’ అని శార్దుల్ చెప్పాడు. ఐపీఎల్ వేలంలో కొనుగోలు ఏ జట్టు కొనుగోలు చేసుకోక పోవడంతో ఏమాత్రం నిరుత్సాహానికి గురికాని శార్దుల్... మరింత క్రమశిక్షణతో తన బౌలింగ్ అ్రస్తాలను పెంచుకొని ఫలితాలు రాబడుతున్నాడు. –సాక్షి, క్రీడావిభాగం

6 రుచులు... 6 ఆరోగ్య లాభాలు
ఉగాది పచ్చడిని సేవించే ఆచారం శాలివాహన శకారంభం నుంచి మొదలైనట్లుగా చరిత్రకారులు చెబుతారు. సంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడిని కొత్త మట్టికుండలోతయారు చేస్తారు. ఉగాది పచ్చడిలో వేపపూత, మామిడి పిందెలు, చింతపండు, ఉప్పు, మిరియాల పొడి, బెల్లం, అరటిపండు ముక్కలు ఉపయోగిస్తారు. వీటి వల్ల ఉగాది పచ్చడి ఆరురుచుల సమ్మేళనంగా తయారవుతుంది. ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలు, వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం....బెల్లం, అరటి పండ్లు– తీపిబెల్లం తీపిగా ఉంటుంది. ఎండ వేడిమి వల్ల కలిగే అలసటను పోగొట్టి, తక్షణ శక్తినిస్తుంది. బెల్లాన్ని అరటిపండుతో కలిపి తీసుకోవడం శ్రేష్ఠమని ఆయుర్వేదం చెబుతోంది. అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలను అరటిపండు నిరోధిస్తుంది.చింతపండు– పులుపుఉగాది పచ్చడి తయారీకి పాత చింతపండు ఉపయోగించడం మంచిది. పాత చింతపండు ఉష్ణాన్ని, వాత దోషాలను తగ్గిస్తుంది. బడలికను పోగొడుతుంది. జఠరశక్తిని పెంచుతుంది. మూత్రవిసర్జన సజావుగా సాగేందుకు దోహదపడుతుంది. వేసవిలో చింతపండు రసం తీసుకోవడం వల్ల ఉష్ణదోషాలు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది.ఉప్పురుచులకు రారాజులాంటిది ఉప్పు. ఉప్పులేని పప్పులు, కూరలు, పచ్చళ్లు రుచించవు. ఆహారంలో అనునిత్యం ఉపయోగించే ఉప్పు త్రిదోషాలను– అంటే, వాత పిత్త కఫ దోషాలు మూడింటినీ పోగొడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే, ఉప్పును మోతాదులోనే వాడాలి.మామిడి పిందెలు– వగరుమామిడి కాయలు ముదిరితే పులుపుగా ఉంటాయి గాని, పిందెలు వగరుగా ఉంటాయి. మామిడి పిందెల వగరుదనం లేకుంటే, ఉగాది పచ్చడికి పరిపూర్ణత రాదు. మామిడి పిందెలలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. మామిడి పిందెలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని త్రిదోషాలను హరించి, శక్తిని కలిగిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.వేపపూలు– చేదువసంతారంభంలో వేపపూలను తినే ఆచారం దాదాపు అన్నిప్రాంతాల్లోనూ ఉంది. దీనిని ‘నింబకుసుమ భక్షణం’ అంటారు. షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిలో వేపపూలను ఉపయోగించడం మన తెలుగువాళ్లకే చెల్లింది. వేపపూలు కఫదోషాన్ని, క్రిమిదోషాలను పోగొడతాయి. జీర్ణకోశ సమస్యలను నివారిస్తాయి.మిరియాల పొడి–కారంమిరియాలను నేరుగాను, పొడిగాను వంటకాల్లో తరచుగా వినియోగిస్తూనే ఉంటాం. మిరియాలు రుచికి కారంగా ఉన్నా, శరీరానికి చాలా మేలు చేస్తాయి. మిరియాలు కఫదోషాన్ని, విష దోషాలను హరిస్తాయి. చర్మవ్యాధులను అరికట్టడమే కాకుండా, జీర్ణశక్తిని, శరీరంలోని జీవక్రియలను పెంచుతాయి. అందుకే సంప్రదాయ ఆయుర్వేద ఔషధాల్లో మిరియాలను విరివిగా ఉపయోగిస్తారు.

టీవీని దాటేసిన డిజిటల్ మీడియా
న్యూఢిల్లీ: దేశీయంగా డిజిటల్ మీడియా జోరుగా వృద్ధి చెందుతోంది. 2024లో సాంప్రదాయ టీవీ మాధ్యమాన్ని కూడా దాటేసి మీడియా, వినోద రంగంలో (ఎంఅండ్‌ఈ) అతి పెద్ద సెగ్మెంట్‌గా ఆవిర్భవించింది. మొత్తం ఆదాయాల్లో 32 శాతం వాటాను దక్కించుకుంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ–ఈవై నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2026లో ప్రకటనలపై ఆదాయాలపరంగా రూ. 1 లక్ష కోట్ల మార్కును అధిగమించే తొలి ఎంఅండ్‌ఈ విభాగంగా డిజిటల్ మీడియా నిలవనుంది. దేశీ ఎంఅండ్‌ఈ రంగం వచ్చే మూడేళ్లలో 7 శాతం వృద్ధితో రూ. 3 లక్షల కోట్ల స్థాయిని దాటుతుందని నివేదిక వివరించింది. 2024లో దేశీ ఎంఅండ్‌ఈ రంగం రూ. 2.5 లక్షల కోట్ల స్థాయికి చేరుకోగా, స్థూల దేశీయోత్పత్తిలో 0.73 శాతం వాటాను దక్కించుకుంది. ‘ఈ పరిశ్రమ 2025లో 7.2 శాతం వృద్ధి చెంది రూ. 2.7 లక్షల కోట్లకు, ఆ తర్వాత 7 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2027 నాటికి రూ. 3.1 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుంది‘ అని నివేదిక వివరించింది. వినూత్న వ్యాపార విధానాల దన్ను.. ఈ భారీ వృద్ధికి వినూత్న వ్యాపార విధానాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, పరిశ్రమలో స్థిరీకరణ తదితర అంశాలు తోడ్పడనున్నాయి. దేశీ ఎంఅండ్‌ఈ రంగం 2023లో 8.3 శాతం పెరగ్గా గతేడాది 3.3 శాతం (సుమారు రూ. 8,100 కోట్లు) వృద్ధి చెందింది. సబ్‌్రస్కిప్షన్ ఆదాయాలు తగ్గడం, భారత్‌కి యానిమేషన్.. వీఎఫ్ఎక్స్ ఔట్సోర్సింగ్ వర్క్ తగ్గిపోవడం వంటి అంశాలు ఇందుకు కారణం. మరోవైపు, ఈ–కామర్స్ వెబ్సైట్లు సహా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రకటనలు, ప్రీమియం.. డిజిటల్ అవుటాఫ్ హోమ్ (ఓఓహెచ్) మీడియాకు డిమాండ్ పెరగడంతో పరిశ్రమ అడ్వరై్టజింగ్ ఆదాయాలు 8.1 శాతం పెరిగాయి. డిజిటల్ మీడియా (17 శాతం) లైవ్ ఈవెంట్లు (15 శాతం), ఓఓహెచ్ మీడియా (10 శాతం) ఈ వృద్ధికి దోహదపడ్డాయి. డిజిటల్ వినియోగం వేగవంతమవుతుండటం, వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతుండటం తదితర అంశాల నేపథ్యంలో భారతీయ మీడియా, వినోద రంగం కీలక పరివర్తన దశలో ఉందని ఫిక్కీ చైర్మన్ (మీడియా, ఎంటర్టైన్మెంట్ కమిటీ) కెవిన్ వాజ్ చెప్పారు. దీనితో కంటెంట్ క్రియేటర్లు, ప్రకటనకర్తలు, టెక్నాలజీ ఆవిష్కర్తలకు అపార అవకాశాలు లభిస్తున్నాయని వివరించారు.

అదే దౌర్జన్యం.. అడుగడుగునా బెదిరింపుల పర్వం
సాక్షి, పుట్టపర్తి/సాక్షి, భీమవరం/నరసరావుపేట రూరల్/కారంపూడి/ప్రొద్దుటూరు: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార కూటమి నేతలు బెదిరింపులు, దౌర్జన్యాలు, అడ్డగింతలను నమ్ముకునే ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు, హెచ్చరికలు, గొడవల కారణంగా గురువారం ఏడు చోట్ల వాయిదా పడిన ఎన్నికలు... శుక్రవారం కూడా వాయిదా పడ్డాయి. అధికార పార్టీ నేతల నిర్వాకంతో ఉమ్మడి అనంతపురం జిల్లా గాండ్లపెంట, రామగిరి, పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి, యలమంచిలిలో ఎంపీపీ, పల్నాడు జిల్లా నరసరావుపేట, కారంపూడిలో వైస్ ఎంపీపీ, వైఎస్సార్ జిల్లా గోపవరంలో ఉప సర్పంచ్ పదవులకు శుక్రవారం ఎన్నిక నిర్వహించలేకపోయారు.గురువారం రాష్ట్రవ్యాప్తంగా 50 చోట్ల జరిగిన ‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 40 స్థానాల్లో (ఒక రెబల్‌తో కలిపి) తన హవాను చాటుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాయిదా పడిన ఏడు చోట్ల శుక్రవారం ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ఎన్నిక నిర్వహించే కార్యాలయం వద్దకు రాకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పోలీసులు ఇందుకు వారికి సహకరించారు. వాస్తవానికి కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే తిరిగి నిర్వహిస్తున్న నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టంగా ఎన్నికలు సాగాల్సి ఉంది. అయితే ఈ స్థానాలు కూడా వైఎస్సార్సీపీ వశమైతే ప్రజల్లో కూటమి పట్ల వ్యతిరేకత మరింత ప్రబలుతుందని అధికార పార్టీ పెద్దలు బెంబేలెత్తిపోయారు. అడ్డుకోవాలంటూ స్థానిక నేతలకు కనుసైగ చేశారు. దీంతో శుక్రవారం కూడా ఉప ఎన్నికలు నిర్వహించలేకపోయారు. టీడీపీ నేతల దౌర్జన్యకాండ..టీడీపీ నేతల దాష్టీకంతో శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలు తిరిగి వాయిదా పడ్డాయి. నిర్ణీత సమయంలోగా మూడింట రెండు వంతుల సభ్యులు హాజరు కాకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలంలో ఏడుగురు సభ్యులకు గాను ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. రామగిరిలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు రెండు రోజులుగా టీడీపీ నేతల దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నిక సజావుగా జరిగితే వైఎస్సార్సీపీకి ఎంపీపీ పదవులు దక్కుతాయని భావించి గాండ్లపెంటలో టీడీపీ కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, రామగిరిలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ ఎన్నిక జరగకుండా గురువారం ఆటంకాలు సృష్టించిన విషయం తెలిసిందే.ఉప ఎన్నికల వాయిదా.. ఎంపీపీ: 4 వైస్ ఎంపీపీ: 2 ఉప సర్పంచ్: 1 మొత్తం: 7 పశ్చిమలో కూటమి అధికార మదంపశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీకి ఏకపక్షం కావాల్సిన అత్తిలి, యలమంచిలి ఎంపీపీ ఎన్నికలను రెండో రోజైన శుక్రవారం కూడా కూటమి నేతలు తమ అధికార మదాన్ని చూపించి అడ్డుకున్నారు. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు, అత్తిలిలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెరవెనుక నుంచి తంతు నడిపించారు. సమావేశం ఉందని చెప్పి మండలంలోని ఉపాధి హామీ పథకం కూలీలు, డ్వాక్రా మహిళలను అత్తిలికి తరలించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంటి వద్ద మహిళలను మోహరించారు. ఒక్కొక్కరికి రూ.500 నగదు, బిర్యానీ ప్యాకెట్ ఇస్తామని చెప్పి ఉంచారు. కొందరు టీడీపీ కార్యకర్తలు కారుమూరి నివాసం చుట్టూ మోటారు సైకిళ్లపై హల్చల్ చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను కవ్వించే ప్రయత్నాలు చేశారు. 13 మంది వైఎస్సార్సీపీ సభ్యులు గురువారం రాత్రి రహస్య ప్రదేశంలో ఉండిపోయారు. శుక్రవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల్లో పాల్గొనాలని భావించారు. అయితే ఎంత ప్రయత్నించినా వైఎస్సార్సీపీ సభ్యులు ఎక్కడున్నదీ తెలియకపోవడంతో ఏ రోడ్డు నుంచైనా వచ్చేస్తారని ఉదయం నుంచి అత్తిలి గ్రామానికి వచ్చే రోడ్లన్నింటినీ కూటమి నేతలు దిగ్బంధించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామానికి వచ్చే బస్సులు, ఆటోలు, ఇతర అన్ని వాహనాలను తనిఖీ చేసి వైఎస్సార్సీపీ సభ్యులు లేరని నిర్ధారించుకున్న తర్వాతే వదిలారు. వైఎస్సార్సీపీ సభ్యులు ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు కూటమి మూకలు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు చేష్టలుడిగి చూడటం గమనార్హం. ఈ నేపథ్యంలో తమ సభ్యులను పోలీసు రక్షణతో ఎన్నికలకు హాజరు పర్చేందుకు మాజీ మంత్రి కారుమూరి పోలీస్ అధికారులను ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు.పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల నిర్వాకంపల్నాడు జిల్లా నరసరావుపేట, కారంపూడి మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక రెండోసారీ వాయిదా పడింది. టీడీపీ నేతల దౌర్జన్యం కారణంగా కోరం లేకపోవడంతో ఈ రెండు చోట్ల ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నరసరావుపేటలో కేవలం నలుగురు ఎంపీటీసీ సభ్యులు, కారంపూడిలో ఒకే ఒక్కరు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ సభ్యులు రాకుండా టీడీపీ నేతలు ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు. దీంతో కోరం లేదన్న విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబుకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించి ఎన్నికను వాయిదా వేశారు. తదుపరి ఎన్నికల తేదీని తర్వాత ప్రకటిస్తారని అధికారులు తెలిపారు. బలం లేకపోయినా సరికొత్త నాటకంపశ్చిమగోదావరి జిల్లా యలమంచిలిలో ఎన్నిక ప్రారంభానికి ముందే కూటమి నాయకులు నాటకీయ పరిణామాలకు తెరలేపారు. గుంపర్రు ఎంపీటీసీ సభ్యురాలు కంభాల సత్యశ్రీ కనిపించడం లేదని ఆమె కుమార్తె ఫిర్యాదు చేసిందంటూ పోలీసులు వచ్చి సత్యశ్రీని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ కూటమి నాయకులు ఆమె కుమార్తె ద్వారా సత్యశ్రీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. తాను ప్రాణం పోయినా వైఎస్సార్సీపీని వీడేది లేదని ఆమె స్పష్టం చేయడంతో పోలీసులు తిరిగి ఆమెను మండల పరిషత్ కార్యాలయానికి తీసుకు వచ్చి దించడం గమనార్హం.అనంతరం నిర్ణీత సమయానికి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నికకు వైఎస్సార్సీపీ నుంచి 12 మంది, కూటమికి చెందిన నలుగురు సభ్యులు హాజరయ్యారు. అటెండెన్స్ ప్రక్రియ పూర్తయ్యాక కూటమి సభ్యులు లేచి తమను వైఎస్సార్సీపీ సభ్యులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఎన్నిక ఏ విధంగా జరిపిస్తారంటూ వాగ్వాదానికి దిగారు. సంగతి తేల్చాలంటూ ఘర్షణ వాతావరణం, గందరగోళ పరిస్థితులు సృష్టించారు. ఈ నేపథ్యంలో తనకు గుండెల్లో దడగా ఉందంటూ రిటర్నింగ్ అధికారి ఎం.శ్రీనివాస్ బయటకు వెళ్లిపోయారు. శాంతిభద్రతల దృష్ట్యా ఎన్నిక నిర్వహించడానికి సరైన వాతావరణం లేనందున వాయిదా వేస్తున్నట్టు ఎంపీడీఓ ఎ.ప్రేమాన్విత్ ప్రకటించారు. తమకు పూర్తి సంఖ్యాబలం ఉండగా కూటమి సభ్యులను భయపెట్టాల్సిన అవసరం ఏముందని వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నించినా వారు స్పందించలేదు. వాళ్లలో వాళ్లే గొడవ పడుతూ హైడ్రామావైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం వైఎస్సార్సీపీ వార్డు సభ్యులపై దౌర్జన్యం, దాడులకు దిగటంతో ఎన్నిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజైన శుక్రవారం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ సభ్యులు హైడ్రామాకు తెర తీశారు. ఎన్నికల కార్యాలయంలో.. పథకం ప్రకారం టీడీపీకి చెందిన 7వ వార్డు సభ్యురాలు కాచన రామలక్షుమ్మ, ఉప సర్పంచ్ అభ్యర్థి మండ్ల రమాదేవి వాగ్వాదానికి దిగారు.ఒకరినొకరు ద్వేషించుకున్నారు. వీరు గొడవ పడుతుండగానే 8వ వార్డు సభ్యురాలు గాయత్రి ఎన్నికల అధికారి వద్ద ఉన్న మినిట్స్ బుక్‌ను లాక్కొని చించేశారు. ఈ సందర్భంగా 5వ వార్డు సభ్యుడు ఆదినారాయణరెడ్డి కుర్చీలు విసిరేశాడు. టీడీపీ సభ్యులైన వీరంతా కలిసి పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చేశారు. ఇంతలోనే ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి తనకు గుండెపోటు వచ్చిందని కుర్చీలో కూర్చుండిపోయారు. అంబులెన్స్‌ను పిలిపించి ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. దీంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కాగా, స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకే ఇక్కడ ఈ హైడ్రామా చోటుచేసుకుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఈ రాశి వారు కొత్త పనులు చేపడతారు.. బంధువుల కలయిక
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: అమావాస్య సా.5.04 వరకు, తదుపరి చైత్ర శుద్ధ పాడ్యమి, నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.8.21 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: ఉ.6.49 నుండి 8.17 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.26 నుండి 7.37 వరకు, అమృతఘడియలు: ప.3.48 నుండి 5.16 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.01, సూర్యాస్తమయం: 6.08.మేషం: పనులు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శనం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.వృషభం: కొత్త పనులు చేపడతారు. బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.మిథునం: పరిచయాలు పెరుగుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.కర్కాటకం: వ్యయప్రయాసలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ధనవ్యయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.సింహం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. నిర్ణయాలలో మార్పులు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.కన్య: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.తుల: కొత్త వ్యక్తుల పరిచయం. ఆహ్వానాలు రాగలవు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.వృశ్చికం: రుణఒత్తిడులు. ఇంటాబయటా సమస్యలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప మార్పులు.ధనుస్సు: రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి.మకరం: ఆహ్వానాలు అందుతాయి. కుటుంబసభ్యులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.కుంభం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు.మీనం: కొత్త పనులు చేపడతారు. బంధువుల కలయిక. విందువినోదాలు. ప్రయత్నాలు అనుకూలం. పాతమిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

పౌర హక్కుల బాధ్యత కోర్టులు, పోలీసులదే
సాక్షి, అమరావతి: పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే విషయంలో పౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కోర్టులు, పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహం తమ ఆలోచనలను, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడమనేది ఆరోగ్యకరమైన, నాగరిక సమాజంలో అంతర్భాగమని పేర్కొంది. స్వేచ్ఛగా ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితం గడపడం అసాధ్యమవుతుందని తేల్చి చెప్పింది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆలోచనలను మరో అభిప్రాయంతో విబేధించాలేగానీ వాటిని అణచి వేయకూడదని పేర్కొంది.పోలీసులు విఫలమైతే కోర్టులు బాధ్యత తీసుకోవాలి...‘‘పోలీసులు లేదా కార్యనిర్వాహక సంస్థలు రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక హక్కులను గౌరవించడం, పరిరక్షించడంలో విఫలమైతే న్యాయస్థానాలు ముందుకు వచ్చి ఆ బాధ్యతను తీసుకోవాలి. ఎందుకంటే పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించగలిగే సంస్థ మరొకటి ఏదీ లేదు. మనది గణతంత్ర రాజ్యంగా అవతరించి 75 సంవత్సరాలు పూర్తయిన తరువాత కూడా మౌలిక సూత్రాలలో మనం ఇలా అస్థిరంగా ఉండకూడదు. కేవలం ఒక కవిత పఠనం, వినోద రూపంలో కళా ప్రదర్శన చేయడం లాంటివి సమూహాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించడం ఎంత మాత్రం సరైంది కాదు. ఇలాంటి దృక్పథాన్ని అంగీకరించడమంటే అది ప్రజాస్వామ్యంలో న్యాయసమ్మతమైన అన్ని అభిప్రాయాలను అణిచివేయడమే అవుతుంది. పోలీసులు రాజ్యాంగాన్ని గౌరవించాలి. అలాగే అందులోని ఆదర్శాలకు కట్టుబడి ఉండాలి’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని విమర్శించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అడ్డగోలుగా కేసులు బనాయిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్న నేపథ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పునకు ప్రాధాన్యత ఏర్పడింది.ఇమ్రాన్ ప్రతాప్‌గ్రాహిపై కేసు కొట్టివేత...ఇన్‌స్ట్రాగామ్‌లో అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గ్రాహిపై గుజరాత్ పోలీసులు నమోదు చేసిన కేసును సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఇమ్రాన్‌పై మోపిన నేరం ఏదీ ఆయనకు వర్తించదని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల భుయాన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ గురించి తీర్పులో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.విభేదించవచ్చు.. కానీ గౌరవించాలి!ఓ వ్యక్తి వ్యక్తం చేసే అభిప్రాయాలతో ఎంతోమంది విబేధించవచ్చునని, అయితే ఆ వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కును అందరూ గౌరవించడంతో పాటు ఆ హక్కును పరిరక్షించాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సాహిత్యం, కవిత్వం, నాటకాలు, సినిమాలు, వ్యంగ్య రచనలు, కళలు మానవ జీవితాన్ని మరింత అర్థవంతంగా మారుస్తాయని, వాటిని విద్వేషాలను రెచ్చగొట్టేవిగా పరిగణించరాదని సూచించింది. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను పరిరక్షించడంతో పాటు అవి అమలయ్యేలా చూడటం న్యాయస్థానాల ప్రధాన కర్తవ్యమని సుప్రీంకోర్టు తెలిపింది. కొన్నిసార్లు తమకు వినబడిన, రాయబడిన మాటలను న్యాయమూర్తులుగా తాము ఇష్టపడకపోవచ్చునని, అయినప్పటికీ పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అలాగే న్యాయమూర్తులుగా రాజ్యాంగాన్ని, అందులోని ఆదర్శాలను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా తమపై ఉందంది. పౌరుల హక్కులను రక్షించే విషయంలో సదా ముందు ఉండటం న్యాయస్థానాల బాధ్యతని వ్యాఖ్యానించింది. ప్రాథమిక హక్కులను కోర్టులు పరిరక్షించాలి...ప్రధానంగా రాజ్యాంగ న్యాయస్థానాలు పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించేందుకు అగ్రభాగంలో ఉండాలని సుప్రీం సూచించింది. రాజ్యాంగం, ఆదర్శాలను అణిచివేయకుండా చూడాల్సిన ఉత్కృష్ట బాధ్యత న్యాయస్థానాలపై ఉందని పేర్కొంది. న్యాయస్థానాలు ఎప్పుడూ పౌరుల ప్రాథమిక హక్కులను ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించి, దానిని ప్రోత్సహించే వైపే ఉండాలని తెలిపింది. ఇది స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉండే అత్యంత కీలకమైన హక్కు అని తేల్చి చెప్పింది. పౌరుల స్వేచ్ఛాయుత ఆలోచన, భావప్రకటన స్వేచ్ఛ మన రాజ్యాంగంలోని ప్రధానమైన ఆదర్శాలలో ఒకటని తెలిపింది. పోలీసులు కూడా ఈ దేశ పౌరులేనని, అందువల్ల రాజ్యాంగాన్ని అనుసరించడం, పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడం వారి బాధ్యతని తెలిపింది. విచారణకు స్వీకరించదగ్గ నేరం చేశారన్న సమాచారం అందినప్పుడు సదరు పోలీసు అధికారి మొదట ప్రాథమిక విచారణ చేపట్టాలంది. ప్రాథమిక విచారణ తరువాత ఆ నేరం విచారణకు స్వీకరించదగ్గదని తేలితే, అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని పేర్కొంది. విచారణకు స్వీకరించదగ్గ నేరం కాదని ప్రాథమిక విచారణలో తేలితే ఆ విషయాన్ని పోలీసులు సదరు ఫిర్యాదుదారుడికి తెలియచేయాలంది. తద్వారా ఫిర్యాదుదారు తనకున్న ఇతర ప్రత్యామ్నాయాలను చూసుకుంటారని తెలిపింది.» స్వేచ్ఛగా ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితం గడపడం అసాధ్యమవుతుంది» విచారణకు స్వీకరించదగ్గ నేరం కాదని ప్రాథమిక విచారణలో తేలితే ఆ విషయాన్ని పోలీసులు సదరు ఫిర్యాదుదారుడికి తెలియచేయాలి. తద్వారా ఫిర్యాదుదారు తనకున్న ఇతర ప్రత్యామ్నాయాలను చూసుకుంటారు.» ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆలోచనలను మరో అభిప్రాయంతో విబేధించాలేగానీ వాటిని అణచి వేయకూడదు.» స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉండే అత్యంత కీలకమైన హక్కు.. పౌరుల స్వేచ్ఛాయుత ఆలోచన, భావప్రకటన స్వేచ్ఛ మన రాజ్యాంగంలోని ప్రధానమైన ఆదర్శాలలో ఒకటి.

2026లో టీవీకే, డీఎంకే మధ్యే పోటీ
చెన్నై: తమిళనాడు అసెంబ్లీకి 2026లో జరిగే ఎన్నికలు వేరే విధంగా ఉండబోతున్నాయని సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ వ్యాఖ్యానించారు. ఈసారి టీఎంకే, అధికార డీఎంకే మధ్యనే పోటీ ఉండనుందన్నారు. శుక్రవారం చెన్నైలో జరిగిన పార్టీ ప్రప్రథమ జనరల్ కౌన్సిల్ సమావేశంలో విజయ్ మాట్లాడారు. సీఎం ఎంకే స్టాలిన్‌ను గౌరవనీయులైన రాచరిక ముఖ్యమంత్రిగా అభివర్ణించిన విజయ్.. డీఎంకే కుటుంబ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ అంటూ పూర్తి పేరును ఘనంగా చెప్పుకుంటే సరిపోదు, అది చేతల్లో, పాలనలో కనిపించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ అంటూ తిట్టిపోసే డీఎంకే కూడా అంతకంటే తక్కువేం కాదు, అదే ఫాసిస్ట్ వైఖరిని అనుసరిస్తోందని మండిపడ్డారు. ప్రజలు, కార్యకర్తలను కలుసుకోకుండా నన్ను ఆపడానికి మీరెవరు? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తనపై విధించిన ఆంక్షలను అనుసరించానన్నారు. సహజ వనరులు, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం కలుగజేసే ప్రాజెక్టులను మాత్రమే తన పార్టీ వ్యతిరేకిస్తుందంటూ ఉద్యోగులు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా ఉంటామన్నారు. రాబోయే టీవీకే ప్రభుత్వంలో ప్రజలే పాలకులుగా ఉంటారని, మిత్రపక్షాలతో అధికారాన్ని పంచుకుంటామని స్పష్టం చేశారు. అదే సమయంలో విజయ్ కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు నుంచి జీఎస్టీ రూపంలో పన్నులు వసూలు చేస్తూ రాష్ట్రానికి తగు విధంగా నిధులను కేటాయించడం లేదని ఆరోపించారు. త్రిభాషా విధానాన్ని రాష్ట్రంపై రుద్ద వద్దని, పార్లమెంట్లో ప్రాతినిథ్యాన్ని తగ్గించే డీలిమిటేషన్ అమలును ఆపాలని కోరారు. జమిలి ఎన్నికల విధానం వద్దన్నారు. ముస్లింల హక్కులను లాగేసుకునేలా ఉన్న వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని విజయ్ కోరారు. ఎన్నికల సంబంధ అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని విజయ్‌కు కట్టబెడుతూ ఈ సమావేశం ఒక తీర్మానం చేసింది. అదే సమయంలో, 543 లోక్‌సభ నియోజకవర్గాలను ఎప్పటికీ కొనసాగించాలన్నదే టీవీకే విధానమని పేర్కొంది. ఈ సందర్భంగా విజయ్ను దళపతికి బదులుగా ‘వెట్రి తలైవార్’అని సంబోధించాలంటూ సీనియర్ నేత ఆధవ్ అర్జున ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం తెలిపింది.

సినిమా చూస్తూ నవ్వుతూనే ఉన్నారు: హారిక సూర్యదేవర
‘మ్యాడ్ స్క్వేర్’ని కాలేజ్ స్టూడెంట్స్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తూ నవ్వుతూనే ఉన్నారు. ఇలా మా కష్టానికి తగ్గ ఫలితం దక్కడం హ్యాపీగా ఉంది’’ అని హారిక సూర్యదేవర తెలిపారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్ స్క్వేర్’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.అన్ని షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. కొన్ని ఏరియాల్లో ‘మ్యాడ్’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ‘మ్యాడ్ స్క్వేర్’కి మాత్రం మొదటి రోజే వచ్చే అవకాశం ఉంది’’ అన్నారు. ‘‘థియేటర్లో ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తుంటే... దీనికోసమే కదా మనం సినిమా తీసింది అనే అనుభూతి కలిగింది’’ అని కల్యాణ్ శంకర్ పేర్కొన్నారు. ‘‘థియేటర్లో ప్రేక్షకులు గోల చేసుకుంటూ సినిమా చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది’’ అన్నారు నార్నే నితిన్.‘‘మా సినిమాపై ఇంతటి ప్రేమ కురిపిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అని రామ్ నితిన్ చెప్పారు. ‘‘ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల చాలా ఆనందంగా ఉన్నాం’’ అన్నారు సంగీత్ శోభన్. ‘‘ఇలాంటి విజయవంతమైన సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది’’ అని ప్రియాంక జవాల్కర్ తెలిపారు.

పార్టీ కేసులకు ప్రజాధనం లూథ్రాకు రూ.2.86 కోట్లు అర్పణం
సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తమ ఆస్థాన న్యాయవాది సిద్దార్థ లూథ్రాకు పెద్ద మొత్తంలో ఫీజుల సంతర్పణ చేశారు. వ్యక్తిగతంగా, పార్టీపరంగా కష్ట కాలంలో తనకు అండగా నిలిచినందుకు సొంత సొమ్ము కాకుండా.. ప్రజల సొమ్మును గురుదక్షిణగా చెల్లించారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై నమోదు చేసిన నాలుగు వేర్వేరు కేసుల్లో వాదనలు వినిపించినందుకు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.86 కోట్లను ఫీజు రూపంలో చెల్లించింది. ఇందులో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులోనే ఆయనకు ఏకంగా రూ.1.25 కోట్లు చెల్లించింది. ఇందులో ఒక్క రోజు హాజరై వాదనలు వినిపించినందుకు రూ.75 లక్షలు చెల్లించారు. ఇదే కేసులో పలు తేదీల్లో హాజరై వాదనలు వినిపించినందుకు మరో రూ.50 లక్షలను ఫీజుల రూపంలో లూథ్రాకు చెల్లించారు. అలాగే తాడేపల్లి, కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి నమోదైన కేసులో వాదనలు వినిపించినందుకు ఆయనకు రూ.60 లక్షలు ఇచ్చారు. రఘురామకృష్ణంరాజు కేసులో చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో వాదించినందుకు లూథ్రాకు రూ.65 లక్షలు చెల్లించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వాదనలు వినిపించినందుకు రూ.10 లక్షలు చెల్లించారు. ఇలా మొత్తం 2.60 కోట్లు చెల్లించారు. దీనికి క్లర్కేజ్ (క్లర్కుకు చెల్లించాలంటూ) 10 శాతం అదనంగా అంటే రూ.26 లక్షలు కలిపి మొత్తం రూ.2.86 కోట్లు చెల్లించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. నామమాత్రంగా వాదనలు వినిపించి, వాయిదాలు కోరిన కేసుల్లోనూ ఆయనకు లక్షల్లో ఫీజులు చెల్లించడం విశేషం. లూథ్రా క్లర్కు సంపాదించిన రూ.26 లక్షలను ఇంత తక్కువ సమయంలో సంపాదించడం హైకోర్టులో 90% మంది న్యాయవాదులకు దుర్లభమైన పని.కేసు చిన్నదైనా, పెద్దదైనా.. ఆయనకే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన సిద్దార్థ లూథ్రా దాదాపు దశాబ్ద కాలంగా చంద్రబాబుకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, కింది కోర్టు.. ఇలా ఎక్కడైనా చంద్రబాబుకు కష్టం వస్తే అక్కడ లూథ్రా ప్రత్యక్షమవుతారు. చిన్న కేసయినా, పెద్ద కేసయినా లూథ్రాకే ఇచ్చేవారు. ఇందుకు అనుగుణంగానే చంద్రబాబు, టీడీపీపై లూథ్రా ఈగ కూడా వాలనిచ్చేవారు కాదు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టయినప్పుడు లూథ్రానే రంగంలోకి దిగారు. బాబు తరఫున రోజుల తరబడి వాదనలు వినిపించారు. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై పక్కా ఆధారాలుండటంతో ఆయన ఏమీ చేయలేకపోయారు. ఆయన వాదన ఏసీబీ కోర్టు ముందు నిలవలేదు. తర్వాత హైకోర్టులో ఆయన వాదన చెల్లలేదు. తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అక్కడా చంద్రబాబు తరఫున లూథ్రానే కీలక పాత్ర పోషించారు. అక్కడా చంద్రబాబు విజయం సాధించలేకపోయారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లూథ్రానే బయట ఉండి మొత్తం వ్యూహరచన చేశారు. ఇందుకు ఆయనకు కోట్ల రూపాయల మేర ఫీజులు చెల్లించారన్న విషయం అందరికీ తెలిసిందే.
లక్ష్యంలో 86 శాతానికి ద్రవ్యలోటు
ఫిబ్రవరిలో నిదానించిన మౌలిక రంగం
కాంట్రాక్ట్ మహిళా టెకీలకు సవాళ్లు
టీవీని దాటేసిన డిజిటల్ మీడియా
1,200 ఎకరాలు.. 10 లక్షల జనం
ఎఫ్ఎంసీజీ దిగ్గజాల షాపింగ్
బేస్మెంట్ పూర్తయితే వెంటనే రూ. 1,00,000
డిజిటల్ చెల్లింపులు.. ‘ఖాతా’కు చిల్లులు!
రెవెన్యూ ‘మాసం’
దారి తప్పిన దర్యాప్తు!
ముందు అతన్ని బ్రష్ చేసుకోమన్నా: నటి సురభి
రాజేంద్రప్రసాద్ బూతు మాటలపై డేవిడ్ వార్నర్ రియాక్షన్ ఇదీ..
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
15 ఏళ్ల క్రితం పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకున్నా.. కానీ అంతకంటే టైం వేస్ట్ ఇంకోటి లేదు!
అప్సర కేసు: ఒక్క రాత్రిలో తలకిందులైన జీవితాలు
గవర్నమెంట్ స్కూల్ టీచర్ కొడుకు.. కట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే విధ్వంసం
మంచు ఫ్యామిలీలో గొడవలు.. మామయ్యకేమైనా అవుతుందేమోనని..: విరానిక
BCCI Contracts: రుతురాజ్ గైక్వాడ్‌కు భారీ షాక్.. !
అప్సర కేసులో సాయికృష్ణకి జీవితఖైదు
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
లక్ష్యంలో 86 శాతానికి ద్రవ్యలోటు
ఫిబ్రవరిలో నిదానించిన మౌలిక రంగం
కాంట్రాక్ట్ మహిళా టెకీలకు సవాళ్లు
టీవీని దాటేసిన డిజిటల్ మీడియా
1,200 ఎకరాలు.. 10 లక్షల జనం
ఎఫ్ఎంసీజీ దిగ్గజాల షాపింగ్
బేస్మెంట్ పూర్తయితే వెంటనే రూ. 1,00,000
డిజిటల్ చెల్లింపులు.. ‘ఖాతా’కు చిల్లులు!
రెవెన్యూ ‘మాసం’
దారి తప్పిన దర్యాప్తు!
ముందు అతన్ని బ్రష్ చేసుకోమన్నా: నటి సురభి
రాజేంద్రప్రసాద్ బూతు మాటలపై డేవిడ్ వార్నర్ రియాక్షన్ ఇదీ..
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
15 ఏళ్ల క్రితం పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకున్నా.. కానీ అంతకంటే టైం వేస్ట్ ఇంకోటి లేదు!
అప్సర కేసు: ఒక్క రాత్రిలో తలకిందులైన జీవితాలు
గవర్నమెంట్ స్కూల్ టీచర్ కొడుకు.. కట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే విధ్వంసం
మంచు ఫ్యామిలీలో గొడవలు.. మామయ్యకేమైనా అవుతుందేమోనని..: విరానిక
BCCI Contracts: రుతురాజ్ గైక్వాడ్‌కు భారీ షాక్.. !
అప్సర కేసులో సాయికృష్ణకి జీవితఖైదు
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
సినిమా

రాబిన్‌హుడ్‌లో డేవిడ్ వార్నర్.. రెండు నిమిషాలకే ఇంత హంగామా చేశారా?
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ రోజే థియేటర్లలోకి వచ్చేసింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా ద్వారా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీ రిలీజ్ ముందు ప్రమోషన్లలోనూ బిజీగా పాల్గొన్నారు. రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిశారు. దీంతో రాబిన్‌హుడ్‌లో డేవిడ్ రోల్‌పై అభిమానుల్లో మరింత అంచనాలు పెరిగాయి.అయితే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ పాత్రపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కెమియో రోల్ అయినప్పటికీ ట్రైలర్ ఎంట్రీ ఇవ్వడం చూసిన ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఉంటుందని ఊహించారు. కానీ అభిమానులు ఊహించినంత స్థాయిలో మాత్రం డేవిడ్ పాత్ర కనిపించలేదు. కేవలం 2 నిమిషాల 50 సెకన్ల పాటు కనిపించి ఉస్సురుమనిపించారు. రాబిన్‌హుడ్‌లో కొద్దిసేపే కనిపించడంపై డేవిడ్ వార్నర్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అది కూడా కేవలం డ్రగ్ డీలర్ పాత్రలో కనిపించడం.. కథలో పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతో మైనస్‌గా మారింది.మూవీ ప్రమోషన్స్‌లో డైరెక్టర్ వెంకీ కుడుముల వార్నర్ పాత్రపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వార్నర్ రోల్ ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తుందని అన్నారు. అంతేకాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కావడం, స్వయంగా అతను కూడా మూవీ ప్రమోషన్లలో పాల్గొనడంతో అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కనీసం పది నిమిషాల పాటైనా వార్నర్ స్క్రీన్‌పై సందడి చేస్తే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వార్నర్.. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుందాం.

ఇంటికి చేరుకున్న అతియా శెట్టి.. కేఎల్ రాహుల్ వారసురాలికి ఘనస్వాగతం!
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ సతీమణి అతియా శెట్టి ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈనెల 24న పాప తమ జీవితంలోకి అడుగుపెట్టిందని సంతోషం వ్యక్తం చేసింది. ఆ తర్వాత పలువురు సినీతారలు, అభిమానులు అతియా శెట్టి దంపతులకు అభినందనలు తెలిపారు.అయితే తాజాగా అతియా శెట్టి తన బిడ్డతో కలిసి ఇంటికి చేరుకుంది. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న సందర్భంగా గ్రాండ్ వెల్కమ్ లభించింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. పూలు, కుంకుమతో తనకు స్వాగతం పలికి ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అతియా పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఫోటోలో 'ఓం' దేవుడి పేరును కూడా ప్రస్తావించింది.కాగా.. అతియాశెట్టి, కేఎల్ రాహుల్ గతేడాది నవంబర్ 2024న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాము మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. రెండు వారాల క్రితమే అతియా శెట్టి తన ప్రసూతి ఫోటోషూట్ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. అంతకుముందు కేఎల్, అతియా 2019లో డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో జనవరి 2023లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి సన్నిహితులు, బాలీవుడ్ సినీతారలు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. సునీల్ శెట్టి ఖండాలా ఫామ్‌హౌస్‌లో గ్రాండ్ వెడ్డింగ్ వేడుక జరిగింది.

'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ
టైటిల్ : మ్యాడ్ స్క్వేర్నటీనటులు: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శుభలేఖ సుధాకర్, మురళీధర్ గౌడ్, తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు: సూర్యదేవర హారిక, సాయి సౌజన్యసమర్పకులు: ఎస్. నాగ వంశీఎడిటింగ్: నవీన్ నూలిదర్శకత్వం, కథ: కల్యాణ్ శంకర్ సంగీతం: భీమ్స్ సిసిరోలియో, తమన్‌సినిమాటోగ్రఫీ: శామ్దత్విడుదల: మార్చి 28, 2025'మ్యాడ్ స్క్వేర్'తో(Mad Square) మరోసారి నవ్వులు పూయించేందుకు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ థియేటర్స్‌లోకి వచ్చేశారు. 2023లో విడుదలైన హిట్ సినిమా ‘మ్యాడ్’ (Mad) చిత్రానికి ఇది కొనసాగింపుగా ఉంది. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. నేడు (మార్చి 28) సినిమా విడుదలైంది. కాలేజీ నేపథ్యంతో పరిచయం అయిన కొందరు స్నేహితులు వారి చదువులు పూర్తి అయిన తర్వాత మళ్లీ ఒకచోట కలిస్తే వారి అల్లరి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE)లో చదువుకోవడం ఇష్టం లేక ఓ విద్యార్థి పారిపోయే సంఘటన నుంచి మ్యాడ్ పార్ట్-1 కథ మొదలవుతుంది. ఫైనల్‌గా ఆ విద్యార్థి RIEలోనే చదివి తీరుతాననే నిర్ణయంతో కథ ముగుస్తుంది. ఇప్పుడు లడ్డు గాడి పెళ్లితో మ్యాడ్ స్క్వేర్ కథ ప్రారంభమౌతుంది. కాలేజీ నుంచి తమ చదవులు పూర్తి చేసిన తర్వాత వారు ఏం చేశారనేది మ్యాడ్ స్క్వేర్‌లో ఫుల్ ఫన్‌తో దర్శకుడు చూపించాడు.కథేంటంటే..ఈ కథలో పెద్దగా లాజిక్స్ అంటూ ఏమీ ఉండవ్.. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని చూస్తే ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు. అశోక్ (నార్నె నితిన్), మనోజ్(రామ్ నితిన్), దామోదర్(సంగీత్ శోభన్),లడ్డు(విష్ణు) నలుగురు స్నేహితులు ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత విడిపోతారు. కానీ, లైఫ్‌లో సెటిల్ కాకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లడ్డు(విష్ణు) పెళ్లి నుంచి ఈ సినిమా అసలు కథ మొదలౌతుంది. స్నేహితులకు చెప్పకుండా లడ్డు పెళ్లికి రెడీ అయిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అతని మిత్రులు వేడక సమయంలో సడెన్‌గా ఎంట్రీ ఇస్తారు. ఈ క్రమంలో అక్కడ భారీగా ఫన్ మొదలౌతుంది. లడ్డుకు ఎలాగైనా పెళ్లి చేయాలని తండ్రి మురళీధర్ గౌడ్ ఎదురు కట్నం ఇచ్చి సంబంధం సెట్ చేస్తాడు. ఈ క్రమంలో ఆ పెళ్లి చెడిపోకూడదని లడ్డూ ఫ్యామిలీ పడే పాట్లు నవ్వులు తెప్పిస్తాయి. ఫ్రెండ్ పెళ్లి ఘనంగా చేయాలని దామోదర్, అశోక్, మనోజ్ అనేక ప్లాన్స్ వేస్తుంటారు. వారి హంగామాకు తోడు పెళ్లికూతురు ఫ్యామిలీ నుంచి లడ్డూకు ఎదురయ్యే అవమానాలు కడుపుబ్బా నవ్విస్తాయి. తన స్నేహితులు చేసే తుంటరి పనుల వల్ల ఆ పెళ్లిలో చాలా గందరగోళం నెలకొంటుంది. పెళ్లి జరుగుతున్నంత సేపు ఎక్కడ ఆ కార్యక్రమం ఆగిపోతుందో అనే భయంతో లడ్డు ఉంటాడు. సరిగ్గా పెళ్లి అవుతుందని సమయంలో లడ్డు స్నేహితులతో పాటు వచ్చిన ఒక వ్యక్తితో పెళ్లికూతురు వెళ్లిపోతుంది. ఈ విషయం తెలిశాక లడ్డూ ఇంట్లో జరిగే పంచాయితీ, అక్కడ మ్యాడ్ గ్యాంగ్ చేసే అతి ఫుల్‌గా నవ్విస్తుంది. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న లడ్డు కోసం కాస్త రిలాక్స్ ఇవ్వాలని వారందరూ గోవా ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. వారు ఎంట్రీ ఇచ్చాక గోవా మ్యూజియంలో విలువైన లాకెట్‌ను గోవాలో పెద్ద డాన్‌గా ఉన్న మ్యాక్స్ (సునీల్) మనుసులు దొంగలిస్తారు. దానిని లడ్డు బ్యాచ్ చేశారని పోలీసులు అనుమానిస్తారు. దీంతో వారిపై నిఘా ఉంచుతారు. అయితే, ఒక ఘటనలో ఆ లాకెట్ లడ్డు చేతికి దొరుకుతుంది. దీంతో దానిని తిరిగి తెచ్చివ్వాలని లడ్డు తండ్రిని మ్యాక్స్ కిడ్నాప్ చేస్తాడు. ఈ కేసును చేధించేందుకు ఒక ఐపీఎస్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. లడ్డు బ్యాచ్‌లో ఉన్న ఆ అధికారి ఎవరు..? లడ్డుని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మరో అబ్బాయితో ఎందుకు వెళ్లిపోయింది...? వారిద్దరూ కూడా గోవాకే ఎందుకు వెళ్తారు..? చివరిగా ఆ లాకెట్ కథ ఏంటి.. ఎవరి వద్ద ఉంటుంది..? ఫైనల్‌గా లడ్డును తన స్నేహితుడే జైలుకు ఎందుకు పంపుతాడు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..?మ్యాడ్ స్క్వేర్ విడుదలకు ముందే నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో కథ గురించి పెద్దగా ఏమీ ఉండదని తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే కథ బలం ఉండదు. కానీ, నవ్వులతో వంద శాతం ఎంటర్టైన్ చేస్తారు. ప్రతి సీన్లో వరుస పంచ్‌లతో నవ్విస్తారు. డీడీ, లడ్డు గ్యాంగ్ కావాల్సినంత హంగామా చేస్తారు. ఆద్యంతం ఎక్కడా విసుగు లేకుండా ప్రతి సన్నివేశంలో వారు వినోదాన్ని పంచుతారు. పార్ట్-1లో కాలేజి క్యాంపస్‌ను ఎంచుకున్న దర్శకుడు.. పార్ట్‌లో లడ్డు గాడి పెళ్లి, గోవా కాన్సెప్ట్‌ను ప్రధానంగా ఎంచుకున్నాడు. యువతను ఆకట్టుకునేలా ఫుల్ పంచ్‌లతో సినిమా ఉంటుంది. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు దర్శకుడు కల్యాణ్ శంకర్. కాలేజీలో మొదలైన స్నేహం.. ఆ తర్వాత కూడా ఎంత మధురంగా ఉంటుందో లడ్డు కథతో దర్శకుడు చెప్పాడు. (ఇదీ చదవండి: ‘రాబిన్‌హుడ్’ మూవీ రివ్యూ)ఈ కథలో ప్రధాన పాత్రధారులైన మనోజ్, అశోక్, దామోదర్ల పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకొని మ్యాడ్ అనే టైటిల్ పెట్టి హిట్ కొట్టాడు. ఇప్పుడు దానికి లడ్డుగాడి కథన కలిపి మ్యాడ్ స్క్వేర్ చేశాడని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో కథ గోవా షిఫ్ట్ అయ్యాక ఇంకాస్త స్పీడ్ పెంచాడు దర్శకుడు. ఫస్టాఫ్ అంతా లడ్డు పెళ్లితో ఫుల్ ఎంటర్టైన్ చేస్తే రెండో భాగం కాస్త ఫన్ నెమ్మదిస్తుంది. మ్యాక్స్ గ్యాంగ్ చేసే దొంగతనం మ్యాడ్ గ్యాంగ్‌కు చుట్టుకోవడం. ఆపై లడ్డూ తండ్రిని మ్యాక్స్ కిడ్నాప్ చేయడం.. ఆయన్ని ఎలాగైనా కాపాడాలని డీడీ, లడ్డూ, అశోక్, మనోజ్ చేసే ప్రయత్నాలు సెకండాఫ్‌లో ఉంటాయి.సునీల్, లడ్డు ఫాదర్ మురళీధర్ మధ్య సీన్స్ బాగున్నాయి. సత్యం రాజేష్ పోలీసు పాత్ర నుంచి వచ్చే ప్రతి సీన్ కాస్త ఫోర్స్డుగా ఉంటుంది. సినిమాలో హిట్ సాంగ్ స్వాతిరెడ్డి కూడా సరైన పాయింట్లో లేదు అనిపిస్తుంది. ప్రియాంక జవల్కార్ను కామియో రోల్ ఇచ్చారు. కానీ, అంత ఎట్రాక్ట్ అనిపించలేదు. లడ్డు మీద వరుస పంచ్‌లు పడుతున్నా సరే సినిమాను ఫుల్ స్వింగ్‌లో నడిపించాడని చెప్పవచ్చు. అక్కడక్కడ మినహాయిస్తే.. విసుగు లేకుండా ప్రతి సన్నివేశంలో ఫుల్ వినోదం ఉంటుంది. రెండు గంటలపాటు బాగా ఎంజాయ్ చేసే థియేటర్ నుంచి ప్రేక్షకుల బయటకు వస్తారని చెప్పవచ్చు.ఎవరెలా చేశారంటే..?మ్యాడ్-1లో చాలా పాత్రలు ఉంటాయి.. అక్కడ అన్ని క్యారెక్టర్స్‌కు ప్రాధాన్యత ఉంటుంది. కానీ, ఇందులో కొన్నింటికి తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. నార్నె నితిన్ తనదైన స్టైల్లో సెట్ అయిపోయాడు. లడ్డూగా విష్ణు తన నటన తీరుతో నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. ఈ సినిమాకు ప్రధాన బలం లడ్డునే అని చెప్పవచ్చు. సంగీత్ శోభన్ డీడీగా తన వేగం ఎక్కడా తగ్గనివ్వకుండా పంచ్ డైలాగ్స్ పేలుస్తూనే ఉంటాడు. ఎక్కడా కూడా తన ఎనర్జీ తగ్గకుండా మెప్పిస్తాడు. మనోజ్ పాత్రలో రామ్ నితిన్ సైలెంట్‌గా లవర్ బాయ్‌లా తన ఫెయ్యిల్యూర్ స్టోరీ చెబుతూ చుట్టేస్తూ ఉంటాడు. రఘుబాబు, మురళీధర్ గౌడ్లు తమ పాత్రల పరిధి మేరకు నవ్వులు పంచారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ మరోసారి అతిథి పాత్రలో కనిపించింది కొద్దిసేపు మాత్రమే అయినప్పటికీ ప్రేక్షకులతో విజిల్స్ వేపించేలా చేశాడు. మ్యాక్స్ పాత్రలో సునీల్ విలనిజమే కాకుండా కామెడీని కూడా పండించాడు. శుభలేఖ సుధాకర తన పాత్ర పరిమితిమేరకు పర్వాలేదు. మ్యాడ్ స్క్వేర్ కథలో పెద్దగా బలం లేకున్నప్పటికీ దర్శకుడు కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన విధానం బాగుంది. కానీ, సంభాషణల విషయంలో బలవంతంగా నవ్విద్దాం అనేలా కొన్ని సీన్లు ఉన్నాయి. పాటల విషయంలో భీమ్స్ ఇంకాస్త శ్రద్ధ పెట్టింటే బాగుండు. తమన్ బీజీఎమ్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి సూపర్ అనిచెప్పవచ్చు. నిర్మాణం పరంగా ఉన్నంతమేరకు బాగుంది. నిర్మాతలు సూర్యదేవర హారిక, సాయి సౌజన్యలకు మ్యాడ్ స్క్వేర్ మంచి విజయాన్ని ఇచ్చే సినిమా అని చెప్పవచ్చు.

రాజమౌళి ఒక్కరే.. ఆయన స్థానం ఎవరూ పొందలేరు: బాలీవుడ్ నటుడు
నేను అడుగుపెడితే విజయమే తప్ప పరాజయం ఉండదు అని నిరూపిస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli). ఆయన చేసిన ప్రతి సినిమా బ్లాక్‌బస్టరే! అలాంటి దర్శకుడిని కాపీ కొట్టాలని చూస్తున్నారని.. కానీ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆయన స్థాయిని అందుకోలేరంటున్నాడు బాలీవుడ్ దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap).రాజమౌళి ఒరిజినల్తాజాగా అనురాగ్ కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాన్ ఇండియా హిట్లు తీయగానే రాజమౌళిపి కాపీ కొట్టినవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ, వారెప్పటికీ ఆయనలా మారలేరు. ఎందుకంటే రాజమౌళి ఒక్కరే.. ఆయన ఒరిజినల్! ఎన్నటికీ ఆ చీప్ కాపీలు రాజమౌళి కాలేవు. అలాగే కేజీఎఫ్ సినిమా హిట్టవగానే చాలామంది అదే తరహా చిత్రాలు తీశారు. ఏవీ వర్కవుట్ కాలేదు.కాపీ కొట్టడం మానేసి..అయినా పాన్ ఇండియా ట్రెండ్ ఇప్పటిది కాదు. చిరంజీవి (Chiranjeevi) 'ప్రతిబంధ్', నాగార్జున 'శివ', రజనీకాంత్ 'ఫౌలది ముక్క' (పాయం పులి).. ఇవన్నీ పాన్ ఇండియా చిత్రాలే.. నా చిన్నతనంలోనే ఈ పాన్ ఇండియా సినిమాలు చూశాను. నేనేమంటానంటే ఎవరికి వారే ప్రత్యేకం. అవతలివారిని కాపీ కొట్టడానికి బదులు తమలోని నైపుణ్యాన్ని బయటకు తీయాలి అని అనురాగ్ చెప్పుకొచ్చాడు.ఆ సినిమాలెప్పుడు వచ్చాయంటే?చిరంజీవి 'ప్రతిబంధ్' సినిమా 1990లో వచ్చింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జూహీ చావ్లా కథానాయిక. రజనీకాంత్ హీరోగా నటించిన 'పాయం పులి' సినిమాకు హిందీ డబ్బింగ్ వర్షనే 'ఫౌలది ముక్క'. ఎస్పీ ముత్తుమారన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 1983లో రిలీజైంది. నాగార్జున హీరోగా నటించిన 'శివ' 1989లో విడుదలై సెన్సేషన్ సృష్టించింది. దీనికి రామ్ గోపాల్‌వర్మ దర్శకుడిగా వ్యవహరించాడు.చదవండి: ఇక ఆపండి.. మీ తల్లి, చెల్లి, భార్య వీడియోలు చూడండి: నటి ఫైర్
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

చరిత్ర సృష్టించిన ధోని.. ప్రాణ మిత్రుడి రికార్డు బద్దలు
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని సీఎస్కే చేధించలేక చతికలపడింది. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 146 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఓటమి పాలైనప్పటికి .. ఆ జట్టు లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని మాత్రం తన మెరుపు ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు. తొమ్మిదో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని తనదైన స్టైల్లో షాట్లూ ఆడుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఖరి ఓవర్ వేసిన కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో మిస్టర్ కూల్.. రెండు సిక్స్‌లు, 1 ఫోర్‌తో 16 పరుగులు రాబాట్టాడు. ఓవరాల్‌గా కేవలం 16 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోని.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ధోని ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధోరి రికార్డులకెక్కాడు. ధోని ఇప్పటివరకు సీఎస్కే తరపున 236 మ్యాచ్‌లు ఆడి 4693 పరుగులు చేశాడు. ఇంతకుముందు వరకు రికార్డు మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా పేరిట ఉండేది. రైనా సీఎస్కే తరపున 4,687 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌లో 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద తన మిత్రుడి రికార్డును తలైవా బ్రేక్ చేశాడు. కాగా రైనా చాలా సీజన్ల పాటు సీఎస్కేకే ప్రాతినిథ్యం వహించాడు. ధోనికి రైనాకు మంచి అనుబంధం ఉంది. అప్పటిలో అతడిని చిన్న తలా అని అభిమానులు పిలుచుకునే వారు. చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, లివింగ్‌స్టోన్ తలా రెండు వికెట్లు సాధించారు.చెపాక్‌లో సీఎస్కేపై ఆర్సీబీ విజయం సాధించడం 2008 సీజన్ తర్వాత ఇదే తొలిసారి. దీంతో సీఎస్కే కంచుకోటను పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ బద్దలు కొట్టింది. 2008 సీజన్ తర్వాత ఏ ఆర్సీబీ కెప్టెన్ కూడా చెపాక్‌లో సీఎస్కేపై తన జట్టును గెలిపించకలేకపోయాడు. ఇప్పుడు అది పాటిదార్‌కు సాధ్యమైంది.

#RCB: సీఎస్కే కంచు కోట బద్దలు.. 17 ఏళ్ల తర్వాత తొలి విజయం
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో విజయం సాధించింది. ఈ టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో ధోని(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, లివింగ్‌స్టోన్ తలా రెండు వికెట్లు సాధించారు.చెపాక్‌లో సీఎస్కేపై ఆర్సీబీ విజయం సాధించడం 2008 సీజన్ తర్వాత ఇదే తొలిసారి. దీంతో సీఎస్కే కంచుకోటను పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ బద్దలు కొట్టింది. 2008 సీజన్ తర్వాత ఏ ఆర్సీబీ కెప్టెన్ కూడా చెపాక్‌లో సీఎస్కేపై తన జట్టును గెలిపించకలేకపోయాడు. ఇప్పుడు అది పాటిదార్‌కు సాధ్యమైంది. కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి(31), పడిక్కల్(27) రాణించారు. ఆఖరి ఓవర్లో టిమ్ డేవిడ్( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్‌లతో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ ఆహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. పతిరానా రెండు, ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా వికెట్ సాధించారు.

అందుకే సన్‌రైజర్స్ వదిలేసింది.. అక్కడ కూడా అదే ఆటనా?
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో త్రిపాఠి దారుణ ప్రదర్శన కనబరిచాడు. మరోసారి ఓపెనర్‌గా బరిలోకి దిగిన త్రిపాఠి కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్‌లో చెత్త షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా త్రిపాఠి కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో త్రిపాఠిని సీఎస్కే ఫ్యాన్స్ దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ చెత్త ఆడినందుకే సన్‌రైజర్స్ వదిలేసింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా రాహుల్ త్రిపాఠి గత కొన్ని సీజన్లగా ఎస్ఆర్హెచ్కు ప్రాతినిథ్యం వహించాడు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మెగా వేలానికి ముందు ఎస్ఆర్హెచ్ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని సీఎస్కే రూ. 3.40 కోట్లకు కొనుగోలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం త్రిపాఠి చేయలేకపోతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.చదవండి: #MS Dhoni: వారెవ్వా ధోని..కళ్లు మూసి తెరిచేలోపే! వీడియో వైరల్

IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పర్వాలేదన్పించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 30 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 31 పరుగులు చేశాడు. తద్వారా కింగ్ కోహ్లి ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.కోహ్లి ఇప్పటివరకు సీఎస్కేపై 34 మ్యాచ్‌ల్లో 1068 పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ చెన్నైపై 29 మ్యాచ్‌ల్లో 44.04 సగటుతో మొత్తం 1,057 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీతో పాటు, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. తాజా మ్యాచ్‌లో 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధావన్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి, ధావన్ తర్వాతి స్దానాల్లో వరుసగా రోహిత్ శర్మ(896), డేవిడ్ వార్నర్(696), కీరన్ పొలార్డ్(583) ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి(31), పడిక్కల్(27) రాణించారు. ఆఖరి ఓవర్లో టిమ్ డేవిడ్( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్‌లతో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ ఆహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. పతిరానా రెండు, ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా వికెట్ సాధించారు.
బిజినెస్

సమ్మె అయినా గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆగదు
హైదరాబాద్: సదరన్ రీజియన్ బల్క్ ఎల్పీజీ ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ అసోసియేషన్‌కు చెందిన బల్క్ ఎల్పీజీ రవాణాదారుల సమ్మె నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్) తమ ఎల్పీజీ వినియోగదారులకు తగినంత సిలిండర్ సరఫరా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చాయి. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల బాట్లింగ్ ప్లాంట్లలో బల్క్ ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయన్నారు. ఎల్పీజీ పంపిణీ కేంద్రాలు యథావిధిగా పని చేస్తాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన రవాణా టెండర్‌ను అన్ని ప్రాంతాల ట్రాన్స్పోర్టర్లతో విస్తృత చర్చల తర్వాత తుది రూపం ఇచ్చారన్నారు. ఈ ప్రక్రియలో రవాణాదారుల వివిధ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమైన సందేహాలను నివృత్తి చేసేందుకు వివరణలు ఇచ్చారన్నారు.చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, గువాహటి నగరాల్లో నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశాల ద్వారా వారి అభిప్రాయాలను కూడా కలుపుకున్నారన్నారు. ఈ టెండర్ నిబంధనలను ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు, కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలను పాటిస్తూ పూర్తిగా పారదర్శకంగా రూపొందించారని పేర్కొన్నారు. ఈ నిబంధనలు పీఈఎస్ఓ, పీఎన్జీఆర్బీ, ఓఐఎస్డీ వంటి చట్టబద్ధ సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందాయన్నారు. ఎల్పీజీ రవాణా భద్రత, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మా ప్రయత్నాల్లో భాగంగా ఈ కొత్త టెండర్ నిబంధనలను తీసుకు వచ్చామన్నారు.ఈ చర్యలు తీసుకున్నప్పటికి కొంతమంది రవాణాదారులు సమ్మెకు పిలుపునిచ్చారన్నారు. ప్రధానంగా భద్రతా ఉల్లంఘనలకు సంబంధించిన శిక్షా నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే, ఈ భద్రతా సంబంధిత చర్యలు ట్యాంకర్ యజమానులు, డ్రైవర్లు, వినియోగదారులు సహా అన్ని స్టేక్హోల్డర్లకు లాభదాయకంగా ఉంటాయని తెలిపారు. అవి మరింత భద్రతా ప్రమాణాలు కలిగిన, విశ్వసనీయమైన ఎల్పీజీ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.మా స్టేక్హోల్డర్ల నుంచి బాధ్యతాయుతమైన చర్యలు, అవగాహనను ఆశిస్తున్నామన్నారు. తద్వారా అవసరమైన భద్రతా ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ ఎల్పీజీ సిలిండర్ల నిరంతర సరఫరాను నిర్ధారించవచ్చన్నారు. రవాణాదారులకు సమ్మెను విరమించాలని, అత్యవసరమైన ఎల్పీజీ సరఫరా నిల్వలను ప్రభావితం చేసే చర్యలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తద్వారా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడవచ్చన్నారు.ఓఎంసీలు ప్రధాన రవాణాదారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందన్నారు. త్వరలో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలుగా గృహ అవసరాలు, వాణిజ్య అవసరాలు తీర్చేందుకు ఎల్పీజీ సరఫరాను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే ఎల్పీజీ సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఏఐని ఎవరెలా వాడుతున్నారు?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. ఇప్పటికే చాలా మంది కస్టమర్లు ఏఐ వేళ్ల మీద వినియోగిస్తున్నారు. ఏఐ ఇప్పుడు భారతీయ వినియోగదారుల దైనందిన జీవితంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్ ‘సర్వీస్ నౌ’ తన తాజా సర్వేలో వివరించింది.షాపింగ్, ఫుడ్..షాపింగ్ సిఫార్సుల కోసం 84 శాతం మంది, ఆహారం, భోజన సూచనల కోసం 82 శాతం మంది, పెట్టుబడి అవకాశాలను పరిశీలించడానికి ప్రతి ఐదుగురిలో నలుగురు (78 శాతం) ఏఐ చాట్బాట్లను ఉపయోగిస్తున్నారని సర్వేలో తేలింది. ఇది ఏఐ ఆధారిత ఆర్థిక నిర్ణయాల వైపు మళ్లడాన్ని సూచిస్తుందని సర్వే తెలిపింది.దేశంలోని 80 శాతం మంది వినియోగదారులు ఇప్పుడు ఫిర్యాదుల స్థితిని తెలుసుకునేందుకు, ఉత్పత్తులపై సలహాల కోసం, స్వయం సహాయక మార్గదర్శకాల కోసం ఏఐ చాట్బాట్లను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆరుగురిలో ఐదుగురు సందేహాల నివృత్తికి, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను చురుకుగా ఉపయోగిస్తున్నారని సర్వే పేర్కొంది.కస్టమర్ సర్వీస్‌లో మాత్రం..రోజువారీ జీవితంలో కృత్రిమ మేధ పెరుగుతున్న పాత్ర ఉన్నప్పటికీ, దాని సమయాన్ని ఆదా చేసే సామర్థ్యాలు కస్టమర్ సర్వీస్ నిరీక్షణ సమయాలను తగ్గించడంలో మాత్రం సహాయపడటం లేదు. భారతీయ వినియోగదారులు గత సంవత్సరంలో 15 బిలియన్ గంటలు వేచి ఉన్నారు అని సర్వీస్ నౌ కస్టమర్ ఎక్స్పీరియన్స్ రిపోర్ట్ తెలిపింది. కాగా వ్యాపార సంస్థలు వారానికి సగటున ఒక రోజు కంటే తక్కువ కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి, మిగిలిన నాలుగు రోజులు బృందాల ప్రతిస్పందనలు, పరిపాలనా విధులు, ప్రమోషనల్ ఆఫర్లు, శిక్షణ, విరామాల కోసం వెచ్చిస్తున్నాయని సర్వే చెబుతోంది.వ్యాపార సంస్థలకు భారీ అవకాశాలను అందించే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ గా భారత్ అవతరించబోతోంది. కొత్త ఏఐ టూల్స్ కస్టమర్ సర్వీస్ పై తమ అంచనాలను పెంచాయని 82 శాతం మంది వినియోగదారులు వ్యక్తం చేశారని సర్వీస్ నౌ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుమీత్ మాథుర్ తెలిపారు. 2024 నవంబర్ 1 నుంచి 15 వరకు సుమారు 5,000 మంది వినియోగదారులపై ఈ సర్వే నిర్వహించారు.

సరికొత్త రీచార్జ్ ప్లాన్.. సగం ఖర్చుతోనే..
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) 54 రోజుల సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది అపరిమిత కాలింగ్, డేటా, ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాలను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో అందిస్తుంది. ఇదే వ్యాలిడిటీ ప్లాన్ల కోసం ఇతర ప్రైవేటు టెలికం కంపెనీలలో అయ్యే ఖర్చులో దాదాపు సగం ఖర్చుతోనే బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.బీఎస్ఎన్ఎల్ 54 రోజుల ప్లాన్ కీలక ఫీచర్లుబీఎస్ఎన్ఎల్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం రూ.347కే లభిస్తున్న ఈ ప్లాన్ లో అనేక ఆకర్షణీయమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఉచిత నేషనల్ రోమింగ్ తో సహా భారతదేశంలోని ఏ నంబర్ కు అయినా అపరిమిత వాయిస్ కాల్స్ ను వినియోగదారులు ఆస్వాదించవచ్చు.ఈ ప్లాన్ రోజుకు 2 జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అంటే 54 రోజుల వ్యాలిడిటీ కాలంలో మొత్తం 108 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీంతోపాటు ఈ ప్లాన్‌లో బైటీవీకి (BITV) కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా ఉంది. ఇందులో 400కి పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు.ఈ కొత్త ప్లాన్‌తో పాటు తన ప్రతిష్టాత్మక విస్తరణ ప్రయత్నాలతో బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం సంస్థలకు సవాలు విసురుతోంది. తమ వినియోగదారులకు మరింత విలువ ఆధారిత సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది. బీఎస్ఎన్ఎల్ ఇటీవల 75,000 కొత్త 4జీ మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది. రాబోయే వారాల్లో 100,000 కొత్త 4జీ టవర్ల మైలురాయిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఎయిర్‌బస్ కొత్త విమానాలు వస్తున్నాయ్
వాహన రంగంలో దాదాపు అన్ని సంస్థలు అప్డేట్ వెహికల్స్ ప్రవేశపెడుతున్నాయి. అయితే విమానాయాన రంగంలోని ఎయిర్‌బస్ మాత్రం దశాబ్దాలుగా చెప్పుకోదగ్గ రీతిలో పెద్ద మార్పులు చేయలేదు. అయితే ఇప్పుడు ఈ సంస్థ రేపటి కోసం (భవిష్యత్తు కోసం) సరికొత్త విమానాలను రూపొందిస్తోంది. టౌలౌస్‌లో జరిగిన ఎయిర్‌బస్ సమ్మిట్ 2025లో కొత్త టెక్నాలజీతో రూపొందించనున్న విమానాలను ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎయిర్‌బస్ విమానాలు చాలా ఏళ్లుగా చెప్పుకోదగ్గ మార్పులకు గురి కాలేదు. అయితే రాబోయే రోజుల్లో విమానయాన సంస్థలు కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకెళ్లనున్నాయి. కాబట్టి ఎయిర్‌బస్ తన వేగాన్ని పెంచింది. తదుపరి తరం ఎయిర్‌బస్ విమానాలలో పక్షుల రెక్కలను అనుకరించే రెక్కలు ఉంటాయి. ఇవి తేలికగా, సన్నగా, పొడవుగా ఉంటాయి.వింగ్ ఆఫ్ టుమారో (WoT) పరిశోధన అండ్ టెక్నాలజీ కార్యక్రమానికి నిలయంగా ఉన్న ఇంగ్లాండ్‌లోని ఫిల్టన్‌లోని ఎయిర్‌బస్ వింగ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్లో జరిగిన పని ఆధారంగా, కొత్త రెక్కలు తక్కువ డ్రాగ్ కోసం ఎక్కువ లిఫ్ట్‌ను ఉత్పత్తి చేస్తాయి. పొడవైన రెక్కలను ఆఫ్సెట్ చేయడానికి ఉపయోగపడతాయికి. ఇవి ఫోల్డ్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి.ఎయిర్‌బస్ కొత్త జెట్ ఇంజిన్‌ను కూడా ఆవిష్కరించనుంది. ఇది ఇప్పుడున్న వాటికంటే పెద్దవిగా ఉండటమే కాకుండా.. ఇంధన వినియోగాన్ని కూడా 20 శాతం తగ్గిస్తాయి. కొత్త ఇంజిన్లతో పాటు, ఎయిర్‌బస్ హైబ్రిడైజేషన్ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. మరోవైపు కార్బన్-ఫైబర్ రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్ (CFRP) స్థానంలో కార్బన్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ థర్మోప్లాస్టిక్ పాలిమర్ కాంపోజిట్స్ (CFRTP) ఉపయోగించాలని అనుకుంటోంది.Source: Airbus
ఫ్యామిలీ

తండ్రీకూతుళ్లను కలిపిన కాలం కథ
అందరి నాన్నల్లా అతడు కూడా తన కూతురిని అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. తన కూతురిని పైలట్ చేయాలనుకున్నాడు. కానీ కూతురు ఊహించని షాక్ ఇచ్చింది. తన అభిష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దీంత తండ్రికూతుళ్ల మధ్య పూడ్చలేనంత దూరం పెరిగింది. అయితే కాలం (Time) ఎవరి కోసం ఆగదుగా, అది తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎంతటి గాయాన్నైనా కాలం నయం చేస్తుందంటారు. అంతేకాదు విడిపోయిన మనుషులను కూడా కాలం కలుపుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తండ్రి విషయంలోనూ అదే జరిగింది.అస్సలు ఊహించలేదు..ఆయన పేరు అశోక్ కేత్కర్. భారత వాయుసేనలో వింగ్ కమాండర్‌గా రిటైర్ అయ్యారు. విధి నిర్వహణలో ఆయన తన రెండు కాళ్లను కోల్పోయి చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. దీని కంటే కూడా తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కన్నకూతురు భార్గవి తనను కాదని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం కేత్కర్‌ను ఎక్కువ బాధ పెట్టింది. దీంతో కూతురికి కటీఫ్ చెప్పారు. ఇది జరిగిన ఐదేళ్ల తర్వాత ఒకరోజు కేత్కర్ విమానంలో ముంబై (Mumbai) నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనకు ముందుగా తెలియదు ఈ ప్రయాణం (Journey) తన జీవితంలో అత్యంత తీపి జ్ఞాపకం అవుతుందని. భూమాకాశాల మధ్యలో విధి ప్రత్యేక ‘నిధి’ని కానుకగా అందివ్వబోతోందని ఆయన అస్సలు ఊహించలేదు.విమానం గాల్లోకి లేవగానే ఓ చిన్నపిల్లవాడు కేత్కర్కు వచ్చి గ్లాసుతో మంచినీళ్లు అందించాడు. ఆ బుడ్డోడిని చూసి ఎంతో ముచ్చటపడ్డారు కేత్కర్. ఇంతలో మైక్ నుంచి మహిళా పైలట్ (Woman Pilot) మాటలు వినిపించాయి. కేత్కర్‌ను యుద్ధవీరుడిగా ప్రయాణికులకు పరిచయం చేసింది. తర్వాత మాటలు విని ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఎందుకంటే ఆ పైలట్ ఎవరో కాదు, ఆయన కూతురు భార్గవి. ‘సర్, మీరు బంధాలను తెంచుకున్న అమ్మాయి, మీ కూతురు భార్గవి ఈ విమానాన్ని నడుపుతోంది’ అనే మాటలు చెవిన పడగానే కేత్కర్ ఖిన్నుడయ్యారు.కేత్కర్ తేరుకునేలోపే కాక్‌పిట్ నుంచి బయటకు వచ్చిన భార్గవి, ఆయనకు ఎదురుగా నిలబడి సెల్యూట్ చేసింది. ‘నాన్నా.. నేను మీ కలను సాకారం చేశాను. మీరు అనుకున్నట్టుగానే పైలట్ అయ్యాను. దయచేసి నన్ను క్షమించండి’ అని వేడుకుంది. కూతురిని అలా చూడగానే ఆయన కరిగిపోయాడు. తన బిడ్డను ఆలింగనం చేసుకుని అప్యాయత కురిపించారు. ఇందాక మీకు మంచినీళ్లు ఇచ్చిన చిన్నారి ఎవరో కాదు తన కొడుకే అని భార్గవి చెప్పడంతో కేత్కర్ ఆనందంతో పొంగిపోయారు. ‘తాతయ్యా, నేను మీలాగే ఫైటర్ పైలట్ అవ్వాలనుకుంటున్నాను’ అని మనవడు అనడంతో ఆయన సంతోషం రెట్టింపయింది.‘బయట సూర్యుడు అస్తమించాడు. విమానం కిందకు దిగిపోయింది. కానీ అశోక్ కేత్కర్ జీవితం మళ్ళీ చిగురించింది’ అంటూ ఈ కథను ఎక్స్‌లో షేర్ చేశారు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka). అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు ఆయన వెల్లడించలేదు. ఈ పోస్ట్‌కు 3 లక్షలకు పైగా వ్యూస్, 5 వేలకు పైగా లైకులు వచ్చాయి.నెటిజన్ల రియాక్షన్..హర్ష్ గోయెంకా పోస్ట్‌పై పలువురు నెటిజనులు స్పందించారు. ‘దర్శకుడు మణిరత్నం దీన్ని చదివితే, ఈ కథకు ఒక రూపాన్ని ఇచ్చి సినిమా తెరకెక్కిస్తార’ని ఒకరు కామెంట్ చేశారు. ‘ఆ తండ్రి గర్వం, బాధ తన కూతురి కౌగిలిలో కరిగిపోయాయి. ఒకప్పుడు వారిని విడదీసిన ఆకాశం ఇప్పుడు వారిని కలిపింది. అతడు కూతురిని కోల్పోయాడు కానీ హీరోని కనుగొన్నాడు!’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇది నిజంగా జరిగిందనడానికి నమ్మదగిన ఆధారాలు లేవని మరొక యూజర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సోర్టీ చాట్‌జీపీటీ రాసిందా అని ఒక నెటిజన్ వ్యంగ్యంగా అడిగారు. కొంతమంది అయితే స్టోరీలోని లొసుగులను ప్రశ్నించారు. ఎక్కువ మంది మాత్రం పాజిటివ్‌గా స్పందించారు. At Mumbai airport, a wheelchair-bound veteran, Wing Commander Ashok Ketkar, boarded a flight to Delhi. He had lost both legs in service, but what truly broke him was losing his daughter Bhargavi, who married against his wishes.He hadn’t spoken to her in 5 years.Mid-flight, an…— Harsh Goenka (@hvgoenka) March 26, 2025

గ్లోబల్ స్టార్ రామ చరణ్ ఫిట్నెస్ సీక్రెట్..! డైట్లో అవి ఉండాల్సిందే..
చిరంజీవి నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. నటన పరంగా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఎందులోనైనా తండ్రికి ధీటుగా చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు. ఈ రోజుతో ఆయనకు 40 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా చరణ్ ఫిట్నెస్ సీక్రెట్, డైట్‌ప్లాన్‌లు ఏంటో చూద్దామా. ఆయన తొలి చిత్రం చిరుత మూవీ నుంచి ఇటీవల విడుదలైన గేమ్‌ఛేంజర్ మూవీ వరకు అదే లుక్‌తో కనిపించేలా బాడీని మెయింటైన్ చేస్తున్నారు. అంతలా ఫిట్‌గా కనిపించేందుకు వెనుక ఎంతో డెడీకేషన్తో చేసే వర్కౌట్లు అనుసరించే డైట్లే అత్యంత ప్రధానమైనవి. అవేంటో చూద్దామా..రామ్ చరణ్ ఒకసారి అపోలా లైఫ్ డాట్ కామ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను ఫిట్‌గా యాక్టివ్‌గా ఉండేందుకు ఎలాంటి వ్యాయమాలు, ఆహారం తీసుకుంటారో షేర్ చేసుకున్నారు. జంపింగ్ జాక్‌లు, సీటెడ్ మెషిన్ ప్రెస్‌ల నుంచి మిలిటరీ పుషప్‌లు, బార్బెల్ స్టిఫ్-లెగ్ డెడ్ లిఫ్ట్‌ల వరకు ప్రతిదీ చేస్తానని అన్నారు. అయితే ఇంట్లో వండిన భోజనం మాత్రమే తీసుకుంటానని అన్నారు. సమతుల్య జీవనశైలికి ప్రాధన్యాత ఇస్తానని చెప్పారు. ప్రతిరోజూ కొన్ని క్రీడలు తప్పనిసరిగా ఆడతానని అన్నారు. వారంలో నాలుగు రోజులు అధిక తీవ్రతతో కూడిన వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తానని అన్నారు. ముఖ్యంగా ప్రశాంతంగా ఉండేందుకు ఇష్టపడతానని చెప్పారు. అలాగే ప్రతిరోజు ఒక గంటన్నర పాటు వ్యాయామం చేస్తానని తెలిపారు. అంతేగాదు శరీర బరువుని అదుపులో ఉంచే వ్యాయామాలపై దృష్టి పెడతానని చెప్పారు. 80% ఆహారంపైనే..ఫిట్ బాడీని నిర్వహించడంలో ఆహారం ప్రాముఖ్యతను హైలెట్ చేశారు రామ్‌చరణ. మన ఆరోగ్యం 80 శాతం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందన్నారు. అందువల్ల మనం ఏం తింటున్నాం అనేది అత్యంత ముఖ్యం అని చెప్పారు. అలాగే తాను ఆహారం విషయంలో చాలా కేర్ తీసుకుంటానని చెప్పారు. అనారోగ్యకరమైన ఆహారాలకు చాలా దూరంగా ఉంటానని చెప్పారు. అంతేగాదు ప్రతి ఆదివారం చీట్మీల్స్లో పాల్గొంటా, కానీ అది సృతి మించకుండా చూసుకుంటానని అన్నారు. డైట్ సీక్రెట్స్ఫిట్నెస్ కోచ్ రాకేష్ ఉడియార్ రూపొందించిన డైట్ ప్లాన్ ప్రకారం..కెఫిన్, ఆల్కహాల్, చక్కెర పానీయాలు, రెడ్ మీట్, గోధుమలు, ప్రోటీన్ షేక్‌లకు దూరంగా ఉంటారట రామ్‌చరణ్. తన రోజుని గుడ్డులోని తెల్లసొనతో చేసిన ఆమ్లేట్ లేదా పూర్తి గుడ్లు, ఓట్స్, బాదంపాలతో ప్రారంభిస్తారట. ఆ తర్వాత మధ్యాహ్నం కూరగాయలతో చేసి సూప్‌ని తీసుకుంటారట. ఇక భోజనంలో చికెన్ బ్రెస్ట్, బ్రౌన్ రైస్, గ్రీన్ వెజిటేబుల్ కర్రీ తీసుకుంటారట. సాయంత్రం స్నాక్స్ కోసం గ్రిల్డ్ ఫిష్, చిలగడదుంప, గ్రిల్డ్ వెజిటేబుల్స్‌ను ఇష్టపడతారని చెప్పారు. సాయంత్రం 6 గంటలకు రాత్రి భోజనంలో 'లార్జ్ మిక్స్డ్ గ్రీన్ సలాడ్', కొన్ని అవకాడోలను తీసుకుంటారని తెలిపారు ఫిట్నెస్ కోచ్ రాకేష్ ఉడియార్.వారంలో చేసే వర్కౌట్లు:సోమవారం: బైసెప్స్ (తప్పనిసరి)మంగళవారం: క్వాడ్స్బుధవారం: క్లేవ్స్ అండ్ అబ్స్గురువారం: ఛాతీ ట్రైసెప్స్శుక్రవారం: బ్యాక్ వర్కౌట్లుశనివారం: హామ్ స్ట్రింగ్ అండ్ ఇన్నర్ థై అబ్స్ఆదివారం: ఫుల్ రెస్ట్ View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) (చదవండి: బాబోయ్ మరీ ఇంతలానా..! వైరల్‌గా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జీవనశైలి)

'విల్ పవర్' అంటే ఇది..ఏకంగా వీల్‌చైర్‌తో బంగీ జంప్..!
మన మనోశక్తి ముందు ఎంత పెద్ద సమస్య లేదా అడ్డంకైన పక్కకు వెళ్లిపోవాల్సిందే. అందుకే అంటారు పెద్దలు సంకల్ప శక్తికి మించిన ఆయుధం ఇంకొకటి లేదని. విల్‌పవర్ ఉన్నోడికి దునియానే తలవంచి సలాం కొడుతుంది. అలాంటి సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రిషికేశ్‌లో తన కంపెనీ ఉద్యోగి వీల్‌చైర్ తోపాటు బంగీ జంప్ చేస్తున్న వీడియోని పంచుకున్నారు. ఆయన సోషల్ మీడియా ఎక్స్‌లో ఈ వీడియోని జత చేస్తూ ఇలా రాశారు. "చాలామంది దీనిని థ్రిల్ కోసం చేస్తారు. కానీ మన మెహతా సంకల్ప శక్తి పవర్ చూపించడానికే ఈ సాహసం చేశారు. అయినా సంకల్ప శక్తి ముందు ఏ భయం, వైకల్యం అయినా పరార్ అయిపోవాల్సింది. దానిముందు ఏ అడ్డంకి నిలువలేవు అని రాసుకొచ్చారు పోస్ట్‌లో గౌతమ్ అదానీ. కాగా, గత నెల పిబ్రవరిలో అదానీ కుమారుడు జీత్ అదానీ దివాషాల వివాహంలో సామాజిక కార్యక్రమల కోసం దాదాపు రూ. 10 కోట్లు ఖర్చు చేస్తానని అన్నారు గౌతమ్ అదానీ. అలాగే ఆ కొత్త జంట కూడా ప్రతి ఏడాది సుమారు 500 మంది మహిళా వికలాంగులకు ఒక్కొక్కరం రూ. 10 లక్షలు చొప్పున విరాళంగా ఇస్తామని వాగ్దానం చేశారు. అంతేగాదు గౌతమ్ అదానీ హిందీ బుల్లితెర స్టార్ ప్లస్‌లో వచ్చే షార్క్ ట్యాంక్ ఇండియాలో సైతం ప్రముఖ టీవీ షోలో వికలాంగులు, వారి కోసం పాటుపడేవారి కోసం ఏదైనా చేయొచ్చేగా అని ఒక ఎపిసోడ్లో సూచించారు కూడా. Most people do it for the thrill. Kay Mehta, our own Adanian, did it to make a statement. From the heights of Rishikesh, strapped in his wheelchair, Kay took a leap that told the world: no odds, no fear, can stop willpower. Kay, you don’t just inspire us - you redefine what it… pic.twitter.com/n1CTvFKtsQ— Gautam Adani (@gautam_adani) March 27, 2025 (చదవండి: బాబోయ్ మరీ ఇంతలానా..! వైరల్‌గా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జీవనశైలి)

బాబోయ్ మరీ ఇంతలానా..! వైరల్‌గా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జీవనశైలి
ఇటీవల ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిది అంటూ తెగ నెట్టింట ఫిట్నెస్ మంత్రాలు ట్రెండ్ అవుతున్నాయి. పాపం కొందరు ఫాలో అయ్యి వర్కౌట్ అవ్వాక ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు మరిన్ని అనారోగ్య సమస్యలు కొని తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు తాజగా ఓ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ తన విభిన్నమైన వెల్నెస్ రోటీన్ని నెట్టింట షేర్ చేశాడు. అది చూసి నెటిజన్లు బాబోయ్ మరీ ఇంత మంచి అలవాట్లా..అని విస్తుపోతున్నారు. నో ఛాన్స్ అదంతా వర్కౌట్ అయ్యే అవకాశం లేదని కామెంట్లు కూడా చేస్తున్నారు. మరీ అంత విచ్రితంగా అనిపించినా.. అతడి వెల్నెస్ రొటీన్ ఏంటో చూద్దామా..!.29 ఏళ్ల ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఆష్టన్ హాల్తన తీవ్రైమన ఆరోగ్య స్ప్రుహ కారణంగా నెట్టింట వైరల్‌గా మారాడు. అతడి ఫిట్నెస్ మంత్ర చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అతడి స్ట్రిట్ ఫిట్నెస్ రొటీన్ ఎలా ఉంటుందంటే..అత్యంత క్రమశిక్షణాయుతమైన జీవనశైలి అతడిది. హాల్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ఉదయం 3:52 ప్రారంభమైమార్నింగ్ 9.30 గంటలకు ముగుస్తుంది. హాల్ నిద్రపోయేటప్పుడు తన నోటికి మౌత్ట్యాప్ వేసుకుంటాడు. ఇది గురకను నివారస్తుందనేది అతడి నమ్మకం. ఆ తర్వాత 7.30 నుంచి 8.30 గంటల వరకు స్విమ్మింగ్ పూల్‌లో గడిని తదనంతరం బ్రేక్‌ఫాస్ట్‌గా అరటిపళ్లు తీసుకుంటాడు.ఆ తర్వాత అదే అరటిపండు తొక్కలను ముఖానికి రుద్దుకుంటాడు. ఆ తర్వాతమ బ్రాండెడ్ మినరల్ వాటర్, గిలకొట్టన పచ్చిగుడ్లు, అవకాడో టోస్ట్ వంటివి అతడి ఆహారాలు. ఈ వెరైటీ దినచర్యకు గానూ హాల్ నెట్టింట వైరల్‌గా మారాడు. ఇది సాధ్యమయ్యేది కాదనేది నెటిజన్ల వాదన. అంతేగాదు సోషల్ మీడియాలో బ్రో బిజీ లైప్ ఇవన్నీ కష్టం అని కామెంట్ చేస్తూ పోస్టుల పెడుతున్నారుహాల్ అనుసరించే కొన్ని మంచి వెల్నెస్ ట్రెండ్లు..మౌత్ ట్యాపింగ్మౌత్ ట్యాపింగ్ అనేది రాత్రిపూట నోటిని మూసి ఉంచడానికి ఉపయోగించే ప్రత్యేక టేప్. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రసిద్ధ వెల్నెస్ ట్రెండ్ ముక్కు ద్వారా శ్వాస తీసుకునేలా చేస్తుంది. అలాగే పీల్చే గాలి ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా అలర్జీ కారకాలు, శిధిలాలు లేదా విషపదార్థాలు ఊపిరితిత్తులకు చేరక మునుపే ఫిల్టర్ అవుతాయి. అంతేగాదు తేలికపాటి స్లీప్ అప్నియా ఉంటే మౌత్ ట్యాపింగ్ హెల్ప్ అవుతుందని చెబుతున్నారు నిపుణులు. ముఖాన్ని ఐస్ వాటర్‌లో ముంచడం..చల్లటి నీటిలో ముఖాన్ని ముంచడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఒత్తిడి హర్మోన్ స్థాయిని తగ్గిస్తుందట. నాడీ వ్యవస్థపై ప్రశాంతత ప్రభావాన్ని చూపుతుంది. చల్లటి నీరు రక్త నాళాలను ఇరుకుగా చేయడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. చర్మ కణాలకు ఆక్సిజన్ పోషకాలను అందిస్తుంది. ప్రకాశవంతమైన రంగుని అందించడంలో హెల్ప్ అవుతుందట. అంతేగాదు ఈ మంచులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయట. ఇవి మొటిమల రంధ్రాల పరిమాణాన్ని తగ్గిస్తాయట. అదే సమయంలో వాపు వంటివి దరిచేరనీయదు అని చెబుతున్నారు నిపుణులు.చర్మంపై అరటి తొక్క ప్రభావంఅరటిపండ్లు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియంల శక్తివంతమైన వనరు. మొత్తం ఆరోగ్యానికి సహాయపడతాయి. చర్మంపై అరటి తొక్కను రుద్దడం వల్ల మాయిశ్చరైజర్‌గా పనిచేసి చర్మాని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ముడతలు తగ్గుతాయి. గీతలు లేకుండా చేస్తుంది. అలాగే కళ్ళ కింద నల్లటి వలయాలను తగ్గిస్తుందని చెబుతున్నారు చర్మ నిపుణులుమార్నింగ్ వ్యాయామంఉదయం వ్యాయామం ప్రత్యేకమైన జీవక్రియ ప్రభావాలను కలిగి ఉంటుంది. అధ్యయనాల ప్రకారం, వ్యాయామం చేసే సమయంలో శరీరం జీవక్రియ ప్రతిస్పందనను ప్రభావితం చేస్తుంది. ఉదయం వ్యాయామాలు కొవ్వు జీవక్రియను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా గ్లూకోజ్ టాలరెన్స్‌ను మెరుగుపరిచి అలసటను తగ్గిస్తుంది. అంతేగాదు శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది కూడా. అలాగే బాడీని ఫిట్‌గా ఉంచడమే కాకుండా మంచి నిద్రను, మెరుగైన ఏకాగ్రత అందిస్తుంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: చిరాకుగా ఉన్నా..చిద్విలాసంగా ఉన్నా..చిరుతిండికే ఓటు..!)
ఫొటోలు
International

లండన్: నిరసనకారులకు దీదీ ఝలక్
లండన్: విదేశీ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)కి నిరసన సెగ తాకింది. ఓ కాలేజ్ ఈవెంట్లో మమత ప్రసంగిస్తున్న టైంలో టీఎంసీ వ్యతిరేక నినాదాలతో అడ్డుపడ్డారు. అయితే వాళ్లకు అంతే ధీటుగా ఆమె సమాధానం ఇవ్వడంతో అక్కడి హాల్ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది.గురువారం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ(Oxford University)లోని కెల్లాగ్ కళాశాలలో బెంగాల్ పారిశ్రామికీరణ అంశంపై ఆమె ప్రసంగించారు. ఆ టైంలో కొందరు ఫ్లకార్డులతో నినాదాలు చేస్తూ ఆమె ప్రసంగానికి అడ్డు పడ్డారు. ఆ ఫ్లకార్డుల మీద బెంగాల్ ఎన్నికల హింస, ఆర్జీకర్ ఘటన(RG Kar Incident), జాదవ్‌పూర్ యూనివర్సిటీ ఘటనలకు సంబంధించిన రాతలు ఉన్నాయి. మమత మాట్లాతున్న టైంలో.. టీఎంసీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు వాళ్లు. అయితే.. Mamata Banerjee faces protest at Oxford University, London during speech..SFI-UK held a demonstration in Kellogg College, Oxford against Mamata Banerjee's speech. #MamataBanerjee #UK #OxfordUniversity pic.twitter.com/uJinRxGhT2— Kapadia CP (@Ckant72) March 28, 2025వాళ్లకు ఆమె ధీటుగానే బదులిచ్చారు. ‘‘మీరేం చెప్పదల్చుకున్నారో గట్టిగా చెప్పండి. నాకేం వినిపించడం లేదు. మీరే చెప్పే ప్రతీది వినేందుకు నేను సిద్ధం. ఈ కేసు(ఆర్జీకర్ ఘటన) పెండింగ్‌లో ఉందని మీకు తెలుసా?. ప్రస్తుతం ఆ అంశం మా చేతుల్లో లేకుండా పోయింది. కేంద్రమే ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇది రాజకీయాలకు వేదిక కాదు. మీ రాజకీయాలు ఇక్కడ కాదు. దమ్ముంటే మా రాష్ట్రానికి వచ్చి నాతో రాజకీయం చేయండి’’ అని సవాల్ విసిరారామె. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా కంగుతిన్నారు. నిరసకారుల్లో ఓ విద్యార్థిని ఉద్దేశించి.. ‘‘చూడు తమ్ముడూ.. అబద్ధాలు చెప్పకు. నీ మీద నాకు సానుభూతి ఉంది. కాకుంటే ఇక్కడ రాజకీయాలు చేసే బదులు బెంగాల్‌కు వెళ్లి మీ పార్టీని బలోపేతం చేసుకోండి. అప్పుడే వాళ్లు మాతో తలపడగలరు’’ అని అన్నారామె. ఆ మాటలతో వాళ్లు మరింత రెచ్చిపోయారు. దీంతో ఆమె మరోసారి స్పందిచాల్సి వచ్చింది. ‘‘నన్ను అవమానించడం ద్వారా మీ విద్యా సంస్థను మీరే అగౌరవపర్చుకుంటున్నారు. నేను ఇక్కడికి వచ్చింది దేశం తరఫున ప్రతినిధిగా. దయచేసి మీ దేశాన్ని మీరే అవమానించకండి.’’ అన్నారు. #Breaking: WB CM #MamataBanerjee’s speech at Kellogg College, University of Oxford interrupted by questions on Abhaya/RG Kar case. Mamata Banerjee says, “This matter is sub judice, this case is with the central government. Do not do politics here, this platform is not for… pic.twitter.com/fwPYYYHPsW— Pooja Mehta (@pooja_news) March 27, 2025మమత మాటలతో ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది. ఆ టైంలో సభలో ఉన్నవాళ్లను ఉద్దేశిస్తూ.. ఇప్పుడు మీరు ఇస్తున్న ప్రొత్సాహాం నన్ను మళ్లీ మళ్లీ ఇక్కడికి వచ్చేలా చేసింది. దీదీ.. ఎవరినీ పట్టించుకోదు. దీదీ ఓ రాయల్ బెంగాల్ టైగర్. ఒకవేళ పట్టుకోవాలనుకుంటే.. పట్టుకోండి అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ఆపై నిర్వాహకులు, అక్కడున్న ఆడియొన్స్ సూచన మేరకు నిరసనకారులు బయటకు వెళ్లిపోగా.. దీదీ ప్రసంగం కొనసాగింది. ఆ టైంలో వేదికపై క్రికెట్ దిగ్గజం సౌరబ్ గంగూలీ కూడా ఉన్నారు. চিত্ত যেথা ভয়শূন্য, উচ্চ যেথা শিরShe doesn’t flinch. She doesn’t falter. The more you heckle, the fiercer she roars. Smt. @MamataOfficial is a Royal Bengal Tiger!#DidiAtOxford pic.twitter.com/uqrck6sjFd— All India Trinamool Congress (@AITCofficial) March 27, 2025

యూఏఈ: 500 మందికి పైగా భారతీయులకు క్షమాభిక్ష
అబుదాబి: భారత్‌తో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే క్రమంలో యూఏఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా భారీ సంఖ్యలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. అందులో భారత్‌కు చెందిన వాళ్లే 500 మందికి పైగా ఉండగా.. వాళ్లంతా జైళ్ల నుంచి విడుదలైనట్లు సమాచారం. రంజాన్ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ అక్కడి జైళ్లలో ఉన్న 1,295 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. మరోవైపు ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా 1,518 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్‌లోని జైళ్లలో మగ్గుతున్న వివిధ దేశాలకు చెందిన ఖైదీలకు తాజా క్షమాభిక్ష వర్తిస్తుందని అటార్నీ జనరల్, ఛాన్సలర్ ఎస్సమ్ ఇస్సా అల్ హుమైదాన్ ప్రకటించారు. రంజాన్ మాసం సందర్భంగా ఇలా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం.. విడుదల చేయడం యూఏఈలో ఆనవాయితీగా వస్తోంది. అయితే సత్ప్రవర్తనను ఆధారంగా చేసుకునే ఆయా ఖైదీలను ఎంపిక చేసి విడుదల చేస్తుంటారు. అంతేకాదు వాళ్లు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు అవసరమయ్యే ఆర్థిక సాయం కూడా అందించనున్నారు.

పుతిన్ త్వరలో చనిపోతారు
కీవ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై వదంతుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. ఆయన తొందరలోనే చనిపోతారని వ్యాఖ్యానించారు. రెండు దేశాల మద్య యుద్ధం అప్పుడే ముగుస్తుందన్నారు. పారిస్‌లో ఓ ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మా న్యుయేల్ మాక్రాన్‌తో బుధవారం భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతి ప్రయత్నాలు జరుగుతున్నా రష్యా మాత్రం సంఘర్షణను ఇంకా లాగుతోందని ఆరోపించారు. ‘‘యుద్ధం కొనసాగాలని రష్యా కోరుకుంటోంది. యుద్ధాన్ని ముగించేలా దానిపై ఒత్తిడి తేవాల్సిన అవసరముంది’’ అన్నారు. పుతిన్ ఆరోగ్యంపై కొన్ని నెలలుగా ఊహాగానాలు, వదంతులు వినిపిస్తున్నాయి. ఆయన ఎడ తెరిపి లేకుండా దగ్గుతున్న వీడియోలు, చేతులు, కాళ్లు అసంకల్పితంగా కదలడం వంటివి పుకార్లకు మరింత బలం చేకూర్చాయి. 2022లో రష్యా మాజీ రక్షణ మంత్రి సెర్గీ షొయిగుతో భేటీ సందర్భంగా పుతిన్ టేబుల్ పట్టుకొని కుర్చీలో కూర్చున్న వీడియో వైరలైంది. ఆయన పార్కిన్సన్, కేన్సర్‌తో పోరా డుతున్నట్టు కొన్ని నివేదికలు కూడా వచ్చాయి. క్రెమ్లిన్ మాత్రం ఈ వార్తలను ఖండించింది.

శ్వేతసౌధంలో చిరు చొరబాటు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేస్తున్న వేళ కాల్పుల ఘటనతో ఉలిక్కిపడిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆనాటి నుంచి అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ ఏజెంట్లకు బుధవారం ఒక చిన్నారి కాస్తంత పనిచెప్పాడు. తల్లిదండ్రులతో కలిసి వాషింగ్టన్ డీసీలో అధ్యక్షుని అధికార నివాసం వైట్‌హౌస్ ఉన్న ప్రాంతానికి వచ్చాడు. రోడ్డుకు, శ్వేతసౌధానికి మధ్య గోడ కాకుండా కేవలం నిలువెత్తు ఇనుప చువ్వల ఫెన్సింగ్ మాత్రమే ఉంటుంది. హఠాత్తుగా రోడ్డు మీద నుంచి ఆ ఫెన్సింగ్ చువ్వల సందుల్లోంచి సులభంగా దూరిపోయి వైట్‌హౌస్ గార్డెన్‌లోకి వచ్చి అంతా కలియ తిరగడం మొదలెట్టాడు. ఇది చూసి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు చకచకా వచ్చేసి చిన్నారిని ఎత్తుకుని తీసుకెళ్లారు. బయటివైపు పిల్లాడి కోసం చూస్తున్న తల్లిదండ్రులకు అప్పగించారు. ఉత్తరం వైపు పచ్చికబయళ్ల వద్ద బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ఈ ఘటన జరిగిందని సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి ఆంటోనీ గుగెల్మీ చెప్పారు. నీలం రంగు హూడీ చొక్కా వేసుకున్న చిన్నారిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఎత్తుకునిరావడం, పిల్లాడు అతని గడ్డంతో ఆడుకుంటున్న దృశ్యాలున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘ ఎంతోమంది నిరసనకారులు ఆ ఫెన్సింగ్ దాటేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ ఈ పిల్లాడు రెప్పపాటులో ఫెన్సింగ్ దాటేశాడు’’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘ వైట్‌హౌస్‌లో ఈజీగా వెళ్లిపోయానని భవిష్యత్తులో చెప్పుకోవడానికి ఆ పిల్లాడికి ఇది ఒక చిరస్మరణీయ ఘటనగా నిలిచిపోతుంది’’ అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘‘ అతను ఒకవేళ ఎలాన్ మస్క్ డజను మంది సంతానంలో ఒకరై ఉంటారు. తండ్రి ఆఫీస్ ఇదేననుకుని వచ్చాడేమో’’ అని మరొకరు ట్వీట్‌చేశారు.
National

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్.. మరో కేసు నమోదు
ఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై పిటిషన్ దాఖలైన క్రమంలో ఆయనపై కేసు నమోదు చేయాలని ఇటీవల ఢిల్లీ కోర్టు ఆదేశాలు చేయగా, పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు కోర్టుకు రిపోర్ట్‌ను సమర్పించారు.ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోందని, మరింత సమయం కావాలని కోర్టుకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో తదుపరి విచారణను ఏప్రిల్ 18కి కోర్టు వాయిదా వేసింది. కాగా, 2019లో ద్వారకలో భారీ హోర్డింగ్‌లు ఏర్పాటుకు నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఢిల్లీ రౌజ్‌అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ సహా ఇతర నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. ఆ అభ్యర్థనకు ఢిల్లీ కోర్టు అంగీకారం తెలిపింది. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రోసిజర్ సెక్షన్ 156(3) కింద దరఖాస్తును అనుమతించాల్సిన అవసరం ఉందని ఈ కోర్టు అభిప్రాయపడింది.ఢిల్లీ ప్రివెన్షన్ ఆఫ్ డిఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 2007లోని సెక్షన్ 3 కింద నమోదు చేయాలని కోర్టు పేర్కొంది. అక్రమ హోర్డింగ్‌లు కూలిపోవడం వల్ల గతంలో మరణాలు నమోదయ్యాయని, అందువల్ల కఠిన చర్యలు అవసరమని కోర్టు నొక్కి చెప్పింది. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎస్‌హెచ్‌వోను ఆదేశించినట్లు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నేహా మిట్టల్ తన తీర్పులో పేర్కొన్నారు. 2019లో దాఖలైన ఫిర్యాదులో కేజ్రీవాల్, కొందరు నేతలు ఆ ప్రాంతం అంతటా భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజా నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

భావ ప్రకటన స్వేచ్ఛ.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: వాక్ స్వాతంత్ర్యం.. భావ ప్రకటన స్వేచ్ఛపై దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court Of India) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో.. అందునా ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో అవి భాగమని.. ప్రాథమిక హక్కులను పరిరక్షించడం న్యాయస్థానాల విధి అని స్పష్టం చేస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది.రెచ్చగొట్టేలా పద్యాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గర్హీపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం.. సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ(Freedom of Expression) అంతర్భాగమని, ఆ హక్కును గౌరవించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో గుజరాత్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఈ కేసులో ఎలాంటి నేరం లేకపోయినా అత్యుత్సాహం ప్రదర్శించారని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంలోనే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.సినిమాలు, కవిత్వం.. సాహిత్యం, వ్యంగ్యం.. మనుషుల జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తాయి. ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ లేనప్పుడు.. ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం ఎలా సాధ్యమవుతుంది?. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో.. విభిన్న అభిప్రాయాలను.. ప్రతివాదనలతో ఎదుర్కోవాలే తప్ప అణచివేతతో కాదు. ఒకవేళ ఆ వ్యాఖ్యలపై ఆంక్షలు విధించాల్సివస్తే.. అవి సహేతుకంగా ఉండాలే గానీ.. ఊహాజనితంగా కాదు. ఓ వ్యక్తి అభిప్రాయాలను ఎక్కువమంది వ్యతిరేకించినా సరే.. ఆ వ్యక్తి భావ ప్రకటనా హక్కును తప్పనిసరిగా గౌరవించాల్సిందే. భావ స్వేచ్ఛ ప్రకటన, వాక్ స్వాతంత్య్రం(Freedom of Speech) అనేవి ప్రజాస్వామ్యంలో అంతర్భాగం. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం న్యాయస్థానాల విధి. పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలి. అంతిమంగా.. ఆర్టికల్ 19(1)ను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులదే’’ అని ధర్మాసనం స్పష్టం చేస్తూ.. గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేసింది. జరిగింది ఇదే..గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి(Imran Pratapgarhi) గతేడాది డిసెంబరులో 46 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఒకటి పోస్ట్ చేశారు. ఓ పెళ్లి వేడుక మధ్యలో ఆయన నడిచివస్తుండగా పూలవర్షం కురిపిస్తూ.. బ్యాక్‌గ్రౌండ్ ఓ పద్యం వినిపించారు. అయితే, ఆ పద్యంలో పదాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, అవి మత విశ్వాసాలు, సామరస్యాన్ని, జాతి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయన్న ఫిర్యాదుతో గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్ హైకోర్టులో ఇమ్రాన్‌కు ఊరట లభించలేదు. దీంతో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం.. ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్‌కు ఊరట ఇచ్చింది.

హైకోర్టునే బురిడీ కొట్టించిన మాయగాడు
సొంత ఇంటికే కన్నమేసినట్లు.. తాను పని చేసే చోట దారుణమైన మోసానికి పాల్పడ్డాడు ఆ వ్యక్తి. కాస్త ఆలస్యంగానైనా పాపం పండడంతో కేసు నమోదు అయ్యింది. ఈలోపు హైకోర్టు అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే ఉన్నత న్యాయస్థానాన్ని సైతం బురిడీ కొట్టించిన అతని మోసం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముంబై: ఫోర్జరీ, కాపీ రైట్ ఉల్లంఘన కేసులో నిందితుడు ఏకంగా జడ్జి సంతకాన్నే ఫోర్జరీ చేశాడు. ఆ ఫేక్ కోర్టు ఆదేశాలతో హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ మీద ఎంచక్కా బయటకు వచ్చాడు. చివరకు.. ఆ మోసం బయటపడేలోపు పరారయ్యాడు. ఆ మాయగాడి వ్యవహారంపై బాంబే హైకోర్టు(Bombay High Court) భగ్గుమంది. కోర్టు ఆదేశాలతో పోలీసులు నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పుణేకి చెందిన సీటీఆర్ మానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డిజైన్లను చెన్నైకు చెందిన ఓ కంపెనీ ఉపయోగించడంపై 2022లో ఫిర్యాదు దాఖలైంది. దర్యాప్తులో సీటీఆర్‌లో పని చేసే ఉద్యోగులే ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది. సీటీఆర్ ఉద్యోగులు.. మాజీ ఉద్యోగులు కొందరి మీద విమంతల్ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. 2016-2017 పని చేసిన హరిబావు చెంటే కూడా నిందితుల జాబితాలో ఉన్నాడు. అతనిపై ఫోర్జరీ, కాపీ రైట్ ఉల్లంఘన అభియోగాలున్నాయి.అయితే.. ముందస్తు బెయిల్ కోసం హరిబావు పుణే జిల్లా కోర్టును ఆశ్రయించగా.. అతనికి చుక్కెదురైంది. దీంతో బాంబే హైకోర్టులో ఓ పిటిషన్ వేశాడు. ఈ క్రమంలో పుణే కోర్టు జడ్జి సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ కోర్టు ఆదేశాలను సృష్టించాడు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 169 ప్రకారం.. నిందితుడి మీద అభియోగాలకు సంబంధించి సరైన ఆధారాలు లేకుంటే న్యాయ విచారణ లేకుండా విడుదల చేయొచ్చు. దీన్ని ఆసరాగా చేసుకుని పుణేకు చెందిన ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సంతకాన్ని చెంటే ఫోర్జరీ చేశాడు. ఆ నకిలీ ఆదేశాలకు హైకోర్టుకు సమర్పించి.. ఈ ఏడాది జనవరి 17వ తేదీన బెయిల్ పొందాడు. అయితే..ఈ వ్యవహారంపై అనుమానంతో సీటీఆర్ కంపెనీ విమంతల్ పోలీసులను ఆశ్రయించింది. వాళ్లు ఈ విషయాన్ని ఇటు పుణే కోర్టు.. అటు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హరిబావు సమర్పించిన కోర్టు ఆదేశాలు రాతపూర్వకంగా ఉండడంతో హైకోర్టు పరిశీలన జరిపింది. జడ్జి సంతకం ఫోర్జరీ, నకిలీ ఆదేశాలు బెయిల్ పొందినట్లు తేలడంతో హైకోర్టు తీవ్రంగా భావించింది. అతని బెయిల్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించి.. అతనిపై మరో కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న హరిబావు చెంటే కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

జమ్ములో కొనసాగుతున్న ఉగ్ర వేట.. నలుగురు పోలీసుల వీరమరణం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టగా.. మరికొందరి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులు వీరమరణం చెందారు. డీఎస్పీ అధికారి సహా మరో ముగ్గురు సిబ్బందికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.రాజ్‌బాగ్ ప్రాంతంలోని జఖోలె గ్రామం వద్ద గురువారం ఈ ఎన్కౌంటర్ జరిగింది. పాక్ భూభాగం నుంచి దొంగచాటుగా చొరబడిన ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన కార్డన్ ఆపరేషన్ సుదీర్ఘ ఎదురు కాల్పులకు దారి తీసింది. ఇంకా నలుగురు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఆదివారం సాయంత్రం కథువా జిల్లా హిరానగర్ సెక్టార్లో జమ్మూకశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ)కి ఎదురుపడ్డ ఉగ్రవాదుల గ్రూపు తప్పించుకుపోయింది. ఘటనాప్రాంతంలో ఎం4 కార్బైన్ తపాకులు నాలుగు, గ్రనేడ్లు 2, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఒకటి, ఐఈడీ సామగ్రి అక్కడ లభించాయి. శనివారం వీరు లోయమార్గం గుండా, లేదా కొత్తగా నిర్మించిన సొరంగం గుండా చొరబడి ఉంటారని భావిస్తున్నారు. అప్పటి నుంచి డ్రోన్లు, హెలికాప్టర్లు, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, జాగితాలతో వేటాడుతూనే ఉన్న ఎస్‌వోజీ అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో గురువారం వారి జాడను పసిగట్టింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సుఫైన్ గ్రామ సమీప దట్టమైన అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. పోలీసులకు తోడు ఆర్మీ, సీఆర్పీఎఫ్ను కూడా ఉన్నతాధికారులు అక్కడికి తరలించారు.
NRI

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్‌కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్‌ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్‌పర్సన్‌గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్‌లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్‌ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్‌లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్‌లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్‌లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు సహాయం కోరే వారికి మరియు సహాయం అందించే వారికి వారధిగా నిలిచే తెలుగు లేడీస్ ఇన్ యుకె గ్రూపును శ్రీదేవి మీనా వల్లి 14 ఏళ్ల క్రితం స్థాపించారు. ఈ గ్రూపులో ప్రస్తుతం ఐదు వేలకు పైగా తెలుగు మహిళలు ఉన్నారు.యూకే కి వచ్చినా తెలుగు ఆడపడుచులను ఆదరించి వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ విద్యా వైద్య ఉద్యోగ విషయాల్లో సహాయం అందించడమే గ్రూప్ ఆశయమని శ్రీదేవి గారు తెలియజెప్పారు. ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో ,లైవ్ తెలుగు బ్యాండ్ తో, పసందైన తెలుగు భోజనంతో పాటు,చారిటీ రాఫెల్ నిర్వహించి అవసరంలో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచారు.మస్తీ ఏ కాదు మానవత్వం లో కూడా ముందు ఉన్నాము అని నిరూపించారు.ఈవెంట్ లో డాక్టర్ వాణి శివ కుమార్ గారు మహిళలకు సెల్ఫ్ కేర్ గురించి ఎన్నో మంచి సూచనలు ఇచ్చారు. ఈవెంట్ కి వచ్చిన వాళ్లందరికీ మనసు నిండా సంతోషంతో పాటు మన తెలుగుతనాన్ని చాటిచెప్పేలా గాజులు,పూతరేకులు, కాజాలు వంటి పసందైన రుచులతో తాంబూలాలు పంచిపెట్టారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి ,స్వాతి డోలా,జ్యోతి సిరపు,స్వరూప పంతంగి ,శిరీష టాటా ,దీప్తి నాగేంద్ర , లక్ష్మి చిరుమామిళ్ల , సవిత గుంటుపల్లి, చరణి తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

నోట్లో నురగలతో ముగ్గురు చిన్నారుల మృతి
పటాన్చెరు టౌన్: రాత్రి భోజనం చేసి పడుకున్నారు. తెల్లవారుజామున నోట్లో నురగలతో విగతజీవులై కన్పించారు. ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మరణించిన విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఆస్పత్రిలో చేరిన వారి తల్లి చికిత్స పొందుతోంది. సీఐ నరేష్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదకపల్లి గ్రామానికి చెందిన చెన్నయ్యకు 2008లో వివాహం జరిగింది.2010లో భార్య అనారోగ్యంతో మరణించడంతో 2012లో నల్లగొండ జిల్లా మందాపూర్ గ్రామానికి చెందిన రజిత అలియాస్ లావణ్యను రెండో వివాహం చేసుకున్నాడు. ఏడేళ్ల క్రితం బతుకుతెరువు కోసం రాఘవేంద్ర కాలనీకి వచ్చి ఉంటున్నాడు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, రజిత స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. వీరికి ఐదో తరగతి చదువుతున్న సాయికృష్ణ (12), నాలుగో తరగతి చదువుతున్న మధుప్రియ (10), మూడు చదువుతున్న గౌతమ్ (8) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంతా కలిసే భోజనం చేశారు గురువారం రాత్రి 9 గంటల సమయంలో అంతా కలిసి భోజనం చేశారు. పిల్లలు, రజిత పప్పుతో పాటు షాపు నుంచి తెచ్చుకున్న పెరుగుతో అన్నం తిన్నారు. చెన్నయ్య మాత్రం వట్టి పప్పుతో తిని, ట్యాంకర్ తీసుకుని చందానగర్‌కు వెళ్లాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగిరాగా, రజిత తలుపులు తీసింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో రజిత తీవ్రంగా కడుపు నొప్పి వస్తోందని భర్తకు చెప్పింది. చెన్నయ్య వెంటనే పిల్లలను నిద్రలేపేందుకు వెళ్లగా ముగ్గురు పిల్లలు నోటి నుండి నురగలు కక్కుతూ చలనం లేకుండా కనిపించారు.దీంతో వెంటనే బయటకు వెళ్లిన ఆయన ‘కాపాడండి..’అంటూ అరిచాడు. స్ధానికులు రావడంతో పిల్లలు చనిపోయారని, భార్యకు సీరియస్‌గా ఉందని చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు రజితను బీరంగూడలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ పారితోష్ పంకజ్, సీఐ నరేష్, క్లూస్ టీం ఇంటి ముందు, వెనుక, భవనంపైన పరిశీలించారు. ఘటనపై స్థానికుల్ని ఆరా తీశారు.పిల్లల్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజితతో అమీన్పూర్ పోలీసులు మాట్లాడారు. తాము విషం లాంటిదేమీ తీసుకోలేదని, పప్పు, పెరుగన్నం తిన్నామని, భర్త పప్పుతో అన్నం తిన్నాడని వివరించింది. దీంతో వీరు తిన్న పెరుగులో ఏదైనా కలిసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడతామని తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు చిన్నారుల బ్లడ్ శాంపిల్స్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అమీన్పూర్ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో ధర్యాప్తు చేస్తున్నారు. రాత్రి అసలేం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. మరణించిన చిన్నారులు తీసుకున్న ఆహారంలో ఎవరైనా ఉద్దేశపూర్వంగా విషం కలిపారా? లేక ఫుడ్ పాయిజన్ జరిగిందా? అనేది పరిశీలిస్తున్నారు. చిన్నారుల బ్లడ్ శాంపిళ్లతో పాటు, ఇతర శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎస్పీ పరితోష్ పంకజ్ ‘క్లూస్ టీంతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించాం. స్థానికంగా ఆరా తీశాం. కానీ ఏం జరిగింది అన్న విషయం ఇంకా పూర్తిస్ధాయిలో తెలియరాలేదు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే ఎలా మృతి చెందారన్న విషయం తెలుస్తుంది. ఇప్పుడే ఏమీ చెప్పలేం..’అని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు.గతంలో భార్యాభర్తల మధ్య గొడవలున్నాయి: రజిత తల్లి ‘గత ఏడాది వరకు నా కూతురుకి, అల్లుడికి గొడవలు ఉన్నాయి. అప్పట్లో వచ్చి సర్ది చెప్పి వెళ్లాం. అప్పుడే నా కూతురు.. మళ్లీ గొడవ జరిగితే నేను, నా పిల్లలు మందు తాగి చనిపోతామని, మందు దొరకకపోతే ఎక్కడైనా నదిలో పడి చనిపోతామని చెప్పింది..’అని రజిత తల్లి పార్వతమ్మ మీడియాకు చెప్పింది.కారు ఇచ్చి ఆస్పత్రికి పంపా.. ‘చెన్నయ్య ఏడేళ్లుగా రాఘవేంద్ర కాలనీలో ఉంటున్నా డు. అర్ధరాత్రి రెండున్నర స మయంలో పిల్లలు చనిపోయారని, భార్య ప్రాణాపా య స్థితిలో ఉందంటూ చెన్నయ్య అరవడంతో బ యటకు వచ్చాం. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు నేనే కారు ఇచ్చా. డయల్ 100కు, పోలీసులకు సమా చారం ఇచ్చా’అని కాలనీ వాసి ప్రభాకర్ చారి చెప్పారు.

అయ్యో...అవ్వ!
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వంలో ఒంటరి వృద్ధులకూ రక్షణ కరువైంది. ఎవరిని ఏం చేసినా పట్టించుకునే వారే లేకపోవడంతో అరాచకశక్తులు పేట్రేగిపోతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి ఏలూరు వన్‌టౌన్ సత్యనారాయణపేటకు చెందిన చానాపతి రమణమ్మ (65) అనే ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ప్రసాద్ అనే యువకుడు ఆమె వద్ద డబ్బు ఉందని తెలుసుకుని 7.30 గంటల సమయంలో గొడవ పడ్డాడు. 9.30 గంటలకు మరోసారి వెళ్లి గొడవకు దిగాడు. ఆమె ముఖంపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మెడలోని బంగారు గొలుసు, బీరువాలోని కొంత నగదు తీసుకుని పరారయ్యాడు. తానే చంపానన్న అనుమానం వస్తుందని భావించి అర్ధరాత్రి ఆమె ఇంటికి మళ్లీ వచ్చాడు. ఆమె చేతులు, కాళ్లను కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి, వెంట తీసుకువచ్చిన పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. ఆమె ఇంట్లో నుంచి దట్టమైన పొగ రావటంతో స్థానికులు వెళ్లి చూడగా విషయం వెలుగు చూసింది. పోలీసులు డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ బృందంతో రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని నగదు, నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం
సాక్షి, పెద్దపెల్లి జిల్లా: రాష్ట్రంలో మరో పరువు హత్య కలకలం రేపింది. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో తన కూతురిని ప్రేమించాడనే కారణంతో సాయికుమార్ అనే యువకుడిని తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముప్పిరతోట గ్రామానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పుట్టినరోజు నాడే సాయికుమార్‌ను ప్రత్యర్థులు మట్టుబెట్టారు. దీంతో సాయికుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని మృతదేహాన్ని ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న అమ్మాయి తండ్రి కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు.

భవనంపై నుంచి దూకి నవ వధువు ఆత్మహత్య
ముషీరాబాద్: భర్త, అత్తింటి వేధింపులు తాళలేక ఓ నవ వధువు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్‌పూర్‌లో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భోలక్‌పూర్‌కు చెందిన సౌజన్యకు మూసాపేటకు చెందిన జిమ్ నిర్వాకుడు శబరీష్ యాదవ్‌తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.అయితే, సౌజన్యకు గుండెలో రంధ్రం ఉందని, చెప్పకుండా పెళ్లి చేశారని ఆమె భర్త, అతడి కుటుంబ సభ్యులు సౌజన్యను తరచూ వేధిస్తున్నారు. ఈ విషయం దాచినందుకు అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు. పలుమార్లు ఆమెను పుట్టింటికి పంపారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి అత్తింటికి వెళ్లిన సౌజన్యను తమ ఇంటికి రావొద్దంటూ అక్కడినుంచి వెల్లగొట్టారు.దీంతో మనస్తాపం చెందిన సౌజన్య పుట్టింటికి వచ్చి మూడంతస్తుల భవనం పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికి మృతి చెందినట్లు ముషీరాబాద్ పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి పుష్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.