
ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎంట్రీతో రాబిన్‌హుడ్ సినిమా (Robinhood Movie)కు కొత్త జోష్ వచ్చినట్లయింది. అతడి స్పెషల్ ఎంట్రీ సినిమాలోనే కాకుండా ప్రీరిలీజ్ ఈవెంట్‌లోనూ ఉండటంతో అభిమానులు సంతోషపడ్డారు. కానీ ఇదే ఈవెంట్‌లో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ వార్నర్‌పై నోరు జారాడు. రేయ్ వార్నరూ.. క్రికెట్ ఆడమంటే కుప్పిగంతులు వేస్తున్నావ్.. అంటూ అతడిని వెక్కిరిస్తూ ఓ బూతు మాట కూడా అన్నాడు.
క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
అంత పెద్ద క్రికెటర్‌ను పట్టుకుని ఇలాంటి చవకబారు వ్యాఖ్యలేంటని జనం మండిపడ్డారు. దీంతో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) క్షమాపణలు తెలిపాడు. వార్నర్ అంటే తనకిష్టమని, ఉద్దేశపూర్వకంగా అలాంటి మాట అనలేదన్నాడు. పొరపాటున నోరు జారానని, మరోసారి అలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. తన మాట తీరు వల్ల ఎవరైనా బాధపడుంటే క్షమించండి అని కోరాడు.
వార్నర్ రియాక్షన్ ఇదీ!
ఈ విషయంలో వార్నర్ (David Warner) రియాక్షన్ ఎలా ఉందో బయటపెట్టాడు దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula). వెంకీ మాట్లాడుతూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మేమందరం కలిశాం. అప్పుడు రాజేంద్రప్రసాద్‌గారు, వార్నర్ బాగా క్లోజ్ అయ్యారు. రాజేంద్రప్రసాద్‌గారు చాలా పెద్దాయన, కానీ చిన్నపిల్లాడి మనస్తత్వం. ఏదనిపిస్తే అది మాట్లాడతారు. నువ్వు యాక్టింగ్‌కు వచ్చావ్ కదా.. చూసుకుందాం అని రాజేంద్రప్రసాద్.. నువ్వు క్రికెట్‌కు రా.. చూసుకుందాం అని వార్నర్ ఒకరినొకరు టీజ్ చేసుకున్నారు.
నోరు జారాడు
దాన్ని స్టేజీపై ఫన్ చేసే క్రమంలో రాజేంద్రప్రసాద్ అనుకోకుండా ఓ మాట తూలారు. అందుకు ఆయన కూడా బాధపడ్డారు. ఈ విషయం గురించి వార్నర్‌తో మాట్లాడా.. కాస్త నోరు జారాడు, ఏమీ అనుకోకు అని చెప్పాను. అందుకు వార్నర్.. క్రికెట్‌లో పెద్ద పెద్ద స్లెడ్జింగ్‌లు (కావాలని తిట్టుకోవడం) చూశాను. మా స్లెడ్జింగ్‌లు చూస్తే మీరు చెవులు మూసుకుంటారు. ఇది యాక్టర్స్ మధ్య స్లెడ్జింగ్.. ఇట్స్ ఓకే.. అని పాజిటివ్‌గా మాట్లాడారు. ఆయన చాలా మంచి మనిషి అని వెంకీ చెప్పుకొచ్చాడు. నితిన్ హీరోగా శ్రీలీల కథానాయికగా నటించిన రాబిన్‌హుడ్ మార్చి 28న విడుదల కానుంది. ఇందులో వార్నర్ ముఖ్య పాత్ర పోషించాడు.
చదవండి: 15 ఏళ్ల క్రితం పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకున్నా.. కానీ అదంతా టైం వేస్ట్
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment