David warner
-
లేటు వయసులోనూ ఇరగదీసిన వార్నర్.. వచ్చాడు.. విరుచుకుపడ్డాడు..!
అబుదాబీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో (ILT20 2025) దుబాయ్ క్యాపిటల్స్ (Dubai Capitals) వెటరన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ (David Warner) వచ్చీరాగానే తన ప్రతాపం చూపించాడు. ఐఎల్టీ20లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన వార్నర్.. అబుదాబీ నైట్‌రైడర్స్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్ (57 బంతుల్లో 93 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్) ఆడి తన జట్టుకు క్వాలిఫయర్స్‌కు చేర్చాడు. తాజాగా ఇన్నింగ్స్‌తో వార్నర్ తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపించాడు. వార్నర్ మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌పై క్యాపిటల్స్ 26 పరుగుల తేడాతో గెలుపొందింది.క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో వార్నర్‌తో పాటు షాయ్ హోప్ (24 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), గుల్బదిన్ నైబ్ (25 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), దసున్ షనక (12 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. షనక చివర్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. చివరి రెండు ఓవర్లలో షనక ఎక్కువ భాగం స్ట్రయిక్ తీసుకుని వార్నర్‌కు బ్యాటింగ్ ఇవ్వలేదు. చివరి రెండు ఓవర్లలో వార్నర్‌కు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చి ఉంటే సెంచరీ పూర్తి చేసుకుని ఉండేవాడు. షనక, వార్నర్ ధాటికి నైట్‌రైడర్స్ బౌలర్ జేసన్ హోల్డర్ 4 ఓవర్లలో ఏకంగా 61 పరుగులు సమర్పించుకున్నాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్, హోల్డర్, సునీల్ నరైన్, ఇబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.218 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్ చివరి వరకు పోరాడింది. ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి లక్ష్యానికి 27 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఓపెనర్లు కైల్ మేయర్స్ (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రియస్ గౌస్ (47 బంతుల్లో 78; 7 ఫోర్లు, 4 సిక్సర్లు).. ఆఖర్లో జేసన్ హోల్డర్ (9 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్సర్లు), సునీల్ నరైన్ (8 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) నైట్‌రైడర్స్‌ను గెలిపించేందుకు శతవిధాల ప్రయత్నించారు. క్యాపిటల్స్ బౌలర్ దుష్మంత చమీరా 19వ ఓవర్‌ను అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ఓవరే నైట్‌రైడర్స్ విజయావకాశాలపై నీళ్లు చల్లింది.కాగా, ప్రస్తుత ఐఎల్టీ20 ఎడిషన్‌లో దుబాయ్ క్యాపిటల్స్‌తో పాటు డెజర్ట్ వైపర్స్, ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్స్ క్వాలిఫయర్స్‌కు చేరుకున్నాయి. గల్ఫ్ జెయింట్స్, అబుదాబీ నైట్‌రైడర్స్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి.ఉదయం శ్రీలంకలో సెంచరీ.. సాయంత్రం అబుదాబీలో మెరుపు ఇన్నింగ్స్నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్‌లో క్యాపిటల్స్ ఆటగాడు దసున్ షనక మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు షనక కొన్ని మైళ్ల దూరం ప్రయాణించాడు. ఉదయం శ్రీలంకలో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో సెంచరీ బాదిన షనక.. సాయంత్రం నైట్‌రైడర్స్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షనక.. మేజర్ లీగ్ టోర్నమెంట్లో భాగంగా సింహలీస్ క్లబ్‌కు ఆడుతూ 87 బంతుల్లో 123 పరుగులు చేశాడు. -
రాణించిన కొన్‌స్టాస్.. వార్నర్ జట్టుకు ఊహించని గెలుపు
బిగ్‌బాష్ లీగ్‌లో డేవిడ్ వార్నర్ సారథ్యం వహిస్తున్న సిడ్నీ థండర్‌కు ఊహించని విజయం దక్కింది. పెర్త్ స్కార్చర్స్‌తో ఇవాళ (జనవరి 13) జరిగిన మ్యాచ్‌లో థండర్ జట్టు 61 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (42 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించాడు. ఆఖర్లో టామ్ ఆండ్రూస్ (13 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆండ్రూస్‌కు క్రీస్ గ్రీన్ (16 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్) సహకరించాడు. ఈ ముగ్గురు మినహా థండర్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (8) సహా అంతా విఫలమయ్యారు. మాథ్యూ గిల్కెస్ 8, సామ్ బిల్లింగ్స్ 8, జార్జ్ గార్టన్ 1, హగ్ వెబ్జెన్ 6, మెక్ ఆండ్రూ 9 పరుగులకు ఔటయ్యారు. స్కార్చర్స్ బౌలర్లలో లాన్స్ మోరిస్ మూడు వికెట్లు పడగొట్టగా.. బెహ్రెన్‌డార్ఫ్, అస్టన్ అగర్, కూపర్ కన్నోలీ, మాథ్యూ స్పూర్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. 97 పరుగులకే కుప్పకూలిన స్కార్చర్స్థండర్ 158 పరుగుల స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టమని అంతా అనుకున్నారు. అయితే ఆ జట్టు బౌలర్లు అద్భుతం చేశారు. కలిసికట్టుగా బౌలింగ్ చేసి స్వల్ప స్కోర్‌ను విజయవంతంగా కాపాడుకున్నారు. క్రిస్ గ్రీన్ 3, నాథన్ మెక్ఆండ్రూ 2, మొహమ్మద్ హస్నైన్, తన్వీర్ సంఘా, టామ్ ఆండ్రూస్ తలో వికెట్ పడగొట్టారు. ఫలితంగా స్కార్చర్స్ 17.2 ఓవర్లలో 97 పరుగులకే చాపచుట్టేసింది. స్కార్చర్స్ ఇన్నింగ్స్‌లో ఆరోన్ హార్డీ (22), నిక్ హాబ్సన్ (10), మాథ్యూ స్పూర్స్ (13), జేసన్ బెహ్రెన్‌డార్ఫ్ (17 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. సామ్ ఫాన్నింగ్ (1), ఫిన్ అలెన్ (9), కూపర్ కన్నోలీ (7), అస్టన్ టర్నర్ (4), అస్టన్ అగర్ (7), లాన్స్ మోరిస్ (0), మహ్లి బియర్డ్మ్యాన్ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సిడ్నీ థండర్ ఫైనల్‌కు చేరింది. ఆ జట్టు తొమ్మిది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో (11 పాయింట్లు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. -
డేవిడ్ వార్నర్‌కు చేదు అనుభవం
బిగ్‌బాష్ లీగ్ 2024-25 ఆడుతున్న ఆసీస్ మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ లీగ్‌లో సిడ్నీ థండర్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్.. హోబర్ట్ హరికేన్స్‌తో ఇవాళ (జనవరి 10) జరుగుతున్న మ్యాచ్‌లో తన బ్యాట్‌తో తనే కొట్టుకున్నాడు. అసలేం జరిగిందంటే.. హరికేన్స్‌తో మ్యాచ్‌లో సిడ్నీ థండర్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ను రిలే మెరిడిత్ బౌలింగ్ చేశాడు. వార్నర్ స్ట్రయిక్‌లో ఉన్నాడు. తొలి బంతిని మెరిడిత్ డ్రైవ్ చేసే విధంగా ఆఫ్ స్టంప్ ఆవల బౌల్ చేశాడు. ఈ బాల్‌ను వార్నర్ మిడ్ ఆఫ్ దిశగా డ్రైవ్ చేశాడు. అయితే వార్నర్‌కు ఊహించిన ఫలితం రాలేదు. బౌలర్ స్పీడ్ ధాటికో ఏమో కాని డ్రైవ్ షాట్ ఆడగానే వార్నర్ బ్యాట్ హ్యాండిల్ దగ్గర విరిగిపోయింది. క్రికెట్లో ఇలా జరగడం సాధారణమే. ఇక్కడే ఓ ట్విస్ట్ నెలకొంది. బ్యాట్ విరగగానే రెండో భాగం కాస్త వార్నర్ తల వెనుక భాగాన్ని తాకింది. అదృష్టవశాత్తు హెల్మెట్ ధరించినందుకు గాను వార్నర్‌కు ఏమీ కాలేదు. ఇలా జరగ్గానే వార్నర్ గట్టి అరిచాడు. కామెంటేటర్లు సరదాగా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలలో వైరలవుతుంది.David Warner's bat broke and he's hit himself in the head with it 🤣#BBL14 pic.twitter.com/6g4lp47CSu— KFC Big Bash League (@BBL) January 10, 2025మ్యాచ్ విషయానికొస్తే.. కొత్త బ్యాట్ తీసుకున్న తర్వాత వార్నర్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో చాలా జాగ్రత్తగా ఆడిన వార్నర్ చివరి వరకు క్రీజ్‌లో నిలిచాడు. వార్నర్ అజేయ హాఫ్ సెంచరీ సాధించడంతో సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. వార్నర్ 66 బంతుల్లో 7 బౌండరీల సాయంతో 88 పరుగులు చేశాడు. థండర్ ఇన్నింగ్స్‌ను వార్నర్ ఒక్కడే నడిపించాడు. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. సామ్ బిల్లింగ్స్ (15 బంతుల్లో 28; 4 ఫోర్లు), ఒలివర్ డేవిస్ (17 బంతుల్లో 17; ఫోర్) కాసేపు క్రీజ్‌లో నిలబడ్డారు. థండర్ ఇన్నింగ్స్‌లో వీరు మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయాడు. భారీగా బిల్డప్ ఇచ్చిన సామ్ కొన్‌స్టాస్ 9 బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. మాథ్యూ గిల్కెస్ 7 బంతుల్లో 9, క్రిస్ గ్రీన్ 7 బంతుల్లో 8 పరుగులు చేశారు. అసిస్టెంట్ కోచ్ కమ్ ప్లేయర్ అయిన డేనియల్ క్రిస్టియన్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌటయ్యాడు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టాన్లేక్, క్రిస్ జోర్డన్, నిఖిల్ చౌదరీ తలో వికెట్ దక్కించుకున్నారు.భీకర ఫామ్‌లో వార్నర్ఈ సీజన్లో సిడ్నీ థండర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. వార్నర్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 316 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.ఈ సీజన్లో వార్నర్ స్కోర్లు..7 (5)17 (10)19 (15)86 నాటౌట్ (57)49 (33)50 (36)88 నాటౌట్ (66)టాప్‌లో థండర్ప్రస్తుత బీబీఎల్ సీజన్లో సిడ్నీ థండర్ అద్భుత విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఈ సీజన్లో ఆ జట్టు 7 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు (9 పాయింట్లు) సాధించింది. రెండింట ఓడిపోగా, ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. పాయింట్ల పట్టికలో థండర్ తర్వాతి స్థానాల్లో సిడ్నీ సిక్సర్స్ (9 పాయింట్లు), హోబర్ట్ హరికేన్స్ (9), బ్రిస్బేన్ హీట్ (7), పెర్త్ స్కార్చర్స్ (6), మెల్బోర్న్ రెనెగేడ్స్ (6), మెల్బోర్న్ స్టార్స్ (6), అడిలైడ్ స్ట్రయికర్స్ (4) ఉన్నాయి. -
‘కొన్‌స్టాస్ పది టెస్టులు కూడా ఆడలేడు.. అతడి బలహీనత అదే!’
ఆస్ట్రేలియా యువ సంచలనం సామ్ కొన్‌స్టాస్(Sam Konstas) భవిష్యత్తుపై ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిన్సన్(Steve Harminson) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ టీనేజర్ పట్టుమని పది టెస్టులు కూడా ఆడలేడని పేర్కొన్నాడు. కాగా డేవిడ్ వార్నర్(David Warner) రిటైర్మెంట్ తర్వాత ఆసీస్ ఓపెనింగ్ స్థానంలో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసే క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా తొలుత నాథన్ మెక్‌స్వీనీ వైపు మొగ్గుచూపింది.మెక్‌స్వీనీపై వేటు.. టీనేజర్‌కు పిలుపుటీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అతడిని జట్టుకు ఎంపిక చేసింది. అయితే, ఓపెనర్‌గా 25 ఏళ్ల మెక్‌స్వీనీ పూర్తిగా విఫలమయ్యాడు. పెర్త్ టెస్టులో అరంగేట్రం చేసిన అతడు రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 10, 0 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో(39, 10 నాటౌట్)నూ పెద్దగా రాణించలేకపోయాడు. మూడో టెస్టులో(9, 4)నూ పూర్తిగా విఫలమయ్యాడు.అరంగేట్రంలోనే అర్ధ శతకంఈ క్రమంలో మెక్‌స్వీనీపై వేటు వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. 19 ఏళ్ల కుర్రాడైన సామ్ కొన్‌స్టాస్‌ను భారత్‌తో మిగిలిన రెండు టెస్టులకు ఎంపిక చేసింది. మెల్బోర్న్ టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కొన్‌స్టాస్.. అరంగేట్రంలోనే అర్ధ శతకం(60)తో దుమ్ములేపాడు. సిడ్నీలోనూ రాణించిన ఈ కుడిచేతివాటం బ్యాటర్.. మొత్తంగా రెండు టెస్టుల్లో కలిపి 113 పరుగులు సాధించాడు.కోహ్లి, బుమ్రాలతో గొడవఇక బ్యాట్ ఝులిపించడమే కాకుండా.. టీమిండియా సూపర్స్టార్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలతో గొడవ ద్వారా కూడా కొన్‌స్టాస్ మరింత ఫేమస్ అయ్యాడు. తదుపరి శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడనున్న పదహారు మంది సభ్యుల ఆసీస్ జట్టులోనూ అతడు స్థానం సంపాదించాడు.డిఫెన్సివ్ టెక్నిక్ లేదుఈ నేపథ్యంలో స్టీవ్ హార్మిన్సన్ మాట్లాడుతూ.. ‘‘నాకైతే కొన్‌స్టాస్ కనీసం పది టెస్టులు కూడా ఆడలేడని అనిపిస్తోంది. అలా అని అతడి భవిష్యత్తుపై నేనిప్పుడే తీర్పునిచ్చేయడం లేదు. కానీ.. ఈ పిల్లాడు గనుక ఒక్కసారి లయ అందుకుంటే సూపర్‌స్టార్ స్థాయికి ఎదగగలడు. ఇండియాతో సిరీస్‌లో అతడు ర్యాంప్ షాట్లు, స్కూప్ షాట్లు ఆడాడు.కానీ.. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో తలపడుతున్నపుడు వికెట్ కాపాడుకోవాల్సిన అంశంపై మాత్రం దృష్టి పెట్టలేదు. టెస్టుల్లో ఓపెనర్‌గా రాణించాలంటే డిఫెన్సివ్ టెక్నిక్ ముఖ్యమైనది. అయితే, కొన్‌స్టాస్ ఈ విషయంలో బలహీనంగా ఉన్నాడు.మరో డేవిడ్ వార్నర్ కావాలని కొన్‌స్టాస్ భావిస్తున్నట్లున్నాడు. అయితే, ఈ టీనేజర్‌కు వార్నర్‌కు ఉన్న టెక్నిక్‌లు లేవు. ఏదేమైనా ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో కొన్‌స్టాస్ ఆడితే నాకూ సంతోషమే’’ అని పేర్కొన్నాడు. కాగా కొన్‌స్టాస్‌పై హార్మిన్సన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.ఆస్ట్రేలియాదే బోర్డర్- గావస్కర్ ట్రోఫీప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా సొంతగడ్డపై టీమిండియాను 3-1తో ఓడించింది. తద్వారా దశాబ్ద కాలం తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అంతేకాదు.. ఈ సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు కూడా అర్హత సాధించింది.డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగా మ్యాచ్ బరిలో దిగనున్న కమిన్స్ బృందం.. టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇక డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో ఆఖరిగా శ్రీలంకతో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. చదవండి: IND vs ENG: విరాట్ కోహ్లి కీలక నిర్ణయం -
పదకొండేళ్ల తర్వాత తొలి హాఫ్ సెంచరీ.. అదీ 40 బంతుల్లో!
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డేవిడ్ వార్నర్(David Warner) ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్(Big Bash League- బీబీఎల్)తో బిజీగా ఉన్నాడు. ఈ టీ20 లీగ్‌లో సిడ్నీ థండర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్నర్.. అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. ఎట్టకేలకు అర్ధ శతకం సాధించాడు. దాదాపు పదకొండేళ్ల అనంతరం బీబీఎల్‌లో తొలిసారి యాభై పరుగుల మార్కును అందుకున్నాడు.కెప్టెన్‌గా వార్నర్అయితే, విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన పొట్టి ఫార్మాట్లో(T20 Cricket) సుదీర్ఘ విరామం తర్వాత హాఫ్ సెంచరీ బాదిన వార్నర్ భాయ్.. అందుకోసం ఏకంగా 40 బంతులు తీసుకోవడం గమనార్హం. కాగా డిసెంబరు 15 బీబీఎల్ 2024-25 సీజన్ ఆరంభమైంది. ఈ క్రమంల డిసెంబరు 17న వార్నర్ కెప్టెన్సీలో తమ తొలి మ్యాచ్ ఆడిన సిడ్నీ థండర్ రెండు వికెట్ల తేడాతో అడిలైడ్ స్ట్రైకర్స్‌ను ఓడించింది.ఆరంభ మ్యాచ్‌లలో విఫలంనాటి మ్యాచ్‌లో వార్నర్ కేవలం ఏడు పరుగులే చేశాడు. అనంతరం.. సిడ్నీ సిక్సర్స్‌తో తలపడ్డ సిడ్నీ థండర్(Sydney Thunder) ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ వార్నర్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం పదిహేడు పరుగులే చేసి నిష్క్రమించాడు.ఆ తర్వాత మెల్బోర్న్తో స్టార్స్‌తో మ్యాచ్‌లో వార్నర్ 19 పరుగులే చేసినా.. సామ్ బిల్లింగ్స్(72 నాటౌట్) కారణంగా.. సిడ్నీ థండర్ 18 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో సోమవారం నాటి మ్యాచ్‌లో మెల్బోర్న్ గ్రెనేడ్స్తో మ్యాచ్‌లో మాత్రం వార్నర్ బ్యాట్ ఝులిపించాడు.ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడుసిడ్నీలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మెల్బోర్న్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్ ఆదిలోనే కామెరాన్ బాన్‌క్రాఫ్ట్(8) వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్ బ్యాటర్ షెర్ఫానే రూథర్‌ఫర్డ్(11), ఒలివర్ డేవిస్(10), సామ్ బిల్లింగ్స్(10) కూడా విఫలమయ్యారు.ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ గాడిన పెట్టే బాధ్యత తీసుకున్న ఓపెనర్ వార్నర్ నెమ్మదిగా ఆడాడు. వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ.. 40 బంతుల్లో యాభై పరుగులు మార్కుకు చేరుకున్నాడు. ఆ తర్వాత మరో పదిహేడు బంతుల్లోనే 36 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.మొత్తంగా 57 బంతులు ఎదుర్కొని పది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో వార్నర్ 86 పరుగులు సాధించాడు. అతడి తోడుగా మాథ్యూ గిల్క్స్(23 నాటౌట్) కూడా రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో సిడ్నీ థండర్ నాలుగు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.2013లో చివరగాకాగా డేవిడ్ వార్నర్ బీబీఎల్‌లో చివరగా 2013లో అర్థ శతకం నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్నర్ ప్రస్తుతం ఫ్రాంఛైజీ క్రికెట్లో ఆడుతున్నాడు. అయితే, ఐపీఎల్లో గతంలో మంచి రికార్డులే ఉన్నా మెగా వేలం 2025లో మాత్రం వార్నర్‌పై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.ఒకవేళ బీబీఎల్‌లో గనుక పరుగుల వరద పారిస్తే.. అతడు ఐపీఎల్లో తిరిగి పునరాగమనం చేసే అవకాశం ఉంటుంది. కాగా తమ ఆటగాళ్లు ఎవరైనా గాయపడిన సందర్భంలో ఫ్రాంఛైజీలు .. వారి స్థానంలో అన్‌సోల్డ్‌గా ఉన్న క్రికెటర్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఓపెనర్‌గా ఘనమైన రికార్డు ఉన్న వార్నర్ సేవలను పంజాబ్ కింగ్స్ లేదంటే లక్నో సూపర్ జెయింట్స్ వాడుకునే అవకాశం ఉంది.చదవండి: థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పే..; బీసీసీఐ ఉపాధ్యక్షుడి స్పందన ఇదేDavid Warner's first BBL half-century since 2013! 👏Things you love to see! #BBL14 pic.twitter.com/Uzjq8jamp3— KFC Big Bash League (@BBL) December 30, 2024 -
బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
టీ20 క్రికెట్ పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా పదకొండు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్‌ను అధిగమించి.. ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.పాక్‌కు చేదు అనుభవంసౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా బాబర్ ఆజం ఈ ఘనత సాధించాడు. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లింది. ఈ పర్యటన టీ20 సిరీస్‌తో మొదలుకగా.. పాక్‌కు చేదు అనుభవం ఎదురైంది.డర్బన్‌లో జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ప్రొటీస్ జట్టు చేతిలో 11 పరుగుల తేడాతో ఓడిన పాకిస్తాన్.. సెంచూరియన్‌లో శుక్రవారం నాటి రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. సౌతాఫ్రికా చేతిలో ఏడు వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది పాక్.సయీమ్ ఆయుబ్ ధనాధన్ ఇన్నింగ్స్ వృథాఓపెనర్ సయీమ్ ఆయుబ్(57 బంతుల్లో 98 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్‌కు తోడు.. బాబర్ ఆజం(20 బంతుల్లో 31), ఇర్ఫాన్ ఖాన్(16 బంతుల్లో 30) రాణించడంతో భారీ స్కోరు సాధించింది. అయితే, సౌతాఫ్రికా బ్యాటర్లలో రీజా హెండ్రిక్స్ సూపర్ సెంచరీ(63 బంతుల్లో 117), రాసీ వాన్ డెర్ డసెన్(38 బంతుల్లో 66) అద్భుత అర్ధ శతకం కారణంగా పాక్‌కు ఓటమి తప్పలేదు.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఘనంగా(31, 3 ఫోర్లు, ఒక సిక్సర్)నే ఇన్నింగ్స్‌ను ఆరంభించినా.. దానిని భారీ స్కోరుగా మలుచుకోలేకపోయాడు. అయినప్పటికీ పొట్టి ఫార్మాట్లో అతడు అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.గేల్ ప్రపంచ రికార్డును బద్దలుసౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా బాబర్ ఆజం షార్టెస్ట్ క్రికెట్లో ఓవరాల్‌గా 11,020 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో గేల్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. పదకొండు వేల పరుగుల మార్కును అందుకోవడానికి గేల్‌కు 314 ఇన్నింగ్స్ అవసరమైతే.. బాబర్ 298 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. అయితే, ఓవరాల్‌గా మాత్రం అంతర్జాతీయ, ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్లో గేల్ యూనివర్సల్ బాస్‌గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 14562 టీ20 రన్స్ ఉన్నాయి.టీ20 క్రికెట్లో తక్కువ ఇన్నింగ్స్‌లో 11000 పరుగులు సాధించిన ఆటగాళ్లు1. బాబర్ ఆజం- 298 ఇన్నింగ్స్2. క్రిస్ గేల్- 314 ఇన్నింగ్స్3. డేవిడ్ వార్నర్- 330 ఇన్నింగ్స్4. విరాట్ కోహ్లి- 337 ఇన్నింగ్స్.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
అతడికి జట్టులో ఉండే అర్హత లేదు: డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను ఉద్దేశించి ఆ జట్టు మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాక్సీకి టెస్టు జట్టులో ఉండే అర్హతే లేదన్నాడు. కాగా మాక్స్వెల్ ఆస్ట్రేలియా తరఫున టెస్టు బరిలో దిగి దాదాపు ఏడేళ్లు అవుతోంది. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా 2017లో తన చివరి టెస్టు ఆడాడు.ఏడు టెస్టులుచట్టోగ్రామ్ వేదికగా నాటి మ్యాచ్‌లో 36 ఏళ్ల మాక్సీ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 28, 25* పరుగులు చేశాడు. ఇక 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటివరకు మొత్తంగా.. తన కెరీర్లో ఏడు టెస్టులు ఆడాడు.టెస్టుల్లోనూ పునరాగమనం చేయాలనే ఆశఇందులో నాలుగు టీమిండియా, ఒకటి పాకిస్తాన్, రెండు బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచ్‌లు. వీటన్నింటిలో కలిపి 339 పరుగులు చేసిన మాక్సీ.. ఎనిమిది వికెట్లు మాత్రమే తీశాడు. ఇక వన్డే, టీ20లలో అదరగొడుతున్న ఈ ఆల్‌రౌండర్.. టెస్టుల్లోనూ పునరాగమనం చేయాలని ఆశపడుతున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న ఆసీస్ టెస్టు జట్టులో తనకు చోటు దక్కితే బాగుంటుందని.. ఇటీవల మాక్సీ తన మనసులోని మాట బయటపెట్టాడు.అతడి ఆ అర్హత కూడా లేదుఈ విషయంపై మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందిస్తూ.. ‘‘నీకు దేశీ టోర్నీ జట్టులోనే చోటు దక్కనపుడు.. జాతీయ జట్టులో స్థానం కావాలని ఆశించడం సరికాదు!.. నిజానికి నీకు టెస్టుల్లో ఆడాలనే కోరిక మాత్రమే ఉంది. ఆ కారణంగా నిన్నెవరూ జట్టుకు ఎంపిక చేయరు.క్లబ్ క్రికెట్ ఆడుతూ.. అక్కడ నిరూపించుకుంటే.. టెస్టు క్రికెట్ జట్టు నుంచి తప్పకుండా పిలుపు వస్తుంది. కానీ.. అతడు అలాంటిదేమీ చేయడం లేదు. కాబట్టి.. నా దృష్టిలో మాక్సీకి టెస్టు జట్టు చోటు కోరుకునే అర్హత కూడా లేదు’’ అని వార్నర్ ఘాటు విమర్శలు చేశాడు.కాగా గతేడాది ఇంగ్లండ్ కౌంటీల్లో భాగంగా వార్విక్షైర్ తరఫున మాక్స్వెల్ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాడు. అనంతరం దేశీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో విక్టోరియా తరఫున అతడు బరిలోకి దిగాల్సింది. అయితే, పాకిస్తాన్‌తో ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ సమయంలో మాక్సీకి తొడ కండరాల గాయమైంది. ఫలితంగా అతడు ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ కోడ్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.టీమిండియాతో టెస్టులతో ఆసీస్ బిజీఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా ప్రస్తుతం టీమిండియాతో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో ఐదు టెస్టులు ఆడతున్న కంగారూ జట్టు సిరీస్‌ను ప్రస్తుతం 1-1తో సమం చేసింది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా చేతిలో ఓడిన ఆసీస్.. అడిలైడ్‌లో జరిగిన పింక్ టెస్టులో ఘన విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య డిసెంబరు 14 నుంచి మూడో టెస్టు జరుగనుంది. బ్రిస్బేన్‌లోని ‘ది గాబా’ మైదానం ఇందుకు వేదిక.చదవండి: PAK vs SA: షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు.. -
IPL 2025: ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, పృథ్వీ షా..!
ఐపీఎల్ 2025 మెగా వేలంలో డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, పృథ్వీ షా, ఆదిల్ రషీద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సికందర్ రజా లాంటి చాలా మంది స్టార్ ఆటగాళ్లు అన్ సోల్డ్‌గా మిగిలిపోయారు. విదేశీ ప్లేయర్ల కోటా(తుదిజట్టు)కు సంబంధించిన నిబంధనలను కాసేపు పక్కన పెడితే.. అన్ సోల్డ్ ప్లేయర్లతో ఓ పటిష్టమైన జట్టు తయారు చేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం.ఈ జట్టుకు ఓపెనర్లుగా పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ ఉంటారు. వీరిద్దరు గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కలిసి ఆడారు. ఐపీఎల్లో డేవిడ్ వార్నర్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అయినా ఈసారి ఫ్రాంచైజీలు అతనిపై ఆసక్తి చూపలేదు. వయసు పైబడటం, పెద్దగా ఫామ్‌లో లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు.పృథ్వీ షా విషయానికొస్తే.. ఈ ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఓపెనర్ ఐపీఎల్లో 79 మ్యాచ్‌లు ఆడి 147.5 స్ట్రయిక్‌రేట్‌తో 1892 పరుగులు చేశాడు. అయితే షా గత కొన్ని సీజన్లుగా పెద్దగా పెర్ఫార్మ్ చేయడం లేదు. అందుకే అతన్ని ఈసారి వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. పైగా షా ఓవర్ వెయిట్ అయ్యాడు. అతనిపై ఫ్రాంచైజీలు అనాసక్తి చూపడానికి ఇదీ ఒక కారణం అయ్యి ఉండవచ్చు.వన్‌డౌన్ విషయానికొస్తే.. ఈ స్థానంలో విండీస్ ఆటగాడు కైల్ మేయర్స్‌ను ఆడిస్తే బాగుంటుంది. మేయర్స్ గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడాడు. మేయర్స్పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడానికి పెద్ద కారణాలేమీ లేవు. నాలుగో స్థానం విషయానికొస్తే.. ఈ స్థానంలో స్టీవ్ స్మిత్ ఆడితే బాగుంటుంది. స్టీవ్‌కు పొట్టి ఫార్మాట్లో సరైన ట్రాక్ రికార్డు లేకపోవడం వల్ల అతను అమ్ముడుపోలేదు.ఐదో స్థానంలో ఇంగ్లండ్ వికెట్‌కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో వస్తే బాగుటుంది. బెయిర్‌స్టో ఇటీవలి కాలంలో పెద్దగా ఫామ్‌లో లేకపోవడం వల్ల అతన్ని ఏ జట్టు ఎంపిక చేసుకోలేదు. ఆరో స్థానంలో జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా ఆడితే బాగుంటుంది. ఏడో స్థానంలో సౌతాఫ్రికా ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్.. ఎనిమిదో స్థానంలో విండీస్ ఆటగాడు అకీల్ హొసేన్ బరిలోకి దిగితే బాగుంటుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఆదిల్ రషీద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.. స్పెషలిస్ట్ పేసర్లుగా ఉమేశ్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ బరిలోకి దిగితే ఐపీఎల్ మెగా వేలంలో అన్ సోల్డ్ ప్లేయర్లతో పటిష్టమైన జట్టు రూపుదిద్దుకుంటుంది.ఐపీఎల్ మెగా వేలంలో అన్ సోల్డ్ ప్లేయర్లతో జట్టు..డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, కైల్ మేయర్స్, స్టీవ్ స్మిత్, డెవాల్డ్ బ్రెవిస్, సికందర్ రజా, అకీల్ హొసేన్, ఆదిల్ రషీద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఉమేశ్ యాదవ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ -
పాపం డేవిడ్ వార్నర్.. ఒక్కరు కూడా ఆసక్తి చూపలేదు..!
నిన్న (నవంబర్ 24) ప్రారంభమైన ఐపీఎల్ 2025 మెగా వేలంలో మొత్తం 92 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందులో 72 మంది అమ్ముడుపోగా.. 20 మంది అన్ సోల్డ్‌గా మిగిలారు. అమ్ముడుపోయిన ఆటగాళ్లలో 24 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగతా వారు భారత ఆటగాళ్లు. పాపం వార్నర్నిన్న జరిగిన మెగా వేలంలో ఆసీస్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. వార్నర్ 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. తొలి రోజు వేలంలో వార్నర్‌తో పాటు దేవ్‌దత్ పడిక్కల్, జానీ బెయిర్‌స్టో లాంటి పేరు కలిగిన ఆటగాళ్లు కూడా అమ్ముడుపోలేదు. వీరిద్దరు కూడా 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఐపీఎల్ తొలి రోజు వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే..!దేవ్‌దత్ పడిక్కల్ (బేస్ ధర 2 కోట్లు)డేవిడ్ వార్నర్ (2 కోట్లు)జానీ బెయిర్‌స్టో (2 కోట్లు)వకార్ సలామ్ఖిల్ (ఆఫ్ఘనిస్తాన్, 75 లక్షలు)పియుశ్ చావ్లా (50 లక్షలు)కార్తీక్ త్యాగి (40 లక్షలు)యశ్ ధుల్ (30 లక్షలు)అన్మోల్ప్రీత్ సింగ్ (30 లక్షలు)ఉత్కర్శ్ సింగ్ (30 లక్షలు)లవ్నిత్ సిసోడియా (30 లక్షలు)ఉపేంద్ర సింగ్ యాదవ్ (30 లక్షలు)శ్రేయస్ గోపాల్ (30 లక్షలు)కాగా, తొలి రోజు వేలంలో అన్ని ఫ్రాంచైజీలు కలిసి 467.85 కోట్లు ఖర్చు చేశాయి. తొలి రోజు వేలంలో రిషబ్ పంత్‌కు అత్యధిక ధర లభించింది. లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను రూ. 27 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది భారీ ధర.నిన్నటి వేలంలో రెండో భారీ మొత్తం శ్రేయస్ అయ్యర్‌కు లభించింది. శ్రేయస్‌ను పంజాబ్ రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. మూడో అత్యధిక ధర వెంకటేశ్ అయ్యర్‌కు లభించింది. వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ రూ. 23.75 కోట్లకు సొంతం చేసుకుంది. అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్‌లను పంజాబ్ చెరి రూ. 18 కోట్లు ఇచ్చి దక్కించుకుంది. అంతా ఊహించనట్లుగా కేఎల్ రాహుల్‌కు భారీ ధర దక్కలేదు. రాహుల్‌ను ఢిల్లీ కేవలం రూ. 14 కోట్లకే సొంతం చేసుకుంది. -
ఆస్ట్రేలియా అంటే చాలు కోహ్లికి పూనకాలే.. జాగ్రత్తగా ఉండండి: వార్నర్
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా మొదలు కానుంది. మొదటి టెస్టు కోసం ఇప్పటికే పెర్త్‌కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన జట్టుకు హెచ్చరిక జారీ చేశాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో జాగ్రత్తగా ఉండాలని కమ్మిన్స్ సేనకు వార్నర్ సూచించాడు. కాగా విరాట్ కోహ్లికి ఆసీస్ గడ్డపై టెస్టుల్లో అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 54.08 సగటుతో 1352 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 సెంచరీలు ఉన్నాయి."బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అంటే చాలు విరాట్ కోహ్లి చెలరేగిపోతాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో అతడిని అడ్డుకోవడం అంత సులువు కాదు. అతడు ఎల్లప్పుడూ పరుగుల దాహంతో ఉంటాడు. ఆసీస్ గడ్డపై అతడిని మించిన ఆటగాడు ఇంకొకరు లేరు. విమర్శకుల నోళ్లు మూయించడానికి కోహ్లికి ఇదే సరైన సమయం.ఈ సిరీస్‌లో కోహ్లి నుంచి పెద్ద ఇన్నింగ్స్‌లు వస్తాయాని నేను ఆశిస్తున్నాను. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కచ్చితంగా విరాట్ నుంచి ముప్పు పొంచి ఉంది. కోహ్లి ఫామ్‌పై పెద్దగా ఆందోళన లేదు. ఎందుకంటే ఇటువంటి పెద్ద సిరీస్‌లలో ఎలా ఆడాలో కోహ్లికి బాగా తెలుసు" అని హెరాల్డ్ సన్ కాలమ్‌లో డేవిడ్ భాయ్ రాసుకొచ్చాడు.చదవండి: రోహిత్ వచ్చినా అతడినే కెప్టెన్‌గా కొనసాగించండి: హర్భజన్ -
పాక్‌తో తొలి టీ20: మాక్స్వెల్ ఊచకోత.. చరిత్ర పుటల్లోకి!
పాకిస్తాన్‌తో తొలి టీ20లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టాడు. పాక్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ.. కేవలం పందొమ్మిది బంతుల్లోనే 43 పరుగులు సాధించాడు. 226కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేసిన మాక్సీ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.ఇక మాక్సీతో పాటు మరో ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. కేవలం ఏడు బంతుల్లోనే రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత ఏడు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.కాగా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచి పాకిస్తాన్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా టీ20 సిరీస్ మొదలైంది.గాబా స్టేడియంలో గురువారం నాటి ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో టీ20ని ఏడు ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ ఆసీస్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, ఓపెనర్లు మాథ్యూ షార్ట్(7), జేక్ ఫ్రేజర్ మెగర్క్(9).. అదే విధంగా టిమ్ డేవిడ్(10) విఫలం కాగా.. మాక్సీ, స్టొయినిస్ దంచికొట్టారు.చరిత్ర పుటల్లోకి!ఇక పాక్‌తో తొలి టీ20 సందర్భంగా మాక్స్వెల్ పొట్టి ఫార్మాట్లో పది వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా పురుషుల క్రికెట్లో ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన పదహారో బ్యాటర్‌గా.. అదే విధంగా మూడో ఆసీస్ క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. మాక్సీ (10012) కంటే ముందు డేవిడ్ వార్నర్(12411), ఆరోన్ ఫించ్(11458) ఆస్ట్రేలియా తరఫున పదివేల పరుగుల క్లబ్లో చేరారు. 'This is why people pay a lot of money to watch this guy bat' #AUSvPAK pic.twitter.com/Zwab5Pnw3j— cricket.com.au (@cricketcomau) November 14, 2024 -
మళ్లీ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్
సిడ్నీ థండర్ (బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ) కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ మళ్లీ ఎంపికయ్యాడు. వచ్చే సీజన్ నుంచి వార్నర్ బాధ్యతలు చేపడతాడు. డేవిడ్ వార్నర్‌పై ఇటీవలే కెప్టెన్సీ నిషేధం ఎత్తివేసిన విషయం తెలిసిందే. వార్నర్ క్రిస్ గ్రీన్ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతాడు. వార్నర్ కెప్టెన్సీలో గ్రీన్ సాధారణ సభ్యుడిలా జట్టులో కొనసాగుతాడు. వార్నర్ గతంలో సిడ్నీ థండర్ కెప్టెన్‌గా పని చేశాడు. సిడ్నీ థండర్ కెప్టెన్‌గా మరోసారి ఎంపిక కావడంపై వార్నర్ హర్షం వ్యక్తం చేశాడు. బిగ్‌బాష్ లీగ్ తదుపరి సీజన్ (14వ సీజన్) డిసెంబర్ 15 నుంచి ప్రారంభమవుతుంది. సిడ్నీ థండర్ తమ తొలి మ్యాచ్‌ను (అడిలైడ్ స్ట్రయికర్స్‌తో) డిసెంబర్ 17న ఆడుతుంది. సిడ్నీ థండర్ గత సీజన్లో ఆఖరి స్థానంలో నిలిచింది.కాగా, డేవిడ్ వార్నర్ ఈ ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా తరఫున 112 టెస్ట్‌లు, 161 వన్డేలు, 110 టీ20లు ఆడి దాదాపు 19 వేల పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 98 అర్ద సెంచరీలు ఉన్నాయి. వార్నర్ 2009 నుంచి ఐపీఎల్లో కూడా ఆడుతున్నాడు. వార్నర్‌ను ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ వదులకుంది. త్వరలో జరుగబోయే ఐపీఎల్ వేలంలో వార్నర్ పాల్గొంటాడు. వార్నర్ ఐపీఎల్లో 184 మ్యాచ్‌లు ఆడి 6565 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వార్నర్ బిగ్‌బాష్ లీగ్‌లో 11 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 301 పరుగులు చేశాడు.వచ్చే సీజన్ కోసం సిడ్నీ థండర్ స్క్వాడ్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), వెస్ అగర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, సామ్ బిల్లింగ్స్, ఆలివర్ డేవిస్, లాకీ ఫెర్గూసన్, మాట్ గిల్క్స్, క్రిస్ గ్రీన్, లియామ్ హాట్చర్, సామ్ కాన్స్టాస్, నిక్ మాడిన్సన్, నాథన్ మెక్ఆండ్రూ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, విలియం సాల్జ్‌మన్, డేనియల్ సామ్స్, జాసన్ సంఘా, తన్వీర్ సంఘా -
వార్నర్ బర్త్ డే.. అల్లు అర్జున్ స్పెషల్ విషెస్
హీరోలు పుట్టినరోజులు వస్తుంటాయి. కానీ ఒకరికి ఒకరు విషెస్ చెప్పుకున్న సందర్భాలు తక్కువే. అలాంటిది అల్లు అర్జున్ మాత్రం ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పుట్టినరోజుని గుర్తుంచుకుని మరీ శుభాకాంక్షలు చెప్పాడు. తన ఇన్ స్టాలో స్టోరీ కూడా పెట్టాడు. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో)'అల వైకుంఠపురములో' సినిమా మహా అయితే తెలుగోళ్లకు మాత్రమే తెలుసుంటుంది. కానీ లాక్డౌన్ టైంలో బుట్టబొమ్మ పాటకు డేవిడ్ వార్నర్ రీల్స్ చేశాడు. తెలుగు నాట ఫుల్ ఫేమస్ అయిపోయాడు. 'పుష్ప' రిలీజ్ తర్వాత అయితే గడ్డం కింద చేయి పెట్టే మేనరిజమ్, శ్రీవల్లి పాటలో స్టెప్పులు వార్నర్‌కి తెగ నచ్చేశాయి. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు ఐపీఎల్‌లోనూ 'తగ్గేదే లే' మేనరిజమ్స్ చేసి చూపించేవాడు. అలా బన్నీ-వార్నర్ మధ్య సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేషన్ అవుతూనే ఉంది.ఒకరి పుట్టినరోజున మరొకరు విషెస్ చెబుతూనే వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బన్నీ పుట్టినరోజు వార్నర్ స్టోరీ పెడితే.. ఇప్పుడు వార్నర్ బర్త్ డేకి అల్లు అర్జున్ ఇన్ స్టాలో స్టోరీ పెట్టడం వీళ్ల మధ్య బాండింగ్ ఎలాంటిదో చెప్పకనే చెబుతోంది. చాన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో అడుగుతున్నట్లు 'పుష్ప 2'లో వార్నర్‌కి చిన్న గెస్ట్ రోల్ ఇచ్చేస్తే అభిమానులు కూడా ఫుల్ హ్యాపీ అయిపోతారేమో?(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) -
డేవిడ్ వార్నర్‌పై నిషేధం ఎత్తివేత
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై ఉన్న జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేశారు. 2018లో సాండ్ పేపర్ వివాదంలో (కేప్‌టౌన్ టెస్ట్‌లో) వార్నర్‌పై జీవితకాల కెప్టెన్సీ నిషేధం విధించబడింది. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్‌పై కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సాండ్ పేపర్ వివాదంలో వార్నర్ ఏడాది పాటు ఆటకు కూడా దూరయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా తాజా నిర్ణయంతో వార్నర్ బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది. నిషేధం కారణంగా వార్నర్ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా పని చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 37 ఏళ్ల వార్నర్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే జట్టుకు అవసరమైతే భారత్‌తో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తిరిగి బరిలోకి దిగుతానని ప్రకటించాడు.వార్నర్ ఆసీస్ తరఫున 112 టెస్ట్‌లు ఆడి 8786 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 37 అర్ద సెంచరీలు ఉన్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. -
రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకునేందుకు రెడీ: వార్నర్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా తాజా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీజీటీలో ఆడేందుకు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించాడు. ఈ ఏడాది జనవరిలో టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్నర్ తిరిగి బ్యాగీ గ్రీన్ ధరించేందుకు సన్నద్దత వ్యక్తం చేశాడు. వార్నర్ రిటైర్మెంట్తో ఆసీస్‌కు ఓపెనర్ సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. ఉస్మాన్ ఖ్వాజాకు జోడీగా స్టీవ్ స్మిత్‌ను ప్రయోగించినప్పటికీ.. అది ఆశించిన ఫలితాలు అందించలేదు. దీంతో వార్నర్ తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. కోడ్ స్పోర్ట్స్ అనే వెబ్‌సైట్‌తో వార్నర్ మాట్లాడుతూ.. దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నాడు. సెలెక్టర్ల నుంచి ఫోన్ రావడమే ఆలస్యమని ప్రకటించాడు. కాగా, బీజీటీకి ముందు ఆసీస్‌కు ఓపెనింగ్ సమస్యతో పాటు కామెరూన్ గ్రీన్ అందుబాటులో లేకపోవడం చాలా ఇబ్బందిగా మారింది. ఉస్మాన్ ఖ్వాజా జోడీ కోసం ఆసీస్ సెలక్టర్లు సామ్ కోన్స్టాస్, మార్కస్ హ్యారిస్ పేర్లను పరిశీలిస్తున్నారు. తాజాగా వార్నర్ ప్రకటన నేపథ్యంలో ఆసీస్ సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో రావడం దాదాపుగా ఖరారైంది. 37 ఏళ్ల డేవిడ్ వార్నర్ ఆసీస్ తరఫున 112 టెస్ట్‌లు ఆడి 8786 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 37 అర్ద సెంచరీలు ఉన్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి.చదవండి: చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రికార్డు -
'వెల్' డన్ సర్ఫరాజ్.. ఎంతో కష్టపడ్డావు: డేవిడ్ వార్నర్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో మెరిశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. సర్ఫరాజ్‌కు ఇది ఇది అంతర్జాతీయ క్రికెట్ లో అతనికి తొలి సెంచరీ కావడం విశేషం. భారత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అద్బుతమైన ఆట తీరును కనబరిచి శతకాన్ని నమోదు చేశాడు. కేవలం 110 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై నిరాశపరిచిన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అందుకు భిన్నంగా ఆడుతున్నాడు. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తనదైన షాట్లతో అభిమానులను ఈ ముంబైకర్ అలరిస్తున్నాడు. ప్రస్తుతం 125 పరుగులతో సర్ఫరాజ్ ఆజేయంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సర్ఫరాజ్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజగా ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ చేరాడు. అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడావు అంటూ డేవిడ్ భాయ్ కొనియాడాడు. "వెల్ డన్ సర్ఫరాజ్. చాలా కష్టపడ్డావు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావు, చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదంటూ" వార్నర్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. కాగా ఐపీఎల్లో సర్ఫరాజ్, వార్నర్ కలిసి ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించారు.ఇక ఈ మ్యాచ్‌లో 71 ఓవర్లు ముగిసే సరికి ఇండియా జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కంటే భారత్ 13 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ 125, రిషబ్ పంత్ 53 పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే వర్షం కారణంగా ఆట ప్రస్తుతం నిలిచిపోయింది. చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి! -
వార్నర్ ఇకపై క్రికెటర్ కాదు యాక్టర్..!
-
డాన్ గెటప్‌లో డేవిడ్ వార్నర్.. 'పుష్ప 2' కోసమేనా?
డేవిడ్ వార్నర్ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తొచ్చేది క్రికెటర్ అని. మనోళ్లని అడిగితే మాత్రం క్రికెటర్ కమ్ యాక్టర్ అని అంటారు. ఎందుకంటే లాక్డౌన్ ముందు వార్నర్‌కి తెలిసిందల్లా క్రికెట్. కానీ కరోనా వల్ల ఇంట్లో ఉండేసరికి టిక్ టాక్‌లో భార్యతో కలిసి రీల్స్ చేశాడు. వాటిలో తెలుగు పాటలు బోలెడు. అలా ఊహించని క్రేజ్ తెచ్చుకున్నాడు.మరీ ముఖ్యంగా 'పుష్ప'లో అల్లు అర్జున్ ఇమిటేట్ చేయడం డేవిడ్ వార్నర్‌కి చాలా ఇష్టం. ఐపీఎల్, మిగతా మ్యాచుల్లో గ్రౌండ్లో ఫీల్టింగ్ చేస్తూ 'శ్రీవల్లి' పాటలోని స్టెప్ ఎన్నిసార్లు వేసుంటాడో లెక్కే లేదు. అలా రీల్స్ పుణ్యమా అని కొన్నాళ్ల క్రితం ఏకంగా రాజమౌళితో కలిసి ఓ యాడ్‌లో కనిపించాడు. అందులో వార్నర్ తన యాక్టింగ్‌తో తెగ నవ్వించేశాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)ఇక 'పుష్ప' ఇమిటేషన్‌కి ఫిదా అయిపోయిన తెలుగు మూవీ లవర్స్.. సీక్వెల్లో ఇతడికి సినిమాలో చిన్న పాత్ర అయినా ఇవ్వాలని డైరెక్టర్ సుకుమార్‌ని ఎప్పటినుంచో సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు. మరి అది నిజమైందో ఏమో తెలీదు గానీ ఇప్పుడు వార్నర్ యాక్టింగ్ చేస్తూ కనిపించాడు.మెల్బోర్న్లో తాజాగా వార్నర్.. హెలికాప్టర్ నుంచి దిగి గన్ పట్టుకుని నడుస్తున్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదంతా కూడా ఓ భారతీయ సినిమా కోసమని మాట్లాడుకుంటున్నారు. అయితే అది 'పుష్ప 2' కోసమైతే బాగుండు అని బన్నీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే గనక రచ్చ రచ్చే.(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన నటుడు అమితాబ్ బచ్చన్) -
వార్నర్ రికార్డును సమం చేసిన సూర్యకుమార్ యాదవ్
శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చినందుకు గానూ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌లో స్కై 3 మ్యాచ్‌ల్లో 92 పరుగులే చేసినప్పటికీ.. చాలా కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మూడో టీ20లో అతను బంతితోనూ (1-0-5-2) మ్యాజిక్ చేశాడు. ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్కైకు ఇది తొలి సిరీస్. తొలి సిరీస్‌లోనే స్కై.. ప్రత్యర్ది జట్టును క్లీన్ స్వీప్ చేశాడు.టీ20ల్లో స్కైకు ఇది ఐదో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు. ఈ అవార్డుతో అతను అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. స్కై.. బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్, షకీబ్ అల్ హసన్‌లతో సమంగా ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (7) టాప్‌లో ఉన్నాడు.మూడో టీ20 విషయానికొస్తే.. లంకపై భారత్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా.. ఛేదనలో శ్రీలంక సైతం అన్నే పరుగులు చేసింది. రింకూ సింగ్, సూర్యకుమార్ చివరి రెండో ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను ఓటమి నుంచి గట్టెక్కించారు. అనంతరం సూపర్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి (2/2) భారత్ గెలుపుకు బాటలు వేశాడు. సూర్యకుమార్ తొలి బంతికే బౌండరీ మ్యాచ్‌ను ముగించాడు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రెగ్యులర్ మ్యాచ్‌లో 2 వికెట్లు, 25 పరుగులు.. సూపర్ ఓవర్లో 2 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించిన సుందర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
వార్నర్‌ను పరిగణలోకి తీసుకోం..!
అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలనుకున్న డేవిడ్ వార్నర్ ఆశలపై ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ నీళ్లు చల్లాడు. వచ్చే ఏడాది పాక్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి వార్నర్‌ను పరిగణలోకి తీసుకోవడం లేదని వెల్లడించాడు. వార్నర్ ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్ 2024తో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. అనంతరం కొద్ది రోజుల్లోనే మనసు మార్చుకుని ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. వార్నర్ ప్రకటనపై తాజాగా జార్జ్ బెయిలీ స్పందించాడు. తమ ఫ్యూచర్ ప్లాన్స్‌లో వార్నర్ లేడని స్పష్టం చేశాడు. తమకున్న సమాచారం మేరకు వార్నర్ మూడు ఫార్మాట్ల నుంచి రిటైరయ్యాడని తెలిపాడు. వార్నర్ ఎప్పుడు జోక్ చేస్తాడో.. ఎప్పుడు సీరియస్‌గా ఉంటాడో తెలీదని అన్నాడు. వార్నర్ కెరీర్ అద్బుతంగా సాగిందని గుర్తు చేశాడు. తమ ప్రణాళికల్లో కొత్త ఆటగాళ్లు ఉన్నారని పేర్కొన్నాడు. బెయిలీ మాటలను బట్టి చూస్తే వార్నర్ తిరిగి జట్టులోకి రావాలనుకున్నా అవకాశం లేదన్న విషయం స్పష్టమవుతుంది.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024లో సూపర్-8 దశలోనే నిష్క్రమించిన ఆస్ట్రేలియా.. త్వరలో ఇంగ్లండ్, స్కాట్లాండ్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సన్నద్దమవుతుంది. ఈ రెండు సిరీస్‌లకు ఆసీస్ సెలెక్టర్లు ఇవాళ (జులై 15) జట్లను ప్రకటించారు. ఆస్ట్రేలియా తొలుత స్కాట్లాండ్తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (సెప్టెంబర్ 4, 6, 7) ఆడనుంది. అనంతరం సెప్టెంబర్ 11 నుంచి ఇంగ్లండ్ పర్యటన మొదలవుతుంది. ఈ పర్యటనలో ఆసీస్ మూడు టీ20లు (సెప్టెబంర్ 11, 13, 15).. ఐదు వన్డేలు (సెప్టెంబర్ 19, 21, 24, 27, 29) ఆడనుంది. స్కాట్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20లకు ఆసీస్ జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.ఇంగ్లండ్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. -
మనసు మార్చుకున్న వార్నర్..?
టీ20 వరల్డ్‌కప్ 2024తో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియన్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. రిటైర్మెంట్ విషయంలో మనసు మార్చుకున్నాడని తెలుస్తుంది. వార్నర్ వన్డేల్లో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. జట్టుకు అవసరమైతే ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అందుబాటులో ఉంటానని వార్నర్ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు టాక్. వార్నర్ రిటైర్మెంట్ విషయంలో వెనక్కు తగ్గినా అతన్ని జట్టులోకి తీసుకుంటారా లేదా అన్నది ఆసక్తికరం. 37 ఏళ్ల వార్నర్ ఈ ఏడాది జనవరి 1న వన్డేలకు.. జనవరి 10న టెస్ట్‌లకు.. ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్‌తో టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.వార్నర్ టీ20 వరల్డ్‌కప్ 2024లో ఆస్ట్రేలియా తరఫున సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో ఆసీస్ సూపర్-8లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడి సెమీస్‌కు చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. ఆసీస్‌కు ఇప్పట్లో అంతర్జాతీయ కమిట్మెంట్స్ ఏమీ లేవు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసీస్.. ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్.. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనున్నాయి. ఈ మధ్యలో ఆసీస్ రెండు నెలల పాటు ఖాళీగా ఉంటుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా ఒక్కటే అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీగా ఉంది. ప్రస్తుతం భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు (జులై 8) రెండు మ్యాచ్‌లు ముగియగా.. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ సిరీస్‌లో మూడో టీ20 జులై 10న జరుగనుంది. -
మరచిపోయారేమో.. నా భర్త గొప్పదనం ఇదీ: వార్నర్ భార్య
‘‘మా దేశం తరఫున మేము ఇంతకు ముందెన్నడూ చూడని అత్యత్తుమ క్రికెటర్లలో ఒకడైన డేవిడ్ వార్నర్‌కు అభినందనలు. ప్రతి విషయంలోనూ ముందు వరుసలో కూర్చోగలిగే గౌరవం దక్కడం పట్ల గర్వంగా ఉంది.ఇక ముందు నువ్వు ఆస్ట్రేలియా తరఫున ఆడవంటే బాధగా ఉంది. ఆసీస్ ప్లేయర్‌గా కచ్చితంగా నిన్ను మిస్సవుతాము.అయితే, ఇకపై నీతో ఇంట్లోనే ఎక్కువ సమయం గడపవచ్చు కాబట్టి ఓ పక్క సంతోషంగానూ ఉంది. లవ్ యూ’’ అని ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ భార్య కాండీస్ వార్నర్ భావోద్వేగానికి లోనైంది.అదే విధంగా ఆటగాడిగా తన భర్త సాధించిన విజయాల గురించి ప్రస్తావిస్తూ రికార్డుల విశేషాలు షేర్ చేసింది. వార్నర్‌ను విమర్శించిన వాళ్ల నోళ్లు మూతపడేలా అతడి అరుదైన ఘనతల గురించి చెబుతూ అతడి గొప్పతనాన్ని చాటే ప్రయత్నం చేసింది.నా భర్త గొప్పదనం ఇదీ‘‘ఆస్ట్రేలియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ప్లేయర్. ప్రపంచంలో మూడో వ్యక్తి.మూడు ఫార్మాట్లలో కలిపి 49 శతకాలు సాధించిన క్రికెటర్. ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్.అంతర్జాతీయ స్థాయిలో 18995 పరుగులు చేసిన క్రికెటర్. రెండుసార్లు వన్డే వరల్డ్‌కప్, ఒకసారి టీ20 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు.టెస్టు చాంపియన్‌షిప్ గెలిచిన టీమ్‌లో మెంబర్. వరల్డ్‌కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఘనత. మూడుసార్లు అలెన్ బోర్డర్ మెడల్ విజేత.టెస్టుల్లో అత్యధిక స్కోరు 335 నాటౌట్.. ఒకవేళ ఎవరైనా మర్చిపోతారేమో.. అందుకే ఈ నిజాలు చెబుతున్నా’’ అంటూ కాండిస్ వార్నర్ ఉద్వేగపూరిత నోట్‌తో పాటు భర్త, కూతుళ్లతో కలిసి ఉన్న ఫొటోలు పంచుకుంది.ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహస్వప్నంఓపెనింగ్లో బ్యాటింగ్‌కు దిగి ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహస్వప్నంగా మారి కంగారు పెట్టించిన ఈ కంగారూ క్రికెటర్ వార్నర్ అంతర్జాతీయ ఆటకు సంపూర్ణంగా టాటా చెప్పేసిన విషయం తెలిసిందే. తాజాగా టీ20లకు గుడ్‌బై చెప్పడం ద్వారా 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు 37 ఏళ్ల వార్నర్ వీడ్కోలు పలికాడు.ఆస్ట్రేలియా ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ బ్యాటర్లలో ఒకడైన వార్నర్ ఇన్నింగ్స్‌కు అర్ష్‌దీప్ సింగ్ తెరదించాడు. అతని చివరి ఇన్నింగ్స్ స్కోరు 6. నిరాశగా వెనుదిరగడం మినహా ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ గానీ స్టాండింగ్ ఒవేషన్ గానీ అందుకోలేకపోయాడు. అతని అంతిమ స్కోరు నిరాశపరచిందేమో కానీ... అతనే ఆస్ట్రేలియా తరఫున టి20ల్లో అత్యధిక పరుగుల (3277) వీరుడు. అన్ని ఫార్మాట్లలో కలిపి చూసుకున్న అతను చేసిందేమాత్రం తక్కువ కాదు. టెస్టు, వన్డే, టి20లు కలిపి దాదాపు 19 వేల పరుగులు (18,995) సాధించాడు. 49 సెంచరీలు బాదాడు. 98 అర్ధశతకాలు చేశాడు. సొంతగడ్డపై 2009 జనవరిలో సఫారీతో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదే నెల అదే ప్రత్యర్థిపై వన్డే కెరీర్ మొదలుపెట్టాడు. కానీ ఈ విధ్వంసకారుడు సంప్రదాయ టెస్టులు ఆడేందుకు దాదాపు మూడేళ్లు పట్టింది. 2011 డిసెంబర్లో కివీస్‌పై ఐదు రోజుల ఆటకు శ్రీకారం చుట్టాడు. ముగింపు ఇలా... ఓపెనర్‌గా విజయవంతమైన వార్నర్ ఆట భారత్‌తోనే ముగిసింది. గత నవంబర్‌లో భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్లో భారత్‌పై ఆడాకా ఆసీస్ విజేతగా నిలువడంతోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు మళ్లీ ప్రస్తుత టి20 ప్రపంచకప్‌లో సూపర్–8 దశలో భారత్‌తోనే (మొత్తం అంతర్జాతీయ) కెరీర్‌కు మంగళం పాడాడు. మరక పడిందలా... ఆటలో మేటి, ఓపెనింగ్‌లో ఘనాపాటి. మైదానంలో చిన్నచిన్న స్లెడ్జింగ్ ఉండేదేమో కానీ బాల్ టాపంరింగ్ కంటే ముందు వార్నర్ పక్కా జెంటిల్మేనే! 2018లో సఫారీ పర్యటనలో మూడో టెస్టు (కేప్‌టౌన్‌లో) సందర్భంగా వైస్ కెప్టెన్‌గా ఉన్న వార్నర్, కెప్టెన్ స్మిత్, బౌలర్ బ్యాంక్రాఫ్ట్తో కలిసి బాల్ టాంపరింగ్ (బంతి ఆకారం మార్చడం)కు పాల్పడంతో ఏడాది పాటు నిషేధానికి, కెరీర్ అసాంతం కెప్టెన్సీకి దూరమయ్యాడు. 👉ఆడిన టెస్టులు: 112 👉చేసిన పరుగులు: 8786 👉సెంచరీలు: 26 👉అర్ధ సెంచరీలు: 37 👉అత్యధిక స్కోరు: 335 నాటౌట్ 👉ఆడిన వన్డేలు: 161 👉చేసిన పరుగులు: 6932 👉సెంచరీలు: 22 👉అర్ధ సెంచరీలు: 33 👉అత్యధిక స్కోరు: 179 👉ఆడిన టీ20లు: 110 👉చేసిన పరుగులు: 3277 👉సెంచరీలు: 1 👉అర్ధ సెంచరీలు: 28 👉అత్యధిక స్కోరు: 100 నాటౌట్ . -
వారసుడిని ప్రకటించిన డేవిడ్ వార్నర్.. ఆసీస్ కొత్త ఓపెనర్ ఎవరంటే?
అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రయాణం ముగిసింది. ఇప్పటికే వన్డేలకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్.. ఇప్పుడు టీ20ల నుంచి తప్పుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో అఫ్గానిస్తాన్- బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంతో వార్నర్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ఇదివరకే టీ20 వరల్డ్‌కప్ అనంతరం తన రిటైర్ అవుతానని వార్నర్ ప్రకటించేశాడు. దీంతో తన చివరి మ్యాచ్‌ను వార్నర్ భారత్‌పై ఆడేశాడు. ఇక వార్నర్ తన వారసుడిగా ఆసీస్ యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్‌ను ప్రకటించాడు. ప్రస్తుతం కరేబియన్ దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న వార్నర్ జేక్ ఫ్రేజర్-మెక్గర్క్తో కలిసి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు."ఇక నుంచి అంతా నీదే ఛాంపియన్ అంటూ" వార్నర్ క్యాప్షన్‌గా ఇచ్చాడు. కాగా మెక్‌గర్క్‌కు టీ20 వరల్డ్‌కప్ ప్రధాన జట్టులో చోటు దక్కకపోయినప్పటికి బ్యాకప్ ఓపెనర్‌గా రిజర్వ్‌లో ఉన్నాడు. మెక్‌గర్క్ కూడా ప్రస్తుతం ఓపెనర్‌గా సత్తాచాటుతున్నాడు. ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఫ్రెజర్.. 9 మ్యాచ్‌ల్లో 230 పరుగులు చేశాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో ట్రావిస్ హెడ్‌తో కలిసి మెక్‌గర్క్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశముంది. ఇక ఆస్ట్రేలియా తరఫున 112 టెస్టులు, 161 వన్డేలు, 110 టీ20 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 8786, 6932, 3277 పరుగులు సాధించాడు. వార్నర్ ఇక పై ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగనున్నాడు. David Warner passes the baton to Jake Fraser-McGurk 💛📸: David Warner pic.twitter.com/VwCFtjvIX0— CricTracker (@Cricketracker) June 25, 2024 -
డేవిడ్ వార్నర్ గుడ్ బై.. అందమైన కుటుంబాన్ని చూశారా?(ఫొటోలు)
-
David Warner: డేవిడ్ వార్నర్ గుడ్‌బై
డేవిడ్ వార్నర్ ఓ ఆస్ట్రేలియన్ క్రికెటర్ అంతే! అంతేనా అంటే కచ్చితంగా కాదు... మనకు బాగా తెలిసిన వ్యక్తి... మనల్ని మైదానంలో (ఐపీఎల్) ఆటతో, వెలుపల సతీసమేతంగా రీల్స్‌తో తెలుగు వాళ్లకు సుపరిచితుడు. అతని గురించి మూడే మూడు ముక్కల్లో చెప్పాలంటే ఓపెనింగ్‌లో విధ్వంసం, జట్టులో కీలకం, విజయాల్లో సంబరం! కానీ అతని బ్యాటింగ్ మెరుపులు ఇకపై అంతర్జాతీయ క్రికెట్లో కనిపించవు. ఆరు నెలల క్రితం టెస్టు, వన్డే ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన ఈ ఆస్ట్రేలియన్ తాజాగా టీ20లకూ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని విధ్వంసరచన ఇకమీదట ఫ్రాంచైజీ ప్రైవేట్ టీ20 లీగ్‌లకే పరిమితం కానుంది. ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో భాగంగా అఫ్గనిస్తాన్- బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంతో ఈ స్టార్ బ్యాటర్ ఇంటర్నేషనల్ కెరీర్‌కు తెరపడింది.కాగా ఇప్పటికే వన్డే, టెస్టుల నుంచి రిటైర్ అయిన డేవిడ్ వార్నర్.. టీ20 వరల్డ్‌కప్-2024 తన అంతర్జాతీయ కెరీర్లో చివరి టోర్నీ అని ప్రకటించాడు. అమెరికా- వెస్టిండీస్ వేదికగా సాగిన ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత తాను వీడ్కోలు పలుకుతానని వెల్లడించాడు.ఈ క్రమంలో మంగళవారం నాటి ఉత్కంఠ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్- బంగ్లాదేశ్‌ను ఓడించడంతో.. ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నాకౌట్ అయింది. కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది.టీమిండియాతో ఆడిన మ్యాచ్ చివరిదిఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్ కెరీర్‌కు ఇక్కడితో ఫుల్స్టాప్ పడినట్లయింది. ఆసీస్ తరఫున అతడు టీమిండియాతో సోమవారం ఆడిన మ్యాచ్ చివరిది కానుంది. కాగా టీమిండియాతో మ్యాచ్‌లో వార్నర్ ఆరు బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులే చేశాడు.భారత యువ పేసర్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కాగా 37 ఏళ్ల ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 2009లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు.తొలుత టీ20.. తర్వాత అదే ఏడాది వన్డేల్లో అడుగుపెట్టిన వార్నర్.. 2011లో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. మొత్తంగా ఆస్ట్రేలియా తరఫున 112 టెస్టులు, 161 వన్డేలు, 110 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 8786, 6932, 3277 పరుగులు సాధించాడు. అంతేకాదు ఈ పార్ట్‌టైమ్ స్పిన్నర్ టెస్టుల్లో నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.కచ్చితంగా తనను మిస్ అవుతాంటీమిండియాతో మ్యాచ్‌లో ఓటమి అనంతరం ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్ వార్నర్ గురించి మాట్లాడుతూ.. ‘‘మేమంతా అతడిని కచ్చితంగా మిస్ అవుతాం. చాలా ఏళ్లుగా అతడితో మా ప్రయాణం కొనసాగుతోంది.మూడు ఫార్మాట్లలో తను అద్భుతంగా రాణించాడు. తొలుత టెస్టులు.. తర్వాత వన్డేలకు.. ఇప్పుడు టీ20లకు ఇలా దూరమయ్యాడు. అతడు జట్టుతో లేకుండా ఉండటం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాం’’ అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
కమిన్స్ హ్యాట్రిక్, వార్నర్ మెరుపు హాఫ్ సెంచరీ.. ఆసీస్ చేతిలో చిత్తైన బంగ్లాదేశ్
టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (జూన్ 21) ఉదయం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 141 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వరుణుడు ఆడ్డు తగలడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఆసీస్‌ను విజేతగా ప్రకటించారు. వర్షం మొదలయ్యే సమయానికి ఆసీస్ స్కోర్ 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులుగా ఉండింది.కమిన్స్ హ్యాట్రిక్ఈ మ్యాచ్‌లో కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇది తొలి హ్యాట్రిక్ కాగా.. టీ20 ప్రసంచకప్ టోర్నీల్లో ఆసీస్‌కు ఇది రెండో హ్యాట్రిక్. ఆసీస్ తరఫున తొలి హ్యాట్రిక్ 2007 ప్రపంచకప్ ఎడిషన్‌లో నమోదైంది. ఆ ఎడిషన్‌లో బ్రెట్ లీ బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ సాధించాడు.HAT-TRICK FOR PAT CUMMINS!!- Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. 🏆pic.twitter.com/qh0ZCFAkHF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. కమిన్స్ (4-0-29-3), ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్‌వెల్ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు.వార్నర్ మెరుపు అర్ధ శతకం141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం మొదలై మ్యాచ్‌కు అంతరాయం కలిగించి, డక్‌వర్త లూయిస్ పద్దతిన ఫలితాన్ని నిర్దారించేలా చేసింది. వర్షం మొదలయ్యే సమయానికి ఓపెనర్ డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (6 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్.. ట్రవిస్ హెడ్‌తో (31) కలిసి ఆసీస్‌కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు కలిసి పవర్ ప్లేలో 59 పరుగులు జోడించారు. -
ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్ వీడియో.. బన్నీ రిప్లై ఇదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2: ది రూల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. పుష్ప-2లోనూ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్‌ను ఊపేస్తున్నాయి.పుష్ప సినిమా తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం బన్నీకి ఫ్యాన్‌గా మారిపోయాడు. పుష్ప మేనరిజాన్ని బన్నీ స్టైల్లో చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. పుష్ప-2 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని వార్నర్ గతంలోనే వెల్లడించారు.అయితే తాజాగా వార్నర్ ఓ కంపెనీ యాడ్‌లో మెరిశారు. ఈ ప్రకటనలో పుష్ప సినిమాలోని ఫైర్ అనే డైలాగ్‌తో మెప్పించారు వార్నర్. ఈ ప్రకటన చూసిన బన్నీ ఫన్నీ రిప్లై ఇచ్చారు. నవ్వుతున్న ఎమోజీలు జత చేస్తూ థమ్సప్ సింబల్ ఇచ్చాడు. కాగా.. ఇటీవల విడుదలైన 'పుష్ప: ది రూల్'లోని 'పుష్ప పుష్ప' సాంగ్‌కు స్టెప్పులతో డేవిడ్ వార్నర్ అదరగొట్టాడు. షూ డ్రాప్ స్టెప్ ప్రాక్టీస్ చేస్తూ వార్నర్ కనిపించారు. కాగా.. పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
AUS Vs ENG: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా..
టీ20 వరల్డ్‌కప్-2024లో ఆస్ట్రేలియా తమ జోరును కొనసాగిస్తోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బార్బోడస్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ టాపార్డర్ బ్యాటర్లు అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు.ట్రావిస్ హెడ్(34), వార్నర్(39), మిచెల్ మార్ష్(35), మాక్స్వెల్(28), స్టోయినిష్(30) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ,అర్చర్, లివింగ్ స్టోన్, రషీద్ తలా వికెట్ సాధించారు.రాణించిన ఆసీస్ బౌలర్లు..202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్(42) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫిల్ సాల్ట్(37), మొయిన్ అలీ(25) తమ వంతు ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్లలో పాట్ కమ్మిన్స్, జంపా తలా రెండు వికెట్లు సాధించగా.. హాజిల్‌వుడ్, మార్కస్ స్టోయినిష్ తలా వికెట్ పడగొట్టారు. కాగా ఆసీస్‌కు ఇది వరుసగా రెండో విజయం కావడం గమనార్హం. -
T20 World Cup 2024: క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన డేవిడ్ వార్నర్
ఆసీస్ వెటరన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్ చరమాంకంలో ఓ అద్భుత రికార్డు నెలకొల్పాడు. పొట్టి క్రికెట్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (సెంచరీలు కలుపుకుని) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఒమన్‌తో ఇవాళ (జూన్ 6) జరిగిన మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్సర్) మెరిసిన వార్నర్.. టీ20ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ రికార్డు సాధించే క్రమంలో వార్నర్ విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్‌ను అధిగమించాడు. ఒమన్‌పై హాఫ్ సెంచరీ కలుపుకుని వార్నర్ ఖాతాలో 111 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉండగా.. గేల్ పేరిట 110 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు నమోదై ఉన్నాయి. వార్నర్ కేవలం 378 ఇన్నింగ్స్‌ల్లో 111 ఫిఫ్టి ప్లస్ స్కోర్ల మార్కు తాకగా.. గేల్‌కు 110 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసేందుకు 455 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఈ జాబితాలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మూడో స్థానంలో (105), పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నాలుగో స్థానంలో (101) ఉన్నారు.కాగా, బార్బడోస్ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. స్టోయినిస్ (36 బంతుల్లో 67 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), వార్నర్ (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాట్‌తో చెలరేగిన స్టోయినిస్ బంతితోనూ (3-0-19-3) రాణించాడు. స్టోయినిస్‌తో పాటు జంపా (4-0-24-2), ఇల్లిస్ (4-0-28-2), స్టార్క్ (3-0-20-2) కూడా సత్తా చాటడంతో ఒమన్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 36 పరుగులు చేసిన అయాన్ ఖాన్ ఒమన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
వారెవ్వా జోసెఫ్.. దెబ్బకు వార్నర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
వెస్టిండీస్ యువ పేస్ సంచలనం షామర్ జోసెఫ్ టీ20 వరల్డ్‌కప్-2024కు సన్నద్దమవుతున్నాడు. ఈ క్రమంలో ట్రినిడాడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మాప్ మ్యాచ్‌లో జోసెఫ్ సంచలన బంతితో మెరిశాడు. ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను జోషఫ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. జోషఫ్ వేసిన డెలివరీకి వార్నర్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఆసీస్ ఇన్నింగ్స్ 2వ వేసిన జోషఫ్ తొలి మూడు బంతుల్లో ఏకంగా 14 పరుగులు సమర్పించుకున్నాడు. వార్నర్ రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. ఈ సమయంలో జోసెఫ్ సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. నాలుగో బంతిని జోసెఫ్.. వార్నర్‌కు బ్యాక్-ఆఫ్-లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అయితే వార్నర్ ఈ డెలివరీని లెగ్ సైట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌కు మిస్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఏడాది ఆసీస్‌తో గబ్బా వేదికగా జరిగిన టెస్టులో సంచలన ప్రదర్శన కనబరిచిన జోసెఫ్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇక వార్మాప్ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్‌పై 35 పరుగుల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. విండీస్ బ్యాటర్లలో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో పూరన్ 75 పరుగులు చేశాడు. జాన్సన్ ఛార్లెస్(40), రూథర్‌ఫోర్డ్(47) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో ఆసీస్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
పసికూనపై ప్రతాపం.. రెచ్చిపోయిన హాజిల్‌వుడ్, వార్నర్
టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా నమీబియాతో నిన్న (మే 28) జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా కేవలం 10 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ తరఫున తొలుత హాజిల్‌వుడ్.. ఆతర్వాత డేవిడ్ వార్నర్ రెచ్చిపోయారు. హాజిల్‌వుడ్ నాలుగు ఓవర్లు బౌల్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా.. వార్నర్ 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 54 పరుగులు చేశాడు. హాజిల్‌వుడ్ తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఏకంగా మూడు మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం. హాజిల్‌వుడ్‌తో పాటు ఆడమ్ జంపా (4-0-25-3), నాథన్ ఇల్లిస్ (4-0-17-1), టిమ్ డేవిడ్ (4-0-39-1) కూడా సత్తా చాటడంతో పసికూన నమీబియా విలవిలలాడిపోయింది. నమీబియా ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ జేన్ గ్రీన్ (38) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. కెప్టెన్ మార్ష్ 18, ఇంగ్లిస్ 5, టిమ్ డేవిడ్ 23, వేడ్ 12 (నాటౌట్) పరుగులు చేశారు. నమీబియా బౌలర్లలో బెర్నల్డ్ స్కోల్జ్‌కు రెండు వికెట్లు దక్కగా.. మార్ష్ రనౌటయ్యాడు. బంగ్లాదేశ్, యూఎస్ఏ మధ్య నిన్ననే జరగాల్సిన మరో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైంది. -
‘అతడు 70 శాతం ఇండియన్.. 30 శాతం మాత్రమే ఆస్ట్రేలియన్’
‘‘నేను కలిసిన అత్యంత నిస్వార్థమైన వ్యక్తుల్లో అతడూ ఒకడు. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికీ అతడు సమయం కేటాయించగలడు. సాయం చేయడానికి 24/7 అందుబాటులోనే ఉంటాడు.ఎక్కడి హోటల్‌కు వెళ్లినా నా గదికి రెండు గదుల అవతల అతడు ఉంటాడు. నాకు ఇష్టం వచ్చినప్పుడు అక్కడికి వెళ్లవచ్చు. ప్రతి రోజూ ఉదయం అక్కడే నేను కాఫీ తాగుతాను కూడా!ఇండియన్ అనడం బెటర్నిజం చెప్పాలంటే అతడు ఆస్ట్రేలియన్ అనడం కంటే ఇండియన్ అనడం బెటర్. అతడికి కూడా ఇదే మాట చెబుతూ ఉంటా. నా దృష్టిలో అతడు 70 శాతం ఇండియన్.కేవలం 30 శాతం మాత్రమే ఆస్ట్రేలియన్‌గా ఉంటాడు’’ అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ యువ సంచలనం, ఆసీస్ స్టార్ జేక్ ఫ్రేజర్-మెగర్క్ సహచర ఆటగాడు డేవిడ్ వార్నర్‌పై ప్రశంసలు కురిపించాడు.తనకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా వెంటనే వార్నర్ దగ్గరికి వెళ్లి అడిగేంత చొరవ ఉందని తెలిపాడు. సీనియర్ అన్న పొగరు ఏమాత్రం చూపించడని.. అందరితోనూ సరదాగా ఉంటాడని మెగర్క్ చెప్పుకొచ్చాడు.హైదరాబాదీలతో బంధంకాగా ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ద్వారా భారతీయులకు చేరువైన విషయం తెలిసిందే. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన సమయంలో హైదరాబాదీలతో బంధం పెనవేసుకున్నాడు.టాలీవుడ్ స్టార్ హీరోల తెలుగు పాటలకు రీల్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వార్నర్ భాయ్.. ఇటీవలే దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ఓ యాడ్లోనూ నటించి మెప్పించాడు.ఈ నేపథ్యంలో మెగర్క్ వార్నర్ గురించి డీసీ(ఢిల్లీ క్యాపిటల్స్) పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీకి ఆడుతున్న సౌతాఫ్రికా స్టార్ ట్రిస్టన్ స్టబ్స్ సైతం వార్నర్‌తో తనకు మంచి అనుబంధం ఉందని.. అతడితో కలిసి గోల్ఫ్ ఆడటం తనకు ఇష్టమని పేర్కొన్నాడు.ఐపీఎల్-2024లో ఇలాకాగా ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. మరోవైపు.. ఈ సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేసిన 22 ఏళ్ల జేక్ ఫ్రేజర్-మెగర్క్ 6 ఇన్నింగ్స్‌లో కలిపి 259 పరుగులు చేశాడు.ఇక ట్రిస్టన్ స్టబ్స్ 10 ఇన్నింగ్స్ ఆడి 277 రన్స్ చేయగా.. డేవిడ్ వార్నర్ కేవలం 7 మ్యాచ్‌లలో భాగమై 167 పరుగులు చేయగలిగాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు వార్నర్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. -
పుష్ప స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. బన్నీ రిప్లై అదిరిపోయింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప-2: ది రూల్. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ పుష్పకు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసన మేకర్స్ మరో సాలిడ్ అప్డేట్తో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు.ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. పుష్ప.. పుష్ప.. పుష్ప.. అంటూ సాగే పాట ఆడియన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. అయితే ఈ సాంగ్‌లో బన్నీ చేసిన షూ డ్రాప్ స్టెప్ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంటోంది. ఈ స్టెప్ వేస్తున్న వీడియోను చూసిన పుష్ప వీరాభిమాని డేవిడ్ వార్నర్ రిప్లై ఇచ్చారు. ఓ డియర్.. ఎంత బాగా చేశావ్.. ఇప్పుడు నేను కూడా ఆ స్టెప్ ప్రాక్టీస్ కోసం కొంత వర్క్ చేయాలి' అంటూ కామెంట్ చేశాడు.అయితే డేవిడ్ వార్నర్ కామెంట్‌కు బన్నీ కూడా రిప్లై ఇచ్చాడు. మనిద్దరం కలిసినప్పుడు తప్పకుండా హుక్ స్టెప్ నేర్పిస్తానని అల్లు అర్జున్ రాసుకొచ్చారు. 'ఇది చాలా సులభం...మనం కలిసినప్పుడు ఎలా చేయాలో నీకు చూపిస్తా' అని కామెంట్స్‌లో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. కాగా.. పుష్ప సినిమా నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. అల్లు అర్జున్‌కు నటనకు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి బన్నీకి వీరాభిమాని అయిపోయారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పుష్ప డైలాగ్స్‌తో అలరిస్తుంటారు. కాగా.. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
విరాట్ కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 201 పరుగుల భారీ లక్ష్య చేధనలో కోహ్లి అద్బుతమైన ఇన్నింగ్స్‌ను ఆడాడు. కేవలం 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు విల్ జాక్స్ మెరుపు శతకంతో చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 10 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా 201 పరుగుల టార్గెట్‌ను ఆర్సీబీ 16 ఓవర్లలో ఊదిపడేసింది. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన కోహ్లి పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్లో రన్ ఛేజింగ్‌లో అత్యధిక సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన రెండో ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఐపీఎల్లో లక్ష్య చేధనలో కోహ్లి ఇప్పటివరకు 24 సార్లు ఏభై పైగా పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా వెటరన్ ఓపెనర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ 23 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. తాజా మ్యాచ్‌తో ధావన్‌ను కింగ్ కోహ్లి అధిగమించాడు. →అదే విధంగా ఐపీఎల్ సీజన్లో అత్యధిక సార్లు 500 పైగా పరుగులు చేసిన క్రికెటర్‌గా డేవిడ్ వార్నర్ రికార్డును కోహ్లి సమం చేశాడు. వార్నర్ ఇప్పటివరకు 7 సీజన్లలో 500 పైగా పరుగులు చేయగా.. విరాట్ కూడా సరిగ్గా 500 ప్లస్ పరుగులు చేశాడు. ఐపీఎల్-2024లో ఇప్పటివరకు మ్యాచ్‌లు ఆడినహ్లి 500 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాన్నాడు. -
రాజమౌళి దర్శకత్వంలో వార్నర్...నవ్వులు పూయిస్తున్న వీడియో
-
రాజమౌళి దర్శకత్వంలో వార్నర్.. నవ్వులు పూయిస్తున్న వీడియో
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కి యాక్టింగ్ అంటే పిచ్చి. లాక్డౌన్ సమయంలో ఎన్నో టిక్‌టాక్ వీడియోలు చేసి అలరించాడు. అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్‌బాబుతో పాటు పలువురు టాలీవుడ్ హీరోల పాటలకు స్టైప్పులేస్తూ దక్షిణాది సీనీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బాహుబలిలో ప్రభాస్, మహర్షిలో మహేశ్‌బాబు, దర్బార్‌లో రజినీకాంత్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను రీఫేస్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. అవి వైరల్ అయ్యేవి. తాజాగా ఈ స్టార్ క్రికెటర్ ఓ యాడ్‌లో నటించాడు. ఆ ప్రకటనలో దర్శకధీరుడు రాజమౌళి నటించడం మరో విశేషం. నవ్వులు పూయిస్తున్న యాడ్ ప్రముఖ పేమెంట్స్ యాప్ క్రెడ్ (CRED) ఓ ఫన్నీ యాడ్ రూపొందించింది. ఇందులో రాజమౌళి దర్శకుడిగా, వార్నర్ హీరోగా నటించారు. ‘మ్యాచ్ టికెట్లపై డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి’ అంటూ రాజమౌళి వార్నర్‌కి ఫోన్‌చేసి అడుగుతాడు. దానికి వార్నర్ బదులిస్తూ.. ‘రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ ఉంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది' అంటాడు. మరి నార్మల్ యూపీఐ అయితే అని రాజమౌళి అడుగుతాడు. అలా అయితే డిస్కౌంట్ కోసం నాకు మీరో ఫేవర్ చేయాలని వార్నర్ కోరతాడు. తనతో ఓ సినిమా చేయమని అడుగుతాడు. ఒకవేళ తన సినిమాల్లో నిజంగానే వార్నర్ నటిస్తే ఎలా ఉండేదో రాజమౌళి ఊహించుకుంటాడు. సెట్స్‌లో వార్నర్ చేసే అల్లరి, వేసే స్టెప్పలు, డైగాల్స్ ..ఇవన్నీ ఊహించుకొని భయపడిపోయినట్లు యాడ్‌లో చూపించారు. మధ్యలో ‘ఆస్కార్ వేదికగా కలుద్దాం’ అని వార్నర్ అన్నప్పుడు రాజమౌళి చూసే చూపు నవ్వులు పూయిస్తుంది. కొన్ని సార్లు ఫేవర్ కూడా మార్కెట్ రిస్క్‌కి లోబడి ఉంటాయంటూ క్రెడ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ వీడియోని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అటు సినీ ప్రియులతో పాటు ఇటు క్రికెట్ అభిమానులను అలరిస్తోంది. Favours are subject to market risk. pic.twitter.com/QSPToEGYzg — CRED (@CRED_club) April 12, 2024 -
IPL 2024: కోహ్లి, వార్నర్ సరసన చేరిన హిట్‌మ్యాన్
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఏప్రిల్ 7) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ కేవలం 27 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి అలరించాడు. 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఓ అరుదైన క్లబ్లో చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 1000 పరుగులు (34 మ్యాచ్‌ల్లో 1026 పరుగులు) పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్‌కు ముందు విరాట్ కోహ్లి మాత్రమే ఢిల్లీపై 1000 పరుగులు మార్కును తాకాడు. కోహ్లి ఢిల్లీపై 28 ఇన్నింగ్స్‌ల్లోనే 1030 పరుగులు చేశాడు. రోహిత్ ఢిల్లీపై 1000 పరుగులు పూర్తి చేయడంతో మరో రికార్డు కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ఒకటి, అంతకంటే ఎక్కువ జట్లపై 1000 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. హిట్‌మ్యాన్ ఢిల్లీతో పాటు కేకేఆర్‌పై కూడా 1000 పరుగులు పూర్తి చేశాడు. రోహిత్‌కు ముందు డేవిడ్ వార్నర్ (పంజాబ్, కేకేఆర్), విరాట్ కోహ్లి (ఢిల్లీ, సీఎస్కే) మాత్రమే ఐపీఎల్లో ఒకటి అంతకుమించి జట్లపై 1000 పరుగులు పూర్తి చేశారు. కాగా, ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రోహిత్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. 235 పరుగల భారీ లక్ష్య ఛేదనలో ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 71 పరుగులు నాటౌట్), పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఢిల్లీని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. స్టబ్స్ చివరి వరకు పోరాడినప్పటికీ ఢిల్లీ లక్ష్యానికి 30 పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత.. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డు సమం
టీ20 క్రికెట్లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రిస్ గేల్ రికార్డును వార్నర్ సమం చేశాడు. ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 52 పరుగులు చేసిన వార్నర్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. వార్నర్ ఇప్పటివరకు 110 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించగా.. క్రిస్ గేల్ కూడా 110 సార్లు ఏభైకి పైగా పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్లో గేల్ రికార్డును వార్నర్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. వీరి తర్వాతి స్ధానాల్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఉన్నాడు. కోహ్లి టీ20ల్లో ఇప్పటివరకు 101 సార్లు ఫిప్టీ ప్లస్ పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(52), రిషబ్ పంత్(51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అదేవిధంగా ఈ ఏడాది సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న పృథ్వీ షా(43) పరుగులతో రాణించాడు. వార్నర్,పృథ్వీ షా తొలి వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సీఎస్కే బౌలర్లలో పతిరాన 3 వికెట్లు పడగొట్టగా.. జడేజా, ముస్తఫిజర్ రెహ్మన్ తలా వికెట్ సాధించారు -
ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాజస్తాన్ మెరుపు విజయం (ఫొటోలు)
-
స్టోయినిస్‌కు మొండిచెయ్యి.. కొత్తగా నలుగురికి అవకాశం
2024-25 సంవత్సరానికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ లభించిన 23 మంది ఆటగాళ్ల జాబితాను క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ (మార్చి 28) ప్రకటించింది. ఈ జాబితాలో లిమిటెడ్ ఓవర్స్ స్పెషలిస్ట్ మార్కస్ స్టోయినిస్, ఇటీవలే టెస్ట్, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్‌కు చోటు దక్కలేదు. వీరితో పాటు ఆస్టన్ అగర్, మార్కస్ హ్యారిస్, మైకేల్ నెసర్, మ్యాట్ రెన్షాలకు కూడా క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక కాంట్రాక్ట్ లభించలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా కొత్తగా నలుగురు ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్ట్ కల్పించింది. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, మ్యాట్ షార్ట్, ఆరోన్ హార్డీ కొత్తగా కాంట్రాక్ట్ పొందిన వారిలో ఉన్నారు. ఈ నలుగురిలో బార్ట్లెట్ తొలిసారి కాంట్రాక్ట్ పొందగా.. మిగతా ముగ్గురు గతంలో వార్షిక కాంట్రాక్ట్ పొందారు. ఈ వార్షిక కాంట్రాక్ట్ టీ20 వరల్డ్‌కప్ అనంతరం అమల్లోకి వస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా 2024-25: సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లాబూషేన్, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, జే రిచర్డ్సన్, మ్యాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
బాబర్ ఆజం, డేవిడ్ వార్నర్‌కు ఘోర అవమానం..
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌లకు మరోసారి ఘోర అవమానం ఎదురైంది. ఇంగ్లండ్ ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీ ది హండ్రెడ్ లీగ్‌లో వరుసగా మూడోసారి ఈ పాక్ స్టార్ క్రికెటర్లు అమ్ముడుపోలేదు. ది హండ్రెడ్ లీగ్ 2024 సీజన్ డ్రాఫ్ట్‌లో బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లను సొంతం చేసుకోవడానికి ఏ ప్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. వీరితో పాటు ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్, ఆసీస్ యువ సంచలనం టిమ్ డేవిడ్‌లు సైతం అమ్ముడు పోలేదు. అయితే ఈ డ్రాఫ్ట్‌లో బాబర్, రిజ్వాన్‌ను ఎవరూ పట్టించుకో పోయినప్పటికి.. తమ సహాచర ఆటగాళ్లు షాహీన్ అఫ్రిది, నసీం షా, ఇమాద్ వసీం మాత్రం అమ్ముడుపోయారు. షాహీన్ ఆఫ్రిదీని లక్ష పౌండ్ల(పాకిస్తాన్ కరెన్సీలో 3 కోట్ల 48 లక్షల రూపాయలు)కు వెల్ష్ ఫైర్ ప్రాంచైజీ సొంతం చేసుకుంది. గత సీజన్లో కూడా షాహీన్.. వెల్ష్ ఫైర్ ప్రాంచైజీకే ప్రాతినిథ్యం వహించాడు. ఇమాద్ వసీంను ట్రెంట్ రాకెట్స్, నసీం షాను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ దక్కించుకుంది. కాగా ఈ డ్రాప్ట్‌లో వెస్టిండీస్ ఆటగాళ్లకు బారీ డిమాండ్ నెలకొంది. నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, హెట్‌మైర్ వంటి విండీస్ ఆటగాళ్లు తొలి రౌండ్లోనే అమ్ముడుపోయారు. పూరన్‌ను నార్తర్న్ సూపర్ఛార్జర్స్ సెలక్ట్ చేసుకోగా.. ఆండ్రీ రస్సెల్, షిమ్రాన్ హెట్మెయర్ లండన్ స్పిరిట్‌కు ఆడనున్నారు. వీరితో పాటు విండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ సదరన్ బ్రేవ్ జట్టుకు, రోవ్మాన్ పావెల్ ట్రెంట్ రాకెట్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించనున్నారు. మరోవైపు మహిళల ది హండ్రెడ్ లీగ్ డ్రాప్ట్‌లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అయితే భారత స్టార్ క్రికెటర్లు స్మృతి మంధాన, రిచ్ ఘోష్‌లను మాత్రం ఈ డ్రాప్ట్‌లో ఎంపికయ్యారు. మంధానను సదరన్ బ్రేవ్ సొంతం చేసుకోగా.. రిచా ఘోష్‌ను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఎంపిక చేసింది. -
బుట్టబొమ్మ స్టెప్పులు.. వార్నర్ పోటీగా హాలీవుడ్ పాప్ సింగర్!
బుట్టబొమ్మ పాట చెప్పగానే మనోళ్లకు అల్లు అర్జున్ గుర్తొస్తే.. విదేశీయులకు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గుర్తొస్తాడు. ఎందుకంటే మనవరకు తెలిసిన ఈ పాటని వార్నర్.. తనదైన స్టెప్పులతో ఇంటర్నేషనల్ ప్రియులకు పరిచయం చేశాడు. ఇప్పుడు అతడికి పోటీగా హాలీవుడ్ పాప్ సింగర్ వచ్చేశాడు. తాజాగా జరిగిన ఓ పార్టీలో కష్టపడుతూనే బుట్టబొమ్మ స్టెప్పులేశాడు. ఇంతకీ ఎవరా సింగర్? ఏంటా సంగతి? (ఇదీ చదవండి: ఇంతలా ఎప్పుడు నవ్వుకున్నానో గుర్తులేదు: మహేశ్ బాబు) అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'.. 2020 సంక్రాంతికి రిలీజైంది. అయితే సినిమా కంటే పాటలు అదిరిపోయే రేంజులో పాపులారిటీ సంపాదించుకున్నాయి. లాక్డౌన్ టైంలో పలువురు స్టార్స్ ఈ పాటకు స్టెప్పులేసి రీల్స్ చేశారు. వీళ్లందరి సంగతేమో గానీ ఆసీస్ క్రికెటర్ వార్నర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీతో వేసిన స్టెప్పులైతే కేక. ఇప్పటికీ వార్నర్ ఎక్కడ కనిపించినా మనోళ్లు.. బుట్టబొమ్మ స్టెప్పు వేయమని అరుస్తుంటారు. అలా డేవిడ్ వార్నర్ కాస్త బుట్టబొమ్మ వార్నర్ అయిపోయాడు. ఇకపోతే యూకే దేశానికి చెందిన ప్రముఖ సింగర్ ఎడ్ షీరన్.. తాజాగా ముంబయిలో కొన్ని ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు వచ్చాడు. తాజాగా జరిగిన ఓ పార్టీలో 'బుట్టబొమ్మ' పాడిన సింగర్ అర్మాన్ మాలిక్‌తో కలిసి ఇదే పాటకు స్టెప్పులేశాడు. అయితే అనుభవం లేకపోవడం వల్ల.. చేతులు, కాళ్లు కదపడానికి ఎడ్ షీరన్ కష్టపడ్డాడు. మరి వార్నర్-షీరన్.. వీళ్లిద్దరిలో ఎవరు బుట్టబొమ్మ స్టెప్పు బాగా వేశారని అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) View this post on Instagram A post shared by ARMAAN MALIK 🧿 (@armaanmalik) -
ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ హీరోలు వీరే.. 2024 సీజన్లో ఎవరు..?
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి మరో 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మార్చి 22న ఈ సీజన్ తొలి మ్యాచ్ జరుగనుంది. ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. సీజన్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ టాప్ రికార్డు అయిన ఆరెంజ్ క్యాప్‌పై (అత్యధిక పరుగులు) ఓ లుక్కేద్దాం. ఐపీఎల్ తొలి ఎడిషన్ (2008) నుంచే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఐపీఎల్ తొలి ఆరెంజ్ క్యాప్‌ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆటగాడు షాన్ మార్ష్ సొంతం చేసుకున్నాడు. ఆ సీజన్లో మార్ష్ 11 మ్యాచ్‌ల్లో సెంచరీ, 5 హాఫ్ సెంచరీల సాయంతో 616 పరుగులు చేసి సీజన్ టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 2009 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మాథ్యూ హేడెన్ ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. ఆ సీజన్లో హేడెన్ 12 మ్యాచ్‌ల్లో 5 అర్దసెంచరీల సాయంతో 572 పరుగులు చేశాడు. 2010 ఎడిషన్ విషయానికొస్తే.. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 15 మ్యాచ్‌ల్లో 618 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అనంతరం 2011, 2012 సీజన్లలో ఆర్సీబీ ఆటగాడు క్రిస్ గేల్ వరుసగా రెండు సార్లు (608, 733) ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకోగా.. 2013లో సీఎస్కే ఆటగాడు మైక్ హస్సీ (733), 2014లో కేకేఆర్ రాబిన్ ఉతప్ప (660), 2015లో సన్‌రైజర్స్ డేవిడ్ వార్నర్ (562) ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. 2016లో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి (973) లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు (ఒక సీజన్లో) చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకోగా.. 2017లో సన్‌రైజర్స్ వార్నర్ (692), 2018లో సన్‌రైజర్స్ కేన్ విలియమ్సన్ (735), 2019లో వార్నర్ (692) ముచ్చటగా మూడో సారి, 2020లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కేఎల్ రాహుల్ (670), 2021లో సీఎస్కే రుతురాజ్ గైక్వాడ్ (635), 2022లో రాజస్థాన్ రాయల్స్ జోస్ బట్లర్ (863), 2023లో గుజరాత్ టైటాన్స్ శుభ్‌మన్ గిల్ (890) ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నారు. మరి ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుచుకుంటారో కామెంట్లో తెలియజేయండి. -
IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. డేవిడ్ వార్నర్‌కు గాయం!
న్యూజిలాండ్‌తో మూడో టీ20కు ముందు ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా మూడో టీ20కు దూరమయ్యాడు. వార్నర్ ప్రస్తుతం తుంటి గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే రెండో టీ20కు విశ్రాంతి తీసుకున్న వార్నర్.. ఇప్పుడు మూడో టీ20 నుంచి సైతం తప్పుకున్నాడు. ఈ మెరకు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటన విడుదల చేసింది. "వార్నర్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. అతడు కోలుకోవడానికి కాస్త సమయం పడుతోంది. అయితే అతడు కచ్చితంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్, టీ20 వరల్డ్‌కప్‌కు కచ్చితంగా అందుబాటులో ఉంటాడని" క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటనలో పేర్కొంది. కాగా కివీస్‌తో జరిగిన తొలి టీ20లో వార్నర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 20 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వార్నర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సీజన్లో రిషబ్ పంత్ గైర్హజరీలో ఢిల్లీ జట్టును డేవిడ్ భాయ్ ముందుండి నడిపించాడు. చదవండి: IND vs ENG: అయ్యో.. ట్రాప్‌లో చిక్కుకున్న రోహిత్ శర్మ! వీడియో వైరల్ -
IPL 2024: ఈ సీజన్లో మా కెప్టెన్ అతడే: ఢిల్లీ క్యాపిటల్స్
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ పునరాగమనం ఖరారైంది. ఐపీఎల్-2024 సీజన్‌తో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ధ్రువీకరించింది. క్యాష్ రిచ్ లీగ్ పదిహేడవ ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా పంత్ వ్యవహరిస్తాడని ఆ ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ స్పష్టం చేశాడు. కాగా టీమిండియా కీలక ఆటగాడైన రిషభ్ పంత్.. డిసెంబరు, 2022లో ఘోర ప్రమాదానికి గురై.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. అయితే, గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పంత్ కోలుకోడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. ఈ క్రమంలో టీమిండియా కీలక సిరీస్‌లతో పాటు... ఐపీఎల్-2023, వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలకు ఈ ఉత్తరాఖండ్ క్రికెటర్ దూరమయ్యాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతూ క్రమక్రమంగా కోలుకున్నాడు. మార్చి 22 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్ తాజా ఎడిషన్ నాటికి మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పార్థ్ జిందాల్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ పంత్ రీఎంట్రీని ధ్రువీకరించాడు. అయితే.. తొలి అర్ధభాగం మ్యాచ్‌లలో అతడు వికెట్ కీపింగ్ చేయడని పేర్కొన్నాడు. కేవలం కెప్టెన్సీ, బ్యాటింగ్ సేవలకే పరిమితం అవుతాడని వెల్లడించాడు. ‘‘రిషభ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. రన్నింగ్ కూడా చేయగలుగుతున్నాడు. ఇప్పుడిప్పుడే వికెట్ కీపింగ్ కూడా మొదలుపెట్టాడు. ఐపీఎల్ ఆరంభ సమయానికి అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని నమ్మకం ఉంది. రిషభ్ కచ్చితంగా ఈ సీజన్లో ఆడతాడు.. అదే విధంగా కెప్టెన్‌గానూ సేవలు అందిస్తాడని విశ్వసిస్తున్నా. తొలి ఏడు మ్యాచ్‌లలో కేవలం బ్యాటర్‌గానే అతడు బరిలోకి దిగుతాడు. ఒకవేళ తన శరీరం ఆటకు సహకరించకపోతే మాత్రం అతడికి విశ్రాంతినిస్తాం’’అని పార్థ్ జిందాల్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. తాను వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను రిషభ్ పంత్ ఇటీవల షేర్ చేశాడు. ఇదిలా ఉంటే.. పంత్ గైర్హాజరీలో ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. గతేడాది క్యాపిటల్స్ సారథిగా వ్యవహరించాడు. అయితే, వార్నర్ సారథ్యంలో ఢిల్లీ పదిహేడు మ్యాచ్‌లకు గానూ కేవలం 5 మాత్రమే గెలిచి పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. చదవండి: IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ హోం మ్యాచ్‌లు విశాఖలో.. ఎందుకంటే..? View this post on Instagram A post shared by Rishabh Pant (@rishabpant) -
IPL: రోహిత్ శర్మకు ఘోర అవమానం.. జట్టులోనూ చోటు కరువు!
IPL's greatest all-time team: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, టీమిండియా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనికి అరుదైన గౌరవడం దక్కింది. ఇండియన ప్రీమియర్ లీగ్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టీమ్ కెప్టెన్‌గా మిస్టర్ కూల్ ఎంపికయ్యాడు. పదిహేను మంది సభ్యులతో కూడిన అత్యుత్తమ జట్టుకు నాయకుడిగా అవకాశం దక్కించుకున్నాడు. మాజీ క్రికెటర్లు వసీం అక్రం, డేల్ స్టెయిన్, మాథ్యూ హెడన్, టామ్ మూడీ తదితరులతో పాటు సుమారు 70 మంది జర్నలిస్టులతో కూడిన నిపుణుల బృందం ఈ జట్టును ప్రకటించింది. అంతాకలిసి నాయకుడిగా ధోనికే ఓటు వేయడం విశేషం. జట్టులో స్థానం సంపాదించింది వీళ్లే ఇక ఈ జట్టులో టాపార్డర్‌లో ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, టీమిండియా సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి, వెస్టిండీస్ పవర్‌హౌజ్ క్రిస్ గేల్‌లకు చోటు దక్కింది. అదే విధంగా మిడిలార్డర్లో సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, ధోని స్థానం సంపాదించారు. ఇక హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కీరన్ పొలార్డ్‌లు ఆల్‌రౌండర్ల జాబితాలో చోటు దక్కించుకోగా.. రషీద్ ఖాన్, సునిల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్ బౌలింగ్ దళ సభ్యులుగా ఎంపికయ్యారు. కాగా చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు విజేతగా నిలిపిన ఘనత ధోని సొంతం. ఇక విరాట్ కోహ్లి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు(7263) సాధించిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు వార్నర్(6397).. ఐపీఎల్ లీగ్ రన్స్కోరర్లలో విదేశీ బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక సురేశ్ రైనా మిస్టర్ ఐపీఎల్‌గా పేరుగాంచగా.. డివిలియర్స్ 151.68పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టిన ఘనత సొంతం చేసుకున్నాడు. అదే విధంగా.. ధోని 5 వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు అత్యధికంగా 133 విజయాలు సాధించిన కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. ఇక బౌలర్లలో చహల్ 187 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. పేసర్లు మలింగ, బుమ్రా ముంబై ఇండియన్స్ ఐదుసార్లు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. రోహిత్‌కు ఘోర అవమానం మరోవైపు.. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను అరంగేట్రంలో(2022)నే విజేతగా నిలిపి సత్తా చాటాడు. అయితే, ముంబై ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలు అందించిన సెంచరీ వీరుడు, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ జట్టు: మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, సురేశ్ రైనా, ఏబి డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, యజువేంద్ర చహల్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా. చదవండి: Mike Tyson: బీస్ట్‌లా విరుచుకుపడటమే తెలుసు.. 57 ఏళ్ల వయసులోనూ! -
రఫ్ఫాడించిన రసెల్.. వార్నర్ మెరుపులు వృధా
ఆస్ట్రేలియా పర్యటనను విండీస్ గెలుపుతో ముగించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పర్యాటక జట్టు చివరి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో విండీస్ ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీశారు. ఫలితంగా 37 పరుగుల తేడాతో విజయం సాధించి, క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకున్నారు. రఫ్ఫాడించిన రసెల్.. రెచ్చిపోయిన రూథర్‌ఫోర్డ్ తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ రసెల్ (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ (40 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) రఫ్ఫాడించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. వీరిద్దరితో పాటు రోస్టన్ ఛేజ్ (37), రోవ్‌మన్ పావెల్ (21) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. వార్నర్ మెరుపులు వృధా భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. వార్నర్ (49 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించడంతో విజయం దిశగా సాగింది. అయితే వార్నీ ఔట్ అయిన వెంటనే ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. ఆఖర్లో టిమ్ డేవిడ్ (19 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రెచ్చిపోయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత ఓవర్లలో ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో గత మ్యాచ్ సెంచరీ హీరో మ్యాక్స్‌వెల్ (12) సహా, హిట్టర్లు మిచ్ మార్ష్ (17), ఆరోన్ హార్డీ (16) విఫలమయ్యారు. ఈ సిరీస్‌లో తొలి రెండు టీ20లు ఆసీస్ గెలవగా.. చివరి మ్యాచ్‌లో విండీస్ విజయం సాధించింది. టీ20 సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య టెస్ట్, వన్డే సిరీస్‌లు జరిగాయి. టెస్ట్ సిరీస్ 1-1తో డ్రా కాగా.. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. -
అర్ధ శతకాల్లో సెంచరీ! వార్నర్ రికార్డు!
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో వార్నర్.. కరేబియన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో వార్నర్ కేవలం 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 36 బంతులు ఎదుర్కొన్న డేవిడ్ భాయ్ 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 70 పరుగులు చేశాడు. కాగా వార్నర్‌కు ఇది టీ20ల్లో 100వ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఓ అరుదైన ఘనతను వార్నర్ తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో వంద అర్ధశతకాల మార్క్‌ను అందుకున్న తొలి క్రికెటర్‌గా వార్నర్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఓవరాల్‌గా 367 టీ20లు ఆడిన వార్నర్ 100 హాఫ్ సెంచరీలను సాధించాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో వార్నర్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లి(91) ఉన్నాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో వార్నర్ మరో అరుదైన రికార్డును నమోదు చేశాడు. క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా వార్నర్ రికార్డులకెక్కాడు. అయితే ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన మూడో ప్లేయర్‌గా వార్నర్ నిలిచాడు. ఈ జాబితాలో డేవిడ్ కంటే ముందు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ ఉన్నాడు. చదవండి: 'ప్లీజ్.. నా కొడుకును జడేజాతో పోల్చవద్దు' -
వందో మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన వార్నర్.. తొలి టీ20 ఆసీస్‌దే
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో విండీస్ చివరివరకు అద్భుతంగా పోరాడింది. వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ఎంతటి భారీ స్కోర్లనైనా ఛేదిస్తుందని అనిపించింది. జట్టులో దాదాపుగా అందరూ బ్యాట్‌తో మెరుపులు మెరిపించగల సమర్ధులే. ఇంతటి విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉన్నా విండీస్ ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. కెరీర్లో వందో మ్యాచ్ ఆడుతున్న డేవిడ్ వార్నర్ (70) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోష్ ఇంగ్లిస్ (39), టిమ్ డేవిడ్ (37 నాటౌట్), వేడ్ (21) వేగంగా పరుగులు సాధించగా.. మిచెల్ మార్ష్ (16), మ్యాక్స్‌వెల్ (10), స్టోయినిస్ (9), అబాట్ (0) నిరాశపరిచారు. విండీస్ బౌలరల్లో రసెల్ 3 వికెట్లు, అల్జరీ జోసఫ్ 2, హోల్డర్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్.. నిర్ణీత ఓవర్లలో 202 పరుగులకు పరిమితమై (8 వికెట్లు కోల్పోయి) 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (53), జాన్సన్ చార్లెస్ (42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చివారు తుస్సుమనిపించడంతో విండీస్ చేతులెత్తేసింది. ఆఖర్లో జేసన్ హోల్డర్ (34 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడి విండీస్ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. పూరన్ (18), పావెల్ (14), హోప్ (16), రసెల్ (1), రూథర్‌ఫోర్డ్ (7), షెపర్డ్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జంపా 3, స్టోయినిస్ 2, బెహ్రెన్‌డార్ఫ్, మ్యాక్స్‌వెల్, అబాట్ తలో వికెట్ పడగొట్టారు. రెండో టీ20 ఫిబ్రవరి 11న అడిలైడ్‌లో జరుగనుంది. -
AUS VS WI 1st T20: వార్నర్ 'ట్రిపుల్ ‘సెంచరీ’
ఆస్ట్రేలియా వెటరన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో 100కు పైగా మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా, తొలి ఆస్ట్రేలియా ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (ఫిబ్రవరి 9) జరుగుతున్న తొలి మ్యాచ్ వార్నర్ టీ20 కెరీర్లో 100వది. ఇటీవలే వన్డే, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన 37 ఏళ్ల వార్నర్ ఇప్పటివరకు 112 టెస్ట్‌లు, 161 వన్డేలు, 100 టీ20లు ఆడాడు. వార్నర్‌కు ముందు ఈ ఘనత న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మాత్రమే సాధించారు. రాస్ టేలర్ 112 టెస్ట్‌లు, 236 వన్డేలు, 102 టీ20లు ఆడగా.. కోహ్లి 113 టెస్ట్‌లు, 292 వన్డేలు, 117 టీ20లు ఆడాడు. ఇదిలా ఉంటే, వార్నర్ తన 100వ టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆసీస్ భారీ స్కోర్ సాధించేందకు గట్టి పునాది వేశాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వార్నర్.. మొత్తంగా 36 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 70 పరుగులు చేసి అల్జరీ జోసఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వార్నర్ ఔటయ్యాక ఆసీస్ వరసగా వికెట్లు కోల్పోవడంతో స్కోర్ వేగం మందగించింది. 17 ఓవర్ల తర్వత ఆ జట్టు స్కోర్ 173/5గా ఉంది. వార్నర్, జోష్ ఇంగ్లిస్ (39), మిచెల్ మార్ష్ (16), మ్యాక్స్‌వెల్ 10), స్టోయినిస్ (9) ఔట్ కాగా.. టిమ్ డేవిడ్ (18), మాథ్యూ వేడ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలరల్లో అల్జరీ జోసఫ్ 2, జేసన్ హోల్డర్, ఆండ్రీ రసెల్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. టెస్ట్ సిరీస్ 1-1తో సమం కాగా.. వన్డే సిరీస్‌ను ఆసీస్ క్లీన్‌స్వీప్ (3-0) చేసింది. రెండు, మూడు టీ20లు ఫిబ్రవరి 11, 13 తేదీల్లో అడిలైడ్, పెర్త్ వేదికలుగా జరుగనున్నాయి -
విధ్వంసం సృష్టించిన డేవిడ్ వార్నర్
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వెటరన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కెరీర్లో 100వ టీ20 ఆడుతున్న వార్నర్.. కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో మెరుపు హాఫ్ సెంచరీ బాది ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. వార్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో ఆసీస్ 9.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జోష్ ఇంగ్లిస్ 39 పరుగులు (5 ఫోర్లు, సిక్స్) చేసి ఔట్ కాగా.. వార్నర్ (57), మిచెల్ మార్ష్ (11) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లిస్ వికెట్ జేసన్ హోల్డర్‌కు దక్కింది. 10 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ 110/1గా ఉంది. కాగా, ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ కోవిడ్‌తో బాధపడుతున్నప్పటికీ ఈ మ్యాచ్ ఆడుతున్నాడు. కోవిడ్ నిర్ధారణ కావడంతో మార్ష్‌కు బదులు వార్నర్ టాస్కు వచ్చాడు. Mitchell Marsh is leading Australia but as he is COVID positive, David Warner came for the toss. pic.twitter.com/MBBgZ1z6RE — Johns. (@CricCrazyJohns) February 9, 2024 ఇదిలా ఉంటే, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. టెస్ట్ సిరీస్ 1-1తో సమం కాగా.. వన్డే సిరీస్‌ను ఆసీస్ క్లీన్‌స్వీప్ (3-0) చేసింది. రెండు, మూడు టీ20లు ఫిబ్రవరి 11, 13 తేదీల్లో అడిలైడ్, పెర్త్ వేదికలుగా జరుగనున్నాయి -
AUS vs NZ: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. డేవిడ్ వార్నర్‌కు ఛాన్స్
న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. స్వదేశంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్న ఆసీస్ సీనియర్ పేస్ ద్వయం మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ తిరిగి కివీస్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. అదే విధంగా ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వ్యవహరించనున్నాడు. మరోవైపు వన్డే, టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డేవిడ్ వార్నర్‌కు సైతం ఈ జట్టులో చోటు దక్కింది. టీ20 ప్రపంచకప్-2024 సన్నహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. వెల్లింగ్టన్ వేదికగా ఫిబ్రవరి 21న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక టీ20 సిరీస్ అనంతరం మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కూడా బ్లాక్ క్యాప్స్‌తో కంగారులు ఆడనున్నారు. కాగా ఆసీస్ జట్టు ప్రస్తుతం విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో ఆసీస్ సొంతం చేసుకుంది. కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా చదవండి: IND vs ENG: రెండో టెస్టులో ఓటమి.. దుబాయ్‌కు వెళ్లనున్న ఇంగ్లండ్ జట్టు? ఎందుకంటే? -
ఇలాగే ఉంటే ప్లంబర్ పనికి రావాలి.. మారి చూపించాడు! టెస్టుల్లో టీ20 ఇన్నింగ్స్‌తో..
సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం.. దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం తమ జట్టును ఎంపిక చేసేందుకు ఆస్ట్రేలియా సెలక్టర్లు కూర్చున్నారు. ఆ సమయంలో డేవిడ్ వార్నర్ అనే కుర్రాడి పేరు ప్రస్తావనకు వచ్చింది. అతను అప్పటికే రెండేళ్లుగా టి20ల్లో రాణిస్తూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆసీస్ సంప్రదాయం ప్రకారం దేశవాళీ క్రికెట్లో నాలుగు రోజుల ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడని ఆటగాళ్లను జాతీయ జట్టుకు ఎంపిక చేసే అవకాశం లేదు. టి20 ఫార్మాట్లో ఎంపిక చేసేందుకైనా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాలనేది గట్టి అభిప్రాయం. దీనిపై సెలక్టర్ల సమావేశంలో తీవ్ర చర్చ సాగింది. అతని దూకుడైన ఆటతో కొత్తగా ప్రయోగం చేయవచ్చని ఒక వాదన. అయితే అది ఫస్ట్‌క్లాస్ క్రికెట్ విలువను తగ్గిస్తుందనేది మరో వాదన. చివరకు మొదటి వాదనే నెగ్గింది. ఆసీస్ చరిత్రలో 1877 తర్వాత ఫస్ట్‌క్లాస్ స్థాయి క్రికెట్ ఆడకుండానే టీమ్‌లోకి ఎంపికైన తొలి ఆటగాడిగా వార్నర్ పేరుపొందాడు. అతనూ తన సత్తా చాటి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. టి20 శైలి దూకుడుతో టెస్టు క్రికెట్లో అనూహ్య ఫలితాలు సాధించి తర్వాతి ఏడేళ్ల పాటు ప్రపంచ క్రికెట్లో నంబర్‌వన్ టెస్టు బ్యాటర్‌గా నిలిచాడు. అంతే కాదు.. కెరీర్ ఆసాంతం మూడు ఫార్మాట్లలోనూ రికార్డులు కొల్లగొట్టిన అరుదైన ఆటగాళ్ళలో ఒకడిగా వార్నర్ తన పేరు రాసుకున్నాడు. ‘నువ్వు క్రికెట్‌ను ఇష్టపడ్డావని, బాగా ఆడతావని నాన్న నీకు అవకాశం కల్పించాడు. నువ్వు ఇలాగే ఉంటే ఆట అవసరం లేదు. నేను ప్లంబర్‌ను. నా పని ఎలా ఉంటుందో నీకు తెలుసు. నీ ప్రవర్తన మార్చుకోకపోతే నాతో పాటు పనికి వచ్చేయ్. నీకూ కొన్ని డబ్బులు వస్తాయి. ఇద్దరం కలసి ఇంటిని నడిపిద్దాం’ 20 ఏళ్ల డేవిడ్‌కు అతని అన్న స్టీవ్ హెచ్చరిక ఇది. చిన్నతనంలో వార్నర్‌కు క్రికెట్‌ను ఎంచుకోవడంలో ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఆటపై అతనికి మొదటనుంచీ ఆసక్తి ఉంది. అభ్యంతరాలు లేకుండా అతని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి అందులో చేర్పించారు. తగిన మార్గనిర్దేశనంతో సరైన శిక్షణ కూడా ఇప్పించారు. ప్రొఫెషనల్ క్రికెటర్ చేయాలనే వారి ఆలోచనకు తగినట్లుగా వార్నర్ సాధన చేశాడు. స్కూల్ స్థాయి క్రికెట్లో అపార ప్రతిభ కనబరచి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ పొందేందుకు వార్నర్ అవకాశం దక్కించుకున్నాడు. అయితే బ్రిస్బేన్‌లోని ఈ కేంద్రంలో క్రమశిక్షణ తప్పడంతో అకాడమీవాళ్లు అతడిని ఇంటికి పంపించేశారు. దాంతో అతని అన్న ఆ రకంగా క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది. అంతే.. ఆ తర్వాత డేవిడ్ ఏ తప్పూ చేయలేదు. ప్రత్యేక విజ్ఞప్తితో మళ్లీ అకాడమీలో చోటు దక్కించుకున్నాడు. మరో ఆలోచన లేకుండా తీవ్రంగా శ్రమించాడు. మూడేళ్లు తిరిగేసరికి ఏకంగా ఆస్ట్రేలియా టి20 జట్టులోకి ఎంపికై తనను తాను నిరూపించుకున్నాడు. వార్నర్ సోదరుడితో పాటు అతని తల్లిదండ్రులూ వార్నర్ తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసి ఆనందబాష్పాలు రాల్చారు. మెల్బోర్న్లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ పోరులో 43 బంతుల్లోనే 89 పరుగులు చేసిన వార్నర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌తోనే అతను తన రాకను ప్రపంచ క్రికెట్‌కు పరిచయం చేశాడు. వేగంగా దూసుకుపోయి.. క్రికెట్లోకి అడుగు పెట్టాక వార్నర్ ఏరోజూ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. స్కూల్, అండర్–13, అండర్–15, అండర్19.. ఇలా జూనియర్ స్థాయి క్రికెట్ నుంచే సంచలన ప్రదర్శనలు కనబరచిన అతను చాలా వేగంగా ఎదిగిపోయాడు. గ్రౌండ్ బయటకు బంతులను పంపించే భారీ షాట్లు, ప్రతీ అడుగులో దూకుడు, అద్భుతమైన ఫీల్డింగ్ వార్నర్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. నాలుగు రోజుల మ్యాచ్ అయినా, వన్డే అయినా, టి20లు అయినా ఒకటే ధాటి.. ఒకే తరహా మెరుపు ప్రదర్శన. సొంత జట్లు సిడ్నీ, న్యూసౌత్వేల్స్ల తరఫున అతను అన్ని రికార్డులు కొల్లగొడుతూ పోయాడు. అందుకే ఆస్ట్రేలియా జట్టులో అవకాశం కూడా తొందరగా వచ్చింది. పెర్త్‌లోని వాకా మైదానంలో భారత్‌పై టెస్టులో 69 బంతుల్లో చేసిన శతకం వార్నర్ స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే వైస్ కెప్టెన్సీ అవకాశం వచ్చి చేరింది. కెరీర్ ఆరంభంలో ఉడుకు రక్తంతో ఇంగ్లండ్ ఆటగాడు రూట్‌పై పబ్‌లో దాడి చేసినా.. అతని ప్రదర్శన ముందు ఆ ఘటన వెనక్కి వెళ్లిపోయి చెడ్డ పేరును తుడిచిపెట్టింది. వరుసగా ఏడేళ్ల పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న ఓపెనర్‌గా వార్నర్ కెరీర్ అద్భుతంగా సాగింది. పాతాళానికి పడేసిన క్షణం.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించరాదనేది సాధారణంగా ఆటగాళ్ల లక్షణం. కానీ ఏం చేసైనా, ఎలాగైనా ఆటలో గెలవాలనేది ఆస్ట్రేలియన్ల సూత్రం. ఎక్కువ సందర్భాల్లో ఇది బాగా పని చేసినా.. పరిధి దాటినప్పుడు అది సమస్యను తెచ్చి పెడుతుంది. 2018లో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్.. అంతకు ముందు మ్యాచ్‌లో ఆసీస్ ఓటమిపాలైంది. పైగా గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కీపర్ డి కాక్‌తో వ్యక్తిగత దూషణలతో వార్నర్ గొడవ పెట్టుకున్నాడు. ఆ కసి ఇంకా మనసులో ఉంది. దాంతో ఈ మ్యాచ్‌లో పైచేయి సాధించే ఆలోచనతో అతను చేసిన ప్రయత్నం కెరీర్‌ను దెబ్బ కొట్టింది. కెప్టెన్ స్మిత్, మరో ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌తో కలసి కుట్రకు వార్నర్ తెర లేపాడు. స్యాండ్ పేపర్‌తో బంతి ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేయడం అంతా బహిర్గతమైంది. దాంతో ఏడాది పాటు క్రికెట్ ఆడకుండా నిషేధంతో పాటు జీవితకాలం కెప్టెన్సీ ఇవ్వకుండా వేటు పడింది. దాంతో ఒక్కసారిగా అతను నైతికంగా కూడా నేలకూలాడు. తిరిగొచ్చి కొత్తగా.. సంవత్సర కాలపు నిషేధంలో వార్నర్ తనను తాను మార్చుకున్నాడు. ముందుగా ఎక్కువ సమయం కుటుంబంతో గడపడంతో పాటు ఆట కారణంగా కోల్పోయిన వ్యక్తిగత సంతోషాన్ని వెతుక్కున్నాడు. ఈ క్రమంలో కొత్త పరిచయాలు, స్నేహాలు అతడికి గుడ్ బాయ్ ఇమేజ్ను తీసుకొచ్చాయి. క్రికెటర్‌గా వార్నర్ ఘనమైన రికార్డు కారణంగా జట్టులో పునరాగమనానికి ఇబ్బంది కాలేదు. ఏడాది పూర్తి కాగానే మళ్లీ జట్టులోకి వచ్చేసిన అతను తిరిగి చెలరేగి తన విలువేంటో చూపించాడు. వన్డే వరల్డ్ కప్, యాషెస్ సిరీస్, సొంతగడ్డపై పాకిస్తాన్‌తో చేసిన ట్రిపుల్ సెంచరీతో వార్నర్ పరుగుల ప్రదర్శన జోరుగా కొనసాగింది. ఈసారి అన్నింటికంటే పెద్ద మార్పు మైదానంలో అతని ప్రవర్తనే. ఒక్కటంటే ఒక్క వివాదం రాకుండా జాగ్రత్తపడిన అతను గ్రౌండ్లో తన ఆట తప్ప మరొకటి పట్టించుకోలేదు. మాటల్లో దూకుడు, ప్రత్యర్థులపై స్లెడ్జింగ్ ఎక్కడా కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే తన కలుపుగోలుతనంతో అందరికీ ఇష్టుడయ్యాడు కూడా. వార్నర్‌ను మళ్లీ కెప్టెన్ చేసే చర్చలో భాగంగా అతడిని ట్యాంపరింగ్ వివాదంలో కుటుంబంతో సహా బహిరంగ విచారణకు హాజరు కావాలని ఆసీస్ బోర్డు సూచించింది. అయితే తన తప్పునకు తన కుటుంబాన్ని లాగడం అనవసరం అంటూ ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ తాను సాధించినదాంతో ఇలాగే బాగున్నానంటూ వార్నర్ దండం పెట్టేశాడు. ఐపీఎల్‌తో భారత అభిమానులకు చేరువై.. ఐపీఎల్ ఆరంభంలో ఢిల్లీ జట్టుకు ఆడిన వార్నర్ ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు వరుస విజయాలు అందించిన అతను 2016లో ఒంటిచేత్తో టీమ్‌ను ఐపీఎల్ విజేతగా కూడా నిలిపాడు. ఈ క్రమంలో తెలుగు పాటలు, డాన్స్‌లతో అతను మన అభిమానులకూ చేరువయ్యాడు. ఎంతగా అంటే వార్నర్ అంటే మనోడే అన్నంతగా హైదరాబాద్ ఫ్యాన్స్ అతడిని సొంతం చేసుకున్నారు. కరోనా టైమ్‌లో అతను తన ఇంట్లో తెలుగు సినిమా పాటలకు చేసిన డాన్స్‌లు, అతని అమ్మాయిలు కూడా అదే తరహాలో కనిపించడం విశేషంగా ఆకట్టున్నాయి. ఆ తర్వాత ఎప్పుడు మైదానంలోకి దిగినా ఈ వినోదాన్ని అందించడానికి అతను సిద్ధంగా ఉండేవాడు. ముఖ్యంగా పుష్ప తగ్గేదేలే సిగ్నేచర్ సైన్.. శ్రీవల్లి పాటకు డాన్స్ మైదానంలో రొటీన్ అయిపోయాయి. అల్లు అర్జున్ బుట్టబొమ్మ పాటకు కూడా అంతే ఉత్సాహంతో వార్నర్ డాన్స్ చేసి చూపించడం విశేషం. వివిధ కారణాలతో సన్‌రైజర్స్ టీమ్ వార్నర్‌ను కాదనుకున్నా.. తెలుగు ఫ్యాన్స్ మాత్రం ఇంకా అతడిని తమవాడిలాగే చూస్తున్నారనేదానికి ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన వరల్డ్ కప్ వామప్ మ్యాచ్‌లో అతనికి లభించిన ఆదరణే ఉదాహరణ. అన్నీ సాధించి.. టెస్టు, వన్డే క్రికెట్‌కు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ వచ్చే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ టి20ల నుంచి కూడా తప్పుకునే అవకాశం ఉంది. ప్రపంచ క్రికెట్లో ప్రతిష్ఠాత్మక విజయాలన్నింటిలో భాగమైన అతి అరుదైన ఆటగాడిగా వార్నర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు వన్డే వరల్డ్ కప్‌లు, ఒక టి20 వరల్డ్ కప్, టెస్టుల్లో వరల్డ్ కప్‌లాంటి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ గెలిచిన జట్లలో అతను సభ్యుడు. 2021.. టి20 వరల్డ్ కప్‌లో మెరుపు బ్యాటింగ్‌తో అతను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా కూడా నిలిచాడు. ఐపీఎల్ టైటిల్‌ను, అదీ కెప్టెన్‌గా సాధించిన ఘనత కూడా వార్నర్ సొంతం. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు వార్నర్ 111 టెస్టులు, 161 వన్డేలు, 99 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. -∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
హెలికాప్టర్లో నేరుగా గ్రౌండ్లో ల్యాండ్ అయిన వార్నర్..!
బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రైవేట్ హెలికాప్టర్లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ల్యాండ్ అయ్యాడు. సొదరుడి వివాహానికి హాజరైన వార్నర్.. అక్కడి నుంచి నేరుగా తాను ఆడబోయే మ్యాచ్‌కు వేదిక అయిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు హెలికాప్టర్లో చేరుకున్నాడు. Full journey of David Warner in Helicopter to SCG for Big Bash match. 🔥 - What an entry.....!!!!pic.twitter.com/TwTsQe9954 — Johns. (@CricCrazyJohns) January 12, 2024 సాధారణంగా ఏ క్రికెటర్‌కు కూడా ఇలాంటి అవకాశం లభించదు. వార్నర్ కోసం బిగ్‌బాష్ లీగ్ యాజమాన్యం ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేసింది. టెస్ట్, వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక వార్నర్ ఆడనున్న తొలి మ్యాచ్ కావడంతో అతడి గౌరవార్దం ఈ ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు సిడ్నీ థండర్స్ చీఫ్ ప్రకటించాడు. గత బీబీఎల్ సీజన్ సందర్భంగా వార్నర్ సిడ్నీ థండర్స్‌తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగానే అతను ఇవాళ (జనవరి 12) సిడ్నీ సిక్సర్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో ఆడనున్నాడు. David Warner has arrived at SCG in Helicopter for the Big Bash match. - The entertainer is here....!!!!pic.twitter.com/7knZ9BUX58 — Johns. (@CricCrazyJohns) January 12, 2024 కాగా, వార్నర్ కొద్ది రోజుల కిందట ఇదే సిడ్నీ మైదానంలోనే తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. చివరి టెస్ట్ ప్రారంభానికి ముందు వార్నర్ వన్డేల నుంచి కూడా వైదొలుగుతన్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం వార్నర్ ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు టీ20 ఫార్మాట్లో మాత్రమే అందుబాటులో ఉంటాడు. బిగ్‌బాష్ లీగ్ అనంతరం వార్నర్ యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ఆడతాడు. ఈ లీగ్ అతను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా వార్నర్ అంతర్జాతీయ టీ20ల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. త్వరలో విండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు సైతం అందుబాటులో ఉంటానని వార్నర్ ప్రకటించాడు. వార్నర్ బిగ్‌బాష్ లీగ్‌లో ఇప్పటివరకు కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇందులో అతను ఓ సెంచరీ (102) సాయంతో 201 పరుగులు చేశాడు. -
స్టీవ్ స్మిత్‌కు ప్రమోషన్
ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు ఆసీస్ టెస్ట్ జట్టు ఓపెనర్‌గా ప్రమోషన్ లభించింది. టెస్ట్‌ల నుంచి వార్నర్ రిటైర్ కావడంతో ఆసీస్ ఓపెనర్ స్థానాన్ని స్టీవ్ స్మిత్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని ఆసీస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ధృవీకరించాడు. స్వదేశంలో విండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసిన బెయిలీ.. ఇదే సందర్భంగా స్మిత్ న్యూ ఇన్నింగ్స్‌పై (ఓపెనర్) ప్రకటన చేశాడు. వార్నర్ రిటైర్మెంట్ ప్రకటన అనంతరం స్మిత్ టెస్ట్ ఓపెనింగ్ స్థానంపై తన ఇష్టాన్ని స్వయంగా వెల్లడించాడు. దీన్ని పరిగణలోకి తీసుకునే ఆసీస్ సెలెక్టర్లు స్మిత్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చారు. మరోవైపు విండీస్‌తో సిరీస్‌కు రెగ్యులర్ ఓపెనర్ మ్యాట్ రెన్షాను కూడా ఎంపిక చేసిన సెలెక్టర్లు, అతన్ని ఏ స్థానంలో బరిలోకి దించుతారో వేచి చూడాలి. లెగ్ స్పిన్ బౌలర్‌గా మొదలైన ప్రస్తానం.. టెస్ట్‌ల్లో స్టీవ్ స్మిత్ ప్రస్తానం రకరకాల మలుపులు తిరుగూ సాగింది. లెగ్ స్పిన్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించిన స్మిత్.. దినదినాభివృద్ది చెందుతూ ఆసీస్ అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన స్మిత్్.. ఇప్పుడు ఓపెనర్‌గా ప్రమోషన్ పొందాడు. వన్డే జట్టు కెప్టెన్‌గానూ.. ఆసీస్ సెలెక్టర్లు విండీస్‌తో టెస్ట్ సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌కు కూడా ఆసీస్ జట్టును ప్రకటించారు. ఈ సిరీస్ కోసం రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు.. స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించారు. వన్డే సిరీస్‌కు కమిన్స్‌తో పాటు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌లకు విశ్రాంతినిచ్చారు. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, మాట్ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, కెమరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, జై రిచర్డ్సన్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్.. తొలి టెస్ట్: జనవరి 17-21 (అడిలైడ్) రెండో టెస్ట్: జనవరి 25-29 (బ్రిస్బేన్) తొలి వన్డే: ఫిబ్రవరి 2 (మెల్బోర్న్) రెండో వన్డే: ఫిబ్రవరి 4 (సిడ్నీ) మూడో వన్డే: ఫిబ్రవరి 6 (కాన్బెర్రా) తొలి టీ20: ఫిబ్రవరి 9 (హోబర్ట్) రెండో టీ20: ఫిబ్రవరి 11 (అడిలైడ్) మూడో టీ20: ఫిబ్రవరి 13 (పెర్త్) -
'అతడు ఓపెనర్‌గా వస్తే.. లారా 400 పరుగుల రికార్డు బద్దలవ్వాల్సిందే'
ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్లో స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ శకం ముగిసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌తో మూడో టెస్టు సిరీస్ అనంతరం తన 13 ఏళ్ల కెరీర్‌కు వార్నర్ ముగింపు పలికాడు. దీంతో టెస్టుల్లో డేవిడ్ వార్నర్ వారుసుడు ఎవరన్నది ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. అయితే టెస్టుల్లో ఆసీస్ ఓపెనర్‌గా వార్నర్ స్ధానాన్ని సీనియర్ స్టీవ్ స్మిత్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌ను స్టీవ్ స్మిత్‌నే ప్రారంభించాలని క్లార్క్ తెలిపాడు. కాగా వార్నర్ స్దానం కోసం మార్కస్ హారిస్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, మాట్ రెన్షా వంటి ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. "స్టీవ్ స్మిత్ ఓపెనర్‌గా రావాలని నేను కోరుకుంటున్నాను. అతడు ఓపెనర్‌గా వస్తే ఏడాదిలోనే టెస్టుల్లో నంబర్‌వన్ బ్యాటర్‌గా అవతరిస్తాడు. స్మిత్ అద్భుతమైన ఆటగాడు. మూడో స్దానంలో బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ఆటగాడు ఏ స్ధానంలో వచ్చినా మెరుగ్గా రాణించగలడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్ కూడా చాలా బాగుంటుంది. అతడు బంతిని చక్కగా గమనించి ఆడుతాడు. స్మిత్ కూడా ఓపెనర్ పాత్ర పోషించేందుకు సిద్దంగా ఉన్నాడని నేను భావిస్తున్నాను. అతడు ఓపెనర్‌గా వస్తే 12 నెలల్లోనే అత్యుత్తమ ఓపెనర్‌గా నిలుస్తాడు. అంతేకాకుండా బ్రియాన్ లారా 400 పరుగుల రికార్డును బద్దలు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. ఇప్పుడు కరేబియన్లతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు సిద్దమవుతోంది. జనవరి 17 నుంచి ఆడిలైడ్ వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: David Warner: వార్నర్ ‘గ్రేట్’ క్రికెటర్ కాదు.. ఆ జాబితాలో వాళ్లు ముగ్గురే: ఆసీస్ మాజీ కోచ్ -
వార్నర్ ‘గ్రేట్’ కాదు.. ఆ జాబితాలో వాళ్లు ముగ్గురే: ఆసీస్ మాజీ కోచ్
ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి ఆ జట్టు మాజీ కోచ్ జాన్ బుకానన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వార్నర్ మెరుగైన బ్యాటరేనని.. అయితే, అంత గొప్ప ఆటగాడేమీ కాదని అన్నాడు. ఆసీస్ గ్రేట్ అన్న జాబితాలో అతడికి చోటు దక్కే ప్రసక్తే లేదన్నాడు. కాగా ఆసీస్ ఓపెనర్‌గా ఎన్నో రికార్డులు సాధించిన వార్నర్ ఇటీవలే టెస్టు క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో సంప్రదాయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. వన్డేల నుంచి కూడా తప్పుకొంటున్నట్లు ప్రకటించిన అతడు ఇకపై టీ20లకు మాత్రమే పరిమితం కానున్నాడు. ఈ నేపథ్యంలో ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతున్న సందర్భంగా ఆసీస్ మాజీ కోచ్ జాన్ బుకానన్కు వార్నర్‌ను ‘గ్రేట్’ అనొచ్చా అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘లేదు.. నేనైతే అలా అనుకోవడం లేదు. తన కెరీర్ ఆసాంతం అతడు అద్భుతంగా ఆడాడు. వందకు పైగా టెస్టులు ఆడిన అనుభవం అతడికి ఉంది. 8 వేలకు పైగా పరుగులు సాధించాడు. 160కి పైగా వన్డేలు, 100 వరకు టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో అతడి బ్యాటింగ్ సగటు కూడా బాగానే ఉంది. స్ట్రైక్ రేటు కూడా బాగుంది. ప్రదర్శనపరంగా అతడు మెరుగైన స్థానంలో ఉన్నాడు. అయితే, ఒక క్రీడలో దిగ్గజాల గురించి చెప్పాల్సి వచ్చినపుడు నా వరకైతే ఆసీస్ తరఫున డాన్ బ్రాడ్‌మన్, గ్లెన్ మెగ్రాత్, షేన్ వార్న్ వంటి వాళ్లే గుర్తుకువస్తారు. నా దృష్టిలో వాళ్లు ముగ్గురే గ్రేట్ ప్లేయర్లు. మిగతా వాళ్లలో చాలా మంది వీరికి చేరువగా వచ్చిన గ్రేట్ కేటగిరీలో చోటు సంపాదించలేరు. వార్నర్ కూడా అంతే’’ అని బుకానన్ చెప్పుకొచ్చాడు. కాగా తన కెరీర్లో ఆఖరి సిరీస్‌లో వార్నర్ శతకం బాదాడు. ఇక పాక్‌తో జరిగిన ఆ సిరీస్‌లో ఆసీస్ 3-0తో వైట్‌వాష్ చేసింది. సొంతగడ్డపై పాకిస్తాన్‌పై వరుసగా పదిహేడవ విజయం నమోదు చేసింది. -
వార్నర్ గుడ్ బై
సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్తాన్ పరాజయం పరిపూర్ణమైంది. పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన పాక్ మూడో టెస్టులోనూ ఓటమిపాలైంది. శనివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌తో టెస్టు క్రికెట్‌నుంచి తప్పుకున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన సొంత మైదానంలో కుటుంబ సభ్యుల మధ్య విజయంతో వీడ్కోలు పలికాడు. ఓవర్‌నైట్ స్కోరు 68/7తో నాలుగో రోజు ఆట కొనసాగించిన పాకిస్తాన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 115 పరుగులకు ఆలౌటైంది. రిజ్వాన్ (28) కొద్ది సేపు పోరాడాడు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్ 4, లయన్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 130 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆ్రస్టేలియా 25.5 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. 2 వికెట్లు కోల్పోయి ఆ జట్టు 130 పరుగులు చేసింది. లబుషేన్ (62 నాటౌట్), డేవిడ్ వార్నర్ (57 నాటౌట్) అర్ధ సెంచరీ సాధించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 119 పరుగులు జత చేశారు. పాక్ పేసర్ ఆమిర్ జమాల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా...ఆసీస్ కెపె్టన్ ప్యాట్ కమిన్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఆ్రస్టేలియాపై పాక్ జట్టుకు టెస్టుల్లో ఇది వరుసగా 17వ ఓటమి కావడం విశేషం! 1999నుంచి ఇక్కడ ఆడిన అన్ని టెస్టుల్లోనూ ఆ జట్టు ఓడింది. తాజా గెలుపుతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ఆ్రస్టేలియా (56.25 పాయింట్ల శాతం)తో మళ్లీ అగ్రస్థానానికి చేరుకోగా, భారత్ (54.16 పాయింట్ల శాతం) రెండో స్థానానికి పడిపోయింది. టెస్టు నంబర్ 2020... వార్నర్ తొలి మ్యాచ్ ఇది. టి20 స్పెషలిస్ట్‌గా వెలుగులోకి వచ్చి ఆ తర్వాత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ టెస్టు ఓపెనర్లలో ఒకడిగా కెరీర్‌ను ముగించిన ఘనత వార్నర్ సొంతం. దేశవాళీలో దూకుడైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకొని ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడకుండానే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్‌గా వార్నర్ పరిచయమయ్యాడు. టి20 శైలితో టెస్టులు ఆడి వార్నర్ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. 8 వేలకు పైగా పరుగులు సాధించిన బ్యాటర్లను చూస్తే స్ట్రయిక్‌రేట్‌లో సెహా్వగ్ తర్వాత వార్నర్‌దే రెండో స్థానం. ఆ్రస్టేలియా తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసినవారిలో వార్నర్ ఐదో స్థానంలో నిలవగా, ఓపెనర్ల జాబితాలో అతనిదే అగ్రస్థానం కావడం విశేషం. 13 మంది వేర్వేరు భాగస్వాములతో కలిసి ఓపెనింగ్ చేసిన వార్నర్ తమ జట్టుకు శుభారంభం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. తన తొలి టెస్టునుంచి వరుసగా ఏడేళ్ల పాటు వార్నర్ బెస్ట్ ఓపెనర్‌గా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 2018లో వచ్చిన బాల్ టాంపరింగ్ వివాదం అతని కెరీర్లో పెద్ద మరక. అయితే ఏడాది నిషేధం తర్వాత పునరాగమనంలోనూ సత్తా చాటి తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పాకిస్తాన్‌పై చేసిన 335 పరుగులు ఆసీస్ తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. కెరీర్ చివర్లో వరుస వైఫల్యాలతో టీమ్‌లో చోటు దక్కించుకుంటాడో లేదో అనిపించినా...అతని సాధించిన ఘనతలను దృష్టిలో ఉంచుకొని ఆసీస్ బోర్డు వార్నర్ కోరిక ప్రకారం సొంత మైదానంలో రిటైర్మెంట్కు అవకాశం కల్పించింది. ఇప్పుడు విజయంతో ఘనంగా అతను టెస్టులకు వీడ్కోలు పలికాడు. టెస్టు కెరీర్: 112 మ్యాచ్‌లలో 44.59 సగటుతో 8786 పరుగులు – 26 సెంచరీలు, 37 అర్ధసెంచరీలు. -
కెరీర్లో చివరి మ్యాచ్.. కన్నీరు పెట్టుకున్న డేవిడ్ వార్నర్! వీడియో వైరల్
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన 13 ఏళ్ల సుదీర్ఘ టెస్టు కెరీర్‌కు ముగింపు పలికాడు. సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టు అనంతరం టెస్టు క్రికెట్ నుంచి వార్నర్ తప్పుకున్నాడు. తన ఫేర్వెల్ సిరీస్ తొలి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన వార్నర్.. తన కెరీర్ చివరి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో (75 బంతుల్లో 7 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీ సాధించాడు. ఆసీస్ విజయానికి చేరువైన సమయంలో పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ ఎల్బీగా వెనుదిరాడు. మైదానాన్ని వీడి వెళ్తున్న క్రమంలో పాకిస్తాన్ ఆటగాళ్లు వార్నర్‌ను అభినందించారు. అదే విధంగా స్టేడియంలోని ప్రేక్షకులు సైతం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన వార్నర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వార్నర్ కన్నీరు పెట్టుకున్నాడు. "విజయంతో నా కెరీర్‌ను ముగించాలనుకున్నాను. నా కల నిజమైంది. మేము 3-0తో విజయం సాధించాము. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు గత 2 ఏళ్ల నుంచి అద్బుతమైన క్రికెట్ ఆడుతోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విజయం, యాషెస్ సిరీస్ డ్రా, ప్రపంచ కప్ విజయాల్లో భాగమైనందుకు గర్వపడుతున్నాను. కొంత మంది లెజెండరీ క్రికెటర్లతో కలిసి ఆస్ట్రేలియా జట్టు తరపున ఆడే అవకాశం దక్కినందుకు అదృష్టంగా భావిస్తున్నానని"వార్నర్ పేర్కొన్నాడు. తన టెస్టు కెరీర్లో 111 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. 44. 59 సగటుతో 8695 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 26 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి. చదవండి: Ranji Trophy: చరిత్ర సృష్టించిన రాహుల్.. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ! రెండో ఆటగాడిగా David Warner got emotional and crying when he was giving his interview. An emotional moment for him🫶 pic.twitter.com/BhXAsl2PQj — CricGuru (@Cse1Das) January 6, 2024 -
ముగిసిన వార్నర్ శకం.. ఎన్నో అద్బుతాలు! అదొక్కటే మాయని మచ్చ?
ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్లో ఓ శకం ముగిసింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టులకు విడ్కోలు పలికాడు. పాకిస్తాన్‌తో మూడో టెస్టు అనంతరం రెడ్‌బాల్ క్రికెట్ నుంచి డేవిడ్ భాయ్ తప్పుకున్నాడు. నాలుగో రోజు ఆట సందర్భంగా వార్నర్ బ్యాటింగ్ వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది. పాకిస్తాన్ ఆటగాళ్ల సైతం వార్నర్‌కు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. ఇక మూడో టెస్టులో పాకిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. ఈ విజయంతో వార్నర్‌కు ఆసీస్ ఘనమైన విడ్కోలు పలికింది. తన చివరి టెస్టు ఇన్నింగ్స్‌ను వార్నర్ హాఫ్ సెంచరీతో ముగించాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 74 బంతులు ఎదుర్కొన్న వార్నర్.. 7 ఫోర్లతో 57 పరుగులు చేశాడు. కివీస్‌తో మొదలెట్టి పాక్‌తో ముగింపు.. 2011లో న్యూజిలాండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన వార్నర్.. 13 ఏళ్ల పాటు తన సేవలను ఆస్ట్రేలియా క్రికెట్‌కు అందించాడు. తన ఈ సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అద్భుతమైన విజయాల్లో డేవిడ్ భాయ్ భాగమయ్యాడు. ఓపెనర్‌గా ఎన్నో చిర్మసరణీయ విజయాలను కంగరూలకు అందించాడు. ఫార్మాట్ ఏదైనా వార్నర్ క్రీజులో ఉంటే ప్రత్యర్ధి బౌలర్లకు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. అటువంటి విధ్వంసకర ఆటగాడు తప్పుకోవడం నిజంగా క్రికెట్ ఆస్ట్రేలియాకు తీరని లోటు అనే చెప్పాలి. తన టెస్టు కెరీర్లో 111 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. 44. 59 సగటుతో 8695 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 26 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి. మాయని మచ్చలా.. అయితే వార్నర్‌కు తన అద్భుత కెరీర్లో బాల్‌టాంపరింగ్ వివాదం మాత్రం ఓ మాయని మచ్చలా మిగిలిపోయింది. ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు 2018 మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్ సమయంలో ఆసీస్ ఆటగాడు కామెరూన్ బ్యాన్‌క్రాఫ్ట్ సాండ్‌పేపర్‌తో బంతిని రుద్దుతూ కెమెరా కంట పడ్డాడు. బాల్ ట్యాంపరింగ్ చేసి బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించిన అతడిపై విచారణ జరపగా.. అందులో వార్నర్ హస్తం ఉందని తేలింది. దాంతో వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా రెండేళ్ల పాటు నిషేదం విధించింది. తర్వాత అతడిపై బ్యాన్ ఎత్తివేసినప్పటికీ.. ఆ వివాదం ఓ పీడకలలా మిగిలిపోయింది. కాగా వార్నర్ టెస్టులతో పాటు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై టీ20ల్లో మాత్రమే వార్నర్ ఆడనున్నాడు. చదవండి: AUS vs PAK 3rd Test: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఆసీస్.. సిరీస్ క్లీన్‌స్వీప్ One final time.#AUSvPAK pic.twitter.com/gbD9Fv28h8 — cricket.com.au (@cricketcomau) January 6, 2024 -
పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఆసీస్.. సిరీస్ క్లీన్‌స్వీప్
సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో ఆసీస్ క్లీన్‌స్వీప్ చేసింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తన టెస్టు కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన డేవిడ్ వార్నర్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 74 బంతులు ఎదుర్కొన్న వార్నర్.. 7 ఫోర్లతో 57 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్నస్ లబుషేన్(62) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక 68/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన పాకిస్తాన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 115 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 14 పరుగుల అధిక్యాన్ని కలుపుకుని ఆసీస్ ముందు 130 పరుగుల లక్ష్యాన్ని పాక్ నిలిపింది. ఆసీస్ బౌలర్లలో హాజిల్ వుడ్ 4 వికెట్లతో పాక్‌ను దెబ్బతీయగా.. లయోన్ 3 వికెట్లు, స్టార్క్, కమ్మిన్స్, హెడ్ తలా వికెట్ సాధించారు. కాగా అంతకముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో లబుషేన్(60) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లబుషేన్‌తో పాటు మిచెల్ మార్ష్(54), ఖావాజా(47) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో అమీర్ జమీల్ 6 వికెట్లతో సత్తాచాటాడు. కాగా పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌటైంది. -
Aus Vs Pak: ఈజీ క్యాచ్ వదిలేశాడు.. తలపట్టుకున్న బాబర్! వీడియో
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ ఫీల్డింగ్ తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్‌లలో సులువైన క్యాచ్‌లు వదిలేసి పాక్ భారీ మూల్యం చెల్లించిన విషయం తెలిసిందే. పెర్త్ టెస్టులో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను పాకిస్తాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ జారవిడిచాడు. అదే విధంగా.. మెల్బోర్న్లో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ డేవిడ్ వార్నర్ క్యాచ్‌ను వదిలేశాడు. ఇలా కీలక సమయాల్లో ఇద్దరు స్టార్ ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపే ఛాన్స్ మిస్ చేసుకున్న పాకిస్తాన్.. ఆయా మ్యాచ్‌లలో 360, 79 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా సిరీస్ కోల్పోవడమే గాకుండా కంగారూ గడ్డపై వరుసగా 16 టెస్టుల్లో ఓడి తమ చెత్త రికార్డును మరింత పదిలం చేసుకుంది. ఈ నేపథ్యంలో సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన షాన్ మసూద్ బృందం తొలుత బ్యాటింగ్ చేసి.. 313 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో మొదటిరోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో 6/0తో రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్‌ను ఆరంభంలోనే దెబ్బకొట్టే ఛాన్స్ పాకిస్తాన్‌కు వచ్చింది. గురువారం నాటి ఆటలో పద్నాలుగో ఓవర్ రెండో బంతికి ఆమిర్ జమాల్ బౌలింగ్‌లో వార్నర్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను సయీమ్ ఆయుబ్ మిస్ చేశాడు. వార్నర్ బంతిని గాల్లోకి లేపగా ఫస్ట్‌స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆయుబ్.. బాల్‌ను రెండు చేతులతో ఒడిసిపట్టినట్టే పట్టి జారవిడిచేశాడు. దీంతో పక్కనే ఉన్న బాబర్ ఆజం తీవ్ర అసహనానికి గురయ్యాడు. సులువైన క్యాచ్ వదిలేయడంతో లైఫ్ పొందిన వార్నర్ మరోసారి ప్రమాదకారిగా మారుతాడేమోనన్న భయంతో తలపట్టుకుని కూర్చున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో వార్నర్ క్యాచ్ మిస్ చేసిన పాక్ అరంగేట్ర బ్యాటర్ సయీమ్ ఆయుబ్‌పై సొంత జట్టు అభిమానులే ఫైర్ అవుతున్నారు. బ్యాటర్‌గా విఫలమయ్యావు.. ఫీల్డింగ్ చేయడం కూడా రాదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా సిడ్నీ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆయుబ్.. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. ఆయుబ్ క్యాచ్ చేసే సమయానికి వార్నర్ 20 పరుగులతో ఆడుతున్నాడు. అయితే, 24.3వ ఓవర్ వద్ద ఆగా సల్మాన్ బౌలింగ్‌లో బాబర్ ఆజంకు క్యాచ్ ఇచ్చి వార్నర్(34) వెనుదిరిగాడు. చదవండి: Ind Vs SA 2nd Test: రెండో టెస్టులో విజయం భారత్‌దే.. ఎందుకంటే?: టీమిండియా దిగ్గజం It's happened again! 😲 David Warner gets a life courtesy of the debutant Saim Ayub #AUSvPAK pic.twitter.com/VAr7bBis6L — cricket.com.au (@cricketcomau) January 4, 2024 -
వర్షం కారణంగా అర్ధంతరంగా ముగిసిన రెండో రోజు ఆట
Australia vs Pakistan, 3rd Test Day 2: ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. వాన కారణంగా రెండో రోజు కేవలం 46 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆసీస్ పేసర్ల దెబ్బకు టాపార్డర్ కుదేలైంది. ఓపెనర్లు షఫీక్ (0), అయూబ్ (0) డకౌట్ కాగా, కెప్టెన్ షాన్ మసూద్ (35; 3 ఫోర్లు), బాబర్ ఆజమ్ (26; 4 ఫోర్లు) కొద్దిగా పోరాడారు. ఒక దశలో స్కోరు 96/5కి చేరింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్న వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (88), ఆగా సల్మాన్ (53) సల్మాన్ ఆరో వికెట్‌కు 94 పరుగులు జోడించారు. మిగతా వాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో పాక్ ఇక సులువుగానే తలవంచుతుందని ఆసీస్ భావించింది. కానీ పేస్ ఆల్‌రౌండర్ ఆమిర్ జమాల్ (97 బంతుల్లో 82; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) బ్యాటింగ్‌లో వీరోచిత పోరాటం చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా పాకిస్తాన్ మెరుగైన స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 77.1 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు అత్యధికంగా ఐదు వికెట్లు దక్కగా.. స్టార్క్ రెండు, మిచెల్ మార్ష్, నాథన్ లియాన్ ఒక్కో వికెట్ తీశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆట నిలిచే సమయానికి 6/0(2) స్కోరు చేసింది. ఈ క్రమంలో గురువారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్ 24.3 ఓవర్ వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్(34) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అయితే, అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. కానీ అర్ధ శతకానికి మూడు పరుగుల దూరంలో ఉన్న ఖవాజా(47)ను ఆమిర్ జమాల్ అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. స్టీవ్ స్మిత్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో 47వ ఓవర్ ముగిసే సరికి మొదలైన వర్షం తెరిపినివ్వలేదు. దీంతో అక్కడితో ఆటను ముగించేశారు. అప్పటికి లబుషేన్ 23, స్టీవ్ స్మిత్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఆగా సల్మాన్, ఆమిర్ జమాల్‌కు చెరో వికెట్ దక్కింది. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. ఇక సిడ్నీ వేదికగా ఇరు జట్ల మధ్య జరుగుతున్న నామమాత్రపు మూడో మ్యాచ్ డేవిడ్ వార్నర్ కెరీర్లో చివరి టెస్టు. చదవండి: Ind Vs SA: రెండో టెస్టులో విజయం భారత్‌దే.. ఎందుకంటే?: టీమిండియా దిగ్గజం -
ఆసీస్‌తో మూడో టెస్ట్.. పాక్ లోయర్ ఆర్డర్ అద్భుత పోరాటం
సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌటైంది. 96 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన దశ నుంచి పాక్ అద్భుతంగా తేరుకుంది. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు మొహమ్మద్ రిజ్వాన్ (88), అఘా సల్మాన్ (53), ఆమిర్ జమాల్ (82) వీరోచితంగా పోరాడి పాక్ పరువు కాపాడారు. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, సైమ్ అయూబ్ డకౌట్లు కాగా.. షాన్ మసూద్ (35), బాబర్ ఆజమ్ (26) కాసేపు ఆసీస్ బౌలర్లను నిలువరించారు. ఆతర్వాత స్వల్ప వ్యవధిలో వీరిద్దరితో పాటు సౌద్ షకీల్ (5) ఔట్ కావడంతో పాక్ కష్టాల్లో పడింది. ఈ దశలో రిజ్వాన్.. అఘా సల్మాన్, ఆమిర్ జమాల్ సహకారంతో పాక్‌కు ఫైటింగ్ టోటల్‌ను అందించాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆమిర్ జమాల్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ మరోసారి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో (5/61) చెలరేగి పాక్ వెన్నువిరచగా.. స్టార్క్ (2/75), హాజిల్‌వుడ్ (1/65), లయోన్ (1/74), మార్ష్ (1/27) మిగతా పనిని కానిచ్చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్న డేవిడ్ వార్నర్ 6, ఉస్మాన్ ఖ్వాజా 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. -
David Warner: ఆసీస్ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
తన చివరి టెస్ట్‌కు ముందు అతి మూల్యమైన వస్తువును పోగొట్టుకున్న వార్నర్
తన కెరీర్లో చివరి టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అతి మూల్యమైన వస్తువును పోగొట్టుకున్నాడు. వార్నర్ తన కెరీర్లో మెజార్టీ శాతం ధరించిన బ్యాగీ గ్రీన్ (క్యాప్) కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఆస్ట్రేలియన్‌గా తనకు బ్యాగీ గ్రీన్ అతి మూల్యమైన వస్తువని, ఎవరైనా దాన్ని తీసి ఉంటే తిరిగి ఇచ్చేయాలని సోషల్‌మీడియా వేదికగా విజ్ఞప్తి చేశాడు. పాకిస్తాన్‌తో మూడో టెస్ట్‌కు ముందు మెల్బోర్న్ నుంచి సిడ్నీకి ప్రయాణిస్తున్న సమయంలో తన బ్యాగీ గ్రీన్ మిస్ అయినట్లు అనుమానిస్తున్నాడు. ఈ విషయమై అతను ఎయిర్పోర్ట్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల్లో వార్నర్ బ్యాగీ గ్రీన్ దొంగిలించబడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఎయిర్పోర్ట్ అధికారులు వివరణ ఇచ్చారు. తనకు ఎంతో ప్రత్యేకమైన క్యాప్ కనపడకపోవడంతో వార్నర్ తెగ బాధపడిపోతున్నాడు. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) సోషల్‌మీడియా వేదికగా తన బాధను పంచుకున్నాడు. నా కెరీర్లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడే ముందు బ్యాగీ గ్రీన్‌ను మిస్ అయ్యాను. దయచేసి ఎవరికైనా అది దొరికి ఉంటే తిరిగి ఇచ్చేయండని విజ్ఞప్తి చేశాడు. ఇందుకు ప్రతిగా ఎదైనా ఇచ్చేందుకు కూడా తాను సిద్దమేనని అభ్యర్ధించాడు. క్యాప్‌ను తిరిగి ఇచ్చే వారిపై ఎలాంటి కంప్లైంట్ కూడా ఇవ్వనని హామీ ఇచ్చాడు. బ్యాగీ గ్రీన్ దొరికిన వారు తనను సోషల్‌మీడియా ద్వారా సంప్రదించవచ్చని లేదా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధులతోనైనా మాట్లాడవచ్చని మెసేజ్ పాస్ చేశాడు. కాగా, వార్నర్ తన 111 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో ఎక్కువ శాతం మ్యాచ్‌లు ఇప్పుడు పోగొట్టుకున్న బ్యాగీ గ్రీన్‌తోనే ఆడాడట. ఈ క్యాప్ వార్నర్‌కు చాలా కలిసొచ్చిందిగా చెబుతారు. మెల్బోర్న్ నుంచి సిడ్నీకి ప్రయాణిస్తున్న సమయంలో తన రెండు బ్యాగీ గ్రీన్‌లతో కూడిన లగేజ్ చోరీకి గురైందని వార్నర్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ కూడా స్పందించడం విశేషం. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ విషయమై ప్రత్యేక చొరవ తీసుకుని, వార్నర్ పోగొట్టుకున్న బ్యాగీ గ్రీన్‌ను వెతికపెట్టాలని మసూద్ కోరాడు. ఇందుకోసం దేశవ్యాప్తంగా శోధన జరగాలని పిలుపునిచ్చాడు. అవసరమైతే డిటెక్టివ్‌ల సాయం కూడా తీసుకోవాలని సూచించాడు. ఆస్ట్రేలియన్ క్రికెట్‌కు వార్నర్ గొప్ప ప్రతినిధి అని, అలాంటి వ్యక్తికి చెందిన అతి మూల్యమైన వస్తువు పోతే ప్రభుత్వం స్పందించాల్సిందేనని డిమాండ్ చేశాడు. -
Aus Vs Pak: వార్నర్ ఫేర్వెల్ టెస్టు.. ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన
Australia vs Pakistan, 3rd Test: సొంతగడ్డపై పాకిస్తాన్‌తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టును ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్‌లలో ఆడిన జట్టుతోనే ఆఖరి టెస్టులో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ మంగళవారం ధ్రువీకరించాడు. స్వదేశంలో పాకిస్తాన్‌పై టెస్టుల్లో రెండు దశాబ్దాలకు పైగా ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ ఆసీస్ మరోసారి సిరీస్ గెలిచిన విషయం తెలిసిందే. పెర్త్ టెస్టులో పర్యాటక పాక్‌ను 360 పరుగుల తేడాతో చిత్తు చేసిన కంగారూ జట్టు.. బాక్సింగ్ డే టెస్టులోనూ విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. వార్నర్ ఫేర్వెల్ టెస్టు ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టెస్టు జరుగనుంది. ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో బుధవారం (జనవరి 3) నుంచి ఐదు రోజుల మ్యాచ్ మొదలు కానుంది. ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెగ్రాత్ సతీమణి జ్ఞాపకార్థం పింక్ టెస్టుగా నిర్వహించనున్న ఈ మ్యాచ్ సందర్భంగా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడనున్నాడు. తన రెగ్యులర్ జోడీ ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్ తమ స్థానాలు నిలబెట్టుకోగా.. నెట్స్‌లో శ్రమిస్తున్న ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. మరో ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ సూపర్ ఫామ్‌లో ఉన్న కారణంగా గ్రీన్‌ను పక్కనపెట్టక తప్పలేదు. 👀 #AUSvPAK https://t.co/YcZvY1CYlM — cricket.com.au (@cricketcomau) January 1, 2024 ‘పింక్’ టెస్టులో గెలుపు ఎవరిది? ఇక బౌలింగ్ దళంలో పేస్ త్రయం ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌తో పాటు స్పిన్నర్ నాథన్ లియోన్ ఉండగా.. అలెక్స్ క్యారీ వికెట్ కీపర్‌గా కొనసాగనున్నాడు. కాగా ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ గ్లెన్ మెగ్రాత్ భార్య జేన్ మెగ్రాత్ రొమ్ము క్యాన్సర్‌తో మరణించింది. ఈ నేపథ్యంలో.. క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు వీలుగా.. సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఆమె జ్ఞాపకార్థం మెగ్రాత్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా ప్రతి ఏడాది ఆసీస్ ఆడే టెస్టుల్లో ఒక మ్యాచ్‌ను పింక్ టెస్టుగా నిర్వహిస్తూ ఫండ్‌రైజింగ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. పాకిస్తాన్‌తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియోన్, జోష్ హాజిల్‌వుడ్. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ -
నన్ను భయపెట్టిన బౌలర్ అతడే.. చాలా డేంజరస్: డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. జనవరి 3 నుంచి పాకిస్తాన్‌తో జరగనున్న మూడో టెస్టు అనంతరం సంప్రదాయక్రికెట్కు డేవిడ్ భాయ్ విడ్కోలు పలకనున్నాడు. టెస్టులతో పాటు వన్డేలకు వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. అయితే తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్‌కు తన టెస్టు కెరీర్లో ఎదు అత్యంత కఠినమైన బౌలర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. అందుకు బదలుగా వార్నర్ ఏమి ఆలోచించకుండా దక్షిణాఫ్రికా లెజెండ్ డేల్ స్టేయిన్ పేరును చెప్పుకొచ్చాడు. 'నా టెస్టు కెరీర్లో నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ డేల్ స్టేయిన్. 2016-2017లో గబ్బా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు ఇప్పటికి నాకు గుర్తుంది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ సెషన్లో డేల్ స్టేయిన్ నిప్పలు చేరిగాడు. బౌన్సర్లతో నన్ను షాన్ మార్ష్‌ను భయపెట్టాడు. 45 నిమిషాల సెషన్ అయితే మాకు చుక్కలు చూపించింది. షాన్ నా దగ్గరకు వచ్చి అతడి బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొవాలో నాకు అర్ధ కావడం లేదని చెప్పాడు. కనీసం పుల్ షాట్ ఆడాదామన్న కూడా అవకాశం లేదు. చాలా ఓవర్ల పాటు కనీసం బంతిని కూడా టచ్ చేయలేకపోయాను. ఓ బంతి ఏకంగా నా భుజానికి వచ్చి తాకింది. నొప్పితో విల్లాలాడాను. స్టేయిన్ ఎడమచేతి వాటం బ్యాటర్లకు అద్బుతంగా బౌలింగ్ చేస్తాడు. అతడు బౌలింగ్ చేస్తే ప్రతీ బ్యాటర్‌కు కొంచెం భయం కచ్చితంగా ఉంటుందని' వార్నర్ పేర్కొన్నాడు. కాగా వరల్డ్ క్రికెట్ చరిత్రలో స్పీడ్‌గన్ స్టేయిన్ తన పేరును సువర్ణఅక్షరాలతో లిఖించుకున్నాడు. దక్షిణాఫ్రికా తరపున టెస్టులలో 439 వికెట్లు, వన్డేలలో 196 వికెట్లు, టీ20లలో 64 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ -
డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్.. మార్ష్‌కు ప్రమోషన్! ఏకంగా రూ.6 కోట్లు
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అదరగొడుతున్నాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కూడా మార్ష్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో మార్ష్‌కు ప్రమోషన్ ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2024 ఏడాది గాను మార్స్‌కు టాప్ సెంట్రాల్ కాంట్రక్ట్ ఇచ్చి భారీగా అతడి జీతాన్ని పెంచాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. మార్ష్ ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో మిడిల్ టైర్లో ఉన్నాడు. అయితే టాప్ టైర్లో ఉన్న ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులకోవడంతో.. మార్ష్ ప్రమోషన్ దాదాపు ఖాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ అతడు టాప్ టైర్ కాంట్రాక్ట్‌కు ప్రమోషన్ పొందితే.. అతడు 5 లక్షల యూఎస్ డాలర్ల నుంచి 8 లక్షల యూఎస్ డాలర్ల వరకు వార్షిక వేతనం పొందే అవకాశముంది. అంటే భారత కరెన్సీలో సూమారు రూ. 4 కోట్ల నుంచి 7 కోట్ల వరకు అందనుంది. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అత్యధిక వేతనాన్ని పొందుతున్నాడు. అతడికి జీతం రూపంలో క్రికెట్ ఆస్ట్రేలియా 2 మిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో రూ.16 కోట్లు) చెల్లిస్తోంది. -
Australian cricketer: వన్డేలకు వార్నర్ గుడ్‌బై
ఆ్రస్టేలియా డాషింగ్ ఓపెనర్ వార్నర్ వన్డే ఫార్మాట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్యాటింగ్‌లో మెరుపులు, నోటితో తూటాలు పేల్చే అతను పలు వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచాడు. అతని ఖాతాలో సెంచరీలున్నట్లే కెరీర్లో సస్పెన్షన్లు, బాల్ టాంపరింగ్ మరకలూ ఉన్నాయి. ఇప్పుడా ఆట, దూకుడు ఇక మీదట టి20లకే పరిమితం కానున్నాయి. సిడ్నీ: డేవిడ్ వార్నర్ అంటే విజయవంతమైన ఓపెనరే కాదు... వివాదాస్పద క్రికెటర్ కూడా! బ్యాట్‌తో బాదడం ఎంత బాగా తెలుసో... ‘సై అంటే సై’ అని నోటికి పని చెప్పడం కూడా తెలిసినోడు. విధ్వంసకర బ్యాటర్‌గా ఎలా గుర్తుండిపోతాడో అంతే స్థాయిలో తెంపరితనం ఉన్న వ్యక్తిగానూ ముద్ర వేసుకున్నాడు. ఇక మన తెలుగు ప్రేక్షకులకైతే సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఇప్పుడు లేడు)తో బాగా కనెక్టయ్యాడు. తెలుగు హీరోల మేనరిజాన్ని, పాటలకు నప్పే స్టెప్పులతో సోషల్ మీడియాలో వినోదం పంచిన ఈ ఆస్ట్రేలియన్ తాజాగా వన్డే క్రికెట్‌కు సైతం వీడ్కోలు పలికేశాడు. పాకిస్తాన్‌తో స్వదేశంలో ఆఖరి టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్న వేళ వన్డేలపై నిర్ణయాన్ని ప్రకటించాడు. సిడ్నీలో 3 నుంచి జరిగే మూడో టెస్టు అనంతరం అతను కేవలం అంతర్జాతీయ క్రికెట్లో టి20 ఫార్మాట్లోనే కొనసాగుతాడు. సోమవారం మీడియా సమావేశంలో 37 ఏళ్ల వార్నర్ మాట్లాడుతూ ‘భారత్‌లో జరిగిన ప్రపంచకప్ సమయంలోనే రిటైర్మెంట్ గురించి చెప్పాను. విశ్వవిజేత జట్టు సభ్యుడిగా ఎంతో సంతృప్తికరమైన వన్డే కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నాను. దీనివల్ల నేను ఫ్రాంచైజీ టి20 లీగ్‌ను మరింత శ్రద్దపెట్టి ఆడేందుకు వీలవుతుంది. ఈ ఫార్మాట్లో అంతర్జాతీయ కెరీర్‌నూ కొనసాగిస్తాను. అయితే 2025లో చాంపియన్స్ ట్రోఫీ నాటికి ఫామ్‌లో ఉంటే, జట్టుకు అవసరమనిపిస్తే అందుబాటులో ఉంటాను’ అని అన్నాడు. సఫారీతో అరంగేట్రం దక్షిణాఫ్రికాతో 2009 జనవరిలో జరిగిన టి20 మ్యాచ్‌తో 22 ఏళ్ల వార్నర్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదే నెల అదే ప్రత్యర్థితోనే తొలి వన్డే కూడా ఆడాడు. 15 ఏళ్ల కెరీర్లో 99 టి20 మ్యాచ్‌ల్లో 2894 పరుగులు చేశాడు. ఒక సెంచరీతోపాటు 24 ఫిఫ్టీలు అతని ఖాతాలో ఉన్నాయి. 161 వన్డేలాడిన వార్నర్ 45.30 సగటుతో 6932 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 33 అర్ధసెంచరీలున్నాయి. 111 టెస్టుల్లో 44.58 సగటుతో 8695 పరుగులు చేశాడు. 26 శతకాలు, 36 అర్ధశతకాలు బాదాడు. ఇవీ విజయాలు ► మరకలు పక్కనబెట్టి కేవలం క్రికెట్‌నే పరిగణిస్తే మాత్రం వార్నర్ పరిపూర్ణ సాఫల్య క్రికెటర్ అని చెప్పొచ్చు. ఆ్రస్టేలియా సాధించిన 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లలో అతను కీలకపాత్ర పోషించాడు. 2021 టి20 వరల్డ్‌కప్ విజయంలో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. 2023 ఐసీసీ టెస్టు చాంపియన్íÙప్ విజేత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. ఇవీ వివాదాలు ► 2013 చాంపియన్స్ ట్రోఫీ సమయంలో జో రూట్ తో వాగ్వాదానికి దిగడంతో క్రికెట్ ఆ్రస్టేలియా అతనిపై రెండు టెస్టుల నిషేధం విధించింది. దీంతో అతను ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్ని ఆడలేకపోయాడు. ► కేప్‌టౌన్ టెస్టులో బాల్ టాంపరింగ్ ఉదంతం వార్నర్ కెరీర్‌కే మాయని మచ్చ. దీంతో అతనితో పాటు, స్మిత్ (అప్పటి కెపె్టన్) ఏడాది పాటు నిషేధానికి గురయ్యారు. ఇవి చాలవన్నట్లు అదుపులేని నోటి దురుసుతనంతో జీవితకాలం సారథ్యం చేపట్టకుండా శిక్షకు గురయ్యాడు. -
వన్డే క్రికెట్లో వార్నర్ సాధించిన ఘనతలు ఇవే..!
టెస్ట్‌లతో పాటు వన్డే క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా సంచలన ప్రకటన చేసిన డేవిడ్ వార్నర్ 50 ఓవర్ల ఫార్మాట్‌పై తనదైన ముద్ర వేశాడనడంలో ఎలాంటి సందేహం లేదు. 37 ఏళ్ల వార్నర్ తన వన్డే కెరీర్లో మొత్తం 161 మ్యాచ్‌లు ఆడి 22 సెంచరీలు, 33 అర్దసెంచరీల సాయంతో 45.30 సగటున 6932 పరుగులు చేశాడు. వన్డేల్లో వార్నర్ అత్యధిక స్కోర్ 179గా ఉంది. వార్నర్ తన వన్డే కెరీర్లో దాదాపు 100 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు సాధించాడు. వన్డేల్లో వార్నర్ సాధించిన ఘనతలు.. 🏆2015 వరల్డ్ కప్ విజేత 🏆2023 వరల్డ్ కప్ విజేత వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్‌గా రెండో అత్యధిక పరుగులు వన్డేల్లో ఆస్ట్రేలియా తరపున రెండవ అత్యధిక సెంచరీలు వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు వన్డే ప్రపంచ కప్‌లలో ఆస్ట్రేలియా తరఫున రెండవ అత్యధిక పరుగులు 2015 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తరఫున సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్ 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా తరఫున లీడింగ్ రన్ స్కోరర్ 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా తరఫున లీడింగ్ రన్ స్కోరర్ వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున ఆరో అత్యధిక రన్ స్కోరర్ కాగా, టెస్ట్‌లతో పాటు వన్డే క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా స్పష్టం చేసిన డేవిడ్ వార్నర్.. అవసరమైతే ఈ ఫార్మాట్లో రీఎంట్రీ ఇస్తానని ఆసక్తికర స్టేట్మెంట్ ఇచ్చాడు. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనుండగా.. అప్పటికి తాను ఫామ్‌లో ఉండి, జట్టు తన సేవలు అవసరమనుకుంటే తిరిగి బరిలోకి దిగుతానని తెలిపాడు. వార్నర్ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌తో మూడో టెస్ట్ సుదీర్ఘ ఫార్మాట్లో తనకు చివరి టెస్ట్ అని వార్నర్ స్పష్టం చేశాడు. టెస్ట్‌లతో పాటు వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 ఫ్రాంచైజీ అయిన దుబాయ్ క్యాపిటల్స్ వార్నర్‌ను తమ జట్టు కెప్టెన్‌గా ప్రకటించింది. దుబాయ్ క్యాపిటల్స్ విండీస్ ఆటగాడు రోవ్‌మన్ పావెల్ స్థానంలో వార్నర్‌కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పింది. వార్నర్ ఐపీఎల్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ సభ్యుడిగా ఉన్నాడు. గత సీజన్లో అతను పంత్ గైర్హాజరీలో డీసీ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. దుబాయ్ క్యాపిటల్స్.. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అనుబంధ ప్రాంచైజీ అన్న విషయం తెలిసిందే. -
ILT20 2024: దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వార్నర్
International League T20: ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2024లో భాగం కానున్నాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ అనుబంధ జట్టు దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అతడు నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని క్యాపిటల్స్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కెప్టెన్ మార్వెల్ అంటూ వార్నర్ ఆగమాన్ని తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేసింది. కాగా టీమిండియా స్టార్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో ఐపీఎల్-2023లో వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. గతేడాది సీజన్లో మొత్తంగా 14 మ్యాచ్‌లలో కలిపి 516 పరుగులు సాధించిన వార్నర్.. ఆటగాడిగా సఫలమైనా.. కెప్టెన్‌గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. అతడి కెప్టెన్సీలో ఢిల్లీ పద్నాలుగింట కేవలం ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రోవ్‌మన్ పావెల్ స్థానంలో వార్నర్ అయినప్పటికీ వార్నర్ నాయకత్వ పటిమపై నమ్మకం ఉంచిన క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఈసారి ఐఎల్టీ20 లీగ్‌లో అతడిని తమ సారథిగా ఎంచుకుంది. ఇక దుబాయ్ క్యాపిటల్స్‌కు తొలి ఎడిషన్(2023)లో వెస్టిండీస్ స్టార్ రోవ్‌మన్ పావెల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. పది మ్యాచ్‌లలో నాలుగు గెలిపించి ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు. ప్రస్తుత సీజన్ కోసం 37 ఏళ్ల వార్నర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. కాగా జనవరి 13 నుంచి ఐఎల్టీ20 -2024 ఎడిషన్ ఆరంభం కానుంది. కాగా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను టైటిల్ విజేతగా నిలిపిన ఘనత కలిగిన వార్నర్‌కు టీ20లలో బ్యాటర్‌గానూ మంచి రికార్డు ఉంది. అంతర్జాతీయ వన్డేలకూ రిటైర్మెంట్ పొట్టి ఫార్మాట్లో ఇప్పటి వరకు మొత్తంగా 356 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండర్.. 11695 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాను టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలపడంలో అతడిది కీలక పాత్ర. ఇదిలా ఉంటే.. తన కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ టెస్టు సిరీస్ ఆడుతున్న వార్నర్.. తాజాగా వన్డే క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. దుబాయ్ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఆండ్రూ టై, దసున్ షనక, దుష్మంత చమీర, జో రూట్, మార్క్ వుడ్, మాక్స్ హోల్డెన్, మొహమ్మద్ మొహ్సిన్, నువాన్ తుషార, రహ్మనుల్లా గుర్బాజ్, రజా ఆకిఫ్, రోవ్‌మన్ పావెల్, రోలోఫ్ వాన్‌డెర్ మెర్వే, సదీర సమరవిక్రమ, సామ్ బిల్లింగ్స్, సికిందర్ రజా. చదవండి: 2024 ఏడాదిలో టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఈ సారైనా కల నెరవేరేనా? View this post on Instagram A post shared by Dubai Capitals (@dubaicapitals) -
కొత్త సంవత్సరం వేళ.. డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే తన కెరీర్లో చివరి టెస్టు ఆడేందుకు సిద్దమైన వార్నర్.. తాజాగా వన్డే క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. సోమవారం తన నిర్ణయాన్ని డేవిడ్ భాయ్ వెల్లడించాడు. అయితే జట్టుకు తన అవసరం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తే పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆడేందుకు అందుబాటులో ఉంటానని తెలిపాడు. "టెస్టులతో పాటు వన్డే క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. భారత్‌పై వన్డే ప్రపంచకప్ గెలిచిన ఈ తరుణమే ఆటకు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నాను. ఇది నా కెరీర్లో సాధించిన భారీ విజయం. టెస్టు, వన్డే ఫార్మాట్ల నుంచి తప్పుకోవడం వల్ల ఫ్రాంఛైజీ లీగ్‌లలో ఆడేందుకు ఎక్కువ సమయం లభిస్తోంది. నేను తీసుకున్న ఈ నిర్ణయం కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తోంది. అయితే త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉందన్న విషయం నాకు తెలుసు. గత రెండేళ్లలో నేను మంచి క్రికెట్ ఆడుతున్నాను. రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ నేను ఫిట్నెస్గా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టుకు అవసరమైతే కచ్చితంగా నేను అందుబాటులో ఉంటానని సిడ్నీ గ్రౌండ్లో విలేకరుల సమావేశంలో వార్నర్ పేర్కొన్నాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023ను ఆస్ట్రేలియా సొంతం చేసుకోవడంలో డేవిడ్ వార్నర్‌ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 528 పరుగులు చేసిన డేవిడ్ భాయ్.. ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా తన వన్డే కెరీర్లో 161 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలతో 6932 పరుగులు చేశాడు. వన్డేల్లో ఆసీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా వార్నర్ కొనసాగుతున్నాడు. -
మూడు ఫార్మాట్లలోనూ అతడొక అద్బుతం.. నిజంగా మాకు ఇది: ఆసీస్ హెడ్ కోచ్
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. పాకిస్తాన్‌తో జరగనున్న మూడో టెస్టు అనంతరం టెస్టు క్రికెట్‌కు వార్నర్ విడ్కోలు పలకనున్నాడు. ఇప్పటికే తన నిర్ణయాన్ని వార్నర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. . జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరిగే మూడో టెస్టు జరగనుంది. తన సొంత మైదానంలో అద్బుతప్రదర్శన కనబరిచి తన టెస్టు కెరీర్‌కు ముగింపు పలకాలని వార్నర్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వార్నర్‌పై ఆసీస్ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ప్రశంసల వర్షం కురిపించాడు. మూడు ఫార్మాట్లలో ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహించిన అత్యుత్తమ ఆటగాళ్లలో వార్నర్ ఒకడని మెక్‌డొనాల్డ్ కొనియాడాడు. డేవిడ్ వార్నర్ ఒక అద్బుతమైన ఆటగాడు. అతొడక ఆల్‌ఫార్మాట్ ప్లేయర్. మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. అటువంటి ఆటగాడు ఇప్పుడు టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోబోతున్నాడు. ఇది నిజంగా ఆస్ట్రేలియా క్రికెట్‌కు కోలుకోలేని దెబ్బ. గత కొంతకాలం నుంచి వార్నర్ టెస్టు క్రికెట్ ఫామ్‌పై చాలా మంది విమర్శలు చేస్తున్నారని నాకు తెలుసు. కానీ ఒక జట్టుగా మేము అతడిపై నమ్మకం ఉంచాము. అందుకే పాకిస్తాన్‌తో సిరీస్‌కు ఎంపిక చేశాము. తొలి టెస్టు మ్యాచ్‌లోనే తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు. ఏదైమైనప్పటికి అతడి స్థానాన్ని భర్తీ చేయడం మాకు చాలా కష్టం. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా వార్నర్ కొనసాగుతున్నాడు. మేము మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి వార్నర్‌కు అంకితమివ్వాలని భావిస్తున్నాము అని క్రికెట్ ఆస్ట్రేలియా.కామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు. చదవండి: #Saumy Pandey: ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో -
పాకిస్తాన్‌తో మూడో టెస్టు.. ఆసీస్ జట్టు ప్రకటన! వార్నర్‌కు ఆఖరి మ్యాచ్
పాకిస్తాన్‌తో మూడో టెస్టుకు 13 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్‌లో కోసం జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. రెండో టెస్టుకు ఎంపిక చేసిన జట్టునే సెలక్టర్లు కొనసాగించారు. తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడనున్న స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు ఘనంగా విడ్కోలు పలికేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సిద్దమైంది. జనవరి 3 నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ అనంతరం టెస్టు క్రికెట్‌కు వార్నర్ గుడ్‌బై చెప్పనున్నాడు. ఇప్పటికే తన నిర్ణయాన్ని డేవిడ్ భాయ్ వెల్లడించాడు. తన హోం గ్రౌండ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి తన టెస్టు కెరీర్‌కు ముగింపు పలకాలని వార్నర్ భావిస్తున్నాడు. ఇక తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. ఆసీస్ జట్టు: పాట్ కమిన్స్(కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్,ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్,నాథన్ లియోన్,మిచెల్ మార్ష్,స్టీవ్ స్మిత్,మిచెల్ స్టార్క్,డేవిడ్ వార్నర్ చదవండి: #Saumy Pandey: ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో -
పాక్ పేసర్ల దెబ్బ: కుప్పకూలిన ఆసీస్ టాపార్డర్.. మార్ష్ సెంచరీ మిస్
బాక్సింగ్ డే టెస్టు మూడో రోజు ఆటలో పాకిస్తాన్ బౌలర్లు విజృంభించారు. పేసర్లు షాహిన్ ఆఫ్రిది, మీర్ హంజా కలిసి ఆస్ట్రేలియా టాపార్డర్‌ను కుప్పకూల్చారు. అయితే, మిడిలార్డర్లో స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్ అర్ధ శతకాలతో రాణించి ఆసీస్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. కానీ.. మిగతా వాళ్ల నుంచి సహకారం లభించకపోవడంతో ఆట ముగిసే సరికి 62.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 187 పరుగులు చేసింది. కాగా మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య మంగళవారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా 318 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించగా.. పాక్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 264 పరుగులకే ఆలౌట్ అయింది. 194/6 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన పాక్ మరో 70 పరుగులు మాత్రమే జతచేయగలిగింది. ఈ క్రమంలో 54 పరుగుల ఆధిక్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను పాకిస్తాన్ పేసర్లు ఆదిలోనే దెబ్బ కొట్టారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను డకౌట్ చేసిన షాహిన్ ఆఫ్రిది.. మార్నస్ లబుషేన్(4) రూపంలో మరో వికెట్ కూల్చాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్(6) వికెట్‌ను మీర్ హంజా తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం ట్రవిస్ హెడ్‌ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ ఓపికగా ఆడుతూ పాక్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. మిచెల్ మార్ష్‌తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే బాధ్యత తీసుకున్నాడు. వీరిద్దరు కలిసి 150 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే, హంజా బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ బౌల్డ్ కావడంతో ఈ పార్ట్‌నర్‌షిప్‌నకు తెరపడింది. 130 బంతులు ఎదుర్కొన్న మార్ష్ 96 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో అగా సల్మాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో స్మిత్‌కు తోడైన అలెక్స్ క్యారీ ఆచితూచి ఆడాడు. పరుగులు రాబట్టలేకపోయినా వీరిద్దరు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, మూడో రోజు ఆటలో సరిగ్గా ఆఖరి బంతికి స్మిత్‌ను షాహిన్ ఆఫ్రిది అవుట్ చేశాడు. దీంతో స్మిత్ రూపంలో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. దీంతో.. గురువారం 62.3 ఓవర్ వద్ద మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి.. 241 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అలెక్స్ క్యారీ 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది, మీర్ హంజా మూడేసి వికెట్లు దక్కించుకున్నారు. Mitch Marsh gone for 96 - to an absolute belter at first slip from Agha Salman! #AUSvPAK pic.twitter.com/KNUP3kDr3j — cricket.com.au (@cricketcomau) December 28, 2023 -
మళ్లీ అదే పొరపాటు.. తలపట్టుకున్న ఆఫ్రిది! ఆటకు వర్షం అంతరాయం
Australia vs Pakistan, 2nd Test Day 1: ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు ఆరంభమైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మంగళవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పర్యాటక పాక్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ షాన్ మసూద్ నమ్మకాన్ని నిలబెడుతూ పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను 38 పరుగులకే పరిమితం చేశారు. వార్నర్ ఇచ్చిన ఈజీ క్యాచ్ వదిలేశాడు నిజానికి మూడో ఓవర్ ఆఖరి బంతికే అతడు అవుట్ కావాల్సింది. కానీ అబ్దుల్లా షఫీక్ చేసిన పొరపాటు వల్ల వార్నర్‌కు లైఫ్ లభించింది. షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో వార్నర్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను షఫీక్ జారవిడిచాడు. అప్పటికి ఈ ఓపెనింగ్ బ్యాటర్ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు. అయితే, షషీక్ పొరపాటు వల్ల బతికిపోయిన వార్నర్‌ను పాక్ స్పిన్నర్ ఆఘా సల్మాన్ పెవిలియన్‌కు పంపాడు. 28వ ఓవర్ మొదటి బంతికి సల్మాన్ బౌలింగ్‌లో.. ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న బాబర్ ఆజంకు క్యాచ్ ఇచ్చి వార్నర్ వెనుదిరిగాడు. David Warner gets a life on two! Shaheen Afridi gets the ball swinging and Abdullah Shafique puts it down at first slip #AUSvPAK pic.twitter.com/EJc4AptxJk — cricket.com.au (@cricketcomau) December 25, 2023 ఖవాజాను అవుట్ చేసిన హసన్ అలీ ఇక మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(101 బంతుల్లో 42 పరుగులు)ను పేసర్ హసన్ అలీ అద్భుత బంతితో అవుట్ చేశాడు. 33.1 ఓవర్ వద్ద అఘా సల్మాన్ అందుకున్న క్యాచ్‌తో ఖవాజా ఇన్నింగ్స్‌కు తెరపడింది. ప్రస్తుతం మార్నస్ లబుషేన్ 14, స్టీవ్ స్మిత్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆటకు వర్షం అంతరాయం కాగా ఆసీస్- పాక్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వాన కారణంగా ఆటను నిలిపివేసే సమయానికి ఆస్ట్రేలియా 42.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. అప్పుడు ఖవాజా.. ఇప్పుడు వార్నర్ ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ బృందం ఏకంగా 360 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లోనూ ఖవాజా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను షఫీక్ జారవిడిచిన విషయం తెలిసిందే. తాజాగా రెండో టెస్టులోనూ తప్పిదాన్ని పునరావృతం చేశాడు. అయితే, ఈసారి వార్నర్ క్యాచ్‌ను వదిలేశాడు. దీంతో అతడిపై నెట్టింట మరోసారి ట్రోల్స్ మొదలయ్యాయి. చదవండి: IPL 2024: పాండ్యా కోసం రూ. 100 కోట్లు చెల్లించిన ముంబై? బంగారు బాతు కదా! -
పాక్‌తో తొలి టెస్ట్.. సెంచరీ చేజార్చుకున్న మార్ష్.. ఆసీస్ భారీ స్కోర్
పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. తొలి రోజు ఆటలో వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ భారీ శతకంతో (164) చెలరేగగా.. రెండో రోజు మిడిలార్డర్ బ్యాటర్ మిచెల్ మార్ష్ (90) 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (41), స్టీవ్ స్మిత్ (31), ట్రవిస్ హెడ్ (40), అలెక్స్ క్యారీ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. లబూషేన్ (16), మిచెల్ స్టార్క్ (12), కమిన్స్ (9), నాథన్ లయోన్ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. పాక్ బౌలర్లలో అరంగేట్రం పేసర్ ఆమిర్ జమాల్ ఆరు వికెట్ల ప్రదర్శనతో అరదగొట్టగా.. మరో అరంగ్రేటం బౌలర్ ఖుర్రమ్ షెహజాద్ 2, షాహీన్ అఫ్రిది, ఫహీమ్ అష్రాఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి ఆసీస్ స్కోర్‌కు ఇంకా 355 పరుగులు వెనకపడి ఉంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 42, కెప్టెన్ షాన్ మసూద్ 30 పరుగులు చేసి ఔట్ కాగా.. ఇమామ్ ఉల్ హాక్ 38, ఖుర్రమ్ షెహజాద్ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ అనంతరం పాక్ డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్లో రెండో టెస్ట్ ఆడుతుంది. అనంతరం వచ్చే ఏడాది జనవరి 3 నుంచి సిడ్నీలో మూడో టెస్ట్ జరుగుతుంది. ఈ సిరీస్‌తో ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. -
26వ టెస్ట్ శతకం.. డేవిడ్ వార్నర్ ఖాతాలో పలు రికార్డు
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (డిసెంబర్ 14) మొదలైన తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. డేవిడ్ వార్నర్ 26వ టెస్ట్ శతకంతో (211 బంతుల్లో 164; 16 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. వార్నర్ శతకానికి ఉస్మాన్ ఖ్వాజా (41), స్టీవ్ స్మిత్ (31), ట్రవిస్ హెడ్ (40) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు తోడవ్వడంతో ఆసీస్ తొలి రోజే భారీ స్కోర్ చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో లబూషేన్ (16) ఒక్కడే కాస్త నిరాశపరిచాడు. ఆట ముగిసే సమయానికి మిచెల్ మార్ష్ (15), అలెక్స్ క్యారీ (14) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఆమిర్ జమాల్ 2 వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, ఖుర్రమ్ షెహజాద్, ఫహీప్ అష్రాఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. రికార్డు శతకం.. తన కెరీర్లో చివరి టెస్ట్ సిరీస్ ఆడుతున్నట్లు ఇదివరకే ప్రకటించిన వార్నర్.. తన కెరీర్ చరమాంకంలో రికార్డు శతకంతో మెరిశాడు. ఈ ఇన్నింగ్స్ ఆరంభంలో టీ20 తరహాలో చెలరేగిన వార్నీ.. ఆతర్వాత కాస్త నెమ్మిదించి డబుల్ సెంచరీ దిశగా సాగాడు. అయితే దురదృష్టవశాత్తు అతను ఆమిర్ జమాల్ బౌలింగ్‌లో ఇమామ్ ఉల్ హాక్కు క్యాచ్ ఇచ్చి 164 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్ డబుల్ సెంచరీ మిస్ అయినప్పటికీ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు (49) చేసిన ఓపెనర్‌గా.. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లి (80) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా.. ఆసీస్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. వార్నర్ స్వదేశంలో పాకిస్తాన్‌తో ఆడిన గత 14 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా ఏడు సెంచరీలు చేసి సొంతగడ్డపై పాకిస్తాన్ పాలిట ఎంతటి ప్రమాదకారో నిరూపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనర్లు.. డేవిడ్ వార్నర్ (49) సచిన్ టెండూల్కర్ (45) క్రిస్ గేల్ (42) సనత్ జయసూర్య (41) మాథ్యూ హేడెన్ (40) రోహిత్ శర్మ (40) ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు.. విరాట్ కోహ్లి (574 ఇన్నింగ్స్‌ల్లో 80 సెంచరీలు) డేవిడ్ వార్నర్ (458 ఇన్నింగ్స్‌ల్లో 49 సెంచరీలు) జో రూట్ (437 ఇన్నింగ్స్‌ల్లో 46) రోహిత్ శర్మ (482 ఇన్నింగ్స్‌ల్లో 45) స్టీవ్ స్మిత్ (374 ఇన్నింగ్స్‌ల్లో 44) కేన్ విలియమ్సన్ (410 ఇన్నింగ్స్‌ల్లో 42) బాబర్ ఆజమ్ (300 ఇన్నింగ్స్‌ల్లో 31) ఆసీస్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు.. రికీ పాంటింగ్ 13378 అలెన్ బోర్డర్ 11174 స్టీవ్ వా 10927 స్టీవ్ స్మిత్ 9351 డేవిడ్ వార్నర్ 8651 మైఖేల్ క్లార్క్ 8643 -
Aus Vs Pak: మేమేం తప్పు చేశాం భయ్యా? షాక్‌లో పాక్ ఫ్యాన్స్!
David Warner 164- Australia's dominance over Pakistan on Day 1: పాకిస్తాన్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా మొదటి రోజు పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా పర్యాటక జట్టుపై పూర్తి ఆధిపత్యం సాధించింది. ఆస్ట్రేలియా- పాకిస్తాన్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు గురువారం ఆరంభమైంది. పెర్త్ వేదికగా మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆది నుంచే దూకుడైన బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. కొరకరాని కొయ్యగా మారి.. టీ20 తరహా ఇన్నింగ్స్‌తో 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్.. దానిని శతకంగా మలచడంలో సఫలమయ్యాడు. మొత్తంగా 211 బంతులు ఎదుర్కొన్న ఈ వెటరన్ ఓపెనర్ 16 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 164 పరుగులు సాధించాడు. మరో ఓపెనింగ్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా 41 పరుగులతో పర్వాలేదనిపించాడు. అయితే, వీళ్లిద్దరు అందించిన శుభారంభాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయారు మిగిలిన బ్యాటర్లు. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 16 పరుగులకే పెవిలియన్ చేరగా.. స్టీవ్ స్మిత్ 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక వన్డే వరల్డ్‌కప్-2023 హీరో ట్రవిస్ హెడ్ మాత్రం 40 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. వార్నర్ సెంచరీ కారణంగా ఈ మేరకు స్కోరు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది. ఇదిలా ఉంటే.. తన కెరీర్లో చివరి టెస్టు సిరీస్ ఆడుతున్న వార్నర్ మొదటి మ్యాచ్ మొదటి రోజే సెంచరీ బాదడం విశేషం. అంతర్జాతీయ టెస్టుల్లో ఈ లెఫ్టాండ్ బ్యాటర్‌కు ఇది 26వ శతకం కాగా.. ఓవరాల్‌గా 49వది. ఇలా అద్భుత ఇన్నింగ్స్‌తో తనను విమర్శించిన వాళ్లకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పిన వార్నర్‌పై క్రికెట్ వర్గాలు ప్రశంసలు కురిపిస్తుండగా.. పాక్ ఫ్యాన్స్ మాత్రం.. ‘‘మేమేం పాపం చేశాం వార్నర్ భాయ్?’’ అని బాధపడుతూ ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఇమ్రాన్ సిద్ధికీ అనే ఎక్స్ యూజర్.. ‘‘పాకిస్తాన్ మీద వార్నర్‌కు ఇది ఆరో సెంచరీ.. మేం చేసిన తప్పేంటి భయ్యా!’’ అంటూ వార్నర్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో షేర్ చేయడం హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి ఆస్ట్రేలియా- పాకిస్తాన్ తొలి టెస్టు తొలి రోజు ఆట మొత్తమంతా డేవిడ్ వార్నర్ ట్రెండింగ్‌లో నిలిచాడు. A century to silence all the doubters. David Warner came out meaning business today.@nrmainsurance #MilestoneMoment #AUSvPAK pic.twitter.com/rzDGdamLGe — cricket.com.au (@cricketcomau) December 14, 2023 Its a 6th Century for David Warner Against Pakistan Bhaii Humne Kya bigara hai ? pic.twitter.com/Gry5QkHbaN — ٰImran Siddique (@imransiddique89) December 14, 2023