
నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం రాబిన్‌హుడ్. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలోకి వచ్చిన చిత్రం.. ఆశించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంలో తేలిపోయింది. ఈ మూవీ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం కెమియో పాత్రలో మెరిశారు. వార్నర్ కోసమైనా థియేటర్లకు వస్తారనుకున్నప్పటికీ అది కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.
ఇప్పటికే ఈ సినిమా విడుదలై నెలరోజులు పూర్తవ్వడంతో ఈ మూవీ ఓటీటీకి ఎప్పుడొస్తుందా అభిమానులు ఎదురు చూస్తున్నారు. గతంలో మే 4న ఓటీటీ వస్తుందని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. మరోవైపు వచ్చేనెల 10 నుంచి స్ట్రీమింగ్ కానుందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ హక్కులను జీ5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి వస్తున్నాం తరహాలో ఓకేరోజు టీవీలతో పాటు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
రాబిన్‌హుడ్ కథేంటంటే..
'రాబిన్ హుడ్' విషయానికొస్తే.. రామ్ (నితిన్) ఓ అనాథ. అనాథశ్రమాల కోసం రాబిన్ హుడ్ పేరుతో దొంగతనాలు చేస్తుంటాడు. కొన్ని కారణాల వల్ల ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరుతాడు. ఆస్ట‍్రేలియా నుంచి ఇండియాకు వచ్చిన నీరా (శ్రీలీల)కు సెక్యూరిటీగా ఉంటాడు. ఓరోజు నీరాని ఎవరో కిడ్నాప్ చేస్తారు. మరి రామ్, నీరాని ఎలా రక్షించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.