'నాకు శ్రీలీల తప్పితే ఎవరూ నచ్చరు'.. వార్నర్ మామ తెలుగు ప్రాక్టీస్‌ చూశారా? | David Warner Learns Telugu Language Before Robinhood Pre Release Event | Sakshi
Sakshi News home page

David Warner: 'నాకు శ్రీలీల తప్పితే ఎవరూ నచ్చరు'.. వార్నర్ మామకు తెలుగు వచ్చేసిందోచ్!

Published Tue, Mar 25 2025 3:10 PM | Last Updated on Tue, Mar 25 2025 3:56 PM

David Warner Learns Telugu Language Before Robinhood Pre Release Event

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ టాలీవుడ్‌ ‍ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యారు. రాబిన్‌హుడ్‌ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ అభిమానులను మెప్పించనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కూడా డేవిడ్‌ వార్నర్‌ సందడి చేశారు. అంతేకాదు తెలుగులోనూ ఏకంగా డైలాగ్స్ కూడా చెప్పి అలరించారు.

అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డేవిడ్ వార్నర్‌కు తెలుగు నేర్పించే పనిలో ఫుల్ బిజీ అయిపోయారు నితిన్, శ్రీలీల. వార్నర్‌ మామకు తెలుగు నేర్పిద్దామని నితిన్ చెప్పారు. నాకు తెలుగు సినిమాలో నితిన్ అంటే పిచ్చి అని వార్నర్‌తో చెప్పించగా.. ఆ తర్వాత నాకు శ్రీలీల తప్పితే ఎవరూ నచ్చరు.. అంటూ వార్నర్‌తో శ్రీలీల తెలుగు ప్రాక్టీస్ చేయించారు. అయితే ఇదంతా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముందు సరదాగా చేసినట్లు తెలుస్తోంది. ప్రీరిలీజ్‌ వేడుకకు ముందు డేవిడ్‌ వార్నర్‌కు తెలుగు నేర్పిస్తున్న ఈ వీడియోను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement