
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్. ఈ ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసింది. వెంకీ కుడుముల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కించారు.
aఅయితే ఈ సినిమా ద్వారా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ ప్రత్యేకమైన కెమియో పాత్రలో వార్నర్ మెరిశారు. ఈ సినిమాలో డ్రగ్ డీలర్‌గా కనిపించారు. అయితే కేవలం 2 నిమిషాల 51 సెకన్లపాటు మాత్రమే కనిపించారు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.
అయితే తాజాగా డేవిడ్ వార్నర్ పాత్రకు సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. దాదాపు 20 సెకన్ల పాటు ఉన్న వీడియోను పంచుకున్నారు. ఇందులో డేవిడ్ చెప్పిన డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'లాలీ పాప్స్ ఆర్ రెడ్.. ఎనిమీస్ ఆర్ డెడ్' అంటూ డైలాగ్ చెప్పిన తీరు వార్నర్ ఫ్యాన్స్‌కు జోష్ నింపింది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.
DAVID BHAI 💥💥
Enjoy @davidwarner31's MASS & SWAG on the big screens 🤩🔥
Book your tickets for #Robinhood now!
🎟️ https://t.co/ogblfmwZTd@actor_nithiin @sreeleela14 @VenkyKudumula @davidwarner31 @gvprakash #RajendraPrasad @vennelakishore @DevdattaGNage #SaiSriram… pic.twitter.com/PsMo0emXl4— Mythri Movie Makers (@MythriOfficial) March 31, 2025