nithiin
-
కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న నితిన్
టాలీవుడ్ హీరో నితిన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన భార్య షాలిని, కుమారుడితో కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ప్రస్తుతం హీరో నితిన్ రాబిన్‌హుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. భీష్మ తర్వాత వెంకీ కుడుముల- నితిన్ కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.రిలీజ్ వాయిదా..గతేడాది క్రిస్టమస్ విడుదల కావాల్సిన 'రాబిన్ హుడ్' వాయిదా పడింది. పుష్ప-2 ఇంకా థియేటర్లలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతికి కూడా ఈ సినిమా రిలీజ్ కాలేదు. దీంతో వచ్చేనెల ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Youth Star @actor_nithiin visited Tirumala to seek the divine blessings of Lord Venkateshwara!🙏#Nithiin #Robinhood #TeluguFilmNagar pic.twitter.com/tCR1B93mPH— Telugu FilmNagar (@telugufilmnagar) January 25, 2025 -
రాబిన్‌హుడ్ డేట్ ఫిక్స్
‘భీష్మ’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లుగా శనివారం చిత్రయూనిట్ ప్రకటించింది.‘‘ఈ మూవీలో నితిన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమా కోసం కేతికా శర్మ చేసిన స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను అతి త్వరలోనే రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
‘ఎల్లమ్మ’గా సాయి పల్లవి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
వెండితెరపై ఎల్లమ్మగా సాయి పల్లవి(sai Pallavi) కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. నితిన్ హీరోగా ‘బలగం’ ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టాలనుకుంటున్నారు. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు సాయి పల్లవిని అనుకుంటున్నారట. ఆల్రెడీ తెలంగాణ నేటివిటీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఫిదా, విరాటపర్వం’ చిత్రాల్లో సాయి పల్లవి నటిగా మెప్పించారు. ఇక ఇప్పుడు వేణు తెరకెక్కించే చిత్రం కూడా తెలంగాణ నేపథ్యంలోనే ఉంటుందట. ఎల్లమ్మ(Yellamma) పాత్రకు సాయి పల్లవి అయితేనే న్యాయం చేస్తుందని వేణు, దిల్ రాజు భావిస్తున్నారట. దిల్ రాజు ద్వారా సాయి పల్లవిని కలిసిన వేణు.. కథ చెప్పి ఆమె పాత్ర గురించి వివరించారట. ఆమె పాత్ర నచ్చడంతో సాయి పల్లవి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ గాపిప్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరోసారి తెలంగాణ నేపథ్య సినిమాలో సాయి పల్లవి నటించబోతున్నారనే వార్త తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఈ గాసిప్ నిజమై.. వెండితెరపై ‘ఎల్లమ్మ’గా సాయి పల్లవి కనిపిస్తారా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
పండుగ రేసు నుంచి తప్పకున్న నితిన్ 'రాబిన్‌హుడ్'
క్రిస్టమస్ రేసు నుంచి 'రాబిన్ హుడ్' సినిమా తప్పుకుంది. ఈమేరకు చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. 'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. టైటిల్ ప్రకటించిన సమయం నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.‘రాబిన్‌హుడ్’ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే, తాజాగా ఆ సంస్థ మరో ప్రకటన చేసింది. రాబిన్ హుడ్ చిత్రాన్ని అనుకున్న తేదీలో విడుదల చేయడం లేదంటూ తెలిపింది. కానీ, కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. మైత్రీ మూవీస్ నుంచి తెరకెక్కిన పుష్ప2 ఇంకా థియేటర్లో రన్ అవుతూనే ఉంది. మరోవైపు మోహన్‌లాల్ బరోజ్ తెలుగు వర్షన్‌ను ఇదే సంస్థ డిసెంబర్ 25న విడుదల చేస్తుంది. ఆపై ఈ క్రిస్టమస్ రేసులో సుమారు 10కి పైగా చిత్రాలు రేసులో ఉన్నాయి. దీంతో థియేటర్స్ కొరత ఏర్పడే ఛాన్స్ ఉందని రాబిన్ హుడ్ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.రాబిన్ హుడ్‌లో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్ అందిస్తున్నారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుంది. -
నితిన్ 'రాబిన్‌హుడ్' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
వన్ మోర్ టైమ్ అంటోన్న నితిన్.. రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది!
భీష్మ హిట్ తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబోలో వస్తోన్న చిత్రం రాబిన్‌హుడ్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.తాజాగా రాబిన్‌హుడ్ మూవీ నుంచి వన్ మోర్ టైమ్ అనే రొమాంటిక్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. జీవి ప్రకాశ్, విద్య ఆలపించారు. యూనిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతమందిస్తున్నారు. The LOVE FUSION SONG OF THE YEAR is here!#Robinhood First Single #OneMoreTime out now!▶️ https://t.co/QR2AWYjcFlSung by @gvprakash & @VidyaVox 🎙️GRAND RELEASE WORLDWIDE ON DECEMBER 25th 💥@sreeleela14 @VenkyKudumula @kk_lyricist @OfficialSekhar @MythriOfficial pic.twitter.com/0MiffNi3x6— nithiin (@actor_nithiin) November 26, 2024 -
'ఇక నుంచి నువ్వు మా తెలుగు హీరో'.. నితిన్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. అమరన్ రిలీజైన ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. మొదటి రోజే రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ.102 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ హీరో నితిన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరన్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రానికి హీరోయిన్ సాయిపల్లవి బ్యాక్‌బోన్ అంటూ కొనియాడారు. మీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని.. ఏదో ఒకరోజు మీతో డ్యాన్స్ చేయాలని ఉందని అన్నారు. త్వరలోనే ఆ రోజు రావాలని కోరుకుంటున్నానని నితిన్ తెలిపారు.శివ కార్తికేయన్‌తో నాకు ప్రత్యేక అనుబంధముందని హీరో నితిన్ అన్నారు. హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ గత నాలుగేళ్లుగా మేము కలవడానికి కుదర్లేదన్నారు. చాలా రోజుల తర్వాత మేమిద్దరం కలిశామని సంతోషం వ్యక్తం చేశారు. అమరన్ సినిమాకు శివ కార్తికేయన్ చాలా కష్టపడ్డారని.. ఇక నుంచి మా తెలుగు హీరో, మా తెలుగబ్బాయి అయిపోయాడని నితిన్ అన్నారు. కాగా.. నితిన్ ప్రస్తుతం రాబిన్‌హుడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రష్మిక మందన్నా హీరోయిన్లుగా కనిపించనున్నారు. -
బెల్లంకొండ 'భైరవం'.. శివరాత్రికి 'తమ్ముడు'
*'ఛత్రపతి' రీమేక్ ఫలితం దెబ్బకు సైలెంట్ అయిపోయిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. కొత్త సినిమాని రెడీ చేశాడు. 'భైరవం' టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఏడాది తమిళంలో వచ్చిన 'గరుడన్' చిత్రానికి ఇది రీమేక్ అని తెలుస్తోంది. మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకుడు. వచ్చే నెలలో అంటే డిసెంబరు 3వ వారంలో రిలీజ్ ఉండొచ్చని టాక్.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న నటి సన్నీ లియోన్!)*ప్రస్తుతం 'రాబిన్ హుడ్' చేస్తున్న నితిన్.. డిసెంబరు 20న ఈ సినిమాతో థియేటర్లలోకి రానున్నాడు. మరోవైపు 'వకీల్ సాబ్' తీసిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'తమ్ముడు' చేస్తున్నాడు. బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్ కథతో తీస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది శివరాత్రికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు.*అనుష్క శెట్టి ప్రస్తుతం 'ఘాటి' అనే సినిమా చేస్తోంది. క్రిష్ దర్శకుడు. చాలా వరకు షూటింగ్ పూర్తి కాగా.. ఈనెల 7న అంటే గురువారం చిత్ర గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇది వచ్చిన తర్వాత మూవీ ఎలా ఉండబోతుందని ఓ అంచనాకు రావొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్) -
తప్పుకున్న గేమ్ ఛేంజర్ ఆలోచనలో పడ్డ నితిన్, నాగచైతన్య
-
వేణు ‘ఎల్లమ్మ’ కష్టాలు తీరినట్లేనా?
‘బలగం’ సినిమాకి ముందు ఇండస్ట్రీలో వేణుకి ఉన్న ఇమేజ్ వేరు. అప్పటి వరకు వేణు అంటే కమెడియన్ మాత్రమే అని అందరికి తెలుసు. ఆయనలో ఓ గొప్ప దర్శకుడు దాగి ఉన్నాడనే విషయం ‘బలగం’ రిలీజ్ ముందు వరకు తెలియదు. అందరికి లాగే తాను కూడా సరదా కోసం మెగాఫోన్ పట్టారని అంతా అనుకున్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత వేణు టాలెంట్ ప్రపంచం మొత్తానికి తెలిసింది. తొలి సినిమాతో స్టార్ డైరెక్టర్ హోదా సంపాదించాడు. ఆ హోదాను వేణు అలాగే కాపాడుకోవాలి అంటే..కచ్చితంగా ‘బలగం’కి మించిన సినిమాను తీయాలి. ఆ విషయం వేణుకి కూడా బాగా తెలుసు. అందుకే కాస్త సమయం తీసుకొని మరోసారి తెలంగాణ గ్రామీణ నేపథ్య కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలంగాణ ‘కాంతార’బలగం తరహాలోనే వేణు మరోసారి పూర్తి గ్రామీణ నేపథ్యం ఉన్న కథతో ‘ఎల్లమ్మ’ను తెరకెక్కించబోతున్నారట. వేణు కెరీర్‌కి ఈ సినిమా హిట్ చాలా ముఖ్యం అందుకే చాలా జాగ్రత్తగా ఈ కథను రాసుకున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు. ఈ స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తయింది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఈ కథను రెడీ చేశాడట వేణు. కాంతార తరహాలోనే ఈ కథకి కూడా బలమైన క్లైమాక్స్ ఉంటుందట.నాని టు నితిన్‘ఎలమ్మ’ కథను పలువురు హీరోలకు వినిపించాడట వేణు. ప్రతి ఒక్కరు బాగుందనే చెప్పారట. తొలుత నానికి కథ చెప్పాడట. ఆయనకు విపరీతంగా నచ్చిందట. అయితే అప్పటికే తెలంగాణ నేపథ్యంలో ‘దసరా’ సినిమా ఒప్పుకోవడంతో ‘ఎల్లమ్మ’ కథను రిజెక్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత ‘హను-మాన్’ హీరో తేజ సజ్జను అనుకున్నారట. కానీ ఈ వయసులోనే అంత పెద్ద పాత్రను పోషించలేని తేజ వెనక్కి తగ్గారు. వరుణ్ తేజ్ కూడా కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారట. వీరందరికి కంటే ముందే హీరో నితిన్‌కి ఈ కథ చెప్పాడట వేణు. అయితే దిల్ రాజు బ్యానర్లో వరుస సినిమాలు చేస్తున్నాని..మళ్లీ ఇప్పుడు అదే బ్యానర్లో చేస్తే బాగోదని చెప్పాడట. కానీ మళ్లీ ఈ కథ చివరికి నితిన్ వద్దకే చేరిందట. ఆయన అయితేనే వేణు రాసుకున్న పాత్రకు న్యాయం చేస్తాడని భావించి.. దిల్ రాజు ఒప్పించారట. నితిన్ ప్రస్తుతం ‘తమ్ముడు’, ‘రాబిన్‌వుడ్’ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయిన వెంటనే ‘ఎల్లమ్మ’ సెట్లోకి అడుగుపెడతారట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. -
మా బావ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి రుణపడి ఉంటాను...
-
‘ఆయ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్..ముఖ్య అతిథిగా శ్రీలీల (ఫొటోలు)
-
జూనియర్ ఎన్టీఆర్ బామర్ది సినిమా.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
మ్యాడ్ మూవీతో నటుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ఆయ్. నయన్ సారిక హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రానికి అంజి కె.మణపుత్ర దర్శకత్వం వహిస్తున్నారు. జీఎ2 బ్యానర్లో బన్నీవాస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరి బ్యాక్ డ్రాప్‌తో తీశారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ ఐటమ్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. డైవర్షన్ బ్యూటీ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. కాగా.. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. సింగర్ మంగ్లీ ఆలపించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ చిత్రం ఆగస్టు 15 థియేటర్లలో సందడి చేయనుంది. Vibe to the Madness!🔥💃Celebrate the Diversion Beauty ❤️🔥Here's the lyrical video of #DiversionBeauty from #AAYMovie▶️ https://t.co/HQ0F6LR2th🎤 @IamMangli✍️ @LyricsShyam🎶 @arasadaajay#AAY #AAYonAUG15#AlluAravind @TheBunnyVas #VidyaKoppineedi @NarneNithiin @UrsNayan… pic.twitter.com/pzV4kmSLAj— Geetha Arts (@GeethaArts) August 10, 2024 -
పుష్ప-2 వాయిదా.. రేసులోకి వచ్చేసిన ఎన్టీఆర్ బామ్మర్ది!
జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్దిగా ఇండస్ట్రీకి పరిచయం హీరో నార్నెనితిన్. మ్యాడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. తాజాగా నితిన్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'ఆయ్'. అతనికి జంటగా నయన్ సారిక హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను జీఏ2 బ్యానర్‌పై అంజి కె.మణిపుత్ర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని బన్నీ, విద్యా కొప్పినీడి నిర్మాతలుదా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తాజాగా ఈ ఆయ్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పాటలకి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ తేదీ విడుదల కావాల్సిన పుష్ప-2 వాయిదా పడడంతో చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి.మరోవైపు అదే రోజున హీరో రానా నిర్మాతగా తెరకెక్కిస్తోన్న '35 – ఇది చిన్నకథ కాదు' రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, నివేదా థామస్ జంటగా నటించారు. వీటితో రామ్ పోతినేని-పూరి కాంబోలో వస్తోన్న డబుల్ ఇస్మార్ట్ సినిమాను అదే రోజు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో ఈ మూడు సినిమాలు పోటీ పడనున్నాయి. మరి ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే. Gear Up to Celebrate Godavari Emotion, Love, Friendship & much more with the 𝐔𝐋𝐓𝐈𝐌𝐀𝐓𝐄 𝐅𝐔𝐍 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐄𝐑 of the 𝗦𝗘𝗔𝗦𝗢𝗡 🥳❤️🔥#AAYMovie Grand release in theatres on Independence Day, 𝐀𝐔𝐆𝐔𝐒𝐓 𝟏𝟓𝐭𝐡!😍#AAY #AAYonAUG15 🤩#AlluAravind #BunnyVas… pic.twitter.com/HJV9kDEKgj— Geetha Arts (@GeethaArts) June 25, 2024From the sacred land of Tirupathi ✨Bringing you a lovely narrative that will touch everyone’s heartsPresenting35 ~ Chinna Katha Kaadu❤️🔥Starring @i_nivethathomas @PriyadarshiPN @imvishwadev @gautamitads In cinemas from AUGUST 15th, 2024#35Movie #NandaKisore… pic.twitter.com/4HjdTTXk8o— Rana Daggubati (@RanaDaggubati) June 25, 2024 -
శ్రీలీల బర్త్ డే.. స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసిన టీమ్!
పెళ్లిసందడి మూవీతో ఫేమ్ తెచ్చుకున్న కన్నడ బ్యూటీ శ్రీలీల. ఆ తర్వాత రవితేజ ధమాకా, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, స్కంద, భగవంత్ కేసరి లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రవితేజ సరసన మరో సినిమాకు సిద్ధమైంది. దీంతో నితిన్‌తో మరోసారి జతకట్టింది. నితిన్ సరసన రాబిన్‌హుడ్ చిత్రంలో కనిపించనుంది.తాజాగా ఇవాళ శ్రీలీల బర్త్ డే కావడంతో రాబిన్‌హుడ్ టీమ్ స్పెషల్ విషెస్ తెలిపారు. శ్రీలీల బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో శ్రీలీల, వెన్నెల కిశోర్ మధ్య ఫన్నీ డైలాగ్ నవ్వులు తెప్పిస్తోంది. 'సునామీలో టీ సైలెంట్‌గా ఉండాలి.. నా వద్ద నువ్వు సైలెంట్‌గా ఉండాలి' అంటూ వెన్నెల కిశోర్‌కు శ్రీలీల వార్నింగ్ ఇస్తుంది. గ్లింప్స్ చూస్తుంటే ఈ చిత్రంలో శ్రీలీల గ్లామరస్ లుక్స్‌తో ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా.. జీవీ ప్రకాశ్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రం డిసెంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. -
నితిన్‌ను పెళ్లికి ఆహ్వానించిన యంగ్ హీరో..!
త్వరలోనే టాలీవుడ్ యంగ్ హీరో ఓ ఇంటివాడు కాబోతున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు, హీరో ఆశిష్ రెడ్డి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు మన యంగ్ హీరో. తాజాగా టాలీవుడ్ హీరో నితిన్‌ను కలిసి వివాహానికి ఆహ్వానించారు. ప్రత్యేక బహుమతిని అందించిన ఆశిష్ రెడ్డి.. ఆహ్వాన పత్రికను అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. అశిష్ రెడ్డి, అద్వైత రెడ్డిల పెళ్లి వేడుక ఫిబ్రవరి 14న జైపూర్‌లో జరగనుంది. టాలీవుడ్ హీరోలు ప్రభాస్, అఖిల్, మోహన్ బాబు కూడా ఆహ్వాన పత్రికలు అందజేశారు. వీరితో పాటు చాలామంది టాలీవుడ్ ప్రముఖులందరీకీ ఆహ్వానాలు అందించినట్లు తెలుస్తోంది. ఇకపోతే 'రౌడీ బాయ్స్' సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆశిష్ రెడ్డి.. ప్రస్తుతం 'సెల్ఫిష్' అనే మూవీలో నటిస్తున్నాడు. హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. -
నితిన్ రాబిన్ హుడ్
‘భీష్మ’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి ‘రాబిన్ హుడ్’ టైటిల్ ఖరారైంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించనున్నారట. శుక్రవారం (జనవరి 26) రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. మేకర్స్. ‘డబ్బు చాలా చెడ్డది... రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావ్ అంటే... అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతానంటది.. అన్నట్టే చేసింది... దేశమంత కుటుంబం నాది... ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు... ఆభరణాలేసుకున్నోళ్లంత నా అక్క చెల్లెళ్ళు... అవసరం కొద్ది వాళ్ల జేబుల్లో చేతులు పెడితే... ఫ్యామిలీ మెంబర్ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు... అయినా నేను హర్ట్ అవ్వలేదు... ఎందుకంటే అయినవాళ్ల దగ్గర తీసుకోవడం నా హక్కు... మై బేసిక్ రైట్. బికాజ్ ఇండియా ఈజ్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ అంటూ నితిన్ చెప్పే డైలాగ్స్ ఈ వీడియోలో ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
'నా వాళ్లే అనుకుంటే కేసులు పెడుతున్నారు'.. ఆసక్తి పెంచుతోన్న గ్లింప్స్!
గతేడాది ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ చిత్రంతో ప్రేక్షకులను పలకించాడు నితిన్. ఈ చిత్రంలో అతనికి జోడీగా శ్రీలల నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే నితిన్ ప్రస్తుతం మరో చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ కుడుముల డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న ఈ సినిమాను నవీన్ యేర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో పాటు టైటిల్ కూడా రివీల్ చేసేశారు. గ్లింప్స్ చూస్తే ఈ చిత్రం రాబరీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రాబిన్‌హుడ్ అనే టైటిల్ ఖరారు చేశారు. అంతే కాకుండా నితిన్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో 'తమ్ముడు' చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. Unmasking the Con Man from the most entertaining & adventurous world 💥💥 Say hello to your new family member - #ROBINHOOD ❤️🔥 Title reveal glimpse out now! - https://t.co/BoPSPtzMT4#IdhiVere #VN2 @actor_nithiin @VenkyKudumula @gvprakash pic.twitter.com/liAOgVVKwD — Mythri Movie Makers (@MythriOfficial) January 26, 2024 -
గోపిచంద్ సినిమాతో ఎంట్రీ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి దాదాపు ఐదేళ్ల తర్వాత టాలీవుడ్ తలుపు తట్టింది. ఒంటరి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. మలయాళం, తమిళం, కన్నడలో పలు సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో కేవలం హీరో, మహాత్మ, నిప్పు లాంటి చిత్రాల్లో మాత్రమే కనిపించిది. తన 22 ఏళ్ల సినీ కెరీర్లో టాలీవుడ్లో కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే చేసింది. ఇంతకీ ఆమె హీరోయిన్ ఎవరో గుర్తుకు వచ్చిందా? ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు కన్నడ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్లో అలా వచ్చి.. ఇలా గుడ్ బై చెప్పిన అందాల ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందాం పదండి. కేరళలోని త్రిసూర్‌లో జన్మించిన భావన..2002లో మలయాళంలో నమ్మల్ అనే చిత్రం తన కెరీర్ ప్రారంభించింది. మొదటి సినిమాకే కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత మలయాళంలో ఛాన్సులు కొట్టేసిన ముద్దగుమ్మ చాలా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత 2008లో గోపీచంద్ నటించిన ఒంటరి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నితిన్ సరసన హీరో చిత్రంలో మెరిసింది. శ్రీకాంత్ నటించిన మహాత్మ చిత్రంతో గుర్తింపు వచ్చినప్పటికీ.. టాలీవుడ్ ఈ కేరళకుట్టికి పెద్దగా కలిసిరాలేదు. తెలుగులో కేవలం నాలుగు చిత్రాల్లో మాత్రమే కనిపించింది. అయితే తమిళం, కన్నడలో ఛాన్స్‌లు రావడంతో టాలీవుడ్‌కు బైబై చెప్పేసింది. భావన చివరిసారిగా రవితేజ నటించిన నిప్పు చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. నిర్మాతతో ప్రేమ పెళ్లి అయితే 2012లో కన్నడలో రోమియో చిత్రంలో నటించారు. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నవీన్‌తో భావనకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ.. 2018లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఇటీవలే వీరిద్దరు ఆరో వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం భావన తన భర్తతో కలిసి బెంగళూరులో స్థిరపడింది. కాగా.. భావన చివరిసారిగా మలయాళ చిత్రం 'ఎన్టిక్కక్కకోరు ప్రేమోందర్న్'లో కనిపించింది. View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) -
టార్గెట్ 2024.. ఈ సారైనా హిట్ కొడతారా?
గత ఏడాది కొందరు యూత్ హీరోలకు షాక్ తగిలింది. ఎంతో నమ్ముకున్న సినిమాలు నిండా ముంచాయి. అందుకే...ఈ సారి సరికొత్తగా ఆకట్టుకోవాలి అనుకుంటున్నారు. మంచి సినిమాతో వచ్చి..హిట్ ట్రాక్ మీదికి రావాలి అనుకుంటున్నారు. మరి అందుకోసం ఈ కథానాయకులు ఏం చేస్తున్నారు..? యంగ్ హీరో నితిన్..2022 లో మాచర్ల నియోజక వర్గంతో వచ్చి నిరాశ పడ్డాడు. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని మాస్ ప్రయత్నం చేశాడు .. ఇది బెడిసికొట్టింది. అందుకే తనకు అచ్చోచ్చిన ఎంటర్టైనర్ నమ్ముకొని గత ఏడాది..ఎక్ట్రా ఆర్డనరి మ్యాన్ మూవీతో వచ్చాడు. వక్కంతం వంశీ ఈ మూవీకి దర్శకుడు. కాని ఈ ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇక భీష్మ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో ఈ సంవత్సరం రాబోతున్నాడు. (చదవండి: క్లీంకారపై స్పెషల్ సాంగ్.. విన్నారా?) అపజయాలలో ఉన్న మరో కథానాయకుడు పొతినేని రామ్...ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ హిట్ తో మంచి వసూల్లు రాబట్టాడు.దాంతో తర్వాత కూడా మాస్ ను ఆకట్టుకోవాలని వారియర్‌తో వచ్చాడు. 2022 లో వచ్చిన ఈ సినిమా మెప్పించలేకపోయింది. ఇక స్కంద తో గత ఏడాది మరోసారి మాస్ నే నమ్ముకున్నాడు. ఈ మూవీ హిట్ కాలేదు. అంతేకాదు సోషల్ మీడియోలో ట్రోల్స్ కు గురి అయింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్‌లో నటిస్తున్నాడు. ఈ ఏడాది హిట్ ట్రాక్ మీదికి వస్తాడేమో చూడాలి. (చదవండి: దిక్కులేని అనాథలా నటుడి మరణం.. చివరి చూపునకు ఎవరూ రాలే!) నాగ చైతన్యకు కూడా కాలం కలిసి రావటం లేదు.థాంక్యూ మూవీతో పాటు..కస్టడీతో ..ప్లాపులు చూశాడు.ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న తండేల్‌లో నటిస్తున్నాడు. చందు మోండెటి దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. ఈ హీరోలతో పాటు..విజయ్ దేవరకొండ,నిఖిల్,మంచు విష్ణు లాంటి కథాయకులతో పాటు...కుర్ర హీరోలు..వైష్ణవ్ తేజ్ కిరణ్ అబ్బవరం లాంటి హీరోలకు కూడా ఓ విజయం అవసరంగా మారింది. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న నితిన్ కొత్త సినిమా..స్ట్రీమింగ్ అప్పుడే!
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించగా, సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించాడు. డిసెంబర్ 8న థియేటర్స్‌లో రిలీజై ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. రిలీజ్‌కు ముందు విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. దర్శకుడు వక్కంతం వంశీ కమర్షియల్స్ ఎలిమెంట్స్ మెండుగా ఉండేలా జాగ్రత్త పడ్డప్పటికీ.. ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. కామెడీ బాగున్నా.. కథనం మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకయింది. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జనవరి చివరివారం లేదా సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని తొలుత భావించారట. కానీ సినిమాకు హిట్ టాక్ రాకపోవడంతో.. అనుకున్న డేట్ కంటే ముందే ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి మొదటి వారంలోనే ఈచిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి వీక్ ప్రారంభంలో ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే చిత్ర యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. -
Extra Ordinary Man Movie Wallpapers: నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ స్టిల్స్
-
సలార్‌తో పోటీ పడలేం.. అందుకే డేట్ మార్చాం: టాలీవుడ్ నిర్మాత
నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎక్స్ట్రా'. ఆర్డినరీ మ్యాన్’ అనేది ఉపశీర్షిక. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ తేదీని మొదట డిసెంబర్ 23న ప్రకటించారు. కానీ ఆ తర్వాత విడుదల తేదీ మార్చారు. దీనిపై నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడారు. సలార్ రావడం వల్లే రిలీజ్ డేట్స్ మార్చాల్సి వచ్చిందని తెలిపారు. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ..'నాని హాయ్ నాన్న సినిమా మొదట డిసెంబర్ 22న రిలీజ్ డేట్ ఉంది. మా సినిమా కూడా 23న అనుకున్నాం.. కానీ అదే సమయంలో ప్రభాస్ సలార్ వచ్చింది. అందుకే మేం రిలీజ్ డేట్స్ సర్దుబాటు చేసుకున్నాం. ఎందుకంటే పెద్ద సినిమా రావడంతోనే మేం తప్పుకున్నాం. భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి.. అందుకు అనుగుణంగానే సర్దుకున్నాం. ఒక రోజు ముందు నాని 7వ తేదీన వచ్చేస్తున్నాడు. మేం 8న వస్తున్నాం. అంతే కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. పండగ తర్వాత డేట్స్ కుదరవని ముందే రిలీజ్ చేస్తున్నాం' అని అన్నారు. -
ఆ డైలాగ్ ఎలా రాశారో తెలియదు..నా మాటే జీవిత వింటుంది: రాజశేఖర్
టాలీవుడ్ బెస్ట్ కపుల్ లిస్ట్‌లో మొదటి వరుసలో ఉంటారు జీవిత, రాజశేఖర్. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఇంట్లో ఎక్కువగా జీవిత డామినేషనే ఉంటుందని టాలీవుడ్ టాక్. జీవిత ఎలా చెబితే అలా రాజశేఖర్ చేస్తారని, అందుకే వారి మధ్య గొడవలు జరగవని అంటుంటారు. ఇదే విషయాన్ని ఎక్ట్రా ఆర్డనరీ మ్యాన్ సినిమాలో ఒక్క డైలాగ్‌తో చెప్పించాడు దర్శకుడు వక్కంతం వంశీ. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో ‘నాకు జీవిత, జీవితం రెండూ ఒక్కటే’ అని రాజశేఖర్ చెప్పే డైలాగ్ బాగా వైరల్ అయింది. (చదవండి: రేవంత్ రెడ్డి ఫోటో షేర్ చేస్తే ఇంతలా వేధిస్తారా..నన్ను వదిలేయండి: సుప్రిత) తాజాగా జరిగిన ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్లో రాజశేఖర్ ఈ డైలాగ్ గురించి మాట్లాడుతూ..‘ జీవిత, జీవితం రెండూ ఒకటే అనే డైలాగ్ వక్కంతం వంశీ గారు ఎలా రాశారో తెలియదు కానీ.. బాగా సక్సెస్ అయింది. ‘జీవిత కూర్చో అంటే కూర్చుంట..లే అంటే లేస్తాను’ అనే ఉద్దేశంతో వంశీ ఈ డైలాగ్ రాసినట్లు ఉన్నాడు. వాస్తవానికి నేను చెప్పిందే జీవిత వింటుంది. చాలా మంచిది. ఒక్క మాట కూడా తిరిగి అనదు. కానీ అందరూ జీవిత చెప్తే నేను ఆడతాను అని అనుకుంటున్నారు. జీవిత చెప్పింది కూడా నేను వింటాను. ఎందుకంటే ఆమె చెప్పేది నా మంచి కోసమే’ అని రాజశేఖర్ చెప్పుకొచ్చాడు. ఇక జీవిత మాట్లాడుతూ.. ‘భార్యభర్తలు అంటూ ఒకరి మాట ఒకరు వినాలి.. ఒకరి గురించి ఇంకొకరు బతకాలి.. అలాంటి మైండ్ సెట్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. మేం ఇద్దరం ఒకరికొకరం బతుకుతాం. నాకు నా భర్త.. ఇద్దరు కూతుళ్లు..వీళ్లే ప్రపంచం. వీళ్ల కోసం ఎవరినైనా ఎదిరిస్తాను. మంచి పాత్ర దొరికితే రాజశేఖర్ విలన్‌గా అయినా, ఓ స్పెషల్ అప్పియరెన్స్ అయినా చేస్తారు’ అన్నారు. -
నితిన్ ‘ఎక్స్ట్రా’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఆ హీరోయిన్స్ తో బాగా కంఫర్ట్ గా ఉంటుంది: హీరో నితిన్
-
టాలీవుడ్ హీరోకు ఎంఎస్ ధోని గిఫ్ట్.. అదేంటో తెలుసా?
టాలీవుడ్ హీరో నితిన్ మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఎక్స్‌ట్రార్డీనరీ మ్యాన్ అంటూ అభిమానులను పలకరించునున్నారు. ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల జంటగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వక్కంత వంశీ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే హీరో నితిన్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ట్విటర్లో ఓ ఫోటోను నితిన్ పంచుకున్నారు. అందులో ఓ టీ షర్ట్‌ను చేతిలో పట్టుకుని కనిపించారు. ఎక్స్‌ట్రార్డీనరీ మ్యాన్ నుంచి ఎక్స్‌ట్రార్డీనరీ గిఫ్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ టీ షర్ట్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ ధోని పంపించారంటూ ట్వీట్ చేశారు. కాగా.. నితిన్ నటించిన ఎక్స్‌ట్రార్డీనరీ డిసెంబర్ 8న థియేటర్లలో సందడి చేయనుంది. EXTRAORDINARY gift from an EXTRAORDINARY MAN… Thankuu @msdhoni sir for this!! Love u ❤️ pic.twitter.com/dNTeXl1JOe — nithiin (@actor_nithiin) November 29, 2023 -
Extra - Ordinary Man Trailer Launch: నితిన్ ‘ఎక్స్ట్రా’ మూవీ ట్రైలర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
ఆ నెలలోనే వరుణ్- లావణ్య పెళ్లి.. అతిథుల లిస్ట్‌లో టాలీవుడ్ జంట!
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేడుక మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి. ఇప్పటికే పెళ్లి తేదీపై చాలా ఇంటర్వ్యూల్లో వరుణ్‌పై ప్రశ్నల వర్షం కురుస్తోంది. పెళ్లి తేదీ ఇంకెప్పుడు ప్రకటిస్తారంటూ ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి తేదీని అమ్మ నిర్ణయిస్తుందని ఇటీవల ఓ ఇంటరాక్షన్ సందర్భంగా వరుణ్ తేజ్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది నవంబర్ నెలలో వరుణ్-లావణ్య వివాహాం జరిగేలా కనిపిస్తోంది. (ఇది చదవండి: మెగా ఇంట్లో పెళ్లి సందడి.. వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్!) అయితే ఇప్పుడు వేదికతో పాటు ఈ పెళ్లికి హాజరయ్యే ప్రముఖుల ఎవరనే అంశంపై చర్చ నడుస్తోంది. వరుణ్, లావణ్యకు ఇండస్ట్రీలో ప్రముఖ నటీనటులు, స్నేహితులు చాలామందే ఉన్నారు. అయితే వీరి పెళ్లి ఇటలీలో జరుగుతుందని ఇప్పటికే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథుల లిస్ట్‌లో హీరో నితిన్, ఆయన భార్య షాలిని కూడా ఉన్నట్లు సమాచారం. ఈ పెళ్లిలో అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్‌తో పాటు ఇతర నటీనటులు సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రముఖుల గెస్ట్ లిస్ట్ గురించి మరిన్నీ ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే మెగా ఫ్యామిలీ పెళ్లి వేదికతో పాటు తేదీ కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. వరుణ్ పెళ్లికి సంబంధించి సన్నాహాలు మొదలు పెట్టినట్లు సమాచారం. కాగా.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జూన్ 9న నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా లవ్ చేస్తున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠితో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. (ఇది చదవండి: లావణ్యకు కాల్ చేయను.. ఎందుకంటే.. వరుణ్ తేజ్ క్రేజీ ఆన్సర్! ) -
దిల్ రాజు నయా ప్లాన్.. నాని ప్లేస్‌లో నితిన్, వర్కౌట్ అయితే కాసుల వర్షమే!
టాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ తీసి సక్సెస్ అందుకుంటున్నారు హీరోలు..దర్శకులు. అందుకే ఈ మధ్య దర్శకులు సీక్వెల్ కి లీడ్ ఉండేలా క్లైమాక్స్ ప్లాన్ చేసున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ సీక్వెల్ మూవీ న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఈ సినిమాలో నటించింది ఒక హీరో అయితే...సీక్వెల్ లో నటించబోయేది మరో హీరో అని తెలుస్తుంది. డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని హీరోగా దిల్ రాజు నిర్మించిన సినిమా ఎం.సి.ఎ. మిడిల్ క్లాస్ అబ్బాయి. ఈ సినిమాలో నాని, సాయిపల్లవి జంటగా నటించగా...భూమిక ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. దాదాపు 25 కోట్లతో తెరకెక్కిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర 70 కోట్లు వసూళ్లు చేసింది. నాని కెరీర్ లో ఎం.సి.ఎ బెస్ట్ మూవీగా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ వేణు శ్రీరామ్ దిల్ రాజు బ్యానర్ లో వకీల్ సాబ్ తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ డైరెక్టర్ గా ఫుల్ బిజీ అయిపోతాడనుకుంటే...సీన్ రివర్స్ అయింది. ఇప్పటి వరకు ఏ హీరో కూడా డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పలేదు. అయితే ఈ గ్యాప్ లో వేణు శ్రీరామ్ స్టోరీస్ తయారు చేసుకుంటూ బిజీగా ఉన్నాడనే మాట ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం వేణు శ్రీరామ్ తన దర్శకత్వంలో హిట్ అయిన ఎం.సి.ఎ మూవీకి సీక్వెల్ స్టోరీ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సీక్వెల్ కూడా ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కబోతుందని తెలిసింది. అయితే ఈ ఎం.సి.ఎ సీక్వెల్ లో నాని బదులు యంగ్ హీరో నితిన్ నటిస్తున్నాడట. దిల్ రాజు ముందుగా హీరో నానికి ఈ సీక్వెల్ మూవీ ఆఫర్ చేశాడట. అయితే ఇతర సినిమాలతో బిజిగా ఉండటం వల్ల చేయలేనని సున్నితంగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఎం.సి.ఎ సీక్వెల్ ఆఫర్ నితిన్ కి చేరింది. ప్రస్తుతంనితిన్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు. భీష్మ తర్వాత నితిన్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. మాస్ హీరోగా ట్రై చేసిన మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్ గా మిగిలింది. ఈ మూవీ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న నితిన్ కొత్త కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అలా వక్కంతం వంశీ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకి తీసుకువెళ్లాడు నితిన్. అలాగే వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్స్ గా ఓ మూవీలో నటించనున్నారు. భీష్మ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టిన నితిన్...దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక దిల్ రాజు ..డైరెక్టర్ వేణుశ్రీరామ్ కి నితిన్ తో మూవీ తెరకెక్కించే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో డైరెక్టర్ వేణు శ్రీరామ్...నితిన్ కి ఎం.సి.ఎ మూవీ సీక్వెల్ స్టోరీ చెప్పి ఎస్ అనిపించుకున్నాడట. వక్కంతం వంశీ సినిమా అయిపోయాక.. నితిన్-వేణు శ్రీరామ్ మూవీ సెట్స్ పైకి వెళ్తుందనే మాట టి.టౌన్ లో వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి అఫిషియల్ అనౌన్స్మెంట్ మరో వారం రోజుల్లో అవకాశం ఉంది. -
మ..మ..మాస్ అంటున్న యంగ్ హీరోలు
చిత్రపరిశ్రమలో మాస్ అండ్ యాక్షన్ సినిమాలకు, ఆ హీరోలకు ఉండే క్రేజే వేరు. మాస్ హీరోల సినిమాలు విడుదలయితే థియేటర్స్‌లో దద్దరిల్లిపోవాల్సిందే. క్లాస్ మూవీస్ ఎన్ని చేసినా రాని ఇమేజ్ ఒక్క మాస్ మూవీతో వస్తుంది. ఆ హీరో మార్కెట్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా డబుల్ అయిపోతుంది. అందుకే ఏ హీరో అయినా మాస్ హీరో అనిపించుకోవడానికే ట్రై చేస్తాడు. ఇప్పుడు మన టాటీవుడ్ యంగ్ హీరోలంతా మాస్ ఇమేజ్‌పై ఫోకస్ చేశారు. ఊరమాస్ కథలను ఎంచుకుంటూ క్లాస్ నుంచి మాస్కు షిఫ్ట్ అవుతున్నారు. వీరిలో నేచురల్ స్టార్ నాని ముందు వరుసలో ఉన్నాడు. అష్టాచమ్మా నుంచి అంటే సుందరానికి.. వరకు నాని చేసిన సినిమాలన్ని క్లాస్ కథలకు సంబంధించినవే. ఇప్పటి వరకు నాని ఫుల్ లెన్త్ మాస్ క్యారెక్టర్ చేయలేదు. కృష్ణార్జున యుద్దంలో మాస్ గెటప్‌లో కనిపించినా.. అది వర్కౌట్ కాలేదు. ఈ సారి నాని తన రూటుని మార్చాడు. ప్రేక్షకులకు తనలోని ఊరమాస్‌ని పరిచయం చేసేందుకు ‘దసరా’తో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్లో నాని గెటప్ అదిరిపోయింది. తెలంగాణ భాషలో నాని చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం మార్చి 30న విడుదల కాబోతుంది. ఈ సినిమా హిట్టయితే నాని మాస్ సినిమాల కౌంట్ పెంచే చాన్స్ ఎక్కువగా ఉంది. మరోవైపు కేరీర్ స్టార్టింగ్‌లో మాస్ హీరో అనిపించుకున్న రామ్ పోతినేని.. మధ్యలో క్లాస్‌కి షిఫ్ట్ అయ్యాడు. ఆయన హీరోగా తెరకెక్కిన క్లాస్ చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించలేకపోయాయి. దీంతో ‘ఇస్మార్ట్ శంకర్’తో మళ్లీ మాస్‌కి షిఫ్ట్ అయ్యాడు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయింది. ఆ తర్వాత వరుసగా రెడ్, ది వారియర్ అనే మాస్ సినిమాలు చేశాడు. అవేవి వర్కౌట్ కాలేదు. దీంతో ఈ సారి మాస్లో మాస్టర్స్ చేసిన బోయపాటితో రామ్ జత కట్టాడు. వీరిద్దరి కాంబినేషన్లో భారీ బడ్జెట్‌తో ఓ మాస్ మూవీ తెరకెక్కుతుంది. ఇక హీరో నితిన్ కూడా మాస్ సినిమాలవైపే మొగ్గు చూపుతున్నాడు. మాచర్ల నియోజకవర్గం సినిమాతో మాస్ ఫ్లేవర్ చూపించిన నితిన్.. ఇప్పుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో కంప్లీట్ మాస్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా పిరియాడికల్ డ్రామా అని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించబోయే సినిమా కూడా పక్కా మాస్ మూవీ అనే మాట ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోంది. అక్కినేని హీరోలు నాగచైతన్య, అఖిల్ కూడా మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్‌తో అఖిల్.. ‘కస్టడీ’తో నాగచైతన్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. -
ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్.. హీరో నితిన్ న్యూ లుక్
స్టార్ హీరో నితిన్ ఇటీవల మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను మెప్పించలేకపోయింది. నితిన్‌కి జోడీగా కృతీశెట్టి నటించింది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశపరిచింది. అయితే తాజాగా హీరో నితిన్ న్యూ లుక్‌లో దర్శనమిచ్చాడు. అంజనేయస్వామి స్వామి దీక్ష ధరించి కనిపించాడు. ఈ విషయాన్ని తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. దీక్ష ధరించిన దుస్తుల్లో ఉన్న ఫోటోను షేర్ చేశారు. బాబాయ్ హోటల్ ప్రారంభించిన నితిన్ హైదరాబాద్‌లో బాబాయ్ హోటల్ బ్రాంచ్‌ను నితిన్ చేతుల మీదుగా మణికొండలో ప్రారంభించారు. డైరెక్టర్ శశికాంత్ తన స్నేహితులతో కలిసి ఫ్రెండ్స్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పేరు మీదే ఈ బాబాయ్ హోటల్‌ను హైద్రాబాద్‌లోని మణికొండకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ వెంకీ కుడుముల, రామ జోగయ్య శాస్త్రి, రచయిత దర్శకుడు వక్కంతం వంశీ పాల్గొన్నారు. Sri Anjaneyam 🙏🙏 Sarvadha Jayam..!! Enjoy ur Aadhivaaram 🤗🤗 pic.twitter.com/JUn0zNnsHi — nithiin (@actor_nithiin) January 22, 2023 -
ఓటీటీలోకి వచ్చేస్తున్న మాచర్ల నియోజకవర్గం..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరో నితిన్, ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి, కేథరిన్ థ్రేసా జంటగా నటించిన పొలిటికల్ యాక్షన్ చిత్రం'మాచర్ల నియోజకవర్గం'. ఆగస్ట్ 12న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. తొలి షో నుంచే ఫ్లాప్‌టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. ఎలాగైన ఈసారి హిట్ కొట్టాలని ఎదురు చూసిన నితిన్‌కు నిరాశే మిగిలింది. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ 'జీ 5'లో డిసెంబరు 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. (చదవండి: కలెక్టర్‌గా నితిన్ మెప్పించాడా? 'మాచర్ల నియోజకవర్గం' మూవీ రివ్యూ) అసలు కథేంటంటే..: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ అందుకున్న హీరో ఫ్యాక్షన్‌ను తలపించే మాచర్ల నియోజకవర్గ రూపురేఖలను ఎలా మార్చాడు? అక్కడి పరిస్థితులను ఎలా చక్కదిద్దాడు? ఈ క్రమంలో హీరో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్న కథాంశంతో నూతన దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించారు. నితిన్ సరసన కృతిశెట్టి, కేథరిన్ నటించారు. ఈ చిత్రం ఓటీటీలో చాలా ఆలస్యంగా వచ్చింది. -
Telangana Politics: బీజేపీ ప్రచారానికి నితిన్, మిథాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. సినీ, క్రీడా, కళా రంగాల ప్రముఖు లను ఆకర్షించే పనిని వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్‌తో, సాయంత్రం సినీ నటుడు నితిన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు అంగీకరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే వారు బీజేపీలో చేరుతారా, లేక కేవలం ప్రచారానికే పరిమితం అవుతారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. రాజకీయ, సాంస్కృతిక అంశాలపై... శనివారం రాత్రి నోవాటెల్‌కు వచ్చిన సినీ నటుడు నితిన్ జేపీ నడ్డాతో సుమారు గంట పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సినిమాలతోపాటు రాజకీయ అంశాలపై వారు చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రాంతం నుంచి ప్రముఖ హీరోగా నితిన్ ఎదగడాన్ని జేపీ నడ్డా అభినందించారని.. సినిమా శక్తివంతమైన మాధ్యమమని, ప్రజల్లో మార్పునకు ఒక సాధనంగా పనిచేస్తుందని పేర్కొన్నారని తెలిపాయి. తాను ప్రధాని మోదీ నుంచి స్ఫూర్తి పొంది అభిమానిగా మారానని, రాబోయే రోజుల్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని నితిన్ పేర్కొన్నట్టు వెల్లడించాయి. ఈ సమావేశం అనంతరం జేపీ నడ్డా తెలుగులో ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణలో ఈ రోజు ప్ర ముఖ నటుడు నితిన్‌ను కలవడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నాం. నితిన్ తన రాబోయే సినిమాల గురించీ చెప్పారు. అతనికి శుభాభినందనలు తెలియజేశాను..’’అని తన ట్వీట్లో నడ్డా పేర్కొన్నారు. క్రీడలకు ప్రాధాన్యం: మిథాలీరాజ్ ప్రధాని మోదీ హయాంలో దేశంలో క్రీడలకు ప్రాధాన్యం పెరిగిందని నడ్డాతో భేటీలో మిథాలీరాజ్ హర్షం వ్యక్తం చేశారు. క్రీడా రంగంలో శిక్షణ, మౌలిక వసతుల కల్పన పెరిగిందని.. క్రీడాకారుల్లో ఉత్సాహం నెలకొందని పేర్కొన్నారు. 20ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్న తనకు క్రీడారంగంలో గత 8 ఏళ్లలో చోటుచేసుకున్న సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడోత్సవాల్లో భారత్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మునుగోడు’పై పకడ్బందీ కార్యాచరణ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా విజయం సాధించే దిశగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగాలని రాష్ట్ర బీజేపీ నేతలకు జేపీ నడ్డా సూచించారు. శనివారం రాత్రి నోవాటెల్ హోటల్లో పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి తదితరులు నడ్డాతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. పార్టీ నేతలు పూర్తి సమన్వయంతో ముందుకెళ్లాలని, టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ.. బీజేపీకి ప్రజా మద్దతును కూడగట్టాలని ఆదేశించారు. ప్రచారానికి ఓకే అన్న మిథాలీరాజ్, నితిన్: కె.లక్ష్మణ్ నితిన్, మిథాలీరాజ్‌లతో నడ్డా జరిపిన భేటీల్లో పాల్గొన్న ఎంపీ కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ దేశానికి సరైన నాయకత్వం అందిస్తున్నట్టు వారు పేర్కొన్నారని కె.లక్ష్మణ్ చెప్పారు. మోదీ కోసం తమ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారని.. ఎన్నికల ప్రచారానికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని వివరించారు. ప్రధాని మోదీని స్వయంగా కలవాలని వారు కోరారని.. దీంతో వారిని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని నడ్డా తనకు సూచించారని తెలిపారు. చదవండి: (జేపీ నడ్డాతో ముగిసిన హీరో నితిన్ భేటీ) -
‘మాచర్ల నియోజకవర్గం’మూవీ ట్విటర్ రివ్యూ
యంగ్ హీరో నితిన్ తాజాగా నటించిన చిత్రం మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ చిత్రం'మాచర్ల నియోజకవర్గం. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీ ఖర్చుతో నిర్మించారు. చిత్రానికి ఎమ్.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘మాచర్ల నియోజకవర్గం’పై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు (ఆగస్ట్ 12)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘మాచర్ల నియోజకవర్గం’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ► సినిమా వేరే లెవల్లో ఉందని.. మాస్ ఎంటర్టైనర్ అని ఓ అభిమాని ట్విటర్లో కామెంట్ చేశాడు. #MacherlaNiyojakavargam Vere level 💥💥 — Sanjay Saahu 🦅 💎 (@MikePanja) August 12, 2022 ► వెన్నెల కిశోర్ కామెడీ బాగుంది. ఇంటర్వెల్ సీన్, సెకండాఫ్ సినిమాకు చాలా కీలకమని ఓ అభిమాని పేర్కొన్నాడు. 1 hr into the movie… Not much going on story wise but @vennelakishore comedy keeps up the movie 👍… Interval and second half will be crucial #MacherlaNiyojakavargam — Rakita (@Perthist_) August 12, 2022 ► సినిమాలో కొత్తదనం లేదని, రొటీన్ స్క్రిప్ట్ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఫస్టాఫ్ మరీ యావరేజ్‌గా ఉందని చెప్పాడు. #MacherlaNiyojakavargam Strictly Below Average 1st Half! Other than a few Vennela Kishore scenes nothing really works so far. Probably one of the most routine scripts and screenplays in recent times. Need a big 2nd half! — Venky Reviews (@venkyreviews) August 12, 2022 ► సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అని ఓ అభిమాని హర్షం వ్యక్తం చేశాడు. #MacherlaNiyojakavargam block buster no .1 telangana megastar @actor_nithiin ..... andhra's jealous of megastar of telangana... common telangana support our megastar — vinc go (@vincgo2) August 12, 2022 ► పాటలు, బీజీఎం పెద్దగా ఆకట్టుకోలేదని ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు. నితిన్ గత సినిమా భీష్మలో 50 శాతం కూడా మాచర్ల నియోజకవర్గం ఆకట్టుకోలేదని అన్నాడు. Songs and BGM as well not good , bheeshma lo not even 50% #MacherlaNiyojakavargam — NTR30 (@kiran_nine) August 12, 2022 ► వెన్నెల కిశోర్ కామెడీ పండిందని ఓ అభిమాని ట్విటర్లో వెల్లడించాడు. #MacherlaNiyojakavargam poor first half 🙃 Vennala Kishore comedy ✅ worked in some parts 👍#nithin #KrithiShetty#MacherlaNiyojakavargamreview — tollywood_united (@united_tolly) August 12, 2022 ► సినిమా బాగుందని ఓ నెటిజన్ హార్ట్ ఎమోజీ ట్వీట్ చేశాడు. ST: #MacherlaNiyojakavargam @actor_nithiin ❤️ — #TheLegendSarvana Fan 🤗 (@MedaramSampath) August 12, 2022 ► వెన్నెల కిశోర్ కామెడీ బాగుందని, ఫస్టాఫ్ యావరేజ్ అని ఓ అభిమాని ట్విటర్లో వెల్లడించాడు. సినిమాకు కీలకమైన ‘అసలు కథ’ ఇప్పుడే మొదలైందని చెప్పుకొచ్చాడు. 1st half : VENNELA KISHORE COMEDY BIG PLUS 👍 SONGS OKAYISH 😌 ROUTINE DRAMA.. INTERVAL BAGUNDI👍 IPPUDEE ASALU KATHA MODALAINDI.. OVERALL AVG 1ST HALF ✅️ @tollymasti #tollymasti . .#MacherlaNiyojakavargam #MacherlaNiyojakavargamReview #Nithin #MacherlaNiyojakavargamUsa — Tollymasti (@tollymasti) August 12, 2022 -
Macherla Niyojakavargam Movie: ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీ స్టిల్స్
-
మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
మాచర్ల కోసం నా సమాధిని పునాది వేయడానికి నేను సిద్ధం.. మాచర్ల ధమ్కీ
నితిన్, కృతీశెట్టి జంటగా ఎంఎస్ రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘మాచర్ల ధమ్కీ’అంటూ ఓ వీడియోని వదిలారు మేకర్స్. ‘మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలారి మంది తమ సమాధులను పునాదులుగా వేశారు. మాచర్ల నియోజకవర్గంలో ధర్మాన్ని కాపాడటం కోసం నా సమాధిని పునాది వేయడానికి నేను సిద్ధం’అంటూ నితిన్ చేప్పే పవర్ఫుల్ డైలాగ్‌లో ఈ స్పెషల్ వీడియో ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో నితిన్..సిద్ధార్థ్ రెడ్డి అనే యంగ్ ఐఏఎస్ అధికారిగా కనిపించబోతున్నాడు. జులై 30న ఈ చిత్రం ట్రైలర్ విడుదల కానుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో అంజలి ఓ స్పెషల్ సాంగ్‌లో నటించించింది. -
యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న ‘రారా రెడ్డి’ సాంగ్
నితిన్, కృతీశెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిరాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన స్పెషల్ సాంగ్ ‘రారా రెడ్డి’ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఈ పాటకి 20 మిలియన్స్ పైగా వ్యూస్, 3లక్షలకు పైగా లైకులను సొంతం చేసుకొని యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. నితిన్, అంజలి ఎనర్జిటిక్ కెమిస్ట్రీ , కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు, మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన మాస్ డ్యాన్స్ నంబర్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించాయి. ఇక పాటలోని ‘రాను రాను అంటూనే చిన్నదో’ పల్లవికి లక్షలాది సంఖ్యలో రీల్స్ వచ్చాయి. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నాడు. ఆగస్ట్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రా రా రెడ్డి.. . అంజలి స్పెషల్ సాంగ్ ప్రోమో అదిరింది!
నితిన్, కృతీశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిరాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి స్పెషల్ సాంగ్ చేస్తుంది. తాజాగా దానికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు మేకర్స్. (చదవండి: పాకిస్తాన్లో చరిత్ర సృష్టించిన ‘మేజర్’) ‘రారా రెడ్డి.. ’అంటూ సాగే ఈ పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా మహతి స్వరసాగర్ లైవ్లీ బీట్లతో ఊర మాస్ ట్రాక్‌ని స్కోర్ చేశారు. లిప్సిక అద్భుతంగా ఆలపించారు. ఇక నితిన్, అంజలి కలిసే వేసే స్టెప్పులు పాటను మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఫుల్ సాంగ్ జులై 9న విడుదల కానుంది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నాడు. ఆగస్ట్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మరోసారి స్పెషల్ సాంగ్‌లో అంజలి.. నితిన్‌తో కలిసి స్టెప్పులు
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతీ శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం..టైటిల్ అనౌన్స్మెంట్ నుండే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఇటీవల విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ కు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆగస్ట్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో హీరోయిన్ అంజలి స్పెషల్ సాంగ్ చేయబోతుందట. ఈ మేరకు ఓ అదిరిపోయే పోస్టర్ని కూడా విడుదల చేశారు. అందులో అంజలి హాట్ ఫోజుతో కుర్రాళ్ల మతి పోగొట్టేలా ఉంది. ఈ స్పెషల్ సాంగ్‌కి సంబంధించిన మరో అప్డేట్ని సోమవారం ప్రకటించనున్నారు. అంజలికి ఇది రెండో స్పెషల్ సాంగ్. గతంలో సరైనోడులో అల్లు అర్జున్‌తో కలిసి స్టెప్పులేసింది. -
యంగ్ హీరోస్ డేరింగ్ స్టెప్స్.. ఒక్కసారిగా మారిన ప్లానింగ్!
యంగ్ హీరోస్ అని ఎంత కాలం పిలుపించుకుంటారు. యూత్ ఆడియెన్స్ ను ఎంత కాలం ఎంటర్టైన్ చేస్తారు? అదే పనిగా ఎంత కాలం ప్రేమకథల్లో కనిపిస్తారు? అందుకే ఈ జనరేషన్ యంగ్ హీరోస్ తమ ఇమేజ్ మార్చుకునేందుకు సీరియస్ గా ట్రై చేస్తున్నారు. స్టార్ హీరోలతో పోటీ పడేందుకు డైరెక్ట్ గా స్టార్ డైరెక్టర్స్ తోనే మూవీస్ కమిట్ అవుతున్న యంగ్ హీరోస్‌పై ఓ లుక్కేద్దాం. హీరోస్‌పై ఓ లనేను శైలజా, ఉన్నది ఒక్కటే జిందగీ హలో గురు ప్రేమ కోసమే లాంటి సినిమాలు చేస్తూ వచ్చిన నర్జిటిక్ స్టార్ రామ్.. పూరి జగన్నాథ్ మేకింగ్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో నయా ఇమేజ్ అందుకున్నాడు. ముఖ్యంగా మాస్ కు బాగా చేరువయ్యాడు. చాక్లెట్ బాయ్ కాస్త ఇప్పుడు ‘వారియర్’ గా మారాడు. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుంది. జూలై 14న ఈ చిత్రం విడుదల కాబోతంది. త్వరలో బోయపాటి తో కలసి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక రామ్ కోరుకుంటున్న ఛేంజ్ ఓవర్.. స్టార్ డైరెక్టర్ తో వచ్చే నయా ఇమేజ్‌ని ఇప్పుడు మిగితా యంగ్ హీరోస్ కావాలనకుంటున్నారు. అందుకే నితిన్ కూడా రామ్ బాట పడ్డాడు. చెక్, రంగ్ దే, మాస్ట్రో లాంటి మూవీస్ తర్వాత నితిన్ చేస్తున్న మాస్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ సురేందర్ రెడ్డితో ఓ మూవీ చేయబోతున్నాడు. అది కూడా పక్కా మాస్ సినిమానే. అలాగే అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమా తెరకెక్కించిన వక్కంతం వంశీతోనూ ఊరమాస్ మూవీ చేస్తున్నాడు. మరోవైపు అక్కినేని నాగచైతన్య కూడా మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. వెంకీమామ, లవ్ స్టోరీ, థ్యాంక్యూ చిత్రాల తర్వాత నాగ చైతన్య కూడా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ తో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే వెంకట్ ప్రభు తో మూవీ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు సర్కారు వారి పాట డైరెక్టర్ పరశురామ్ తో మూవీ చేయబోతున్నాడు. మొత్తానికి యంగ్ హీరోలు రూటు మార్చి మాస్ బాట పట్టారు. -
ఆ విషయంలో వెంకీ, సూర్యను ఫాలో అవుతున్న నితిన్
ఒకసారి ఓటీటీకి అలవాటు పడితే అక్కడికి నుంచి బయటి రావడం చాలా కష్టం.సూర్య అలాగే అమెజాన్ కోసం సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.వెంకీ కూడా ప్రైమ్ కోసం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఇచ్చేశాడు.ఇప్పుడు నితిన్ కూడా అదే దారిలో వెళ్లాలి అనుకుంటున్నాడట. సెప్టెంబర్ లో హాట్ స్టార్ లోకి మాస్ట్రాతో వచ్చాడు నితిన్.పెద్ద సెన్సేషన్ సృష్టించకపోయినా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన నితిన్ కు మంచి లాభాలనే తెచ్చిపెట్టింది.అందుకే మరో మూవీని ఓటీటీ కోసం నిర్మించి, డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదల చేయాలనుకుంటున్నాడట.అందుకోసం పర్ఫెక్ట్ ఓటీటీ స్టోరీకోసం వెదుకుతున్నాడట. ఆకాశం నీ హద్దురా తర్వాత సూర్య ఇదే ఇలాగే వెళ్లాడు. ప్రైమ్ కోసం జైభీమ్ చిత్రం తీసి లాభాలను అందుకున్నాడు.నారప్ప తర్వాత వెంకటేష్ కూడా సేమ్ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు.నవంబర్ 25 దృశ్యం 2ను చిత్రాన్ని డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నాడు. ఇక నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ మాస్ మూవీని ఏప్రిల్ 29న డైరెక్ట్ గా థియేటర్లలో విడుదల చేయబోతున్నాడు.ఆ తర్వాత ఓటీటీ కోసం ఓ సినిమా చేయబోతున్నాడని టాక్. -
సేఫ్‌గా లేనంటూ నితిన్ భార్య పోస్ట్.. వీడియో వైరల్
దీపావళి పండగను టాలీవుడ్ సెలెబ్రిటీలు ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక పూజలు, స్పెషల్ వంకటకాలతో పాటు పటాసులు కాలుస్తూ ఎంజాయ్ చేశారు. ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో నితిన్ భార్య షాలిని షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో షాలినిని గన్‌తో బెదిరిస్తున్నాడు నితిన్. అయితే అది నిజం గన్ కాదు. చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మ తుపాకీ. దీపావళి పండగవేళ.. నితిన్ చిన్నపిల్లలాడిలా బొమ్మ తుపాకీ చేతపట్టి ఇంట్లో హల్చల్ చేశారు. షాలినిని షూట్ చేయగా.. ఆ సౌండ్ కి ఆమె చెవులు మూసుకుంది. ఈ వీడియోని షాలిని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘అందరికి హ్యాపీ అండ్ సేఫ్ దీపావళీ.. కానీ నేను మాత్రం సేఫ్ గా లేననిపిస్తోంది’అని కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నితిన్ ప్రస్తుతం ‘మాచర్ల నియోజక వర్గం’ చిత్రంలో నటిస్తున్నాడు. పూరీ జగన్నాథ్ శిష్యుడు ఎం.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. నితిన్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది. ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. View this post on Instagram A post shared by Shalini Kandukuri (@shalinikandukuri) -
‘మ్యాస్ట్రో’ మూవీ రివ్యూ
టైటిల్ : మ్యాస్ట్రో నటీనటులు :నితిన్, తమన్నా భాటియా, నభా నటేష్, జిషు సేన్ గుప్తా, నరేష్, శ్రీముఖి, అనన్య, హర్షవర్ధన్, రచ్చ రవి, మంగ్లీ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రేష్ట్ మూవీస్ నిర్మాతలు : సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి దర్శకత్వం: మేర్లపాక గాంధీ సంగీతం : మహతి స్వర సాగర్ సినిమాటోగ్రఫీ : వై యువరాజ్ ఎడిటింగ్: ఎస్ఆర్ శేఖర్ విడుదల తేది : సెప్టెంబర్ 17, 2021(డిస్నీ+హాట్‌స్టార్) భీష్మ సూపర్ హిట్ కావడంతో అదే జోష్‌తో వరుస సినిమాలు చేస్తున్నాడు యంగ్ హీరో నితిన్. కాని భీష్మ రేంజ్ హిట్‌ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఆయన ఇటీవల చేసిన చెక్, రంగ్ దే మూవీస్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయాయి. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని మాస్ట్రో లుక్‌లోకి మారాడు నితిన్. బాలీవుడ్లో వచ్చిన సూపర్ హిట్ అంధాధున్‌కు తెలుగు రీమేక్. ఈ మూవీ శుక్రవారం(సెప్టెంబర్ 17)న ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తొలిసారి నితిన్ అంధుడి పాత్ర పోషించడంతో మ్యాస్ట్రోపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలు ‘మ్యాస్ట్రో’ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. చూపు ఉన్న అంధుడిగా నటిస్తాడు అరుణ్(నితిన్). అతనిలో ఉన్న గొప్ప టాలెండ్ ఏంటంటే పియానో చక్కగా వాయించడం. ఒకసారి తన పియానో పాడవడంతో కొత్తది కొనాలని చూస్తాడు. ఈ క్రమంలో పెడ్రో అనే రెస్టారెంట్లో పియానో అమ్మకానికి పెట్టినట్లు తెలుసుకొని,చూసేందుకు వెళ్తాడు. అక్కడ తన మ్యూజిక్ ప్రతిభ చూపించి అందరి మన్ననలు పొందుతాడు. అరుణ్ టాలెంట్ నచ్చి అతనితో ప్రేమలో పడిపోతుంది రెస్టారెంట్ ఓనర్ కూతురు సోఫీ(నభా నటేశ్). ఆ రెస్టారెంట్‌కు తరచు వచ్చే సినీ హీరో మోహన్ (వీకే నరేష్).. అరుణ్ పియానో సంగీతానికి ఫిదా అవుతాడు. తన భార్య సిమ్రన్ (తమన్నా భాటియా) బర్త్‌డే సందర్భంగా ప్రైవేట్ కన్సర్ట్ను ఏర్పాటు చేయాలని అరుణ్‌ను తన ఇంటికి పిలుస్తాడు. అరుణ్ మోహన్ ఇంటికి వెళ్లేసరికి అతను హత్యకు గురవుతాడు. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? ఈ హత్యకు సిమ్రాన్, సీఐ బాబీ ( జిషు సేన్ గుప్తా)లకు సంబంధం ఏంటి? అరుణ్ అంధుడిగా ఎందుకు నటించాలనుకున్నాడు? మోహన్ హత్యతో అరుణ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనేది తెలియాలంటే డిస్నీ+హాట్‌స్టార్‌లో సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. నితిన్ తొలిసారి అంధుడిగా నటించిన సినిమా ఇది. బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రను తెలుగులో నితిన్ చేశాడు. ఆయుష్మాన్‌కు సమానంగా అంధుడి పాత్రలో నటించి మెప్పించే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్‌లో అంధుడిగా నవ్వించిన నితిన్.. సెకండాఫ్‌లో భావోద్వేగాలపరంగా చక్కటి హావభావాలు పలికించాడు. అంధుడు అరుణ్ పాత్రకు న్యాయం చేసేందుకు శాయశక్తులా కృషి చేశాడు. ఇక ఈ సినిమాలో నితిన్ తర్వాత బాగా పండిన పాత్ర తమన్నాది. సిమ్రన్ పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేసింది. హిందీలో టబు పోషించిన పాత్ర అది. విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో తమన్నా ఒదిగిపోయింది. ఎమోషనల్ సన్నివేశాల్లో తనదైన నటన కనబరిచింది. సోఫి పాత్రలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ మెప్పించింది. జిషు సేన్ గుప్త, నభా నటేశ్, శ్రీముఖి, రచ్చ రవి, మంగ్లీ, అనన్య నాగళ్ల, హర్ష వర్దన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎలా ఉందంటే.. హిందీలో వచ్చి, సూపర్ హిట్ అయినా ‘అంధాధున్’ మూవీకి తెలుగు రీమేకే‘మ్యాస్ట్రో’.సాధారణంగా రీమేక్ అనగానే మాతృకతో పోల్చి చూస్తారు. అందులో ఉన్నది.. ఇందులో లేనిది ఏంటని నిశితంగా పరిశీలిస్తారు. ఉన్నది ఉన్నట్లు తీస్తే కాపీ అంటారు. ఏదైనా యాడ్ చేస్తే.. అనవసరంగా యాడ్ చేసి మంచి సినిమాను చెడగొట్టారని చెబుతారు. అందుకే రీమేక్ అనేది దర్శకుడికి కత్తిమీద సాము లాంటిదనే చెప్పాలి. ఈ విషయంలో దర్శకుడు మేర్లపాక గాంధీ విజయవంతం అయ్యాడు. మాతృకలోని ఆత్మను ఏమాత్రం చెడకుండా ‘అంధాదున్’ని తెలుగు ప్రేక్షకులు మ్యాస్ట్రోగా అందించాడు. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే లాంటి దిగ్గజ నటులు సెట్ చేసిన టార్గెట్‌ని వందశాతం అందుకోలేకపోయినా.. తెలుగు నేటివిటీకి అనుగుణంగా సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాఫ్‌లో అంధుడిగా నితిన్ చేసే సరదా సీన్స్ ప్రేక్షకులను నవ్విస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సీఐ బాబీ అరుణ్ణి చంపాలనుకోవడం.. దాని నుంచి అరుణ్ తప్పించుకొని గోవాకు వెళ్లేందుకు ప్రయత్నించే సీన్స్ ఆసక్తిని కలిగిస్తాయి. సెకండాఫ్‌లో అరుణ్, సిమ్రన్ మధ్యల వచ్చే కొన్ని సీన్స్ నెమ్మదిగా సాగడం సినిమాకు కాస్త మైనస్. ఇక క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు దర్శకుడు. అంధాదున్ సినిమా చూడకుండా డెరెక్ట్‌గా మాస్ట్రో చూసేవారిని థ్రిల్లింగ్ మూవీ చూశామనే అనుభూతి కలుగుతుంది. మహతి స్వర సాగర్ బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. వై యువరాజ్ సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Maestro: ప్రమోషనల్ సాంగ్ అదిరిందిగా!
నితిన్, నభా నటేశ్, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం మాస్ట్రో. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. హిందీ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ ‘అంధాధున్’మూవీకి తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 17న డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్క్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యం శనివారం ప్రమోషన్ సాంగ్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘షూరూ కరో’అంటూ సాగే ఈ పాట హీరో, హీరోయిన్ల లైఫ్ గురించి తెలియజేస్తుంది. ఈ సాంగ్‌కి శ్రిమణి లిరిక్స్ అందించగా, రేవంత్ ఆలపించాడు. మహతి స్వర సాగర్ అధ్భుత సంగీతాన్ని అందించాడు. (చదవండి: మాస్ట్రో’చూశాక జనాలు ఆ మాటే చెబుతారు : నభా నటేశ్) -
‘మాస్ట్రో’చూశాక జనాలు ఆ మాటే చెబుతారు : నభా నటేశ్
‘అంధాదున్ సినిమా విడుదలైనప్పుడు చూశాను. అది బాలీవుడ్‌కు టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా అని చెప్పుకోవచ్చు. అప్పట్లో అంధాదున్ గురించి చాలా వినిపించింది. ఈ రీమేక్‌లో ఆఫర్ రావడంతో చాలా హ్యాపీగా అనిపించింది. జనాలు ఇప్పుడు కొత్త సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి చిత్రంలో నాకు కూడా అవకాశం రావడం హ్యాపీగా అనిపించింది’అన్నారు హీరోయిన్ నభా నటేశ్. నితిన్, నభా నటేశ్, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం మాస్ట్రో. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 17న డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో రాబోతోన్న సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు... ► ఇది నా మొదటి రీమేక్ సినిమా. అది నాకు భయంగా అనిపించింది. రాధికా ఆప్టే అద్బుతంగానటించింది. కానీ అది నేను ఎలా చేయగలను? అని భయం వేసింది. కానీ మళ్లీ సినిమా చూడకూడదు..ప్రభావితం అవుతాను అని అనుకున్నాను. ► కరోనా పీక్స్‌లో ఉన్న సమయంలోనే షూటింగ్ ప్రారంభించాం. మేమే మొదటగా సెట్‌కు వెళ్లామనుకుంటాను. అప్పుడు రెస్టారెంట్, పబ్ సీన్స్ చేశాం. ఎంతో మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు ఉండేవారు. షాట్ చేసేసి మేం పరిగెత్తే వాళ్లం. మా జాగ్రత్తలు మేం తీసుకునేవాళ్లం. అంధుడిగా నితిన్ అద్భుతంగా నటించారు. మా సీన్స్, సాంగ్స్ బాగా వచ్చాయి. ► కరోనా సమయంలో నావి రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఇది మూడో సినిమా. ఇంకా థియేటర్ల సమస్య ఉంది. కానీ ఇప్పుడు ఓటీటీలో అయితే అందరూ చూసేందుకు అవకాశం ఉంది. ► కథను మాత్రం తీసుకుని దర్శకుడు తన విజన్‌తో సినిమాను తీశారు. దానికి దీనికి సంబంధం ఉండదు. నా పాత్రలో ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. తెలుగు చిత్రంలానే ఉంటుంది. కథలోని జీవం మాత్రం అలానే ఉంటుంది. ► రీమేక్ చేయడం ఇదే మొదటి సారి. కచ్చితంగా పోలికలు ఉంటాయి. మూవీ చూసిన తరువాత జనాలు ఎలాంటి రియాక్షన్ ఇస్తారనేది చూడాలి. నా పాత్రను ఒరిజినల్ దాంతో ఎలా పోలుస్తారు? అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ► లాక్డౌన్ సమయంలో సినిమాలు చూడటమే నా పని. ఫస్ట్ వేవ్‌లో చాలా కంటెంట్ వచ్చింది. అన్ని భాషల చిత్రాలు చూశాను. కానీ ఈ సారి మాత్రం అంతగా కుదరలేదు. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాను. పైగా కంటెంట్ కూడా అంతగా రాలేదు. ► డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేశాను. కానీ కుదరలేదు. నేను బెంగళూరులో ఉంటున్నాను.. రావడం వెళ్లడం.. ఈ కరోనా నిబంధనలు.. ఇలా టైం కుదరలేదు. అందుకే డబ్బింగ్ చెప్పలేకపోయాను. తదుపరి చిత్రాల్లో కచ్చితంగా డబ్బింగ్ చెబుతాను. ► లాక్డౌన్ తరువాత ఇండియాలోనే మొదటి సారి షూటింగ్ చేసింది మేమే. సోలో బతుకే సో బెటర్ సినిమాను కూడా రిలీజ్ చేశాం. అప్పుడు భయభయంగానే చేశాం. వీలైనంత తక్కువ మందితో, అన్ని జాగ్రత్తలు తీసుకుని చేశాం. కానీ ఇప్పుడు అంత భయం లేదు. అలవాటు అయింది. ► మన తెలుగు సినిమాకు ఉండే ఆడియెన్స్ ఎప్పుడూ ఉంటారు. మన వారి కోసం ఎన్నో మార్పులు చేర్పులు చేశాం. పాటలు కూడా కనెక్ట్ అయ్యేలానే పెట్టాం. మన తెలుగు ఆడియెన్స్ రీచ్ వేరు. ఒరిజినల్ సినిమాను చూసినా కూడా ఇది కూడా చూస్తారు. కొత్త చిత్రాల కోసం మన వాళ్లు ఎదురుచూస్తున్నారు. అదే మాకు అడ్వాంటేజ్. నేను కూడా ఇంకా ఈ సినిమాను చూడలేదు. ఎంతో ఎదురుచూస్తున్నాను. ► నితిన్‌తో పని చేయడం ఎంతో సరదాగా ఉంటుంది. ఎప్పుడు షూటింగ్ ప్రారంభించాం.. ఎప్పుడు పూర్తి చేశామో కూడా తెలియకుండా గడిచింది. దర్శకుడు, చిత్రయూనిట్ మొత్తం, తమన్నా ఇలా అందరూ ఎంతో సహకరించారు. ► భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల గురించి అధికారికంగా ప్రకటించేంత వరకు ఇప్పుడే ఏమీ చెప్పలేను. అన్ని రకాల పాత్రలను చేయాలని ఉంది. అన్ని రకాల జానర్లలో సినిమాలు చేస్తున్నాను. అది నాకు చాలా ఆనందంగా ఉంది. మాస్ట్రోలోనూ కొత్తగా కనిపిస్తాను. సినిమా చూశాక జనాలు కూడా అదే అంటారు. ఇంకా కొత్త పాత్రలను చేయాలని అనుకుంటున్నాను. -
బంగారంలా మెరిసిపోతున్న సమంత.. మైమరిచిపోయిన నితిన్
సూర్యోదయమా లేదా సూర్యాస్తమయా అంటూ ఓ హాట్ ఫోటోని అభిమానులతో షేర్ చేసుకుంది హీరోయిన్ రాశీఖన్నా మార్నింగ్ పాప్ అంటూ ఉదయాన్నే లాలీపాప్ తింటూ ఫోటోకి పోజులు ఇచ్చింది రాజ్‌పుత్ పాయల్ బంగారంలా మెరిసిపోతున్న సమంత సముద్రం అందాలను ఆస్వాదిస్తున్నాడు నితిన్. అంతంలేని నీలిరంగు అందాల మధ్య నన్ను నేనే మర్చిపోయానంటూ ఓ ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు. View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by N I T H I I N (@actor_nithiin) View this post on Instagram A post shared by Panja Vaishnav Tej (@panja_vaishnav_tej) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) View this post on Instagram A post shared by N I T H I I N (@actor_nithiin) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) -
Maestro: బీచ్‌లో పియానో వాయిస్తున్న నితిన్
వెర్సటైల్ హీరో నితిన్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం `మ్యాస్ట్రో`. ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. నెక్ట్స్ వీక్ నుండి మ్యాస్ట్రో మ్యూజిక్ ఫెస్ట్ ప్రారంభంకానుందని ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదలచేసిన పోస్టర్లో నితిన్ బీచ్‌లో పియానో వాయిస్తూ కనిపిస్తున్నారు. నితిన్ హిట్ మూవీ ‘భీష్మ’కు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగర్ ఈ మ్యాస్ట్రో చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో మరో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను ఆశించొచ్చు. ఇప్పటికే నితిన్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ‘మ్యాస్ట్రో’ సినిమాకు జె యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. 🎹 #MaestroMusicFest 🎹 Begins next week - A @mahathi_sagar Musical! 🥁 'Youth Star' @actor_nithiin as #Maestro arriving soon! 🎵@tamannaahspeaks @MerlapakaG @SreshthMovies @NabhaNatesh #SudhakarReddy #NikithaReddy #RajKumarAkella pic.twitter.com/eLmHiSZlNP — Sreshth Movies (@SreshthMovies) July 10, 2021 -
నభా నటేశ్‌తో బైక్ రైడ్‌కి వెళ్లిన నితిన్
జయాపజయాలతో సంబంధం లేకుండా వరసు సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో నితిన్. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలను వదిలాడు. వాటిలో ‘చెక్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడగా, ‘రంగ్‌దే’ పర్వాలేదనిపించింది. ఇక నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. బాలీవుడ్ సూపర్‌హిట్ ‘అంధాదున్’కి రీమేక్ ఇది. నటా నటేశ్ హీరోయిన్గా నటిస్తోంది. నితిన్ పుట్టిన రోజున(మార్చి 30) ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ వదిలిన చిత్ర బృందం, తాజాగా శ్రీరామనవమి పురస్కరించుకొని ఓ కొత్త పోస్టర్ని విడుదల చేసింది. స్కూటర్ ను నభా నటేశ్ నడుపుతూ ఉండగా.. అంధుడి పాత్రను పోషిస్తున్న నితిన్ ఆమె వెనక కూర్చుని ఉన్నాడు. పోస్టర్ చాలా కలర్ ఫుల్ గా ఉంది. తమన్నా ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను, జూన్ 11న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. Love is Blind and Love doesn’t Discriminate! #MAESTRO🎹 is on the way with his girl to wish you a Happy #SriRamaNavami 🏹💥@actor_nithiin @NabhaNatesh @tamannaahspeaks @MerlapakaG @SreshthMovies #SudhakarReddy #NikithaReddy #RajKumarAkella @mahathi_sagar @Jisshusengupta pic.twitter.com/RO3GdbcDuI — BARaju (@baraju_SuperHit) April 21, 2021 చదవండి: గుండుతో హీరోయిన్ రష్మిక!.. ఫోటోలు వైరల్ 'అతని వల్లే ఆర్తి అగర్వాల్ కెరీర్ ఫేడ్ అవుట్ అయ్యింది' -
నితిన్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
సినిమా అవకాశాల కోసం తిరగకుండానే తేజ లాంటి పెద్ద దర్శకుడి రూపంలో ఆ యువకుడికి హీరోగా అవకాశం వచ్చింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ప్రయత్నాలు చేయకుండా వినాయక్, రాజమౌళి, రాఘవేంద్రరావు, కృష్ణవంశి లాంటి బడా డైరెక్టర్లు తనని హీరోగా సెలక్ట్ చేసుకున్నారు. ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. అతి చిన్న వయసులోనే స్టార్ అయిపోయాడు. కాలం అడ్డం తిరిగింది. వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. స్టార్ హోదా పోయింది. దగ్గరి వాళ్లు దూరమయ్యారు. అయినా ‘ధైర్యం’గా నిలబడ్డాడు. తప్పిదాలు తెలుసుకున్నాడు. ఆచి తూచి కథలు ఎంచుకున్నాడు. ‘ఇష్క్’తో పనిచేశాడు. పుష్కరకాలం తర్వాత మళ్లీ వి‘జయం’ వరించింది. తనదైన నటనతో ప్రేక్షకుల ‘దిల్’లో స్థానం సంపాదించుకొని స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అతనే యంగ్ హీరో నితిన్. ఈ ‘అల్లరి బుల్లోడి’ 38వ పుట్టిన రోజు నేడు (మార్చి 30). ఈ సందర్భంగా నితిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. ► నితిన్ పూర్తి పేరు నితిన్ కుమార్ రెడ్డి.1983 మార్చి 30న సుధాకర్‌రెడ్డి, విద్యారెడ్డి దంపతులకు నిజామాబాద్‌లో జన్మించాడు. ► నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి పాపులర్ డిస్ట్రిబ్యూటర్. ► నువ్వు-నేను సినిమా సమయంలో డైరెక్టర్ తేజ.. నితిన్ ని చూసి నా తర్వాత సినిమా హీరోగా ఛాన్స్ ఇచ్చాడు. ► 2002లో 'జయం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడ నితన్ ► తొలి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డును గూడ అందుకున్నాడు ► దర్శకధీరుడు రాజమౌళి తీసిన ‘సై’ సినిమా నితిన్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది ► ఒకానొక దశలో ఏకంగా దశాబ్దానికి పైగా వరసగా 14 సినిమాలు ప్లాపులు వచ్చాయి నితిన్‌కి. ► 2012లో వచ్చిన 'ఇష్క్' సినిమాతో మళ్లీ సక్సెస్ బాటపట్టాడు ► 2020లో వెంకి కుడుముల రూపొందించిన ‘భీష్మ’తో మరో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు ► ఈ ఏడాది చెక్‌తో ఎంట్రీ ఇచ్చి.. తాజాగా రంగ్‌దే మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు ► హీరోగానే కాకుండా.. నిర్మాతగా, గాయకుడిగా తనకంటూ ప్రత్యే గుర్తింపు తెచ్చుకున్నాడు ► పవన్ కల్యాణ్ నటించిన తొలి ప్రేమను 28సార్లు చూసి పవర్ స్టార్‌కు వీరాభిమానిగా మారాడు. ► జూలై 16, 2020న షాలిని కందుకూరితో నితిన్ వివాహం జరిగింది. ఈ వేడుకకి పవన్ కల్యాణ్ హాజరయ్యాడు ► నితిన్ ప్రస్తుతం 'అందాధూన్' రీమేక్ ‘మాస్ట్రో’లో నటిస్తున్నాడు. -
ఏదో జరిగింది.. ఆసక్తికరంగా నితిన్ ‘మాస్ట్రో’ ఫస్ట్ లుక్
కళ్లు కన బడవు.. స్టిక్ సాయంతో అడుగులు ముందుకు వేస్తున్నాడు. అది ఓకే.. కానీ అక్కడే ఉన్న పియానో మీద రక్తపు మరకలు ఈ వ్యక్తి ఏదో హత్య చేశాడనే అనుమానం రేకెత్తించే విధంగా ఉన్నాయి. లేక వేరే ఎవరైనా హత్య చూసి, ఇతనిపై పడేయాలని ప్లాన్ చేశారా? అసలు విషయం ఏంటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఎన్ . సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ ఇది. నితిన్ పుట్టినరోజు (మార్చి 30) సందర్భంగా ఈ లుక్ విడుదల చేశారు. అలాగే ఈ చిత్రానికి ‘మాస్ట్రో’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇందులో నితిన్ అంధుడిగా నటిస్తున్నారు. నితిన్ సరసన నభా నటేశ్ నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రధానపాత్ర చేస్తున్నారు. జూన్ 11న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: మహతీ స్వరసాగర్, కెమెరా: జె. యువరాజ్, సమర్పణ: రాజ్‌కుమార్ ఆకెళ్ల. చదవండి: లవ్‌స్టోరీ’ వాయిదాపై చిత్ర యూనిట్ క్లారిటీ 'పదహారువందల మందిని ప్రేమించా' -
‘రంగ్‌దే’ మూవీ రివ్యూ
టైటిల్ : రంగ్‌దే జానర్: రొమాంటిక్ ఎంటర్టైనర్ నటీనటులు : నితిన్, కిర్తి సురేశ్, నరేశ్, వెన్నెల కిశోర్, కౌసల్య, బ్రహ్మజీ తదితరులు నిర్మాణ సంస్థ : సితారా ఎంటర్టైన్మెంట్ దర్శకత్వం : వెంకీ అట్లూరి సంగీతం : వీ శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ : పీసీ శ్రీరాం ఎడిటింగ్ : నవీన్ నూలీ విడుదల తేది : మార్చి 26, 2021 గతేడాది ‘భీష్మ’తో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నితిన్.. ఈ ఏడాది ఆదిలోనే పరాజయాన్ని చవిచూశాడు. ఆయన హీరోగా నటించిన ‘చెక్’ మూవీ ఫిబ్రవరి 26న విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘చెక్’ మూవీకి ప్రేక్షకులు చెక్ పెట్టారు. దీంతో ఈ సారి పక్కా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు నితిన్. ఇందులో భాగంగానే ‘తొలి ప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరితో కలిసి ‘రంగ్ దే’ మూవీ చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీనికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేడయంతో ‘రంగ్‌దే’పై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘రంగ్‌దే’ టీమ్ అందుకుందా? నితిన్ కెరీర్లో 29వ సినిమాగా వచ్చిన ‘రంగ్‌దే’ని ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథ అర్జున్(నితిన్) చిన్నప్పటి నుంచి చదువులో వెనకబడతాడు. అదే పక్కింట్లోకి వచ్చిన అను(కీర్తి సురేష్) టాపర్. దీంతో ప్రతిసారి అర్జున్ వాళ్ల నాన్న(నరేశ్)అనుతో పోలుస్తూ అతన్ని తిడుతుంటాడు. ఇలా ఫస్ట్ క్లాస్ నుంచి బీటెక్ వరకు అను వల్ల అర్జున్‌కు తిట్లు పడుతూనే ఉంటాయి. దీంతో అర్జున్‌కు అను అంటే విపరీతమైన కోపం, ద్వేషం ఏర్పడుతుంది. కానీ అనుకు మాత్రం అర్జున్ అంటే ఇష్టం. పెద్దయ్యాక ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారుతంద. అర్జున్‌కు మాత్రం వయసుతో పాటు అనుపై కోపం పెరుగుతూనే వస్తుంది. ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ వార్ జరుగుతూనే ఉంటుంది. అయితే అనుకొని ఒక సంఘటన వల్ల అర్జున్ అనుని పెళ్లి చేసుకోవాల్సివస్తుంది. అనుతో మాట్లాడడానికే ఇష్టపడని అర్జున్ ఆమెను పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? పెళ్లి తర్వాత ఆమెతో కాపురం ఎలా చేశాడు? వారిద్దరి మధ్య గొడవలు అలానే నడిచాయా? లేదా ఒకరినొకరు అర్థం చేసుకొని సంసారం చేశారా? చివరికి వారిద్దరి ఇగోలు పక్కనపెట్టి ఎలా ఒక్కటయ్యారు అనేదే మిగతా కథ. నటీనటులు అల్లరిగా తిరిగే అర్జున్ పాత్రలో నితిన్ అద్భుతంగా నటించాడు. క్యూట్ అండ్ స్టైలీష్ లుక్‌తో అదరగొట్టాడు. కామెడీ స్లీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాలలో అవలీలగా నటించాడు. నచ్చని భార్యతో కాపురం చేయమంటే ఎంత చికాకుగా ఉంటుందో అర్జున్ పాత్ర తెలియజేస్తుంది. ఇక మహానటి కీర్తి సురేష్ అల్లరి పిల్ల అను పాత్రలో జీవించేసింది. అమాయకంగా ఉంటూనే అర్జున్‌ని ఇరకాటంతో పడేస్తుంది. కొన్ని ఎమోషన్ సీన్లలో కూడా అవలీలగా నటించి నిజంగానే మహానటి అనిపించుకుంది. హీరో తండ్రి పాత్రలో నరేశ్ అలరించాడు. తనదైన శైలీలో కామెడీ చేస్తూ నవ్వులు పూయించాడు. ఇక హీరో స్నేహితులుగా ‘కలర్ ఫోటో’ ఫేమ్ సుహాస్, అభినవ్ గౌతమ్ పర్వాలేదనిపించారు. సెకండాఫ్‌లో వచ్చిన వెన్నల కిషోర్ ఉన్నంతలో కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. వినీత్, సత్యం రాజేశ్, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ పక్క పక్కనే ఉండే రెండు కుటుంబాల కథ ఇది. సహజంగానే మనం మన ఇంట్లోవాళ్లను పక్కింటివాళ్లతో పోల్చి చూస్తుంటాం. ముఖ్యంగా చదువు విషయంలో ఈ పోలికలు మరీ ఎక్కువ. తమ బిడ్డ కంటే పక్కింటి వాళ్లు బిడ్డకు ఒక్క మార్కు ఎక్కువ వచ్చిన బాధపడే తల్లిదండ్రులు కోకొల్లలు. దీంతో పక్కింటి వాళ్లతో పోల్చడంతో సహజంగానే ఆ పిల్లల మధ్య అసూయ, ద్వేషం లాంటి ఏర్పడతాయి. ‘రంగ్ దే’ సినిమా నేపథ్యం కూడా అదే. ఒకరంటే ఒకరికి పడని ఓ అబ్బాయి, ఓ అమ్మాయి మధ్య వ్యవహారం పెళ్లిదాకా వస్తే ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయనేదే ‘రంగ్‌దే’ కథ. దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పాలనుకున్న పాయింట్‌ను కాస్త ఎమోషనల్‌గా చూపించాలనుకున్నాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. కథలో కొత్తదనం ఏమిలేదు కానీ తెరపై చూపించిన విధానం బాగుంది. ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా కథనాన్ని సాగించాడు. హీరో హీరోయిన్ మధ్య ఇగో, క్లాషెస్ లాంటి సన్నివేశాలు ప్రేక్షకుడి అలరిస్తాయి. అను, అర్జున్ మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ వార్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంది. అయితే స్లో నెరెషన్ మాత్రం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. ఇంటర్వెల్లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం సెకండాఫ్‌పై మరింత ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఫస్టాఫ్‌లో సినిమానే బాగానే నడిపిన, సెకండాఫ్ కాస్త దెబ్బ కొట్టించినట్టు అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య ఎమోషనల్ సీన్స్ కన్విన్సింగ్‌గా అనిపించవు. కథంతా రోటీన్‌గా సాగడం, దానికి తోడు ప్రతి సన్నివేశం పాత సినిమాలను గుర్తుకు తేవడం కాస్త ప్రతికూల అంశమే ఇక ఈ సినిమాకు ప్రధాన బలం దేవి శ్రీ ప్రాసాద్ సంగీతం. ప్రతి పాట ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఇచ్చాడు. ఎడిటర్ నవీన్ నూలి తన కత్తెర ఇంకాస్త పనిచెప్పాల్సింది. సెకండాఫ్‌లోని చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్ చేస్తే బాగుండనిపిస్తుంది. పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫి బాగుంది. ప్రతి సీన్‌ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తానికి రంగ్ దే స్టోరీ రొటీనే అయినప్పటికీ అర్జున్, అనుల టామ్ అండ్ జెర్రీ వార్ యువతను ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ప్లస్ పాయింట్స్ నితిన్, కీర్తి సురేష్ నటన కామెడీ సీన్స్ సంగీతం మైనస్ పాయింట్స్: రొటీన్ స్టోరి స్లో నెరేషన్స్ సెకండాఫ్ సాగదీత సీన్లు వర్కౌట్ కాని ఎమోషనల్ సీన్లు - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
హల్చల్ చేస్తోన్న ‘రంగ్‌దే’ మేకింగ్ వీడియో..
టాలీవుడ్ హీరో నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం 'రంగ్ దే'. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రస్తుతం మూవీ ప్రమోషనల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో సీనియర్ నరేష్, కౌసల్య, రోహిణి, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్, సుహాస్ తదితరులు నటిస్తున్నారు. సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు సమకూర్చగా పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. నవీన్ నూలి ఎడిటర్. తాజాగా ఈ సినిమా నుంచి ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ‘చూసి నేర్చుకోకు’ అనే బ్యాక్‌గ్రౌండ్ పాటతో కొన్ని మేకింగ్ సన్నివేశాలను కలిపి ఒక వీడియోగా రూపొందించారు. ఇందులో నితిన్, కీర్తిల మధ్య కనిపించిన దృశ్యాలు చాలా ఫన్నీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆదివారం సాయంత్రం(మార్చి 21)శిల్పకళావేదికలో జరిగే ప్రీ రిలీజ్ వేడుకకుముఖ్య అతిథిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రానున్న విషయం తెలిసిందే. గతేడాది నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఆ సెంటిమెంట్‌తోనే రంగ్‌దే సినిమాకి త్రివిక్రమ్‌ని ముఖ్య అతిథిగా పిలిచిననట్లు తెలుస్తోంది. చదవండి: తలైవి ట్రైలర్ చూస్తే గూస్‌బంప్సే.. తూటాల్లా డైలాగులు రంగ్‌దే ప్రీ రిలీజ్: చీఫ్ గెస్ట్‌గా అతనే! -
'రంగ్‌దే' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
రంగ్‌దే ప్రీ రిలీజ్: చీఫ్ గెస్ట్‌గా త్రివిక్రమ్, కారణం అదేనట!
సాధారణంగా మనలో చాలామందికి సెంటిమెంట్లు ఉంటాయి.ఆ సెంటిమెంట్లు ఫాలో అయితేనే అనుకున్న పని అనుకున్న విధంగా జరుగుతుందని నమ్ముతారు. ఇక చిత్రపరిశ్రమలో అయితే ఈ సెంటిమెంట్లు మరీ ఎక్కువ. సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ వేడుకల వరకు దర్శకనిర్మాతలు, హీరోలు ఒక్కో సమయంలో ఒక్కో విధమైన సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. అలా హీరో నితిన్‌కు కూడా ఒక సెంటిమెంట్ ఉంది. తన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరైతే విజయం వరిస్తుందని బలంగా నమ్ముతున్నాడు. అందుకే రంగ్‌దే ప్రీరిలీజ్ ఈవెంట్‌కి త్రివిక్రమ్‌ని చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆదివారం సాయంత్రం(మార్చి 21)శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. దీనికి చాలా మంది ప్రముఖులు వస్తున్నారు. ముఖ్య అతిథిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ వస్తున్నాడు. గతేడాది నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఆ సెంటిమెంట్‌తోనే రంగ్‌దే సినిమాకి త్రివిక్రమ్‌ని ముఖ్య అతిథిగా పిలిచిననట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్‌కి నితిన్ మధ్య మంచి స్నేహం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అఆ మూవీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వీరిద్దరు మరింత క్లోజ్ అయ్యారు. శిష్యుడిగా తన దగ్గర్నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పాడు నితిన్. అప్పట్నుంచి నితిన్ బ్యాక్ చేస్తూనే ఉన్నాడు త్రివిక్రమ్. అప్పట్లో ఆయన అందించిన కథతో ఛల్ మోహన్ రంగా సినిమా చేశాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుములతో భీష్మ సినిమా చేసినపుడు కూడా అండదండలు అందించాడు. ఇప్పుడు రంగ్ దే సినిమాకు కూడా ఈయన వెంటే ఉన్నాడు. మరి నితిన్ సెంటిమెంట్ ఎంతవరకు ఫలిస్తుందో తెలియాలంటే మార్చి 26 వరకు వేచి చూడాల్సిందే. చదవండి: వాళ్లిద్దరూ హ్యాండిచ్చారు : నితిన్ హీరోయిన్ కనబడుట లేదు: డోంట్ వర్రీ అంటున్న పోలీసులు -
వాళ్లిద్దరూ హ్యాండిచ్చారు : నితిన్
‘‘కర్నూలుకు రావడం ఇదే తొలిసారి. కర్నూలు అంటే నాకు గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. అక్కడ తీసిన సినిమాలు హిట్టయ్యాయి. ఆ ప్రదేశం ఎంత పవర్ఫుల్లో మీరూ (కర్నూలువాసులను ఉద్దేశించి) అంతే పవర్‌ఫుల్‌గా ఉన్నారు’’ అని హీరో నితిన్ అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకను కర్నూలులో నిర్వహించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, డీజీ భరత్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘రంగ్ దే’ ఘనవిజయం సాధించాలి. కర్నూలుకు తరచూ వచ్చి సినిమా షూటింగ్స్ చేయాలని నితిన్‌ను కోరుతున్నాం’’ అన్నారు హఫీజ్ ఖాన్, సుధాకర్. నితిన్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ విడుదలకు కీర్తీ సురేశ్, వెంకీ అట్లూరి రావాల్సింది.. కానీ ఇద్దరూ హ్యాండిచ్చారు. రాయలసీమ అంటే మాస్, ఫ్యాక్షన్ అంటారు. కానీ ఆ రెండింటి కంటే కూడా మీలో ఎక్కువ ప్రేమ ఉంది. ఇదే ప్రేమతో మా సినిమా చూసి, హిట్టివ్వండి’’ అన్నారు. ‘‘మా సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నాగవంశీ. -
హర్ట్ అయిన రకుల్.. ప్రమోషన్లకు దూరం!
టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం చెక్. ఈ సినిమా నేడు(ఫిబ్రవరి26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతానికైతే జనాల్లో పర్వాలేదనే టాక్ తెచ్చుకుంటోంది. కల్యాణీ మాలిక్ సంగీతం ఈ సినిమా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. సినిమాల్లో రకుల్ చాలా సన్నివేశాల్లో కనిపించినా ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనిపిస్తోంది. అదే ప్రియ విషయానికొస్తే చేసింది చిన్న క్యారెక్టర్ అయినా తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. దీంతో ఢిల్లీ భామ(రకుల్) హర్ట్ అయినట్లు తెలుస్తోంది. చెక్‌లో తన పాత్ర కన్నా ప్రియా ప్రకాశ్ పాత్ర ఎక్కువ ఉండటం రకుల్‌కు నచ్చలేదట. అంతేగాక నితిన్, ప్రియ మధ్య ఎలాంటి పాటలు ఉండవని చెప్పి చివరికి వీరిద్దరి కలయికలో ఓ పాట కూడా చిత్రీకరించడంతో ఈ భామ హర్ట్ అయ్యిందటా. ఇంకేముంది సినిమా డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటిపై కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే చెక్కు సంబంధించిన ఏ ప్రమోషన్లలో కూడా ఆమె కనిపించలేదు. రిలీజ్‌కు ముందు చెక్ టీం ఓ ప్రెస్ మీట్ పెట్టింది. ఇందులో రకుల్ కనిపించలేదు. కానీ మరో కథానాయికగా నటిస్తున్న మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ మాత్రం మెరిసింది. అంతేగాక రకుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తుందేమో అనుకున్నారు. కానీ ఆ రోజు కూడా రకుల్ దర్శనమివ్వకపోవడంతో అభిమానులు ఆశ్యర్యం వక్తం చేశారు. సినిమా రిలీజ్ తరువాత కూడా ప్రియనే హైలెట్ అవుతోంది. దీంతో సినిమాకు సంబంధించి ఎదో మొక్కుబడిగా ఒకటి రెండు ట్వీట్లు చేసింది తప్ప ఈ సినిమా చేసినందుకు రకుల్ సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు. చదవండి: ‘చెక్’ మూవీ రివ్యూ రకుల్‌ను డామినేట్ చేస్తున్న ప్రియా వారియర్ -
‘చెక్’ మూవీ రివ్యూ
టైటిల్ : చెక్ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు : నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్, సంపత్ రాజ్, సాయిచంద్, పోసాని కృష్ణమురళి, మురళి శర్మ తదితరులు నిర్మాణ సంస్థ : భవ్య క్రియేషన్స్ నిర్మాత : వి. ఆనంద ప్రసాద్ దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి సంగీతం : కల్యాణీ మాలిక్ సినిమాటోగ్రఫీ : రాహుల్ శ్రీవాత్సవ్ ఎడిటర్ : అనల్ అనిరుద్దన్ విడుదల తేది : ఫిబ్రవరి 26, 2021 చాలా కాలం తర్వాత గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘భీష్మ’తో సూపర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో. భీష్మ కంటే ముందు నితిన్ చేసిన లై, చల్‌మోహన్‌రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.దీంతో కొంత గ్యాప్ తీసుకొన్న నితిన్.. ఒకేసారి రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి భీష్మ అయితే మరొకటి చెక్. భీష్మతో పాటు చెక్ కూడా గతేడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్డౌన్ వల్లనిలిచిపోయింది. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత శుక్రవారం రోజు (ఫిబ్రవరి 26) చెక్ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. వైవిధ్యభరిత చిత్రాలను తెరకెక్కించడంలో సిద్దహస్తుడైన చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది.వైవిధ్యమైన ఇతివృత్తంతో వచ్చిన ‘చెక్’పై నితిన్ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాతో నితిన్ మరో హిట్ కొట్టాడా? పాటలు, ఫైట్స్, కామెడీ.. ఇలా రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వచ్చిన ‘చెక్’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథ ఆదిత్య ఒక తెలివైన యువకుడు. తన తెలివితేటలన్నింటిని చోరకళ(దొంగతనం) కోసం ఉపయోగిస్తాడు. పేర్లు మార్చుకుంటూ చిన్న చిన్న మోసాలు చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు. ఈ క్రమంలో అతనికి యాత్ర ( ప్రియా ప్రకాశ్ వారియర్) పరిచమతుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. కట్ చేస్తే... భారత్‌లో ఉగ్రదాడి జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోతారు. ఈ కేసులో ఆదిత్య ఉరిశిక్ష పడుతోంది. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న ఆదిత్యకు జైలులో శ్రీమన్నారాయణ(సాయిచంద్)అనే ఖైదీ పరిచయమై చెస్ ఆటను నేర్పిస్తాడు. ఆదిత్య తెలివికి నేషనల్ చెస్ చాంపియన్ షిప్ గెలుస్తాడని బలంగా నమ్మిన శ్రీమన్నారాయణ.. తనకు ఉన్న పలుకుడిబడితో ఆదిత్యను చెస్ గేమ్ ఆడేలా ఒప్పిస్తాడు. ఇదిలా ఉంటే ఆదిత్యకు క్షమాభిక్ష లభించేలా చేసేందుకు జూనియర్ లాయర్ మానస(రకుల్ ప్రీత్ సింగ్) ప్రయత్నిస్తుంది. చెస్‌లో ఆరితేరిన ఆదిత్యకు ఆ గేమే క్షమాభిక్ష పెట్టాలా చేస్తుందని బలంగా నమ్మి ఆ రకంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో ఎస్పీ నరసింహారెడ్డి(సంపత్ రాజ్) ఆదిత్యకు క్షమాభిక్ష లభించకుండా చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతకి ఆదిత్యకు క్షమాభిక్ష లభించిందా లేదా? అసలు ఉగ్రదాడి కేసులో ఆదిత్య ఎలా బుక్ అయ్యాడు? యాత్ర ఎవరు? చెస్ గేమ్ ఆదిత్యకు ఎలా ఉపయోగపడింది? ఎస్పీ నరసింహారెడ్డికి ఆదిత్య అంటే ఎందుకు కోపం? చివరకు జైలు నుంచి ఆదిత్య ఎలా తప్పించుకున్నాడు అనేదే మిగతా కథ నటీనటులు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న ఆదిత్య పాత్రలో నితిన్ ఒదిగిపోయాడు. ఒక చెస్ చాంపియన్ ఎలా ఆడగలడో, ఏ రకంగా ఎత్తుకు పై ఎత్తులు వేయగలడో అచ్చుగుద్దినట్లు నితిన్ నటన ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఫైట్స్ కూడా చాలా చక్కగా చేశాడు. ఇక లాయర్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ చక్కగా నటించింది. గత చిత్రాలకు బిన్నంగా ఇందులో గ్లామర్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా నటనతో మెప్పించింది. లాయర్ మానస పాత్రలో హవాభావాలు అద్భుతంగా పండించింది. ఇక నితిన్ తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర సాయిచంద్‌ది. చేయని తప్పుకు జైలుపాలైన శ్రీమన్నారాయణ పాత్రలో సాయిచంద్ ఒదిగిపోయాడు. అతని సంభాషణలు, ఎక్స్ప్రెషన్స్ సినిమాకే హైలెట్. ఇక మరో హీరోయిన్ ప్రియ ప్రకాశ్ వారియర్‌కు ఇది తొలి తెలుగు సినిమా. ఆమె పాత్ర నిడివి కొద్దిసేపే అయినప్పటికీ సినిమాకు ఆమె సన్నివేశాలే కీలకం. యాత్ర పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. ఎస్పీ పాత్రలో సంపత్ రాజ్, రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి పాత్రలో పోసాని, జైలర్‌గా మురళి శర్మ తమ పరిధి మేరకు నటించారు. విశ్లేషణ వైవిధ్యభరిత కథా చిత్రాలను తెరకెక్కించడంలో చంద్రశేఖర్ యేలేటి సిద్ధహస్తుడు. ఆయన కథలు జీవితాల్లో నుంచి పుడతాయి. ఆ జీవితాల చుట్టూనే తిరుగుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలోను కొన్ని సంఘటనలు.. అవి అందించే ఎమోషన్లు ఉంటాయి. అలాంటి కథలను తీసుకుని.. అనుభూతి ప్రధానంగా తన సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు. చెక్ సినిమా కూడా అంతే. గత సినిమాలే మాదిరే మైండ్ గేమ్‌కి పెద్ద పీట వేశాడు. క్షమా భిక్ష, చెస్ గేమ్ నేపథ్యంలో కథనంతా నడిపించాడు దర్శకుడు. ఫస్టాఫ్ అంతా ఎలాంటి ట్విస్ట్‌లను రివీల్ చేయకుండా నార్మల్‌గా నడిపించాడు. అసలు హీరో ఈ కేసులో ఎలా ఇరికాడో చెప్పకుండా ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాడు. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తాయి. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. ట్విస్ట్‌లన్నీ సెకండాఫ్‌లోనే ఉంటాయి. కానీ ఎక్కువ సన్నివేశాలు జైలులోనే కనిపించడం కాస్త బోర్ కొట్టించే అంశం. ఇక నేషనల్ చెస్ చాంపియన్ విజేతగా హీరో నిలిచే సన్నివేశాలు కూడా అంతగా రక్తి కట్టించవు. అలాగే లాయర్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఇలా వచ్చి అలా వేళ్తున్నట్లు అనిపిస్తోంది. ఇక క్లైమాక్స్ కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించదు. ఇక్కడా దర్శకుడు యేలేటి తన మార్క్‌ను చూపించాడు. కానీ అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తోంది. అయితే హీరో ఎలా బయటపడ్డాడో చెప్పే విశ్లేషణ మాత్రం బాగుంటుంది. అలాగే సీక్వెల్ ఉంటుందని చెప్పకనే చెబుతూ కథను ముగించాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే బాగుంది. ఇక కల్యాణీ మాలిక్ సంగీతం ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్. తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాడు. ఉన్న ఒక్క పాట పర్వాలేదనిపిస్తోంది. రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రాఫి బాగుంది. జైలు సన్నివేశాలను చక్కగా తెరకెక్కించాడు. అనల్ అనిరుద్దన్ తన కత్తెరకు కాస్త పని చెప్పాల్సింది.నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి ప్లస్ పాయింట్స్ కథా, కథనాలు నితిన్, సాయిచంద్ నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ సెకండాఫ్‌లో కొన్ని సాగతీత సీన్లు క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఇకపై ఆ తప్పు చేయకూడదనుకుంటున్నా!
‘‘చెక్’ సినిమాకి ముందు చంద్రశేఖర్ యేలేటిగారు ఓ లైన్ చెప్పారు. రెండు నెలలు స్క్రిప్ట్‌పై పని చేశారు కూడా. అయితే అది వర్కవుట్ కాదనిపించింది. ఆ తర్వాత ‘చెక్’ కథతో ముందుకెళ్లాం. ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆయన మార్క్ కనిపిస్తుంది. ‘చెక్’ తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని నితిన్ అన్నారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన చిత్రం ‘చెక్’. వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నితిన్ చెప్పిన విశేషాలు. ► వరుసగా మూడు ఫ్లాప్‌లు (లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం) వచ్చాయి. దీంతో తర్వాత చేసే సినిమాల్లో ఒకటి కమర్షియల్, మరొకటి వైవిధ్యమైన చిత్రం అయితే బాగుండు అనుకున్నాను. అందుకే ‘భీష్మ, చెక్’ సినిమాలు ఒప్పుకున్నాను. ‘భీష్మ’ తర్వాత ‘చెక్’ రిలీజ్ చేద్దామనుకున్నాం.. ఈలోపు లాక్డౌన్ వచ్చింది. ► నేనిప్పటివరకూ చేసిన సినిమాలు వేరు.. ‘చెక్’ వేరు. ఈ చిత్రంలో నా నటన చాలా బాగుంటుంది. సినిమా ప్రివ్యూ చూసిన వంద మందిలో అందరూ బాగుందని అభినందించారు. పాటలు, ఫైట్స్, కామెడీ.. ఇలా రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ‘చెక్’ ఉంటుంది. ఒక పాట మినహా మొత్తం కథే ఉంటుంది. ప్రేక్షకులకు మా సినిమా కొత్త అనుభూతినిస్తుంది. ► కల్యాణీ మాలిక్ నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. కమర్షియల్ సినిమాల బడ్జెట్‌కి నిర్మాతలు వెనకాడరు. ‘చెక్’లాంటి వైవిధ్యమైన సినిమాకి ఖర్చు పెట్టిన ఆనంద్ ప్రసాద్‌గారు గ్రేట్.. ఈ సినిమా మంచి విజయం సాధించి, ఆయనకి డబ్బులు బాగా రావాలి. ‘నితిన్ ఎప్పుడూ కొత్తగా ట్రై చేస్తాడు’ అని ‘చెక్’ ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళిగారి నుంచి నాకు కాంప్లిమెంట్ రావడం హ్యాపీ. నా తొలి చిత్రం ‘జయం’ తర్వాత ఎక్కువ టేకులు తీసుకున్నది ‘చెక్’ చిత్రానికే. మొదట్లో ఓ వారంపాటు ఒక్కో సీన్స్ కి 10 నుంచి 15 టేకులు తీసుకున్నాను. ఆ తర్వాత డైరెక్టర్ పల్స్ పట్టుకుని ఆయనకు నచ్చినట్టు చేశా. ► ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు అయింది. ఇప్పటికీ లవర్ బోయ్ ట్యాగ్‌లైన్ నాకు నచ్చదు. గతంలో కథల ఎంపికలో తప్పు చేశాను. ఇకపై ఆ తప్పు చేయకూడదనుకుంటున్నాను. ► 2020 చాలామందికి వరస్ట్ అయితే నాకు గుడ్. ‘భీష్మ’ సినిమా హిట్ అయింది. షాలినీతో పెళ్లయింది. యాక్టర్ ఫ్యామిలీకి, డాక్టర్ ఫ్యామిలీకి బాగా సింక్ అయింది. గతంలో జలుబో, దగ్గో, జ్వరమో వస్తే హాస్పిటల్‌కి వెళ్లేవాణ్ణి.. ఇప్పుడేమో మా మావయ్య– అత్తయ్యలకు ఫోన్ చేసి, ఏ మందులు వేసుకోవాలో అడుగుతున్నాను (నవ్వుతూ). ► ‘రంగ్ దే’ సినిమా షూటింగ్ మంగళవారమే పూర్తయింది. మేర్లపాక గాంధీతో ‘అంధా ధున్ ’ రీమేక్ సినిమా చేస్తున్నా. ‘పవర్‌పేట’ సినిమా మేలో స్టార్ట్ అవుతుంది.. డిసెంబరులో మొదటి పార్ట్ విడుదలవుతుంది.. అది హిట్ అయితే రెండో పార్ట్ ఉంటుంది.. లేకుంటే లేదు. నా సినిమాల్లో ‘సై’కి సీక్వెల్ చేయొచ్చు.. ‘చెక్’ సినిమాకి కూడా సీక్వెల్ చేసే అవకాశం ఉంటుంది. పవన్ కల్యాణ్‌గారితో మల్టీస్టారర్ మూవీ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. -
నితిన్ 30వ సినిమా : విలక్షణ పాత్రలో
నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్గా నటిస్తుండగా, తమన్నా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాని జూన్ 11న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘నితిన్ హీరోగా నటిస్తున్న 30వ చిత్రమిది. ఇప్పటి వరకూ నటించని విలక్షణ పాత్రలో నటిస్తున్నారు నితిన్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కీలకమైన ఈ షెడ్యూల్లో చిత్రంలోని ప్రధాన తారాగణమంతా పాల్గొంటోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: రాజ్‌కుమార్ ఆకెళ్ల, సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: జె. యువరాజ్. -
ఏమిటో ఇది వివరించలేనిది.. మాయ చేసిన దేవిశ్రీ
యంగ్ హీరో నితిన్, ‘మహానటి’ కిర్తి సురేష్ జంటగానటిస్తున్న చిత్రం ‘రంగ్‌దే’.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నితిన్ వెడ్డింగ్ సందర్భంగా ‘రంగ్ దే` నుంచి విడుదల చేసిన చిన్న వీడియోకి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా తొలి పాటను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. `ఏమిటో ఇది వివరించలేనిది.. మది ఆగమన్నది తనువాగనన్నది.. భాష లేని ఊసూలాట సాగుతున్నది. అందుకే ఈ మౌనమే భాష ఐనది’ అంటూ సాగే ఈ మెలోడీ గీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా.. హరిప్రియ, కపిల్ కపిలన్ ఆలపించారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. చాలా నెమ్మదిగా సాగే ఈ మెలోడీ సాంగ్‌ని వెండితెరపై ప్రేక్షకులకు కనువిందు కలిగించేలా చిత్రీకరించనట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల కాలంలో డీఎస్పీ నుంచి ఇలాంటి మెలోడీ సాంగ్ రాలేదనే చెప్పాలి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. (చదండి : ఫ్రెండ్స్‌తో స్టెప్పులేసిన స్టార్ హీరో కూతురు) -
రాఖీ: చెల్లెళ్లతో చిరంజీవి.. వీడియో వైరల్
రాఖీ పండుగ సందర్భంగా సినీ ప్రముఖులు తమ సోదరులు, సోదరీమణులను గుర్తు చేసుకుంటున్నారు. తమ ఇంట్లో జరుపుకుంటోన్న ఈ పండుగ ఫొటోలను పోస్ట్ చేస్తూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంట్లోనే ఉండి పండుగ చేసుకోవాలని పిలుపునిస్తున్నారు. రక్షా బంధన్ సంబర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఇద్దరు చెల్లెళ్లు చిరంజీవికి రాఖీ కట్టి నోరు తీపి చేసి ఆశీర్వాదం తీసుకోగా, వాళ్లను ఆప్యాయంగా కౌగిలించుకొని ఆనందంగా గడుపుతున్న వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. అంతే కాకుండా ప్రజలందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నా చెల్లెళ్ళిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు’అని చిరంజీవి ట్వీట్ చేశారు. నా చెల్లెళ్ళిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. Happy #RakshaBandhan ! pic.twitter.com/DAZrypOm5B — Chiranjeevi Konidela (@KChiruTweets) August 3, 2020 అలాగే హీరో నితిన్ కూడా తన సోదరి నిక్షిత రాఖీ కట్టిన ఫోటోను ట్విటర్లో పంచుకుంటూ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్ బాబు తన కూతురు, కుమారుడి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ..'రక్షాబంధన్ శుభాకాంక్షలు.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి' అని పేర్కొన్నారు. -
‘నాన్నా నవ్వుతోంది.. నేను కట్టలేను’
హీరో నితిన్ మరి కొద్ది గంటల్లో తన ప్రేయసి షాలిని కందుకూరి మెడలో మూడు మూళ్లు వేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నితిన్ తాజా చిత్రం రంగ్‌దే టీమ్ ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చిత్ర బృందం.. ఆదివారం సాయంత్రం రంగ్‌దే టీజర్‌ను విడుదల చేసింది. నితిన్‌కు వివాహ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ టీజర్‌పై స్పందించిన.. ఈరోజు మరింత స్పెషల్‌గా చేసినందుకు రంగ్‌దే టీమ్‌కు థ్యాంక్స్ చెప్పారు. కాగా, ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తీ సురేశ్ కథానాయికగా నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.(మెహందీలో మెరిసిన షాలిని-నితిన్) ఈ టీజర్లో నితిన్ తన తండ్రి నిర్ణయం మేరకు కీర్తి సురేష్‌ను పెళ్లి చేసుకున్నట్టు, పెళ్లి తర్వాత ఇంటి పనులు చేయడంతో బిజీ అయినట్టు చూపించారు. ఇందులో ‘అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు’, ‘చేయి తీయ్ జస్టిస్ చౌదరి’, ‘నాన్న నవ్వుతుంది.. నేను కట్టలేను’ అంటూ నితిన్ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావిస్తున్నట్టు చిత్ర బృందం పేర్కొంది. (పెళ్లి సందడి షురూ) మరోవైపు నితిన్-షాలిని పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. ఈ రోజు రాత్రి 8.30 గంటలకు వీరిద్దరు వివాహ బంధంతో ఒకటి కానున్నారు. నగరంలోని తాజ్ ఫలక్‌నుమాలో ఈ వేడుక జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇరు కుటుంబాలతో పాటుగా, అతికొద్ది మంది సన్నితులు, అతిథులు ఈ పెళ్లి వేడుకకు హాజరు కానున్నారు. -
హీరో నితిన్ పెళ్లి సందడి
-
మెహందీలో మెరిసిన షాలిని-నితిన్
హైదరాబాద్ : యంగ్ హీరో నితిన్ పెళ్లి వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. ఆదివారం రాత్రి 8.30 నితిన్-షాలినిలు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత తాజ్ ఫలక్‌నుమా హోటల్లో ఈ వేడుక జరుగనుంది. ఈ క్రమంలో ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అదిరిపోయేలా నిర్వహిస్తున్నారు. తాజాగా మెహందీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నితిన్ స్నేహితురాలు, ప్రముఖ స్టైలిస్ట్ డిజైనర్ కోన నీరజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.(నితిన్ ఎంగేజ్మెంట్తో వేడుకలు షురూ) ఈ వేడుకలో చేతులకు మెహందీ పెట్టుకున్న షాలిని.. రెడ్ కలర్ లెహంగాలో మెరిసిపోయారు. నితిన్ బ్లూ కలర్ కుర్తాలో కళ్లకు డిఫరెంట్ గాగూల్స్ పెట్టి స్టైలిష్ లుక్‌లో కనిపించారు. మరోవైపు ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా.. పరిమిత అతిథుల సమక్షంలో షాలిని మెడలో నితిన్ మూడు మూళ్లు వేయనున్నారు. సినీ పరిశ్రమ నుంచి హీరోలు పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్, దర్శకుడు త్రివిక్రమ్.. నితిన్-షాలినిల వివాహా వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా నితిన్ తన పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. (నితిన్ పెళ్లికి టైమ్ ఫిక్స్) -
కరోనా ఎఫెక్ట్: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నితిన్
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రస్తుత లాక్డౌన్ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో మార్చి 30న తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపాడు. అదేవిధంగా ఫ్యాన్స్ కూడా తన బర్త్‌డే వేడుకలను జరపవద్దని విజ్ఞప్తి చేశాడు. అంతేకాకుండా లాక్డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 16న జరగాల్సిన తన పెళ్లి గురించి కూడా నితిన్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో తన పెళ్లిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు. ‘నా అభిమానులకు, తెలుగు ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడివున్నాయో మీకు తెలుసు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని లాక్డౌన్ కాలంలో మార్చి 30వ తేదీ నా పుట్టిన రోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల ఎక్కడా కూడా నా పుట్టినరోజు వేడుకలు జరపవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అంతే కాదు, లాక్డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 16వ తేదీ జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనమందరం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కలికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభ సమయంలో మన ఇళ్లల్లో మనం కాలు మీద కాలేసుకొని కూర్చుని, మన కుటుంబంతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్లు. ఎల్లవేళలా మీ అభిమానంతో పాటు మీ ఆరోగ్యాన్ని ఆశించే మీ.. నితిన్’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సంపత్ కుమార్, నూర్జహాన్ దంపతుల రెండవ కుమార్తె షాలినితో నితిన్ పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 15న హైదరాబాద్‌లో నిశితార్థం కూడా జరిగింది. ఏప్రిల్ 16న దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డిండ్ జరపుకోవాలని నితిన్ నిర్ణయించుకున్నాడు. అయితే కరోనా విజృంభిస్తుండటం లాక్డౌన్ కఠినంగా అమలవుతున్న నేపథ్యంలో పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్ల నితిన్ అధికారికంగా ప్రకటించాడు. -
నితిన్ పెళ్లి వాయిదా..!
‘భీష్మ’ విజయంతో మంచి ఊపుమీద ఉన్నాడు యంగ్ హీరో నితిన్. అంతేకాకుండా తాను ప్రేమించిన యువతిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నందుకు మరోరకంగా ఆనందంగా ఉన్నాడు. అయితే నితిన్ ఆనందంపై కరోనా కన్నెర్ర జేసినట్లు తెలుస్తోంది. చాలాకాలంగా ప్రేమలో ఉన్న షాలినితో నితిన్ వివాహం వాయిదా పడిందనే వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అన్నిదేశాలలో విస్తరిస్తుడటం.. ఆయా దేశాలు విదేశీయుల్ని తమ దేశానికి రాకుండా నిషేధం విధించడంతో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకోవాలని భావిస్తున్నారని సమాచారం. (చదవండి : ఘనంగా హీరో నితిన్ ఎంగేజ్మెంట్) ముందుఅనుకున్న ప్రకారం ఏప్రిల్ 16న దుబాయ్‌లో నితిన్, షాలినీల వివాహం జరగాల్సిందింది. పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశారు. కొద్ది మంది బంధువులు, మిత్రుల మధ్య దుబాయ్‌లో ఏప్రిల్ 15వ తేదీన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే ఏప్రిల్ 16వ తేదిన రిసెప్షన్ నిర్వహించాలని అనుకొన్నారు. అయితే దుబాయ్‌లో కూడా కరోనావైరస్ వ్యాప్తి చెందుతుండటంతో పెళ్లి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లోనే నితిన్ వివాహం జరిపేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. కానీ దీనిపై నితిన్ , షాలినీ కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రకటన చేయదలేదు. -
విశాఖలో ‘భీష్మ’ థ్యాంక్స్ మీట్
-
నాకంటే ఆయనే క్యూట్ : రష్మిక
చెన్నై : నాకంటే ఆయనే ఎంతో క్యూట్ అంటోంది హీరోయిన్ రష్మిక మందన. శాండిల్‌వుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ అంటూ దక్షిణాదిని చుట్టేస్తున్న ఈ అమ్మడు వరుస విజయాలతో దూసుకుపోతోంది. గీతగోవిందం ఫీవర్ తగ్గకముందే ఈ మధ్య మహేశ్‌బాబుతో నటించిన సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది రష్మిక. తాజాగా నితిన్‌తో రొమాన్స్ చేసిన భీష్మతో మరో హిట్‌ను అందుకుంది. ఇలా వరుస విజయాలతో మంచి జోరు మీదున్న ఈ కన్నడ భామ పారితోషికాన్ని కోటికి పైగా పెంచేసి నిర్మాతలకు దడ పుట్టిస్తుందనే ప్రచారం ఒక పక్క జరుగుతోంది. ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్న రష్మిక తరచూ ప్రచారంలో ఉండే ప్రయత్నాలను మాత్రం మిస్ కావడం లేదు. భీష్మ చిత్ర హిట్ హాంగోవర్లో ఉన్న ఈ భామ ఇటీవల ప్రత్యేకంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని రకరకాల భంగిమల్లో ఫొటోలు దిగింది. అయితే అవి సాధారణానికి భిన్నంగా ఇంతకు ముందు హాస్య నటుడు వడివేలు పోజుల మాదిరి ఉండడం విశేషం. ఈ అమ్మడు ఆయన చిత్రాలను చూసి అలాంటి భంగిమల్లో ఫొటోలు తీసుకుందా అని అనిపించేలా ఉన్నాయి. దీంతో నెటిజన్లు రష్మిక ఫొటోల పక్కన అలాంటి భంగిమలతో ఉన్న నటుడు వడివేలు ఫొటోలను పోస్ట్ చేసి మీమ్స్ చేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ మీమ్స్ నటి రష్మిక దృష్టిలో పడ్డాయి. దీంతో ఆమె స్పందిస్తూ “నేను ఒప్పుకోను. నాకంటే వడివేలు చాలా క్యూట్‌గా ఉన్నారు’ అని పేర్కొంది. ఇకపోతే సినిమాలో క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే ఏం చెబుతారు అన్న ప్రశ్నకు తనకు తెలుగు నటుడు నితిన్ మంచి ఫ్రెండ్ కావాలని కోరుకుంటున్నాననీ, అదే విధంగా నటుడు విజయ్ అంటే చాలా ఇష్టం అనీ చెప్పింది. ఆయనతో నటించాలన్న కోరిక చాలా కాలంగా ఉందని అంది. ఎలాంటి భర్త కావాలనుకుంటున్నారన్న ప్రశ్నకు బదులు దాటేసిన రష్మిక తమిళ నటుడిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పింది. దీంతో ఈ అమ్మడు కోలీవుడ్ నటుడెవరితోనైనా ప్రేమలో పడిందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. కాగా నటి రష్మిక ఇప్పటికే శాండిల్‌వుడ్ నటుడితో ప్రేమాయణం జరిపి, ఆ తరువాత అతనితో బ్రేకప్ చేసుకుందన్నది గమనార్హం. ఇకపోతే ఇప్పటికే ఈ అమ్మడు కోలీవుడ్‌లో నటుడు కార్తీతో సుల్తాన్ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఆయన సోదరుడు సూర్యకు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. హరి దర్శకత్వంలో సూర్య నటించనున్న చిత్రంలో నటి రష్మిక ఆయనకు జంటగా నటించనుంది. ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇక తెలుగులోనూ ఈ అమ్మడు స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉంది. -
‘డబుల్ కంగ్రాట్యూలేషన్స్ నితిన్’
నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌లోనూ సత్తా చాటుతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు అమాంతం పెరిగిపోయాయి. మొదటిరోజే చిత్రం ఆరున్నర కోట్లకు పైగా షేర్ సాధించిన విషయం తెల్సిందే. ఇక రెండో రోజు కూడా ఈ చిత్రం ఎక్కడా తగ్గలేదు. నాలుగు కోట్ల పైచిలుకు షేర్ ను రాబట్టింది. దీంతో రెండు రోజుల్లోనే భీష్మ కలెక్షన్స్ 10 కోట్ల మార్క్ ను దాటింది. ఇక మూడవ రోజు అయిన ఆదివారం కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడంతో భీష్మ మూడు రోజులకు 14.9 కోట్ల షేర్ ను రాబట్టినట్లు తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన తమ హీరో సినిమాకు హిట్ టాక్ రావడంతో నితిన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. (చదవండి : ‘భీష్మ’ మూవీ రివ్యూ) ఇక ఈ సినిమా విజయంపై సినీ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ట్విటర్ వేదికగా భీష్మ టీమ్‌కు అభినందనలు తెలిపారు. భీష్మ హిట్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న నితిన్‌కు పుల్ జోష్ ఇచ్చిందన్నారు. ‘డబుల్ కంగ్రాట్యూలేషన్స్ నితిన్. ‘భీప్మ’ విజయంతో నీ పెళ్లి వేడుకలు మరింత సందడిగా మారనున్నాయి. సరైన సమయంలో మంచి పని జరిగింది. నిన్ను చూస్తే నాకెంతో సంతోషంగా ఉంది’ అని బన్నీ ట్వీట్ చేశారు. మంచి హిట్ సాధించినందుకుగాను దర్శకుడు వెంకీ కుడుముల, హీరోయిన్ రష్మీక,నిర్మాత సూర్యదేవర నాగవంశికి అభినందనలు తెలియజేస్తూ వరుస ట్వీట్లు చేశారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా గత శుక్రవారం విడుదలైంది. Double Congratulations @actor_nithiin . Now the wedding celebrations will happen with double josh. Best thing happened at the best time . Really happy for you . I Congratulate the entire Cast & Crew of #Bheeshma . — Allu Arjun (@alluarjun) February 24, 2020 -
‘భీష్మ’ మూవీ రివ్యూ
టైటిల్: భీష్మ టైటిల్: రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ నటీనటులు: నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, జిష్‌సేన్ గుప్త, వెన్నెల కిశోర్, రఘుబాబు తదితరులు దర్శకత్వం: వెంకీ కుడుముల సంగీతం: మహతి స్వర సాగర్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీ బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్ నిడివి: 150.45 నిమిషాలు ‘అఆ’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చల్‌మోహన్‌రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తరువాత సినిమా కోసం ఆచితూచి అడుగేశాడు. ‘ఛలో’తో మంచి క్రేజ్ సంపాదించిన వెంకీ కుడుముల చెప్పిన ‘భీష్మ’ స్క్రిప్ట్‌కు నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా నితిన్‌ను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించిందా? రష్మిక గ్లామర్ ఈ చిత్రానికి ఎంతవరకు పనిచేసింది? టీజర్, ట్రైలర్ రేంజ్లో సినిమా ఉందా? అనేది మన సినిమా రివ్యూలో తెలుసుకుందాం. కథ: తాను ఐఏఎస్ అని భీష్మ (నితిన్) చెప్పుకుంటూ అమ్మాయిల వెంట పడతాడు. పరిచయం అయిన కొద్ది నిమిషాల్లోనే భీష్మకు బైబై చెప్పి వెళ్లి పోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్‌కు అర్థం కలెక్టర్ అని కాదు.. ఐయామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాపౌట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తూ కాలం వెళ్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్ర(రష్మిక)ను తొలి చూపులోనే ఇష్టపడి, వెంటపడతాడు. తొలుత భీష్మను అసహ్యించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత సవ్యంగా సాగుతున్న తరుణంలో ఏసీపీ దేవా(సంపత్) తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నాడని తెలుసుకొని అతడి తలపై గన్ ఎక్కుపెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ (నరేశ్) ఓ సంచలన విషయాన్ని చెబుతాడు. ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీకి భీష్మ సీఈఓ అని, పెద్దాయన భీష్మ (అనంత్ నాగ్) మనవడు అని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీని నేల మట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వపయత్నాలు చేస్తుంటుంది. చివరికి ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు సఫలమయ్యాయా? లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా? లేక కొడుకును కాపాడుకోవాడానికి చెప్పిన అబద్దమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీకి హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్ (జిషుసేన్ గుప్తా), పరిమళ్ (వెన్నెల కిశోర్), జేపీ (బ్రహ్మాజీ)లు ఎందుకు ఎంటర్ అవుతారు? అనేదే భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు: ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్‌లో అల్లరిచిల్లరగా తిరిగే బ్యాచ్‌లర్‌గా కనిపించిన నితిన్, సెకండాఫ్‌లో కంపెనీ సీఈఓగా హుందాగా కనిపించాడు. అమ్మాయిల వెంట పడే రోమియోగా, అప్పుడప్పుడు మంచి వాక్యాలు చెప్పి ఇతరులను ఇంప్రెస్ చేసే తనలోని మరో కోణాన్ని బయటపెడుతుంటాడు. తన నటనలో డిఫరెంట్ షేడ్స్‌ను చూపించి నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. చైత్రగా కనిపించిన రష్మిక నితిన్‌తో పోటీ పడి మరీ నటించిందనే చెప్పాలి. తన అందం, అభినయంతో మెస్మరైజ్ చేసింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్, చెప్పే చిన్నిచిన్ని డైలాగ్‌లు చాలా ముద్దుగా ఉంటాయి.అంతేకాకుండా నితిన్‌తో కలిసి రష్మిక డ్యాన్స్‌లతో అదరగొట్టింది. అనంత్ నాగ్ తన అనుభవాన్ని రంగరించి పెద్దాయన భీష్మ పాత్రను అవలీలగా చేశాడు. వెన్నెల కిశోర్, రఘుబాబు, జేపీల కామెడీ టైమింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. విలన్‌గా కనిపించిన జిషుసేన్ గుప్త క్లాస్ విలన్‌గా కనిపించాడు. అయితే అశ్వథ్థామ చిత్రంలో చూసినట్టు ఈ చిత్రంలో కనిపిస్తాడు. హెబ్బా పటేల్ కనిపించేది రెండు మూడు సీన్లలో అయినా ఆకట్టుకుంటుంది. విశ్లేషణ: ఈ సినిమా కథ మొత్తం భీష్మ (నితిన్, అనంత్ నాగ్, ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ) చుట్టే తిరుగుతుంది. అనుకున్న కథ ఎక్కడా డీవియేట్ కాకుండా, అనవసర హంగుల విషయాలకు వెళ్లకుండా దర్శకుడు వెంకీ కుడుముల చాలా జాగ్రత్తగా, పద్దతిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అతడు చెప్పాలనుకున్న పాయింట్‌ను పక్కాగా తెరపై ప్రజెంట్ చేశాడు. ఈ విషయంలో అతడికి నూటికి నూరు మార్కులు పడతాయి. అనంత్ నాగ్ ఆర్గానిక్ వ్యవసాయం గొప్పతనం గురించి చెప్పే స్పీచ్‌తో సినిమా ఆరంభం అవుతుంది. వెంటనే హీరో సాదాసీదా ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తగ్గకుండా, కథ పక్కదారి పట్టకుండా సినిమా సాగుతుంది. హీరోయిన్ ఎంట్రీ, వెన్నెల కిశోర్, సంపత్, నరేశ్, నితిన్, బ్రహ్మాజీల కామెడీ, నితిన్, రష్మికల మధ్య వచ్చే సీన్లతో ఫస్టాఫ్ సాఫీగా సాగుతుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్ కామెడీతోనే మొదలవుతుంది. ఆ తర్వాత అనూహ్య మలుపులు తిరుగుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులు రివీల్ అవుతాయి. ముఖ్యంగా రెండో అర్థభాగం ఆర్గానికి వ్యవసాయం చుట్టూ తిరుగుతున్నా ఎక్కడా బోర్ కొట్టదు. వ్యవసాయానికి శృతి మించని ఎంటర్టైన్మెంట్ జోడించడం బాగుంటుంది. ఇక కొన్ని పంచ్ డైలాగ్‌లు వావ్ అనిపించేలా ఉంటాయి. ఇక ఈ సినిమాలో హీరో అంతగా చదువుకోలేదు.. డబ్బులు ఉన్నవాడు కాదు.. కానీ అనుకున్నది సాధిస్తాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాడు. ఆశయం గొప్పదయితే ప్రకృతే మనకు అదృష్టంగా మారి మన విజయానికి సహకరిస్తుందని ‘భీష్మ’ సినిమాతో మరోసారి రుజువైంది. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ అందించిన పాటలు ఎంతటి హిట్ సాధించాయే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సింగర్స్, లిరక్ రైటర్స్ తమ వంతు న్యాయం చేశారు. స్క్రీన్‌ప్లే గజిబిజీగా కాకుండా క్లీన్‌గా సాగుతుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సాయి శ్రీరామ్ తన కెమెరా పనితనంతో సినిమాను చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఎక్కడా కూడా వెనక్కితగ్గకుండా ఖర్చు నిర్మాత నాగవంశీ ఖర్చు చేసినట్టు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే.. దర్శకుడి ప్రతిభ, ఆకట్టుకునే నటీనటులు నటన, అలరించే సంగీతం ఇలా అన్నీ కలబోసి వచ్చిన చిత్రం ‘భీష్మ’ . పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్.. పైసా వసూల్ చిత్రం. ప్లస్ పాయింట్స్: నితిన్ నటన రష్మిక గ్లామర్ అండ్ క్యూట్‌నెస్ కామెడీ మైనస్ పాయింట్స్: విలనిజం ఆకట్టుకోకపోవడం రెగ్యులర్ కమర్షియల్ ఫార్మట్ కావడం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
‘భీష్మ’ సినిమాలో ట్విస్ట్ అదే : వెంకీ
నితిన్, రష్మిక మందన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల గురువారం మీడియాతో సంభాషించారు. ఆ విశేషాలివి... ► ‘ఛలో’ విడుదలయ్యాక నితిన్‌కి ఈ కథ చెప్పా. ఆయన కోసమే రాసిన కథ ఇది. స్ర్కిప్ట్ వర్క్ పూర్తవడానికి కాస్త సమయం పట్టడంతో టెన్షన్ పడ్డా. కానీ నితిన్ ‘బౌండెడ్ స్ర్కిప్ట్‌తోనే సెట్‌కి వెళదాం. కంగారు ఏమీ లేదు. నేను వెయిట్ చేస్తా’ అని ఏడాది మరో సినిమా చేయకుండా ఉన్నారు. స్ర్కిప్ట్ లాక్ అయ్యాక షూటింగ్‌కి వెళ్లాం. మధ్యలో మార్పులు, చేర్పుల గొడవే లేదు. షూటింగ్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. ►ప్రతి కథలోనూ ప్రేమ మిళితమై ఉంటుంది. ఇందులోనూ కామన్‌గా లవ్‌స్టోరీ ఉంది. కాకపోతే అది వినోదాత్మకంగా సాగుతుంది. కథలో భాగంగానే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పాను. మీమ్స్ చేస్తూ సరదాగా తిరిగే కుర్రాడికి, సేంద్రీయ వ్యవసాయానికి మధ్య సంబంధం ఏంటన్నది ఇందులో ఆసక్తికరమైన పాయింట్. (చదవండి : నవ్వులు పూయిస్తున్న ‘భీష్మ’ మేకింగ్ వీడియో) ►భీష్మ అంటే బ్రహ్మచారి. ఇందులో అనంత్ నాగ్ బ్రహ్మచారిగా కనిపిస్తారు. నితిన్ పాత్రని కూడా భీష్మకి సంబంధించిన కొన్ని అంశాలు జోడించి తీర్చిదిద్దాను. అనంత్ నాగ్‌కి, నితిన్ సంబంధం ఏంటనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. సేంద్రీయ వ్యవసాయం మంచిదనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా చెబుతున్నాం. ►రష్మిక తొలి సినిమాకే తెలుగు బాగా నేర్చుకుంది. డెడికేషన్‌తో పని చేసే నటి ఆమె. తన ఎక్స్ప్రెషన్స్ నాకు ఇష్టం. అందుకే మరోసారి ఆమెను కథానాయికగా ఎంపిక చేశా. అయితే రెండో సినిమాతోనే రష్మిక పెద్ద స్టార్ అయిపోయింది. అసలు నా సినిమా చేస్తుందో లేదో అనుకున్నా. అడగ్గానే అంగీకరించింది. నితిన్‌తో ఆమె చేసే సందడి అలరిస్తుంది. హుందాగా ఉండే ఓ పాత్ర కోసం అనంత నాగ్ని సంప్రదించా. మొదట చేయనన్నారు. కథ పూర్తిగా విన్నాక అంగీకరించారు. సినిమాకు ఆయన పాత్ర చాలా కీలకం. ►మన దగ్గ ఉన్న అత్యుత్తమ రైటర్స్‌లో త్రివిక్రమ్ గారు ముందుంటారు. నేను ఆయనకు అభిమానిని. ఆయన దగ్గర పని చేయడం వల్ల ఆ ప్రభావం నాపై చాలా ఉంది. నా డైలాగులు కూడా ఆయన డైలాగుల్లా అనిపించడానికి అదో కారణం. త్రివిక్రమ్‌గారు సినిమా చూసి నచ్చిందన్నారు. ట్రైలర్లోనే కథ చెప్పేయాలని, అప్పుడే ఆడియన్స్ ప్రిపేర్ అయ్యి వస్తారని, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదని సలహా ఇచ్చారు. అందుకే ట్రైలర్లో కథ చెప్పే ప్రయత్నం చేశా. ►చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలని ఉండేది. పేరెంట్స్ కోసం చదువుకున్నా. కొన్ని రోజులు వ్యవసాయం చేశా. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చా. తొలి విజయం సాధించాక అనేకమంది హీరోలు, నిర్మాతలు ఫోన్ చేయడం కామన్. నాకది ఓ గుర్తింపులా అనిపిస్తుంది. తర్వాత ఎలాంటి అవకాశాలు వస్తాయనే దాని కంటే నా వర్క్‌ని గుర్తించారనే విషయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ‘భీష్మ’ తర్వాత ఏ సినిమా చేయాలనేది ఇంకా ఆలోచించలేదు. మైత్రీ, యువీ సంస్థలకు సినిమాలు చేయాల్సి ఉంది. ప్రతి సినిమా నాకు ఓ పరీక్షలాగే ఫీలవుతా. సినిమా చేసే ప్రాసెస్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. -
‘భీష్మ’ మేకింగ్ : రష్మీక అల్లరే అల్లరి
నితిన్ హీరోగా రిలీజ్‌కు రెడీ అయిన సినిమా భీష్మ. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో పెంచాయి. మంచి హైప్‌తో, భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాపై హీరో నితిన్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. (చదవండి : అదిరిపోయిన ‘భీష్మ’ ట్రైలర్) శుక్రవారం (ఫిబ్రవరి 21న) ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రం బృందం గురువారం మేకింగ్ వీడియోని విడుదల చేసింది. సెట్స్‌లో రష్మిక చేసే అల్లరి, నితిన్ కామెడీ పంచ్‌లతో మేకింగ్ వీడియో అదిరిపోయింది. సినిమాలో సెట్లో జరిగిన సందడి అంతా ఇందులో చూపించారు. (చదవండి : భీష్మ సినిమా పేరు మార్చాలి) ‘హై క్లాసు నుంచి లోక్లాసు దాకా నా క్రష్‌లులే.. వందల్లో ఉన్నారులే... ఒకళ్లూ సెట్టవ్వలే..’ అనే పాటను బ్యాగ్రౌండ్ ప్లే చేస్తూ మేకింగ్ వీడియోను క్రియేట్ చేశారు. షూటింగ్ టైంలో రష్మీక, డైరెక్టర్ వెంకీల మధ్య జరిగిన సరదా సన్నివేశాలను మేకింగ్ వీడియోలో చూపించారు. దర్శకుడి షర్ట్‌పై ‘హీ ఇజ్ ఏ వెరీ రోమాంటిక్ ఫెల్లో’ అని రష్మీక రాయడం బట్టి చూస్తే తెలుస్తుంది ఆమె భీష్మ సెట్లో ఎంత అల్లరి చేసిందో. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం నితిన్‌కి బ్రేక్ ఇస్తుందో లేదో తెలియాలంటే మరి కొద్ది గంటలు ఆగాల్సిందే. -
‘భీష్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
‘దానివల్లేనేమో ఒక్కరు కూడా పడట్లేదు’
‘దుర్యోధనుడు, దుశ్శాసన, ధర్మరాజ్, యమధర్మ రాజ్, శని, శకుని పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆ జన్మ బ్రహ్మచారి భీష్మ పేరు ఎందుకు పెట్టారు నాకు’ అని తెగ ఫీలైపోతున్నాడు హీరో నితిన్. ఆయన హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ గ్లింప్స్, టీజర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. తాజాగా విడుదలయిన ట్రైలర్ మరింత ఆకట్టుకునేలా ఉంది. (చదవండి : ఘనంగా హీరో నితిన్ ఎంగేజ్మెంట్) ట్రైలర్ చూస్తుంటే సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నట్టు అర్థమైపోతోంది.‘దుర్యోధన్, దుశ్శాసన, ధర్మరాజ్, యమధర్మరాజ్, శని, శకుని ఇలా పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆజన్మ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారు నాకు. దానివల్లేనేమో ఒక్కరు కూడా పడట్లేదు’ అనే నితిన్ డైలాగుతో ట్రైలర్ మొదలైంది. వెన్నెల కిషోర్ కామెడీ పంచ్‌లు, రష్మీకతో నితిల్ రోమాన్స్ తరవాత అసలు కథ ఏ అంశం చుట్టూ తిరుగుతుందో చూపించారు. (చదవండి : ‘సరాసరి గుండెల్లో దించావె..’) ఈ సినిమా కథ సేంద్రీయ వ్యవసాయం చుట్టూ తిరుగుతుందని అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో విలన్‌గా బెంగాల్ నటుడు జిషు సేన్‌గుప్తా నటించారు. ఈయన ఎరువుల తయారీ కంపెనీకి యజమాని. జిషు, నితిన్ మధ్య వచ్చే సీన్లు అదిరిపోతాయని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ‘నువ్వు ఎన్ని నెలల్లో పుట్టావ్? ఆరు నెలల్లో పుడితే నిన్ను ఏమంటారో తెలుసా? నెల తక్కువ వెధవ అంటారు’ అంటూ జిషుతో నితిన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ‘బలవంతుడితో పోరాడి గెలవచ్చు.. అదృష్టవంతుడితో గెలవలేం’ అని విలన్ చెప్పే డైలాగ్ బాగుంది. చివరిగా ‘యు టచ్ మి ఐ పోక్ యు.. యు పోక్ మి ఐ స్క్రాచ్ యు’అని నితిన్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ను ముగించారు. -
నితిన్ లవ్‌స్టోరీ తెలిసింది అప్పుడే: రష్మిక
యంగ్ హీరో నితిన్, క్రేజీ బ్యూటీ రష్మిక మందన జంటగా తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఫిబ్రవరి 21న విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్‌కు ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇక చిత్ర ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ రష్మిక మీడియాతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా కనిపించిన విధానం కానీ, నితిన్ కూ, నాకూ మధ్య కెమిస్ట్రీ కానీ చాలా బాగున్నాయనిపించింది. వెరీ క్యూట్ ఫిల్మ్ అనిపించింది. ప్రేక్షకులు కూడా కచ్చితంగా అదే ఫీలవుతారు. సాంగ్స్ కూడా బాగా నచ్చాయ్. సినిమా మొత్తం ఒక విజువల్ ట్రీట్ లా ఉంటుంది" అని రష్మిక అన్నారు. 'సింగిల్ ఫరెవర్' అనే ట్యాగ్ లైన్ మీకు యాప్ట్ ఏమో ఇప్పుడు? అవును కదూ.. నితిన్ ఎంగేజ్ అయిపోయారు.. డైరెక్టర్ వెంకీ, నేను కూర్చొని ఈ సినిమాని మన కోసం చేసుకున్నాం అని సరదాగా అనుకున్నాం. సినిమా చూశారా? లేదు. డబ్బింగ్ చెప్పేటప్పుడు నా పోర్షన్ మాత్రం చూశాను. సినిమా కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నా. 'భీష్మ'లో ఎలాంటి రష్మికను ఆశించవచ్చు? మంచి వినోదాన్ని మీరు ఆశించవచ్చు. అయితే నా సినిమాని నేను జడ్జ్ చెయ్యలేను. ఇందులో నేను చైత్ర అనే క్యారెక్టర్ చేశాను. నైస్ క్యారెక్టర్. భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో పని చేస్తుంటా. నా పాత్ర నుంచి మీకు అది లభిస్తుంది, ఇది లభిస్తుంది.. అని చెప్పలేను. జనరల్ గా చెప్పాలంటే సినిమా మాత్రం సూపర్ గా నవ్విస్తుంది. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ సినిమాతో రష్మిక బాగా నటిస్తుందనీ, బాగా డాన్సులు చేస్తుందనీ, బాగా పాడుతుందని కూడా అందరూ అనుకుంటారు. అనంత్ నాగ్ గారితో కలిసి పనిచెయ్యడం ఎలా ఉంది? ఆయన ఫాదర్ ఫిగర్ లాంటివారు. ఆయన కాంబినేషన్ లో నాలుగైదు రోజులు పనిచేశాను. ఆయన కూడా కర్ణాటక నుంచి వచ్చినవాళ్లు కాబట్టి ఇద్దరం ఎప్పుడూ కన్నడలో మాట్లాడుకొనేవాళ్లం. నా సినిమాల గురించి అడిగేవారు. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచెయ్యడాన్ని బాగా ఆస్వాదించాను. ఈ సినిమాలో ఆర్గానిక్ వ్యవసాయం గురించి చెప్పడం ఎలా అనిపించింది? మా ఫ్రెండ్స్ తో ఈ కథ చెప్పినప్పుడు, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఏం చెప్తారే?.. అని అన్నారు. కానీ 'భీష్మ'లో తన స్క్రీన్ ప్లేతో ఆ టాపిక్ గురించి వెంకీ చాలా బాగా చెప్పాడు. ఇందులో ఎక్కడా దాని గురించి లెక్చర్స్ ఉండవు. 'భీష్మ' అనేది ఆర్గానిక్ వ్యవసాయం గురించిన కథ కాదు. ఇది ఒక వ్యక్తి ప్రయాణం. ఆర్గానిక్ వ్యవసాయం అనేది అతని జర్నీలో ఒక భాగం. ఒక్క మాటలో చెప్పాలంటే 'భీష్మ' చాలా మంచి ఫిల్మ్. వ్యవసాయం గురించిన యథార్థ ఘటనలను కూడా ఈ సబ్జెక్టులో జోడించారా? రైతులు ఇవాళ ఎన్ని కష్టాలు పడుతున్నారో మనకు తెలుసు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్లనూ, పిల్లల స్కూళ్లు ఫీజు చెల్లించడానికి కూడా నానా కష్టాలు పడుతున్నవాళ్లనూ మనం చూస్తున్నాం. వాటిని సూచనప్రాయంగా ఈ కథలో డైరెక్టర్ చెప్పాడు. నాకు కథ చెప్పినప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం అనేది ఒక అంతర్లీన సందేశంగానే ఉంటుందనీ, ప్రధానంగా ఇది ఫన్ ఫిల్మ్ అనీ చెప్పాడు. నేను డబ్బింగ్ చెప్పేప్పుడు అదే ఫీలయ్యాను. వ్యవసాయం అనేది చాలా సున్నిత అంశం. దాన్ని ప్రేక్షకులు ఆమోదించేలాగా వెంకీ తీశాడు. నితిన్.. పవన్ కల్యాణ్ అభిమాని అని మీకు తెలుసా? మాటల మధ్యలో ఒకసారి తాను పవన్ కల్యాణ్ గారికి వీరాభిమానినని నితిన్ చెప్పారు. చిన్నప్పట్నుంచీ ఆయన పవన్ కల్యాణ్ గారికి ఫ్యాన్. ఇప్పుడు తను యాక్టర్ అయినా కూడా ఇంకా ఆయన ఫ్యాన్ గానే ఉండటం ముచ్చటగా అనిపించింది. 'పవన్ గారిని ఎప్పుడైనా కలిశారా?' అనడిగాను. రెండు మూడుసార్లు పవన్ కల్యాణ్ గారిని కలిశానని చెప్పారు. మొత్తానికి నితిన్ ఒక ఫ్యాన్ బాయ్. నితిన్ తో పనిచెయ్యడం ఎలా అనిపించింది? నేను సరదాగా చెప్పడం లేదు. 'అ ఆ'లో నితిన్, సమంతను చూసినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తే, ఇలాంటి సినిమా చెయ్యాలి అనుకొన్నాను. వాళ్లిద్దరూ అంత చక్కగా అనిపించారు ఆ సినిమాలో. ఇప్పుడు నితిన్ తోటే ఈ సినిమా చేశా. మొదటిరోజు సెట్స్ మీదకు వెళ్లినప్పుడు.. తను చాలా సినిమాలు చేశారు కదా, తనతో చెయ్యడం సౌకర్యంగా ఉంటుందా, లేదా అనుకున్నా. కానీ తను ఒక కాలేజ్ బాయ్ లా కనిపించారు. కూర్చొని ఫోన్ చూసుకుంటూ, వెంకీతో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారు. దాంతో నేను సౌకర్యంగా ఫీలయ్యా. కాలేజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా అయిపోయాం. మీకు నితిన్ లవ్ స్టోరీ గురించి ఎప్పుడు తెలిసింది? నిశ్చితార్థానికి రెండు రోజుల ముందే తెలిసింది. అప్పటిదాకా తను నాకూ ఈ విషయం చెప్పలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గురించి ఏం చెబుతారు? ఈ సినిమా చేసేటప్పుడు నాలుగైదు సార్లు నిర్మాత నాగవంశీ గారిని కలిశాను. చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ సినిమా చూసినవాళ్లు ప్రొడక్షన్ విలువల గురించి కూడా మాట్లాడుకుంటారు. అంత క్వాలిటీతో నాగవంశీ గారు 'భీష్మ'ను నిర్మించారు. 'ఛలో' నుంచి చూసుకుంటే మూడేళ్లలోనే మీకు స్టార్ డం రావడాన్ని ఎలా ఫీలవుతున్నారు? నాకు వచ్చిన స్క్రిప్ట్స్ లో నాకు నచ్చినవి చేసుకుంటూ పోతున్నానంతే. ఇందులో లక్ ఫ్యాక్టర్ ఎంత ఉందో నాకు తెలీదు. వాలంటైన్స్ డేని ఎలా గడిపారు? వాలంటైన్స్ డేకి ఫుల్ వర్క్ ఉంటుందని మార్నింగ్ జిమ్ కు వెళ్లొచ్చా. కానీ అన్ని వర్క్స్ కేన్సిల్ అయ్యాయి. అలా నా వాలంటైన్స్ డే ఎప్పుడూ లేనంత బోరింగ్‌గా గడిచింది. ఎవరూ ఎప్పుడూ అలాంటి బోరింగ్ వాలంటైన్స్ డేని గడిపి ఉండరు. పాత్రల ఎంపికలో ఇప్పుడు వేటికి ప్రాధాన్యమిస్తున్నారు? కథకు ప్రాధాన్యమున్న పాత్రల్ని, మనసుకు నచ్చిన పాత్రల్ని ఎంచుకుంటున్నా. ఇది చేస్తే కొత్తగా ఉంటుంది అనిపించినా చేస్తున్నా. ఇప్పుడు పాత్రల విషయంలో మరింత కొత్తదనం కోసం చూస్తున్నా. ఇది ప్రయోగాలు చెయ్యడమే. తర్వాత ఏమవుతుందనే ఉత్కంఠ కలిగించే సబ్జెక్టులు ఎంచుకుంటున్నా. రెండు విషయాలు నేను నమ్ముతాను. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు మంచి సినిమా చూశామనే అనుభూతిని పొందాలి.. అది ఎమోషనల్ కావచ్చు, మరొకటి కావచ్చు. లేదంటే వాళ్లు సరదాగా ఎంజాయ్ చేసేటట్లయినా ఉండాలి. కడుపు నొప్పి పుట్టేంతగా వాళ్లు నవ్వాలి. 'భీష్మ' ఈ రెండో రకానికి చెందిన సినిమా. డబ్బింగ్ చెప్పేప్పుడు నేనే నవ్వలేక పొట్టచేత్తో పట్టుకున్నా. అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమాలో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? మార్చి మధ్యలో జాయినవుతాను. అందులో పూర్తిగా మరో రష్మికను మీరు చూస్తారు. చదవండి: చిన్నప్పటి నుంచి విజయ్ అంటే క్రష్ ‘లవ్యూ వెంకీ.. రష్మిక నువ్వు నా’ -
ఘనంగా హీరో నితిన్ ఎంగేజ్మెంట్
ఎట్టకేలకు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ యంగ్ హీరో నిశ్చితార్థం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. పరిమిత సంఖ్యలో సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుకని నిర్వహించారు. ప్రీ వెడ్డింగ్ ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసిన నితిన్ తన పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయని చెప్పాడు. షాలిని అనే అమ్మాయిని నితిన్ గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని నితిన్ ఇంట్లో చెప్పేయడంతో వారూ ఒప్పుకున్నారు. ఎప్రిల్ 16 నితిన్ వివాహం జరుగనుందని సమాచారం. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ సినిమాతో బాగా బిజీగా ఉన్నారు. వెంకీ కుడుముల సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన కథానాయికగా నటించారు. ఈ నెల 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్ దే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి, దర్శకుడిగా మారిన లిరిసిస్ట్ కృష్ణ చైతన్యల దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు అంగీకరించాడు. Pelli panulu started.. Mussssikk startttts ❤️❤️❤️ Need ur blessings...🤗🤗 pic.twitter.com/bQ3zXUO7s6 — nithiin (@actor_nithiin) February 15, 2020 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘సరాసరి గుండెల్లో దించావె..’
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ ‘భీష్మ’. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ అంశం హైలైట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫస్ట్ గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌తో ఈ సినిమాపై అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ కాసేపటి క్రితం విడుదల చేసింది. ఇప్పటివరకు విడుదలైన సింగిలే అన్న సాంగ్, వాటే బ్యూటీ సాంగ్స్ బాగానే రీచ్ కాగా తాజాగా విడుదలైన సరాసరి సాంగ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. మహతి స్వరసాగర్ కంపోజ్ చేసిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించాడు. ‘రాములో రాములో’ తో ఫుల్ ఫామ్‌లో ఉన్న అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆలపించాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 21న విడుదల కానుంది. చదవండి: ‘లవ్యూ వెంకీ.. రష్మిక నువ్వు నా’ హీరో నితిన్ పెళ్లి వాయిదా..! ‘నా వైఫ్ దిశ.. తను కనిపించట్లేదు సర్’ -
‘భీష్మ’ సినిమా స్టిల్స్