
నితిన్, కృతీశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిరాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి స్పెషల్ సాంగ్ చేస్తుంది. తాజాగా దానికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు మేకర్స్.
(చదవండి: పాకిస్తాన్‌లో చరిత్ర సృష్టించిన ‘మేజర్’)
‘రారా రెడ్డి.. ’అంటూ సాగే ఈ పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా మహతి స్వరసాగర్ లైవ్లీ బీట్‌లతో ఊర మాస్ ట్రాక్‌ని స్కోర్ చేశారు. లిప్సిక అద్భుతంగా ఆలపించారు. ఇక నితిన్, అంజలి కలిసే వేసే స్టెప్పులు పాటను మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఫుల్ సాంగ్ జులై 9న విడుదల కానుంది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నాడు. ఆగస్ట్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment