anjali
-
Madha Gaja Raja Review: ‘మదగజరాజా’ మూవీ రివ్యూ
టైటిల్: మదగజరాజానటీనటులు:విశాల్, సంతానం, వరలక్ష్మి, అంజలి, శరత్ సక్సేనా, సోనూ సూద్, మణివణ్ణన్ (లేట్), నితిన్ సత్య, సడగొప్పన్ రమేష్, ఆర్. సుందర్ రాజన్, మొట్టా రాజేంద్రన్, మనోబాలా (లేట్), స్వామినాథన్, జాన్ కొక్కెన్, టార్జాన్, విచ్చు విశ్వనాథ్ తదితరులునిర్మాణ సంస్థ: జెమినీ ఫిల్మ్ సర్క్యూట్కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుందర్ సితెలుగు విడుదల: సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్సంగీతం: విజయ్ ఆంటోనిఎడిటర్: శ్రీకాంత్ ఎన్.బి.విడుదల తేది: జనవరి 31, 2025తమిళ స్టార్ విశాల్ 12 ఏళ్ల క్రితం నటించిన చిత్రం ‘మదగజరాజా’(Madha Gaja Raja ). కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ.. ఈ ఏడాది జనవరి 12 తమిళ్లో రిలీజై పెద్ద విజయం సాధించింది. చాలా కాలం తర్వాత విశాల్ సినిమా రూ. 50 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. అయితే సంకాంత్రి బరిలో పెద్ద చిత్రాలు ఉండడంతో తెలుగులో రిలీజ్ కాలేదు. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడు(జనవరి 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ మాదిరే ఇక్కడ కూడా ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచిందా? మదగజరాజా తెలుగు ప్రేక్షకులను మెప్పించాడా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?అరకు చెందిన మదగజరాజా( అలియాస్ ఎంజీఆర్(విశాల్)(Vishal) ఓ కేబుల్ ఆపరేటర్. తండ్రి స్థానిక పోలీసు స్టేషన్లో ఎస్సై. తండ్రికి తోడుగా ఉంటూ.. ఊర్లోనే ఉంటుంటాడు. ఓ కేసు విషయంలో అరకు వచ్చిన అగ్గిపెట్ట ఆంజనేయులు కూతురు మాధవి(అంజలి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. మాధవి కూడా ఎంజీఆర్‌ని ప్రేమిస్తుంది. కానీ ఓ కారణంగా ఆమె తండ్రితో కలిసి అరకు నుంచి వెళ్లిపోతుంది(Madha Gaja Raja Review)రాజా ఈ బాధలో ఉండగానే.. తన కూతురు పెళ్లికి రావాలంటూ చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు చెప్పిన మాస్టార్ నుంచి ఫోన్ కాల్వస్తుంది. ఈ పెళ్లి వేడుకలో బాల్య స్నేహితులంతా కలుస్తారు. పెళ్లి అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో తన స్నేహితులకు ఏవో సమస్యలు ఉన్నట్లు రాజాకు తెలుస్తుంది. ఈ సమస్యలకు మీడియా బలంతో పాటు రాజకీయ పలుకుబడి ఉన్న కాకర్ల విశ్వనాథ్(సోనూసూద్) కారణమని తెలిసి రాజా హైదరాబాద్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మీడియాను అడ్డుపెట్టుకొని కాకర్ల ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడు? తన స్నేహితులకు కాకర్ల చేసిన మోసం ఏంటి? చివరకు తన స్నేహితుల సమస్యలను తీర్చాడా లేదా? ఈ కథలో మాయ(వరలక్ష్మి శరత్ కుమార్) పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ సినిమా ఇప్పుడు తెరకెక్కించింది కాదు. 12 ఏళ్ల క్రితమే రూపొందింది. అప్పటికి ఇప్పటికీ వెండితెరపై చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రేక్షకుల మైండ్‌సెట్ కూడా మారిపోయింది. డిఫరెంట్ కంటెంట్, కొత్త పాయింట్ ఉన్న చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మళ్లీ పాత సినిమాలను గుర్తు చేసింది మదగజరాజా. కథ, కథనంలో ఎలాంటి కొత్తదనం లేదు. కమర్షియల్ ఫార్మాటులో సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన సుందర్ సి. ఈ సినిమాను కూడా అదే పంథాలో తెరకెక్కించాడు. లాజిక్స్‌ని పట్టించుకోకుండా ఓన్లీ కామెడీని నమ్ముకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అదే సినిమాను నిలబెట్టింది. రొటీన్ కథే అయినప్పటికీ ఈ సినిమాలోని కామెడీ సన్నివేశాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా హీరో స్నేహితుడుగా సంతానం పండించిన కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. కొన్ని చోట్ల కామెడీ కోసం వాడే సంబాషణలు ఇబ్బందికరంగా ఉన్నా.. ఓ వర్గం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.కథగా చెప్పాలంటే ఇది చాలా చిన్న సినిమా. రాష్ట్ర రాజకీయాలను శాసించే ఓ వ్యక్తిని సామాన్యుడు ఎలా ఢీ కొట్టాడు అనేది ఈ సినిమా కథ. స్నేహితుల కష్టాలను తీర్చడం కోసం హీరో రంగంలోకి దిగడం కూడా పాత పాయింటే. అయితే అసలు స్టోరీ అంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. ఫస్టాఫ్‌లో అసలు కథేమి ఉండదు. కానీ ఎక్కడా బోర్ కొట్టదు. దానికి కారణం సంతానం పండించిన కామెడీనే. సంతానం వేసిన ప్రతి పంచ్ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. కొన్ని చోట్ల శ్రుతిమించినట్లు అనిపించినా సంతానం ట్రాక్‌ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక సెకండాఫ్‌ని సీరియస్‌గా మార్చే అవకాశం ఉన్నా.. మళ్లీ కామెడీనే నమ్ముకున్నాడు దర్శకుడు. కాకర్లను బురిడీ కొట్టించేందుకు హీరో చేసే పనులు వాస్తవికానికి దూరంగా ఉంటాయి. మంత్రి సత్తిబాబు డెడ్‌బాడీతో హీరో, అతని గ్యాంగ్ చేసే హంగామా నవ్విస్తుంది. అయితే ఇవన్నీ సన్నివేశాలుగా చూస్తేనే బాగుంటుంది. కానీ కథగా చూస్తే అతికినట్లుగా అనిపిస్తుంది. సీన్ టు సీన్ కంటిన్యుటీ ఉండదు. ఫస్టాఫ్ కథకి సెకండాఫ్ కథకి సంబంధమే ఉండదు. ఇలాంటి లాజిక్స్‌కి పట్టించుకోకుండా కొంచెం అతి అయినా పర్లేదు భరిస్తామని అనుకుంటే.. ఈ చిత్రం మిమ్మల్ని అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే..మాస్ యాక్షన్ సినిమాలు విశాల్‌కి కొత్తేమి కాదు. కెరీర్ ప్రారంభం నుంచి ఈ తరహా పాత్రలు చేస్తూనే ఉన్నాడు. మదగజరాజాలోనూ మరోసారి మాస్ పాత్రనే పోషించాడు. యాక్షన్‌తో పాటు కామెడీ కూడా బాగానే పండించాడు. ఈ చిత్రం కోసం ఓ పాటను కూడా ఆలపించాడు. తెరపై ఆయన చేసే కొన్ని పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్, అంజలీ ఇద్దరూ తెరపై అందాలు ఆరబోయడంలో పోటీ పడ్డారు. వారిద్దరి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా.. గ్లామర్ పరంగా మాత్రం మంచి మార్కులు కొట్టేశారు. సోనూసూద్ తనకు అలవాటైన విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. సంతానం కామెడీ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. ఆయన పండించిన కామెడీ మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. మనోబాలతో పాటు మిగిలిన నటీటనులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. విజయ్ ఆంటోనీ అందించిన నేపథ్య సంగీతం, పాటలు 12 ఏళ్ల క్రితం వచ్చిన మాస్ కమర్షియల్ సినిమాలను గుర్తు చేస్తాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. డబ్బింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. తెరపై ఒకచోట తమిళ పేర్లు..మరోచోట తెలుగు పేర్లు కనిపిస్తాయి. విశాల్‌తో సహా అందరి పాత్రలకు వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పించారు. విజువల్స్‌గా సినిమా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
తమిళ్లో పెద్ద హిట్.. తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుంది: అంజలి
విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘మద గజరాజా’(Madagada Raja ). ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, అంజలి హీరోయిన్లుగా నటించారు. సుందర్. సి దర్శకత్వంలో జెమిని ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న తమిళంలో విడుదలైంది. ఈ సినిమా తమిళంలో హిట్ మూవీగా నిలిచి, రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించిందని చిత్రబృందం పేర్కొంది. కాగా ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్‌ను అదే టైటిల్‌తో సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ నెల 31న తెలుగులో విడుదల చేస్తోంది.హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంజలి(Anjali) మాట్లాడుతూ– ‘‘మంచి కమర్షియల్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశాను. ఈ మూవీ, తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. విశాల్ యాక్షన్, సంతానం కామెడీ, మ్యూజిక్, సుందర్ సర్ డైరెక్షన్ తో కలర్ ఫుల్ మూవీ ఇది. మూవీ లవర్స్ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. థియేటర్స్ లో చూడండి. తప్పకుండా నచ్చుతుంది' అన్నారు.హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ‘హీరోయిన్గా నా ఫస్ట్ కమర్షియల్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో వెస్ట్రన్ హీరోయిన్గా కనిపిస్తాను.ఈ సినిమా తమిళ్ లో చాలా పెద్ద హిట్. మంచి ఎంటర్ టైనర్. ప్రతి ఎపిసోడ్ ని ఎంజాయ్ చేస్తారు. ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్ టైనర్. జనవరి 31న తెలుగు రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి'నిర్మాత జెమిని కిరణ్ మాట్లాడుతూ.. ఒక హీరో ఇద్దరు హీరోయిన్స్ తో వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం అని ఈ సంక్రాంతికి ఇక్కడ పెద్ద హిట్ కొట్టారు. అలాగే అక్కడ విశాల్ గారు మదగజరాజా తో తమిళ్ లో పెద్ద విజయం అందుకున్నారు. అక్కడ వి ఇక్కడ వి. ఖచ్చితంగా ఇక్కడ కూడా సూపర్ హిట్ కొడతారు. ఈ సినిమా తమిళ్లో సూపర్ డూపర్ హిట్టు. ఇక్కడ కూడా అలానే అవుతుందని ఆశిస్తున్నాను. థాంక్యూ ఆల్ ది బెస్ట్' అన్నారు. -
'మదగజరాజా'మూవీ ప్రెస్మీట్లో హీరోయిన్ అంజలి,వరలక్ష్మి (ఫొటోలు)
-
గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌పై స్పందించిన అంజలి.. బాధేస్తోందంటూ..
గేమ్ ఛేంజర్ సినిమా (Game Changer Movie) రిజల్ట్‌పై హీరోయిన్ అంజలి (Anjali) తొలిసారి స్పందించింది. కొన్ని ఫలితాలను చూసినప్పుడు బాధగా అనిపిస్తుందని పేర్కొంది. ఈ సంక్రాంతికి అంజలి నటించిన రెండు సినిమాలు రిలీజయ్యాయి. ఒకటి గేమ్ ఛేంజర్ కాగా మరొకటి మదగజరాజ. పన్నెండేళ్లక్రితం అంజలి హీరోయిన్గా నటించిన మదగజరాజ ఎట్టకేలకు తమిళనాట విడుదలైంది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో జనవరి 31న రిలీజ్ చేస్తున్నారు.అంతవరకే నా పనిఈ సినిమా సమావేశంలో అంజలికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. గేమ్ ఛేంజర్ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఆ సినిమాకు మంచి ఫలితం వచ్చుంటే బాగుండేది కదా.. దానిపై మీ ఫీలింగ్ ఏంటి? అన్న ప్రశ్నకు.. ఒక నటిగా నా పాత్రకోసం నేను బాధ్యత తీసుకోగలను. నా పాత్రను ఎలా పోషించాలి? అందుకోసం వందశాతం ఎఫర్ట్స్ పెడుతున్నానా? లేదా? అన్నదే నా చేతిలో ఉంటుంది. అక్కడితోనే నా పనైపోతుంది. మా సినిమాను జనాలు ఆదరించాలన్నది మా తపన. అందుకోసం ప్రమోషన్స్‌కు వెళ్తుంటాము. ప్రేక్షకులకు మా సినిమా చూడమని చెప్తాము.ఎవరూ సినిమా బాగోలేదని అనలేదుఅయినా గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడాలంటే దానికోసం ప్రత్యేక ఇంటర్వ్యూ పెట్టాలి. ఎందుకనేది మీ అందరికీ తెలుసు. కొన్ని సినిమాలపై నమ్మకం ఉంచి నటిస్తాము. నేను గేమ్ ఛేంజర్‌ను పూర్తిగా నమ్మాను. ఈ సినిమా చూసిన జనరల్ ఆడియన్స్ ఎవరూ గేమ్ ఛేంజర్ బాగోలేదని చెప్పలేదు. మంచి సినిమా అని కితాబిచ్చారు. సినిమా బాగుండటం వేరు, మంచి సినిమా వేరు. బాధగా ఉందిగేమ్ ఛేంజర్ మంచి సినిమా.. మీరు చాలా బాగా యాక్ట్ చేశారు అని నాతో చాలామంది అన్నారు. అది నాకు చాలు. అయినా సరే.. కొంత బాధగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. మదగజరాజ సినిమా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చుంటే ఒప్పుకునేవారా? అన్న ప్రశ్నకు.. అంజలి, వరలక్ష్మి (Varalaxmi Sarathkumar).. కథ ఎవరు చెప్తున్నారనేదాన్ని బట్టి తమ నిర్ణయం ఆధారపడి ఉంటుందన్నారు.గేమ్ ఛేంజర్ఇదిలా ఉంటే రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటించిన గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత విజయం రాబట్టలేకపోయింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. చరణ్ ద్విపాత్రాభినయం చేయగా అంజలి కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: సినిమాలు వదిలేయాలనుకున్నాను: అప్సరా రాణి -
మొగలిరేకులు సీరియల్ నటి పదో పెళ్లి రోజు.. భర్తతో ఆనందంగా.. (ఫోటోలు)
-
అదిరిపోయే పంచ్‌లతో 'మదగజరాజా' తెలుగు ట్రైలర్
విశాల్(Vishal ) నటించిన ‘మదగజరాజా’(Madha Gaja Raja) చిత్రం సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ సంక్రాంతికి కోలీవుడ్‌లో విడుదలైంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌కు దగ్గరలో ఈ మూవీ ఉంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం తెలుగు వర్షన్ కూడా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన ‘మదగజరాజా’ చిత్రం జనవరి 12న తమిళంలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి మంచి స్పందన లభించిందని యూనిట్ పేర్కొంది. కాగా ఈ జనవరి 31న సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) హీరోయిన్స్‌గా నటించారు. తెలుగు వర్షన్లో సినిమా రానున్నడంతో తాజాగా ‘మదగజరాజా’ ట్రైలర్‌ను హీరో వెంకటేశ్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. కామెడీ ప్రధానంగా ఈ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జానర్ సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు సుందర్.సి. దిట్ట అని చెప్పవచ్చు. ఆయన తన మార్క్ మాస్ అంశాలతో ఈ మూవీని రూపొందించారు. ఇందులో హీరోయిన్ సదా కూడా ఒక ఐటెమ్ సాంగ్‌లో కనిపించింది. -
నిర్మాత లవ్ రిజెక్ట్ చేశా.. ఆ కోపంతో రైల్లో నుంచి తోసేయాలని..: దృశ్యం నటి
దృశ్యం సినిమాతో పాపులరైంది అంజలి నాయర్ (Anjali Nair). తాజాగా ఈ బ్యూటీ తనకు గతంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. అంజలి మాట్లాడుతూ.. ఉన్నయే కాదలిప్పన్ (Unnaiye Kadhalipen) అనే తమిళ సినిమా చేస్తున్నప్పుడు ఆ మూవీ నిర్మాత నాకు ప్రపోజ్ చేశాడు. అతడు ఆ సినిమాను నిర్మించడంతో పాటు అందులో విలన్‌గానూ నటించాడు. తన ప్రపోజల్‌ను నేను తిరస్కరించాను. దాంతో అతడు నేను వేరే సినిమాకు వెళ్లినప్పుడు ఆ సెట్స్‌కు వచ్చి వేధింపులకు గురి చేశాడు.రైల్లో నుంచి నెట్టేయాలని..ఒకసారి రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్‌గా వచ్చి నా బ్యాగు తీసుకున్నాడు. తిరిగిచ్చేయమని అతడిని వెంబడించినప్పుడు రైలు డోర్ దగ్గర నన్ను బయటకు నెట్టేయాలని చూశాడు. ఒకసారి అతడి సోదరి నాకు ఫోన్ చేసి ఆమె తల్లి ఆరోగ్యం బాగోలేదని చెప్పింది. నన్ను చూడాలని కలవరిస్తోందని చెప్పింది. అతడు ఇంట్లో ఉంటే రానని చెప్పాను. అందుకామె.. తన సోదరుడు ఇంట్లో లేడని స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోయాడని, కంగారుపడాల్సినం అవసరం లేదని సర్ది చెప్పింది.కత్తితో బెదిరించి సంతకం..నిజమేననుకుని వెళ్లాను. నేను ఇంట్లో ఓ గదిలోకి వెళ్లగానే బయట నుంచి గడియ పెట్టారు. ఆ గదిలో ఆ రాక్షసుడు ఉన్నాడు. కొన్ని పేపర్లు నా ముందు పెట్టి సంతకం పెట్టమన్నాడు. కత్తితో బెదిరించడంతో సంతకం చేశాను. ఆ పేపర్లలో లవ్ లెటర్ కూడా ఉంది. తర్వాత ఎలాగోలా ఆ గది నుంచి బయటపడ్డాను. అయితే అతడి నెక్స్ట్ సినిమాలో నేనే హీరోయిన్గా నటించాలని కాంట్రాక్ట్ పేపర్‌పై నాతో బలవంతంగా సంతకం చేయించుకున్నాడని అర్థమైంది.(చదవండి: 'సంక్రాంతికి వస్తున్నాం' బుల్లి రాజు.. తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్!)అంత చెండాలంగా లెటర్ రాస్తారా?నేను సినిమా చేయనని చెప్పాను. ఆధారాలతో సహా అతడిపై కేసు పెట్టాను. అప్పుడు అతడు నేను రాసినట్లుగా లవ్ లెటర్స్‌ను సాక్ష్యంగా చూపించాడు. నేనొకటే అడిగా.. ప్రేమించే ఏ అమ్మాయైనా అంత చెండాలంగా లవ్ లెటర్ రాస్తుందా? అని ప్రశ్నించాను. ఆ కేసు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తర్వాత మళ్లీ ఎప్పుడూ అతడు నాకు కనిపించలేదు అని చెప్పుకొచ్చింది. సినిమాఅంజలి.. మలయాళంలో ద కింగ్ అండ్ ద కమిషనర్, 5 సుందరికల్, పట్టం పోలే, వెనిసిలె వ్యాపారి, ఏంజెల్స్, టమార్ పడార్, 100 డిగ్రీ సెల్సియస్, సెకండ్స్, సెంట్రల్ థియేటర్, లైలా ఓ లైలా, బెన్, దూరం, తీరం, ఆమి, దృశ్యం 2, మాన్స్టర్ సినిమాలు చేసింది. తమిళంలో ఇదువుమ్ కాదంధు పొగుం, నెల్లు, ఆగడు సినిమాలు చేసింది. ఇటీవలే చిత్తా(తెలుగులో చిన్నా) సినిమాకుగానూ ఉత్తమ సహాయ నటిగా రాష్ట్రీయ అవార్డు గెలుచుకుంది. కాగా అంజలి దర్శకుడు అనీశ్‌ను 2011లో పెళ్లి చేసుకుంది. వీరికి అవని అనే కూతురు ఉంది. 2016లో అతడికి విడాకులు ఇచ్చింది. 2022లో అజిత్ రాజును రెండో పెళ్లి చేసుకోగా వీరికి ఓ కూతురు పుట్టింది.చదవండి: నాన్న చేసిన పనికి అమ్మ ఏడుస్తూ... ఈ బతుకే వద్దనుకున్నా! -
సంక్రాంతి వచ్చెనట సందడి తెచ్చెనట!
మంచుకు తడిసిన ముద్దబంతులు... ముగ్గులు... పూలు విచ్చుకున్న గుమ్మడి పాదులు... కళ్లాపిలు.... వంట గదుల్లో తీపీ కారాల ఘుమఘుమలు...కొత్త బట్టలు... కొత్త అల్లుళ్ల దర్పాలు...పిల్లల కేరింతలు... ఓపలేని తెంపరితనాలుసంక్రాంతి అంటే సందడే సందడి.మరి మేమేం తక్కువ అంటున్నారు సినిమా తారలు.మా సంక్రాంతిని వినుమా అని ముందుకొచ్చారు.రచయిత్రులు ఊసుల ముత్యాల మాలలు తెచ్చారు.‘ఫ్యామిలీ’ అంతా సరదాగా ఉండే సంబరవేళ ఇది.ప్రతిరోజూ ఇలాగే పండగలా సాగాలని కోరుకుంటూసంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.ఇన్పుట్స్ : సాక్షి సినిమా, ఫ్యామిలీ బ్యూరోమన పండుగలను ఎన్నో అంశాలను మిళితం చేసి ప్రయోజనాత్మకంగా రూపొందించారు మన పెద్దలు. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా పండుగ విధులుగా చెప్పి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగా వాటిని రూపొందించారు. మన పండుగల్లో ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞానాలు మిళితమై ఉంటాయి. తెలుగువారి ప్రధానమైన పండుగ సంక్రాంతిలో కూడా అంతే! ప్రధానంగా చాంద్రమానాన్ని పాటించే తెలుగువారు సౌరమానాన్ని పాటించే ముఖ్యమైన సందర్భం ఇది. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15 కాని, 16వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14 కాని, 15 వ తేదీ వరకు కాని ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఆ రోజు నుండి సూర్యుడు తన గమన దిశని దక్షిణం నుండి ఉత్తరానికి మార్చుకుంటాడు కనుక మకర సంక్రమణానికిప్రాధాన్యం. ఆ రోజు పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు. బొమ్మల కొలువుపెట్టుకునే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. అసలు ప్రధానమైనది సంక్రాంతి. ఈ పుణ్యకాలంలో దానాలు, తర్పణాలుప్రాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం,పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయనివారు ఈ రోజు చేస్తారు. అసలు మూడురోజులు పేరంటం చేసే వారున్నారు. సంక్రాంతి మరునాడు కనుము. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి,పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె పొట్టేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు. నాగలి, బండి మొదలైన వాటిని కూడా పూజిస్తారు. ఇప్పుడు ట్రాక్టర్లకి పూజ చేస్తున్నారు. భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి, వ్యవసాయ పనిముట్లకి కూడా తమ కృతజ్ఞతలని తెలియచేయటం పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవమర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పంటను పాడుచేసే పురుగులని తిని సహాయం చేసినందుకు పక్షులకోసం వరికంకులను తెచ్చి కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’,‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’,‘కనుము నాడు మినుము తినాలి’ అనే సామెతలు కనుముకి పితృదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. మొత్తం నెల రోజులు విస్తరించి, నాలుగు రోజుల ప్రధానంగా ఉన్న పెద్ద పండగ సంక్రాంతి తెలుగువారికి ఎంతో ఇష్టమైన వేడుక. – డా. ఎన్.అనంతలక్ష్మిముక్కనుముముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని మాంసాహారం తినటానికి కేటాయిస్తారు. సంక్రాంతికి అందరూ తమ గ్రామాలకి చేరుకుంటారు. అల్లుళ్లు, ముఖ్యంగా కొత్త అల్లుళ్లు తప్పనిసరి. నెల రోజులు విస్తరించి, నాలుగు రోజులు ప్రధానంగా ఉండే సంక్రాంతి పెద్దపండుగ. పెద్దల పండుగ కూడా. పెద్ద ఎత్తున చేసుకునే పండుగ కూడా.థీమ్‌తో బొమ్మల కొలువుసంక్రాంతికి ప్రతియేటా ఐదు రోజులు బొమ్మలు కొలువు పెడుతుంటాం. చిన్నప్పటి నుంచి నాకున్న సరదా ఇది. నేను, మా అమ్మాయి, మనవరాలు కలిసి రకరకాల బొమ్మలను, వాటి అలంకరణను స్వయంగా చేస్తాం. ప్రతి ఏటా ఒక థీమ్‌ను ఎంచుకుంటాం. అందకు పేపర్, క్లే, అట్టలు, పూసలు, క్లాత్స్.. ఎంచుకుంటాం. ఈ సారి ఉమెన్ పవర్ అనే థీమ్‌తో నవదుర్గలు పెట్టాం. అమ్మ వార్ల బొమ్మలు ఇప్పటికీ ఇంట్లో ఉన్నాయి. గుడిలాగా అలంకారం చేశాం. గుడికి అమ్మాయిలు వస్తున్నట్టు, పేపర్లతో అమ్మాయిల బొమ్మలను చేశాం. తిరుపతి చందనం బొమ్మల సేకరణ కూడా ఉంది. ఆ బొమ్మలతో కైలాసం అనుకుంటే శివపార్వతులుగా, తిరుపతి అనుకుంటే వెంకటేశ్వరస్వామి, పద్మావతి... ఇలా థీమ్‌కు తగ్గట్టు అలంకరణ కూడా మారుస్తాం. ఈ బొమ్మల కొలువుకు మా బంధువులను, స్నేహితులను పిలుస్తుంటాం. ఎవరైనా అడిగితే వాళ్లు వచ్చేవరకు ఉంచుతాం. – శీలా సుభద్రాదేవి, రచయిత్రిపండగ వైభోగం చూతము రారండి– రోహిణితమిళ, మలయాళ, కన్నడ సినిమాలలో ఎంతో పెద్ద పేరు తెచ్చుకున్న రోహిణి అనకాపల్లి అమ్మాయి అనే విషయం చాలామందికి తెలియదు. అయిదేళ్ల వయసులో చెన్నైకి వెళ్లిపోయినా... అనకాపల్లి ఆమెతోనే ఉంది. అనకాపల్లిలో సంక్రాంతి జ్ఞాపకాలు భద్రంగా ఉన్నాయి. నటి, స్క్రీన్ రైటర్, పాటల రచయిత్రి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోహిణి మొల్లెటి... ‘సంక్రాంతి ఇష్టమైన పండగ’ అంటుంది, ఆనాటి పండగ వైభోగాన్ని గుర్తు చేసుకుంటుంది.నా చిన్నప్పుడు .. సంక్రాంతికి స్కూల్‌కి సెలవులు ఇచ్చేవారు. అదో ఆనందం. అలాగే కొత్త బట్టలు కొనిపెట్టేవాళ్లు. ఇంట్లో చక్కగా పిండి వంటలు చేసి పెట్టేవాళ్లు. ఫుల్లుగా తినేవాళ్లం. మాది అనకాపల్లి. నాకు ఐదేళ్లప్పుడు చెన్నై వెళ్లిపోయాం. సో... నాకు ఊహ తెలిశాక జరుపుకున్న పండగలన్నీ చెన్నైకి సంబంధించినవే.సంక్రాంతికి నెల ముందే నెల గంట పడతారు. అప్పట్నుంచి రోజూ ముగ్గులు పెట్టేవాళ్లం. అయితే ఎవరి ముగ్గు వారిది అన్నట్లు కాకుండా మా ముగ్గుకి ఇంకొకరు రంగులు వేయడం, మేం వెళ్లి వాళ్ల ముగ్గులకు రంగులు వేయడం... ఫైనల్లీ ఎవరి ముగ్గు బాగుందో చూసుకోవడం... అవన్నీ బాగుండేది. నేను రథం ముగ్గు వేసేదాన్ని. ఇక సంక్రాంతి అప్పుడు గంగిరెద్దుల సందడి, హరిదాసులను చూడడం భలేగా అనిపించేది. సంక్రాంతి నాకు ఇష్టమైన పండగ. ఎందుకంటే మనకు అన్నం పెట్టే రైతుల పండగ అది. వారికి కృతజ్ఞత తెలపాలనుకుంటాను. రైతుల విలువ పిల్లలకు చెప్పాలి. ఏమీ చెప్పకుండా పండగ చేసుకుంటే ఇది కూడా ఓ వేడుక అనుకుంటారు... అంతే. అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నామో పిల్లలకి చెప్పాలి. అర్థం తెలిసినప్పుడు ఇంకాస్త ఇన్ వాల్వ్ అవుతారు.ఇప్పుడు పండగలు జరుపుకునే తీరు మారింది. వీలైనంత వైభవంగా చేయాలని కొందరు అనుకుంటారు. అయితే ఎంత గ్రాండ్‌గా చేసుకుంటున్నామని కాదు... అర్థం తెలుసుకుని చేసుకుంటున్నామా? లేదా అనేది ముఖ్యం. తాహతుకి మించి ఖర్చుపెట్టి పండగ చేసుకోనక్కర్లేదన్నది నా అభిప్రాయం.సంక్రాంతి అంటే నాకు గుర్తొచ్చే మరో విషయం చెరుకులు. చాలా బాగా తినేవాళ్లం. ఇప్పుడూ తింటుంటాను. అయితే ఒకప్పటి చెరుకులు చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పటి జనరేషన్ చెరుకులు తింటున్నారో లేదో తెలియడం లేదు. షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నారు. అయితే చెరుకు కొరుక్కుని తింటే పళ్లకి కూడా మంచిది. మన పాత వంటకాలు, పాత పద్ధతులన్నీ మంచివే. ఇలా పండగలప్పుడు వాటి గురించి చెప్పడం, ఆ వంటకాలు తినిపించడం చేయాలి.నెల్నాళ్లూ ఊరంతా అరిసెల వాసనపండగ మూడు రోజులు కాదు మాకు నెల రోజులూ ఉండేది. వ్యవసాయం, గోపోషణ సమృద్ధిగా ఉండటం వల్ల నెల ముందు నుంచే ధాన్యం ఇల్లు చేరుతుండేది. నెల గంటు పెట్టగానే పీట ముగ్గులు వేసేవారు. వాటిల్లో గొబ్బిళ్లు పెట్టేవారు. రోజూ గొబ్బిళ్లు పెట్టి, వాటిని పిడకలు కొట్టేవారు. ఆ గొబ్బి పిడకలన్నీ పోగేసి, భోగిరోజున కర్రలు, పిడకలతోనే భోగి మంట వేసేవాళ్లు. మామూలు పిడకల వాసన వేరు, భోగి మంట వాసన వేరు. ప్రధాన సెలబ్రేషన్ అంటే ముగ్గు. బొమ్మల కొలువు పెట్టేవాళ్లం. అందరిళ్లకు పేరంటాలకు వెళ్లేవాళ్లం. ఊరంతా అరిసెల వాసన వస్తుండేది. కొత్త అటుకులు కూడా పట్టేవారు. చెరుకు గడలు, రేగుపళ్లు, తేగలు, పిల్లల ఆటలతో సందడిగా ఉండేది. బంతిపూల కోసం అక్టోబర్‌లో మొక్కలు వేసేవాళ్లం. అవి సంక్రాంతికి పూసేవి. కనుమ నాడు గోవులను అలంకరించి, దండం పెట్టుకునే వాళ్లం. చేసుకున్న పిండి వంటలు పంచుకునేవాళ్లం. హరిదాసులకు, గంగిరెద్దుల వాళ్లకు ధాన్యాన్ని ఇచ్చేవాళ్లం. ఇప్పటికీ పండగలను పల్లెలే సజీవంగా ఉంచుతున్నాయి. పట్టణాల్లో మాత్రం కొన్నేళ్లుగా టీవీల్లోనే సంక్రాంతి సంబరాలను చూస్తున్నాం. – రమారావి, కథకురాలు, ఆధ్యాత్మికవేత్తనా జీవితంలో సంక్రాంతి చాలా స్పెషల్– మీనాక్షీ చౌదరి‘ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారు’ అనేది మన అచ్చ తెలుగు సామెత. తెలుగుతనం ఉట్టిపడే పేరున్న మీనాక్షీ చౌదరి తెలుగు అమ్మాయి కాదు. ఉత్తరాది అమ్మాయి మీనాక్షీ చౌదరి కాస్త బాపు బొమ్మలాంటి తెలుగింటి అమ్మాయిగా మారడానికి మూడు సంవత్సరాల కాలం చాలదా! మీనాక్షీ నటి మాత్రమే కాదు స్విమ్మర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కూడా. ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ (2018) కిరీటాన్ని గెలుచుకుంది. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమా తో తెలుగు తెరకు సైలెంట్‌గా పరిచయం అయిన చౌదరి ‘హిట్: ది సెకండ్ కేస్’తో హిట్ కొట్టింది. సూపర్‌హిట్ సినిమా ‘లక్కీభాస్కర్’ లో సుమతిగా సుపరిచితురాలైంది. కొందరికి కొన్ని పండగలు ప్రత్యేకమైనవి. సెంటిమెంట్‌తో కూడుకున్నవి. మీనాక్షీ చౌదరికి కూడా సరదాల పండగ సంక్రాంతి ప్రత్యేకమైనది. సెంటిమెంట్‌తో కూడుకున్నది. ఈ హరియాణ అందాల రాశి చెప్పిన సంక్రాంతి ముచ్చట్లు ఇవి.మాది హర్యానా రాష్ట్రంలోని పంచకుల. మూడేళ్లుగా నేను హైదరాబాద్‌లో ఉంటూ తెలుగు సినిమాల్లో పని చేస్తున్నాను కాబట్టి సంక్రాంతి పండగ గురించి నాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి జనవరిలో ఒక సెలబ్రేషన్ (సంక్రాంతి) ఉంది. సంక్రాంతి–సినిమా అనేది ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ . సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి అన్నది సినిమాల రిలీజ్‌కి, సెలబ్రేషన్స్ కి చాలా మంచి సమయం. కుటుంబమంతా కలిసి సందడిగా పూజలు చేసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. అది నాక్కూడా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉంటుంది. గాలిపటాలంటే నాకు చాలా ఇష్టం. కానీ, ఎగరేయడంలో నేను చాలా బ్యాడ్ (నవ్వుతూ). అయినా, మా ఫ్రెండ్స్‌తో కలిసి మా ఊర్లోనూ, హైదరాబాద్‌లోనూ ఎగరేసేందుకు ప్రయత్నిస్తుంటాను. హైదరాబాద్‌లో ప్రతి ఏటా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గాలిపటాలు ఎగరేయడం అన్నది కూడా ఒక ఆటే. సంక్రాంతి టు సంక్రాంతి2024 నాకు చాలా సంతోషంగా, గ్రేట్‌ఫుల్‌గా గడిచింది. గత ఏడాది మంచి సినిమాలు, మంచి కథలు, పాత్రలు, మంచి టీమ్‌తో పని చేయడంతో నా కల నిజం అయినట్లు అనిపించింది. 2025 కూడా అలాగే ఉండాలని, ఉంటుందని కోరుకుంటున్నాను. చూస్తుంటే సంక్రాంతి టు సంక్రాంతి వరకు ఓ సర్కిల్లా అనిపిస్తోంది. నా జీవితం లో కూడా సంక్రాంతి చాలా స్పెషల్. ఎందుకంటే గత ఏడాది నేను నటించిన ‘గుంటూరు కారం’ వచ్చింది.. ఈ ఏడాది కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలవుతోంది! అందుకే చాలా సంతోషంగా... ఎగ్జయిటింగ్‌గా ఉంది.ముగ్గుల లోకంలోకి– దివి వాఢత్యాదివి పదహారు అణాల తెలుగు అమ్మాయి. ఎం.టెక్ అమ్మాయి దివి మోడలింగ్‌లోకి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చింది. ‘బిగ్‌బాస్4’తో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. హీరోయిన్గా చేసినా, పెద్ద సినిమాలో చిన్న పాత్ర వేసినా తనదైన మార్కును సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్రలలో మెరిసినా, నాన్–గ్లామరస్ పాత్రలలో కనిపించినాతనదైన గ్రామర్ ఎక్కడీకి పోదు! మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లుగానే... మహా పండగ సంక్రాంతి కోసం ఎదురు చూడడం దివికి ఇష్టం. సంక్రాంతి వస్తే చాలు... ఆమెకు రెక్కలు వస్తాయి. సరాసరి వెళ్లి విజయవాడలో వాలిపోతుంది. పండగ సంతోషాన్ని సొంతం చేసుకుంటుంది. భోగిమంటల వెలుగు నుంచి గగనసీమలో గాలిపటాల వయ్యారాల వరకు దివి చెప్పే సంక్రాంతి కబుర్లు...మాది హైదరాబాదే అయినా, నేను పుట్టింది విజయవాడలో. ఊహ తెలిసినప్పటి నుంచి సంక్రాంతి వచ్చిందంటే చాలు, విజయవాడలోని మా అమ్మమ్మగారి ఇంట్లో వాలిపోతా. వారం ముందు నుంచే మా ఇంట్లో పండుగ సందడి మొదలయ్యేది. మా మామయ్యలు, పిన్నులు, చుట్టాలందరితో కలసి గారెలు, అరిసెలు ఇలా ఇతర పిండి వంటలు చేసుకుని, ఇరుగు పొరుగు వారికి ఇచ్చుకుంటాం. పండుగ రోజు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకునేవాళ్లం. తర్వాత నలుగు పెట్టుకుని స్నానం చేసి, ముగ్గులు పెడతాం. అమ్మమ్మ పూజ చే స్తే, మేమంతా పక్కనే కూర్చొని, దేవుడికి దండం పెట్టుకునేవాళ్లం. కానీ ఆ రోజుల్ని ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా. ఏది ఏమైనా సంక్రాంతికి కచ్చితంగా ఊరెళతాను. ఆ మూడు రోజుల పాటు బయటి ప్రపంచాన్ని మర్చిపోయి కుటుంబ సభ్యులతో కలసి పండుగ చేసుకోవటం నాకు చాలా ఇష్టం. సాయంత్రం స్నేహితులతో కలసి సరదాగా గాలిపటాలు ఎగరేస్తా. ఇప్పుడు నటిగా ఎదుగుతున్న సమయంలో సంక్రాంతి జరుపుకోవటం మరింత ఆనందంగా ఉంది. ఊరెళితే చాలు, అందరూ ఇంటికొచ్చి మరీ పలకరిస్తుంటారు. వారందరినీ చూసినప్పుడు నాపై నాకే తెలియని విశ్వాసం వస్తుంది. చివరగా సంక్రాంతికి ప్రత్యేకించి గోల్స్ లేవు కాని, అందరినీ సంతోషంగా ఉంచుతూ, నేను సంతోషంగా ఉంటే చాలు. ఇక నన్ను బాధించే వ్యక్తులకు, విషయాలకు చాలా దూరంగా ఉంటా. ఇంటర్వ్యూ: శిరీష చల్లపల్లిమర్చిపోలేని పండుగ– అంజలి‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో సీత ఎవరండీ? అచ్చం మన పక్కింటి అమ్మాయి. మన బంధువుల అమ్మాయి. తన సహజనటనతో ‘సీత’ పాత్రకు నిండుతనం తెచ్చిన అంజలికి... ‘మాది రాజోలండీ’ అని చెప్పుకోవడం అంటే ఇష్టం. మూలాలు మరవని వారికి జ్ఞాపకాల కొరత ఉంటుందా! కోనసీమ పల్లె ఒడిలో పెరిగిన అంజలి జ్ఞాపకాల దారిలో వెళుతుంటే....మనం కూడా ఆ దారిలో వెళుతున్నట్లుగానే, పల్లె సంక్రాంతిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగానే ఉంటుంది! ఒకటా ... రెండా... పండగకు సంబంధించిన ఎన్నో విషయాలను నాన్‌స్టాప్‌గా చెబుతుంది. అంజలి చెప్పే కోనసీమ సంక్రాంతి ముచ్చట్లు తెలుసుకుందాం...చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే తెలుగమ్మాయిలందరికీ నటి అంజలి ఓ స్ఫూర్తి. మనందరి అమ్మాయి.. తెలుగమ్మాయి.. ఈ పెద్ద పండుగను ఎలా జరుపుకుంటుందంటే...కోనసీమజిల్లా రాజోలు మా ఊరు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు.. అందరికీ వారం ముందు నుంచి పండుగ మొదలయితే, మాకు నెల ముందు నుంచే ఇంకా చెప్పాలంటే పండుగయిన తర్వాతి రోజే.. వచ్చే సంక్రాంతి కోసం ఏర్పాట్లు చేస్తుంటాం. మా తాతయ్య సుబ్బారావుగారు పండుగలంటే అందరూ కలసి చేసుకోవాలని చెప్పేవారు. అందుకే, చిన్నప్పటి నుంచే నాకు అదే అలవాటు. మా ఫ్యామిలీ చాలా పెద్దది. అందరూ వస్తే ఇల్లు మొత్తం నిండిపోయేది. అయినా సరే, ఏ పండుగైనా అందరం కలసే జరుపుకుంటాం. ఇంట్లోనూ పొలాల్లోనూ ఘనంగా పూజలు నిర్వహిస్తాం. చిన్నప్పుడు కజిన్స్ అందరం కలసి ఉదయాన్నే భోగి మంటలు వేయటానికి, అందులో ఏమేం వేయాలో అనే విషయాల గురించి వారం ముందు నుంచే మాట్లాడుకునేవాళ్లం. తాతయ్య పిండివంటలన్నీ చేయించేవారు. అందుకే, ఈ పండుగ కోసం ఎంతో ఎదురు చూసేదాన్ని. కాని, సిటీకి వచ్చాక అంత ఎంజాయ్మెంట్ లేదు. చిన్నతనంలో మా పెద్దవాళ్లు ముగ్గు వేస్తే, మేము రంగులు వేసి, ఈ ముగ్గు వేసింది మేమే అని గర్వంగా చెప్పుకుని తిరిగేవాళ్లం. అందుకే, ముగ్గుల పోటీల్లో నేనెప్పుడూ పాల్గొనలేదు. గాలిపటాన్ని కూడా ఎవరైనా పైకి ఎగరేసిన తర్వాత ఆ దారాన్ని తీసుకుని నేనే ఎగరేశా అని చెప్పుకుంటా. అందుకే, సంక్రాంతి నాకు మరచిపోలేని పండుగ.నిండుగా పొంగితే అంతటా సమృద్ధిసంక్రాంతి పండగ అనగానే తెల్లవారకుండానే పెద్దలు పిల్లల్ని నిద్రలేపడం, చలికి వణుకుతూ ముసుగుతన్ని మళ్లీ పడుకోవడం ఇప్పటికీ గుర్తు వస్తుంటుంది. సందడంతా ఆడపిల్లలదే. ముగ్గులు వేయడం, వాటిల్లో గొబ్బెమ్మలు పెట్టి, నవధాన్యాలు, రేగుపళ్లు వేసేవాళ్లం. ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, ఆవు పిడకల మీద మట్టి గురిగలు పెట్టి, పాలు పొంగించేవాళ్లం. ఎటువైపు పాలు పొంగితే అటువేపు సస్యశ్యామలం అవుతుందని నమ్మకం. నిండుగా పొంగితే అంతటా సమృద్ధి. మిగిలిన గురుగుల్లోని ప్రసాదాన్ని అలాగే తీసుకెళ్లి లోపలి గదుల్లో మూలకు పెట్టేవారు ఎలుకల కోసం. సాధారణ రోజుల్లో ఎలుకలు గింజలు, బట్టలు కొట్టేస్తున్నాయని వాటిని తరిమేవారు. అలాంటిది సంక్రాంతికి మాత్రం, బయట పక్షులతోపాటు ఇంట్లో ఎలుకలకు కూడా ఇలా ఆహారం పెట్టేవాళ్లు. ముగ్గులు పెట్టడంలో ఇప్పడూ పోటీపడే అమ్మాయిలను చూస్తున్నాను. మేం ఉండేది వనపర్తిలో. అప్పటి మాదిరిగానే ఇప్పడూ జరుపుకుంటున్నాం. – పోల్కంపల్లి శాంతాదేవి, రచయిత్రి -
‘గేమ్ ఛేంజర్’ మూవీ ట్విటర్ రివ్యూ
మెగాఫ్యాన్స్ మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్(Ram Charan) సోలో హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్గా కియారా అద్వాణీ హీరోయిన్గా నటించారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ షో బొమ్మ పడిపోయింది. తెలంగాణలో శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి షోస్ పడనున్నాయి. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.గేమ్ ఛేంజర్ కథేంటి? ఎలా ఉంది? శంకర్, చరణ్ ఖాతాలో భారీ హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.గేమ్ ఛేంజర్ సినిమాకు ఎక్స్‌లో మిక్స్డ్ టాక్ వస్తుంది. సినిమా బాగుందని కొందరు.. ఆశించిన స్థాయిలో సినిమాలేదని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. చరణ్ నటన అదిరిపోయింది కానీ.. శంకర్ మేకింగ్ బాగోలేదని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. పాటలు అయితే తెరపై చూస్తే అద్భుతంగా ఉన్నాయట. రా మచ్చా మచ్చా పాట అదిరిపోయిందంటూ చాలా మంచి నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #GameChanger Strictly Average 1st Half! Follows a predictable commercial pattern so far. A few IAS blocks have came out well along with an interesting interval block. The love story bores and the comedy is over the top and ineffective. Ram Charan is doing well and Thaman’s bgm…— Venky Reviews (@venkyreviews) January 9, 2025ఊహించదగిన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది.కొన్ని ఐఏఎస్ బ్లాక్‌లు బాగా వచ్చాయి, అలాగే ఆసక్తికరమైన ఇంటర్వెల్ బ్లాక్ కూడా వచ్చింది. ప్రేమకథ బోరింగ్‌గా ఉంది. కామెడీ కూడా అతిగా ఉంది మరియు అసమర్థంగా ఉంది. రామ్ చరణ్ బాగా చేస్తున్నాడు. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. సెకండాఫ్ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.#GameChanger#RamCharan𓃵 #GameChangerReviewGood 1st halfAa dhop song kuni scenes teseste inka bagunu Interval scene 🔥🔥Thaman Bgm🔥🎇🎇Raa Macha Macha song🥵🔥🔥🔥#ShankarShanmugham #KiaraAdvani #Thaman https://t.co/l8Gg6IgdfK— Lucky⚡️ (@luckyy2509) January 9, 2025 ఫస్టాఫ్ బాగుంది. దోప్ సాంగ్ ఇంకాస్త బాగా తీయాల్సిది. ఇంటర్వెల్ సీన్అదిరిపోయింది. తమన్ నేపథ్య సంగీతం బాగుంది. రా మచ్చా మచ్చా సాంగ్ అద్భుతం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.#GameChanger First Half Review:Shankar's vintage taking shines as he delivers a gripping first half packed with grandeur, emotional highs, and slick action. Ram Charan impresses with his powerful performance, while Thaman's BGM and song picturization elevate the experience. A…— Censor Reports (@CensorReports) January 9, 2025 ఫస్టాఫ్ అదిరిపోయింది. అద్భుతమైన సన్నివేశాలు, భావోద్వేగాలు, యాక్షన్‌తో శంకర్ మరోసారి తన టేకింగ్ పవర్‌ని చూపించాడు. రామ్ చరణ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. తమన్ బీజీఎం అదిరిపోయిది. సెకండాఫ్‌పై హైప్ పెంచేలా ఇంటర్వెల్ సీన్ ఉందని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.Appanna Emotional shot!❤️💥👌#Anjali shared about the same scene & Said that #RamCharan will win National Award for sure🔥🔥#UnstoppableWithNBKS4#UnstoppableWithNBK#GameChanger#GameChanagerpic.twitter.com/a8AjdNpEya— Vishnu Writess (@VWritessss) January 8, 2025#GameChangerReview1st Half - ⭐⭐⭐Entry SongsBuildupthat Traffic Dance 😭🤮Love scenesFlat Screenplay Interval okay #RamCharan is Good#SSThaman Rocked it 💥💥#Shankar Proved he is not back 😭 #GameChanger #KiaraAdvaniHope 2nd Half Will Blast 🤞🏻🤞🏻... pic.twitter.com/oDstZwzvo0— Movie_Gossips (@M_G__369) January 9, 2025Gamechanger 1st half review Poor pacing👎🏻Boring love track 😴Decent performance from RC👍🏻RC looks 🫠Only hope is 2nd half 🙌BGM okaish 👍#GameChangerReview— ✌🏼 (@UGotLazered) January 9, 2025#GameChanger #GameChangerReview ⭐⭐⭐⭐ 4/5!!So far, fun mass, masala, entertainment. Awesome. That’s @shankarshanmugh for us 👌🏼👌🏼👌🏼🔥🔥❤️❤️❤️. What a technical brilliance 👏🏼👏🏼👏🏼 #RamCharan𓃵 #KiaraAdvani #Sankar #kiaraadvanihot #RamCharan #disastergamechanger… pic.twitter.com/NI0hDd9aDO— the it's Cinema (@theitscinemaa) January 9, 2025Appanna Characterization decent but routine n predictable with stammering role Once appanna died, same lag continues ..Very good climax is needed now #GameChanger #GameChangerReview https://t.co/UEpuZ74o1t— German Devara⚓️🌊 (@HemanthTweets39) January 9, 2025#GameChanger Tamil version!Good first half🔥👍Dialogues are good can feel the aura of @karthiksubbaraj in the build up of the story!Already better than @shankarshanmugh ‘s last three movies, Charan and SJS good.@MusicThaman 🔥#Gamechangerreview— Water Bottle🇵🇹 (@waterbotttle_07) January 9, 2025#GameChanger First Half:A Good First Half Thats Filled With Visual Extravaganza. Interval Ends With A Bang & A Great Twist That Keeps You Anticipated For The Second Half. Ram Charan At His Absolute Best In Dual Roles, You Can Witness The Efforts He Has Put In With Each Scene 👏 pic.twitter.com/Q3jrXfWykB— CineCritique (@CineCritique_) January 9, 2025#GameChanger#GameChangerReview First Half:Very Entertaining, fast paced screenplay by @shankarshanmugh sir. Superb first half. #SJSuryah and #RamCharan𓃵mass acting 🔥🔥🔥@MusicThaman Music is top work and #Dhop song is Hollywood level making #BlockbusterGameChanger— Mr.Professor (@EpicViralHub_) January 10, 2025SPOILER ALERT !! ⚠️⚠️IPS, IASInterval bang kosam CMMalli ventane IASImmediate ga Chief Electoral OfficerMalli climax bang kosam CMNeeku ishtam ochinattu thippav atu itu @shankarshanmugh 🤦🏻#GameChanger— . (@UrsPG) January 10, 2025Shankar’s corruption theme is outdated and he should choose a different script. Else its a Game Over for him.#GameChanger— CB (@cinema_babu) January 10, 2025భారతీయుడు శంకర్ చివరికి ఎన్. శంకర్ అయిపోతాడు అనుకోలేదు 🙏Outdated & Cringe #GameChanger— 🅰️⛓️ (@UaReports689gm1) January 10, 2025#RamCharan #GameChanger•More of a message-driven movie.•Set against a political backdrop.•Unbelievable solutions in the narrative.•Commercial elements are relatively less.•Every actor excelled in their roles, which is a very, very big plus for the movie!— USAnINDIA (@USAnINDIA) January 10, 2025 -
‘గేమ్ ఛేంజర్’ మూవీ HD స్టిల్స్
-
గేమ్ చేంజర్ ప్రత్యేకం: అంజలి
‘‘గేమ్ చేంజర్’ చిత్రంలో నాపాత్ర పేరుపార్వతి. మా అమ్మ పేరు కూడాపార్వతి. శంకర్‌గారు ఈ చిత్ర కథ, నాపాత్ర గురించి చెప్పినప్పుడు మా అమ్మే గుర్తుకొచ్చారు. శంకర్‌గారు నా నటన చూసి చాలా చోట్ల మెచ్చుకున్నారు. నా కెరీర్లో ‘గేమ్ చేంజర్’ సినిమా, నాపాత్ర చాలా ప్రత్యేకం’’ అని అంజలి చెప్పారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. అంజలి, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అంజలి విలేకరులతో పంచుకున్న విశేషాలు... ⇒ నేను నటించిన ‘గేమ్ చేంజర్’(తెలుగు), ‘మదగజరాజ’(తమిళ్) సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలవుతుండటంతో హ్యాపీగా ఉంది. ఈ రెండు చిత్రాలకు మంచి స్పందన వస్తుందనే నమ్మకం ఉంది. ‘గేమ్ చేంజర్’లో నేను చే సినపార్వతిపాత్ర ఆడియన్స్ కి చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. నా కెరీర్లో ఇదే బెస్ట్ క్యారెక్టర్. ఈపాత్రతో నాకు జాతీయ అవార్డు వస్తుందని అంటున్నారు. కథ విన్నప్పుడు నాకూ అలానే అనిపించింది. అదే నిజమైతే అంతకంటే గొప్ప సక్సెస్ ఇంకేం ఉంటుంది.⇒ఈ మూవీలో రామ్‌చరణ్ చేసిన అప్పన్న, నేను చేసినపార్వతిల ప్రేమ, వారి బంధం చాలా గొప్పగా ఉంటుంది. అదే ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. చరణ్ సెట్స్‌లో అందరితోనూ బాగా మాట్లాడతారు. ‘దిల్’ రాజుగారి బ్యానర్లో మూడో సినిమా, శంకర్‌గారి దర్శకత్వంలో తొలి సినిమా, రామ్ చరణ్‌గారితో మొదటి సినిమా.. ఇలా అన్ని రకాలుగా ఈ చిత్రం నాకు ప్రత్యేకం. శంకర్, మణిరత్నంగార్ల చిత్రాల్లో నటించాలని అందరికీ ఉంటుంది. శంకర్‌గారి చిత్రంలో ఛాన్స్ రావడం నా అదృష్టం. ‘గేమ్ చేంజర్’ చూసిన చిరంజీవిగారు.. నాపాత్రను మెచ్చుకోవడమే పెద్ద అవార్డులా అనిపిస్తోంది. తమన్ సంగీతానికి మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. -
‘గేమ్ ఛేంజర్’ HD మూవీ స్టిల్స్
-
Game Changer : ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
తెలుగు బ్యూటీ అంజలి స్టన్నింగ్ లుక్స్ (ఫొటోలు)
-
చీరలో సన్నజాజితీగలా అంజలి, క్యూట్ పప్పీతో హ్యపీగా (ఫోటోలు)
-
అంజలికి రజతం
టిరానా (అల్బేనియా): ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్ అంజలి (59 కేజీలు) రజత పతకం కైవసం చేసుకుంది. 55 కేజీల పురుషుల విభాగంలో చిరాగ్ ఫైనల్‌కు దూసుకెళ్లి మరో పతకం ఖాయం చేశాడు. 55 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో రామచంద్ర మోర్, మహిళల 68 కేజీల విభాగంలో మోనిక కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఆదివారం భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరడంతో పాటు మరో పతకం ఖాయం కాగా... అంతకు ముందు శుక్రవారం మన రెజ్లర్లు రెండు కాంస్యాలు గెలుచుకున్నారు. దీంతో ఓవరాల్‌గా భారత్ ఖాతాలో ఐదు పతకాలు చేరాయి. మహిళల 59 కేజీల సెమీఫైనల్లో అరోరా రుసో (ఇటలీ)పై విజయం సాధించిన అంజలి... తుది పోరులో ఉక్రెయిన్ రెజ్లర్ సొలోమియా చేతిలో ఓడింది. పురుషుల 55 కేజీల ఫైనల్లో అడిమాలిక్ కరాచోవ్ (కిర్గిస్తాన్)తో చిరాగ్ తలపడనున్నాడు. 18 ఏళ్ల చిరాగ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–0తో ఒజావా గుకుటో (జపాన్)పై గెలిచాడు. క్వార్టర్స్‌లో లుబుస్ లబాటిరోవ్పై సెమీఫైనల్లో అలాన్ ఒరల్బేక్ (కజకిస్తాన్)పై గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. అభిషేక్ (61 కేజీలు), సుజీత్ (70 కేజీలు) కాంస్య పతకాల కోసం పోటీ పడనున్నారు. -
సంక్రాంతి బరిలో..?
‘గేమ్ చేంజర్’ సినిమా సంక్రాంతికి విడుదల కానుందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. తండ్రీకొడుకులుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేసిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ పతాకాలపై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అంజలి, ఎస్జే సూర్య, సునీల్, జయరాం, ప్రియదర్శి, నవీన్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కాగా ‘గేమ్ చేంజర్’ సినిమాను క్రిస్మస్ సందర్భంగా ఈ డిసెంబరులో విడుదల చేయనున్నట్లుగా ఇటీవల ‘దిల్’ రాజు పలు సందర్భాల్లో వెల్లడించారు. అయితే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. మరి... ‘గేమ్ చేంజర్’ వాయిదా పడిందా? ఒకవేళ పడితే వచ్చే సంక్రాంతి బరిలో నిలుస్తుందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
ఈ దుఃఖం తీర్చేదెవరు?
(గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్పల్లి) : ‘హైడ్రా’తో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతపై తొలుత హర్షం వ్యక్తమైంది. కానీ ఆ తర్వాత హైడ్రా వ్యవహరిస్తున్న తీరు మా త్రం కుటుంబాల్లో కన్నీళ్లు నింపేలా ఉందంటూ బాధితులు మండిపడుతున్నారు. ఇళ్లలోనో, దుకాణాల్లోనో, షెడ్లలోనో నివ సిస్తున్న.. వ్యాపారాలు చేసుకుంటున్న వారికి కనీస సమాచారం ఇవ్వకుండా, ఇచ్చినా ఖాళీ చేసేందుకు సమ యం ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమదుఃఖం తీర్చేదెవరని.. తమకు జరిగిన నష్టాన్ని పూడ్చేదెవరంటూ కన్నీళ్లుపెడుతున్నారు. చాలా వరకు పేదలు, మధ్యతరగతివారే.. ఇళ్లు కట్టుకున్నవారే కాదు.. స్థలాలు, నిర్మాణాలను లీజుకు తీసుకుని వ్యాపారాలు పెట్టుకున్నవారూ హైడ్రా కూల్చివేతల్లో తీవ్రంగా నష్టపోయారు. ఎక్కడెక్కడి నుంచో బతుకుదెరువు కోసం వచ్చి.. కడుపు కట్టుకుని సంపాదించుకుంటున్న తమ బతుకులు రోడ్డున పడ్డాయని వాపోతున్నారు. వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారాలు చేసుకుంటున్న షెడ్లను, భవనాలను ఉన్నట్టుండి కూల్చడంతో.. తీవ్రంగా నష్టపోయామని, ఇక తమ బతుకులు కోలుకునే అవకాశమే కనిపించడం లేదని కన్నీళ్లు పెడుతున్నారు. ఈ నెల 8న సున్నంచెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలోని ఒక గోడౌన్, మూడు భవనాలు, 20 గుడిసెలను అధికారులు కూల్చివేశారు. అందులో ఒక గుడిసెలో నివాసం ఉంటున్న బలహీనవర్గాలకు చెందిన ఎన్.నర్సింహ, అంజలి దంపతులు ఇరవయ్యేళ్ల క్రితం మాదాపూర్‌కు వలస వచ్చారు. స్థానిక నేతల సూచనతో అక్కడ గుడిసె వేసుకొని కూలిపనులు చేసుకుంటూ బతుకుతున్నారు. వారి కుమారుడు సాయిచరణ్ (17) కేన్సర్ వ్యాధితో బాధపడుతూ రెండు నెలల క్రితమే మృతిచెందాడు. ఆ దుఃఖం నుంచి కోలుకోకముందే వారి గుడిసె నేలమట్టమైంది. తలదాచుకునేందుకు నర్సింహ సోదరి ఇంటికి వెళ్లారు. కానీ అటు కుమారుడిని, ఇటు గూడును కోల్పోయిన ఆవేదనతో.. అంజలి ఈనెల 21న ఛాతీనొప్పికి గురైంది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి ఆమె మృతి చెందింది. పాత జ్ఞాపకాలను వెతుక్కుంటూ కూల్చిన గుడిసె వద్దకు వచ్చిన నర్సింహ.. కొడుకు, భార్య ఇద్దరూ మరణించాక, తాను ఎవరి కోసం బతకాలో అర్థం కావడం లేదని వెక్కివెక్కి ఏడ్చారు. రోడ్డున పడ్డ బతుకులు.. కూకట్‌పల్లికి చెందిన విజయ్ప్రతాప్గౌడ్ది మరో కన్నీటి వ్యథ. కేటరింగ్ చేసే ఆయన వద్ద 68 మంది పనిచేస్తున్నారు. వారందరికీ అదే జీవనాధారం. విజయ్‌ప్రతాప్ భూమిని లీజుకు తీసుకొని, రూ.40 లక్షల వ్యయంతో షెడ్లు, సామగ్రి ఏర్పాటు చేసుకున్నారు. నల్లచెరువులో హైడ్రా కూల్చివేతల్లో భాగంగా ఆయన షెడ్లనూ కూల్చేశారు. కనీసం కేటరింగ్ సామగ్రి బయటికి తీసుకువెళ్లే అవకాశం ఇవ్వలేదని ఆయన వాపోయారు. తనతోపాటు పనిచేసేవారంతా ఉపాధి లేక రోడ్డునపడ్డామని ఆందోళన వ్యక్తం చేశారు. కొంత గడువైనా ఇవ్వాల్సింది సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలతో తీవ్రంగా నష్టపోయానని మరో బాధితుడు పునారాం పేర్కొన్నారు. అక్కడ లక్షలు ఖర్చుపెట్టి గోడౌన్ నిర్మాణం చేపట్టానని, శానిటరీ సామాగ్రి కొంత అందులోనే ఉండిపోయిందని వాపోయారు. కొన్నిరోజులు గడువు ఇచ్చి ఉంటే సామగ్రిని పూర్తిగా తరలించే అవకాశం ఉండేదన్నారు. గోడౌన్, సామగ్రి కలిపి రూ.50 లక్షలకుపైగా నష్టపోయి.. రోడ్డునపడ్డానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భవతి అన్నా కనికరించలేదు! కూకట్‌పల్లిలో రవి జిరాక్స్, ప్రింటింగ్ ప్రెస్‌కు సంబంధించిన దుకాణం నిర్వహిస్తున్నాడు. హైడ్రా ఒక్కసారిగా కూల్చివేతలు చేపట్టడంతో తీవ్రంగా నష్టపోయానని వాపోయాడు. తన భార్య గర్భవతి అని, సామగ్రి తీసుకునేందుకు కాస్త గడువు ఇవ్వాలని కోరినా అధికారులు కనికరించలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను, మరికొందరు కలసి నాలుగు రోజులు కష్టపడి కొంత సామగ్రిని బయటికి తీసినా.. అది చాలా వరకు పాడైపోయిందని వాపోయారు. తనతో పాటు మరెందరో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. -
అందాల తారలు, గారాల బెస్ట్ ఫెండ్స్ (ఫొటోలు)
-
ఆయన అడిగిన ప్రశ్న ఎంతో బాధించింది: నటి అంజలి అమీర్
మలయాళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ మారిన హేమ కమిటీ రిపోర్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మాలివుడ్లో మహిళలు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్ నుంచి పలు సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ ఓ నివేదిక రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు హీరోయిన్లు, ఇతర నటులు గతంలో తమ చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. తాజాగా మలయాళ తొలి ట్రాన్స్‌జెండర్ నటి అంజలి అమీర్ తన అనుభవాలను పంచుకున్నారు.మలయాళ నటుడు నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అంజలి అమీర్ ఇలా పంచుకున్నారు. ' 2018లో మమ్ముట్టి నటించిన పెరున్బు అనే తమిళ సినిమాలో నేను కీలక పాత్ర పోషించాను. ఆ సినిమాలో సూరజ్ వెంజరమూడ్ కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆయన నుంచి నాకు ఒక ప్రశ్న ఎదురైంది. లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులు స్త్రీలలాగా ఎలా సుఖం పొందుతారని సూరజ్ వెంజరమూడ్ నన్ను ప్రశ్నంచారు. అప్పుడు నేను చాలా కలత చెందాను. ఆయన అడిగేంత వరకు, నేను అలాంటి బాధాకరమైన అనుభవాలను ఎప్పుడూ ఎదుర్కోలేదు. నేను బలంగా ఉన్నాను, కానీ ఈ ప్రశ్న నాకు చాలా కోపం తెప్పించింది. అతడిని హెచ్చరించి మమ్ముట్టికి, దర్శకుడికి తెలియజేశాను. ఆపై వెంటనే సూరజ్ వెంజరమూడ్ క్షమాపణలు చెప్పాడు. మరలా నాతో అలా మాట్లాడలేదు. నేను ఆయన్ను అభినందిస్తున్నాను.' అని అంజలి అమీర్ అన్నారు. సూరజ్ వెంజరమూడ్ టాలీవుడ్‌కు పరిచయమే.. డ్రైవింగ్ లైసెన్స్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, జనగణమన చిత్రాలతో పాటు నాగేంద్రన్స్ హానీమూన్స్ వెబ్ సిరీస్‌తో ఆయన తెలుగు వారికి దగ్గరయ్యాడు.ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఇతరుల పట్ల గౌరవంగా ఉంటారని అంజలి పేర్కొంది. అన్ని విభాగాల్లో మాదిరి ఇక్కడ కూడా మంచివాళ్లతో పాటు చెడువాళ్లు కూడా ఉన్నారు. ఇక్కడ కొందరు మాత్రమే కాంప్రమైజ్‌లు, ఫేవర్లు అడిగేవాళ్లు ఉన్నారని అంజలి పేర్కొంది. -
రాజాసాబ్ బ్యూటీ బర్త్‌డే.. చీరకట్టులో ఊర్వశి..
రాజాసాబ్ సెట్లో నిధి అగర్వాల్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫ్యామిలీతో హీరో శ్రీవిష్ణు శ్రీలీల ఫన్నీ వీడియోప్రభాస్ కొత్త సినిమా హీరోయిన్ ఇమాన్విప్రియాంక జైన్ వరలక్ష్మి వ్రతంనిండైన చీరకట్టులో ఊర్వశి రౌతేలా View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Sree Vishnu (@sreevishnu29) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Imanvi (@iman1013) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Nidhi Agarwal (@nidhiagarwal_) -
సైజ్ జీరోలో సంయుక్త .. గ్లామర్ డోస్ పెంచేసిన జగతి మేడమ్
జిమ్‌లో 108రోజుల వర్కౌట్‌తో సైజ్ జీరోకు చేరుకున్న సంయుక్త మీనన్ స్టైలిష్, క్లాస్‌గా మెరిసిపోతున్న హన్సిక గ్లామర్ డోస్ పెంచేసిన 'గుప్పెడంత మనసు' జగతి మేడమ్ View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
50 సినిమాల తర్వాత.. మారిపోయిన అంజలి కెరీర్..
-
బోల్డ్ సీన్స్ చేశాక భావోద్వేగానికి గురయ్యాను: అంజలి
హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ బహిష్కరణ. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో జూలై 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రా అండ్ రస్టిక్ డ్రామాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఇందులో అంజలి పుష్ప అనే వేశ్య పాత్రలో నటించింది. ఈ పాత్రకు వస్తోన్న రెస్పాన్స్‌పై అంజలి స్పందిస్తూ.. ‘‘‘బహిష్కరణ’ సిరీస్‌లో పుష్ప పాత్రకు మంచి స్పందన వస్తోంది. రా అండ్ రస్టిక్ రోల్లో నటించటాన్ని ఎంజాయ్ చేశాను. ఎందుకంటే పుష్ప పాత్రలో చాలా డెప్త్ ఉంది. ఆమె పాత్రలో భావోద్వేగాలను చాలా శక్తివంతంగా చూపించారు’’ అంది.ఎమోషనల అయ్యా..పాత్రకు తగ్గట్లు కొన్ని బోల్డ్ సీన్స్‌లో అంజలి నటించింది. దాని గురించి మాట్లాడుతూ ప్రారంభంలో బోల్డ్ సీన్స్‌లో నటించటం కాస్త ఇబ్బందిగా అనిపించింది. బోల్డ్ సీన్లో నటించిన తర్వాత ఓసారైతే చాలా ఎమోషనల్ అయ్యాను. అందుకు కారణం, అలాంటి సన్నివేశంలో తొలిసారి నేను నటించటమే కారణం. బోల్డ్ సీన్లో నటించేందుకు ముందుగా సన్నద్ధం కాకపోయినా ఛాలెంజింగ్‌గా తీసుకుని నటించాను. ఈ పాత్ర నాకు కొత్తే అయినా దాన్ని ఎలా చేయాలనే దానిపై నాకు అవగాహన ఉంది. జాగ్రత్త తీసుకున్నారునేను ఆ బోల్డ్ సీన్స్‌లో నటించేటప్పుడు సెట్స్‌లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. దర్శకుడు ఆ విషయంలో జాగ్రత్త తీసుకున్నారు. అందువల్ల నేను కంఫర్ట్‌గా నటించగలిగాను అని తెలిపింది. బహిష్కరణ సిరీస్ విషయానికి వస్తే.. రిలీజైన మూడు రోజుల్లోనే 35 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను రాబట్టుకుంది. ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను ప్రశాంతి మలిశెట్టి రూపొందించారు. చదవండి: 70కి పైగా ఆడిషన్స్.. కాంప్రమైజ్ అడగడంతో ఏడ్చేశా: హీరోయిన్ -
అలాంటి సన్నివేశాల్లో నటించడం కష్టం
జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. ఆ విషయాన్ని పక్కన పెడితే నటి అంజలి చేసే పాత్రలన్నీ కచ్చితంగా వైవిధ్యంగా ఉంటున్నాయి. ఈమె కథానాయకిగా నటించినా, ఐటమ్ సాంగ్‌లో నటించినా తనదైన ముద్ర వేసుకుంటున్నారు. తమిళంలో కట్రదు తమిళ్, అంగాడి తెరు, అరవాన్, ఇరైవి, తరమణి వంటి చిత్రాల్లో అంజలి నటనే ఇందుకు నిదర్శనం. అలాగే తెలుగులోనూ గీతాంజలి, సీతమ్మవాకిట్లో సిరిమల్లే చెట్టు వంటి చిత్రాలు అంజలిలోని నటనకు అద్దం పట్టాయి. కాగా ఈమె తాజాగా నటించిన ఏళు కడల్ ఏళు మలై త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి అవార్డులు, ప్రశంసలను అందుకుంది. అలాగే తెలుగులో శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్‌చరణ్‌కు జంటగా నటించారు. కాగా అంజలి తెలుగులో నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్ ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. ఇందులో ఈమె బెడ్రూమ్ సన్నివేశాల్లో, సహా నటుడితో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం చర్చనీయాంశంగా మారింది. దీని గురించి అంజలి ఒక భేటీలో పేర్కొంటూ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం కష్టతరం అన్నారు. చిత్రం యూనిట్లో పలువురు మగవారి మధ్య అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుందని, ఆ పరిస్థితుల్లో నటించడం కష్టం అని అంజలి పేర్కొన్నారు. -
'ఇంటిమేట్ సీన్స్'.. అందరినీ పంపించాకే తీశారు: అంజలి
ఇటీవల విశ్వక్ సేన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో మెప్పించిన టాలీవుడ్ నటి అంజలి. ఇందులో వేశ్య పాత్రలో కనిపించి ఫ్యాన్స్‌ను అలరించింది. మరోసారి అలాంటి డిఫరెంట్ పాత్రతోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా అంజలి కీ రోల్ పోషించిన వెబ్ సిరీస్ బహిష్కరణ. ఇందులో ఆమె వేశ్య పాత్రలోనే కనిపించారు. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అంజలి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ సిరీస్‌లో ఇంటిమేట్ సీన్స్ చేయడంపై ఆమె స్పందించింది.అంజలి మాట్లాడతూ.. 'నా కెరీర్ ప్రారంభంలో మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. నా పాత్రకు ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్ట్‌లనే ఎంచుకుంటా. కొన్ని సినిమాల కోసం ఏకంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. యాక్షన్ సీన్స్ కూడా డూప్ లేకుండా చేస్తా. నవరస అనే వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు కాస్ట్యూమ్ కారణంగా కొన్ని గంటలపాటు వాష్‌రూమ్‌కు కూడా వెళ్లలేదు. అయితే ఈ సిరీస్‌లో ఇంటిమేట్ సీన్స్‌లో నటించడంతో కాస్తా గందరగోళానికి గురయ్యా. ఆయితే ఆ సీన్స్ చేసేటప్పుడు అందరినీ బయటకు పంపి షూట్ చేశారు. నేను ఇప్పటివరకు ఇలాంటివి చేయలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నా పాత్రకు అనుకున్నదానికంటే మంచి స్పందన వచ్చింది.' అని తెలిపింది.అంతే కాకుండా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై కూడా రియాక్ట్ అయింది. నా గురించి ఎవరైనా తప్పుగా రాసినప్పుడు బాధపడతానని వెల్లడించింది. అలా వస్తున్నాయని చెప్పి.. నేను పెళ్లి చేసుకోలేను కదా? అని నవ్వుతూ సమాధామిచ్చింది. తనకు సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానంటోంది అంజలి. -
బుల్లితెర నటి అంజలి కూతురు చందమామ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
వేశ్య పాత్రలో టాలీవుడ్ హీరోయిన్.. అంచనాలు పెంచేసిన ట్రైలర్!
టాలీవుడ్ భామ అంజలి ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంతో అభిమానులను అలరించింది. తాజాగా మరో ఆసక్తికర వెబ్ సిరీస్‌తో ఫ్యాన్స్‌ను పలకరించేందుకు వస్తోంది. అంజలి లీడ్ రోల్లో వస్తోన్న వెబ్ సిరీస్ బహిష్కరణ. ముకేశ్ ప్రజాపతి దర్శకత్వంలో రూపొందించిన ఈ సిరీస్‌ను జీ 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్లపై ప్రశాంతి మలిశెట్టి నిర్మించారు.విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్లో వస్తోన్న సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. 'మంచోడు చేసే మొదటి తప్పు ఏంటో తెలుసా..? చెడ్డోడి చరిత్ర తెలుసుకోవడమే..' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ సిరీస్‌లో అంజలి వేశ్యపాత్రలో కనిపించనుంది. దీంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్‌లో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా.. ఈ వెబ్ సిరీస్ ఈనెల 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. Thrilled to Launch the trailer for #BahishkaranaOnZee5! Always was impressed with the director @iamprajapathi with his work in BiggBoss and now this!!Anjali looking good bringing strength and depth to her character Pushpa!!https://t.co/ewhjAwzSFD@yoursanjali @ZEE5Telugu…— Nagarjuna Akkineni (@iamnagarjuna) July 10, 2024 -
'కల్కి' బ్యూటీ జీరో సైజ్ గ్లామర్.. బికినీలో పాయల్ డ్యాన్స్!
చుడీదార్లో హీరోయిన్ అంజలి నవ్వుల హరివిల్లుటూ పీస్ బికినీలో డ్యాన్స్ ఇరగదీసిన పాయల్ రాజ్పుత్టెంపరేచర్ పెంచేస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ పాలక్ తివారీసన్నజాజి నడుముతో కాక రేపేస్తున్న దిశా పటానీ.. 'కల్కి' స్టిల్స్పొట్టి జీన్ నిక్కర్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చేస్తున్న శివాత్మికతమ్ముడితో కలిసి క్యూట్ పోజులిచ్చిన యాంకర్ శ్రీముఖిక్లోజప్ పిక్స్‌తో మరింత అందంగా ఆండ్రియా జెర్మియా View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by neha sargam (@nehasargam) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by Shivani Narayanan (@shivani_narayanan) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rathika Ravinder (@rathikaravinder) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by PayalS Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) -
16 అడుగుల ఎత్తు నుంచి దూకిన అంజలి!
ఏపాత్రలో అయినా ఒదిగిపోయే అతి కొద్దిమంది నటీమణుల్లో అంజలి ఒకరు అని చెప్పవచ్చు. ఈ పదహారణాల తెలుగుఅమ్మాయి ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడిని మార్చి తెలుగులో నటిగా పరిచయమైనా, తమిళంలో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత తెలుగులోనూ మంచి మంచి పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అంజలి పేరు చెపితే తమిళం, తెలుగు భాషల్లో చాలా చిత్రాలే గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా తమిళంలో కట్రదు తమిళ్, అంగాడి తెరు, తెలుగులో గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె పువ్వు వంటి చిత్రాలు అంజలి కెరీర్లో గుర్తింపు పొందాయి. కెరీర్ ప్రారంభంలో పలు వివాదాల్లో చిక్కుకున్న అంజలి ఆ తర్వాత వాటికి దూరంగా రావడం విశేషమే. అయితే ఇప్పటికీ అవివాహితగానే కొనసాగుతున్న అంజలి కెరీర్ పరంగా అర్ధ సెంచరీని దిగ్విజయంగా టచ్ చేయడం మరో విశేషం. ఇప్పటికీ సినిమాలు, వెబ్ సీరీస్‌ల్లో నటిస్తూ బిజీగానే ఉన్నారు. కాగా అంజలి కథానాయకిగా నటిస్తున్న 50వ చిత్రం ఈగై. అశోక్ దర్శకత్వం వహిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రంలో పలు ఆసక్తికరమైన సన్నివేశాలు చోటుచేసుకుంటాయని తెలిసింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఒక సన్నివేశం కోసం అంజలి 16 అడుగుల ఎత్తు నుంచి ఎలాంటి డూప్ లేకుండా కిందికి దూకినట్లు చిత్రవర్గాలు తెలిపాయి. కాగా శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ కథానాయకుడిగా నటిస్తున్న గేమ్‌చేంజర్ చిత్రంలో అంజలి ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. -
మరోసారి వేశ్య పాత్రలో టాలీవుడ్ హీరోయిన్.. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్!
హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన నటి అంజలి. ఇటీవల విశ్వక్ సేన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో మెప్పించింది. ఈ సినిమాలో వేశ్య పాత్రలో నటించి ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.అంజలి ప్రస్తుతం మరోసారి అలాంటి విభిన్నమైన పాత్రతో అభిమానులను పలకరించనున్నారు. అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ బహిష్కరణ. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్లో ముఖేష్ ప్రజాపతి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ ఈనెల 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సిరీస్ గురించి అంజలి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.అంజలి మాట్లాడుతూ..'పుష్ప పాత్ర పోషించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పాత్ర చేయడంతో నాకు సంతృప్తి కలిగింది. ఒక అమాయకపు వేశ్య నుంచి సమాజంలో అసమానతలను ఎదుర్కొనే స్త్రీ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. పుష్ప అంటే ఓ మిస్టరీ అని.. ఇందులో ఆమె చేసిన ప్రయాణం, వచ్చిన మార్పుని చూడాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ సిరీస్‌లో రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, చైతన్య సాగిరాజు, బేబీ చైత్ర కీలక పాత్రలు పోషించారు.A tale of misused power and enraged beauty.Get ready for #Bahishkarana on 19th July#BahishkaranaOnZee5 @PixelPicturesIN @Prashmalisetti @iamprajapathi @yoursanjali @AnanyaNagalla @RavindraVijay1 @prasannadop @SidharthSadasi1 pic.twitter.com/bvtplrLhgV— ZEE5 Telugu (@ZEE5Telugu) July 4, 2024 -
ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన మరో తెలుగు హీరోయిన్
ఓటీటీలు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులొచ్చాయి. థియేటర్లలో కంటే ఓటీటీల్లోనే సినిమాల్ని ఎక్కువగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోహీరోయిన్లు సైతం డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ లిస్టులో వెంకటేశ్, రానా, నాగచైతన్య, అంజలి లాంటి వాళ్లు ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు హీరోయిన్ చేరింది.(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ క్యూట్ ఫొటో)మల్లేశం, వకీల్ సాబ్ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల.. వీటితో పాటు ప్లే బ్యాక్, శాకుంతలం, మళ్లీ పెళ్లి, తంత్ర, అన్వేషి సినిమాలు చేసింది గానీ బ్రేక్ అందుకోలేకపోయింది. ఈ ఏడాది 'తంత్ర' అనే హారర్ మూవీతో వచ్చింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఈమె చేతిలో 'పొట్టేల్' అనే మూవీ ఉంది.మరోవైపు ఓటీటీలోకి కూడా అనన్య నాగళ్ల ఎంట్రీ ఇస్తోంది. 'బహిష్కరణ' అనే వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర చేస్తోంది. అంజలి ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. గత రెండేళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ సిరీస్ నుంచి తాజాగా అప్డేట్ వచ్చింది. అంజలికి పుట్టినరోజు విషెస్ చెబుతూ చిన్న వీడియో రిలీజ్ చేశారు. అంజలి ఇప్పటికే ఓటీటీలో నవరస, ఫాల్, ఝాన్సీ సిరీస్ లు చేసింది. ఇకపోతే 'బహిష్కరణ' సిరీస్ ని త్వరలో సిరీస్ రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.(ఇదీ చదవండి: ‘కార్తీక దీపం’నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్ చేసి..) Happy Birthday @yoursanjaliWe cannot wait for the world to see your new avatar from #Bahishkarana#BahishkaranaOnZee5 Coming Soon!@PixelPicturesIN @Prashmalisetti @iamprajapathi @prasannadop@SidharthSadasi1 pic.twitter.com/YW4Stiidvy— ZEE5 Telugu (@ZEE5Telugu) June 16, 2024 -
అంజలి బర్త్‌డే స్పెషల్.. ఫ్యాన్స్‌ను ఫిదా చేసే ఫోటోలు చూశారా..?
-
ఓటీటీలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. అధికారిక ప్రకటన
టాలీవుడ్ ప్రముఖ హీరో విశ్వక్ సేన్ నటించిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు మే 31న థియేటర్స్‌లోకి వచ్చేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా విశ్వక్ అభిమానులకు విజిల్స్ కొట్టించే సినిమా అని కూడా చెప్పవచ్చు. తాజాగా విశ్వక్ ఫ్యాన్స్‌కు శుభవార్త వచ్చేసింది. ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.విష్వక్ సేన్, అంజలి, నేహాశెట్టి, నాజర్, పి.సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' జూన్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.గోదావరి నేపథ్యంలో సినిమా అంటే పచ్చటి పల్లెసీమల్లో కనిపించే వాతావరణమే గుర్తొస్తుంది. అయితే, అందుకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది పగ, ప్రతీకారాలతో ఓ యువకుడి ప్రయాణాన్ని దర్శకుడు కృష్ణచైతన్య అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులు అంజలి పాత్రకు కాస్త ఎక్కువ మార్కులే పడుతాయి. విష్వక్ నటనకు ఏమాత్రం పేరు పెట్టాల్సిన పనిలేదని చెప్పవచ్చు. సినిమా విడుదలయిన వారంలోనే రూ. 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో థియేటర్లో రన్ అవుతుంది. అయితే, కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో మరోసారి సినిమా చూడొచ్చని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
అలాంటి వాళ్లు పనికిమాలిన పని చేసిన తప్పులేదు: బాలకృష్ణపై నటి ఫైర్
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ వివాదాస్పద ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసిపోయేలా లేదు. ఇప్పటికే ఆయన తీరును పలువురు సినీతారలు సైతం తప్పుబడుతున్నారు. ప్రముఖ సింగర్ చిన్మయి, బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా సోషల్ మీడియా వేదికగా బాలయ్యపై విమర్శలు చేశారు. హన్సల్ ఏకంగా ఈ చెత్తమనిషి ఎవరంటూ ట్విటర్లో రిప్లై ఇచ్చారు. తాజాగా మరో నటి సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణ తీరుపై విరుచుకుపడింది. ఇంతకీ ఆమె ఏమన్నారో ఓ లుక్కేద్దాం.రిధి డోగ్రా తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బాలకృష్ణపై పోస్ట్ చేసింది. ఆ వీడియోను షేర్ చేస్తూ విమర్శలు చేసింది. అతను ఆ మహిళను కించపరిచేలా వ్యవహరించినప్పటికీ ఆమె నవ్వుతోంది. ఎందుకంటే బాగా డబ్బు, పేరున్న మగాళ్లు పనికిమాలిన పని చేసిన ఈ ప్రపంచం తప్పుపట్టదు. ఎందుకంటే అలాంటి పురుషులు ఏం చేసినా పర్వాలేదు అనే స్థాయికి తీసుకొచ్చారు. ఒకవేళ అదే సమయంలో అంజలి కఠినంగా వ్యవహరించి ఉంటే.. ఇప్పటికే విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యేది అంటూ రిధి డోగ్రా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా వైరల్‌గా మారింది. -
బాలయ్య దెబ్బకు అంజలి భయపడిందా ? ట్వీట్ కు కారణం అదేనా
-
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ
టైటిల్: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరినటీనటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, హైపర్ ఆది తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకుడు: కృష్ణ చైతన్యసంగీతం: యువన్ శంకర్ రాజాసినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి విడుదల తేది: మే 31, 2024మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల గామి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రయోగాత్మకంగా చేసిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఎట్టకేలకు నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 90లో సాగుతుంది. గోదావరి జిల్లాలోని లంక గ్రామానికి చెందిన రత్నాకర్ అలియాస్ రత్న(విశ్వక్ సేన్) అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు. అదే గ్రామంలో ఉండే వేశ్య రత్నమాల(అంజలి) అతనికి మంచి స్నేహితురాలు. తన చుట్టూ ఉన్నవారిని వాడుకుంటూ ఎదగాలనుకునే స్వభావం ఉన్న రత్నాకర్‌కు ఆ ఏరియాలో సాగుతున్న ఇసుక మాఫియా గురించి తెలుస్తుంది. దాని వెనుక స్థానిక ఎమ్మెల్యే దొరస్వామి రాజు(గోపరాజు రమణ) ఉన్నారని తెలుసుకొని అతనికి దగ్గరవుతాడు. కొద్ది రోజుల్లోనే దొరస్వామి కుడిభుజంలా మారతాడు. దొరస్వామి రాజకీయ ప్రత్యర్థి నానాజీ(నాజర్) కూతురు బుజ్జి(నేహా శెట్టి) ప్రేమలో పడి ఆమె కోసం నానాజీకి దగ్గరవుతాడు. ఇలా ఇద్దరి రాజకీయ నాయకులను వాడుకొని రత్నాకర్ ఎమ్మెల్యే అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తనను నమ్మించి మోసం చేసిన రత్నాకర్‌పై దొరస్వామి ఎలా పగ తీర్చుకున్నాడు? పిల్లను ఇచ్చిన మామ నానాజీని రత్నాకర్ ఎందుకు చంపాల్సి వచ్చింది? సొంత భర్తే తన తండ్రిని చంపాడని తెలిసిన తర్వాత బుజ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? రత్నాకర్ ఎదుగుదలకు కారణమైన సొంత మనుషులే అతన్ని చంపేందుకు ఎందుకు కత్తి కట్టారు?(లంకలో ఎవరినైనా చంపాలని ఫిక్స్ అయితే ఆ ఊరి గుహలో ఉన్న అమ్మవారికి మొక్కి చంపాల్సిన వ్యక్తి పేరు అక్కడ రాస్తారు. దాన్నే కత్తి కట్టడం అంటారు) సొంత మనుషులే తనపై కత్తి కట్టారని తెలిసిన తర్వాత రత్నాకర్ ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..విలేజ్ రాజకీయాల నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. గోదావరి ప్రాంతానికి చెందిన ఒక స్లమ్ కుర్రాడు.. రాజకీయాలను వాడుకొని ఎలా ఎదిగాడు? ఎదిగిన తర్వాత అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే ఈ సినిమా కథ. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా.. దాన్ని తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. గత సినిమాల్లో గోదావరి అంటే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉన్నట్లు చూపించేవారు. కానీ ఈ సినిమాలో గోదావరిలో ఉండే మరో కోణాన్ని చూపించారు. విలేజ్ రాజకీయాలు ఎలా ఉంటాయి? నా అనుకునే వాళ్లే ఎలా వెన్నుపోటు పొడుస్తారు? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అయితే రియలిస్టిక్ పేరుతో హింసను ఎక్కువగా చూపించడం ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే సినిమా కథంతా వాస్తవికానికి దూరంగా సాగినట్లు అనిపిస్తుంది. హీరో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన తీరు సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రౌడీలా ప్రవర్తించడం.. ప్రత్యర్థుల దాడి.. హీరోయిన్‌తో ప్రేమలో పడడం.. ఇవన్నీ ఆసక్తికరంగా సాగవు. కత్తికట్టడం గురించి చెబుతూ కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. ఎంట్రీ సీన్‌తో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించాడు. హీరో ఎమ్మెల్యే దొరస్వామి దగ్గరకు వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అయితే కథ పరంగా కాదు కానీ హీరో ఎదిగిన తీరు మాత్రం పుష్ప సినిమాను గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది.ఎవరెలా చేశారంటే.. రత్న అలియాస్ రత్నాకర్ పాత్రలో విశ్వక్ సేన్ ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే భిన్నమైన పాత్ర తనది. యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. గోదావరి యాస మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. అక్కడక్కడ ఆయన ఒరిజినల్ (తెలంగాణ) యాస బయటకు వచ్చింది. రత్నమాల అనే పవర్ఫుల్ పాత్రలో అంజలి చక్కగా నటించింది.బుజ్జిగా నేహాశెట్టి తెరపై అందాలను ప్రదర్శిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. ఐటమ్ సాంగ్‌లో ఆయేషా ఖాన్ అందాలతో ఆకట్టుకుంది. విలన్‌గా యాదు పాత్రలో గగన్ విహారి ఆకట్టుకున్నాడు. నాజర్, సాయి కుమార్ హైపర్ ఆదితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికత పరంగా సినిమా చాలా బాగుంది. యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
'అలాంటి వారిని అంటే సమాజమే ఒప్పుకోదు'.. బాలకృష్ణ వివాదంపై సింగర్ ట్వీట్
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ.. హీరోయిన్ అంజలి పట్ల వ్యవహరించిన తీరు టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీసింది. మహిళలంటే ఆయననకు ఎంత చులకనో అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా బాలయ్య తీరుపై నెటిజన్స్ సైతం మండిపడుతున్నారు. అయితే గతంలోనూ బాలయ్య నోటీ దురుసుతో ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడం చాలాసార్లు జరిగింది. తాజాగా ఈ వివాదంపై సింగర్, ఫెమినిస్ట్ చిన్మయి శ్రీపాద స్పందించారు. ఈ అంశంపై తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.చిన్మయి తన ట్వీట్లో రాస్తూ.. 'ఈ వీడియోను షేర్ చేస్తున్న వారిలో నేను గమనించిన అతిపెద్ద సమస్యల్లో ఇది ఒకటి. ఆమె నవ్వు వైపు చూడండి. ఆమెకు ఉండాలి కదా. ఇలాంటివీ చూసినప్పుడు ప్రేక్షకుల రియాక్షన్‌పై స్పందించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇది మోరల్ పోలీసింగ్ కంటే పవిత్రమైంది. హరిశ్చంద్ర, శ్రీరామచంద్రమూర్తి లేదా వారి బంధువుల అవతారాలు అర్థం చేసుకోకపోవడం పొరపాటే అవుతుంది. పవర్లో ఉన్న వారిని తప్పుగా చూపేందుకు ఈ సమాజమే ఒప్పుకోదు. ముఖ్యంగా డబ్బు, కులం, రాజకీయ బలం నుంచి వచ్చిన వారిని. అయినా ఇందులో మీకు ఎలాంటి నష్టం లేనప్పుడు.. మహిళలకు ఎలా ప్రవర్తించాలో చెప్పకండి.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. One of the biggest problems that I notice from people sharing this“Look at her laughing. She should have _____”1. It is NOT possible to respond according to your spectator response as you watch this on your device. This most moral policing, holier than thou - pure as driven… https://t.co/nzTOlGJm0J— Chinmayi Sripaada (@Chinmayi) May 30, 2024 -
త్వరలో శుభవార్త.. పెళ్లి గురించి హింట్ ఇచ్చిన హీరోయిన్ అంజలి..!
-
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ గ్యాంగ్ స్టర్ మూవీ కాదు: దర్శకుడు
‘గోదావరి అనగానే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉంది అన్నట్టుగా చూపిస్తారు. కానీ నిజానికి మా ప్రాంతంలో కూడా నేరాలు జరుగుతాయి. ప్రాంతాలను బట్టి కాకుండా మనుషులను బట్టి నేరాలు జరుగుతాయి. ఆ ఆలోచన నుంచి పుట్టిన కథే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అని దర్శకుడు కృష్ణ చైతన్య అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ కృష్ణ చైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇒ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కంటే ముందే నేను దర్శకత్వం వహించాల్సిన సినిమాలు ఉన్నా.. అనివార్య కారణాల వల్ల అవి అలస్యం అయ్యాయి. చాలా గ్యాప్ రావడంతో నాలో భయం మొదలైంది. ఇదే విషయాన్ని త్రివిక్రమ్‌తో పంచుకున్నాను. ఆయన సూచనతో విశ్వక్ సేన్‌కి కథ చెప్పగా.. అది ఆయనకు నచ్చడంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొదలైంది.⇒ ఇది కల్పిత కథనే. దీనిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే.. దీని ద్వారా ఒక మంచి కథను చూపించవచ్చు, ఒక మంచి ఎమోషన్ ను చూపించవచ్చు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ విజువల్ ని చూపించవచ్చు అని భావించాను. నా ఆలోచనకు తగ్గట్టుగా సితార లాంటి మంచి నిర్మాణ సంస్థ దొరికింది. కొందరు ఇది గ్యాంగ్ స్టర్ మూవీ అనుకుంటున్నారు. కానీ ఇది గ్యాంగ్ స్టర్ మూవీ కాదు.⇒ విశ్వక్ సేన్ కోసం కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. మొదట ఏదైతే కథ రాసుకున్నామో.. అదే విశ్వక్ తో చేయడం జరిగింది. అయితే విశ్వక్ తెలంగాణలో పెరిగిన వ్యక్తి కాబట్టి.. గోదావరి మాండలికాన్ని సరిగ్గా చెప్పగలడా అని కొంచెం సందేహం కలిగింది. కనీసం రెండు మూడు నెలలు ట్రైనింగ్ అవసరమవుతుంది అనుకున్నాను. కానీ నెల రోజుల లోపులోనే నేర్చుకొని ఆశ్చర్యపరిచాడు.⇒ మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. సంభాషణల పరంగా రెండు చోట్ల మాత్రమే మ్యూట్ వేశారు. అవే మీరు ట్రైలర్ లో చూశారు. ట్రైలర్ కి సెన్సార్ అభ్యంతరాలు ఉండవు. అందుకే ఆ సన్నివేశాల్లోని భావోద్వేగాన్ని బాగా అర్థమయ్యేలా చెప్పడం కోసం ఆ సంభాషణలను ట్రైలర్ లో అలాగే ఉంచడం జరిగింది. సినిమాలో మాత్రం ఆ రెండు అభ్యంతరకర పదాలు వినిపించవు.⇒ యువన్ శంకర్ రాజా లాంటి ప్రముఖ సంగీత దర్శకుడితో పని చేయాలంటే మొదట భయపడ్డాను. ఆయన స్థాయికి నా మాట వింటారా అనుకున్నా. కానీ ఆయన మాత్రం తన అనుభవంతో.. నేను కోరుకున్నట్టుగా, సినిమాకి కావాల్సిన అద్భుతమైన సంగీతాన్ని అందించారు.⇒ ఇది నాకు చాలా చాలా ఇష్టమైన కథ. ఆ ఇష్టంతోనే ఈ సినిమా చేశాను. నేను అనుకున్న భావోద్వేగాలు తెరమీద చక్కగా పలికాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మాత్రం హృదయాన్ని హత్తుకుంటాయి.⇒ మహా భారతంలోని "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాట నాకు చాలా ఇష్టం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాటే చెబుతాను. -
హీరోయిన్ని తోసేసిన బాలకృష్ణ.. అందరిముందు మద్యం తాగుతూ!
హీరో బాలకృష్ణ మరోసారి అనుచితంగా ప్రవర్తించారు. స్టేజీపై తన పక్కనే నిలబడి ఉన్న హీరోయిన్ అంజలిని తోసేశారు. అయితే ఆమె తమాయించుకుని నిలబడింది. అదే టైంలో లోపల ఇబ్బందిగా ఉన్నప్పటికీ బయటకు నవ్వుతూ కవర్ చేసింది. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు)విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా మే 31న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన బాలకృష్ణ చాలా చీప్‌గా ప్రవర్తించాడు. హీరోయిన్ అంజలిని నెట్టేయడంతో పాటు అందరిముందు వాటర్ బాటిల్లో మద్యం సేవించారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.బాలకృష్ణని చేసిన దాన్ని ఆయన ఫ్యాన్స్ సమర్ధించుకుంటారేమో! కానీ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం, నోటీ దురుసుతో ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడం గతంలోనూ పలుమార్లు జరిగింది. అమ్మాయిలు, నర్సులపై గతంలో చౌకబారు కామెంట్స్.. 'అక్కినేని తొక్కినేని' అని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అనడం లాంటివి బాలకృష్ణ ఎలాంటి వాడో చెప్పకనే చెబుతుంటాయి. కొన్నాళ్ల ముందు తమిళ హీరోయిన్ విచిత్ర కూడా ఇతడు పేరు చెప్పకుండా తనని ఓసారి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. ఇలా చెప్పుకొంటూ పోతే బాలకృష్ణ బాగోతాలెన్నో!(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
పెళ్లి గురించి హింట్ ఇచ్చేసిన తెలుగు హీరోయిన్.. త్వరలో శుభవార్త
జనాల్లో హీరోయిన్ల పెళ్లిళ్ల మీద ఉన్న ఆసక్తి మరి దేనిపైనా ఉండదేమో? వారు ప్రేమలో పడితే వార్త, పెళ్లి కాకపోతే వార్త, పెళ్లి అయితే వార్త.. ఇలా ఉంటుంది హీరోయిన్ల పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఇలాంటి వాటి వల్ల వాళ్లకి పెద్ద తలనొప్పి అని చెప్పొచ్చు. అయితే ఇలాంటి వాటిని కొందరు ఎంజాయ్ చేస్తారు. కాగా హీరోయిన్ అంజలి కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. కారణం ఈమెకు 36 ఏళ్లు.(ఇదీ చదవండి: పెళ్లయిన మూడు నెలలకే విడిపోతున్నారా? అసలు విషయం ఇది)మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి పెళ్లెప్పుడు అనే ప్రశ్నలు అంజలిని వెంటాడుతూనే ఉన్నాయి. తెలుగు, తమిళంలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు కథానాయికగా చేస్తూనే స్పెషల్ క్యారెక్టర్స్ కూడా చేస్తోంది. కొన్నాళ్ల క్రితం ఈమె రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే న్యూస్ వచ్చింది. అందరూ ఇది నిజమే అనుకున్నారు. కానీ ఇది కేవలం రూమర్ మత్రమే అని తేలింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి రూమర్స్‌పై స్పందించింది.ఇప్పటికే నాకు మూడు నాలుగు పెళ్లిళ్లు చేశారు. మొదట్లో ఇలాంటి వార్తలు విన్నపుడు బాధపడ్డా కానీ ఆ తర్వాత పట్టించుకోవడం మానేశానని అంజలి చెప్పింది. తనపై వస్తున్న వదంతుల కారణంగా నిజంగా ఓ వ్యక్తిని తీసుకెళ్లి ఇతన్నే పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పినా ఇంట్లో ఎవరూ నమ్మరని చెప్పుకొచ్చింది. తను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని కానీ దానికి చాలా టైమ్ ఉందని క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం నటిగా బిజీగా ఉన్నానని ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే మూవీస్ చేస్తానని మాటిచ్చింది.(ఇదీ చదవండి: హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?) -
మందేసి హీరోయిన్ అంజలిని స్టేజ్ పై తోసేసిన బాలకృష్ణ
-
అంజలి ఎంత ముద్దుగుందో.. (ఫోటోలు)
-
రత్నమాల నా కెరీర్లో గుర్తుండిపోతుంది: అంజలి
‘‘నన్ను ఎక్కువగా పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో చూడాలనుకుంటారు. కానీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో నేను చేసిన రత్నమాల పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. ‘ఈ పాత్రకు మీరే న్యాయం చేయగలరు’ అని కృష్ణచైతన్య అన్నారు. ఇంత మంచి పాత్ర చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని అంజలి అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా, నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది.ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘రత్నమాల పాత్ర కోసం ఈ తరహా (మాస్) సంభాషణలు నా నోటి నుంచి రావడం ఇదే మొదటిసారి. చిత్రీకరణ, డబ్బింగ్ సమయంలో కొత్త అనుభూతి పొందాను. రత్నమాల నా సినీ కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది’’ అన్నారు. పెళ్లి గురించి అడిగితే – ‘‘నా పెళ్లికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతానికి నా పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లే’’ అన్నారు అంజలి. ‘‘ప్రస్తుతం ‘గేమ్ చేంజర్’లో ఓ కథానాయికగా చేస్తున్నాను. తెలుగులో మరో సినిమా, తమిళ, మలయాళ సినిమాలు కూడా చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు అంజలి. -
‘రత్నమాల’నా కెరీర్లో గుర్తుండి పోతుంది: అంజలి
ఇంతవరకు నేను అన్ని సినిమాల్లోనూ పక్కింటి అమ్మాయిలా నటించాను. కానీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో రత్నమాల అనే ఓ డిఫరెంట్ రోల్లో నటించాను. ఆహార్యం, నేను పలికే సంభాషణలు కొత్తగా ఉంటాయి. మనసులో ఏది అనుకుంటే అది బయటకు చెప్పే పాత్ర. లుక్స్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను. రత్నమాల నా సినీ కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది’ అని అన్నారు తెలుగు బ్యూటీ అంజలి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా అంజలి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ⇢ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో రత్నమాల అనే మాస్ పాత్ర చేశాను. అలాంటి పాత్ర చేయడం, ఈ తరహా సంభాషణలు నా నోటి నుంచి రావడం ఇదే మొదటిసారి. అసలు ఈ సంభాషణలు నిజంగా సినిమాలో ఉంచుతారా అనుకున్నాను. చిత్రీకరణ, డబ్బింగ్ సమయంలో కొత్త అనుభూతిని పొందాను.⇢ కృష్ణ చైతన్య మొదటిసారి కలిసి ఈ కథ చెప్పినప్పుడు.. ఈ పాత్రకు నన్ను ఎంపిక చేయడానికి కారణం ఏంటని అడిగాను. ఎందుకంటే నన్ను ఎక్కువగా అందరూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రలలో చూడాలి అనుకుంటారు. కానీ ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. అయితే చైతన్య ఏమన్నారంటే.. నాకు అద్భుతంగా నటించే నటి కావాలి, అందుకే మీ దగ్గరకు వచ్చాను, మీరు ఈ పాత్రకు న్యాయం చేయగలరు అన్నారు. ఆయన ఏ నమ్మకంతో చెప్పారో తెలియదు కానీ.. ఇంత మంచి పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది.⇢ ఈ సినిమాలో విశ్వక్ సేన్, నా పాత్రల బంధం స్వీట్ గా ఉంటుంది. మా పాత్రల పేర్లు కూడా ఒకేలా ఉంటాయి. ఆయన రత్నాకర్, నేను రత్నమాల. ఇద్దరినీ రత్న అని పిలుస్తారు. ⇢ రత్నమాల తరహా పాత్రలు నిజ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తారసపడతాయి. నేను అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు చూశాను. దేనిని లెక్క చేయకుండా పైకి రఫ్ గా కనిపిస్తారు.. కానీ వాళ్ళ మనసు మాత్రం చాలా మంచిది. రత్నమాల పాత్రలోకి వెళ్ళడానికి కాస్త సమయం తీసుకున్నాను. లుక్స్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను.⇢ విశ్వక్ నాకు ముందు నుంచి స్నేహితుడు. అందుకే మా మధ్య సెట్ లో మంచి సమన్వయం ఉంటుంది. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు కాబట్టి.. ఎటువంటి సన్నివేశాల్లోనూ మేము నటించడానికి ఇబ్బంది పడలేదు.⇢ దర్శకుడు కృష్ణ చైతన్య మాకు ఏం చెప్పారో అదే తీశారు. ఒక దర్శకుడు ఏం ఆలోచించాడో.. దానిని అలాగే తెరమీదకు తీసుకురావడం అనేది చాలా మంచి లక్షణం. కృష్ణ చైతన్య ఏదైతే రాసుకున్నారో.. దానిని ఇంకా మెరుగ్గా తెరమీదకు తీసుకొచ్చారు.⇢ ప్రస్తుతం తెలుగులో గేమ్ చేంజర్‌తో పాటు తమిళంలో మూడు సినిమాలు, అలాగే మలయాళ సినిమాలు కూడా చేస్తున్నాను.⇢ పెళ్ళి అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. కానీ ఇప్పుడు కాదు. నా పెళ్ళికి ఇంకా సమయం ఉంది. కొంతకాలంగా నా పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లే. -
పెళ్లి కోసం అబ్బాయిని తీసుకెళ్లినా.. ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు: అంజలి
తెలుగు బ్యూటీ అంజలి పెళ్లిపై చాలా రూమర్స్ వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. మొదట్లో ఓ తమిళ హీరోతో పెళ్లి అని పుకార్లు వచ్చాయి. దానిపై అంజలి వివరణ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు ఎలాంటి రూమర్స్ రాలేదు. మళ్లీ ఆమె సినిమాలతో బీజీ అయిన తర్వాత ప్రముఖ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుందనే ప్రచారం జరిగింది. అంతేకాదు త్వరలోనే సినిమాలకు పుల్‌స్టాప్ పెట్టి అమెరికాలో సెటిల్ అవుతుందనే ప్రచారమూ జరిగింది. అయితే వీటిని అంజలి ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. అయినా కూడా ఈ మ్యారేజ్ రూమర్స్ వస్తునే ఉన్నాయి. తాజాగా అంజలి తన పెళ్లిపై వస్తున్న పుకార్లపై స్పందించింది. ‘ఇప్పటికే సోషల్ మీడియా నాకు మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసింది(నవ్వూతూ..). మొదట్లో ఇలాంటి రూమర్స్ వస్తే ఇంట్లో వాళ్లు కంగారు పడేవాళ్లు. కానీ ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ మధ్య నేను పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యాననే పుకారు వచ్చింది. అమెరికాలోనే ఉన్న మా అక్క నాకు కాల్ చేసి..‘పెళ్లి అయిందటగా’ అని అడిగింది. ఏమో మరి నాకే తెలియదు అని చెప్పా(నవ్వుతూ..). నా పెళ్లిపై వచ్చిన రూమర్స్ కారణంగా..నేను ఒక అబ్బాయిని తీసుకెళ్లి ఇతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పినా.. ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు. పెళ్లి అయితే కచ్చితంగా చేసుకుంటా. కానీ ఇప్పుడు కాదు. ప్రస్తుతం నేను సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. పెళ్లి చేసుకుంటే.. పర్సనల్ లైఫ్‌కి కూడా టైమ్ కేటాయించాలి. అందుకే కొంచెం టైమ్ తీసుకొని పెళ్లి చేసుకుంటా. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను’ అని అంజలి చెప్పుకొచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదలకు సిద్ధంగా ఉంది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి మరో హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే 31న విడుదల కాబోతుంది. -
ఫోన్ తీయనందుకే అంజలి హత్య
హుబ్లీ: నగరంలోని వీరాపుర ఓణిలో ఈ నెల 14వ తేదీ తెల్లవారు జామున జరిగిన అంజలి అంబిగేర హత్య కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ బృందం ఎదుట నిందితుడు నిజాలను చెప్పినట్లుగా తెలుస్తోంది. నిందితుడు గిరీష్ తాను మొదట అంజలిని మైసూరుకు రమ్మని పిలిచాను. అయితే ఆమె రాలేదు. హత్య చేయడానికి ముందు రోజు అంజలికి రూ.1000 ఫోన్ పే చేశాను. డబ్బులు పంపాక ఆమె తన ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేసింది. ఈ కారణంతోనే కోపం తట్టుకోలేక హత్య చేసినట్లుగా నిందితుడు గిరీష్ అలియాస్ విశ్వ సీఐడీ అధికారుల వద్ద విచారణ సందర్భంగా నోరు విప్పాడు. కాగా గత ఏప్రిల్ 18న విద్యార్థిని నేహా హిరేమఠ హత్య చేసిన మాదిరిగానే అంజలి హత్య కూడా జరిగిన సంగతి తెలిసిందే. కాగా అంతకు ముందు నిందితుడు అంజలిని నేహా మాదిరిగానే చంపుతానని బెదిరించేవాడని అంజలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ
హారర్ సినిమాలకు ఓటీటీలో మంచి గిరాకీ ఉంటుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లోకి ఇలా ఎంటరవ్వగానే అలా ట్రెండయిపోతాయి. థియేటర్లలో పెద్దగా కలెక్షన్స్ రాబట్టని చిత్రాలు కూడా మినిమమ్ గ్యారెంటీ వ్యూస్ రాబడతాయి. తాజాగా ఓ తెలుగు హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.గత నెలలో రిలీజ్తెలుగు హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ గీతాంజలి అనే హిట్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. కోన వెంకట్ కథ అందించగా శివ తుర్లపాటి దర్శకత్వం వహించాడు. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, రవిశంకర్, సత్య, బ్రహ్మాజీ, అలీ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. సడన్‌గా ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చేసింది.కథ విషయానికి వస్తే..దర్శకుడు శ్రీనివాస్(శ్రీనివాస్ రెడ్డి) తీసిన మూడు చిత్రాలు ఫ్లాప్ అవుతాయి. మరో ఛాన్స్ కోసం ఫ్యామిలీని వదిలేసి హైదరాబాద్‌లో తిరుగుతుంటాడు. సరిగ్గా అప్పుడే ఊటీకి చెందిన వ్యాపారవేత్త విష్ణు (రాహుల్ మాధవ్) మేనేజర్ గోవిందా గోవిందా (శ్రీకాంత్ అయ్యంగార్) శ్రీనివాస్‌కు ఫోన్ చేసి తనతో సినిమా నిర్మిస్తానని చెపుతాడు. హీరోయిన్గా ఊటీలో కాఫీ కేఫ్ రన్ చేస్తున్న గీతాంజలి(అంజలి)ని తీసుకోవాలని విష్ణు సూచిస్తాడు. అయితే షూటింగ్ అంతా సంగీత్ మహల్లోనే పూర్తి చేయాలని కండీషన్ పెడతాడు. అక్కడున్న దెయ్యాలతో శ్రీను టీమ్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అక్కడే షూటింగ్ చేయాలని ఎందుకు కండీషన్ పెట్టాడు? గీతాంజలి ఆత్మ మళ్లీ ఎలా? ఎందుకు? వచ్చింది? అన్నది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! చదవండి: వైఎస్సార్సీపీ అభ్యర్థి కోసం ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ -
Anjali: అంజలి సారీ లుక్.. తనకన్నీ అలా సెట్టవుతాయంతే! (ఫోటోలు)
-
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు చంపేస్తున్నాయి. అడుగు బయటపెట్టాలంటే భయమేస్తోంది. ఇలాంటి టైంలో థియేటర్‌కి వెళ్లి చూడటం కంటే ఓటీటీలో మూవీస్ చూడటానికే జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే ప్రస్తుతం 'మంజుమ్మల్ బాయ్స్', 'సైతాన్' లాంటి చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు తెలుగు హారర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)హీరోయిన్ అంజలి తెలుగమ్మాయి. అప్పట్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత పలు మూవీస్ చేసినప్పటికీ ఓ మాదిరి సక్సెస్ మాత్రమే అందుకుంది. తన 50వ సినిమాగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చేసింది. ఈ మధ్యే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో జనాలు అంతంత మాత్రంగానే వెళ్లారు.థియేటర్లలోకి ఏప్రిల్ 11న వచ్చిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాని ఇప్పుడు నెల తిరిగిసరికల్లా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. మే 10 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుందని సమాచారం. హిట్ మూవీ కాదు కాబట్టి పెద్దగా హడావుడి లేకుండా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. 2014లో వచ్చిన 'గీతాంజలి' మూవీకి దీన్ని సీక్వెల్‌గా తెరకెక్కించారు. కాకపోతే తొలి భాగంలా హిట్ కొట్టలేకపోయారు.(ఇదీ చదవండి: సమ్మర్ స్పెషల్.. ఓటీటీలో 100 సినిమాలు/ సిరీస్‌లు) -
లైట్ బ్లూ సారీ లో నటి అంజలి లుక్స్.. ఫోటోలు
-
మిక్స్డ్ టాక్.. రూ.50 కోట్లు కావాలంటున్న డైరెక్టర్
ఒకప్పుడు అరుదుగా సీక్వెల్స్ తీసేవారు.. ఇప్పుడు సీక్వెల్స్ అనేవి సర్వసాధారణమైపోయాయి. అలా పదేళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన మూవీ గీతాంజలి. దశాబ్దం తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది తెరకెక్కించారు. అంజలి హీరోయిన్గా నటించిన ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేశ్, సత్య, సునీత్ ప్రధాన పాత్రలు పోషించారు. కోన వెంకట్ కథ అందించగా శివ తుర్లపాటి దర్శకత్వం వహించాడు. ఆ దేవుడిని ఒకటే అడిగా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తొలిరోజే మిక్స్డ్ టాక్ అందుకుంది. గురువారం నాడు కోన వెంకట్ మీడియా ముందు మాట్లాడుతూ.. 'తిరుపతిలో దేవుడి ముందు నిలబడ్డప్పుడు ఒకటే కోరుకున్నా.. 27 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. బ్లాక్బస్టర్లు, ఫ్లాపులు చూశాను. తొలిసారి సక్సెస్ కావాలని భగవంతుడిని వేడుకున్నాను. సక్సెస్ కావాలి సక్సెస్ అనేది మనకంటూ కొత్త శక్తినిస్తుంది. కొత్త కథలను, కొత్తవారిని పరిచయం చేసేందుకు బలాన్నిస్తుంది. నేను చూసింది చాలు.. నా ద్వారా పదిమంది పరిచయం కావాలి, ఇండస్ట్రీకి మేలు జరగాలని కోరుకున్నాను. ముఖ్యంగా ఇది అంజలి 50వ సినిమా కావడంతో ఈ చిత్రానికి కనీసం రూ.50 కోట్లు అయినా వచ్చేట్లు చూడమని అడిగాను. తప్పకుండా ఆ నెంబర్స్ వస్తాయని ఆశిస్తున్నాను. త్వరలోనే రూ.50 కోట్ల ఫంక్షన్లో కలుద్దాం' అని చెప్పుకొచ్చాడు. చదవండి: హీరోయిన్ను పెళ్లాడిన దర్శన్? ఫోటో వైరల్! -
‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ రివ్యూ
టైటిల్: గీతాంజలి మళ్ళీ వచ్చిందినటీనటులు: అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ తదితరులు నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణకథ, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్దర్శకత్వం: శివ తుర్లపాటిసంగీతం: ప్రవీణ్ లక్కరాజుసినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థఎడిటర్: ఛోటా కె ప్రసాద్విడుదల తేది: ఏప్రిల్ 11, 2024తెలుగు బ్యూటీ అంజలి కెరీర్లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో ‘గీతాంజలి’ సినిమా ఒకటి. పదేళ్ల క్రితం వచ్చిన ఈ కామెడీ హారర్ అప్పట్లో ఘన విజయం సాధించింది. దశాబ్దం తర్వాత మళ్లీ అదే టీమ్‌తో గీతాంజలికి సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని తెరకెక్కించారు. మంచి అంచనాలతో నేడు(ఏప్రిల్ 11) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గీతాంజలి తరహాలో సీక్వెల్ కూడా హిట్ అయినట్లేనా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. దర్శకుడు శ్రీనివాస్(శ్రీనివాస్ రెడ్డి) తీసిన మూడు చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో మరో అవకాశం రాదు. సినిమా చాన్స్ కోసం ఫ్యామిలీని వదిలేసి స్నేహితులు ఆరుద్ర(షకలక శంకర్), ఆత్రేయ(సత్యం రాజేశ్)కలిసి హైదరాబాద్‌లో కష్టపడుతుంటాడు. మరోవైపు వైజాగ్‌లో ఫాస్ట్‌పుడ్ సెంటర్ నడుపుకునే అయాన్(సత్య) హీరో కావాలనని కలలు కంటుంటాడు. అయాన్ని హీరో చేస్తానని నమ్మించి అతని నుంచి డబ్బులు వసూలు చేస్తాడు శ్రీనివాస్. ఫ్రెండ్‌పై నమ్మకంతో హైదరాబాద్ వస్తాడు అయాన్. ఇక్కడకు వచ్చాక అసలు విషయం తెలుస్తుంది. మోస పోయానని తెలిసినా శ్రీనివాస్ పరిస్థితి చూసి ఏమి అనలేకపోతాడు.ఇక సినిమా ఇండస్ట్రీని వదిలేసి వేరే ఏదైనా పని చేసుకుందాని శ్రీనివాస్ గ్యాంగ్‌తో పాటు అయాన్ కూడా నిర్ణయం తీసుకుంటారు. సరిగ్గా అదే సమయంలో ఊటికి చెందిన పెద్ద వ్యాపారవేత్త విష్ణు( రాహుల్ మాధవ్) మేనేజర్ గోవిందా గోవిందా(శ్రీకాంత్ అయ్యంగార్) నుంచి శ్రీనివాస్‌కి ఫోన్ కాల్ వస్తుంది. అతనితో ఓ సినిమాను నిర్మిస్తానని విష్ణు చెబుతాడు. హీరోయిన్గా ఊటీలోనే కాఫీ కేఫ్ రన్ చేస్తున్న గీతాంజలి(అంజలి)ని తీసుకోవాలని విష్ణు సూచిస్తాడు. అలాగే షూటింగ్ అంతా సంగీత్ మహాల్‌లోనే చేయాలని కండీషన్ పెడతాడు. ఆ మహాల్ చరిత్ర ఏంటి? ఆ బంగ్లాలో ఉన్న దెయ్యాలలో శ్రీను టీమ్‌కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? సినిమా షూటింగ్‌ని అక్కడే చేయాలని విష్ణు ఎందుకు కండీషన్ పెట్టాడు? హ్యాట్రిప్ ఫ్లాపులు ఇచ్చిన డైరెక్టర్ శ్రీనుతో విష్ణు ఎందుకు సినిమా తీయాలనుకున్నాడు? హీరోయిన్గా అంజలినే ఎందుకు ఎంచుకున్నాడు? ఈ కథలోకి గీతాంజలి ఆత్మ మళ్లీ ఎలా వచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హారర్ కామెడీ చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. పదేళ్ల కిందట వచ్చిన గీతాంజలి ముందు కూడా ఈ జానర్లో సినిమాలు వచ్చాయి. కానీ గీతాంజలి తరహాలో అవి విజయం సాధించలేకపోయాయి. ఆ చిత్రం విజయానికి ప్రధాన కారణం కామెడీ, హారర్‌తో పాటు ఎమోషన్స్ కూడా చక్కగా కుదరడం. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’లో ఆ ఎమోషన్ మిస్ అయింది. కేవలం కామెడీ, హారర్ ఎలిమెంట్స్‌తో కథనాన్ని నడింపించారు దర్శకుడు. కథ- కథనంపై ఫోకస్ చేయకుండా కాన్సెప్ట్‌ని నమ్ముకొని సినిమాను తెరకెక్కించారు.వాస్తవానికి ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంది. దెయ్యాలతో సినిమా షూటింగ్ అనేది కొత్త పాయింటే. ఆ ఎపిసోడ్ వరకు కామెడీ బాగా వర్కౌట్ అయింది. కానీ మిగతా కథంతా అంతగా ఆకట్టుకునేలా సాగదు. ప్రేక్షకులను నవ్విస్తూనే..కొన్నిచోట్ల భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ అది పూర్తిగా సక్సెస్ కాలేదు. కొన్ని సన్నివేశాలు అయితే మరీ రొటీన్‌గా ఉంటాయి. ఇక ఇలాంటి సినిమాల్లో లాజిక్కులను వెతుకొద్దు. కానీ ఎమోషన్స్‌ని ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేయడంలో చిత్రబృందం పూర్తిగా విఫలం అయింది.ఎంతసేపు నవ్వించడం మీదనే ఫోకస్ పెట్టారు. పోనీ ఆ కామెడీ అయినా కొత్తగా ఉందంటే అదీ లేదు. ఫస్టాప్‌లో వచ్చే కామెడీ సీన్స్ అయితే జబర్దస్త్ షోని గుర్తు చేస్తాయి. ఇంటర్వెల్ వరకు కథంతా సోసోగానే సాగుతుంది. సెకండాఫ్ ప్రారంభంలో కథనం కాస్త ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగుతుంది. దెయ్యాలను జూనియర్ ఆర్టిస్టులు అని శ్రీను నమ్మించడం.. ఆ తర్వాత సత్య, సునీల్ పాత్రలు ఆ దెయ్యాలతో జరిపే సంభాషణలు నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ పరమ రొటీన్‌గా ఉంటుంది. ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా భయపెట్టలేదు.. కడుపుబ్బా నవ్వించనూ లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మాత్రం కాస్త ఎంటర్టైన్ అవుతారు. ఎవరెలా చేశారంటే.. గీతాంజలి పాత్రలో అంజలి ఒదిగిపోయింది. అల్రేడీ చేసిన పాత్రే కాబట్టి.. ఇంకాస్త చక్కగా నటించింది. ఇందులో ఆమెకు ఓ యాక్షన్ సీన్ ఉంది. ఆ సీన్లో అదరగొట్టేసింది. ఈ సినిమాకు సత్య పోషించిన పాత్ర హైలెట్ అని చెప్పాలి. అయాన్‌గా ఆయన పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. శ్రీనివాస్‌రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేశ్‌లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రాఫర్ కిల్లర్ నానిగా సునీల్ పండించిన కామెడీ కొన్ని చోట్ల నవ్వులు పూయిస్తుంది. దెయ్యాలుగా రవిశంకర్, ప్రియ కొన్ని చోట్ల భయపెట్టారు. ఆ పాత్రలకు సరైన ముగింపు ఉండదు. రాహుల్ మహదేవ్ విలనిజం అంతగా పండలేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాకేతికంగా ఈ సినిమా జస్ట్ ఓకే. హారర్ సినిమాలకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. బీజీఎంతోనే భయపెట్టాలి. కానీ ప్రవీణ్ లక్కరాజు ఆ స్థాయి నేపథ్య సంగీతాన్ని అందించలేకపోయాడు. పాటలు కూడా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. గ్రాఫిక్స్ విభాగం పనితీరు వీక్‌గా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. సంభాషణలు కొన్నిచోట్ల ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Anjali: అందం అభినయం కలబోసిన తెలుగమ్మాయి అంజలి (ఫొటోలు)
-
Ugadi2024 అంజలి ‘పాప’ ఎంత ముద్దుగుందో..! (ఫోటోలు)
-
హారర్... కామెడీ సమానంగా ఉంటాయి: అంజలి
‘‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా పాయింట్‌ను కోన వెంకట్‌గారు నాలుగేళ్ల ముందే చెప్పారు. అయితే అప్పుడు నేను బిజీగా ఉండటం, ఆ తర్వాత ఈ సినిమాలోని ఇతర నటీనటులు బిజీగా ఉండటంతో కుదరలేదు. మధ్యలో కరోనా వచ్చింది. హారర్, కామెడీని బ్యాలెన్స్ చేస్తూ చేసిన ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు హీరోయిన్ అంజలి. ‘గీతాంజలి’కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఎంవీవీ సినిమాస్‌తో కలిసి కోన వెంకట్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 11న రిలీజవుతోంది. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘గీతాంజలి’కి ఇది సీక్వెల్ కాబట్టి పాత్రలని మార్చలేదు. కానీ, కొత్త క్యారెక్టర్స్‌ను (అలీ, సునీల్, సత్య) తీసుకొచ్చాం. రొటీన్‌గా చేస్తే నటిగా నాకు ఆసక్తి ఉండదు కాబట్టి ప్రతి సినిమాకి కొత్తగా ఉండాలనే చూస్తున్నాను. ఈ ఉగాదికి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’తో వస్తుండటం హ్యాపీ’’ అన్నారు. -
'గీతాంజలి మళ్లీ వచ్చింది' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
'గీతాంజలి మళ్లీ వచ్చింది' ట్రైలర్ చూసేయండి
థియేటర్లో ప్రేక్షకులను భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించిన చిత్రం 'గీతాంజలి'. అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పటికి వచ్చి దాదాపు పదేళ్లు అవుతుంది. ఇన్నేళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే సినిమా విడుదలకు ఇప్పుడు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో టైటిల్ పాత్రలో అంజలి పోషిస్తుండగా.. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, అలీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంజలికి ఇది 50వ చిత్రం. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చడం విశేషం. అంచనాలతో వచ్చిన ప్రేక్షకులు అంతకుమించి ఆస్వాదించేలా ఈ సినిమా ఉంటుందని కోన వెంకట్ చెప్పారు. -
'ఇలాంటి టైటిల్ పెట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది'
మిర్చి విజయ్, అంజలి నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం వైఫ్. ఈ చిత్రం ద్వారా హేమంత్ నాదం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఒలింపియ మూవీస్ సంస్థ అధినేత ఎస్.అంబేడ్కర్ నిర్మిస్తున్నారు. గతంలో జిప్సీ, డాడా, కలిగేత్తి మూర్కన్ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను ఆయన నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దంపతుల మధ్య నవీన అనుబంధాలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఇది ఉంటుందని డైరెక్టర్ హేమంత్ నాదం అన్నారు. అందుకే ఈ చిత్రానికి వైఫ్ అని పేరు పెట్టామని తెలిపారు. ఇలాంటి టైటిల్‌ను ఇప్పటివరకు ఎవరూ పెట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. చదరంగంలో రాణికి అపార శక్తి ఉంటుందన్నారు. అదేవిధంగా ఒక ఇంటిని చక్కదిద్దడంలో భార్య పాత్ర ముఖ్యమన్నారు. వివాహానంతరం భార్యాభర్తల మధ్య పెరిగే ప్రేమానుబంధాన్ని ఎమోషనల్‌గా ఆవిష్కరించే చిత్రమని చెప్పారు. ఈ చిత్రం ద్వారా మిర్చి విజయ్ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కేఏ శక్తివేల్ చాయాగ్రహణం, జెన్ మార్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో మైత్రేయన్, రెడిన్ కింగ్స్ లీ, కల్యాణి నటరాజన్, విజయ్‌బాబు, విల్లు, కదిర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. Super happy to present the First Look of my next Romcom #Wife with @RJVijayOfficial 👰🏻♀️🤵🏻 Directed by @dir_hemanathan Produced by @ambethkumarmla @olympiaMovis@Abishek_jg @shakthi_dop @JenMartinmusic @PMohan93 @gayathribala21@sharmaseenu11@VishnuEdavan1 @DoneChannel1 pic.twitter.com/fqnzgwDBaZ — Anjali (@ianjalinair) March 23, 2024 -
ఆమెను చూస్తే గర్వంగా ఉంది
‘‘అంజలిగారి కెరీర్లో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ 50వ సినిమా. ఓ తెలుగమ్మాయి ఇన్ని సినిమాలు చేసి, విజయం సాధించడం గర్వంగా ఉంది. అంజలిగారు వందకుపైగా సినిమాలు చేయాలి. మార్చి 22న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో పాటు నా మూవీ ‘ఓం భీం బుష్’ కూడా విడుదలవుతోంది. ఈ రెండు చిత్రాలు విజయం సాధించాలి’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్. శివ తుర్లపాటి దర్శకత్వంలో కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ , ఎంవీవీ సినిమాస్‌పై కోన వెంకట్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 22న విడుదలకానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు హీరో శ్రీ విష్ణు, దర్శకులు గోపీచంద్ మలినేని, బాబీ, బుచ్చిబాబు సన అతిథులుగా హాజరయ్యారు. అంజలి మాట్లాడుతూ – ‘‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ నా కెరీర్లో ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది. యాభై సినిమాలు చేయడం నాకు సంతోషాన్నిస్తోంది’’ అన్నారు అంజలి. ‘‘ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది’’ అన్నారు కోన వెంకట్. ‘‘ఓ మంచి చిత్రానికి దర్శకత్వం వహించాననే సంతృప్తి కలిగింది’’ అన్నారు శివ తుర్లపాటి. నటులు అలీ, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. -
గీతాంజలి మళ్లీ వచ్చింది.. భయపెడుతోన్న టీజర్
రర్ సినిమాలకు ఎప్పుడూ మంచి గిరాకీయే ఉంటుంది. ఇక్కడ ఎవరు నటించారు? ఎవరు డైరెక్ట్ చేశారు? అనేదానికన్నా కథేంటి? కాన్సేప్ట్ ఏంటి? అనే చూస్తారు ప్రేక్షకులు. అలాంటిది ఆల్రెడీ హిట్ కొట్టిన హారర్ మూవీ గీతాంజలికి సీక్వెల్ తెరకెక్కుతోంది. దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంజలి ప్రధాన పాత్రలో నటించిన మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. ఇది అంజలి కెరీర్లో 50వ చిత్రంగా తెరకెక్కింది. శివ దర్శకత్వం వహించిన ఈ మూవీని రచయిత–నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మించారు. శ్రీనివాస్ రెడ్డి, ‘సత్యం’ రాజేశ్, ‘షకలక’ శంకర్, అలీ, సునీల్, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. మొదట టీజర్ లాంచ్ ఈవెంట్‌ను స్మశానవాటికలో చేద్దామనుకున్నారు. తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ కన్వెన్షన్ హాల్లో శనివారం సాయంత్రం టీజర్ లాంచ్ చేశారు. అంజలి క్లాసికల్ డ్యాన్స్‌తో టీజర్ మొదలైంది. దెయ్యాలను ఎలా నమ్మారు? అనే దగ్గరి నుంచి దెయ్యాలకు జడుసుకునేవరకు చూపించారు.హారర్‌తో పాటు కామెడీ కూడా పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను మార్చి 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చదవండి: మీమర్ పిచ్చి ప్రశ్నలు.. హీరో వద్దని వారిస్తున్నా పదేపదే.. -
ముద్దు సన్నివేశాల్లో నటించడం పై అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు
-
ముద్దు సన్నివేశాల్లో నటించడంపై అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగమ్మాయి అంజలి వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. కేవలం టాలీవుడ్లో కాకుండా కోలీవుడ్, మాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ..బిజియెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా ఈ బ్యూటీ ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్‌పై తన అభిప్రాయాన్ని తెలియజేసింది. సినిమాల్లో ముద్దు సన్నివేశాలు సహజంగా వస్తాయని, అందులో నటించక తప్పదన్నారు. అయితే అలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు తనకు కాస్త ఇబ్బందిగానే ఉంటుందని, కానీ కథ డిమాండ్ చేస్తే చేయక తప్పదన్నారు. (చదవండి: రియల్ లైఫ్‌లో ఒక్కటి కానున్న రీల్ జంట!) ‘ కొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు సహనటుడు నా గురించి ఏమనుకుంటాడోనని ఆందోళన కలుగుతుంది..ఇంటిమేట్ సన్నివేశాలు సినిమాకు అవసరం కాబట్టి వాటిని నిరాకరించలేను. అసౌకర్యంగానే వాటిల్లో నటిస్తాను నిజ జీవితంలో ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే కెమిస్ట్రీకి సినిమాలో ప్రేమికుల మధ్య ఉండే దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే సహనటులతో ముద్దు సన్నివేశాల్లో నటించేటప్పుడు నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది’ అని అంజలి చెప్పారు. (చదవండి: తెలుగులో ఇదే నా చివరి సినిమా.. మళ్లీ ఆ చాన్స్ రాకపోవచ్చు: మహేశ్ బాబు) ఇక తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ గురించి స్పందిస్తూ.. ‘కొందరు నా పర్సనల్ విషయాల గురించి ఇష్టానుసారంగా రాసేస్తున్నారు. గతంలో జర్నీ నటుడు జైతో ప్రేమలో ఉన్నానని రూమర్స్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత అమెరికాకు చెందిన వ్యక్తితో పెళ్లి అయిందని వార్తలు రాశారు. అవన్నీ రూమర్స్ మాత్రమే. వాటిని చూసి నవ్వుకుంటాను తప్ప సీరియస్‌గా తీసుకొను’అని అంజని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అంజలి రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్‌లో సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది. 2014లో ఆమె నటించిన గీతాంజలి సీక్వెల్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. వీటితో పాటు పలు తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తోంది. -
'హీరోతో లవ్.. వ్యాపారవేత్తతో పెళ్లి'.. అంజలి ఆన్సరిదే!
పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లదెబ్బలు అన్న సామెత మాదిరిగా సెలబ్రిటీల గురించి ముఖ్యంగా సినీ హీరోయిన్ల గురించి సోషల్ మీడియాలో లేనిపోనివి రాసేస్తుంటారు. అంజలి విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ అచ్చ తెలుగమ్మాయి ఫొటో చిత్రం ద్వారా టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైంది. రామ్ దర్శకత్వంలో 'కట్రదు తమిళ్' చిత్రం ద్వారా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అంజలి అక్కడ తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత తనకు తమిళంలో వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. దీంతో అంజలి అక్కడ బిజీ హీరోయిన్గా మారింది. స్టార్ హీరోలతో జోడీ అలాంటి సమయంలోనే పిన్నితో మనస్పర్థలు తలెత్తడంతో హైదరాబాద్‌కు మకాం మార్చింది. ఇది ఈమెకు ప్లస్సే అయ్యిందని చెప్పవచ్చు. ఇక్కడ వెంకటేశ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాలు అందుకుంది. ఇకపోతే హీరో జైతో ప్రేమాయణం.. పెళ్లికి సిద్ధం అవుతున్న అంజలి అంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. దాన్ని అప్పట్లోనే అంజలి లైట్ తీసుకుంది. ఇప్పుడేమో.. ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిందని ప్రచారం జరుగుతోంది. తెలియకుండానే పెళ్లి చేస్తున్నారు! దీనిపై ఒక ఇంటర్వ్యూలో స్పందించిన అంజలి సినిమా రంగంలో తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారని చెప్పింది. దీంతో తనను ఎవరితో కలిపి రాయాలన్నది కొందరు వారే సొంతంగా నిర్ణయించుకుని రాసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మొదట్లో హీరో జైను ప్రేమిస్తున్నట్లు రాశారని, ఇప్పుడు ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయినట్లు ప్రచారం జరుగుతోందని తెలిపింది. తనకు తెలియకుండానే తన పెళ్లి చేసేస్తుండడంతో నవ్వు వస్తోందని పేర్కొంది. తమిళంలో ఈమె నటించిన ఏళు కడల్ ఏళు మలై చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. మరోవైపు గీతాంజలి 2 కూడా త్వరలో రిలీజ్ కానుంది. చదవండి: షూటింగ్లో గాయపడ్డ హీరో నితిన్? -
శ్రీలీలతో పోల్చినందుకు రిపోర్టర్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అంజలి
-
శ్రీలీల 6 సినిమాలు చేస్తోంది.. మీరేమో.. అంజలి రిప్లై ఇదే!
తెలుగు హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో గీతాంజలి(2014) ఒకటి. పదేళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే సినిమా తెరకెక్కింది. అంజలితో పాటు సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు. 'నిన్ను కోరి' సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పని చేసిన శివ తుర్లపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శనివారం ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌ను పరిచయం చేస్తూ విలేకర్ల సమావేశం నిర్వహించారు. శ్రీలీలతో పోలిక.. అంజలి చిరాకు ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ అంజలిని ఉద్దేశిస్తూ ఓ ప్రశ్న అడిగింది. 'తెలుగువారికి మీరంటే చాలా అభిమానం. నేను కూడా మీకు పెద్ద అభిమానిని. అయితే మీకు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదని అనిపిస్తోంది. తెలుగమ్మాయి అవడం వల్ల బ్రేక్ రాలేదా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా?' అని అడిగింది. దీనికి అంజలి బదులిస్తూ.. 'నాకు బ్రేక్ రాకపోతే మీకు ఫేవరెట్ హీరో అయ్యేదాన్నే కాదు' అని చెప్పింది. దీనికి సదరు జర్నలిస్టు స్పందిస్తూ.. అలా అని కాదు.. ఈ రోజు శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తోంది. మీరేమో.. అని నసగడంతో అంజలి మధ్యలోనే అందుకుంది. కిక్ ఉంటేనే చేస్తా 'నేనెప్పుడూ ఒకటి, రెండు స్థానాల కోసం పోటీపడలేదు. ఒక్కొక్కరికి ఒక్కో హీరోయిన్ నచ్చుతారు. నాకు స్క్రిప్ట్ నచ్చితేనే, అందులోనూ నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటేనే ఆ సినిమా చేస్తాను. లేదంటే ఆ పాత్ర ఒప్పుకోను. నేను ఒకేసారి నాలుగు సినిమాలు చేయొచ్చు. కానీ నాలుగింటికి బదులు ఒక్క మంచి సినిమా చేయడమనేది నాకిష్టం. నేను తెలుగుతో పాటు ఇతర మూడు భాషల్లోనూ నటిస్తున్నాను. ఒకేసారి అన్ని చోట్లా నేను ఉండలేను. అక్కడో సినిమా, ఇక్కడో సినిమా చేస్తున్నాను. నాకు కిక్కిచ్చే పాత్రలే చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది అంజలి. చదవండి: సీరియల్ నటి ప్రియాంకకు ఆపరేషన్.. గతంలో ఆమె ప్రియుడికి కూడా! -
నవ్విస్తూ...భయపెడుతూ..
అంజలి టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్. శ్రీనివాస్ రెడ్డి, ‘సత్యం’ రాజేశ్, ‘షకలక’ శంకర్, అలీ, సునీల్, సత్య ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రచయిత–నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది ప్రథమార్ధంలో విడుదల కానుంది. శనివారం ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌ను పరిచయం చేస్తూ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అంతా ఒక ఎత్తైతే.. క్లైమాక్స్ మరో రేంజ్లో ఉంటుంది. ‘గీతాంజలి’ని ఫ్రాంచైజీగా చేస్తూ, కోనగారు ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ చేశారు. కోనగారి కామెడీ ట్రాక్, ఈ సినిమాను ఆయన డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దర్శకుడు శివగారికి ఈ సినిమాతో పెద్ద బ్రేక్ వస్తుంది’’ అన్నారు. ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’’ని అమెరికాలో చేద్దామనుకున్నాం. కొన్ని ్రపాక్టికల్ కారణాల వల్ల ఊటీ బ్యాక్‌డ్రాప్‌కి మార్చాం. ప్రేక్షకులు వారి అంచనాలకు మించి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు కోన వెంకట్. ‘‘ప్రేక్షకులను భయపెడుతూ, నవ్విస్తూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డి. ‘‘బ్లాక్‌బస్టర్ మూవీ ‘గీతాంజలి’కి సీక్వెల్ చేసే అవకాశాన్ని కల్పించిన కోనగారికి, ఎంవీవీగారికి థాంక్స్’’ అన్నారు శివ తుర్లపాటి. నటుడు రవికృష్ణ, ఎడిటర్ చోటా కె. ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు మాట్లాడారు. -
ప్రేమికుల రోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ సినిమా 'రీ రిలీజ్'
దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన 'జర్నీ' సినిమా అప్పట్లో యూత్‌ను ఎంతగానో కట్టిపడేసింది. అంజలి, జై, శర్వానంద్, అనన్య జోడిగా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాను చూసిన వారందరూ ఇప్పటి జనరేషన్లో టువంటి అమ్మాయిలు కూడా ఉంటారా? అనేంతగా సినిమా కథలో హీరోయిన్ పాత్ర ఉంటుంది. ఇందులోని ప్రేమ కథలకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. మురుగదాస్ నిర్మాణం, ఎం.శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీ.సత్య సంగీతం అందించారు. అప్పట్లో ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించింది. 2011 సెప్టెంబర్ 16న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించి బ్లాక్ బస్టర్ హిట్‌ను చేశారు. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ కాబోతోంది. అసలే టాలీవుడ్లో ఇప్పుడు రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతీ నెల ఏదో ఒక కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అవుతూనే ఉంది. ఈ రీ రిలీజ్‌లకు థియేటర్లు షేక్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇదే క్రమంలో ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ‘జర్నీ’ని రీ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద ఏ.సుప్రియ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరిలో జర్నీని గ్రాండ్‌గా మళ్లీ థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. ప్రేమికులకు ఈ సినిమా మంచి ఫీస్ట్ లాంటిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. -
2023.. న్యూ ఇయర్ వేళ.. ఢిల్లీలో జరిగిన ఘోరమిదే!
అది 2023, జనవరి ఒకటి.. దేశమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగితేలుతోంది. ఇంతలో దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన యావత్ దేశప్రజలను కలచివేసింది. మర్నాటి ఉదయం వెలుగు చూసిన ఒక వీడియో సంచలనంగా మారింది. అదే.. ఢిల్లీలో నూతన సంవత్సరం వేళ కంఝావాలాలో చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ ఘటన. ఒక హోటల్ జరిగిన న్యూ ఇయర్ పార్టీకి హాజరైన అంజలి(20) స్కూటీపై ఇంటికి తిరిగి వెళుతోంది. ఇంతలో అటుగా కారులో వచ్చిన యువకులు ఆమె వాహనాన్ని ఢీకొని, కారుని వేగంగా పోనిచ్చారు. అయితే ఆమె కారు కింద ఇరుక్కుపోయింది. కారు ఆమెను ఈడ్చుకుంటూ 12 కిలోమీటర్లు దూరం వరకూ వెళ్లింది. ఆమె తనను కాపాడాలని అరుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా ఆమె మృతి చెందింది. ఈ ఘటన దేశ ప్రజల్లో ఆగ్రహాన్ని నింపింది. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో అంజలి స్నేహితురాలు నిధిని కూడా విచారించారు. ఆ సమయంలో అంజలి మద్యం మత్తులో ఉందని నిధి పోలీసులకు తెలిపింది. కాగా వారి స్కూటీ కంఝావాలాలోని సుల్తాన్‌పురి ఏరియాకు చేరుకున్నంతలో మితిమీరిన వేగంతో వచ్చిన ఒక కారు వీరి స్కూటీని ఢీకొంది. దాంతో నిధి ఎగిరి పక్కన పడిపోగా, అంజలి కారు కింద ఇరుక్కుపోయింది. అయితే కారును ఆపకుండా.. కారులో ఉన్న అయిదుగురు నిందితులు 12 కిలోమీటర్ల దూరం వరకూ అంజలిని ఈడ్చుకుంటూ వెళ్లారు. తరువాత ఆమె మృతదేహాన్ని రోడ్డుపక్కన పడేసి పరారయ్యారు. పోలీసుల విచారణలో నిధి.. తమను కారు ఏవిధంగా ఢీకొన్నదో తెలిపింది. అయితే ఆ సమయంలో తాను భయాందోళనకు లోనైనందుకు పోలీసులకు వెంటనే ఈ విషయం చెప్పలేకపోయానని నిధి పేర్కొంది. కాగా తెల్లవారుజామున 3.24 గంటలకు ఒక మృతదేహాన్ని ఈడ్చుకుంటూ ఒక కారు కుతుబ్ మినార్ వైపు అతివేగంతో వెళుతున్నదని ఢిల్లీలోని కంఝావాలా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది. ఈ ఘటన దర్యాప్తు దరిమిలా విధులలో నిర్లక్ష్యం వహించారంటూ 11 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. వీరిలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు 800 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పోలీసులు ఏడుగురిని నిందితులుగా కేసులో చేర్చారు. వీరిలో అమిత్ ఖన్నా, అశుతోష్లపై మోటారు వాహన చట్టం కింద కేసు కూడా నమోదైంది. బాధిత కుటుంబానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇది కూడా చదవండి: 2023లో ప్రధాని మోదీ ఎన్ని దేశాల్లో పర్యటించారు? ఎవరిని కలిశారు? -
గీతాంజలి మళ్లీ వస్తోంది
అంజలి టైటిల్ రోల్లో, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘గీతాంజలి’ (2014) హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అంజలి, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, ‘షకలక’ శంకర్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్, ఊటీ నేపథ్యాల్లో ఈ సినిమా కథనం సాగుతుంది. ‘‘ఇప్పటి వరకు 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో జరగనున్న ఊటీ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
Anjali: కుక్కపిల్లకు ఓ రేంజ్లో బర్త్‌డే సెలబ్రేట్ చేసిన అంజలి (ఫోటోలు)
-
Anjali: వెకేషన్లో చిల్ అవుతున్న బ్యూటిఫుల్ అంజలి (ఫోటోలు)
-
'గేమ్ చేంజర్' షూటింగ్లో రామ్‌చరణ్‌కు గాయాలు!
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘గేమ్ చేంజర్’. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, సునీల్, నవీన్ చంద్ర, ఎస్జే సూర్య, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ‘గేమ్‌చేంజర్’ తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 20 నుంచి ప్లాన్ చేశారు. అయితే ఈ షెడ్యూల్ రద్దు అయ్యింది. ‘‘గేమ్‌చేంజర్’లోని కొందరు ఆర్టిస్టులు షూటింగ్‌కు అందుబాటులో లేని కారణంగానే ఈ నెలలో జరగాల్సిన షూటింగ్ రద్దు అయింది. అక్టోబర్ రెండోవారంలో తిరిగి షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే రెండు రోజుల క్రితం రామ్‌చరణ్‌కు షూటింగ్లో చిన్న గాయమైందని ఓ వార్త వైరలవుతోంది. గాయం కారణంగా డాక్టర్ పది రోజుల వరకు విశ్రాంతి తీసుకోమన్నారని తెలుస్తోంది. ఈ కారణం వల్ల కూడా షూటింగ్ రద్దైనట్లు సమాచారం. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: తమన్. -
ప్రతీకార జ్వాలతో..
అంజలి టైటిల్ రోల్లో, శ్రీనివాస రెడ్డి కీలక పాత్రలో రాజ్‌కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ‘గీతాంజలి (2014)’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ని తెరకెక్కిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ఆరంభమైంది. తొలి సీన్‌కి రామచంద్ర క్లాప్ ఇవ్వగా, స్క్రిప్ట్‌ని ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ ఈ చిత్రదర్శకుడు శివ తుర్లపాటికి అందజేశారు. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అని ప్రకటించి, శనివారమే షూటింగ్ ఆరంభించినట్లు వెల్లడించారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. -
సినీ కెరీర్లో అరుదైన మైల్స్టోన్ చేరుకున్న ఈ ఐదుగురు
యాభైలో పడ్డారంటే యాభై ఏళ్ల వయసులో పడ్డారనుకుంటున్నారేమో! ఆ మాటకొస్తే.. ధనుష్, విజయ్ సేతుపతి, అంజలికన్నా సీనియర్ ఆర్టిస్ట్ అయిన సిమ్రానే ఇంకా వయసు పరంగా యాభై టచ్ అవ్వలేదు. ఆమె యాభైలోకి అడుగుపెట్టడానికి ఇంకో రెండు మూడేళ్లు పడుతుంది. ఇక ధనుష్, భరత్ నలభై టచ్ చేస్తే.. ఇంకో అయిదు అదనంగా అంటే... సేతుపతి నలభై అయిదు టచ్ చేశారు. అంజలి నలభై లోపే. ఈ అయిదుగురూ అయిదుపదుల్లో పడింది సినిమాల పరంగా. ఈ అయిదుగురూ చేస్తున్న 50వ సినిమా విశేషాల్లోకి వెళదాం... రెండు దశాబ్దాల్లో రెండోది రెండు దశాబ్దాల కెరీర్లో నటుడు– నిర్మాత ధనుష్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘పా. పాండి’ (2017). ఈ సినిమా తర్వాత మరో సినిమా కోసం దర్శకుడిగా ధనుష్ మెగాఫోన్ పట్టాలనుకున్నారు. ‘నాన్ రుద్రన్’గా ప్రచారం జరిగిన ఈ సినిమా ఎందుకో సెట్స్‌పైకి వెళ్లలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. అయితే ఇది ధనుష్ కెరీర్లో 50వ సినిమా కావడం విశేషం. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా ఉంటుందట. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024లో రిలీజ్ కానుంది. మహారాజా హీరో.. విలన్.. సపోర్టింగ్ యాక్టర్... ఇలా పాత్రకు తగ్గట్టు ఇమిడిపోతూ విలక్షణ నటుడిగా ప్రేక్షకుల్లో పేరు సంపాదించుకున్నారు విజయ్ సేతుపతి. కెరీర్లో విజయ్ సేతుపతి 50 చిత్రాల మైలురాయికి చేరుకున్నారు. ఆయన 50వ సినిమాకు ‘మహారాజా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నితిలన్ సామినాథన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్ మమతా మోహన్‌దాస్, నట్టి నటరాజ్, బాలీవుడ్ దర్శక–నిర్మాత, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటించారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా తుది దశకు చేరుకున్నాయి. ‘పాషన్ స్టూడియోస్’ సుధన్ సుందరం, జగదీష్ పళనీసామి నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో ఓ స్పష్టత రానుంది. లా స్టూడెంట్ దక్షిణాదిలో నటిగా అంజలికి మంచి మార్కులే వేశారు ప్రేక్షకులు. హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా, కీలక పాత్రల్లో నటిస్తున్న అంజలి కెరీర్లో హాఫ్ సెంచరీ కొట్టారు. అదేనండీ.. యాభై సినిమాల మైల్స్టోన్కు చేరుకున్నారు. అంజలి ప్రధాన పాత్రలో అశోక్ వేలాయుధం దర్శకత్వంలో ‘ఈగై’ అనే ఓ కోర్టు డ్రామా మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం అంజలికి 50వది. ఆల్రెడీ చిత్రీకరణ మొదలైంది. ఈ చిత్రంలో అంజలి లా స్టూడెంట్‌గా నటిస్తున్నారని, సునీల్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. గ్రీన్ అమ్యూస్మెంట్ ప్రొడక్షన్స్, డీ3 ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. సిమ్రాన్ శబ్దం సిమ్రాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దక్షిణాదిలోనే కాదు..ఉత్తరాదిలో కూడా సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు సిమ్రాన్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. సిమ్రాన్ కీలక పాత్ర చేస్తున్న మూవీల్లో ‘శబ్దం’ ఒకటి. ‘ఈరమ్’ (తెలుగులో ‘వైశాలి’) చిత్రం తర్వాత హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందుతోంది. లక్ష్మీ మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్, లైలా కీలక పాత్రధారులు. సిమ్రాన్‌కు తమిళంలో ఇది 50వ సినిమా కావడం విశేషం. ప్రేమకోసం... దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన తమిళ చిత్రం ‘కాదల్’ తెలుగులో ‘ప్రేమిస్తే..’గా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత తమిళంలో చాలా సినిమాలే చేశారు భరత్. తెలుగులో మహేశ్‌బాబు ‘స్పైడర్’, సుధీర్‌బాబు ‘హంట్’ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. కాగా భరత్ కెరీర్లో రూపొందిన 50వ సినిమా ‘లవ్’. వాణీ భోజన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ఆర్పీ బాలా దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. -
ఫాక్స్ కార్పొరేషన్ స్ట్రీమింగ్ సర్వీస్‌కు సీఈవోగా అంజలీ సూద్
ఫాక్స్ కార్పొరేషన్ ఉచిత యాడ్-సపోర్టెడ్ స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ట్యూబీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా భారతీయ-అమెరికన్ అంజలీ సూద్ నియమితులయ్యారు. సెప్టెంబర్ 1 నుంచి కంపెనీ సీఈవోగా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. విమియో కంపెనీ సీఈవోగా ఉన్న అంజలీ సూద్, తొమ్మిదేళ్లు అక్కడ పనిచేశాక ఇటీవలే పదవి నుంచి వైదొలిగారు. ట్యూబీ ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫర్హాద్ మస్సౌదీ అనంతరం ఆమె ఆ కంపెనీగా సీఈవోగా నియమితులయ్యారు. విమియో కంటే ముందు ఆమె టైమ్ వార్నర్, అమెజాన్ కంపెనీల ఫైనాన్స్, మీడియా, ఈ-కామర్స్ విభాగాల్లో పనిచేశారు. సీఈవోగా అంజలి సూద్ నాయకత్వంలో విమియో ప్రపంచవ్యాప్తంగా వీడియో క్రియేటర్లు, ఇతర ప్రొఫెషనల్స్‌కు కేంద్రంగా మారింది. 300 మిలియన్లకు పైగా యూజర్లను సంపాదించుకోవడంతోపాటు గణనీయమైన ఆదాయాన్నీ ఆర్జించింది. అమెరికాలో ఇటీవల అత్యధికంగా వీక్షించిన ఫ్రీ యాడ్ సపోర్టెడ్ స్ట్రీమింగ్ సర్వీస్‌గా ట్యూబీ నిలిచింది. నీల్సన్ ప్రకారం.. ట్యూబీకి 64 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఈవోగా అంజలీ సూద్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్యూబీని ఫాక్స్ కార్పొరేషన్ 2020లో 440 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. మొత్తం టీవీ వీక్షణ నిమిషాల్లో ప్లూటోటీవీ, పీకాక్, హెచ్‌బీవో మ్యాక్స్‌లను కూడా ట్యూబీ అధిగమించింది. -
తొలి అడుగు
భద్ర, పద్మాకర్ రావ్ హీరోలుగా, నేహా, అంజలి హీరోయిన్లుగా ఉప్పలపాటి శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. మిస్పా మూవీ మీడియాపై పద్మాకర్రావ్ చిన్నతోట, ఆర్.సువర్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం కడపలో ప్రారంభమైంది. పద్మాకర్రావ్ చిన్నతోట మాట్లాడుతూ–‘‘పదహారేళ్లుగా మీడియా రంగంలో రాణిస్తున్న మా మిస్పా మూవీ మీడియా సంస్థ నిర్మాణ రంగంలో తొలి అడుగు వేసింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. -
మాస్ రత్నమాల
ఊర మాస్ రత్నమాలగా కనిపించనున్నారు అంజలి. శుక్రవారం (జూన్ 16) ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘వీఎస్ 11’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో ఆమె చేస్తున్న రత్నమాల పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శ కత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘‘యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రత్నమాలగా అంజలి కనిపించనున్నారు. ఆమె పాత్ర మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. విశ్వక్ సేన్ తొలిసారి ఈ చిత్రంలో క్రూరమైన పాత్రను పోషిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మధాది, సహనిర్మాతలు: వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి. -
అలాంటి వ్యక్తినే మనువాడతా!
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న నటి అంజలి. రామ్ దర్శకత్వంలో కట్రదు తమిళ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథనాయాకిగా పరిచయమైన అచ్చ తెలుగు అమ్మాయి అంజలి. ఆ తరువాత అంగాడి తెరు చిత్రంతో నటిగా తానేమిటో నిరూపించుకుంది. ఎంగేయుమ్ ఎప్పోదుమ్, కలగలప్పు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే విధంగా తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. అదే విధంగా కొన్ని చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్, వెబ్ సీరిస్‌లోనూ నటిస్తూ ఇప్పటికి బిజీగానే ఉన్నారు. ఇకపోతే వ్యక్తిగత జీవితంలో ప్రేమ, పెళ్లి వంటి పలు వదంతుల్లోనూ చిక్కుకున్నారు. ముఖ్యంగా ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం షూటింగ్ సమయంలో ఆ చిత్ర కథానాయకుడు జయ్‌తో పరిచయం ప్రేమగా మారడం, ఇద్దరు చాలా కాలం సహ జీవనంలో ఉన్నారు అనే ప్రచారం జోరుగా సాగింది. అంతేగాక నటుడు జయ్, అంజలి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా సాగింది. అలాంటిది మనస్పర్థల కారణంగా ఇద్దరు విడిపోయారంటూ నటి అంజలి హైదరాబాదుకు మకాం మార్చినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం 36 ఏళ్ల ఈ బ్యూటీ సింగిల్ గానే ఉన్నారు. ఇటీవల ఒక భేటీలో పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు రిలేషన్షిప్లో మర్యాద చాలా ముఖ్యం అని అంజలి పేర్కొన్నారు. ఆ తర్వాతే ప్రేమ, అభిమానం అన్నీ అన్నారు. మర్యాద లేని వ్యక్తితో సంబంధమే తనకు అవసరం లేదని పేర్కొన్నారు. కెరీర్, రిలేషన్‌షిప్‌లలో ఏది కోరుకుంటారు అన్న ప్రశ్నకు తనకు రెండు ముఖ్యమన్నారు.