‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ గ్యాంగ్ స్టర్ మూవీ కాదు: దర్శకుడు | Director Krishna Chaitanya Interesting Comments About Gangs Of Godavari Movie, Deets Inside | Sakshi
Sakshi News home page

ఆ ఆలోచన నుంచే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కథ పుట్టింది: దర్శకుడు

Published Wed, May 29 2024 4:47 PM | Last Updated on Wed, May 29 2024 5:16 PM

Director Krishna Chaitanya Talk About Gangs of Godavari Movie

‘గోదావరి అనగానే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉంది అన్నట్టుగా చూపిస్తారు. కానీ నిజానికి మా ప్రాంతంలో కూడా నేరాలు జరుగుతాయి. ప్రాంతాలను బట్టి కాకుండా మనుషులను బట్టి నేరాలు జరుగుతాయి. ఆ ఆలోచన నుంచి పుట్టిన కథే ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ అని దర్శకుడు కృష్ణ చైతన్య అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని  శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్‌ కృష్ణ చైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కంటే ముందే నేను దర్శకత్వం వహించాల్సిన సినిమాలు ఉన్నా.. అనివార్య కారణాల వల్ల అవి అలస్యం అయ్యాయి. చాలా గ్యాప్‌ రావడంతో నాలో భయం మొదలైంది. ఇదే విషయాన్ని త్రివిక్రమ్‌తో పంచుకున్నాను. ఆయన సూచనతో విశ్వక్‌ సేన్‌కి కథ చెప్పగా.. అది ఆయనకు నచ్చడంతో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి మొదలైంది.

ఇది కల్పిత కథనే. దీనిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే.. దీని ద్వారా ఒక మంచి కథను చూపించవచ్చు, ఒక మంచి ఎమోషన్ ను చూపించవచ్చు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ విజువల్ ని చూపించవచ్చు అని భావించాను. నా ఆలోచనకు తగ్గట్టుగా సితార లాంటి మంచి నిర్మాణ సంస్థ దొరికింది. కొందరు ఇది గ్యాంగ్ స్టర్ మూవీ అనుకుంటున్నారు. కానీ ఇది గ్యాంగ్ స్టర్ మూవీ కాదు.

విశ్వక్ సేన్ కోసం కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. మొదట ఏదైతే కథ రాసుకున్నామో.. అదే విశ్వక్ తో చేయడం జరిగింది. అయితే విశ్వక్ తెలంగాణలో పెరిగిన వ్యక్తి కాబట్టి.. గోదావరి మాండలికాన్ని సరిగ్గా చెప్పగలడా అని కొంచెం సందేహం కలిగింది. కనీసం రెండు మూడు నెలలు ట్రైనింగ్ అవసరమవుతుంది అనుకున్నాను. కానీ నెల రోజుల లోపులోనే నేర్చుకొని ఆశ్చర్యపరిచాడు.

మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. సంభాషణల పరంగా రెండు చోట్ల మాత్రమే మ్యూట్ వేశారు. అవే మీరు ట్రైలర్ లో చూశారు. ట్రైలర్ కి సెన్సార్ అభ్యంతరాలు ఉండవు. అందుకే ఆ సన్నివేశాల్లోని భావోద్వేగాన్ని బాగా అర్థమయ్యేలా చెప్పడం కోసం ఆ సంభాషణలను ట్రైలర్ లో అలాగే ఉంచడం జరిగింది. సినిమాలో మాత్రం ఆ రెండు అభ్యంతరకర పదాలు వినిపించవు.

యువన్ శంకర్ రాజా లాంటి ప్రముఖ సంగీత దర్శకుడితో పని చేయాలంటే మొదట భయపడ్డాను. ఆయన స్థాయికి నా మాట వింటారా అనుకున్నా. కానీ ఆయన మాత్రం తన అనుభవంతో.. నేను కోరుకున్నట్టుగా, సినిమాకి కావాల్సిన అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

ఇది నాకు చాలా చాలా ఇష్టమైన కథ. ఆ ఇష్టంతోనే ఈ సినిమా చేశాను. నేను అనుకున్న భావోద్వేగాలు తెరమీద చక్కగా పలికాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మాత్రం హృదయాన్ని హత్తుకుంటాయి.

మహా భారతంలోని "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాట నాకు చాలా ఇష్టం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాటే చెబుతాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement