Gangs of Godavari Movie
-
ఓటీటీలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఎంట్రీ
టాలీవుడ్ ప్రముఖ హీరో విశ్వక్ సేన్ నటించిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు మే 31న విడుదలైంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే, ఈ చిత్రం విడుదలైన 15రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.నేడు జూన్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉండటం విశేషం. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్గా మెప్పిస్తే.. అంజలి కీలక పాత్రలో ప్రేక్షకులను ఫిదా చేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్తో సంయుక్తంగా దర్శకుడు త్రివిక్రమ్ ఈ మూవీని నిర్మించారు. విశ్వక్ సేన్ ఎనర్జీతో ఈ సినిమాను నడిపించాడు. బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్ల గ్రాస్‌ను ఈ చిత్రం రాబట్టినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
వీకెండ్లో ఓటీటీ సినిమాల హవా.. టాలీవుడ్ హిట్ మూవీ కూడా!
మరో వీకెండ్ రానే వచ్చింది. శుక్రవారం వస్తోందంటే చాలు అందరిచూపు ఏయే సినిమాలు వస్తున్నాయనే దానిపైనే ఉంటుంది. పండుగల సీజన్ కాకపోవడంతో పెద్ద పెద్ద సినిమాల సందడి కనిపించడం లేదు. ఈ వారంలో థియేటర్లలో సుధీర్ బాబు హరోం హర సినిమాతో అలరించేందుకు వస్తున్నాడు. దీంతో పాటు అజయ్ ఘోష్ మ్యూజిక్ షాప్ మూర్తి, చాందినీ చౌదరి నటించిన యేవమ్ థియేటర్లలో సందడి చేయనున్నాయి.ఇవే కాకుండా ఓటీటీ ప్రియుల కోసం సినిమాలు సిద్ధమైపోయాయి. టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన హిట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈనెల 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంతే కాకుండా డియర్ నాన్న మూవీ, నివేదాథామస్ నటించిన వెబ్ సిరీస్ పరువు, మంచు లక్ష్మి యక్షిణి వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేయనున్నాయి. వీటితోపాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు శుక్రవారం ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింక్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ అబంగ్ అధిక్ (మాండరిన్ సినిమా) - జూన్ 14 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (తెలుగు మూవీ) - జూన్ 14 జోకో అన్వర్స్ నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ (ఇండోనేసియన్ సిరీస్) - జూన్ 14 మహారాజ్ (హిందీ సినిమా) - జూన్ 14డిస్నీ ప్లస్ హాట్స్టార్యక్షిణి(తెలుగు వెబ్ సిరీస్)- జూన్ 14ఆహా కురంగు పెడల్ (తమిళ సిరీస్) - జూన్ 14 డియర్ నాన్న(తెలుగు సినిమా)- జూన్ 14ఆపిల్ ప్లస్ టీవీ క్యాంప్ స్నూపీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 14జీ5 లవ్ కీ అరేంజ్ మ్యారేజ్ (హిందీ సినిమా) - జూన్ 14 పరువు (తెలుగు వెబ్ సిరీస్) - జూన్ 14బుక్ మై షోఫాల్ గాయ్(హాలీవుడ్ మూవీ)- జూన్ 14 -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈసారి థియేటర్లలో చిన్న చిత్రాలే రిలీజ్ కానున్నాయి. వీటిలో యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి, హరోంహర తదితర మూవీస్ ఉన్నాయి. వీటిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం పలు క్రేజీ సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో తెలుగువి కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో ప్రేక్షకుల వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు.(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'పారిజాతపర్వం' సినిమాలతో పాటు 'పరువు' అనే తెలుగు సిరీస్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. వీటితో పాటు 'మహారాజ' మూవీ, 'ద బాయ్స్' సిరీస్ ఉన్నంతలో కాస్త ఆసక్తి రేపుతున్నాయి. మరి ఓవరాల్‌గా ఎన్ని మూవీస్ ఏయే ఓటీటీల్లోకి రాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ లిస్ట్ (జూన్ 10- 16 వరకు)నెట్ఫ్లిక్స్టూర్ డే ఫ్రాన్స్ అన్ చైన్డ్ సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) - జూన్ 11కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్ ద గోల్డిన్ టచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12మై నెక్స్ట్ గెస్ట్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12మిస్టరీస్ ఆఫ్ ద టెర్రకోటా వారియర్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 12బిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 13డాక్టర్ క్లైమాక్స్ (థాయ్ సిరీస్) - జూన్ 13అబంగ్ అధిక్ (మాండరిన్ సినిమా) - జూన్ 14గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (తెలుగు మూవీ) - జూన్ 14జోకో అన్వర్స్ నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ (ఇండోనేసియన్ సిరీస్) - జూన్ 14మహారాజ్ (హిందీ సినిమా) - జూన్ 14హాట్స్టార్ప్రొటెక్టింగ్ ప్యారడైజ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 10ద కలర్ ఆఫ్ విక్టరీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 10నాట్ డెడ్ యెట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12జియో సినిమాఘాంత్ చాప్టర్ 1 (హిందీ సిరీస్) - జూన్ 11అమెజాన్ ప్రైమ్గ్రౌండ్ (తెలుగు సినిమా) - జూన్ 10ద బాయ్స్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 13ఆహాపారిజాత పర్వం (తెలుగు సినిమా) - జూన్ 12కురంగు పెడల్ (తమిళ సిరీస్) - జూన్ 14ఆపిల్ ప్లస్ టీవీప్రెజూమ్డ్ ఇన్నోసెంట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12క్యాంప్ స్నూపీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 14జీ5లవ్ కీ అరేంజ్ మ్యారేజ్ (హిందీ సినిమా) - జూన్ 14పరువు (తెలుగు సిరీస్) - జూన్ 14(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
ఓటీటీలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. అధికారిక ప్రకటన
టాలీవుడ్ ప్రముఖ హీరో విశ్వక్ సేన్ నటించిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు మే 31న థియేటర్స్‌లోకి వచ్చేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా విశ్వక్ అభిమానులకు విజిల్స్ కొట్టించే సినిమా అని కూడా చెప్పవచ్చు. తాజాగా విశ్వక్ ఫ్యాన్స్‌కు శుభవార్త వచ్చేసింది. ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.విష్వక్ సేన్, అంజలి, నేహాశెట్టి, నాజర్, పి.సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' జూన్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.గోదావరి నేపథ్యంలో సినిమా అంటే పచ్చటి పల్లెసీమల్లో కనిపించే వాతావరణమే గుర్తొస్తుంది. అయితే, అందుకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది పగ, ప్రతీకారాలతో ఓ యువకుడి ప్రయాణాన్ని దర్శకుడు కృష్ణచైతన్య అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులు అంజలి పాత్రకు కాస్త ఎక్కువ మార్కులే పడుతాయి. విష్వక్ నటనకు ఏమాత్రం పేరు పెట్టాల్సిన పనిలేదని చెప్పవచ్చు. సినిమా విడుదలయిన వారంలోనే రూ. 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో థియేటర్లో రన్ అవుతుంది. అయితే, కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో మరోసారి సినిమా చూడొచ్చని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
మాస్ కా దాస్ దూకుడు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
యంగ్ హీరో విశ్వక్ సేన్, డీజే టిల్లు భామ నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరెకెక్కించిన ఈ చిత్రం ఈనెల 31న థియేటర్లలో రిలీజైంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే రూ.5.2 కోట్ల నెట్ వసూళ్లు రాగా.. రూ.8.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.రెండో రోజు సైతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అదే జోరును కొనసాగించింది. కాస్తా తగ్గినప్పటికీ రూ.3 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో రెండు రోజుల్లోనే రూ.8.2 కోట్ల నికర కలెక్షన్స్ రాగా.. రూ.11.30 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముంది. కాగా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం థియేటర్లలో శనివారం 25.89 శాతం ఆక్సుపెన్సీతో నడిచాయి. కాగా.. ఈ చిత్రంలో అంజలి కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. -
బాలయ్య దెబ్బకు అంజలి భయపడిందా ? ట్వీట్ కు కారణం అదేనా
-
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' గ్రాండ్ ఓపెనింగ్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?
విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' థియేటర్లలోకి వచ్చేసింది. తొలిరోజు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం దుమ్మరేపాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. చాన్నాళ్లుగా సరైన మూవీస్ రిలీజ్ కాకపోవడం కూడా ఈ చిత్రానికి ప్లస్ అయింది. అలా గ్రాండ్ ఓపెనింగ్ లభించింది. ఇంతకీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' తొలిరోజు వసూళ్లు ఎంతంటే?(ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఆ ఓటీటీలోనే.. వచ్చేది ఎప్పుడంటే?)విశ్వక్ సేన్, నేహాశెట్టి, అంజలి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాని పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీశారు. ఇప్పటివరకు గోదావరి అంటే పచ్చని పొలాలు, చెరువులు లాంటివి చూపించేవారు. కానీ ఇందులో మాత్రం నరుక్కోవడం, చంపుకోవడం లాంటివి చూపించి షాకిచ్చారు. అయితే సినిమాలో సరిగా డ్రామా పండలేదని పలువురు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఏదేమైనా సరే ఓ మాదిరి టాక్ సొంతం చేసుకున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రానికి తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.8.2 కోట్ల గ్రాస్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ వీకెండ్ అయ్యేసరికి ఎన్ని కోట్ల గ్రాస్ వస్తుంది అనే దానిబట్టి లాభాల్లోకి వెళ్తుందా? లేదా అనేది తెలిసిపోతుంది.(ఇదీ చదవండి: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ) -
సినిమా చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారు: విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శర్మ నటించిన చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో హీరో విశ్వక్ సేన్, డైరెక్టర్ కృష్ణచైతన్య ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రివ్యూలపై విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారని ఆరోపించారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ..' బుక్ మై షో వాళ్లు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి. టికెట్ కొన్నవారికే రివ్యూ ఇచ్చేలా ఉండాలి. కానీ ఇక్కడ ఎంతమంది ఇచ్చినా తెలిసిపోతుంది. ఎవరో పని గట్టుకొని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఎవరు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు. సినిమాకి సంగీతం బాగాలేదని కొందరు రివ్యూల్లో రాశారు. అక్కడే వారు మూవీ చూడలేదని అక్కడే అర్థమైపోయింది. ఈ సినిమాలో మ్యూజిక్ అద్భుతంగా ఉంది. చూడకుండానే ఉదయం ఐదారు గంటలకే రివ్యూ ఇచ్చారు. సినిమాలో వీక్ పాయింట్‌ని సమీక్షించడంలో తప్పులేదు.' అని అన్నారు. కాగా.. ఇటీవలే మూవీ రిలీజైన వారానికి రివ్యూలు ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై టాలీవుడ్లో చర్చ జరిగిన సంగతి తెలిసిందే.మరోవైపు ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ కృష్ణచైతన్య స్పష్టం చేశారు. కథ సిద్దమయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. పవర్ పేట గురించి త్వరలోనే అప్డేట్ ఇస్తామన్నారు. -
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఆ ఓటీటీలోనే.. వచ్చేది ఎప్పుడంటే?
విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఎన్నికలు, ఐపీఎల్ వల్ల పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు ఫైనల్‌గా ప్రేక్షకులని పలకరించింది. అయితే విడుదలకు ముందు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు మాత్రం మిక్స్డ్ టాక్ నడుస్తోంది. మరోవైపు ఈ మూవీకి ఓటీటీ పార్ట్నర్ కూడా ఎవరనేది ఫిక్స్ అయింది. ఆ డీటైల్స్ ఇవిగో.(ఇదీ చదవండి: 'భజే వాయువేగం' సినిమా రివ్యూ)'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ పేరుకు తగ్గట్లే యాక్షన్ ఎలిమెంట్స్‌తో నింపేశారు. 90ల్లో గోదావరి జిల్లాలోని ఓ లంక ప్రాంతాంలో జరిగే కథతో దీన్ని తీశారు. ఇక నటుడిగా విశ్వక్ సేన్ ఆకట్టుకున్నప్పటికీ ఓవరాల్‌గా మాత్రం యావరేజ్ అనే టాక్ నడుస్తోంది. ఇక ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అయితే 28 తర్వాత స్ట్రీమింగ్ ఉండొచ్చని అంటున్నారు.దీనిబట్టి చూస్తే మే 31న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' థియేటర్లలోకి వచ్చింది. అంటే జూన్ చివరికల్లా ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చేయొచ్చు. ఈ మూవీలో విశ్వక్ సేన్‌తో పాటు నేహాశెట్టి, అంజలి కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. నాగవంశీ నిర్మించారు.(ఇదీ చదవండి: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ) -
ఒకే రోజు రిలీజ్ అవుతున్న టాలీవుడ్ మూవీస్
-
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ
టైటిల్: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరినటీనటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, హైపర్ ఆది తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకుడు: కృష్ణ చైతన్యసంగీతం: యువన్ శంకర్ రాజాసినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి విడుదల తేది: మే 31, 2024మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల గామి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రయోగాత్మకంగా చేసిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఎట్టకేలకు నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 90లో సాగుతుంది. గోదావరి జిల్లాలోని లంక గ్రామానికి చెందిన రత్నాకర్ అలియాస్ రత్న(విశ్వక్ సేన్) అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు. అదే గ్రామంలో ఉండే వేశ్య రత్నమాల(అంజలి) అతనికి మంచి స్నేహితురాలు. తన చుట్టూ ఉన్నవారిని వాడుకుంటూ ఎదగాలనుకునే స్వభావం ఉన్న రత్నాకర్‌కు ఆ ఏరియాలో సాగుతున్న ఇసుక మాఫియా గురించి తెలుస్తుంది. దాని వెనుక స్థానిక ఎమ్మెల్యే దొరస్వామి రాజు(గోపరాజు రమణ) ఉన్నారని తెలుసుకొని అతనికి దగ్గరవుతాడు. కొద్ది రోజుల్లోనే దొరస్వామి కుడిభుజంలా మారతాడు. దొరస్వామి రాజకీయ ప్రత్యర్థి నానాజీ(నాజర్) కూతురు బుజ్జి(నేహా శెట్టి) ప్రేమలో పడి ఆమె కోసం నానాజీకి దగ్గరవుతాడు. ఇలా ఇద్దరి రాజకీయ నాయకులను వాడుకొని రత్నాకర్ ఎమ్మెల్యే అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తనను నమ్మించి మోసం చేసిన రత్నాకర్‌పై దొరస్వామి ఎలా పగ తీర్చుకున్నాడు? పిల్లను ఇచ్చిన మామ నానాజీని రత్నాకర్ ఎందుకు చంపాల్సి వచ్చింది? సొంత భర్తే తన తండ్రిని చంపాడని తెలిసిన తర్వాత బుజ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? రత్నాకర్ ఎదుగుదలకు కారణమైన సొంత మనుషులే అతన్ని చంపేందుకు ఎందుకు కత్తి కట్టారు?(లంకలో ఎవరినైనా చంపాలని ఫిక్స్ అయితే ఆ ఊరి గుహలో ఉన్న అమ్మవారికి మొక్కి చంపాల్సిన వ్యక్తి పేరు అక్కడ రాస్తారు. దాన్నే కత్తి కట్టడం అంటారు) సొంత మనుషులే తనపై కత్తి కట్టారని తెలిసిన తర్వాత రత్నాకర్ ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..విలేజ్ రాజకీయాల నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. గోదావరి ప్రాంతానికి చెందిన ఒక స్లమ్ కుర్రాడు.. రాజకీయాలను వాడుకొని ఎలా ఎదిగాడు? ఎదిగిన తర్వాత అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే ఈ సినిమా కథ. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా.. దాన్ని తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. గత సినిమాల్లో గోదావరి అంటే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉన్నట్లు చూపించేవారు. కానీ ఈ సినిమాలో గోదావరిలో ఉండే మరో కోణాన్ని చూపించారు. విలేజ్ రాజకీయాలు ఎలా ఉంటాయి? నా అనుకునే వాళ్లే ఎలా వెన్నుపోటు పొడుస్తారు? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అయితే రియలిస్టిక్ పేరుతో హింసను ఎక్కువగా చూపించడం ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే సినిమా కథంతా వాస్తవికానికి దూరంగా సాగినట్లు అనిపిస్తుంది. హీరో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన తీరు సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రౌడీలా ప్రవర్తించడం.. ప్రత్యర్థుల దాడి.. హీరోయిన్‌తో ప్రేమలో పడడం.. ఇవన్నీ ఆసక్తికరంగా సాగవు. కత్తికట్టడం గురించి చెబుతూ కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. ఎంట్రీ సీన్‌తో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించాడు. హీరో ఎమ్మెల్యే దొరస్వామి దగ్గరకు వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అయితే కథ పరంగా కాదు కానీ హీరో ఎదిగిన తీరు మాత్రం పుష్ప సినిమాను గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది.ఎవరెలా చేశారంటే.. రత్న అలియాస్ రత్నాకర్ పాత్రలో విశ్వక్ సేన్ ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే భిన్నమైన పాత్ర తనది. యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. గోదావరి యాస మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. అక్కడక్కడ ఆయన ఒరిజినల్ (తెలంగాణ) యాస బయటకు వచ్చింది. రత్నమాల అనే పవర్ఫుల్ పాత్రలో అంజలి చక్కగా నటించింది.బుజ్జిగా నేహాశెట్టి తెరపై అందాలను ప్రదర్శిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. ఐటమ్ సాంగ్‌లో ఆయేషా ఖాన్ అందాలతో ఆకట్టుకుంది. విలన్‌గా యాదు పాత్రలో గగన్ విహారి ఆకట్టుకున్నాడు. నాజర్, సాయి కుమార్ హైపర్ ఆదితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికత పరంగా సినిమా చాలా బాగుంది. యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్విటర్ రివ్యూ
యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. చాన్నాళ్లుగా థియేటర్లు డల్‌గా ఉన్నాయి. దీంతో ఈ మూవీపై అందరూ అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్లో చీఫ్ గెస్ట్‌గా బాలకృష్ణ ప్రవర్తన వల్ల ఈ మూవీ వార్తల్లో నిలిచింది. మరి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఎలా ఉంది? సినిమా చూస్తున్న ప్రేక్షకులు ట్విటర్ లో ఏమంటున్నారు?(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్!)యాక్షన్, కామెడీ మిక్స్ చేసి తీసిన లంకల రత్న పాత్రలో విశ్వక్సేన్ యాక్టింగ్ బాగుందని మూవీ చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. విశ్వక్‌లోని మాస్ కోణాన్ని డిఫరెంట్‌గా చూపించిన సినిమా ఇదని అంటున్నారు. రేసీ స్క్రీన్‌ప్లేతో ల్యాగ్ లేకుండా సినిమాని తీశారని మెచ్చుకుంటున్నారు. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్, మాస్ డైలాగ్స్ బాగున్నాయని ట్వీట్స్ చేస్తున్నారు. సినిమా బోర్ కొట్టనప్పటికీ.. డైరెక్షన్ ఔట్డేటెడ్గా ఉందని అంటున్నారు. విశ్వక్సేన్ నుంచి ఫ్యాన్స్ ఆశించే మాస్ అంశాలు ఇందులో ఎక్కువగా లేకపోవడం మైనస్ అయిందని చెబుతున్నారు. డ్రామా పెద్దగా వర్కవుట్ కాలేదని చెబుతోన్నారు.(ఇదీ చదవండి: మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివకార్తికేయన్? వీడియో వైరల్)ST : #GangsofGodavari pic.twitter.com/sUNH7IikFY— అభి (@Abhiiitweets) May 30, 2024Good first half. Although not a brand new story it has a racy screenplay without any lag, that will definitely work in the films favor. Not a boring moment so far. Second half will be key. #GangsofGodavari— T 🌸 (@PinkCancerian) May 31, 2024#GangsofGodavari good first half 👍... Vishwak sen just killed it🔥— Gautam (@gauthamvarma04) May 31, 2024"aadu modati moodu potlu ammoruki vadilesadu ayya"interval fight🔥but scene process cheskone time ivvatledu. Basically, Pushpa fasttrack chesthe ela undo ala undi. 1st half mottam oka movie teeyochu. Crisp runtime ani kurchunattu unnaru, really bad editing.#GangsofGodavari— Mirugama Kadavula (@Kamal_Tweetz) May 30, 2024Jr tho teeyalsina movie.. inka bagundediViswak’s mass feast #GangsofGodavari 1st half 3.25/5— AN (@anurag_i_am) May 30, 2024 -
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ గ్యాంగ్ స్టర్ మూవీ కాదు: దర్శకుడు
‘గోదావరి అనగానే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉంది అన్నట్టుగా చూపిస్తారు. కానీ నిజానికి మా ప్రాంతంలో కూడా నేరాలు జరుగుతాయి. ప్రాంతాలను బట్టి కాకుండా మనుషులను బట్టి నేరాలు జరుగుతాయి. ఆ ఆలోచన నుంచి పుట్టిన కథే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అని దర్శకుడు కృష్ణ చైతన్య అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ కృష్ణ చైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇒ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కంటే ముందే నేను దర్శకత్వం వహించాల్సిన సినిమాలు ఉన్నా.. అనివార్య కారణాల వల్ల అవి అలస్యం అయ్యాయి. చాలా గ్యాప్ రావడంతో నాలో భయం మొదలైంది. ఇదే విషయాన్ని త్రివిక్రమ్‌తో పంచుకున్నాను. ఆయన సూచనతో విశ్వక్ సేన్‌కి కథ చెప్పగా.. అది ఆయనకు నచ్చడంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొదలైంది.⇒ ఇది కల్పిత కథనే. దీనిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే.. దీని ద్వారా ఒక మంచి కథను చూపించవచ్చు, ఒక మంచి ఎమోషన్ ను చూపించవచ్చు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ విజువల్ ని చూపించవచ్చు అని భావించాను. నా ఆలోచనకు తగ్గట్టుగా సితార లాంటి మంచి నిర్మాణ సంస్థ దొరికింది. కొందరు ఇది గ్యాంగ్ స్టర్ మూవీ అనుకుంటున్నారు. కానీ ఇది గ్యాంగ్ స్టర్ మూవీ కాదు.⇒ విశ్వక్ సేన్ కోసం కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. మొదట ఏదైతే కథ రాసుకున్నామో.. అదే విశ్వక్ తో చేయడం జరిగింది. అయితే విశ్వక్ తెలంగాణలో పెరిగిన వ్యక్తి కాబట్టి.. గోదావరి మాండలికాన్ని సరిగ్గా చెప్పగలడా అని కొంచెం సందేహం కలిగింది. కనీసం రెండు మూడు నెలలు ట్రైనింగ్ అవసరమవుతుంది అనుకున్నాను. కానీ నెల రోజుల లోపులోనే నేర్చుకొని ఆశ్చర్యపరిచాడు.⇒ మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. సంభాషణల పరంగా రెండు చోట్ల మాత్రమే మ్యూట్ వేశారు. అవే మీరు ట్రైలర్ లో చూశారు. ట్రైలర్ కి సెన్సార్ అభ్యంతరాలు ఉండవు. అందుకే ఆ సన్నివేశాల్లోని భావోద్వేగాన్ని బాగా అర్థమయ్యేలా చెప్పడం కోసం ఆ సంభాషణలను ట్రైలర్ లో అలాగే ఉంచడం జరిగింది. సినిమాలో మాత్రం ఆ రెండు అభ్యంతరకర పదాలు వినిపించవు.⇒ యువన్ శంకర్ రాజా లాంటి ప్రముఖ సంగీత దర్శకుడితో పని చేయాలంటే మొదట భయపడ్డాను. ఆయన స్థాయికి నా మాట వింటారా అనుకున్నా. కానీ ఆయన మాత్రం తన అనుభవంతో.. నేను కోరుకున్నట్టుగా, సినిమాకి కావాల్సిన అద్భుతమైన సంగీతాన్ని అందించారు.⇒ ఇది నాకు చాలా చాలా ఇష్టమైన కథ. ఆ ఇష్టంతోనే ఈ సినిమా చేశాను. నేను అనుకున్న భావోద్వేగాలు తెరమీద చక్కగా పలికాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మాత్రం హృదయాన్ని హత్తుకుంటాయి.⇒ మహా భారతంలోని "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాట నాకు చాలా ఇష్టం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాటే చెబుతాను. -
హీరోయిన్ని తోసేసిన బాలకృష్ణ.. అందరిముందు మద్యం తాగుతూ!
హీరో బాలకృష్ణ మరోసారి అనుచితంగా ప్రవర్తించారు. స్టేజీపై తన పక్కనే నిలబడి ఉన్న హీరోయిన్ అంజలిని తోసేశారు. అయితే ఆమె తమాయించుకుని నిలబడింది. అదే టైంలో లోపల ఇబ్బందిగా ఉన్నప్పటికీ బయటకు నవ్వుతూ కవర్ చేసింది. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు)విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా మే 31న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన బాలకృష్ణ చాలా చీప్‌గా ప్రవర్తించాడు. హీరోయిన్ అంజలిని నెట్టేయడంతో పాటు అందరిముందు వాటర్ బాటిల్లో మద్యం సేవించారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.బాలకృష్ణని చేసిన దాన్ని ఆయన ఫ్యాన్స్ సమర్ధించుకుంటారేమో! కానీ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం, నోటీ దురుసుతో ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడం గతంలోనూ పలుమార్లు జరిగింది. అమ్మాయిలు, నర్సులపై గతంలో చౌకబారు కామెంట్స్.. 'అక్కినేని తొక్కినేని' అని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అనడం లాంటివి బాలకృష్ణ ఎలాంటి వాడో చెప్పకనే చెబుతుంటాయి. కొన్నాళ్ల ముందు తమిళ హీరోయిన్ విచిత్ర కూడా ఇతడు పేరు చెప్పకుండా తనని ఓసారి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. ఇలా చెప్పుకొంటూ పోతే బాలకృష్ణ బాగోతాలెన్నో!(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
పెళ్లి గురించి హింట్ ఇచ్చేసిన తెలుగు హీరోయిన్.. త్వరలో శుభవార్త
జనాల్లో హీరోయిన్ల పెళ్లిళ్ల మీద ఉన్న ఆసక్తి మరి దేనిపైనా ఉండదేమో? వారు ప్రేమలో పడితే వార్త, పెళ్లి కాకపోతే వార్త, పెళ్లి అయితే వార్త.. ఇలా ఉంటుంది హీరోయిన్ల పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఇలాంటి వాటి వల్ల వాళ్లకి పెద్ద తలనొప్పి అని చెప్పొచ్చు. అయితే ఇలాంటి వాటిని కొందరు ఎంజాయ్ చేస్తారు. కాగా హీరోయిన్ అంజలి కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. కారణం ఈమెకు 36 ఏళ్లు.(ఇదీ చదవండి: పెళ్లయిన మూడు నెలలకే విడిపోతున్నారా? అసలు విషయం ఇది)మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి పెళ్లెప్పుడు అనే ప్రశ్నలు అంజలిని వెంటాడుతూనే ఉన్నాయి. తెలుగు, తమిళంలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు కథానాయికగా చేస్తూనే స్పెషల్ క్యారెక్టర్స్ కూడా చేస్తోంది. కొన్నాళ్ల క్రితం ఈమె రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే న్యూస్ వచ్చింది. అందరూ ఇది నిజమే అనుకున్నారు. కానీ ఇది కేవలం రూమర్ మత్రమే అని తేలింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి రూమర్స్‌పై స్పందించింది.ఇప్పటికే నాకు మూడు నాలుగు పెళ్లిళ్లు చేశారు. మొదట్లో ఇలాంటి వార్తలు విన్నపుడు బాధపడ్డా కానీ ఆ తర్వాత పట్టించుకోవడం మానేశానని అంజలి చెప్పింది. తనపై వస్తున్న వదంతుల కారణంగా నిజంగా ఓ వ్యక్తిని తీసుకెళ్లి ఇతన్నే పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పినా ఇంట్లో ఎవరూ నమ్మరని చెప్పుకొచ్చింది. తను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని కానీ దానికి చాలా టైమ్ ఉందని క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం నటిగా బిజీగా ఉన్నానని ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే మూవీస్ చేస్తానని మాటిచ్చింది.(ఇదీ చదవండి: హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?) -
మందేసి హీరోయిన్ అంజలిని స్టేజ్ పై తోసేసిన బాలకృష్ణ
-
ఇండస్ట్రీ నుంచి పంపించేస్తామన్నారు: విశ్వక్ సేన్
‘‘నిజాయతీగా పని చేసి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ లాంటి మంచి సినిమా తీశాం. అందుకే ఈ మూవీపై చాలా నమ్మకంగా ఉన్నాం. అందరూ కుటుంబంతో కలిసి రావొచ్చు. సినిమా చూశాక రెండు మూడు రోజుల పాటు ప్రేక్షకుల మనసుల్లోనే ఉంటుంది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా, నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఐదేళ్ల క్రితం మార్చి 31వ తేదీనే నా ‘ఫలక్‌నుమా దాస్’ రిలీజ్ అయ్యింది. నేనీ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆ సినిమా.. ఆదరించిన ప్రేక్షకులే. నా కెరీర్ ఆరంభంలో ‘ఇలాంటి యాటిట్యూడ్ ఇండస్ట్రీలో పనికి రాదు.. తొక్కేస్తారు.. పంపించేస్తారు’ అన్నారు. అయినా నా క్యారెక్టర్ మార్చుకోలేదు. ఐదేళ్లుగా నన్ను సపోర్ట్ చేస్తున్న ఇండస్ట్రీకి, దర్శక–నిర్మాతలకు, ముఖ్యంగా నా ఫ్యాన్స్‌కి థ్యాంక్స్. ఇప్పటికే ఐదేళ్లు గడిచిపోయాయి.మరో ఐదేళ్లు ఫైనల్.. కాల్చిపడేస్తా మొత్తం. రత్నలాంటి పాత్ర చేయాలన్నది నా కల. అలాంటి కథతో వచ్చిన కృష్ణ చైతన్యకి థ్యాంక్స్. నేను ఇప్పటి వరకూ పనిచేసిన నిర్మాతల్లో నాగవంశీ బెస్ట్’’ అన్నారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూ– ‘‘మా అమ్మానాన్నల ఆశీస్సుల వల్లే ఇక్కడ ఉన్నాను. మా గురువు త్రివిక్రమ్‌గారే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి మూలం. ఆయన వల్లే ఈ సినిమా మొదలైంది. నన్ను నమ్మి ఈ సినిమా తీసిన నిర్మాతలు చినబాబు, నాగవంశీ, సాయి సౌజన్యగార్లకు కృతజ్ఞతలు. బుజ్జిగా నేహాశెట్టి, రత్నమాలగా అంజలి పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.విశ్వక్ సేన్ అద్భుతంగా నటించాడు. తను చేసిన రత్న పాత్ర ప్రేక్షకుల్ని నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.. భయపెడుతుంది’’ అన్నారు. సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘ఈ నెల 31 తర్వాత విశ్వక్ సేన్ గురించి మాట్లాడుకుంటే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి ముందు, తర్వాత అని మాట్లాడు కుంటారు. నట విశ్వరూపం చూపించాడు. సినిమా చూశాక నిజంగా కృష్ణ చైతన్య తీశాడా? అనిపించింది. ఈ మధ్య కాలంలో ఇంత మంచి ఇంటెన్స్ మూవీ రాలేదు’’ అన్నారు. నటి నేహా శెట్టి, నటులు మధునందన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ భామ నేహా అమేజింగ్ లుక్స్
-
షారుక్ బాద్షా.. నేను రాధిక: నేహా శెట్టి
‘‘మనం పోషించిన పాత్రల పేరుతో ప్రేక్షకులు మనల్ని పిలవడం ఏ నటులకైనా గొప్ప ప్రశంస. పోలిక అని కాదు కానీ.. షారుఖ్ ఖాన్‌గారిని బాద్షా అని పిలుస్తారు. డీజే టిల్లు’ చిత్రంలో నేను పోషించిన రాధిక పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నా కెరీర్ ప్రారంభంలోనే రాధిక అని పేరు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది.. దాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అని హీరోయిన్ నేహా శెట్టి అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. నేహా శెట్టి, అంజలి కథానాయికలు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నేహా శెట్టి మాట్లాడుతూ–‘‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ ఒక కుటుంబ ప్రయాణంలా ఉంటుంది. రత్న, రత్నమాల, బుజ్జి పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ మూవీలో 90లలో ధనవంతుల కుటుంబానికి చెందిన పల్లెటూరి అమ్మాయి బుజ్జి పాత్ర చేశా.90లలో సాగే ఈ క్యారెక్టర్ కోసం డైరెక్టర్‌గారు నటి శోభనగారిని రిఫరెన్స్‌గా చూపించారు. బుజ్జి పాత్ర నాకు ఎంతగానో పేరు తెచ్చి పెడుతుంది. అప్పట్లో వాన పాటలంటే శ్రీదేవిగారు గుర్తుకొచ్చే వారు. అంత గొప్ప నటిలాగా ఇప్పుడు నాకు ఎక్కువ వాన పాటల్లో కనిపించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. విశ్వక్ సేన్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. అనుభవం గల నటిగా అంజలిగారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కృష్ణ చైతన్యగారు ఈ మూవీని తెరకెక్కించిన విధానం అద్భుతం. సితార సంస్థలో సినిమా చేయడం సంతోషంగా ఉంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి జోడీగా ఓ సినిమా చేయబోతున్నా’’ అన్నారు. -
విశ్వక్సేన్ ఫ్రెండయ్యాడు.. అందుకే ఏ సీన్లోనూ ఇబ్బందిపడలేదు
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి". కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మే 31వ తేదీన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నేహా శెట్టి చిత్ర విశేషాలను పంచుకున్నారు.తీవ్ర ఎండలో..నేను ఇప్పటివరకు ఎక్కువగా మోడ్రన్ పాత్రలే చేశాను. కానీ బుజ్జి పాత్ర అలా కాదు. అందుకే దానికి తగ్గట్టుగా హోంవర్క్ చేశాను. పైగా మాటల కంటే ఎక్కువగా కళ్ళతోనే భావాలను పలికించే పాత్ర ఇది. విశ్వక్ సేన్ తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. తీవ్ర ఎండలో కూడా షూట్ చేశాడు. మేము మంచి స్నేహితులయ్యాం. అందుకే ఎటువంటి సన్నివేశాల చిత్రీకరణలోనూ ఇబ్బంది పడలేదు. అంజలి నుంచి చాలా నేర్చుకోవచ్చుఅంజలి గారు చాలా సరదాగా ఉంటారు. విషాద సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నేను మౌనంగా కూర్చుంటాను. కానీ ఆమె అలా కాదు. అప్పటివరకు నవ్వుతూ ఉండి, టేక్ కి వెళ్ళగానే పాత్రకి తగ్గట్టుగా మారిపోతారు. అంజలి గారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. గోదావరి పరిసరాల్లో షూటింగ్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాం. రాజమండ్రి ప్రజలు చాలా స్వీట్ పీపుల్. మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు. అక్కడి ఫుడ్ కూడా చాలా బాగుండేది. వడదెబ్బగతేడాది వేసవి నుంచి ఈ సమ్మర్ వరకు సినిమా చిత్రీకరణ జరిగింది. అధిక ఎండ వల్ల ఇబ్బంది పడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఒకసారి రాజమండ్రిలో షూట్ చేస్తున్న సమయంలో మా చిత్ర బృందంలోని పలువురికి వడదెబ్బ కూడా తగిలింది. నన్ను రాధిక అని పిలవడం సంతోషంగా అనిపిస్తుంది. మనం పోషించిన పాత్ర పేరుతో మనల్ని పిలవడం అనేది.. ఏ నటులకైనా గొప్ప ప్రశంస. పోలిక అని కాదు కానీ.. షారుఖ్ ఖాన్ గారిని బాద్షా అని పిలుస్తారు. అలా నేను కెరీర్ ప్రారంభంలోనే రాధిక అని పేరు తెచ్చుకోవడం హ్యాపీ..వాన పాటలకు కేరాఫ్ అడ్రస్ప్రేక్షకుల హృదయాల్లో ఆ పాత్ర అంతటి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. వాళ్ళు అభిమానంతో రాధిక అని పిలవడాన్ని గౌరవంగానే భావిస్తున్నాను. అప్పట్లో వాన పాటలంటే శ్రీదేవి గారు గుర్తుకొచ్చే వారు. అంత గొప్ప నటిలా.. ఇప్పుడు నాకు ఎక్కువ వాన పాటల్లో కనిపించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఒక సినిమా చేయబోతున్నాను. -
రత్నమాల నా కెరీర్లో గుర్తుండిపోతుంది: అంజలి
‘‘నన్ను ఎక్కువగా పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో చూడాలనుకుంటారు. కానీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో నేను చేసిన రత్నమాల పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. ‘ఈ పాత్రకు మీరే న్యాయం చేయగలరు’ అని కృష్ణచైతన్య అన్నారు. ఇంత మంచి పాత్ర చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని అంజలి అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా, నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది.ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘రత్నమాల పాత్ర కోసం ఈ తరహా (మాస్) సంభాషణలు నా నోటి నుంచి రావడం ఇదే మొదటిసారి. చిత్రీకరణ, డబ్బింగ్ సమయంలో కొత్త అనుభూతి పొందాను. రత్నమాల నా సినీ కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది’’ అన్నారు. పెళ్లి గురించి అడిగితే – ‘‘నా పెళ్లికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతానికి నా పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లే’’ అన్నారు అంజలి. ‘‘ప్రస్తుతం ‘గేమ్ చేంజర్’లో ఓ కథానాయికగా చేస్తున్నాను. తెలుగులో మరో సినిమా, తమిళ, మలయాళ సినిమాలు కూడా చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు అంజలి. -
‘రత్నమాల’నా కెరీర్లో గుర్తుండి పోతుంది: అంజలి
ఇంతవరకు నేను అన్ని సినిమాల్లోనూ పక్కింటి అమ్మాయిలా నటించాను. కానీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో రత్నమాల అనే ఓ డిఫరెంట్ రోల్లో నటించాను. ఆహార్యం, నేను పలికే సంభాషణలు కొత్తగా ఉంటాయి. మనసులో ఏది అనుకుంటే అది బయటకు చెప్పే పాత్ర. లుక్స్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను. రత్నమాల నా సినీ కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది’ అని అన్నారు తెలుగు బ్యూటీ అంజలి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా అంజలి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ⇢ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో రత్నమాల అనే మాస్ పాత్ర చేశాను. అలాంటి పాత్ర చేయడం, ఈ తరహా సంభాషణలు నా నోటి నుంచి రావడం ఇదే మొదటిసారి. అసలు ఈ సంభాషణలు నిజంగా సినిమాలో ఉంచుతారా అనుకున్నాను. చిత్రీకరణ, డబ్బింగ్ సమయంలో కొత్త అనుభూతిని పొందాను.⇢ కృష్ణ చైతన్య మొదటిసారి కలిసి ఈ కథ చెప్పినప్పుడు.. ఈ పాత్రకు నన్ను ఎంపిక చేయడానికి కారణం ఏంటని అడిగాను. ఎందుకంటే నన్ను ఎక్కువగా అందరూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రలలో చూడాలి అనుకుంటారు. కానీ ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. అయితే చైతన్య ఏమన్నారంటే.. నాకు అద్భుతంగా నటించే నటి కావాలి, అందుకే మీ దగ్గరకు వచ్చాను, మీరు ఈ పాత్రకు న్యాయం చేయగలరు అన్నారు. ఆయన ఏ నమ్మకంతో చెప్పారో తెలియదు కానీ.. ఇంత మంచి పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది.⇢ ఈ సినిమాలో విశ్వక్ సేన్, నా పాత్రల బంధం స్వీట్ గా ఉంటుంది. మా పాత్రల పేర్లు కూడా ఒకేలా ఉంటాయి. ఆయన రత్నాకర్, నేను రత్నమాల. ఇద్దరినీ రత్న అని పిలుస్తారు. ⇢ రత్నమాల తరహా పాత్రలు నిజ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తారసపడతాయి. నేను అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు చూశాను. దేనిని లెక్క చేయకుండా పైకి రఫ్ గా కనిపిస్తారు.. కానీ వాళ్ళ మనసు మాత్రం చాలా మంచిది. రత్నమాల పాత్రలోకి వెళ్ళడానికి కాస్త సమయం తీసుకున్నాను. లుక్స్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను.⇢ విశ్వక్ నాకు ముందు నుంచి స్నేహితుడు. అందుకే మా మధ్య సెట్ లో మంచి సమన్వయం ఉంటుంది. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు కాబట్టి.. ఎటువంటి సన్నివేశాల్లోనూ మేము నటించడానికి ఇబ్బంది పడలేదు.⇢ దర్శకుడు కృష్ణ చైతన్య మాకు ఏం చెప్పారో అదే తీశారు. ఒక దర్శకుడు ఏం ఆలోచించాడో.. దానిని అలాగే తెరమీదకు తీసుకురావడం అనేది చాలా మంచి లక్షణం. కృష్ణ చైతన్య ఏదైతే రాసుకున్నారో.. దానిని ఇంకా మెరుగ్గా తెరమీదకు తీసుకొచ్చారు.⇢ ప్రస్తుతం తెలుగులో గేమ్ చేంజర్‌తో పాటు తమిళంలో మూడు సినిమాలు, అలాగే మలయాళ సినిమాలు కూడా చేస్తున్నాను.⇢ పెళ్ళి అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. కానీ ఇప్పుడు కాదు. నా పెళ్ళికి ఇంకా సమయం ఉంది. కొంతకాలంగా నా పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లే. -
పెళ్లి కోసం అబ్బాయిని తీసుకెళ్లినా.. ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు: అంజలి
తెలుగు బ్యూటీ అంజలి పెళ్లిపై చాలా రూమర్స్ వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. మొదట్లో ఓ తమిళ హీరోతో పెళ్లి అని పుకార్లు వచ్చాయి. దానిపై అంజలి వివరణ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు ఎలాంటి రూమర్స్ రాలేదు. మళ్లీ ఆమె సినిమాలతో బీజీ అయిన తర్వాత ప్రముఖ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుందనే ప్రచారం జరిగింది. అంతేకాదు త్వరలోనే సినిమాలకు పుల్‌స్టాప్ పెట్టి అమెరికాలో సెటిల్ అవుతుందనే ప్రచారమూ జరిగింది. అయితే వీటిని అంజలి ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. అయినా కూడా ఈ మ్యారేజ్ రూమర్స్ వస్తునే ఉన్నాయి. తాజాగా అంజలి తన పెళ్లిపై వస్తున్న పుకార్లపై స్పందించింది. ‘ఇప్పటికే సోషల్ మీడియా నాకు మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసింది(నవ్వూతూ..). మొదట్లో ఇలాంటి రూమర్స్ వస్తే ఇంట్లో వాళ్లు కంగారు పడేవాళ్లు. కానీ ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ మధ్య నేను పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యాననే పుకారు వచ్చింది. అమెరికాలోనే ఉన్న మా అక్క నాకు కాల్ చేసి..‘పెళ్లి అయిందటగా’ అని అడిగింది. ఏమో మరి నాకే తెలియదు అని చెప్పా(నవ్వుతూ..). నా పెళ్లిపై వచ్చిన రూమర్స్ కారణంగా..నేను ఒక అబ్బాయిని తీసుకెళ్లి ఇతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పినా.. ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు. పెళ్లి అయితే కచ్చితంగా చేసుకుంటా. కానీ ఇప్పుడు కాదు. ప్రస్తుతం నేను సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. పెళ్లి చేసుకుంటే.. పర్సనల్ లైఫ్‌కి కూడా టైమ్ కేటాయించాలి. అందుకే కొంచెం టైమ్ తీసుకొని పెళ్లి చేసుకుంటా. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను’ అని అంజలి చెప్పుకొచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదలకు సిద్ధంగా ఉంది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి మరో హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే 31న విడుదల కాబోతుంది. -
చరిత్రలో మిగిలిపోవాలంతే...
‘మనుషులు మూడు రకాలురా.. నాసి రకం.. రెండోది బోసి రకం.. మూడోది నాణ్యమైన రకం..’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ట్రైలర్. విశ్వక్ సేన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా, అంజలి ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు కృష్ణచైతన్య దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది.ఈ సందర్భంగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని దేవి 70 ఎంఎం థియేటర్లో జరిగింది. ‘‘యువ నాయకుడు రత్నాకర్’, ‘నా ఊళ్లో నాకేంట్రా భయం’, ‘ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే..’ అనే డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. -
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ ఊరమాస్.. ఏకంగా!
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ వచ్చేసింది. 2 నిమిషాల 18 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్‌ని ఊరమాస్ సీన్స్‌తో నింపేశారు. విశ్వక్ సేన్ యాటిట్యూడ్ దగ్గర నుంచి విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో జరిగే రాజకీయాలు, యాక్షన్, రొమాన్స్.. ఇలా అన్ని అంశాల్ని మిక్స్ చేసిన ట్రైలర్ చూస్తుంటేనే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దీనితో పాటు బూతులు కూడా బాగానే దట్టించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో కూడా రెండు చోట్ల ఈ పదాలు వినిపించాయి.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి)ట్రైలర్ చూస్తే పూర్తిగా రస్టిక్ విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' తీసినట్లు క్లారిటీ వచ్చేసింది. రత్నాకర్ అనే కుర్రాడు.. ఊరి రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత జరిగే డ్రామా, ఎత్తుకు పై ఎత్తులు ఇలా ట్రైలర్ అంతా రేసీగా కనిపించింది. మరి సినిమా ఎలా ఉంటుందో మే 31న తెలిసిపోతుంది. ఈ మూవీలో నేహాశెట్టి హీరోయిన్ కాగా, అంజలి కీలక పాత్ర పోషించింది. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. (ఇదీ చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి) -
విశ్వక్ సేన్ యాక్షన్ ఎంటర్టైనర్.. బ్యాడ్ సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఈ చిత్రంలో డీజే టిల్లు భామ నేహాశెట్టి, అంజలి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.'అడవికి గొడ్డలి బ్యాడ్.. కడుపుకి అంబలి బ్యాడ్.. మట్టికి నాగలి బ్యాడ్' అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా రిలీజైన ఈ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ చిత్రం రిలీజ్ తేదీ మరోసారి మారింది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మే 31 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. మొదట ఈనెల 17న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆలస్యంగా వస్తున్న గ్యాంగ్
కాస్త లేట్‌గా థియేటర్స్‌లోకి రానున్నారు గోదావరి గ్యాంగ్. విశ్వక్ సేన్ హీరోగా నటించిన యాక్షన్ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్గా నటించగా, కీలక పాత్రలో అంజలి నటించారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కావాల్సింది.కానీ వాయిదా వేసి, ఈ నెల 31న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా థీమ్ సాంగ్ ‘బ్యాడ్’ లిరికల్ వీడియో నేడు విడుదలవుతోంది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో లంకల రత్నగా విశ్వక్ సేన్, రత్నమాలగా అంజలి, బుజ్జిగా నేహా శెట్టి కనిపిస్తారు. -
మెరుపుతీగలా నేహాశెట్టి.. చూస్తే మెల్ట్ అయిపోతారేమో! (ఫొటోలు)
-
గ్యాంగ్స్ అఫ్ గోదావరి టీజర్ లాంచ్ (ఫోటోలు)
-
లైట్ బ్లూ సారీ లో నటి అంజలి లుక్స్.. ఫోటోలు
-
కుర్రాళ్ళ గుండెల్లో మోత మోగించే పాట విడుదల చేసిన విశ్వక్
టాలీవుడ్ సక్సెస్ఫుల్ హీరో విశ్వక్సేన్ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. రీసెంట్గా ‘గామి’ చిత్రంలో అఘోరా పాత్రలో నటించిన విశ్వక్ ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా ఆయన నటించిన మరో కొత్త చిత్రం విడుదలకు రెడీగా ఉంది. విశ్వక్, నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నుంచి తాజాగా అదిరిపోయే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'మోత మోగిపోద్ది..' అంటూ సాగే మాస్ ఐటెం సాంగ్ నెట్టింట దుమ్మురేపుతుంది. ఈ పాటలో విశ్వక్‌తో అయేషా ఖాన్ తన అందచందాలతో స్టెప్పులేసింది. చంద్రబోస్ రాసిన ఈ పాటకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. రంగస్థలం సినిమాలో 'రంగమ్మా మంగమ్మా' పాటతో మెప్పించిన 'ఎమ్ఎమ్ మానసి' ఇప్పుడు 'మోత మోగిపోద్ది..' అంటూ అదిరిపోయే సాంగ్ పాడింది. ఇటీవలే ఓం భీమ్ బుష్ సినిమాలో ప్రియదర్శి సరసన కనిపించిన అయేషాఖాన్ ఆ సినిమాతో బాగా పాపులర్ అయింది. ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో ఈ ఐటమ్ సాంగ్‌తో మోత మోగిపోయేలా స్టెప్పులు వేసింది. మే 17న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. -
గోదావరి గ్యాంగ్స్ రెడీ
విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం కొత్త విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను మే 17న రిలీజ్ చేయనున్నట్లు శనివారం యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నేహా శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ అంజలి ఓ లీడ్ రోల్లో కనిపిస్తారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. 1960లలో గోదావరి ప్రాంతంలో చీకటి ప్రపంచంలో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన ఓ వ్యక్తి నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఈ సినిమాను ఈ నెల 8న విడుదల చేయాలనుకున్నారు. కానీ పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడం వల్ల మే 17కి వాయిదా వేశారు. -
గామితో హిట్ కొట్టిన విశ్వక్ సేన్.. రెండు నెలల గ్యాప్‌లోనే!
ఇటీవలే టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. గామి మూవీలో అఘోరా పాత్రలో మెప్పించారు. శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చిన గామి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. విద్యాధర్ కాగిత అనే యువ దర్శకుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. క్రౌడ్ ఫండింగ్‌తో మొదలైన గామి.. దాదాపు ఆరేళ్ల పాటు తెరకెక్కించారు. ప్రస్తుతం గామి థియేటర్లలో సందడి చేస్తుండగానే మరో సినిమాతో రెడీ అయిపోయారు విశ్వక్ సేన్. మరో కొత్త సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వక్సేన్, నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమాకు కృష్ణచైతన్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం మే 17న సినిమా విడుదల చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు. కాగా.. పలుసార్లు అనివార్య కారణాలతో వాయిదా పడిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది. Get ready to witness the Most rugged and violent tale from the banks of Godavari! 🔥🌊 #GangsofGodavari to release on 𝗠𝗮𝘆 𝟭𝟳𝘁𝗵 𝟮𝟬𝟮𝟰, worldwide. Meet you in theatres this Summer. #GOGOnMay17th 💥 pic.twitter.com/A8u0RKKJI2 — VishwakSen (@VishwakSenActor) March 16, 2024 -
క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం: నేహా శెట్టి
డీజే టిల్లు, బెదురులంక 2012, రూల్స్ రంజన్ సినిమాలతో ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ నేహా శెట్టి. యూత్ ఆడియెన్స్ లో రాధికగా ఫేమ్ అయ్యింది. కావాల్సినంత క్రేజ్ ఉన్నా...వరుసగా సినిమాలు చేయడం లేదు నేహా శెట్టి. తనకు క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని.. అందుకే వచ్చిన ప్రతి ఆఫర్ ఒప్పుకోవడం లేదని చెబుతుందీ యంగ్ హీహీరోయిన్. మంచి సినిమాలు చేసి, మరింతగా ప్రేక్షకుల ఆదరణ పొందాలని నేహా శెట్టి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా న్యూయార్క్ ఫిలిం అకాడెమీలో 4 నెలల కోర్స్ చేసింది నేహా శెట్టి. నటిగా తనను తాను మెరుగుపర్చుకోవడంలో ఈ కోర్స్ ఎంతో ఉపయోగపడిందని నేహా శెట్టి చెబుతోంది. నేహా శెట్టి మాట్లాడుతూ - నటిగా వైవిధ్యంగా కనిపించాలి, భిన్నమైన క్యారెక్టర్స్ లో నటించాలనే నా ప్రయత్నానికి న్యూయార్క్ ఫిలిం అకాడెమీలో చేసిన కోర్స్ బాగా హెల్ప్ అవుతోంది. ఈ కోర్స్ ద్వారా నేర్చుకున్న విషయాలతో నటిగా మరింత మెరుగయ్యాను. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో బుజ్జి పాత్రలో మిమ్మల్ని ఆకట్టుకుంటాను. అని చెప్పింది. విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మార్చిలో గోదావరి గ్యాంగ్
విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయికగా నటించగా, నటి అంజలి ముఖ్యమైనపాత్రను పోషించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, వెంకట్ ఉప్పుటూరి, ఇన్మమూరి గోపీచంద్ నిర్మించిన ఈ చిత్రం విడుదల తేదీ మారింది. తొలుత డిసెంబరు 8న సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే 2024 మార్చి 8న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ‘‘చీకటి ప్రపంచంలో సాధారణ స్థాయి నుండి ధనవంతుడిగా ఎదిగిన ఓ వ్యక్తి కథతో ఈ చిత్రం రూపొందింది. అతని ప్రయాణంలో రాజకీయ చిక్కులు కూడా ఉంటాయి. ఈ సినిమాలో విశ్వక్ సేన్ గ్రే క్యారెక్టర్లో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మధాడి. -
తగ్గేదేలే అంటూ విశ్వక్ సేన్ పోస్ట్.. మూవీ రిలీజ్ వాయిదా!
యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రంలో నేహాశెట్టి హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. గతంలో విశ్వక్ సేన్ కూడా సినిమా రిలీజ్ తేదీ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ పోస్ట్ కూడా పెట్టారు. అది అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే విశ్వక్ సేన్ అనుకున్నదొకటి.. అయిందొక్కటి అన్న చందంగా మారింది. వచ్చే నెల 8న ఈ మూవీని రిలీజ్ చేయాలని భావించారు. కానీ ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చిన 8న విడుదల చేయనున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. దీంతో వచ్చే నెల మూవీ రిలీజవుతుందని భావించిన విశ్వక్ సేన్ అభిమానులకు నిరాశే ఎదురైంది. అదే కారణమా? అయితే డిసెంబర్ మొదటివారంలో నాని నటించిన హాయ్ నాన్న, నితిన్ మూవీ ఎక్స్ట్రా: ఆర్డినరీమ్యాన్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందువల్లే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాయిదా పడే అవకాశాలున్నాయని కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది. అదే సమయంలో విశ్వక్ సేన్ పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. స్పందించిన నిర్మాత నాగవంశీ విశ్వక్ సేన్ పోస్ట్‌పై నిర్మాత నాగవంశీ స్పందించారు. హీరో నాని, నితిన్‌తో మా బ్యానర్‌కు సత్సంబంధాలే ఉన్నాయని.. ఒకేసారి అన్ని విడుదలైతే పోటీ ఉంటుందని భావించి.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని వాయిదా వేద్దామని నేను అంటానేమోనని విశ్వక్ సేన్ భావించారు. అందువల్లే విశ్వక్ సేన్ అలాంటి పోస్ట్ పెట్టి ఉంటారని అన్నారు. A tale of absolute grit and determination and the rise of a man from rags to riches! 💥💥#GangsofGodavari will arrive in theatres on 8th March, 2024! 🔥🌊 @VishwakSenActor @thisisysr @iamnehashetty @yoursanjali #KrishnaChaitanya @vamsi84 #SaiSoujanya @Venkatupputuri… pic.twitter.com/q5qoqyVi30 — Sithara Entertainments (@SitharaEnts) November 27, 2023 -
తెలుగు యంగ్ హీరోకి గాయం.. పట్టుజారి అలా పడిపోవడంతో!
సినిమా హీరోలు ఎంత జాగ్రత్తగా ఉన్నాసరే షూటింగ్స్‌లో చిన్నచిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అలా ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో గాయపడ్డాడు. సినిమా కోసం రిహార్సల్స్ చేస్తున్న టైంలో ఇది జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం కాస్త బయటపడింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' షోలో వివాదం.. లేడీ కంటెస్టెంట్‌పై పోలీస్ కేసు) యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ చేస్తున్నాడు. గోదావరి ప్రాంతంలో జరిగే యాక్షన్ ఎంటర్టైనర్గా దీన్ని తీస్తున్నారు. రాబోయే డిసెంబరు 8న ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ తేదీకి వస్తుందా రాదా అనేది ఇప్పుడు సందేహంగా మారింది. మరోవైపు కొన్నాళ్ల ముందు ఈ చిత్ర షూటింగ్ రిహార్సల్స్‌లో విశ్వక్ గాయపడ్డాడట. ఓ లారీ పైనుంచి పక్కకి దూకే సీన్ చేస్తున్న టైంలో ఓ బస్తా కాలికి తగలడంతో పట్టుజారి పక్కనే పడిపోయాడు. అయితే ఇందులో భాగంగా విశ్వక్ కాలికి గాయమైందట. ప్రస్తుతం అది తగ్గిపోయిందని, షూటింగ్లో కూడా విశ్వక్ పాల్గొంటున్నాడని తెలిసింది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) -
'గంగమ్మ తల్లిమీద ఒట్టు'.. అలా జరిగిందంటే.. విశ్వక్ సేన్ సంచలన పోస్ట్!
దాస్ కా ధమ్కీ అంటూ ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో విశ్వక్సేన్ మరోసారి థియేటర్లలో అలరించబోతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో విశ్వక్ సేన్ చేసిన పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని ఉద్దేశించి నటుడు విశ్వక్ సేన్ ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ఇబ్బందిపెట్టాలనే చూస్తుంటారని రాసుకొచ్చారు. తాము అనుకున్న తేదీకే సినిమా విడుదల అవుతుందని.. అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. ఇన్‌స్టాలో రాస్తూ..'మనకు బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి ఒక్కడూ గేమ్ మారుద్దాం అనుకుంటాడు. ఈ సినిమా కోసం ప్రతి ఫ్రేమ్‌లో ప్రాణం పెట్టి పని చేసి చెప్తున్నా. డిసెంబర్ 8న వస్తున్నా. హిట్, ఫ్లాప్, సూపర్‌హిట్, అట్టర్ ఫ్లాప్ అనేది మీ నిర్ణయం. ఆవేశంతోనో, అహంకారంతోనో తీసుకున్న నిర్ణయం కాదు ఇది. తగ్గే కొద్దీ మనల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తుంటారని నాకిప్పుడు అర్థమైంది. డిసెంబర్ 8 శివాలెత్తిపోద్ది. గంగమ్మ తల్లిపై నా ఒట్టు. మహాకాళి మాతో ఉంది. డిసెంబర్లో కనుక మా సినిమా విడుదల కాకపోతే ఇకపై నన్ను ప్రమోషన్స్‌లో కూడా చూడరు' అంటూ విశ్వక్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కాగా.. డిసెంబర్ 8న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రిలీజ్ కానుంది. అయితే అదే రోజు నితిన్ ‘ఎక్స్ట్రా’, వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సైతం రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. మరీ ఆ చిత్రాలను దృష్టిలో పెట్టుకుని ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ని వాయిదా వేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని.. ఈ విషయంపైనే విశ్వక్ అసహనానికి లోనయ్యారని వార్తలు వస్తున్నాయి. అందువల్లే ఈ పోస్ట్ పెట్టినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. -
యంగ్ హీరోతో హనీరోజ్ రొమాన్స్.. వైరల్ అవుతున్న న్యూస్
బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాతో టాలీవుడ్లో క్రేజీ గుర్తింపు తెచ్చుకున్న హనీరోజ్ యూత్ గుండెళ్లో గ్లామర్ ముద్ర వేశారు. తన గ్లామర్‌తో కుర్రకారు మతిపోగొడుతోన్న ఈ మలయాళ బ్యూటీ తన సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంటుంది. ‘వీరసింహారెడ్డి’ ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఆమెకు చాలా సినిమా అవకాశాలు వచ్చినా అవన్నీ అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం కావడంతో చాలా వరకు రిజెక్ట్ చేసింది. తాజాగా పాన్ ఇండియా మూవీ ‘రాచెల్’లో హనీరోజ్‌నే ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. (ఇదీ చదవండి: పెళ్లికి ముందు కూడా నరకం చూశా.. రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్) తాజాగా ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఐటమ్ సాంగ్‌కు గ్రీన్ ఇచ్చినట్లు సమాచారం. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా ఉన్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌కు ఈ హాట్ బ్యూటీ జతకడితే సినిమాకు భారీ ప్రమోషన్ దక్కడం ఖాయం అని తెలుస్తోంది. పాటలో తన హాట్ హాట్ ఫిజిక్‌తో దుమ్ములేపడం గ్యారెంటీ అని పలువురు చెప్పుకొస్తున్నారు. ఈ పాట కోసం ఆమె ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అంత మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఈ విషయాన్ని 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మేకర్స్ అధికారికంగా తెలపాల్సి ఉంది. -
Gangs Of Godavari: విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ స్టిల్స్
-
రొమాంటిక్ సాంగ్.. స్టేజీపైనే రెచ్చిపోయారు!
సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు దర్శకనిర్మాతలు ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నారు. ఏం చేయడానికైనా సరే వెనకాడట్లేదు. ఒకప్పడు ఈవెంట్ ఏర్పాటు చేసి సినిమా గురించి పబ్లిసిటీ చేసేవాళ్లు. ఇప్పుడు కాలేజీల్లో సాంగ్ రిలీజ్ లాంటివి చేస్తున్నారు. అలా విశ్వక్ సేన్ కొత్త మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లోని పాటని తాజాగా రిలీజ్ చేశారు. అయితే విశ్వక్-నేహా స్టేజీపై ఈ సాంగ్‌కి డ్యాన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. (ఇదీ చదవండి: 'ఖుషి' ఈవెంట్లో విజయ్ వింత డ్రస్.. ధరెంతో తెలుసా?) 'సుట్టంలా సూసి' అనే రొమాంటిక్ సాంగ్ తాజాగా హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్లో రిలీజ్ చేశారు. ఈ వేడుకలో హీరోహీరోయిన్ విశ్వక్ సేన్, నేహాశెట్టితోపాటు చిత్రబృందం అంతా పాల్గొంది. అయితే ఈ పాటకు స్టేజీపై డ్యాన్స్ చేసిన విశ్వక్-సేన్.. సినిమాలో ఏ స్టెప్పులైతే ఉన్నాయో.. వాటినే రీక్రియేట్ చేశారు. నేహా చీరని విశ్వక్ నోటితో పట్టుకుని వేసిన స్టెప్ అయితే అక్కడున్న వారందరినీ అవాక్కయ్యేలా చేసింది. గోదావరి బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న పీరియాడికల్ సినిమా ఇది. క్రూరమైన, నేరపూరితమైన చీకటి సామ్రాజ్యంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదగాలని కోరుకునే వ్యక్తి కథ ఈ చిత్రం. ఈ సినిమాని చైతన్య కృష్ణ దర్శకుడు కాగా, యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. డిసెంబరు 8న థియేటర్లలోకి ఈ మూవీని తీసుకురానున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: చెల్లెలిగా కీర్తి సురేశ్.. చిరు-రజనీ ఇద్దరూ బలైపోయారు!)