సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు దర్శకనిర్మాతలు ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నారు. ఏం చేయడానికైనా సరే వెనకాడట్లేదు. ఒకప్పడు ఈవెంట్ ఏర్పాటు చేసి సినిమా గురించి పబ్లిసిటీ చేసేవాళ్లు. ఇప్పుడు కాలేజీల్లో సాంగ్ రిలీజ్ లాంటివి చేస్తున్నారు. అలా విశ్వక్ సేన్ కొత్త మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లోని పాటని తాజాగా రిలీజ్ చేశారు. అయితే విశ్వక్-నేహా స్టేజీపై ఈ సాంగ్‌కి డ్యాన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.
(ఇదీ చదవండి: 'ఖుషి' ఈవెంట్‌లో విజయ్ వింత డ్రస్.. ధరెంతో తెలుసా?)
'సుట్టంలా సూసి' అనే రొమాంటిక్ సాంగ్ తాజాగా హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్‌లో రిలీజ్ చేశారు. ఈ వేడుకలో హీరోహీరోయిన్ విశ్వక్ సేన్, నేహాశెట్టితోపాటు చిత్రబృందం అంతా పాల్గొంది. అయితే ఈ పాటకు స్టేజీపై డ్యాన్స్ చేసిన విశ్వక్-సేన్.. సినిమాలో ఏ స్టెప్పులైతే ఉన్నాయో.. వాటినే రీక్రియేట్ చేశారు. నేహా చీరని విశ్వక్ నోటితో పట్టుకుని వేసిన స్టెప్ అయితే అక్కడున్న వారందరినీ అవాక్కయ్యేలా చేసింది.
గోదావరి బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న పీరియాడికల్ సినిమా ఇది. క్రూరమైన, నేరపూరితమైన చీకటి సామ్రాజ్యంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదగాలని కోరుకునే వ్యక్తి కథ ఈ చిత్రం. ఈ సినిమాని చైతన్య కృష్ణ దర్శకుడు కాగా, యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. డిసెంబరు 8న థియేటర్లలోకి ఈ మూవీని తీసుకురానున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
(ఇదీ చదవండి: చెల్లెలిగా కీర్తి సురేశ్.. చిరు-రజనీ ఇద్దరూ బలైపోయారు!)
Comments
Please login to add a commentAdd a comment