ఓటీటీలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఎంట్రీ | Gangs Of Godavari Streaming Now On This OTT | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఎంట్రీ

Published Fri, Jun 14 2024 10:25 AM | Last Updated on Fri, Jun 14 2024 10:37 AM

Gangs Of Godavari Streaming Now On This OTT

టాలీవుడ్‌ ప్రముఖ హీరో విశ్వక్ సేన్ నటించిన సినిమా  'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు మే 31న విడుదలైంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే, ఈ చిత్రం విడుదలైన 15రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.

నేడు జూన్‌ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో కూడా అందుబాటులో ఉండటం విశేషం. కృష్ణ చైత‌న్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  నేహా శెట్టి హీరోయిన్‌గా మెప్పిస్తే.. అంజలి కీలక పాత్రలో ప్రేక్షకులను ఫిదా చేసింది.  సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో సంయుక్తంగా ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఈ మూవీని నిర్మించారు. విశ్వక్‌ సేన్‌ ఎనర్జీతో ఈ సినిమాను నడిపించాడు. బాక్సాఫీస్‌ వద్ద రూ.30 కోట్ల గ్రాస్‌ను ఈ చిత్రం రాబట్టినట్లు సమాచారం.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement