Vishwak Sen
-
నా సినిమాపై విమర్శలను అంగీకరిస్తున్నా: అభిమానులకు విశ్వక్ సేన్ లేఖ
మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) ఇటీవలే లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో అభిమానులను అలరించారు. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందే వివాదానికి దారి తీయడంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విషయంలో తీవ్రంగా నిరాశపర్చింది. ఈ నేపథ్యంలో హీరో విశ్వక్ సేన్ తాజాగా ఓ లేఖ విడుదల చేశారు. అభిమానులు ఆశించిన స్థాయిలో సినిమాలు చేయలేకపోయానని ట్విటర్ వేదికగా వెల్లడించారు.విశ్వక్ సేన్ తన లేఖలో రాస్తూ..'అందరికీ నమస్కారం.. ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శలను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణానికి మద్దతిచ్చిన నా అభిమానులకు.. నాకు ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే. కానీ.. ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నా. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్.. మాస్ ఏదైనా సరే అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే.. నన్ను విమర్శించే హక్కు మీకు ఉంది. ఎందుకంటే, నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరే' అని రాసుకొచ్చారు.'అంతేకాకుండా నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు.. నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నా. అంతే కాకుండా, నా మీద విశ్వాసం ఉంచిన నిర్మాతలు, పంపిణీదారులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే నా కథానాయకులు, దర్శకులు, రచయితలు నాకు వెన్నెముకగా నిలిచి.. నన్ను మలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరో బలమైన కథతో ముందుకు వస్తా. నా మంచి, చెడు కాలాల్లో నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం- ఇట్లు మీ విశ్వక్ సేన్' అంటూ లేఖను విడుదల చేశారు.కాగా.. ప్రస్తుతం విశ్వక్సేన్ జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ డైరెక్షన్లో ఫంకీ చిత్రంలో నటిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవ్ అండ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.🙏 With gratitude #vishwaksen pic.twitter.com/c95Jyal2Il— VishwakSen (@VishwakSenActor) February 20, 2025 -
బాయ్ కాట్ లైలా.. ఆ సినిమాపై చూపిన ప్రభావం ఎంత ?
-
Laila Review: ‘లైలా’ మూవీ రివ్యూ
టైటిల్: లైలానటీనటుటు: విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, పృథ్వీ రాజ్ తదితరులునిర్మాణ సంస్థ:షైన్ స్క్రీన్స్నిర్మాత: సాహు గారపాటిదర్శకత్వం: రామ్ నారాయణ్సంగీతం: జేమ్స్ లియోన్సినిమాటోగ్రఫీ:రిచర్డ్ ప్రసాద్విడుదల తేది: ఫిబ్రవరి 14యంగ్ హీరో విశ్వక్ సేన్ జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు. సినిమా హిట్టా, ఫట్టా అన్నది పక్కన పెడితే..ఏడాదికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. ఈ మధ్యే మెకానిక్ రాకీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం విశ్వక్‌ని తీవ్ర నిరాశ పరిచింది. దీంతో ‘లైలా’పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘లైలా’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? విశ్వక్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. (Laila Movie Review)కథేంటంటే..సోను మోడల్(విశ్వక్ సేన్)(Vishwak Sen) హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో బ్యూటీ పార్లర్ రన్ చేస్తుంటాడు. ఆ చుట్టు పక్కల మహిళలకు సోను మోడల్ అంటే విపరీతమైన గౌరవం ఉంటుంది. తన కస్టమర్లను అందంగా రెడీ చేయడమేకాదు..కష్టం వచ్చినప్పడు ఆదుకుంటాడు కూడా. అలా ఓ కస్టమర్‌కి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ఆమె భర్త చేస్తున్న ఆయిల్ బిజినెస్‌కి తన ఫోటో వాడుకోమని సలహా ఇస్తాడు. స్థానిక మహిళల భర్తలతో పాటు అక్కడి ఎస్సై శంకర్(పృథ్వీ)కి సోను అంటే నచ్చదు. మరోవైపు ఓల్డ్ సిటీలోనే మేకల బిజినెస్ చేసే రుస్తుం(అభిమన్యు సింగ్) కూడా సోనుపై పగ పెంచుకుంటాడు. ఓ సారి సోను చేయని నేరంలో ఇరుక్కుంటాడు. పోలీసులతో పాటు రుస్తుం మనుషులు కూడా అతని కోసం గాలిస్తారు. దీంతో సోను గెటప్ మార్చి లైలా(Laila Movie Review)గా మారుతాడు. అసలు సోనుపై వచ్చిన ఆరోపణలు ఏంటి? చేయని నేరంలో సోనును ఇరికించిందెవ్వరు? రుస్తుం సోను కోసం ఎందుకు గాలిస్తున్నాడు? లైలాగా మారిన తర్వాత సోనుకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. జెన్నీ(ఆకాంక్ష శర్మ)తో ప్రేమాయణం ఎలా సాగింది? చివరకు తనను తప్పుడు కేసులో ఇరికించిన వారిని లైలా ఎలా పట్టుకుంది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..‘కర్మలో కారం పొడి ఉంటే పళ్లెంలోకి పరమాన్నం ఎలా వస్తుంది’ అన్నట్లుగా.. కథలోనే కొత్తదనం లేనప్పుడు ఎన్ని ‘గెటప్’లు వేసినా డిఫరెంట్ సినిమా చూశామనే ఫీలింగ్ ఎలా వస్తుంది? లైలా సినిమా పరిస్థితి అలానే ఉంది. హీరోలు లేడి గెటప్పులు వేయడం కొత్త కాదు. కానీ మాస్ ఇమేజ్ ఉన్న విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరో లేడీ గెటప్ అనగానే..ఇదేదో డిఫరెంట్ చిత్రంలా ఉందే అనుకున్నారంతా. తీరా సినిమా చూశాక..‘గెటప్’లోనే కొత్తదనం.. అంతకు మించి ఏమి లేదు. లుక్ పరంగా లైలా కొంతవరకు బాగానే ఉంది కానీ, ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానంలోనే లోపం ఉంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ అందించకుండా రొట్ట రొటీన్ సీన్లతో చాలా ‘జాగ్రత్త’గా కథనాన్ని నడిపించాడు దర్శకుడు. ఆయన రాసుకున్న కామెడీ సీన్లను చూసి నిజంగానే ‘నవ్వుకుంటారు’. డబుల్ మీనింగ్ డైలాగ్స్ విని ‘జబర్దస్త్’లాంటి షోలను గుర్తు చేసుకుంటారు. అడల్ట్ కామెడీ ఉంటే చాలు సినిమా ఆడేస్తుందనుకున్నాడేమో.. ఫోకస్ అంతా దానిపైనే పెట్టాడు. కథలో సీరియస్ నెస్ లేదు..కామెడీలో కొత్తదనం లేదు. ఇక హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది.వాస్తవానికి ఈ సినిమాలో పేరుకే విశ్వక్ సేన్ హీరో. కానీ కీలక సన్నివేశాలన్నీ అభిమన్య సింగ్, సునిశిత్ పాత్రలతోనే ఉంటాయి. అభిమన్యు పాత్రకు విశ్వక్‌తో సమానంగా స్క్రీన్ స్పేస్ ఉంది. సునిశిత్ తెరపై కనిపించేది తక్కువే కానీ... కీలక సన్నివేశాల్లో ఆయనే కనిపిస్తాడు. ఇక హీరోయిన్ని అందాలను ప్రదర్శించడానికి తప్ప.. నటనకు స్కోప్ ఉన్న ఒక్క సీన్ రాసుకోలేదు. ఫస్టాఫ్ అంతా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా సాగుతుంది. సోను మోడల్ బ్యూటీ పార్లర్ పెట్టడానికి గల కారణాన్ని బలంగా చూపించలేకపోయారు. హీరోయిన్‌తో లవ్‌ట్రాక్ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఆయిల్ బిజినెస్, ఎస్సై శంకర్ ఎపిసోడ్ అనీ.. బోరింగ్‌గా సాగుతాయి. లైలా ఎంట్రీతో సెకండాఫ్‌పై కాస్త ఆసక్తి కలుగుతుంది. కానీ ఆ పాత్ర చుట్టు అల్లుకున్న కథ మళ్లీ రోటీన్‌గానే అనిపిస్తుంది. ఒకనొక దశలో లైలా పాత్రలో విశ్వక్‌ని చూడలేకపోతాం. ఇంటర్వెల్ సీన్‌తోనే సెకండాఫ్ ఎలా ఉంటుంది? క్లైమాక్స్ ఏంటనేది అర్థమైపోతుంది. ఫ్యామిలీతో కలిసి చూడలేని విధంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్, అడల్ట్ కామెడీ ఉంటుంది. పోని అది యూత్కైనా నచ్చేలా ఉంటుందా అంటే అదీ లేదు.మదర్ సెంటిమెంట్ రొటీన్‌గానే ఉన్నా .. కొంతవరకు ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. విశ్వక్ ఎప్పటిలాగే తన పాత్ర కోసం బాగానే కష్టపడ్డాడు. సోను మోడల్‌గా, లైలాగా రెండు విభిన్నమైన పాత్రలు పోషించి..తనదైన నటనతో వేరియేషన్ చూపించాడు. లైలా లుక్‌లో బాగున్నా.. నటనలో మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఇక హీరోయిన్ ఆకాంక్ష శర్మ జెన్నీ పాత్రకు ఉన్నంతలో న్యాయం చేసింది. అయితే ఆమెను నటన కంటే అందాల ప్రదర్శనకే ఎక్కువగా వాడేసుకున్నారు. రుస్తుం పాత్రలో అభిమన్యుసింగ్ చక్కగా నటించాడు. అతని కెరీర్లో ఇదొక డిఫరెంట్ పాత్ర. యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఫేమస్ అయిన సునిశిత్.. తన ఒరిజినల్ క్యారెక్టర్ని చేశాడు.కామాక్షి భాస్కర్ల డీ గ్లామర్ రోల్ చేశారు. సురభి ప్రభావతితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.జేమ్స్ లియోన్ సంగీతం జస్ట్ ఓకే. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. నేపథ్య సంగీతం కూడా ఆశించిన స్థాయిలో ఉండదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ఈ సినిమాపై కొందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి: విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది. ఇందులో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో అభిమానులను అలరించనున్నారు. ఈ నేపథ్యంలోనే లైలా మూవీ రిలీజ్‌కు ముందు అభిమానులకు విజ్ఞప్తి చేశారు మన యంగ్ హీరో. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'అందరికీ నమస్తే. ఫైనల్‌గా లైలా విడుదలవుతోంది. కానీ మధ్యలో చాలా అపార్థాలు జరిగాయి. మా టీమ్ తరఫున క్షమాపణలు చెప్పాను మా తప్పు లేకపోయినా. అందరం కోపాలు తగ్గించుకుని.. మిస్ అండర్స్టాండిగ్స్ తగ్గించుకోవాలి. నేను మీలో ఒకడిని. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి పాత్రలు చేయగలను. మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తాం. నేను గెలిస్తే మీరు గెలిచినట్లే. చాలామంది కొత్త నటులు, డైరెక్టర్ లైఫ్ ఈ సినిమాపై ఆధారపడి ఉంది. ఇప్పటికైనా అందరం కలిసి సినిమాను గెలిపిద్దాం. మీ అందరి ఆశీస్సులు కూడా కావాలి' అంటూ వీడియోను పోస్ట్ చేశారు.పృథ్వీ వ్యాఖ్యలతో వివాదం..లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో టాలీవుడ్ నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్స్‌పై లైలా చిత్రబృందం స్పందించింది. హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి క్షమాపణలు చెప్పారు. మా ఈవెంట్లో జరిగినందువల్లే మేము క్షమాపణలు చెబుతున్నట్లు విశ్వక్ సేన్ వెల్లడించారు. తాజాగా నటుడు పృథ్వీ సైతం తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరారు.#laila pic.twitter.com/pc1Mcpq6ho— VishwakSen (@VishwakSenActor) February 13, 2025 -
Laila Movie X Review: ‘లైలా’ మూవీ ట్విటర్ రివ్యూ
మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటించిన తాజా చిత్రం ‘లైలా’(Laila Movie). ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూన్నారు. ‘లైలా సినిమా కథేంటి? ఎలా ఉంది? విశ్వక్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.ఎక్స్‌లో ఈ సినిమాకు మిశ్రమ టాక్ వస్తుంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే..బాగోలేదని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. కథలో కొత్తదనం లేదని.. విశ్వక్ సేన్ తప్ప సినిమా చెప్పుకోవడానికి ఏమి లేదని అంటున్నారు.#LailaMovie విశ్వక్ సేన్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి, చూడడానికి ఏమి లేదు. మరీ ముఖ్యంగా కథ, ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి కాలం నాటి స్టోరి.. స్ర్కీన్ ప్లే.. మ్యూజిక్ సో.. సో.. డైరక్షన్ 👎👎 @VishwakSenActor కష్టం వృథా అయింది… లేడి గెటప్ లో పర్ఫెక్ట్ గా ఉన్నాడు.#Laila - 2/5 pic.twitter.com/q7QK9oqylP— తార-సితార (@Tsr1257) February 14, 2025‘లైలా సినిమాలో విశ్వక్ సేన్ తప్ప చెప్పుకోవడానికి, చూడడానికి ఏమి లేదు. మరీ ముఖ్యంగా కథ ఎప్పుడో పాత చింతకాయ పచ్చడిలా ఉంది. స్క్రీన్‌ప్లే, మ్యూజిక్ కూడా యావరేజ్, విశ్వక్ సేన్ కష్టం వృథా అయిపోయింది. లేడీ గెటప్‌లో విశ్వక్ బాగున్నాడు’ అంటూ ఓ నెటిజన్ 2 రేటింగ్ ఇచ్చాడు. Decent 1st Half, Sonu model killed with the characterization and some decent comedy scenes!! Expecting a huge comedy riot in 2nd Half😂❤️Pure @VishwakSenActor Domination !!#Laila pic.twitter.com/zw8EzBxzZv— Shiva Akunuri (@AkunuriShivaa) February 13, 2025 ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. సోనూ మోడల్ పాత్ర అందరిని ఆకట్టుకుటుంది. కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. సెకండాఫ్‌లో ఎక్కువ కామెడీ ఆశిస్తున్నా. ఇప్పటి వరకు విశ్వక్ సేన్ ఒక్కడే అందరిని డామినేట్ చేశాడు’ అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు.#Laila Roddest movie in #VishwakSen career! Not one positive scene. Cringey comedy scenes, full double and vulgar dialogues and horrendous story. Contender for the worst Telugu movie ever made. How did he agree to this. Epic disaster! 0.25/5 pic.twitter.com/t8xPnnj1hX— AllAboutMovies (@MoviesAbout12) February 14, 2025 విశ్వక్ కెరీర్లో రాడ్ మూవీ లైలా. ఒక్క పాజిటివ్ సీన్ కూడా లేదు. క్రింజ్ కామెడీ సీన్స్, డబుల్ మీనింగ్, వల్గర్ డైలాగ్స్ తప్ప కథేమి లేదు. విశ్వక్ ఈ స్టోరీని ఎలా ఒప్పుకున్నాడో తెలియదు అంటూ మరో నెటిజన్ 0.25 రేటింగ్ ఇచ్చాడు.🙆🙆🙆🙆🙆#Laila is a complete disappointment, lacking a single memorable scene.Total movie 👎Chapri scenes and cringe comedy ULTRA DISASTER MOVIE 😭🤦🙏👎👎 pic.twitter.com/O3h4D4C3id— TollywoodGozzip (@TollywoodGozzip) February 14, 2025 లైలా నిరుత్సాహపరిచింది.గుర్తించుకునేలా ఒక్క సన్నివేశం కూడా లేదు. క్రింజ్ కామెడీ, వల్గర్ సన్నివేశాలు మినహా చెప్పుకోవడానికి ఏమి లేదు. అల్ట్రా డిజాస్టర్ మూవీ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.Pure GUTS! @VishwakSenActor has NAILED the lady getup role, showcasing CLASS ACTING! 🔥🔥🔥🔥🔥 A one-man show, Babu! 👌👌🫡🫡 #Laila #MassKadas pic.twitter.com/eE1hxxuvsV— kiran (@abburi_k) February 13, 2025 విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో అదరగొట్టేశాడు. క్లాస్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. లైలా కంప్లీట్‌గా విశ్వక్ వన్ మ్యాన్ షో. సినిమా బాగుంది అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.#Laila - A clueless film where everything from writing to direction to music to actors' performances failed. A bad first half followed by a pretty bad second half made the film a forgettable outing for Vishwak Sen and the team. #Laila pic.twitter.com/4ukkOWJ1wR— Prashanth VK 18 (@PrashanthSSMB28) February 14, 2025#Laila - పూర్తిగా దారి తప్పిన సినిమా 2/5 లైలా అనే సినిమా కథా రచన నుండి దర్శకత్వం, సంగీతం, నటుల అభినయం వరకు ప్రతీ అంశంలో విఫలమైంది. సినిమా చూసేంతసేపూ ఏదైనా ఆసక్తికరమైన సన్నివేశం వస్తుందా అని ఎదురుచూసినా, అసలు ఎక్కడా కూడా కథ పట్టుదలగా కొనసాగలేదు.మొదటి భాగం పూర్తిగా అర్ధరహితమైన… https://t.co/UGMETZ3vx2— TollywoodRulz (@TollywoodRulz) February 14, 2025#LailaReview:Positives:• Vishwak Sen’s performance in parts 👍• BGM & a few comedy scenes 👍• Beauty parlour setup 👍Negatives:• Lackluster Direction & Screenplay • Outdated Story• Zero impactful Scenes• Senseless Comedy • Poorly written characters & villains…— Movies4u Official (@Movies4u_Officl) February 13, 2025#LAILA : A DECENT ONE WITH MASS KA DASS OUTSTANDING PERFORMANCE 💥💥🔥🔥🔥❤️🔥❤️🔥Mainly @VishwakSenActor is the BIGGEST PLUS FOR THIS FILM 🎥 ON SCREENS SONGS ARE SUPERB 👌With GOOD PRODUCTION VALUES ❤️🔥❤️🔥❤️🔥💥💥👍👍ENTERTAINMENT WORKED OUT 👍👌Our Rating : 2.75/5 👍👍💥… pic.twitter.com/8r3NAouTk5— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) February 14, 2025 -
చీర, హై హిల్స్ వేసుకొని ఫైట్ చేశా: విశ్వక్ సేన్
‘ఆర్టిస్ట్ గా కొన్ని పాత్రలు చేయాలని ప్రతి నటుడికి ఉంటుంది. భామనే సత్యభామనే, మేడం, చిత్రం భళారే విచిత్రం, రెమో సినిమాలు చూసినప్పుడు ఆర్టిస్టుగా ఇలాంటి గెటప్ చేయాలని ఉండేది. అలాగే ఆడియన్స్ ఇప్పుడు కొత్త కథలని, థీమ్స్ ని కోరుకుంటున్నారు. ఇలాంటి సినిమాలురాక దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతుంది. ఈ జనరేషన్ లో ఒక హీరో అమ్మాయి పాత్ర వేయడం గత 20 ఏళ్లుగా మనం చూడలేదు. ఆ లోటుని భర్తీ చేయాలని ఒక మంచి కథ రావడంతో ‘లైలా’ చేయడం జరిగింది’ అని అన్నారు హీరో విశ్వక్ సేన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘లైలా’. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విశ్వక్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ తొలిసారి ఈ సినిమా కోసం లేడీ గెటప్ వేశాడు. మెకప్కే దాదాపు రెండున్నర గంటల సమయం పట్టేది. మేకప్ ఆర్టిస్ట్ నిక్కీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు.చాలా నేచురల్ గా వచ్చింది. → లైలా క్యారెక్టర్ లో ఫైట్ కూడా చేశాను. చీర, హై హిల్స్ లో ఫైట్ ఎంత కష్టంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. దాన్ని ఒక స్టైల్ లో చేసాము. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.→ లైలా పాత్రతో పాటు సోను మోడల్ క్యారెక్టర్ కూడా అందరికి నచ్చుతుంది. పబ్లిసిటీలో లైలా డామినేట్ చేస్తుంది. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మాత్రం సోను క్యారెక్టర్ ని కూడా చాలా ఇష్టపడతారు. ఫస్ట్ హాఫ్ లో సోను మోడల్ లైఫ్ స్టైల్ ని తన క్యారెక్టర్ ని చాలా ఎంజాయ్ చేస్తారు.→ డైరెక్టర్ కథ చెప్పినంత సేపు విపరీతంగా ఎంజాయ్ చేశాను. ఇలాంటి నవ్వులు జనాలకి ఎందుకు ఇవ్వకూదని అనిపించింది. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ చాలా సీరియస్ గానే వింటాను. కానీ ఈ కథ విన్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. ఇది అడల్ట్ సినిమా కాదు. యూత్ ఫుల్ కంటెంట్‌తో తెరకెక్కించాం. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్.→ ఈ సినిమాకి లిరిక్స్ రాశాను.‘మొహమాటం ఏమీ లేదు. నేను రాస్తాను. బాగుంటే పెట్టుకోండి ’అని డైరెక్టర్ తో చెప్పాను.ఆయనకిపెట్టడం జరిగింది. నాకు రాయడం ఇష్టం.→ లైలా గెటప్ లో నన్ను చూసి ఇంట్లో వాళ్లు చాలా ఎంజాయ్ చేశారు. నవ్వులు వెక్కిరింతలు అన్నీ జరిగాయి. మా అక్క మమ్మీ మ్యాచింగ్ చీరలు కట్టుకొని షూటింగ్‌కి వచ్చారు(నవ్వుతూ..)→ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చిన చిరంజీవి గారు.. లైలాని చూడగానే నాకే కొరకాలనిపిస్తుందని' చెప్పడం బెస్ట్ కాంప్లిమెంట్. లైలా నా కెరీర్ లో గుర్తిండిపోయే సినిమా అవుందనే నమ్మకంతో చేశాను.→ లైలాని బిగ్ స్క్రీన్ పైనే చూడాలి. అయితే లైలా గెటప్ మళ్ళీ వెయ్యాలని ఉంది. ఇందులో సీక్వెల్ కి పనికొచ్చే మంచి క్లిప్ హ్యంగర్ సీన్ ఉంది. మంచి రెస్పాన్స్ వస్తే సెకండ్ వీక్ లో యాడ్ చేస్తాం. -
హీరోని వెతకడం సవాల్‌గా అనిపించింది: రామ్ నారాయణ్
‘‘లైలా’(laila) చిత్రకథని ఇద్దరు ముగ్గురు యువ హీరోలకి చెప్పా. కథ వారికి నచ్చినప్పటికీ లైలా అనే లేడీ గెటప్ వేసేందుకు ఆసక్తి చూపలేదు. ఈపాత్ర చేయడానికి చాలా ధైర్యం కావాలి. అందుకే హీరోని వెతకడం సవాల్‌గా అనిపించింది. నిర్మాత సాహుగారికి ఈ కథ బాగా నచ్చి, విశ్వక్ సేన్‌గారికి చెప్పమని సలహా ఇచ్చారు. విశ్వక్‌గారు కథ వినగానే.. ఇలాంటి లేడీ గెటప్ వేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను.మనం ఈ సినిమా చేస్తున్నాం అన్నారు’’ అని డైరెక్టర్ రామ్ నారాయణ్(Ram Narayan) చెప్పారు. విశ్వక్ సేన్(Vishwak Sen), ఆకాంక్షా శర్మ జంటగా నటించిన చిత్రం ‘లైలా’. సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్ నారాయణ్ మాట్లాడుతూ– ‘‘‘బట్టల రామస్వామి బయోపిక్, దిల్ దివాన, ఉందిలే మంచి కాలం’ సినిమాలకు మ్యూజిక్ చేశాను.దర్శకుడిగా నా తొలి చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్’ (2021) మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత ఓ యునిక్ స్టోరీగా ‘లైలా’ రాశా. హీరో లేడీ గెటప్ వేయడం వంటి చిత్రాలు ఈ మధ్య రాలేదు. ఆ నేపథ్యంలో వస్తున్న వినోదాత్మక చిత్రమిది. ఇందులో సోను మోడల్, లైలాగా విశ్వక్ నటించారు. ఈ చిత్రంలో ఎమోషన్, యాక్షన్, రొమాన్స్... ఇలా అన్నీ ఉన్నాయి’’ అని చెప్పారు. -
పృథ్వీ వ్యాఖ్యలపై సారీ చెప్పిన విశ్వక్ సేన్
-
మీ అందరికీ క్షమాపణలు.. మా సినిమాతో అతనికి సంబంధం లేదు: విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా లైలా టీమ్ హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈవెంట్లో టాలీవుడ్ నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. దీంతో ఆయన చేసిన కామెంట్స్‌పై లైలా చిత్రబృందం స్పందించింది. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి క్షమాపణలు చెప్పారు. మా ఈవెంట్లో జరిగినందువల్లే మేము క్షమాపణలు చెబుతున్నట్లు విశ్వక్ సేన్ వెల్లడించారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన లైలా మూవీ టీమ్ టాలీవుడ్ నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు.విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తి మాట్లాడిన వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. పృథ్వీ మాట్లాడిన విషయం మాకు తెలీదు. ఎందుకంటే నా ఈవెంట్లో జరిగినందువల్లే మీ అందరికీ సారీ చెబుతున్నా. అతను నటించాడు సినిమాలో. రెండు రోజుల్లో మా సినిమా జనాల్లోకి వెళ్తోంది. కానీ నా సినిమాను చంపేయకండి. ఏ వ్యక్తితో మాట్లాడి మేము ఈ విషయాన్ని లాగదలుచుకోవడం లేదు. సపోర్ట్ లైలా అంతే. అతను మాట్లాడిన దానికి.. మా సినిమాకు సంబంధం లేదు. సినిమా ఈవెంట్లో పాలిటిక్స్, నంబర్స్ గురించి మాట్లాడటం తప్పే. చాలా కష్టపడి సినిమా తీశాం. నేను ఈ వివాదం ఇంతటితో ముగిస్తున్నా. మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దంటూ' అభిమానులకు విజ్ఞప్తి చేశారు.నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో బాయ్‌కాట్ లైలా ట్రెండ్ అవ్వడం చూసి షాక్‌కు గురయ్యాం. అది మాకు తెలిసి జరగలేదు. సినిమాని అందరూ సినిమాగా చూడండి. గెస్ట్లుగా వచ్చిన వాళ్లు ఏమి మాట్లాడతారో మాకు తెలీదు' అని అన్నారు.పాలిటిక్స్ నంబర్స్ గురించి మాట్లాడటం తప్పే.. దానికి నేను క్షమాపణ చెప్తున్నా 🙏 - Mass Ka Das #VishwakSen#Laila #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/Ug5vuKKySM— Telugu FilmNagar (@telugufilmnagar) February 10, 2025 -
‘లైలా’ మెగా మాస్ ఈవెంట్ ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)
-
ఇండస్ట్రీ అంతా ఒకటే కాంపౌండ్: చిరంజీవి
‘‘ఇండస్ట్రీలో అందరూ ఒక కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి, మంచి సుహృద్భావ వాతావరణంలో ఉన్నరోజున అందరూ ఆనందంగా, గొప్పగా చెప్పుకుంటారు. అందుకే సాహు, విశ్వక్ సేన్(Vishwak Sen) వచ్చి అడగ్గానే ‘లైలా’(Laila) ఫంక్షన్‌కి వచ్చాను. నాకు తెలిసి ఇకపై ఆ కాంపౌండ్.. ఈ కాంపౌండ్ అంటారని అనుకోవడం లేదు. ఇండస్ట్రీ అంతా ఒకటే కాంపౌండ్ అంతే’’ అని హీరో చిరంజీవి(Chiranjeevi) అన్నారు. విశ్వక్ సేన్, ఆకాంక్షా శర్మ జంటగా నటించిన చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న విడుదల కానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘లైలా మెగా మాస్ ఈవెంట్’కి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ–‘‘విశ్వక్ సేన్ ‘లైలా’ ఫంక్షన్‌కి నేను వెళుతున్నానని చెప్పినప్పుడు కొందరు.. ‘విశ్వక్ సేన్ ఫంక్షన్‌కి వెళుతున్నావా? అతను మన మనిషి కాదు.. అవతల బాలకృష్ణ... అప్పుడప్పుడు తారక్ అంటాడు’ అన్నారు. మనుషులన్నాక వేరే వాళ్లమీద అభిమానం, ప్రేమ ఉండకూడదా? నామీద ఆ΄్యాయత ఉండకూడదా? ఇదేంటిది?. మా ఇంట్లోనే మా అబ్బాయికి(రామ్‌చరణ్) సూర్య అంటే చాలా ఇష్టం.అంత మాత్రాన వాడి ఫంక్షన్స్‌కి నేను వెళ్లకూడదా? వాడితో కలిసి భోజనం చేయకూడదా? వాడితో ఉండకూడదా?. మా హీరోల మధ్య సఖ్యత ఉండదేమో అనుకుని గతంలో అభిమానులు కొట్టుకుని చచ్చేవాళ్లు. వాల్‌పోస్టర్లు చింపుకునేవాళ్లు. నెల్లూరులోని మా కజిన్స్లో ఇద్దరు సొంత అన్నదమ్ములైనా ఒకరు ఎన్టీఆర్, మరొకరు ఏఎన్ఆర్గార్లను అభిమానించే వాళ్లు. వాళ్లిద్దరూ ఓ రోజు రక్తం వచ్చేలా కొట్టుకున్నారు.. అప్పుడు నేను వాళ్ల కంటే చిన్నవాణ్ణి కావడంతో కంగారు పడ్డాను. సినిమా హీరోలంటే బాగానే ఉంటారు.. కానీ వీళ్లు కొట్టుకుని చస్తారేంటి అని ఆరోజే అనిపించింది.నేను ఫిల్మ్ యాక్టర్ అయిన తర్వాత హీరోల మధ్య ఓ సఖ్యత, సుహృద్భావ వాతావరణం ఏర్పాటు చేయాలని బలంగా కోరుకున్నాను. మద్రాస్‌లో హనీ హౌస్‌లో అందరం కలిసి పార్టీలు చేసుకునే వాళ్లం. ఈ రోజుకి నేను, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ అంతా కలిసికట్టుగా ఉంటాం. మా మధ్య ఎలాంటి అరమరికలు లేవు. మన ఇమేజ్, ఫ్యాన్ బేస్ పెరగాలంటే మనం చేసే సినిమాలను బట్టి ఉంటుందే తప్ప మనం దూరంగా ఉండటం వల్ల కాదు. ‘పుష్ప 2’ సినిమా పెద్ద హిట్ అయినందుకు గర్విస్తాను.మన సినిమాలు ఆడొచ్చు, ఆడక పోవచ్చు కానీ, ఇండస్ట్రీలో ఓ సినిమా ఆడిందంటే ప్రతి ఒక్కరూ హర్షించాలి. ఎందుకంటే ఓ సినిమా మీద ఎంతో మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఒక్క హిట్ ఏ హీరోకి వచ్చినా సరే అందరం ఆనంద పడాలి. ఆ వచ్చిన డబ్బు మళ్లీ ఇండస్ట్రీలోనే సినిమాలపైనే పెడతారు నిర్మాతలు. ‘లైలా’ ట్రైలర్ చూసిన తర్వాత విశ్వక్ నిజంగా ఆడపిల్ల అయ్యుంటే గుండెజారి గల్లంతయ్యేది(నవ్వుతూ).. అంతగ్లామర్గా ఉన్నాడు. ‘లైలా’ బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ’’ అన్నారు.విశ్వక్ సేన్ మాట్లాడుతూ–‘‘నా సినిమాని సపోర్ట్ చేయడానికి చిరంజీవిగారు రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని తెలిపారు. డైరెక్టర్ రామ్ నారాయణ్ మాట్లాడుతూ– ‘‘విశ్వక్‌గారు ‘లైలా’ సినిమా కథ ఒప్పుకోవడమే నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్.. ఇది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను’’ అన్నారు. -
హీరో లేడీ గెటప్ వేస్తే హిట్టే: నిర్మాత సాహు గారపాటి
‘‘హీరో లేడీ గెటప్ వేసిన ‘భామనే సత్యభామనే, మేడమ్’ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించి, హిట్స్‌గా నిలిచాయి. ఈ సెంటిమెంట్‌తో ‘లైలా’(Laila) మూవీ కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అలాగే తెలుగులో ఈ తరహా సినిమాలు వచ్చి కూడా చాలా కాలం అయింది. దీంతో ‘లైలా’ మూవీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు నిర్మాత సాహు గారపాటి. విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘లైలా’. ఆకాంక్షా శర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో కామాక్షీ భాస్కర్ల, అభిమన్యు సింగ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో నిర్మాత సాహు గారపాటి(Producer Sahu Garapati) మాట్లాడుతూ– ‘‘యూత్ టార్గెట్‌గా చేసిన ‘లైలా’ని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో హీరో లేడీ క్యారెక్టర్ (లైలా) కూడా చేశారు. ఈ క్యారెక్టర్ కోసం ముందుగా కొందరు హీరోలను అనుకున్నాం. విశ్వక్ ఈ కథ వినగానే ‘ఇది నేను చేయాల్సిన క్యారెక్టర్’ అన్నారు.హీరో తొలి భాగం సోనూగా, రెండో భాగం లైలాగా మారతాడు. లైలాగా హీరో ఎందుకు మారాడు? అనేది ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక ప్రస్తుతం నిర్మాత పరిస్థితి ఏమీ బాగోలేదు. అనుకున్న బడ్జెట్లో సినిమాను నిర్మించగలిగితే ఓకే. ‘లైలా’ని అనుకున్న బడ్జెట్లోనే తీశాం. చిరంజీవిగారితో అనిల్ రావిపూడి డైరెక్షన్లో మేం చేయనున్న నెక్ట్స్ మూవీ జూన్ లేదా జూలైలో ప్రారంభం అవుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో చేస్తున్న సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది’’ అని అన్నారు. -
లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్ సేన్ ‘లైలా’మూవీ HD (ఫొటోలు)
-
విశ్వక్ సేన్ 'లైలా'మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
'మా మధ్య కాంపౌండ్స్ వేయకుర్రి'.. విశ్వక్ సేన్ అదిరిపోయే రిప్లై
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం రోజున అభిమానులను పలకరించనున్నారు. విశ్వక్ విభిన్నమైన పాత్రతో ఫ్యాన్స్‌ను అలరించనున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ అండ్ యాక్షన్ మూవీలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు.అయితే ఈవెంట్లో విశ్వక్ సేన్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. మీరు ఈవెంట్స్కైనా నందమూరి హీరోలను పిలుస్తుంటారు కదా? సడన్‌గా మెగాస్టార్(బాస్)ను పిలిచారు? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి విశ్వక్ సేన్ తనదైన స్టైల్లోనే అదిరిపోయే సమాధానం ఇచ్చారు. మాకు ఉన్నది ఒక్కటే కాంపౌండ్ అని విశ్వక్ సేన్ స్పష్టం చేశారు. మీరే మా మధ్య ఏదేదో సృష్టించవద్దని కోరారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ..' మా మధ్యలో కాంపౌండ్లు వేసేది మీరే. మాకు ఉన్నది ఇంటి కాంపౌండ్ ఒక్కటే. ఇక్కడ కంపౌండ్ లాంటివి ఏం లేవు. ఇండస్ట్రీ అంతా ఒక్కటే. బాస్ ఇజ్ బాస్. ప్రతిసారి వారిని ఇబ్బంది పెట్టి మా ఈవెంట్స్‌కు పిలవం కదా. మా నాన్న గారికి రాజకీయాల నుంచి చిరంజీవితో పరిచయం ఉంది. ఆ టైమ్‌లో మా డాడీ మలక్‌పేట్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నా చిన్నప్పటి నుంచి వారి మధ్య మంచి రిలేషన్ ఉంది. కానీ మీరు వచ్చి ఇక్కడ లేనీ పోనీ కాంపౌండ్స్ వేయకండి. మీరు వచ్చి మధ్యన లేనివీ సృష్టించకండి. ఇండస్ట్రీలో ఎప్పటికైనా మేమంతా ఒక్కటే. మేము మంచి ఉద్దేశంతో సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు వారిని పిలుస్తాం. అంతే తప్ప ఇక్కడ అలాంటివే ఉండవు. మీరొచ్చి దాంటో ఏమీ వేయకుర్రి ' అని కాస్తా గట్టిగానే బదులిచ్చారు. రిపోర్టర్: ఏ EVENT కి అయినా నందమూరి HEROS ని పిలుస్తారు.. ఈసారి #Chiranjeevi గారు ఎందుకు?#VishwakSen: మీరు COMPOUND అనకండి.. నాకున్నది మా ఇంటి COMPOUND మాత్రమే.. #Laila #NandamuriBalakrishna #JrNTR #TeluguFilmNagar pic.twitter.com/a6NQeMjo9j— Telugu FilmNagar (@telugufilmnagar) February 6, 2025 -
విశ్వక్ సేన్ 'లైలా'.. ట్రైలర్ వచ్చేసింది
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం లైలా. ఈ మూవీ లేడీ పాత్రలో అభిమానులను అలరించనున్నాడు మన యంగ్ హీరో. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం రోజున థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో లైలా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది. ట్రైలర్ చూస్తే అభిమానులకు ఫుల్ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఖాయంగా కనిపిస్తోంది. లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్ నటన అద్భుతమైన ఫర్మామెన్స్తో ఆకట్టుకున్నాడు. ఈ ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్న ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఫ్యాన్స్‌ను అలరించనుంది. సోనూ మోడల్‌గా మాస్ కా దాస్ అభిమానులకు లవర్స్ డే రోజున అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు. ఇంకేందుకు ఆలస్యం లైలా కోసం వెయిట్ చేస్తున్న మజ్నులంతా ట్రైలర్ చూసేయండి. The fun and humor will go to the next level with Laila and Sonu Model 💥💥💥The entertaining #LailaTrailer out now ❤🔥▶️ https://t.co/ytb4SlU2qV#Laila GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th 🌹 @RAMNroars #AkankshaSharma @sahugarapati7 @Shine_Screens @leon_james… pic.twitter.com/Pf9QSZOfnn— VishwakSen (@VishwakSenActor) February 6, 2025 -
విశ్వక్ సేన్, విక్రమ్ సినిమాలకు అరుదైన గౌరవం
గత ఏడాదిలో విడుదలైన రెండు సౌత్ ఇండియా సినిమాలకు అరుదైన గౌరవం దక్కింది. 2024లో తెలుగు సినిమా గామి, తమిళ మూవీ తంగలాన్ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డామ్ (International Film Festival Rotterdam) 2025కు ఈ రెండు చిత్రాలు అధికారికంగా ఎంపికయ్యాయి. ఈమేరకు అధికారికంగా ఇరు సినిమాల మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 9వ తేదీ వరకూ జరగనున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రాలను ప్రదర్శించనున్నారు. నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భారత సినిమాలకు చోటు దక్కడంతో నెట్టింటి ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు.విశ్వక్ సేన్ (Vishwak sen), చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా విద్యాధర కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గామి’(Gaami). వి సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు ఆరేళ్లపాటు షూటింగ్ చేసి మరీ ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇందులో విశ్వక్ సేన్ అఘోరాగా నటించడం విశేషం. టాక్ పరంగా పాజిటివ్ వచ్చినప్పటికీ డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులు ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యారు. హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) వింత సమస్యతో బాధపడుతుంటాడు. దీంతో ఆ ప్రాంతం నుంచి నుంచి ఎక్కడికి వెళ్లడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా శంకర్ తనున్న ప్రదేశాన్ని వీడి తన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కాశీకి వెళతాడు. అక్కడ తన సమస్యకు పరిష్కారం దొరికే చోటు హిమాలయాలు అని తెలుస్తుంది. అక్కడ 36 ఏళ్లకు అరుదుగా దొరికే మాలి పత్రాలు కోసం శంకర్ అన్వేషిస్తూ బయలుదేరుతాడు. అదే సమయంలో అతనికి డాక్టర్ జాహ్నవి (చాందిని చౌదరి)తో పరిచయం అవుతుంది. వారిద్దరూ కలిసి చేసిన ప్రయాణంలో ఎదురైన చిక్కులు ఏంటి..? ఎన్నో ప్రమాదాలను దాటుకొని చివరకు వాళ్లు సాధించింది ఏంటి..? అనేదే గామి కథ. జీ5 ఓటీటీ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.తమిళ్ నుంచి తంగలాన్ తమిళ స్టార్ హీరో విక్రమ్, దర్శకుడు పా. రంజిత్ (Pa Ranjith) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం తంగలాన్ (Thangalaan). గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ విజయాన్ని నమోదుచేసింది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. -
'కోయ్ కోయ్ కోడ్‌ని కోయ్' అంటోన్న విశ్వక్ సేన్.. ఈ మాస్ సాంగ్ చూశారా?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak sen) నటించిన తాజా చిత్రం లైలా(Laila). ఈ మూవీ లేడీ గెటప్‌లో అభిమానులను అలరించునున్నారు మాస్ హీరో. ఈ సినిమాకు రామ్ నారయణ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ మూవీలో విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది.ఈ నేపథ్యంలో లైలా మూవీ నుంచి మూడో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓహో రత్తమ్మ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ మాస్ సాంగ్‌కు పెంచల్ దాస్ లిరిక్స్ అందించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ పాటను సింగర్ మధుప్రియ, పెంచల్ దాస్ ఆలపించారు. విడుదలైన కొద్ది గంటల్లోనే మాస్ ఆడియన్స్‌ను తెగ ఊపేస్తోంది ఈ సాంగ్. అయితే ఈ సాంగ్ ఎత్తుగడలో ఈ మధ్య బాగా వైరలైన 'కోయ్ కోయ్ కోడ్‌ని కోయ్' అనే లిరిక్స్ వాడడంతో ఈ సాంగ్ తెగ వైరలవుతోంది.లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్..ఈ మూవీలో సోనూ, లైలా అనే లేడీ పాత్రల్లో ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు విశ్వక్ సేన్. ముఖ్యంగా లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్ లుక్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది. ఇటీవలే సోనూ మోడల్, లైలాగా అభిమానులను పలకరించనున్నాడు. ఇటీవలే లైలా మేకోవర్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఆ లుక్ కోసం ఎంత కష్టపడ్డారో దాదాపు రెండు గంటల పాటు కష్టపడినట్లు వివరించారు. కాగా.. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. Mass vibe shuruuu! 😎Here's the massiest folk number #OhoRathamma from #Laila 🔊🕺💥▶️ https://t.co/DC4OjBYYlmA @leon_james musical Sung by #PenchalDas and #MadhupriyaLyrics by #PenchalDasGRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th 🌹 @RAMNroars #AkankshaSharma… pic.twitter.com/kAZJDM4eCr— VishwakSen (@VishwakSenActor) January 31, 2025 -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (ఫోటోలు)
-
లైలా కోసం ఇంత కష్టపడ్డారా?.. మాస్ కా దాస్ వీడియో చూశారా?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ఆకాంక్షా శర్మ జంటగా నటించిన చిత్రం లైలా( Laila). ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.రెండు పాత్రల్లో విశ్వక్ సేన్..ఈ మూవీలో సోనూ, లైలా అనే లేడీ పాత్రల్లో ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు విశ్వక్ సేన్. ముఖ్యంగా లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్ లుక్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది. తాజాగా తన లుక్ సోనూ మోడల్ నుంచి లైలా ఎలా మారిందో చూశారా? అంటూ ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఆ లుక్ కోసం ఎంత కష్టపడ్డారో మీరు కూడా చూసేయండి.ఆ ఫోటోను వాడకండి..తన లుక్ గురించి ఇటీవల సాంగ్ లాంఛ్ ఈవెంట్లో కూడా మాట్లాడారు. లైలా లుక్‌పై విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీలో తన పాత్ర ముఖ్యంగా అమ్మాయి గెటప్‌లో ఉన్న ఫోటోను దేనికి పడితే దానికి వాడకండి అని అభిమానులను రిక్వెస్ట్ చేశారు. కత్తిలా ఉందని పొగిడి కామెంట్ చేసి అక్కడికి వదలేయండి అంటూ నవ్వుతూ మాట్లాడారు.Here's how #sonumodel transformed to #Laila 💄Meet #Laila in theatres from FEBRUARY 14th ❤️ ▶️ https://t.co/qpfZPFKbuy@RAMNroars #AkankshaSharma @sahugarapati7 @Shine_Screens @leon_james @JungleeMusicSTH @MediaYouwe pic.twitter.com/EzyK4AO9wa— VishwakSen (@VishwakSenActor) January 27, 2025 -
మోనాలిసా.. ఆంటీలతో పోలిక.. ఎంత అన్యాయమన్న విశ్వక్సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైలా. ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలో విశ్వక్.. లైలా అనే లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్స్‌లో అమ్మాయిలకే అసూయ పెట్టేంత అందంగా ముస్తాబయ్యాడు.సాంగ్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్‌కు చేదు అనుభవంశుక్రవారం (జనవరి 24న) ఈ సినిమా నుంచి ఇచ్చుకుందాం బేబీ.. అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో ఓ వ్యక్తి విశ్వక్‌ను పిచ్చి ప్రశ్న అడిగాడు. లైలా గెటప్.. ఇండియా అంతటా ట్రెండ్ అవుతున్న మోసాలిసా అంత అందంగా ఉందని కొందరంటున్నారు. కేపీహెచ్‌బీ (కూకట్పల్లి హౌసింగ్ బోర్డు) ఆంటీలా ఉందని మరికొందరు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని ప్రశ్నించాడు.ఎంత అన్యాయంరా?ఈ ప్రశ్న విని షాకైన విశ్వక్ కొద్ది క్షణాలపాటు నోరు విప్పి మాట్లాడలేకపోయాడు. తర్వాత తేరుకుని.. ఎంత అన్యాయంరా? ఆ పోలికేంటి? అంతర్జాతీయ అందగత్తెను తీసుకొచ్చి కూకట్‌పల్లిలో పెడ్తావా? అని సెటైర్ వేశాడు. హద్దూఅదుపు లేకుండా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఎలా అడుగుతారని పలువురూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలైలా సినిమా విషయానికి వస్తే.. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ కథానాయికగా నటించింది. లియోన్ జేమ్స్ సంగీతం అందించగా సాహు గారపాటి నిర్మించారు. ఈ మూవీ వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.చదవండి: విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వ్యాఖ్యలు.. యూట్యూబర్స్‌పై కేసు నమోదు -
‘లైలా’గా రెడీ కావడానికి రెండు గంటలు పట్టేది : విశ్వక్ సేన్
‘‘నా కెరీర్లో యాక్షన్ టచ్‌తో రూపొందిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఫ్యామిలీ ఫిల్మ్ ‘లైలా’. చాలా క్లీన్‌గా ఉంటుంది. ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా కోసం లైలాగా రెడీ కావడానికి రెండు గంటలు పట్టేది. నిజంగా అమ్మాయిలకు హ్యాట్సాఫ్ చెప్పాలి’’ అని హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) అన్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, ఆకాంక్షా శర్మ జంటగా నటించిన చిత్రం ‘లైలా’( Laila). సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘ఇచ్చుకుందాం బేబీ...’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు. పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ పాటని ఆదిత్య ఆర్కే, ఎంఎం మానసి ఆలపించారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘లైలా’లో మోడల్ సోనూ, లైలా అనే రెండు పాత్రల్లో నటించా. వాలెంటైన్స్ డే కి సింగిల్స్ తమకు ఎవరూ లేరని బాధపడుతుంటారు. ఈ వాలెంటైన్స్ డే కి మీకు లైలా ఉంది. అమ్మాయిలు సింగిల్ అని అనుకుంటే మీకు సోను మోడల్ వున్నాడు.(నవ్వుతూ). మీరంతా ఎంజాయ్ చేస్తారు. ఫిబ్రవరి 14కి కలుద్దాం’ అన్నారు. ‘‘లైలా’ కథ ఇద్దరు ముగ్గురు హీరోలకు చెప్పాను. లేడీ గెటప్ వేయడం అంత ఈజీ కాదు. సినిమా అంటే పిచ్చి ఉంటేనే చేయగలరు. అలాంటి పిచ్చి ఉన్న విశ్వక్ దొరికారు’’ అని రామ్ నారాయణ్ చెప్పారు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. రామ్ కథ చెప్పిన తర్వాత కొందరు హీరోలకు అప్రోచ్ అయ్యాను. లేడి క్యారెక్టర్ ని చేయగలుగుతామా లేదా అనుకునే టైంలో విశ్వక్ ఇలాంటి క్యారెక్టర్ కోసం తను ఎదురుచూస్తున్నాని చెప్పి సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇది మంచి క్యారెక్టర్ గా తన కెరీర్ లో నిలిచిపోతుంది. యూత్ ట్యాలెంట్ తో ఈ సినిమా కోసం పని చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు.లిరిక్ రైటర్ పూర్ణచారి మాట్లాడుతూ... ధమ్కి లో ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ నేనే రాశాను, అది వంద మిలియన్స్ కొట్టింది. ఇప్పుడీ ఈ సాంగ్ కి రెండు వందల మిలియన్స్ కి మించి రావాలని కోరుకుంటున్నాను. ఈ పాట రాసే అవకాశం ఇచ్చిన విశ్వక్ గారికి, నిర్మాత సాహు గారికి, డైరెక్టర్ రామ్ గారికి థాంక్ యూ. ఈ సినిమాని పెద్ద చేస్తారని కోరుకుంటున్నాను' అన్నారు -
విశ్వక్ సేన్ 'లైలా' సినిమా పాట విడుదల (ఫొటోలు)
-
ఆ ఫోటోను దేనికి పడితే దానికి వాడకండి: విశ్వక్ సేన్ విజ్ఞప్తి
మాస్ కా దాస్ 'విశ్వక్ సేన్ మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఏడాది లవర్స్ డే కానుకగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్తో అభిమానులను పలకరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ రెండో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇచ్చుకుందాం బేబీ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను విశ్వక్ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీలో తన పాత్ర గురించి మాట్లాడారు. ముఖ్యంగా అమ్మాయి గెటప్‌లో ఉన్న ఫోటోను దేనికి పడితే దానికి వాడకండి అని అభిమానులకు సలహా ఇచ్చారు. పర్లేదు.. కత్తిలా ఉందని పొగిడి కామెంట్ చేసి అక్కడికి వదలేయండి అంటూ నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.#Vishwaksen about #Laila Make-over 😂🖤 pic.twitter.com/2BQYHIq1po— Rebel 🦁 (@Setti_Tweetz) January 23, 2025 -
'మనకు తెల్లగా చేసుడే కాదు.. తోలు తీసుడు కూడా వచ్చు'.. టీజర్ చూశారా?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం లైలా. గతేడాది మెకానిక్ రాకీతో అలరించిన హీరో.. ఈ లవర్స్ డే రోజున ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. లైలా టీజర్ చూస్తుంటే ఫుల్ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లేడీ గెటప్లోనూ ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు. 'మనకు తెల్లగా చేసుడే కాదు.. తోలు తీసుడు కూడా వచ్చు' అనే డైలాగ్ మాస్ కా దాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా టీజర్ చూసేయండి. కాగా.. ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. Welcome to the world of #Laila filled with fun, action and romance ❤🔥The Echipaad #LailaTeaser out now 💥💥▶️ https://t.co/YHl8j4IgAKGRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th @RAMNroars #AkankshaSharma @leon_james @sahugarapati7 @Shine_Screens @JungleeMusicSTH pic.twitter.com/OQ5I4yzaJN— VishwakSen (@VishwakSenActor) January 17, 2025 -
లుక్కు మారింది.. కిక్కు ఖాయం
సంవత్సరం మారింది... లుక్ మార్చి బాక్సాఫీస్ లెక్కలు కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు కొందరు హీరోలు. ఇందు కోసం కథానుగుణంగా గెటప్ మార్చేశారు. ఇలా సరికొత్త లుక్‌లో తమ అభిమాన హీరోలు కనిపించడానికి అభిమానులకు ఓ కిక్కు అని ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక ఈ ఏడాది స్క్రీన్‌పై ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం.సరికొత్త మహేశ్ మహేశ్‌బాబు కెరీర్లో ఇప్పటివరకు ఇరవై ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. అయితే స్క్రీన్‌పై ఎప్పుడూ కనిపించనంత కొత్తగా మేకోవర్ అయ్యే పనిలో పడ్డారు మహేశ్‌బాబు. రాజమౌళి డైరెక్షన్‌లోని కొత్త సినిమా కోసమే మహేశ్‌బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాలోని లుక్, మేకోవర్ కోసం ఆయన జర్మనీలో కొంత సమయం గడిపారు. గురువారం ఈ సినిమా లాంచ్ జరిగింది. కానీ మహేశ్ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి అండ్ టీమ్. ఈ సినిమాలో మహేశ్ లాంగ్ హెయిర్‌తో, కాస్త గెడ్డంతో కనిపిస్తారని ఇటీవల బయటికొచ్చిన ఆయన ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాజా సాబ్ ప్రభాస్ తొలిసారిగా చేస్తున్న హారర్ మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ రెండు గెటప్స్‌లో ఉన్న లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే ప్రభాస్ కుర్చీలో కూర్చున్న ఓ గెటప్ మాత్రం కొత్తగా అనిపిస్తోంది. అలాగే ప్రభాస్ ఇటీవల ఎక్కువగా రగ్డ్ లుక్‌తో, గెడ్డంతోనే కనిపించారు. కానీ ‘రాజాసాబ్’లో మాత్రం క్లీన్ షేవ్‌తో ఓ గెటప్, కాస్త రగ్డ్ లుక్‌తో మరో గెటప్‌లో కనిపిస్తారు.మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. అయితే విడుదల విషయంలో మార్పు ఉండొచ్చనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అలాగే ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే పోలీస్ యాక్షన్ డ్రామా చిత్రం కమిటయ్యారు ప్రభాస్. ఈ చిత్రంలోనూ ప్రభాస్ ఓ డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారని టాక్. ఆ మేకోవర్ కోసం హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులను సంప్రదిస్తున్నారట సందీప్ రెడ్డి వంగా.రగ్డ్ పెద్ది ‘గేమ్ చేంజర్’ మూవీలో రామ్‌చరణ్ క్లీన్ షేవ్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం గుబురు గడ్డం, కాస్త లాంగ్ హెయిర్‌తో రగ్డ్గా కనిపిస్తున్నారు. చరణ్ ఇలా కొత్తగా మేకోవర్ అయ్యింది తన లేటెస్ట్ మూవీ కోసం అని ఊహించవచ్చు. రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.ఈ సినిమా కోసమే రామ్‌చరణ్ కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇందుకోసం రామ్ చరణ్ విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారని తెలిసింది. ఫిజిక్ విషయంలోనే కాదు... హెయిర్ స్టైల్‌తోనూ చరణ్ కొత్తగా కనిపిస్తారు. ‘పెద్ది’ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరిగింది. ఈ షెడ్యూల్లో సెలిబ్రిటీ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పాల్గొని, రామ్‌చరణ్ హెయిర్ స్టైల్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఆఫీసర్ అర్జున్ సర్కార్ రోల్‌కు తగ్గట్లుగా నాని మౌల్డ్ అవుతుంటారు. తాజాగా అర్జున్ సర్కార్ పాత్ర కోసం నాని కొంత మేకోవర్ అయ్యారు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్ 3’. ఈ మూవీలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఈ చిత్రంలో నాని కొన్ని సీన్స్‌లో ఫుల్ వైట్ హెయిర్‌తో కనిపిస్తారని తెలిసింది. అంటే... ఓ సీనియర్ పోలీసాఫీసర్ లెక్క అన్నమాట. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ‘హిట్ 3’ మే 1న రిలీజ్ కానుంది. అలాగే ‘దసరా’ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఫుల్ వయొలెన్స్‌తో సాగే ఈ చిత్రంలో ఓ ఫిరోషియస్ లుక్‌లో నాని కనిపించనున్నారు. ఇందుకోసం నాని ప్రత్యేకంగా మేకోవర్ కావాల్సి ఉంది. ‘హిట్ 3’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత నాని కొత్త మేకోవర్ స్టార్ట్ అవుతుందని ఊహించవచ్చు.రొమాంటిక్ లవ్‌స్టోరీ గతేడాది వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కాస్త మాసీ లుక్‌లో కనిపించారు హీరో రామ్. తన తాజా చిత్రం కోసం రామ్ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ కోసం లాంగ్ హెయిర్ పెంచారు రామ్. అలాగే బరువు కూడా తగ్గారు. యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్‌లోకి వచ్చే చాన్స్ ఉంది. స్పై డ్రామా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో ఫ్యామిలీ మేన్‌లా కనిపించారు విజయ్ దేవరకొండ. అయితే ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో అందుకు భిన్నంగా కనిపించనున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లుగా తెలిసింది. దీంతో పోలీస్ రోల్‌కు తగ్గట్లుగా షార్ట్ హెయిర్‌తో, కరెక్ట్ ఫిజిక్‌తో కనిపించనున్నారట విజయ్. కాగా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో విజయ్ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఈ సీన్స్‌లో విజయ్ లుక్ రగ్డ్గా... చాలా మాస్‌గా ఉంటుందని సమాచారం. ఇలా ఈ చిత్రంలో విజయ్ రెండు గెటప్స్‌లో కనిపించనున్నారట. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీలో మార్పు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.మాస్ సంబరాలు ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాలో సాయి దుర్గా తేజ్ మేకోవర్ చూశారుగా... మాసీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ మాస్ సినిమా కోసం ఫిజికల్‌గా చాలా హార్డ్‌వర్క్ చేశారు సాయి దుర్గాతేజ్. సిక్స్‌ఫ్యాక్ చేశారు. కేపీ రోహిత్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, దాదాపు రూ. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.లేడీ గెటప్‌లో.. మాసీ లుక్స్‌తో కనిపించే విశ్వక్ సేన్ తొలిసారిగా లైలాగా అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. ఓ అబ్బాయి లేడీ గెటప్‌లో నటించాలంటే స్పెషల్‌గా మేకోవర్ అవ్వాల్సిందే. అలా లైలాగా కనిపించడానికి విశ్వక్ మౌల్డ్ అయ్యారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోను, లైలా అనే అమ్మాయి... ఇలా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు విశ్వక్ సేన్. లెనిన్‌గా... ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ హీరోగా చేయాల్సిన నెక్ట్స్ మూవీపై మరో అధికారిక ప్రకటన రాలేదు. అయితే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరితో అఖిల్ ఓ మూవీ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని, ఆల్రెడీ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని, ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే ఈ సినిమా కథ అనంతపురం నేపథ్యంలో సాగుతుందని, లెనిన్ పాత్ర కోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారని తెలిసింది.పీరియాడికల్ వార్ హీరో నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘స్వయంభూ’. పీరియాడికల్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం నిఖిల్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. చెప్పాలంటే గత ఏడాదిగా ఈ లుక్‌నే మెయిన్టైన్ చేస్తున్నారు నిఖిల్. లాంగ్ హెయిర్‌తో, స్ట్రాంగ్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు నిఖిల్. అంతే కాదు... ఈ సినిమా కోసం నిఖిల్ కొన్ని యాక్షన్ సీన్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ కోవలో మరికొందరు హీరోలు కూడా తమ కొత్త సినిమాల కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
విష్వక్ సేన్ 'లైలా' సాంగ్ రిలీజ్.. ప్రత్యేకత ఎంటో తెలుసా..?
మాస్ కా దాస్ 'విష్వక్ సేన్' వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తన కొత్త సినిమా 'లైలా' నుంచి అదిరిపోయే సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లైలా మూవీకి దర్శకత్వం వహించే భాద్యత కొత్తవారికి ఇవ్వడంతో విష్వక్పై ప్రశంసలు వచ్చాయి. దర్శకుడిపై హీరో పెట్టకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ.. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ఇప్పుడు 'సోను మోడల్' అంటూ సాగే ఈ పాటకు విష్వక్ లిరిక్స్ ఇవ్వడం ప్రత్యేకంగా నిలిచింది. అందుకు తగినట్లు నారాయణన్ రవిశంకర్, రేష్మా శ్యామ్ ఆలపించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి లైలా రానుంది. -
చెప్పిన సమయానికే వస్తున్న లైలా.. రిలీజ్ ఎప్పుడంటే?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల మెకానిక్ రాకీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఇతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ లైలా రిలీజ్‌కు రెడీ అవుతోంది. సోమవారం చిత్రయూనిట్ లైలా విడుదల తేదీ ప్రకటించింది. మాస్ కా దాస్‌ను సరికొత్త అవతారంలో చూడనున్నారు. ఈ ప్రేమికుల దినోత్సవానికి లైలా మీ ముందుకు వచ్చేస్తోంది. 2025లో ఫిబ్రవరి 14న లైలా విడుదల కానుంది అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు.రామ్ నారాయణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. ఆకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తోంది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్లోనూ కనిపించనున్నాడు. ఇకపోతే విశ్వక్.. జాతిరత్నాలు డైరెక్టర్ కేవీ అనుదీప్‌తో ఫంకీ సినిమా చేస్తున్నాడు. MASS KA DAS in never seen before AVATARS 😎This Valentine's Day, it's going to be an entertaining blast in theatres 💥#Laila GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th ❤🔥First Rose of Laila out for New Year 2025 🌹#LailaFromFeb14'Mass Ka Das' @VishwakSenActor… pic.twitter.com/ZprdOvH3kN— Shine Screens (@Shine_Screens) December 16, 2024చదవండి: ఆరు ఐటం సాంగ్స్ పెట్టమన్నారు.. ఇప్పటికీ ఏం మారలేదు! -
మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన 'మెకానిక్ రాకీ'
కొత్త సినిమాలు మరీ త్వరగా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా అలానే లేటెస్ట్ తెలుగు మూవీ ఒకటి.. సడన్ సర్ప్రైజ్ అన్నట్లు వచ్చేసింది. మొన్ననే థియేటర్లలో రిలీజైంది. ఇది జరిగిన మూడు వారాలు అయిందో లేదో ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది?యంగ్ హీరో విశ్వక్ సేన్.. వరస సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఈ ఏడాది 'గామి', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రాలు చేశాడు గానీ ఇవి అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో నవంబర్ 22న 'మెకానిక్ రాకీ'గా వచ్చాడు. అయితే ఈ మూవీ సెకండాఫ్ బాగున్నా ఫస్టాప్ మరీ తీసికట్టుగా ఉండటం మైనస్ అయింది. దీంతో ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. క్లారిటీ ఇచ్చిన టీమ్)ఈ క్రమంలోనే ఎలాంటి ప్రకటన లేకుండా ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వీకెండ్ ఎలా టైమ్ పాస్ చేయాలా అని ఆలోచిస్తుంటే 'మెకానిక్ రాకీ' చూస్తే ఎంజాయ్ చేసేయండి. సినిమా విషయానికొస్తే.. రాకీ (విష్వక్) మెకానిక్ గ్యారేజ్‌తో పాటూ డ్రైవింగ్ స్కూల్ నడుపుతుంటాడు. వారసత్వంగా వచ్చిన ఈ గ్యారేజ్‌లో తండ్రితో కలిసి పనిచేస్తుంటాడు. అనుకోని పరిస్థితుల్లో రాకీ తండ్రి చనిపోతాడు.ఇదిలా ఉండగా మాయ (శ్రద్ధ శ్రీనాథ్) మెకానిక్ రాకీ దగ్గర డ్రైవింగ్ స్కూల్లో చేరుతుంది. మధ్యలో రంకిరెడ్డి అనే ఓ కబ్జాదారుడు (సునీల్).. ఆ మెకానిక్ షెడ్డుని కబ్జా చేయబోతాడు. ఈలోగా చనిపోయిన తండ్రి పేరు మీద రూ.2 కోట్లు ఇన్సూరెన్స్ ఉందని, ఆ డబ్బు వస్తుంది కనుక రంకిరెడ్డి మొహాన కొంత కొట్టి ఆ కబ్జా నుంచి తప్పించుకోవచ్చని దారి చూపిస్తుంది మాయ. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మిగతా కథ.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8కు అందుకే వచ్చానన్న గౌతమ్.. ఏడ్చేసిన అవినాష్!) -
జాతిరత్నాలు డైరెక్టర్ తో మాస్ కా దాస్ కామెడీ ఫిల్మ్
-
రెండేళ్ల తర్వాత 'జాతిరత్నాలు' అనుదీప్ కొత్త సినిమా
'జాతిరత్నాలు' సినిమాతో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్.. ఆ తర్వాత తమిళ హీరో శివకార్తికేయన్‌తో 'ప్రిన్స్' అనే మూవీ చేశాడు. ఇది అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు. దీంతో అనుదీప్ మరో మూవీ చేయలేకపోయాడు. మధ్యలో 'మ్యాడ్', 'కల్కి' మూవీస్‌లో అతిథి పాత్రల్లో కనిపించాడు. దాదాపు రెండేళ్ల తర్వాత తన కొత్త మూవీని మొదలుపెట్టాడు.(ఇదీ చదవండి: హాస్పిటల్లో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు)యంగ్ హీరో విశ్వక్ సేన్‌తో అనుదీప్ సినిమా చేయబోతున్నాడు. బుధవారం లాంఛనంగా పూజా కార్యక్రమం జరిగింది. 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తీస్తున్న మూవీకి 'ఫంకీ' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.లెక్క ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో మొదలవ్వాలి. కానీ పలువురు నిర్మాతల దగ్గరకు వెళ్లారు కానీ ఎక్కడా సెట్ కాలేదు. చివరగా సితార సంస్థ దగ్గరకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు లాంఛనంగా మొదలైంది. వచ్చే ఏడాదిలో రిలీజ్ ఉండే అవకాశముంది. ప్రస్తుతం విశ్వక్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు) -
‘సలామ్...పోలీస్’ అంటున్న టాలీవుడ్ స్టార్స్
వెండితెరపై కనిపించే ‘సూపర్ హీరో’ తరహా పాత్రల్లో పోలీస్ పాత్ర గురించి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు సమాజం మేలు కోసం ఓ సూపర్ హీరో చేసే అన్ని సాహసాలు పోలీస్ ఆఫీసర్లు చేస్తుంటారు. ఇలా పోలీసాఫీసర్లకు ‘సలామ్’ కొట్టేలా కొందరు హీరోలు వెండితెరపై పోలీసులుగా యాక్షన్ చేస్తున్నారు. ఆ హీరోలపై కథనం.హుకుమ్...రజనీకాంత్ కెరీర్లో ఈ మధ్యకాలంలో వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్‌గా నిలిచిన చిత్రాల్లో ‘జైలర్’ ఒకటి. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2023లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రజనీకాంత్ మేజర్ సీన్స్‌లో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా, కొన్ని సీన్స్‌లో పోలీస్ డ్రెస్ వేసుకున్న జైలర్‌గా స్క్రీన్‌పై కనిపించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ తెరకెక్కనుంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేశారు నెల్సన్ దిలీప్ కుమార్. ‘జైలర్ 2’కి సంబంధించి రజనీకాంత్ లుక్ టెస్ట్ కూడా జరిగిందని సమాచారం. డిసెంబరు 12న రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా ‘జైలర్’ సీక్వెల్ అప్డేట్ ఉండొచ్చనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. అంతేకాదు... ‘జైలర్’ సినిమా సీక్వెల్‌కు ‘హుకుమ్’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ‘జైలర్’లోని ‘హుకుమ్’ పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ పాటనే సీక్వెల్‌కు టైటిల్‌గా పెడితే ఆడియన్స్‌కు సినిమా మరింత బాగా రీచ్ అవుతుందని, ‘హుకుమ్’ అనే టైటిల్ అన్ని భాషలకు సరిపోతుందని టీమ్ భావిస్తోందట. కళానిధి మారన్ నిర్మించనున్న ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. ఫ్యామిలీ పోలీస్ ‘సూపర్ పోలీస్, సూర్య ఐపీఎస్, ఘర్షణ’ వంటి సినిమాల్లో సీరియస్ పోలీసాఫీసర్‌గా వెంకటేశ్ మెప్పించారు. ‘బాబు బంగారం’ సినిమాలో కామిక్ టైమ్ ఉన్న పోలీస్‌గా వెంకీ నటించారు. అయితే ఫస్ట్ టైమ్ ఫ్యామిలీ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారాయన (‘ది ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి చేసిన రోల్ తరహాలో...) ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాలో మాజీ పోలీసాఫీసర్‌గా వెంకటేశ్ కనిపిస్తారు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌లో వెంకీ ఆన్ డ్యూటీ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారని తెలిసింది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. మీనాక్షీ చౌదరి కూడా ఈ చిత్రంలో ΄ోలీసాఫీసర్గానే కనిపిస్తారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఫస్ట్ టైమ్ పోలీస్‌గా... ప్రభాస్ వంటి కటౌట్ ఉన్న హీరో పోలీస్ ఆఫీసర్‌గా స్క్రీన్‌పై కనిపిస్తే ఆడియన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. తనను పోలీసాఫీసర్‌గా స్క్రీన్‌పై చూపించే అవకాశాన్ని ‘అర్జున్‌రెడ్డి, యానిమల్’ వంటి సినిమాలు తీసిన సందీప్‌రెడ్డి వంగా చేతుల్లో పెట్టారు ప్రభాస్. ‘స్పిరిట్’ టైటిల్‌తో రానున్న ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది. ప్రభాస్ ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్‌గా ఈ చిత్రంలో నటిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ సీరిస్‌లపై భూషణ్ కుమార్ నిర్మించ నున్న ఈ సినిమా 2025లో రిలీజ్ కానుంది. కేసు నంబరు 3 సూపర్‌హిట్ ఫ్రాంచైజీ ‘హిట్’ నుంచి ‘హిట్: ద థర్డ్ కేస్’ రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్‌గా నాని నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకు పూర్తయింది. ‘హిట్ 1, హిట్ 2’ చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కోలనుయే మూడో భాగానికీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘హిట్’ ఫ్రాంచైజీలో తొలి రెండు సినిమాలను నిర్మించిన నాని, ‘హిట్ 3’లో హీరోగా నటిస్తూ, నిర్మిస్తుండటం విశేషం. నాని వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ‘హిట్ 3’ చిత్రం 2025 మే 1న విడుదల కానుంది. బంధూక్ హీరో విశ్వక్ సేన్ తుపాకీ పట్టుకుని చాలాసార్లు స్క్రీన్‌పై కనిపించారు. కానీ రియల్ పోలీస్ ఆఫీసర్‌గా కాదు... అయితే ‘బంధూక్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా కోసం విశ్వక్ సేన్ పోలీసాఫీసర్‌గా ఖాకీ డ్రెస్ ధరించి, తుపాకీ పట్టారు. ఈ పోలీస్ యాక్షన్ డ్రామాకు శ్రీధర్ గంటా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంపద హీరోయిన్. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా 2025లో రిలీజ్ కానుంది. ఎస్ఐ యుగంధర్ ఈ మధ్య కాలంలో పోలీసాఫీసర్ రోల్స్‌కే ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్లున్నారు హీరో ఆది సాయికుమార్. ఆయన హీరోగా విడుదలైన గత ఐదు సినిమాల్లో రెండు పోలీసాఫీసర్ సినిమాలు ఉన్నాయి. ఈలోపు మరో పోలీసాఫీసర్ మూవీ ‘ఎస్ఐ యుగంధర్’కు ఆది సాయికుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఎస్ఐ యుగంధర్‌గా ఓ కొత్త క్యారెక్టరైజేషన్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్ కనిపిస్తారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇందులో మేఘా లేఖ హీరోయిన్గా నటిస్తున్నారు. యశ్వంత్ దర్శకత్వంలో ప్రదీప్ జూలురు నిర్మిస్తున్న ఈ చిత్రం 2025లో రిలీజ్ కానుంది. మర్డర్ మిస్టరీ ఓ మర్డర్ మిస్టరీని చేధించే పనిలో పడ్డారు హీరో త్రిగుణ్ (అరుణ్ అదిత్). స్క్రీన్‌పై ఓ పోలీసాఫీసర్‌గా ఈ కేసును పరిష్కరించే క్రమంలో త్రిగుణ్‌కు ఓ టర్నింగ్ ΄ాయింట్ దొరికింది. ఇది ఏంటీ అంటే...‘టర్నింగ్ ΄ాయింట్’ సినిమా చూడాల్సిందే. హెబ్బా పటేల్, ఇషా చావ్లా, వర్షిణి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కుహాన్ నాయుడు దర్శకుడు. సురేష్ దత్తి నిర్మించారు. ఇలా పోలీసాఫీసర్ రోల్స్‌లో నటించే హీరోలు మరికొంతమంది ఉన్నారు. మరికొందరు స్క్రిప్ట్స్ వింటున్నారని తెలిసింది.– ముసిమి శివాంజనేయులు -
‘మెకానిక్ రాకీ’ మూవీ రివ్యూ
టైటిల్: మెకానిక్ రాకీనటీనటులు: విశ్వక్ సేన్, మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేశ్, హైపర్ ఆది తదితరులునిర్మాణ సంస్థ: ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్నిర్మాత : రామ్ తాళ్లూరిదర్శకత్వం: రవితేజ ముళ్లపూడిసంగీతం: జేక్స్ బిజోయ్సినిమాటోగ్రఫీ: మనోజన్ రెడ్డి కాటసానిఎడిటింగ్: అన్వర్ అలీవిడుదల తేది: నవంబర్ 22, 2024జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇప్పటికే ఈ ఏడాదిలో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షలను అలరించిన విశ్వక్.. ఇప్పుడు మెకానిక్ రాకీ అంటూ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చేశాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు విశ్వక్ తనదైన స్టైల్లో ప్రమోషన్స్ చేయడంతో ‘మెకానిక్ రాకీ’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు (నవంబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..రాకేష్ అలియాస్ రాకీ(విశ్వక్ సేన్) బీటెక్ మధ్యలో ఆపేసి తండ్రి రామకృష్ణ(నరేశ్ వీకే)నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్‌గా జాయిన్ అవుతాడు. కార్లను రిపేర్ చేస్తూ.. మరోవైపు డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. ఆ గ్యారేజీపై రంకిరెడ్డి (సునీల్) కన్ను పడుతుంది. వారసత్వంగా వస్తున్న ఆ గ్యారేజీని కాపాడుకోవడం కోసం రాకీ ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో రాకీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మాయ(శ్రద్ధా శ్రీనాథ్) వస్తుంది. తాను ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తున్నానంటూ రాకీతో పరిచయం చేసుకుంటుంది. రాకీ సమస్య తెలిసి మాయ ఎలాంటి సహాయం చేసింది? గ్యారేజీని కాపాడుకోవడం కోసం రాకీ ఏం చేశాడు? కాలేజీలో ప్రేమించి అమ్మాయి ప్రియ(మీనాక్షి చౌదరి) గురించి రాకీకి తెలిసి షాకింగ్ విషయాలు ఏంటి? ప్రియ కోసం రాకీ ఏం చేశాడు? ప్రియ, రాకీల జీవితాల్లోకి మాయ వచ్చిన తర్వాత ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ సినిమా కథ ప్రారంభ సన్నివేశాలను చూడగానే ఇదొక సాదాసీదా ప్రేమ కథ అనిపిస్తుంది. కాలేజీ ఎపిసోడ్, కామెడీ సీన్లన్ని రొటీన్‌గా సాగుతాయి. ఒకనొక దశలో ఇది కామెడీ లవ్‌స్టోరీ అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో సినిమా జానరే మారిపోతుంది. అప్పటి వరకు కథపై ఉన్న ఓపీనియన్ పూర్తిగా చేంజ్ అవుతుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని తెలిసిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే థ్రిల్లింగ్‌గా అపిపిస్తుంది. ప్రతి పాత్రకు ఒక్కో మలుపు ఉంటుంది. ఆ మలుపు సీన్లను మరింత థ్రిల్లింగ్‌గా చూపించే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ దిశగా ఆలోచించలేదు. కొన్ని ట్విస్టులను ముందే ఊహించొచ్చు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. ఇక ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే.. నేటి తరం యువత చేస్తున్న ఓ పెద్ద తప్పిదాన్ని చూపించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీల అవసరాన్ని, ఆశని ఆసరాగా తీసుకొని కొంతమంది చేస్తున్న ఆన్లైన్ మోసాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా.. దాని చుట్టు అల్లుకున్న కథే రొటీన్‌గా ఉంది. భావోద్వేగాలను పండించడంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. మోతాదుకు మించి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కథనం వాస్తవికానికి దూరంగా సాగితున్నందనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్ కథని మరింత బలంగా రాసుకొని, స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. రాకీ అలియాస్ మెకానిక్ రాకీ పాత్రలో విశ్వక్ సేన్ చక్కగా నటించాడు. అయితే ఈ తరహా పాత్రలు విశ్వక్ చాలానే చేశాడు. అందుకే తెరపై కొత్తదనం కనిపించలేదు. మాయగా శ్రద్ధా శ్రీనాథ్ అదరగొట్టేసింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. మీనాక్షి చౌదరికి చాలా బలమైన పాత్ర దొరికింది. మిడిల్ క్లాస్ యువతి ప్రియగా ఆమె చక్కగా నటించింది. తెరపై శ్రద్ధా, మీనాక్షి ఇద్దరూ అందంగా కనిపించారు. హీరో తండ్రిగా నరేశ్ తనకు అలవాటైన పాత్రలో జీవించేశాడు. సునీల్, హర్షవర్ధన్, రఘు, వైవా హర్షతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
Mechanic Rocky Review: ‘మెకానిక్ రాకీ’ టాక్ ఎలా ఉందంటే..?
మాస్కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఫస్ట్ గేర్, ట్రైలర్స్, సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా నేడు(నవంబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే తెలు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల ప్రీమియర్స్‌తో పాటు ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. మెకానిక్ రాకీ ఎలా ఉంది? విశ్వక్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలు ట్విటర్(ఎక్స్)వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి.ఎక్స్‌లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని, విశ్వక్ తన నటనతో ఇరగదీశారని కొంతమంది అంటుంటే.. ఇది యావరేజ్ మూవీ అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. #MechanicRocky మూవీ1st Half Ok2nd Half Extra Ordinary 👌🔥Far Better Than Recent Small Movies HIT Movie @VishwakSenActor Anna 🎉— Somesh NTR (@NtrFanELURU) November 22, 2024 ఫస్టాఫ్ ఓకే. సెకండాఫ్ అదిరిపోయింది. ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న చిత్రాలతో పోలిస్తే మెకానిక్ రాకీ మూవీ చాలా బెటర్. హిట్ మూవీ విశ్వక్ అన్న అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.#MechanicRocky review బోరింగ్ ఫస్ట్ హాఫ్...ఎంటర్టైన్మెంట్ కూడా లేకపోవటం వల్ల ఓపికకు పరీక్షా పెడుతుంది సెకండ్ హాఫ్ కొంచెం పర్వాలేదు.. సినిమాలో ఉన్న ట్విస్ట్‌లు ఇంప్రెసివ్ గా వున్న స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవటం వల్ల పెద్దగా ఇంట్రస్టింగ్ గా అనిపించదు..మొత్తంగా ఇది చాలా సాదాసీదా…— Cinethop (@cinethop) November 22, 2024 బోరింగ్ ఫస్ట్ హాఫ్...ఎంటర్టైన్మెంట్ కూడా లేకపోవటం వల్ల ఓపికకు పరీక్షా పెడుతుంది .సెకండ్ హాఫ్ కొంచెం పర్వాలేదు.. సినిమాలో ఉన్న ట్విస్టులు ఇంప్రెసివ్ గా ఉన్న స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవటం వల్ల పెద్దగా ఇంట్రస్టింగ్ గా అనిపించదు.. మొత్తంగా ఇది చాలా సాదాసీదా సినిమా అంటూ మరోనెటిజన్ 2.25 రేటింగ్ ఇచ్చాడు.Hittu movie👍 bit worried aftr hearing the title, thinking it might be routine, but u proved me wrong. Great acting. Congrats, @VishwakSenActor. U r the next big thing! #MeenakshiChoudhary 👍 Another nice role @ShraddhaSrinath. Good score @JxBe. My rating: 3/5 #MechanicRocky https://t.co/C8LBDcZP3r— Venkat Kondeti (@venkatpazzo) November 21, 2024#MechanicRocky’s story has the potential to be a good thriller, but the first half is unengaging and tedious. While the second half offers some twists and turns, the pacing and screenplay doesn’t get much engaging. It could have been much more tolerable if the comedy had landed.— Well, It’s Just My Opinion (@WIJMyOpinion) November 22, 2024Hit bomma1 half- average Little bit boring 2 half -mind blowing with twists Overall-3.5/5#MechanicRocky #blockbustermechanicRocky pic.twitter.com/kP16RkNA59— muddapappu (@muddapappu69) November 22, 2024#MechanicRocky Substandard 1st Half!Apart from a few jokes here and there, this film offers nothing interesting so far and irritates at times. The screenplay is outdated. Comedy is over the top for the most part and does not work. Not much of a storyline either. Need a big…— Venky Reviews (@venkyreviews) November 21, 2024💫 #MechanicRockyReview: Some twists Saved the Movie- #Vishwaksen is Good, Tried hard- #MeenakshiChaudhary gets a good role this time- Internal, 2nd half twists are worked well- But lag scenes, predictable screenplay & Somd dull moments #MechanicRocky #Jrntr #Devara #War2 pic.twitter.com/88V3dB1Lid— MJ Cartels (@Mjcartels) November 22, 2024 -
రౌడీలా రెచ్చిపోయిన పృథ్వీ.. విశ్వక్సేన్ దగ్గర అవినాష్ కక్కుర్తి!
ఈసారి మెగా చీఫ్ పోస్టు అందుకోవడం అంత ఈజీ పనిలా లేదు. బిగ్‌బాస్ పెట్టిన పలు టాస్కులు ఆడి గెలిస్తేనే హౌస్‌లో చివరిసారి చీఫ్ అవుతారు. ఇకపోతే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హౌస్‌లో అడుగుపెట్టి అందరితో ఇట్టే కలిసిపోయాడు. మరి షోలో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..చివరి కంటెండర్పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, తేజ మెగా చీఫ్ కంటెండర్లవగా చివరగా నిఖిల్, రోహిణి మాత్రమే మిగిలారు. వీరిలో ఎవర్ని కంటెండర్ చేస్తారో హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. ఈ క్రమంలో గౌతమ్.. చాలామంది వైల్డ్‌కార్డ్స్‌ను పంపించేద్దామని ప్లాన్ చేశారు. అవన్నీ తట్టుకుని రోహిణి ఇక్కడిదాకా వచ్చిందంటూ ఆమెకు సపోర్ట్ చేశాడు. యష్మి, ప్రేరణ, తేజ కూడా రోహిణికే సపోర్ట్ ఇచ్చారు.గ్రూప్ గేమ్‌ను ప్రశ్నించిన గౌతమ్విష్ణుప్రియ నిఖిల్‌కు మద్దతిచ్చింది. ఇక పృథ్వీ.. వైల్డ్ కార్డ్స్‌ను పంపించేయాలని ప్లాన్ చేశామన్నారు. ఓజీ, రాయల్ టీమ్స్‌గా ఉన్నప్పుడు అది జరిగింది. కానీ ఇప్పుడు క్లాన్స్ లేవు కాబట్టి అలాంటి ప్లానింగ్స్ ఏవీ చేయడం లేదని క్లారిటీ ఇస్తూనే నిఖిల్‌కు సపోర్ట్ ఇచ్చాడు. ఇక గ్రూపిజం ఉందని గౌతమ్.. పృథ్వీతో గొడవపడుతుంటే యష్మి, విష్ణుప్రియ, నిఖిల్ వెంటనే దూసుకువచ్చి ఆ మాట నిజమేనని నిరూపించారు. నా వెంట్రుక కూడా పీకలేవుపృథ్వీ.. గౌతమ్ పైపైకి వెళ్తూ వాడు, వీడు అని మాట్లాడాడు. వాడు అని పిలవొద్దని చెప్తున్నా పృథ్వీ వెనక్కు తగ్గలేదు. దీంతో గౌతమ్ నువ్వు నన్నేం పీకలేవన్నాడు. దానికి పృథ్వీ.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు అని మరింత రెచ్చిపోయాడు. ఇలా వీరిద్దరూ చాలాసేపు గొడవపడ్డారు. మెజారిటీ ఓట్లు రోహిణికి రావడంతో ఆమె కంటెండర్ అయింది. విశ్వక్సేన్ ఎంట్రీమెగా చీఫ్ అవడానికి ఒకటి కంటే ఎక్కువ టాస్కులుంటాయన్నాడు బిగ్‌బాస్. అలా మొదటగా పట్టువదలని విక్రమార్కుడు టాస్క్ ఇచ్చాడు. ఇందులో విష్ణుప్రియ 10, యష్మి 20, పృథ్వీ 30, రోహిణి 40, తేజ 50 పాయింట్లు సాధించారు. అనంతరం విశ్వక్సేన్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అవినాష్ కక్కుర్తివస్తూనే రుచికరమైన ఇంటి భోజనం తీసుకువచ్చి అందరితో కలిసి తిన్నాడు. విశ్వక్ కోరిక మేరకు తేజ, అవినాష్ పోల్ డ్యాన్స్ చేశారు. అనంతరం రోహిణి, అవినాష్‌తో కలిసి విశ్వక్ స్కిట్ కూడా చేశాడు. తర్వాత అవినాష్.. విశ్వక్ దగ్గర టీషర్ట్ దోచేశాడు. చివరగా అందరితో కలిసి స్టెప్పులేసి వీడ్కోలు తీసుకున్నాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ షోలో మెకానిక్ రాకీ.. గౌతమ్‌పై రౌడీలా దూసుకొచ్చిన పృథ్వీ
బిగ్‌బాస్ హౌస్‌లోకి మెకానిక్ రాకీ వచ్చేశాడు. ఏకంగా ఆటో వేసుకుని మరీ మెయిన్ గేట్ నుంచి లోనికి దూసుకొచ్చాడు. విశ్వక్ సేన్ ఇలా ఆటోలో హౌస్‌లోకి రావడం చూసి కంటెస్టెంట్లు సర్ప్రైజ్ అయ్యారు. తాను కూడా కంటెస్టెంట్‌గా వచ్చానంటూ హీరో అందర్నీ సరదాగా ఆటపట్టించాడు.మెకానిక్ రాకీ సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చిన ఆయన అందరితో కలిసి ఫన్నీ స్కిట్ చేశాడు. చివరగా హౌస్‌మేట్స్‌తో డ్యాన్సులు కూడా వేశాడు. మరో ప్రోమోలో.. నిఖిల్, రోహిణిలలో ఒకర్ని కంటెండర్‌గా ఎన్నుకోమని బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌పై భారం వేశాడు. ఈ సందర్భంగా గౌతమ్.. చాలామంది హౌస్మేట్స్ కలిసి వైల్డ్‌కార్డ్స్‌ను పంపించేద్దామని ప్లాన్ చేశారు అంటూ వైల్డ్ కార్డ్ రోహిణికి సపోర్ట్ చేశాడు. ఈ క్రమంలో పృథ్వీ, గౌతమ్ గొడవపడ్డారు. పృథ్వీ వాడు వీడంటూ నోరు జారడంతో గౌతమ్... మంచిగా మాట్లాడమని హెచ్చరించాడు. అయినా కూడా పృథ్వీ.. నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ సైగ చేస్తూ అతడి పైపైకి వెళ్లాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆ టైమ్‌లో నేను భయపడ్డాను
‘‘నాకు క్వాలిటీ వర్క్ చేయడం ఇష్టం. అందుకే స్క్రిప్ట్స్ సెలక్షన్లో కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉంటాను. తెలుగులో ‘జెర్సీ’ సినిమా తర్వాత నాకు మదర్ క్యారెక్టర్ ఆఫర్స్ చాలా వచ్చాయి. కానీ ఒకే తరహా పాత్రలు చేయడం ఇష్టం లేక ఒప్పుకోలేదు. ఇక కోవిడ్ సమయంలో కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ పని చేసుకున్నారు. కానీ ఆర్టిస్టులకు ఇది కుదరదు. అందుకే నా కెరీర్ ఎలా ఉంటుందా? అని అందరిలానే నేనూ భయపడ్డాను’’ అని శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘మెకానిక్ రాకీ’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో మాయ అనే పాత్ర చేశాను. నాది మెకానిక్ రాకీ జీవితాన్ని మార్చే పాత్ర. ఈ సినిమా కథ విన్నప్పుడు ఎగ్జైటింగ్‌గా అనిపించడంతో ఒప్పుకున్నాను. ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంలో విశ్వక్ చెప్పిన స్టోరీ నాకు నచ్చలేదు. అందుకే ఆ సినిమా ఒప్పుకోలేదు. ఆ తర్వాత కూడా విశ్వక్ హీరోగా చేసిన రెండు చిత్రాల్లో నటించాల్సింది. కానీ కుదర్లేదు. ఫైనల్‌గా ‘మెకానిక్ రాకీ’ చేశాను. ‘బాహుబలి’, ‘కల్కి 2898 ఏడీ’లాంటి సినిమాలూ చేయాలని ఉంది. ప్రస్తుతం ‘డాకు మహారాజ్’ చేస్తున్నాను. తమిళంలో విష్ణు విశాల్‌తో ఓ సినిమా, ఓ తమిళ వెబ్ సిరీస్ చేస్తున్నాను’’ అని అన్నారు. -
విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
‘మెకానిక్ రాకీ ’లో బర్నింగ్ పాయింట్‌ని టచ్ చేశాం: విశ్వక్ సేన్
‘మెకానిక్ రాకీ సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. ఇందులో గత నాలుగైదు ఏళ్లుగా జరుగుతున్న ఓ బర్నింగ్ పాయింట్‌ని టచ్ చేశాం. అది స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. అసలు ఇంతకాలం ఈ పాయింట్‌ని ఎందుకు టచ్ చేయలేదని ఆడియన్స్ ఫీల్ అవుతారు’అని అన్నారు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ గ్యాంగ్స్ అఫ్ గోదావరి, మెకానిక్ రాకీ రెండు ఒకే సమయంలో చేశాను. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఒక చిన్న భయం ఉండేది. ఈ సినిమాలో మేము చెబుతున్న పాయింట్ తో ఇంకేదైనా సినిమా వస్తుందా అని ఒక చిన్న టెన్షన్ ఉండేది. కచ్చితంగా మెకానిక్ రాకీలో ఆ ఎలిమెంట్ కి ఆడియన్స్ సర్ ప్రైజ్ అవుతారు. ఈ సినిమాలో మేము మెసేజ్ ఇవ్వడం లేదు. అయితే కావాల్సిన వారు అందులో నుంచి మెసేజ్ ని తీసుకోవచ్చు.→ ఇది అన్ ప్రిడిక్టబుల్ మూవీ. ఊహించని విధంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి జోనర్ మారుతుంది. సెకండ్ హఫ్ మొదలైన పది నిమిషాల తర్వాత హై స్టార్ట్ అయిపోతుంది. ఫోన్ వస్తే కట్ చేసి జేబులో పెట్టుకునేంత మేటర్ ఉంది. మేము ట్రైలర్ లో కథని పెద్దగా రివిల్ చేయలేదు. సినిమాలో చాలా కథ ఉంది. అందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.→ రవితేజ చాలా స్మార్ట్ డైరెక్టర్. తను ఈ కథని తీయగలుగుతాడని బలంగా నమ్మాను. అద్భుతంగా తీశాడు. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఫస్ట్ డైరెక్టర్, రైటింగ్ ని మెచ్చుకుంటారు. ఇది ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన సినిమా. ఆ ఇన్సిడెంట్స్ ఏమిటనేది ఆడియన్స్ కి తెలిసిపోతుంది. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు.→ సినిమా లో నేను, మీనాక్షి, శ్రద్దా, నరేష్ గారు, రఘు, సునీల్, అన్నీ పాత్రలు ఈక్వెల్ ఇంపార్టెన్స్ తో ఉంటాయి. ఇది కేవలం హీరో డ్రివెన్ ఫిలిం కాదు. స్క్రీన్ ప్లే రేటింగ్ కి చాలా మంచి పేరు వస్తుంది. → కొత్త సినిమాల విషయాలకొస్తే..లైలా 60 పర్సెంట్ కంప్లీట్ అయ్యింది. సుధాకర్, అనుదీప్ గారి సినిమాలు ప్యార్లల్ గా జరుగుతాయి. కల్ట్ మార్చ్ లో మొదలుపెడతాం. ఏమైయింది నగరానికి 2 రైటింగ్ జరుగుతోంది. -
ఈ సినిమా గిట్ట ఆడకపోతే.. ఇలాంటి మాటలు వద్దు ఇక: విశ్వక్ సేన్ కామెంట్స్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి మాస్ యాక్షన్‌తో వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో హిట్ కొట్టిన యంగ్ హీరో మళ్లీ అలరించేదుకు రెడీ అయ్యాడు. యంగ్ మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం మెకానిక్ రాకీ. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో గుంటూరు కారం భామ మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మేకర్స్ మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వరంగల్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈవెంట్‌కు హాజరైన హీరో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా హిట్ కొట్టినా.. ఫ్లాఫ్ అయినా నేను సినిమాలు తీయడం ఆపేది లేదని ఛాలెంజ్ విసిరారు.విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'మీకు ఎప్పటిలాగే ఛాలెంజ్ విసరాలా? ప్రతి సినిమాకు ఛాలెంజ్ కావాలా? మొన్ననే మెకానిక్ రాకీ సినిమా చూసుకున్నా. ఈ సినిమా గిట్ట ఆడకపోతే షర్ట్ లేకుండా చెక్‌పోస్ట్‌లో తిరుగుతా.. ఫిల్మ్ నగర్లో ఇల్లు ఖాళీ చేస్తా.. ఇకపై ఇలాంటివీ నేను మాట్లాడదలచుకోవట్లేదు. సినిమా హిట్ అయినా.. ఫ్లాఫ్ అయినా నా చొక్కా నా ఒంటిమీదనే ఉంటది.. నా ఇల్లు జూబ్లీహిల్స్లోనే ఉంటది.. నేను ఇంకో సినిమా చూస్తా. అది ఉన్నా.. దొబ్బినా మళ్లీ మళ్లీ సినిమా తీస్తా. పూరి జగన్నాధ్ రాసినట్టు, రవితేజ అన్న చెప్పినట్లు మాకు తెలిసిందల్లా ఒక్కటే.. సినిమా సినిమా. అంతే ప్రాణం పెట్టిన ఈ మూవీ తీసినం' అంటూ మాట్లాడారు. కాగా.. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. -
‘మెకానిక్ రాకీ’ ఐదు నిమిషాలు కూడా బోర్ కొట్టదు : విశ్వక్ సేన్
‘‘నేను పది సినిమాలు చేశాను. ఆ అనుభవంతో చెబుతున్నాను. నా గత సినిమాల కన్నా చాలా భిన్నమైన సినిమా ‘మెకానిక్ రాకీ’. ఐదు నిమిషాలు కూడా బోర్ కొట్టదు. 21న ‘మెకానిక్ రాకీ’ పెయిడ్ ప్రిమియర్స్ వేస్తున్నాం. థియేటర్స్‌కు రండి. నిర్మాత రామ్‌గారు లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. ఆయన కాలర్ ఎగరేసుకునేలా చేస్తాను’’ అని విశ్వక్ సేన్ అన్నారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘మెకానిక్ రాకీ’. మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘మెకానిక్ రాకీ’ మంచి సినిమా’’ అన్నారు. ‘‘విశ్వక్ సేన్ కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు రామ్ తాళ్లూరి. ఈ వేడుకలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడి, ‘మెకానిక్ రాకీ’ విజయాన్ని ఆకాంక్షించారు. -
హన్మకొండలో విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (ఫొటోలు)
-
హైదరాబాద్ : సుదర్శన్ థియేటర్లో ‘దేవర’ మూవీ 50 రోజుల వేడుక (ఫొటోలు)
-
ఆ హీరోయిన్ నో చెప్పడంతో బాధపడ్డా: విశ్వక్సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ సినిమాతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ కాలేజీ ఈవెంట్లో విశ్వక్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సినిమా విశేషాలు చెప్తూనే శ్రద్ధా శ్రీనాథ్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టాడు.ఫలక్‌నుమా దాస్ సినిమాకు శ్రద్ధా శ్రీనాథ్‌నే తీసుకోవాలనుకున్నాను. ఆమెకు కథ చెప్పడం కోసం బెంగళూరు దాకా వెళ్లాను. తీరా వెళ్లాక ఆమె నో చెప్పింది. డబ్బుల్లేకపోయినా ఖర్చుపెట్టుకుని మరీ బెంగళూరు వెళ్లా.. అనుకున్న పని జరగలేదని చాలా ఫీలయ్యాను. ఇప్పుడు ఆమె నా సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంటే భలే ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. కాగా మెకానిక్ రాకీ మూవీ నవంబర్ 22న విడుదల కానుంది.చదవండి: ‘లాస్ట్ లేడీస్’ కోసం మహిళలందరూ సపోర్ట్ చేయాలి: కిరణ్ రావు -
విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ.. ఆ సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తోన్న తాజా చిత్రం మెకానిక్ రాకీ. ఈ సినిమాకు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.తాజాగా విడుదలైన ఐ హేట్ యూ మై డాడీ అంటూ సాగే పాట ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు సనారే లిరిక్స్ అందించగా.. సింగర్ రామ్ మిరియాల ఆలపించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ మెకానిక్ పాత్రతో అలరించనున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సునీల్, నరేష్ వీకే, హైపర్ ఆది, హర్ష వర్ధన్, వైవా హర్ష, రఘురామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జేక్స్ బేజోయ్ సంగీతమందిస్తున్నారు. It’s a new vibe, for sure😂Listen to our #IHateuMyDaddy from #MechanicRocky 🛠🔥🔗https://t.co/C0XtVfkoPW#MechanicRockyOnNOV22 🛠🎵 @JxBe🎤 #RamMiriyala✍️ #Sanare@itsRamTalluri @RaviTejaDirects @Meenakshiioffl @ShraddhaSrinath @JxBe #RajaniTalluri @SRTmovies… pic.twitter.com/lpU6FzRc9X— VishwakSen (@VishwakSenActor) November 6, 2024 -
‘మెకానిక్ రాకీ’ఈవెంట్లో మెరిసిన శ్రద్ధా శ్రీనాథ్ (ఫొటోలు)
-
విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మాస్ మెకానిక్
‘ఓ నటుడిగా నేనింత దూరం వచ్చానంటే ఇద్దరే కారణం. ఒకటి నేను... రెండు... మీరు (అభిమానులు, ప్రేక్షకులను ఉద్దేశించి). ‘మెకానిక్ రాకీ’ సినిమా చూసుకున్నాను. చాలా బాగా వచ్చింది. రెండోసారి కూడా చూడాలనుకునేలా ఈ సినిమా ఉంటుంది.’’ అని విశ్వక్ సేన్ అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా, మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం నవంబరు 22న విడుదల కానుంది. ఈ సినిమా తొలి ట్రైలర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. మాస్ యాక్షన్, లవ్, సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమా ఉంటుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘రిలీజ్ సమయంలో మరో ట్రైలర్‌ను విడుదల చేస్తాం. అలాగే ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తాం. నిర్మాత రామ్ తాళ్లూరి బాగా స΄ోర్ట్ చేశారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు రామ్ తాళ్లూరి, శ్రద్ధా శ్రీనాథ్, రవితేజ. -
'సౌండ్ ఎక్కువైతే బోర్ చేస్తా'.. విశ్వక్సేన్ మాస్ ట్రైలర్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో మెకానిక్ రాకీ అంటూ అభిమానులను అలరించేందుకు వచ్చేస్తున్నాడు. ఈ చిత్రంలో గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో హిట్ కొట్టిన మాస్ కా దాస్ మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయిపోయారు. ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. హైదరాబాద్‌లోని మూసాపేట్లో ఉన్న శ్రీరాములు థియేటర్లో మెకానిక్ రాకీ ట్రైలర్ 1.0ను లాంఛ్ చేశారు. ట్రైలర్ చూస్తే మరోసారి మాస్ పాత్రలో విశ్వక్సేన్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మెకానిక్ పాత్రలో ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు. అంతే కాకుండా మాస్ యాక్షన్‌తో పాటు ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఉందని ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ రివీల్ చేశారు.కాగా.. ఈ చిత్రంలో సునీల్, వీకే నరేష్, హైపర్ ఆది, హర్ష వర్ధన్, వైవా హర్ష, రఘురామ్ కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రజనీ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మెకానిక్ రాకీ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 22న థియేటర్లలో సందడి చేయనుంది. -
మెకానిక్ డేట్ చేంజ్
విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘మెకానిక్ రాకీ’ సినిమా విడుదల తేదీ మారింది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించింది. అయితే నవంబరు 22న రిలీజ్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు మేకర్స్. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్ మెంట్స్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు.ఈ మూవీ ట్రైలర్‌ని ఈ నెల 20న, సినిమాని నవంబరు 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్ విడుదల చేశారు. ‘‘మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ‘మెకానిక్ రాకీ’ రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి, రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని యూనిట్ పేర్కొంది. వీకే నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్ నటించిన ఈ సినిమాకి కెమెరా: మనోజ్ కాటసాని, సంగీతం: జేక్స్ బిజోయ్, ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్స్: ‘సత్యం’ రాజేష్, విద్యాసాగర్ జె. -
దాండియా ఆడిన టాలీవుడ్ యంగ్ హీరో.. వీడియో వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మెకానిక్ రాకీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత మరో మాస్ యాక్షన్ మూవీతో అభిమానులను అలరించనున్నారు. ఈ సినిమాను రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా విశ్వక్ సేన్ దసరా పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా గుజరాతీ స్టైల్లో దాండియా ఆడుతూ కనిపించారు. తన సిస్టర్‌తో కలిసి విశ్వక్ సేన్ దాండియా ఆడారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ తమ అభిమాన హీరోపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. #TFNReels: Mass Ka Das @VishwakSenActor plays dandiya with his sister at Navaratri celebrations!!❤️#VishwakSen #Laila #MechanicRocky #TeluguFilmNagar pic.twitter.com/UuzlCM3ZVP— Telugu FilmNagar (@telugufilmnagar) October 11, 2024 -
రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్ కావాలి
‘‘కార్తీగారంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని మన తెలుగు హీరో అని చెప్పుకుంటాం. ‘96’ సినిమాకి పెద్ద ఫ్యాన్‌ని. ప్రేమ్ కుమార్‌గారు నా కలల దర్శకుడు. వారిద్దరూ కలిసి చేసిన ‘సత్యం సుందరం’ సినిమాని ఈ 28న చూడండి. అలాగే 27న ‘దేవర’ చిత్రం చూడండి. ఈ రెండు సినిమాలూ పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. కార్తీ, అరవింద్ స్వామి ప్రధానపాత్రల్లో శ్రీదివ్య కీలకపాత్రలో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదల కానుంది.ఏషియన్ సురేష్ ఎంటర్టైన్ మెంట్స్ ఎల్ఎల్పీ తెలుగులో విడుదల చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్‌కి విశ్వక్ సేన్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘కొన్ని నెలల క్రితం కార్తీగారిని కలిసి, కథ చెప్పాను. ఆయన ఓకే చేయడమే మిగిలి ఉంది. ‘సత్యం సుందరం’ ట్రైలర్, టీజర్ చాలా నచ్చాయి. ఈ సినిమా చూడ్డానికి ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.‘‘యుగానికి ఒక్కడు’ సినిమా చూసినప్పుడే కార్తీగారు నాకు చాలా నచ్చేశారు. నాకు ఇష్టమైన హీరోతో పని చేయడం హ్యాపీ. మా సినిమాని చూడండి’’ అని శ్రీదివ్య తెలిపారు. ‘‘ఆర్య, జగడం’ సినిమాలతో నా కెరీర్‌ని తెలుగులో ప్రారంభించాను. ఆ తర్వాత తమిళ పరిశ్రమకు వెళ్లాను. ఈ నెల 28న అందరం థియేటర్స్‌లో కలుద్దాం’’ అని పేర్కొన్నారు ప్రేమ్ కుమార్. ‘‘చాలా హార్ట్‌ఫుల్‌గా తీసిన సినిమా ‘సత్యం సుందరం’’ అని నిర్మాత సురేష్ బాబు చెప్పారు. రచయిత, నటుడు రాకేందు మౌళి మాట్లాడారు. -
దేవరపై ట్రోలింగ్.. యూట్యూబర్లపై మండిపడ్డ విశ్వక్సేన్
జూనియర్ ఎన్టీఆర్ దేవర ట్రైలర్ గురించ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. చాలామంది ఈ ట్రైలర్ చూస్తుంటే ఆచార్య గుర్తొస్తోందని ట్రోల్ చేస్తున్నారు. కొందరు యూట్యూబర్స్ అయితే ఏకంగా ఎన్టీఆర్ లుక్స్ మీద కూడా సెటైర్లు వేశారు. ట్రైలర్ చూడబుద్ధి కాలేదు, ఏమంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదనిపిస్తోంది. ఆయన లుక్స్ కూడా బాలేవని కామెంట్లు చేశారు.సపోర్ట్ లేకుండా కూర్చో..దీంతో తారక్ వీరాభిమాని, హీరో విశ్వక్సేన్ సదరు యూట్యూబర్లపై తీవ్రంగా మండిపడ్డాడు. వీడు నా పేరు ఖరాబ్ చేయడానికే పుట్టాడు. నువ్వు ముందు ఆ గోడ సపోర్ట్ లేకుండా రెండు నిమిషాలు కూర్చో.. తర్వాత సినిమాను, ఆడియన్స్‌ను ఉద్ధరిద్దువు కానీ.. నీ ముఖం ఆల్రెడీ కాలిపోయినట్లు ఉంది. అలాంటి నువ్వే అందం గురించి మాట్లాడాలి మరి! అని కౌంటర్ ఇచ్చాడు. ఇది చూసిన తారక్ ఫ్యాన్స్.. అదీ.. అట్లా గడ్డి పెట్టు అని కామెంట్లు చేస్తున్నారు.ఈ నెలలోనే దేవరఇకపోతే ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. సైఫ్ అలీఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ కీలకపాత్రల్లో నటించారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మించారు. దేవర ఫస్ట్ పార్ట్ ఈ నెల 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. Anna ni okka maata anina, ee tammudu medha padipothadu anthe...Hatsoff to ur voice of voiceless fans moment anna....You stood with them, when it matters the most @VishwakSenActor Bhaai 🫶🫡#NTR #Devara #Vishwaksen pic.twitter.com/aiA7SfRmH6— MAHI MOVIE WRITEUPS (@MahiMVWriteups) September 11, 2024 బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన విశ్వక్ సేన్
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి విపత్తుల సమయంలో ప్రజలకు సాయం చేసేందుకు టాలీవుడ్ హీరోలు ముందుకొచ్చారు. రెండు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు చొప్పున జూ.ఎన్టీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా రెండు రాష్ట్రాలకు తన వంతుగా సాయం ప్రకటించారు.తెలంగాణలో ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ ప్రజలను భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. ప్రభుత్వాల నుంచి తమకు సరైన సాయం అందడంలేదంటూ ప్రజలు చేయి చాపుతున్నారు. పిల్లలకు పాలతో పాటు తమకు తాగేందుకు కనీసం నీళ్లు అయినా ఇవ్వండి అంటూ ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఇలాంటి విపత్తు సమయంలో వరద సహాయక చర్యలకు మద్దతుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 5 లక్షలు విరాళం ఇస్తున్నట్లు విశ్వక్ సేన్ ప్రకటించారు. వరదల వల్ల నష్టపోయిన వారి బాధలను కొంతైనా తగ్గించే దిశగా ఈ చిన్న సహకారం అంటూ ఆయన ట్వీట్ చేశారు. తన అభిమాన హీరో తారక్ రెండు రాష్ట్రాలకు కలిపి రూ.1 కోటి విరాళం ప్రకటించిన వెంటనే విశ్వక్ కూడా అదే దారిలో తన వంతుగా సాయం చేయడం విశేషం. దీంతో తారక్, విశ్వక్ ఫ్యాన్స్ అభినందిస్తూ సోషల్‌మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. -
Vishwak Sen: థ్రిల్లింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఛాలెంజ్.. ఇది!
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం సోషల్ మీడియాపై ఆధారపడని వ్యవస్థ, వ్యాపారం ఏదీ లేదని, టాలెంట్ ఎవరి సొత్తూ కాదని ప్రముఖ సినీ నటుడు విశ్వక్సేన్ తెలిపారు. నెక్లెస్ రోడ్‌లోని అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ ‘థ్రిల్ సిటీ’ ఆధ్వర్యంలో థ్రిల్లింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఛాలెంజ్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విశ్వక్సేన్ ఆవిష్కరించారు. క్రియేటివిటీ ఫీల్డ్‌లో కొత్తగా ప్రవేశించేవాళ్లు కూడా బ్రహ్మాండంగా రాణించవచ్చని అన్నారు. ఇందులో భాగంగా థ్రిల్‌సిటీ విడియోలను ఇన్ఫ్లుయెన్సర్లు తమ సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేయాలని కో–ఆర్డినేటర్ బందూక్ లక్ష్మణ్ తెలిపారు. మూడు విభాగాల్లో ఉత్తమ వీడియోలను ఎంపిక చేసి ఒక్కొక్కరికీ లక్ష చొప్పున 3 లక్షల నగదు బహుమతులను అందిస్తున్నామన్నారు. -
విలేజ్ పాలిటిక్స్ షురూ
హీరో విశ్వక్ సేన్ కెరీర్‌లోని 13వ సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ‘ఎవ్రీ యాక్షన్ ఫైర్స్ ఎ రియాక్షన్’ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ సంపద హీరోయిన్గా నటించనున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాతో శ్రీధర్ గంటా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఎల్ఎస్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వశిష్ఠ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాతలు నాగవంశీ, సాహు గారపాటి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ పోలీసాఫీసర్‌గా నటించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను సెప్టెంబరులో ఆరంభించనున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: కిశోర్ కుమార్. -
విశ్వక్సేన్ కొత్త సినిమా ప్రాజెక్ట్ ప్రారంభం (ఫొటోలు)
-
గులాబీలు గుప్పే పిల్లడే...
‘‘గుల్లేడు గుల్లేడు గులాబీలు గుప్పే పిల్లడే ఇంక నాతో ఉంటడే...’ అంటూ మొదలవుతుంది ‘మెకానిక్ రాకీ’ సినిమాలోని ‘గుల్లేడు గుల్లేడు...’ పాట. విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ఇది. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 31న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ‘గుల్లేడు గుల్లేడు..’ అంటూ సాగే ఫోక్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. జేక్స్ బిజోయ్ సంగీత సారథ్యంలో సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించిన ఈ పాటను మంగ్లీ పాడారు. ‘జాతి రత్నాలు’ దర్శకుడితో... మంగళవారం విశ్వక్ 13వ సినిమా ప్రకటన రాగా, బుధవారం ఆయన 14వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నారు. ఈ సినిమాకు సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
మాస్ కా దాస్ జెట్ స్పీడ్.. ఫుల్ యాక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్!
టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. అంతే కాకుండా ఇటీవలే లైలా అనేపేరుతో కొత్త మూవీని కూడా ప్రకటించాడు. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్ సేన్ మరో మూవీని అనౌన్స్ చేశాడు. దీంతో వరుస సినిమాలతో టాలీవుడ్లో బిజీగా మారిపోయాడు.తాజాగా వర్కింగ్ టైటిల్ వీఎస్13 పేరుతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు శ్రీధర్ గంట దర్శకత్వం వహిస్తున్నారు. కాంతార మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ సంగీంతమందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. A High Voltage Action Film 🧨🧨🪓🪓Written and directed by #SreedharGanta@sudhakarcheruk5 @innamuri8888 @AJANEESHB @kishorkumardop @SLVCinemasOffl pic.twitter.com/lZbwFPlWH2— VishwakSen (@VishwakSenActor) August 6, 2024 -
ఈ ఏడాది నాకు చాలా స్పెషల్: విశ్వక్సేన్
‘‘ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకం. నేను నటించిన మూడో సినిమా (మెకానిక్ రాకీ) కూడా రిలీజ్ అవుతోంది. (‘గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాలు విడుదలయ్యాయి). మలక్‌పేట బ్యాక్‌డ్రాప్‌లో సాగే ముక్కోణపు ప్రేమకథే ‘మెకానిక్ రాకీ’. రాకీగా నాపాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని హీరో విశ్వక్సేన్ అన్నారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘మెకానిక్ రాకీ’. విశ్వక్సేన్ హీరోగా, మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబరు 31న రిలీజ్ కానుంది.ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్ వీడియో లాంచ్ ఈవెంట్లో విశ్వక్సేన్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా దీపావళికి క్రాకర్ అవుతుంది. ఫ్యామిలీతో వచ్చి థియేటర్స్‌లో చూడండి. రామ్ తాళ్లూరిగారి వల్లే ఈ సినిమా అవుట్‌పుట్ ఇంత బాగా వచ్చింది. జేక్స్ బిజోయ్ సంగీతం అదిరి΄ోతుంది’’ అన్నారు. ‘‘రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘మెకానిక్ రాకీ’ రూపొందింది. నాకు అవకాశం వచ్చిన విశ్వక్, రామ్ తాళ్లూరి గారికి థ్యాంక్స్’’ అన్నారు రవితేజ ముళ్లపూడి. ‘‘మెకానిక్ రాకీ’ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు రామ్‌తాళ్లూరి, మీనాక్షీ చౌదరి. -
ఇన్స్టాగ్రామ్ ఎందుకు డీయాక్టివేట్ చేశానంటే?: విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం మెకానిక్ రాకీ. మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 31న రిలీజ్ చేయనున్నారు. ఆదివారం (జూలై 28న) సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్వక్సేన్కు ఓ ప్రశ్న ఎదురైంది.అందుకే సోషల్ మీడియాకు దూరంఏ నటి వల్ల మీ ఇన్స్టాగ్రామ్ ఖాతా డిలీట్ చేశారు? సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్‌గా ఉండట్లేదు? అని ఓ విలేఖరి ప్రశ్నించాడు. అందుకు హీరో స్పందిస్తూ.. నువ్వు అమ్మాయిల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటావ్.. కానీ నేను అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఉంటాను. అయినా ఎవరో నటి గురించి నేనెందుకు ఇన్స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేస్తాననుకున్నారు.మొన్నే తెలిసొచ్చిందిసరే, అది పక్కన పెడితే.. మార్చి 29న నాకు 30 ఏళ్లు వచ్చాయని అర్థమైంది. ఇంకా ఫోన్ పట్టుకుని గంటలకొద్దీ కాలక్షేపం చేయడమేంటి? వయసొచ్చింది.. ఫోన్ పక్కనపెట్టి ఎక్కువ పని చేద్దామనుకున్నాను. అందుకనే ఇన్స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేశాను. సినిమా రిలీజ్‌కు వారం రోజుల ముందు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాను.మూవీ విడుదలైన వారం తర్వాత మళ్లీ కనిపించను అని చెప్పుకొచ్చాడు.చదవండి: బాబును అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది: నటి -
అశ్విన్ కెరీర్లో శివం భజే నిలిచిపోతుంది: విశ్వక్ సేన్
‘‘శివం భజే’ ట్రైలర్ బాగుంది. నేపథ్య సంగీతం అదిరిపో యింది. ఆగస్ట్ 1న అశ్విన్‌కు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాను. తన కెరీర్లో ‘శివం భజే’ నిలిచిపోతుంది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవన్షీ జోడీగా అప్సర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘శివం భజే’. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 1న విడుదలవుతోంది.మంగళవారం జరిగిన ‘శివం భజే’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి విశ్వక్ సేన్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు తమన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘‘శివం భజే’ ట్రైలర్ బాగుంది. యూనిట్‌కి ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలి’’ అన్నారు అనిల్ రావిపూడి.‘‘అశ్విన్ క్రికెట్లో బాల్‌ను ఎలా బాదుతాడో బాక్సాఫీస్‌ను కూడా అలానే బాదాలి’’ అన్నారు తమన్. ‘‘పరమేశ్వరుడి కథతో రూపొందిన ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అన్నారు అప్సర్. ‘‘ముస్లిం అయిన అప్సర్గారు ‘శివం భజే’ లాంటి కథను ఎలా రాశారో అనుకున్నాను. ఇదంతా శివ లీల అనిపించింది’’ అని అన్నారు అశ్విన్‌బాబు. -
రాకీ ప్రపంచంలోకి...
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. కాగా శ్రద్ధా శ్రీనాథ్‌ని స్వాగతిస్తూ, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.‘‘మెకానిక్ రాకీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నా’’ అని ఈ సందర్భంగా శ్రద్ధా శ్రీనాథ్ పేర్కొన్నారు. ‘‘ముక్కోణపు ప్రేమకథగా రూపొందుతోన్న చిత్రం ‘మెకానిక్ రాకీ’. మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమాని విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మనోజ్ కాటసాని. -
జాతిరత్నాలు డైరెక్టర్ తో విశ్వక్ సేన్ సినిమా
-
దీపావళికి రాకీ
దీపావళికి థియేటర్స్‌కు వస్తున్నాడు మెకానిక్ రాకీ. విశ్వక్ సేన్ టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న యాక్షన్ చిత్రం ఇది.ఈ చిత్రాన్ని అక్టోబరు 31న దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లుగా గురువారం ప్రకటించి, విశ్వక్ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. కామెడీ, యాక్షన్ అంశాల మేళవింపుతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్ స్వరకర్త. -
జాతిరత్నాలు డైరెక్టర్ తో విశ్వక్ సేన్ సినిమా
-
ఆ సినిమా రోజులు గుర్తొస్తున్నాయి: విశ్వక్ సేన్
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘గలీజ్..’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘రోటి కపడా రొమాన్స్’ టీమ్‌ను చూస్తుంటే నాకు మా ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా రోజులు గుర్తొస్తున్నాయి. నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌కు ప్రేమకథలపై మంచి జడ్జ్మెంట్ ఉంది. ఈ సినిమా విజయం సాధించి, మంచి వసూళ్లను రాబట్టాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘మంచి ఎమోషనల్ రైడ్ ఫిల్మ్ ఇది’’ అన్నారు విక్రమ్ రెడ్డి. ‘‘ఓ కొత్త పాయింట్‌ను యువతకు చె΄్పాలని ‘రోటి కపడా రొమాన్స్’లాంటి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీని తీశాం’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్. ‘‘ప్రేక్షకులందర్నీ అలరించే సినిమా ఇది’’ అన్నారు నిర్మాత సృజన్‌కుమార్. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించిన ఈ ‘గలీజ్’ పాటను రాహుల్ సిప్లిగంజ్, పీవీఎన్ఎస్ రోహిత్ పాడారు. -
రిస్క్ చేశారు.. సక్సెస్ కావాలి
‘‘ఆపరేషన్ రావణ్’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. వెంకట సత్యగారు వాళ్ల అబ్బాయి రక్షిత్ కోసమే ‘పలాస 1978’ మూవీ చేసి హిట్ అందుకున్నారు. ఇప్పుడు ‘ఆపరేషన్ రావణ్’తో మరోసారి రిస్క్ చేశారు... ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు హీరో విశ్వక్ సేన్. రక్షిత్ అట్లూరి, సంగీర్తనా విపిన్ జంటగా వెంకట సత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 2న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో అతిథి విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘రక్షిత్‌కు నేను చెప్పే సలహా ఒక్కటే. ఇండస్ట్రీలో చివరి చాన్స్ అనేది ఏమీ ఉండదు. ఇంకో చాన్స్ ఉంటుంది. మనం నమ్మకం వదిలేసినప్పుడే అనుకోని ఫలితాలు వస్తుంటాయి. నమ్మకంతో ప్రయత్నిస్తుంటే తప్పకుండా విజయం వస్తుంది’’ అన్నారు. ‘‘మీ ఆలోచనల ప్రభావం వల్లే మీరు మంచివాళ్లా? చెడ్డ వాళ్లా? అనేది నిర్ణయిస్తారు. మీరు ఎలా ఉండాలో మీ ఆలోచనలే నిర్ణయిస్తాయి. ఆ ΄ాయింట్తోనే ‘ఆపరేషన్ రావణ్’ రూ΄÷ందించా’’ అన్నారు వెంకట సత్య. రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ– ‘‘సెట్లోకి వెళితే నేను యాక్టర్... నాన్న డైరెక్టర్ అంతే. ‘ఆపరేషన్ రావణ్’ ప్రేక్షకులను అల రిస్తుంది. ‘పలాస 2’ సినిమాకు చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
'ఆపరేషన్ రావణ్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వీరి వీరి గుమ్మడిపండు ఈ స్టార్ ఎవరు?
వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి? అని కళ్లకు గంతలు కట్టి అడుగుతారు. కానీ గంతలు కట్టకుండానే ఫొటోలు చూపించి, వీరి వీరి గుమ్మడిపండు ఈ స్టార్ ఎవరు? అని అడిగితే... పేరు చెప్పడానికి తడబడాల్సిందే. అలా పోల్చుకోలేనంతగా మారిపోయారు కొందరు స్టార్స్. గుర్తుపట్టలేని వెరైటీ గెటప్స్‌లో ఆ స్టార్స్ కనిపించనున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.⇒ మేకోవర్, కొత్త గెటప్ అనగానే వెంటనే గుర్తొచ్చే హీరోల్లో విక్రమ్ ఒకరు. ‘పితామగన్’ (‘శివపుత్రుడు’), సేతు, అపరిచితుడు, ఐ, కోబ్రా’... ఇలా చెప్పుకుంటూ పోతే విక్రమ్ చేసిన ప్రయోగాత్మక చిత్రాల్లోని పాత్రల జాబితా ఎక్కువగానే ఉంటుంది. తాజాగా ‘తంగలాన్’లోనూ విక్రమ్ వినూత్నంగా కనిపించనున్నారు. పద్దెనిమిదో శతాబ్దంలో కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) నేపథ్యంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ‘తంగలాన్’ తీశామని ఈ చిత్రదర్శకుడు పా. రంజిత్ పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్లు మాళవికా మోహనన్, పార్వతీ తిరువోత్తుల గెటప్స్ కూడా పూర్తి డీ–గ్లామరస్‌గా, ఆడియన్స్ గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి.⇒ తమిళ హిట్ ఫిల్మ్ ‘సారపట్ట పరంపరై’లో డీ–గ్లామరస్ రోల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు హీరోయిన్ దుషారా విజయన్. ఇప్పుడైతే మరీ గుర్తుపట్టలేని గెటప్‌లో కనిపించనున్నారు. ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘రాయన్’ సినిమాలోనే ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఈ సినిమాలో దుషారతో పాటు వరలక్ష్మీ శరత్‌కుమార్, అపర్ణా బాలమురళి కూడా డీగ్లామరస్ రోల్స్‌లోనే కనిపిస్తారు. సందీప్ కిషన్, కాళిదాసు ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో ముగ్గురు అన్నదమ్ముల కథగా సాగే ఈ మూవీ ఈ నెల 26న రిలీజ్ కానుంది.⇒ కథ డిమాండ్ చేస్తే అందులోని గెటప్‌లోకి అవలీలగా మారిపోతారు కమల్‌హాసన్. ‘భామనే సత్యభామనే’లో బామ్మగా, పది అవతారాల్లో ‘దశావతారం’ వంటి చిత్రాలు అందుకు మంచి ఉదాహరణలు. ‘దశావతారం’ (2008) తర్వాత కమల్ ఒకే సినిమాలో ఎక్కువ గెటప్స్‌లో కనిపించలేదు. ఇప్పుడు ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2’)లో ఐదారు గెటప్స్‌లో కనిపించనున్నారు. వీటిలో ఒకట్రెండు గెటప్స్ ఇప్పటికే బయటకు రాగా మిగిలినవి థియేటర్స్‌లో సర్ప్రైజ్గా ఉండబోతున్నాయని తెలిసింది. ‘భారతీయుడు 2’ కథ రీత్యా కమల్ వందేళ్ల వయసుపైబడిన సేనాపతి పాత్రలో నటించారు. మొత్తంగా ఆయన ఎన్ని పాత్రల్లో కనిపిస్తారో థియేటర్స్‌లోనే చూడాలి. ఇక శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇండియన్ 2’ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 12న విడుదల కానుంది. ⇒ డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్‌ను మెప్పించడంలో ధనుష్ ముందు ఉంటారు. ఈ విలక్షణ హీరో ప్రస్తుతం దర్శకుడు శేఖర్ కమ్ములతో ‘కుబేర’ సినిమా చేస్తున్నారు. ఇందులో నాగార్జున మరో హీరో. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా, సామాజిక అసమానతల మేళవింపుతో రానున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ధనుష్ బిచ్చగాడి గెటప్‌లో కనిపిస్తారట.⇒ మాస్ హీరో అనిపించుకున్న విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేశారు. అది ‘లైలా’ సినిమా కోసం అన్నమాట. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఫస్టాఫ్ అబ్బాయిగా, సెకండాఫ్ లైలా అనే అమ్మాయిగా కనిపిస్తారు. ఆకాంక్షా శర్మను హీరోయిన్గా పరిచయం చేస్తూ రామ్‌నారాయణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.⇒ అటు కన్నడకు వెళితే ఇప్పుడు శివ రాజ్‌కుమార్ గెటప్ హాట్ టాపిక్‌గా నిలిచింది. ‘భైరవనకోనెపాఠ’ అనే చిత్రంలో శివ రాజ్‌కుమార్ గుర్తుపట్టలేని గెటప్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి హేమంత్‌రావు దర్శకుడు. ఈ సినిమా తెలుగు లోనూ రిలీజ్ కానుంది.ఇలా గుర్తు పట్టలేని గెటప్‌కి సై అని, సవాల్‌గా తీసుకుని నటిస్తున్న స్టార్స్ మరికొందరు ఉన్నారు. -
డార్లింగ్ విజయం సాధిస్తుంది: విశ్వక్ సేన్
‘‘డార్లింగ్’ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. డైరెక్టర్ రామ్ అద్భుతంగా తీశారు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. ప్రియదర్శి, నభా నటేష్ జోడీగా అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘డార్లింగ్’. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను విశ్వక్ సేన్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా సమయంలో నన్ను వేదికపైకి ఆహ్వానించి సైకో వివేక్‌గా పరిచయం చేశాడు ప్రియదర్శి. ‘మల్లేశం, బలగం’ లాంటి సినిమాలు అందరికీ పడవు.. రాసి పెట్టి ఉండాలి. ఇప్పుడు తను ‘డార్లింగ్’ తో రావడం చాలా ఆనందంగా ఉంది. దర్శి గెలిస్తే నేను గెలిచినట్లు అనిపిస్తుంది’’ అన్నారు. ‘‘డార్లింగ్ అనగానే ప్రభాస్అన్న పేరు గుర్తొస్తుంది. అలాంటి టైటిల్ పెట్టుకోవాలంటే భయంగా ఉండేది. అయితే కథని నమ్మి ‘డార్లింగ్’ టైటిల్ పెట్టుకున్నాం’’ అన్నారు ప్రియదర్శి. ‘‘నేను ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి సినిమా చేయాలి? అని ఆలోచిస్తున్నపుడు ‘డార్లింగ్’ అవకాశం వచ్చింది’’ అన్నారు నభా నటేష్. ‘‘మూడేళ్ల ప్రయాణం ‘డార్లింగ్’. వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది’’ అన్నారు అశ్విన్ రామ్. ‘‘కథని నమ్మి తీసిన ఈ మూవీకి ప్రేక్షకుల ్రపోత్సాహం కావాలి’’ అన్నారు చైతన్య. -
'దయచేసి ఎవరు సీరియస్‌గా తీసుకోవద్దు'.. విశ్వక్ సేన్ విజ్ఞప్తి!
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్. గోదావరి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం విశ్వక్ లైలా చిత్రంలో నటించనున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అంతే కాకుండా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ తన కెరీర్లో తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించనున్నారు. అయితే తాజాగా విశ్వక్ సేన్ సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తన ట్విటర్లో పోస్ట్ చేశారు.తాజా పోస్ట్‌లో విశ్వక్ సేన్ రాస్తూ..'అందరికీ హాయ్.. నేను సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. అయితే నా ఇన్‌స్టాగ్రామ్‌కు చిన్న విరామం మాత్రమే. మీరు ఎవరు చింతించాల్సిన పనిలేదు. ట్విట్టర్ ఖాతాను నా టీమ్ నిర్వహిస్తుంది. నా ఇన్స్టాగ్రామ్ డీయాక్టివేషన్ గురించి ఒత్తిడికి గురికావద్దని' సూచించారు.అంతేకాకుండా.. 'ఇటీవల నా సోషల్ మీడియా ఖాతా డియాక్టివేషన్ కారణంగా అందరూ మేసేజులు పెడుతున్నారు. అంతా బాగానే ఉందా అని. ఇది చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా నా వ్యక్తిగత జీవితాన్ని నిర్వచించదు. సోషల్ మీడియాను కొంత వరకు మాత్రమే సీరియస్‌గా తీసుకోవాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. మీ అందరికీ ధన్యవాదాలు!' అంటూ పోస్ట్ చేశారు. అయితే విశ్వక్ సేన్ నిర్ణయంపై ఫ్యాన్స్ నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. Hey everyone, just a heads up—I posted a story about starting a social media detox. It's a small break from Instagram, nothing to worry about. Try being productive during this time! My team mostly manages my Twitter, so don't stress over my Instagram deactivation. Lately, I've…— VishwakSen (@VishwakSenActor) July 5, 2024 -
లైలాగా టాలీవుడ్ హీరో.. హీరోయిన్లే కుళ్లుకునేలా..
ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నిలదొక్కుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. ఐదేళ్ల క్రితం ఫలక్‌నుమా దాస్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈయన తర్వాత ఎన్నో రకాల ప్రయోగాలు చేశాడు. యాటిట్యూడ్ చూపించే విశ్వక్ కేవలం మాస్ సినిమాలకే సెట్టవుతాడన్న అభిప్రాయాలను అశోకవనంలో అర్జున కల్యాణం మూవీతో తప్పని రుజువు చేశాడు. లైలాగా మారిన హీరోఈ ఏడాది గామితో హిట్ కొట్టి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో పర్వాలేదనిపించిన ఈ హీరో తాజాగా సరికొత్త ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నాడు. ఇందులో లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ మూవీకి లైలా అనే టైటిల్ ఖరారు చేశారు. బుధవారం ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా ఆకాంక్ష శర్మను హీరోయిన్గా తీసుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం నాడు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఫస్ట్ లుక్ రిలీజ్ఈ మేరకు రిలీజ్ డేట్‌తో కూడిన ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో లేడీ గెటప్‌లో ఉన్న విశ్వక్ కళ్లు మాత్రమే చూపించారు. ఇది చూసిన నెటిజన్లు హీరోయిన్లు సైతం కుళ్లుకునేంత అందంగా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ నిర్మించనుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.చదవండి: కన్నబిడ్డను కాటికి పంపించాలనుకున్నా: పాకిస్తాన్ నటి -
‘లైలా’గా మారిన విశ్వక్ సేన్..కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
ఇన్ స్టా అకౌంట్ డిలీట్ చేసిన హీరో విశ్వక్ సేన్.. అదే కారణమా?
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ షాకింగ్ పనిచేశాడు. ఎప్పుడు తన ఇన్ స్టా ఖాతాని డిలీట్ చేశాడు. ట్విట్టర్ ఖాతా కనిపిస్తుంది గానీ ఇన్ స్టాలో సెర్చ్ చేస్తుంటే ఇతడి అధికారిక అకౌంట్ కనిపించడం లేదు. ఒకవేళ ప్రైవేట్‌లో పెట్టున్నా సరే కనీసం కనిపించేది కానీ పూర్తిగా ఖాతానే చూపించట్లేదు. దీంతో డిలీట్ చేశాడనే నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)ఇప్పుడు యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. సినిమాల అప్డేట్స్ దగ్గర నుంచి మీమ్స్‌ని స్టోరీలో పెట్టడం వరకు బాగానే ట్రెండ్ ఫాలో అవుతుంటాడు. అలాంటిది రీసెంట్గా 'కల్కి' ట్రైలర్ చూసి ఓపెనియన్ నెగిటివ్‌గా చెప్పాడని ఓ యూట్యూబర్‌తో సోషల్ మీడియాలో గొడవ పెట్టుకున్నాడు. ఒకటి రెండు రోజులు ఇది చర్చనీయాంశంగా మారింది.ఈ వివాదంతో పాటు రీసెంట్గా విశ్వక్ సేన్ చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీపై కూడా విమర్శలు వచ్చాయి. బహుశా ఈ కారణంగానే ఇన్ స్టాకి దూరమయ్యాడా అనిపిస్తుంది. అయితే ట్విట్టర్ ఖాతా మాత్రం ప్రస్తుతం కనిపిస్తుంది. మరి పూర్తిగా ఇన్ స్టాకి దూరమైపోతాడా లేదా కొన్నిరోజులు ఆగి వస్తాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: మరో లగ్జరీ అపార్ట్మెంట్ కొన్న హీరో ఆమిర్ ఖాన్.. ఎన్ని కోట్ల ఖరీదంటే?) -
ఊహించని పనిచేసి షాకిచ్చిన హీరో విశ్వక్ సేన్
ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం టాలీవుడ్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. లెక్కకు మించి హీరోలు వస్తున్నారు. వీళ్లలో తమదైన గుర్తింపు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలా పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నిలబడ్డ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. యాటిట్యూడ్ కామెంట్స్ వల్ల అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాడు గానీ మంచి యాక్టర్. ఇప్పుడు అంతకు మించిన మంచి పని చేసి శెభాష్ అనిపించుకున్నాడు.(ఇదీ చదవండిు: Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి)తాజాగా హైదరాబాద్‌లో 'మెట్రో రెట్రో' పేరుతో అవయవ దానంకి సంబంధించిన ఓ ఈవెంట్ జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన విశ్వక్.. తాను కూడా అవయవ దానం చేస్తానని అన్నాడు. ఈ మేకరు తన వివరాలు ఇచ్చాడు. మిగతా తెలుగు హీరోలు కూడా విశ్వక్ సేన్‌లా ముందుకొస్తే, అభిమానులు కూడా తమ వంతుగా డోనర్స్ అవుతారు.రీసెంట్గా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన విశ్వక్ సేన్.. ప్రస్తుతం 'మెకానిక్ రాకీ' మూవీ చేస్తున్నాడు. రీసెంట్గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. త్వరలో రిలీజ్ డేట్‌తో పాటు ఇతర వివరాలు వెల్లడిస్తారు.(ఇదీ చదవండిు: ఓటీటీలో ఇలియానా బోల్డ్ అండ్ కామెడీ సినిమా) -
ఓటీటీలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఎంట్రీ
టాలీవుడ్ ప్రముఖ హీరో విశ్వక్ సేన్ నటించిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు మే 31న విడుదలైంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే, ఈ చిత్రం విడుదలైన 15రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.నేడు జూన్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉండటం విశేషం. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్గా మెప్పిస్తే.. అంజలి కీలక పాత్రలో ప్రేక్షకులను ఫిదా చేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్తో సంయుక్తంగా దర్శకుడు త్రివిక్రమ్ ఈ మూవీని నిర్మించారు. విశ్వక్ సేన్ ఎనర్జీతో ఈ సినిమాను నడిపించాడు. బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్ల గ్రాస్‌ను ఈ చిత్రం రాబట్టినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
నమ్మకం ఉంది కాబట్టే ముందే షో వేశారు
‘‘హరోం హర’ ట్రైలర్ చాలా నచ్చింది. సుధీర్‌బాబు మంచి సినిమా చేశాడని తెలిసి, ఈ వేడుకకి వచ్చాను. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా విడుదలకు నాలుగైదు రోజుల ముందే డిస్ట్రిబ్యూటర్స్‌ని పిలిచి షో వేశారంటే సినిమాపై యూనిట్‌కి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది’’ అని హీరో అడివి శేష్ అన్నారు. సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన చిత్రం ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌పై సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హీరోలు అడివి శేష్, విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ (టీజర్, ట్రైలర్, ΄ాటలు...) ్ర΄ామిసింగ్గా ఉంది. సుబ్రహ్మణ్యం, సుమంత్ లాంటి ΄్యాషన్ ఉన్న నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. ఈ సినిమాని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ తెలుగు ఇండస్ట్రీలో ‘హరోం హర’ లాంటి నేపథ్యంలో సినిమా రాలేదు. నాతో ఇంత మంచి సినిమా తీసిన జ్ఞానసాగర్కి థ్యాంక్స్. ఈ సినిమా చూశాక ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం’’ అన్నారు నిర్మాత సుమంత్. ‘‘హరోం హర’లోని తండ్రీ కొడుకుల ఎమోషన్ నాకు చాలా కనెక్ట్ అయ్యింది’’ అన్నారు సుబ్రహ్మణ్యం. ఈ వేడుకలో నిర్మాతలు దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగో΄ాల్, డైరెక్టర్ మారుతి, డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. -
'గాడిద గుడ్డేం కాదు'.. నెటిజన్‌కు ఇచ్చిపడేసిన విశ్వక్ సేన్!
టాలీవుడ్ యంగ్ విశ్వక్ సేన్ ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో అలరించాడు. ఇటీవల థియేటర్లలో రిలీజైన బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. జూన్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.అయితే విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీని ఉద్దేశించి ఓ నెటిజన్ ట్వీట్ చేసింది. ఈ మూవీ రైట్స్‌ను దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం రూ.8 కోట్లకే అమ్మినట్లు పోస్ట్ చేసింది. అది కూడా జీఎస్టీతో కలిపి అంటూ పోస్ట్ పెట్టింది. అయితే ఇది చూసిన విశ్వక్ సేన్ తనదైన శైలిలో నెటిజన్‌కు ఇచ్చిపడేశాడు.'గాడిద గుడ్డేం కాదు.. టీ షాపు ముచ్చట్లు తీసుకొచ్చి ట్విటర్లో పెట్టొద్దు. మెకానికి రాకీ చిత్రానికి సంబంధించిన ఇంకా ఎలాంటి విక్రయాలు జరగలేదు. మీరు కాస్తా వాస్తవాలను తెలుసుకోండి. ఇదంతా ఓ టీమ్ కెరీర్‌కు సంబంధించింది' అంటూ నెటిజన్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Donkey egg em kadhu . With gst anta 😂 tea shop muchatlu theeskochi tweeter lo pettodhu priyaji. #mechanicrocky was never sold yet ! Get facts right . Its teams career— VishwakSen (@VishwakSenActor) June 12, 2024 -
ఈ టీమ్‌ని చూస్తే ముచ్చటేసింది: విశ్వక్ సేన్
‘‘ప్రతిభ ఉన్న యువతకు సీ స్పేస్ అనే సంస్థ ద్వారా మంచి వేదిక సృష్టించాడు నవదీప్. నా తోటి నటీనటుల్లో నేను గౌరవించే వాళ్లలో చాందినీ చౌదరి ఒకరు. తను ఎప్పుడూ టెన్షన్ పడుతుంటుంది. ‘యేవమ్’తో తనకి ఆ భయం పోయింది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. చాందినీ చౌదరి, వశిష్ట సింహా, భరత్ రాజ్, అషు రెడ్డి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘యేవమ్’. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది.ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి అతిథిగా హాజరైన విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘యేవమ్’ లాంటి ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రానికి మహిళా సంగీత దర్శకురాలు, మహిళా ఎడిటర్ పని చేయడం హ్యాపీగా ఉంది. ఈ టీమ్‌కి ఈ చిత్రం మంచి బ్రేక్ అవ్వాలి’’ అన్నారు. ‘‘యేవమ్’ చూశాను. ఇంటర్వెల్, పతాక సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి’’ అన్నారు మరో అతిథి, డైరెక్టర్ సందీప్ రాజ్. ‘‘ఈ మూవీలో నాది పోలీస్ పాత్ర అనగానే యాక్షన్ ఓరియంటెడ్ అనుకున్నాను. అయితే యాక్షన్ పాటు అన్ని షేడ్స్ నా పాత్రలో ఉన్నాయి’’ అన్నారు చాందిని. ‘‘మంచి ఇంటెన్స్‌తో నిజాయితీగా చేసిన సినిమా ‘యేవమ్’’ అన్నారు నవదీప్. ‘‘ఇదొక ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్’’ అన్నారు ప్రకాశ్ దంతులూరి.