
ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం టాలీవుడ్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. లెక్కకు మించి హీరోలు వస్తున్నారు. వీళ్లలో తమదైన గుర్తింపు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలా పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నిలబడ్డ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. యాటిట్యూడ్ కామెంట్స్ వల్ల అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాడు గానీ మంచి యాక్టర్. ఇప్పుడు అంతకు మించిన మంచి పని చేసి శెభాష్ అనిపించుకున్నాడు.
(ఇదీ చదవండిు: Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి)
తాజాగా హైదరాబాద్‌లో 'మెట్రో రెట్రో' పేరుతో అవయవ దానంకి సంబంధించిన ఓ ఈవెంట్ జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన విశ్వక్.. తాను కూడా అవయవ దానం చేస్తానని అన్నాడు. ఈ మేకరు తన వివరాలు ఇచ్చాడు. మిగతా తెలుగు హీరోలు కూడా విశ్వక్ సేన్‌లా ముందుకొస్తే, అభిమానులు కూడా తమ వంతుగా డోనర్స్ అవుతారు.
రీసెంట్‌గా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన విశ్వక్ సేన్.. ప్రస్తుతం 'మెకానిక్ రాకీ' మూవీ చేస్తున్నాడు. రీసెంట్‌గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. త్వరలో రిలీజ్ డేట్‌తో పాటు ఇతర వివరాలు వెల్లడిస్తారు.
(ఇదీ చదవండిు: ఓటీటీలో ఇలియానా బోల్డ్ అండ్ కామెడీ సినిమా)
Comments
Please login to add a commentAdd a comment