
‘‘శివం భజే’ ట్రైలర్ బాగుంది. నేపథ్య సంగీతం అదిరిపో యింది. ఆగస్ట్ 1న అశ్విన్‌కు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాను. తన కెరీర్‌లో ‘శివం భజే’ నిలిచిపోతుంది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవన్షీ జోడీగా అప్సర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘శివం భజే’. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 1న విడుదలవుతోంది.
మంగళవారం జరిగిన ‘శివం భజే’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి విశ్వక్ సేన్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు తమన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘‘శివం భజే’ ట్రైలర్ బాగుంది. యూనిట్‌కి ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలి’’ అన్నారు అనిల్ రావిపూడి.
‘‘అశ్విన్ క్రికెట్‌లో బాల్‌ను ఎలా బాదుతాడో బాక్సాఫీస్‌ను కూడా అలానే బాదాలి’’ అన్నారు తమన్. ‘‘పరమేశ్వరుడి కథతో రూపొందిన ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అన్నారు అప్సర్. ‘‘ముస్లిం అయిన అప్సర్‌గారు ‘శివం భజే’ లాంటి కథను ఎలా రాశారో అనుకున్నాను. ఇదంతా శివ లీల అనిపించింది’’ అని అన్నారు అశ్విన్‌బాబు.
Comments
Please login to add a commentAdd a comment