Trailer Launch
-
నవ్వులు గట్టిగా వినిపిస్తాయి: సందీప్ కిషన్
సందీప్ కిషన్(Sundeep Kishan), రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’(Mazaka). రావు రమేశ్, అన్షు ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రాజేశ్ దండా, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఆదివారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘మజాకా’ సినిమాకు థియేటర్స్‌లో నవ్వులు గట్టిగా వినిపిస్తాయి.నా కెరీర్లో హయ్యెస్ట్ నంబర్స్ ఈ సినిమా ఇస్తుందనే నమ్మకం ఉంది. ఫ్యామిలీతో థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా ఇది. నాకు, రావు రమేశ్‌గారికి ఈక్వెల్ స్క్రీన్ స్పేస్ ఉంది. ఆయన వల్ల కథ మరింతగా పండింది’’ అన్నారు సందీప్ కిషన్. ‘‘ఇద్దరు మగవాళ్లు మాత్రమే ఉన్న ఒక ఇంట్లో ఏ రోజుకైనా ఒక ఫ్యామిలీ ఫొటో రావాలని పడే తపనే ఈ సినిమా కథ. నా ప్రతి సినిమాలో ఉండే మ్యాజిక్ ఈ సినిమా లోనూ ఉంటుంది. ఈ సినిమా డబుల్ బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు నక్కిన త్రినాథరావు.‘‘ఈ చిత్రంలో రొమాంటిక్‌గా నటించడం చాలా సవాల్‌గా అనిపించింది. కొత్తగా నవ్వించే చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు రావు రమేశ్. ‘‘కెప్టెన్ మిల్లర్, భైరవకోన, రాయన్’ ఇప్పుడు ‘మజాకా’... ఇలా డిఫరెంట్ సినిమాలతో అలరిస్తున్న సందీప్ కిషన్‌కు పీపుల్స్ స్టార్ అనే ట్యాగ్ యాప్ట్ అనిపించింది’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘సందీప్, రావు రమేశ్గార్లు పొటీపడి నటించారు. ‘మజాకా’ అందరికీ నచ్చుతుంది. ‘సామజ వరగమన, భైరవ కోన’ చిత్రాల తర్వాత అనిల్‌గారు, నేను హ్యాట్రిక్ సినిమాతో వస్తున్నాం’’ అన్నారు రాజేశ్ దండా. హీరోయిన్ రీతూ వర్మ, అన్షు మాట్లాడారు. -
'మజాకా' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘నారి’ మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)
-
బాపు అరుదైన సినిమా: రానా దగ్గుబాటి
రెగ్యులర్‌కి భిన్నంగా ఉండే ‘బాపు’లాంటి సినిమాలు రావడం చాలా అరుదు. ఒక సంస్కృతిని చూపించే ఇలాంటి చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకుల్లా నేను కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati ) అన్నారు. బ్రహ్మాజీ(Brahmaji) లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘బాపు’(Bapu). దయా దర్శకత్వంలో కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బాపు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి రానా దగ్గుబాటి, నటుడు తిరువీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరువీర్ మాట్లాడుతూ– ‘‘బాపు’ ట్రైలర్లో మట్టివాసన కనిపించింది. దయాగారు చాలా మంచి సినిమా తీశారు’’ అన్నారు. ‘‘మన కుటుంబంలోని పాత్రలు ఈ సినిమాలో కనిపిస్తాయి.ఈ మూవీని అందరం ్రపోత్సహిద్దాం’’ అని దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ పేర్కొన్నారు. ‘‘బాపు’ మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఈ చిత్రానికి మంచి పేరు రావాలి’’ అన్నారు బ్రహ్మాజీ. ‘‘మా చిత్రాన్ని అందరూ థియేటర్స్‌లో చూడాలి’’ అని దయా కోరారు. ‘‘నా కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా ‘బాపు’’ అన్నారు సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్. -
బ్రహ్మాజీ 'బాపు' ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
విశ్వక్ సేన్ 'లైలా'మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
'మా మధ్య కాంపౌండ్స్ వేయకుర్రి'.. విశ్వక్ సేన్ అదిరిపోయే రిప్లై
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం రోజున అభిమానులను పలకరించనున్నారు. విశ్వక్ విభిన్నమైన పాత్రతో ఫ్యాన్స్‌ను అలరించనున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ అండ్ యాక్షన్ మూవీలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు.అయితే ఈవెంట్లో విశ్వక్ సేన్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. మీరు ఈవెంట్స్కైనా నందమూరి హీరోలను పిలుస్తుంటారు కదా? సడన్‌గా మెగాస్టార్(బాస్)ను పిలిచారు? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి విశ్వక్ సేన్ తనదైన స్టైల్లోనే అదిరిపోయే సమాధానం ఇచ్చారు. మాకు ఉన్నది ఒక్కటే కాంపౌండ్ అని విశ్వక్ సేన్ స్పష్టం చేశారు. మీరే మా మధ్య ఏదేదో సృష్టించవద్దని కోరారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ..' మా మధ్యలో కాంపౌండ్లు వేసేది మీరే. మాకు ఉన్నది ఇంటి కాంపౌండ్ ఒక్కటే. ఇక్కడ కంపౌండ్ లాంటివి ఏం లేవు. ఇండస్ట్రీ అంతా ఒక్కటే. బాస్ ఇజ్ బాస్. ప్రతిసారి వారిని ఇబ్బంది పెట్టి మా ఈవెంట్స్‌కు పిలవం కదా. మా నాన్న గారికి రాజకీయాల నుంచి చిరంజీవితో పరిచయం ఉంది. ఆ టైమ్‌లో మా డాడీ మలక్‌పేట్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నా చిన్నప్పటి నుంచి వారి మధ్య మంచి రిలేషన్ ఉంది. కానీ మీరు వచ్చి ఇక్కడ లేనీ పోనీ కాంపౌండ్స్ వేయకండి. మీరు వచ్చి మధ్యన లేనివీ సృష్టించకండి. ఇండస్ట్రీలో ఎప్పటికైనా మేమంతా ఒక్కటే. మేము మంచి ఉద్దేశంతో సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు వారిని పిలుస్తాం. అంతే తప్ప ఇక్కడ అలాంటివే ఉండవు. మీరొచ్చి దాంటో ఏమీ వేయకుర్రి ' అని కాస్తా గట్టిగానే బదులిచ్చారు. రిపోర్టర్: ఏ EVENT కి అయినా నందమూరి HEROS ని పిలుస్తారు.. ఈసారి #Chiranjeevi గారు ఎందుకు?#VishwakSen: మీరు COMPOUND అనకండి.. నాకున్నది మా ఇంటి COMPOUND మాత్రమే.. #Laila #NandamuriBalakrishna #JrNTR #TeluguFilmNagar pic.twitter.com/a6NQeMjo9j— Telugu FilmNagar (@telugufilmnagar) February 6, 2025 -
యాక్షన్... థ్రిల్
ఆకాశ్ మురళి(Akash Murali), అదితీ శంకర్ జంటగా ‘పంజా’ ఫేం విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. ‘నేసిప్పాయా’ పేరుతో తమిళంలో విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో ‘ప్రేమిస్తావా’(Premistava) పేరుతో ఈ నెల 30న విడుదల చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్‌లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా మేకింగ్, ఆర్ఆర్ చాలా బాగున్నాయి’’ అని చెప్పారు.‘‘ప్రస్తుతం సమాజంలో బంధాలు ఎలా ఉన్నాయి? అనేది మా చిత్రం చూపిస్తుంది’’ అన్నారు విష్ణువర్ధన్. ‘‘ప్రేమిస్తావా’ని అందరూ సపోర్ట్ చేయాలి’’ అని సహ నిర్మాత స్నేహ బ్రిట్టో కోరారు. ‘‘నా తొలి సినిమాను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయడం నా అదృష్టం’’ అని చెప్పారు ఆకాశ్ మురళి. ‘‘ఈ చిత్రంలో ప్రేమ, యాక్షన్, రొమాన్స్ ఉన్నాయి’’ అని తెలిపారు అదితీ శంకర్. -
ఈ ఒక్క పాత్ర చాలు.. ఇక రిటైర్ అయిపోతా: రష్మిక కామెంట్స్ వైరల్
పుష్ప-2 అభిమానులను అలరించిన రష్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం విక్కీ కౌశల్ సరసన ఛావా చిత్రంతో అలరించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఛావా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన రష్మిక ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఈ మూవీలో మరాఠా రాణి యేసుబాయి భోన్సాలే పాత్రలో నటించే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఇలాంటి గొప్ప పాత్ర చేయడం తనకెంతో సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ పాత్రతో ఇక తాను సినిమాల నుంచి రిటైర్ అయిపోయినా సంతోషమేనని రష్మిక వెల్లడించింది. ట్రైలర్ లాంఛ్ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. 'ఇది నాకు గొప్ప గౌరవం. మహారాణి యేసుబాయి పాత్రను పోషించడానికి దక్షిణాది అమ్మాయిగా చాలా సంతోషంగా ఉంది. నా సినీ కెరీర్లో అత్యంత విశేషమైన, ప్రత్యేకమైన పాత్ర. అందుకే నేను డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ సార్‌తో ఒక విషయం చెప్పాను. ఈ పాత్ర చేశాక నేను సంతోషంగా రిటైర్ అయిపోతా అని చెప్పా' అని అన్నారు.తననే ఈ పాత్రకు ఎంపిక చేయడంపై స్పందిస్తూ..' ఈ విషయంలో నేను షాక్ అయ్యా. అసలు లక్ష్మణ్ సర్ నాకు ఇలాంటి పాత్ర ఇవ్వాలని ఎలా డిసైడ్ చేశాడు. నాకు లక్ష్మణ్ సర్ ప్రత్యేక పాత్ర ఇవ్వడంతోనే ఫిదా అయిపోయా. ఇక్కడ నాకు భాషతో పాటు ప్రతిదీ చాలా రిహార్సల్‌గా అనిపించింది. కానీ లక్ష్మణ్ సార్‌కు ఏది అడిగినా చేయడానికి నేను ఉన్నా అన్న ధైర్యమిచ్చా' అని అన్నారు.గాయంతోనే ఈవెంట్‌కు..కాగా.. ఇటీవల రష్మిక మందన్నా కాలికి గాయమైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో మెరిసింది. కాలు ఎంత ఇబ్బంది పెడుతున్నా కుంటుతూనే ఈవెంట్‌కు హాజరైంది ముద్దుగుమ్మ.కాగా.. ఛావాలో విక్కీ కౌశల్ హీరోగా నటించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా కనిపించనున్నారు. ఈ చిత్రంలో అశుతోష్ రాణా, దివ్య దత్తా, నీల్ భూపాలం, సంతోష్ జువేకర్, ప్రదీప్ రావత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మడాక్ ఫిల్మ్స్ నిర్మించింది. ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. -
లవ్ అని చెప్పు...
అక్షయ్, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా, మరో హీరోయిన్ మమితా బైజు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డియర్ కృష్ణ’. దినేష్ బాబు దర్శకత్వంలో పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా చేసిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్–నటుడు శ్రీకాంత్ విడుదల చేశారు. ‘లైక్ ఎందుకు లవ్ అని చెప్పు’, ‘ఎల్లప్పుడూ విశ్వాసంతో నన్ను పూజిస్తుంటారో... వారికి నేనెప్పుడూ అండగా ఉంటాను’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ సంఘటనను ప్రేరణగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించాం. మొదటి వంద టికెట్లు బుక్ చేసిన వారిలో ఒకర్ని ఎంపిక చేసి, క్యాష్ బ్యాక్ కింద రూ. పదివేలు బహుమతి ఇవ్వడం జరుగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
అజయ్ దేవ్‌గణ్ ‘ఆజాద్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ HD మూవీ స్టిల్స్
-
నిజామాబాద్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
యుద్ధం మొదలైంది
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్కై ఫోర్స్’. వీర్ పహారియా, సారా అలీఖాన్, నిమ్రత్ కౌర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ మూవీని దర్శక ద్వయం సందీప్ కెవ్లానీ– అభిషేక్ అనిల్ కపూర్ తెరకెక్కించారు. 1965లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ వార్ నేపథ్యంలో భారతదేశపు మొదటి వైమానిక దాడి సంఘటనల ఆధారంగా ‘స్కై ఫోర్స్’ సినిమాను తీశారని బాలీవుడ్ సమాచారం.ఈ చిత్రంలో కమాండర్ కేవో అహుజా పాత్రలో అక్షయ్ కుమార్, టి. విజయ పాత్రలో వీర్ పహారియా నటించారు. దినేష్ విజయ్, జ్యోతీ దేశ్ పాండే, అమర్ కౌశిక్, సాహిల్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఆదివారం ‘స్కై ఫోర్స్’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.‘యుద్ధం మొదలైంది’, ‘..అండ్ ది మిషన్ ఈజ్ కాల్డ్ మిషన్ స్కై ఫోర్స్’, ‘కౌన్ జనాబ్... కౌన్ జనాబ్... తేరా బాప్... హిందూస్తాన్’, ‘విజయ రూల్స్‌ని బ్రేక్ చేశాడు...’, ‘సార్... అతడ్ని కనిపెట్టడంలో మనం పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి’, ‘మీరందరూ అతను ఓ పిచ్చివాడిలా ప్రవర్తించాడు అన్నారు. కానీ అతనికి ఉన్న ఆ పిచ్చి దేశభక్తి’ అనే డైలాగ్స్ విడుదలైన ట్రైలర్లో ఉన్నాయి. -
ఎవర్నువ్వు..!
‘అనగనగ ఒక రాజు ఉండేవాడు... చెడ్డవాళ్లంతా ఆయన్ను డాకు అనేవారు. మాకు మాత్రం మహారాజు...’ అంటూ మొదలవుతుంది ‘డాకు మహారాజ్’ సినిమా ట్రైలర్. బాలకృష్ణ(Daaku Maharaaj) హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ ( Daaku Maharaaj ). ఈ చిత్రంలో బాబీ డియోల్, మకరంద్ దేశ్‌పాండే, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. బాబీ కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా అమెరికాలోని డల్లాస్‌లో ‘డాకు మహారాజ్’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఎవర్నువ్వు... నానాజీ అమ్మా.., నీకు నువ్వే జీ అని పెట్టుకుంటే... నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా...’, ‘చెప్పింది వినాలి... ఇచ్చింది తీసుకోవాలి’, ‘వాడి ముందు నువ్వు కాదు... నేనుండాలి’, ‘అసలు ఎవడ్రా నువ్వు... మైఖేల్ జాక్సన్’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ట్రైలర్‌లోని సన్నివేశాలను బట్టి ‘డాకు మహారాజ్’ చిత్రంలోని బాలకృష్ణ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ‘‘యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన ‘డాకు మహారాజ్’ చిత్రం ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: తమన్. -
Game Changer : ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ డేట్, ముహుర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ట్రైలర్ జనవరి 1న విడుదల చేస్తామని ఇటీవల విజయవాడలో దిల్ రాజు ప్రకటించారు. కానీ ఒక రోజు ఆలస్యంగా రెండో తేదీకి మారింది. హైదరాబాద్‌లోనే గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నారు. అయితే మెగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆయన చేతుల మీదుగానే గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. గురువారం సాయంత్రం 05:04 గంటలకు గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల కానుంది.(ఇది చదవండి: గేమ్ ఛేంజర్ కటౌట్ వరల్డ్ రికార్డ్.. ట్రైలర్ డేట్ ప్రకటించిన దిల్ రాజు)256 అడుగుల రామ్ చరణ్ కటౌట్..ఇటీవల ఏపీలో రామ్ చరణ్ భారీ కటౌట్‌ను ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. విజయవాడలో దాదాపు 256 అడుగులతో ఏర్పాటు చేసిన కటౌట్‌ను నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. ఈ భారీ కటౌట్‌కు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఈ సందర్భంగా దిల్ రాజుకు అవార్డ్‌ను అందజేశారు. కాగా.. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో ఈ కటౌట్‌ను సిద్ధం చేశారు. ఈ భారీ కటౌట్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు దక్కింది.కాగా.. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో కోలీవుడ్ సూపర్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. Drum roll, please 🥁The one and only @ssrajamouli is making a spectacular entry at the #GameChangerTrailer launch on January 2nd! 😎💥See you tomorrow at 5:04 PM!#GameChanger#GameChangerOnJAN10 🚁Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @yoursanjali… pic.twitter.com/sdrTfzxLMi— Sri Venkateswara Creations (@SVC_official) January 1, 2025 -
బచ్చలమల్లి హిట్ అవుతుంది: నాని
‘‘బచ్చలమల్లి’ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. టీజర్, ట్రైలర్ అదిరిపోయాయి. నరేష్ హిట్ కొడతాడనే నమ్మకం ఆడియన్స్ లో కూడా వచ్చేసింది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. ఏ రేంజ్ బ్లాక్‌బస్టర్ అనేది కాలమే నిర్ణయిస్తుంది’’ అని నాని అన్నారు. ‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘బచ్చలమల్లి’. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిచన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ఈ నెల 20న విడుదల కానుంది.ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగాపాల్గొన్న నాని మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీజర్ చూసి, నరేశ్‌కి ఫోన్ చేశాను. ఈ సినిమా కోసం ఏదైనా చేయాలని ఉందని చెప్పి, నాకు నేనుగా ఈ ఈవెంట్‌కు వచ్చాను. ట్రైలర్లోనే సుబ్బు కథ చె΄్పాలనుకున్నాడంటే, సినిమాలో ఇంకా నిజాయతీగా ప్రయత్నించి ఉంటాడని ఊహించగలను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ క్రిస్మస్ మనదే’’ అన్నారు. ‘‘నాని మా ఫ్యామిలీ మెంబర్. 16 ఏళ్ల నుంచి మా ప్రయాణం కొనసాగుతోంది. నా ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు నాకు కొంత టెన్షన్ ఉంటుంది. కానీ, ఈ సినిమా విషయంలో నాకు ఎలాంటి టెన్షన్ లేదు. ఆల్రెడీ హిట్ కొట్టేసాం అనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. ‘‘మజ్ను’ టైమ్ నుంచి నానిగారు నాకు తెలుసు.ఆయన ఈవెంట్‌కి రావడమే ఓ బ్లాక్‌బస్టర్ కొట్టేశామనే ఫీలింగ్ కలుగుతోంది. నేను రాసిన దాన్ని నరేశ్‌గారు అర్థం చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది’’ అని పేర్కొన్నారు. దర్శకుడు సుబ్బు మంగాదేవి. ‘‘ఈ క్రిస్మస్కి బచ్చలమల్లి మోత మోగిపోద్ది. సినిమా విజయం పట్ల టీమ్ అంతా నమ్మకంతో ఉన్నాం’’ అని తెలిపారు రాజేష్ దండా. -
గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో...
జో శర్మ, సంబీత్ ఆచార్య లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ఎమ్ 4 ఎమ్’ (మోటివ్ ఫర్ మర్డర్). మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించారు. మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్విన్ గ్రూప్ (యూఎస్ఏ) బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం హిందీ ట్రైలర్‌ని ఈ నెల 23న గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో విడుదల చేయనున్నారు. -
'రికార్డుల్లో పుష్ప పేరు ఉండడం కాదు.. పుష్ప పేరు మీదే రికార్డులు ఉంటాయి'
ఇప్పుడంతా ఎక్కడ చూసినా పుష్ప-2 పేరే వినిపిస్తోంది. కేవలం వినిపించడమే కాదు..డైలాగ్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఆదివారం పుష్ప-2 ట్రైలర్ రిలీజైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పుష్ప ఫీవర్ మొదలైంది. బన్నీ ఫ్యాన్స్ సందడి అయితే అంతా ఇంతా కాదు. ఏ నగరంలో చూసిన టపాసులు పేలుస్తూ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పటికే యూట్యూబ్‌లో ఎప్పుడు లేని రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది.అయితే ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప రాజ్.. మరో క్రేజీ రికార్డ్ నమోదు చేశాడు. బిహార్‌లో పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను ఏకంగా 2.6 లక్షల మంది లైవ్‌లో వీక్షించారు. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా ఈ రికార్డ్‌ను సాధించలేదు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను పుష్ప టీమ్ ట్విటర్లో పంచుకుంది. దీంతో పుష్ప-2 రికార్డులు చూస్తుంటే ఏ ఇండియన్ సినిమాకు ఇప్పట్లో అందేలా కనిపించడం లేదు. కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్-1 బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2021 డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం పలు రికార్డులు నమోదు చేసింది. వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనున్న పుష్ప-2 ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో వేచి చూడాల్సిందే. His arrival means one thing - the existing records tumble 💥💥#Pushpa2TheRuleTrailer launch event registers the highest number of live viewers for an event with 2.6 LAKH concurrent viewers❤🔥❤🔥#RecordBreakingPushpa2TRAILER 🌋🌋▶️ https://t.co/FKXAngle5q… pic.twitter.com/vuCpMypShD— Pushpa (@PushpaMovie) November 18, 2024 -
'ఆ విషయంలో నన్ను క్షమించండి'.. ఫ్యాన్స్‌కు ఐకాన్ స్టార్ రిక్వెస్ట్
ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్‌గా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా బిహార్‌లోని పాట్నాలో జరిగిన భారీ ఈవెంట్లో పుష్ప-2 ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు హాజరైన అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వేదికపై మాట్లాడారు.బన్నీ మాట్లాడుతూ..' నమస్తే.. బీహార్ గడ్డకు, ప్రజలందరికీ నా శతకోటి ప్రణామాలు.. బీహార్‌కు మొదటిసారి వచ్చా. మీ ప్రేమ, అభిమానానికి నా ధన్యవాదాలు. పుష్ప ఎప్పుడు తలవంచలేదు.. కానీ మొదటిసారి మీ ప్రేమకు తలవంచుతున్నా. మీరంతా ఎలా ఉన్నారు? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫ్లవర్ కాదు వైల్డ్ ఫైర్. నా హిందీ కొంచెం బాగుండదు. ఈ విషయంలో నన్ను క్షమించండి. పుష్పపై మీరు చూపిస్తున్న ప్రేమకు ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా. మీ ప్రేమే ఈ సినిమా ఇంత గొప్పగా తీయడానికి, ఇంత గొప్పగా అందరికీ నచ్చడానికి కారణం. పుష్ప టీమ్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈవెంట్‌కు సహకరించిన పోలీసులు, అభిమానులకు థ్యాంక్స్. డిసెంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్‌గా రాబోతోంది. అందరికీ నచ్చుతుంది. థ్యాంక్యూ బీహార్. థ్యాంక్యూ పాట్నా' అంటూ ఐకాన్ స్టార్ మాట్లాడారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా... ఫ్లవర్ కాదు..’ అంటూ డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు ఐకాన్ స్టార్.హీరోయిన్ రష్మిక మందన్నా మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. ఇంతటి ప్రేమను అందించిన పాట్నా ప్రజలందరికీ నా ధన్యవాదాలు. పుష్ప శ్రీవల్లి ఈ కార్యక్రమానికి మీ అందరిని ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నా. ఈ చిత్రం కోసం రెండు సంవత్సరాల మీ ఎదురుచూపులు కచ్చితంగా మీరు ఊహించిన దానికి మించి ఉంటుందిన. ఇంతమంది అభిమానులు పుష్ప ప్రపంచంలోకి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చూడాలని నేను కోరుకుంటున్నా' అని అన్నారు శ్రీవల్లి.కాగా.. ఈ ఈవెంట్లో భారీ ఎత్తున ఐకాన్ స్టార్స్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్ షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ రిలీజైన మాస్ ట్రైలర్ ఏకంగా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టనుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పుష్ప 2 ట్రైలర్ చూసేయండి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న పుష్ప-2 థియేటర్లలో విడుదల కానుంది. -
పాట్నాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ హంగామా!
-
పాట్నాలో ఐకాన్ స్టార్.. ఎయిర్‌పోర్ట్‌లో గ్రాండ్ వెల్కమ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చింది. ఈ మూవీ ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేయనున్నారు. పాట్నాలో ఏర్పాటు భారీ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఈవెంట్లో పాల్గొనేందుకు ఐకాన్ స్టార్ ఇప్పటికే పాట్నా చేరుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కు ఘనస్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.నగరంలో గాంధీ మైదానంలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను భారీస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రబృంద సభ్యులు పాట్నా చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల మూడు నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల చేయనున్నారు.Pushpa Raj aka @alluarjun is arriving in style to rule Patna! 💥Get ready for the MASSIVE #Pushpa2TheRuleTrailer Launch Event at Gandhi Maidan! ❤️🔥Watch Live Here 👇 https://t.co/JTQseKpgjQEvent by @MediaYouwe#Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/HPG6eegYUJ— YouWe Media (@MediaYouwe) November 17, 2024 -
గన్నులు కాల్చి స్వాగతిస్తాం.. బిహార్‌లో 'పుష్ప 2' క్రేజ్
'పుష్ప 2' ట్రైలర్ ఈ రోజు (ఆదివారం) సాయంత్రం రిలీజ్ కానుంది. బిహార్‌లోని పాట్నాలో గ్రాండ్ ఈవెంట్ ఉంది. అయితే ఊరు కాని ఊరులోనూ 'పుష్ప' క్రేజ్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ట్రైలర్ ఈవెంట్ పాసుల కోసం బిహారీలు ఎగబడుతున్నారు. సినిమాలోని డైలాగ్స్ చెబుతూ, పాటలు పాడుతూ తెగ సంబరపడిపోతున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? తిలక్-సూర్య డిస్కషన్)మరికొందరైతే 'పుష్ప' మూవీకి గన్నులు పేల్చి మరీ స్వాగతం పలుకుతామని అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతున్నాయి. ఇదంతా చూస్తుంటే చాలామంది బాలీవుడ్ హీరోలకు సాధ్యం కాని విధంగా నార్త్‌లోనూ బన్నీ క్రేజ్ సంపాదించాడనిపిస్తోంది.ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కే ఈ రేంజ్ రచ్చ జరుగుతుందంటే.. ఇక సినిమా వస్తే నార్త్ ఆడియెన్స్ ఇంకా ఏమేం చేస్తారో అనిపిస్తోంది. సాయంత్రం 6:03 గంటలకు 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ అవుతుంది. డిసెంబరు 5న పాన్ ఇండియా వైడ్ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లకు పైగా జరిగినట్లు టాక్.(ఇదీ చదవండి: 'పుష్ప 2' చూసి భయపడ్డాను: తమన్)A mataki ah maata North Audience mathram movie ni gattiga ne own cheskunnaru and dhaniki taggatte team kuda promotions manchiga plan cheskunnaru, north lo mathram bhAAi @alluarjun esari gattiga ne kottela vunnadu..#AlluArjun #Pushpa2TheRuleTrailer #Pushpa2 #Pushpa2TheRule pic.twitter.com/ZMHzojospb— poorna_choudary (@poornachoudary1) November 16, 2024Orey 😂😹 #Pushpa2TheRule #Pushpa2 pic.twitter.com/c1FGxVmRsP— Race Gurram (@racexgurram) November 16, 2024idhi AAdi Range 🥵💥 Ap TS Daatithey Okkadu Dekadu 🐕 ni , Lanj*dka*llara , miru AA ni anadam #Pushpa2TheRule #Pushpa2 #Pushpa2Trailer #AlluArjun𓃵 @alluarjunpic.twitter.com/GrioVKCBBn— ..... (@Icon_Sanjuu) November 16, 2024 View this post on Instagram A post shared by BUSTARD_BABAI_ (@bustard_babai) -
'దేవకీ నందన వాసుదేవ' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘జీబ్రా’ మెగా ట్రైలర్ రిలీజ్ వేడుక..ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)
-
అది మా తప్పు.. ప్రేక్షకులది కాదు: చిరంజీవి
‘‘నాలుగైదు పెద్ద సినిమాలు ఆడినంత మాత్రాన ఇండస్ట్రీ ఓహో అన్నట్లు కాదు. చిన్న సినిమాలు కూడా ఆడాలి. చిన్న, పెద్ద సినిమాలతో ఇండస్ట్రీ కళకళలాడాలి అనుకునే మాలాంటి వాళ్లకి, నాకు ఒకరకమైన బెరుకు వచ్చింది. కరోనా తర్వాత ఏ సినిమాలు చేయాలి? ఎలాంటి సినిమాలు చేసి రాణించాలి? అని. కానీ, అవన్నీ కరెక్ట్ కాదు. ప్రేక్షకుల్లో ఎప్పుడూ తప్పు ఉండదు. ఏదైనా తప్పు ఉండి సినిమాలు ఆడలేదు, రాణించలేదు అంటే అది వేదికపై ఉన్న మా అందరిదే తప్పు.. ప్రేక్షకుల తప్పు కానే కాదు’’ అని హీరో చిరంజీవి అన్నారు. సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జీబ్రా’. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అన్నది ట్యాగ్‌లైన్ . ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్ పిక్కినాటో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో సునీల్, సత్యరాజ్, సత్య అక్కల కీలక పాత్రలు పోషించారు. పద్మజ ఫిల్మ్స్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్‌పై ఎస్ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘జీబ్రా’ మెగా ట్రైలర్ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘2024 ‘హను–మాన్’ సినిమాతో శుభారంభం అయింది. అది తెలుగు సినిమా అనుకుంటే ఆల్ ఇండియా సినిమా అయిపోయింది. అక్కడి నుంచి చిన్న సినిమాల పట్ల ప్రారంభమైన ఈ ఆదరణ నిæ పెద్ద సినిమాల స్థాయికి మార్చారు మన తెలుగు ప్రేక్షకులు. ఆ తర్వాత వచ్చిన చిన్న సినిమాలు ‘కమిటీ కుర్రోళ్లు’, ‘టిల్లు స్క్వేర్, ఆయ్, మత్తు వదలరా 2’ ఇలా వరుసగా హిట్లు వచ్చాయి. మొన్న దీపావళికి వచ్చిన ‘అమరన్, క, లక్కీ భాస్కర్’ సినిమాలు ఎంతో ఆదరణ పొందాయి. ఈ సినిమాలో స్టార్లు లేరు.. పెద్ద డైరెక్టర్లు లేరు.. కోట్ల బడ్జెట్ లేదు. కానీ, కంటెంట్ ఉంది. అది సినిమాలకి ఆయువుపట్టు. కంటెంట్ బాగుండి, వినోదాన్ని అందించగలిగితే ఆస్వాదించడానికి ఎప్పుడూ ప్రేక్షకులు రెడీగా ఉంటారు.‘జీబ్రా’లో కూడా మంచి కంటెంట్, వినోదం, ఫ్యామిలీ అంశాలతో పాటు భావోద్వేగాలు.. అద్భుతమైన నటీనటులు ఉన్నారు. కచ్చితంగా ‘జీబ్రా’ సూపర్‌హిట్టు అవుతుంది.. అవ్వాలి.. అవుతుంది’’ అని చెప్పారు. సత్యదేవ్ మాట్లాడుతూ–‘‘కెరీర్ పరంగా ఇండస్ట్రీలో నేను చాలా లోగా ఉన్నప్పుడు చిరంజీవి అన్నయ్యగారు పిలిచి ‘గాడ్ ఫాదర్’లో విలన్‌గా అవకాశం ఇచ్చారు. నా జీవితంలో పెద్ద హై ఇచ్చిన సినిమా అది. నా కెరీర్లో ‘జీబ్రా’ చాలా పెద్ద సినిమా. ఈ సినిమాని అన్నయ్యకి అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ‘‘వాల్తేరు వీరయ్య’ లో బాబీ చేసిన క్యారెక్టర్ని నేను చేయాల్సింది. కానీ, మిస్ అయ్యాను’’ అని తెలిపారు డాలీ ధనంజయ. ‘‘జీబ్రా’ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు ఈశ్వర్ కార్తీక్, ఎస్ఎన్ రెడ్డి. ‘‘తెలుగు ప్రేక్షకులు మంచి కథ ఉన్న సినిమాల్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. మా చిత్రం కూడా చాలా మంచి కంటెంట్‌తో రూపొందింది’’ అని దినేష్ సుందరం, బాల సుందరం చెప్పారు. ఈ వేడుకలో నిర్మాత వై.రవి శంకర్, డైరెక్టర్స్ ప్రశాంత్ వర్మ, వెంకటేశ్ మహా, కెమెరామేన్ సత్య పొన్మార్, సంగీత దర్శకుడు రవి బస్రూర్, నటీమణులు అమృత అయ్యంగార్, జెన్నీఫర్ పిక్కినాటో, ఎడిటర్ అనిల్ క్రిష్, లిరిక్ రైటర్ పూర్ణాచారి మాట్లాడారు. -
హీరో వరుణ్ తేజ్ మూవీ మట్కా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
హీరో సూర్య ‘కంగువ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
లక్కీ భాస్కర్ నాకు చాలా ప్రత్యేకం: దుల్కర్ సల్మాన్
‘‘దాదాపు 14 నెలల తర్వాత నా నుంచి వస్తున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇందులో వినోదం, భావోద్వేగాలు, సంగీతం బాగుంటాయి. కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఉంటాయి. ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. అలాగే ఈ సినిమా కూడా అన్నివర్గాల వారికి నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అని దుల్కర్ సల్మాన్ తెలిపారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’.దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న తెలుగు, మలయాళ, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ–‘‘ఇప్పటివరకు నేను చేసిన ΄పాత్రల్లో ఈ చిత్రంలో చేసిన సుమతి నాకు బాగా ఇష్టమైన ΄పాత్ర’’ అన్నారు. ‘‘బ్యాంకింగ్ నేపథ్యంలో కుటుంబ భావోద్వేగాలతో నడిచే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అని సూర్యదేవర నాగవంశీ తెలిపారు. -
విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
త్వరలోనే ఆ రుణం తీర్చుకుంటాను: సాయి రాజేష్
‘‘నేను తీసిన ‘హృదయ కాలేయం’ సినిమా ఆడియో ఫంక్షన్‌కి వచ్చి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్కిట్ చేశాడు రాకేష్. ఆ రోజు మాకు సపోర్ట్ చేసిన తనకి కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ రాస్తానని మాట ఇచ్చాను. త్వరలోనే ఆపాత్ర రాసి రుణం తీర్చుకుంటాను. ‘కేసీఆర్’ సినిమా ట్రైలర్ బావుంది. సినిమా విజయం సాధించి, రాకేష్ మంచి స్థాయికి వెళ్లాలి’’ అని డైరెక్టర్ సాయి రాజేష్ అన్నారు. ‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్). ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య కృష్ణన్ కథానాయికగా నటించారు.రాకింగ్ రాకేష్ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ– ‘‘లంబాడీ వర్గానికి చెందిన ఓ యువకుడి నిజ జీవితం నుంచి స్ఫూర్తి పొందిన చిత్రమిది’’ అని తెలిపారు. ‘‘కేసీఆర్’కి నేను దర్శకత్వం వహించడంతోపాటు సినిమాటోగ్రఫీ కూడా అందించాను. రాకేష్ అద్భుతమైన కథ రాశారు’’ అని ‘గరుడవేగ’ అంజి చెప్పారు. నటి అనసూయ మాట్లాడుతూ– ‘‘కొన్ని డబ్బులు సంపాదిస్తే ఇల్లు, కారు కొనుక్కోవాలనుకుంటారు. కానీ, రాకేష్ మాత్రం ‘కేసీఆర్’లాంటి ఒక మంచి సినిమా తీశాడు’’ అని పేర్కొన్నారు. -
పొట్టేల్ రియల్‌పాన్ ఇండియన్ మూవీ: సంయుక్తా మీనన్
‘‘పొట్టేల్’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఈ కథ మీద డైరెక్టర్ సాహిత్ నాలుగేళ్లు పని చేయడం మామూలు విషయం కాదు. మంచి రైటింగ్, డైరెక్షన్ ఉంటేనే ఇంత అద్భుతమైన సినిమా తెరపైకి వస్తుంది. ఈ ట్రైలర్లో ఫస్ట్ షాట్ చూసినప్పుడు ఒక రియల్‌పాన్ ఇండియన్ ఫిల్మ్‌లా అనిపించింది’’ అని హీరోయిన్ సంయుక్తా మీనన్ అన్నారు. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో అజయ్ కీలకపాత్రలో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన సంయుక్తా మీనన్ మాట్లాడుతూ– ‘‘నిశాంక్గారు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు చాలా ΄ప్యాషన్నేట్ ప్రోడ్యూసర్ అనిపించింది. ఇలాంటి ΄ప్యాషన్ ఉన్న నిర్మాతలు పరిశ్రమకి కావాలి’’ అన్నారు. అనన్య నాగళ్ల మాట్లాడుతూ– ‘‘ట్రైలర్లో చూసింది ఒక శాతం మాత్రమే. ఈ చిత్రంలో గొప్ప కథ ఉంది’’ అని చెప్పారు. ‘‘చాలా ప్రేమించి ఈ చిత్రం చేశాం’’ అన్నారు యువ చంద్రకృష్ణ. ‘‘ప్రేక్షకుల స్పందన కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని సాహిత్ మోత్కూరి పేర్కొన్నారు. ‘‘మంచి కంటెంట్‌తో నిర్మించిన ఈ చిత్రం పెద్ద సౌండ్ చేయబోతోంది. సాహిత్ అద్భుతంగా తీశాడు’’ అని నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే తెలిపారు. -
ఉగ్రావతారం
‘‘హైదరాబాద్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. నా భర్త ఉపేంద్రగారిని తొలిసారి ఇక్కడే కలిశాను. అందుకే హైదరాబాద్ నాకు చాలా లక్కీ సిటీ. నా కెరీర్లో తొలి యాక్షన్ ఫిల్మ్ ‘ఉగ్రావతారం’. ఈ పాత్రకు నేను సరిపోతానని డైరెక్టర్ గురుమూర్తిగారు నమ్మారు. నా మొదటి పాన్ ఇండియన్ మూవీని అందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అని నటి ప్రియాంకా ఉపేంద్ర అన్నారు. ప్రియాంకా ఉపేంద్ర లీడ్ రోల్లో గురుమూర్తి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉగ్రావతారం’.ప్రియాంకా ఉపేంద్ర సమర్పణలో ఎస్జీ సతీష్ నిర్మించిన ఈ సినిమా నవంబరు 1న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ఈ చిత్రం ట్రైలర్, సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. నిర్మాత రాజ్ కందుకూరి ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా, నిర్మాత కరాటే రాజు, నటుడు సత్యప్రకాశ్ పాటను రిలీజ్ చేశారు. డైరెక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరిగే అన్యాయాలు, అఘాయిత్యాలపై మంచి సందేశాత్మాక చిత్రంగా ‘ఉగ్రావతారం’ ఉంటుంది’’ అన్నారు. -
వెతకక్కర్లేదు.. వచ్చేశాడు!
‘రాజ రాజ చోర’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో శ్రీ విష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘శ్యాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.‘‘ఈ వంశ ఖజానా వారసుడు దొరకడం అంత సులువు కాదు.. ఈ తరంలో వాడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు...’, ‘వెతకక్కర్లేదు..వచ్చేశాడు!’, ‘మా వంశాన్ని వెతుక్కుంటూ వచ్చేసరికి ఇంతకాలం పట్టింది’ వంటి డైలాగ్స్ ‘శ్యాగ్’ సినిమా ట్రైలర్లో ఉన్నాయి. రీతూ వర్మ హీరోయిన్ గా, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్ నటించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించారు. -
రవితేజ చాలా మందికి హెల్ప్ చేసారు..
-
Mr. Idiot: మూవీ ట్రైలర్ లాంచ్
-
'మిస్టర్ ఇడియట్' మూవీతో హీరోగా రవితేజ వారసుడి ఎంట్రీ..(ఫొటోలు)
-
ఎన్టీఆర్ ‘దేవర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Devara Trailer: ఆ ధైర్యాన్ని సంపే భయాన్ని ఐతా!
‘అసలు ఎవరు వాళ్లంతా..’ అనే డైలాగ్‌తో ‘దేవరపార్ట్1’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘దేవరపార్ట్ 1’. జాన్వీకపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ కీలకపాత్రల్లో నటించారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మించిన ‘దేవరపార్ట్ 1’ ఈ నెల 27న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో ‘దేవరపార్ట్ 1’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మంగళవారం ముంబైలో ఘనంగా నిర్వహించారు. నిర్మాత కరణ్ జోహార్, డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని( నటి రవీనా టాండన్ భర్త) సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ‘మనిషికి బతికేంత ధైర్యం చాలు.. చంపేంత ధైర్యం కాదు... కాదు కూడదు అని మీరు మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని సంపే భయాన్ని ఐతా’, ‘పనిమీద ΄÷య్యినోడైతే పని అవ్వంగానే తిరిగొస్తాడు.. పంతం పట్టిపోయిండాడు నీ కొడుకు’ అంటూ ఎన్టీఆర్ చెప్పే పవర్ఫుల్ డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. -
రేవు మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
ఘనంగా బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
సుదర్శన్ థియేటర్లో ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
-
మన సినిమాతో ఈ నెలాఖరు అదిరిపోతుంది: నాని
‘‘హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ నాకు చాలా స్పెషల్. ఈ థియేటర్లో మీ అందరితో (అభిమానులు, ప్రేక్షకులు) కలసి ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ లాంచ్ వేడుక చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన సినిమాతో ఈ నెలాఖరు అదిరిపోతుంది. మీ ప్రేమను నాపై ఇలానే చూపిస్తూ ఉంటే వంద శాతం కష్టపడి మరిన్ని మంచి చిత్రాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటా’’ అని హీరో నాని అన్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ– ‘‘29న థియేటర్స్‌లో ‘సరిపోదా శనివారం’ని సెలబ్రేట్ చేసుకుందాం’’ అన్నారు.నటుడు ఎస్జే సూర్య మాట్లాడుతూ– ‘‘చాలా మంచి కంటెంట్ ఉన్న చిత్రం ఇది.. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘గ్యాంగ్ లీడర్’ సినిమా తర్వాత నానీగారితో ‘సరిపోదా శనివారం’ చేశాను. అందరూ కుటుంబంతో వెళ్లి మా సినిమా చూడండి’’ అని ప్రియాంకా అరుళ్ మోహన్ చెప్పారు. ‘‘మా సినిమా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది’’ అన్నారు డీవీవీ దానయ్య. -
హీరో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పని ఇంపార్టెంట్... పేరు కాదు
‘సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు... సంపద కాపాడేవాడు కూడా సైనికుడే...’ అనే డైలాగ్‌తో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ట్రైలర్ప్రారంభం అవుతుంది. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ‘నోప్రాబ్లమ్ సార్.. నాకు పని ఇంపార్టెంట్.. పేరు కాదు, ఉయ్ ఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని నిరూపిస్తా, ఆగస్టు 15న ఏం జరిగిందో తెలుసా మీకు.. ఆ రోజు 70ఎంఎం స్టీరియో ఫోనిక్ ‘షోలే’ రిలీజ్ అయింది’ అంటూ రవితేజ చెప్పే డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. -
ఆ పిచ్చి తగ్గక డైరెక్టర్ ని అయ్యా..
-
Ram Pothineni: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
'ఖేల్ ఖేల్ మే' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మెరిసిన వాణి కపూర్ , ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)
-
‘కమిటీ కుర్రోళ్ళు’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Anasuya Bharadwaj: Simbaa మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
అశ్విన్ ‘శివం భజే’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
అశ్విన్ కెరీర్లో శివం భజే నిలిచిపోతుంది: విశ్వక్ సేన్
‘‘శివం భజే’ ట్రైలర్ బాగుంది. నేపథ్య సంగీతం అదిరిపో యింది. ఆగస్ట్ 1న అశ్విన్‌కు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాను. తన కెరీర్లో ‘శివం భజే’ నిలిచిపోతుంది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవన్షీ జోడీగా అప్సర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘శివం భజే’. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 1న విడుదలవుతోంది.మంగళవారం జరిగిన ‘శివం భజే’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి విశ్వక్ సేన్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు తమన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘‘శివం భజే’ ట్రైలర్ బాగుంది. యూనిట్‌కి ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలి’’ అన్నారు అనిల్ రావిపూడి.‘‘అశ్విన్ క్రికెట్లో బాల్‌ను ఎలా బాదుతాడో బాక్సాఫీస్‌ను కూడా అలానే బాదాలి’’ అన్నారు తమన్. ‘‘పరమేశ్వరుడి కథతో రూపొందిన ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అన్నారు అప్సర్. ‘‘ముస్లిం అయిన అప్సర్గారు ‘శివం భజే’ లాంటి కథను ఎలా రాశారో అనుకున్నాను. ఇదంతా శివ లీల అనిపించింది’’ అని అన్నారు అశ్విన్‌బాబు. -
పుట్టిన ఊరు కోసం...
‘బిగ్‌బాస్’ ఫేమ్ అలీ రేజా, సీతా నారాయణన్ జోడీగా నటించిన చిత్రం ‘రామ్ ఎన్ ఆర్ఐ’. ‘పవర్ ఆఫ్ రిలేషన్ షిప్’ అనేది ఉపశీర్షిక. ఎన్.లక్ష్మీ నందా దర్శకత్వం వహించారు. ఎస్ఎంకే ఫిల్మ్స్ సింగులూరి మోహన్ కృష్ణ సమర్పణలో మువ్వా సత్యనారాయణ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదలఅవుతోంది.ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నిర్మాతలు ప్రసన్న కుమార్, సాయి వెంకట్, రామకృష్ణ గౌడ్, రామ సత్యనారాయణ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎన్.లక్ష్మీ నందా మాట్లాడుతూ– ‘‘పుట్టిన ఊరు కోసం ఎన్ఆర్ఐలు ఏం చేశారు? అనే కథాంశంతో ‘రామ్ ఎన్ ఆర్ఐ’ రూపొందింది’’ అన్నారు. ‘‘లక్ష్మీ నందాగారితో సోలోగా ఓ సినిమా తీస్తున్నాను’’ అన్నారు సింగులూరి మోహన్ కృష్ణ. ‘‘మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు మువ్వా సత్యనారాయణ. నటుడు రవి వర్మ మాట్లాడారు. -
కామెడీ లవ్ ఎంటర్టైనర్గా ‘జస్ట్ ఏ మినిట్’
అభిషేక్ పచ్చిపాల హీరోగా, నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’. కామెడీ లవ్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాను యశ్వంత్ దర్శకత్వంలో తన్వీర్, ప్రకాశ్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో హీరో అభిషేక్ మాట్లాడుతూ –‘‘సినిమా మొత్తం ఫన్ ఉంటుంది. ఈ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరచదు. బాజీ మ్యూజిక్ ఓ హైలైట్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ వేడుకలో నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్, సారిపల్లి సతీష్, జబర్దస్త్ ఫణి మాట్లాడారు. -
అద్దంకి దయాకర్ ‘ఇండియా ఫైల్స్’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
'ఆపరేషన్ రావణ్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆదిపర్వం మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
తిరగబడరా స్వామి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో మాల్వీ మల్హోత్రా.. పోటోలు
-
డార్లింగ్ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
అల్లు శిరీష్ 'బడ్డీ' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
యేవమ్ అంటే...
చాందినీ చౌదరి, వశిష్ఠ సింహా, భరత్‌రాజ్, అషు రెడ్డి ముఖ్య తారలుగా రూపొందిన సినిమా ‘యేవమ్’. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. చాందినీ చౌదరి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రకథ వికారాబాద్ నేపథ్యంలో జరుగుతుంది. తెలంగాణ కల్చర్‌కు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. నేను మొదటిసారి పోలీసాఫీసర్‌గా నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. సైకలాజికల్ ఎమోషన్స్ చాలా ఉంటాయి’’ అన్నారు. ‘‘యేవమ్’ అంటే ‘ఇది ఇలా జరిగింది’ అని అర్థం. విభిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్న నలుగురు వ్యక్తులు అనుకోని పరిస్థితుల్లో కలుసుకుని, అక్కడి నుంచి వారి ప్రయాణాన్ని మొదలు పెడితే ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమా కథాంశం’’ అన్నారు ప్రకాశ్. -
కృష్ణగారు యాక్షన్ సినిమాలు చేయమనేవారు: సుధీర్‌బాబు
‘‘సూపర్‌స్టార్ కృష్ణగారి జయంతి (మే 31) సందర్భంగా ‘హరోం హర’ మూవీ ట్రైలర్‌ని లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది. యాక్షన్ సినిమాలు చేయమని కృష్ణగారు చెప్పే వారు. ‘హరోం హర’ విషయంలో ఆయన ఆనందపడతారని నమ్ముతున్నాను. తెలుగు, ఇండియన్ సినిమాలో ఇప్పటివరకూ ‘హరోం హర’లాంటి నేపథ్యం ఉన్న సినిమా రాలేదనుకుంటున్నాను’’ అన్నారు సుధీర్‌బాబు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్‌బాబు, మాళవికా శర్మ జంటగా నటించిన చిత్రం ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి. నాయుడు నిర్మించారు.ఈ సినిమా ట్రైలర్‌ను హీరో మహేశ్‌బాబు గురువారం సోషల్ మీడియాలో రిలీజ్ చేసి, ‘ట్రైలర్ ఆసక్తిగా ఉంది. సుధీర్‌బాబు, టీమ్‌కు శుభాకాంక్షలు’ అన్నారు. అనంతరం నిర్వహించిన ట్రైలర్ లాంచ్ వేడుకకి దర్శకులు అనిల్ రావిపూడి, సంపత్ నంది అతిథులుగా హాజరయ్యారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ–‘‘హరోం హర’లో హీరో పాత్ర గురించి సింగిల్ లైన్లో చెప్పాలంటే జేమ్స్ బాండ్ ఇన్ కుప్పం లేదా రాంబో ఇన్ కుప్పం అనొచ్చు’’ అన్నారు.‘‘ఈ సినిమా సుధీర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టవుతుంది’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘ఈ మూవీ ట్రైలర్ టెరిఫిక్‌గా అనిపించింది’’ అన్నారు సంపత్ నంది. ‘‘హరోం హర’లో రెండు వేల మందితో షూట్ చేసిన ఓ సీక్వెన్స్ థియేటర్స్‌లో అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు జ్ఞానసాగర్ ద్వారక. ‘‘నేనిప్పటివరకూ చేయని పాత్రను ఈ సినిమాలో చేశాను’’ అన్నారు మాళవికా శర్మ. ‘‘మా సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు సుమంత్ జి. నాయుడు. నిర్మాతలు సుబ్రహ్మణ్యం, కేఎల్ దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్, సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ పాల్గొన్నారు. -
బాహుబలిలా వెపన్
‘‘ప్రస్తుతం భాష అనేది హద్దుగా లేదు. ‘బాహుబలి’ సినిమా ఎన్నో భాషల్లో విడుదలైంది. మా ‘వెపన్’ మూవీ కూడా అలాంటి చిత్రమే. సూపర్ హ్యూమన్ సాగా కాన్సెప్ట్‌తో రానున్న ఈ మూవీ కొత్త ట్రెండ్ కావడంతో పాటు పెద్ద హిట్టవుతుంది’’ అని నటుడు సత్యరాజ్ అన్నారు. గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘వెపన్’.ఎంఎస్ మన్జూర్ సమర్పణలో మిలియన్ స్టూడియో బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గుహన్ సెన్నియప్పన్ మాట్లాడుతూ– ‘‘ఇదొక స్కైఫై థ్రిల్లర్, యాక్షన్ మూవీ’’ అన్నారు. ‘‘వెపన్’ లాంటి మంచి సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు వసంత్ రవి, తాన్యా హోప్, రాజీవ్ పిళ్లై. -
చరిత్రలో మిగిలిపోవాలంతే...
‘మనుషులు మూడు రకాలురా.. నాసి రకం.. రెండోది బోసి రకం.. మూడోది నాణ్యమైన రకం..’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ట్రైలర్. విశ్వక్ సేన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా, అంజలి ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు కృష్ణచైతన్య దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది.ఈ సందర్భంగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని దేవి 70 ఎంఎం థియేటర్లో జరిగింది. ‘‘యువ నాయకుడు రత్నాకర్’, ‘నా ఊళ్లో నాకేంట్రా భయం’, ‘ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే..’ అనే డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. -
కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
గం గం గణేశా మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
వినాయక చవితి చుట్టూ...
‘‘గం గం గణేశా’ దర్శకుడు ఉదయ్ నా వద్ద పని చేశాడు. అంకితభావం, కష్టపడే తత్వం ఉన్న అతనికి ఈ సినిమా తప్పకుండా సక్సెస్ ఇవ్వాలి’’ అని రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతీ శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది.ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్, దర్శకులు వంశీ పైడిపల్లి, సాయి రాజేశ్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘గం గం గణేశా’ని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు వంశీ కారుమంచి, కేదార్ సెలగంశెట్టి. ‘‘వినాయక చవితి చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందించాం’’ అన్నారు ఉదయ్ శెట్టి. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘గం గం గణేశా’లో తొలిసారి ఎనర్జిటిక్ క్యారెక్టర్ చేశాను’’ అన్నారు. -
డర్టీ ఫెలో రెడీ
శాంతి చంద్ర హీరోగా, దీపికా సింగ్, ‘మిస్ ఇండియా 2022’ సిమ్రితి హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించిన చిత్రం ‘డర్టీ ఫెలో’. గూడూరు భద్రకాళీ సమర్పణలో జీయస్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ 24న రిలీజ్‌కి రెడీ అయింది. ఈ సినిమా ట్రైలర్‌ని ‘బింబిసార’ మూవీ ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘డర్టీ ఫెలో’ ట్రైలర్ బాగుంది.ఈ సినిమా విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు రావాలి’’ అన్నారు. శాంతి చంద్ర, మూర్తి సాయి ఆడారి మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘డర్టీ ఫెలో’. మా సినిమాలోని అన్ని పాటలకు మంచి స్పందన వచ్చింది. మా చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామకృష్ణ .యస్, సంగీతం: డా. సతీష్ కుమార్ .పి. -
‘లవ్ మీ’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
లవ్ మీ సినిమా స్టోరీ లీక్ చేసిన బ్యూటీ, క్లైమాక్స్ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)
-
సుహాస్ 'ప్రసన్నవదనం'మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'ఆ ఒక్కటీ అడక్కు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మృగాడితో రొమాన్స్.. బోల్డ్ సీన్లతో ట్రైలర్
'లవ్ మౌళి'గా చాలారోజుల తర్వాత ప్రేక్షకులు ముందుకు రానున్నారు నవదీప్. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అవనీంద్ర డైరెక్ట్ చేయగా.. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సి స్పేస్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది. ఇందులో పంఖురి గిద్వానీ హీరోయిన్గా నటించగా. భావన సాగి, మిర్చి హేమంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేమ అనేది లేకుండా ప్రపంచంలో మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి అనూహ్యంగా ప్రేమ దొరికితే ఎలా ఉంటుంది అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మనుషులతో ఎలాంటి పరిచయం లేని వ్యక్తికి ప్రేమించే వ్యక్తి దొరికితే మనిషి ఎలా మారతాడు అనే విషయాన్ని కాస్త బోల్డ్‌గానే చెప్పినట్లు ట్రైలర్‌తో తెలుస్తోంది. ట్రైలర్లో అక్కడక్కడ రొమాన్స్ సీన్లు ఉన్నా.. అందులో ఏదో కంటెంట్ ఉంది అనేలా ట్రైలర్‌ను మేకర్స్ కట్ చేశారు. 2021లో ప్రారంభమైన ఈ సినిమా కరోనా సమయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొని ఆపై అనేక ఒడుదొడుకల నడుమ ఇటీవల ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి అయ్యాయి. ఏప్రిల్ 19న ఈ సినిమా విడుదల కానుంది. -
'గీతాంజలి మళ్లీ వచ్చింది' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
'గీతాంజలి మళ్లీ వచ్చింది' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
Tamannaah Latest Photos: తమన్నా బ్యూటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు (ఫోటోలు)
-
గుర్తుండే ఫ్యామిలీ స్టార్
‘‘ఇరవైఒకటేళ్ల కింద ఏప్రిల్ 5న ‘దిల్’ సినిమా నిర్మాతగా ‘దిల్ రాజు’గా మారాను. 21 ఏళ్ల తర్వాత ఇదే తేదీన మా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిలీజ్ అవుతోంది. మాస్, క్లాస్, యూత్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అందరికీ నచ్చే కథతో ఈ చిత్రం రూపొందింది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘ఫ్యామిలీ స్టార్’ వచ్చే నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో ‘దిల్’ రాజు ఇంకా మాట్లాడుతూ – ‘‘తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీ స్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం. మీలోనూ (ప్రేక్షకులు) ఫ్యామిలీ స్టార్స్ ఉంటారు. లేకపోతే ఈ సినిమా చూశాక ఫ్యామిలీ స్టార్ అవ్వాలని కోరుకుంటారు. ‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్, విజయ్ కాంబి నేషన్‌లో రూపొందిన ఈ చిత్రం ఈ సమ్మర్లో అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని, విజయ్ దేవరకొండను, మృణాల్ ఠాకూర్‌ను ప్రతి తెలుగు ప్రేక్షకుడు, ప్రతి తెలుగు కుటుంబం కొన్నేళ్ల పాటు గుర్తుంచుకుంటారు’’ అని పరశురామ్ అన్నారు. -
‘బడే మియా చోటే మియా’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
స్నేహానికి హద్దు లేదురా!
‘‘ఏ దర్శకుడికైనా ఫస్ట్ మూవీ బర్త్ లాంటింది. నా తొలి చిత్రం ‘డాన్ శ్రీను’ ని ఇప్పటికీ మర్చిపోలేను. మనమేంటో ఇండస్ట్రీకి తెలియజేసేదే తొలి సినిమా. ‘హద్దు లేదురా’ చిత్రం ట్రైలర్ చూస్తుంటే రాజశేఖర్ తొలిసారి దర్శకత్వం వహించినట్లు అనిపించడం లేదు. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. ఆశిష్ గాంధీ, అశోక్ హీరోలుగా, వర్ష, హ్రితిక హీరోయిన్లుగా, ఎస్తేర్ అతిథి పాత్రలో నటించిన చిత్రం ‘హద్దు లేదురా’. రాజశేఖర్ రావి దర్శకత్వంలో వీరేష్ గాజుల బళ్లారి నిర్మించారు. రావి మోహన్‌రావు సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి గోపీచంద్ మలినేని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘‘స్నేహం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది’’ అన్నారు రాజశేఖర్ రావి. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు మా యూనిట్‌ని ప్రోత్సహించాలి’’ అన్నారు వీరేష్ గాజుల బళ్లారి. నటీనటులు ఆశిష్ గాంధీ, తనికెళ్ల భరణి, రాధా మనోహర్ దాస్, ఎస్తేర్ మాట్లాడారు.