‘అసలు ఎవరు వాళ్లంతా..’ అనే డైలాగ్‌తో ‘దేవరపార్ట్1’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘దేవరపార్ట్ 1’. జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ కీలకపాత్రల్లో నటించారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మించిన ‘దేవరపార్ట్ 1’ ఈ నెల 27న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో ‘దేవరపార్ట్ 1’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మంగళవారం ముంబైలో ఘనంగా నిర్వహించారు. నిర్మాత కరణ్ జోహార్, డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని( నటి రవీనా టాండన్ భర్త) సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ‘మనిషికి బతికేంత ధైర్యం చాలు.. చంపేంత ధైర్యం కాదు... కాదు కూడదు అని మీరు మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని సంపే భయాన్ని ఐతా’, ‘పనిమీద ΄÷య్యినోడైతే పని అవ్వంగానే తిరిగొస్తాడు.. పంతం పట్టిపోయిండాడు నీ కొడుకు’ అంటూ ఎన్టీఆర్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగులు ట్రైలర్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment