‘అనగనగ ఒక రాజు ఉండేవాడు... చెడ్డవాళ్లంతా ఆయన్ను డాకు అనేవారు. మాకు మాత్రం మహారాజు...’ అంటూ మొదలవుతుంది ‘డాకు మహారాజ్’ సినిమా ట్రైలర్. బాలకృష్ణ(Daaku Maharaaj) హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ ( Daaku Maharaaj ). ఈ చిత్రంలో బాబీ డియోల్, మకరంద్ దేశ్‌పాండే, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. బాబీ కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది.
ఈ సందర్భంగా అమెరికాలోని డల్లాస్‌లో ‘డాకు మహారాజ్’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఎవర్నువ్వు... నానాజీ అమ్మా.., నీకు నువ్వే జీ అని పెట్టుకుంటే... నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా...’, ‘చెప్పింది వినాలి... ఇచ్చింది తీసుకోవాలి’, ‘వాడి ముందు నువ్వు కాదు... నేనుండాలి’, ‘అసలు ఎవడ్రా నువ్వు... మైఖేల్ జాక్సన్’ అనే డైలాగ్స్ ట్రైలర్‌లో ఉన్నాయి.
ట్రైలర్‌లోని సన్నివేశాలను బట్టి ‘డాకు మహారాజ్’ చిత్రంలోని బాలకృష్ణ క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ‘‘యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన ‘డాకు మహారాజ్’ చిత్రం ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: తమన్.
Comments
Please login to add a commentAdd a comment