Bala krishna
-
ఆదిత్య 369 సీక్వెల్‌కి కథ సిద్ధమైంది: బాలకృష్ణ
‘‘ఆదిత్య 369’ సినిమా సీక్వెల్‌కి కథ సిద్ధమైంది. పార్టు 2 సబ్జెక్ట్‌ను ఒక రాత్రిలో ఫైనలైజ్ చేశాం. నేను, సింగీతంగారు మళ్లీ మాట్లాడుకోవాలి’’ అన్నారు బాలకృష్ణ. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన చిత్రం ‘ఆదిత్య 369’. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 4న రీ రిలీజ్ కానుంది. 34 సంవత్సరాల తర్వాత 4 ఓ డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ‘ఆదిత్య 369’ సినిమా రీ–రిలీజ్ ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘ఆదిత్య 369’ ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. రీ రిలీజ్ తర్వాత ఇండియన్ ఫిల్మ్ కమ్యూనిటీ అంతా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుంది. ఈ సినిమాకు ముఖ్యమైన శ్రీకృష్ణ దేవరాయల పాత్రను నేను చేయడానికి కారకులైన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంగారికి రుణపడి ఉంటాను. ఈ సినిమా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగార్లకు హ్యాట్సాఫ్’’ అన్నారు.‘‘ఆదిత్య 369’ని నిర్మించు... కొన్ని దశాబ్దాలపాటు గుర్తుంటుందని ఎస్పీ బాలుగారు అన్నారు. ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవుతోందంటే అది నా పూర్మజన్మ సుకృతం’’ అని తెలిపారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘నాడు రామారావుగారు వేసిన శ్రీ కృష్ణదేవరాయల పాత్రలో (‘మహామంత్రి తిమ్మరుసు’లో) అంతే అద్భుతంగా రాణించాలంటే బాలకృష్ణకు మాత్రమే సాధ్యమౌతుందని భావించి, ఆయన్ను సంప్రదించాను.బాలకృష్ణ ఓకే అనడం... ‘ఆదిత్య 369’ స్టార్ట్ కావడం... చకా చకా జరిగిపోయాయి. ఇంత పెద్ద సబ్జెక్ట్‌ను నమ్మి, నిర్మించిన శివలెంక కృష్ణప్రసాద్‌కి ఈ సినిమా క్రెడిట్లో సింహభాగం దక్కుతుంది’’ అని వీడియో బైట్ రిలీజ్ చేశారు సింగీతం శ్రీనివాసరావు. అతిథులుగా దర్శకులు బాబీ, అనిల్ రావిపూడి పాల్గొన్నారు. -
హ్యాపీ డేస్ నటుడికి సర్జరీ.. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ప్రాక్టీస్!
టాలీవుడ్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆదర్శ్ బాలకృష్ణ. తెలుగులో బిగ్‌బాస్ మొదటి సీజన్లో కంటెస్టెంట్ కూడా పాల్గొన్నారు. టాలీవుడ్లో పలు సినిమాల్లో తనదైన నటనతో ఆదర్శ్ బాలకృష్ణ అభిమానులను మెప్పించారు. గతంలో ఝాన్సీ వెబ్ సిరీస్‌తో అభిమానులను మెప్పించిన ఆదర్శ్.. ప్రస్తుతం గౌతమ్ వాసుదేవ్ మీనన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఆయనతో దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.అయితే తాజాగా ఆదర్శ్ బాలకృష్ణ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సర్జరీ తొలి రోజు చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసిన వీడియోను పంచుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ మొదటి రోజు చిన్నచిన్న కసరత్తులు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే కోలుకుని తిరిగి వస్తానని పోస్ట్ చేశారు. అయితే ఇంతకీ ఆదర్శ్ బాలకృష్ణకు అసలేం జరిగిందో తెలియాల్సి ఉంది. మోకాలికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నారా? లేదంటే మరేదైనా కారణాలున్నాయా? అనే వివరాలపై క్లారిటీ లేదు.సినీ కెరీర్ విషయానికొస్తే హ్యాపీ డేస్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత టాలీవుడ్ పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించారు. గత రెండేళ్లలో రంగమార్తాండ, శాకుంతలం, మిక్సప్ సినిమాలలో అభిమానులను అలరించారు. -
ఏప్రిల్‌లో ఆదిత్య 369
హీరో బాలకృష్ణ కెరీర్‌లోని విజయవంతమైన చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ సినిమా ఇది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం 1991లో విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఆదిత్య 369’ చిత్రాన్ని 4కేలో డిజిటలైజ్ చేశాం. సౌండ్‌ని కూడా 5.1 క్వాలిటీలోకి మార్చాం. 34 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది. ఇప్పటి ట్రెండ్‌కి కూడా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఈ చిత్రాన్ని నేను నిర్మించడానికి ఎంతో సహకరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారికి రుణపడి ఉంటాను. ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నామని చెప్పగానే బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావుగార్లు ఎగ్జయిట్ అయ్యారు.ఇళయరాజాగారి సంగీతం, జంధ్యాలగారి మాటలు, పీసీ శ్రీరామ్, వీఎస్ఆర్ స్వామి, కబీర్ లాల్ ఛాయాగ్రహణం ఈ సినిమాని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. ఇప్పటి వరకు 15 సినిమాలు నిర్మించినప్పటికీ నాకు మంచి గుర్తింపుని, మా శ్రీదేవి మూవీస్ పేరును చరిత్రలో నిలిచిపోయేలా చేసిన చిత్రం ‘ఆదిత్య 369’’ అన్నారు. -
ఆ గానానికి గమ్యం – శ్రీహరి సన్నిధే!
సంగీతం ఆపాతమధురం. భావుకతతో, సమసమాజ భావనలతో, ప్రకృతి వర్ణనలతో... ఇలా హరివిల్లులా సంగీత జగత్తు నాదమయం. అలాగే భక్తి, ప్రపత్తి, శరణాగతులతో గానం చేసిన వారి కీర్తి అజరామరం. మన సమకాలంలో గానం చేస్తున్న, చేసిన సంగీత విద్వాంసులలో తనదైన విలక్షణ గాత్రంతో వెలిగిన ధ్రువతార శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్.నాకు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్‌తో దశాబ్దాల అనుబంధం. సౌజన్యం, సంస్కారం, వినమ్రత – పరిచయమైన క్షణంలోనే సూదంటురాయిలా ఆకర్షించిన అంశాలు. శక్తి, భక్తి, రక్తి కలిగిన తిరుమల ఆలయ కవి అన్నమయ్య కీర్తనలు పాడి తరించిన సంకీర్తన మహతి.స్వామి పుష్కరిణీ తీరంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని గానం చేసిన భావ పుష్కరిణి అన్నమయ్య. ఆ కీర్తనలలోని రసాత్మ కతను దర్శించి, అనుభవించి స్వర పరచిన మహనీయులలో ఆరాధ్యుడు, అనవధ్యుడు శ్రీ గరిమెళ్ళ. ఒక వాగ్గేయకారుని సహస్ర కీర్తనలు స్వర పరిచి, పాడి, తన శిష్య ప్రశిష్యులతో పాడించిన కారణ జన్ముడు. స్వయంగా వాగ్గేయకారుడు. ‘ఆంజనేయ కృతి మణిమాల’, ‘నవగ్రహ కీర్తనలు’ వంటివి ఇందుకు మణిదర్పణం. లలిత సంగీత రచనల్లో 200 పాటల అందమైన బాలకృష్ణ భావలహరి అజరామరం.గాయకుడిగా, వాగ్గేయకారుడిగా, స్వరకర్తగా, శిష్య ప్రశిష్యులను తీర్చిదిద్దిన సంగీత కులపతి ఆయన. ఉద్యాన వనంలో ఆనేకమైన పూలకుండే పరిమళంలా, ప్రతి పాటకు తాను చేసిన స్వర రచనలో ఎంతో వైవిధ్యం, ఎంతో శాస్త్రీయత ఉట్టిపడుతాయి. అయితే, అంత కన్నా ఎంత ఆర్ద్రత నిండుగా ఉంటుందో స్మరిస్తే పులకించిపోతాం.సంగీత అక్షయ పుణ్యకోశమైన శ్రీ బాలకృష్ణ ప్రసాద్‌కు నాపై ఉండే ఆదరం నిరుపమానం. లెక్కకు మించిన సార్లు నా ఇంటికి వచ్చి నాకు నచ్చిన పాటలు వినిపించిన ఆత్మబంధువు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడిగా నేను రూపకల్పన చేసిన ‘దళిత గోవిందం’, ‘కల్యాణమస్తు’, ఇంకా, దేశ విదేశాల్లో జరిగిన కల్యాణాల్లో, ఇతర ధార్మిక కార్యక్రమ ప్రస్థానంలో, ఆయన నా సహచరుడు. దళిత గోవిందం, శ్రీనివాస కల్యాణాల్లో – ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’, ‘ఇతడొక్కడే సర్వేశ్వరుడు’ వంటి కీర్తనలు ఆయన ఆలపించిన తీరు నాలో చెరగని ముద్ర వేశాయి. బాలకృష్ణ ప్రసాద్ ఛాందసుడు కాడు. మానవత్వం మొగ్గ తొడగాలని, సమాజంలో అన్ని వర్గాల మధ్య మమతా బంధాలు బలపడాలనే తాత్వికుడు. ఈ సత్యాన్ని తెలిపే వారి లలిత గీతాలు – ఆకాశవాణిలో ఎన్నో ప్రసారం అయ్యాయి. సామ్యవాదాన్ని, సౌమ్య వాదాన్ని మేళవించుకొన్న స్థితప్రజ్ఞడు.రాజకీయ నాయకుల్లో మాట తప్పని, మడమ తిప్పని మహ నీయుడు శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారితో చేయించిన సన్మానం తనకొక మధుర స్మృతిగా నాకు తరచూ చెప్పేవాడు. జన హృదయ నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆదేశిస్తే, తి.తి.దే. అధ్యక్షుడిగా ఆయనకు ‘పద్మశ్రీ’ ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించాను. కేంద్ర సంగీత నాటక ఆకాడమీ సన్మానితుడిగా, తి.తి.దే. ఆస్థాన పండితుడిగా, బిరుదులకే గౌరవాన్ని తెచ్చిన, లేదా పెంచిన ప్రజ్ఞాశాలి ఆయన. లాలిపాటల నుండి జోల పాటల వరకు కులశేఖరపడి వద్ద పాడిన అపర అన్నమయ్య.శ్రీవారి సేవలో నాద విద్వాంసుడిగా జీవించిన పూర్ణకాముడు. ఆ గాత్రానికుండే ప్రత్యేకత ఆరు దశాబ్దాల కాలం, ఇలలో సౌగంధికా సౌరభాన్ని నింపింది. ఇక కోనేటి రాయుని కొలువులో నారద,తుంబురులతో గానం చేస్తాడు. అన్నమయ్య కీర్తనలను, తన కీర్తనలను కలిపి గానం చేస్తూ తాళ్ళపాక కవులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతాడు. పులుకు తేనెల తల్లి అమృత హస్తాలతో ఆనందామృతాన్ని గ్రోలుతాడు. ఆ మహనీయుని ధర్మపత్ని శ్రీమతి రాధ, వారి పుత్రులైన శ్రీ అనిల్ కుమార్, శ్రీ పవన్ కుమార్‌లకు – జాలి గుండెలవాడైన ఏడుకొండలస్వామి నిండైన అండదండగా ఉంటాడని విశ్వసిస్తున్నాను.భూమన కరుణాకర రెడ్డి వ్యాసకర్త పూర్వ అధ్యక్షులు,తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి -
గరిమెళ్ల గళంలో అన్నమయ్య అమృతం
ఆచార్య తాడేపల్లి పతంజలికొందరు జీవించి ఉన్నప్పుడే తాము ఎంచుకున్న క్షేత్రంలో అంకితభావంతో కృషిచేసి ప్రసిద్ధులవుతారు. శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత ఈ లోకానికి సిద్ధ పురుషులుగా మిగిలిపోతారు. అటువంటి వారిలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఒకరు.‘పుడమి నిందరి బట్టె భూతము కడుబొడవైన నల్లని భూతము‘ అని అన్నమయ్య వేంకటేశుని గురించి వర్ణిస్తాడు. ఆ అన్నమయ్య కీర్తనల భూతం ఎప్పటినుంచో సంగీత సాహిత్య ప్రపంచంలో చాలా మందిని పట్టుకొని వదలటం లేదు.అటువంటి అన్నమయ్య వేంకటేశుని భూతము పట్టినవారిలో గరిమెళ్ళ ఒకరు. తన మనసుని పట్టుకున్న అన్నమయ్య కీర్తనకి అద్భుతమైన తన గాత్ర రాగ చందనాన్ని అద్ది సంగీత సాహిత్య ప్రియుల హృదయాలలో పట్టుకునేటట్లు కలకాలం నిలిచి ఉండేటట్లు చేసారు. ఒకటా రెండా... వందల కొలది అన్నమయ్య కీర్తనలు గరిమెళ్ళ వారి స్వరరచనలో విరబూసిన వాడిపోని కమలాలుగా, సౌగంధికా పుష్పాలుగా నేటికీ విరబూస్తున్నాయి. భావ పరిమళాలు వెదజల్లుతున్నాయి.ఒక గొప్ప రహస్యంఎందరు గాయకులు పాడుతున్నప్పటికీ ప్రత్యేకంగా శ్రీ గరిమెళ్ళ అన్నమయ్య కీర్తన ఇంతగా ప్రచారం కావడం వెనుక ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, అన్నమయ్య మానసిక స్థాయికి తాను వెళ్లి, రసానుభూతితో పాడారు కనుకనే గరిమెళ్ళ వారి అన్నమయ్య కీర్తన సప్తగిరులలోను, లోకంలోను ప్రతిధ్వనిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ నడుస్తూనే ఈ లోకం నుంచి సెలవు తీసుకొన్నారు. బహుశా ఆ సమయంలో కూడా అన్నమయ్య కీర్తన ఏదో ఆయన మనస్సులో ప్రస్థానం సాగించే ఉంటుంది. అనుమానం లేదు.సంగీత ప్రస్థానంశ్రీ గరిమెళ్ళ సంగీత ప్రస్థానం చాలా విచిత్రంగా సాగింది. మొదట్లో సినిమా పాటలు పాడేవారు. తర్వాత లలిత సంగీతం, ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం ఆయనను తన అక్కున చేర్చుకుంది. తన పినతల్లి అయిన ప్రముఖ సినీ నేపథ్యగాయని ఎస్. జానకి గారి ఇంట్లో ఆరు నెలల పాటు ఉండి ఆమెతో కలిసి రికార్డింగ్లకి వెళ్లేవారు. జానకి గారు గరిమెళ్ళ వారిని ఎంతోప్రోత్సహించారు. బాలకృష్ణ ప్రసాద్ మొదట్లో చిన్న చిన్న కచేరీల్లో మృదంగం వాయించేవారు. తన 16వ ఏట చలనచిత్ర గీతాలతో పాటు భక్తి పాటలు కలిపి మొదటి కచేరీ చేసారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చేసిన కచేరీలు, శబ్దముద్రణలు (రికార్డింగ్‌లు లెక్కకు అందనివి.కొత్త పద్ధతిసాధారణంగా ఎవరైనా ఒకే వేదిక నుంచి ఒకరోజు సంకీర్తన యజ్ఞం చేస్తారు కానీ బాలకృష్ణ ప్రసాద్ ఒక వారం రోజులపాటు ఒకేవేదిక నుంచి సంకీర్తన యజ్ఞం చేసి ఒక కొత్త పద్ధతినిప్రారంభించారు. టెలివిజన్ మాధ్యమాల ద్వారా అనేక మందికి సంగీతపు పాఠాలు నేర్పించారు.నేదునూరి నోట – అన్నమయ్య మాటఅప్పట్లో ప్రసిద్ధమయిన ఆకాశవాణి భక్తి రంజనిలో బాలకృష్ణ ప్రసాద్ ని పాడటానికి సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆహ్వానించారు. పోంగిపోయారు బాలకృష్ణ ప్రసాద్. గరిమెళ్ళ గానానికి సంతోషించిన నేదునూరి తిరుపతి అన్నమాచార్యప్రాజెక్టులో చేరమని సలహా ఇచ్చారు. అలా అన్నమయ్య కు వేంకటేశునికి బాలకృష్ణ ప్రసాద్ దగ్గరయ్యారు. అన్నమాచార్యప్రాజెక్టుకు బాలకృష్ణప్రసాద్ అందించిన సేవలు సాటిలేనివి. పురస్కారాలురాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి 2023 ఫిబ్రవరి 23న కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు, శ్రీపోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు ఇలా కోకొల్లలు. అన్నమాచార్య సంకీర్తన సంపుటి, అన్నమయ్య నృసింహ సంకీర్తనం వంటి పుస్తకాలు తెలుగు, తమిళ భాషల్లో ఆయన ప్రచురించారు. గరిమెళ్ళపై ముగ్గురు పీహెచ్డీ విద్యార్థులు పరిశోధన గ్రంథాలు సమర్పించారు.శివపదం కూడా...గరిమెళ్ళ ఎంతటి అన్నమయ్య వేంకటేశ భక్తులో అంతగా శివభక్తులు కూడా. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శివునిపై రచించిన సాహిత్యానికి, గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ మృదుమధురంగా స్వరపరిచి పాడారు. ‘‘అడుగు కలిపెను’’,’’ఐదు మోములతోడ’’, ‘‘అమృతేశ్వరాయ’’ వంటి కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పోందాయి. ‘చూపు లోపల త్రిప్పి చూచినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు‘ అంటూ ఒక శివ పద కీర్తనలో బాల కృష్ణప్రసాద్ ఆర్తి మరిచిపోలేనిది. ఆంజనేయుడు మొదలయిన ఇతర దేవతలపై కూడా గరిమెళ్ళ పాడిన పాటలు ప్రసిద్ధాలు.అన్నమయ్య స్వరసేవ‘అన్నమయ్యకు స్వరసేవ చేయడం తప్ప మరో ప్రపంచం తెలీదు. అన్నమయ్య పాటలే ప్రపంచంగా బతికారు. ఆ పాటలు వినని వాళ్లకు కూడా బలవంతంగా వినిపించేవారు. ప్రతి ఇంట్లో అన్నమయ్య పాట ఉండాలి.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని తపన పడేవారు. అన్నమయ్య కీర్తనలు స్వరం, రాగం, తాళం తూకం వేసినట్లు కచ్చితంగా పాడాలని పట్టుబట్టేవారు.’’ అని బాలకృష్ణ ప్రసాద్ సతీమణి రాధ చెప్పారు. అన్నమయ్య చెప్పినట్లు ‘‘ఇదిగాక వైభవంబిక నొకటి కలదా?’’చిరస్మరణీయంతెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి నెల 6న నిర్వహించిన అన్నమాచార్య సంకీ ర్తన విభావరియే ఆయన చివరి కచేరీ. నాలుగు నెలలుగా గొంతు సరిగా లేకపోవడంతో ఎక్కడా కచేరీ చేయలేదని, నీదే భారమంటూ స్వామికి మొక్కి వచ్చినట్లు ఆయన ఆర్ద్రంగా యాదగిరి గుట్టలో చెప్పిన విషయం చిరస్మరణీయం.అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20కొత్త రాగాలు కూడా సృష్టించారు.ప్రసూన బాలాంత్రపుమంద్రస్థాయిలోని మధుర స్వరం భక్తి, ప్రేమ రంగరించి రూపం దాలిస్తే అది బాలకృష్ణ ప్రసాద్ అవుతుంది. ఈ తరం వారికి అన్నమయ్య పాటలంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది బాలకృష్ణ ప్రసాద్. లలిత సంగీత ధోరణిలో అన్నమయ్యను అందరికి దగ్గర చేసిన ఘనత ఆయనది. 1948 నవంబర్ 9న రాజమండ్రిలో కృష్ణవేణి, గరిమెళ్ళ నరసింహరావులకు జన్మించారు బాలకృష్ణ. ఇంటిలో అందరూ సంగీత కళాకారులే కావడం వల్ల ఆయన పాటతోనే పెరిగారు. ప్రముఖ నేపథ్యగాయని జానకి వారి పినతల్లి. సంగీతం ఎంతో సహజంగా వారికి అబ్బింది కనుకే ఒక పాట రాసినా, సంగీతం కూర్చినా, పాట పాడినా అది అందరి మనస్సులను ఆకర్షించింది. 1980లో మాట. టి.టి.డి వాళ్ళు అన్నమాచార్యప్రాజెక్ట్ మొదలు పెట్టి రాగి రేకులలో దొరికిన అన్నమయ్య పాటలను ప్రజలకు చేర్చాలని నిశ్చయించారు. అప్పటికే కొన్ని పాటలు జనంలో వున్నా అవి అన్నమయ్య పాటలు అని తెలియదు.ఉదాహరణకు ‘జో అచ్యుతానంద’. ఒక ఉద్యమంగా ఈ పాటలు ప్రచారం చెయ్యాలని ప్రతిపాదన. ప్రముఖ విద్వాంసులు రాళ్ళపల్లి అనంత కృష్ణ్ణశర్మ, నేదునూరి కృష్ణమూర్తి, బాలాంత్రపు రజనీకాంతరావు, మల్లిక్ ఈ పాటలకు సంగీతం కూర్చారు. ఆ తరువాత తరం కళాకారులు బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు. నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర బాలకృష్ణ ప్రసాద్ స్కాలర్‌షిప్‌తో శిష్యులుగా చేరి శాస్త్రీయ సంగీతం, అన్నమయ్య పాటలు నేర్చుకున్నారు. నేదునూరి గారు ముందుగా స్వరపరచినది ‘ఏమొకో చిగురుటధరమున’ అనే పాట. ఇది కీర్తన అనేందుకు లేదు. మాములుగా శాస్త్రీయ సంగీతంలో కనిపించే ధోరణులు ఇందులో ఉండవు. మరో పాట ‘నానాటి బ్రతుకు’ కూడా ఇటువంటిదే. ఆ పాటలలో భావం, కవి హృదయం వినే మనస్సుకు అందాలి.అది ఆ సంగీతంలోని భావనా శక్తి. అదే బాలకృష్ణ ప్రసాద్ గారికి స్ఫూర్తి. ఇక అన్నమయ్య పాట పుట్టింది. ప్రచారంలో ఉన్న త్యాగరాజ కీర్తనలకు భిన్నంగా నడిచింది ఈ సంగీతం. నిజానికి అన్నమయ్య త్యాగరాజ ముందు తరం వాడు. అదే బాటలో మొదటి అడుగుగా ‘వినరో భాగ్యం విష్ణు కథ’ పాటలా మన ముందుకు వచ్చింది. నేదునూరి రాగభావన అందిపుచ్చుకుని బాలకృష్ణ ప్రసాద్ ముందుకు నడిచారు. ‘చూడరమ్మ సతులాలా’ అన్నా, ‘జాజర పాట’ పాడినా, ‘కులుకుతూ నడవరో కొమ్మల్లాలా’ అన్నా బాలకృష్ణ ప్రసాద్ గొంతులో భావం, తెలుగు నుడి అందంగా ఒదిగిపోతాయి. అలాప్రారంభం అయిన బాలకృష్ణ ప్రసాద్ సంగీత ప్రస్థానం 150 రాగాలతో 800 పైగా సంకీర్తనలకు సంగీతం కూర్చడం దాకా సాగింది. అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20 కొత్త రాగాలు కూడా సృష్టించారు. అన్నమయ్యవి అచ్చ తెలుగు పాటలు. బాలకృష్ణ ప్రసాద్ గొంతులో ఆ తెలుగు సొబగు మృదుమధురంగా వినిపిస్తుంది. ఆయన సంగీతంలో అనవసరమైన సంగతులు ఉండవు. పాట స్పష్టంగా, హృదయానికి తాకేటట్లు పాడడమే ఉద్దేశం. విన్న ప్రతివారు మళ్ళీ ఆ పాట పాడుకోగలగాలి. దీనికై వారు అన్నమయ్య సంగీత శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించి ప్రచారం చేశారు. 400 పైగా కృతులను తెలుగు, సంస్కృత భాషల్లో రచించారు బాలకృష్ణ. అనేక వర్ణాలు, తిల్లానాలు, జావళీలు రచించారు. 400కు పైగా లలిత గీతాలు రచించారు. 16 నవంబర్ 2012లో టి.టి.డి ఆస్థాన గాయకులుగా, కంచి కామకోటి పీఠం ఆస్థాన గాయకులుగా నియమించబడ్డారు. ఆయన లలిత గీతాలు కూడా రచించారు. ఆంజనేయ కృతి మణిమాల, వినాయక కృతులు, నవగ్రహ కృతులు, సర్వదేవతాస్తుతి రచించి క్యాసెట్టు రూపంలో అందించి తెలుగు వారి పూజాగృహంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన పాట ఒక అనుభూతి, ఒక స్వర ప్రవాహం, ఒక భావ సంపద. కొందరికి మరణం ఉండదు. వారి పాట, మాట నిత్యం మనతోనే ఉంటాయి. బాలకృష్ణ ప్రసాద్ అటువంటి మహనీయుడు. -
కన్న తల్లి ఊరుని అవమానించిన బాలయ్య
-
మీరు చాలా మారాలి సార్!
అంతరిక్షంలో చిక్కుకుపోయి, భూమికి చేరేమార్గం కోసం ధైర్యంగా ఎదురుచూస్తున్న సునీతా విలియమ్స్ (Sunita Williams) వంటి సాహసగత్తెల కాలంలో ఉన్నాము. అదే సమయంలో స్త్రీల మీద వివక్షలు మారకపోగా కొత్త రూపాలు తీసుకున్నాయని ఇటీవలి కొన్ని వరుస ఘటనలు నిరూపిస్తున్నాయి. ప్రాబల్య స్థానాల్లో ఉన్న కొందరు పురుషులు బహిరంగంగా, ఎటువంటి సంకోచాలూ లేకుండా స్త్రీల గురించి చేస్తున్న వ్యాఖ్యలు పితృస్వామ్య సామాజిక స్థితిని దగ్గరగా చూపిస్తున్నాయి. ఈ పురుషుల్లో సినిమా నటులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, చివరికి న్యాయ, రక్షణ వ్యవస్థలు కూడా ఉండడం వివక్ష తీవ్రతను తెలుపుతున్నది.మాట, చూపు, హావభావ కవళికల్లో పెద్దమనిషితనం ఉట్టి పడుతున్నట్లు కనిపించేలా సవాలక్ష జాగ్రత్తలు తీసుకునే ‘మెగాస్టార్’ ఈసారి దొరికిపోయారు. ఆడపిల్లలతో నిండిన తన ఇల్లు లేడీస్ హాస్టల్లా, తను వార్డెన్‌లా ఆయనకి అనిపించింది. అయిదుగురు చెల్లెళ్లకి రక్షకుడిలా తను నటించిన ‘హిట్లర్’ సినిమా నిజం అనుకున్నారు కాబోలు! అంతేకాకుండా తమ లెగసీ కొనసాగించడానికి ఈసారైనా కొడుకుని కనమని కొడుక్కి బహిరంగంగా చమత్కారపూర్వక సలహా ఇచ్చారు. పసిబిడ్డ మొహాన్ని కూడా బహిరంగపరచకుండా తమ ప్రైవసీని కాపాడుకునే అతని కొడుకూ కోడలూ – తమ ఆడపిల్లకి ఎదురైన ఈ బహిరంగ వివక్షని ఎలా తీసుకుంటారో బహుశా అది వారి కుటుంబ విషయం. కానీ అనేకమంది ఆరాధకులని పెంచి పోషించుకునే ఒక సినిమా నటుడిగా ఆయన వ్యాఖ్యలు వ్యతిరేకించవలసినవి. రేపుమాపు ‘మెగా’ అభి మానులందరూ తమ ఇంటి స్త్రీలకి వార్డెన్లగానూ, లెగసీ కోసం కొడుకుల్ని కనమని వేధించేవారిగానూ ఉండడమే ఫ్యాషన్ అనుకుంటే అది ప్రమాదం కనుక ఈ వ్యాఖ్యలని కొందరైనా ఖండిస్తున్నారు. స్త్రీలపట్ల అసభ్యంగా ప్రవర్తించడంలో సినీనటుడు బాలకృష్ణ ‘గాడ్ ఆఫ్ వల్గారిటీ’కి ప్రతీకగా మారిపోయారు. స్త్రీలను ఉద్దేశించి నర్మగర్భంగా తను ఎక్కని ఎత్తులు, దిగని లోతులు లేవని అనడం, వెంటపడే పాత్రలు చేస్తే తన ఫాన్స్ ఊరుకోరని, అమ్మాయిలు కనపడగానే ముద్దయినా పెట్టాలి, కడుపైనా చేసేయాలని కోరుకుంటారన్న అసభ్య వ్యాఖ్యలకి కోర్టుకేసులు ఎదుర్కున్నారు. ఒక నటిని పడిపోయేంతగా వేదిక మీద నెట్టడం దగ్గర్నుంచి తన చుట్టూ ఉండే స్త్రీలతో కొన్నిసార్లు ఆయన ప్రవర్తన వేధింపు పరిధిలోకి వస్తుంది. ఇటీవల విడుదలైన చిత్రంలోని ఒక పాటకు ఆయన వేసిన స్టెప్పులు దిగజారడానికి పరిధులు ఏమీ లేనంత హీనమైనవి. అది కళారంగపు టేస్ట్ అనుకుని వదిలేయనివ్వలేదు బాలకృష్ణ (Balakrishna). అదే నటితో ఒక ప్రయివేట్ పార్టీలో అవే స్టెప్పులు వేస్తూ ఆమెని ఇబ్బంది పెట్టారు. వారికి లేని బాధ మీకేమిటనే అభిమానులకి కొరత లేదు. మగనటుల పవర్, స్త్రీ నటుల అవకాశాలను ప్రభావితం చేస్తుంది కనుక వారు ఊరుకుంటారు. కానీ సమాజం కూడా ఊరుకోవాల్సిన అవసరం లేదు. బహిరంగంగానే ఇలా ఉంటే కనపడని వేధింపులు ఎన్నో ఊహించలేము. నటుడిగా దాక్కోడానికి చోటు ఉన్నట్లు రాజకీయాల్లో ఉండదు కనుక ఇట్స్ టైమ్ టు స్టాపబుల్ మిస్టర్ ఎమ్మెల్యే!భార్యతో భర్త చేసే బలవంతపు అసహజ శృంగారం నేరం కాదని ఇటీవల ఛత్తీస్‌గఢ్ హైకోర్టు (chhattisgarh high court) ఇచ్చిన తీర్పు ఇపుడు చర్చలోకి వచ్చింది. 2017లో జరిగిన ఘటన ఇది. భర్త చేసిన అసహజ లైంగికచర్యల కారణంగా భార్య అనారోగ్యానికి గురయి మరణించింది. మరణ వాంగ్మూలంలో ఆమె ఇదే చెప్పింది. కింది కోర్టు వేసిన పదేళ్ళ శిక్షని కొట్టేసి భర్తని నిర్దోషిగా తేల్చింది హైకోర్టు. మారిటల్ రేప్ గురించి ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. భార్యకి ఇష్టం లేకుండా భర్త బలవంతంగా ఆమె శరీరాన్ని తాకకూడదన్నది ఒక విలువగా, హక్కుగా సమాజానికి అలవాటు కావాల్సిన సమయంలో ఈ తీర్పు స్త్రీల లైంగిక స్థితిని కొన్ని రెట్లు వెనక్కి నెట్టేదిగా ఉంది. ఆ భర్త అసహజ లైంగిక చర్య చేయడం గురించి కొంతమంది తప్పు బడుతున్నారు. సహజమా, అసహజమా అన్నది కాదు ముఖ్యం. ఆమె సమ్మతి ముఖ్యం. స్త్రీని లైంగిక కోరికలు తీర్చే వస్తువుగా చూసే పాత ఆలోచనా విధానాన్ని అందరూ సవరించుకోవాల్సిన అవస రాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తోంది. పనిగంటల విషయంలో ఎల్ అండ్ టి ఛైర్మన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా చాలా చర్చల్లోకి వచ్చాయి. వారానికి తొంభై పనిగంటలు పనిచేయాలని సూచిస్తూ ‘ఇంట్లో మీరు మీ భార్య మొహం ఎంతసేపు చూస్తూ ఉండగలరు, మీ భార్య మీ మొహం ఎంతసేపు చూస్తూ ఉండగలదు’ అని వ్యాఖ్యానించారు. పనిగంటల భారాన్ని వ్యతిరేకిస్తూ ఇంటిపనులు, బైటిపనులు, వ్యక్తిగత, మానసిక అవసరాల గురించి చాలామంది మాట్లాడారు. అయితే తక్కువగా చర్చకు వచ్చిన విషయం ఒకటి ఉంది. అది ఈ పనిగంటల సూచన కేవలం మగ ఉద్యోగులను ఉద్దేశించినట్లుగా ఉండడం. దాని ద్వారా ఇల్లు, పిల్లలు, వృద్ధుల బాధ్యతలు మగవారి టెరిటరీ కావు, అవి కేవలం స్త్రీలకి ఉద్దేశించినవి మాత్రమేనన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు! మగవారు తమ పూర్తికాలం ఉద్యోగంలో గడిపితే కుటుంబాల సమస్త బాధ్యతలు స్త్రీల మీద పడతాయి. ఉద్యోగం పురుష లక్షణం, ఇల్లు దిద్దుకోవడం స్త్రీ లక్షణంగా ఆ వ్యాఖ్యల అంతరార్థం స్ఫురిస్తోంది. చదవండి: ‘దంగల్’ చూడండి ‘మాస్టారు’పై నాలుగు ఘటనల్లో నాలుగు ప్రధానమైన సమస్యలు మన ముందుకు చర్చకు వచ్చాయి. ఆడశిశువుని పురిటిలోనే చంపేసిన సమాజాలు మనవి. ఆ దశ దాటి వస్తున్నాము. ఆకాశంలో సగాలకి తాము వార్డెన్లమని బాధపడటం కాకుండా– వారి పుట్టుక, ఎదుగు దల, విజయాలు సాధికారికంగా సెలెబ్రేట్ చేసుకోవడం మన వివేకంలో భాగం కావాలి. స్త్రీలకు సొంత లైంగిక వ్యక్తిత్వం ఉంటుంది. అధికారం, హోదా, పేరు ప్రఖ్యాతులతో మదించినవారు ఆ వ్యక్తిత్వం మీద దాడి చేస్తూనే ఉంటారు. చదవండి: దీపికా పదుకోన్ (బాలీవుడ్ నటి) రాయని డైరీధైర్యంగా వ్యతిరేకించే వారు పెరగాలి. న్యాయవ్యవస్థలు న్యాయసూత్రాల పరిధికి లోబడి పనిచేస్తాయి. న్యాయసూత్రాలు కాలం చెల్లినవిగా, స్త్రీలకి రక్షణ కల్పించలేనివిగా ఉన్నప్పుడు వాటిమీద పౌరసమాజం విస్తృత చర్చ చేయాలి. ఇంటిపనికి విలువ కట్టడం సరే, స్త్రీ పురుషుల మధ్య పని విభజనకి మార్గదర్శకాలు రూపొందించుకోవాలి. వీటన్నిటితో పాటు లోకం తన చూపుకి మరికాస్త స్త్రీ తత్వాన్ని అద్దుకోవాలి.కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త ప్రరవే ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com -
అక్రమంగా హిందూపురం ఛైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ
-
హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ కుట్ర రాజకీయాలు
-
ప్రజాస్వామ్యాన్ని డాకూగా బాలకృష్ణ దోపిడీ చేశాడు: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
-
రాయలసీమ రమ్మంటోంది
రాయలసీమ నేపథ్యం సినిమాలంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఎన్నో సినిమాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ కూడా రాయలసీమ నేపథ్యంలో రూపొందిన సినిమాయే. కాగా ప్రస్తుతం ‘రాయలసీమ రమ్మంటోంది’ అంటూ కొందరు తెలుగు హీరోలు రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాల వివరాల్లోకి వెళితే...అఖండ తాండవంబాలకృష్ణ కెరీర్లో రాయలసీమ నేపథ్యంలో రూపొందిన ‘సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ఇటీవలి కాలంలో ‘అఖండ, డాకు మహారాజ్’ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. హీరో బాలకృష్ణ–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ’ (2021) మూవీ అనంతపురం నేపథ్యంలో ఉన్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ మూవీకి సీక్వెల్‌గా బాలకృష్ణ– బోయపాటి శ్రీను కాంబినేషన్లోనే ‘అఖండ 2: తాండవం’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ సంయుక్త ఓ కీ రోల్ చేస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ‘అఖండ 2: తాండవం’ కూడా ‘అఖండ’ సినిమా మాదిరి అనంతపురం నేపథ్యంలోనే ఉంటుందని ఊహించవచ్చు. ఈ సినిమాను సెప్టెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. నవ్వించేకి వస్తుండా! ‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా!’ అని ఇటీవల తన కొత్త సినిమా గురించి వరుణ్ తేజ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. దీంతో వరుణ్ తేజ్ నెక్ట్స్ మూవీ రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని స్పష్టమైపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వియత్నాంలో జరుగుతున్నాయి. పనిలో పనిగా ఈ మూవీ చిత్రీకరణ కోసం లొకేషన్లను కూడా వెతుకుతున్నారు మేకర్స్. ఈ పనుల కోసం హీరో వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ ప్రస్తుతం వియత్నాంలోనే ఉన్నారు. హారర్–కామెడీ జానర్లో రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ సినిమా ప్రధానంగా అనంతపురం నేపథ్యంలో ఉంటుందని, ‘కొరియన్ కనక రాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించనున్నాయి.19వ శతాబ్దంలో...‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో మరో చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. 19వ శతాబ్దంలో 1854–1878 మధ్య కాలంలో జరిగిన కొన్ని చారిత్రక వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందనున్నట్లుగా తెలుస్తోంది. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన కాలంలో జరిగిన కొన్ని చారిత్రక అంశాలను ఈ మూవీలో ప్రస్తావించనున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుందట. ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నటించిన విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలకు అమితాబ్ బచ్చన్, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూలను మేకర్స్ సంప్రదించారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యాక్షన్ లవ్‌స్టోరీ ‘ఏజెంట్’ మూవీ తర్వాత అక్కినేని అఖిల్ తర్వాతిప్రాజెక్ట్పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ అఖిల్ తర్వాతి చిత్రం చిత్రీకరణ ఆల్రెడీ మొదలైందని, రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ లవ్‌స్టోరీ ఫిల్మ్‌కి ‘లెనిన్’ అనే టైటిల్ అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ చిత్రంలో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారని తెలిసింది. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ దర్శకుడు మురళీ కిశోర్ ‘లెనిన్’ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ మూవీని నిర్మిస్తున్నాయని సమాచారం. మాస్ సంబరాలు ‘ఏటి గట్టు సాచ్చిగా చెబ్తాండ ఈ తూరి నరికినానంటే అరుపు గొంతులో నుంచి కాదు... తెగిన నరాలొన్నించొచ్చాది!... ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం కోసం సాయిదుర్గా తేజ్ చెప్పిన డైలాగ్ ఇది. దాదాపు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ ΄్యాక్డ్ మూవీని కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.రాజకీయం... ప్రతీకారం అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘రాచరికం’. సురేశ్ లంకలపల్లి దర్శకత్వంలో ఈశ్వర్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 1న విడుదల కానుంది. పూర్తిగా రాయలసీమ నేపథ్యంలో సాగే ఫిల్మ్ ఇది. లవ్, యాక్షన్, రాజకీయాలు, ప్రతీకారం వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందింది. రాయలసీమ నేపథ్యంలో మరికొందరు కుర్ర హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఇంకొందరు రాయలసీమ కథలు వింటున్నారు. – ముసిమి శివాంజనేయులు -
అఖండ-2 హీరోయిన్ను ప్రకటించిన మేకర్స్
‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి హిట్ సినిమాల తర్వాత హీరో బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ మూవీలో హీరోయిన్గా సంయుక్తా మీనన్(Samyuktha Menon) ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం మహా కుంభమేళాలో జరుగుతోంది. సినిమాలోని కీలక సీన్స్ షూట్ చేస్తు న్నారు. అయితే ఇప్పటివరకూ హీరోయిన్ ఎవరు? అనే విషయంపై చిత్రబృందం ప్రకటించలేదు. తాజాగా సంయుక్తా మీనన్ హీరోయిన్గా ఎంపిక అయినట్లు మేకర్స్ ప్రకటించారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమేరా: సి. రాంప్రసాద్, సంతోష్ డి. -
తెలుగు సినిమా స్థాయి పెరిగింది: బాలకృష్ణ
‘‘ఇతర దేశస్తులు కూడా మన సినిమాలను చూసి, ప్రశంసించే స్థాయికి తెలుగు చలన చిత్రసీమ ఎదిగింది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని ఆదరిస్తారు. ‘డాకు మహారాజ్’ విజయంతో ఇది మరోసారి రుజువైంది’’ అని బాలకృష్ణ అన్నారు. ఆయన టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’.ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ అయింది. రిలీజైన ఐదు రోజుల్లోనే రూ. 114 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌తో ‘డాకు మహారాజ్’ సూపర్ హిట్‌గా ప్రదర్శితమవుతోందని చిత్రబృందం పేర్కొంది. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ప్రతి సినిమాని ఓ చాలెంజ్‌గా తీసుకుని చేస్తాను.వరుసగా ఇది నాకు నాలుగో (‘అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్’) విజయం. ప్రతి నటుడి నుంచి అందమైన హావభావాలను రాబట్టుకోగలిగాడు బాబీ. తమన్ ఇంటి పేరును అభిమానులు మార్చేశారు. నేనైతే ఎన్బీకే తమన్ అని నామకరణం చేస్తున్నాను. అన్ని క్రాఫ్ట్స్‌పై అవగాహన ఉన్న నాగవంశీ నా అభిమాని కావడం నాకు గర్వంగా ఉంది’’ అని మాట్లాడారు. ‘‘బాలకృష్ణగారి ఫిల్మోగ్రఫీలో గుర్తుండిపోయే సినిమాలా ‘డాకు మహారాజ్’ ఉండాలని మొదలుపెట్టాం.డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మూడు రోజుల్లోనే డబ్బులు రావడం చాలా ఆనందంగా ఉంది. ఓ దర్శకుడికి ఇంతకన్నా ఆనందం మరొకటి ఉండదు’’ అన్నారు దర్శకుడు బాబీ. ‘‘జనవరి 12న ‘డాకు మహారాజ్’ విడుదలైతే, సంక్రాంతి పండగ రోజుకే మా డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్‌కి వెళ్లిపోయారు. డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వచ్చినప్పుడే నిర్మాతలకు నిజమైన ఆనందం’’ అని పేర్కొన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. -
మురారి వినోదం
శర్వానంద్ హీరోగా, సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి ‘నారీ నారీ నడుమ మురారి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శర్వానంద్ కెరీర్‌లోని ఈ 37వ సినిమా ఫస్ట్‌లుక్‌ను సంక్రాంతి శుభాకాంక్షలతో హీరోలు బాలకృష్ణ, రామ్‌చరణ్ కలిసి విడుదల చేశారు. ‘‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రీకరణ జరుగుతోంది. జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్‌గా ఈ చిత్రం ఆడియన్స్ ను అలరిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, సహ–నిర్మాత: అజయ్ సుంకర. -
సంక్రాంతి ప్రత్యేకం
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగతో చిత్ర పరిశ్రమకు ప్రత్యేక అనుబంధం ఉంది. సంక్రాంతి సందర్భంగా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు స్టార్ హీరోలు సైతం పోటీపడుతుంటారు. ఈ సంక్రాంతికి రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సంక్రాంతి పండుగని పురస్కరించుకుని తమ సినిమాల నుంచి ప్రత్యేక పోస్టర్స్, లుక్స్‌ని విడుదల చేశారు పలువురు మేకర్స్. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం... రాజా సాబ్ ఆగయాప్రభాస్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్లో రూపొందుతోన్న ‘రాజా సాబ్’ నుంచి ప్రభాస్ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పండుగ కళ కనిపిస్తున్న ఈ పోస్టర్లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది. షూటింగ్ తుదిదశలో ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.అందమైన లైలాహీరో విశ్వక్ సేన్ లైలాగా మారారు. ఆయన అబ్బాయిగా, అమ్మాయిగా నటించిన చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆకాంక్షా శర్మ హీరోయిన్. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీలో తొలిసారి లైలా అనే అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు విశ్వక్ సేన్. ఈ సినిమా నుంచి లైలాగా విశ్వక్ సేన్ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. జాస్మిన్ వచ్చేశారు‘బబుల్ గమ్’ మూవీ ఫేమ్ రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. ‘కలర్ ఫోటో’ మూవీతో జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ , టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా సాక్షి సాగర్ మదోల్కర్ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఆమె జాస్మిన్ పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొని, పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. సంతానప్రాప్తిరస్తువిక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సంతానప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా నుంచి విక్రాంత్, చాందినిల స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేసింది యూనిట్. ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. -
పండుగ పూట బీజేపీలో జనసేన విలీనం..!? బాలకృష్ణ వేధింపులు
-
మహా కుంభమేళాలో...
‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి హిట్ సినిమాల తర్వాత హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ మహా కుంభమేళాలో సోమవారం ప్రారంభమైంది.‘‘ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో ‘అఖండ 2’ చిత్రీకరణ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. సినిమాలోని పలు కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నాం. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా:సి.రాంప్రసాద్, సంతోష్ డి. -
పొగిడితే కళ్లతోనే కనిపెట్టేస్తారు: దర్శకుడు బాబీ
‘‘సెట్స్‌లో నేను ఫ్యాన్ బాయ్‌లా ఉండను. అలా ఉంటే కొన్ని పనులు మనం అనుకున్నట్లుగా సాగవు. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ గార్లతో వర్క్ చేశాను. ఇద్దరూ పని రాక్షసులు. వీరికి అపారమైన అనుభవం ఉంది. పొగడ్తలతో మాట్లాడితే మన అంతరంగాన్ని కళ్లతోనే కనిపెట్టేస్తారు. కాబట్టి నేను సెట్స్‌లో ఓ దర్శకుడిగా నిజాయితీతోనే ఉండాలనుకుంటాను. అప్పుడు మనపై గౌరవం పెరుగుతుంది.చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌గార్ల వంటి సీనియర్ హీరోలతో సినిమాలు చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు దర్శకుడు బాబీ కొల్లి. బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. బాబీ కొల్లి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం నేడు (ఆదివారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు బాబీ చెప్పిన విశేషాలు...⇒ డాకు మహారాజ్‌గా సీతారామ్ ఎలా మారాడు? అన్నది ఈ సినిమా కథనం. బాలకృష్ణగారి ఇమేజ్, ఆయన సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఉండే అంచనాలను దృష్టిలో పెట్టుకునే ‘డాకు మహారాజ్’ కథ రాయడం జరిగింది. ఈ సినిమాలో బాలకృష్ణగారిని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాం. ‘నరసింహనాయడు, సమరసింహారెడ్డి’ చిత్రాల తర్వాత నాకు బాలకృష్ణగారి ‘సింహా’ అంటే చాలా ఇష్టం. ‘సింహా’లో బాలకృష్ణగారు డాక్టర్ రోల్‌ను చాలా సెటిల్డ్‌గా చేశారు⇒ ‘డాకు మహారాజ్’ చిత్రంలో హీరోయిన్స్ శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌ల పాత్రలతో పాటు ఓ చిన్న పాప రోల్ కూడా కీలకంగా ఉంటుంది. ఓ విధంగా ఈ పాప చుట్టూనే కథ తిరుగుతుంది. అయితే మరో హీరోయిన్ చాందినీ చౌదరి సీన్స్ కొన్ని ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ విషయం ఆమెకు తెలియజేశాం. ఆమె ఏమీ అభ్యంతరం తెలుపలేదు. ఈ చిత్రంలో బాబీ డియోల్‌గారు మంచి రోల్ చేశారు. ⇒ మంచి కథ రాసుకోవడం, సీరియస్ స్క్రీన్‌ప్లేని డీల్ చేయడంలో నేను బాగా చేస్తాననే పేరు తెచ్చుకోగలిగాను. కానీ విజువల్స్ పరంగా నా ప్రతిభ గురించి ఆడియన్స్ మాట్లాడుకునేలా చేయలేకపోయానేమో? అనే చిన్న ఆలోచన నాలో ఉండేది. అందుకే ఇప్పుడు ‘డాకు మహారాజ్’ సినిమా విజువల్స్ బాగున్నాయని అంటుంటే హ్యాపీగాఉంది. ‘జైలర్’ డీఓపీ విజయ్ కన్నన్గారు ఈ సినిమాకు వర్క్ చేశారు. విజయ్‌గారు కథను ఓన్ చేసుకుంటారు. అందుకే విజువల్స్ అంత బాగా వచ్చాయి. -
ఊహలకు మించి ఉంటుంది: బాలకృష్ణ
‘‘సంక్రాంతి పండగకి విడుదలైన నా సినిమాలన్నీ ఘన విజయం సాధించాయి. ఈ సంక్రాంతి కానుకగా రిలీజవుతున్న ‘డాకు మహారాజ్’ కూడా ఘన విజయం సాధిస్తుంది. ఈ చిత్రం గురించి ప్రేక్షకులు ఏం ఊహించుకుంటున్నారో అంతకు మించి ఈ సినిమా ఉంటుంది’’ అని బాలకృష్ణ చెప్పారు. బాబీ కొల్లి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా, బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ రేపు (ఆదివారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘తిరుపతి తొక్కిసలాట ఘటన నన్ను ఎంతో కలిచివేసింది. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’.. ఇలా వరుస ఘన విజయాల తర్వాత వస్తున్న ‘డాకు మహారాజ్’తో మరో ఘన విజయాన్ని అందుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు. బాబీ కొల్లి మాట్లాడుతూ–‘‘నా టీమ్‌తో కలిసి ఎంతో శ్రద్ధగా ‘డాకు మహారాజ్’ కథని సిద్ధం చేశాను. బాలకృష్ణగారితో ఒకసారి పని చేస్తే మళ్లీ పని చేయాలనిపిస్తుంటుంది’’ అని చెప్పారు. సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘ఐదేళ్ల క్రితం వైకుంఠ ఏకాదశి రోజున ‘అల వైకుంఠపురములో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి, జనవరి 12న ఆదివారం సినిమా విడుదల చేశాం.ఇప్పుడు ‘డాకు మహారాజ్’కి కూడా అదే జరిగింది. ‘అల వైకుంఠపురములో’లాగే ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది’’ అని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ–‘‘కొన్ని సినిమాలకు ప్రాణం పెట్టి సంగీతం చేయాలనిపిస్తుంది. అలాంటి సినిమా ‘డాకు మహారాజ్’’ అన్నారు. ఈ వేడుకలో వైజాగ్ ఎంపీ భరత్, బాలకృష్ణ కుమార్తె తేజస్విని, కెమెరామేన్ విజయ్ కన్నన్, రచయిత మోహన్ కృష్ణ తదితరులు పాల్గొని, ‘డాకు మహారాజ్’ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు. -
కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది: సూర్యదేవర నాగవంశీ
‘‘డాకు మహారాజ్’లో యాక్షన్ సీన్స్ బాగుంటాయి. తెలుగుతోపాటు తమిళ్లోనూ ఈ నెల 12న మా సినిమాను రిలీజ్ చేస్తున్నాం. బాలకృష్ణగారి కెరీర్లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది’’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘డాకు మహారాజ్’. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి హీరోయిన్లుగా నటించగా, బాబీ డియోల్ కీలకపాత్ర చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.మంగళవారం జరిగిన సమావేశంలో బాబీ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నాను. యాక్షన్‌తోపాటు మంచి వినోదం, భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ నెల 12న నా బర్త్ డే కానుకగా ఈ చిత్ర విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’’ అని ప్రగ్యా జైస్వాల్ చెప్పారు. ‘‘ఈ సినిమా నా జర్నీలో ప్రత్యేకంగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాను’’ అన్నారు శ్రద్ధా శ్రీనాథ్. -
ఎవర్నువ్వు..!
‘అనగనగ ఒక రాజు ఉండేవాడు... చెడ్డవాళ్లంతా ఆయన్ను డాకు అనేవారు. మాకు మాత్రం మహారాజు...’ అంటూ మొదలవుతుంది ‘డాకు మహారాజ్’ సినిమా ట్రైలర్. బాలకృష్ణ(Daaku Maharaaj) హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ ( Daaku Maharaaj ). ఈ చిత్రంలో బాబీ డియోల్, మకరంద్ దేశ్‌పాండే, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. బాబీ కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా అమెరికాలోని డల్లాస్‌లో ‘డాకు మహారాజ్’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఎవర్నువ్వు... నానాజీ అమ్మా.., నీకు నువ్వే జీ అని పెట్టుకుంటే... నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా...’, ‘చెప్పింది వినాలి... ఇచ్చింది తీసుకోవాలి’, ‘వాడి ముందు నువ్వు కాదు... నేనుండాలి’, ‘అసలు ఎవడ్రా నువ్వు... మైఖేల్ జాక్సన్’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ట్రైలర్‌లోని సన్నివేశాలను బట్టి ‘డాకు మహారాజ్’ చిత్రంలోని బాలకృష్ణ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ‘‘యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన ‘డాకు మహారాజ్’ చిత్రం ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: తమన్. -
ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల బలవన్మరణం
సిద్దిపేటకమాన్/ కొల్చారం (నర్సాపూర్): ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆదివారం ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సిద్దిపేట పట్టణంలో అప్పుల బాధ భరించలేక ఒకరు, మెదక్ జిల్లా కొల్చారం మండలంలో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మనస్తాపానికి గురై మరొకరు ఉరేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బండారి బాలకృష్ణ (34).. భార్య మానస, ఇద్దరు కుమారులతో కలసి సిద్దిపేట పట్టణం కాళ్లకుంట కాలనీలో నివాసం ఉంటున్నారు. బాలకృష్ణ రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆర్మర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ సిద్దిపేట నుంచి విధులకు వెళ్లి వస్తుంటారు. కాగా, బాలకృష్ణ ఫోనిక్స్ అనే ఓప్రైవేటు కంపెనీలో ఫోన్ పే, గూగుల్ పే, నెఫ్ట్ ద్వారా పలు విడతలుగా సుమారు రూ.25 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. ఈ క్రమంలో చాలా అప్పులు చేశారు. అయితే పెట్టుబడులపై ఆశించిన ఆదాయం రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని భార్యతో చెప్పి శనివారం రాత్రి ఎలుకల మందు కలిపిన టీని ఇద్దరు పిల్లలకు తాగించి, భార్యాభర్తలు కూడా తాగారు. ఆదివారం తెల్లవారుజామున మేలుకున్న బాలకృష్ణ లేచి చూడగా అందరూ స్పృహలోనే ఉన్నారు. ఇది గుర్తించి అతడు పక్క గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలకృష్ణ భార్య మానస, ఇద్దరు కుమారులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతుడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ వాసుదేవరావు తెలిపారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారని..మరో ఘటనలో మెదక్ జిల్లా కొల్చారం పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కాటూరి సాయికుమార్ (55) బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం ప్రకారం.. హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ భార్య శైలజ, ఇద్దరు కుమార్తెలతో కలసి నర్సాపూర్‌లో ఉంటున్నారు. రోజూ అక్కడి నుంచే డ్యూటీకి వచ్చి వెళ్తుంటారు. శనివారం మధ్యాహ్నం కొల్చారం స్టేషన్‌కు డ్యూటీకి వచ్చారు. రాత్రి క్వార్టర్ రూమ్‌లో ఉన్నారు. ఆదివారం ఉదయం భార్య శైలజకు ఫోన్ చేసి, ‘నేను చనిపోతున్నాను. నన్ను కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు’అని చెప్పి స్టేషన్ ఆవరణలోని చెట్టుకు ఉరేసుకొన్నారు. విషయం తెలుసుకున్న మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారుతీవ్రంగా వేధించారు: మృతుడి భార్య శైలజకొంతకాలంగా నర్సాపూర్‌లోని ఓ మహిళతో సాయికుమార్ తరచూ ఫోన్లో మాట్లాడేవారని ఆయన భార్య శైలజ తెలిపారు. ఇది తెలిసిన ఆ మహిళ భర్త.. వివాహేతర సంబంధం అంటగట్టడంతోపాటు కేసు పెడతానంటూ వేధించేవాడని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా అతడి అల్లుడితో కలసి చంపుతామంటూ తరచూ బెదిరించేవారని పేర్కొంది. తన భర్త మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు. -
గుర్తుండిపొతుంది
‘‘డాకు మహారాజ్’ సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఊహించినదానికంటే బ్రహ్మాండమైన యాక్షన్ సీన్స్ ఉంటాయి. అలాగే వినోదం, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. బాలకృష్ణగారి నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది’’ అని డైరెక్టర్ బాబీ కొల్లి చెప్పారు. బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘డాకు మహారాజ్’.ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి హీరోయిన్లుగా నటించగా, బాబీ డియోల్ కీలక పాత్ర చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ –‘‘బాలకృష్ణగారి కెరీర్లో గుర్తుండిపొయే చిత్రాల్లో ఒకటిగా ‘డాకు మహారాజ్’ నిలుస్తుంది. జనవరి 2న హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల వేడుక, 4న అమెరికాలో ప్రీ రిలీజ్ వేడుక చేసి, ఒక పాట విడుదల చేయాలనుకుంటున్నాం. 8న ఏపీలో ప్రీ రిలీజ్ వేడుక ప్లాన్ చేస్తున్నాం’’ అని తెలిపారు. -
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారుణం ఉంది
-
టీడీపీ దిగజారుడు రాజకీయం బాలకృష్ణ డైరెక్షన్ లో కౌన్సిలర్లకు ఎర
-
బాలకృష్ణ రిసార్ట్ రాజకీయం..
క్యాంపు రాజకీయాలతో ఎన్టీఆర్ నుంచి టీడీపీని చంద్రబాబు లాక్కోగా... అదే బాటలో ఆయన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా నడుస్తున్నారు. 38 కౌన్సిల్ స్థానాలున్న హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు సిద్ధమయ్యారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను తమవైపునకు తిప్పుకుని రిసార్ట్ రాజకీయం చేస్తున్నారు.హిందూపురం: నోరు తెరిస్తే బ్లడ్డు...బ్రీడు అంటూ తన గురించి తాను గొప్పగా చెప్పుకునే ఎమ్మెల్యే బాలకృష్ణ నీచ రాజకీయానికి తెరతీశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే హిందూపురం మున్సిపల్ పీఠంపై ఆయన కన్నేశారు. తనకు అనుకూలమైన వారిని చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు కుట్ర రాజకీయాలకు తెరలేపారు.ప్రలోభాలు.. బెదిరింపులుహిందూపురం మున్సిపాల్టీలో 38 వార్డులున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 30 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. బీజేపీ ఒకటి, ఎంఐఎం మరో స్థానం దక్కించుకోగా... టీడీపీ అష్టకష్టాలు పడి ఆరింటితో సరిపెట్టుకుంది. పురంలో వైఎస్సార్ సీపీ అఖండ విజయం సాధించాక ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ స్థానం కోసం ఎంతోమంది పోటీపడగా..మహిళకు పెద్దపీట వేశారు. అందులోనూ బీసీలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని భావించి తొలిసారి కౌన్సిలర్‌గా గెలిచిన బోయ ఇంద్రజకు చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. బీసీ సంక్షేమంపై తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ గిమ్మిక్కు రాజకీయాలు చేశారు. ప్రలోభాలకు గురిచేసి ఇంద్రజను టీడీపీ వైపు లాగారు. ఈ నేపథ్యంలోనే ఆమె తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ చైర్పర్సన్ స్థానానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలన్న ఉద్దేశంతో బాలకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు దిగజారి ప్రవర్తించారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రలోభాలకు తెరతీశారు. అందుకు లొంగని వారిని భయపెట్టారు. అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ప్రస్తుతం హిందూపురం మున్సిపల్ కౌన్సిల్లో టీడీపీకి ఆరుగురు కౌన్సిలర్లు ఉండగా, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లను కలుపుకున్నారు. దీంతో టీడీపీ బలం 8కి చేరింది. దీంతో చైర్పర్సన్ ఇంద్రజతో పాటు మరికొంత మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను తమవైపు లాక్కున్నారు.రిసార్ట్ రాజకీయం..టీడీపీ, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లతో పాటు వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయించిన కౌన్సిలర్లు, వారి కుటుంబీకులను ఎమ్మెల్యే బాలకృష్ణ హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌కు తరలించారు. రెండురోజుల్లో చైర్మన్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నోటిఫికేషన్ రాగానే కౌన్సిలర్లను నేరుగా కౌన్సిల్ సమావేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రజల సమస్యలు గాలికి వదిలేసి చైర్మన్ పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న టీడీపీ నీచ రాజకీయాన్ని జనం చీదరించుకుంటున్నారు. -
గేమ్ చేంజ్ చేసిన రామ్ చరణ్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
కష్టాల్లో ఏపీ ప్రజలు.. వినోదాల్లో మునిగి తేలుతున్న చంద్రబాబు
సాక్షి,విజయవాడ: ఏపీలో ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబు రియాలిటీ షోల్లో మునిగిపోయారు. ఓ వైపు రాష్ట్రంలో ఆడబిడ్డలపై హత్యాచారాలు జరుగుతుంటే.. ఇటు విజయనగరం జిల్లా గుర్లలో అతిసారా వ్యాధితో 11మంది మరణిస్తే ఇవేమీ పట్టకుండా బావ బాలకృష్ణతో చంద్రబాబు అన్‌స్టాపబుల్ షోకు వెళ్లడం వివాదాస్పదంగా మారింది. వీకెండ్ విహారంలో భాగంగా రియాలిటీ షో అన్‌స్టాపబుల్‌కి హాజరయ్యారు చంద్రబాబు. రాష్ట్రంలో ఆడపిల్లలపై ఆఘాయిత్యాలు జరుగుతుంటే రియాలిటీషోలు చేసుకుంటున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు.విజయ నగరం జిల్లా గుర్లలో అతిసారతో 11మంది ప్రాణాలు పోయినా పట్టించుకోని చంద్రబాబు అన్‌స్టాపబుల్ షోనే ప్రధానంగా భావించారా? అనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇంతమంది చనిపోతే ఒక్క సమీక్ష చేయలేదు చంద్రబాబు. శనివారం వీకెండ్ విశ్రాంతి కోసం చంద్రబాబు హైదరాబాద్‌కు వెళ్లారు. ఇవాళ అన్ స్టాపబుల్ షోలో బిజీగా గడిపారు.హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో అఘాయిత్యం జరిగితే ఇప్పటి వరకు బాధితుల్ని పరామర్శించడానికి ఎమ్మెల్యే బాలకృష్ణ వెళ్లలేదు. దీంతో వియ్యింకులు వినోదపు షోలపై రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
ఎన్టీఆర్ రూట్ లో బాలకృష్ణ
-
వేర్ ఈజ్ పోలీస్ ప్రభుత్వం?
సాక్షి, అమరావతి/ సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగ అరాచకం రాష్ట్రంలో విశృంఖలంగా సాగిపోతోంది. అమాయకులను వేధింపులకు గురిచేస్తూ, నేరగాళ్లకు అండగా నిలుస్తూ చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగిస్తోంది. గత 4 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అరాచకాలే ఇందుకు నిదర్శనం. తాజాగా దసరా రోజున శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని నల్ల బొమ్మనపల్లిలో అత్త, కోడలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆగంతకులకు టీడీపీ సర్కార్ కొమ్ముకాస్తూ.. కేసును పక్కదారి పట్టించేందుకూ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే దారుణం జరిగి మూడు రోజులైనా పోలీసులు ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పైపెచ్చు ఈ ముఠాక నాయకుడైన యువకుడిని ఇంతవరకు అరెస్టు చేయలేదు. టీడీపీ నేతలు పెంచి పోషిస్తున్న ఈ నేరగాళ్ల ముఠాకు పొట్ట కూటి కోసం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన కుటుంబం బలైపోయింది. ఓ పేపర్ మిల్లులో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న తండ్రి, కొడుకుపై వారి ఇంటి ఎదుటే దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన వాచ్‌మేన్ భార్య, కోడలిని బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకుపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆత్తా కోడళ్లను బలవంతంగా ఎత్తుకుపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైగా, ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు నిందుతలకు ప్రభుత్వ వత్తాసును స్పష్టంచేస్తున్నాయి. ఆరుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని సీసీ టీవీ రికార్డులు స్పష్టంగా చెబుతున్నాయి. వారిలో అయిదుగురిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కానీ ఆ ముఠాకు నాయకుడిగా ఉన్న యువకుడిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం తీరు పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలీ రాష్ట్రంలో పోలీసులున్నారా.. ప్రభుత్వముందా అంటూ ప్రజలు, విపక్షాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.బాధితులను పరామర్శించేందుకు అనుమతినివ్వని పోలీసులు అత్యాచార బాధితులను కలిసేందుకు ప్రతిపక్ష నేతలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులను ప్రభుత్వం అనుమతించడంలేదు. బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నించినా పోలీసులు సమ్మతించలేదు. బాధితులను కలిసేందుకు ఎవరినీ అనుమతించడంలేదని పోలీసులు చెబుతున్నారు. బాధితులపై ఒత్తిడి తెచ్చి, నిజాలకు పాతరేసి, కేసును పక్కదారి పట్టించాలన్న ప్రభుత్వ పెద్దల పన్నాగంలో భాగంగానే ఇతరులెవ్వరూ బాధితులను కలిసేందుకు అనుమతించడంలేదు. ప్రతిపక్ష నేతలు, మహిళా సంఘాల ప్రతినిధులు బాధితులను కలసి మాట్లాడితే వారు వాస్తవాలు వెల్లడించే అవకాశం ఉన్నందునే ఎవర్నీ అనుమతించడం లేదన్నది సుస్పష్టం.రాష్ట్రమంతా ఇదే దారుణకాండచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాపంగా మహిళలు, యువతులపై అత్యాచారాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. నంద్యాల జిల్లా ముచ్చిమర్రులో ఓ బాలికను అపహరించి అత్యాచారం చేసి హత్య చేశారు. ఇది జరిగి నాలుగు నెలలైనా ఆ చిన్నారి మృతదేహాన్ని కూడా ఆమె తల్లిదండ్రులకు అప్పగించలేకపోయారు. ఇక పుంగనూరులో ఇటీవల ఓ ముస్లిం బాలికను అపహరించి హత్య చేశారు. తమ బిడ్డను ఎవరో అపహరించుకుపోయారని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా అయిదు రోజులు పోలీసులు కాలయాపన చేశారు తప్ప, ఆ చిన్నారిని రక్షించే ప్రయత్నం చేయలేదు. నిత్యం బాలికలు, మహిళలపై లైంగిక దాడులు, అరాచకాలతో రాష్ట్రం అల్లకల్లోలమవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడమేలేదు.వేర్ ఈజ్ ఎమ్మెల్యే బాలకృష్ణనందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో విలన్ ఓ మహిళా అధికారిని ఆమె కుమారుడి ఎదుటే అత్యాచారం చేస్తారు. ఆ సినిమాలో హీరో పాత్రధారి బాలకృష్ణ ఆ విలన్‌ను చంపి శిక్షిస్తాడు. అంతేకాదు.. మహిళల ఔన్యత్యాన్ని కీర్తిస్తూ భారీ డైలాగులు చెబుతారు.. కట్ చేస్తే.. అదే హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరుసగా మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఆగంతకులు అత్త, కోడలిపై వారి ఇంట్లోనే సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. తన నియోజకవర్గంలోనే జరిగిన ఈ ఘోరంపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించనే లేదు. కనీసం పోలీసులతో మాట్లాడి నిందితులను వెంటన అరెస్ట్ చేయమని ఆదేశించనూ లేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించనూ లేదు. సినిమా షూటింగ్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. అందుకే హిందూపూర్ ప్రజలే కాదు.. యావత్ రాష్ట్రం ‘వేర్ ఈజ్ పోలీస్.. వేర్ ఈజ్ ప్రభుత్వం.. వేర్ ఈజ్ బాలకృష్ణ’ అని ప్రశ్నిస్తోంది. -
బాలకృష్ణ నిద్ర పోతున్నావా... దసరా రోజున ఇలాంటి ఘటన దారుణం
-
ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో రెచ్చిపోయిన టీడీపీ నేత
శ్రీ సత్యసాయి, సాక్షి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల దాడులు ఆగటం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పచ్చనేతలు దాడులతో రెచ్చిపోతున్నారు.తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో టీడీపీ నేత రెచ్చిపోయాడు. హిందూపురంలో కొడవలితో టీడీపీ నేత శ్రీహరి నాయుడు వీరంగం సృష్టించాడు. వినాయకుడి మండపం వద్ద డీజే పెట్టొద్దని.. పాటలు నిలిపివేయాలని గొడవకు దిగాడు. అక్కడితో ఆగకుండా అక్కడి ఉన్నవారిపై దాడికి తెగబడ్డాడు.టీడీపీ నేత దాడిలో పాండురంగ అనే వ్యక్తి గాయపడ్డారు. ప్రస్తుతం టీడీపీ నేత దౌర్జన్యం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.చదవండి: విపత్తు నిర్వహణను పట్టించుకోని చంద్రబాబు సర్కార్ -
ఎమ్మెల్యే బాలకృష్ణపై రైతుల ఆగ్రహం
శ్రీ సత్యసాయి, సాక్షి: తెలుగుదేశం పార్టీ హిందూపురం నియోజవర్గం ఎమ్మెల్యే బాలకృష్ణపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. హిందూపురం పోలీసు స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున రైతులు ధర్నాకు దిగారు. టీడీపీ నేతల కబ్జా వ్యవహారంపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించాలంటూ రైతుల నినాదాలు చేశారు. హిందూపురంలో రూ. 2 కోట్ల విలువైన పాడి రైతుల భవనాన్ని టీడీపీ నేతలు కూల్చివేశారు. ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించకపోవటంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: సొసైటీ భవనం నేలమట్టం -
మోక్షజ్ఞ ఎంట్రీ షురూ
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం కానున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఎం తేజస్వినీ నందమూరి సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మోక్షజ్ఞ పుట్టినరోజు (సెప్టెంబర్ 6) సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘నాపై, నా కథపై బాలకృష్ణగారు ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. మన ఇతిహాసాల నుండి పొందిన స్ఫూర్తితో ఈ కథ ఉంటుంది’’ అన్నారు. ‘‘మోక్షజ అరంగేట్రానికి సరి΄ోయే కథను ప్రశాంత్ వర్మ సిద్ధం చేశారు. ఇప్పటికే నటన, ఫైట్స్, డ్యాన్స్‌లో మోక్షజ్ఞ శిక్షణ తీసుకున్నారు’’ అని సుధాకర్ చెరుకూరి అన్నారు. -
బాలయ్యతో మరోసారి పూరి..
-
హిందూపురంలో రెచ్చిపోయిన పచ్చమూక.. మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, సత్యసాయి: నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు వేధింపులకు పాల్పడ్డారు. ఈ వేధింపుల కారణంగా ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తన ఆవేదన, బాధను సెల్ఫీ వీడియోలో వ్యక్తం చేసింది.వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇలాకాలో మరో దారుణం జరిగింది. టీడీపీ నేతల ఒత్తిళ్లతో సుగుణమ్మ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కాగా, చిలమత్తూరులో వికలాంగుడు నాగరాజు వెలుగు యానిమేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, తాజాగా అకారణంగా నాగరాజును విధుల నుంచి తొలగించారు. ఈ క్రమంలో తనను ఎందుకు తొలగించారని నాగరాజు, అతడి భార్య సుగుణమ్మ ప్రశ్నించగా టీడీపీ నేతలు వేధింపులకు గురిచేశారు.దీంతో, సుగుణమ్మ మనాస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సందర్భంగా టీడీపీ నేతల వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియోలో సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. నెయిల్ పాలిష్ తాగి ఆమె ఆత్మహత్యయత్నం చేయడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలియాల్సి ఉంది. -
మళ్ళీ వార్ కి రెడీ అవుతున్న చిరు, బాలయ్య
-
రెచ్చిపోతున్న బాలకృష్ణ..
-
పదవి ఒకరిది.. పెత్తనం మరొకరిది
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడిచింది. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అప్పుడే నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. ఎమ్మెల్యేల బంధువులు, అనుచరులు, పీఏలు పెత్తనం చేస్తున్నారు. ఎంతో నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే ఇదేనా మీరు మాకు చేసే సేవ అంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు.సాక్షి, పుట్టపర్తి : జిల్లాలో షాడో ఎమ్మెల్యేల హవా నడుస్తోంది. ఎమ్మెల్యే ఒకరైతే.. కుటుంబ సభ్యుల్లో మరొకరు పెత్తనం చేస్తూ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ దర్జాగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవక ముందే పుట్టపర్తి, మడకశిర, హిందూపురంలో ప్రజలకు వింత పరిస్థితులు ఎదురవుతున్నాయి. షాడో ఎమ్మెల్యేలకు ఎలాంటి హోదా లేకున్నా.. అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. సమీక్షలు నిర్వహిస్తూ ఆదేశాలిస్తుండటంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రశ్నిస్తే ఎక్కడ బదిలీ చేస్తారోనని భయపడిపోతున్నారు. జనం కూడా షాడో ఎమ్మెల్యేల తీరుపై పెదవి విరుస్తున్నారు.ధర్మవరంలో చక్రం తిప్పుతున్న శ్రీరామ్..ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ రాష్ట్ర మంత్రిగా ఇతర ప్రాంతాలకే పరిమితం కాగా...నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ చక్రం తిప్పుతున్నారు. అన్ని విషయాల్లోనూ ఆయనే జోక్యం చేసుకుంటున్నారు. తాను నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్నంటూ పెత్తనం చెలాయిస్తున్నారు. అధికారులను బదిలీలు చేయిస్తానంటూ బెదిరిస్తున్నారు. రాప్తాడులోనూ పరిటాల సునీత ఎమ్మెల్యే అయినప్పటికీ.. అక్కడ కూడా పరిటాల శ్రీరామ్ రాజ్యమేలుతున్నారు. ఎలాంటి పదవి లేకున్నా.. ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు.హిందూపురంలో పీఏల పాలన..ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమాల్లో బిజీగా ఉండటంతో నియోజకవర్గంలో గత పదేళ్లుగా ఆయన పీఏ (పర్సనల్ అసిస్టెంట్) లే అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. 2014లో బాలయ్య తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు.. శేఖర్ అనే వ్యక్తి పీఏగా ఉంటూ తానే లోకల్ ఎమ్మెల్యే అన్న తరహాలో ప్రవర్తించారు. మరో పీఏ పేకాట ఆడుతూ కర్ణాటక పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం మరో ఇద్దరు పీఏలు తామే నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నామని చెబుతున్నారు. కనిపించని ఎమ్మెల్యే కంటే కళ్లముందుండే పీఏనే బెటరని కార్యకర్తలు కూడా వారి చుట్టే తిరుగుతున్నారు.మడకశిరలో మాజీ ఎమ్మెల్సీ హవా..ఎస్సీ రిజర్వుడు స్థానమైన మడకశిరలో పెత్తందారు గుండుమల తిప్పేస్వామి హవా నడుస్తోంది. టీడీపీ తరఫున ఎమ్మెల్యే ఎవరైనా.. పెత్తనం మాత్రం మాజీ ఎమ్మెల్సీ గుండుమలదే. అధికారుల బదిలీలు, పాలనా వ్యవహారాలతో పాటు కార్యకర్తలతో నిత్యం టచ్‌లో ఉంటూ ఎమ్మెల్యే తరహాలో అధికారం చెలాయిస్తున్నారు. తనను వ్యతిరేకిస్తే.. టీడీపీలో మనుగడ సాగించడం కష్టమని, భయపెడతారనే ఆరోపణలున్నాయి.నామినేటెడ్ కోసం లాబీయింగ్..టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయా పార్టీల నేతలు నామినేటెడ్ పదవులపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల వద్ద లాబీయింగ్ చేసేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే బదులు షాడో ఎమ్మెల్యేల హవా నడుస్తుండటంతో ఎవరిని ప్రసన్నం చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. అధికారుల బదిలీలు, పోస్టింగులు తదితర వ్యవహారాల్లోనూ షాడో ఎమ్మెల్యేలే కీలకపాత్ర పోషిస్తున్నారు.పుట్టపర్తిలో ఎమ్మెల్యే మామదే పెత్తనం..జిల్లా కేంద్రం పుట్టపర్తిలో పల్లె సింధూరారెడ్డి పేరుకే ఎమ్మెల్యే. అంతా ఆమె మామ, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డే చూసుకుంటారు. ఆయనే నేరుగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేస్తున్నారు. చెప్పినట్లు వినని అధికారులను బదిలీ పేరుతో బెదిరిస్తున్నారు. ప్రతి కార్యక్రమంలోనూ ఎమ్మెల్యే కంటే ఆయనే ముందు ఉంటూ షాడో ఎమ్మెల్యేగా మారారు. నియోజకవర్గంలోని అధికారులు, నాయకులతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రతి సమావేశంలోనూ ఆయనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. -
బాలయ్య దెబ్బకు అంజలి భయపడిందా ? ట్వీట్ కు కారణం అదేనా
-
మరోసారి అడ్డంగా బుక్కయిన బాలయ్య.. సంచలన నిర్ణయం తీసుకున్న సుకుమార్
-
బుక్కయిన బాలయ్య.. అంతా గ్రాఫిక్స్ అంటున్న ప్రొడ్యూసర్...
-
బ్లడ్ వేరు బ్రీడ్ వేరు..బ్రాందీ తోనే నడుస్తుంది
-
మందేసి హీరోయిన్ అంజలిని స్టేజ్ పై తోసేసిన బాలకృష్ణ
-
బాలయ్య బాబు కి బలమైన కౌంటర్లు పిఠాపురం సాక్షిగా దత్తపుత్రుడి పరువు..!
-
బాలకృష్ణ, దత్తపుత్రుడికి జిరాక్స్ కాపీలిచ్చారా? సీఎం జగన్
-
పవన్ కళ్యాణ్, బాలకృష్ణకు సీఎం జగన్ కౌంటర్
-
హిందూపూర్ లో నా మెజారిటీ ఎంతంటే..?
-
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
-
హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు
-
జగన్ పాటకే భయపడ్డారు!
హిందూపురం అర్బన్: ప్రజాభిమానం మెండుగా ఉన్న వైఎస్ జగన్ పేరు చెబితేనే టీడీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ‘భళి రా.. భళి భళి రా..భళి రా..పులివెందులలో పుట్టింది పులి రా’ అంటూ జనం వైఎస్సార్ సీపీ జెండా పట్టుకుని ఆనందంతో నృత్యాలు చేస్తుంటే టీడీపీ నాయకులు చూసి తట్టుకోలేక ఘర్షణకు దిగుతున్నారు. ఈక్రమంలోనే ముద్దిరెడ్డిపల్లికి చెందిన టీడీపీ నేతలు హద్దులు దాటి ప్రవర్తించారు. గురువారం బాలకృష్ణ సతీమణి వసుంధర ముద్దిరెడ్డిపల్లిలో రోడ్ షో నిర్వహించారు. అదే సమయంలో అక్కడే వైఎస్సార్ సీపీ ప్రచార జీపు కూడా ఉంది. అందులో జగన్ పాటలు వినిపిస్తుండటంతో పచ్చమూకలు రెచ్చిపోయాయి. జగన్ పాటలు ఎందుకు పెట్టారంటూ దౌర్జన్యానికి దిగారు. స్థానికులు నచ్చ జెప్పటంతో అప్పటికి వెనుతిరిగారు. అనంతరం పలువురు టీడీపీ నాయకులు అక్కడ గుమికూడటంతో.. వైఎస్సార్సీపీ నాయకులూ అక్కడికి చేరుకున్నారు. ఇంత చిన్న విషయానికి రాద్ధాంతం అవసరం లేదని వైఎస్సార్ సీపీ నేతలు చెబుతుండగానే... టీడీపీ నాయకులు రెచ్చి పోయారు. వైఎస్సార్ సీపీ నాయకులు లోకేష్, నాగభూషన్రెడ్డి, నవీన్, బాబు, అసీఫ్‌లపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో లోకేష్‌తో పాటు బాబు, నవీన్‌లకు గాయాలు కాగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో టీడీపీ నేతలు కూడా దాడిలో తమకూ గాయాలయ్యాయని ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలోనూ ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభం కాగా, పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు దాడులకు తెగబడిన టీడీపీ నేతలపై వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ నేతలూ ఫిర్యాదు చేశారు. -
బాలయ్య.. ఇదేం బాలేదయ్యా..!
కంచరపాలెం: అసలే నందమూరి నటసింహం..ఆయన సభకు జనం లేకపోతే టీడీపీ స్థానిక నేతలకు దబిడి దిబిడే. కాళ్లోవేళ్లో పట్టుకుని మనిషికి రూ.200 ఇచ్చి మరీ టీడీపీ నేతలు జనసమీకరణ చేశారు. అయితే బాలయ్య తనమార్కు డైలాగ్‌లతో ప్రజలను విసిగించాడు. మరీ ఆనాడు...అంటూ ప్రారంభించి తలాతోకలేని మాటలతో విసుగుతెప్పించాడు. కంచరపాలెం మెట్టు ప్రధాన రహదారిపై శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ 5.45 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా..రాత్రి 7.20 గంటలకు బాలకృష్ణ రావడంతో జనం రోడ్లపై నిలబడలేక ఊసూరుమన్నారు. మైక్ అందుకున్న బాలయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బదులు సీఎం జీవన్ అంటూ నోరుతిరగని పదాలతో జనాన్ని అయోమయంలో పడేశాడు. స్థానిక టీడీపీ, బీజేపీ అభ్యర్థుల కోసం కాకుండా తన తండ్రి ఎన్టీఆర్ సేవల గురించి చెప్పుకున్నాడు. చంద్రబాబు కోసం అంతంత మాత్రమే మాట్లాడగా.. ఇక పవన్ కల్యాణ్ గురించి అసలు ప్రస్తావనే లేదు. రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అర్థం కాని మాటలు, సినీ డైలాగ్‌లతో బాలకృష్ణ బోర్ కొట్టించాడు. ఐటీఐ కూడలిలో బాలకృష్ణకు పూలదండ వేసేందుకు భారీ క్రేన్‌ను టీడీపీ నాయకులు అడ్డంగా పెట్టడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సభా వేదిక వద్ద టీడీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచార రథాలపై మహిళలు సినీ గీతాలకు డ్యాన్స్ చేస్తున్నా.. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు. బీఆర్టీఎస్ రోడ్డులో కార్యకర్తలు అడ్డంగా ఉండటంతో అంబులెన్స్ వెళ్లేందుకు దారి లేక చాలాసేపు అక్కడే నిలిచిపోయింది. -
బాలకృష్ణ చిన్నల్లుడి వ్యాఖ్యలపై దుమారం
సాక్షి, విశాఖపట్నం: ‘ప్రభుత్వం అతి పెద్ద గూండా! అది వైఎస్సార్ సీపీ అయినా.. టీడీపీ ప్రభుత్వమైనా అంతే..’ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. విశాఖ లోక్‌సభకు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న శ్రీభరత్. ఈయన నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు, నారా లోకేష్ తోడల్లుడు కూడా. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే.. ‘ప్రభుత్వంతో పని చేయడం తనకు అస్సలు ఇష్టం ఉండదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ పోట్లాడలేరు. చేసిన పనులకు బిల్లు పెండింగులో ఉంటే కోర్టు కెళ్తే వస్తుందనుకుంటున్నారా? రాదు.. వెయ్యి కండిషన్లు పెడతారు. ఏదో లోపం వెతుక్కుంటూ పోతారు. అందుకే ప్రభుత్వాలపై నాకు నమ్మకం కుదరదు’ అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో డబ్బు ఖర్చు పెట్టే వారి దగ్గరకే ఎక్కువ మంది జనం చేరతారన్నారు.‘ఎక్కువ మంది మన గురించి మాట్లాడాలన్నా.. వారికి చేరువకావాలన్నా డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టాలి. కార్యకర్తలు రాజకీయ నాయకుడి దగ్గరకు విద్య, వైద్య, ఆరోగ్య అవసరాల కోసం వస్తుంటారు. పార్టీ కార్యక్రమాలు చేస్తున్నామని, గుడులు కడుతున్నాం విరాళాలివ్వండి అంటూ వస్తారు. నేను మనీ పాలిటిక్స్‌ను నమ్మను’ అని పేర్కొన్నారు. అందుకే తాను ఎంపీగా పోటీ చేయాలని ఎంచుకున్నట్లు చెప్పారు. ఎంపీ అయితే డబ్బుల విషయంలో నేరుగా జోక్యం(డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్) ఉండదన్నారు. ఎంపీ అభ్యర్థయితే డబ్బు ఖర్చు పెట్టనక్కర్లేదని, తన లోక్‌సభ పరిధిలో పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల అభ్యర్థులే అవన్నీ భరిస్తారని కుండబద్దలు కొట్టారు.ఇప్పటికే శ్రీభరత్ ఎన్నికల ఖర్చుల విషయంలో క్యాడర్‌కు చుక్కలు చూపిస్తున్నారని టీడీపీ శ్రేణులు లబోదిబోమంటున్నారు. ఎన్నికల ఖర్చు విషయంలో ఆయన పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులపైనే భారాన్ని మోపారన్న విషయం తేటతెల్లమవుతోందని టీడీపీ నాయకులే చెబుతున్నారు. కోట్లకు అధిపతి అయిన శ్రీభరత్‌ను ఎంపీగా గెలిపించే బాధ్యతను తమపైకి నెట్టేయడమేమిటని అసెంబ్లీ అభ్యర్థులు కిందామీదా పడుతున్నారు. మొత్తం మీద శ్రీభరత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అటు టీడీపీలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అవుతున్నాయి. -
తప్పుడు ప్రకటనలకు విరుగుడు ఎలా?
తప్పుదోవ పట్టించేలా ప్రకటనలిచ్చారంటూ పతంజలి సంస్థ విషయంలో సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. 1954 నాటి చట్టం కొన్ని రకాల వ్యాధులకు మందులను ప్రకటించడంపై నిషేధం విధిస్తోంది. అయినా ఫలానా ఔషధాలతో అద్భుతాలు జరుగుతాయనడం, వాటి సామర్థ్యంపై చిలువలు పలువలుగా చెప్పడం కొనసాగుతూనే ఉంది. తప్పుదోవ పట్టించే ప్రకటనల జారీ కేవలం ఒక్క సంస్థకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రాయోజిత కార్యక్రమాల రూపంలో ఎన్నో తప్పుడు చికిత్సావిధానాలు, మందుల గురించి ప్రచారం జరుగుతోంది. దేశంలోని చట్టాలు సరిపోకపోవడమో, శక్తిమంతంగా లేకపోవడమో ప్రస్తుత సమస్యకు కారణం కాదు; చట్టాల అమలులో ఉదాసీనంగా ఉండటమే అసలు సమస్య.సుప్రీంకోర్టులో ఇటీవల ఓ ఆసక్తికరమైన వ్యవహారం నడిచింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలిచ్చారంటూ పతంజలి ఆయుర్వేద వ్యవస్థాప కుడు బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యవహరించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేననీ, ధిక్కరణ కేసు విష యంలో క్షమాపణలు స్పష్టంగా, బహిరంగంగా తగు ప్రాధాన్యంతో చెప్పాల్సిందేననీ సుప్రీంకోర్టు పట్టుబట్టిన విషయం తెలిసిందే. తుది తీర్పు మాటెలా ఉన్నా... ఈ కేసు అటు మందుల తయారీదారుకు, ఇటు నియంత్రణ వ్యవస్థలు, ప్రభుత్వాలు, వినియోగదారులకు చాలా పాఠాలు నేర్పింది. ఇంతకీ ఏమిటీ కేసు? అన్నింటికీ కేంద్రంగా ఉన్నవి 1954 నాటి డ్రగ్స్ అండ్ మేజిక్ రెమిడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనల) చట్టం; 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం... దీని కింద 1945లో రూపొందించిన నిబంధనలను రామ్‌దేవ్ బాబాకు చెందిన సంస్థలు ఉల్లంఘించాయన్నది ఆరోపణ. 1954 చట్టం కొన్ని రకాల వ్యాధులకు మందులను ప్రకటించడంపై నిషేధం విధిస్తోంది. కొన్ని రకాల మందుల ప్రకటనకు సంబంధించి పరిమితులు విధిస్తోంది. క్యాన్సర్, మధుమేహం, వంధ్యత్వం, ఎయిడ్స్, ఊబకాయం, తక్కువ వయసు లోనే వృద్ధాప్య లక్షణాలు కనిపించడం, అంధత్వం వంటి సమస్యల పరిష్కారానికి మందులున్నాయని ప్రకటనలు జారీ చేయకూడదు... ఔషధాలతో అద్భుతాలు జరుగుతాయనడం, వాటి సామర్థ్యంపై చిలు వలు పలువలుగా చెప్పడం వంటివి. 1940 నాటి చట్టం... భారత్‌లో మందులు, సౌందర్య సాధనాలు, వైద్య పరికరాలు తదితరాల తయారీ, పంపిణీ, అమ్మకాలకు సంబంధించిన ప్రాథమిక చట్టం.పతంజలి సంస్థ మధుమేహం మొదలుకొని థైరాయిడ్ సంబంధిత సమస్యలు, ఆఖరికి క్యాన్సర్ వ్యాధికీ మూలిక సంబంధిత మందులు ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ కాలంలో ఈ సంస్థ వ్యాధిని నయం చేస్తుందని చెబుతూ ‘కరోనిల్’ను ప్రవేశ పెట్టింది. అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ దీనికి మద్దతు పలికారు. ఈ మందుపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు మార్కెటింగ్‌లో ‘చికిత్స’ స్థానంలో ‘నిర్వహణ’ అని మార్చి చేతులు దులుపుకుంది పతంజలి. ఎన్నో వ్యాధులకు చికిత్స కల్పిస్తామని ప్రక టనలు జారీ చేయడమే కాకుండా, ఆధునిక వైద్య పద్ధతినీ లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగింది. ఈ అంశంపై విసుగు చెందిన కొందరు ఆరోగ్య కార్యకర్తలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు.. చట్టాల ఉల్లంఘన జరిగిందని ఫిర్యాదు చేశారు. కోర్టు తగదని వారించినా తప్పుడు ప్రకటన జారీ మాత్రం ఆపలేదు. ఫలితంగా కోర్టు ధిక్కరణకూ పాల్పడినట్లు అయ్యింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల జారీ కేవలం పతంజలి సంస్థకు మాత్రమే పరిమితం కాలేదు. నిర్దిష్ట సమయాల్లో దేశంలోనిపత్రికలు, న్యూస్ ఛానెళ్లు కూడా ప్రాయోజిత కార్యక్రమాల రూపంలో ఎన్నో తప్పుడు చికిత్స పద్ధతులు, మందుల గురించి ప్రచారం చేస్తూంటాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లోనైతే ఇలాంటివి కుప్పలు తెప్పలు! తాజాగా సోషల్ మీడియా ‘ఇన్ఫ్లుయెన్సర్లు’ రంగంలోకి దిగారు. ప్రమాదకరమైన ఉత్పత్తులను కూడా వీరు ఆరోగ్యం పేరిట అమ్మడం, ప్రచారం చేయడం మొదలుపెట్టారు. పెద్ద కంపెనీలు నేరుగా ప్రకటనలు జారీ చేసే విషయంలో కొంత నిగ్రహం పాటిస్తాయి. బదులుగా పెయిడ్ న్యూస్, వైద్య సంబంధిత సదస్సుల ప్రాయోజకత్వం, వైద్యులకు గిఫ్టులు ఇవ్వడం వంటి అనైతిక చర్యల ద్వారా తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకునే ప్రయత్నం చేస్తూంటాయి. కొన్నేళ్ల క్రితం తగినన్ని సాక్ష్యాలు లేకపోయినా కొన్ని ఔషధాల సామర్థ్యం విషయంలో ఐఎంఏ స్వయంగా మద్దతు పలకడం చెప్పుకోవాల్సిన అంశం. వైద్యుల అనైతిక చర్యల విషయంలోనూ ఐఎంఏ రికార్డు ఏమంత గొప్పగా లేదు. దేశంలోని చట్టాలు సరిపోకపోవడమో, శక్తిమంతంగా లేకపోవడమో ప్రస్తుత సమస్యకు కారణం కాదు. ప్రభుత్వాలు చట్టాలను అమలు చేసే విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూండటమే అసలు సమస్య. నియంత్రణ సంస్థలు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నాయి.హెచ్ఐవీ/ఎయిడ్స్‌కు చికిత్స కల్పిస్తామంటూ రామ్‌దేవ్ చేసిన ప్రకటనలను 2008లో నేను ఖండించాను. స్వయంగా వైద్యుడైన అన్బుమణి రామ్‌దాస్ నేతృత్వంలోని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రామ్‌దేవ్‌కు నోటీసు జారీ చేసింది. కొంత కాలం గడిచిందో లేదో... మంత్రి ‘యూ టర్న్’ తీసుకున్నారు. గురుగ్రామ్‌లో రామ్‌దేవ్ బాబాతో కలిసి యోగా సెషన్ లో కనిపించారు. ఆ వేదికపై కూడా రామ్‌దేవ్ హెచ్ఐవీ/ఎయిడ్స్‌ల చికిత్సకు తన మందులు ఉపయోగపడతాయని ప్రకటించుకున్నారు. దాదాపు ఈ సమయంలోనే సీపీఎం ఎంపీగా ఉన్న బృందా కారత్ ఈ రామ్‌దేవ్ వ్యవ హారాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ప్రస్తుత కేసు సంగతికి వద్దాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ సంస్థలు కలిసికట్టుగా ఉదాసీన వైఖరిని అవలంబించాయి. ఫలితంగా రామ్‌దేవ్ బాబా తన తప్పుడు ప్రకటనల జారీని యథేచ్ఛగా కొనసాగించగలిగారు. కేరళకు చెందిన ఆరోగ్య కార్యకర్త, ఆర్టీఐ ఉద్యమకారుడు డాక్టర్ కేవీ బాబు పతంజలి సంస్థపై వరుసగా ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ఉత్తరాఖండ్‌లోని స్టేట్ లైసెన్సింగ్ అథారిటీకి పలుమార్లు లేఖలు రాశారు. దాంతో అధికారులు పతంజలి సంస్థ అలాంటి ప్రకటనలు జారీ చేయడం మానుకోవాలని లేఖ రాశారు. అంతేగానీ, అధికారం ఉన్నప్పటికీ చర్యలు చేపట్టలేదు. పైగా తప్పించుకునేందుకు మార్గమూ చూపించారు. 1954 చట్టం కింద కాకుండా డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్‌లోని నిర్దిష్ట నిబంధన కింద నోటీసు జారీ చేశారు. ఈ నిబంధనపై అప్పటికే ముంబై హైకోర్టులో ఓ కేసు నడుస్తూ ఉంది. దీంతో పతంజలి సంస్థ ఆ కేసును చూపి ప్రకటనల జారీ కొనసాగించింది. ప్రశ్నార్థకమైన ఈ నిబంధనను 2018లో ఒక సవరణ ద్వారా కలిపారు. ఆరోగ్య సంబంధిత ప్రకటనల జారీలో ముందస్తు అనుమతులను అది తప్పనిసరి చేసింది.ఆహార పదార్థాల ప్రకటనల్లో సెలబ్రిటీలు పాల్గొనడం, వాటి గురించి ఊదరగొట్టడం కూడా ఒక సమస్య. ఇలాంటి కేసుల్లోనూ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ పనితీరును నత్తను తలపించేదే. న్యూట్రాస్యూ టికల్స్, ఫుడ్ సప్లిమెంట్స్లకు సంబంధించిన ప్రకటనల విషయంలో ఇప్పటికైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దేశంలో మారిపోతున్న మీడియా వ్యవహారాలను దృష్టిలో ఉంచుకుంటే... ప్రత్యక్ష, పరోక్ష ప్రకటనలకు ఉన్న అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న చట్టాల (ఔషధాలు, సౌందర్య సాధనాలకు సంబంధించినవి) సంపూర్ణ సమీక్ష అవసరం. మందులు, ఆహార పదార్థాలు, సప్లిమెంట్ల వంటి అన్ని అంశాలకు సంబంధించిన, భారతీయ వైద్య విధానానికి సంబంధించిన చట్టాలను కూడా పూర్తిగా సమీక్షించాలి. తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని ప్రస్తుతమున్న చట్టాలు చెబుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫుడ్ అండ్ డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీల పని తీరునూ సమీక్షించాలి. తగినన్ని వనరులు, అధికారాలు సమ కూర్చడం, స్వతంత్రంగా వ్యవహరించేందుకు అవకాశం కల్పించడం ద్వారా పరిస్థితిలో ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నాటి అడ్వర్టైజ్మెంట్ల సైజులోనే క్షమాపణల యాడ్స్ వేశారా?
న్యూఢిల్లీ: కరోనా విలయకాలంలో అల్లోపతి వంటి ఆధునిక వైద్యవిధానాలను తప్పుబడుతూ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ ఇచ్చిన తప్పుడు అడ్వర్టైజ్మెంట్లు, ప్రకటనల కేసులో బాబా రాందేవ్, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పినా సర్వోన్నత న్యాయస్థానం వారిని వదిలిపెట్టలేదు. ఈ కేసు విచారణ సందర్భంగా మంగళవారం రాందేవ్, బాలకృష్ణ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు హాజరయ్యారు. రూ.10 లక్షలు ఖర్చుపెట్టి సోమవారం 67 వార్తాపత్రికల్లో క్షమాపణల యాడ్ ఇచ్చామని కోర్టుకు తెలిపారు. ‘‘ ఆనాడు అల్లోపతిని కించపరుస్తూ, పతంజలి ఉత్పత్తులు అద్భుతమంటూ ఇచ్చిన ఫుల్‌పేజీ యాడ్ల స్థాయిలోనే ఈ యాడ్లను ప్రముఖంగా ప్రచురించారా?. అదే ఫాంట్ సైజులో అంతే పరిమాణంలో ప్రకటన ఇచ్చారా?’ అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. ‘ మా క్లయింట్లు యాడ్స్ కోసం లక్షలు వెచ్చించారు’ అని రోహత్గీ చెప్పారు. ‘ ఖర్చు ఎంతయింది అనేది మాకు అనవసరం’ అని జడ్జి అసహనం వ్యక్తంచేశారు. ‘గతంలో క్షమాపణల యాడ్స్ ఇవ్వాలని ఆదేశిస్తే ఈరోజు కోర్టు విచారణ ఉందనగా నిన్న ఎందుకు యాడ్ ఇచ్చారు?. ఈ కేసులో పతంజలికి ప్రతివాదిగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌పై రూ.100 కోట్ల పరువునష్టం దావా ఒకటి దాఖలైంది. ఆ దావాతో మీకేమైనా సంబంధం ఉందా?’ అని జడ్జి అనుమానం వ్యక్తంచేశారు. ‘‘ తన క్లయింట్లకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. ఈసారి పెద్ద సైజులో క్షమాపణ ప్రకటనలు ఇస్తాం’’ అని రోహత్గీ చెప్పారు. దీంతో సోమవారం నాటి ప్రకటనల వివరాలను రెండ్రోజుల్లోపు సమర్పించాలని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాహ్ల ధర్మాసనం ఆదేశించింది. ఇలాగే తప్పుడు ప్రకటనలు ఇస్తున్న ఫాస్ట్‌మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని సంబంధింత మూడు కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలను కోర్టు ఆదేశించింది. ‘‘ ఈ కంపెనీల తప్పుడు ప్రకటనలు వల్లే ఆయా సంస్థల ఉత్పత్తులను చిన్నారులు, పాఠశాల స్థాయి విద్యార్థులు, వృద్ధులు విరివిగా వినియోగిస్తున్నారు’ అని కోర్టు ఆవేదన వ్యక్తంచేసింది. -
పవన్, బాలకృష్ణపై చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్‌కళ్యాణ్, నందమూరి బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేశారు. సోమవారం సచివాలయంలో సీఈవో ముఖేష్ కుమార్‌మీనాను కలిసి ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఆధారాలతో ఫిర్యాదు అందజేశారు. ఈ నెల 13న కదిరి బహిరంగ సభలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఈ నెల 14న తెనాలి నియోజకవర్గంలో జనసేన సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఎన్నిక కోడ్‌కు విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనాడు దినపత్రిక ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కథనాలు రాస్తోందని, దీనిపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహరరెడ్డి తదితరులు ఉన్నారు. -
ముగ్గురూ ముగ్గురే..రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు...
-
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి పితాని బాలకృష్ణ
సాక్షి, కోనసీమ జిల్లా: ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేనలకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నాయకులంతా వరుసగా గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి భారీగా వైఎస్సార్సీపీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో తుగ్గలి వద్ద... సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముమ్మిడివరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పితాని బాలకృష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సానబోయిన మల్లిఖార్జున్ సహా పలువురు జనసేన పార్టీ కీలక నేతలు చేరారు. జనసేన పార్టీలో కష్టపడినవారికి కాకుండా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ కలసి టికెట్లు అమ్ముకున్నారని పితాని బాలకృష్ణ మండిపడ్డారు. పార్టీ కోసం కోట్లాదిరూపాయల ఆస్తిని అమ్ముకున్న తనకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: టీడీపీ, జనసేనకు వరుస షాక్‌లు! -
సొంత నేతలను కాలదన్నుకుని పార్టీని ఖాళీ చేసుకున్న పవన్
-
పవన్ కళ్యాణ్ పై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు
-
నీ పార్టీ లో నీకు సీటు ఉందొ లేదో నీకే తెలీదు..ఎమ్మెల్యే బియ్యపు పంచులే పంచులు
-
చీరలేంటి బాలయ్య !
-
ప్రభంజనం సృష్టించనున్న మహిళా శక్తి
-
తవ్వేకొద్దీ బయటపడుతున్న శివబాలకృష్ణ లీలలు
-
నవ్వితే చాలు.. బాలకృష్ణకు కోపం వస్తుంది
‘‘తెలుగులో బాలకృష్ణతో సినిమాలు చేశాను. ఎవరైనా బాలకృష్ణని చూసి నవ్వితే చాలు. ఆయనకు చాలా కోపం వచ్చేస్తుంది’’ అంటూ చెన్నైలో జరిగిన తమిళ చిత్రం ‘గార్డియన్’ ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు కేఎస్ రవికుమార్ అనడం వైరల్‌గా మారింది. బాలకృష్ణతో వరుసగా ‘జైసింహా’ (2018), ‘రూలర్’ (2019) చిత్రాలకు దర్శకత్వం వహించారు కేఎస్ రవికుమార్. ఆ చిత్రాల షూటింగ్ లొకేషన్లో జరిగిన సంఘటనలనే ‘గార్డియన్’ వేదికపై పంచుకున్నట్లున్నారు. ఇంకా ఆ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ– ‘‘ఒకరోజు లొకేషన్లో ఒక వ్యక్తి నవ్వితే.. ‘ఎందుకు నవ్వుతున్నావ్... రేయ్ ఎందుకురా నవ్వావ్.. నన్ను చూసి ఎందుకు నవ్వావ్’’ అని బాలకృష్ణ కొట్టడానికి ముందుకు వెళ్లినట్లుగా చేతులతో చూపించారు కేఎస్ రవికుమార్. ఇంకా మాట్లాడుతూ– ‘‘ఇంకోసారి నా అసిస్టెంట్‌ని ‘ఆ ఫ్యాన్‌ని ఇలా తిప్పు’ అంటే.. అతను ఫ్యాన్ తి΄్పాడు. ఆ గాలికి బాలకృష్ణ విగ్ కాస్త చెదిరినట్లయితే అతను నవ్వాడు. ‘ఏయ్ ఎందుకు నవ్వుతున్నావ్’ అని బాలకృష్ణ అడుగుతుంటే అసలే తను నా అసిస్టెంట్.. ఎక్కడ కొట్టేస్తారేమోనని, ‘సార్ సార్.. అతను మన అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ సార్..’ అన్నాను. ‘లేదు లేదు.. ఆ΄ోజిట్ గ్యాంగ్.. ఆ΄ోజిట్ గ్యాంగ్.. చూడు ఇప్పుడు కూడా నవ్వుతున్నాడు’ అని ఆయన అన్నారు. ఇక అప్పుడు ‘రేయ్.. వెళ్లరా ఇక్కణ్ణుంఛి’ అని అతన్ని పంపించేశాను’’ అని కూడా చె΄్పారు రవికుమార్. -
శివ బాలకృష్ణ కేసులో మరో కీలక ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్లాట్ కొనుగోలుకు శివ బాలకృష్ణ భారీగా చెల్లించిన నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. శ్రీకృష్ణ నిర్మాణ సంస్థలో ఫ్లాట్ కొనుగోలుకు బాలకృష్ణ చెల్లించిన రెండు కోట్ల 70 లక్షల రూపాయలను నగదును సీజ్ చేశారు. బాలకృష్ణ ఇంకా ఏ ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడనే దానిపై ఏసీబీ విచారణ చేస్తోంది. బినామీల పేర్లతో భారీగా ఆస్తుల కొనుగోలుపై ఆరా తీస్తోంది. పలు నిర్మాణ సంస్థల్లో పెట్టుబడులపై ఏసీబీ దృష్టి పెట్టింది. కాగా, శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో రోజుకో విస్తుపోయే విషయం వెలుగు చూస్తోంది. తన పేరిటే కాకుండా.. ఇంట్లోవాళ్లు, దగ్గరి.. దూరపు బంధువుల పేరిట కూడా ఆయన భారీగా ఆస్తుల్ని జమ చేశాడు. ఆఖరికి తన దగ్గర పని చేసేవాళ్లనూ వదల్లేదాయన. తాజాగా.. ఆయన దగ్గర అటెండర్, డ్రైవర్‌గా పని చేసిన వ్యక్తుల్ని అవినీతి నిరోధక శాఖ(ACB) అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరి పేరిటా భారీగానే బినామీ ఆస్తుల్ని శివ బాలకృష్ణ కూడబెట్టి ఉంటాడన్న అనుమానాల నేపథ్యంలో అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. శివబాలకృష్ణ దగ్గర అటెండర్‌గా పని చేసిన హబీబ్, డ్రైవర్ గోపీలను ఏసీబీ తాజాగా అరెస్ట్ చేసింది. శివ బాలకృష్ణకు లంచాలు చేరవేయడంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యహహరించారని .. ప్రతిఫలంగా ఇద్దరి పేర్లపైనా బాలకృష్ణ ఆస్తులు కూడబెట్టాడని సమాచారం. ఈ క్రమంలోనే.. డ్రైవర్ గోపీకి కాస్ట్లీ హోండా సిటీకారును శివ బాలకృష్ణ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్లిద్దరి పేరిట ఉన్న బినామీ ఆస్తుల వివరాలను గుర్తించే పనిలో ఉంది ఏసీబీ. ఇదీ చదవండి: తిరుపతి జూ ఘటన.. తేలని ప్రశ్నలు! -
శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరున 52 ఎకరాల భూములు
సాక్షి, యాదాద్రి: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ బయటపడ్డాయి. ఆయనపై జరుగుతున్న విచారణ సందర్భంగా.. భువనగిరి జిల్లాలో భూములు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. విలువైన వ్యవసాయ భూములను తన కుటుంబ సభ్యుల పేరున రిజిస్టర్ చేసుకున్నట్లు తేలింది. వలిగొండ, బీబీనగర్, మోత్కూరు మండలాల్లో శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరున గల 52.31 ఎకరాల వ్యవసాయ భూముల వివరాలను ఏసీబీ అధికారులు సేకరించారు. ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలను జిల్లా కలెక్టర్‌కు సమర్పించి వాటిని ఫ్రీజ్ చేయాలని కోరినట్లు సమాచారం. రిజిస్టర్ డాక్యుమెంట్ల కావాలి శివబాలకృష్ణ కుటుంబ సభ్యులైన శివనవీన్, శివఅరుణ, ఎస్.ప్రసాద్, ఎస్.పద్మావతి, ఎస్.రఘుదేవి పేరున వ్యవసాయ భూముల డాక్యుమెంట్ల ఫ్రీజ్ చేయాలని కలెక్టర్‌ను ఏసీబీ అఽధికారులు కోరారు. ఇందుకు సంబంధించిన రిజిస్టర్ డాక్యుమెంట్లు, స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ కోసం సమర్పించిన గుర్తింపు కార్డులు, మ్యుటేషన్ ఫైల్స్ ఇవ్వాలని కోరారు. అలాగే, శివబాలకృష్ణ కుటుంబ సభ్యులకు సంబందించిన డాక్యుమెంట్ల రిజిష్ట్రేషన్లను నిలిపివేయాలని, తాము ఇచ్చిన వివరాల ప్రకారం ధరణీ పోర్టల్లోఉన్న రికార్డులను, కార్యాలయంలో ఉన్న రికార్డుల హార్డ్ కాపీలను పరిశీలించాలని కోరారు. శివబాలకృష్ణ పేరు మీద జిల్లాలో ఇంకేమైన ఆస్తుల డాక్యుమెంట్లు ఉంటే వాటికి సంబంధించి చెల్లించిన ఫీజు వివరాలను తమకు ఇవ్వడంతోపాటు వాటిని కూడా ఫ్రీజ్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. 22 మంది ఆధార్‌కార్డులు శివబాలకృష్ణకు కుటుంబ సభ్యులు, ఆయన భార్య, కుమార్తె, కుమారుడు, తల్లిదండ్రులు, స్నేహితులు, బావమరిది, సొదరుని కుమారులు, కోడలు, వారి స్నేహితులకు సంబంధించి మొత్తం 22మంది ఆధార్ కార్డులు కలెక్టర్‌కు ఏసీబీ అధికారులు పంపించారు. జిల్లాలో ఎక్కడైనా వీరికి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఆస్తిపాస్తుల వివరాలు తమకు ఇవ్వడంతో పాటు వాటికి సంబంఽధించిన రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని కోరారు. ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తుల వివరాలు ఇవీ.. శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరుతో భువనగిరి జిల్లాలో ఏసీబీ అధికారులు గుర్తించిన భూముల వివరాలు ఇలావున్నాయి.. వలిగొండ మండలం నర్సాపూర్‌లో ఎస్.హరిప్రసాద్ పేరున 8 ఎకరాలు, ఎస్.రఘుదేవి పేరున 11.03 ఎకరాలు, వలిగొండ మండల చిత్తాపురంలో ఎస్.పద్మావతి పేరున ఎకరం 30 గుంటలు, బీబీనగర్ మండలం చిన్నరావులపల్లిలో శివఅరుణ పేరున 20 గుంటలు, మోత్కూరు మండలం పాలడుగులో శివనవీన్ పేరున 6.32 ఎకరాలు, 12.5 ఎకరాలు, వలిగొండ మండలం రెడ్లరేపాకలో శివనవీన్ పేరున 4.22 ఎకరాలు, 5.32 ఎకరాల వ్యవసాయ భూమిని వారి కుటుంబ సభ్యులపేరున ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. -
శివబాలకృష్ణకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు చుక్కెదురైంది. శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. శివబాలకృష్ణ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అక్రమాస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రూ.250 కోట్ల విలువైన అక్రమాస్తులను ఏబీసీ గుర్తించింది. మరోవైపు శివబాలకృష్ణ వెనుక ఉన్న అధికారుల పాత్ర పై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించామని, ఆయన సమీప బంధువులు, స్నేహితులు, సహ ఉద్యోగుల ఇళ్లలో మొత్తంగా 17 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారని ఏసీబీ అధికారులు చెప్పారు. ఇవీ ఆస్తులు... శివబాలకృష్ణ ఇంట్లో రూ. 84.60 లక్షల నగదు, 2 కేజీలు బంగారం, 5.5 కేజీల వెండి, 32 లక్షలు విలువ చేసే వాచ్‌లు, 3 విల్లాలు, 7 ఫ్లాట్స్‌తోపాటు కొడ కండ్ల, జనగామ, నాగర్‌కర్నూలు, సిద్ధిపేట, యా దాద్రి, పాలకుర్తి, జఫర్‌గఢ్ ప్రాంతాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించామని సుదీంద్ర చెప్పారు. భూమి ఆయన పేరుతోపాటు కొందరు బినామీల పేరుపై ఉందని, 29 ఓపెన్‌ప్లాట్లు ఉన్నాయని, రంగారెడ్డిజిల్లాలోనే 12, వైజాగ్, విజయవా డ, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా ఖాళీ స్థలాలు రిజి స్టర్ అయ్యాయన్నారు. అన్నింటి విలువ రూ.250 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. సోదాలు ఇంకో నాలుగు చోట్ల కొనసాగుతున్నాయని, శివబాలకృష్ణ పై కేసు నమోదు చేసి, గురువారం న్యాయస్థా నం ముందు హాజరుపరుస్తామన్నారు. ‘ఇంకా కొన్ని విషయాలు ఆయన చెప్పలేదు.. మా విచారణకు సహకరించలేదు. కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది.’అని సుదీంద్ర తెలిపారు. ఇది చదవండి: HMDA Siva Balakrishna Case: శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్.. ఐఏఎస్ అరవింద్.. -
HMDA శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్.. ఐఏఎస్ అరవింద్..
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈకేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ.. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అంశాన్ని బయటకు తీసింది. దీంతో, విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. వివరాల ప్రకారం.. హెచ్ఎండీఏ అధికారి శివబాలకృష్ణ అవినీతి కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. శివ బాలకృష్ణ కేసులో తాజాగా ఏసీబీ నివేదిక రెడీ చేసింది. ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇక, ఈ కేసులో మరో కొత్త అంశాన్ని బయటకు తీసుకువచ్చింది. ఏసీబీ నివేదికలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వ్యవహారాన్ని ప్రస్తావించింది. బాలకృష్ణ దగ్గర నుంచి అరవింద్ కుమార్ పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్టు నివేదికలో పేర్కొంది. ఇక, ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్‌ను విచారించేందుకు ఏసీబీ.. ప్రభుత్వ అనుమతిని కోరింది. మరోవైపు.. బాలకృష్ణ నుంచి రికవరీ చేసిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, గత పదేళ్ల కాలంలో దాదాపు 15 సెల్‌ఫోన్స్ మార్చినట్టు ఏసీబీ నివేదికలో వెల్లడించారు. ఈ ఫోన్లు, కాంటాక్ట్‌లకు సంబంధించి మరిన్ని కీలక విషయాలను ఏసీబీ వెల్లడించే అవకాశం ఉంది. -
అంతా ఆయన చెబితేనే చేశా..
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి కథ రోజుకో మలుపు తిరుగుతోంది. మరికొన్ని కీలక పాత్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ‘అంతా ఆ అధికారి చెబితేనే చేశాను’అంటూ ఏసీబీ అధికారుల వద్ద శివబాలకృష్ణ చెప్పినట్టు సమాచారం. నాటి పురపాలక, పట్టణాభివృధ్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఈ మొత్తం అవినీతి వ్యవహారం వెనుక కీలక వ్యక్తి అని ఏసీబీకి ఇచ్చి న కన్ఫెషన్ రిపోర్ట్ (వాగ్మూలం)లో శివబాలకృష్ణ పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘నేను ఇంత పెద్ద మొత్తంలో అవినీతి సొమ్ము కూడ బెట్టడంలో పై అధికారి అరవింద్‌కుమార్ పూర్తి సహకారం ఉంది. నా నుంచి ఎన్నో పనులు చేయించుకుని ఆయన కూడా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించారు..’అంటూ ఆరోపణలు చేసినట్టు తెలిసింది. కోర్టుకు సమర్పించిన ఈ కన్ఫెషన్ రిపోర్టులో ఏసీబీ అధికారులు.. అరవింద్‌కుమార్ పాత్రకు సంబంధించిన కీలక అంశాలు ప్రస్తావించినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు కన్ఫెషన్ రిపోర్టులోని ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి. కోటి రూపాయలు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చా ఉదయ ఎస్ఎస్వీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌ను నార్సింగిలోని 12 ఎకరాల స్థలంలో చేపట్టారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణంతో కూడిన ఈ ప్రాజెక్టు చాలా కాలంగా అనేక చట్టపరమైన సమస్యల కారణంగా పెండింగ్‌లో ఉంది. హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ 2023 నవంబర్, డిసెంబర్లలో హెచ్ఎండీఏ సెక్రటరీ చంద్రయ్యతో కలిసి సమస్యను పరిష్కరించారు. వివాదాన్ని క్లియర్ చేసి ప్రణాళికను విడుదల చేశారు. ఇందుకోసం అరవింద్ కుమార్ ఆ సంస్థ యాజమాన్యం నుంచి రూ.10 కోట్ల లంచం డిమాండ్ చేశారు. అందులో భాగంగా 2023 డిసెంబర్లో రూ.1 కోటి నగదు ఉదయ ఎస్ఎస్వీ ప్రాజెక్టు ప్రతినిధి షేక్ సైదా నాకు ఇచ్చారు. మరుసటి రోజు ఉదయం ఆ డబ్బును నేను జూబ్లీహిల్స్ అంబేడ్కర్ వర్సిటీ సమీపంలోని అరవింద్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయనకు అందజేశా. భూమార్పిడి చేసినందుకు రూ.కోటి ఆరు నుంచి ఏడు నెలల క్రితం క్యూ–మార్ట్ రాహుల్ అనే ఒక వ్యక్తి నాకు రెరా కార్యాలయంలో రూ.ఒక కోటి ఇచ్చారు. ఆ డబ్బును అదే రోజు నేను అరవింద్‌కుమార్ నివాసంలో అందజేశా. బాచుపల్లిలోని రెండు ఎకరాలలోపు భూమిని మార్పిడి చేసినందుకు అరవింద్‌కుమార్ రూ.కోటి లంచం డిమాండ్ చేసినట్టుగా ఆ వ్యక్తి నాతో చెప్పాడు. వివిధ పనుల గురించి అరవింద్‌కుమార్ తరఫున నా నుంచి కొందరు వ్యక్తులు డబ్బులు వసూలు చేసేవారు. మైహోం బూజాలో ఉండే రంగా భాయ్, మీనా జ్యూవెలర్స్ ఎండీ , కేశినేని ప్రాజెక్ట్స్ రవి రమేశ్, ఎల్బీనగర్లో ఉండే సుధాకర్ ఇతరులు వీరిలో ఉన్నారు. ఈస్ట్ మారేడ్‌పల్లి, కోకాపేట్ ప్రాజెక్టుల్లో కూడా.. ఈస్ట్ మారేడ్‌పల్లిలోని ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు విషయంలో జీహెచ్ఎంసీ నుంచి అనుమతుల విషయంలో మీనాక్షి కంపెనీకి అరవింద్‌కుమార్ చేసిన సాయానికి బదులుగా ఆయన డిమాండ్ చేసిన మేరకు రూ.50 లక్షలు సదరు కంపెనీ లైజనింగ్ అధికారి నాగబాబు మా ఇంటికి వచ్చి ఇచ్చాడు. ఆ సొమ్మును అదే రోజు అరవింద్‌కుమార్ ఇంటికి వెళ్లి ఆయనకు ఇచ్చా. కోకాపేట్ హై రైజ్ బిల్డింగ్ ప్రాజెక్టులో ప్రెస్టీజ్ గ్రూప్‌కు అరవింద్ కుమార్ సహాయం చేశారు. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ జనరల్ మేనేజర్ సురేష్ 2022 చివరిలో అరవింద్ కుమార్ కోసం రూ.40 లక్షల లంచం నాకు ఇచ్చారు. అ డబ్బును కూడా నేను అరవింద్ కుమార్‌కు ఆయన నివాసంలోనే అందజేశా. ఇక కోకాపేట్ మల్టిస్టోర్డ్ హై రైజ్ బిల్డింగ్‌లోని సాలార్ పురియ సత్తవ ప్రాజెక్ట్‌కు సాయం చేసినందుకు అమిత్ సలార్ పురియా డిసెంబర్ 2022లో అరవింద్ కుమార్ కోసం రూ.35 లక్షలు లంచం తీసుకు వచ్చారు. అ డబ్బును అరవింద్ కుమార్‌కు ఇచ్చా. నాకూ కొన్ని ప్లాట్లు బహుమతిగా అందాయి సాయి సందీప్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ , ప్రైమ్ ల్యాండ్ ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్‌కు చెందిన కె.సందీప్‌రెడ్డి కంది మండలంలో, ఇతర ప్రాంతాల్లో చేసిన వెంచర్స్‌లో కొన్ని ప్లాట్లు నాకు బహుమతిగా ఇచ్చారు. నాకు గుర్తున్నంత వరకు నాకు గిఫ్ట్‌గా వచ్చి న ప్లాట్లను మా మేనల్లుడు భరణి పేరిట రిజిస్టర్ చేయించాను. నా పై అధికారి అరవింద్‌కుమార్ సైతం తన డ్రైవర్లు, గన్మెన్లు, ఇతరుల పేరుమీద ప్లాట్లు రిజిస్టర్ చేయించేవారు. ఆయన వాట్సాప్ ద్వారా నాకు వివరాలు పంపేవారు. ఎవరి పేరుమీద ప్లాట్లు రిజిస్టర్ చేయాలన్నది నాకు సూచించేవారు. ఈ వివరాలు నేను డెవలపర్లకు పంపేవాడిని, నాకు గుర్తు ఉన్నంత వరకు కంది మండలం, ఇతర ప్రాంతాల్లోని సాయి సందీప్ డెవలపర్స్, ఇన్ప్రా, ప్రైమ్‌ల్యాండ్ ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ వెంచర్స్‌లో ప్లాట్లను 2022 ఆగస్టు, డిసెంబర్లో రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ ఫీజు సైతం ఆ కంపెనీలే చెల్లించేవి. వెర్టెక్స్ హోం కంపెనీ రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని మంఖాల్ గ్రామంలో చేసిన వెంచర్‌కు గాను అరవింద్‌కుమార్.. 550 చదరపు గజాల ఓపెన్ ప్లాట్‌ను ఎలాంటి క్రయ విక్రయాలు లేకుండా గిఫ్ట్‌గా పొందారు. అరవింద్ కుమార్ విచారణకు ఏసీబీ సమాయత్తం? శివ బాలకృష్ణ ఇచ్చి న వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుత ప్రకృతి విపత్తుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను ప్రశ్నించడానికి ఏసీబీ సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అఖిల భారత సర్వీసు అధికారి కావడం వల్ల ఈ విషయమై డీవోపీటికి కూడా సమాచారం అందించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు
-
బాలకృష్ణ కేసులో కీలక మలుపు.. తెరపైకి మరో ఐఏఎస్ అధికారి పేరు!
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో కస్టడీ కన్పెషన్ స్టేట్మెంట్ కీలకంగా మారింది. తన వాంగ్మూలంలో మరో ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. పలువురి ఒత్తిడి మేరకే అక్రమాలకు పాల్పడినట్లు బాలకృష్ణ అంగీకరించారు. అక్రమాల చిట్టాను బయటపెట్టారు. ఐఏఎస్ అధికారి చెప్పిన ఫైళ్లు వెంటనే క్లియర్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఐఏఎస్‌ను విచారించేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం,కోర్టు అనుమతిని ఏసీబీ కోరనుంది. ఇప్పటికే శివ బాలకృష్ణ వద్ద డాక్యుమెంట్ లెక్కల ప్రకారం 250 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. 214 ఎకరాలు భూములను ఏసీబీ గుర్తించింది. బాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీ లోకి తీసుకుని ఏసీబీ విచారించగా, శివ బాలకృష్ణతో పాటు ఇతర అధికారుల పాత్రపైన ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శివ బాలకృష్ణ బినామీలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. శివబాలకృష్ణ కేసులో ఈడీ, ఐటీ ఫోకస్ పెట్టింది. సోదరుడు నవీన్ అరెస్ట్ చేయగా, మరో ఇద్దరి అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బాగోతం బయటపడుతోంది. మొన్న సోమేష్‌కుమార్, నిన్న అరవింద్ కుమార్, నేడు రజత్‌కుమార్ ఆస్తులపై వివాదం నెలకొంది. ఐఏఎస్ రజత్‌కుమార్..గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో పని చేశారు. హేమాజీపూర్ సర్వే నంబర్ 83, 84, 85లో ఆయన కుటుంబం పేరు మీద భూములు ఉన్నట్లు సమాచారం. వరుసగా పలువురు ఐఏఎస్‌ల మీద ఆరోపణలు రావడంతో భూములను ఇతరుల పేర్లు మీద మార్చడానికి రజత్‌కుమార్ స్లాట్ బుక్ చేసినట్లు తెలిసింది. 15 ఎకరాల భూమిని ఇతరుల పేరు మీద మార్చేందుకు రజత్‌కుమార్ సిద్ధమయినట్లు సమాచారం. ఇదీ చదవండి: శివ బాలకృష్ణపై ఈడీ.. ఐటీ? -
శివ బాలకృష్ణపై ఈడీ.. ఐటీ?
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి భాగోతంపై త్వరలోనే ఇన్ కమ్‌ట్యాక్స్ (ఐటీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు రంగంలోకి దిగనున్నట్టు తెలిసింది. అధికార దుర్వినియోగం, అడ్డగోలు అనుమతుల జారీతో దాదాపు రూ.250 కోట్ల మేర ఆస్తులను శివబాలకృష్ణ కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అదేవిధంగా ఐటీ అధికారులు సైతం ఏసీబీ నుంచి ఈ కేసు వివరాలు తీసుకోనున్నట్టు సమాచారం. అతనిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ, కేసు దర్యాప్తులో గుర్తించిన అక్రమాస్తుల వివరాలను ఈ రెండు దర్యాప్తు సంస్థలు ఏసీబీ నుంచి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈడీ, ఐటీ రంగంలోకి దిగితే మరిన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. మరో ఇద్దరు బినామీల అరెస్టుకు రెడీ! శివబాలకృష్ణ తన అక్రమార్జనలో ఎక్కువ భాగం తన కుటుంబ సభ్యులు, ఇతర బినామీల పేరిట ఉంచినట్టు ఏసీబీ అధికారులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. శివబాలకృష్ణకు ప్రధాన బినామీగా ఉన్న ఆయన సోదరుడు శివనవీన్ కుమార్‌ను ఏసీబీ మంగళవారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శివబాలకృష్ణ బినామీలుగా ఉన్న మరో ఇద్దరిని అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు శివ నవీన్‌కుమార్ కస్టడీ కోసం ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హెచ్ఎండీఏలో ముగిసిన ఏసీబీ సోదాలు హెచ్ఎండీఏలో ఏసీబీ సోదాలు ముగిశాయి. మూడు రోజుల పాటు వివిధ జోన్లకు చెందిన ఫైళ్లను క్షుణ్ణ్గంగా తనిఖీ చేసిన ఏసీబీ అధికారులు 4వ రోజు గురువారం పంచనామా నిర్వహించారు. ఈ నాలుగు రోజుల్లో శంకర్పల్లి, శంషాబాద్, ఘట్కేసర్ జోన్ల పరిధిలోని సుమారు 120 ఫైళ్లను పరిశీలించారు. వాటిలో కీలకమైన వాటిని తమ వెంట తీసుకెళ్లినట్లు తెలిసింది. ముఖ్యంగా శివబాలకృష్ణ హెచ్ఎండీఏ నుంచి రెరాకు బదిలీ అయిన తరువాత కూడా పాత తేదీలతో పెద్ద ఎత్తున భూమార్పిడి అనుమతులను ఇవ్వడాన్ని ఏసీబీ సీరియస్‌గా పరిగణిస్తోంది. జోవో 111 పరిధిలో కన్జర్వేషన్ జోన్లో ఉన్న భూములను రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్లకు మారుస్తూ అనుమతులను ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. పుప్పాలగూడ నుంచి వట్టినాగులపల్లి వరకు వివిధ ప్రాంతాల్లో వందల ఎకరాలను ఇలా అడ్డగోలుగా మార్చేసినట్లు తెలిసింది. అలాగే ఘట్కేసర్, శంషాబాద్ జోన్లలో ఇచ్చిన మరి కొన్ని అనుమతులపైన కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. అలా ఎలా అనుమతులిచ్చారని నిలదీసిన ఏసీబీ నీటివనరులు ఉన్న ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులను ఇచ్చేందుకు కొందరు ప్లానింగ్ అధికారులు మొదట నిరాకరించినా ఆ తరువాత ఆ అధికారులే తిరిగి అనుమతులను ఎందుకిచ్చారని ఏసీబీ వర్గాలు ప్రశ్నించినట్లు తెలిసింది. ‘వాళ్లకు అనుమానం వచ్చిన ప్రతి ఫైల్‌ను పోస్టుమార్టం చేశారు. అనేక రకాల సందేహాలను వ్యక్తం చేశారు. అన్నింటికీ మా వైపు నుంచి సమాధానాలు చెప్పాం.’అని ఒక ప్లానింగ్ అధికారి తెలిపారు.‘ప్రతి ఫైల్ పరిష్కారంలో పై అధికారుల సూచనలు, సలహాలు, దిశా నిర్ధేశం మేరకే పని చేశాం.’అని మరో ప్లానింగ్ అధికారి వివరించారు. డైరెక్టర్ స్థాయిలో ఉన్న బాలకృష్ణ ఆదేశాలను తప్పకుండా పాటించవలసి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆ ఏపీఓలపై ఏసీబీ కన్ను ఏసీబీ అధికారులు తమ వెంట తీసుకెళ్లిన ఫైళ్ల కారణంగా ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని కొందరు ప్లానింగ్ అధికారులు, ఏపీఓలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు ఏపీఓలు బాలకృష్ణకు అన్నివిధాలుగా సహకరించి అక్రమార్జనలో శివబాలకృష్ణకు పోటీపడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. తెర వెనుక సూత్రధారులెవరు? అసలు శివ బాలకృష్ణ తెరవెనుక ఉండి.. ఆయనను నడిపించిందెవరు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక డైరెక్టర్ స్థాయిలో ఇష్టారాజ్యంగా అనుమతులనివ్వడం అసాధ్యం. భూమి జోన్ మార్పునకు సంబంధించిన అనుమతులకు కమిటీ ఆమోదం తప్పనిసరి. ఈ కమిటీలో ఐఏఎస్ అధికారులతో పాటు మున్సిపల్‌శాఖ మంత్రి కూడా ఉంటారు. రూ.వందల కోట్ల విలువైన భూములను కన్జర్వేషన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్లోకి మార్చేందుకు సదరు కమిటీ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇలాంటి ఫైళ్లు పదుల కొద్దీ ఎలాంటి సమావేశాలు లేకుండానే ఎడాపెడా ఇచ్చేశారు. ఈ క్రమంలో కింది నుంచి పై వరకు భారీ మొత్తంలో చేతులు మారాయి. కానీ చివరకు బాలకృష్ణ మాత్రం మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందని హెచ్ఎండీఏ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ అక్రమ అనుమతులను మరింత లోతుగా, సమగ్రంగా అధ్యయనం చేస్తే తెరవెనుక ఉన్న కీలకమైన వ్యక్తులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ‘ప్రతి చేంజ్ ఆఫ్ లాండ్ యూజ్ వెనుక వాళ్లు ఉన్నారు. వారిచ్చే ఆదేశాల మేరకే బాలకృష్ణ పని చేసి తన వాటా తాను పొందాడు. ’అని హెచ్ఎండీఏ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో ’వాళ్లు’ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. -
రూ.250 కోట్లపైనే..
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు రూ. 250 కోట్లపైనే ఉంటాయని ఏసీబీ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. శివబాలకృష్ణ కస్టడీ బుధవారంతో ముగి సింది. ఆయన ఇంట్లో కొద్ది రోజులుగా జరుపుతున్న సోదాలు ముగిసినట్టు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుదీంద్ర వెల్లడించారు. శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించామని, ఆయన సమీప బంధువులు, స్నేహితులు, సహ ఉద్యోగుల ఇళ్లలో మొత్తంగా 17 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారని చెప్పారు. ఇవీ ఆస్తులు... శివబాలకృష్ణ ఇంట్లో రూ. 84.60 లక్షల నగదు, 2 కేజీలు బంగారం, 5.5 కేజీల వెండి, 32 లక్షలు విలు వ చేసే వాచ్‌లు, 3 విల్లాలు, 7 ఫ్లాట్స్‌తోపాటు కొడ కండ్ల, జనగామ, నాగర్‌కర్నూలు, సిద్ధిపేట, యా దాద్రి, పాలకుర్తి, జఫర్‌గఢ్ ప్రాంతాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించామని సు«దీంద్ర చెప్పారు. భూమి ఆయన పేరుతోపాటు కొందరు బినామీల పేరుపై ఉందని, 29 ఓపెన్‌ప్లాట్లు ఉన్నాయని, రంగారెడ్డిజిల్లాలోనే 12, వైజాగ్, విజయవా డ, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా ఖాళీ స్థలాలు రిజి స్టర్ అయ్యాయన్నారు. అన్నింటి విలువ రూ.250 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపా రు. సోదాలు ఇంకో నాలుగు చోట్ల కొనసాగుతున్నాయని, శివబాలకృష్ణ పై కేసు నమోదు చేసి, గురువారం న్యాయస్థా నం ముందు హాజరుపరుస్తామన్నారు. ‘ఇంకా కొన్ని విషయాలు ఆయ న చెప్పలేదు..మా విచారణకు సహకరించలేదు. కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది.’అని సు«దీంద్ర తెలిపారు. మిగతా అధికారుల్లో టెన్షన్.. హెచ్ఎండీఏలో పనిచేస్తున్న మిగతా అధికారుల్లో టెన్షన్ నెలకొంది. హెచ్ఎండీఏ పరిధి ఏడు జిల్లాల్లో విస్తరించి ఉండగా, గతంలో అనుమతులు మంజూరు చేసిన లేఔట్లు, ప్లాట్లకు సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ పరిశీలించే యోచనలో ఏసీబీ ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నిర్మిస్తున్న హైరేజ్ అపార్ట్మెంట్లకు అనుమతుల్లో హెచ్ఎండీఏ అధికారులు భారీగా లంచాలు పొందినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి రెండు రోజుల ముందు భారీఎత్తున లాండ్ కన్జర్వేషన్ జరిగిందని, హైరైస్ బిల్డింగ్ జోన్ పరిధిలోకి భూముల మార్పు జరిగిందని భావిస్తున్నారు. ఉస్మాన్‌సాగర్ పరిధిలోనూ భారీగా భూమారి్పడి జరిగిందని సమాచారం. ఆ రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల విలువైన భూములు చేతులు మారినట్టు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. పూర్తిస్థాయి విచారణ జరిగితే ఇందులోని పెద్ద తలకాయల భాగోతాలు బట్టబయలు అవుతాయని తెలుస్తోంది. కాగా ఉప్పల్‌లో శివబాలకృష్ణ సోదరి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శివబాలకృష్ణ సోదరి, ఇద్దరు కొడుకులు హెచ్ఎండీఏలో ఆయన దగ్గరే పనిచేశారు. వీరంతా బినామీలుగా ఉన్నట్టు గుర్తించారు. హెచ్ఎండీఏలో మూడో రోజు ఏసీబీ సోదాలు హెచ్ఎండీఏలో మూడో రోజు ఏసీబీ సోదాలు కొనసాగాయి. శివబాలకృష్ణపై విచారణలో భా గంగా పలు కీలకమైన ఫైళ్లు ఏసీబీ అధికారులు స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. బుధవారం ఉదయమే అమీర్‌పేట్‌లోని హెచ్ఎండీఏ కా ర్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. శివబాల కృష్ణ హయాంలో ఇ చ్చి న అనుమతులపైన ప్ర ధానంగా దృష్టి సారించి మూడురోజుల పాటు ఫైళ్లను పరిశీలించినట్టు తెలిసింది. ముఖ్యంగా కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, తదితర ప్రాంతాల్లో నిర్మించిన భారీ బహుళ అంతస్తుల భవనాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇ చ్చి నట్టు ఏసీబీ అధికారుల పరిశీలనలో వెల్లడి కావడంతో, ఆ దిశగానే హెచ్ఎండీఏలో సోదాలు నిర్వహించారు. శివబాలకృష్ణ రెరాకు బదిలీ అయిన తర్వాత కూడా పలు ఫైళ్ల కు పాత తేదీలపైన అనుమతులు ఇవ్వడాన్ని ఏసీబీ సీరియస్‌గా పరిగణిస్తోంది. -
శివబాలకృష్ణ అక్రమాస్తులు వెయ్యి కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ బుధవారం ముగిసింది. దీంతో ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. మరో 14 రోజులు రిమాండ్‌ను పొడగించింది. అయితే ఎనిమిది రోజుల విచారణలో శివబాలకృష్ణ చెప్పిన విషయాలు.. బయటపడుతున్న ఆస్తులు.. వాటిని కూడబెట్టేందుకు ఆయన అనుసరించిన విధానాల్ని చూసి ఏసీబీ అధికారులే నిర్ఘాంతపోతున్నారు. శివబాలకృష్ణ అక్రమాస్తుల విలువ వెయ్యి కోట్ల రూపాయలకు పైనే ఉండొచ్చని ఏసీబీ భావిస్తోంది. దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడి అవుతుండడంతో.. మరిన్ని వివరాలు రాబట్టేందుకు శివబాలకృష్ణ రిమాండ్‌కు పొడగించాలని కోర్టును కోరింది. దీంతో శివబాలకృష్ణ రిమాండ్‌ను 14 రోజుల పాటు కోర్టు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇప్పటివరకు రూ.250 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణ పేరుతో 214 ఎకరాలు భూమి ఉన్నట్లు ఏసీబీ జాయింగ్ డైరెక్టర్ వెల్లడించారు. తెలంగాణతోపాటు విశాఖపట్నంలో కూడా శివబాలకృష్ణకు 29 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 19 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, 3 విల్లాలు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా శివబాలకృష్ణకు ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు సంబంధించి హెచ్ఎండీఏలో పలువురు అధికారులు పాత్రపై కూడా సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చప్పారు. పలు ఫైల్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. లాకర్స్‌లో ఉన్న బంగారం, ఆస్తులకు సంబంధించి పలు కీలక పత్రాలను సీజ్ చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
బడా రియల్ కంపెనీలతో బంధం
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి లావాదేవీలు ఏసీబీ అధికారులు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు అనుమతులిచ్చిన శివబాలకృష్ణ..అందుకు ప్రతిఫలంగా కోట్ల రూపాయలు మూటగట్టుకున్నట్టు ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెలుగుచూసినట్టు సమాచారం. ఎన్నికలకోడ్ సమయంలోనూ శివబాలకృష్ణ అనుమతుల జారీ ప్రక్రియ కొనసాగినట్టు ఏసీబీ గుర్తించింది. పుప్పాలగూడ, నార్సింగి పరిధిలో రెండు రియల్ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో శివబాలకృష్ణకు పెద్దమొత్తంలో ‘లబ్ది’చేకూరినట్టు కీలక వివరాలు సేకరించారు. ‘చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్’ ప్రక్రియలో పెద్దసంఖ్యలో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన అనుమతులపైనా ఆరా తీసేందుకు వరుసగా రెండోరోజూ ఏసీబీ అధికారుల బృందం అమీర్‌పేట్‌లోని హెచ్ఎండీఏ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు ఫైళ్లు పరిశీలించి వివరాలు సేకరించినట్టు సమాచారం. అక్రమార్జన కేసులో ఏసీబీకి పట్టుబడిన శివబాలకృష్ణను కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఏసీబీ అధికారులు ఏడో రోజు కస్టడీలో భాగంగా చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రధానంగా ఏసీబీ అధికారులు సేకరించిన భూలావాదేవీల వివరాలు, ఇతర పత్రాలు శివబాలకృష్ణ ముందు ఉంచి మంగళవారం ప్రశ్నించినట్టు సమాచారం. లోతుగా పరిశీలన డాక్యుమెంట్లు, బినామీ ఆస్తుల వివరాల ఆధారంగా బాలకృష్ణను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇతర మార్గాల్లో సేకరించిన వివరాలపై ఏసీబీ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రెరా కార్యాలయంలోనూ సోదాలు చేసి కోట్ల రూపాయల భూములకు సంబంధించిన అనుమతుల విషయంలో వివరాలు సేకరించారు. సోమ, మంగళవారాల్లో అమీర్‌పేట్‌లోని హెచ్ఎండీఏ కార్యాలయంలో జరిపిన సోదాల్లో మరిన్ని వివరాలు లభించాయి. వీటన్నింటినీ విశ్లేషిస్తున్న ఏసీబీ అధికారుల ప్రత్యేక బృందం ఆ విషయాలతో ప్రశ్నావళి రూపొందిస్తూ శివబాలకృష్ణ నుంచి వివరాలు సేకరిస్తోంది. శివబాలకృష్ణకు సహకరించిన సిబ్బందిపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణ నుంచి నిబంధనలకు విరుద్ధంగా అనమతులు పొందిన పలు రియల్ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నించనున్నట్టు సమాచారం. శివబాలకృష్ణ సోదరుడు శివనవీన్‌కుమార్ అరెస్టు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చే సుకుంది. ఆయనకు బి నామీగా వ్యవహరించిన ట్టు ఆధారాలు లభించడంతో ఏసీబీ అధికారులు శివబాలకృష్ణ సో దరుడు శివనవీన్కుమార్ను మంగళవారం అరె స్టు చేశారు. ఇప్పటికే శివ బాలకృష్ణను ఎనిమిది రోజుల కస్టడీలో భాగంగా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఏసీబీ సోదాల్లో భాగంగా గుర్తించిన ఆస్తులు, ఆ తర్వాత లాక ర్లు ఓపెన్ చేసి స్వాదీనం చేసుకున్న పలు డాక్యుమెంట్లు, రేరా, హెచ్ఎండీఏ కార్యాలయంలో సోదాల్లో భాగంగా తెలుసుకున్న సమాచారం మేరకు ఏసీబీ అధికారులు శివ నవీన్‌కుమార్‌ను ప్రశ్నించారు. ప్రాథమిక ఆధారాలతోపాటు, శివబాలకృష్ణ విచారణలో తెలుసుకున్న అంశాల మేరకు శివనవీన్‌కుమార్ తన సోదరుడికి బినామీగా వ్యవహరించినట్టు ఏసీబీ అధికారులు ధృవీకరించుకున్నారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసినట్టు ఏసీబీ వర్గాలు తెలిపాయి. నేటితో ముగియనున్న ఏసీబీ కస్టడీ హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ బుధవారంతో ముగియనుంది. గత బుధవారం నుంచి శివబాలకృష్ణను కస్టడీకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు, మరోవైపు ఇతర ఆధారాల కోసం తనిఖీలు కొనసాగిస్తున్నారు. బుధవారం చివరి రోజు కావడంతో మరిన్ని కీలక వివరాలు సేకరించేలా ఏసీబీ అధికారుల బృందం ఏర్పాట్లు చేసుకుంది. ఇప్పటికే సేకరించిన వివరాలతోపాటు తనిఖీల్లో గుర్తించిన ఫైళ్ల ఆధారంగా చివరి రోజు ప్రశ్నించే అవకాశముంది. కాగా, హెచ్ఎండీఏ కార్యాలయాల్లో వరుస సోదాలు, బ్యాంకు లాకర్ల నుంచి సేకరించిన పత్రాలు, ఇతర ఆధారాలపై మరింత లోతుగా ఆరా తీయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజులు శివబాలకృష్ణను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేసే యోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్టు తెలిసింది. -
షేర్లు.. ఆస్తులు..పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: వందల కోట్ల అక్రమార్జనతో దొరికిపోయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో తవ్వినకొద్దీ మరిన్ని అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయి. పలువురు రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకుని తాను పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ బినామీల పేరిట షేర్లు తీసుకోవడంతో పాటు పెట్టుబడులు సైతం పెట్టినట్టు సమాచారం. శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఆరో రోజు కస్టడీలో భాగంగా సోమవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. తమ సోదాల్లో గుర్తించిన ఆస్తులు, ఆభరణాలు, బ్యాంకు ఖాతాలు, కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలు, లాకర్లు, కీలక ఆస్తులకు సంబంధించిన పత్రాలు.. ఇలా పలు అంశాలపై గత ఐదు రోజులుగా శివబాలకృష్ణ నుంచి సమాచారం సేకరించిన ఏసీబీ అధికారులు.. తాజాగా రియల్ ఎస్టేట్ కంపెనీలతో లింకులపై ఫోకస్ పెట్టారు. పలు రకాల అనుమతులకు సంబంధించి లోతుగా ఆరా తీస్తున్నారు. రెండు రియల్ కంపెనీలతో పలు లావాదేవీలు ప్రాథమిక ఆధారాల ప్రకారం..ప్రధానంగా రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలతో శివబాలకృష్ణ పలు లావాదేవీలు జరిపినట్టు తెలిసింది. సోమవారం నాటి విచారణలో భాగంగా సంబంధిత వివరాలు ఏసీబీ అధికారులు సేకరించినట్టు తెలిసింది. అదేవిధంగా లాకర్లు ఓపెన్ చేసినప్పుడు లభించిన పలు భూ పత్రాలపైనా ప్రశ్నించినట్టు సమాచారం. ఇప్పటికే శివబాలకృష్ణ సోదరుడు సునీల్‌ను అధికారులు ప్రశ్నించారు. అతడి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా మరిన్ని అంశాలపై శివబాలకృష్ణను ప్రశ్నించినట్టు తెలిసింది. ఔటర్ చుట్టూ కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల్లోనూ అవినీతికి పాల్పడిన శివబాలకృష్ణ తన బినామీల పేరిట ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం. వీటి గురించి కూడా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. రెండు రోజుల్లో కస్టడీ ముగియనున్న నేపథ్యంలో కీలక అంశాలపై మరిన్ని వివరాలు సేకరించేలా ఏసీబీ అధికారులు ప్రశ్నావళి రూపొందించుకుంటున్నట్టు తెలిసింది. -
బాలకృష్ణ కక్కుర్తి.. కళ్లు బైర్లు కమ్మేలా..
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ విచారణ నాలుగో రోజు ముగిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులపై ఏసీబీ ఆరా తీసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరెవరు బాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించారనే దానిపై ఏసీబీ అధికారులు విచారించారు. బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్‌ను ఏసీబీ విచారించింది. ఏసీబీ కార్యాలయానికి పిలిపించి సునీల్‌ను అధికారులు ప్రశ్నించారు. బాలకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు ఏసీబీ గుర్తించింది. బాలాజీ పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు తేలింది. బాలకృష్ణ కాసుల కక్కుర్తిపై విచారణ అధికారులు షాక్ అవుతున్నారు. రెరా కార్యాలయం నాలుగో అంతస్తులోని బాలకృష్ణ చాంబర్లో లాకర్‌ను అధికారులు బ్రేక్ చేశారు. 12 లక్షలు విలువ చేసే చందనపు చీరలు, 20 లక్షలకు పైగా క్యాష్ లభ్యమైంది. వాటితో బాలకృష్ణ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు ఫోటో ఆల్బమ్‌లు, కీలకమైన భూముల పాసు పుస్తకాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: ఆ కార్లు ఎక్కడివి? -
ఆ కార్లు ఎక్కడివి?
సాక్షి, హైదరాబాద్: ఆ కార్లు ఎక్కడివి..ఎవరు బహుమతిగా ఇచ్చారు? ఒకవేళ మీరే కొంటే..అందుకు సొమ్ము ఎక్కడిది? అంటూ మూడో రోజు కస్టడీలో ఏసీబీ అధికారులు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ప్రశ్నించినట్టు తెలిసింది. ఏసీబీకి పట్టుబడడానికి కొద్ది నెలల కిత్రమే రెండు కొత్త కార్లు శివబాలకృష్ణకు బహుమతిగా వచ్చినట్టు ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఇందులో హోండాసిటీ కారును ఓ బిల్డర్, నెక్సాన్ కారు ఓ రియల్‌బ్రోకర్ నుంచి బహుమతిగా వచ్చినట్టుగా ప్రాథమిక ఆధారాల మేరకు అనుమానిస్తున్నారు. ఈ రెండు కార్ల విషయంతోపాటు కుటుంబసభ్యులు, ఇతర బినామీల పేరిట నడుపుతున్న పలు బ్యాంకు ఖాతాలు, లాకర్ల వివరాలపైనా ఏసీ బీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. శివ బాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరిట మరో మూడు లాకర్లు ఉన్నట్టు గుర్తించారు. ఎనిమిది రోజుల కస్టడీలో భాగంగా శుక్రవారం మూడో రోజు శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. తొలిరోజు విచారణలో భాగంగా బుధవారం ఏడు గంటలు, గురువారం ఆరుగంటలపాటు శివబాలకృష్ణను ఏసీబీ అధికారుల బృందం ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే, శుక్రవారం విచారణలో భాగంగా ఉద యం చంచల్‌గూడ జైలు నుంచి శివబాలకృష్ణను తమ కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు తొలుత రెరా కార్యాలయానికి వెళ్లినట్టు సమాచారం. అక్కడ సోదా ల్లో రూ.కోటి విలువైన ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చి ప్రశ్నించారు. అయితే తొలి రెండు రోజులు ఏసీబీ విచారణకు సహకరించకపోయినా, వరుసగా కీలక పత్రాలు ముందుంచి తమదైన శైలిలో ప్రశి్నస్తుండడంతో శివబాలకృష్ణ కొన్ని ప్రశ్నలకు ఏసీబీ అధికారులకు సమాధానాలు ఇస్తున్నట్టు తెలిసింది. లాకర్లలో భారీగా బంగారం? శివబాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యుల పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు తెరిపించినట్టు సమాచారం. ఈ లాకర్లలో పెద్ద మొత్తంలో దాచిన బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఎంతమేర బంగారం, ఇతర పత్రాలు స్వా«దీనం చేసుకున్నారన్న సమాచారం పూర్తిగా తెలియరాలేదు. కాగా, ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత శివబాలకృష్ణపై మరికొందరు ఏసీబీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తుండడంతో ఏసీబీ అధికారులు ఆ అంశాలపైనా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. శనివారం మరోమారు ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను కస్టడీకి తీసుకొని ప్రశ్నించనున్నారు. -
HMDA: శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధిచిన కేసులో అవినితి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ఎదుర్కొంటున్న శివబాల కృష్ణపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీ(HMDA) వేటు వేసింది. శివ బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయనికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఇక.. ఆయన తన పదవిని అడ్డుపెట్టుకొని రూ. వందల కోట్లు సంపాధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏసీబీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ -
హెచ్ఎండీఏలో ‘ఏసీబీ’ ప్రకంపనలు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏలో ఏసీబీ దాడులు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై దాడుల నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. బాలకృష్ణ ఇంటిపై దాడులు అనంతరం ఏసీబీ అధికారులు తమ దర్యాఫ్తులో భాగంగా హెచ్ఎండీఏపై దృష్టి సారించారు. గత మూడేళ్లలో ప్రణాళికా విభాగం నుంచి ఇచి్చన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆదివారం సెలవు దినమైనప్పటికీ ప్రణాళికా విభాగానికి చెందిన ప్లానింగ్ అధికారులు, ఏపీఓలు, జేపీలు, ఇతర సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. మరోవైపు ఈ మూడేళ్ల అనుమతులకు సంబంధించిన ఫైళ్లను హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్‌కు కూడా అధికారులు అందజేశారు. శంకర్పల్లి, శంషాబాద్, ఘటకేసర్, మేడ్చల్ జోన్లలో పెద్ద సంఖ్యలో వివిధ రకాల అనుమతుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. టీఎస్‌బీపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొందరు అధికారులు ‘డాక్యుమెంట్ల పరిశీలన’సాకుతో అక్రమార్జన కోసం నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు ఇచ్చారు. కన్జర్వేషన్ జోన్లలో ఉన్న భూములను యథేచ్చగా కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లలోకి మార్చేశారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ పరిధిలోనూ ఇలాంటి అక్రమాలు చాలా జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు వట్టి నాగులపల్లి ప్రాంతానికి చెందిన సుమారు 70 భూమారి్పడి ఫైళ్లకు ఆగమేఘాల మీద అనుమతులు ఇవ్వడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో మరిన్ని అక్రమ అనుమతులు ఇచి్చనట్లు లభించిన సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు హెచ్ఎండీఏ ప్రణాళికా విభాగంపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఔటర్ సమీపంలో ఉన్న మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట్, నార్సింగి, మంచిరేవుల, తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణంలో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రోత్ కారిడార్‌లో భవిష్యత్తులో వాహనాల రద్దీని నియంత్రించేందుకు సమాంతర రహదారుల కోసం కేటాయించిన భూముల్లో పలుచోట్ల ఇలాంటి ఉల్లంఘనలు జరిగినట్లు తెలిసింది. మరోవైపు బాలకృష్ణ ఇంటిపై దాడులు, అతడి అరెస్టు, రిమాండ్ అనంతరం వెలుగులోకి వచి్చన అక్రమ ఆస్తులకు సంబంధించి రోజుకో కొత్త విషయం బయట పడుతుండడంతో హెచ్ఎండీఏ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అడ్డగోలుగా అనుమతులు ప్రస్తుతం ఏసీబీ.. బాలకృష్ణకు నమ్మిన బంట్లుగా ఉండి ఆయనకు అన్ని విధాలుగా సహకరించిన కొందరు అధికారులపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. లే అవుట్లు, భవన నిర్మాణాలు, ప్రత్యేకించి హైరైజ్ భవనాల కోసం అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. కొన్నిచోట్ల పర్యావరణ సంస్థలు విధించిన ఆంక్షలను సైతం పక్కన పెట్టి, నీటివనరులు ఉన్న చోట భవనాలకు అనుమతులిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే పారిశ్రామిక ప్రాంతాల్లో నివాస సముదాయాలు వెలిశాయి. ఇలాంటి అనుమతులను ఇచ్చేందుకు ఒకరిద్దరు ఏపీఓ స్థాయి అధికారులు బాలకృష్ణకు ప్రధాన అనుచరుల మాదిరి వ్యవహరించినట్లు సమాచారం. ఈ క్రమంలో వారు సైతం రూ.కోట్లలో అక్రమార్జనకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కీలకమైన జోన్లో పని చేస్తున్న ఒక ఏపీఓ బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడిగా ఉండి అన్ని రకాల వ్యవహారాలు చక్కబెట్టినట్లు తెలిసింది. దీంతో ఏసీబీ అధికారులు ఆ ఏపీఓపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు బాలకృష్ణపై ఏసీబీ దాడుల అనంతరం ఒకరిద్దరు వ్యక్తిగత కారణాలు చూపుతూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం గమనార్హం. -
HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణను సర్వీసు నుంచి తొలగించేందుకు చర్యలు
-
బినామీలుగా సంబంధంలేని వ్యక్తులు!
సాక్షి, హైదరాబాద్: భూవినియోగ మార్పు, భవన అనుమతుల్లో అక్రమాలతో భారీగా ఆర్జించిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా కార్యదర్శి శివబాలకృష్ణ.. చాలా తెలివిగా తనకు బంధుత్వం, దగ్గరి సంబంధమేదీ లేని వ్యక్తులను బినామీలుగా పెట్టుకుని వందల కోట్ల రూపాయల ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. తెలిసినవారైతే అనుమానం వస్తుందని భావించి ఇలా వ్యవహరించారని.. అధికారులు, రాజకీయ నేతల సహకారంతో వందల కోట్ల విలువ చేసే భూములను ఆర్జించారని అంటున్నారు. శివబాలకృష్ణపై ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కోర్టులో దాఖలు చేసిన 45పేజీల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను వెల్లడించారు. సహకరించిన అధికారుల పాత్రపైనా విచారణ శివ బాలకృష్ణ ఇంటితోపాటు పీర్జాదిగూడలో రమాదేవి, జూబ్లీహిల్స్ ప్రమోద్‌కుమార్, మాదాపూర్‌లో సందీప్‌రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణమూర్తి ఇళ్లు, ఇతర కార్యాలయాలు కలిపి మొత్తం 18 చోట్ల సోదాలు చేశామని.. భారీగా స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లను గుర్తించామని రిమాండ్ రిపోర్టులో అధికారులు వివరించారు. ‘‘బాలకృష్ణ ఇంట్లో స్వాధీనం చేసుకున్న 50 స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లను పరిశీలించాం. పట్టణాల్లో విల్లాలు, ఇళ్లతోపాటు నాగర్‌కర్నూల్‌లో 12.13 ఎకరాలు, అబ్దుల్లాపూర్, భువనగిరి, చేవెళ్ల, యాదగిరిగుట్ట, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో భూములు ఉన్నట్టు గుర్తించాం. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల మేరకు స్థిరాస్తుల విలువ రూ.4.9 కోట్లుగా ఉంది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ అంతకు 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే రూ.83,80,000 నగదు, నాలుగు కార్లు, రూ.8.26 కోట్ల విలువైన బంగారం, వెండితోపాటు పలు వస్తువులు సీజ్ చేశాం. 155 డాక్యుమెంట్లు, 4 బ్యాంక్ పాస్‌బుక్‌లు, ఖరీదైన వాచీలు, సెల్ఫోన్లు, లాకర్ పత్రాలు, ఎల్ఐసీ బాండ్లను స్వాధీనం చేసుకున్నాం. వీటిలో బినామీలను విచారించాల్సి ఉంది. అలాగే ఈ ఉదంతంలో ఇతర అధికారుల పాత్రపైనా దర్యాప్తు జరపాల్సి ఉంది..’’ అని అధికారులు పేర్కొన్నారు. రాజకీయ నాయకులూ సహకరించారు లేఔట్ల అనుమతుల కోసం శివబాలకృష్ణ పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేసేవారని.. రెరా సెక్రటరీ హోదాలోనూ పలు అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. బాలకృష్ణ హయాంలో అనుమతులు ఇచ్చిన వాటిపై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. అక్రమాలకు తనవారు అవసరమని భావించిన బాలకృష్ణ బంధువులను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నియమించుకున్నారని.. కొందరు రాజకీయ నాయకులు కూడా సహకరించారని పేర్కొన్నారు. సోదాల్లో పట్టుబడిన ఆస్తులు, వస్తువులకు సంబంధించిన వివరాలపై ఎంత అడిగినా.. బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు సహకరించలేదన్నారు. అన్ని వివరాలు బయటపడాలంటే ఇప్పటికే అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న బాలకృష్ణను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. డ్రైవర్ పేరిట రూ.20 కోట్ల ఆస్తులు బాలకృష్ణ డ్రైవర్ పేరిట నగర శివార్లలో రూ.20 కోట్లకుపైగా (మార్కెట్ రేట్ల ప్రకారం) విలువైన భూములు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పలు జిల్లాల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ఉద్యోగులు, బ్యాంకు లాకర్ల నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. ఆ ఆధారాలను బట్టి ఈ కేసుతో సంబంధమన్న వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. బినామీల్లో ఒకరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నట్టు గుర్తించి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. హెచ్ఎండీఏ పరిధిలో ఏ పని జరగాలన్నా తొలుత ఆయన బినామీలను సంప్రదించాకే అధికారుల వద్దకు వెళ్లేలా బాలకృష్ణ ప్రత్యేకంగా ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు కూడా విచారణలో తేలిందని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. -
బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ మరో వారం రోజుల కస్టడీ కోరనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలకృష్ణ ఆమోదించిన ఫైల్స్, బినామీ ఆస్థులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. మరోవైపు.. బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలను అధికారులు వెల్లడించారు. కాగా, లేఅవుట్ అనుమతుల కోసం బాలకృష్ణ భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ పేర్కొన్నారు. అప్లికేషన్లలో తప్పులు ఉన్నాయని లాభాలు పొందినట్టు తెలిపారు. ప్లాట్స్ నిర్మాణాల్లో విల్లాలను సైతం లంచంగా బాలకృష్ణ తీసుకున్నాడు. బాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ, రెరాలో భారీగా అక్రమాలు జరిగినట్టు స్పష్టం చేశారు. హెచ్ఎండీఏలోని మూడు జోన్లపై బాలకృష్ణకు మంచిపట్టు ఉందని గుర్తించారు. ఇక, హెచ్ఎండీఏలోని కీలక పోస్టులో బాలకృష్ణ సుదీర్ఘంగా పనిచేశారు. మరోవైపు.. బాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నాక ఏసీబీ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనుంది. ఇదే సమయంలో బాలకృష్ణకు సహాయం చేసిన అధికారులపై కూడా విచారించనున్నారు. ఇదిలా ఉండగా.. వట్టి నాగులపల్లిలో ప్రభుత్వ భూముల యాజమాన్యం, వినియోగ హక్కుల మార్పిడిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అక్రమాలు జరిగిన భూముల ఫైల్స్‌పై సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. వట్టి నాగులపల్లిలో ఎలక్షన్ కోడ్‌కు కొద్దిరోజుల ముందే పెద్ద ఎత్తున భూ వినియోగ మార్పిడి జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా లేకపోయినా ఫైల్స్ ఆమోదంలో బాలకృష్ణ పాత్రపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇక, హెచ్ఎండీఏ నుండి ఆరు నెలల క్రితమే బదిలీ అయి తెలంగాణ రేరా సెక్రటరీగా బాలకృష్ణ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో, బాలకృష్ణ హయాంలో ఇచ్చిన అక్రమ అనుమతులపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. అయితే, బాలకృష్ణ తన దగ్గరి బంధువులను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించుకుని అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. కొందరు పొలిటికల్ లీడర్లు కూడా అక్రమాలకు మధ్యవర్తులుగా వ్యవహరించినట్టు సమాచారం. -
‘టౌన్ ప్లానింగ్’ శివబాలకృష్ణ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు దొరికిన పురపాలక శాఖ పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) విభాగం ఉన్నతాధికారి శివబాలకృష్ణ ఆస్తులు లెక్కకు మించి బయటపడుతున్నాయి. సోదాల్లో గుర్తించిన ఆస్తుల విలువను మదింపు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. గురువారం ఆయనను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వచ్చే నెల 8వరకు రిమాండ్ విధించడంతో.. చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇక బాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించిన మూర్తి, సత్యంల కోసం గాలిస్తున్నారు. శివబాలకృష్ణ అవినీతి, అక్రమాల సంపాదనతో నాలుగైదు ప్రాంతాల్లో వంద ఎకరాల వరకు వ్యవసాయ భూమి, ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేశారని పురపాలక శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వాటి ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు ఐదు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సుమారు రెండు కిలోల బంగారం.. కోటి నగదు.. శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో స్థిరాస్తి పత్రాలను అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్‌లో విల్లాలు, ఫ్లాట్లు, నగర శివారు ప్రాంతాల్లో భారీగా భూముల పత్రాలు వీటిలో ఉండటం గమనార్హం. మొత్తంగా వంద ఎకరాల వరకు ఈ భూములు ఉన్నట్టు తెలిసింది. వీటితోపాటు కోటి వరకు నగదు, దాదాపు రెండు కిలోల బంగారు ఆభరణాలు, ఆరు కిలోలకుపైగా వెండి వస్తువులు, 80కిపైగా అత్యంత ఖరీదైన వాచీలు, పదుల సంఖ్యలో ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లను కూడా అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. ఇంకా బ్యాంకు లాకర్లను తెరిస్తే ఇంకా ఎంత స్థాయిలో ఆస్తులు బయటపడతాయోనని అధికారులు పేర్కొంటున్నారు. బినామీల పేరిట భూములు సోదాల్లో కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, జనగామలో 24 ఎకరాల స్థిరాస్తి భూముల పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. వాటిలో చాలా వరకు బినామీల పేరిట ఉన్నట్టు చెప్తున్నారు. బినామీలుగా వ్యవహరించిన సత్యం, మూర్తి కోసం అధికారులు గాలిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో, మరో 16 చోట్ల జరిపిన దాడుల్లో ఇప్పటివరకు స్థిరాస్తులు, చరాస్తుల డాక్యుమెంట్లలోని ప్రభుత్వ విలువ ప్రకారం రూ.8.26 కోట్ల ఆస్తులను గుర్తించినట్టు ఏసీబీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో ఎన్నోరెట్లు అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇంకా ఆస్తుల మదింపు జరుగుతోందని తెలిపారు. సోదాల్లో రూ.99,60,850 నగదు, 1,988 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆరు కిలోల వెండి ఆభరణాలు/వస్తువులు, డాక్యుమెంట్ల లెక్కల ప్రకారం రూ.5,96,27,495 విలువైన స్థిర, చరాస్తులను గుర్తించినట్టు తెలిపారు. బాలకృష్ణను అరెస్టు చేసి ఏసీబీ కోర్టు అదనపు స్పెషల్ జడ్జి ముందు హాజరుపర్చినట్టు వివరించారు. అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులకు సంబంధించి ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని సమాచారం ఇవ్వాలని కోరారు. పుర ‘ప్లానింగ్’ అంతా ఆయనదే! ♦ విధానాల రూపకల్పనలో చక్రం తిప్పిన శివబాలకృష్ణ ♦ ఆయన కోసం పురపాలక శాఖలో డైరెక్టర్ (ప్లానింగ్) పోస్టు సృష్టి ♦ హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రో రైల్ విధాన నిర్ణయాల్లో ప్రభావం ♦ రెరా నిబంధనలు, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, టీఎస్–బీపాస్ల రూపకల్పనలోనూ కీలక పాత్ర ♦ అనుమతులు, మినహాయింపులు, అలైన్మెంట్ మార్పుల పేరిట అవినీతి ♦ శివబాలకృష్ణ ఏసీబీకి చిక్కడంపై రియల్ ఎస్టేట్ రంగంలో తీవ్ర చర్చ సాక్షి, హైదరాబాద్: ఏసీబీకి చిక్కి అరెస్టయిన హెచ్ ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ.. రాష్ట్ర అర్బన్ ప్లానింగ్ పాలసీల రూపకల్పనలో చక్రం తిప్పారని పురపాలకశాఖ వర్గాలు చెప్తున్నాయి. పట్టణ ప్రణాళి కకు సంబంధించిన విధానాల రూపకల్పన, రచన (డ్రాఫ్టింగ్)లో దిట్టకావడంతో ఆయన హవా కొన సాగిందని అంటున్నాయి. 2014లో రాష్ట్ర సచివాల యంలోని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో డైరెక్టర్ (ప్లానింగ్) పేరుతో కొత్త పోస్టును సృష్టించి మరీ ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించ డం గమనార్హం. దీనితో ఆయన హెచ్ఎండీఏ, జీహె చ్ఎంసీ, హైదరాబాద్ మెట్రోరైల్, భూవిని యోగ మార్పిడి, ఎలివేటెడ్ కారిడార్లు, ఆకాశ హర్మ్యాలు, మాస్టర్ ప్లాన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ స్థాయి లో విధానపర నిర్ణయాలు తీసుకోవ డంలో కీలకంగా వ్యవహరించారు. పురపాలక శాఖ లో ఈ వ్యవ హారాలను పర్యవేక్షించే కీలకమైన ప్లానింగ్–1, ప్లానింగ్–2, ప్లానింగ్–3 అనే మూడు సెక్షన్లకూ శివ బాలకృష్ణ మకుటం లేని మహా రాజుగా వ్యవహరించారని.. హెచ్ఎండీఏ డైరెక్టర్ (ప్లానింగ్)గా ఆ సంస్థ అంతర్గత వ్యవహారాల్లోనూ ప్రభావం చూపి నట్టు చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే ఆయ న పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడి ఆస్తులు పోగే సుకున్నట్టు ఆరోపణలు విని పిస్తున్నాయి. శివబాల కృష్ణ ఇంట్లో సోదాల్లో లభించిన విలువైన వాచీలు, సెల్ఫోన్లు, ఆభరణాలు వంటివన్నీ బహుమతు లుగా అందుకున్నవేనని పురపాలక శాఖలో చర్చ జరుగుతోంది. కీలక విధాన నిర్ణయాలన్నీ.. గత పదేళ్లలో రాష్ట్ర పురపాలక శాఖ తీసుకొచ్చిన పాలసీల రూపకల్పనలో శివబాలకృష్ణ ముఖ్యపాత్ర పోషించారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ముఖ్యమైన తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యు లేషన్ అథారిటీ (టీఎస్ రెరా) నిబంధనలను సైతం శివబాలకృష్ణ రూపొందించారు. ఈ క్రమంలో రెరా అమల్లోకి వచ్చిన తేదీ నాటికే నిర్మాణం ప్రారంభమైన ప్రాజెక్టులకు మినహాయింపు ఇచ్చి, బిల్డర్లకు ప్రయోజనం కల్పించినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇక అనుమతి లేని కట్టడాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం సర్కారు తెచ్చిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ల జీవోలు శివబాలకృష్ణ ఆధ్వర్యంలోనే సిద్ధం చేశారు. టౌన్షిప్ పాలసీ, పొడియం పార్కింగ్ పాలసీ, పార్కింగ్ ఫీజు విధానం, సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో భవన అనుమతుల జారీ కోసం తెచ్చిన టీఎస్–బీపాస్ పాలసీ, కూల్‌రూఫ్ పాలసీ, రాష్ట్ర బిల్డింగ్ రూల్స్ (జీవో 168)కు సవరణలతో వేర్వేరు సందర్భాల్లో జారీ చేసిన జీవోలు, లేఅవుట్ రూల్స్‌కు సవరణలతో వేర్వేరు సందర్భాల్లో ఇచ్చిన జీవోలను సైతం ఆయన నేతృత్వంలోనే రూపొందించినట్టు పురపాలక శాఖ వర్గాలు చెప్తున్నాయి. దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టి.. హెచ్ఎండీఏ, ఇతర పట్టణాల మాస్టర్ ప్లాన్లకు సవ రణలు/మినహాయింపులు, మాస్టర్ ప్లాన్ల నుంచి రోడ్లను తొలగించడం/పార్కులను మార్చడం, హెచ్ఎండీఏ పరిధిలో భూవినియోగ మార్పిడి దర ఖాస్తుల పరిష్కరణ, హెచ్ఎండీఏ పరిధి విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్, ఓఆర్ఆర్ వ్యవహారాలు, ఆకాశహర్మ్యాల నిర్మాణానికి ప్రత్యేకంగా నిబంధ నల మినహాయింపులు, భారీ రియల్ ఎస్టేట్ ప్రాజె క్టులు/గేటెడ్ సొసైటీలు/టౌన్‌షిప్‌ల నిర్మాణానికి అనుమతులు, మెట్రో అలైన్మెంట్ మార్పులు వంటి అంశాల్లోనూ శివబాలకృష్ణ కీల కంగా వ్యవహ రించారని సమాచారం. ఈ క్రమంలో ఆయా అంశాల్లో అనుమతులు, మినహాయింపులు కోరుతూ వచ్చే దరఖాస్తులను పెండింగ్ ఉంచేవా రని.. కొన్నింటికి మాత్రమే వేగంగా పురపాలకశాఖ నుంచి అనుమతులు లభించేవని విమర్శలు ఉన్నా యి. ఈ క్రమంలోనే భారీగా సొమ్ము, బహుమ తులు అందుకునేవారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
చంద్రబాబు ప్రకటించిన తీరుపై టీడీపీ సీనియర్ నేత నెక్కంటి బాలకృష్ణ ఫైర్
-
బాలకృష్ణ అక్రమార్జన.. అధికారులే కంగుతినేలా..!
హైదరాబాద్, సాక్షి: హెచ్ఎండీఏ మాజీ చైర్మన్, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి శివ బాలకృష్ణను అక్రమాస్తుల వ్యవహారంలో దర్యాప్తు చేసే క్రమంలో విస్తూపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వందల కోట్ల ఆస్తుల్ని కూడబెట్టుకునేందుకు బాలకృష్ణ ఎలాంటి మార్గాల్ని అనుసరించాడో తెలిసి అధికారులే కంగుతింటున్నారు. పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో శివబాలకృష్ణ బారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ దర్యాప్తుల్లో వెల్లడైంది. అయితే.. రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చి.. ఆ లంచాలను పెట్టుబడుల్లోకి ఆయన మార్చుకున్నట్లు తేలింది. ఇందుకోసం హైదరాబాద్ శివారుల్లో వందల కొద్దీ ఆయన అనుమతులు ఇచ్చినట్లు తేలింది. హెచ్ఎండీఏ, రెరాలో పని చేస్తూనే ఆయన ఈ అనుమతులు జారీ చేసినట్లు గుర్తించారు. ఇక.. ఆయన్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ.. బంజారాహిల్స్ స్టేషన్‌ను తరలించి విచారిస్తోంది. ఆయన ఏ కంపెనీలకు, ఎవరెవరికి అనుమతులు ఇచ్చిందో ఆరా తీస్తోంది. మరోవైపు బంధువులు, మిత్రుల పేర్లు మీద కూడా ఎకరాల కొద్దీ ఆయన భూములు కొన్నారు. కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, జనగామలో 24 ఎకరాల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 90 ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. బాలకృష్ణ ఆస్తుల కేసులో విచారణ కొనసాగుతోంది. కీలకమైన డాక్యుమెంట్లనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటిదాకా బయటపడిన పత్రాలు, ఇతరాలను బట్టి.. ఆయన కూడబెట్టిన ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం రూ. 300-400 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం జరిగిన సోదాల్లో.. ఒక్క నానక్‌రామ్‌గూడ లోని బాలకృష్ణ ఇంట్లోనే రూ. 84 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఖరీదైన విల్లాలు, ఫ్లాట్లు.. నగర శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ భూములు ఆయన వెనకేసినట్లు గుర్తించారు. -
TS: భారీ అవినీతి తిమింగలం @500 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: భవన అనుమతులు, టౌన్‌ప్లానింగ్‌లో అడ్డగోలుగా అవినీతికి పాల్పడి, వందల కోట్లు అక్రమంగా కూడబెట్టిన తిమింగలం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కింది. హైదరాబాద్ నగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మాజీ డైరెక్టర్, ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ ఆర్ఎంఎల్) డైరెక్టర్‌గా ఉన్న శివబాలకృష్ణ నివాసం, కార్యాలయాలు, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు బుధవారం విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఆయన తన పదవిని, ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితో సన్నిహిత పరిచయాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా రూ.500 కోట్ల వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా అంచనా వేస్తున్నారు. బుధవారం సా యంత్రం వరకు స్వాదీనం చేసుకున్న ఆస్తుల విలువే బహిరంగ మార్కెట్లో రూ.వంద కోట్లకుపైగానే ఉంటుందని చెప్తున్నారు. ఇంకా నిర్ధారించి, విలువ తేల్చాల్సిన ఆస్తులు భారీగానే ఉన్నాయని అంటున్నారు. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో శివబాలకృష్ణ భారీగా అవినీతికి పాల్పడి, అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా ఫిర్యాదులు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 17 చోట్ల ఏకకాలంలో సోదాలు శివ బాలకృష్ణ హెచ్ఎండీఏలో భూమార్పిడి వినియోగం, హైరైజ్ భవనాలకు అనుమతులు, కీలకమైన పట్టణ ప్రణాళిక (టౌన్‌ప్లానింగ్)కు సంబంధించిన పోస్టుల్లో పనిచేశారు. ఈ క్రమంలో ఆయన ఉన్నతాధికారుల అండదండలతో కీలక పోస్టుల్లో ఏళ్లతరబడి పాతుకుపోయి భారీగా అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారన్న సమాచారం మేరకు ఏసీబీ దాడులకు దిగింది. అధికారులు బుధవారం ఉదయం హైదరాబాద్ శివార్లలోని పుప్పాలగూడలో ఉన్న శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లు కలసి మొత్తం 17 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఇంట్లో అయితే ఏకంగా 20 మంది అధికారులు అన్ని మూలలా జల్లెడపట్టినట్టు తెలిసింది. ఈ సందర్భంగా భారీగా స్థిర, చరాస్తులను గుర్తించారు. పెద్ద సంఖ్యలో ప్లాట్లు, ఫ్లాట్లు, బినామీల పేరిట పెట్టిన ఇతర స్థిరాస్తుల డాక్యుమెంట్లు, రూ.40 లక్షల నగదు, భారీగా బంగారు, వజ్రాభరణాలు, వెండి, పదిహేను వరకు ఐఫోన్లు, పదుల సంఖ్యలో వాచ్‌లను స్వాదీనం చేసుకున్నట్టు తెలిసింది. ఆయనకు పెద్ద సంఖ్యలో బ్యాంకు లాకర్లు ఉన్నట్టు సమాచారం. వాటిని తెరిస్తే మరింత భారీగా ఆస్తుల బయటపడవచ్చని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. గురువారం కూడా సోదాలు జరిపే అవకాశం ఉందని, తనిఖీలు పూర్తయ్యే సరికి ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ రూ.500 కోట్ల వరకు తేలవచ్చని అంటున్నారు. సహకరించని కుటుంబ సభ్యులు, బంధువులు ఏసీబీ అధికారులు సోదాలు చేసిన సమయంలో శివ బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు ఏమా త్రం సహకరించలేదని అధికారులు అంటున్నారు. బినామీ ఆస్తుల పత్రాలకు సంబంధించి ప్రశ్నిస్తే శివ బాలకృష్ణ సమాధానం ఇవ్వనట్టు తెలిసింది. ఆయన కారును కూడా అధికారులు క్షుణ్నంగా తనిఖీ చేశారు. శివబాలకృష్ణ పెద్ద ఎత్తున పెండింగ్ ఫైల్స్‌ను పురపాలక శాఖ ఉన్నతాధికారి అండదండలతో క్లియర్ చేశారని.. పలు నిర్మాణ సంస్థల యజమానుల నుంచి భారీగా సొమ్ము తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. శివ బాలకృష్ణ వ్యవహారశైలితో నష్టపోయిన కొందరు బిల్డర్లు ఏసీబీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఆయనపై ఏసీబీ దాడి నేపథ్యంలో కొందరు టౌన్‌ప్లానింగ్ అధికారుల్లో ఆందోళన కనిపిస్తోంది. బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉంది ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు ఫిర్యాదులు అందడంతో శివబాలకృష్ణపై దాడులు చేపట్టినట్టు ఏసీ బీ జాయింట్ డైరెక్టర్ సు«దీంద్ర బుధవారం సాయంత్రం వెల్లడించారు. ‘‘బాలకృష్ణ 2018–2023 మధ్య హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా కొనసాగారు. మొత్తం 17 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నాం. భారీ ఎత్తున అతి విలువైన భూముల పత్రాలు దొరికాయి. అవన్నీ బినామీల పేరిట కొనుగోలు చేశారు. వాటిని పరిశీలిస్తున్నాం. బాలకృష్ణ ఇంట్లో రూ.40 లక్షల నగదు స్వా«దీనం చేసుకున్నాం. బుధవారం అర్ధరాత్రి వరకు, అవసరమైతే గురువారం కూడా సోదాలు కొనసాగిస్తాం. ఇంకా బ్యాంకు లాకర్లను పరిశీలించాల్సి ఉంది..’’అని ఏసీబీ డీజీ తెలిపారు. శివ బాలకృష్ణపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశామని, గురువారం ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెడతామని తెలిపారు. ఓ సీనియర్ ఐఏఎస్ భాగస్వామ్యంపై ఆరా! శివబాలకృష్ణ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితో సన్నిహితంగా మెలిగారని, ఆయన కనుసన్నల్లో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. సదరు ఐఏఎస్ అధికారికి ఈ అవినీతిలో భాగస్వామ్యంపైనా ఆరా తీస్తున్నట్టు చెప్తున్నారు. పురపాలక శాఖలోని అధికారులు సైతం.. సదరు సీనియర్ ఐఏఎస్ అధికారి లక్ష్యంగా దాడులు జరిగాయని చర్చించుకుంటున్నారు. శివబాలకృష్ణ భారీగా ముడుపులు తీసుకోవడమేకాక, కొందరి నుంచి ఆస్తులను రిజిస్టర్ చేయించుకున్నట్టుగా ఏసీబీ అధికారులకు కచ్చితమైన సమాచారం లభించిందని.. ఈ క్రమంలోనే దాడులు జరిగాయని అంటున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను కొత్త సర్కారు ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా నియమించాక ఈ కేసుపై ఫోకస్ పెట్టడం గమనార్హం. -
మండపేట సీటుపై రచ్చ బాబుకు టీడీపీ, జనసేన వార్నింగ్
-
జూనియర్ ఎన్టీఆర్ అంటే బాబుకు అంత భయమెందుకు ?
-
జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయండి
ఖైరతాబాద్ (హైదరాబాద్): ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని ఆయన ఘాట్ వద్ద నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశించడం వివాదానికి దారితీసింది. బాలకృష్ణ ఆదేశాలతో ఆయన అనుచరులు ఫ్లెక్సీలు తొలగించడం, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాటిని తిరిగి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవడంతో ఘాట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్‌కు కుటుంబసభ్యుల నివాళి గురువారం ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్‌లోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. తెల్లవారు జామున జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు.. ఎన్టీఆర్ ఘాట్‌కు విచ్చేసి తాతకు నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ కుమారు డు, సీనియర్ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, నంద మూరి రామకృష్ణ, సుహాసినితో పాటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నివాళులర్పించారు. అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లోపల, ప్రవేశ ద్వా రం రెండువైపులా జూనియర్ ఎన్టీఆర్ అభిమాను లు.. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్‌లతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తండ్రికి నివాళులర్పించి బయటకు వచ్చే క్రమంలో ఈ ఫ్లెక్సీలను చూసిన బాలకృష్ణ.. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించడంతో, ఆయన అనుచరులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించి కొన్నింటిని రోడ్డు ఫుట్‌పాత్‌పై, మరికొన్ని ఘాట్ పార్కింగ్ ప్రాంతంలో కనిపించకుండా పెట్టారు. జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం తమ హీరో ఫ్లెక్సీలు తొలగించారన్న విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బయట ఉంచిన ఫ్లెక్సీలను తిరిగి లోపల పెట్టేందుకు అనుమతించాలని పోలీసులను కోరారు. వారు అందుకు అనుమతించకపోవడంతో అభిమానులు ఘాట్ లోపల తొలగించకుండా వదిలేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పూలమాల వేసి పాలాభిషే కం చేశారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన జూని యర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధ్యక్షుడు ఫుట్‌పాత్‌పై ఉంచిన రెండు ఫ్లెక్సీలను ఘాట్ లోపలికి తీసుకువచ్చారు. ఇది గమనించిన పోలీ సులు.. బయట ఉన్న ఫ్లెక్సీలు లోపలికి ఎందుకు తీసుకువచ్చారంటూ.. వెంటనే వాటిని యథా స్థానంలో పెట్టాలని ఆదేశించారు. వారు విన్పించుకోక పోవడంతో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రి క్తత నెలకొంది. చివరకు పోలీసులు లోపలికి తీసుకువచ్చిన ఫ్లెక్సీలను తిరిగి బయట పెట్టించి వారిని అక్కడినుంచి పంపించి వేయడంతో ఉద్రి క్తత చల్లారింది. కాగా నివాళులర్పించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ..తెలుగు బిడ్డ బొడ్డు కోయకముందే రాజకీయాలంటే ఏంటో తెలిపిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. సాహసోపేత పథకాల అమలుతో పేదవాడి ఆక లి తీర్చి, విప్లవాత్మక, సామాజిక మార్పులు తీసుకువచ్చిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారని చెప్పారు. -
బాలకృష్ణ మానసిక స్థితి బాగోలేదు అందుకే ఈ చిల్లర రాజకీయాలు
-
బాలకృష్ణ ఆశ.. జూ.ఎన్టీఆర్ బొచ్చు కూడా పీకలేరు
-
జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని తీసేయాలంటూ బాలకృష్ణ హుకుం
-
పవన్ బాలకృష్ణపై పేర్ని నాని అదిరిపోయే సెటైర్లు
-
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కు చేదు అనుభవం
-
దేవర మౌనం వెనుక..
-
ఆ ఫ్యామిలీకి తారక్ పూర్తిగా దూరమైనట్టేనా
-
ఆమెకు టికెట్ ఇవ్వవద్దు అంటున్న సొంత పార్టీ నాయకులు..!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పైన పటారం, లోన భయం భయంగా ఉందనేది కొంతమంది ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. 2019 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ఉమ్మడి అనంతపురం జిల్లాలో గెలిచారు. మిగతా 12 చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ తరఫున గెలిచిన బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరన్నది ప్రధాన విమర్శ. మిగతా ఇన్చార్జ్లున్న చోట గడిచిన నాలుగున్నరేళ్లలో ప్రజల పక్షాన నిలబడి ఏ కార్యక్రమమూ చేయలేదు. దీనికి తోడు నియోజకవర్గాల్లో ఉన్న తగాదాలు ఇప్పుడా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. నేను గెలవలేక పోవచ్చు.. కానీ నిన్ను ఓడించగలను అంటూ ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. అప్పుడు చేసింది లేదు.. ఇప్పుడు చేయాల్సిందీ లేదు టీడీపీ అధికారంలో ఉండగా జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా ఒక్క అభివృద్ధి పనీ చెయ్యలేదు. అందుకే పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులును ప్రజలు గత ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. ఈ పరిస్థితుల్లో కనీసం ప్రతిపక్ష పార్టీ పాత్ర అయినా పోషించాల్సింది పోయి బురద రాజకీయం చేస్తుండటంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీని జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా ప్రభుత్వం తరఫున అందాల్సిన సంక్షేమ ఫలాలన్నీ తెలుగుదేశం పార్టీ వర్గాలకు కూడా చేరుతున్నాయి. అందుకే లోకేష్ యువగళానికి, బాబు జైలుకెళ్లినప్పుడు చేసిన నిరసనలకు ఉమ్మడి జిల్లాలో నామమాత్రంగానైనా స్పందన లేదు. దీంతో ఇప్పుడు టీడీపీ నేతల్లో భయం పట్టుకుంది. నువ్వెంతంటే నువ్వెంత.. కళ్యాణదుర్గంలో హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వర నాయుడు మధ్య నాలుగేళ్లుగా విభేదాలు కార్చిచ్చులా రగులుతూనే ఉన్నాయి. ఇక్కడ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. పెనుకొండ నియోజకవర్గంలోనూ బీకే పార్థసారఽథి, సవితమ్మ మధ్య కోల్డ్‌వార్ నడుస్తూనే ఉంది. ఇక కదిరిలో వైఎస్సార్సీపీ తరఫున 2014లో గెలిచి టీడీపీలోకి వెళ్లిన అత్తార్ చాంద్‌బాషా, చెక్‌బౌన్స్ కేసుల్లో శిక్షపడిన కందికుంట ప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. శింగనమలలో బండారు శ్రావణిశ్రీకి టికెట్ దక్కకుండా చేసేందుకు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారు. టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాలవ శ్రీనివాసులు అంటే ఏ నియోజకవర్గ నేతలకూ పడడం లేదు. ఈ దఫా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందో లేదోనన్న అనుమానం ఉంది. అనంతపురం అర్బన్‌లో ప్రభాకర్ చౌదరికి చెక్‌పెట్టేందుకు పలువురు గ్రూపుగా ఏర్పడ్డారు. గుంతకల్లులో టీడీపీ అభ్యర్థి ఊసే లేకపోగా, మడకశిరలో రెండు వర్గాల మధ్య నిరంతరం పోరు కొనసాగుతోంది. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరుతో ప్రజలు విసుగెత్తారు. గతంలో టీడీపీలో ఉండి ఓటమిపాలై బీజేపీలో చేరిన వరదాపురం సూరి.. ధర్మవరం టికెట్ కోసం ఇప్పుడు మళ్లీ టీడీపీ కండువా వేసుకోవాలని చూస్తుండగా.. పరిటాల శ్రీరాం వ్యతిరేకిస్తున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో గ్రూపు తగాదాలతో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. -
చంద్రబాబుకు షాక్.. పార్టీ మారనున్న అనంతపురం కీలక నేతలు!
► హిందూపురంలో బీసీ వర్గానికి చెందిన ఓ నేత రెండు దశాబ్దాలుగా టీడీపీ జెండా మోస్తున్నారు. మైనార్టీ నేత అబ్దుల్ ఘని తర్వాతైనా తనకు అసెంబ్లీ సీటు ఇస్తారని ఆశించారు. కానీ అధిష్టానం బాలకృష్ణను తెరపైకి తెచ్చింది. దీంతో సదరు నేత పదేళ్లుగా బాలకృష్ణ పల్లకీ మోస్తూ వచ్చాడు. ‘ఎన్నాళ్లిలా’ అంటూ తన వర్గం నుంచే వ్యతిరేకత రావడంతో కండువా మార్చేందుకు సిద్ధమయ్యారు. ► పుట్టపర్తికి చెందిన మరో బీసీ నాయకుడు కూడా దశాబ్దకాలంగా టీడీపీ జెండా మోస్తున్నాడు. అతని ద్వారా బీసీల ఓట్లకు గాలం వేస్తున్న అధిష్టానం.. అసెంబ్లీ సీటు మాత్రం ఇవ్వడం లేదు. పెత్తనమంతా ‘పల్లె’కు కట్టబెట్టగా...పల్లకీ మోతతో సదరు నేత అలసిపోయారు. త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుని అధిష్టానానికి బీసీల సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ...ఇలా..ఇన్నాళ్లూ టీడీపీ జెండా మోసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. తమను జెండా కూలీలుగా చూస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకుని, రాజ్యాధికారం కట్టబెడుతున్న పార్టీవైపు చూస్తున్నారు. సాక్షి, పుట్టపర్తి: తెలుగుదేశం పార్టీలో దశాబ్దాల కాలంగా కొనసాగిన వారికి నేడు గుర్తింపు లేకుండా పోయింది. పార్టీ గెలుపు కోసం జెండా మోసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం టీడీపీ పెద్దలకు అలవాటైంది. బడుగులను జెండా మోసే కూలీలుగా చూస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కేవలం పెత్తదార్లకే ఆదిపత్యం ఇవ్వడంపై బడుగు, బలహీన వర్గాల తమ్ముళ్లంతా అసంతృప్తిగా ఉన్నారు. ఫలితంగా గ్రామ స్థాయిలో టీడీపీ ఖాళీ అయ్యింది. గత సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ వార్డు స్థాయి నుంచి టీడీపీ బొక్కబోర్లా పడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా పార్టీ వెంట నడిచిన వారు ఒక్కొక్కరుగా వీడిపోతున్నారు. అయినా ఆ పార్టీ పంథా మాత్రం మారడం లేదు. పగ్గాలు ఒకరికి.. పెత్తనం మరొకరికి.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పెత్తందార్లకే పెత్తనం కట్టబెట్టారు. ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో కూడా అంతా బడాబాబులకే పెద్దపీట వేస్తున్నారు. ఒకటి, రెండు చోట్ల పేరుకు బీసీలకు పగ్గాలు ఇచ్చినప్పటికీ... వారిని కూడా పరిటాల కుటుంబమే ఆడిస్తోంది. ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బీకే పార్థసారథి ఉన్నప్పటికీ.. అన్ని నిర్ణయాల్లో పరిటాల సునీత నిర్ణయమే ఫైనల్ అవుతోంది. అధిష్టానం వద్ద బీకే చెల్లని కాసు కాగా..పరిటాల సునీతే హవా నడిపిస్తోంది. ఫలితంగా బీకే వెంట నడిచినా.. ఎలాంటి ప్రయోజనం ఉండబోదని చాలామంది ఆయన వర్గీయులు ఒక్కొక్కరూ దూరం అవుతున్నారు. పేరు ఈరన్న.. పెత్తనం గుండుమల.. మడకశిర నియోజకవర్గం 2008 నుంచి ఎస్సీలకు రిజర్వు అయ్యింది. అయితే నియోజకవర్గంలో ఎస్సీ లకు టికెట్ ఇచ్చినా.. అక్కడంతా బడాబాబులదే పెత్తనం నడుస్తోంది. పేరుకు ఈరన్న ఉన్నా... నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు మాత్రం వ్యాపారవేత్త గుండుమల తిప్పేస్వామికి ఇచ్చారు. దీంతో ఎస్సీ సామాజిక వర్గీయులు టీడీపీ వెంట నడిచేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈరన్నను 2019 తర్వాత నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా నియమించారు. అయితే ఆ తర్వాత గుండుమల తిప్పేస్వామి తనదైన శైలిలో అధిష్టానం వద్ద లాబీయింగ్ చేసుకుని పగ్గాలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఈరన్నను అడుగడుగునా అవమానిస్తూ వస్తున్నారు. ఏదైనా పార్టీ సభ జరిగినా ఈరన్న పేరు కూడా ప్రస్తావించడం లేదు. దీంతో ఈరన్న వర్గమంతా గుండుమల తిప్పేస్వామితో పాటు పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉంది. మైనార్టీలకు మొండిచెయ్యి.. నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా 2009లో అబ్దుల్ ఘని టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ రాజకీయ ప్రవేశం కోసం ఘనిని పక్కనబెట్టారు. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో విసుగుచెందిన ఆయన వైఎస్సార్ సీపీలో చేరారు. కదిరిలోనూ మైనార్టీ నేతలను టీడీపీ అవసరానికే వాడుకుంటోంది. వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన అత్తార్ చాంద్‌బాషాకు లేనిపోని ఆశలు పెట్టి పచ్చకండువా కప్పేసింది. ఆ తర్వాత కూరలో కరివేపాకులా తీసిపడేసింది. ఇప్పుడు అక్కడ అంతా కందికుంట రాజ్యమే నడుస్తోంది. కందికుంటకే టీడీపీ సీటు ఇస్తామని ఇటీవల కదిరిలో పర్యటించిన చంద్రబాబు చెప్పకనే చెప్పారు. పక్కనే ఉన్న అత్తార్ ఆశలన్నీ అడియాసలు కాగా, మైనార్టీలంతా తమను మోసం చేసిన బాబుకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. బీసీ కార్డుతో మోసం.. టీడీపీ బీసీల పార్టీ అని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు.. కానీ ఆ దిశగా న్యాయం చేయడం లేదని పుట్టపర్తి నియోజకవర్గంలోని చాలా మంది బీసీ నాయకులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుని.. పెత్తందార్లకే మద్దతు పలకడం చంద్రబాబు నైజమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెనుకొండలో ఏకంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని కాదని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న సవితమ్మకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ధర్మవరం, రాప్తాడులో పరిటాల కుటుంబ సభ్యులు ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ, పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఇలా ఎక్కడైనా టీడీపీలో పెత్తందార్ల పెత్తనమే సాగుతోంది. దీంతో దశాబ్దాలుగా పచ్చ నేతల పల్లకీ మోసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలంతా కండువా మార్చే పనిలో పడ్డారు. -
యువగళం ముగింపు సభలో ట్విస్ట్.. లోకేష్, బాలకృష్ణకు షాక్!
సాక్షి, విజయనగరం: టీడీపీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం ముగింపు సభ అట్టర్ ప్లాప్ అయ్యింది. యువగళాన్ని ప్రజలు పట్టించుకోకపోగా.. సభకు వెళ్లిన అరకొర మంది కూడా లోకేష్ స్పీచ్ విని భయంతో పరుగులు తీసినంత పనిచేశారు. దీంతో, ఎల్లో బ్యాచ్ తల పట్టుకునే పరిస్థితి ఎదురైంది. అయితే, నారా లోకేష్ యువగళం ముగింపు టీడీపీని నిరాశకు గురిచేసింది. ముగింపు సభ అంచనాలను అందుకోలేదు. లోకేష్ సభకు ఆరు లక్షల మంది వస్తారని టీడీపీ నేతలు ఊదరగొట్టారు. కాగా, ఉత్తరాంధ్ర నేతలు, ప్రజలు ముఖం చాటేయడంతో ఎల్లో బ్యాచ్ అంచనాలు తప్పాయి. సభకు అనుకున్న సంఖ్యలో జనం రాకపోవడంతో ఎల్లో టీమ్ ఖంగుతుంది. సరే అనుకుని వచ్చిన జనాలతో అయినా సభను నడిపిద్దామనుకుంటే నారా లోకేష్ మాట్లాడుతుండగా ఆయన స్పీచ్ భరించలేక బారికేడ్డు సైతం దూకి అక్కడి నుంచి పారిపోయారు. ఇక, నందమూరి బాలకృష్ణ మాట్లాడుతుండగా.. ఆపేయండి అంటూ మధ్యలోనే జనం కేకలు వేశారు. మరోవైపు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీచ్‌ను కూడా ప్రజలు పట్టించుకోలేదు. స్పీచ్ మధ్యలోనే సభ నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు స్పీచ్ వచ్చే సమయానికే సభలో మూడు వంతులకు పైగా ప్రాంగణం ఖాళీ అయిపోయింది. దీంతో, టీడీపీ నేతలు బిత్తర చూపులు చూడాల్సి వచ్చింది. -
వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రారంభించిన నటుడు బాలకృష్ణ
-
చంద్రబాబుకు బాలకృష్ణ, లోకేష్ రిటర్న్ గిఫ్ట్
-
టీడీపీ నాయకులకు మహిళలంటే చిన్నచూపు: MLC పోతుల సునీత
-
బాలకృష్ణ పరువుతీసిన ఎంపీ గోరంట్ల మాధవ్
-
అన్ని వర్గాలకూ అండగా నిలిచిన నాయకుడు సీఎం జగన్
-
బాలయ్య పాత సినిమాకు 109 సినిమాకు లింక్..!
-
పురందేశ్వరి నిజస్వరూపం తెలిస్తే షాక్ అవుతారు: పోసాని
-
బిగ్ బాస్ హోస్ట్ గా బాలకృష్ణ..ఇక దబిడి దిబిడే..
-
మహేష్ తో సినిమా చేస్తే పరువు తీస్తాడు..!
-
చిరంజీవి,బాలకృష్ణ కి కలిపి ఒక సాంగ్ కొడితే..!
-
అభయమిచ్చారు.. ఆదుకున్నారు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సీఎం వైఎస్ జగన్ మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. అభాగ్యులకు ఆపన్నహస్తం అందించారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా దివాన్‌చెరువు గ్రామంలో జక్కంపూడి గణేశ్ వివాహ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చి న సీఎం వైఎస్ జగన్‌కు పలువురు తమ సమస్యలు తెలియజేశారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సీఎం ఆదేశించిన మూడు గంటల్లోనే కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మొత్తం ఆరుగురు అర్జీదారులకు రూ.5.50 లక్షల ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ మాధవీలత అందించారు. ధవళేశ్వరానికి చెందిన ఆర్జీ బాలకృష్ణ డిసెంబర్లో మలేసియాలో జరిగే వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు వెళ్లేందుకు ప్రయాణఖర్చుల నిమిత్తం రూ.2.50 లక్షల చెక్కు అందజేసినట్లు తెలిపారు. అలాగే వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అన్నవరానికి చెందిన పెయ్యాల బాబురావుకు రూ.లక్ష, రాపాక వెంకట సూర్యనారాయణకు రూ.25 వేలు, వాడపల్లికి చెందిన దాకే చంద్ర ఫణికుమార్కి రూ.లక్ష, పోతవరానికి చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్‌కు రూ.25 వేలు చెక్కు అందజేశామన్నారు. తండ్రిని కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న పెనుగొండకు చెందిన కె.లక్ష్మీకుమారికి రూ.50 వేలు చెక్కు అందజేయడంతో పాటు ఉద్యోగం కోసం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు సిఫారసు చేసినట్లు తెలిపారు. పోతవరానికి చెందిన తోట ఇంద్రకుమారి ఇంటి స్థలం పట్టా కోసం సీఎంను కలిశారని.. ఈ విషయమై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. -
నా జీవితం బాలకృష్ణ గారి మాటతో మారిపోయింది..!
-
బావ చంద్రబాబు కోసం సినిమా వాయిదా వేయలేడా?
-
‘బాబు బాధలో ఉంటే బాలకృష్ణ మూవీ రిలీజ్ చేస్తారా?^
సాక్షి, మాడుగుల: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అయినా ఆ బాధ వారి కుటుంబ సభ్యుల్లో కనిపించడంలేదని అన్నారు. కాగా, బూడి ముత్యాల నాయుడు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ స్కాం కేసులో అన్ని ఆధారాలతో చంద్రబాబు దొరికిపోయారు. చంద్రబాబు అతిపెద్ద అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు జైలులో బాధలో ఉంటే బాలకృష్ణ సినిమా ఎలా రిలీజ్ చేస్తారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టే జైలు నుంచి రాజకీయాలు చేస్తున్నారు. బాబు అనారోగ్యంగా ఉంటే కేజీ బరువు ఎలా పెరుగుతారు. నారా ఫ్యామిలీ, నందమూరి కుటుంబం కలిసి ఎన్ని యాత్రలు చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏమీ చేయలేరు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చు కదా?. రూ.371 కోట్ల అవినీతిలో చంద్రబాబు అడ్డంగా దొరికొపోయారు కాబట్టే జైలు జీవితం గడుపుతున్నారు. స్కిల్ స్కాంలో బయటపడింది కేవలం గోరంత మాత్రమే. చంద్రబాబు అవినీతి పూర్తి స్థాయిలో వెలికి తీస్తే కొండంత అవినీతి బయటపడుతుంది. ఇది కూడా చదవండి: చంద్రబాబుకి బ్లాక్ ఫ్రైడే.. కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు -
బాలకృష్ణ తొడ కొట్టడం పై పేర్ని నాని సెటైర్లు
-
‘బాబు అరెస్ట్‌తో హరికృష్ణ ఆత్మకూడా శాంతిస్తోంది’
సాక్షి, తాడేపల్లి: టీడీపీకి పట్టిన శని నారా లోకేష్. చంద్రబాబు అరెస్ట్‌తో నందమూరి హరికృష్ణ ఆత్మకూడా శాంతిస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోగ్యంపై నాటకం ఆడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి అంబటి రాంబాబు గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు అరెస్ట్‌తో కలత చెంది ఎవరూ చనిపోలేదు. చంద్రబాబుకు జైలులో పటిష్ట భద్రత ఉంది. ఆధారాలతో సహా దొరికిపోయిన దొంగ చంద్రబాబు. నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ అనే పేరుతో యాత్ర చేయబోతున్నారట. నిజంగానే నిజం గెలవాలనే జనం కోరుకుంటున్నారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి నిజాలను పాతాళంలోకి తొక్కేశారు. వ్యవస్థలను మ్యానేజ్ చేసేవారు. ఇప్పుడు నిజం గెలుస్తున్నందునే చంద్రబాబు జైల్లో ఉన్నారు. నిజం గెలవాలని కోరుకునేవారు 17A పట్టుకునే ఎందుకు తిరుగుతున్నారు?. నిజాన్ని ఓడించాలనే మీ ప్రయత్నం ఓడిపోతూనే ఉంది. బాలకృష్ణ ఏమయ్యాడు?.. చంద్రబాబు మోసాలు, అన్యాయాలు చేసే మనిషి. ఆయన జైలుకు వెళ్తే గుండెలు పగిలి జనం చచ్చిపోయారని కట్టుకథలు అల్లారు. చంద్రబాబు జైలుకు వెళ్లాక ఎన్టీఆర్, హరికృష్ణ, వంగవీటి రంగా, కందుకూరు, గుంటూరు సభలో చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తున్నాయి. చంద్రబాబు జైల్లో నుండి కూడా కుట్రలు చేస్తున్నారు. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని బాలకృష్ణ అన్నారు. మరి బాలకృష్ణ కాకుండా ఇప్పుడు భువనేశ్వరి వెళ్లాలనుకోవడం ఏంటి?. ఇది ములాఖత్‌లో జరిగిన కుట్ర కాదా?. నారావారి చేతిలో నుండి పార్టీ నందమూరి వారి చేతిలోకి వెళ్తుందనే భయం కాదా?. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు చంద్రబాబు ఏసీబీ కోర్టులో చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. టీడీపీకి, నారా వారి కుటుంబానికి భవిష్యత్తు లేదు. అలాంటి వారు భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మళ్ళీ తిరుగుతారంట. క్వాష్ రాదనీ, బెయిల్ రాదనీ వారికి అర్థం అయింది. అందుకే ఆరోగ్య సమస్యలు అంటూ హడావుడి చేశారు. చంద్రబాబు ఉన్నది జ్యడీషియల్ రిమాండ్‌లో.. కోర్టు చెప్పిందే అధికారులు చేస్తారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి చెబితే అధికారులు వినరు. టీడీపీ డ్రామాలను ప్రజలు నమ్మరు.. టీడీపీకి పట్టిన శని నారా లోకేష్. ఆయన వచ్చాకే టీడీపీ భ్రష్టు పట్టింది. లాయర్ల ములాఖత్‌లు ఐదుసార్లు కావాలన్నా కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవచ్చు. కోర్టు చెప్పిందే ఫైనల్. టీడీపీ నేతలు గవర్నర్‌ను కలవటం పొలిటికల్ డ్రామా. లోకేష్ వెళ్లి అమిత్ షాని కలిస్తే కోర్టుల నిర్ణయాలు జోక్యం చేసుకుంటారా?. టీడీపీ వారు ఎన్ని డ్రామాలు చేసినా జనం నమ్మరు. అన్ని ఆధారాలతో కేసు బలంగా ఉంది. చంద్రబాబు కేసు నుండి తప్పించుకోలేరు. పవన్ కల్యాణ్‌కు కౌంటర్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆలోచన లేదు, ఆలోచనా విధానం లేదు. జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయా? లేదా? అనే డౌట్ చాలాకాలం ఉంది. తెలంగాణలో టీడీపీతో ఎందుకు కలవటం లేదు?. ఏపీలో మళ్ళీ చంద్రబాబుతో పొత్తు ఏంటి?. పవన్ రాజకీయాలకు పనికిరారు. నిజజీవితంలో చేసినట్టే ఒకరితో ఉంటూ ఇంకొకరితో పొత్తు పెట్టుకోవటం ఏంటి?. చంద్రబాబును అరెస్టు చేయటంపై అమిత్ షాతో మాట్లాడతానని చెప్పిన పవన్ ఏమయ్యారు? అంటూ ప్రశ్నలు సంధించారు. -
నా కొడుకు గురించి వేరే వాళ్ళ సలహా నాకు అక్కర్లేదు
-
జనాల ముందు ఒకలా వెనుక ఒకలా మాట్లాడటం రాదు
-
ఎక్కడికెళ్లినా మా నాన్న ప్రస్తావన ఉండాల్సిందే
-
బాలకృష్ణ,లోకేష్ పై అంబటి రాంబాబు సెటైరికల్ పంచ్ లు
-
జూనియర్ ఎన్టీఆర్ స్పందిచకపోతే ఐ డోంట్‌కేర్: బాలయ్య
హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీటీడీపీ కార్యకర్తలతో సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై సినీ రంగానికి సంబంధించిన పెద్దలెవరూ స్పందిచకపోవడంపై విలేఖరులు ప్రశ్నించగా ఎవరు స్పంధించకపోయినా తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. ఇది సినిమా రంగానికి సంబంధించిన విషయం కాదనడం కూడా తప్పే అన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ స్పంధించకపోవడంపై విలేఖరులు ప్రశ్నించగా.. ఐ డోంట్ కేర్.. బ్రో.. ఐ డోంట్‌కేర్ అంటూ తీవ్రంగా స్పందించారు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' చిత్రం ఈ నెల 19న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రానికి అనీల్ రావిపుడి దర్శకుడు. -
బాలకృష్ణ, చంద్రబాబును మించిన సైకోలెవరు బ్రాహ్మణి..?: మంత్రి రోజా
సాక్షి, చిత్తూరు జిల్లా: రాజకీయాల్లో 45 ఏళ్ల ఇండస్ట్రీ అంటూ ఊదరగొట్టుకుంటూ, పచ్చ ఛానెళ్లల్లో పబ్లిసిటీ చేసుకునే చంద్రబాబు పేదల కోసం.. ఒక్క మంచి ఆలోచన అయినా చేశాడా..? అంటూ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, అదే మా నాయకుడు జగనన్న అతిచిన్న వయసులోనే పోరాడే యోధుడిగా నిలిచి, రాష్ట్రంలో 151 స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ‘‘ఆయన అంత చిన్నవయసులోనే ప్రజలకు ఏం కావాలో.. వారికి ఏ ఇవ్వాలో ఆలోచించి వారి సంక్షేమానికి, వారి ఆరోగ్యం కోసం జగనన్న సురక్ష పేరిట ప్రతి ఇంటి గడప దగ్గరకే వైద్యాన్ని తెచ్చిన మహనీయుడిగా ప్రజల హృదయాల్లో నిలిచారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుభవం ఉన్న నేతగా చంద్రబాబుకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే.. ఆయన మాత్రం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపెడతామంటూ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ పేరుతో పెద్ద కుంభకోణానికి పాల్పడి, షెల్ కంపెనీల ద్వారా రూ.371 కోట్లు ప్రజాధనం స్వాహా చేశాడు’’ అంటూ మండిపడ్డారు. ‘‘ఆ స్కామ్‌లో అన్ని ఆధారాలతో దొంగలా దొరికి జైల్లో కూర్చొంటే, ఈరోజు ఆయన భార్య,కోడలు బ్రాహ్మణి సిగ్గులేకుండా.. ప్రజలంతా గంటకొట్టి తమకు సంఘీభావం తెలపండని కోరతారా..?. బ్రాహ్మణికి బహుశా అసలు సైకోలు ఎవరో తెలియక ట్వీట్లు పెడుతున్నారనుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో అతిపెద్ద సైకోలెవరంటే, ఒకరు మీ నాన్న బాలకృష్ణ కాగా మరొకరు మీ మామ చంద్రబాబు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘మీ నాన్న, మీ మామకు అడ్రస్ కల్పించి, సమాజంలో గౌరవాన్ని అందించిన మీ తాత ఎన్టీ రామారావు గారిపై చెప్పులేసి.. ఆయన్ను వెన్నుపోటు పొడిచి.. ఆయన పార్టీని లాక్కుని చివరికి ఆయన చావుకు కారణమైన పెద్దసైకోలెవరంటే.. అది బాలకృష్ణ, చంద్రబాబు అని చిన్నపిల్లలను అడిగినా చెబుతారు. తప్పుచేసి, సాక్ష్యాధారాలతో సహా దొరికి జైలుకి పోయిన తర్వాత కూడా చంద్రబాబు కుటుంబం ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని చూడటం చాలా సిగ్గుచేటు. మరోసారి, సీఎం జగన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడినా.. ట్వీట్లు పెట్టినా నారా బ్రాహ్మణికి మర్యాద దక్కదు. మీరు ఇలాగే నీచమైన మాటలతో ప్రజల్ని అమాయకుల్ని చేయాలనుకుంటే మిమ్మల్ని హైదరాబాద్‌కే పరిమితం చేసేలా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలు తరిమికొట్టి తగిన బుద్ధిచెబుతారు’’ అంటూ మంత్రి రోజా హెచ్చరించారు. చదవండి: మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు.. డీజీపీకి వాసిరెడ్డి పద్మ లేఖ -
ఈ పాలిటిక్స్ గేమ్ ఏంటో నాకు అర్థం కాదు అంటున్న రోజా
-
అలా చేసినందుకు వాడికి చుక్కలు చూపించాను: బాలయ్య
-
నా సినిమాలు అల ఉంటాయి కాబట్టి అందరూ చూస్తారు: బాలయ్య
-
ఆ సినిమా చేయడానికి నాన్న గారే కారణం..!
-
ఆ స్టార్ హీరోల మధ్య తేడా ఇదే అనిపించింది: నటి జయప్రద
-
మఠంపల్లి ఎస్ఐకి రూ.5వేలు జరిమానా
నల్గొండ: కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను మఠంపల్లి స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా ఉన్న ఎస్ఐ బాలకృష్ణకు రూ.5వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు జడ్జి సీవీ భాస్కర్‌రెడ్డి తీర్పు వెలువరించారు. ఈ మేరకు ఎస్ఐ సోమవారం రాష్ట్ర న్యాయ సేవా సంస్థకు రూ.5వేలు జరిమానా చెల్లించి రశీదు పొందారు. వివరాలు.. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన వల్లపుదాసు కలమ్మకు భూమిని ఆమె ఆడపడుచు యరగాని విజయలక్ష్మి, ఆమె భర్త గురువయ్య ఫోర్జరీ సంతకాలతో మ్యూటేషన్ చేయించుకుని పట్టాదారు పాసుపుస్తకం పొందారు. ఈ విషయం తెలుసుకున్న కళమ్మ మఠంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సూర్యాపేట ఎస్పీ, కోదాడ డీఎస్పీ, హుజూర్నగర్ సీఐకి రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో ఆమె హుజూర్నగర్ కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయవాది కాల్వ శ్రీనివాసరావు ద్వారా కళమ్మ ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయగా న్యాయమూర్తి ఆ కంప్లైంట్‌ను మఠంపల్లి పోలీస్ స్టేషన్‌కు పంపి కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఎస్ఐ కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై పూర్తి వాదనలు విన్న న్యాయమూర్తి సీవీ భాస్కర్‌రెడ్డి మఠంపల్లి ఎస్ఐ బాలకృష్ణను రాష్ట్ర న్యాయసేవా సంస్థకు రూ.5వేలు జరిమానా చెల్లించాలని తీర్పు వెలువరించారు. ఈ మేరకు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ పేరుతో ఎస్ఐ బాలకృష్ణ జరిమానా రూ.5వేలు చెల్లించి రశీదు పొందారు. కాగా గత నెలలోనే ఇక్కడ పనిచేసిన మరో ఎస్ఐకి హైకోర్టు రూ.2వేలు జరిమానా విధించిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు పంచులు అదుర్స్
-
బాలయ్యకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
-
బాలకృష్ణకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సూపర్ కౌంటర్
-
బాలకృష్ణ, టీడీపీ నేతలపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు
-
బాలకృష్ణ, టీడీపీ నేతల చిల్లరి వేషాలు...ఎమ్మెల్యే కిలారి కౌంటర్
-
బాలకృష్ణ విజిల్స్, అచ్చెన్నాయుడు వీడియోలకు స్ట్రాంగ్ కాంటర్ ఇచ్చిన మంత్రి చెల్లుబోయిన
-
బాలకృష్ణకు సూపర్ ఐడియా ఇచ్చిన అంబటి
-
క్వాష్ పిటిషన్ కొట్టేసిన బాలకృష్ణకు బుద్దిరాలేదు: రోజా
-
సీరియళ్లు చేసుకుంటూ సంపాదించే వాడిని... కానీ ఇప్పుడు సినిమాలు
-
బాలకృష్ణ రీల్ హీరో...సీఎం జగన్ రియల్ హీరో
-
టీడీపీ సభ్యుల వద్దకు వెళ్లిన మార్షల్స్ పై బాలకృష్ణ దురుసు ప్రవర్తన
-
ఫ్లూటు జింక ముందు ఊదు..సీఎం జగన్ ముందు కాదు..
-
చంద్రబాబు దొరికిపోయిన దొంగ: మంత్రి మెరుగు నాగార్జున
-
టీడీపీలోని ప్రతి సభ్యుడు ఓ సైకోనే..
-
సభలో విజిల్స్ వేసిన బాలకృష్ణ
-
రాష్ట్రంలో సైకో పాలన ఎప్పుడో పోయింది: మంత్రి జోగి రమేష్
-
బాలికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి
-
అసెంబ్లీ సాక్షిగా నందమూరి బాలకృష్ణ నేలబారు విన్యాసాలు
-
అసెంబ్లీ సాక్షిగా.. టీడీపీ బరితెగింపు
శాసన సభ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు గురువారం టీడీపీ ఎమ్మెల్యేలు వీరంగం సృష్టించారు. చట్ట సభ ప్రతిష్టను దిగజారుస్తూ, స్పీకర్ పట్ల అమర్యాదగా వ్యవహరించారు. ఎలాగైనా సరే సస్పెండ్ అవ్వాలన్న ఉద్దేశంతోనే సభలో అడుగుపెట్టిన వారు ఆద్యంతం వీధి రౌడీలను మరిపిస్తూ చిల్లరగా వ్యవహరించారు. పోడియంపైకి చేరుకుని అసభ్య చేష్టలు, సైగలతో రెచ్చిపోయారు. పయ్యావుల, తదితరులు సీనియర్ ఎమ్మెల్యేలు అయినప్పటికీ సభా మర్యాద పాటించలేదు. సభలో వీడియో చిత్రీకరణ నిషేధం అని తెలిసినప్పటికీ ఆ పనే చేస్తూ.. ఇలాంటి వాళ్లా మన ప్రజాప్రతినిధులు అని ప్రజలు ఛీదరించుకునేలా దిగజారి నడుచుకున్నారు. అరుపులు, కేకలు, బూతులే తమకు తెలుసన్నట్లు నిస్సిగ్గుగా ప్రవర్తించారు. సాక్షి, అమరావతి: అసెంబ్లీ వేదికగా టీడీపీ గురువారం ఇంకో మెట్టు దిగజారింది. సభలో ఏం మాట్లాడాలో తెలియక అడ్డగోలుగా వ్యవహరించింది. బూతులు మాట్లాడుతూ.. స్పీకర్‌ను అడ్డుకుంటూ.. సభా సంప్రదాయాలను మంటగలుపుతూ అధికార పక్ష సభ్యులను రెచ్చగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఉదయం 9 గంటలకు సభలో క్వశ్చన్ అవర్‌లో కల్యాణమస్తు పథకంపై ఎమ్మెల్యే వి.కళావతి అడిగిన ప్రశ్నకు మంత్రి మేరుగు నాగార్జున సమాధానం చెబుతుండగా.. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అంశంపై వాయిదా తీర్మానం కింద చర్చించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి, బాలవీరాంజనేయస్వామి, చిన్నరాజప్ప తదితరులు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంలోకి చొచ్చుకువెళ్లారు. వీరితోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి కూడా కేకలు వేస్తూ వెళ్లి వారితో కలిశారు. ఇరు వైపుల నుంచి స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టి ఆయనపై పేపర్లు విసురుతూ నినాదాలు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో చంద్రబాబు పాత్రపై టీడీపీ వాయిదా తీర్మానం కోరిందని, ఆ సభ్యులకు కావాల్సినంత సమయం ఇచ్చి చర్చిద్దామని, అంతవరకు సంయమనం పాటించాలని శాసన సభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్వీకర్ ద్వారా టీడీపీ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. సభ ప్రారంభమైనప్పటి నుంచి 28 నిమిషాలపాటు వారు నినాదాలు చేస్తూనే వికృత చేష్టలకు పాల్పడ్డారు. స్పీకర్ కుర్చీని సైతం లాగి పడేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కల్పించుకుని చంద్రబాబు అరెస్టు అంశం కోర్టు తేలుస్తుందని, ఆ విషయం అక్కడ వాదించుకోవాలని సూచించారు. సభలో టీడీపీ సభ్యులు ఇలా రెచ్చగొట్టేలా ప్రవర్తించవద్దని, సభా మర్యాదలకు భంగం కలుగుతుందని చెబుతుండగా, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పీకర్ టేబుల్‌పై ఉన్న పత్రాలను విసిరేసి, కంప్యూటర్ మానిటర్‌ను లాగిపడేశారు. మరో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గ్లాసులో నీటిని టేబుల్‌పై పోయడంతో పలు పేపర్లు తడిచిపోయాయి. అయినా స్పీకర్ తమ్మినేని సంయమనంతో వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఎథిక్స్ కమిటీతో విచారణకు సిఫారసు శాసనసభలో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఆస్తికి నష్టం చేకూరిస్తే 365 నియమావళి ప్రకారం సదరు సభ్యుల నుంచి ఆ మొత్తాన్ని రాబడతామని స్పీకర్ సీతారాం చెప్పారు. వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌లు ఫైల్ చించి వేయడం, బాటిల్‌ను పగలగొట్టడం, స్పీకర్ పోడియం వద్ద మానిటర్, వైర్లను తుంచి వేయడం గర్హనీయమన్నారు. సభా మర్యాదలను కాలరాస్తూ ప్రతిపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తన, సభాపతి స్థానాన్ని ధిక్కరిస్తూ చోటుచేసుకున్న ఘటనలను పూర్తిగా పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌లను సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. సరైన ఫార్మేట్లో వస్తే చర్చకు సిద్ధం సభలో టీడీపీ సభ్యుల వ్యవహార శైలి క్రిమినల్ చర్యల కిందకు వస్తుందని మంత్రి బుగ్గన మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యులు సరైన ఫార్మేట్లో వాయిదా తీర్మానం ఇస్తే ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ సభను అటంక పరుస్తూ ఉండటంతో తొలుత 15మంది సభ్యులను ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు పయ్యావుల కేశవ్, బెందాళం అశోక్, కింజారపు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, ఘన వెంకటరెడ్డి నాయుడు, గద్దె రామ్మోహన్రావు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయ స్వామిలతోపాటు ఉండవల్లి శ్రీదేవిని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అయితే వారు బయటకు వెళ్లకుండా నినాదాలు చేస్తూ సభకు అడ్డుతగలడంతోపాటు బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా సెల్ఫోన్లతో వీడియోలు చిత్రీకరిస్తుండగా అధికార పక్ష సభ్యులు రోజా, ఉషశ్రీ చరణ్‌లు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. తొలుత పయ్యావుల కేశవ్‌ను ఒక రోజే సస్పెండ్ చేసినా.. నిబంధనలు తుంగలో తొక్కి వీడియోలు చిత్రీకరించినందుకు ప్రస్తుత సభాకాలం మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులు ఎంతకీ సభలోనే నినాదాలు చేస్తుండటంతో వారిని బయటకు పంపించాలని స్పీకర్ మార్షల్స్‌ను ఆదేశించారు. సెల్ఫోన్లు సభ బయటే.. శాసనసభలో సభ్యులు సెల్ఫోన్ల వినియోగంపై స్పీకర్ స్పష్టమైన రూలింగ్ ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. జీరో అవర్‌లో మాట్లాడిన మంత్రి.. ప్రతిపక్ష సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్లు పట్టుకుని వీడియోలు తీయడాన్ని తప్పుపట్టారు. ‘సెల్ఫోన్లు సభలోకి తీసుకురావచ్చా? తీసుకొస్తే వీడియోలు తీయోచ్చా? స్పీకర్ రూలింగ్ ఇవ్వాలి’ అని కోరారు. రూలింగ్ ఇచ్చిన తర్వాత కూడా నియమాలను ఉల్లంఘిస్తే ఎటువంటి శిక్ష విధించాలో కూడా చెప్పాలన్నారు. లేకుంటే సభలో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో తమకు నచ్చినట్టు చిత్రీకరించుకుని సమాజాన్ని తప్పుదారి పట్టిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రూలింగ్‌పై స్పీకర్ స్పందిస్తూ ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్లు, కెమెరాలు సభలో వినియోగించకూడదని బిజినెన్స్ రూల్స్‌లో స్పష్టంగా ఉన్నాయని చదివి వినిపించారు. అయినప్పటికీ సభ్యుల సెల్ఫోన్లను సభ వెలుపలే డిపాజిట్ చేసిన తర్వాత లోనికి వచ్చేలా విధానాన్ని తీసుకొస్తామన్నారు. జీరో అవర్ అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేశారు. మీసం మెలేసి కవ్వించిన బాలకృష్ణ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతుండగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసం మెలేసి ‘చూసుకుందాం రా’ అన్నట్టు వేలు చూపిస్తూ కవ్వించారు. బాలకృష్ణ చర్యలను తప్పుబట్టిన మంత్రి రాంబాబు మీసాలు మెలేయడానికి ఇదేమి సినిమా కాదని హితవుపలికారు. ఈలోగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కొందరు కలుగజేసుకుని టీడీపీ ఎమ్మెల్యేల తీరును తప్పుపడుతూ మాట్లాడారు. ఇరుపక్షాల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం నడిచింది. గందరగోళ పరిస్థితుల మధ్య సభ అదుపు తప్పుతుండటంతో స్పీకర్ సభను కొద్ది నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి 11.05 గంటలకు సభ ప్రారంభం కాగానే.. టీడీపీ సభ్యులు మళ్లీ స్పీకర్‌ను ముట్టడించేందుకు యత్నిస్తుండగా మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. ఇక్కడా బాలకృష్ణ రెండోసారి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చూస్తూ వికృతంగా చప్పట్లు కొట్టారు. దీంతో మరోసారి రభస మొదలైంది. మంత్రి బుగ్గన మాట్లాడుతూ స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించి సభా మర్యాదలకు భంగం కలిగించిన టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోకుంటే ఇదే అలవాటైపోతుందని, వారిపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. శాసనసభలో అసభ్యకరంగా సైగలు చేస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ టీడీపీ సభ్యులు పట్టు వీడకపోవడంతో వారి నినాదాల మధ్య స్పీకర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ‘సభ అత్యంత గౌరవించే సభాపతి స్థానాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. సభాపతిని అగౌరవ పరిచేలా కాగితాలు విసిరివేశారు. ప్రజాస్వామ్యహితంగా నిరసన తెలుపకుండా సభ ఔన్నత్యాన్ని కించపరిచేలా తొడలు చరుస్తూ, మీసాలు మెలివేస్తూ వికృత చేష్టలకు ఒడిగట్టారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. వెల్‌లోకి వచ్చి మీసాలు మెలివేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ సభా సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారన్నారు. దీనిని మొదటి తప్పుగా భావిస్తున్నామని.. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఉద్దేశ పూర్వకంగానే టీడీపీ రాద్ధాంతం ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా శాసన సభ వేదికగా అవినీతికి పాల్పడి, పేద విద్యార్థులను మోసం చేసిన వ్యక్తికి వత్తాసు పలుకుతూ ప్రతిపక్ష సభ్యులు రాద్ధాంతం చేయడం సిగ్గుచేటని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మండిపడ్డారు. ఉద్దేశ పూర్వకంగా స్పీకర్ స్థానాన్ని అగౌరవ పరుస్తూ ప్రభుత్వ ఆస్తులను నాశనం చేస్తున్న సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రెజరీ బెంచ్ సభ్యులను రెచ్చగొట్టేలా ప్రతిపక్షం వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబు దోపిడీకి పూర్తి ఆధారాలున్నందునే జైలుకు వెళ్లగా, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీడీపీ సభ్యులు సభాకాలాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. -
బాలకృష్ణకు పోతుల సునీత కొట్టినట్టు కౌంటర్ ఇచ్చింది
-
గజదొంగ కోసం బాలకృష్ణ ఓవరాక్షన్ చేస్తున్నారు: మంత్రి రోజా