సాక్షి,విజయవాడ: ఏపీలో ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబు రియాలిటీ షోల్లో మునిగిపోయారు. ఓ వైపు రాష్ట్రంలో ఆడబిడ్డలపై హత్యాచారాలు జరుగుతుంటే.. ఇటు విజయనగరం జిల్లా గుర్లలో అతిసారా వ్యాధితో 11మంది మరణిస్తే ఇవేమీ పట్టకుండా బావ బాలకృష్ణతో చంద్రబాబు అన్‌స్టాపబుల్ షోకు వెళ్లడం వివాదాస్పదంగా మారింది.
వీకెండ్ విహారంలో భాగంగా రియాలిటీ షో అన్‌స్టాపబుల్‌కి హాజరయ్యారు చంద్రబాబు. రాష్ట్రంలో ఆడపిల్లలపై ఆఘాయిత్యాలు జరుగుతుంటే రియాలిటీషోలు చేసుకుంటున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు.
విజయ నగరం జిల్లా గుర్లలో అతిసారతో 11మంది ప్రాణాలు పోయినా పట్టించుకోని చంద్రబాబు అన్‌స్టాపబుల్ షోనే ప్రధానంగా భావించారా? అనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇంతమంది చనిపోతే ఒక్క సమీక్ష చేయలేదు చంద్రబాబు. శనివారం వీకెండ్ విశ్రాంతి కోసం చంద్రబాబు హైదరాబాద్‌కు వెళ్లారు. ఇవాళ అన్ స్టాపబుల్ షోలో బిజీగా గడిపారు.
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో అఘాయిత్యం జరిగితే ఇప్పటి వరకు బాధితుల్ని పరామర్శించడానికి ఎమ్మెల్యే బాలకృష్ణ వెళ్లలేదు. దీంతో వియ్యింకులు వినోదపు షోలపై రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment