Reality show
-
ఇస్మార్ట్ జోడీ 3కి రంగం సిద్ధం: ఎవరెవరు పాల్గొంటున్నారంటే?
ప్రేమ అంటే ఓ మ్యాజిక్. ఆ మ్యాజిక్‌తో స్టార్ మా "ఇస్మార్ట్ జోడి సీజన్ 3"ని ప్రారంభిస్తోంది. గత రెండు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యాంకర్ ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ షోలో సెలబ్రిటీ జంటల మధ్య అనుబంధానికి, అన్యోన్యతకు, అనురాగానికి కావాల్సినంత వినోదాన్ని జోడించనున్నారు.ఈ షోలో ప్రదీప్- సరస్వతి, అనిల్ జీలా- ఆమని, అలీ రెజా- మసుమా, రాకేష్- సుజాత, వరుణ్- సౌజన్య, యష్- సోనియా, మంజునాథ- లాస్య, ఆదిరెడ్డి- కవిత, అమర్ దీప్- తేజు జంటలు పాల్గొంటున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్నవారు, కొంత జీవితం చూసినవారు, సలహాలు సూచనలు ఇచ్చే స్థాయి అందుకున్నవారు అంద ఉన్నారు.ఈ షో వినోదంతో అలరించడమే కాదు, ఆలోచింపచేస్తుంది. జంటలు మరింత ప్రేమగా ఉండేందుకు పరోక్షంగా సలహాలిస్తుంది. బంధం బలంగా ఉండడానికి ఏం చేయాలో సూచనలిస్తుంది. స్టార్ మా లో ఈ శనివారం(డిసెంబర్ 21) రాత్రి 9 గంటలకు ఇస్మార్ట్ జోడి సీజన్ 3 ప్రారంభం కానుంది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. -
కష్టాల్లో ఏపీ ప్రజలు.. వినోదాల్లో మునిగి తేలుతున్న చంద్రబాబు
సాక్షి,విజయవాడ: ఏపీలో ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబు రియాలిటీ షోల్లో మునిగిపోయారు. ఓ వైపు రాష్ట్రంలో ఆడబిడ్డలపై హత్యాచారాలు జరుగుతుంటే.. ఇటు విజయనగరం జిల్లా గుర్లలో అతిసారా వ్యాధితో 11మంది మరణిస్తే ఇవేమీ పట్టకుండా బావ బాలకృష్ణతో చంద్రబాబు అన్‌స్టాపబుల్ షోకు వెళ్లడం వివాదాస్పదంగా మారింది. వీకెండ్ విహారంలో భాగంగా రియాలిటీ షో అన్‌స్టాపబుల్‌కి హాజరయ్యారు చంద్రబాబు. రాష్ట్రంలో ఆడపిల్లలపై ఆఘాయిత్యాలు జరుగుతుంటే రియాలిటీషోలు చేసుకుంటున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు.విజయ నగరం జిల్లా గుర్లలో అతిసారతో 11మంది ప్రాణాలు పోయినా పట్టించుకోని చంద్రబాబు అన్‌స్టాపబుల్ షోనే ప్రధానంగా భావించారా? అనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇంతమంది చనిపోతే ఒక్క సమీక్ష చేయలేదు చంద్రబాబు. శనివారం వీకెండ్ విశ్రాంతి కోసం చంద్రబాబు హైదరాబాద్‌కు వెళ్లారు. ఇవాళ అన్ స్టాపబుల్ షోలో బిజీగా గడిపారు.హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో అఘాయిత్యం జరిగితే ఇప్పటి వరకు బాధితుల్ని పరామర్శించడానికి ఎమ్మెల్యే బాలకృష్ణ వెళ్లలేదు. దీంతో వియ్యింకులు వినోదపు షోలపై రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
టాలీవుడ్ రియాలిటీ షో.. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-3 వచ్చేసింది!
టాలీవుడ్ సినీ ప్రియులను అలరించేందుకు మరో రియాలిటీ షో వచ్చేసింది. యువ సింగర్స్ టాలెంట్‌ను వెలికితీసేందుకు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్- 3 సిద్ధమైంది. ఈ రోజు నుంచే షో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా అధికారికంగా వెల్లడించింది. ఈ షో కోసం చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి రెండు సీజన్లు సక్సెస్ కావడంతో ఈ సీజన్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్- 3 షో ఇక నుంచి ప్రతి శుక్ర, శనివారాల్లో సాయంత్రం 7 గంటల నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. గతవారమే లాంచ్ ప్రోమోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి జడ్జిలుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్స్ కార్తీక్, గీతా మాధురి, శ్రీరామచంద్ర వ్యవహరిస్తున్నారు. కాగా.. ఈ షో మొత్తం 33 దేశాలలో ఆడిషన్స్ నిర్వహించారు. స్వర సంగీత సమరం!🎶సరిగమ రాగల సంబరం!!🎙️తెలుగు ఇండియన్ ఐడల్- 3 ఆగమనం!!!🥳Global star ni chese star meere...ika chuseyandi ..👉▶️https://t.co/QVPfxrk2AG🎤🎶 Watch India's biggest singing song #TeluguIndianIdolS3 streaming now only on @ahavideoin, every Friday and Saturday at 7… pic.twitter.com/ZeOYSI28yf— ahavideoin (@ahavideoIN) June 14, 2024 -
‘మీ అమ్మకు అలా మెసేజ్ చేస్తే ఓకేనా?’.. నెటిజన్‌పై శ్వేతవర్మ ఫైర్
బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా చాలా మంది ఫేమస్ అయ్యారు. వారిలో శ్వేతవర్మ కూడా ఒకరు. గతంలో పలు సినిమాల్లో నటించినా.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొన్న తర్వాత బుల్లితెర ప్రేక్షకులతో పాటు తెలుగు సినీ ప్రియులందరికి దగ్గరైంది. ఆ షో తర్వాత సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. పలు చిన్న సినిమాల్లో హీరోయిన్‌గాను నటించింది. అయితే అవకాశాలు రాలేకనో లేదా పాత్రలు నచ్చకపోవడంతో తెలియదు కానీ కొన్నాళ్లుగా శ్వేత వర్మ సినిమాలకు దూరంగా ఉంటుంది. సోషల్ మీడియా ద్వార మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. తన పర్సనల్ విషయాలను సైతం ఫ్యాన్స్‌తో షేర్ చేసుకునే శ్వేతకు సోషల్ మీడియాలో ఛేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఆమెకు అసభ్యకర సందేశాలను పంపిస్తూ వేధిస్తున్నాడు. ఆమె ఫ్రైవేట్ భాగాలపై నీచంగా కామెంట్ చేశాడు. తాజాగా సదరు వ్యక్తి పంపిన సందేశాలతో పాటు అతని ప్రొఫైల్‌ని స్క్రీన్ షాట్స్ తీసి ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది.‘ఒక మనిషికి ఇలాంటి మాట్లాడాలని ఎలా అనిపిస్తుంది? అతని అమ్మకు కూడా ఎవరైనా ఇలా చెబితే ఊరుకుంటాడా? ఇప్పటికీ ఇలాంటి వాళ్లు ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను’అంటూ శ్వేత రాసుకొచ్చింది. అలాగే అతని అడ్రస్, కాంటాక్ట్ కూడా సంపాదించానని, ఆ వివరాలు కూడా ఇన్‌స్టాలో పెట్టొచ్చు..కానీ మనిషిని కాబట్టి షేర్ చేయలేకపోతున్నానని చెప్పింది. ఇది అతనికొక గుణపాఠమని, ఇకనైనా ఇలాంటి పనులు చేయకుండా ఉంటే మంచిదంటూ శ్వేత ఓ వీడియోని షేర్ చేసింది.శ్వేత వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Swetaa Varma (@swetaavarma) -
సరికొత్త టాక్ షోకు హోస్ట్‌గా టాలీవుడ్ హీరో.. ఏ ఓటీటీలో తెలుసా!
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గురించి పరిచయం అక్కర్లేదు. గతేడాది బాబాయ్ వెంకటేశ్‌తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్‌లో నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాగా.. ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం రానా రజినీకాంత్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అంతే కాకుండా రానా ప్రధానపాత్రలో హిరణ్య కశ్యప అనే మూవీని కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. రానా సరికొత్త టాక్ షోతో ప్రేక్షకులను అలరించనున్నారు. సెలెబ్రిటీలతో రానా ఈ టాక్ షో చేయనున్నారని అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్వహించిన ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. తన ప్రొడక్షన్ హౌస్ స్పిరిట్ మీడియాలో ఈ షోను ప్రొడ్యూస్ చేయనున్నారు. అయితే ఈ టాక్ షో ఎప్పటి నుంచి మొదలవుతుందని మాత్రం రివీల్ చేయలేదు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. గతంలో నంబర్ వన్ యారీ టాక్ షో టాలీవుడ్ హీరో రానా గతంలో నంబర్ 1 యారీ పేరుతో ఓ టాక్ షో హోస్ట్ చేశారు. తెలుగు ఇండస్ట్రీ సెలెబ్రిటీలతో ఈ టాక్ షో నిర్వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రానున్న టాక్ షో ది రానా కనెక్షన్ అనే పేరును ఖరారు చేశారు. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు వివిధ ఇండస్ట్రీలకు చెందిన సెలెబ్రిటీలు ఈ టాక్ షోకు ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. An exciting and curiosity-piquing talk show hosted by celebrated actor Rana Daggubati, featuring his friends and contemporaries from Indian cinema. #TheRanaConnectionOnPrime #AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/Gg7fcqqeNi — prime video IN (@PrimeVideoIN) March 19, 2024 -
KBC 15: ముగిసిన కేబీసీ 15వ సీజన్.. అమితాబ్ ఎమోషనల్
కొన్ని రియాల్టీ షోల ద్వారా హోస్టింగ్ చేసిన సెలెబ్రిటీలకు పేరొస్తుంది. మరికొన్ని రియాల్టీ షోలకు మాత్రం హోస్టింగ్ చేసిన సెలెబ్రిటీ ద్వారానే మంచి గుర్తింపు వస్తుంది. అలాంటి రియాల్టీ షోలలో`కౌన్ బనేగా కరోడ్‌పతి` ఒకటి. ఈ షో పేరు చెప్పగానే అందిరికి గుర్తొచ్చే పేరు అమితాబ్ బచ్చన్. ఈ షో సక్సెస్‌లో అబితాబ్ కీలక పాత్ర పోషించాడు. ఇది కేవలం జ్ఞానాన్ని మాత్రమే అందించి షో కాదు.. ఎన్నో అనుభూతులను కూడా పంచుతుంటుంది. హాట్సీట్లో కూర్చొని అబితాబ్ చెప్పే విషయాలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. ఇప్పటి వరకు 14 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 15వ సీజన్‌ని కూడా పూర్తి చేసుకుంది. డిసెంబర్ 29న చివరి ఎపిసోడ్ ప్రసారమవ్వగా.. షోకి వచ్చిన ప్రేక్షకులతో పాటు అబితాబ్ కూడా ఎమోషనల్ అయ్యారు. (చదవండి: Year End 2023: హిట్లు తక్కువ..ఫ్లాపులెక్కువ) `లేడీస్ అండ్ జెంటిల్మెన్.. మేం వీడ్కోలు పలుకుతున్నాం. ఈ వేదిక రేపట్నుంచి కనిపించదు. రేపట్నుంచి మేం ఇక్కడకు రావడం లేదు అని చెప్పాలనిపించడం లేదు. నేను, అమితాబ్ బచ్చన్, ఈ సీజన్లో చివరి సారిగా నేను చెప్పేది ఒక్కటే.. గుడ్ నైట్.. గుడ్ నైట్’ అంటూ అమితాబ్ భావోద్వేగానికి గురయ్యారు. (చదవండి: Rewind 2023: బడ్జెట్‌తో పనిలేని బంపర్ హిట్స్) అమితాబ్‌తో పాటు షోకి వెళ్లిన ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. ‘మేం దేవుడిని చూడలేదు కానీ ఆ దేవుడికి అత్యంత ఇష్టమైన వ్యక్తిని చూస్తున్నాం’అంటూ ఓ ప్రేక్షకురాలు చెప్పడంతో వేదిక అంతా చప్పట్లతో మారుమ్రోగింది. కాగా, చివరి ఎపిసోడ్‌కి విద్యాబాలన్, షీలా దేవి, షర్మిలా ఠాగూర్, సారా అలీఖాన్ విచ్చేసి సందడి చేశారు. ఇదే చివరి ఎపిసోడ్. ఇకపై ఇక్కడకు రాలేము అనే మాటలు చెబుతున్నందుకు బాధగా ఉంది. ఇలాంటి రోజు వస్తుందని ముందే తెలుసు. నా ప్రేక్షకులతో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే ఇది ఇక్కడితో ఆగిపోకూడదని కోరుకుంటున్నాను’అని అమితాబ్ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
సూపర్ సింగర్.. ఆరోజే ప్రారంభం!
మధురమైన గాత్రాలను వెలికి తీసుకువచ్చే ప్రయత్నమే సింగింగ్ షో. ఇలాంటి సింగింగ్ షోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలను పరిచయం చేసిన "సూపర్ సింగర్" ఇప్పుడు స్టార్ మాలో మరింత వినూత్నంగా మళ్ళీ ప్రారంభం కాబోతోంది. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్‌లతో సర్వం సిద్ధం చేసుకుంది. షో కోసం ఆడిషన్స్ నిర్వహించి.. వాటి నుంచి వడపోసిన స్వరాలు ప్రేక్షకులు ఆస్వాదించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా, కేరళ నుంచి వచ్చి పాటల మీద, సంగీతం మీద ఆసక్తితో, తమను తాము నిరూపించుకోవాలన్న ఆకాంక్షతో కంటెస్టెంట్స్ పాల్గొనేందుకు రావడం ఈ షో ప్రత్యేకత. ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా నలుగురు ప్రతిభావంతులు న్యాయమూర్తులుగా కంటెస్టెంట్స్‌ని తీర్చిదిద్దడంతో పాటు పోటీని మరింత రసవత్తరంగా నడిపించబోతున్నారు. ఇంతకీ ఆ నలుగురు మరెవరో కాదు.. గాయని శ్వేతా మోహన్, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, గేయ రచయిత అనంత శ్రీరామ్. వీరే ఈ సారి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. 20 మంది కంటెస్టెంట్లతో ప్రారంభం కాబోతున్న ఈ షోలో 16 మందితో అసలైన పోటీ మొదలవుతుంది. ఈ నెల 23 నుంచి.. ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు "సూపర్ సింగర్" సంగీతాభిమానుల్నే కాదు.. ప్రతి “స్టార్ మా” ప్రేక్షకుల్ని అలరించనుంది. షో నిర్వహణలో ఈ సారి స్టార్ మా ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. కంటెస్టెంట్స్, వాళ్ళని తీర్చిదిద్దే జడ్జెస్, మార్కులు.. ఇవి మాత్రమే కాకుండా షో ని ఇంకా ఆసక్తిగా మలచబోతున్న ఆ విషయం ఏంటో తెలుసుకోవాలంటే 'స్టార్ మా'లో సూపర్ సింగర్ చూడాల్సిందే. చదవండి: నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత!: రైతుబిడ్డ -
బిగ్‌బాస్ షో.. ఈ వారం స్పెషల్ కంటెస్టెంట్ ఎలిమినేట్!
బిగ్ బాస్ రియాలిటీ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. బుల్లితెరపై ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తోంది. దక్షిణాదిలో ప్రస్తుతం బిగ్‌బాస్ హవా నడుస్తోంది. ఈ ఏడాది కన్నడలో సీజన్- 10 నడుస్తోంది. ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షోలో.. ఈ వారంలో ట్రాన్స్‌జెండర్ మహిళ నీతూ వనజాక్షి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. దాదాపు 50 రోజులపాటు హౌస్‌లో ఉన్న నీతూ ఏడోవారంలో బయటకొచ్చేసింది. అయితే ఈ వారంలో ఆమెనే హౌస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. ఎలిమినేషన్ తర్వాత ప్రత్యేక ఇంటర్వ్యూలో నీతూ తన అభిప్రాయాలను వెల్లడించింది. బిగ్‌బాస్ హోస్లో 50 రోజులు పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. కంటెస్టెంట్‌గా నేను ఎక్కువ రోజులు ఉన్నందుకు గర్వపడుతున్నా. ఎన్నో అనుభవాలతో ఇంటికి వెళ్తున్నా. ఈ అనుభవాలతో మరింత ముందుకు సాగుతా. మీరు బయటకు వస్తారని నేను ఊహించా. గత రెండు వారాలుగా నా పనితీరు చాలా తక్కువగా ఉంది. కానీ కెప్టెన్సీ టాస్క్‌లో బాగా ఆడాను. కానీ దురదృష్టం నన్ను వెంటాడింది. హౌస్‌లో ఉన్న ప్రతాప్, తుకలి సంతోష్, సంగీత, కార్తీక్, తనీషా ఈసారి బిగ్ బాస్ టాప్ ఫైవ్‌లో ఉంటారు. ఈ సీజన్ విన్నర్‌గా ప్రతాప్ నిలుస్తాడంటూ నీతూ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. బిగ్‌బాస్ అవకాశంపై మాట్లాడుతూ.. 'నాకు ప్రేమ కావాలి కానీ.. సానుభూతి అవసరం లేదు. బిగ్‌బాస్‌లోకి రావడం మంచి అవకాశం. ఇంట్లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. ఈ ఈ జ్ఞాపకాలను నా జీవితాంతం గుర్తుంచుకుంటా. అలాగే ట్రాన్స్జెండర్ల జీవితం గురించి చాలా మందికి తెలియదు. మేం ఏమి కోరుకుంటున్నామో, సమాజం నుంచి ఏమి ఆశిస్తున్నామో కూడా తెలియదు. చివరికి మాకు కావలసింది ప్రేమ మాత్రమే. మాకు ఎవరీ జాలీ, దయ అక్కర్లేదు. ప్రేమను పంచితే చాలు. అది నాకు బిగ్ బాస్ హౌస్ ఇచ్చింది.' అని అన్నారు. -
కోటి రూపాయలు గెలిచింది.. కానీ బ్యాంక్ అకౌంట్ కూడా లేదు!
బాలీవుడ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో ఈ షో విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా ఆగస్టు 14న కౌన్ బనేగా కరోడ్‌పతి 15వ సీజన్ ప్రారంభమైంది. ఈ సారి కూడా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఎంతోమంది ఈ షోలో పాల్గొని చివరిదాకా నిలిచి కోటీశ్వరులైన వారు కూడా ఉన్నారు. అయితే ఈ షోలో మొదట కోటీ రూపాయలు గెలుచుకున్న మహిళ ఎవరో తెలుసా? ఆమె గురించి వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది కూడా. ఇంతకీ ఆమె ఎవరు? అసలు ఆమె ఇప్పుడు ఏం చేస్తోంది? ఆమె గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలేంటి? అన్న సందేహం వస్తోంది కదా. అయితే అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: 30 ఏళ్లుగా చిరంజీవికి డూప్‌గా నటించిన ఈ వ్యక్తి గురించి తెలుసా?) రియాలిటీ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రస్తుతం 15వ సీజన్ ప్రారంభమైంది. అయితే ఈ షో ప్రారంభమైన తర్వాత తొలిసారిగా మహిళ కంటెస్టెంట్ కోటి రూపాయలు గెలిచింది. 2010లో కేబీసీ -4 సీజన్లో అమితబ్‌ను మెప్పించిన మహిళ రహత్ తస్లీమ్ రూ.కోటి రూపాయలు ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది. జార్ఖండ్‌లోని గిరిదిహ్‌కు చెందిన 37 ఏళ్ల రహత్ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. రాహత్ పాల్గొన్న సమయంలో రూ. 3.20 లక్షల ప్రశ్న నుంచి రూ. 50 లక్షల ప్రశ్న వరకు ఎలాంటి లైఫ్ లైన్లు వినియోగించుకోలేదు. ఆ తర్వాత నీపై ఇంత నమ్మకం ఎక్కడి నుంచి వచ్చిందని బిగ్ బి ప్రశ్నించగా.. అది నా ఆత్మవిశ్వాసం నుంచే పుట్టింది.. నాకు అన్నీ తెలుసు.. అని సమాధానిచ్చినట్లు రాహత్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే కేబీసీలో పాల్గొనేందుకు మేసేజ్ చేయడానికి తన మొబైల్ ఫోన్లో కేవలం రూ. 3 మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలిపింది. ఆ డబ్బులతోనే మేసేజ్ పంపినట్లు పేర్కొంది. ఆ తర్వాత తాను ఎంపికవ్వడంతో ముంబయిలో ఆడిషన్ కోసం పిలిచారని వెల్లడించింది. అయితే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ అందరికీ బ్యాంక్ ఖాతా, పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారని వివరించింది. (ఇది చదవండి: రీఎంట్రీలో చిరంజీవి ఆ తప్పులు చేస్తున్నారా?) అయితే ఆడిషన్స్ ముగిశాక.. ఇంటికి తిరిగి వెళ్లిన వెంటనే నేను చేసిన మొదటి పని బ్యాంక్ ఖాతా తెరిచి పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడమే అని ఆ రోజులను రాహత్ గుర్తుచేసుకుంది. కాగా.. ప్రస్తుతం రాహత్ ఇప్పుడు గిరిదిహ్‌లోని పెద్ద మాల్లో దుస్తుల షోరూమ్ నిర్వహిస్తోంది. అయితే కోటి రూపాయలు గెలుచుకున్న ఆమె.. బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ లేని స్థితి నుంచి ఏకంగా బిజినెస్ చేసే స్థాయికి చేరుకోవడమంటే గొప్ప విషయమే. కౌన్ బనేగా కరోడ్‌పతి వల్ల ఓ సామాన్యురాలు సైతం బిజినెస్ వుమెన్‌గా అవతరించింది. -
బిగ్ బాస్ షో.. టీవీ ప్రసారాలకు సెన్సార్ లేకపోతే ఎలా?: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: టీవీల్లో అసభ్య, అభ్యతరకర రీతిలో రియాల్టీ షోలు, ఇతర కార్యక్రమాల ప్రసారానికి ముందు సెన్సార్ చేయకపోతే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని, కేంద్రానికి తగిన సచనలు చేసే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. టీవీ కార్యక్రమాల పర్యవేక్షణకు ఓ యంత్రాంగం లేకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. యువతను పెడదోవ పట్టిస్తున్న బిగ్‌బాస్ షో నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుత సామాజిక కార్యకర్త, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, స్టార్ వ టీవీ ప్రైవేట్ లిమిటెడ్, ఎండేమోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బిగ్‌బాస్ షో వ్యాఖ్యాత అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ చేసింది. స్టార్ మా టీవీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, బిగ్‌బాస్ షోను అభివృద్ధి చేసిన ఎండేమోల్ ఇండియా లిమిటెడ్ తరఫున సీనియర్ న్యాయవాది చిత్తరవు రఘు, పిటిషనర్ తరఫున గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు. చదవండి: ఇదేమి యాత్ర నాయనా..! -
చిన్నపిల్లలకు అసభ్యకర ప్రశ్నలు.. మండిపడుతున్న నెటిజన్స్!
సోని పిక్చర్స్ నెట్‌వర్క్‌లో ప్రసారమవుతున్న రియాలిటీ షో సూపర్ డ్యాన్సర్ చాప్టర్ -3. ఈ షో చిన్నపిల్లలు, వారి తల్లిదండ్రులను చిలిపి ప్రశ్నలు వేస్తూ ఆడియన్స్‌ను నవిస్తుంటారు. ఈ షోకు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, కొరియోగ్రాఫర్ గీతా కపూర్, చిత్రనిర్మాత అనురాగ్ బసు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఉన్నారు. అయితే ఈ డ్యాన్స్ కాస్తా అసభ్యకరమైన చర్చలకు దారితీసింది. ఈ షోలో పాల్గొన్న చిన్నారులను అతని తల్లిదండ్రులను ఉద్దేశించి అసభ్యకరమైన, లైంగిక ప్రశ్నలు వేస్తూ జడ్జిలు నవ్వుకుంటున్నారని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (ఇది చదవండి: కమెడియన్‌తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!) దీనికి సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. యూట్యూబ్‌లో అన్ని వయసుల వారికి వీడియో అందుబాటులో ఉందని నెటిజన్స్ ఫైరవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ జడ్జిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'చిన్న పిల్లలను ఇలాంటి ప్రశ్నలా అడిగేది.. మీకు అసలు కొంచెమైన సిగ్గుందా' అంటూ మండిపడుతున్నారు. మరో నెటిజన్ రాస్తూ..'ఇది చాలా అసహ్యంగా ఉంది. అస్సలు ఇది వినోదం కాదు. పిల్లలతో ఇలాంటివీ చెప్పిస్తారా?' ఫైరయ్యారు. కాగా.. జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టంలోని నిబంధనలను ఛానెల్ ఉల్లంఘించిందని ఎన్సీపీసీఆర్ పేర్కొంది. చైల్డ్ ఆర్టిస్ట్‌కు ఇలాంటి అనుచిత ప్రశ్నలు ఎందుకు అడిగారో వివరణ ఇవ్వాలని కూడా కమిషన్ కోరింది. లేఖ అందిన 7 రోజులలోపు కమిషన్‌కు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR) సమర్పించాలని లేఖలో ఎన్సీపీసీఆర్ చైర్పర్సన్ ఆదేశించారు. కాగా.. ఈ రియాలిటీ షో ఏప్రిల్ 2019 నుండి జూన్ 2019 వరకు ప్రసారం చేయబడింది. (ఇది చదవండి: ఆష్విట్జ్ సీన్ వివాదం.. నెటిజన్స్‌కు జాన్వీ స్ట్రాంగ్ కౌంటర్!) Child is made to deliver vulgar remarks on parents on stage in a kid show Everyone laughs and the episode is available for all ages on YouTube!#BollywoodKiGandagi are not role models. They are biggest enemies of Vishwaguru vision. Destroyer of our kidspic.twitter.com/49K7RzSWzr — Gems of Bollywood बॉलीवुड के रत्न (@GemsOfBollywood) July 24, 2023 What a shameful thing to do! Papa is shocked & embarrassed at this, but even he did not dare open his mouth. Only glamour rules the idiot box. https://t.co/30nr83q6Ye — Achhabachha🇮🇳 (@Lovepettyquotes) July 24, 2023 -
'ఆహా'లో మరో రియాలిటీ షో.. ఈసారి మహిళల కోసం
ఓటీటీల్లో ఆహా ఇప్పటికే దూసుకెళ్తోంది. అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇప్పుడు స్త్రీ సాధికారతకు పెద్దపీట వేస్తూ మహిళలను వ్యాపార రంగంలోనూ దూసుకెళ్లేలా చేయటానికి బిజినెస్ రియాలిటీ షోని ప్రారంభించింది. అదే 'నేను సూపర్ ఉమెన్'. కొత్త పరిశ్రమలను స్థాపించేలా మహిళలని ప్రేరేపించడమే ఈ షో ప్రధాన లక్ష్యం. దీని కారణంగా పారిశ్రామిక రంగంలో మహిళల ప్రాధాన్యత పెరగడంతో పాటు వారిలో ఆర్థిక స్వాతంత్య్ర భావన పెంపొందుతుంది. (ఇదీ చదవండి: జెట్ స్పీడ్‌లో శ్రీలీల కెరీర్.. ఆ అంశాలే కలిసొచ్చాయా?) 'నేను సూపర్ ఉమెన్' ప్రోగ్రామ్ వినూత్న మార్గాలను చూపిస్తూ, మహిళలకు మార్గదర్శకం చేస్తూ వారికి ప్రత్యక్ష అనుభవం ఏర్పడేలా ఉపయోగపడుతుంది. 'తెలుగు ఇండియన్ ఐడల్'కి హోస్ట్ గా చేసి ఆకట్టుకున్న శ్రీరామ్ చంద్ర.. ఈ షోకి కూడా హోస్టింగ్ చేయబోతున్నాడు. ఈ కార్యక్రమంలో ఏంజెల్స్ అనే ప్యానెల్ ఉంటుంది. ఇందులో పాల్గొనే ఔత్సాహిక మహిళా వ్యాపారులు వారి ఆలోచనలను ఈ ఏంజెల్స్ తో పంచుకోవచ్చు. 40 మంది అసాధారణ అభ్యర్థులు ఈ 'సూపర్ ఉమెన్'కు ఎంపికయ్యారు. వీరందరూ ఏంజెల్స్ ప్యానెల్ సమక్షంలో తమ ఆలోచనలను ముఖాముఖిగా బయటపెడతారు. ప్రతి ఆలోచన చాలా జాగ్రత్తగా మూల్యాంకనం చేయబడుతుంది. తుది ప్రదర్శన తర్వాత ప్యానెల్ ఆఫర్స్‌ను పొడిగిస్తుంది. ఏంజెల్స్ ప్యానెల్ లో రోహిత్ చెన్నమనేని (డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు), శ్రీధర్ గాది (క్వాంటెలా ఇన్క్ యొక్క వ్యవస్థాపకుడు మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్), రేణుకా బొడ్లా (సిల్వర్ నీడెల్ వెంచర్స్ భాగస్వామి), సుధాకర్ రెడ్డి (అభి బస్ వ్యవస్థాపకుడు, సీఇఓ), దొడ్ల దీపా రెడ్డి (దొడ్ల డెయిరీ), సింధూర పొంగూరు (నారాయణ గ్రూప్) ఉన్నారు. వీళ్లంతా మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించటానికి సిద్ధంగా ఉన్నారు. Introducing the awe-inspiring 'Angels' of #NenuSuperWoman! 👼🏼💼 They go beyond just empowering women entrepreneurs with valuable business insights. These incredible Angels actually invest in their ambitions and nurture them to soar to new heights of success! 🚀 Get ready for a… pic.twitter.com/WE5k7Wgdnz — ahavideoin (@ahavideoIN) June 27, 2023 (ఇదీ చదవండి: ఒక్కో పాట కోసం రూ.3 కోట్లు.. ఆ సింగర్ ఎవరో తెలుసా?) -
డబ్బు కోసం ఆ పని చేశా.. సీక్రెట్‌గా ఉంచాల్సిన వీడియో లీక్..
బిగ్‌బాస్, స్ప్లిట్స్‌విల్లా, ఎంటీవీ రోడీస్, ఇన్ రియల్ లవ్, లాకప్.. ఇలాంటి రియాలిటీ షోలకు కొదవే లేదు. ఇక్కడ సెలబ్రిటీలు ఎలా ఉంటారు? వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? అన్నది చూపించడంమే రియాలిటీ షోలో కామన్ పాయింట్‌గా ఉంటుంది. ఈ క్రమంలో వారి వ్యక్తిగత విషయాలను కూడా బయటపెడుతుంటారు తారలు. తాజాగా ఎంటీవీ రోడీస్ కొత్త సీజన్ శనివారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. స్ప్లిట్స్‌విల్లా కంటెస్టెంట్ భూమిక వశిష్ట్ ఈ షోలో ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా తను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వెల్లడించింది నటి. వీడియో లీక్.. డిప్రెషన్ 'డ్యాన్స్ రియాలిటీ షో తర్వాత నేను సెలబ్రిటీలాగే ఉండిపోవాలనుకున్నాను. కానీ సెలబ్రిటీ లైఫ్ అనేది డబ్బుతో కూడుకున్న పని. ఫేమ్, గ్లామర్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకని నా లైఫ్‌స్టైల్ కోసం అప్పు తీసుకున్నాను. ఆ అప్పు తీర్చేందుకు దుస్తులు విప్పుతున్న వీడియోను ఒక యాప్‌లో అప్లోడ్ చేశాను. సీక్రెట్‌గా ఉంచాల్సిన ఆ వీడియోను ఎవరో ఆన్లైన్లో లీక్ చేశారు. దీంతో నాపై చాలా విమర్శలు వచ్చాయి. డిప్రెషన్‌కు వెళ్లిపోయాను' అని చెప్తూ భావోద్వేగానికి లోనైంది భూమిక. ఆమె మాటలు విన్న గ్యాంగ్ లీడర్స్(జడ్జిలు) రియా చక్రవర్తి, ప్రిన్స్ నరూలా.. భూమికను ఓదార్చారు. రియా ఆమెను వెళ్లి హత్తుకోగా.. నరూలా.. దాని గురించి పట్టించుకోవాల్సిన పనే లేదని, ధైర్యంగా ఉండమని చెప్పాడు. హోస్ట్‌గా సోనూసూద్ కాగా ప్రస్తుతం సోనూసూద్ ఎంటీవీ రోడీస్ షో వ్యాఖ్యాతగా పని చేస్తున్నాడు. ఈ షోలో ప్రిన్స్ నరూలా, రియా చక్రవర్తి, గౌతమ్ గులటి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ, పుణె, ఇండోర్ నగరాల్లో ఆడిషన్ నిర్వహించగా ఇందులో కొంతమంది యంగ్‌స్టర్స్‌ను సెలక్ట్ చేసుకుని షోలో ప్రవేశపెట్టారు. View this post on Instagram A post shared by MTV Roadies (@mtvroadies) View this post on Instagram A post shared by MTV Roadies (@mtvroadies) చదవండి: నా మాజీ భర్త ఎంతోమంది అమ్మాయిలను మోసం చేశాడు: నటి -
శ్రీముఖి తో వున్న రీలేషన్ ని రివీల్ చేసిన సాయి చరణ్..
-
MasterChef India 7: Nayanjyoti Saikia: వంటకోసం ప్రాణం ఇస్తాడు
వంట అమ్మ చేయాలి.. అది రూలట. తర్వాత అమ్మాయి చేయాలి.. అది పెంపకం అట. కాని అబ్బాయి చేస్తే? అబ్బాయి నేర్చుకుంటే? వంట ద్వారానే విజేతగా మారితే? అస్సాంలో టీ తోటల్లో కార్మికుడిగా ఉన్న నయన్జ్యోతి సైకియా వంట మీద ధ్యాస పెట్టాడు. మునివేళ్ల మంత్రం నేర్చాడు. మాస్టర్ చెఫ్ పోటీలో విజేతగా నిలిచి 25 లక్షల ప్రైజు సాధించాడు. అమ్మ ఊరికెళితే కర్రీ పాయింట్ వైపు అడుగులు వేసే పుత్రరత్నాలు ఇతని నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. 27 ఏళ్ల నయన్జ్యోతి సైకియాకు రాని వంట లేదు. మూడు నెలల పాటు ముంబైలో ‘మాస్టర్ షెఫ్’ రియాలిటీ షో కోసం ఉండి, రకరకాల వంటలు చేసి, భేష్ అనిపించుకుని, వారం క్రితం 25 లక్షల రూపాయల మొదటి ప్రైజ్ గెలిచాక ఎగువ అస్సాంలో ఉండే అతని ఊరి ప్రజలు ఉత్సవం జరుపుకుంటూ, ట్రోఫీతో తిరిగి వస్తున్న అతనికి స్వాగతం చెప్పడానికి రకరకాల వంటలు చేయిస్తూ ‘ప్రత్యేకంగా ఏం చేయించమంటావ్’ అని అడిగితే నయన్జ్యోతి సైకియా ‘ఏం వద్దు... మా ఇంట్లో చేసే టొమాటో చేప కూర చాలు’ అన్నాడు. దాదాపు రెండు వేల మంది అతనికి స్వాగతం చెప్పడానికి ఊరిలో జమ అయితే ఈ కూర నాలుకకు తగిలాకే ‘అమ్మయ్య... ఇప్పటికి మన ఊరు చేరినట్టయ్యింది’ అని నవ్వాడు. ఇవాళ నయన్జ్యోతి సైకియాను అస్సాం అంతా తనవాడు అని గర్వంగా చెప్పుకుంటోంది. అతను ఆస్కారో నోబెలో తేలేదు. కేవలం వంట ద్వారానే తన ప్రాంతం తల ఎత్తుకు తిరిగేలా చేశాడు. మెకానికల్ ఇంజనీర్ నయన్జ్యోతి సైకియా సొంత ఊరు తిన్ సుకియ. ఇది గౌహతికి 490 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సైకియా తండ్రి టీ ఎస్టేట్లలో పని చేస్తాడు. రైతు. 2018లో గౌహతిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సైకియా ఊరికి తిరిగి వచ్చి టీ ఎస్టేట్‌లో తండ్రి పనికి సాయంగా ఉంటూ వచ్చాడు. నిజానికి చిన్నప్పటి నుంచి ఇంట్లో వంట విషయంలో సాయం చేస్తూ వచ్చిన సైకియాకు వంట మీద రోజు రోజుకీ ఆసక్తి పెరిగిపోయిందని ఇంటి వాళ్లు గుర్తించలేదు. అది ఒక ముఖ్య ఉపాధి అని కూడా భావించలేదు. కాని సైకియా మాత్రం తన బెడ్రూమ్లో ఒక మూల చిన్న స్టవ్‌ను ఏర్పాటు చేసుకొని రకరాల వంటలు తయారు చేయడం మొదలుపెట్టాడు. ఇంటర్ వరకూ ఇది కొంత రహస్యం గా సాగినా ఇంజనీరింగ్ కోసం గౌహతికి వెళ్లాక ఆ నాలుగేళ్లు అతని ప్రయోగాలకు అడ్డు చెప్పేవారు లేకపోయారు. ఇంటర్నెట్ గురువు ‘నాకు గురువులు లేరు. వంట శాస్త్రం కాలేజీకి వెళ్లి చదువుకోలేదు. నాకు వచ్చిందంతా ఇంటర్నెట్లో రకరకాల షెఫ్‌లను ఫాలో అయి నేర్చుకున్నదే. నేను మంచి ఫొటోగ్రాఫర్‌ని. నేను చేసిన వంటలను చాలా ఆకర్షణీయంగా ఫొటోలు తీసి ఇన్‌స్టాలో పెట్టేవాణ్ణి. అలా అందరి దృష్టి నా మీద పడింది. ప్రఖ్యాత షెఫ్ వికాస్ ఖన్నా నా ఇన్‌స్టా పేజీలో నా వంటలను చూసి నన్ను వెతుక్కుంటూ అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి మా ఊరు వచ్చారు. మా ఇంట్లో మా సంప్రదాయ వంటలు వండి చూపించారు. నన్ను మాస్టర్ షెఫ్ ప్రోగ్రాంలో పార్టిసిపెంట్‌గా తీసుకెళతానని అడిగారు. గట్టిపోటీలో ఈశాన్య రుచులు చూపి ‘మాస్టర్ షెఫ్’ రియాలిటీ షో అంటే మాటలు కాదు. కొమ్ములు తిరిగిన పార్టిసిపెంట్లు వస్తారు. అనుభవం సంపాదించుకున్నవారు వారిలో ఉంటారు. వారందరితో తలపడి మొదటి స్థానానికి వెళ్లడం చాలా గొప్ప. అదీ గాక జడ్జీలను మెప్పించాలి. ఈ షోకు జడ్జీలుగా వచ్చిన రణ్వీర్ బ్రార్, గరిమ అరోర, వికాస్ ఖన్నాను ఆకట్టుకున్నాడు సైకియా. ‘అందుకు కారణం నేను నా వంటల్లో మా ఊరి దినుసులను దాదాపుగా వాడటం. వాటితో ప్రయోగాలు చేయడం.’ అంటాడు సైకియా. ఎన్నో అడ్డంకులున్నా ఇంత విజయం సాధించాక పెద్ద పెద్ద రెస్టరెంట్లే అతణ్ణి భాగస్వామిని కమ్మని అడుగుతున్నాయి. విజయం అంటే ఇది. కోరుకున్న కలను ఛేదించాలంటే ఇలాంటి పట్టుదలే ఉండాలి. ‘నేను జీవితంలో ఇప్పటికీ పెద్ద రెస్టరెంట్‌కు వెళ్లలేదు. మా ఊళ్లో లేకపోవడం వల్ల. అంత డబ్బు లేకపోవడం వల్ల. కాని పెద్ద రెస్టరెంట్లలో చేసేవన్నీ నేను అంతకన్నా బాగా చేయడం నేర్చుకున్నాను’ నార్త్ ఈస్ట్ అంటే మాంసాహారం అని ఎక్కువమంది అనుకుంటారు. నేను శాకాహారం రెసిపీలు కూడా చేసి చూపించాను. మణిపూర్ నల్లబియ్యంతో సంగటి వొండితే వారికి బాగా నచ్చింది. ఇక రకరకాల పాస్తాలు చేయడంలో నన్ను మించినవారు లేరు. – నయన్జ్యోతి సైకియా -
గిల్‌పై ఇషాన్ కిషన్ ఆగ్రహం.. ఏం పట్టనట్లుగా చహల్
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లను చేజెక్కించుకున్న టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. ముఖ్యంగా ఈ సిరీస్ శుబ్‌మన్ గిల్‌కు బాగా ఉపయోగపడింది. కీలకమైన వన్డే వరల్డ్‌కప్‌కు ముందు అతను మంచి ఫామ్ కనబరుస్తుండడం.. వరుస సెంచరీలతో జట్టులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఇక కివీస్‌తో జరిగిన చివరి టి20మ్యాచ్‌లో గిల్ సుడిగాలి శతకంతో టి20 ప్లేయర్‌గా పనికిరాడన్న అపవాదును తొలగించుకున్నాడు. అయితే ఇషాన్ కిషన్ మాత్రం తన పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. సిరీస్ ముగిసిన అనంతరం శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యజ్వేంద్ర చహల్‌లు కలిసి చేసిన ఫన్నీ వీడియో ప్రస్తుతం నవ్వులు పూయిస్తుంది. పాపులర్ యూత్ షో ఎంటీవీ రోడీస్‌లో ఆడిషన్ ఎపిసోడ్‌ను ఈ ముగ్గరు రీక్రియేట్ చేశారు. చహల్ దర్శకత్వం చేయగా.. గిల్, ఇషాన్‌లు తమ యాక్షన్‌ను షురూ చేశారు. వీడియోలో ఇషాన్ కిషన్ గొరిల్లా లాగా జంప్ చేయడం అందరిని ఆకట్టుకుంటుంది. ఆడిషన్లో భాగంగా సరైన ప్రదర్శన ఇవ్వని గిల్‌ను ఇషాన్ కిషన్ తిట్టడం.. ఆపై చెంపలు వాయించుకోమనడం లాంటివి సరదాగా అనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోనూ గిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వీడియోను బాగా ఎంజాయ్ చేసిన నెటిజన్లు వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్ అనంతరం టీమిండియా టెస్టు క్రికెట్‌కు సిద్ధమవుతోంది.ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇప్పటికే టీమిండియా నాగ్‌పూర్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 9న ఇరుజట్ల మధ్య తొలిటెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరీస్ టీమిండియాకు చాలా కీలకం. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. ఆసీస్‌తో సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే చాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 10 టెస్టుల్లో గెలుపు, ఒక ఓటమి, నాలుగు డ్రాలతో కలిపి 75.56 పర్సంటైల్ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఐదు టెస్టుల్లో గెలుపు, నాలుగింటిలో ఓటమి, ఒక డ్రాతో కలిపి 58.93 పర్సంటైల్ పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. View this post on Instagram A post shared by Ꮪhubman Gill (@shubmangill) చదవండి: ఆసీస్‌తో తొలి టెస్టు.. నాగ్‌పూర్ చేరుకున్న టీమిండియా -
స్మిత టాక్ షోకు సాయి పల్లవి.. ఫిజికల్ అబ్యూస్ అంటూ సీరియస్ కామెంట్స్!
తెలుగు హీరోయిన్లలో సాయి పల్లవి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సినిమాల్లో తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడుతుంది. అందుకే దర్శకులు కూడా సాయి పల్లవి రోల్‌ను చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఇక ఆమె గ్లామర్స్ పాత్రలకు దూరమనే విషయం తెలిసిందే. స్కీన్ షో ఉంటే అది స్టార్ హీరో బడా డైరెక్టర్ చిత్రమైన నో చెబుతుంది. అందుకే సినిమా ఫలితాలతో సంబంధంగా లేకుండా వ్యక్తిగతం ఆమెను అభిమానించేవారు చాలా మంది ఉన్నారు. అయితే లవ్‌స్టోరితో కమర్షియల్ హిట్ అందుకున్న సాయి పల్లవి ఆ తర్వాత నటించిన చిత్రాలన్ని బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. చదవండి: బ్రహ్మానందం మొత్తం ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా? తన నటనతో మెప్పించినప్పటికి కమర్షియల్‌గా మాత్రం విజయం సాధించలేకపోతున్నాయి. దాంతో ప్రస్తుతం ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అంతేకాదు మీడియాకు, సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటుంది. దీంతో సాయి పల్లవి పూర్తిగా నటనకు గుడ్‌బై చెప్పిందా? అని ఆమె అభిమానలంతా ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు కొద్ది రోజులు ఇకపై ఆమె నటించదనే ప్రచారం కూడా గట్టిగానే జరుగుతోంది. మరోవైపు ఆమె పెళ్లి చేసుకుబోతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ పుకార్లపై ఇంతవరకు ఈ న్యాచురల్ బ్యూటీ నుంచి క్లారిటీ రాలేదు. దాంతో అంతా అదే నిజమనుకుంటున్నారు. చదవండి: కత్రినా వచ్చాక నా లైఫ్ మారిపోయింది.. నేను పర్ఫెక్ట్ హస్భెండ్ కాదు..!: విక్కీ కౌశల్ ఈ నేపథ్యంలో సాయి పల్లవి ఓ టాక్ షోలో పాల్గొన్నారు. సోనీ లైవ్‌లో త్వరలో ప్రసారం కానున్న 'నిజం విత్ స్మిత' షోలో ఆమె పాల్గొన్నారు. ఫిబ్రవరి 10న సాయి పల్లవి ఎపిసోడ్ ప్రసారం కానుంది. చూస్తుంటే ఈ ఎపిసోడ్ కొంచెం వాడివేడిగానే సాగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. ఇందులో సాయి పల్లవి కాస్తా గట్టిగా రియాక్ట్ అయినట్లుంది. ఈ వీడియోలో ఆమె ఫిజికల్ అబ్యూస్, వర్బల్ అబ్యూస్ అంటూ సీరియస్ కామెంట్స్ చేస్తూ కనిపించింది. దాంతో సాయి పల్లవి ఎపిసోడ్ ఆసక్తిని సంతరించుకుంది. ఈ షో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. #NijamWithSmita A thought-provoking talk show With @Sai_Pallavi92 ♥️ n few of the Top Stars Episodes exclusively on @SonyLIV, from February 10th.#SaiPallavi @smitapop pic.twitter.com/ujeoUq9r8t — Sai Pallavi FC™ (@SaipallaviFC) February 2, 2023 -
నేను సూపర్ ఉమెన్.. ఆడవారి కోసం ఆహా బిజినెస్ రియాలిటీ షో
మహిళా వ్యాపారవేత్తలు తమ ఆలోచనలు పంచుకునేందుకు, తమ ప్రయాణం గురించి చెప్పుకునేందుకు సరైన వేదికను ఆహా ఏర్పాటు చేస్తోంది. మొదటి సారిగా మహిళా వ్యాపారవేత్తల కోసం 'నేను సూపర్ ఉమెన్' అనే రియాలిటీ షోను ఆహా టీం ప్లాన్ చేసింది. మహిళా పారిశ్రామికవేత్తలకు మెరుగైన ప్రోత్సాహ౦ అందిచండం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. కానీ సామాజిక ఆర్థిక కారణాల వల్ల వారు వెనుకబడి ఉంటున్నారు. ఆహా మహిళా వ్యాపారవేత్తల కోసం 'నేను సూపర్ ఉమెన్' షోని ప్రత్యేకంగా తీసుకువచ్చింది. మీ దగ్గర మెరుగైన వ్యాపార ఆలోచనలు, వ్యాపార ప్రొటోటైప్ లేదా బిజినెస్ చేస్తున్నా అవన్నీ కూడా పరిశీలిస్తారు మన 'ఏంజెల్స్. నేను సూపర్ ఉమెన్‌లో పాల్గొనే వారికి దిశానిర్దేశం చేసేందుకు ప్రముఖ వ్యాపారవేత్తలను 'ఏంజెల్స్'గా అందరి ముందుకు తీసుకువచ్చింది ఆహా. ► డార్విన్ బాక్స్ కో ఫౌండర్ రోహిత్ చెన్నమనేని ఈ షోలో కనిపించనున్నారు. ఆయన ఐఐఎం లక్నో నుంచి వచ్చి డార్విన్ బాక్స్ కో ఫౌండర్‌గా ఎదిగారు. అంతేకాకుండా సాస్భూమిని కూడా డెవలప్ చేశారు. సరికొత్త ఆలోచనలతో రాబోయే వారిని ప్రోత్సహించేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు సైతం సిద్దంగా ఉన్నారు. ► ముద్ర వెంచర్స్ స్థాపకురాలు స్వాతి రెడ్డి గునుపాటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రులయ్యారు. ఆమె ముద్ర వెంచర్స్‌లో భాగంగా డిఫెన్స్, ఆరోగ్యం, ఆహారం, వినోద రంగంలో రకరకాల పెట్టుబడులు పెడుతూ సక్సెస్ఫుల్ అవుతున్నారు. ► ప్రముఖ వ్యాపారవేత శ్రీధర్ గది 2015లో క్వాంటేలా ఇంక్ అనే సంస్థను ప్రారంభించారు. అనతి కాలంలోనే ఆ సంస్థను టాప్ ప్లేస్‌లోకి తీసుకొచ్చారు. స్మార్ట్ సిటీ సొల్యూషన్‌లో భాగంగా మార్కెట్ లీడర్లలో సింపుల్ డ్యాష్ బోర్డ్ కంపెనీగా క్వాంటెలా ఇంక్ నిలిచింది. ► సిల్వర్ నీడిల్ వెంచర్స్ యొక్క వెంచర్ పార్టనర్ రేణుక బొడ్ల ఐఐఎం కలకత్తా నుంచి పట్టభద్రురాలయ్యారు. నోవార్టిస్ బియోమ్ ఇండియాకు హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఒరాకిల్, సిస్కో, జీఈ, నోవార్టిస్ వంటి వాటిలో ఇరవైఏళ్లుగా స్టింట్గా పని చేసిన తరువాత సిల్వర్ నీడిల్ వెంచర్స్‌లో జాయిన్ అయ్యారు. ► అభి బస్ ఫౌండర్ అండ్ సీఈఓ సుధాకర్ రెడ్డి ఓ సంచలనం సృష్టించారు. బస్ టికెట్ యాప్స్‌లో అభి బస్ ఎంతటి వృద్దిని సాధిస్తోందో అందరికీ తెలిసిందే. ఈ పదమూడేళ్లలో దాదాపు 200 మిలియన్ యూఎస్ డాలర్ల వ్యాపారం జరిగింది. అభి బస్ అనేది దాదాపు 3500 ప్రైవేట్, పబ్లిక్ రవాణా సంస్థలతో కలిసి పని చేస్తోంది. నెలకు ఇంచు మించుగా రెండు మిలియన్ల సీట్లు బుక్ అవుతాయి. ఆయన ఈ సంస్థను లెక్సిగో గ్రూపులో విలీనం చేశారు. ఆ తరువాత ఫ్రెష్ బస్ అనే కొత్త వెంచర్‌ను ప్రారంభించారు. మద్రాసులోని అన్నా యూనివర్సిటీలో సుధాకర్ రెడ్డి చదువుకున్నారు. మీరు కూడా మీ వ్యాపార ఆలోచనలను పంచుకునేందుకు ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు ఇలా చేయండి.. మొదటి స్టెప్ - ఆన్ లైన్ అప్లికేషన్ tally.so/r/wvXg4D లింక్‌ను ఓపెన్ చేయండి. నియయ నిబంధనలు పాటిస్తూ అందులోని ఫాంను నింపండి. మీ బిజినెస్ ఐడియాలను అక్కడ రాయండి. అవి ఎందుకు అంత ప్రత్యేకం, పెట్టుబడులు పెట్టేంత విషయం ఏముందో కూడా వివరించండి. ఓ నిమిషం నిడివి గల వీడియోను కూడా పంపండి. రెండవ స్టెప్ - ఆన్ లైన్ ట్రైనింగ్ ఈ దశలో అభ్యర్థులను వర్చువల్‌గా ట్రైన్ చేస్తారు. నేను సూపర్ ఉమెన్ టీం మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తుంది. ఎకనామిక్స్, ఆపరేషన్స్, ఫైనాన్స్, స్ట్రాటజీల వంటి విషయంలో టీం సలహాలు, సూచనలు ఇస్తుంది. మూడవ స్టెప్ - ఇన్ పర్సన్ మెంటర్షిప్ ఎంపికైన అభ్యర్థులు మెంటార్స్‌ను కలిసి మాట్లాడాల్సి ఉంటుంది. వారి వారి వ్యాపార ఆలోచనలు, కొత్త ఐడియాలను వ్యక్తపరచాలి. నాల్గవ స్టెప్ - ఫైనల్ పిచ్ ఆన్ ది షో నలభై మంది అభ్యర్థులను ఎంచుకుంటారు. ఇందులోనే వారంతా కూడా ఇన్వెస్టర్లతో తమ తమ ఆలోచనలు, కొత్త ఐడియాలను పంచుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని వీ హబ్, గ్రూప్ ఎం, ఆహా కలిసి నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 5 వరకు దరఖాస్తులకు ఆహ్వానం. -
బిగ్ బాస్ సీజన్-6 తెలుగు: అందుకే సక్సెస్ కాలేదా..!
బిగ్ బాస్ తెలుగు -6 సీజన్ గ్రాండ్ ఫినాలే ఆదివారం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో సింగర్ రేవంత్ విన్నర్‌గా నిలవగా.. శ్రీహాన్ రన్నరప్‌గా నిలిచాడు. అయితే ఈ సీజన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే చెప్పాలి. గత సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది తీవ్ర నిరాశకు గురిచేసంది. మరి ఎందుకిలా జరిగింది. నాగార్జున హోస్ట్ చేసిన కూడా ఈ సీజన్ నిరాశపరిచేందుకు గల కారణాలేవో ఓ సారి చూద్దాం. టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్- 6 'ఎంటర్టైన్మెంట్కి అడ్డా ఫిక్స్' అనే ట్యాగ్‌లైన్‌తో అభిమానుల ముందుకొచ్చింది. ఈ రియాల్టీ షోలో కంటెస్టెంట్స్ తమ ఎత్తులు, పైఎత్తులతో అభిమానులను అలరించే ప్రయత్నం చేశారు. కానీ గతంలో కంటే ఈ సీజన్ ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇటీవల కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో చాలా మంది ప్రతివాదులు సీజన్‌ను 'ఫ్లాప్' అని పిలుస్తున్నారు. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ప్రభావం: సెప్టెంబర్ 4న జరిగిన గ్రాండ్ ప్రీమియర్ ఎపిసోడ్ రేటింగ్స్‌లో తెలుగులో రియాలిటీ టీవీ సిరీస్ గత సీజన్ల కంటే అత్యల్ప టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది. ఆసియా కప్ 2022లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ ఈ షోపై ప్రభావం చూపింది. నిరాశపర్చిన కంటెస్టెంట్స్ ఫర్మామెన్స్: ఈ సీజన్ ప్రారంభంలో వినోదభరితమైన టాస్క్‌లతో మొదలైంది. కానీ చివరికి దాగా అదే ఊపును కొనసాగించలేకపోయారు. ఇది ప్రేక్షకుల ఆసక్తిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ సీజన్ చివరి భాగంలో కొన్ని వినూత్న టాస్క్‌లు ప్రవేశపెట్టి ఉండాల్సింది. కంటెస్టెంట్స్ బలహీనతలు: ఈ సీజన్లో కొంతమంది పోటీదారులు బిగ్ బాస్ ఛాలెంజ్‌ను ప్రభావితం చేసినా.. కొందరు పోటీదారుల పనితీరు కారణంగా విజయవంతమైన టాస్క్‌లు కూడా సక్సెస్ కాలేదని బిగ్ బాస్ ప్రస్తావించారు. గీతూ, ఇనయ లాంటి కంటెస్టెంట్ల ఫర్ఫామెన్స్ ఇతర కంటెస్టెంట్ల సహనాన్ని పరీక్షించింది. ఆకట్టుకోలేక పోయిన జంటలు: టాస్క్‌లతో పాటు రొమాంటిక్ ట్రాక్స్ కూడా ఈ షో చూసే అభిమానులను ఆకట్టుకుంటాయి. కానీ ఈ సీజన్లో అర్జున్ కళ్యాణ్, శ్రీ సత్య సూర్య, ఆరోహి జోడీలు ఫ్యాన్స్‌ను నిరాశ పరిచాయి. సూర్యపై తనకు క్రష్ ఉందని ఇనయ చెప్పినా అభిమానులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. ఊహించని ఎలిమినేషన్స్: అభినయ శ్రీ, సుదీప, బాలాదిత్య, గీతూ, ఇనయ లాంటి పోటీదారులను ఊహించని విధంగా ఎలిమినేట్ కావడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. దీంతో సోషల్ మీడియాలో కొందరు అభిమానులు ఒక వర్గం గీతూ, ఇనాయను తొలగించడాన్ని తప్పుబట్టారు. టీవీ, ఓటీటీలో ప్రసారం: ఈ కార్యక్రమం టీవీతో పాటు, ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. కానీ రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ప్రతి ఎపిసోడ్‌లోని ఈవెంట్లను 'లీక్' చేయడం మరింత దెబ్బతీసింది. ఈ సీజన్లో వీక్షకుల సంఖ్య తక్కువగా ఉండటం వెనుక ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఈ విషయాన్ని హోస్ట్ నాగార్జున అక్కినేని తప్ప మరెవరూ ధృవీకరించలేదు. వీక్షకుల సంఖ్య తగ్గడం గురించి తాను కూడా ఆందోళన చెందుతున్నానని నాగార్జున అన్నారు. అయితే మేకర్స్ ఈ విషయంలో సంతోషంగా ఉన్నందున షో కొనసాగించమని చెప్పారని తెలిపారు. -
వెబ్ స్క్రీన్‌పై బాగా వినిపిస్తున్న ఈ హీరోయిన్ గురించి తెలుసా ?
ఈ నటి పేరు సనా సయ్యద్. టీవీ ప్రేక్షకులకు .. మరీ ముఖ్యంగా ఎమ్‌టీవీ అభిమానులకు ఆమె బాగా సుపరిచితం. ఎమ్‌టీవీ రియాలిటీ షో 'స్ల్పిట్స్‌విల్లా' సీజన్ 8 ఫస్ట్ రన్నరప్ సనా సయ్యద్. ఆ షోనే ఆమెను పాపులర్ చేసింది. ఇప్పుడు వెబ్ స్క్రీన్ మీదా వెలుగుతోంది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సనా సయ్యద్ గురించి పలు ఆసక్తికర విషయాలు చూసేద్దామా ! సనా సయ్యద్ పుట్టింది, పెరిగింది ముంబైలో. బికామ్ గ్రాడ్యుయేట్. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్, యాక్టింగ్ అంటే ఆసక్తి. స్కూల్ డేస్‌లో రన్నింగ్, సైక్లింగ్‌లో చాంపియన్. పుస్తకాలు కూడా బాగా చదువుతుంది. అందులో విజయం ‘జానా నా దిల్ సే దూర్’ అనే సీరియల్లో నటిగా చాన్స్‌నిచ్చింది. ఈ సీరియల్ అనంతరం ఆమె యాక్టింగ్ షెడ్యూల్ బిజీ అయిపోయింది. స్పోర్ట్స్ పట్ల ఆమెకున్న ఆసక్తి చూసి సనా అథ్లెట్ అవుతుందని అనుకున్నారట ఆమె కుటుంబ సభ్యులు. వాళ్ల అంచనాలకు అందకుండా యాక్టర్ అయింది. (చదవండి: నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్) యాక్టింగ్‌లో కెరీర్ కోసం ముందు మెడల్‌గా మారింది. మోడలింగ్ చేస్తున్నప్పుడే ‘స్ల్పిట్స్‌విల్లా’ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. సనాను అభిమాన టీవీ నటిగా చేసింది మాత్రం ‘దివ్యదృష్టి’ అనే సీరియలే. ఆ ఫేమ్.. నేమ్ ఆమెకు వెబ్ స్క్రీన్ అప్పియరెన్స్నూ ఇప్పించింది. ‘లాక్ డౌన్ కి లవ్ స్టోరీ’, ‘స్పై బహు’ వంటి సిరీస్‌లో ప్రధాన భూమికల్లో మెప్పిస్తూ వీక్షకుల ప్రశంసలకు పాత్రురాలవుతోంది. 'నా హాబీ.. ప్రొఫెషన్.. అన్నీ కూడా యాక్టింగే. సో.. సెట్స్ మీద లేకపోయినా.. ఇంట్లో అద్దం ముందు నిలబడి నా నటనకు మెరుగులు దిద్దుకుంటూ ఉంటా. సినిమా క్రాఫ్ట్‌కి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉంటా. జయాపజయాలను స్పోర్టివ్‌గా తీసుకుంటా.. ఎంతైనా స్పోర్ట్స్ పర్సన్‌ను కదా!' అని అంటోంది సనా సయ్యద్. (చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం) -
‘తెలుగు ఇండియన్ ఐడల్’ విజేత వాగ్దేవి ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ ఫినాలే ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగా సాగింది. శుక్రవారం రాత్రి స్ట్రీమింగ్ అయిన ఈ ఫైనల్ ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కంటెస్టెంట్స్ చేసిన సందడి బాగా ఆకట్టుకుంది. చిరుతో పాటు రానా, సాయిపల్లవిలు ‘విరాటపర్వం’ ప్రమోషన్లో భాగంగా ఈ షోలో సందడి చేశారు. చదవండి: ‘ఆ బుక్ ఆధారంగా కెఫె కాఫీ డే వీజీ సిద్ధార్థ బయోపిక్ తీస్తున్నాం’ కాగా ఈ సింగింగ్ రియాలిటీ షోకు శ్రీరామ్‌చంద్ర హోస్ట్‌గా.. సంగీత దర్శకుడు తమన్, నటి నిత్యామీనన్, సింగర్ కార్తీక్‌లు జడ్జ్‌లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ ఫినాలే ఎపిసోడ్లో వాగ్దేవి, వైష్ణవి, ప్రణతి, జయంత్, శ్రీనివాస్‌లు ఫైనల్‌కు రాగా.. వాగ్దేవి విన్నర్‌గా నిలిచింది. శ్రీనివాస్, వైష్ణవిలు 2, 3 స్థానాల్లో నిలిచి రన్నర్లుగా నిలిచారు. విజేతగా నిలిచిన వాగ్దేవికి చిరంజీవి ట్రోఫీని అందించాడు. అలాగే ట్రోఫీతో పాటు రూ.10 లక్షల ప్రైజ్‌మనీని కూడా ఆమె గెలుచుకుంది. అంతేకాదు ఇకపై గీతా ఆర్ట్స్ నుండి రానున్న సినిమాలో ఓ పాట పాడే అవకాశం కూడా ఆమె అందుకుంది. చదవండి: ఇంటింటికి సబ్బులు అమ్ముకుంటున్న స్టార్ నటి ఐశ్వర్య మొదటి రన్నరప్‌గా నిలిచిన శ్రీనివాస్‌కు రూ. 3 లక్షలు ప్రైజ్‌మని, రెండవ రన్నరప్‌గా నిలిచిన వైష్ణవికి 2 లక్షల రూపాయలు బహుమాతిగా అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి తన తదుపరి సినిమా ‘గాడ్‌ఫాదర్’లో వైష్ణవికి పాట పాడే అవకాశం ఇచ్చాడు. అలాగే సింగర్ కార్తీక్ తను సంగీతం అందించనున్న నెక్స్ట్ సినిమాలో విన్నర్ వాగ్దేవికి ఛాన్స్ ఇస్తున్నట్లు తెలిపాడు. ఆనంతరం చిరుతో ముందుగానే వాగ్ధేవికి చెక్‌ను కూడా అందించాడు. ఇక ఈ ఎపిసోడ్లో నిత్యా మీనన్ పాట పాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. థమన్, కార్తిక్ పాటల ప్రదర్శన, శ్రీరామ్ చంద్ర నృత్య ప్రదర్శనతో షోను మరింత వినోదంగా సాగింది. -
రియాలిటీ షోలో గాయపడ్డ బుల్లితెర నటి
రియాలిటీ షోలో బుల్లితెర నటి కనిక మన్ గాయాలపాలైంది. ఖత్రోన్ కె ఖిలాడీ 12వ సీజన్లో పాల్గొన్న ఆమె స్టంట్స్ చేస్తూ గాయపడింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో ఆమె మోచేతి చర్మం కొట్టుకుపోయి రక్తసిక్తమైనట్లు కనిపిస్తోంది. అంతేగాక కాళ్లకు సైతం అక్కడక్కడా గీసుకుపోయినట్లు రక్తపు మరకలున్నాయి. అంత తీవ్రంగా గాయపడ్డా సరే కనికా మాత్రం చిరునవ్వు చెదరనీయకపోవడం గమనార్హం. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను గాయపడ్డ విషయాన్ని ధృవీకరించింది. 'అవును, నాకు దెబ్బలు తగిలాయి. ఇదే విషయాన్ని రోహిత్ సర్‌కు కూడా చెప్పాను. దెబ్బలు బాగా తాకడంతో చేతులు, కాళ్లు కదపలేకపోతున్నానని తెలిపాను. దానికాయన ఏమన్నాడంటే ప్రేక్షకులకు నువ్వు గాయపడ్డ విషయం తెలియదు. వాళ్లు నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని భావిస్తున్నారు. నువ్వు షోలోనే ఉండి అదే నిజమని నిరూపించుకో అని చెప్పారు. నేనిప్పుడు అదే చేయబోతున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా రోహిత్ శెట్టి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో రుబీనా దిలైక్, ఫైజల్ షైఖ్, జన్నత్ జుబైర్, మోహిత్ మాలిక్, చేతన పాండే, నిశాంత్ భట్, ప్రతీక్ సెహజ్‌పాల్, సురభి, శివంగి జోషి సహా తదితరులు ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఈ రియాలిటీ షో షూటింగ్ జరుపుకుంటోంది. గతంలోనూ ఖత్రోన్ కె ఖిలాడీ షోలో పలువురు గాయాలపాలయ్యారు. వారిలో భారతీ సింగ్, తేజస్వి ప్రకాశ్ ఉన్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Khatron Ke Khiladi 12 (@khatronkkhiladi.12) చదవండి: 2 ఏళ్లుగా డేటింగ్, ప్రియుడితో ప్రముఖ దర్శకుడి కుమార్తె పెళ్లి! -
బిగ్‌బాస్ తెలుగు నాన్‌స్టాప్‌లో పాయల్ సపోర్ట్ ఎవరికో తెలుసా?
Bigg Boss Telugu OTT: బుల్లితెరపై ఎంతో ఆదరణ పొందిచి రియాలిటీ షో బిగ్‌బాస్. తెలుగులో ఇప్పటికే 5 సీజన్లు పూర్తి చేసుకున్న ఈషో ఓటీటీలోకి కూడా అడుగు పెట్టింది. తొలిసారి ఈ సో బిగ్‌బాస్ ఓటీటీ నాన్‌స్టాప్ పేరుతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతుంది. ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈ షోకి కూడా మంచి ప్రేక్షక ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ షో చివరి వారానికి చేరుకుంది. బిగ్‌బాస్ ఓటీటీ తొలి సీజన్ టైటిల్‌ను సొంతం చేసుకునేదెవరో తెలిసేందుకు ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. దీంతో హౌజ్‌లోని కంటెస్టెంట్స్ అంతా ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇచ్చుకుంటున్నారు. చదవండి: Bigg Boss Non Stop: బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే, అసలైన పోటీ ఆ ఇద్దరి మధ్యే! ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో తన సపోర్ట్ ఎవరికో బయటపెట్టింది ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌజ్‌లో బిందు మాధవి, అఖిల్, అరియానా, బాబా భాస్కర్ మాస్టర్, యాంకర్ శివ, మిత్రా శర్మ ఉన్నారు. ఇక శనివారం లోపు టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరూ అనేదానిపై క్లారిటీ కూడా వచ్చేస్తుంది. అయితే ఇదే సమయంలో బయట ఉన్న ఫ్యాన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. తాజాగా నటి పాయల్ రాజ్‌పుత్ కూడా సోషల్ మీడియా వేదికగా బిందు మాధవికి తన మద్దతు తెలిపింది. చదవండి: సర్కారు వారి పాట విజయంపై సూపర్ స్టార్ కృష్ణ స్పందన బిందు మాధవికి ఓటు వేసి గెలిపించాలని తన ఫాలోవర్స్‌ను కోరింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో బిందు ఫొటోను షేర్ చేస్తూ.. ‘నువ్వు టైటిల్ గెలవడానికి అర్హురాలివి’ అంటూ బిందుకు సపోర్ట్ చేసింది పాయల్. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఓ అమ్మాయి టైటిల్ గెలవలేదు. అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో ట్రోఫీ గెలుచుకునే రేసులో ముందంజలో ఉంది బిందు మాధవి. తన ఆటతీరుతో పాటు బిందు మాధవికి సంబంధించిన ఎన్నో అంశాలు ప్రేక్షకులను ఫిదా చేసేస్తున్నాయి. అందుకే టాప్ 5లో బిందు ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. -
సంచలనాల 'లాకప్' షో విన్నర్ గెలుచుకుంది ఎంతో తెలుసా ?
Lock Up Show Winner Munawar Faruqui Got 20 Lakh Prize Money: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఓ పక్క సినిమాలతో మరోవైపు హోస్ట్‌గా సక్సేస్ఫుల్గా ముందుకు సాగుతోంది. ఆమె వ్యాఖ్యతగా వ్యవహరించిన విభిన్నమైన రియాల్టీ షో 'లాకప్' గురించి తెలిసిందే. ఇందులో పార్టిస్పేట్ చేసిన కంటెస్టెంట్ నుంచి వారు చెప్పిన సీక్రెట్స్ వరకు అన్ని హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం ఈ షో చివరిదశకు చేరుకుంది. ఈ షోలో ఫైనల్ విన్నర్‌ను శనివారం (మే 7) ప్రకటించింది హోస్ట్ కంగనా రనౌత్. కాంట్రవర్సీ రియాల్టీ షో లాకప్ సీజన్ 1 బాడ్యాస్ విన్నర్ మునావర్ ఫరూఖీ అని కంగనా ప్రకటించింది. మరోవైపు రన్నరప్‌గా నటి పాయల్ రోహత్గీ నిలిచింది. 'లాకప్' షో విజేత మునావర్ ఫరూఖీ ట్రోఫీని గెలుచుకోవడంతోపాటు రూ. 20 లక్షల చెక్కు, మారుతీ సుజుకి ఎర్టిగా కారు, ఇటలీకి ఫ్రీ ట్రిప్‌ను అందుకున్నాడు. ఈ గ్రాండ్ ఫినాలేలో మునావర్ ఫరూఖీ ఇతర నలుగురు ఫైనలిస్టులైన పాయల్ రోహత్గి, అంజలి అరోరా, అజ్మా ఫల్లా, శివమ్ శర్మలను ఓడించాడు. ఈ ట్రోఫీ గెలవడంపై మునావర్ ఫరూఖీ సంతోషం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ మే 7న ఎమ్ఎక్స్ ప్లేయర్, ఆల్ట్ బాలాజీలో ప్రసారమైంది. చదవండి: ఆరేళ్లప్పుడు లైంగిక వేధింపులు.. కంగనా రనౌత్ షాకింగ్ రియాక్షన్ MUNAWAR FARUQUI IS 'LOCK UPP' WINNER... And the winner of the first season of #LockUpp is #MunawarFaruqui... The show - which debuted in Feb 2022 - was aired on #MXPlayer and #ALTBalaji... #KanganaRanaut hosted the first season.@MXPlayer @altbalaji pic.twitter.com/ONxIaR9VZZ — taran adarsh (@taran_adarsh) May 8, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
లగ్జరీ కారు కొన్న గజల్, భర్తతో కారు ముందు పోజులు!
'షార్క్ ట్యాంక్ ఇండియా షో' ఫేమ్ గజల్ అలగ్ కొత్త కారు కొనుగోలు చేసింది. రూ.1.19 కోట్ల ఖరీదైన ఆడి ఈ త్రోన్ అనే లగ్జరీ కారును తన గ్యారేజీలోకి తచ్చుకుంది. భర్త వరుణ్‌తో కలిసి కారు ముందు దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. కాగా రెండు నెలల క్రితమే ఆమె ఈ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గజల్, వరుణ్ 2016లో మామాఎర్త్ ఫౌండేషన్‌ను స్థాపించారు. తమ కొడుకు అగస్త్యకు మార్కెట్లో సహజ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ఎంతో కష్టపడ్డామని, ఆ క్రమంలోనే మామాఎర్త్ను స్థాపించాలన్న ఆలోచన పుట్టిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పలు స్టార్టప్స్‌కు, మంచి ఐడియాతో వచ్చే ఎంట్రప్రెన్యూర్స్‌కు షార్క్ ట్యాంక్ ఇండియా ఫండింగ్‌ను అందిస్తోంది. ఇది ఒక బిజినెస్ రియాలిటీ షో. భారత్‌పే మేనేజింగ్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్, boAt సహ వ్యవస్థాపకుడు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమన్ గుప్తా, Shaadi.com, పీపుల్ గ్రూప్ వ్యవస్థాపకుడు సీఈవో అనుపమ్ మిట్టల్ సహా నమితా థాపర్, వినీతా సింగ్, పీయుష్ బన్సల్ వంటి బడా పారిశ్రామికవేత్తలు ఈ షోలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. View this post on Instagram A post shared by Ghazal Alagh (@ghazalalagh) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1701356058.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: సినీప్రియులకు ఆహా గుడ్‌న్యూస్, మేలో ఏకంగా 40కి పైగా సినిమాలు! -
నాతో కాకపోతే ఇంకొకరిని వెతుక్కో.. కాబోయే భర్త ఏమన్నాడంటే
Sangram Singh Reacts To Payal Rohatgi About If She Cant Pregnant: బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో లాకప్. విభిన్న కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ షోలో కంటెస్టెంట్ల సీక్రెట్స్ విని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇటీవలిటీ షోలో కంటెస్టెంట్లను వారికి సంబంధించిన బంధువులు కలిశారు. ఈ క్రమంలోనే మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ పాయల్ రోహత్గీతో తనకు కాబోయే భర్త సంగ్రామ్ సింగ్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు ఇంతకుముందు లాకప్ షోలో కెమెరా ముందు పాయల్ మాట్లాడిన మాటలకు బదులుగా జవాబిచ్చాడు. కమెరా ముందు పాయల్ 'నేను గర్భవతిని కాలేను. మేము పిల్లలను కనాలని నాలుగైదేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాం. ఐవీఎఫ్ పద్ధతి కూడా ప్రయత్నించాం. కానీ అది ఫలించలేదు. సంగ్రామ్ సింగ్‌కు పిల్లలంటే ఇష్టం. అతను పిల్లలను కనడానికి అర్హుడు. సంగ్రామ్ సింగ్‌తో పెళ్లికి ఆలస్యం కావడానికి కూడా ఇదే కారణం. ఒకవేళ నాతో పిల్లలను కనలేకపోతే అతను కచ్చితంగా వేరేవాళ్లను పెళ్లి చేసుకోవాలి.' అని ఎమోషనలైంది. చదవండి: వావ్.. సినీ ప్రియులకు ఇక పండగే.. ఓటీటీలో ఏకంగా 40 దీనికి ఇటీవల షోను సందర్శించిన సంగ్రామ్ సింగ్ 'పాయల్ చాలా ధైర్యవంతురాలు. నేను ఆమెను చూసి గర్వపడుతున్నాను. అవును. ఐవీఎఫ్ పద్ధతి విఫలమైంది. ఆమె గర్భవతి కాలేదని వైద్యులు చెప్పారు. కానీ మా ఇద్దరి ప్రేమ ముందు ఇవన్ని పెద్ద సమస్య కాదు. ఒకవేళ నాకే ఈ సమస్య వస్తే పాయల్ నన్ను విడిచిపెడుతుందా ? కచ్చితంగా కాదు. నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుని నా సొంత పిల్లలను కనమని నాకు చెప్పింది. కానీ దానికి నాకు నవ్వు వచ్చింది. మేము కలిసి ఉన్నాం. ఎప్పటికీ కలిసే ఉంటాం.' అని పేర్కొన్నాడు. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం.. కరెంట్ షాక్‌తో డైరెక్టర్ మృతి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
లైంగికంగా వేధించారు.. అందుకే 'గే' అయ్యావా అన్నారు..
Lock Upp: Saisha Shinde Reveal Secret Says This Is Why You Are Gay: బాలీవుడ్ వివాస్పద బ్యూటీ కంగనా రనౌత్ ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు హోస్ట్‌గా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన రియాలిటీ షో 'లాకప్'కు కంగనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ఇటీవలి జడ్జిమెంట్ స్పెషల్ ఎపిసోడ్లో మునావర్ ఫరూఖీ తన లైఫ్ సీక్రెట్‌ను చెప్పాడు. తన ఆరేళ్ల వయసులో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. తర్వాత కంగనాకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని చెప్పి షాక్‌కు గురి చేసింది. అయితే వీరి తర్వాత ఎవిక్షన్ నుంచి సేవ్ అయిన సైషా షిండే తను ఎలాంటి వేధింపులను ఎదుర్కుందో లాకప్ వేదికగా తెలియజేసింది. 'ఇది నా మొదటి సీక్రెట్. మీకు (మునావర్ ఫరూఖీ, కంగనా రనౌత్) జరిగిన లైంగిక వేధింపులను మీరు పంచుకోవడం చూశాక, అది విని ప్రజలు ఎలా రియాక్టయ్యారో చూశాక నాకు జరిగింది గుర్తుకు వచ్చింది. నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను. ఈ విషయం చెప్పినప్పుడు కొంతమంది వ్యక్తులు 'ఇందుకేనా నువ్ స్వలింగ సంపర్కురాలివి అయ్యావా (గే)' అని అన్నారు. అలా అన్నాక ఇక ఎవ్వరికీ ఈ విషయం గురించి చెప్పే సాహసం చేయలేదు.' చదవండి: ఆరేళ్లప్పుడు లైంగిక వేధింపులు.. కంగనా రనౌత్ షాకింగ్ రియాక్షన్ View this post on Instagram A post shared by S A I S H A S H I N D E (@officialsaishashinde) సైషా తాను స్వప్నిల్ షిండేగా ఉన్న సమయం గురించి పలుసార్లు తెలిపింది. ఆ సమయంలో తనను తాను స్వలింగ సంపర్కాలు (గే) అని నమ్మిందట. సైషాగా మారాలని నిర్ణయించుకునేంత వరకు మానసికంగా ఎలా పోరాడిందో తరచుగా చెప్పేది. దీపికా పదుకొణె, కరీనా కపూర్ ఖాన్, కత్రీనా కైఫ్, శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్, సన్నీ లియోన్, తాప్సీ పన్ను, భూమి పడ్నేకర్, హీనా ఖాన్‌లతో సహా టాప్ ఎ-లిస్ట్ బాలీవుడ్ నటులతో ప్రముఖ డిజైనర్ స్వప్నిల్ షిండేగా పనిచేసింది. చదవండి: పెళ్లయ్యాక పరాయి వ్యక్తిని ముద్దు పెట్టుకున్నా.. భర్తకు చెప్పిన నటి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_921254769.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆరేళ్లప్పుడు లైంగిక వేధింపులు.. కంగనా రనౌత్ షాకింగ్ రియాక్షన్
Lock Upp: Kangana Ranaut Sexually Assaulted As Child: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలతో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. ఓ పక్క సినిమాలతో అలరిస్తూనే మరోవైపు సక్సెస్ఫుల్ హోస్ట్‌గా దూసుకుపోతోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో వచ్చిన లాకప్ రియాల్టీ షోకు కంగనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోని కంటెస్టెంట్లు ఒక్కొక్కరూ తమ జీవితంలో జరిగిన అనుభవాలను చెప్పి ప్రేక్షకులను షాక్‌కు గురి చేశారు. తాజాగా ఈ షోలోని కంటెస్టెంట్‌తోపాటు తనకు కూడా జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది కంగనా. జడ్జిమెంట్ డే స్పెషల్ ఎపిసోడ్లో కంటెస్టెంట్ మునావర్ ఫరూఖీ తన చిన్నతనంలో తను అనుభవించిన లైంగిక వేధింపుల గురించి తెలిపాడు. 'నా దగ్గరి బంధువులు ఇద్దరు నన్ను లైంగిక వేధించారు. నాకు ఆరేళ్లప్పుడు ఈ లైంగిక వేధింపులు ప్రారంభమయ్యాయి. సుమారు నాలుగైదేళ్లు నరకం చూశాను. ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో అని ఇప్పటికీ ఎవరికీ చెప్పలేదు.' అంటూ ఎమోషనల్ అయ్యాడు మనావర్ ఫరూఖీ. ఇలాంటి చేదు సంఘటనను ధైర్యంగా ఇలాంటి పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌పై షేర్ చేసుకోవడంతో మునావర్‌పై కంగనా ప్రశంసలు కురిపించింది. తర్వాత తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి తెలిపింది. చదవండి: షారుఖ్, అక్షయ్, ప్రియాంక చోప్రా అంతా ఫెయిల్యూర్స్.. కంగనా షాకింగ్ కామెంట్స్ 'ఈ సమాజంలో చాలా మంది చిన్న పిల్లలు ఇలాంటి లైంగిక వేధింపులకు గురవుతున్నారు. పిల్లల పెంపక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. నేను కూడా నా చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురయ్యాను. నాకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు మా గ్రామంలో ఉండే ఒక అబ్బాయి మాతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. అతను మాకంటే నాలుగేళ్లు మాత్రమే పెద్దవాడు. మేము మా స్నేహితులతో కలిసి ఆడుకునేప్పుడు అతను వచ్చి మమ్మల్ని ఇబ్బందికరంగా తాకేవాడు. మేము అప్పుడు లైంగికంగా బాధింపబడుతున్నామని మాకు తెలియదు.' అని కంగనా రనౌత్ పేర్కొంది. చదవండి: నువ్ ఏడిచే రోజు వచ్చేసింది.. కరణ్ జోహార్‌పై కంగనా కామెంట్స్ View this post on Instagram A post shared by ALTBalaji (@altbalaji) -
నువ్ ఏడిచే రోజు వచ్చేసింది.. కరణ్ జోహార్‌పై కంగనా కామెంట్స్
Kangana Ranaut Drags Karan Johar As Lock Upp Hits 200M Views: బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్ తన మాటలతో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. ఏ అంశమైన తనదైనా శైలీలో సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతూ పలు విమర్శలు మూటగట్టుకుంది. అంతేకాకుండా ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌ను విమర్శించేందుకు కంగనా ఏ చిన్న అవకాశాన్ని కోల్పోదన్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కరణ్‌పై కంగనా తనదైన శైలిలో సెటైర్ వేసింది. కంగనా హోస్ట్‌గా నిర్వహిస్తున్న రియాలిటీ షో 'లాకప్'. ఆది నుంచే వివాదలు ఎదుర్కొన్న ఈ షో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దూసుకుపోతోంది. తాజాగా ఈ షో 200 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ విజయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కంగనా. చదవండి: 'కంగనా సెలబ్రిటీనే కావచ్చు.. కానీ ఆమె ఓ కేసులో నిందితురాలు' ఈ విజయం గురించి గొప్పగా చెబుతూ ఇన్‌స్టా స్టోరీ షేర్ చేసింది. ఈ స్టోరీలో 'లాకప్ షో 200 మిలియన్ వ్యూస్ సాధించడంతో అతనితోపాటు కొంతమంది రహస్యంగా ఏడవబోతున్నారు. నువ్ ఏడిచే రోజు వచ్చేసింది పాపా జో' అంటూ రాసుకొచ్చింది కంగనా. అయితే ఈ 'పాపా జో' అనే మాట కరణ్ జోహార్‌ను సూచిస్తున్నట్లు తెలుస్తోంది. పలువురితో కలిసి తన షోను కరణ్ నాశనం చేసేందుకు ప్రయత్నించడాని ఆమె బలంగా నమ్ముతుందని సమాచారం. వీరిద్దరి మధ్య శత్రుత్వం 2017లో ప్రారంభమైంది. కరణ్ టాక్ షో అయిన 'కాఫీ విత్ కరణ్' షోకు సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి కంగనా సందడి చేసింది. ఈ కార్యక్రమంలో 'నెపోటిజానికి సూత్రధారి', 'సినిమా మాఫియా లాంటివాడు' అని కరణ్‌పై అభిప్రాయం వ్యక్తం చేసింది కంగనా. తర్వాత నుంచి అనేక సమయాల్లో కరణ్‌పై కంగనా విమర్శలు చేస్తూ వస్తోంది. చదవండి: అతనిలా నేను కూడా చెంపచెల్లుమనిపిస్తా.. కంగనా షాకింగ్ కామెంట్స్ చదవండి: కోట్లలో ఆస్తులున్న కంగనా రనౌత్.. వాటి విలువ ఎంతంటే? -
అందుకోసమే లైఫ్ పార్ట్నర్ కావాలంటున్న పాపులర్ సింగర్
Mika Singh Revealed Why He Looking For His Life Partner: బాలీవుడ్ పాపులర్ సింగర్లో ఒకరు మికా సింగ్. అనేక పాటలను తన హుషారైన గాత్రంతో పాడి ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఆయన తన జీవిత భాగస్వామి కోసం వెతుకులాట మొదలుపెట్టనున్నాడు. అది కూడా ఎందుకోసమో వివరించాడు. రాఖీ సావంత్, మల్లికా షెరావత్, రతన్ రాజ్‌పుత్, రాహుల్ మహాజన్ తర్వాతి ఇప్పుడు మికా సింగ్ కోసం స్వయంవరం ఏర్పాటు చేయనుంది ఓ నేషనల్ ఛానెల్. మికా ది వోహ్తి అనే పేరుతో ఒక రియాలిటీ షోను ప్రారంభిస్తోంది స్టార్ భారత్ ఛానెల్. ఇప్పటికే ఈ షోలో పాల్గోనేవారికోసం రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించారు. ఈ స్వయంవరం ఎందుకు అనే విషయాన్ని ఈ షో ప్రోమో ద్వారా తెలియజేశాడు మికా. ఈ ప్రోమోలో 'నేను 2000కుపైగా వివాహాల్లో ప్రదర్శించాను. అలాగే ఎన్నో పాటలు పాడి కెరీర్లో విజయం సాధించాలన్నేదే నా ఉద్దేశం. నా మొదటి పాట మౌజా హి మౌజా పాడినప్పుడు ఇలాగే కొనసాగాలని అనుకున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్. రెహమాన్, ఇతర ప్రముఖ సంగీత దర్శకుల్లాగా గొప్పవాన్ని కావాలనుకుంటున్నాను. భగవంతుని దయతో నేను ముందుకు సాగుతున్నాను. కానీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని దలేర్ పాజీ, భాభిజీ కోరారు. నా బంధువుల కోరిక నిమిత్తం నేను నా జీవిత భాగస్వామిని వెతకాలనుకుంటున్నా. వారి కోరికను నేను నెరవేర్చాలని అనుకుంటున్నా. అందుకోసం వారిని కొద్ది సమయం వేచి ఉండమని అభ్యర్థించాను.' అని మికా తెలిపాడు. ఇంకా వివరిస్తూ 'నేను టీవీ ఛానెల్ నుంచి ఈ ఆఫర్ అందుకున్నట్లు మా దలేర్ పాజీకి తెలియజేశాను. అతను సంతోషంతో అవును.. నువ్ ఎందుకు ఇలా ప్రయత్నించకూడదు ? నీకు సరైనా జీవిత భాగస్వామి దొరుకుతుంది.' అని పేర్కొన్నాడు. అలాగే ఈ టీవీ షో డబ్బు కోసం చేయట్లేదని మికా సింగ్ తెలిపాడు. View this post on Instagram A post shared by STAR Bharat (@starbharat) -
పెళ్లయ్యాక పరాయి వ్యక్తిని ముద్దు పెట్టుకున్నా.. భర్తకు చెప్పిన నటి
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బ్యూటిఫుల్ కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న డిఫరెంట్ రియాలిటీ షో 'లాకప్'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ షోలో కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా తమ రహస్యాలు బయటపెడుతున్నారు. అది విని ప్రేక్షకులు ఔరా..! అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ షోలో ఎలిమినేషన్ నుంచి గట్టెక్కి విజయం సాధించేందుకు ఇన్నాళ్లు దాచుకున్న సీక్రెట్స్‌ను బాహటంగా చెప్పేస్తున్నారు. తాజాగా మార్చి 20న ప్రసారమైన జడ్జిమెంట్ డే ఎపిసోడ్లో మరో కంటెస్టెంట్ తన రహస్యాన్ని బయటపెట్టింది. మునావర్ ఫరూఖీ, నిషా రావల్‌లు తమ జీవితంలోని రహస్యాన్ని బయటపెట్టే అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో నిషా రావల్ మొదటగా బజర్ నొక్కడంతో తన సీక్రెట్‌ను ప్రపంచంతో పంచుకోమని కంగనా కోరింది. చదవండి: మీరు చాలా హాట్‌గా ఉన్నారు.. మాకు కోచింగ్ ఇవ్వండి: కంటెస్టెంట్‌తో కంగనా సీరియల్ నటుడు కరణ్ మెహ్రాను 2012లో వివాహం చేసుకుంది నిషా రావల్. 2021లో కరణ్ మెహ్రాపై గృహ హింస, వివాహేతర సంబంధం కేసులు పెట్టి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. అయితే 2014లో తనకు గర్భస్రావం అయినట్లు తెలిపింది నిషా. ఈ విషయం గురించి చెబుతూ 'నేను కరణ్ మెహ్రాను 2012లో పెళ్లి చేసుకున్నాను. 2014లో నాకు గర్భస్రావం అయింది. ఇది అందరికీ తెలుసు. అప్పుడు నేను ఐదు నెలల గర్భవతిని. నేను శారీరకంగా, మానసికంగా వేధించే బంధంలో ఉన్నానని అందరికీ తెలుసు. గర్భస్రావం తర్వాత నేను చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఒక మహిళగా ఎన్నో విషయాలను ఎదుర్కొంటున్నాను. అప్పుడు నన్ను చాలా మంది చాలా మాటలు అనేవాళ్లు. పదాలతో దూషించేవాళ్లు. పబ్లిక్ ఫిగర్ అయినందున నేను ఎవరితోనూ ఏ విషయం షేర్ చేసుకోలేక పోయాను. నాకు ఎలాంటి మద్దతు లేదు. చదవండి: 'పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాను.. 4 కేసులు కూడా ఉన్నాయి' 2015లో నా కజిన్ సంగీత్ వేడుకలో నా పాత స్నేహితుడిని కలిశాను. అక్కడ కూడా చాలా మంది నన్ను అవమానించారు. అప్పడు నాకు ఎవరితోనైనా మాట్లాడాలని అనిపించింది. నాకు ఎవరైనా సపోర్ట్‌గా ఉంటే బాగుండనిపించింది. ఆ సమయంలో మేము కొత్త ఇంటికి మారుతున్నాం. అక్కడ నా పాత మిత్రుడిని చూశాను. చాలా కాలం తర్వాత మేము కనెక్ట్ అయ్యాం. అతడు నన్ను సపోర్ట్ చేశాడు. నేను అతనిపట్ల ఆకర్షితురాలినయ్యాను. అప్పుడే నేను అతన్ని ముద్దు పెట్టుకున్నాను. కానీ ఆ విషయం అదే రోజు నా భర్తకు చెప్పాను. మేము అప్పటికే విడిపోవడం గురించి చర్చించుకుంటున్నాం. ఇక ఆ వివాహం బంధంలో నాకు ఉండాలనిపించలేదు. చివరిగా నాకోసం స్టాండ్ తీసుకున్నాను.' అని నిషా రావల్ తెలిపింది. చదవండి: 'అమ్మ స్నేహితురాలితో పడక షేర్ చేసుకున్నాను' -
'పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాను.. 4 కేసులు కూడా ఉన్నాయి'
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కాంట్రవర్సీ రియాలిటీ షో 'లాకప్'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ షోలో కంటెస్టెంట్లు బయటపెడుతున్న రహస్యాలు విని ప్రేక్షకులు ఔరా..! అనుకుంటున్నారు. ఎలిమినేషన్ నుంచి గట్టెక్కడం కోసం, షోలో విజయం సాధించేందుకు ఇన్నాళ్లు దాచుకున్న సీక్రెట్స్‌ను నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. ఇటీవల ఓ ప్రముఖ వ్యాపార వేత్త తన భార్యతో నిద్రించాలని చెప్పి అందరినీ షాక్‌కు గురి చేశాడు. అలాగే క్రికెటర్ శివమ్ శర్మ తన తల్లి ఫ్రెండ్‌తో బెడ్ షేర్ చేసుకున్నట్లు చెప్పి కంటెస్టెంట్లు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేశాడు. తాజాగా తన జీవితంలో తనకు ఎదురైన దుర్భరమైన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు బాలీవుడ్ యాక్టర్ కరణ్వీర్ బోహ్రా. చదవండి: అతనే ఫస్ట్ ఎలిమినేషన్ కంటెస్టెంట్.. ఎందుకంటే ? కరణ్వీర్ బోహ్రా తన జీవితంలోని చీకటి, లోతైనా, భావోద్వేగపు రహస్యాలను బహిర్గతం చేశాడు. ఏడేళ్లుగా తనకు పని లేకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొన్నాని తెలిపాడు. 'నేను నా జీవితంలో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాను. ఆ ఆప్పులు చెల్లించకపోవడంతో నాపై 3, 4 కేసులు కూడా నమోదయ్యాయి. 2015 నుంచి నేను చేసిన ప్రతీ పని కేవలం ఆ అప్పు తీర్చడానికే చేశాను. నేను నా కుటుంబానికి ఏమిచ్చాను? అని ఎప్పుడూ బాధపడుతుంటాను. ఈ బాధతో నేను ఆత్మహత్య కూడా చేసుకునే వాడిని. తీజయ్, అమ్మ, నాన్న, నా పిల్లలు లేకుంటే, నేను ఏం చేసేవాడినో నాకే తెలియదు. నాకు ఈ షో ఒక లైఫ్‌లైన్ లాంటింది.' అని తెలిపాడు కరణ్వీర్ బోహ్రా. చదవండి: బడా వ్యాపారవేత్త ముందే తన భార్యతో నిద్రించాను: షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన కంటెస్టెంట్ -
ప్రముఖ వ్యాపారవేత్త తన భార్యతో నిద్రించమని ఆఫర్ చేశాడు
వివాదాస్పద నటి కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో లాకప్. ఈ షోలో కంటెస్టెంట్లు బయటపెడుతున్న సీక్రెట్లు వింటుంటే ప్రేక్షకుల మతి పోతోంది. ఎలిమినేషన్ నుంచి గట్టెక్కడం కోసం ఇన్నాళ్లుగా దాచిపెట్టిన రహస్యాలను నిర్మొహమాటంగా బయటపెడుతున్నారు కంటెస్టెంట్లు. తాజాగా తెహ్సీన్ పూనావాలా ఓ షాకింగ్ రహస్యాన్ని వెల్లడించినప్పటికీ అతడు షో నుంచి ఎలిమినేట్ అవక తప్పలేదు. ఇంతకీ అతడు బయటపెట్టిన సీక్రెట్ ఏంటో పూనావాలా మాటల్లోనే తెలుసుకుందాం.. 'భారత్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త అతడి భార్యతో నిద్రించాలని నాకో ఆఫర్ ఇచ్చాడు. అంతేకాదు శని, ఆది వారాల కోసం నైట్ క్లబ్ బుక్ చేశాడు. అతడి భార్యతో బెడ్ షేర్ చేసుకుంటుండగా అతడు చూసి ఎంజాయ్ చేయాలనుకున్నాడు. అదే జరిగింది కూడా! ఇప్పుడిది మీతో చెప్పడానికి కూడా నాకేం అభ్యంతరం అనిపించడం లేదు. ఎందుకంటే అందులో తప్పేం లేదు. అతడి కోరికను మేము నెరవేర్చాం. అంతే..' అని చెప్పుకొచ్చాడు. చదవండి: అవకాశాల కోసం అంట్లు తోమాను, బాత్రూంలు కడిగాను సీక్రెట్ నీ భార్యకు తెలుసా? అని కంగనా అడగ్గా తెహ్సీన్ తెలుసని బదులిచ్చాడు. తన పెళ్లవకముందు జరిగిన విషయమని తెలిపాడు. తన భార్యతో డేటింగ్లో ఉన్నప్పుడే ఈ సీక్రెట్‌ను ఆమెకు చెప్పానన్నాడు. తర్వాత లాకప్ షోలోని మరో కంటెస్టెంట్ సాయేషా సైతం ఒక రహస్యాన్ని బయపెట్టాలనడంతో ఆమె పదేళ్ల వయసులోనే అత్యాచారానికి గురయ్యానని తెలిపింది. చదవండి: కోట్లు సంపాదించిన మిత్ర శర్మ ఇల్లు చూశారా? -
'అమ్మ స్నేహితురాలితో పడక షేర్ చేసుకున్నాను'
Lock Upp: కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న వివాదాస్పద షో 'లాకప్'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ షో ఆడియన్స్‌ను బాగానే అట్రాక్ట్ చేస్తోంది. ఇక ఈ గేమ్‌లో ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలంటే ఒక సీక్రెట్ చెప్పాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా లాకప్ కంటెస్టెంట్, క్రికెటర్ శివమ్ శర్మ తన గురించి ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. తన తల్లి స్నేహితురాలితో బెడ్ షేర్ చేసుకున్నట్లు తెలిపాడు. 'మా అమ్మ స్నేహితురాలు మా ఇంటికి దగ్గర్లోనే ఉండేది. ఆమె విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. ఆమెకు నేనంటే ఇష్టం. వైట్ సాస్ పాస్తా తీసుకుని ఆమె ఇంటికి వెళ్లేవాడిని. ఆమెతో పడక షేర్ చేసుకున్నాను. ఇది ఎనిమిదేళ్ల క్రితం అంటే నా కాలేజీ రోజుల్లో జరిగింది' అని శివమ్ శర్మ చెప్పుకొచ్చాడు. అతడు చెప్పిన సీక్రెట్ విని షాకవడం మిగతా కంటెస్టెంట్లు షాకయ్యారు. దీన్ని యూజ్ చేసుకోవడం అంటారని ఓ కంటెస్టెంట్ అనడంతో స్పందించిన శివమ్ శర్మ.. అది ఇద్దరి ప్రమేయంతోనే జరిగిందని, ఆమెను తాను వాడుకోలేదని స్పష్టం చేశాడు. We really Live in a society where cynical clones/shameless ppl like #ShivamSharma will do whatever they want, and no one is ready to take a stand against them. I have no words, I'm literally speechless right now. Someone pls stop him !! #LockUpp #LockUppWithKaran #SiddharthSharma pic.twitter.com/MPcDHYRQA0 — kevs.fp (@punegangsta_fp) March 13, 2022 చదవండి: మార్చి 3వ వారంలో వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. షారుక్ అలాంటి వాడు కాబట్టి వదిలేద్దామనుకున్నా: గౌరీ ఖాన్ -
అతనే ఫస్ట్ ఎలిమినేషన్ కంటెస్టెంట్.. ఎందుకంటే ?
Lock Upp’s First Elimination: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న వివాదాస్పద రియాలిటీ షో 'లాక్ అప్'. 13 మంది కాంట్రవర్సీ సెలబ్రిటీలతో నడుస్తోన్నఈ షోకు ఇంతకుముందు చూడనంతా ఉత్సాహం, గొడవలు, మసాలా కంటెంట్‌తో దూసుకుపోతోంది. అయితే ఈసారి ఈ షో నుంచి మొదటిసారిగా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ ఓటీటీ సిరీస్ నుంచి గాడ్‌మ్యాన్ స్వామి చక్రపాణి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ లాక్ అప్ షోలో రాజకీయాల, సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన వివిధ నేపథ్యం ఉన్న వ్యక్తులు పాల్గొంటున్నారు. వీరిలో భారతదేశంలో ఎప్పటినుంచో ఉన్న హిందూ జాతీయవాద సంస్థ అయిన హిందూ మహాసభకు అధ్యక్షుడిగా చెప్పుకునే గాడ్‌మ్యాన్ స్వామి చక్రపాణి ఒకరు. స్వామి చక్రపాణి ఈ లాక్ అప్ షోలో టాస్క్‌లు చేస్తున్నప్పుడు తన సహచరులకు ఎలాంటి సహాయం చేసేవాడు కాదట. దీంతో హోస్ట్ కంగనా రనౌత్, ప్రేక్షకులు మొదటి వారంలోనే ఎలిమినేట్ చేయాలని ఓట్లు వేశారు. చక్రపాణి ఎలిమినేట్ అయినట్లు ఓటీటీ సంస్థ ఆల్ట్ బాలాజీ చక్రపాణి లాక్డ్ అవుట్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేసింది. ఇదిలా ఉంటే ఈ షో సమయంలో చక్రపాణి తనను అభ్యంతరకరంగా తాకినట్లు సైషా అనే మరో కంటెస్టెంట్ తెలిపింది. 'నాతో ఇలా చేయకు. నాకు చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. మీరు ఇతరులతో ఇలానే చేస్తారా? నేను అమ్మాయిని. ఇది స్నేహం, మరేదైనా ఇలా నాకు ఇష్టం లేదు' అని చెప్పుకొచ్చింది. -
తన పెళ్లి గురించి చెబుతూ ఏడ్చేసిన టాప్ హీరోయిన్..
Bhagyashree Gets Emotional Remembering Her Wedding: బాలీవుడ్లో ఒక ఊపు ఊపేసిన అలనాటి టాప్ హీరోయిన్ భాగ్యశ్రీ. 1989లో సల్మాన్ ఖాన్ సరసన 'మైనే ప్యార్ కియా' సినిమాతో ఎంత క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు పొందిన భాగ్యశ్రీ పలు సామాజిక సేవలందించింది. మహారాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 'భాగ్యశ్రీ' స్కీమ్‌కు 2015లో బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఎంపికైంది. ఇటీవల స్టార్‌ప్లస్ నిర్వహిస్తున్న కొత్త రియాలిటీ షో 'స్మార్ట్ జోడి'లో భాగ్యశ్రీ దంపతులు పాల్గొన్నారు. ఈ షోలో తన వివాహం గురించి చెబుతూ భావోద్వేగానికి లోనైంది. హిమాలయ దస్సానితో తన వివాహానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదని, ఎలాంటి మద్దతు ఇవ్వలేదని ఎమోషనల్ అయింది భాగ్యశ్రీ. వారి పెళ్లికి తన భర్త తప్ప ఇంకెవరూ లేరని కన్నీళ్లు పెట్టుకుంది. 'తల్లిదండ్రులు తమ పిల్లల గురించి కలలు కంటారు. కానీ తమ పిల్లలకు కూడా సొంత కలలు ఉంటాయి. మీరు వారి కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించాలి. కొన్నిసార్లు వారి డ్రీమ్స్‌తో వారిని జీవించనివ్వండి. ఎందుకంటే చివరికీ వారి జీవితాన్ని వారే జీవించాలి కాబట్టి.' అని చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ. అలాగే 'ఒక సమయంలో నేను, హిమాలయ దస్సానీ లేచిపోయామని ప్రజలు, మీడియా ప్రచారం చేశారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే మేము అలా చేయలేదు.' అని పేర్కొంది. స్టార్ ప్లస్ నిర్వహిస్తున్న ఈ స్మార్ట్ జోడీ రియాలిటీ షోలో నిజ జీవితంలోని 10 మంది జంటలు పాల్గొంటారు. అందులో భాగంగా ఒక జంటగా భాగ్యశ్రీ-హిమాలయ దస్సానీ పార్టిసిపేట్ చేశారు. View this post on Instagram A post shared by StarPlus (@starplus) -
'లాకప్'లో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ.. ఎందుకంటే ?
Poonam Pandey As Third Contestant In Kangana Lock Upp Show: బీటౌన్ ఫైర్ బ్రాండ్, మోస్ట్ డేరింగ్ హీరోయిన్ హోస్ట్‌గా 'లాకప్' అనే రియాల్టీ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఈ షోకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. మోస్ట్ ఫియర్లెస్ షో అని ప్రచారం చేసిన 'లాకప్' షో ఫిబ్రవరి 27 నుంచి ఆల్ట్ బాలాజీ ఓటీటీ, ఎమ్ఎక్స్ ప్లేయర్లలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో షో నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రిటీలను వరుసగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే మొదటి కంటెస్టెంట్‌గా నిషా రావల్, రెండో కంటెస్టెంట్‌గా కాంట్రవర్సీ కమెడియన్ మునవర్ ఫరూఖీని రివీల్ చేశారు. తాజాగా ఈ షోలో మూడో పార్టిస్పెంట్గా బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండేను పరిచయం చేశారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన వీడియోను పూనమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోకు 'నేను హాట్‌గా ఉన్నందుకే లాకప్ చేశారు.' అని రాసుకొచ్చింది పూనమ్. పాండే షేర్ చేసిన ఈ టీజర్ వీడియోలో పూనమ్ ఆరెంజ్ డ్రెస్‌లో హాట్‌గా కనిపించింది. ఈ వీడియోతోపాటు లాకప్‌లో ఉన్న ఒక పిక్‌ను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Poonam Pandey (@poonampandeyreal) View this post on Instagram A post shared by Poonam Pandey (@poonampandeyreal) -
'మోస్ట్ ఫియర్లెస్ షో'కు హోస్ట్‌గా కంగనా రనౌత్ !
Kangana Ranaut Is Confirmed As Host For Ekta Kapoor Show: బీటౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమాజంలోని పరిస్థితులపై తనదైన శైలీలో కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడేస్తుూ ఉంటుంది. అలా మాట్లాడటంతో దేశంలోనే మోస్ట్ డేరింగ్ హీరోయిన్గా పేరు వచ్చింది. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ క్వీన్‌గా రికార్డుకెక్కింది. ఏ విషయం గురించి అయినా ఎలాంటి భయం లేకుండా బయటకు చెప్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ వ్యాఖ్యలతో కంగనా రనౌత్ పలుసార్లు వివాదాలపాలైంది కూడా. కానీ కంగనా బోల్డ్ యాటిట్యూడ్ అనేకమంది దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం కంగనా టికు వెడ్స్ షెరు సినిమాతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా కంగనా ఒక మోస్ట్ డేరింగ్ షోకి హోస్ట్‌గా వ్యవహరించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ బుల్లితెర నిర్మాత ఏక్తా కపూర్ ఆల్ట్ బాలాజీ, ఎమ్ఎక్స్ ప్లేయర్ కోసం రూపొందించే ఒక 'ఫియర్లెస్ రియాలిటీ షో' కోసం కంగనాను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ మాదిరిగా ఉన్న ఈ షోను కంగనా హోస్ట్ చేయనుందని సమాచారం. ఈ విషయంపై త్వరలో అధికారికంగా ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఈ షో గురించి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కంగనా తర్వాత ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. View this post on Instagram A post shared by ALTBalaji (@altbalaji) -
వెంకీమామతో సరికొత్త టాక్ షో.. రంగంలోకి అల్లు అరవింద్!
వెండితెరపై సత్తా చాటి స్టార్స్‌గా వెలుగొందిన పలువురు టాలీవుడ్ నటులు..ఇప్పుడు బుల్లితెరపై కూడా తమ హవాని చాటుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, రానాలు పలు షోలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించి, తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇటీవల నందమూరి బాలకృష్ట కూడా హోస్ట్ అవతారం ఎత్తాడు. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ప్రసారమవుతున్న‘అన్ స్టాపబుల్’ టాక్ షోకి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. తనదైన డైలాగ్స్, పంచులతో ఈ టాక్ షోని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు బాలయ్య. డిజిటల్ ప్లాట్ ఫాంలో ఈ టాక్ షో దూసుకెళ్తోంది. దీంతో మరో కొత్త షోని ప్రారంభించాలని ప్రయత్నిస్తుందట ‘ఆహా’టీమ్. ఈ సరికొత్త టాక్ షోకి విక్టరీ వెంకటేశ్‌ని హోస్ట్‌గా చేయించడానికి ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే ‘ఆహా’టీమ్ వెంకటేశ్‌ని సంప్రదించారట. ఆయనను ఒప్పించడానికి అల్లు అరవింద్ కూడా రంగంలోకి దిగారట. ఇదే నిజమైతే..త్వరలోనే వెంకీమామని మనం హోస్ట్‌గా చూడొచ్చు. ప్రస్తుతం వెంకటేశ్ ఎఫ్ 3 చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో పాటు రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. -
ఫ్యాన్స్‌కి తీపి కబురు అందించిన నటి రాధ, మళ్లీ వస్తున్నానంటూ ట్వీట్..
Senior Actress Radha Re Entry To Small Screen After Long Gap: అలనాటి హీరోయిన్, ప్రముఖ సీనియర్ నటి రాధ.. అప్పటి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ప్రత్యేకం పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయం, నటన.. అంతకు మించి డ్యాన్స్‌తో ఎంతో ప్రేక్షకులను గుండెల్లో ఆమె నిలిచిపోయారు. 80, 90 దశకంలో ఆనాటి అగ్ర హీరోలు సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణతో పలువురి హీరోలందరి సరసన ఆమె నటించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్యలతో పోటీ పోడుతూ డ్యాన్స్ చేసి పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చదవండి: ‘బంగార్రాజు’ ట్రైలర్ వచ్చేసింది, చై హంగామా మామూలుగా లేదుగా.. అలా స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రాధ తమిళ్, మలయాళంలో కూడా హీరోయిన్గా నటించారు.అక్కడ కూడా ఆమె స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో రానూరానూ సినిమాలు తగ్గించిన రాధ పెళ్లి చేసుకుని పూర్తిగా నటనకు దూరమయ్యారు. భర్త, పిల్లలు, వ్యాపారంతో బిజీ అయిపోయారు. ఆమె తెరపై కనిపించి ఓ దశాబ్దమే గడిచింది. ఈక్రమంలో అప్పుడప్పుడు పలు ఈవెంట్స్‌లో మెరిసిన ఆమె పూర్తిస్థాయిలో తెరపై కనిపించలేదు. ఇదిలా ఉంటే తన ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసే ఓ తీపి కబురు అందించారు రాధ. మళ్లీ వస్తున్నానంటూ ఆమె ట్వీట్ చేశారు. చదవండి: సల్మాన్ ఖాన్‌తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత.. ఈ మేరకు రాధ ట్వీట్ చేస్తూ.. త్వరలో బుల్లితెరపై సందడి చేయబోతున్నానంటూ ఓ షో ప్రోమోను వదిలారు. ‘చాలా గ్యాప్ తర్వాత మళ్లీ వస్తున్నా. ఓ రియాలిటీ షోకు న్యాయనిర్థేతగా వ్యవహరించేందుకు బుల్లితెరపైకి వస్తున్నాను. నా కో-జడ్జీగా నకుల్ వ్యవహరిస్తున్న ఈ సూపర్ క్వీన్స్ షో జీ తమిళ్లో ప్రసారం కాబోతోంది. ఈ షోకు జడ్జీగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నా. ఎంతోమంది అమ్మాయిల ప్రతిభను ఈ కార్యక్రమం ద్వారా చూడటం గర్వంగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు. 90వ దశకంలో సినీ రంగానికి గుడ్ బై చెప్పిన రాధ పెళ్లి తర్వాత ముంబయిలో సెటిలయ్యారు. అడపాదడపా ఈవెంట్లలో దర్శనమిస్తూ అభిమానులను అలరించడం తప్ప హోస్ట్‌గా ఆమె కనిపించడం ఇదే తొలిసారి. కాగా ఈ షో జనవరి 16 నుంచి జీ తమిళంలో ప్రసారం కానుంది. After pretty long time , again as a judge for a reality show ! Nakul, my co judge is such a sweetheart ❤️That too on Zee Tamil! Enjoyed every bit of it! So proud to witness our talented girls!https://t.co/Kae1rQA7ax @ZeeTamil — Radha Nair (@ActressRadha) January 11, 2022 -
ఆయన్ని చూసి రణ్వీర్ సింగ్ కంటతడి.. దేవుడంటూ ఎమోషనల్
Ranveer Singh Breaks Down Tears After Met Govinda: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ మాజీ క్రికెటర్ హర్యానా హరికేన్ కపిల్ దేవ్ పాత్రలో మెప్పించి ఆకట్టుకుంటున్న చిత్రం '83'. 1983 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అశేష ప్రేక్షాదరణ పొందుతుంది. ముఖ్యంగా కపిల్ దేవ్లా డిట్టు దింపేసినా రణ్వీర్ సింగ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రణ్వీర్ సింగ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇటీవల కలర్స్ అందిస్తున్న 'ది బిగ్ పిక్చర్' రియాలిటీ షోను హోస్ట్ చేశాడు రణ్వీర్. ఈ షోకు హాజరైన ప్రముఖ నటుడు గోవిందాను చూసి ఉద్వేగానికి లోనయ్యాడు రణ్వీర్ సింగ్. తర్వాత రణ్వీర్ను ఓదార్చాడు గోవిందా. ఈ షోలో ప్రేక్షకులకు గోవిందాను పరిచయం చేస్తూ 'ఈ శుభ దినాన నా దేవుడే మిమ్మల్ని కలవడానికి వస్తున్నాడు. ది వన్ అండ్ ఓన్లీ , హీరో నెంబర్ వన్ గోవిందా' అంటూ స్టేజిపైకి ఆహ్వానించాడు. అనంతరం రణ్వీర్ సింగ్.. గోవిందా కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. రణ్వీర్ సింగ్ అభిమానాన్ని చూసిన గోవిందా సంతోషపడ్డాడు. తర్వాత వీరిద్దరూ కలిసి ఇష్క్ హై సుహానా, యూపీ వాలా తుమ్కా వంటి గోవిందా హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేసి సందడి చేశారు. ఈ పోగ్రామ్‌లో గోవిందా భార్య సునీత, కుమార్తె టీనా, కుమారుడు యశ్వర్ధన్ అహుజా వీడియో కాల్ ద్వారా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) ఇదీ చదవండి: 83 చిత్రంపై రజనీ కాంత్ రియాక్షన్.. పొగడ్తలతో బౌండరీలు -
ఆ‘గాలి’ అమ్ముకొని వారానికి రూ. 53 లక్షలు సంపాదిస్తోంది..
తమ అభిమాన తారలకు సంబంధించిన అలవాట్లు, అభిరుచులు, వస్తువులు.. ఇలా వేటినైనా తెగ ఇష్టపడుతుంటారు డై హార్డ్ ఫ్యాన్స్. వారు వాడే యాక్సెసరీల నుంచి ఆటోగ్రాఫ్ చేసిన పేపర్ వరకు ఏది దొరికినా వాటిని మధుర జ్జాపకంగా పదిలంగా దాచుకుంటారు. ఇప్పటి వరకు స్టార్స్ తమ వాచ్‌లు, షర్ట్స్, బైక్‌లు వంటి వస్తువలను వేలంలో అమ్మి డబ్బులు సంపాదించిన ఘటనలు ఎన్నో చూశాం కానీ ఓ టీవీ స్టార్ తన అపాన వాయువును (పిత్తు) అమ్మి లక్షల్లో ఆదాయం గడిస్తుందంటే నమ్ముతారా.. నిజమేనండి. బహిరంగంగా మాట్లేందుకు ఇబ్బందిగా ఫీల్ అయ్యే అపానవాయువుతో డబ్బులు కూడా సంపాదిస్తున్నానని స్టెఫానీ మాటో అనే టీవీ ఆర్టిస్ట్ చెప్పడం వైరల్‌గా మారింది. 90డే ఫియాన్స్ అనే టీవీ షో ద్వారా స్టెఫానీ మట్లో సోషల్ మీడియాలో తెగ పాపులారిటీని సంపాదించింది. అయితే తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో తన అపానవాయువును అమ్మే బిజినెస్‌ను ప్రారంభించింది. ఆ వాయువును అమ్ముతూ వారానికి ఏకంగా 70 వేల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 53 లక్షల రూపాయలను ఆమె సంపాదిస్తోంది. ఈ విషయాన్ని స్టెఫానీ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. చదవండి: హృదయ విదారకం.. చనిపోయిన తల్లి ఫోటోతో వధువు కన్నీళ్లు తన అపానవాయువును ఓ గాజు పాత్రలో వేసి ఒక్కో యూనిట్‌ను 1,400 డాలర్లకు (సుమారు లక్ష) తన అభిమానులకు ఆన్లైన్లో అమ్ముకుంటుంది. దీనికి సంబంధించిన వీడియోలను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేస్తూ అపానవాయువును అమ్మడం ద్వారా డబ్బు ఎలా సంపాదిస్తుందో పేర్కొంది. అలాగే అపానవాయువు బయటకు రావడం కోసం తాను ఎలాంటి ఫుడ్ తీసుకుంటుందో వివరించింది. వీడియోలో బీన్స్, ప్రోటీన్ మఫిన్, గట్టిగా ఉడికించిన గుడ్లు, ప్రోటీన్ షేక్, పెరుగు చూపిస్తుంది. ఇంతకూ గబ్బు లేపే అపానవాయువును కొనేదెవరు? ఈ సోది ఏంటి అనేగా మీ సందేహం. రెండు రోజుల్లోనే ఆమె 90 జార్లు అమ్మేసిందంటే... వాటికి ఎంత డిమాండ్ ఉందో ఆలోచించండి. తను అపానవాయువు పంపే గాజు పాత్రలో పూల రేకులు పెట్టడంతో అది సువాసన భరితంగా ఉంటుందని ఆమె తెలిపింది. వీటికి తోడు ఓ నోట్ కూడా రాసి పంపుతోంది. ఇంకేముంది అభిమాన తార నుంచి అపురూప కానుక అంటూ ఫ్యాన్స్ వేలకు వేలు పోసి కొనుక్కుంటున్నారు. చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే.. బజ్‌ఫీడ్ అనే మీడియా కంపెనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టెఫానీ మాట్లాడుతూ.. ‘అపానవాయువు అమ్ముకోవడం నాకు తగిన పని అని అనిపించింది. అంతేగాక కొంచెం ఫన్నీగా, డిఫరెంట్‌గా ఫీల్ అయ్యాను. ఇది కొత్త ఉపాధి కూడా’ అని ఆమె పేర్కొంది. View this post on Instagram A post shared by Stephanie Matto (@stepankamatto) View this post on Instagram A post shared by Stephanie Matto (@stepankamatto) -
కేంద్ర ప్రభుత్వం ఆధ్వరంలో రియాలిటీ షో.. ఎందుకోసమంటే ?
న్యూఢిల్లీ: వినూత్నమైన ఐడియాలున్న స్టార్టప్‌ల నిధుల సమీకరణకు ఊతమిచ్చే విధంగా ప్రత్యేక రియాలిటీ షోను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సోమవారం ఆవిష్కరించారు. ‘హార్సెస్ స్టేబుల్ – జో జీతా వహీ సికందర్‘ పేరిట ఈ షోను రూపొందించారు. స్టార్టప్‌లు, చిన్న.. మధ్య తరహా సంస్థలు తమ ఐడియాలను వివరించి, పెట్టుబడులను అందిపుచ్చుకునేందుకు ఇది తోడ్పడగలదని కాంత్ పేర్కొన్నారు. స్టార్టప్‌లకు తోడ్పాటునిచ్చేందుకు పరిశ్రమ దిగ్గజాలు ముందుకు రావడం హర్షణీయమని ఆయన తెలిపారు. హెచ్పీపీఎల్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కలిసి ఈ షోను రూపొందించారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ (మిషన్ డైరెక్టర్) చింతన్ వైష్ణవ్, సునీల్ శెట్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరైన ఇన్వెస్టరు నుంచే నిధులు సమకూర్చుకోవడం, తగిన భాగస్వాములే.. వ్యాపార వృద్ధికి దోహదపడగలవని చింతన్ వైష్ణవ్ పేర్కొన్నారు. చదవండి: ఐఐటీ హైదరాబాద్..స్టార్టప్‌ల కోసం స్పెషల్ ఫండ్ -
KBC: అమితాబ్ కష్టకాలపు రాతను మార్చి, కాసుల వర్షం కురిపించి..
కౌన్ బనేగా కరోడ్‌పతి? మీలో ఎవరు కోటీశ్వరుడు? అంటూ ప్రశ్నలతో పందెం విసిరి.. జవాబులకు వేలు, లక్షలు, కోటి రూపాయలు ఇస్తుంటే.. పందెం స్వీకరించడానికి ముందుకురాని వారెవరు?! ఆ చాన్స్‌తో జీకే మీద పట్టును, జీవితంలోని అదృష్టాన్నీ పరీక్షించుకోవడానికి హాట్ సీట్లో ఆసీనులైనవారెందరో! ఈ రియాలిటీ షో పోటీదారుల స్థాయిని పెంచింది.. షో హోస్ట్ అమితాబ్ బచ్చన్ కష్టకాలపు రాతను మార్చింది.. ప్రసారం చేసిన స్టార్ టీవీ చానల్ సరిహద్దుగీతను చెరిపేసింది.. ఏక కాలంలో అందరికీ కాసులు కురిపించింది.. దాని కథే ఇక్కడ.. 2000 సంవత్సరం మార్చి.. Kaun Banega Crorepati :ముంబై అంధేరీ ఈస్ట్‌లో ఉన్న స్టార్ టీవీ ఆఫీసులో వాతావరణం బాగా వేడెక్కి ఉంది. నాలుగేళ్ళ తరువాత సంస్థ ఛైర్మన్ రూపర్ట్ మర్దోక్ హాజరైన సమీక్షాసమావేశం అది. పాత ఒప్పందంలోని ఒక క్లాజ్ చూపించి ఎనిమిదేళ్ళపాటు హిందీ కార్యక్రమాలు చేయకుండా స్టార్‌ను జీ టీవీ అడ్డుకుంటూ వచ్చింది. ఉమ్మడి వ్యాపారానికి ఒప్పుకుంటే 50 శాతం వాటాతోబాటు చైర్మన్ పదవి ఇస్తానని చెబితే జీ టీవీ అధిపతి సుభాష్ కాదనటం మర్దోక్‌కి అవమానంగా అనిపించింది. అసహనాన్ని మరింత పెంచింది. తాజా రేటింగ్స్ తెలియజెప్పే మొదటి చార్ట్‌లోనే జీ టీవీ తిరుగులేని ఆధిక్యం, దానికి గట్టిపోటీ ఇస్తూ రెండో స్థానంలో సోనీ. ఎక్కడో దూరంగా విసిరేసినట్టు మూడో స్థానంలో ఉన్న స్టార్‌కు టాప్ 20 ప్రోగ్రామ్స్‌లో ఒక్కటంటే ఒక్కటే స్థానం. ‘మళ్లీ ఇలాంటి చార్ట్ నాకు కనబడ్డానికి వీల్లేదు’ తీవ్రస్వరంతో హెచ్చరించాడు మర్దోక్. ‘జీ టీవీని వెంటాడాల్సిందే. ఏం చేస్తారో మీ ఇష్టం’ తేల్చి చెప్పేశాడు. కొత్త ప్రోగ్రామింగ్ చీఫ్‌గా చేరిన సమీర్ నాయర్ వెంటనే తన ప్రజెంటేషన్‌లో అసలు పాయింట్‌కి వచ్చేశాడు. హూ వాంట్స్ టు బి ఎ మిలియనేర్ కార్యక్రమానికి హిందీ వెర్షన్ చేద్దామనుకుంటున్నట్టు చెప్పాడు. సినిమాలు సరిగా ఆడని స్థితిలో ఉన్న 57 ఏళ్ళ అమితాబ్ సెలెబ్రిటీ స్థాయిని వాడుకోవటానికి హోస్ట్‌గా ఒప్పిస్తానన్నాడు. ‘ఇంతకీ ప్రైజ్ మనీ ఎంత?’ అడిగాడు మర్దోక్. లక్ష రూపాయలిచ్చి, కార్యక్రమం పేరు ‘‘కౌన్ బనేగా లఖ్పతి’’ అని పెడతానన్నాడు నాయర్. ‘అంటే ఎంత?’ మళ్లీ అడిగాడు మర్దోక్. ఆయనకు అర్థం కావటానికి ‘2,133 డాలర్లు’ అని చెప్పాడు నాయర్. ‘ఇంత తక్కువా?’ పెదవి విరిచాడు మర్దోక్. ‘కలలో మాత్రమే ఊహించుకోవాలంటే ఎంత ఉండాలి?’ అని మళ్ళీ అడిగితే ‘కోటి.. అంటే పది మిలియన్లు’ అని జవాబొచ్చింది. అర్థం కాలేదు, మళ్లీ చెప్పమంటే ‘2,13,310 డాలర్లు’ అని అక్కడెవరో అన్నారు. ‘అయితే కోటి ఖాయం చెయ్యండి’ అనేసి ఇంకో మాటకు తావివ్వకుండా లేచి వెళ్ళిపోయాడు మర్దోక్. ‘కౌన్ బానేగా లఖ్పతి’ పేరు అప్పటికప్పుడు ‘కౌన్ బానేగా కరోడ్‌పతి’ గా మారిపోయింది. సమీర్ నాయర్ బాధ్యత ఇప్పుడు మరింత పెరిగింది. భారీ ప్రైజ్ మనీతో పోగ్రామ్ స్థాయి అనూహ్యంగా పెరగటం ఒకవైపు, అమితాబ్‌ను ఒప్పించగలమా అన్న భయం ఇంకోవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిజానికి దాదాపు ఏడాది కిందటే ఈ కార్యక్రమం గురించి ఆలోచించటం మొదలైంది. బ్రిటిష్ మూలానికి ఆసియా హక్కులున్న ఈసీఎం సంస్థ నుంచి భారతదేశానికి హక్కులు కొనుక్కోవటం లాంటి పనులు కూడా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమం ప్రొడక్షన్ బాధ్యతలు చేపట్టటానికి ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు తట్టిన ఒకే ఒక పేరు సిద్ధార్థ బసు. అప్పటికే డీడీలో ఆయన క్విజ్‌కు బాగా పేరుంది. బీబీసీలో మాస్టర్ మైండ్ ఇండియా కూడా పేరుమోసింది. ‘ఇంత భారీ ప్రోగ్రామ్ చేయగలనా?’ అని మొదట్లో తటపటాయించినా, తన సంస్థ సినర్జీ తరఫున చేయటానికి ఒప్పుకున్నాడు సిద్ధార్థ బసు. ఇది కేవలం క్విజ్ ప్రోగ్రామ్ కాదు. ఇందులో చాలా డ్రామా ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ కలిపి మాట్లాడుతూ రక్తి కట్టించాలి. అనుక్షణం నాటకీయత కనిపించాలి. ప్రేక్షకులకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తున్నట్టు ఉండాలి. హోస్ట్ భారతీయలందరికీ సుపరచితుడైన వ్యక్తి అయి ఉండాలి. అందుకే అప్పటి ఏకైక సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మాత్రమే ఈ పాత్రకు సరిపోతారన్నది సమీర్ నాయర్ అభిప్రాయం. సిద్ధార్థబసు కూడా సమర్థించారు. అప్పటికి అమితాబ్‌కు సినిమాలు లేవు. ఒప్పించటం సులువే అనుకున్నారు. అందుకే ధీమాగా మర్దోక్‌కి కూడా చెప్పారు. కానీ అమితాబ్ ఒప్పుకోలేదు. టీవీ అంటే ఒక మెట్టు దిగటమనే అభిప్రాయం ఆయనది. ఆ మాటకొస్తే ఆ రోజుల్లో సినిమా వాళ్ళందరి అభిప్రాయమూ అదే. ఎలాగైనా ఒప్పించాలని ప్రయాణిస్తున్న సమయంలోనే ఏప్రిల్ కూడా వచ్చేసింది. ఆఖరి ప్రయత్నంగా అమితాబ్‌ను లండన్ తీసుకువెళ్ళి అక్కడి సెట్, షూటింగ్ చూపిస్తే మనసు మారవచ్చుననుకున్నారు. ఆ విధంగా స్టార్ బృందం, అమితాబ్ లండన్ వెళ్ళారు. ఎల్స్ ట్రీ స్టూడియోలో ఒక రోజంతా గడిపి నిశితంగా పరిశీలించిన అమితాబ్ అడిగిన ప్రశ్న ఒక్కటే ‘అచ్చం ఇలాగే చేయగలరా?’ అని. అంతా భారీ స్థాయి, అద్భుతమైన సెట్, టెక్నాలజీ, లక్షల ఫోన్లను అందుకోగల సామర్థ్యం ఉండటం నిజానికి అప్పట్లో చాలా పెద్ద విషయాలే. జవాబు కోసం సిద్ధార్థ బసు వైపు చూశాడు సమీర్ నాయర్. ‘బడ్జెట్ ఉంటే చేయవచ్చు’ అన్నాడు బసు. స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నాయర్ మూడు నెలల ప్రయత్నం ఫలించి ఏప్రిల్‌లో ఒప్పందం మీద అమితాబ్ సంతకం చేశారు. ఆన్ ఎయిర్ 250 మందితో కూడిన సినర్జీ బృందం ముంబయ్‌కి తరలి వచ్చింది. సెలడార్ రూపకల్పన చేసిన ఫార్మాట్ ను యథాతథంగా తీసుకోవటంతోబాటు సెట్ కూడా అచ్చు గుద్దినట్టు అలాగే తయారు చేయటంలో ప్రముఖ డిజైనర్ నితిన్ దేశాయ్ విజయం సాధించాడు. పోటీదారును ఉద్వేగభరితుణ్ణి చేసే లైటింగ్, మ్యూజిక్ అన్నీ సిద్ధమయ్యాయి. 2000, జూన్‌లో ముంబయ్ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సెట్లో తొలిరోజు షూటింగ్‌కు అమితాబ్ రానే వచ్చారు. లైట్లాగి పోయాయి. ఏదో సాంకేతిక సమస్య. మూడు గంటలు వేచి చూసినా సమస్య పరిష్కారం కాలేదు. ఇదేదో అపశకునమంటూ అమితాబ్ వెళ్ళిపోయారు. అది చివరి దూరదృష్టమని స్టార్ ఉద్యోగులు సర్దిచెప్పుకున్నారు. 2000, జులై 3న స్టార్ టీవీలో రాత్రి 9 గంటలకు ‘కౌన్ బానేగా కరోడ్‌పతి’ మొదలైంది. భారతదేశ టీవీ చరిత్రలో ముందెన్నడూ చూడని అతిపెద్ద కార్యక్రమం అది. ఇండియా–పాకిస్తాన్ వన్డే క్రికెట్‌ను మించిన ఉత్కంఠ కనబడటంతో జనం టీవీకి అతుక్కుపోయేట్టు చేసింది. కంప్యూటర్ జీ, లాక్ కియాజాయే లాంటి పదాలు నిత్య జీవితంలో అందరూ సరదా సంభాషణాలలో వాడటానికి అలవాటు పడేంతగా పాపులర్ అయ్యాయి. కరోడ్‌పతి వర్సెస్ సినిమా మొదటివారంలో 10 రేటింగ్ పాయింట్స్ తెచ్చుకున్న షో ఆగస్టులో 18 దాటింది. వారానికి ఒక రోజు అరగంట చొప్పున ఉంటుందని జీ, సోనీ భావించగా సోమవారం నుంచి గురువారం దాకా నాలుగు రోజులపాటు గంటసేపు ప్రసారంగా మారటంతో అవి కంగుతిన్నాయి. అడ్వర్టయిజర్లు స్టార్ టీవీ ముందు క్యూ కట్టారు. పది సెకెన్లకు నాలుగున్నర లక్షలు ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అయితే ఆ అవకాశాన్ని వాడుకుంటూ ప్రకటనల వ్యవధిని పెంచాలని మాత్రం స్టార్ ఆలోచించలేదు. గంటకు 12 నిమిషాల ప్రకటనలకే పరిమితమైంది. ఆ సమయంలో మొదట్లో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రసారం చేయటం ద్వారా కరోడ్‌పతి దూకుడుకు అడ్డుకట్టవేయాలని జీ నిర్ణయించుకుంది. అయితే, వారానికి నాలుగు రోజులకు కరోడ్‌పతి విస్తరించటంతో అన్ని సినిమాలు కొని ప్రసారం చేయటం జీటీవీకి దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో జీ – సోనీ ఆధిక్యాన్ని స్టార్ శాశ్వతంగా వెనక్కు నెట్టేసింది. కరోడ్‌పతి మొదలైన అదే జూలై 3న రాత్రి 10.30 కు ఏక్తా కపూర్ సీరియల్ ‘క్యోం కీ సాస్ భీ కభీ బహూ థీ‘ కూడా మొదలవటం జీ, సోనీకి మరో దెబ్బ. కేబీసీ ఆదరణకు అడ్డుకట్టవేయటానికి అలాంటి కార్యక్రమమే సరైన మార్గమని జీటీవీ భావించింది. ప్రైజ్ మనీ భారీగా పెట్టి ‘‘సవాల్ దస్ కరోడ్ కా’’ అని ఊరిస్తూ, అనుపమ్ ఖేర్, మనీషా కోయిరాలా హోస్ట్‌లుగా ప్రారంభించింది. మొదటి వారం ఒక మోస్తరు రేటింగ్స్ వచ్చినా, మూడో వారానికే అందులో సగానికి పడిపోయి ఇక లేవలేదు. హిందీలో ఇప్పుడు నడుస్తున్నది 13వ సీజన్ కాగా, మొదటి మూడు సీజన్లు మాత్రమే స్టార్‌లో ప్రసారమయ్యాయి. ఆ తరువాత ఆసియా హక్కులు కొనుక్కున్న సోనీ సంస్థ భారత్ లో సోనీ టీవీలోనే ప్రసారం చేస్తూ వస్తోంది. మూడో సీజన్‌కు మాత్రమే షారూఖ్ ఖాన్ హోస్ట్‌గా ఉండగా మిగిలినవన్నీ అమితాబ్ నడిపినవే. మొదటి సీజన్లో కోటి రూపాయల బహుమతి ఉండగా 2, 3 సీజన్లలో ఆ మొత్తాన్ని రెండు కోట్లు చేశారు. 4 వ సీజన్‌తో సోనీలో మొదలైనప్పుడు ఇది 5 కోట్లకు చేరింది. ఏడో సీజన్ నుంచి ఇప్పటిదాకా రూ.7 కోట్లతో సాగుతోంది. డింగు టకా.. గొళ్లెం పెట్టు తెలుగులో అనుకరణ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ విశేషంగా ప్రజలను ఆకట్టుకుంటున్న రోజుల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చేసిన పేరడీ అప్పట్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. వరుసగా కొన్ని ఆదివారాల పాటు ఆయన ‘డింగు టకా, గొళ్ళెం పెట్టు’ లాంటి మాటలతో అలరించిన ఆ కార్యక్రమాన్ని ప్రైవేట్ నిర్మాతలు రూపొందించగా జెమినీ టీవీ ప్రసారం చేసింది. ‘చల్ మోహన రంగా’ పేరుతో ఇది కేవలం సరదాగా నవ్వించటానికి తయారుచేసిన పేరడీ కార్యక్రమం మాత్రమే. ఆ తరువాత కేబీసీ నమూనాలో కొద్దిపాటు మార్పులు చేస్తూ క్రియేటివ్ డైరెక్టర్ అడివి శ్రీనివాస్ సారధ్యంలో మా టీవీలో 17 ఏళ్ల కిందట ‘బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర’ పేరుతో క్విజ్ షో రూపొందించారు. ప్రైజ్ మనీ 5 లక్షలు. ఈ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఝాన్సీ హోస్ట్‌గా వ్యవహరించిన ఆ షో కోసం వేసిన సెట్ ఖరీదు కేవలం 5 లక్షలు కాగా ఆ రోజుల్లోనే 4 రేటింగ్ పాయింట్స్ సంపాదించటం విశేషం. ఐ న్యూస్‌లో బ్రహ్మానందం హోస్ట్‌గా చేసిన కార్యక్రమం కూడా కరోడ్‌పతి నమూనానే. ‘బ్రహ్మీ టెన్ లాక్ షో’ పేరులోనే ఉన్నట్టు దాని ప్రైజ్ మనీ 10 లక్షలు. ఒక న్యూస్ చానల్ అంత బడ్జెట్ పెట్టి ఇలాంటి షో చేయాలనుకోవటం దుస్సాహసమే అయినా, ఐ న్యూస్ అందుకు సిద్ధపడింది. కానీ భారీ ప్రొడక్షన్ ఖర్చు, బ్రహ్మానందం లాంటి బిజీ, ఖరీదైన నటుణ్ణి భరించటం సాధ్యంకాక మధ్యలోనే మానేయాల్సి వచ్చింది. దగ్గుతో మోసం అతిపెద్ద వివాదం సరిగ్గా 20 ఏళ్ల కిందట.. 2001 సెప్టెంబర్‌లో బ్రిటిష్ సైన్యంలో మేజర్‌గా ఉన్న చాల్స్ ఇన్‌గ్రాం విజేత అయ్యాడు. బహుమతి అందుకున్నాడు. అయితే రికార్డు చేసిన మొత్తం ప్రసారాన్ని ఎడిట్ చేస్తున్న ప్రొడక్షన్ సిబ్బందికి చిన్న అనుమానమొచ్చింది. అత్యంత కీలకమైన చివరి రెండు ప్రశ్నలకూ ముందు తప్పు సమాధానమిచ్చి తరువాత దిద్దుకోవటం గమనించారు. ఆ విధంగా అర మిలియన్ పౌండ్ల ప్రశ్నకూ, మిలియన్ పౌండ్ల ప్రశ్నకూ ఒక దగ్గు శబ్దం వినపడగానే సమాధానం మార్చుకున్నట్టు అర్థమైంది. పైగా, అలా దగ్గింది స్వయానా ఇన్‌గ్రామ్ భార్య డయానా. మొత్తం టేపులు పరిశీలించినప్పుడు అంతకుముందు కూడా తప్పుడు సమాధానాలకు అలా దగ్గినట్టు తేలింది. ప్రత్యక్షప్రసారం కాదు కాబట్టి ఎడిటింగ్ దశలో గుర్తుపట్టిన ఈ మోసం వల్ల ఐటీవీ ఈ ఎపిసోడ్ ప్రసారం నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం కోర్టుకెక్కింది. డస్ట్ ఎలర్జీ వలన దగ్గానే తప్ప క్లూ ఇవ్వటానికి కాదన్న డయానా వాదనను కోర్టు నమ్మలేదు. మొత్తం ఫుటేజ్‌ని కోర్టు పరిశీలించి శిక్ష, జరిమానా విధించింది. బహుమతి వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. బ్రిటిష్ సైనికాధికారులు చాల్స్ ఇన్‌గ్రామ్‌ను మేజర్ హోదా నుంచి తప్పించి ఇంటికి పంపారు. కోర్టు విచారణ పూర్తయ్యాక ఐటీవీ స్వయంగా ‘మిలియనేర్: ఏ మేజర్ ఫ్రాడ్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ తయారుచేసి ప్రసారం చేయటం విశేషం. బైటికిరాని ఆ ఫుటేజ్‌లోని కీలక భాగాలతోబాటు ప్రొడక్షన్ సిబ్బంది, ఆ సమయంలో పాల్గొన్న మరికొందరు పోటీదారుల ఇంటర్వ్యూలతో ఆ డాక్యుమెంటరీ తయారైంది. ఆ తరువాత జేమ్స్ గ్రాహమ్ రాసిన నాటకాన్ని కూడా ఐటీవీ ప్రసారం చేసింది. ఈ మొత్తం వివాదం మీద ‘బాడ్ షో: ది క్విజ్, ది కాఫ్, ది మిలియనీర్ మేజర్’ పేరుతో ఒక పుస్తకం కూడా వచ్చింది. ‘ఫోన్ ఎ ఫ్రెండ్’ అనే అవకాశాన్ని వాడుకోవటం కూడా పక్కదారులు పట్టింది. ఈ లైఫ్ లైన్ వాడుకోవాలనుకునే వారికి సాయం చేసే ముఠా ఒకటి తయారైంది. విషయ పరిజ్ఞానం ఉన్న ఒక బృందాన్ని సిద్ధం చేసుకొని పోటీదారులతో బేరం కుదుర్చుకొని ఫోన్ నెంబర్ ఇవ్వటం ద్వారా 200 మందికి దాదాపు 5 మిలియన్ పౌండ్లు గెలుచుకోవటానికి సాయం చేసినట్టు ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కీత్ బర్జెస్ ఒప్పుకున్నాడు. 2007లో బ్రిటిష్ పత్రికలు ఈ విషయం బహిర్గతం చేశాయి. ఈ లోపాన్ని సరిదిద్దటానికి ఆ తరువాత కాలంలో పోటీదారుడు తన ఫ్రెండ్ పేరుతో పాటు ఫోటో కూడా ఇవ్వాలనే షరతు పెట్టి దాన్ని కూడా టీవీ తెరమీద చూపించటం మొదలుపెట్టారు. ఈ భాషల్లోనూ.. ప్రాంతీయ చానల్స్ కూడా దీన్ని బాగానే వాడుకున్నాయి. అక్కడి భాషలో పేర్లు పెట్టుకోవటంతోబాటు కొద్దిపాటి మార్పులు చేసుకున్నాయి. స్టార్ లో మొదలైన కొద్ది నెలలకే సన్ గ్రూప్ తన తమిళ చానల్ సన్ టీవీలోనూ, మలయాళ చానల్ సూర్యలోనూ కోటీశ్వరన్ పేరుతో ప్రసారం చేసింది. 2011లో శత్రుఘ్న సిన్హా హోస్ట్‌గా భోజ్‌పురిలో, సౌరభ్ గంగూలీ హోస్ట్‌గా బెంగాలీలో, 2012లో స్టార్ విజయ్ (తమిళం) లో, స్టార్ సువర్ణ (కన్నడం)లో, ఈ టీవీ మరాఠీలో, ఏసియానెట్ (మలయాళం) లో, 2014లో స్టార్ మా (తెలుగు)లో, 2019లో డీడీ కశీర్ (కశ్మీరీ)లో మొదటిసారి అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇదే కార్యక్రమం వివిధ కారణాలవలన చానల్స్ మారుతూ వచ్చింది. ప్రసార హక్కులున్న సోనీ తనకు ప్రాంతీయ చానల్స్లేని చోట అలా అమ్ముతూ వస్తోంది. అందుకే ‘స్టార్ మా’లో మూడు సీజన్లు ( రెండు సీజన్లకు నాగార్జున, మూడో సీజన్‌కు చిరంజీవి హోస్ట్ లుగా) ప్రసారమయ్యాక ఇప్పుడు తెలుగులో నాలుగో సీజన్ జెమినీ టీవీలో ఎన్టీయార్ హోస్ట్‌గా ప్రసారమవుతోంది. మూలం.. బ్రిటన్‌లో డేవిడ్ బ్రిగ్స్ రూపకల్పన చేసిన ‘‘హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్ ’’ గేమ్ షోను ఐటీవీ కోసం సెలెడార్ సంస్థ నిర్మించింది. క్రిస్ టారంట్ దీనికి హోస్ట్. 1998 సెప్టెంబర్ 4 న మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది. సరైన సమాధానానికి బహుమతి ఇస్తూ, వరుసగా అడిగే ప్రశ్నల బహుమతిని పెంచుకుంటూ ఆఖరి ప్రశ్నకు మిలియన్ పౌండ్లు ఇవ్వటం స్థూలంగా ఈ క్విజ్ షో థీమ్. వచ్చిన బహుమతితో వెళ్ళిపోవటమా, కొనసాగటమా అనేది పోటీదారు ఇష్టం. జవాబు ఇవ్వటంలో సాయపడేలా అనేక లైఫ్ లైన్స్ కూడా ఇస్తారు. ఈ షో 1999 లో 60% మార్కెట్ వాటాతో బీబీసీ చరిత్రలోనే రేటింగ్స్ అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గేట్టు చేసింది. ఇలా అనూహ్యమైన విజయం సాధించటంతో అంతర్జాతీయ ఫ్రాంచైజ్ గా మారి వివిధ దేశాలలో కొద్దిపాటి మార్పులతో ఇప్పటికీ ప్రసారమవుతూనే ఉంది. ఈ నమూనాకు ప్రాతిపదిక తమదేనంటూ చాలామంది కోర్టుకెక్కారు. కొన్ని వాదనలు వీగిపోగా, మరికొందరికి డబ్బిచ్చి సెటిల్ చేసుకున్నారు. ఈ షో వర్కింగ్ టైటిల్ ‘ది కాష్ మౌంటేన్’. అయితే 1956 నాటి ‘హై సొసైటీ’ చిత్రానికి కోల్ పోర్టర్ రాసిన పాట ‘హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్‘ బాగా నచ్చి దాన్నే వాడుకున్నారు. అయితే, అలా వాడుకోవటం మీద దుమారం చెలరేగటంతో అప్పుడు కూడా కొంత పరిహారం చెల్లించి సెటిల్ చేసుకున్నారు. -తోట భావనారాయణ -
కేబీసీలో 5 కోట్లు గెలిచాడు.. కానీ దివాళా తీశాడు!
కౌన్ బనేగా కరోడ్‌పతి 5వ సీజన్ విజేత సుశీల్ కుమార్ గుర్తున్నాడా? ఇప్పుడు అతడి ప్రస్తావన ఎందుకని అనుకుంటున్నారా? ఎందుకంటే కేబీసీ 13వ సీజన్ ఆగస్టు 23 నుంచి ప్రసారమవుతోంది. ఈ నేపథ్యంలో సుశీల్ కుమార్ మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చాడు. 2011లో కేబీసీ విజేతగా నిలిచిన ఈ బిహారీ కామన్‌మేన్ నిజ జీవితంలో మాత్రం విఫల వ్యక్తిగా మిగిలాడు. రియాలిటీ క్విజ్ షోలో మొట్ట మొదటిసారిగా గెలిచిన 5 కోట్ల రూపాయలను ఇష్టారీతిని ఖర్చు చేసి చివరకు దివాళా తీశాడు. తన విఫలగాథను పేస్బుక్ పేజీలో గతేడాది ఏకరవు పెట్టాడు. 2011లో కేబీసీ 5వ సీజన్లో విజేతగా నిలిచి బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా 5 కోట్ల రూపాయల చెక్ అందుకున్నాడు సుశీల్ కుమార్. కానీ ఆ తర్వాత అతడి జీవితం ఊహించని మలుపులు తిరిగింది. ‘2015-16 నా జీవితంలో అత్యంత సవాల్‌తో కూడిన సమయం. ఏం చేస్తున్నానో నాకే తెలియదు. ఆ టైమ్‌లో నేను లోకల్ సెలబ్రిటీ అయిపోయాను. బిహార్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ నెలకు 10 నుంచి 15 కార్యక్రమాలకు హాజరయ్యేవాడిని. క్షణం తీరిక లేకపోవడంతో చదువులకు దూరమయ్యాను. లోకల్ సెలబ్రిటీ హోదా రావడంతో మీడియా కూడా నా వెంట పడేది. జర్నలిస్టులు నా ఇంటర్వ్యూలు తీసుకునే వారు. నా గురించి గొప్పగా రాసేవారు. మీడియాతో ఎలా మాట్లాడాలో తెలియకపోయినా ఏదేదో చెప్పేసేవాడిని. కాని కొన్నిరోజుల తర్వాత చూస్తే నా పరిస్థితి మొత్తం తలకిందులైంద’ని సుశీల్ రాసుకొచ్చాడు. ఎంతో మంది మోసం చేశారు కేబీసీలో ఐదు కోట్లు సంపాదించడంతో స్వచ్చంద సంస్థలు సుశీల్ కుమార్ వెంట పడ్డాయి. ముందు వెనుక చూడకుండా అతడు దానధర్మాలు చేసి మొత్తం ఊడ్చిపెట్టడంతో భార్యతో విభేదాలు తలెత్తాయి. ‘కేబీసీలో గెలిచాక మహా దాతగా మారిపోయాను. రహస్యంగా దానాలు చేయడం వ్యసనంగా మారిపోయింది. దీన్ని అలుసుగా తీసుకుని చాలా మంది నన్ను మోసం చేశారు. దానాలు చేసిన తర్వాతే ఈ విషయం నాకు బోధపడింది. ముందు వెనుక చూడకుండా దానాలు చేయొద్దని నా భార్య పోరు పెట్టేది. దీంతో నా భార్యతో గొడవలు మొదలయ్యాయి. తర్వాత నెమ్మదిగా మద్యానికి, పొగ తాగడానికి అలవాటుపడ్డాను. నేను ఢిల్లీలో వారం రోజులు ఉన్నప్పుడు పలు రకాల వ్యక్తులతో కలిసి మద్యం, ధూమపానం చేసేవాడిని. అక్కడ వారి మాటలు నాకు బాగా నచ్చేవి. దీంతో మీడియాను తేలిగ్గా తీసుకోవడం ప్రారంభించాన’ని సుశీల్ కుమార్ వెల్లడించాడు. దావానలంలా దివాళా వార్త.. తాను దివాళా తీశానన్న వార్త బయటకు రావడంతో జనం తనను పట్టించుకోవడం మానేశారని, కార్యక్రమాలకు పిలవడం మానేశారని సుశీల్ చెప్పాడు. ‘నేను ఎలా దివాళా తీశాననే విషయం గురించి సినిమాటిక్‌గా చెబుతా. ఒకసారి ఇంగ్లీషు న్యూస్‌పేపర్ జర్నలిస్ట్ ఒకరు నాకు ఫోన్ చేసి విసిగించడంతో.. నా డబ్బు మొత్తం అయిపోయిందని, నా దగ్గర కేవలం రెండు ఆవులు మాత్రమే ఉన్నాయని.. పాలు అమ్ముకుని బతుకుతున్నానని చెప్పాను. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో నా వెంట పడటం మానేశార’ని చెప్పుకొచ్చాడు. సినిమా కల.. ముంబై వల భార్యతో విభేతాలు తలెత్తడంతో దర్శకుడు కావాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు ముంబైకి మకాం మార్చాడు సుశీల్ కుమార్. ‘ముంబైలో నాకు సన్నిహితులైన గీత రచయితలతో రోజుల తరబడి మంతనాలు జరిపాను. రూమ్‌లో ఉంటూ రోజంతా సినిమాలు చూసేవాడిని. పుస్తకాలు చదివాను. ఇలా ఆరు నెలల కాలం గడిపేశాను. అప్పుడే రోజుకో ప్యాకెట్ సిగరెట్లు కాల్చేవాడిని. చాలా విషయాలు నేర్చుకున్న తర్వాత మూడు స్క్రిప్ట్‌లు రాశాను. ఒక ప్రొడక్షన్ హౌస్ నా స్క్రిప్ట్‌లకు 20 వేల రూపాయలు కూడా ఇచ్చింది. కొంత కాలం తర్వాత నా కళ్లు తెరుచుకున్నాయి. దాంతో ముంబై నుంచి మా ఊరికి తిరిగి వచ్చి టీచర్‌గా ఉద్యోగం సంపాదించాన’ని తెలిపాడు. ఇప్పుడంతా హ్యాపీ! ‘ముంబైలో ఆరు నెలల పాటు ఒంటరిగా గడిపిన తర్వాత నాకు విషయం బోధపడింది. ఫిల్మ్ మేకర్ కావడానికి ముంబై రాలేదని.. సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఇక్కడకు వచ్చానని అర్థమయింది. మనసుకు నచ్చిందే చేయాలని ఆ క్షణంలో నిర్ణయించుకున్నాను. వెంటనే మా ఊరికి తిరిగి వచ్చి టీచర్ ఉద్యోగానికి ప్రిపరేషన్ మొదలుపెట్టాను. మొత్తానికి జాబ్ సాధించాను. మందు, సిగరెట్ మానేశాను. పర్యావరణ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాను. ప్రస్తుతం ప్రతి రోజు నాకు పండగలా గడుస్తోంది. తిండికి లోటు లేకుండా సంపాదిస్తే చాలు అనుకుంటున్నాను. పర్యావరణాన్ని మెరుగుపరచడానికి నా వంతు సాయం చేస్తూనే ఉంటాన’ని సుశీల్ కుమార్ ముగించాడు. సో.. సొమ్ములు సంపాదించడమే కాదు.. సవ్యంగా ఖర్చు పెట్టడం తెలియాలని సుశీల్ లైఫ్ స్టోరీ కళ్లకు కడుతోంది! -
భర్త అరెస్ట్‌తో రియాలిటీ షో నుంచి తప్పుకున్న శిల్పాశెట్టి!
Raj Kundra Arrest: పోర్నోగ్రఫీ కేసులో కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ కావడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి.. వాళ్లతో అడల్ట్ చిత్రాలు తీస్తున్నాడని రాజ్‌కుంద్రాపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. కుంద్రా అరెస్ట్‌తో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత రెండు రోజులుగా దీనికి సంబంధించిన వార్తలు హెడ్‌లైన్స్‌గా మారాయి. ఈ మొత్తం వ్యవహారంతో ఆయన భార్య, ప్రముఖ నటి శిల్పా శెట్టి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. దీంతో ఆమె జడ్జిగా ఉన్న ఓ రియాలిటీ షో నుంచి తప్పుకోవాలని శిల్పా భావిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను సోనీ టీవీ రిలీజ్ చేసింది. ఇందులో శిల్పా శెట్టి స్థానంలో కరీష్మా కపూర్ కనిపించడం రూమర్స్‌కు మరింత బలం చేకూర్చాయి. అయితే కరీష్మా కేవలం ఒక్క ఎపిసోడ్‌కు మాత్రమే గెస్ట్‌గా వచ్చారని, ఆమె షో మొత్తానికి కొనసాగరని సన్నిహిత వర్గాల సమాచారం. దీంతో శిల్పా శెట్టి స్థానంలో మరొకరు వస్తారా? లేక ఆమె తిరిగి జడ్జిగా కొనసాగుతారా అన్నది చూడాల్సి ఉంది. కొద్ది నెలల క్రితం రాజ్‌కుంద్రా సహా మిగతా కుటుంబసభ్యులు కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో శిల్పా బ్రేక్ తీసుకోగా, ఆమె స్థానంలో మలైకా అరోరా జడ్జిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె మరో రియాలిటీ షోకు జడ్జిగా కొనసాగుతున్నారు. మరోవైపు శిల్పా శెట్టి ప్రధానపాత్రలో నటించిన 'హంగామా' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శిల్పా.. ఈ చిత్రంతో మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని భావించింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో రాజ్‌కుంద్రా అరెస్ట్‌తో శిల్పాకు గడ్డుకాలమనే చెప్పొచ్చంటున్నారు సినీ పెద్దలు. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
నటి ఆరోపణలు.. డీసెంట్‌గా స్పందించిన రమ్యకృష్ణ
వనితా విజయ్‌కుమార్.. సీనియర్ యాక్టర్స్ విజయ్-మంజుల కూతురు. వ్యక్తిగత కారణాలతో నటనకు చాలాకాలం దూరంగా ఉన్న ఈమె.. బిగ్ బాస్ ద్వారా మళ్లీ తెర మీదకు వచ్చింది. ఆ తర్వాత తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా స్టార్ విజయ్ టీవీతో ఆమె ప్రయాణం కొనసాగుతూ వస్తోంది. తాజాగా ‘బిగ్‌బాస్ జోడిగల్’ రియాలిటీ షోలో పాల్గొంటున్న ఆమె.. ఆ షో నుంచి అర్థాంతరంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలో కాస్టింగ్ కౌచ్, వేధింపులు, అవమానాలు అంటూ ట్వీట్లు చేసిన వనితా.. ఓ సీనియర్ నటి వల్లే తాను షోను వీడాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ షోకి హోస్ట్ వ్యవహరిస్తోంది నటి రమ్యకృష్ణన్(రమ్యకృష్ణ). పైగా ఈ షో మొత్తంలో ఆమె సీనియర్ కూడా. దీంతో ఆమెను ఉద్దేశించే వనితా ఈ కామెంట్లు చేసిందని అంతా అనుకుంటున్నారు. Thank you @vijaytelevision for giving me the best opportunities of my life beginning from #biggbosstamil3 ..#cookuwithkomali season 1..and #kalakkapovadhuyaaru season 9.. and #bbjodigal. I want to make it clear I WALKED OUT OF THE SHOW @bbsureshthatha sorry I had to do this..❤️🙏 pic.twitter.com/E0c95POaoD — Vanitha Vijaykumar (@vanithavijayku1) July 2, 2021 అయితే ఈ వివాదాన్ని ఓ కోలీవుడ్ న్యూస్ ఛానెల్ రమ్యకృష్ణ వద్ద ప్రస్తావించింది. దానికి రమ్యకృష్ణ బదులిస్తూ.. ‘‘షోలో ఏం జరిగిందో కూడా మీరు ఆమెను అడిగి ఉంటే బాగుండేది’’ అని బదులిచ్చింది. ‘నాకు సంబంధించినంత వరకు ఇదేం పెద్ద విషయం కాదు. నో కామెంట్స్ అని తేల్చేసింది ఆమె. కాగా, చివరి ఎపిసోడ్లో వనిత పర్ఫార్మెన్స్కు పదికి 1 మార్క్ ఇచ్చింది రమ్యకృష్ణ. చదవండి: ఆ కామెంట్ నచ్చకే విడిపోయా- హీరోయిన్ -
భార్యకు నటుడి సర్ప్రైజ్; థాంక్యూ అంటూ భావోద్వేగం
లండన్: ‘అమ్మా’ అనే పిలుపు కోసం మహిళలు పరితపించడం సహజం. ముఖ్యంగా గర్భవతైన తర్వాత పుట్టబోయే బిడ్డ గురించి అనేక కలలు కంటారు కాబోయే తల్లులు. తమ పాపాయి ఎలా ఉండబోతుంది, తను ఎప్పుడెప్పుడు ఈ ప్రపంచంలోకి వస్తుందా.. తనను ఎలా పెంచాలి.. ఇలాంటి ఎన్నో ఆలోచనలు వారిని వెంటాడతాయి. అలాంటి సమయంలో జీవిత భాగస్వామి ఎంత ప్రేమను కురిపిస్తే వారి మనసు అంత ఆహ్లాదంగా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నారు ప్రముఖ రియాలిటీ షో స్ల్పిట్స్‌విల్లా హోస్ట్, నటుడు రన్విజయ్ సింఘా భార్య ప్రియాంక సింఘా. 2014లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఇప్పటికే ఓ కూతురు కనియత్ సింఘా ఉండగా.. త్వరలోనే మరో చిన్నారి వారి జీవితాల్లోకి రాబోతోంది. ఈ సంతోషకర సమయంలో భార్యకు మరచిపోలేని సర్ప్రైజ్ ఇచ్చాడు రన్విజయ్. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైనప్పటికీ.. ఇంటి ఆవరణలోనే అందంగా డెకరేట్ చేయించి భార్య సీమంతం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన ప్రియాంక సింఘా.. ‘‘ఎనిమిది నెలలుగా ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాం కదా. కాబట్టి మనం బద్దకస్తులుగా మారటం సహజం. ఇతరులకు దూరంగా ఉండక తప్పదు. కానీ అక్కడితోనే అంతా ముగిసిపోదు. పద పద త్వరగా రెడీ అవ్వు అంటూ తను తొందరపెట్టేశాడు. బయటకు రాగానే గార్డెన్లో చూస్తే ఆశ్చర్యం. నా జీవితంలోని బెస్ట్ సర్ప్రైజ్ ఇది. థాంక్యూ.. బేబీ షవర్‌ను ఇంత అందమైన మధురజ్ఞాపకంగా మలిచిన రన్‌కు, తనకు సహకరించిన సిబ్బందికి రుణపడి ఉంటాను’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా స్ల్పిట్స్‌విల్లా, రోడీస్ వంటి షోలకు హోస్ట్‌గా వ్యవహరించిన రన్విజయ్.. టాస్, లండన్ డ్రీమ్స్, యాక్షన్ రిప్లే వంటి సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలోనూ నటించాడు. చదవండి: గర్భవతిగా ఉన్నా పెళ్లి చేసుకుంటానన్నాడు: నటి రిస్క్ వద్దు.. పెంట పెట్టుకోవద్దుని హెచ్చరించారు: ఆమిర్ ఖాన్ View this post on Instagram A post shared by Prianka Singha (@priankasingha) View this post on Instagram A post shared by Prianka Singha (@priankasingha) -
19 ఏళ్లకే సెలబ్రిటీ, నెలకు రూ.6 లక్షల సంపాదన!
ఏయ్ బంటీ నీ సబ్బు స్లోనా ఏంటీ? అంటూ లైఫ్‌బాయ్ యాడ్‌లో ఎంతో చక్కగా నటించిన అనాటి చిన్నారి.. కట్ చేస్తే నేటి సోషల్ మీడియా సంచలన సూపర్ స్టార్‌గా ఎదిగింది. యాడ్లు, సీరియళ్లు, సినిమాల్లో నటిస్తూ.. మరోపక్క సోషల్ మీడియాలో ఫ్యాషన్, లైఫ్స్టై్టల్, మేకప్ ట్యుటోరియల్స్ వీడియోలు పోస్టుచేస్తూ, ఒకప్పటి టిక్‌టాక్ క్వీన్‌గానూ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో దాదాపు రెండు కోట్లమంది ఫాలోవర్స్‌తో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది అవనీత్ కౌర్. పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో.. అమన్‌దీప్ నంద్ర, సోనియా నంద్ర దంపతులకు 2001 అక్టోబర్ 13న అవ్నీత్ జన్మించింది. అవ్నీత్కు జయ్జీత్ సింగ్ అనే అన్నయ్య ఉన్నాడు. తండ్రి ఓ కంపెనీలో పనిచేస్తుండగా తల్లి గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జలంధర్‌లో పాఠశాల విద్యనభ్యసించిన అవనీత్ తరువాత ముంబైకు మారింది. ప్రస్తుతం ముంబైలోని ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్మీడియట్ 74 శాతం మార్కులతో పాసయ్యింది. ఒకపక్క చదువును కొనసాగిస్తూనే, కెరీర్లో నిలదొక్కుకుంటూ లక్షల్లో సంపాదిస్తోంది అవ్నీత్. డ్యాన్స్ రియాల్టి షోలు.. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ షో ద్వారా ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అవ్నీత్ అరంగేట్రం చేసింది. తన డ్యాన్స్ స్టెప్పులతో డ్యాన్స్ షోలో టాప్ త్రీ కంటెస్టెంట్స్‌లో ఒకటిగా ఉండేది. అంతేగాక ‘డ్యాన్స్ కే సూపర్‌స్టార్స్’లో కూడా పాల్గొంది. ఈ షోలో ఎంతో పాపులర్ అయిన ‘జలక్ దిఖలాజా’పాటకు డ్యాన్స్ చేసిన ఐదుగురు కంటెస్టెంట్స్‌లో అవ్నీత్ కూడా ఒకటి. మేరీ మా టీవి సీరియల్ ద్వారా తొలిసారి టీవీ తెరకు పరిచయమైంది. క్రమంగా సీరియల్స్ చేస్తూ.. జీ5 వెబ్‌సిరీస్ ‘బబ్బర్ కా తబ్బార్’ వంటి వాటిలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘‘అల్లాద్దిన్ నామ్ తో సునా హోగా’’ సీరియల్లో ప్రిన్సెస్‌గా నటించి ఎంతోమంది అభిమానాన్ని చూరగొంది. టీవీ షోలతో వచ్చిన గుర్తింపుతో మర్దాని సినిమాలో మీరా క్యారెక్టర్‌ను ఎంతో చక్కగా పోషించింది. తరువాత వచ్చిన మర్దాని–2 లో కూడా అవనీత్ నటించడం విశేషం. ఈ రెండు సినిమాల్లో అవ్నీత్ నటనకు అనేక ప్రశంసలు వచ్చాయి. తరువాత రొమాంటిక్ కామెడీ సినిమా ఖరీబ్ ఖరీబ్‌లో నటించింది. సింగర్‌గానూ.. అవ్నీత్ ఒకపక్క డ్యాన్సర్‌గానూ మరోపక్క మంచి నటిగా రాణిస్తూ చక్కటి గాయనిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే చాలా మ్యూజిక్ ఆల్బమ్స్‌ను విడుదలచేసింది. అవనీత్‌కు మ్యూజిక్ పరంగా మంచి పేరు తెచ్చిన వాటిలో కాలీ మేరీ ఘాడీ, తార్సే యే నైనా, యారి, పహాదాన్, మేరే నైనా, అటాచ్మెంట్, తేరి నాజర్, మెయిన్ ఫిర్ నైనాలు బాగా ఫేమస్ అయిన వాటిలో ఉన్నాయి. హిందీ, పంజాబీ భాషల్లో తన గానంతో అలరిస్తోంది. సంపాదన, ఫాలోవర్స్ లక్షల్లోనే.. ఒకపక్క నటన, మరోపక్క సింగింగ్‌తో రోజంతా తీరికలేకుండా ఉండే అవనీత్ తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, మేకప్ ట్యూటోరియల్, డ్యాన్స్ వీడియోలను పోస్టు చేసి యూట్యూబ్, టిక్‌టాక్ ఇన్‌స్టాగ్రామ్‌లలో లక్షలమంది ఫాలోవర్స్ అభిమానం సంపాదించింది. రోజూ తన అప్డేటెడ్ వీడియోలతో ఎంతోమంది యువతీ యువకులకు ప్రేరణగా నిలుస్తోంది. ప్రస్తుతం అవనీత్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ దాదాపు రెండు కోట్లమంది ఉన్నారు. ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ చేయకముందు వరకు అవనీత్ అకౌంట్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య కోటీ ఎనభై ఆరు లక్షలుగా ఉండేది. అప్పట్లో టిక్‌టాక్ క్వీన్‌గానూ అలరించింది. అవ్నీత్ ఎప్పటికప్పుడు తన అందచందాలతోనూ, డ్యాన్స్స్కిల్స్తో తన అభిమానులను అలరిస్తూ సోషల్ మీడియాలో పెద్ద స్టార్‌గా ట్రెండ్ అవుతోంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈ ఏడాదికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. 19 ఏళ్లకే సెలబ్రెటి హోదాను పొందడం ఒక ఎల్తైతే.. నెలకు ఆరులక్షల రూపాయలకు పైగా గడిస్తూ ఏడాదికి కోటి రూపాయల టర్నోవర్‌ను కలిగి ఉండడం విశేషం. -
ప్రియురాలిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక..
ముంబై : ప్రముఖ రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ' పదకొండవ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగే ఈ షోలో పాల్గొనేందుకు ఇప్పటికే కంటెస్టెంట్లు సన్నద్ధం అయ్యారు. ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ ఫేం రాహుల్ వైద్య, వరుణ్ సూద్, దివ్యంకా త్రిపాఠి అర్జున్ బిజ్లాని, నిక్కి తంబోలి, అభినవ్ శుక్లా సహా పలువురు ఈ షోలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి ముంబై ఏయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్ ప్రియురాలు దిషా పర్మార్‌ని వదిలి వెళ్లేటప్పుడు ఎమోషల్ అయ్యారు. ప్రియురాలికి ముద్లులు, హగ్గులు ఇచ్చి విడ్కోలు పలికారు. ఈ ఫోటోలను క్లిక్ మనిపించిన ఫోటోగ్రాఫర్లు వీరిది ఎంతో క్యూట్ జోడీ అంటూ కొనియాడారు. ఇక ఈ పోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హిందీ బిగ్‌బాస్-14లో రుబీనా దిలైక్‌తో తలపడి రాహుల్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదే షోలో ప్రియురాలు దిశా పర్మార్‌ని కూడా పరిచయం చేసిన రాహుల్ మరొకొద్ది నెలల్లోనే తమ వివాహం ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టినా కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఖత్రోన్ కే ఖిలాడీ షోలో పాల్గొనేందుకు సన్నద్ధం అయ్యారు. అయితే ఏయిర్‌పోర్టులో ప్రేయసిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక రాహుల్ మదనపడుతూ కనిపించాడు. View this post on Instagram A post shared by Rahul Vaidya world (@mad_fan_of_rahul_vaidya_) ఛదవండి : 'బిగ్‌బాస్' వల్ల నాకు ఒరింగిందేమీ లేదు : నటి నా కుమారులు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు: నటి -
'పక్కన ఉండుంటే సూసైడ్ చేసుకోనిచ్చేవాడిని కాదు'
చెన్నై: తమిళ రియాలిటీ షో డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. వానవిల్ సూపర్ స్టార్స్ షో డైరెక్టర్ దేవ్ రాజా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు జేమ్స్ వసంతన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. మలేషియాలో స్థిరపడిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ కొద్ది నెలల క్రితం భారత పర్యటనకు వచ్చాడు. ఈ క్రమంలో తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకున్న తనకు చెన్నైలోని తన నివాసంలో దేవ్ మంచి ఆతిథ్యమిచ్చాడని గుర్తు చేసుకున్నాడు. దేవ్‌తో వుండివుంటే ఆత్మహత్య ఆలోచనలనే రానిచ్చేవాడిని కాదని, ప్రాణం తీసుకోకుండా అడ్డుకునేవాడిని అన్నాడు. కాగా దేవ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. துக்க செய்தி இங்கு 'Super Singer' போல மலேஷியாவில் Astro channel-ல் 'வானவில் சூப்பர் ஸ்டார்' என்றொரு நிகழ்ச்சி... Posted by James Vasanthan on Saturday, 24 April 2021 చదవండి: మరోసారి ఆ డైరెక్టర్‌తో జతకట్టనున్న ధనుష్ అలీ రెజా కొత్త కారు, రవి ఏదో అంటున్నాడే? -
EMK: షోలో పాల్గొనాలనుకుంటున్నారా.. అయితే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటిశ్వరులు’తో మరోసారి బుల్లితెరపై సందడి చేయడానికి వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హోస్టోగా వస్తున్న ఈ రియాలిటీ షో తర్వలో జెమిని టీవీలో ప్రసారం కానుంది. ఇప్పటికే సరికొత్తగా విడుదలైన ఈ ప్రోమో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. ఎన్టీఆర్ కోమరం భీంగా ఎంట్రీ ఇచ్చి ‘ఆట నాది.. కోటీ మీది’ అంటూ చెప్పిన డైలాగ్ షోకు మరింత హైప్‌ను క్రియోట్ చేసింది. ఇక ఈ ప్రోమోకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించడం విశేషం. కాగా త్వరలోనే ఈ షో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా జెమిని టీవీ కంటెస్టెంట్స్‌కు ఆహ్వానం పలుకుతోంది. ఈ సందర్భంగా ఈ షో పాల్గొనే వారి కోసం ఓ వీడియో విడుదల చేసింది. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ వీడియోలో చెప్పినట్టుగా చేసి.. కంటెస్టెంట్స్‌గా వెళ్లి.. కోటీశ్వరులగా తిరిగి రండి. -
మీ లైఫ్‌ను మార్చే మొదటి ప్రశ్న..డోంట్ మిస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేయబోతున్న రియాల్టీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’. త్వరలోనే జెమిని టీవీలో ఈ షో ప్రసారం కానుంది. శుక్రవారం ఈ షోకి సంబంధించి మరో ఇంపార్టెంట్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో చార్మినార్ గురించి టూరిస్టులకు చెబుతూ ఓ గైడ్..ఇది చార్మినార్...దేశం నాలుగు దిక్కుల నుండీ టూరిస్టులు వస్తుంటారు.. అందుకే దీనిని చార్మినార్ అంటారు అని చెప్పగా, ఎందుకు కట్టారని టూరిస్ట్ ప్రశ్నించగా..రోడ్లు విశాలంగా ఉన్నాయి...అందుకే కట్టేశారని గైడ్ సమాధానం చెప్తాడు. దీంతో వెంటనే అక్కడున్న ఆటో డ్రైవర్ వచ్చి..‘400 ఏళ్ల క్రితం ప్లేగు వ్యాధి వచ్చి తగ్గిపోయింది.. దానికి గుర్తుగా చార్మినార్ కట్టారు’అని సమాధానం చెప్తాడు. దీంతో షాక్ అయిన టూరిస్ట్..ఇన్ని తెలిసి ఆటో డ్రైవర్‌గా ఉన్నావేంటి అని అడగ్గా..బతకాలి కదా అందుకే ఇలా అని చెప్పగా..మరి గెలుపుని వెతకాలి కదా అంటూ ప్రోమో చివర్లో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు ఈ షోఎప్పుడు మొదలు కానుంది, కంటెస్టెంట్స్ ఎవరనేది మాత్రం ప్రకటించకలేదు. అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో మాత్రం ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ లో మొదటి ప్రశ్న ఎప్పుడనేదానిపై క్లారిటీ ఇచ్చారు. మార్చి 29న రాత్రి గం. 8.15 నిమిషాలకు.. మీ లైఫ్ ని మార్చే మొదటి ప్రశ్న అడిగేందుకు ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నారు. సో డోంట్ మిస్. ఈ ప్రోగ్రాం ఏప్రిల్ చివరిలో లేదా మే తొలి వారంలో ప్రారంభం కానుందని సమాచారం. చదవండి : భార్యకు ఖరీదైన గిఫ్టిచ్చిన ఎన్టీఆర్! ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే -
ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేయబోతున్న రియాల్టీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’. త్వరలోనే జెమిని టీవీలో ప్రసారం కానున్న ఈ షో ప్రోమో ఇది వరకే విడుదల అయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ షోకు హోస్ట్ గా వ్యవహరించడంతో మంచి సక్సెస్ అయింది. ఇక నాగార్జున, చిరంజీవి హోస్ట్‌లుగా వ్యవహరించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రియాల్టీ షో ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మొదటి మూడు సీజన్లకి కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించగా, 2017లో వచ్చిన నాలుగో సీజన్‌కి మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా చేశాడు. ఇప్పుడు అదే షోని కొన్ని మార్పులతో ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెమ్యునరేషన్ ఎంత అనే విషయంలో సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. గతంలో మూడు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జునకు దాదాపుగా 4.5 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వగా, చిరంజీవి సుమారు రూ.9 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం హోస్ట్‌గా చేయబోతున్న ఎన్టీఆర్ కోసం షో నిర్వాహకులు రూ.7.5 కోట్లను పారితోషికంగా ఇవ్వనున్నట్లు టాక్ వినిపోస్తోంది. గతంలో బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా నిర్వహించిన ఎన్టీఆర్ నాలుగు కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం 'ఎవరు మీలో కోటీశ్వరులు' రియాలిటీ షో కోసం దాన్ని అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది. 60 ఎపిసోడ్లుగా ఈ సీజన్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ ప్రోగ్రాం ఏప్రిల్ చివరిలో లేదా మే తొలి వారంలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. మరోవైపు తమ హీరోను బుల్లితెరపై కనులారా చూసుకునేందుకు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చదవండి : (పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన ఎన్టీఆర్) (ఆర్ఆర్ఆర్: సీత వచ్చేసిందిగా) -
ఆట నాది.. కోటి మీది అంటున్న ఎన్టీఆర్
బుల్లితెరపై మరోసారి సందడి చేయడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెడీ అయ్యాడు. ఆయన హోస్ట్‌గా చేయబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ రియాల్టీ షో ప్రోమో శనివారం విడుదల అయింది. ఈ రియాల్టీ షో జెమిని టీవీలో ప్రసారం కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గెటప్‌లో కనిపించడం విశేషం. అయితే ఈ షో ఎప్పుడు మొదలు కానుంది, కంటెస్టెంట్స్ ఎవరనేది మాత్రం ప్రకటించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుల్లితెరపై ఎన్టీఆర్ రెండో సారి సందడి చేయబోతున్నాడు. బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు.ఎన్టీఆర్ షోకు హోస్ట్ గా వ్యవహరించడంతో మంచి సక్సెస్ అయింది. ఇక నాగార్జున, చిరంజీవి హోస్ట్‌లుగా వ్యవహరించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రియాల్టీ షో ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మొదటి మూడు సీజన్లకి కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించగా, 2017లో వచ్చిన నాలుగో సీజన్‌కి మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా చేశాడు. ఇప్పుడు అదే షోని కొన్ని మార్పులతో ఎన్టీఆర్ హోస్ట్‌గా జెమిని టీవీలో ప్రసారం కానుంది. -
ఇండియన్ ఐడల్ 12: పిజ్జా పార్టీ ఇచ్చిన జడ్జి
ముంబై: సోనీ టీవీ నిర్వహిస్తున్న ప్రముఖ రియాల్టీ మ్యూజిక్ షో ‘ఇండియన్ ఐడల్ 12’ గురించి సంగీత ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూలైలో ప్రారంభమైన ఈ మ్యూజిక్ షో గ్రాండ్ ప్రీమియర్‌కు చేరుకుంది. డిసెంబర్ 19, 20వ తేదీలో సోని టీవీలో రాత్రి 8 గంటలకు ప్రసారం కానున్న ఈ గ్రాండ్ ప్రిమియర్ షో సందడిగా జరగనుంది. ఇందులోని టాప్ 15 కంటెస్టెంట్స్ ట్రోఫీ కోసం ఒకరితో ఒకరూ పోటీ పడుతూ తమ గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేయనున్నారు. వారాంతంలో జరిగే ఈ షోలో టాప్ 15 ఫైనలిస్టులు అద్భుతమైన ప్రదర్శను ఇవ్వనుండగా.. షో జడ్జిలైన విశాల్ దాద్లానీ, నేహా కక్కర్, హిమేష్ రేష్మియాలు పోటీదారుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జడ్జిలంతా వారికి సంబంధించిన కొన్ని సరద క్షణాలను కంటెస్టెంట్స్‌తో పంచుకొనున్నారు. ఆ తర్వాత సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా గ్రాండ్ ప్రీమియర్ సందర్భంగా షోలోని అందరికి పిజ్జా పార్టీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో షో హోస్ట్ అదిత్య నారాయణ్, జడ్జి నేహా కక్కర్లు కంటెస్టెంట్స్ తల్లిదండ్రులతో కలిసి సరదాగా స్టెప్పులేశారు. (చదవండి: జాతీయ స్థాయిలో షణ్ముఖ స్వరం) The Grand Premiere of #IndianIdol2020 unfolds this weekend!@SonyTV #IndianIdol #SonyTV #Tellychakkar https://t.co/RtlXEHHRRV — princess Arisham khan (@p_Arisham_khan) December 16, 2020 ఇండియల్ ఐడిల్ సీజన్ 12 టాప్ 15 కంటెస్టెంట్స్‌లో ఏపీ నుంచి ముగ్గురు ఈ సీజన్లో మొదటి 12 మంది కంటెస్టెంట్స్ వరుసగా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మొహద్ డానిష్, ఆంధ్రప్రదేశ్‌కు నుంచి.. శిరీష భగవతుల, అంజలి; మహారాష్ట్రకు చెందిన సాయిలీ కిషోర్ కాంబ్లే; న్యూఢిల్లీకి చెందిన సమ్యాక్ ప్రసానా; కేరళకు చెందిన వైష్ణవ్ గిరీశ్; పశ్చిమ బెంగాల్‌కు చెందిన అరుణీతా కంజీలాల్, అనుష్క బెనర్జీ; కర్ణాటకకు చెందిన నిహాల్ టౌరో; హర్యానాకు చెందిన సాహైల్ సోలంకి; ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌దీప్ రాజన్; రాజస్థాన్‌కు చెందిన సవాయి భట్; ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షణ్ముఖ ప్రియా; ముంబైకి చెందిన నాచీకెట్ లేలే; పూణేకు చెందిన ఆశీస్ కులకర్ణిలు. (చదవండి: షణ్ముఖప్రియ పాటకు న్యాయనిర్ణేతలు ఫిదా) View this post on Instagram A post shared by Indian idol 2020 (@indian__idol12) -
మరో టీవీ షోలో...
చిన్న ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారా? అంటే ఫిల్మ్‌నగర్ వర్గాలు అవుననే అంటున్నాయి. ‘బిగ్ బాస్’ షోలో హోస్ట్‌గా తనదైన శైలిలో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు చిన్న ఎన్టీఆర్. ఇప్పుడు ఓ రియాలిటీ షో చేయనున్నారని సమాచారం. ఈ షో కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్స్ వేస్తున్నారని తెలిసింది. నిజానికి భవిష్యత్తులో ‘బిగ్ బాస్’ రాబోయే సీజన్లో మళ్లీ చిన్న ఎన్టీఆర్ కనబడే అవకాశం ఉందనే ఊహాగానాలు ఉన్న తరుణంలో ఈ షో వార్త తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఈ షూటింగ్లో పాల్గొంటూనే టీవీ షో చిత్రీకరణలో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నారట. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తరహాలో ఈ షో ఉంటుందని టాక్. -
షారుక్ వైఫ్ లైఫ్ ఎలా ఉంటుంది?
సినిమా స్టార్స్ లైఫ్ స్టయిల్ ఎలా ఉంటుంది? వాళ్లు చేసే విహార యాత్రలు, పార్టీలు, వాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌తోనే ‘ఫ్యాబులస్ లైఫ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ అనే రియాలిటీ షో తెరకెక్కింది. నెట్స్ఫ్లిక్స్లో ఈ షో అందుబాటులో ఉంది. బాలీవుడ్ స్టార్స్ భార్యల జీవితం ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్, చంకీ పాండే భార్య భావనా పాండే, సోహైల్ ఖాన్ భార్య సీమా ఖాన్, హీరోయిన్ నీలమ్ (సమీర్ సోనీ భార్య) ఈ నలుగురూ కలసి చేసిన షో ఇది. ఈ నలుగురూ 25 ఏళ్లుగా స్నేహితులు. వీళ్లు స్నేహితులుగా ఉండటంతో పాటు వీరి ఫ్యామిలీస్ కూడా ఎంత దగ్గరగా ఉన్నాయో తొలి భాగంలో చూపించారు. ఈ నలుగురి జీవితాల్లోని ముఖ్యమైన వ్యక్తులు, పార్టీలు, వెకేషన్స్, పిల్లలు, రోజువారి లైఫ్ తొలి సీజన్లో ఉంటాయి. 8 ఎపిసోడ్లుగా తొలి సీజన్ విడుదలైంది. ఇప్పుడు రెండో సీజన్ రాబోతోంది. ఇందులో షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ కూడా కనిపించనున్నారు. ఇంటీరియర్ డిజైనర్‌గా, నిర్మాతగా గౌరీ ఖాన్ తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నారు. ఫార్చ్యూన్ మేగజీన్ విడుదల చేసిన ఫిఫ్టీ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్‌లో చోటు సంపాదించారు గౌరి. ‘ఫ్యాబులస్ లైఫ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్’ సీజన్ 2లో భాగం అవుతున్నట్టు ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారామె. -
బాబాయ్.. అబ్బాయ్.. ఓ మల్టీస్టారర్
తెలుగు చిత్రపరిశ్రమలో మల్టీస్టారర్స్‌కు క్రేజ్ తీసుకొచ్చిన హీరోల్లో వెంకటేశ్ ఒకరు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేశ్‌బాబుతో, ‘గోపాల గోపాల’ చిత్రంలో పవన్ కల్యాణ్‌తో కలిసి నటించారాయన. గత ఏడాది మేనల్లుడు నాగచైతన్యతో ‘వెంకీ మామ’ సినిమా చేశారు. ఇప్పుడు అన్న సురేశ్‌బాబు కొడుకు రానాతో సినిమా చేయనున్నారని టాక్. తమిళంలో ఘనవిజయం సాధించిన ఓ చిత్రానికి ఇది తెలుగు రీమేక్ అని, తెలుగుకి అనుగుణంగా కథని మార్చి, పక్కా స్క్రిప్ట్ రెడీ చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి వీరూ పోట్ల దర్శకత్వం వహిస్తారని సమాచారం. డిసెంబర్ 13న వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా బాబాయ్–అబ్బాయ్ సినిమా ప్రకటన వెలువడే అవకాశం ఉందట. కాగా క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కిన ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో ‘బళ్లారి బావ..’ పాటలో రానాతో కలసి వెంకటేశ్ సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఫుల్ సినిమాలో ఇద్దరూ కనిపిస్తే సందడి డబుల్ అనొచ్చు. రియాలిటీ షోలో.. మల్టీస్టారర్ సినిమా కంటే ముందు వెంకటేశ్–రానా ఓ రియాలిటీ షో చేయనున్నట్లు టాక్. ఇటీవల రానా ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. దానికోసం ఈ ఇద్దరూ ఓ షో చేయనున్నారట. అలాగే ఓ ఎంటర్టైన్మెంట్ చానల్ వీరి కాంబినేషన్లో ఓ రియాలిటీ షోకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
ట్రోఫీ కైవసం: నటి భావోద్వేగం
ముంబై: ప్రముఖ హిందీ రియాలిటీ షో ‘ఖత్రోంకీ ఖిలాడీ: మేడిన్ ఇండియా’ స్పెషల్ ఎడిషన్ బహుమతుల ప్రదానోత్సవం ఆదివారం ముగిసింది. ఒళ్లు గగుర్పొడిచే స్టంట్లతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తూనే.. ఒకింత భయానికి గురిచేసే ఈ అడ్వెంచరస్ షో ట్రోఫీని టీవీ నటి నియా శర్మ సొంతం చేసుకున్నారు. సీజన్ ఆసాంతం అద్భుత ప్రదర్శిన కనబరిచిన ఆమె.. ఫైనల్లో మరోసారి తనదైన ధైర్యసాహసాలు ప్రదర్శించి విజేతగా నిలిచారు. నటీనటులు జాస్మిన్ భాసిన్, కరణ్ వాహిని వెనక్కి నెట్టి ట్రోఫీని ముద్దాడారు. ఈ సందర్భంగా నియా శర్మ మాట్లాడుతూ.. ‘‘ఈ స్పెషల్ ఎడిషన్‌ను తొలుత చాలా సరదాగా ప్రారంభించాను. అయితే కొద్ది రోజుల్లోనే నా ఆలోచన పూర్తిగా మారిపోయింది. టైటిల్‌ను గెలవాలనే ఆశయంతో స్టంట్లు పూర్తి చేయడం మొదలుపెట్టాను. ఇందుకోసం నేను వందకు వంద శాతం కష్టపడ్డాను’’ అని సంతోషం వ్యక్తం చేశారు. షో నిర్వాహకులు తన పట్ల పూర్తి నమ్మకం ఉంచి, ప్రోత్సహించడంతోనే ఇదంతా సాధ్యమైందని చెప్పుకొచ్చారు. (చదవండి: బిగ్‌బాస్ ఎంట్రీ: కొట్టిపారేసిన నటి) అదే విధంగా.. ‘‘కలర్స్(టీవీ చానెల్) నాకు రెండోసారి అవకాశం కల్పించింది. నన్ను నేను నిరూపించుకోవడానికి దోహదపడింది. నియా శర్మ అంటే కేవలం మేకప్, స్టైలింగ్ అని విమర్శించే వాళ్లకు ఈ విధంగా సమాధానం ఇచ్చాను. నియా ఒక విజేత. తనను తాను నిరూపించుకున్న ధీశాలి’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. కాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి హోస్ట్‌గా వ్యవహరించిన ఖత్రోంకీ ఖిలాడీ షోలో నియా, జాస్మిన్ భాసిన్, కరణ్ వాహితో పాటుగా జై భన్షాలీ, రిత్విక్ ధంజని, భారతీ సింగ్, హర్ష్ లింబోచియా, అలీ గొని, కరణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. వీరిలో రిత్విక్ మాత్రం వ్యక్తిగత కారణాలతో షో మధ్యలోనే వైదొలిగాడు. సీజన్ 10 ముగిసిన తర్వాత నిర్వహించిన స్పెషల్ ఎడిషన్‌లో రోహిత్ శెట్టి టీం కఠిన టాస్కులతో కంటెస్టంట్ల ధైర్యసాహసాలను పరీక్షించారు. (చదవండి: బాడీషేమింగ్ అనేది మార్కెట్ గిమ్మిక్) నీటితో నింపి లాక్ చేసిన పేటికలో గడపడం, బాంబులను దాటుకుంటూ ముందుకు సాగడం, బురదలో ఈత కొట్టడం వంటి స్టంట్లు ఇచ్చారు. ఇక ఫైనల్లో కొండచిలువలను తప్పించుకుంటూ, పైకి ఎగబాకుతూ, గ్లాసు పగులకొట్టి నెక్లెస్‌ను తీసుకురావాల్సిందిగా టాస్క్ ఇచ్చారు. మధ్య మధ్యలో బాంబులు పేలుస్తూ, ఎలక్ట్రిక్ షాకులకు గురిచేశారు. వీటన్నింటినీ సమర్థవంతంగా పూర్తి చేసిన నియా శర్మ.. టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఇక జమాయి రాజా, ఏక్ హజారోం మే మేరీ బహన్ హై వంటి హిట్ సీరియళ్లతో బుల్లితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ‘ఖత్రోంకీ ఖిలాడీ’గా నిలిచారు. -
బిగ్‌బాస్ ఈజ్ బ్యాక్
రియాలిటీ షో బిగ్‌బాస్ కొత్త సీజన్‌తో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్‌కి రెడీ అవుతోంది. మొదటి రెండు సీజన్లకు హోస్ట్‌గా ఎన్టీఆర్, నాని కనిపించగా మూడో సీజన్‌కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. నాలుగో సీజన్‌కి కూడా హోస్ట్‌గా నాగార్జునే కనిపించనున్నారు. దీనికి సంబంధించిన ప్రమోషనల్ యాడ్ షూట్ కూడా పూర్తయింది. శుక్ర, శనివారాల్లో ఈ యాడ్‌ను చిత్రీకరించారు. ‘‘మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టడం బావుంది’’ అని ప్రోమో షూట్ ఫోటోను ట్వీటర్లో షేర్ చేశారు నాగ్. ఈ యాడ్‌ను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ షూట్ చేశారు. సెంథిల్ కెమెరామేన్ గా వ్యవహరించారు. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్ సెట్ వర్క్ జరుగుతోంది. సాధారణంగా హౌస్ సెట్ నిర్మించడానికి దాదాపు నెలరోజుల వరకు పడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అలాగే చాలా మంది సినీ కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లిపోవడంతో సెట్ వర్క్‌కి ఎక్కువ సమయం పడుతుందని సమాచారం. అలాగే ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక ఇంకా పూర్తి కాలేదట. ఈ నెల చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారం నుంచి బిగ్‌బాస్ ప్రసారం కానుందని సమాచారం. -
పోలీసులను పిలవాలనుకున్నా..
న్యూఢిల్లీ : సోనీలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ 11 షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న నేహాకక్కర్‌ను కంటెస్టెంట్ ముద్దు పెట్టుకున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే షోలో మరో జడ్జిగా వ్యవహరిస్తున్న విశాల్ దడ్లాని తాజా ఎపిసోడ్‌పై ట్విటర్లో ఘాటుగా స్పందించారు. 'కంటెస్టెంట్ చేసిన పనికి పోలీసులను పిలుద్దామని నేహాకక్కర్కు చెప్పాను. కానీ ఆమె ఈ విషయాన్ని ఇక్కడితో మరిచిపోవాలంటూ తనను వారించిందని' పేర్కొన్నాడు. అయితే కంటెస్టెంట్ చేసిన పనిని నెటిజన్లు తీవ్రంగా తప్పు పడుతూ విశాల్ దడ్లానికి వరుస ట్వీట్లు చేశారు. 'విశాల్ జీ ! మీరు కంటెస్టెంట్ చేసిన పనికి అతని చెంపను పగలగొట్టాల్సింది. ఆ పని చేసేందుకు అతనికి ఎంత దైర్యం, అతన్ని ఊరికే వదిలేయద్దు అంటూ' ట్వీట్ చేశాడు. 'నిజంగా కంటెస్టెంట్ తన హద్దు మీరి ప్రవర్తించాడని, ఇటువంటి చర్యలు మరోసారి జరగకుండా జాగ్రత్త పడాలని' మరొకరు ట్వీట్ చేశారు. 'కేవలం టీఆర్పీ రేటింగ్ కోసమే షో నిర్వాహకులు కావాలనే కంటెస్టెంట్‌తో ఆ పని చేయించారని, ముందు షో నిర్వాహకులపై చర్యలు తీసుకుంటే బాగుండేదని' పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. వీటిపై విశాల్ దడ్లాని స్పందిస్తూ.. కంటెస్టెంట్ చేసిన పనికి పోలీసులను పిలవాలని చెప్పానని, నేహాకక్కర్ అందుకు ఒప్పుకోలేదని పేర్కొన్నారు. కానీ అతనికి మానసిక చికిత్స అవసరం ఎంతో ఉందని తెలిపాడు. మళ్లీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్త వహించాలని షో నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని కోరినట్లు తెలిపారు. చదవండి : (వైరల్ : జడ్జిని ముద్దుపెట్టుకున్న కంటెస్టెంట్) I suggested that the Police be called, but Neha decided to let the guy off the hook. He definitely needs psychiatric help, and we will try to help him get that, if we can. #IndianIdol11 https://t.co/CiCLy7u787 — VISHAL DADLANI (@VishalDadlani) October 20, 2019 -
వైరల్: జడ్జికి కంటెస్టెంట్ ముద్దు
ముంబయి : సోనీ చానెల్ నిర్వహిస్తోన్న రియాల్టీ షోలో కంటెస్టెంట్ మహిళా జడ్జికి ముద్దుపెట్టి అక్కడున్నవారందరినీ షాక్‌కు గురి చేశాడు. ఊహించని ఘటనతో సదరు మహిళా జడ్జి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. కాగా ఇదంతా సోనీ నిర్వహిస్తోన్న 'ఇండియన్ ఐడల్ 11' లో చోటుచేసుకుంది. అయితే దీనిని సోనీ టీవీ ప్రోమో రూపంలో రిలీజ్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే .. ఇండియన్ ఐడల్ 11 కార్యక్రమానికి ప్రముఖ గాయకులు అను మాలిక్, విశాల్ దడ్లానిలతో పాటు నేహా కక్కర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కంటెస్టెంట్ గుజరాతీ వేషదారణలో పలు బహుమతులతో స్టేజీ మీదకు వచ్చినట్లు ప్రోమోలో తెలుస్తుంది. పాట పాడిన అనంతరం తనను గుర్తుపట్టారా అంటూ నేహాకక్కర్‌ను అడిగాడు. దీంతో స్టేజీ మీదకు వెళ్లిన నేహా అతను ఇచ్చిన బహుమతులను తీసుకొని కృతజ్ఞతగా అతన్ని హగ్ చేసుకుంది. ఈ నేపథ్యంలో అతను అందరూ చూస్తుండగానే నేహా బుగ్గమీద ముద్దుపెట్టాడు. దీంతో షో వాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆదిత్య నారాయణ అతన్ని అడ్డుకొని అక్కడి నుంచి పంపించేశాడు. ఈ ఉహించని పరిణామంతో షాక్‌కు గురైన నేహాకక్కర్ కార్యక్రమం మద్యలోనే వెళ్లిపోయినట్లు ప్రోమోలో చూపించారు. కాగా, ఈ ఎపిసోడ్ ఆదివారం సోనీలో టెలికాస్ట్ అవనుంది. -
రీల్ హీరోనే కాదు.. రియల్ హీరో కూడా!
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో, ఖిలాడి అక్షయ్ కుమార్ కేవలం ‘రీల్ హీరోనే కాదు.. రియల్ హీరో కూడా’ అంటూ అతడి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల ఓ టీవీ షోకి గెస్ట్‌గా వెళ్లిన అక్షయ్ ఆ షోలో పాల్గొన ఓ వ్యక్తికి చేసిన సహాయమే ఇందుకు కారణం. వివరాలు.. మనీష్ పాల్ రూపొందించిన ‘మూవీ మస్తీ’ అనే కొత్త షోకి అక్కీ అతిధిగా వెళ్లాడు. ఈ షోలో అలీ ఆస్గర్‌తో పాటు మరో వ్యక్తి కలిసి స్కిట్ చేశారు. ఇందులో భాగంగా వాళ్లు.. ఓ రోప్ సహాయంతో కిందకు జారుతూ వచ్చి.. కింద ఉన్న నీటి తోట్టిలో నిలబడాలి. కాగా స్కిట్ చేస్తున్న సమయంలో అలీ ఆస్గర్‌తో పాటు పట్టీలో ఉన్న మరో వ్యక్తి స్పృహ కోల్పోయి.. వెనక్కి పడబోతుంటే పక్కనే ఉన్న అలీ గుర్తించి అతడిని కాపాడే ప్రయత్నం చేశాడు. ఊహించని పరిణామంతో కంగుతిన్న షో సిబ్బంది స్టేజ్‌పైకి పరుగెత్తుకు వచ్చారు. ఈ క్రమంలో వారితో పాటు అక్షయ్ కూడా స్టేజీ పైకి పరుగెత్తాడు. వెంటనే నీటి తొట్టి పైకెక్కి ఆ వ్యక్తిని తన కాళ్లపై పడుకోబెట్టుకొని కిందకు దించడంలో సహాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో... ‘అక్షయ్ అద్భుతమైన నటుడు.. దాన ధర్మాలు చేస్తాడు. జవాన్లను ఆదుకుంటాడు. అలాగే అందరికీ సాయం చేయడంలో ముందుంటాడు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక తన సినిమాల్లోని స్టంట్స్ సీన్లలో తానే స్వయంగా నటించి యాక్షన్ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఖిలాడి.. 2008లో వచ్చిన ‘ఖత్రోన్ కే ఖిలాడి’ అనే ఫియర్ ఫ్యాక్టర్ రియాలిటీ షోకి హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. View this post on Instagram .@akshaykumar and team of #MovieMasti with @manieshpaul's show save a man on the sets during #Housefull4 promotions | . . #AkshayKumar #Video #WOW #DailyVideo #VideoOfTheDay #Stuntman #AkshayKumarFans #Celeb #BollywoodVideo #BollywoodHungama #sushmatodkar A post shared by Sushma (AKKIAN) (@officialsushma) on Oct 4, 2019 at 3:30am PDT -
మరో టాక్ షో
బిగ్‌స్క్రీన్ ఎంట్రీ కంటే ముందే టెలివిజన్‌లో హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు లక్ష్మీ మంచు. ‘లక్ష్మీ టాక్ షో, ప్రేమతో మీ లక్ష్మీ, లక్ ఉంటే లక్ష్మీ...’ వంటి విభిన్న టెలివిజన్ షోలు చేశారు. మంచి హోస్ట్ అని ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేశారు. తాజాగా ‘ఊట్’ సబ్స్క్రిప్షన్ వీడియో అన్ డిమాండ్ సర్వీస్ యాప్‌కు ఓ టాక్ షో చేస్తున్నారు లక్ష్మీ మంచు. ఈ ప్రోగ్రామ్‌లో తొలి గెస్ట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. త్వరలోనే ‘ఊట్’ లో ఈ షో ప్రసారం కానుంది. -
విలన్ అంటే నేనే గుర్తుకు రావాలి
తన సంతోషాన్ని మాత్రమే వెతుక్కునే గుణం, నచ్చనివారికి చెడు జరగాలనే తలంపే విలనిజంలో ప్రధానంగా ఉంటుంది. విలన్‌గా నటనలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘ముత్యాల ముగ్గు’ సీరియల్లో నందిక క్యారెక్టర్ ద్వారా తెలుగు బుల్లితెరపై విలనిజాన్ని చూపుతుంది నవ్య. కన్నడ టీవీ సీరియల్లో రాణించి, తెలుగు సీరియల్ ద్వారా విలన్‌గా పరిచయమైన నవ్యారావు పంచుకున్న ముచ్చట్లు ఇవి. నా ఫ్రెండ్స్, బంధువులతో పాటు మా చెల్లెల్లు కూడా ‘ఎందుకు నెగిటివ్ రోల్స్ చేస్తావు. నిన్నందరూ బ్యాడ్ అనుకుంటారు తెలుసా’ అంటుంటారు. ఇలాంటి క్యారెక్టర్స్ వల్ల నటనలో మన ప్రతిభ ఏంటో తెలుస్తుంది. ఈ విషయం పదే పదే వారికి చెప్పలేక నవ్వేసి ఊరుకుంటాను. పాజిటివ్ రోల్స్ చేయాలని నాకూ ఉంది. అవకాశం వస్తే తప్పకుండా ఉపయోగించుకుంటాను. రియాలిటీ షో ఎమ్‌కామ్ పూర్తయ్యాక ఓ రోజు కన్నడ టీవీలో ఒక జ్యువెలరీ షో కోసం యాంకర్స్ కావాలనే ప్రకటన చూశాను. నా ఫొటోలు, వివరాలు వారికి పంపించాను. సెలక్ట్ అయ్యాను. అలా టీవీలోకి వచ్చాను. దీని తర్వాత ఒక రియాలిటీ షోకి అవకాశం వచ్చింది. ‘అండమాన్‌లో పట్టణ ప్రజలు ఎలా ఉంటారు’ అనే టాపిక్ మీద ఆ షో నడిచింది. అక్కడ ఎవరి తిండి వారు వాళ్లే కష్టపడి సంపాదించుకోవాలి, ఫోన్ ఇతరత్రా సదుపాయాలేవీ ఉండవు. అలాంటి చోట పదిహేను రోజులు ఉండటం చాలా కష్టమైంది. కానీ, వర్క్ నచ్చటంతో అంత దూరమైనా లెక్క చేయలేదు. మంచి పేరొచ్చింది. ఆ తర్వాత కన్నడలో ఓ సీరియల్ చేశాను. ఆ తర్వాత తెలుగులో ‘ముత్యాల ముగ్గు’ సీరియల్‌కి అవకాశం వచ్చింది. అయితే, పాజిటివ్ రోల్ కోసం ఎదురుచూస్తున్న నాకు మళ్లీ నెగిటివ్ రోలే వరించింది. ముందు కొంచెం నిరుత్సాహ పడ్డాను. తర్వాత నా రోల్ ప్రాధాన్యత తెలిసి చాలా సంతోషించాను. సరైన ఫీల్డ్ మా నాన్నగారు గణేష్ టీవీ సీరియల్ ఆర్టిస్. నేను ఈ ఫీల్డ్ రావాలని నాన్నగారు ఎప్పుడూ అనుకోలేదు. నేనూ ముందు ఆలోచించలేదు. చదువు తర్వాత లెక్చరర్‌గా స్థిరపడాలనేది నా ఆలోచన. అయితే, నాన్నగారు అనారోగ్యం కారణంగా చనిపోవడంతో సీరియల్ ఆఫర్స్ నాకు వచ్చాయి. అమ్మ, చెల్లి ఉన్నారు. నాన్న తర్వాత ఇంటి బాధ్యత నా మీద ఉంది. అందుకే ఆలోచించి సీరియల్‌కి ఓకే చేశాను. కన్నడ సీరియల్ తర్వాత ఆరునెలల పాటు ఖాళీగా ఉన్నాను. ఆ సమయంలో ఒక కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ జాబ్‌లో చేరాను. అక్కడకు వచ్చినవారు నన్ను కలిసి ‘మీరు ఫలానా సీరియల్లో నటించారు కదా!’ అని దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతుండేవారు. చాలా ఇబ్బంది అనిపించేది. పనిచేసే చోట ఇలాంటి వాతావరణం ఉండకూడదు అనుకున్నాను. ‘ఏ ఫీల్డ్‌లో గుర్తింపు వచ్చిందో ఆ ఫీల్డ్‌లోనే కొనసాగడం మంచిది’ అని ఆ తర్వాత సీరియల్ ఒప్పుకున్నాను. ముత్యాల ముగ్గు ఈ సీరియల్ తెలుగువారికి నన్ను చాలా చేరువచేసింది. హీరోయిన్ కన్నా పది రెట్ల ఎక్కువ ప్రాముఖ్యం ఉన్న పాత్ర. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ‘నందిక’ పాత్ర ఎంతో మేలు చేసింది. నా కెరియర్లో ఇదొక టర్నింగ్ పాయింట్. ఈ సీరియల్లో భూమి–అంబిక అక్కచెల్లెళ్లు. భూమి పల్లెటూరి అమ్మాయి, అంబిక సిటీ అమ్మాయి. భూమికి పూర్తి వ్యతిరేక పాత్ర నాది. నాకేదైనా, ఎవరైనా నచ్చారంటే వాళ్లు నాతోనే ఉండాలి. ఆ వస్తువు, ఆ మనిషి నాకే చెందాలి. అందుకోసం ఎంతదూరమైన వెళతాను. భూమి అంటే నాకు పడదు. నాకు నచ్చిన విరాట్‌ను తను పెళ్లి చేసుకుంటుంది. వాళ్లను విడదీసి విరాట్‌ను నేను సొంతం చేసుకోవాలి. ఎవరికి ఎలాంటి చెడు జరిగినా డోన్ట్ కేర్.. అన్నట్టుగా ఉంటుంది నా పాత్ర. నందికలో చాలా మధనం ఉంటుంది. బ్యాడ్ మార్క్ పడకూడదు నెగిటివ్, పాజిటివ్ .. ఏ రోల్ చేసినా ఇక్కడ మన మీద ఒక్క బ్యాడ్ మార్క్ కూడా పడకూడదు. అంత జాగ్రత్తగా ఉండాలి. ఏ రోల్ వేసినా క్యాస్ట్యూమ్స్, మేకప్, హెయిర్‌స్టైల్ ద్వారా మెప్పించాలి. ఒకసారి ప్రాజెక్ట్‌కి ఓకే చేశాక మన బాధ్యత చాలా ఉంటుంది. ఇండస్ట్రీలో హార్డ్ వర్క్‌కే ఎక్కువ ప్రాధాన్యత. నేనెక్కడా యాక్టింగ్ నేర్చుకోలేదు. క్లాసులకు వెళ్లింది లేదు. మా నాన్నగారు ఈ ఫీల్డ్‌లో ఉండటం వల్ల స్వతహాగా నాకు యాక్టింగ్ వచ్చి ఉంటుంది. అలాగే, నా సీనియర్ ఆర్టిస్టుల నుంచీ నటనలో మరిన్ని మెళకువలు నేర్చుకుంటున్నాను. – నిర్మలారెడ్డి -
వామ్మో.. డాన్స్ ఇరగదీశాడు!
కోల్‌కతాకు చెందిన డాన్సింగ్ స్టార్ 14 ఏళ్ల అక్షత్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాడు. టీవీల్లో డాన్స్ కార్యక్రమాలు వీక్షించే వారికి అక్షత్ సుపరిచితుడు. ఇండియా’స్ గాట్ టాలెంట్ టీవీ షోలో సల్మాన్ ఖాన్ పాటకు అతడు చేసిన డాన్స్ వీడియో వైరల్ కావడంతో 2014లో అక్షత్ పేరు మార్మోగిపోయింది. దాంతో అతడికి పలు టీవీ షోల్లో పాల్గొనే అవకాశాలు దక్కాయి. తాజాగా బ్రిటన్స్ గాట్ టాలెంట్ షోలో అక్షత్ అదరగొట్టాడు. తన డాన్స్, హావభావాలతో అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. జడ్జిలతో పాటు ప్రేక్షకులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అతడిని ప్రశంసించారు. కుమారుడి ప్రతిభను కళ్లారా చూసి అక్షత్ తల్లి ఆనంద భాష్పాలు రాల్చారు. అక్షత్ సింగ్ తాజా డాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నావని జడ్జిలు అడిగిన ప్రశ్నకు అక్షత్ స్ఫూర్తిదాయక సమాధానం ఇచ్చాడు. ‘అందరిని సంతోషంగా ఉంచాలి. కష్టపడితే ఏదైనా సాధించగలమ’ని నిరూపించడానికి ఈ షోలో పాల్గొన్నానని జవాబిచ్చాడు. అక్షత్ మొదటిసారి బెంగాలీ రియాలిటీ షో ‘డాన్స్ బంగ్లా డాన్స్’లో పాల్గొన్నాడు. తర్వాత ఇండియా’స్ గాట్ టాలెంట్ షోతో బాగా పాపులర్ అయ్యాడు. దీంతో అతడి కుటుంబం ముంబైకి మారింది. -
బుల్లితెర టైమ్ వచ్చింది!
కోలీవుడ్‌లో వెండితెరపై నటుడిగా సూపర్‌సక్సెస్ సాధించారు విజయ్ సేతుపతి. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఆయన హోస్ట్‌గా ఓ ప్రముఖ చానల్లో ఓ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని విజయ్ సేతుపతి అధికారికంగా వెల్లడించారు. ఈ షో త్వరలో మొదలుకానుంది. ఆల్రెడీ కమల్‌హాసన్ బిగ్‌బాస్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. రీసెంట్గా శ్రుతీ హాసన్, విశాల్, వరలక్ష్మి బుల్లితెర కమిట్మెంట్కు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు సేతుపతి వంతు వచ్చినట్లు ఉంది. ఇక విజయ్ సేతుపతి సినిమాల విషయానికి వస్తే... రజనీకాంత్ నటించిన ‘పేట్టా’ చిత్రంలో జీతూ అనే కీలక పాత్ర చేశారు. తెలుగులో చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. హీరోగానూ కొన్ని తమిళ సినిమాలు చేస్తున్నారాయన. ఇటీవల విజయ్‌సేతుపతి, త్రిష జంటగా వచ్చిన ‘96’ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. -
పోలవరంలో మరో రియాలిటీ షో
సాక్షి, అమరావతి: ఇంటికి పునాది పనులు పూర్తి అయ్యాక.. గృహనిర్మాణం అయిపోయినట్లేనని హడావుడి చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు దగ్గర అలాంటి హడావుడి చేసి ప్రాజెక్టు పూర్తయినట్లు షో చేయడానికి సీఎం చంద్రబాబు తెరతీస్తున్నారు. ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తిచేయడంలో వైఫల్యాన్ని, అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి మరో ‘రియాలిటీ షో’ చేయబోతున్నారు. హెడ్ వర్క్స్(జలాశయం)లో ప్రధానమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్–రాతి మట్టి కట్ట) నిర్మాణంలో పునాది (డయాఫ్రమ్ వాల్) పనులు సోమవారం నాటికి పూర్తవుతాయని అధికారులు చెప్పారు. పునాది పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పనులు పూర్తి చేసినట్లుగా ప్రజలను భ్రమింపజేసేందుకు పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రత్యేకంగా పైలాన్‌ను ఆవిష్కరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఉభయగోదావరి జిల్లాల నుంచే కాకుండా.. కృష్ణా, విశాఖపట్నం జిల్లాల నుంచి భారీ సంఖ్యలో జనాన్ని సమీకరించాలంటూ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పైలాన్ ఆవిష్కరణ సభకు రూ. 3.50 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు జలవనరుల శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. పునాది పనులే పూర్తి చేయడానికి నాలుగేళ్ల సమయం పట్టిందంటే ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ఎలా ఉందో అర్థమవుతుంది. హెడ్‌వర్క్స్‌లో 45 డిజైన్లకు గాను ఇప్పటివరకు కేవలం 14 డిజైన్లను మాత్రమే కేంద్ర జలసంఘం ఆమోదించింది. మిగిలిన 31 డిజైన్లను రాష్ట్రప్రభుత్వం ఇప్పటికీ తయారు చేయలేకపోయింది. పోలవరం ప్రాజెక్టును 2018 ఖరీఫ్ నాటికి పూర్తి చేస్తామని 2014 జూన్ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు ఖర్చు భరించి, నిర్మించి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ మేరకు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ‘స్పెషల్ పర్సస్ వెహికల్’గా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ను ఏర్పాటు చేసింది. ట్రాన్స్ట్రాయ్ను ముందుపెట్టి.. రూ.4,054 కోట్లకు పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ కాంట్రాక్టును టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ దక్కించుకుంది. పనులు చేసే సత్తా ట్రాన్స్‌ట్రాయ్‌కి లేదని పీపీఏ సీఈవోగా ఉన్న సమయంలో దినేష్‌కుమార్ తేల్చిచెప్పారు. అయినా ట్రాన్స్ట్రాయ్పై సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎంపీ రాయపాటిని అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి, కమీషన్లు కాజేయాలన్న ఎత్తుగడలో భాగంగా పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా, ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తూ వచ్చారు. ఈ కమీషన్ల కోసం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి.. 2016, సెప్టెంబర్ 7న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్నారు. ఆ మరుసటి రోజే హెడ్‌వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ. 5,535.41 కోట్లు పెంచేశారు. వర్చువల్ రివ్యూలతో షోలు.. హెడ్‌వర్క్స్‌లో మట్టి పనులు త్రివేణి కంపెనీకి, డయాఫ్రమ్ వాల్ పనులు ఎల్ అండ్ టీ–బావర్, కాంక్రీట్ పనులు పెంటా, ఫూట్జ్మీస్టర్లకు అప్పగించారు. ఆ వెంటనే 2016, సెప్టెంబర్ 12న ప్రతి సోమవారం వర్చువల్ రివ్యూల ద్వారా పనులను సమీక్షిస్తానని చంద్రబాబు ప్రకటించారు. వారం వారం కమీషన్ల వసూళ్లకే వర్చువల్ రివ్యూ పేరుతో షో చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే 2016, డిసెంబర్ 26న ఢిల్లీ వేదికగా రియాలిటీ షోకు తెరతీశారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా రూ. 1,981.54 కోట్లను కేంద్రం విడుదల చేసినప్పుడే పనులన్నీ పూర్తయినట్లుగా ప్రజలను భ్రమింపజేసేలా సీఎం చంద్రబాబు డ్రామా చేశారు. 2016, డిసెంబర్ 30న హెడ్ వర్క్స్‌లో కాంక్రీట్ పనుల ప్రారంభోత్సవాన్ని భారీగా నిర్వహించారు. దీని తర్వాత గేట్ల తయారీ పనులను బీకెమ్ అనే సంస్థకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి కమీషన్లు దండుకున్నారు. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి 2017, సెప్టెంబరు 27న గేట్ల తయారీ పనులను ఘనంగా ప్రారంభించారు. ఆ వెంటనే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి వీలుగా నదీ ప్రవాహాన్ని మళ్లించేందుకు కాఫర్ డ్యామ్‌ల నిర్మాణ పనుల్లో పునాది (జెట్ గ్రౌటింగ్) పనులను కెల్లర్ అనే సంస్థకు నామినేషన్‌పై అప్పగించి జేబులు నింపుకున్నారు. ఆ తర్వాత 2017, జూన్ 8న కాఫర్ డ్యామ్ పనులకు శంకుస్థాపనను భారీ ఎత్తున నిర్వహించారు. తర్వాత హెడ్ వర్క్స్‌లో స్పిల్‌వే, స్పిల్ చానల్లో రూ. 2,165.54 కోట్ల విలువైన పనులను నవయుగ కంపెనీకి నామినేషన్‌పై కట్టబెట్టారు. తాజాగా సుమారు రూ. 2,400 కోట్లకు పైగా విలువైన ఎర్త్‌కం రాక్ ఫిల్‌డ్యాం పనులను కూడా రత్న ఇన్ఫ్రా అనే సంస్థకు నామినేషన్ పద్ధతిపై అప్పగించడానికి సీఎం చంద్రబాబు రంగం సిద్ధం చేశారు. ఈ వ్యవహారంలో భారీఎత్తున ముడుపులు చేతులు మారినట్లు సమాచారం. నాలుగేళ్లలో 18.06 శాతం మాత్రమే పనులు.. పోలవరం ప్రాజెక్టు పనులను 63 సార్లు వర్చువల్ రివ్యూలు.. 24 సార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించడం ద్వారా చంద్రబాబు సమీక్షించారు. ఇప్పటివరకూ మొత్తం 54.73 శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు జలవనరుల శాఖ రికార్డులే చెబుతున్నాయి. ఇందులో 39.67 శాతం పనులు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి. అంటే నాలుగేళ్లలో కేవలం 18.06 శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు స్పష్టమవుతోంది. 2018 ఖరీఫ్ వచ్చేసింది. తాను ఇచ్చిన హామీ నీరుగారిపోవడంతో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సీఎం చంద్రబాబు మరో డ్రామాకు తెరతీశారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి పునాది పనులు 1,397 మీటర్లు చేయాల్సి ఉండగా.. గడిచిన సోమవారం నాటికి 1378.60 మీటర్లు పూర్తయ్యాయి. మిగిలిన 18.40 మీటర్లు ఈనెల 11 నాటికి పూర్తవుతాయని జలవనరుల శాఖ అధికారులు తేల్చారు. పునాది పనులు పూర్తవడంతోనే ప్రాజెక్టు పూర్తయినట్టుగా మాయ చేసేందుకు భారీ పైలాన్‌ను ఆవిష్కరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంపై అధికారవర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. ప్రజాధనాన్ని దుబారా చేస్తుండటంపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. డయాఫ్రం వాల్ అంటే... పోలవరం ప్రాజెక్టును గోదావరి నదిలో ఇసుక తిన్నెలపై నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో నీరు దిగువకు లీకేజి కాకుండా ఉండటానికి.. భూకంప ప్రభావిత ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్నందున పునాదిని పటిష్టంగా నిర్మించాల్సి ఉంటుంది. దీంతో డయాఫ్రం వాల్ విధానంలో పునాదిని నిర్మించాలని కేంద్ర జలసంఘం నిర్ణయించింది. డాగర్లు, గ్రాబర్లు అనే యంత్రాలతో పునాదిని గట్టి రాతిపొర వచ్చేవరకు తవ్వుకుంటూ పోతారు. మట్టిని తవ్విన ఖాళీ ప్రదేశంలోకి బెంటనైట్ మిశ్రమాన్ని నింపుతారు. రాతిపొర వచ్చిన తరువాత అధిక పీడనంతో కాంక్రీటు మిశ్రమాన్ని లోపలికి పంపుతారు. అప్పుడు బెంటనైట్ మిశ్రమం పైపుల ద్వారా బయటకు వస్తుంది. సుమారు 8 నుంచి 10 శాతం బెంటనైట్ మిశ్రమం కాంక్రీటుతో కలిసి పోతుంది. బెంటనైట్, కాంక్రీటు మిశ్రమం కలవడం వల్ల ప్లాస్టిక్ కాంక్రీటుగా రూపాంతరం చెందుతుంది. ఇది అత్యంత పటిష్టంగా ఉంటుంది. చుక్కనీటిని బయటకు రానీయదు. భూకంపాలు వచ్చినా ప్రాజెక్టుకు నష్టం వాటిల్లదు. ఈ విధానంలో నిర్మించే పునాది గోడనే డయాఫ్రం వాల్ అంటారు. దీనిని నదీ ఉపరితలం వరకు నిర్మిస్తారు. ఇది ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక పని మాత్రమే. కానీ తెలుగుదేశం ప్రభుత్వం పునాది పనులను చేయడానికే నాలుగేళ్ల సమయం తీసుకుంది. ఇప్పుడు దీన్నే సోమవారం సీఎం చంద్రబాబునాయుడు జాతికి అంకితం చేస్తారు. ఎక్కడైనా, ఏ ప్రభుత్వమైనా ప్రాజెక్టులు పూర్తయిన తరువాత, ఆయకట్టుకు నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేయడం సంప్రదాయం. కానీ సీఎం చంద్రబాబు మాత్రం పోలవరం ప్రాజెక్టు పునాది గోడను జాతికి అంకితం చేస్తుండటంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. -
బిగ్‌బాస్ హోస్ట్‌గా సూపర్‌స్టార్?
టాలీవుడ్లో సంచలనం సృష్టించిన రియాల్టీ షో బిగ్‌బాస్. ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరించిన ఈ షో టాప్ టీఆర్పీలతో సత్తాచాటింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెలబ్రిటీలు తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. త్వరలో రెండో సీజన్‌ను కూడా ప్రారంబించేందుకు రెడీ అవుతున్నారు. అయితే మరో భాషలోనూ బిగ్‌బాస్ షోను ప్రారంభించేందుకు బిగ్‌బాస్ టీమ్ రెడీ అవుతుంది. తాజాగా మలయళంలో కూడా ఈ షో మొదలవతున్నట్టు సమాచారం. ఈ రియాల్టీ షోకు హోస్ట్‌గా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వ్యవహరిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొదట్లో ఈ కార్యక్రమానికి మమ్ముట్టి, రమేష్ గోపిలు హోస్ట్‌గా ఉంటారనే వార్తలు వచ్చాయి. అయితే బిగ్‌బాస్ టీమ్ మాత్రం మోహన్‌లాల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. మలయాళంలో ఈ షో జూన్ చివరిలో ప్రారంభం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెల్లువడాల్సి ఉంది. -
హీరో స్వయంవరం.. సెన్సార్‌బోర్డుకు నోటీసులు
సాక్షి, చెన్నై : కోలీవుడ్ ఓ రియాల్టీ షో కోర్టు మెట్లెక్కింది. నటుడు ఆర్య స్వయంవరం పేరిట ఈ షోను నిర్వహిస్తున్నారు. 18 ఏళ్లు పైబడిన అమ్మాయిలను ఎంపిక చేసి ఇందులో గెలిచిన వారిని ఆర్య వివాహం చేసుకుంటాడంటూ ఈ షోను నిర్వహిస్తున్నారు. అయితే దీనిని నిలిపివేయాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. షో నిర్వాహకులతోపాటు సెన్సార్‌బోర్డుకు కోర్టు నోటీసులు దాఖలు చేసింది. ‘ఎంగ వీటు మాపిల్లై’ పేరిట ఆర్య తన స్వయంవరం షోను ప్రకటించాడు. కలర్స్ తమిళ్ ఛానెల్లో సోమవారం నుంచి శుక్రవారం దాకా ఈ కార్యక్రమం ప్రసారం అవుతోంది. నటి సంగీత ఈ రియాల్టీ షోకు హోస్టింగ్ చేస్తున్నారు. అయితే ఈ షో మహిళల గౌరవానికి దెబ్బతీసేలా ఉంటోందని.. పైగా కంటెస్టెంట్లను కించపరిచేలా షోలో పనులు చేయిస్తున్నారంటూ జానకిఅమ్మల్ అనే ఉద్యమకారిణి ఆరోపణలకు దిగారు. ఈ మేరకు షోను నిలుపుదల చేయాలంటూ ఆమె సెన్సార్ బోర్డు, కేంద్ర సాంకేతిక సమాచార శాఖ కార్యదర్శికి లేఖలు రాశారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన మధురై బెంచ్.. షో నిర్వాహకులకు, సాంకేతిక సమాచార శాఖ కార్యదర్శితోపాటు, ఈ షోకు అసలు అనుమతి ఎలా ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డుకు నోటీసులు దాఖలు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 18కు వాయిదా వేసింది. అయితే అప్పటిదాకా షో నిర్వాహణను నిలుపుదల చేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను మాత్రం కోర్టు తోసిపుచ్చింది. -
వైట్ హౌజ్‌లో రియాల్టీ షో!
సాక్షి : గత రెండు రోజులుగా వైట్ హౌజ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు రియాల్టీ షోను తలపిస్తున్నాయని రిపబ్లికన్ పార్టీ ఆరోపిస్తోంది. అస్తవ్యస్త పాలనతో ట్రంప్ తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నారని ఆ పార్టీ సెనెటర్ ఒకరు బుధవారం మండిపడ్డారు. ఉత్తరకొరియా అధ్యకుడు కిమ్ జంగ్ ఉన్‌తో మాటల యుద్ధం, లాస్ వెగాస్ కాల్పుల ఘటన, ఫ్లోరిడా తుఫాన్ బాధితులను ఆదుకోవటంలో ట్రంప్ విఫలం అయ్యాడంటూ ఆయన చెబుతున్నారు. ‘‘గత రెండు రోజులుగా వైట్ హౌస్ లో పెద్ద రియాటి షో జరుగుతోంది(ట్రంప్ భార్యల వ్యవహారాన్ని ఉద్దేశించి). ప్రథమ పౌరురాలు ఎవరన్న వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించటం లేదు’’ ఆ సెనేటర్ మండిపడ్డారు. జాతీయ భద్రత కార్యదర్శిగా పనిచేస్తున్న రేటెల్లర్సన్ పై ట్రంప్ వ్యవహరించిన తీరును ఆ సెనెటర్ తప్పుబట్టారు. రేటెల్లర్సన్ ను ఐక్యూ టెస్ట్ కు సిద్ధంగా ఉండాలని ట్రంప్ ఆదేశించటాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ ఉన్నతాధికారిని ఆయన(ట్రంప్) ఎలా దూషిస్తారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలతో ట్రంప్ తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని ఆయన సూచించారు. ఉత్తరకొరియాతో చర్చలు జరుపుదామన్న రేటెల్లర్సన్ సూచనను తిరస్కరించడం ట్రంప్ అవివేకానికి నిదర్శనమని ఆయన చెప్పారు. ఇంకోవైపు రిపబ్లికన్ సెనేటర్ బాబ్ కొర్కర్.. ట్రంప్‌ను మూర్ఖుడిగా అభివర్ణించారు. ఫేక్ మీడియాపై ట్రంప్ ఫైర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై విరుచుకుపడ్డాడు. తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న ఎన్బీసీ నెట్‌వర్క్‌తోపాటు మరికొన్ని అమెరికన్ ఛానెళ్లను మూసివేయిస్తానని ఆయన హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే ఆయన మీడియాపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పాలనను తప్పుబడుతూ తరచూ ఆయా ఛానెళ్లు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. తాజాగా దేశ ఆర్థిక వ్యవస్థ సమూలంగా నాశనం అయిపోయిందని, పన్నుల సంస్కరణలో ట్రంప్ దారుణంగా విఫలం అయ్యాడంటూ ఏకీపడేశాయి. దీనికి తోడు వైట్‌హౌజ్ ప్రధాన అధికారి జాన్ ఈ కెల్లీని ట్రంప్ తొలగించబోతున్నాడంటూ మరో వార్తను ప్రసారం చేశాయి. దీంతో ట్రంప్ బుధవారం తన ట్విట్టర్లో వరుసగా ట్వీట్లు చేశారు. ఫేక్ మీడియా కారణంగా దేశం గొప్పతనం దెబ్బతింటోందని ఆయన చెప్పారు. ఇది ప్రజలకు ఏ మాత్రం మంచిది కాదని, అవసరమైతే వాటి లైసెన్లు రద్దు చేసేందుకైనా సిద్ధమని ట్రంప్ చెప్పారు. Network news has become so partisan, distorted and fake that licenses must be challenged and, if appropriate, revoked. Not fair to public! — Donald J. Trump (@realDonaldTrump) October 12, 2017 -
ప్రతిభకు పట్టం కట్టే రియాల్టీ షో!
తిరువనంతపురం: ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని విద్యార్థుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా కేరళలోని హరిత విద్యాలయం.. ఓ ఎడ్యుకేషనల్ రియాల్టీ షోను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను కేరళ సాంకేతిక విద్య, మౌలిక సదుపాయాల సంస్థ(కైట్) సంస్థ విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోవడానికి ఇదో అమోఘమైన అవకాశమని కైట్ పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ షోను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కైట్ తెలిపిన మరిన్ని వివరాల ప్రకారం.. ఈ షోలో పాల్గొనాలనుకునే గవర్నమెంట్ పాఠశాలల విద్యార్థులు అక్టోబర్ 2వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాక తమ ప్రతిభాపాఠవాలకు సంబంధించి సొంత యాక్టివిటీతో కూడిన 5 నిమిషాల వీడియో లేదా 20 నిమిషాల స్లైడ్ షోను పంపాలి. వీటిని పరిశీలించి, 150 మందిని తొలి రౌండ్ కోసం ఎంపిక చేస్తారు. వీరిలో రియాల్టీ షోను నిర్వహించి, అత్యుత్తమ ప్రతిభను చాటుకున్న విద్యార్థులను తదుపరి రౌండ్లకు పంపుతారు. పోటీలో చివరి వరకు నిలిచిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు. మొదటి బహుమతిగా రూ.15 లక్షల నగదు, రెండో బహుమతిగా రూ.10 లక్షల నగదును, మూడో బహుమతిగా రూ.5 లక్షల నగదును అందజేస్తారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులు చదివే పాఠశాలలకు కూడా ప్రోత్సాహకాలు అందజేస్తారు. -
రేణు దేశాయ్‌తో స్టార్ మా రియాలిటీ షో
సాక్షి, హైదరాబాద్: రేణు దేశాయ్ పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా సుపరిచయం. భర్త పవన్ కల్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత పిల్లలతో పూణేలో ఉంటున్నారు. సినిమాల పై ఉన్న ఫ్యాషన్‌తో రేణు దేశాయ్ ఓ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. కొడుకు అకీరా నందన్ ఆచిత్రంలో ప్రత్యేకపాత్రలో కనిపించారు. ఇప్పుడు తాజాగా రేణు దేశాయ్ కూడా తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమచారం. ఇప్పటికే తారక్ బిగ్‌బాస్ షో, రానా నెం.1 యారీ ప్రోగ్రాంలతో చిన్న స్క్రీన్‌పై మెప్పిస్తున్నారు. తాజాగా రేణు కూడా ఓ రియాలిటీ షోకి హోస్ట్ గా సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించే పనిలో ప్రముఖ తెలుగు చానెల్ స్టార్‌మా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ షో సాగుతోంది. ఈ సీజన్ అనంతరం ‘స్టార్ మా’ రేణుదేశాయ్‌తో రియాలిటీ డాన్స్ షో ప్లాన్ చేస్తోంది. రేణు హోస్ట్ గా వ్యవహరించనున్న ఈ డాన్స్ షో పై అంతా ఆసక్తిగా ఉన్నారు. -
కొక్కొరొకో.. మ్యూజిక్ వీడియో వైరల్!
కొక్కొరొకో అంటూ... తన కూతతో ఉదయాన్నే మనల్ని నిద్రలేపే కోడి... అద్భుతమైన మ్యూజిక్ కూడా వాయిస్తోంది. చూడచక్కగా... వినసొంపుగా పియానాతో రాగాలు పలికిస్తోంది. ఆశ్చర్యంగా ఉంది కదూ..? అమెరికాలో జరిగిన ఓ రియాలిటీ టాలెంట్ షోలో ఒక కోడి తన సంగీత ప్రతిభను చాటి ప్రేక్షకుల మది దోచుకుంది. ముక్కుతో పియానో బటన్స్ నొక్కుతూ మ్యూజిక్‌తో రంజింప చేసింది. కోడి పలికించిన స్వరాగాలు విన్న అక్కడి ప్రేక్షకులంతా కరతాళ ధ్వనులు చేశారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. -
ప్రాణం తీసిన టీవీ షో
-
పచ్చిమిర్చి
రాఖీసావంత్ మాట మిర్చిలా ఘాటుగా ఉంటుంది. మనసు నొప్పిస్తుంది. కోపం తెప్పిస్తుంది. మిర్చి స్వభావమే అంత. ఘాటు తగ్గేవరకు హాహాకారాలు వినిపిస్తూనే ఉంటాయి. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ముంబైలోనా? పంజాబ్లోనా? పోలీసుల అదుపులోనా లేదా తనకెంతో ఇష్టమైన చైనీస్ ఫుడ్ తింటూ ఏదైనా రెస్టారెంట్లోనా? ఎక్కడున్నా సరే, ఇవాళ మాత్రం ఆవిడ లూథియానా కోర్టుకు హాజరు కావలసిందే. నేడు ఆమె కేసు హియరింగ్‌కు వస్తోంది. గత ఏడాది జూలైలో నరీందర్ ఆదిత్య అనే న్యాయవాది రాఖీపై కేసు పెట్టారు. వాల్మీకి కులస్థుల మనోభావాలు గాయపడేలా ఒక టీవీ ఛానెల్లో రాఖీ మాట్లాడారని ఆయన ఆరోపణ. కేస్ ఫైల్ అయ్యాక రాఖీ ఇంతవరకు ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు. దాంతో కోర్టు ఆదేశాలపై ఇద్దరు పంజాబ్ పోలీసులు గత నెల 9న అరస్టు వారెంటుతో రాఖీని వెతుక్కుంటూ ముంబై వెళ్లారు. తర్వాత రాఖీ కచ్చితంగా ఎక్కడ ఉన్నదీ నిన్న ఆదివారం నాటికి కూడా ఎవరికీ తెలియదు!చెడ్డవాళ్లు మంచివాళ్లుగా ఎలా మారతారో చెప్పడానికి రాఖీ సావంత్ వాల్మీకి మహర్షిని ఉదాహరణగా తీసుకోవడమే ఆమెను చిక్కుల్లో పడేసింది. అసలు ఇదంతా పంజాబీ గాయకుడు మికా సింగ్‌తో వచ్చింది. పదేళ్ల క్రితం తన బర్త్ డే పార్టీకి వచ్చిన రాఖీని అతడు బలవంతంగా పెదవులపై ముద్దు పెట్టడం, రాఖీ అతడిపై కేసు పెట్టడం.. అంత తేలిగ్గా లోకానికి మరపురానివ్వని సంఘటనలు. ‘అయితే ఇప్పుడతడు మంచివాడైపోయాడు. జస్ట్ లైక్ వాల్మీకి! దారికాసి దోపిడీలు చేసే వాల్మీకి.. ఆ తర్వాత మంచివాడైపోయిన విధంగానే మికా సింగ్ మారిపోయాడు’ అని రాఖీ అనడమే ఆమెను కోర్టుకు ఈడ్చింది. అలా అన్నందుకు ఆ తర్వాత ఆమె క్షమాపణ కోరారు కానీ, కేసు కొనసాగుతూనే ఉంది. ‘నేను చిన్నప్పుడు చదువుకున్న దానిని బట్టి అలా మాట్లాడాను. అంతే తప్ప ఎవర్నీ చిన్నబుచ్చాలన్న ఉద్దేశం నాకు లేదు’ అని రాఖీ ఓ చిన్న వీడియో ద్వారా వివరణ ఇచ్చినప్పటికీ వినేందుకెవరూ సిద్ధంగా లేరు. నిజానికి రాఖీ సావంత్‌ది వివరణ ఇచ్చుకునే తత్వం కాదు. ‘డ్రామా క్వీన్’ అని అమెకు పేరు వచ్చింది కానీ, అంతకన్నా కూడా ఆమెను ‘దుస్సాహసి’ అని అంటేనే సరిగ్గా సరిపోతుంది. వాల్మీకి కులస్తులను కించపరిచారన్న ఆరోపణలు వచ్చినప్పుడు రాఖీ సావంత్ స్పందన మొదట వేరేలా ఉంది. ‘‘నేను సల్మాన్‌ఖాన్‌ని కాదు. రాఖీ సావంత్‌ని. నా మీద ఆరోపణలు చేయడం వల్ల మీకు ఒనగూడేది ఏమీ ఉండదు. నేనొక మామూలు అమ్మాయిని’’ అని అన్నారు రాఖీ. రాఖీని ‘రాకింగ్ రాఖీ’ అనడానికి తగినంత ‘స్పంక్’ అమెలో ఉంది. స్పంక్ అంటే ధైర్యం, దృఢచిత్తం. మాట అనగలరు. మాట మీద నిలబడగలరు. పోనీలే పాపం అని అనిపించినప్పుడు మాట మీద నుంచి దిగగలరు కూడా. వాల్మీకిపై వ్యాఖ్యలకు సారీ చెప్పడం కూడా ఇలా దిగి చెప్పిందే. దిగడానికి కూడా ధైర్యం కావాలి. ఆ ధైర్యం రాఖీకి ఉంది. ‘‘దేవుడు ఇవ్వనిది డాక్టర్ ఇస్తాడు’’ అని తన బోటాక్స్ సర్జరీల గురించి దాపరికం లేకుండా ధైర్యంగా చెప్పుకున్న రాఖీ సావంత్ ఇవాళ కోర్టుకు వెళతారా? Good girls go to heaven, bad girls go every where...గ్రామీ అవార్డు విజేత జిమ్ స్టెయిన్మెన్ రాసిన పాట ఇది. మంచమ్మాయిలు స్వర్గానికి వెళితే, చెడ్డమ్మాయిలు ప్రతిచోటుకీ వెళ్తారట. రాఖీ బ్యాడ్ గర్ల్ అన్నదే కనుక మన ఒపీనియన్ అయితే.. నేచురల్‌గానే ఆమె ఎక్కడికైనా వెళ్లగలరు. ఎవరీ అమ్మాయి? రాఖీ సావంత్ ముంబై అమ్మాయి. 1978 నవంబర్ 25 రాఖీ డేటాఫ్ బర్త్. అసలు పేరు నీరూ భేడా. డాన్సర్, మోడల్, బాలీవుడ్ న టి, టెలివిజన్ టాక్ షో ల వాగుడుకాయ. హిందీ, కన్నడ, మరాఠీ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. కలర్స్ ఛానల్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లో కూడా ఉంది. ‘రాష్ట్రీయ ఆమ్ పార్టీ’ అని ఒక సొంత పార్టీ పెట్టుకుని 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసింది రాఖీ. ఎన్నికలయ్యాక ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ)లో చేరింది. ‘ఎ’ అన్నది పార్టీ వ్యవస్థాపకుడు రామ్‌దాస్ బంధు అథావాల్ పేరు. ఇది ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’ (ఆర్.పి.ఐ.) నుంచి చీలిన పార్టీ. అంబేడ్కర్ నడిపిన ‘షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్’ నుంచి ఆర్.పి.ఐ. వచ్చింది. రాఖీ మాటలు, చేతలు నిరంతరం ఆమెను వార్తల్లో తాజా మనిషిగా ఉంచుతాయి. ఆమె వయసు 38. ఇంటి విషయాలు రాఖీ తల్లి పేరు జయా భేడా. ఆమె ఆనంద్ సావంత్‌ను చేసుకుంది. వొర్లి పోలీస్ స్టేషన్లో ఆయన కానిస్టేబుల్. జయ తన మొదటి వివాహం వల్ల కలిగిన పిల్లలకు కూడా రెండో భర్త ఇంటి పేరునే పెట్టుకుంది. రాఖీ సోదరుడు రాఖేశ్ సావంత్ సినిమా డైరెక్టర్. సోదరి ఒకప్పటి నటి ఉషా సావంత్. రాఖీ సావంత్ క్రైస్తవ మతాన్ని స్వీకరించిన హిందువుల అమ్మాయి. ముంబై సమీపంలోని గోక్లీబాయ్ హైస్కూల్లో రాఖీ చదివింది. మిథీబాయ్ కాలేజీలో డిగ్రీ చేసింది. 1997 టు 2017 రాఖీ సినిమాల్లోకి వచ్చిన సంవత్సరం 1997. తొలి సినిమా ‘అగ్నిచక్ర’. తర్వాతంతా చిన్న చిన్న సినిమాలు. పెద్ద పెద్ద ఐటమ్ సాంగ్స్. హిమేశ్ రేషమియా కంపోజ్ చేసిన ‘మొహబ్బత్ హై మిర్చి’ ఐటమ్ సాంగ్ (ఛురా లియా హై తుమ్నే సినిమాలోనిది) రాఖీ కెరీర్ గ్రాఫ్ వేగాన్ని ఒక్కసారిగా పైపైకి పెంచేసింది. ‘అగ్నిచక్ర’ మొదలు, ‘ఉపేక్ష’ (ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది) వరకు సుమారు 35 చిత్రాలో నటించారు. తెలుగులో ‘6 టీన్స్’ అనే సినిమాలో నటించారు. తెలుగులోనే ‘ద్రోణ’ చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్ (సయ్యారే.. సయ్యారే)లో కనిపించారు. అన్ని భాషల్లో కలిపి రాఖీ అకౌంట్లో 20 వరకు ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. ఇవి కాక, ఓ పది మ్యూజిక్ వీడియోలు, ముప్పై టీవీ షోలు రాఖీవి ఉన్నాయి. రాఖీ గాయని కూడా. 2007లో ఆమె తన తొలి ఆల్బమ్ ‘సూపర్ గర్ల్’తో సంగీత ప్రపంచాన్ని షేక్ చేసింది. దళితుల హక్కుల కోసం! 2019 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి, దళితుల హక్కుల కోసం పోరాడతానని రాఖీ అంటున్నారు. గత ఎన్నికల్లో ఆమె వాయవ్య ముంబై నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆమెకు కేవలం 2006 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పార్టీ ఎన్నికల గుర్తుగా ఆమె ‘గ్రీన్ చిల్లీ’ని కోరుకున్నారు. తన వ్యక్తిత్వాన్ని పచ్చి మిర్చితో పోల్చవచ్చని రాఖీ చెబుతుంటారు. ఎన్నికల్లో ఓడిపోయాక రాఖీ ఆర్.పి.ఐ (ఎ)లో చేరారు. అప్పుడే తొలిసారిగా ఆమె తనకు దళితుల కోసం పనిచేయాలని ఉందని ప్రకటించారు. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, మహిళా విభాగం అధ్యక్షరాలిగా కూడా పని చేశారు. విశేషాలు–వివాదాలు ♦ రాఖీ తండ్రికి ఆమె సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. మొదట్లో ఇద్దరికీ గొడవలు అయ్యేవి. చివరికి ఆ పెంకి పిల్లతో వాదించడం ఆయన మానుకున్నారు ♦ టీనా మునిమ్ పెళ్లిలో రాఖీ (అప్పటికి 12 ఏళ్లు) భోజనాలు వడ్డించే అమ్మాయిగా పని చేసింది ♦ యోగా గురు రామ్‌దేవ్ బాబా అంటే తనకెంతో ఇష్టం అని, ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఉందని కొంతకాలం క్రితం రాఖీ చేసిన ప్రకటన దేశంలో కలకలం రేపింది ♦ కొల్హాపూర్‌లో ఓసారి స్టేజ్ షో ఇచ్చినప్పుడు రాఖీ అభ్యంతరకరమైన భంగిమలతో డాన్స్ చేశారని, ఒళ్లు కనిపించేలా దుస్తులు ధరించారని ఆమెపై కేసు నమోదు అయ్యింది ♦ 2006లో పంజాబీ సింగింగ్ సెన్సేషన్ మికా సింగ్ తన బర్త్‌డే పార్టీకి వచ్చిన రాఖీ సావంత్‌కు బలవంతంగా ముద్దు పెట్టడంతో ఆమె అతడిపై క్రిమినల్ కేసు పెట్టారు ♦ లెక్కలేనన్ని కాస్మెటిక్ సర్జరీలు చేయించుకున్నారని రాఖీపై ఓ విమర్శ ♦ ఓ ప్రీమియర్ షోలో రెండేళ్ల క్రితం నటి కైనాజ్ పర్వేజ్‌ను రాఖీ ముద్దు పెట్టుకోవడం పెద్ద చర్చ అయింది ♦ మోదీ బొమ్మ ఉన్న దుస్తుల్ని ధరించి ఆమె బీజేపీ అభిమానులకు కోపం తెప్పించారు. మిర్చి కోట్స్ ♦ రాఖీసావంత్‌కి తనను తాను గ్రీన్ మిర్చితో పోల్చుకోవడం ఇష్టం. ఆమె మాటలు కూడా పచ్చి మిర్చి అంత ఘాటుగానే ఉంటాయి. వాటిలో కొన్ని ♦ డొనాల్ట్ ట్రంప్ మీద పోటీ చేసి ఉంటే నేను తేలిగ్గా గెలిచి ఉండేదాన్ని ♦ నేను డిప్రెషన్లో పడే టైపు కాదు. డిప్రెషన్లో పడేసే టైపు ♦ షారుక్ ఖాన్ కనిపెట్టిన మణిమాణిక్యాన్ని నేను ♦ ఎవరేం చేస్తున్నారని కేజ్రీవాల్‌లా నేనో కన్నేసి ఉంచను. డైరెక్ట్‌గా మీడియాను స్పాట్‌లోకి తీసుకెళ్తానంతే ♦ సెక్స్ అప్పీల్ లేకుండా టాలెంట్ ఏమిటి! టాలెంట్ లేకుండా సెక్స్ అప్పీల్ ఏమిటి!! రాఖీకి పెళ్లయిందా? పెళ్లయిందీ, పెళ్లి పెటాకులూ అయింది. 2009లో రాఖీ తన 31వ యేట ‘రాఖీ కా స్వయంవర్’ అనే రియాలిటీ షోలో తన జీవిత భాగస్వామిని వరించి వివాహం చేసుకున్నారు. అలా ఆ ఏడాది ఆగస్టు 2న రాఖీ.. స్వయంవరానికి వచ్చిన కెనడా కుర్రాడు ఎలేష్ పారజాన్వాలా మెడలో పూలహారం వేశారు. అయితే, ఆ తర్వాత కొద్ది నెలలకే ‘మేమిద్దరం విడిపోయాం’ అని ఆమె ప్రకటించారు. ఆ తర్వాత రాఖీ నాలుగేళ్ల పాటు అభిషేక్ అవస్థితో డేటింగ్ చేశారు. బ్రేకప్ తర్వాత, శ్రద్ధాశర్మ తన బాయ్ ఫ్రెండ్‌ని దొంగిలించిందని రాఖీ ఆరోపించారు. అభిషేక్ అవస్థి యాక్టర్, కొరియోగ్రాఫర్, డాన్సర్, మోడల్. రాఖీ కన్నా వయసులో మూడేళ్లు చిన్న. బ్రేకప్ అయినప్పుడు రాఖీ అభిషేక్‌ను లాగిపెట్టి చెప్పదెబ్బ కూడా కొట్టింది. ఏక్ నిరంజని ‘అమ్మా లేదు, నాన్నా లేడు, అక్కా చెల్లి తంబీ లేడు.. ఏక్ నిరంజన్’ అని ‘ఏక్ నిరంజన్’ సినిమాలో ప్రభాస్ పాడతాడు. రాఖీ సావంత్‌కి వీళ్లందరూ ఉన్నారు కానీ, ‘నాకెవరూ లేరు’ అని ఆమె చెబుతుంటారు! ఆమె ఉద్దేశం.. ఎవరి సహాయమూ లేకుండా స్వయంకృషితో పైకొచ్చానని చెప్పడం. రాఖీ.. ‘రాఖీ’ పండుగను కూడా జరుపుకోరు. అందుకు ‘ఇదీ’ అని కారణం ఏమీ లేదు కానీ, క్రైస్తవ మతాన్ని స్వీకరించాక రాఖీ వదులుకున్న హైందవ సంప్రదాయాల్లో రాఖీ కూడా ఒకటి. రాఖీ సావంత్ ప్రస్తుతం ముంబైలోని లంకంత సొంత ఇంట్లో తనొక్కరే ఉంటున్నారు. అయితే తన లక్కీ మ్యాన్ కోసం రెండోసారి ‘స్వయంవరం’ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు!! రాఖీ బెస్ట్ ఫ్రెండ్, నటి అయిన సోఫియా హయత్ చెబుతున్న దానిని బట్టి రాఖీ ఈ ఏడాదిలో ఎప్పుడైనా వివాహం చేసుకోవచ్చని తెలుస్తోంది. -
సల్సాతో దుమ్ము రేపిన 80 ఏళ్ల బామ్మ
-
చైనా రియాలిటీ షోలో బుడ్డోడి సాహసం
-
తృప్తి దేశాయ్ కు ‘బిగ్ బాస్’ ఆఫర్
ముంబై: ఆలయాల్లో మహిళల సమాన హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ కు ’బిగ్ బాస్’ ఆఫర్ వచ్చింది. వివాదస్పద సెలబ్రిటీ రియాలిటీ షో ‘బిగ్ బాగ్ 10’ లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ విషయాన్ని తృప్తి దేశాయ్ ధ్రువీకరించారు. అయితే ఒక షరతుపై ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమని ఆమె తెలిపారు. ఇందులో పోటీపడే వారందరూ మహిళలు ఉండాలని ఆమె షరతు పెట్టారు. తన షరతుకు అంగీకరిస్తే పాల్గొంటానని వెల్లడించారు. అక్టోబర్ 16 నుంచి బిగ్ బాగ్ 10 కార్యక్రమం ప్రారంభమవుతుందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈసారి సామాన్యులకు ఇందులో ప్రవేశం కల్పిస్తారని అంటున్నారు. సుల్తాన్, వ్యోమగామి వేషంలో సల్మాన్ ఖాన్.. ప్రొమోస్ లో కనిపిస్తున్నాడు. -
దెబ్బకు ఠా దొంగల ముఠా
సిటీలోని వినోద కేంద్రాలు విచిత్రాలను చూపిస్తున్నాయి. రొటీన్ వర్క్‌కు బై చెప్పి ప్రొటీన్ లాంటి ఎంటర్టైన్మెంట్ను కోరుకుంటున్న కార్పొరేట్ ఉద్యోగులే లక్ష్యంగా ఏర్పాటవుతున్న వినోద కేంద్రాలు.. వైవిధ్య లోతుల్ని తవ్వి తీస్తున్నాయి. పబ్, క్లబ్, కాఫీ షాప్స్, స్పోర్ట్స్ ఎరీనాలు.. ఇవన్నీ బోర్ కొట్టేశాయంటున్న యువత కోసం అరుదైన ఆటల కేంద్రాలు ఆవిర్భవిస్తున్నాయి. రియాలిటీ షోలను తలదన్నే రీతిలో గేమ్‌లను డిజైన్ చేసి యువ సందడికి వేదికలవుతున్నాయి. ట్రెజర్ గేమ్.. ఒక సంపన్నుడు 1950లో తమ పూర్వీకుల సమాధితో పాటు నేలమట్టం అయిన నిధిని తిరిగి పొందాలని ఆశిస్తాడు. దీని కోసం కొందరిని నియమించుకొని వారిని టైమ్ మెషిన్ మీద కొన్ని దశాబ్దాల వెనుకకు పంపించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే మెషిన్ పొరపాటు వల్ల అది వారిని సమాధి నేలమట్టం అవడానికి కేవలం గంట ముందుకు మాత్రమే పంపుతుంది. దీంతో వాళ్లు కేవలం 60 నిమిషాల్లో నిధిని కనిపెట్టడంతో పాటు కుప్పకూలనున్న సమాధి నుంచి బయటపడాల్సి వస్తుంది. అప్పుడు మొదలువుతుంది ఆట.. రంజుగా. నిజాం ఆభరణాల చోరీకి... సిటీలోని సాలార్జంగ్ మ్యూజియంలోని నిజాం నగల తాత్కాలిక ప్రదర్శన నుంచి అత్యంత ఆకర్షణీయమైన, విలువైన 250 క్యారట్ల నిజామీ డైమండ్‌ని దొంగిలించేందుకు స్కెచ్ వేస్తుందో ముఠా. కేవలం గంట వ్యవధిలో దీన్ని దొంగలించి, సెక్యూరిటీ గార్డ్స్‌కి చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకోవడానికి ముఠాలోని కొందరు సిద్ధమవుతారు. అందాల నటికి ఆపదొస్తే.. ఒక టాలీవుడ్ నటి జీవితం చిక్కుల్లో పడుతుంది. నటికి ఆపద కల్పించాలనే ఉద్దేశంతో ఆమె నటిస్తున్న షూటింగ్ సెట్లో సైతం ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతుంటాయి. తనకు మరో గంటలో ఏమైనా జరగొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో సినిమా షూటింగ్‌కు అంతరాయం కలుగకూడదని అనుకుంటారు నిర్మాత, దర్శకులు. గంట వ్యవధిలో నటికి కీడు తలపెట్టిన వారిని పట్టుకోవాలని సిటీకి చెందిన టాప్ డిటెక్టివ్‌లను పురమాయిస్తారు. ఈ వినోద క్రీడల్లో నిధిని అన్వేషించే వాళ్లు, ఆభరణాల దొంగలు, డిటెక్టివ్లు.. వీరంతా ఆటగాళ్లే. ఇలాంటి ఆటలు ఆడేందుకు వీరికి ‘ది ఎస్కేప్ హంట్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్’ లాంటి విచిత్రమైన వినోద వేదికలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఎస్కేప్ హంట్ దాదాపు 4,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో గేమ్‌కి ఒకటి చొప్పున రూమ్స్ ఉన్నాయి. వినోదం.. విశేషం స్నేహితులు, కుటుంబాలతో కలిసి వెళ్లి ఆడుకునేందుకు వీలుగా ఈ గేమ్ సెంటర్లలో ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నారు. కార్పొరేట్ టీమ్ బిల్డింగ్ ఈవెంట్స్, క్రిటికల్ థింకింగ్, అబ్జర్వేషన్ వంటి స్కిల్స్ పెరిగేందుకు ఇవి ఉపకరిస్తున్నాయని అంటున్నారు నిర్వాహకులు ఆదిత్య, సనా. ‘బ్యాంకాక్, థాయ్‌ల్యాండ్‌లలో పెరిగాను. ఆస్ట్రేలియా నుంచి కొన్నేళ్ల క్రితమే నగరానికి తిరిగి వచ్చాను. ఇక్కడ వినోద వేదికలున్నా మరిన్ని విశేషాలకు అవకాశం ఉందని అర్థమైంది. బ్యాంకాక్‌లో ఆడిన అనుభవమే ఇక్కడ ప్రారంభించేందుకు కారణమైంది. సిటీలో ఇదే ఫస్ట్ ఎస్కేప్ రూమ్ గేమ్. దేశంలోనే రెండోది. ఇందులో 60 నిమిషాల ఆట, 30 నిమిషాలు రిలాక్స్ అవడం ఉంటాయి. ఇక్కడ ఫైవ్‌స్టార్ లాంజ్‌లో అవసరమైన రీఫ్రెష్‌మెంట్స్ ఉంటాయి. అలాగే స్పెషల్ కాస్ట్యూమ్స్ ధరించి ఫొటోలు దిగేందుకు వీలుగా ఫొటో వాల్స్ ఉన్నాయ’ని చెప్పారు సనా. -
బుల్లితెరపై నవదీప్
తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జై సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయిన యంగ్ హీరో నవదీప్. లుక్ విషయంలో, నటన విషయంలో ఎలాంటి రిమార్క్స్ లేకపోయినా స్టార్ ఇమేజ్ను మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. అయితే హీరో పాత్రే చేయాలంటూ పట్టు పట్టకపోవటంతో నవదీప్ కెరీర్ బిజీగానే సాగుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో నెగెటివ్ రోల్స్‌కు నవదీప్ బెస్ట్ చాయిస్‌లా కనిపిస్తున్నాడు. అంతేకాదు పలు కార్యక్రమాలకు హోస్ట్‌గా కూడా తన సత్తా చూపిస్తున్నాడు నవదీప్. ఇటీవల జరిగిన ఐఐఎఫ్ఎ అవార్డ్ ఫంక్షన్‌తో పాటు, బ్రహ్మోత్సవం ఆడియో వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. తాజాగా మరో కొత్త కార్యక్రమంతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఓ ప్రముఖ చానల్లో నిర్వహిస్తున్న రియాల్టీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కూతురు స్వప్నదత్ నిర్మాతగా వైజయంతీ టెలిఫిలింస్ నిర్మిస్తున్న ఈ కార్యక్రమంలో 15 మంది టాలీవుడ్ ముద్దుగుమ్మలు సాహసాలు చేయనున్నారు. వారిని సమన్వయపరిచే బాధ్యతను నవదీప్ తీసుకున్నాడు. దీంతోపాటు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ధృవ సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు నవదీప్. -
రైట్ స్టెప్పా? రాంగ్ స్టెప్పా??
బంగారు పళ్లానికైనా గోడ చేర్పు కావాలంటారు. బంగారు భవిత పొందాలంటే కళాకారులకూ ఒక వేదిక కావాలి. ఒకప్పుడు తమలోని కౌశలాన్ని ప్రపంచానికి తెలియజెప్పడానికి అవకాశమే ఉండేది కాదు. కాని రియాలిటీ షోల పుట్టుకతో అవకాశాలు నేరుగా వచ్చి అంగట్లో వాలుతున్నాయి. బాల కళాకారులకు సైతం మంచి వేదికగా మారుతున్నాయి. ముఖ్యంగా పిల్లల డ్యాన్స షోలు రాను రాను ఎక్కువవుతున్నాయి. వారిని చిన్ననాటే సెలెబ్రిటీలను చేస్తున్నాయి. కానీ కొందరు అంటున్నట్టు ఈ షోలు శృతి మించుతున్నాయా? పిల్లల మనసులపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయా? గెలుపోటముల మధ్య జరిగే ఈ సంగ్రామాలు పిల్లల పసి మనసులను గాయపరుస్తున్నాయా? గెలిచి తీరాలనే ఒత్తిడి వాళ్లను చిత్రవధకు గురిచేస్తోందా? భారతీయ టెలివిజన్ వినోద కార్యక్రమాల చరిత్రలో మహత్తరమైన మనోరంజక కార్యక్రమాలుగా నిలిచి... బ్రహ్మాండమైన ప్రజాభిమానాన్ని, ఆర్థిక విజయాన్ని కైవసం చేసుకున్నవి డ్యాన్స షోలు. వీటిలో బాలల విభాగం మరింత ఊపును, హుషారును కలిగిస్తూ ఆబాల గోపాలాన్నీ అలరించాయి, అలరిస్తున్నాయి. మన దేశంలో డ్యాన్స్ షోలు సోనీ టీవీలో భూగీ వూగీతో ప్రారంభమయ్యా యని చెప్పాలి. ప్రముఖ డ్యాన్సింగ్ స్టార్ జావెద్ జాఫ్రీ సోదరుడు నవీద్ జాఫ్రీ, రవీ బెహల్ సంయుక్తంగా సుమారు ఎనిమిదేళ్ల పాటు ఈ షోను విజయవంతంగా నడి పారు. పిల్లల డ్యాన్స్ షోలను కూడా అదే సిరీస్‌లో వాళ్లే ప్రవేశపెట్టారు. అవి కనీ వినీ ఎరుగనంత ప్రేక్షకాదరణ పొందాయి. అదిరి పోయే టీఆర్పీలు నమోదయ్యాయి. దాంతో మరికొన్ని షోలు పుట్టుకొచ్చాయి. జీ టీవీలో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స కూడా సూపర్‌హిట్ అయ్యింది. అత్యధిక ప్రేక్షకాదరణను చూరగొంది. తెలుగులో కూడా చాలాకాలం క్రితమే పిల్లల డ్యాన్స షోలు మొదలయ్యాయి. ఓంకార్ ‘ఆట’తో పాటు ‘ఢీ జూనియర్స్’ మొదలైన పిల్లల డ్యాన్స్ షోలు సందడి చేయడం మొదలుపెట్టాయి. అంతవరకూ బాగుంది... చెప్పాలంటే... రాత్రికి రాత్రే దేశ ప్రజలకు అభిమాన పాత్రులయ్యే అవ కాశాన్ని ఈ షోలు చిన్నారులకు కల్పిస్తు న్నాయి. ఒకప్పుడు పేరు, డబ్బు రావా లంటే ఓ వయసు వరకూ ఎదురు చూడాల్సి వచ్చేది. ఎన్నో తపస్సులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడంత శ్రమ లేకుండా చేస్తు న్నాయి టీవీ చానెళ్లు. అవకాశాలను తెచ్చి వాకిట్లో నిలబెడుతున్నాయి. తమ ప్రతిభకు పదును పెట్టుకునే మార్గాన్ని సులభతరం చేస్తున్నాయి. దానికితోడు ఎస్సెమ్మెస్ రిక్వెస్టుల ద్వారా ప్రజలు తమనెంత ఇష్టపడుతున్నారో తెలుసుకునే అవకాశాన్ని కూడా పిల్లలకు కలిగిస్తున్నాయి. పువ్వు పుట్టగానే పరిమళించిం దన్నట్టు... సరిగ్గా ప్రపంచాన్ని చూడక ముందే ప్రపంచానికి ఫేవరేట్స్‌గా మారిపోతోన్న తమ పిల్లలను చూసుకుని తల్లిదండ్రులు కూడా మురిసిపోతున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ షోలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణాలు బోలెడు. పిల్లలను డ్యాన్స్ చేయ మంటున్నారు సరే. కానీ ఎలాంటి పాటలకి? ఐటెమ్ సాంగులకి, రొమాంటిక్ నంబర్స్‌కి. పైగా ఆ లిరిక్స్‌కి తగ్గట్టుగానే హావభావాలను పలికించమనడం, అసభ్యకరమైన అభ్యంతర కరమైన భంగిమల్లో నర్తింపజేయడం సమంజసమా? ఇది పిల్లల మానసిక స్థితిపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అంటున్నారు మానసిక నిపుణులు. నిజానికి ఈ విషయంలో జాతీయ చానెళ్లు జాగరూకతతో ఉన్నాయి. కథక్, భాంగ్రా వంటి సంప్రదాయ, జానపద నర్తన రీతులను మేళవించిన పాటలకు నర్తించే విధంగా పిల్లలను ప్రోత్సహిస్తున్నాయి. దాంతో ఆ షోలకు ప్రజాదరణ ఎక్కువ, విమర్శలు తక్కువగా ఉంటున్నాయి. మన దగ్గర అలా జరగకపోవడం బాధాకరం. ఇక మరో సమస్య... గెలుపోట ములు. ఓటమి అందరికీ బాధా కరమే. పిల్లలకైతే మరీను. తాము ఓడిపోయామే అన్న బాధ వాళ్లను నలిపేస్తుంది. ఫలితాలను సున్నితంగా ప్రకటించడం ద్వారా వాళ్ల మనసులు గాయపడకుండా చూడొచ్చు. కానీ విపరీతమైన టెన్షన్ వాళ్లలో క్రియేట్ చేసి మరీ రిజల్ట్ చెప్తారు. దాంతో డిజప్పాయింట్ అయ్యి పిల్లలు విపరీతంగా ఏడ్చిన సందర్భాలున్నాయి. దానికి తోడు న్యాయనిర్ణేతల కామెంట్స్ కూడా పసి మనసుల్ని కలత చెందేలా చేస్తాయి. వారిపై ఒత్తిడిని పెంచుతాయి. నిరుత్సాహానికి గురి చేస్తాయి. అసలు జాగ్రత్తగా ప్రయత్నిస్తే ఓటమిని భరించే శక్తి పిల్లలకు నేర్పడానికి ఈ షోలు మంచి వేదిక. ఎందుకంటే షో సక్సెస్ కావాలంటే.... డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టులు, కాస్ట్యూమ్స్ డిజైనర్లు, స్టేజి అలంకరణ చేసేవారు, సహాయకులు అంతా కలసి ఎన్నో రోజులు అభ్యాసం చేయవలసి ఉంటుంది. ఇలా నలుగురితో కలిసి ఒకే లక్ష్యం కోసం పరిశ్రమించడం వల్ల బాలలకూ టీమ్ స్పిరిట్ అలవాటవుతుంది. గెలుపోటములు కూడా సమాన స్థాయిలో స్వీకరించే క్రీడాస్ఫూర్తి వస్తుంది. కానీ గెలిచి తీరాలంటూ చేసే ఒత్తిడితో ఆ అవకాశం పిల్లలకు లేకుండా చేస్తున్నామా అన్నది ఓసారి చూసుకోవాలి. ఎంతసేపూ నువ్వే గెలవాలి, నువ్వే గెలవాలి అంటే వాళ్లు ఇతరుల గెలుపును ఎందుకు హర్షిస్తారు? తమ ఓటమిని ఎలా తట్టుకుం టారు? పైగా రోజుల తరబడి, రిహార్సల్స్ చేసి, ఒళ్లు హూనం చేసుకున్నాక కూడా ఓడిపోయామే అన్న బాధ ప్రశాంతంగా ఎలా ఉండనిస్తుంది? ఇవన్నీ సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయాలు. కిట్టిగాడు, అపరంజి, హైస్కూల్ తప్పితే తెలుగులో బాలల కథాంశాలతో సీరియళ్లు రాలేదు. దాంతో పిల్లల ఉత్పత్తుల ప్రకటనలకు అనువైన స్లాట్ ఈ షోలు అని అడ్వటైజర్లు భావిస్తున్నారు. వ్యాపారం కోసం పిల్లల్ని బలిపెట్టడం భావ్యం కాదు కదా! ఈ విషయంలో తల్లిదండ్రులకూ సమాన బాధ్యత ఉంది. కాబట్టి నిర్వాహకులు పిల్లల బాల్యాన్ని తమ షోలు హరిస్తున్నాయా అన్నది ఓసారి ఆలోచించాలి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలను సెలెబ్రిటీలుగా చూడాలనుకునే క్రమంలో వాళ్ల భవిష్యత్తుని, మానసిక స్థితిని పాడుచేస్తున్నామా అన్నది పరిశీలించు కోవాలి. ఎందుకంటే, అతి చిన్న వయసులో సెలెబ్రిటీ స్టేటస్ పిల్లల ఫ్యూచర్‌కి మంచిది కాదంటున్నారు నిపుణులు. తాము అందరికీ తెలుసు అన్న ఫీలింగ్ కాస్తా తమకు అన్నీ తెలుసన్న ఫీలింగ్‌గా మారి చిన్న వయసులో సెలెబ్రిటీలైన వాళ్లెందరో తప్పటడుగులు వేయడం చూస్తూనే ఉన్నాం. మరి మీ పిల్లలను ఆ దిశగా దగ్గ రుండి నడిపించడం... మీరు వేస్తున్నది రైట్ స్టెప్పా... రాంగ్ స్టెప్పా... ఆలోచించండి! - పి.వి.రామమోహన్ నాయుడు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, టీవీ నిర్మాత బాల్యాన్ని హరించడమే! టీవీ రియాలిటీ షోస్.. ముఖ్యంగా పిల్లల డ్యాన్స్ షోస్‌లో పదేళ్లలోపు చిన్నారులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆ వయసువాళ్లు నిజమేదో, భ్రమేదో తెలుసుకోలేరు. చూస్తు న్నదే వాస్తవమనుకుంటారు. న్యాయనిర్ణేతలు పిల్లలు డ్యాన్స్ సరిగా చేయలేదని చెబుతుం టారు. దాంతో పిల్లల మనసు గాయపడు తుంది. అలాగే ప్రాక్టీస్ సమయాల్లో పిల్లలపై తల్లిదండ్రులు, ట్రైనర్ల ఒత్తిడి బాగా పడు తుంది. అది చైల్డ్ లేబర్ కంటే భయంకర మైనది. ఇదంతా బాల్యాన్ని హరించడం కిందికే వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలపై పిల్ వేశాం. కానీ అది పెండింగ్‌లోనే ఉంది. - దేవి, సామాజిక కార్యకర్త ఒత్తిడి పెరిగితే ప్రమాదమే! రబ్బర్బ్యాండ్ని తీసుకుందాం. దాన్ని లాగితేనే పని జరుగుతుంది. కానీ, ఎంత వరకు లాగాలో అంతే లాగాలి. ఎక్కువగా లాగితే తెగిపోతుంది. అలాగే పిల్లలపై ఒత్తి డికి కూడా హద్దు ఉండాలి. బాగా చదవా లన్నా, డ్యాన్స్ చేయాలన్నా కొద్దిగా ఒత్తిడి అవసరమే. అది కూడా వయసును బట్టి మారుతూండాలి. అలా అయితేనే ఏ రంగం లోనైనా రాణించగలరు. కాబట్టి డ్యాన్స్ షోల్లో కామెంట్స్‌లో మార్పు రావాలి. సున్ని తంగా చెప్పాలి. తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉంటూ వారిని ప్రోత్సహించాలి. - డా॥శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై, మానసిక నిపుణులు -
ప్రాణం తీసిన ‘రియాల్టీ’ మోజు
► మంటలంటుకున్నాక తప్పించుకోవాలని వ్యూహం ► స్నేహితులతో కలసి నిర్మానుష్య ప్రాంతంలో సాహసకృత్యం చిత్రీకరణ ► ఒంటికి ఒక్కసారిగా అంటుకున్న మంటలు ► వెంటనే టీషర్ట్ విప్పడం సాధ్యం కాకపోవడంతో కుప్పకూలిన వైనం ► 60 శాతం కాలిపోయిన శరీరం ► ఆసుపత్రిలో నాలుగురోజులుగా చికిత్స పొందుతూ మృతి ► నగరంలోని బార్కాస్ ప్రాంతంలో ఘటన సాక్షి, హైదరాబాద్: ఆ కుర్రాడికి టీవీల్లో వచ్చే రియాల్టీ షోలంటే పిచ్చి.. అందులో తానూ సాహసకృత్యాలు చేసి శభాష్ అన్పించుకోవాలని కోరిక.. ఎలాగైనా ఆ షోకు వెళ్లాలనుకున్నాడు.. తల్లిదండ్రులు వారిస్తున్నా వినలేదు.. వారి కంట పడకుండా దూరంగా వెళ్లి ఫ్రెండ్స్‌తో కలసి సాహసం చేయబోయాడు.. ఒంటిపై కిరోసిన్ పోసుకొని మంటలంటుకున్నాక షర్ట్ విప్పేసి చాకచక్యంగా తప్పించుకుంటానని చెప్పాడు.. స్నేహితులు వీడియో తీయడం మొదలుపెట్టారు.. కానీ మంటలు అంటుకున్నాక షర్ట్ విప్పడం సాధ్యం కాలేదు.. చివరికి 60 శాతం కాలిన గాయాలతో నాలుగు రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు!! హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్రాంతంలో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. కలర్స్ చానల్ షోపై మోజు: పాతబస్తీలోని బార్కాస్‌కు చెందిన బషీరుద్దీన్ కుమారుడు జలాలుద్దీన్ (19) శాలిబండలోని గౌతం జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. సీఎన్ఎన్-ఐబీఎన్ సంస్థకు చెందిన కలర్స్ చానల్ నిర్వహిస్తున్న ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ రియాల్టీ షోపై ఇతడు మోజు పెంచుకున్నాడు. ఈ షోకు చెందిన ఏడో సీజన్ ‘ఫియర్ ఫ్యాక్టర్- ఖత్రోంకే ఖిలాడీ’ ఇటీవలే ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న యువతలో ఉన్న ధైర్య సాహసాలను వెలికి తీసి ప్రదర్శించడమే తమ ఉద్దేశమని ఈ కార్యక్రమ నిర్వాహకులు చెబుతున్నారు. దీనికి జడ్జిలుగా వ్యవహరిస్తున్న పలువురు ప్రముఖులు, సినీ తారలు షోలో పాల్గొనే వారి సాహసాలను చూసి పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఈ రియాల్టీ షో విజేతలకు ప్రైజ్‌మనీ కూడా రూ.లక్షల్లో ఉంటోంది. ఇవన్నీ జలాలుద్దీన్ను ప్రేరేపించాయి. ఈ రియాల్టీ షోలో పాల్గొనేందుకు ముందుగా ఎంట్రీ వీడియోలను పంపాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించాక అర్హులను షోకు ఆహ్వానిస్తారు. దీంతో ఎంట్రీ వీడియో చిత్రీకరించాలని జలాలుద్దీన్ భావించాడు. నిప్పుతో కూడిన సాహసకృత్యాన్ని ఎంపిక చేసుకున్నాడు. అతడి ప్రయత్నాలను గమనించిన తల్లిదండ్రులు పలుమార్లు హెచ్చరించారు. దీంతో జలాలుద్దీన్ ఇంటి బయట స్నేహితులతో కలిసి వీడియో చిత్రీకరణకు సిద్ధమయ్యాడు. టీ-షర్ట్ కావడంతో అడ్డం తిరిగిన కథ.. గురువారం మధ్యాహ్నం జలాలుద్దీన్ బంధువులు, స్నేహితులతో కలిసి బార్కాస్ ప్రాంతంలోని వీడియో చిత్రీకరణ ప్రారంభించాడు. నోట్లో కిరోసిన్ పోసుకొని మండుతున్న కర్రను ఊదుతూ గాల్లో అగ్నిగోళాలు సృష్టించాడు. దీనికి సంబంధించి 41 సెకన్ల నిడివితో ఉన్న వీడియోను అతడి స్నేహితులు చిత్రీకరించారు. అయితే ఈ ప్రయత్నాలను బస్తీ వాసులు అడ్డుకుని, మందలించడంతో ఫ్రెండ్స్‌తో కలిసి ఫలక్‌నుమ వద్ద ఉన్న గుట్టపైకి వెళ్లాడు. అక్కడ మరో అడుగు ముందుకు వేసిన జలాలుద్దీన్... ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటానని, కొద్దిసేపట్లోనే చాకచక్యంగా షర్ట్ విప్పేసి బయటపడతానని చెప్పి ఆ దృశ్యాలను రికార్డు చేయమని కోరాడు. అనుకున్నట్టే వెంట తెచ్చుకున్న బాటిల్లోని కిరోసిన్‌ను ఒంటిపై పోసుకున్నాడు. తర్వాత నిప్పంటిచుకొని షర్ట్ విప్పేందుకు ప్రయత్నించాడు. ఈ దృశ్యాలను జలాలుద్దీన్ వెంట ఉన్న వారు 28 సెకన్ల నిడివితో సెల్ఫోన్లో రికార్డు చేశారు. అయితే ఆ సమయంలో అతడు ధరించింది టీ-షర్ట్ కావడం, అది టైట్‌గా ఉండటంతో అనుకున్న సమయంలో విప్పలేకపోయాడు. ఈ లోపు మంటలు ఎక్కువయ్యాయి. ఆక్సిజన్ అందక మెదడు చచ్చుబడిపోయినట్లయింది. మంటల్లో చిక్కుకొని జలాలుద్దీన్ కాసేపటికే అచేతనంగా కుప్పకూలిపోయాడు. 60 శాతం కాలిన గాయాలు మంటల్లో జలాలుద్దీన్ శరీరం దాదాపు 60 శాతం కాలిపోయింది. ఈ హఠాత్పరిణామంతో అతడి వెంట ఉన్న స్నేహితులు కంగుతిన్నారు. వెంటనే తేరుకుని మంటల్ని ఆర్పి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గురువారం నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జలాలుద్దీన్ పరిస్థితి విషమించడంతో ఆదివారం చనిపోయాడు. ఈ విషయం సోమవారం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసుకున్న ఫలక్‌నుమ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జలాలుద్దీన్ సాహసకృత్యాలతో కూడిన రెండు వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. అతడి స్నేహితుల వాంగ్మూలాలు నమోదు చేశారు. -
రియాల్టీ షోను అనుకరించబోయి..
చాంద్రాయణగుట్ట: పాతబస్తీ యువతలో మార్పు తీసుకొచ్చేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొందరు యువకుల్లో మార్పు రావడం లేదు. టీవీలలో డబ్ల్యూ డబ్ల్యూ ఫైట్‌ను చూసి ఆకర్షితులై గతేడాది మే నెలలో యువకులు స్ట్రీట్ ఫైట్‌కు దిగిన ఘటనలో నబీల్ అనే యువకుడు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. తాజాగా ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో సైతం ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి టీవీలలో ప్రసారమయ్యే అగ్నికి సంబంధించిన విన్యాసాలను స్పూర్తిగా తీసుకొనే ప్రయత్నంలో ప్రాణాలుకోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్కాస్ ప్రాంతానికి చెందిన బషీరుద్దీన్ కుమారుడు జలాలుద్దీన్(19) శాలిబండలోని గౌతం జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యనభ్యసిస్తున్నాడు. కాగా గత కొన్నాళ్ల నుంచి జలాలుద్దీన్ టీవీలలో వచ్చే ఇండియా గాట్ ట్యాలెంట్ షో లాంటి రియాల్టీ షో లను స్పూర్తిగా తీసుకొని తాను కూడా అలా చేయాలని...విన్యాసాలు చేస్తూ వీడియోలలో చిత్రీకరించి సదరు ఛానల్లకు పంపాలని ప్రయత్నిస్తున్నాడు. ఇలా చేసే క్రమంలో పలుమార్లు తల్లిదండ్రులు హెచ్చరించారు. ఇంట్లో తల్లిదండ్రులు తనపై నిఘా ఉంచారని తెలుసుకున్న జలాలుద్దీన్ బయట స్నేహితులతో తన ప్రయోగాలు చేయడం ఆరంభించాడు. ఓ ప్రముఖ హిందీ ఛానల్లో ప్రసారమయ్యే అగ్నితో చెలగాటమాడే కార్యక్రమం చూసి తాను కూడా అలా చేసి సెలబ్రిటీ కావాలని ఊహించాడు. తన బంధువులలోని ఐదుగురు యువకులతో కలిసి ఫలక్‌నుమా జహనుమా వాటర్ ట్యాంక్ ప్రాంతానికి వెళ్లి టీవీలలో వచ్చే షో మాదిరిగా జలాలుద్దీన్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే విప్పి పడేసేందుకు యత్నించినప్పటికీ...అది టీ షర్ట్ కావడంతో త్వరగా రాకపోవడంతో తీవ్ర గాయాలకు గురయ్యాడు. వెంటనే అతన్ని స్నేహితులు కుటంబ సభ్యుల సహకారంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందిన జలాలుద్దీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ప్రాణం తీసిన రియాలిటీ మోజు
హైదరాబాద్: రియాలిటీ షోల మోజుతో ఓ యువకుడు ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నా తనకేమీ కాదంటూ స్నేహితుల ఎదుటే నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడి మరణించాడు. వివరాలు.. నగరంలోని పాతబస్తీకి చెందిన జాన్ మాల్ కు చెందిన జలాలుద్దీన్(22) ఈ నెల 7 వ తేదీన తన స్నేహితుల వద్ద రియాలిటీ షో చేస్తానని చెప్పాడు. వారి ఎదుటే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కొద్దిసేపు అలాగే ఉన్న యువకుడు తర్వాత మంటలు వ్యాపించడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితులు అతడిని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్సపొందుతూ జలాలుద్దీన్ సోమవారం మృతిచెందాడు. -
వార్న్‌కు పాముకాటు!
టీవీ షోలో ఘటన మెల్బోర్న్: టీవీ రియాల్టీ షోలో సాహసాలు చేయబోయిన దిగ్గజ క్రికెటర్ షేన్‌వార్న్ అనకొండ బారిన పడ్డాడు. ‘ఐయామ్ ఎ సెలబ్రిటీ...గెట్ మి అవుట్ హియర్’ అనే కార్యక్రమంలో పాల్గొంటున్న వార్న్‌ను అనకొండ తలపై కరిచింది. అయితే ఇది విషరహితమైన సర్పం కావడంతో పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు షోలో భాగంగా వివిధ రకాల కీటకాలతో కూడిన బాక్స్‌లలో తల ఉంచిన వార్న్...అనకొండ బాక్స్ దగ్గరికి రాగా, వాసనను గుర్తించిన పాము దాడి చేసింది. అప్పటికే వార్న్‌ను వ్యాఖ్యాత హెచ్చరించినా... ధైర్యంగా దగ్గరికి వెళ్లబోయిన క్రికెటర్‌పై ఒక్కసారిగా పాము దూసుకొచ్చింది. విషం లేకపోయినా దాని కాటు పడితే...అది ఒకేసారి వంద ఇంజెక్షన్లతో గుచ్చినంత నొప్పి కలిగిస్తుంది. -
రియాలిటీ షో కోసం హీరో సాహసం!
బాలీవుడ్ యువ కెరటం అర్జున్ కపూర్ ఓ రియాలిటీ షో కోసం ఒళ్లుగగుర్పొడిచే సాహసం చేశాడు. సాహసకృత్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఓ రియాలిటీ షోకి అర్జున్ మొదటిసారి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. దీనిలో భాగంగా మొదటి ఎపిసోడ్‌లోనే అర్జున్ సాహసానికి దిగాడు. ప్రమాదకరమైన తేనెటీగలు ఉన్న పెట్టెలో తలపెట్టి అందులో ఉన్న పండ్లను తిన్నాడు. ముఖం నిండా స్వీట్ క్రీమ్ రాసుకుని భయంకరమైన రకరకాల ఈగలు ఉన్న పెట్టెలో తల పెట్టి అందులో ఉన్న స్ట్రాబెర్రీలు మొత్తం తినాలి. ఈ సాహసా కృత్యానికి అర్జున్ తనంతటతానుగా పూనుకున్నాడు. ఈగలన్నీ తన ముఖం మీద వాలి క్రీమ్ రుచి చూస్తుండగా ఏ మాత్రం తొణకకుండా పెట్టెలోని స్ట్రాబెర్రీలన్నీ తినేశాడు. కాస్త తేడా వచ్చినా పరిస్థితి ప్రమాదకరంగా ఉండేది. ఇటువంటి సాహసం చేసిన మొట్టమొదటి హోస్ట్ అర్జునే అంటూ సదరు రియాలిటీ షో యూనిట్ పొగడ్తలతో ముంచెత్తింది. దీనిపై అర్జున్ మాట్లాడుతూ.. 'మాటలకన్నా చేతలు గట్టిగా పనిచేస్తాయి. షోలో పాల్గొనే అభ్యర్థులకు మరింత ప్రోత్సాహం అందించాలనే ఇలా చేశాను. అయినా నాకెలాంటి ఫోబియాలు లేవు, అందువల్లే ప్రమాదకారి ఈగలన్నీ నాపై వాలినా నేను భయపడలేదు, ఏదేమైనా ఈ అనుభవం సరికొత్తగా ఉంది.. చాలా ఎంజాయ్ చేశాను' అంటూ చెప్పుకొచ్చాడు. -
కూలీగా విద్యాబాలన్!
ఆ రోజు జైపూర్ బస్టాండ్‌లో ఉన్న ప్రయాణీకులు, కూలీలు ఒక్కసారిగా షాకయ్యారు. తమను తాము గిచ్చి చూసుకున్నారు. దానికి కారణం లేకపోలేదు. హఠాత్తుగా విద్యాబాలన్ అక్కడ కూలీ డ్రెస్సులో ఎంటరయ్యారు. కాసేపు నిలబడి ఓ కుర్రాడి చేతిలోంచి సూట్‌కేస్ తీసుకుని నెత్తి మీద పెట్టుకుని, ఒక బస్సులో పెట్టారు. అందుకుగాను ఆ కుర్రాడి అమ్మ నుంచి వంద రూపాయలు అడిగి తీసుకున్నారు. ఇంకా మరికొంతమంది ప్రయాణీకుల లగేజీలను కూడా విద్యా మోసారు. ఆమె అలా ఎందుకు చేస్తుందో తెలియక ప్రయాణీకులు తికమకపడ్డారు. విద్యా మాత్రం శ్రద్ధగా తన పని తాను చేసుకుపోయారు. ఓ రియాల్టీ షో కోసమే విద్యాబాలన్ ఇలా కూలీ అవతారమెత్తారు. త్వరలో ఈ షో ప్రసారం కానుంది. అసలు విషయం ఆ తర్వాత తెలుసుకుని ప్రయాణీకులు నవ్వుకున్నారట. అలాగే, విద్యాబాలన్ నటనను అభినందించారట! -
సెలబ్రిటీలు వ్యవసాయం చేస్తే..?
పచ్చని పొలాల్లో నాయకా నాయికలు రొమాన్స్ చేస్తుంటే, చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. పొలం గట్ల వెంట పరిగెత్తుతూ సరసాలాడుకుంటుంటే అదో కనువిందు. ఇలా కాకుండా వాళ్లు నాగలి పట్టి పొలం దున్నితే చూడటానికి వింతగా, ఆసక్తిగా ఉంటుంది. ప్రేక్షకులకు ఇలాంటి వింతైన కార్యక్రమాన్ని చూపించడానికి హిందీ నటుడు సల్మాన్ ఖాన్ రెడీ అయ్యారు. సెలబ్రిటీలు పాలు పితకడం, వ్యవసాయం చేయడం వంటి అంశాలతో ఆయన ఓ రియాల్టీ షో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ‘బిగ్ బాస్’ రియాల్టీ షో చాలా పాపులర్ అయ్యింది. అయితే ఆ షోలో సెలబ్రిటీలు నాలుగు గోడల మధ్య కూర్చొని మాట్లాడుకోవడం, ఆడుకోవడం, కుదిరితే ఫైట్ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సల్మాన్ దీనికి పూర్తి భిన్నంగా ఉండే షో చేయాలనుకున్నారట. సొంత ప్రొడక్షన్లో ఆయన ఈ షోను రూపొందించాలనుకుంటున్నారు. విలేజ్ సెటప్‌లో ఈ షో ఉండనుంది. ఇందులో పాల్గొనే సెలబ్రిటీలకు వ్యవసాయం చేయడం గురించి మొదట శిక్షణ కూడా ఇస్తారట. శిక్షణ తీసుకున్నవారికే షోలో పాల్గొనే అవకాశం ఉంటుందని సమాచారం. అలాగే ఈ షోలో వినోదం పాళ్లు ఎక్కువుండేలా స్క్రిప్ట్‌లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు సల్మాన్. -
తప్పించుకో చూద్దాం!
లండన్: ‘నీవు ఏ ప్రాంతమెల్లినా ఎందుదాగుండినా ప్రభుత్వ నిఘా నేత్రం నిన్ను వెన్నంటే ఉంటుంది’ అన్న విషయాన్ని అక్షరాల నిరూపించేందుకు బ్రిటన్‌కు చెందిన ఛానెల్ 4 టీవీ ఓ వినూత్న రియాలిటీ షో నిర్వహించి నిరూపించింది. అందుకోసం 14 మంది సామాన్యులను ఎంపిక చేసింది. లండన్‌లో టెర్రరిస్టు నిరోధక విభాగం మాజీ అధిపతి, సీఐఏ విశ్లేషకుడు, నిఘా నిపుణులతో కూడిన 30 మందిని ఓ బృందంగా ఏర్పాటు చేసింది. 14 మంది సామాన్యులు నిఘా బృందానికి దొరక్కుండా దేశంలో ఎక్కడికైనా పారిపోతుండాలి. దొరక్కుండా ఉండేందుకు హోటళ్లలో బస చేయకూడదు. క్రెడిట్ కార్డులు ఉపయోగించకూడదు. సెల్ఫోన్లు వినియోగించరాదు. ఇలా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 28 రోజులపాటు దొరక్కుండా తప్పించుకు తిరిగిన సామాన్యుడిని రియాలిటీ షోలో విజేతగా ప్రకటిస్తారు. నిఘా నిపుణుల బృందం పరారీలోవున్న సామాన్యులను ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి. స్థూలంగా ఇది ‘హైడ్ అండ్ సీక్’ లాంటి గేమ్. ఓ రోజు గేమ్ ప్రారంభమైంది. షో నిర్వాహకులు దారి ఖర్చులకు ఇచ్చిన డబ్బులను తీసుకొని, భుజానికి బ్యాగులు తగిలించుకొని 14 మంది సామాన్యులు దేశంలో తలో దిక్కుకు పారిపోయారు. వారిని పట్టుకునేందుకు నిఘా బృందం వెంట పడింది. రెండు వారాల్లోనే 13 మంది సామాన్యులు దొరికిపోయారు. ఆఖరి వాడు 46 ఏళ్ల జీపీ రికీ అలెన్ గత వారం దొరికి పోయారు. కార్ల నెంబర్ ప్లేట్లను ఆటోమేటిక్‌గా గుర్తించే సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా లండన్‌లోని యూస్టన్ రైల్వే స్టేషన్లో రికీని పట్టుకోగలిగారు. 28 రోజుల పాటు ఆయన తప్పించుకోలేక పోయినా షో నిర్వాహకులు ఆయన్నే విజేతగా ప్రకటించి బహమతి ప్రకటించారు. బ్రిటన్‌లో ప్రతి 11 మందికి ఒకటి చొప్పున సీసీటీవీ కెమెరాలు వీధుల్లో అమర్చి ఉన్నాయి. వాటిలో నంబరు ప్లేట్లను ఆటోమేటిక్‌గా గుర్తించే కెమెరాలు ఎనిమిది వేలున్నాయి. రోజుకు 140 లక్షల మంది డ్రైవర్లపై అవి నిఘా వేయగలవు. మూడున్నర కోట్ల మంది ప్రజల సెలఫోన్లను ట్రాక్ చేయగల జీపీఎస్ వ్యవస్థ కూడా పోలీసు అధికార వ్యవస్థ ఉంది. ఆ అధికార వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశం ఓ టీవీ ఛానల్‌కు ఉండదుకనుక, మ్యాపింగ్ ద్వారా ప్రభుత్వ నిఘా కెమెరాలు ఎక్కడున్నాయో అక్కడ షో నిర్వాహకులు ప్రైవేటు సీసీటీవీ కెమెరాలను అమర్చి పరారీలో ఉన్న సామాన్యులపై నిఘా పెట్టారు. అందులో ఓ నెంబర్ ప్లేటును గుర్తించే కెమెరా ఫుటేజ్ ద్వారా రికీని నిఘా బృందం పట్టుకోగలిగింది. ఆయన ఓ కారు పక్కన నిలబడి ఉండడాన్ని గమనించిన బృందం ఆ కారును వెంటాడడం ద్వారా రికీని దొరకబుచ్చుకుంది. పలుసార్లు తనను పట్టుకునేందుకు నిఘా బృందం తనకు సమీపంలోకి వచ్చినప్పటికీ వారిని తప్పుదోవ పట్టించడం ద్వారా ఎక్కువ రోజులు దొరక్కుండా తప్పించున్నానని రికీ తెలిపారు. జాన్ బుచన్ 1915లో రాసిన ‘ది 39 స్టెప్స్’ అడ్వెంచర్ నవల తనకెంతో స్ఫూర్తినిచ్చిందని, దానిలో పేర్కొన్న ప్రాంతాలన్నింటికి తాను తప్పించుకొని పారిపోవడంలో భాగంగా వెళ్లానని రికీ వివరించారు. తన ఇంట్లోనే ఉన్న ఆ నవలను స్వాధీనం చేసుకొని, దాన్ని చదివి ఉన్నట్లయితే నిఘా బృందం తనను ఎప్పుడో పట్టుకొని ఉండేదని రికీ వివరించారు. నిఘా నీడల మధ్య జీవితం ఎలా ఉంటుందో తన పిల్లలకు చెప్పడం కోసమే తానీ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్నానని చెప్పారు. నేటి సాంకేతిక యుగంలో ‘దాచుకోవాల్సింది ఏమీ లేనప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదనే నానుడిని నీవు ఏ తప్పు చేయనప్పుడు నీ ఇంట్లో నిఘా కెమెరా పెడతేనేమి’గా మార్చాలని ఆయన వ్యాఖ్యానించారు. -
రియాల్టీ షో కోసం బాలుడిని..
న్యూఢిల్లీ: పాపులర్ రియాల్టీ షోలో పాల్గొనేందుకు.. ఇద్దరు మైనర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. 13 ఏళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి, నిర్దాక్షిణ్యంగా హత్యచేశారు. అనంతరం ఆ బాలుడి తండ్రిని 60 వేల రూపాయలివ్వాలని డిమాండ్ చేశారు. దీంతో విషయం వెలుగు చూసింది. ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి రాంధ్వా చెప్పిన సమాచారం ప్రకారం..17 ఏళ్ల అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ఒక రియాల్టీ షో లో పాల్గొనేందుకు ముంబై వెళ్లాలనుకున్నారు. దీనికి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే కోరికతో ఇద్దరూ కలిసి పథకం పన్నారు. డ్యాన్స్ షోకు వెళదామంటూ 13 ఏళ్ల స్వప్నేష్ గుప్తాకు మాయమాటలు చెప్పి నమ్మించారు. సెప్టెంబర్ 16న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ తీసుకెళ్లారు. అక్కడ ఒక రాత్రి మరో స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నారు. అక్కడికి సమీపంలోని రాణిఖేత్ కొండపైకి తీసుకెళ్లి బెల్టుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. మృతదేహాన్ని కొండ పైనుంచి కిందికి తోసేసి, రెండురోజుల తర్వాత ఢిల్లీకి తిరిగి వచ్చేశారు. తమ ప్లాన్‌లో భాగంగా రూ. 60 వేలు కావాలని స్నప్నేష్ తండ్రిని డిమాండ్ చేశాడు. ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల ఫోన్ కాల్స్ ఆధారంగా కేసును ఛేదించారు. -
ఇరవయ్యేళ్ల తర్వాత మళ్లీ బుల్లితెరపై!
విద్యాబాలన్ మన ఇంటికి రానున్నారు. కొన్ని కొత్త విషయాలు కూడా చెప్పనున్నారు. విచిత్రంగా ఉంది కదూ. విషయం ఏంటంటే... ఇన్నాళ్లూ వెండితెరపై నటిగా తన టాలెంట్ ఏంటో చూపించిన విద్యాబాలన్ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయనున్నారు. ‘టెడ్’ అనే రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించమని కొన్ని నెలల క్రితం ఓ అంతర్జాతీయ చానల్ ప్రతినిధులు విద్యాబాలన్‌ను సంప్రతించారట. ఈ షోలో పలు రంగాలకు సంబంధించిన మేధావులు, ఔత్సాహికులు పాల్గొని కొత్త ఐడియాలను ప్రపంచానికి పరిచయం చేసి, ఆయా రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు బాటలు వేస్తారు. సినిమా రంగానికి సంబంధించి విద్యాబాలన్ అయితే బాగుంటుందని సదరు షో నిర్వాహకులు భావించారట. విద్యా బాలన్‌కి కూడా ఈ షో కాన్సెప్ట్ నచ్చి కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. ‘‘ఆ షో నిర్వాహకులు రెండు ఐడియాలతో నా దగ్గరకు వచ్చారు. ఒకటి నచ్చింది. వెంటనే దీన్ని డెవలప్ చేసి తీసుకురమ్మన్నా. ఫైనల్ కాన్సెప్ట్ నచ్చితే ఓకే చెప్పేస్తా’’ అని విద్యాబాలన్ అన్నారు. విశేషమేమిటంటే, ఆమె మొదట ఓ బుల్లితెర కార్యక్రమం ‘హమ్‌పాంచ్’తో పరిచయమై ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడు గుపెట్టారు. -
రియాలిటీ షో
‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘ఓకే బంగారం’, ‘గంగ’ చిత్రాల్లో నటించి మురిపించిన నిత్యామీనన్ కథానాయికగా మరో చిత్రం రానుంది. నిత్యామీనన్, ఉన్ని ముకుందం, శ్వేతా మీనన్, సిద్దిక్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రాన్ని ‘ఈ వేళలో’ పేరుతో మనదేశం మూవీస్ పతాకంపై అశోక్ వల్లభనేని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. టి.కె రాజీవ్ కుమార్ దర్శకుడు. ఈ నెల మూడో వారంలో ఈ సినిమా విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘టీవీ రియాలిటీ షో, రేటింగ్స్ నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ప్రేమకథ ఇది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శరత్, మాటలు- పాటలు: అంజలి గెర్రి, కెమెరా: వినోద్ ఇల్లంపల్లి. -
కేర్ టేకర్!
రియాల్టీ షో స్టార్ కిమ్ కర్డాషియన్ ఏం చేసినా సంచలనమే. నటించినా.. బయట తిరిగినా.. రిలేషన్స్ మెయిన్‌టెయిన్ చేసినా..! చెప్పొచ్చేదేమంటే... గ్లామర్ ఫీల్డ్‌లో పర్సనల్ మ్యాకప్మ్యాన్స్ ఉండటం కామనే. కానీ... ఈ అమ్మడు మరికాస్త ముందుకెళ్లింది. మ్యాకప్ను మరింత పర్సనల్ టచ్‌కు ఉపయోగించుకుంటుందట! అధరాలు, కనుబొమ్మలు, బుగ్గలు... ఓకే! ఈ సెక్సీ తార ఎద సంపదకూ టచప్ల కోసం స్పెషల్‌గా మ్యాకప్ ఉమన్‌ను పెట్టుకుందట! ఇది విని సామాన్యులే కాదు.. హాలీవుడ్ తారలూ కొత్తగా ఫీలయ్యారట. ‘ఇప్పటి వరకు కిమ్ గ్లామర్‌ను ఒక కోణంలోనే చూశారు. నిజానికి ఆమెలో ప్రతిదీ స్పెషలే. మెరుగులు అద్దితే ఈ అందం మరింత వికసిస్తుంది. అందుకే ఈ ప్రయత్నం’ అంటూ ఆమె హబ్బీ కాన్యే వెస్ట్ చెప్పాడన్నది ‘ది సన్’ పత్రిక కథనం. మొత్తానికి తన వంపుసొంపులతో పురుష పుంగవులకు నిద్దర లేని రాత్రులు మిగులుస్తోంది కిమ్! -
టాలెంట్ అన్లిమిటెడ్
అవకాశం రావాలే కానీ... ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు సిటీ కుర్రకారు. కలర్స ఎంటర్టైన్మెంట్ చానల్ మెహదీపట్నం సెయింట్ ఆన్స్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఆడిషన్స్‌లో తమ టాలెంట్‌తో అదరగొట్టి అబ్బురపరిచారు. ‘ఇండియా గాట్ ట్యాలెంట్’ అనే ఈ రియాల్టీ షోలో దుమ్ము రేపారు. రియాల్టీ షో హోస్ట్ నకుల్ మెహతా, బిగ్‌బాస్ సీజన్8 ఫైనలిస్ట్ ప్రీతమ్ సింగ్ యూత్ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. సిటీ కుర్రాళ్లే కాదు... ఇతర రాష్ట్రాల నుంచి కూడా తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. సిటీ ‘నిధి’ ఆడిషన్స్‌లో బోయినపల్లికి చెందిన పదేళ్ల చిన్నారి జి.నిధి ప్రత్యేక ఆకర్షణ. కూచిపూడితో పాటు జానపద గీతాలకు అలవోకగా నృత్యం చేసి అబ్బురపరిచింది నిధి. భవిష్యత్‌లో మంచి యాక్టర్ అవ్వాలనేది ఈ చిన్నారి ఆకాంక్ష. మా అమ్మాయి 21 లాలిపాటలను ఏకధాటిగా పాడి తెలుగు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఏడు రికార్డులు తిరగరాసింది. కళాకారిణి కావాలన్న నా కోరిక నా బిడ్డ తీర్చింది... అంటూ ఆనందంగా చెప్పారు నిధి తల్లి స్వర్ణశ్రీ. మహరాష్ర్ట బీడ్ ప్రాంతం నుంచి వచ్చాం. మా అమ్మాయి సలోని (11)కి డ్యాన్స్ అంటే మహా ఇష్టం. మహరాష్ట్ర దూరదర్శన్‌లో నిర్వహించిన డ్యాన్స్ పోటీల్లో తనే విన్నర్. ప్రస్తుతం ‘అస్త్ర’ అనే మరాఠి చిత్రంలో నటిస్తోంది. ఈ షోలో కూడా అదరగొడుతుందని నమ్మకం ఉంది... అని వైష్ణవి చెప్పారు. కొదవ లేదు... ఈ టాలెంట్ హంట్‌లో పాల్గొనేవారిని ఉత్తేజపరచడానికి వచ్చాను. కంటెస్టెంట్ల ప్రదర్శన మైండ్ బ్లోయింగ్. వారిని చూస్తుంటే నాకే ప్రేరణ కలుగుతుంది... అన్నారు నకుల్ మెహతా. హైదరాబాద్‌లో టాలెంటెడ్ యూత్‌కి కొదవలేదని ప్రీతమ్‌సింగ్ చెప్పారు. - ఎస్.శ్రావణ్‌జయ -
గౌహర్ ఇంటెన్షన్!
సినిమాల్లోనే చూస్తుంటాం... విలన్ పాపులారిటీ, సింపతీ తెచ్చుకోవడానికి తనపై తనే దాడి చేయించుకుంటాడు. సరిగ్గా అదే ఫార్ములా ఫాలో అయినట్టుంది హీరోయిన్ గౌహర్‌ఖాన్. రియాల్టీ షో ‘ఇండియాస్ రా స్టార్’ షూటింగ్లో కురచ డ్రెస్ వేసుకుందంటూ జూనియర్ ఆర్టిస్ట్ మహమ్మద్ అకిల్ మాలిక్ గౌహర్ చెంప ఛెళ్లుమనిపించాడు. సింపతీ పెరిగి... ఒక్కసారిగా ఈ అమ్మడికి పాపులారిటీ వచ్చేసింది. ఇప్పుడా ఎపిసోడ్ ఆసక్తికర మలుపు తీసుకుంది. తనను కొట్టమని గౌహరే డబ్బులిచ్చిందని మాలిక్ చెబుతున్నాడు. ఈ మేరకు ఇద్దరి మధ్యా మౌఖిక ఒప్పందం కుదిరిందట. ‘నాకు అవకాశాలిమ్మని గౌహర్‌ను కలిశా. దబాంగ్3లో మంచి రోల్ ఇప్పిస్తానని, ప్రతిగా రియాల్టీ షోలో తనను కొట్టాలని కోరింది’ అంటూ ఓ చానల్‌తో గుట్టు విప్పాడు మాలిక్. -
నవ్వులో కూడా ఏడుపు వినిపిస్తుంది!
లైఫ్‌బుక్ ‘ఎం’ టీవి ఇండియా రియాల్టీ షో ‘టీన్ దివా’తో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన రియా చక్రవర్తి ‘తూనీగ... తూనీగ’ తెలుగు సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. ‘మేరే డాడ్ కీ మారుతి’, ‘సోనాలీ కేబుల్’ సినిమాలలో తన నటనతో ఆకట్టుకున్నారు. ఆమె మనసులోని మాటలు... ఇటీవల మహిళా ప్రధానమైన సినిమాలు కొన్ని రావడం హర్షించదగిన పరిణామం. ‘క్వీన్’, ‘మర్దానీ’, ‘ఖూబ్సూరత్’ లాంటి సినిమాలు మరిన్ని రావాలి. నేను నటించిన ‘సోనాలీ కేబుల్’ కూడా అలాంటి సినిమానే! దర్శకులకు మించిన పెద్ద పుస్తకాలు ఏముంటాయి? వారు చెప్పింది చెప్పినట్లు చేస్తే ఎన్నో వర్క్‌షాప్‌లలో పాల్గొన్న అనుభవం నటనలో తొంగిచూస్తుంది. రమేష్ సిప్పీతో పనిచేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. ఆయన చెప్పినదాంట్లో కొంత చేసినా కూడా నటిగా ఎంతో పేరు వస్తుంది. అలా అని భారమంతా దర్శకుడి మీదే వదిలేయకుండా నాదైన కోణాన్ని నటనకు జోడిస్తాను. షూటింగ్ రోజున చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నా, పొరపాటున కూడా దాన్ని మనసులోకి రానివ్వను. మానసిక ప్రశాంతత లేనప్పుడు ఆ ప్రభావం కచ్చితంగా నటనలో కనిపిస్తుంది. చివరికి నవ్వే సన్నివేశాల్లో కూడా ఏడుపు వినిపిస్తుంది! కొన్ని పాత్రల గురించి విన్నప్పుడు ‘నేను చేయగలనా?’ అనిపిస్తుంది. ‘చేయాలా? వద్దా’ అనే ఆలోచనలో, ‘చేయాలి’ అనే నిర్ణయమే నెగ్గుతుంది. ‘చిన్న సినిమాల్లో నటించడమేమిటి?’ అనే భావన నాలో ఎప్పుడూ లేదు. నిజానికి పెద్ద సినిమాల్లో నటించడానికి ఇవే సోపానాలు. ‘బాగా నటించిందా లేదా’ అనేది చూస్తారు తప్ప ‘చిన్న సినిమాల్లో నటించే నటికి పెద్ద సినిమాలో ఎవరూ అవకాశం ఇవ్వరు’ అని ఎవరూ ఆలోచించరు. చిన్న సినిమాల్లో నటించిన ఎందరో నటులు ఆ తరువాత పెద్ద సినిమాల్లో కూడా నటించి తమ సత్తా చాటుకున్నారు. -
క్యాంపస్‌లో.. bigg boss
సిటీ కాలేజీలు ట్రెండ్‌ని ఫాలో అవ్వవు. క్రియేట్ చేస్తాయి. సూపర్‌హిట్ అయిన టీవీ రియాలిటీ షో లు బిగ్‌బాస్, రోడీస్లని క్యాంపస్‌లోకి తీసుకొచ్చి కాలేజ్ ఫెస్ట్‌లో భాగం చేయడం ద్వారా సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది పల్సేషన్. మిగిలిన కాలేజీలన్నీ మరిన్ని రియాల్టీ షోలకు వెల్కమ్ చెప్పడం ద్వారా ఇది రేపటి ట్రెడిషన్ గా మారనుంది. కల్చరల్ ఈవెంట్స్, క్విజ్ కాంపిటీషన్స్, గేమ్స్, స్పోర్ట్స్, లిటరరీ యాక్టివిటీస్, మ్యూజిక్ కాంపిటీషన్స్.. ఇంకా చారిటీ వర్క్స్. కాలేజ్ ఈవెంట్లలో హోరెత్తించే ఈ తరహా రెగ్యులర్ ప్రోగ్రామ్‌ల గురించి మాట్లాడడం ఇంకా మనకు బోరెత్తించదా? వాట్స్ నెక్ట్స్? అని అడగాలనిపించదా? యంగ్ అండ్ ఎనర్జిటిక్ గైస్/గాళ్స్‌కు ఆ మాత్రం తెలియదా? తెలుసు కాబట్టే.. ఓ కొత్త ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో క్యాంపస్ ఈవెంట్‌ని టాక్ ఆఫ్ ది ట్విన్ సిటీస్‌గా మార్చారు. ఆ కాన్సెప్ట్ పేరే రియాలిటీ షో. కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా టీవీ వ్యూయర్‌షిప్‌ని శాసిస్తున్న షోస్‌ని అనుకరించడం ద్వారా కాలేజీలలో లేటెస్ట్ ట్రెండ్‌కు నాంది పలికాయి షాదాన్ ఇన్స్టిట్యూట్ ఆప్ మెడికల్ సెన్సైస్, డాక్టర్ వీఆర్కే వుమెన్స్ మెడికల్ కాలేజీ. ‘బిగ్’ ఫెస్ట్... విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఒకే చోట కొన్ని రోజుల పాటు కలసి గడపడం, వారి ప్రవర్తనను సీక్రెట్ కెమెరాల ద్వారా గమనించడం, సహజమైన భావోద్వేగాలను స్వేచ్ఛగా వెల్లడించే ందుకు అవకాశం కల్పించి.. వారి ప్రవర్తనకు వీక్షకుల ఓటింగ్, న్యాయ నిర్ణేతల జడ్జిమెంట్ బేస్ చేసుకుని మార్కులేయడం.. ఎక్కువ మందిని మెప్పించిన వారిని విజేతలుగా ఎంపిక చేయడం.. ఈ ప్రాసెస్ వినగానే హిందీ టీవీ చానెల్స్ చూసే వాళ్లు వెంటనే బిగ్‌బాస్ అని గుర్తిస్తారు. అంతగా పాపులరైన ఈ ప్రోగ్రామ్‌ను మక్కీకి మక్కీ షాదాన్ కాలేజ్ ఫెస్ట్‌లో భాగం చేశారు. దీని కోసం క్యాంపస్ ఆవరణలోనే బిగ్‌బాస్ హౌస్‌ను కూడా నెలకొల్పారు. ‘విభిన్నంగా ఉంటుందని దీనిని ఎంచుకున్నాం. దాదాపు 100కు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. వీటిలో నుంచి 20 ఫైనలిస్ట్‌లు ఎంపికైతే చివరకు 15 మందికే హౌస్‌లోకి వెళ్లే అవకాశం కలిగింది’ అని నిర్వాహకులు అమన్ చెప్పారు. లివింగ్ రూమ్, డైనింగ్ హాల్, బెడ్ రూమ్.. వంటి వాటితో ఈ బిగ్ హౌస్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు రాత్రుళ్లు సైతం అక్కడే ఉంటే విద్యార్థినులు రాత్రి వెళ్లి పోయి ఉదయాన్నే మళ్లీ జాయిన్ అయ్యారు. అలాగే ఓటింగ్‌లు, ఎలిమినేషన్ రౌండ్లు.. ఇలా బిగ్‌బాస్‌ను తలపించే రీతిలో షో కండక్ట్ చేశారు. యూత్‌కి యూజ్‌ఫుల్.. యువత కోసం యువత చేత యువత వలన అన్నట్టు రూపుదిద్దుకునే కాలేజీ ఈవెంట్లు.. రోజు రోజుకూ క్రియేటి వ్గా మారుతుండడం నవతరానికి మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. రియాలిటీ షో అనే కొత్త కాన్సెప్ట్ ఎంటరై హిట్టవడంతో రానున్న రోజుల్లో మరిన్ని వెరైటీ థీమ్స్ రావడం, మరింతగా యూత్ టాలెంట్ వెలుగుచూడడం తధ్యం. సో.. లెట్ వెయిట్ ఫర్ మెనీ మోర్ వెరైటీ కాన్సెప్ట్స్.. సమ్‌థింగ్ డిఫరెంట్.. విభిన్నంగా ఏదైనా ప్లాన్ చేయాలని ఆలోచించి బిగ్‌బాస్ రియాలిటీషో కాన్సెప్ట్ డిజైన్ చేశాం. అందిన రిజిస్ట్రేషన్స్ నుంచి 15మందికి కుదించి మరో 5గురికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాం. కాలేజ్ బిల్డింగ్‌లో థర్డ్ ఫ్లోర్లో వేసిన బిగ్ బాస్ హౌజ్ సెట్లో మొత్తం 3రోజుల పాటు కంటెస్టెంట్స్ బస చేసేందుకు అనువుగా ఫుడ్, బెడ్స్ అన్నీ అరేంజ్ చేశాం. లోపలి ప్రతి సన్నివేశాన్ని షూట్ చేశాం. దానిని స్టూడెంట్స్ చూసేలా స్క్రీన్ ఏర్పాటు చేసి, ఆడియన్స్‌కు ఓటింగ్ ఛాన్స్ ఇచ్చాం. ఎవిరిడే ఎలిమినేషన్ రౌండ్స్ నిర్వహించాం. నలుగురు ఫైనలిస్ట్‌ల నుంచి విన్నర్‌గా డాక్టర్ నాసిహ్ని ఓటింగ్ ఆధారంగా సెలెక్ట్ చేశాం. అలాగే రోడీస్ రియాలిటీ షో తరహాలో చేసిన ప్రోగ్రాం కోసం ఆడిషన్స్‌లో 30 స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేశాం. డిఫరెంట్ టాస్క్స్ ఇచ్చాం. దీనిలో షయ్యద్ షాబాజుద్దీన్, అదీబా అలీలు విజేతలుగా నిలిచారు’ అంటూ వివరించారు నిర్వాహకులు. - మన్నన్ అలీ అష్మీ, నిర్వాహక ప్రతినిధి -
రియల్ రియాలిటీ షోస్
టీవీక్షణం: టీవీ వినోదం కోసమూ, విజ్ఞానం కోసమూ ఉందనుకుంటాం మనం. కానీ అది సమస్యల్ని కూడా పరిష్కరిస్తుందని తెలుసా?! కొన్ని చానెళ్లు సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని రియాలిటీ షోలను రూపొందించాయి. ఆ సమస్యలకు పరిష్కారం చూపేందుకు నడుం కట్టాయి. అలాంటి ప్రతి షో విజయం సాధించింది. ఎందుకంటే... సమస్య లేని మనిషి ఉండడు కాబట్టి! సమస్య అంటూ ఉన్న తర్వాత పరిష్కారం కావాలి కాబట్టి! బుల్లితెరపై ‘సత్యమేవ జయతే’ ఓ సంచలనం. సమాజంలోని పలు సమస్యలను వెలికి తీసి, ఆ సమస్య బాధితులందరినీ ఒక వేదిక మీదికి తెచ్చి, సమస్య మూలాల్లోకి వెళ్లి కూలంకషంగా చర్చించి, చివరికి దానికి పరిష్కారాన్ని కూడా చూపిస్తుంది ఈ ప్రోగ్రామ్. అందుకే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఓ గొప్ప విషయం ఏమిటంటే... ఆమిర్‌ఖాన్ తన షో ద్వారా చూపించిన పరిష్కారాలను నాయకులు, అధికారులు అమలు చేస్తున్నారు! ఈ విధంగా సామాజిక సమస్యల మీద ఎలుగెత్తే కార్యక్రమాలు అరుదు. మొదట్లో కొన్ని ఇంగ్లిష్ చానెళ్లు ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినా, అవి న్యాయపరమైన సమస్యల చుట్టూనే ఎక్కువ తిరిగాయి. కోర్ట్ రూమ్, ఫేమస్ జ్యూరీ ట్రయల్స్, యువర్ విట్నెస్, గుడ్‌విల్ కోర్ట్ అంటూ పలు రకాల ప్రోగ్రామ్స్ ప్రసారమయ్యాయి. అదే మన దేశంలో అయితే కుటుంబ సమస్యల ఆధారంగా తీసినవే ఎక్కువ. కలర్స్ చానెల్ వారు బాంధవ్యాల మధ్య వచ్చే వైరుధ్యాలను రూపుమాపేందుకు పెట్టిన షో ‘ఆమ్నా సామ్నా’. సమస్యల వెనుక కారణాలను అన్వేషించి, పరిష్కారాలను చూపెట్టేవారు. అవసరమైతే వైద్య, న్యాయ, చట్ట పరమైన సహకారాన్ని కూడా అందించేవారు. జీ తెలుగువారు ప్రసారం చేసిన ‘బతుకు జట్కా బండి’ కూడా ఇటువంటిదే. సుమలత హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో.. తెలుగు రియాలిటీ షోలలో ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. సున్నితమైన సమస్యలను సుతిమెత్తగా డీల్ చేసిన విధానం ఆ షోకి అవార్డుల పంటను పండించింది. స్టార్‌ప్లస్‌లో ప్రసారమైన ‘ఆప్కీ కచేరీ’ని కిరణ్‌బేడీ నిర్వహించడంతో... అక్కడికి వెళ్తే సమస్య తీరుతుందన్న విశ్వాసం అందరిలో పెరిగింది. జీ తమిళ్ చానెల్ వారి ‘సొల్వతెల్లమై ఉన్నమై’ కూడా మంచి విజయం సాధించింది. నటి లక్ష్మీ రామకృష్ణన్ పక్షపాతం లేకుండా, నిజానిజాలను అంచనావేస్తూ, న్యాయబద్దంగా షోని నిర్వహించారు. తమ సమస్యల్ని కూడా పరిష్కరించమంటూ రోజుకు దాదాపు రెండు వేలమంది ఆ చానెల్ ఆఫీసుకు ఫోన్ చేసేవారంటే అర్థం చేసుకోవచ్చు... ఆ షో ఎంతగా అందరి మనసులనూ చూరగొందో! అయితే ఈ కార్యక్రమాలు చూసేటప్పుడు ప్రేక్షకులకు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది... పార్టిసిపెంట్స్ నిజంగా బాధితులేనా లేక కల్పిత పాత్రలా అని! నిజానికి కొన్ని షోలలో బాధితులు నిజమైనవారే అయినా, కొన్నింటిలో మాత్రం విచారణ వెనుక సాగించి, ఆ మొత్తం వ్యవహారాన్నీ నటులతో చిత్రించి, వాటిని ప్రసారం చేస్తుంటారు. బాధితుల గురించి అందరికీ తెలియడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఇలా చేయాల్సి వస్తుంది. ఏది ఏమైనా... ఇలాంటి షోల వల్ల ఎందరి సమస్యలకో పరిష్కారం దొరుకుతున్నట్లు అవుతోంది. తాము వేయాల్సిన అడుగు ఏమిటో అర్థమవుతోంది. అందుకే నిజ సమస్యల ఆధారంగా తెరకెక్కిన ప్రతి షో విజయవంతమవుతోంది! -
లవ్ అండ్ బ్రేకప్
రియాల్టీ షోలో చిగురించిన ప్రేమ రియల్ లైఫ్‌లోకి వచ్చేసరికి వాడిపోయింది. బుల్లితెర బిగ్ రియాల్టీ షో ‘బిగ్‌బాస్ 7’ చెట్టాపట్టాలేసుకున్న గువ హర్ ఖాన్, కుశాల్ టాండన్ బ్రేకప్ చెప్పేసుకున్నారు. ‘మేమిద్దం కలసి ప్రశాంతంగా ఉండలేం’ అంటూ కుశాల్టాండన్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వీళ్లిద్దరి పర్సనల్ మ్యాటర్ కాస్త పబ్లిక్ అయింది. మొత్తానికి రియాల్టీ షోలో ఇన్స్పైర్ చేసిన ఈ ప్రేమజంట.. ఇలా ఉస్సూరుమనిపించింది. -
అతడే నా ఫేవరెట్!
ఖాన్ల త్రయం, హృతిక్ రోషన్... ఎందరో స్టార్లకు డ్యాన్స్ సీక్వెన్స్‌లు చేసిన ఫరాఖాన్‌కు వీళ్లలో ఎవరూ నచ్చలేదట. ఎంతమంది ఎన్ని ‘మెలికలు’ తిరిగినా... కామెడీ స్టార్ గోవింద డ్యాన్స్ చూసినంత కిక్కు రాదట. బాలీవుడ్లో సిసలైన డ్యాన్స్ కింగ్ అంటే అతడే అంటోందీ డెరైక్టర్‌గా మారిన కొరియోగ్రాఫర్. ‘గోవిందా డ్యాన్స్ చేస్తుంటే నేను ఎంతో హ్యాపీగా ఫీలవుతా’ అంటోంది. పైగా... ‘డ్యాన్స్ కమ్స్ దిల్ సే. స్టెప్స్ కమ్ ఫ్రమ్ ది మైండ్’ అంటూ కొత్త కొత్తగా ఏదేదో చెప్పేసింది తాజాగా ఓ డ్యాన్స్ రియాల్టీ షో లాంచింగ్‌లో! -
మళ్లీ రభస మొదలు !
టీవీక్షణం: మన దేశంలోని టాప్ రియాలిటీ షోలలో ఒకటి బిగ్‌బాస్. కొంతమంది సెలెబ్రిటీలను ఓచోట పడేసి, బయటకు రానివ్వకుండా చేసి, రకరకాల పోటీలు పెట్టి, చిట్ట చివరకు ఒకరిని విజేతగా ఎంపిక చేస్తారు ఈ షోలో. కానీ ఆలోపు జరిగే తంతు ఉంది చూశారూ... మామూలుగా ఉండదు. తిండి దగ్గర నుంచి పడుకునే చోటు వరకూ ప్రతి విషయంలోనూ కొట్లాటలు! ఒకరిని చూసి ఒకరు మండి పడుతుంటారు. కొందరు వెనుక కామెంట్లు చేస్తుంటే, కొందరు ముఖమ్మీదే విమర్శించి తగవులు పడుతుంటారు. వారానికొకరు ఎలిమినేట్ అవుతుంటారు. మధ్యలో కొందరు కొత్తగా ఎంట్రీ ఇస్తుంటారు. దాంతో వారం వారం షో కొత్త మజాని అందిస్తుంది. అందుకే ఈ షోకి టీఆర్పీ ఎప్పుడూ అధికంగానే ఉంటుంది! ఇటీవలే బిగ్‌బాస్ ఎనిమిదో సిరీస్ ప్రారంభమయ్యింది (కలర్స్ చానెల్). పోయినసారి స్వర్గం-నరకం కాన్సెప్ట్‌తో నడిచిన షో... ఈసారి ఎయిర్‌లైన్స్ కాన్సెప్ట్‌తో ప్రారంభమయ్యింది. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు అది ఏదైనా ప్రమాదంలో పడి నిర్మానుష్య దీవిలో చిక్కుబడిపోతే ఏం జరుగుతుంది? ప్రయాణికులు ఎలా ఉంటారక్కడ? ఉన్నవాటితో ఎలా సర్దుకుంటారు? ఇదే కాన్సెప్ట్. విమానం సెట్టింగు వేసి, కొందరు సెలెబ్రిటీలను అందులో వదిలేశారు. వాళ్లు ఆటాడుతుంటే, బిగ్‌బాస్ వేటాడుతున్నాడు. ఈసారి... మినీషా లాంబా (నటి), నటాషా స్టాంకోవిక్ (సెర్బిన్ మోడల్), ప్రణీత్భట్ (నటుడు, దర్శకుడు), సుకీర్తి కంద్పాల్ (మోడల్, నటి), గౌతమ్ గులాటీ (టీవీ నటుడు), సుశాంత్ దివ్గీకర్ (మిస్టర్ గే ఇండియా టైటిల్ విజేత), డయాండ్రా సోరెస్ (మోడల్, ఫ్యాషన్ డిజైనర్), ఆర్యబబ్బర్ (నటుడు, రాజ్‌బబ్బర్ కొడుకు), సోనీసింగ్ (టీవీ నటి), ఉపేన్ పటేల్ (మోడల్, నటుడు), కరిష్మా తన్నా (మోడల్, నటి), సోనాలీ రౌత్ (మోడల్, నటి) పోటీ పడుతున్నారు. ఇక గత రెండు సీజన్ల మాదిరిగానే బాలీవుడ్ సూపర్ హీరో సల్మాన్‌ఖాన్ సోలోగా యాంకరింగ్ చేస్తున్నాడు. నవ్వేచోట నవ్వుతూ, కసిరే చోట కసురుతూ ప్రేక్షకులను అలరించడంలో సల్మాన్ సక్సెస్ అయ్యాడు. అందుకే ఈసారి కూడా షో అతడి చేతికే వెళ్లింది. అయితే షో ఎంత సక్సెస్ అయినా... లోపల నడిచే ప్రేమకథలు, రొమాన్స్ వంటి వాటి విషయంలో మాత్రం కొందరు సంప్రదాయవాదులు గుర్రుగా ఉన్నారు. గతంలో షోను బ్యాన్ చేయమని కోరుతూ కొందరు కోర్టుకెళ్లారు కూడా! మరి ఈసారి ఎలాంటి కథలు నడుస్తాయో, ఎంత రభస జరుగుతుందో ముందు ముందు చూడాల్సిందే! -
పెట్టుబడుల్లో నిలువెత్తు శిల్పాశెట్టి
సెలబ్రిటీ స్టైల్.. బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి.. సాహసవీరుడు-సాగర కన్య లాంటి కొన్ని తెలుగు సినిమాల్లోనూ అలరించింది. సినిమాల్లో అవకాశాలు కాస్త తగ్గినప్పుడు బిగ్ బ్రదర్ రియాలిటీ షోలో విజేతగా నిల్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మధ్యమధ్యలో వివాదాలు ఉన్నా .. ఐపీఎల్ క్రికెట్, ఆభరణాలు, రియల్టీ వంటి వ్యాపార రంగాల్లోనూ మెరుస్తోంది. కొత్త వెంచర్లతో ముందుకు సాగిపోతున్న శిల్పా శెట్టి ఇన్వెస్ట్మెంట్లు, మనీ మేనేజ్మెంట్పై ఆమె అభిప్రాయాలు సెలబ్రిటీ స్టయిల్లో.. బిజినెస్ వెంచర్లు, టీవీ షోలు, ఎండార్స్మెంట్లు మొదలైన వాటి ద్వారా శిల్పా శెట్టి సంపద విలువ దాదాపు రూ. 1,200 కోట్ల మేర ఉంటుందని అంచనా. కేవలం గ్లామర్ ఫీల్డ్కి మాత్రమే పరిమితం కాకుండా వ్యాపారవేత్తగా కూడా రాణిస్తోంది శిల్పా శెట్టి. బిగ్ బ్రదర్ షోతో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పాపులారిటీని వృథాగా పోనివ్వకుండా అప్పటికప్పుడు తన పేరుతో ఎస్2 పర్ఫ్యూమ్ని లాంచ్ చేసింది. అలాగే, యోగాపై డీవీడీ వీడియోలు ప్రవేశపెట్టింది. మరోవైపు, బిజినెస్‌మ్యాన్ భర్త రాజ్ కుంద్రా సహకారంతో పలు బిజినెస్ వెంచర్లు కూడా చేపట్టింది ఐపీఎల్ క్రికెట్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో ఇన్వెస్ట్ చేసింది. ఆన్లైన్ ప్రాపర్టీ బ్రోకరేజి బిజినెస్‌తో పాటు గ్రూప్కో డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను ఏర్పాటు చేసింది. అటు లండన్, దుబాయ్ సహా పలు ప్రాంతాల్లో రియల్టీ రంగంలో ఇన్వెస్ట్ చేశారు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా. ఇటీవలే సత్యుగ్ గోల్డ్ పేరిట ఆభరణాల వ్యాపారంలోకి కూడా అరంగేట్రం చేశారు. సినీ నిర్మాతగా కూడా మారారు. శిల్పా శెట్టి ఇలా విభిన్న పాత్రలు పోషిస్తున్నప్పటికీ మనీకి సంబంధించి ఆమె ఫిలాసఫీ చాలా సింపుల్‌గా ఉంటుంది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం కావడంతో డబ్బు విలువ తనకు బాగా తెలుసంటుంది. మనీకి అనవసర ప్రాధాన్యం ఇవ్వనని, నచ్చినది చేస్తే డబ్బు దానంతటదే వస్తుందని చెబుతుంది. ఇక పెట్టుబడుల విషయానికొస్తే.. భవిష్యత్ సురక్షితంగా ఉండటం కోసం చేసేవే కాబట్టి వీటి ని పెన్షన్ ప్రణాళికలుగా కూడా పరిగణి ంచవచ్చని చెబుతుంది శిల్పా శెట్టి. -
ఎంత భయమేసినా పాడాల్సిందే!
-
నేను కోరుకున్నదేదీ నాకు దక్కలేదు
‘నాక్కొంచెం తిక్కుంది... అయితే... దానికో లెక్కుంది’ అని ‘గబ్బర్‌సింగ్’లో పవన్‌కల్యాణ్ అన్నట్లు... ‘నాక్కొంచెం పొగరెక్కువ. అందుకని నేను గర్విష్టిని మాత్రం కాను’ అని మీడియా ముందు అదిరిపోయే స్టైల్లో చెప్పేశారు ప్రియాంక చోప్రా. ఇటీవల ఓ చానల్ రియాలిటీ షోలో అతిథిగా పాల్గొన్న ప్రియాంక... తన గురించి పలు అసక్తికరమైన విషయాలు చెప్పారు. ‘‘నా జీవితమే ఒక విచిత్రం. ఎందుకంటే... నా లైఫ్‌లో నేను దేని గురించీ పోరాడింది లేదు. అసలు నేను కోరుకున్నదేదీ నాకు దక్కలేదు. అయితే... కోరుకున్న దానికంటే ఎక్కువ నాకు దక్కింది. ఇంజినీరింగ్ కానీ, క్రిమినల్ సైకాలజీ కానీ చదవాలనేది నా యాంబిషన్. అదే లక్ష్యంగా స్కూల్‌కి వెళ్లేదాన్ని. స్కూల్ చదువు పూర్తయింది. మిస్ వరల్డ్ కిరీటం తలపైకొచ్చింది. ఎక్కడ లేని కీర్తి ప్రతిష్టలు చుట్టుముట్టాయి. ప్రపంచ స్థాయి మీడియా నా ముందుకొచ్చి నిలబడింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే సెలబ్రిటీ అయిపోయాను. అయితే... ఎంత ఎదిగినా నా కళ్లు మాత్రం నెత్తిపైకి ఎక్కవు. ఎందుకంటే... నా తిక్కను దించడానికి పక్కనే మా అమ్మ సిద్ధంగా ఉంటుంది’’ అని చెప్పారు ప్రియాంక. ‘‘కెరీర్లో నేను అనుకున్నదేం జరగ్గపోయినా... ఒక విషయంలో మాత్రం పోరాడాలని నిశ్చయించుకున్నా. అదే ‘మ్యూజిక్’. గతంలో కొన్ని పాప్ ఆల్బమ్స్ పాడాను. అనుకోకుండా పాడినా... మంచి పేరొచ్చింది. నాకు తెలిసి ప్రపంచంలో నటిగా ఉండి పాప్ మ్యూజిక్ పాడింది జెన్నిఫర్ లోపెజ్ తర్వాత నేను మాత్రమే. భవిష్యత్తులో పాప్ మ్యూజిక్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఉంది’’ అని ప్రియాంక ఆశాభావం వెలిబుచ్చారు. -
పాపం.. రణ్‌బీర్..!
బాలీవుడ్‌లోని ఈతరం నటుల్లో అదృష్టవంతుడు ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం రణ్‌బీర్ కపూర్. అందానికి అందం.., నటనకు నటన.., తల్లిదండ్రులే గాడ్‌ఫాదర్ పాత్ర పోషిస్తుండడంతో బాలీవుడ్లో అతగాడికి దేనికీ కొదవలేకుండా పోయింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని తనలోని ప్రతిభను కూడా చాటిచెప్పాడు ఈ యువ నటుడు. అయితే రణ్‌బీర్ మాత్రం ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నిన్నమొన్నటిదాకా బాగానే ఉన్నా ఇటీవల తనపై వస్తున్న పుకార్లతో జీవితం తలకిందులవుతున్నట్లు అనిపిస్తోందంటున్నాడు. పుకార్లు తన జీవితాన్ని ‘రియాల్టీ షో’గా మార్చేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనపై వస్తున్న పుకార్లను చూసి తన తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారని, ఈ వయసులో వారినలా చూస్తుండడం తనకు కూడా ఎంతో బాధగా ఉందంటున్నాడు. ‘తల్లిదండ్రులతో రణ్‌బీర్ గొడవపడ్డాడని, తండ్రి రిషి కపూర్.. రణ్‌బీర్‌ను ఇంట్లోనుంచి వెళ్లగొట్టాడని, రణ్‌బీర్ ఇంట్లోనుంచి వెళ్లిపోయాడని రకరకాల కథనాలు మీడియాలో ప్రసారమవుతున్నాయి. వార్తాపత్రికల్లో కూడా ప్రచురితమవుతున్నాయి. మరికొందరైతే కత్రినాతో కలసి వెళ్లిపోతున్నాడని కూడా రాస్తున్నాయి. ఆమెతో వెళ్లిపోవడానికి నేనెవర్ని? నాకింకా పెళ్లి కాలేదు. అలాంటిదేదైనా ఉంటే నేరుగా మీడియా ముందుకు వచ్చి నేనే చెబుతాను. అప్పటిదాకా ఇలాంటి పనులను మానుకుంటే మంచిద’న్నాడు. అనురాగ్ కశ్యప్ చిత్రం ‘బాంబే వెల్వెట్’ షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం ‘జగ్గా జాసూస్’ చిత్రంలో నటిస్తున్నానని చెప్పాడు. ఇందులో కథానాయిక కత్రినా కైఫ్ కావడం గమనార్హం. -
పంచామృతం: ఎక్స్ట్రా టాలెంట్...!
ఏంజెలీనా జోలీ మన హీరోయిన్లు ఈ మధ్య సినిమాల్లో రౌద్రపూరితమైన పాత్రలను చేస్తూ కత్తులు చేతబడుతున్నారు. అయితే హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ నిజజీవితంలోనే కత్తిని తిప్పడంలో నిపుణురాలు. చేతిలో ఇమిడిపోయే నైఫ్‌ను చూపరులను ఆకట్టుకొనేలా తిప్పగలదు ఏంజెలీనా. షూటింగ్ స్పాట్స్లోనూ, రియాలిటీ షోలోలలోనూ ఏంజెలీనా తన ఈ నైపుణ్యాన్ని ప్రద ర్శిస్తూ ఆకట్టుకొంటూ ఉంటుంది. ఆయుష్మాన్ ఖురానా ఇతడు సెట్లో ఉంటే సహనటులు, ఇతర యూనిట్‌కు ఫుల్ఎంటర్టైన్మెంట్ ఉంటుందట. షూటింగ్ స్పాట్‌కు తనతో పాటు గిటార్‌ను తెచ్చుకొని మధురమైన సంగీతం వినిపిస్తాడు ఈ హీరో. అంతే కాదు ‘విక్కీడోనర్’ సినిమా కోసం ఒక పాటను రచించి, ట్యూన్ కట్టి, కంపోజ్ చేశాడు. తనలోని భిన్నమైన టాలెంట్‌ను చాటుకొన్నాడు. వివేక్ ఒబెరాయ్ ఒకప్పుడు విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌తో ప్రేమగ్రంథం సాగించిన ఈ హీరో ఆమెను తన కవిత్వంతోనే ఆకట్టుకొని ఉంటాడని అంటారు ఇతడిని ఎరిగిన వాళ్లు. ఎందుకంటే కవితలు రచించడంలో వివేక్ ఒబెరాయ్‌కు మంచి నైపుణ్యం ఉందట. తన భావనలను అందమైన అక్షరాల్లో కూర్చగలడట ఈ హీరో. వాళ్లేంటో, వాళ్లు ఏ విధంగా ఫేమస్ అయ్యారో, ఏ రంగంలో ప్రతిభవంతులో ప్రపంచమందరికీ తెలుసు. అయితే ప్రతి వ్యక్తి సరదాగానో, సీరియస్‌గానో తమ వృత్తికి భిన్నమైన ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. వినడానికి ఆశ్చర్యంగా, తెలుసుకోవడానికి ఆసక్తి కరంగా ఉంటాయి ఆ ప్రతిభాపాటవాలు. అదెలాగంటే.... జస్టిన్ బీబర్ బీబర్ అంటే జలపాతంలా హోరెత్తించే సంగీతమే గుర్తుకు వస్తుంది. అయితే ఆఫ్‌లైన్‌లో ఈ యువకుడు రూబిక్స్ క్యూబ్‌తో తన టాలెంట్‌ను నిరూపించుకొంటూ ఉంటాడు. జులాయి సినిమాలో అల్లు అర్జున్‌లా రెండే నిమిషాల్లో రూబిక్ క్యూబ్‌ను సాల్వ్ చేయగలడు బీబర్. చాలా మందికి అసాధ్యమైన, చాలా సమయం పట్టే సరదా పనిని బీబర్ చకచకా చేస్తాడు. ప్రియాంక చోప్రా... ప్రియాంక అంటే ఆమెను మిస్ వరల్డ్గానే చాలా మంది గుర్తు పెట్టుకొంటారు. బాలీవుడ్ నటిగా ఆమెను ఆరాధించే వాళ్లూ ఉన్నారు. అయితే ప్రియాంకకు సంగీతంపై మంచి పట్టుందనేది తక్కువమందికి తెలిసిన అంశం. ఇప్పటికే ఒక ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆల్బమ్‌ను విడుదల చేసి ప్రియాంక తన సంగీత పటిమను చాటుకొంది. ఈ విధంగా మ్యూజిక్ ఆల్బమ్‌ను విడుదల చేసిన ఏకైక ఘనత ప్రియాంకచోప్రాకు మాత్రమే సొంతం. -
గంటా వారి రియాల్టీ షో ఫ్లాప్
ఓటర్లకు తాయిలాలు.. అయినా దక్కని మద్దతు తగరపువలస,న్యూస్‌లైన్: భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థ్ధి గంటా శ్రీనివాసరావు స్థానిక నేతలు, ఓటర్లతో మైండ్‌గేమ్ ఆడుతున్నారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్న ట్టు ప్రచారం చేయిం చడంలో సిద్ధహస్తుడైన ఆయన నిజస్వరూపం ఎన్నికల తేదీ సమీపించడంతో కొంచెం కొంచెంగా బయటపడుతోంది. నామినేషన్ వేసినరోజే వంద ద్విచక్రవాహనాలు, పదుల సంఖ్యలో ఇన్నోవాలు కార్యకర్తల కోసం కొనుగోలు చేసినట్టు ప్రచారం చేసుకున్నారు. దీంతో తెలుగుతమ్ముళ్లు వీటిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఎక్కడా ఇలాంటి వాహనా లు కనిపించకపోయేసరికి వారంతా నిరాశచెందుతున్నారు. ఇప్పుడు మండలస్థాయి నాయకులను కాదని కిందస్థాయి నాయకులకు రోజుకు రూ.10వేలు చొప్పున అందించడంతో పాటు మహిళా కార్యకర్తలను నియమించి పంచాయితీకి రూ.5లక్షలు ఇవ్వనున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు.గత బుధవారం తగరపువలస కూడలిలో వైఎస్సార్సీపీ నిర్వహించిన భారీ ర్యాలీని చూసి గంటా తోకముడివాల్సి వచ్చింది. ర్యాలీకి ఎదురుగా వస్తున్న వాహనంలో ఉన్న గంటా వైఎస్సార్సీపీకి ఉన్న ఆదరణ చూసి విస్తుపోయారని టీడీపీ నాయకులే అంటున్నారు. ఇటీవల సొంత ఖర్చులతో గంటా శ్రీనివాస్ సర్వే చేయించుకోగా భీమిలిలో వైఎస్సార్సీపీకి కనీసం ఇరవై వేల మెజార్టీ ఖాయమని తేలిందని, ఆ క్షణం నుంచీ ఆయన మరింత కంగారు పడుతున్నారని కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారు. తనకు రావని తెలిసిన ఓటర్లను కూడా మాటలతో ప్రలోభాలకు గురిచేస్తున్నారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీతో టీడీపీ దోస్తీని మైనారిటీలు అసహ్యించుకుంటుంటే శుక్రవారం ఆయన పాస్టర్లను మభ్యపెట్టి సమావేశం నిర్వహించారు. భీమిలిలో తనకో ఓటు,ఎంపీగా బీజేపీకి ఓటు వేయాలని కోరడంతో పాస్లర్టు గంటాను అక్కడే కడిగిపారేసినట్లు తెలిసింది. క్రిస్టియన్లకు అండగా ఉంటామని గంటా చెప్పినా నమ్మకపోవడంతో ఈ షో ఫ్లాప్ అయినట్టు కార్యకర్తలే చెబుతున్నారు. మొదట్నుంచీ క్రైస్తవులు, ముస్లింలు వైఎస్ఆర్ వెంటే ఉన్నారన్న విషయాన్ని గంటా గుర్తించకపోవడం ఘోరమని కార్యకర్తలే చెబుతున్నారు. భీమిలి పట్టణంలో హిందువులతో పాటు క్రిస్టియన్లకు ప్రత్యేకంగా శ్మశానవాటికలు ఉన్నాయని, నియోజకవర్గంలో మిగతాచోట కూడా దీని కోసం స్థలం కేటాయించాలని గతంలో గంటా వద్దకు స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ద్వారా వచ్చినా స్పందించలేదని వారంతా నిలదీసినట్టు తెలిసింది. దీంతో మతం పేరిట ఓట్లు కొల్లగొట్టాలనుకున్న ఆయన పన్నాగం పారలేదని కార్యకర్తలే చెబుతున్నారు. క్రిస్టియన్లు వైఎస్సార్సీపీకి ఆప్తులు.. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా క్రిస్టియన్లు,ముస్లింలు వైఎస్సార్సీపీకు మద్దతు తెలుపుతారు. ఇటీవల ప్రచారంలో ఈ విషయం తెలియడంతో టీడీపీ దొడ్డిదారి ఎంచుకుంది. అయినా గంటా పాచికలు ఇక్కడ పారవు. ఆయనకు ఓటర్లు తగిన రీతిలో బుద్ధి చెబుతారు. -వెంపాడ అప్పలకారురెడ్డి గంటకో పార్టీ ...ఆయన్ను నమ్మలేం పార్టీకో మేనిఫెస్టో ఉంటుంది. అందువలన తరచూ పార్టీలు,నియోజకవర్గాలు మారిన వారిని మైనారిటీలు విశ్వసించలేరు. అయినా ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. మళ్లీ ఇక్కడే పోటీ చేస్తారో లేదో కూడా తెలియదు. అలాంటి వ్యక్తిని ఎలా నమ్మగలం - వంకాయల మారుతీ ప్రసాద్ -
గాల్లో విహరించనున్న శిల్పాశెట్టి
ముంబై: బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి వినూత్నంగా నటించబోతోంది. ఓ రియాల్టీ షోలో శిల్పా గాల్లో నటిస్తూ అభిమానులను అలరించనుంది. స్టార్ ప్లస్ చానెల్ లో ప్రసారమవుతున్న 'నచ్ బలియె 6' అనే షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ కోసం శిల్పా రిహార్సల్స్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో శనివారం ప్రసారంకానుంది. గ్రాండ్ ఫైనల్ కోసం శిల్ప కఠోర సాధన చేస్తోందట. ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తోందని చానెల్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమం తొలుత 11 జంటలతో ఆరంభమైంది. ఫైనల్లో నాలుగు జంటలు పోడీపడుతున్నాయి. వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకున్న శిల్ప టీవీ షోలు, సినిమాలతో పాటు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టింది. ఇక భర్తతో కలసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో వాటాలున్నాయి.