ఇండియన్‌ ఐడల్‌ 12: పిజ్జా పార్టీ ఇచ్చిన జడ్జి | Indian Idol 2020 Grand Premiere This Weekend With Pizza Party | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ ఐడల్‌ 12: పిజ్జా పార్టీ ఇచ్చిన షో జడ్జి

Published Wed, Dec 16 2020 5:39 PM | Last Updated on Wed, Dec 16 2020 7:10 PM

Indian Idol 2020 Grand Premiere This Weekend With Pizza Party - Sakshi

ముంబై: సోనీ టీవీ నిర్వహిస్తున్న ప్రముఖ రియాల్టీ మ్యూజిక్‌ షో ‘ఇండియన్‌ ఐడల్‌ 12’ గురించి సంగీత ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూలైలో ప్రారంభమైన ఈ మ్యూజిక్‌ షో గ్రాండ్‌ ప్రీమియర్‌కు చేరుకుంది. డిసెంబర్‌ 19, 20వ తేదీలో సోని టీవీలో రాత్రి 8 గంటలకు ప్రసారం కానున్న ఈ గ్రాండ్‌ ప్రిమియర్‌ షో సందడిగా జరగనుంది. ఇందులోని టాప్‌ 15 కంటెస్టెంట్స్‌ ట్రోఫీ కోసం ఒకరితో ఒకరూ పోటీ పడుతూ తమ గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేయనున్నారు. వారాంతంలో జరిగే ఈ షోలో టాప్‌ 15 ఫైనలిస్టులు అద్భుతమైన ప్రదర్శను ఇవ్వనుండగా.. షో జడ్జిలైన విశాల్‌ దాద్లానీ, నేహా కక్కర్‌, హిమేష్ రేష్మియాలు పోటీదారుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జడ్జిలంతా వారికి సంబంధించిన కొన్ని సరద క్షణాలను కంటెస్టెంట్స్‌తో పంచుకొనున్నారు. ఆ తర్వాత సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా గ్రాండ్‌ ప్రీమియర్‌ సందర్భంగా షోలోని అందరికి పిజ్జా పార్టీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో షో హోస్ట్‌ అదిత్య నారాయణ్‌, జడ్జి నేహా కక్కర్‌లు కంటెస్టెంట్స్‌ తల్లిదండ్రులతో కలిసి సరదాగా స్టెప్పులేశారు. (చదవండి: జాతీయ స్థాయిలో షణ్ముఖ స్వరం)

ఇండియల్‌ ఐడిల్‌ సీజన్‌ 12 టాప్‌ 15 కంటెస్టెంట్స్‌లో ఏపీ నుంచి ముగ్గురు
ఈ సీజన్‌లో మొదటి 12 మంది కంటెస్టెంట్స్‌ వరుసగా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మొహద్‌ డానిష్‌, ఆంధ్రప్రదేశ్‌కు నుంచి.. శిరీష భగవతుల, అంజలి‌; మహారాష్ట్రకు చెందిన సాయిలీ కిషోర్‌ కాంబ్లే; న్యూఢిల్లీకి చెందిన సమ్యాక్‌ ప్రసానా; కేరళకు చెందిన వైష్ణవ్‌ గిరీశ్‌‌; పశ్చిమ బెంగాల్‌కు చెందిన అరుణీతా కంజీలాల్‌, అనుష్క బెనర్జీ;  కర్ణాటకకు చెందిన నిహాల్‌ టౌరో; హర్యానాకు చెందిన సాహైల్‌ సోలంకి; ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌దీప్‌ రాజన్‌; రాజస్థాన్‌కు చెందిన సవాయి భట్‌; ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షణ్ముఖ ప్రియా; ముంబైకి చెందిన నాచీకెట్‌ లేలే; పూణేకు చెందిన ఆశీస్‌ కులకర్ణిలు. (చదవండి: షణ్ముఖప్రియ పాటకు న్యాయనిర్ణేతలు ఫిదా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement