టాలీవుడ్‌ రియాలిటీ షో.. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్‌-3 వచ్చేసింది! | Telugu Indian Idol Season 3 Streaming Now on This Ott Platform | Sakshi
Sakshi News home page

Telugu Indian Idol Season 3: 'స్వర సంగీత సమరం'.. ఇండియన్ ఐడల్ సీజన్‌-3 వచ్చేసింది!

Published Fri, Jun 14 2024 8:09 PM | Last Updated on Fri, Jun 14 2024 8:21 PM

Telugu Indian Idol Season 3 Streaming Now on This Ott Platform

టాలీవుడ్ సినీ ప్రియులను అలరించేందుకు మరో రియాలిటీ షో వచ్చేసింది. యువ సింగర్స్‌ టాలెంట్‌ను వెలికితీసేందుకు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్- 3 సిద్ధమైంది. ఈ రోజు నుంచే షో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఆహా అధికారికంగా వెల్లడించింది. ఈ షో కోసం చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి రెండు సీజన్లు సక్సెస్‌ కావడంతో ఈ సీజన్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్- 3 షో ఇక నుంచి ప్రతి శుక్ర, శనివారాల్లో సాయంత్రం 7 గంటల నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. గతవారమే లాంచ్‌ ప్రోమోను రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి జడ్జిలుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్స్‌ కార్తీక్, గీతా మాధురి, శ్రీరామచంద్ర వ్యవహరిస్తున్నారు. కాగా.. ఈ షో మొత్తం 33 దేశాలలో ఆడిషన్స్ నిర్వహించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement