Indian Idol
-
పోలీసు..సింగర్.. నటుడు.. ఎవరీ ప్రశాంత్ తమాంగ్?
చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడు కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. కొంతమంది నటీనటులు వందల సినిమాలు చేసినా.. సరైన గుర్తింపు రాదు. మరికొంత మంది ఒక్క సినిమాతో ఫేమస్ అవుతారు. ఇది కేవలం హీరోహీరోయిన్లకు మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా వర్తిస్తుంది. తాజాగా ఓ నటుడు అలాగే ఫేమస్ అయ్యాడు. వెబ్ సిరీస్‌లో చేసిన ఓ చిన్న పాత్ర అతన్ని ఫేమస్ చేసింది. అతనే ప్రశాంత్ తమాంగ్. అతన్ని ఫేమస్ చేసిన వెబ్ సిరీసే ‘పాతాళ్‌లోక్-2’(Paatal Lok Season 2 ).స్నిపర్ డేనియల్ లెచో..ఓటీటీలో సూపర్ హిట్‌గా నిలిచిన పాతాళ్‌లోక్ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన వెబ్ సిరీస్ పాతాళ్‌లోక్ సీజన్ 2. జైదీప్ అహ్లవత్, గుల్‌పనాగ్, ఇష్వాక్ సింగ్, విపిన్ శర్మ, తిలోత్తమ షోమీ, ప్రశాంత్ తమాంగ్ కీలక పాత్రలు పోషించారు.అవినాష్ అరుణ్, ప్రోసిత్ రాయ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ చూసిన వారందరూ హాథీరామ్ చౌదరి పాత్రతో పాటు స్నిపర్ డేనియల్ లెచో పాత్ర గురించి కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు. నిడివి తక్కువే అయినా ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. తనదైన నటనతో ఆ పాత్రకే వన్నె తెచ్చిన నటుడే ప్రశాంత్ తమాంగ్(Prashant Tamang). ఈ ఒక్క వెబ్ సిరీస్‌తో ఒక్కసారిగా ఆయన ఫేమస్ అయిపోయాడు. నెటిజన్స్ ఆయన గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అతని నేపథ్యాన్ని చూసి షాకవుతున్నారు. మనోడిలో మంచి నటుడే కాదు.. సింగర్ కూడా ఉన్నాడంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూనే.. ప్రశాంత్ తమాంగ్ పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జన్మించాడు. తండ్రి కానిస్టేబుల్. ప్రశాంత్ స్కూల్ ఏజ్‌లోనే ఓ ప్రమాదంలో తండ్రి చనిపోయాడు. దీంతో ప్రశాంత్ తన చదవుని మధ్యలోనే ఆపేసి తండ్రి ప్లేస్‌లో కానిస్టేబుల్‌గా చేరాడు. అయితే చిన్నప్పటి నుంచే సింగర్ కావాలని ప్రశాంత్ కోరిక. కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూనే.. అవకాశం ఉన్నప్పుడలా తన గాత్రాన్ని వినిపించేవాడు. పోలీసులు ఏర్పాటు చేసుకునే ఆర్కెస్ట్రాలో ప్రశాంత్ పాల్గొని అద్భుతమైన పాటలు ఆలపించేవారు.ఇండియన్ ఐడల్ విన్నర్తన పై అధికారులు ఎంకరేజ్ చేయడంతో కోల్ కత్తాలో జరిగిన ఇండియన్ ఐడల్ సీజన్ 3(2007)లో ప్రశాంత్ పాల్గొన్నాడు. తనదైన గాత్రంతో అలరించి.. సీజన్ 3 విన్నర్‌గా నిలిచాడు. నేపాలి ఫ్యామిలీస్‌కి చెందిన ప్రశాంత్.. 2009లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2010లో ఆయన నటించిన తొలి నేపాలీ సినిమా రిలీజైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు. కానీ పాతాళ్‌లోక్ 2లో పోషించిన చిన్న పాత్రతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. Here's Daniel from Paatal Lok, Indian Idol 2007 winner Prashant Tamang pic.twitter.com/V5tyVmD4ut— Abhishek ✨ (@ImAbhishek7_) January 20, 2025 -
ఆ గాత్ర మధురం!
సాక్షి, హైదరాబాద్: పుట్టుకతోనే చూపులేని ఓ బాలుడి పాటకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మంత్రముగ్ధుడయ్యారు. ఓ బస్సులో కూర్చుని చేతులతో దరువేస్తూ ఆ బాలుడు పాడిన పాట ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో బాలుడి పాట వీడియోను పోస్టు చేసి.. తెలుగు సినిమా పరిశ్రమలో అతడికి ఎవరైనా అవకాశం ఇవ్వాలని కోరారు. అందుకు స్పందించిన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్.. ఆ బాలుడికి ఆహా ఇండియన్ ఐడల్ 4వ సీజన్లో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. బాలుడితో కలిసి తాను ప్రత్యేకంగా ప్రదర్శన ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆహా టీంను ఆదేశించారు. బాలుడికి అద్భుతమైన ప్రతిభ ఉందని కితాబిచ్చారు. దేవుడు అప్పుడప్పుడూ కఠినంగా వ్యవహరించినా.. ఇలాంటి వారిని ఎంతో ప్రత్యేకంగా చూసుకునేందుకు మంచి మనుషులు ఉండనే ఉన్నారని పేర్కొన్నారు. -
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్.. స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్!
ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ పాటపాడిన అంధగాయకుడిపై తమన్ ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందని ఆయన అన్నారు. అతని ప్రతిభకు ఫిదా అయిన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలుగు ఇండియన్ ఐడల్‌లో పాడే అవకాశం కల్పిస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. అతడితో కలిసి తానూ పాడుతానంటూ పోస్ట్ చేశారు.అంతకుముందు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆ బాలుడి వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..! ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి అంటూ సోషల్ మీడియా వేదికగా కోరారు. దీనిపై స్పందించిన ఎస్ఎస్ తమన్ ఆ బాలుడికి తెలుగు ఇండియన్ ఐడల్‌లో పాడే అవకాశమిస్తానని తమన్ ట్వీట్ చేశారు.తమన్‌కు సజ్జనార్ కృతజ్ఞతలుఆర్టీసీ బస్సులో పాటపాడిన బాలుడికి అవకాశమిచ్చినందుకు తమన్‌కు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. అద్భుతమైన కంఠంతో పాటలు ఆలపిస్తోన్న ఈ అంధ యువకుడికి తెలుగు ఇండియన్ ఐడల్‌లో అవకాశం ఇచ్చేలా చూస్తానని ప్రకటించిన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. అలాగే ఈ అవకాశంతో అద్భుతమైన తన టాలెంట్‌కు మరింతగా గుర్తింపు దక్కుతుందని అన్నారు. భవిష్యత్‌లో తన మధురమైన గాత్రంతో ఎంతో మందిని మంత్ర ముగ్దులను చేస్తూ ఈ యువకుడు ఉన్నతంగా ఎదుగుతారని ఆశిస్తున్నట్లు రాసుకొచ్చారు. అద్భుతమైన కంఠంతో పాటలు ఆలపిస్తోన్న ఈ అంధ యువకుడికి @ahavideoIN నిర్వహిస్తోన్న తెలుగు ఇండియన్ ఐడల్ లో అవకాశం ఇచ్చేలా చూస్తానని ప్రకటించిన ప్రముఖ సంగీత దర్శకుడు @MusicThaman గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అవకాశంతో అద్భుతమైన తన టాలెంట్‌కు మరింతగా గుర్తింపు ద… https://t.co/9Z4HR44QFF— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 14, 2024 I will make sure he Performs in #TeluguIndianIdolS4@ahavideoIN pls consider as my request and order 📢❤️🎧⭐️▶️💥Will have his Special Performance and I will perform along with him ❤️✨🙌🏿What a Talent what perfect pitching 🖤God is sometimes harsh But we humans are there… https://t.co/CqjEU0QHfc— thaman S (@MusicThaman) November 13, 2024 -
పవన్ కళ్యాణ్ 06 లో ఛాన్స్ ఎలా వచ్చిదంటే..
-
తెలుగు ఇండియన్ ఐడల్ -3 విజేత ఎవరంటే?
ఆహాలో అలరిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ షో మూడో సీజన్ గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. 26 వారాలుగా సాగిన ఈ షోలో కీర్తి, అనిరుధ్, నసీరుద్దీన్ షేక్ టాప్ 3కి చేరుకున్నారు. వీరిలో నసీరుద్దీన్ విజేతగా నిలిచి టైటిల్‌తో పాటు రూ.10 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. రెండో స్థానంలో నిలిచిన అనిరుధ్ రూ.3 లక్షలు, మూడో స్థానంలో ఉన్న జీవీ శ్రీ కీర్తి రూ.2 లక్షలతో సరిపెట్టుకున్నారు.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మోటార్ మెకానిక్ కుమారుడైన నసీరుద్దీన్ తన గాత్రంతో అటు ప్రేక్షకులను, ఇటు షో జడ్జిలను మెప్పించాడు. తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచిన ఇతడు ఓజీ మూవీలో పాట పాడే అవకాశం కూడా దక్కించుకోవడం విశేషం. -
ఫినాలేకి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ 3.. విజేత ఎవరు?
ఆహా ఓటీటీలో గత రెండు సీజన్ల పాటు సంగీత ప్రియుల్ని ఊర్రూతలూగించిన సింగింగ్ షో 'తెలుగు ఇండియన్ ఐడల్'. ప్రస్తుతం మూడో సీజన్ విజయవంతంగా నడుస్తోంది. దాదాపు 24 వారాల నుంచి ప్రతి శని, ఆదివారాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఇది తుది అంకానికి వచ్చేసింది. గ్రాండ్ ఫినాలే ఈ వీకెండ్లో ప్రసారం కాబోతుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఫినాలేకి సింగర్స్ అనిరుధ్, కీర్తన, నజీరుద్దీన్, శ్రీ కీర్తి, స్కంద వచ్చారు. ఫినాలేలోనూ వైవిధ్యమైన పాటలతో దుమ్మదులిపేశారు. అలానే జడ్జిలు తమన్, గీతామాధురి కూడా ఫెర్ఫార్మెన్స్లు ఇచ్చారు. ఇలా ప్రోమో ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్గా ఉంది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరోయిన్ మేఘా ఆకాశ్.. ముఖ్యమంత్రి ఆశీర్వాదం) -
తమన్ చిలిపి పనులను బయటపెట్టిన తల్లి
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రసవత్తరంగా జరుగుతోంది. ప్రతి వారం ఎపిసోడ్ అభిమానులకు థ్రిల్ పంచుకున్నాయి. ఇప్పుడీ మెగా మ్యూజిక్ షోలో మరో స్పెషల్ మూమెంట్. ఈ షోకి జడ్జ్ గా ఉంటున్న సెన్సేషనల్ కంపోజర్ తమన్ అమ్మ గారు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. దీనికి సంబధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. తమన్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఘంటసాల సాయి శ్రీనివాస్ అలియాస్ తమన్ చిన్నప్పటి ముచ్చట్లు చెప్పారు. తమన్ చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో కన్నా మైదానంలోనే ఎక్కువగా ఉండేవాడని, తనకి అస్సలు భయం లేదని, స్కూళ్లలో గొడవలు వచ్చేవని చెప్పారు. తొటి పిల్లల టిఫిన్ బాక్స్ లు ఓపెన్ చేసి తినేసేవాడని కంప్లయింట్ లు ఉండేవని అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఐతే తను హార్డ్ వర్క్ చేస్తాడని, వర్క్ అయ్యే వరకు తిండి కూడా పట్టించుకోడని, సంగీతం క్రికెట్ తనకి మరో ప్రపంచం లేదని .. ఇలా చాలా సంగతులు చెప్పారు. -
నవీన్ పోలిశెట్టి ఈజ్ బ్యాక్.. ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3లో సందడి
గాయం నుంచి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి పూర్తిగా కోలుకున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ తర్వాత అమెరికా వెళ్లారు నవీన్ పోలిశెట్టి.. అనుకోకుండా ఓ రోడ్ యాక్సిడెంట్ కు గురయ్యాడు. చాలా రోజులుగా ఇంటి వద్దనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు నవీన్ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. తాజాగా ప్రముఖ ఓటీటీలో ప్రాసారమవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3లో నవీన్ పాల్గొని సందడి చేశాడు. నవీన్ పోలిశెట్టి క్రేజీ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ ఈ వారం రాబోతోంది. తన ఎనర్జీ, డ్యాన్స్, కామెడీ టైమింగ్ తో కంటెస్టెంట్స్, జడ్జ్ లని మెస్మరైజ్ చేశారు. నవీన్ పడిన రెండు పాటలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ ఎపిసోడ్స్ లో చాలా హైలెట్స్ ఉన్నట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. నవీన్ గాయం నుంచి కోలుకున్న తన జర్నీని చెప్పిన తీరు చాలా స్ఫూర్తిని ఇచ్చింది. ఆ కష్టమైన క్షణాలని కూడా చాలా హ్యూమర్స్ గా చెప్పడం అలరించింది. కష్టాన్ని కూడా ఎంత తేలిగ్గా దాటోచ్చో నవీన్ చెప్పిన తీరు గిలిగింతలు పెడుతూనే హార్ట్ టచ్చింగ్ గా అనిపించింది. -
ఇండియన్ ఐడల్ సీజన్ 2.. గెస్టుగా విజయ్ దేవరకొండ
తెలుగు ఇండియన్ ఐడల్ - సీజన్ 3 వినోదాన్ని రెట్టింపు చేస్తూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ వారం ఎపిసోడ్స్‌కి ఓ కొత్త గెస్ట్ వచ్చేస్తున్నాడు. 'కల్కి 2898 ఏ.డీ'లో అర్జునుడిగా కనిపించిన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ షోలో కనిపించనున్నాడు.ఈ మేరకు ఓ ప్రోమోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ''ఈ షోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆహా మన ప్లాట్‌ఫామ్. మన తెలుగు కంటెస్టెంట్స్‌కు సపోర్టుగా ఉండాలి. మీ జర్నీలో ఉండాలని వచ్చాను" అని ప్రోమోలో చెప్పాడు. విజయ్ షోకి రావడంతో ఈ వారం ఎపిసోడ్స్ డబుల్ మ్యూజికల్ ట్రీట్‌గా ఉండబోతున్నాయని ఇట్టే తెలిసిపోతుంది. ఈ వారం నుంచే ఓటింగ్ కూడా స్టార్ట్ కానుంది. తెలుగు ఇండియన్ ఐడల్ 3.. ఆహాలో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది. -
ఎమోషన్ అంతా క్రికెట్ గ్రౌండ్‌లోనే.. .. తమన్ హార్ట్ టచ్చింగ్ స్టోరీ
తమన్..ఇప్పుడు ఇటు తెలుగు అటు తమిళ సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా తక్కువ వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి..వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మ్యూజిక్ సెన్సేషన్‌గా మారిపోయాడు. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలందరికి హుషారెత్తే మ్యూజిక్ అందించాడు.డ్రమ్మర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు. అయితే తమన్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డాడు. ఇంట్లో వాళ్లకి తెలియకుండా ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయట. తన ఎమోషన్ అంతా దాచుకొని క్రికెట్ గ్రౌండ్లో చూపించేవాడట. ఇండియన్ ఐడడ్ సీజన్ 3 లాంచింగ్ ఎపిసోడ్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆహాలో స్క్రీమ్ అవుతున్న ఈ మ్యూజికల్ రియాలిటీ షోకి తమన్‌తో పాటు కార్తిక్, గీతా మాధురి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. షో మధ్యలో ఓ సందర్భంలో ‘మీ జీవితంలో ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా?’అని గీతా మాధురి అడిగిన ప్రశ్నకు బదులుగా ''జీవితంలో తాను ఎన్నోసార్లు ఏడిచాను. నా ఎమోషన్ అంతా క్రికెట్ గ్రౌండ్ లో ఉంటుంది'అని తన ఎమోషన్ ని దాచుకునే ప్రయత్నం చేశారు. తర్వాత గీతా మాధురి తమన్ అమ్మగారిని గురించి ప్రస్థావించినపుడు.. గతాన్ని బాల్యన్ని తలచుకొని చాలా ఎమోషనల్ అయ్యారు తమన్.తమన్ లోని ఎమోషన్ కోణాన్ని టచ్ చేసిన ఈ వీడియో నెటిజన్స్‌ని కదిలిస్తుంది. -
టాలీవుడ్ రియాలిటీ షో.. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-3 వచ్చేసింది!
టాలీవుడ్ సినీ ప్రియులను అలరించేందుకు మరో రియాలిటీ షో వచ్చేసింది. యువ సింగర్స్ టాలెంట్‌ను వెలికితీసేందుకు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్- 3 సిద్ధమైంది. ఈ రోజు నుంచే షో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా అధికారికంగా వెల్లడించింది. ఈ షో కోసం చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి రెండు సీజన్లు సక్సెస్ కావడంతో ఈ సీజన్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్- 3 షో ఇక నుంచి ప్రతి శుక్ర, శనివారాల్లో సాయంత్రం 7 గంటల నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. గతవారమే లాంచ్ ప్రోమోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి జడ్జిలుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్స్ కార్తీక్, గీతా మాధురి, శ్రీరామచంద్ర వ్యవహరిస్తున్నారు. కాగా.. ఈ షో మొత్తం 33 దేశాలలో ఆడిషన్స్ నిర్వహించారు. స్వర సంగీత సమరం!🎶సరిగమ రాగల సంబరం!!🎙️తెలుగు ఇండియన్ ఐడల్- 3 ఆగమనం!!!🥳Global star ni chese star meere...ika chuseyandi ..👉▶️https://t.co/QVPfxrk2AG🎤🎶 Watch India's biggest singing song #TeluguIndianIdolS3 streaming now only on @ahavideoin, every Friday and Saturday at 7… pic.twitter.com/ZeOYSI28yf— ahavideoin (@ahavideoIN) June 14, 2024 -
సంగీత ప్రియులను అలరించే షో.. ప్రోమో అదుర్స్!
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన హిట్షో ఇండియన్ ఐడల్. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత రెండు సీజన్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరోసారి సంగీత ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఇండియన్ ఐడల్ మరో సీజన్ ఈనెల 14 నుంచి ప్రారంభ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రోమోను రిలీజ్ చేశారు.తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్- 3 లాంఛ్ ప్రోమో వచ్చేసింది. ఈసారి జడ్జీలుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్స్ గీతామాధురి, శ్రీరామచంద్ర, కార్తీక్ వ్యవహరించనున్నారు. కొత్త సీజన్లో కంటెస్టెంట్ల ఎమోషన్స్ ఫుల్‌గా ఉండబోతున్నట్లు ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది. ఈ షో మూడోసారి ఆహా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. ప్రతి శుక్ర, శనివారాల్లో రాత్రి 7 గంటలకు ఈ షో స్ట్రీమింగ్ కానుంది. దీంతో వారం ముందుగానే ప్రోమోను ఆడియన్స్‌కు పరిచయం చేశారు మేకర్స్. Ultimate musical journey ki muhurtham set ayindi 🎙️🗓️.Kotha swarala madya competition, Judges iche entertainment tho Indian Idol resound India antha vinapadutundi.✨.Telugu Indian Idol Season 3 Launch Promo Out▶️https://t.co/6b5B1VURT9🎤🎶 Catch #TeluguIndianIdolS3 starting… pic.twitter.com/Pl33SKG5No— ahavideoin (@ahavideoIN) June 6, 2024 -
Manuka Paudel: పాడాలి... వినపడుతుంది
'శక్తి లేదనిపిస్తుంది. ప్రయత్నించాలి. కాళ్లలో బలం లేదనిపిస్తుంది. కదలాలి. ఎవరూ తోడు నిలవడం లేదనిపిస్తుంది. ఒంటరిగా పోరాడాలి. లేదని ఓడేది మనిషే. ఉందని గెలిచేది మనిషే. మేనుకా పౌడెల్‌కు చూపు లేదు. నేపాల్ నుంచి ఇండియాకు పాటను నమ్ముకుని వచ్చింది. తన పాటతో ఎందరినో కదిలించింది. ఇండియన్ ఐడెల్ కంటెస్టెంట్‌గా ఎంపికై ఇప్పుడు ‘సలార్’లో పాడి దేశం మొత్తానికి వినపడుతోంది.' స్ఫూర్తిదాయకమైన ఈ గాయని గురించి.. ‘ఓ పాలన్ హారే నిర్గుణ్ ఔర్ న్యారే తుమ్రె బిన్ హమ్రా కోనొ నహీ’... ‘లగాన్’లోని ఈ పాటను మేనుకా పౌడెల్ (25) పాడుతున్నప్పుడు, ఆ పాటలోని ఆర్తికి, అర్పణకి, ఆరాధనకి న్యాయ నిర్ణేతల్లో ఒకరైన శ్రేయా ఘోషల్ ఏడుస్తూనే ఉంది. మరో జడ్జి విశాల్ దద్లానీ పరిస్థితీ అంతే. ఇంకో జడ్జయిన ప్రముఖ గాయకుడు కుమార్ షాను ‘వహ్వా’లు కొడుతూనే ఉండిపోయాడు. కన్ను తెరిచినా, కన్ను మూసినా చీకటి తప్ప, గాఢాంధకారం తప్ప, ఓడించాలని చూసే నలుపు తప్ప మరేమీ ఎరగని ఆమె తన పాటతో దివ్వె వెలిగించింది. వెలుతురు చూస్తోంది. వెలుతురు చూపిస్తోంది. నేపాల్‌కు చెందిన అంధురాలు మేనుకా పౌడెల్‌కు ఆడిషన్స్ రౌండ్లో గోల్డెన్ మైక్ దొరికింది. ఇండియన్ ఐడెల్ సీజన్ 14లో ఇంకా ఆమె టాప్ కంటెస్టెంట్‌గా కొనసాగుతూ ఉంది. ముఖేష్ స్పెషల్‌లో ముఖేష్ తనయుడు నితిన్ ముఖేష్ సమక్షాన ‘ఏ ప్యార్ కా నగ్మా హై’ పాడితే ఆయన ఎంతో సంతోషించాడు. దర్శకుడు మహేశ్ భట్ సమక్షంలో ‘జఖ్మ్’ సినిమాలోని ‘గలి మే ఆజ్ చాంద్ నిక్లా’ పాటను పాడితే ఆయన స్పందిస్తూ ‘హృదయం దగ్గర ఒక కన్ను ఉంటుందని నువ్వు నిరూపించావు’ అన్నాడు. వాద్యాలు చూడకుండా, పాటను అక్షరాల్లో చూడకుండా, అంత పెద్ద సెట్‌ను చూడకుండా, తన ఎదుట ఉన్న జడ్జిలు ఎలా ఉంటారో చూడకుండా మేనుకా పౌడెల్ ఎంతో నిబ్బరంతో పాటలు పాడటం వల్ల కోట్లమంది అభిమానులను సంపాదించుకుంది. ఇంతకుముందు రియాల్టీ షోలలో కొంతమంది అంధులు పాడటానికి ప్రయత్నించారు కానీ ఇలా నిలువలేదు. మేనుకా పౌడెల్ గొంతులోని మాధుర్యం చివరకు ఆమెను‘సలార్’ లో పాడే వరకూ తీసుకెళ్లింది. ‘సలార్’ హిందీ వెర్షన్‌లోని ‘సూరజ్ హీ ఆజ్ తన్కే’ పాటను మేనుకా పౌడెల్ పాడింది. దీనివల్ల ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఒక భారీ సినిమాతో జరిగిందని చెప్పాలి. ఇదంతా ఆమె పాడాలి అనుకోవడం వల్ల. ఓడాలి అని అనుకోకపోవడం వల్ల. నేపాల్ అమ్మాయి మేనుకా పౌడెల్ది నేపాల్‌లోని జాపా. పుట్టుకతో చూపు లేకపోయినా తల్లిదండ్రులు ఆ లోటు తెలియనీకుండా పెంచారు. బాల్యం నుంచి గానం పట్ల ఆమె ఆసక్తిని ప్రోత్సహించారు. తండ్రి మలేసియాలో ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లగా ఇంటి బాధ్యత ఇప్పుడు మేనుక మీదే ఉంది. ముంబైలోని సురేష్ వాడ్కర్ అకాడెమీలో కొన్నాళ్లు పాడటం నేర్చుకున్న మేనుక గాయనిగా తన ప్రతిభను చాటేందుకు ప్రయత్నిస్తూనే వచ్చింది. సాయిబాబా భజనలు పాడుతూ ఉపాధి పొందింది. ‘సాయిబాబా నా కుటుంబ సభ్యుడు’ అని చెప్పుకుంటుంది. బహుశా ఆ సాయి దయ వల్లే ఆమెకు ఇప్పుడు గొప్ప గుర్తింపు లభించింది. ఆమె పాటను మీరు ఇండియన్ ఐడల్‌లో వినచ్చు. -
చూపున్న పాట
‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లు వస్తాయి’ అన్నాడు కవి. పట్టలేని ఆనందంలో, ప్రశంసించడానికి మాటలు దొరకని పరిస్థితుల్లో కూడా కన్నీళ్లు వస్తాయి. మేనుక పౌదెల్ పుట్టు అంధురాలు. మంచి గాయకురాలు. ఇండియన్ ఐడల్ 14 సీజన్లో ‘లగాన్’ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన ‘ఓ పాలన్ హరే’ పాట పాడింది. అద్భుతమైన ఆమె పాట వింటూ జడ్జీలలో ఒకరైన శ్రేయా ఘోషల్ ఏడ్చేసింది. ఈ ఎపిసోడ్ ఇంటర్నెట్లో వైరల్ అయింది. వైరల్ కావడం మాట ఎలా ఉన్నా ‘శ్రేయ ఓవర్‌గా రియాక్ట్ అయ్యారు’ అని కొందరు విమర్శించారు. మరి ఆమె అభిమానులు ఊరుకుంటారా? వాళ్లు ఇలా స్పందించారు...‘రెండు దశాబ్దాలకు పైగా శ్రేయ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో జాతీయ అవార్డ్లు అందుకున్నారు. ఆమెకు ప్రతిభ లేకపోతే ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవారు. ఇలాంటి టాలెంటెడ్ సింగర్ గురించి నెగెటివ్ కామెంట్స్ పెట్టడం తగదు’. -
సింగర్‌ను పెళ్లాడనున్న బుల్లితెర నటి.. ఫోటోలు వైరల్!
మరాఠీ నటి స్వానంది టికేకర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. తాజాగా ఇండియన్ ఐడల్- 12 కంటెస్టెంట్ ఆశిష్ కులకర్ణితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆదివారం జరిగిన ఈ వేడుకలో వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను నటి తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్వానంది తన ఇన్‌స్టాలో రాస్తూ..' మేము నిశ్చితార్థం చేసుకున్నాం. ఇక నుంచి నువ్వే నా ఏకైక ఇల్లు' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. కాగా.. స్వానంది ప్రముఖ నటుడు ఉదయ్ టికేకర్, ప్రసిద్ధ సింగర్ ఆరతి అంకాలికర్ కుమార్తె. సింగర్‌తో నిశ్చితార్థం జరిగిన తర్వాత స్వానంది తన పెళ్లి గురించి మాట్లాడింది. (ఇది చదవండి: ఇంటర్వ్యూల కోసమే చీప్ ట్రిక్స్.. ఎందుకు కొడతానన్న స్టార్ నటుడు!) స్వానంది మాట్లాడుతూ..' మా పెళ్లి త్వరలోనే జరగబోతోంది. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా. ప్రస్తుతానికి ఇది మాత్రమే చెప్పగలను. నేను జీవితంలో ఒక నూతన అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నా. ఆశిష్, నేను మా సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ప్రత్యేక సందర్భాన్ని ఆస్వాదిస్తున్నా.' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ఇండియన్ ఐడల్ -12 తర్వాత ఆశిశ్‌కు గుర్తింపు వచ్చింది. కాగా.. స్వానంది టికేకర్ మరాఠీ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. దిల్ దోస్తీ దునియాదారి, దిల్ దోస్తీ దొబారా, అస్సా మహేర్ నాకో గా బాయి పాత్రలకు ఫేమ్ వచ్చింది. అంతే కాకుండా ఏక్ శూన్య తీన్, డోంట్ వర్రీ బి హ్యాపీ అనే చిత్రాల్లో నటించింది. ఇండియన్ ఐడల్ మరాఠీ షోకు హోస్ట్‌గా చేసింది. View this post on Instagram A post shared by A D I N A T H P A ‘त’ K A R (@adinath.patkar) (ఇది చదవండి: 'ఓపెన్‌హైమర్' సినిమాలో ఆ సీన్ తొలగించండి: సమాచార మంత్రిత్వ శాఖ) View this post on Instagram A post shared by Ashish Kulkarni (@ashishkulkarni.music) -
ఇండియన్ ఐడల్ 2 విన్నర్ ఆమెనే.. ఐకాన్ స్టార్ ప్రశంసలు
సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తున్న ఆహా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ గ్రాండ్ ఫినాలేకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఎంతో ఉత్కంఠగా జరిగిన తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఫైనల్లో విశాఖపట్నానికి చెందిన సౌజన్య భాగవతుల విజేతగా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన జయరాం, సిద్దిపేటకు చెందిన లాస్య ప్రియలు ఫస్ట్, సెకండ్ రన్నరప్‌లుగా నిలిచారు. వీరికి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'సంగీతంలో ఎంతో ప్రతిభావంతులైన వీరి ప్రదర్శన చూసి మనసంతా ఆనందంతో నిండిపోయింది. సంగీతంపై మరింత ప్రేమ పెరిగింది. ఈ షో నాకెంతో ప్రత్యేకమైనది, మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలింది. సౌజన్యకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆమె అసాధారణమైన విజయాన్ని సాధించింది. రెండేళ్ల చిన్నారికి తల్లిగా ఉంటూ ఎంతో అంకిత భావంతో ఈ పోటీల్లో పాల్గొనటం.. ఓ వైపు సంగీతం, మరో వైపు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం అనేది అంత సులువైన విషయం కాదు. ఆమె అంకిత భావం, నిబద్ధత చూస్తే గౌరవం పెరిగింది. ఆమెకు కుటుంబం నుంచి వచ్చిన మద్దతు ఎంత గొప్పగా ఉందో, దాని ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. పెళ్లైన ప్రతి స్త్రీ వెనుక ఆమె భర్త సహకారం ఉండాలి. అలా ఉన్నప్పుడు మహిళలు వారి అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. అది వారి ఉనికిని అందరికీ తెలిసేలా చేస్తుంది. సౌజన్య సాధించిన ఈ విజయం అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఆమె సంగీత ప్రయాణంలో ఇలాంటి విజయాలను మరెన్నింటిలో అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విజేతగా నిలిచిన సౌజన్య భాగవతుల మాట్లాడుతూ ‘‘ఆహా వారి తెలుగు ఇండియన్ 2లో విజేతగా నిలవటం, ముఖ్యంగా అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. కల నిజమైనట్లు ఉంది. ఆయన అందించిన ప్రోత్సాహం, ప్రశంసలను నేనెప్పటికీ మరచిపోను. ఈ మ్యూజికల్ జర్నీ నాలోని పట్టుదలను మరింతగా పెంచింది. ఇంత గొప్ప వేదికను అందించిన ఆహా వారికి, న్యాయ నిర్ణేతలకు, నా తోటి కంటెస్టెంట్స్‌కు, మా వెనుక ఉండి ప్రోత్సహించిన టీమ్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. జీవితంలో ఈ క్షణాలను ఎప్పటికీ మరచిపోలేను. ఇంకా గొప్పగా రాణించటానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ మొత్తం 25 ఎపిపోడ్లకు గాను 10 వేల మంది యువ గాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. సౌజన్య, జయరాం, లాస్యప్రియతో పాటు న్యూజెర్సీకి చెందిన శ్రుతి, హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ టాప్-5లో ఉన్నారు. Today is the time! In an hour from now ICON STAR @AlluArjun garu will announce the winner of #TeluguIndianIdol2. 🎵🕺Watch Part 2 of ICONIC FINAALE now!😍🔥@MusicThaman @singer_karthik @geethasinger . Streaming now ▶ https://t.co/XgDhOwib60 pic.twitter.com/FLwIzzvXtq — ahavideoin (@ahavideoIN) June 4, 2023 @alluarjun intha ga blush avvadaniki, Sruthi story ento telusukovadaniki. Inkoka '4hrs' matrame. Watch Iconic Grand FinAAle #TeluguIndianIdol2 #AAforTeluguIndianIdol2 #IconicFinAAle #AlluArjun @MusicThaman @geethasinger pic.twitter.com/IXH2aZNuNA — ahavideoin (@ahavideoIN) June 4, 2023 చదవండి: డబ్బు కోసం ఆ పని చేశా.. సీక్రెట్‌గా ఉంచాల్సిన వీడియో లీక్ -
ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలే.. ఛీఫ్ గెస్ట్ పేరు లీక్!
ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 సంగీత ప్రియులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. (ఇది చదవండి: NTR30: ఎన్టీఆర్30 ఫస్ట్‌లుక్ పోస్టర్.. టైటిల్ అదిరిపోయింది!) అయితే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేకు పాన్ ఇండియా స్టార్ హాజరవుతున్నట్లు ట్వీట్ చేసింది. అంతేకాకుండా పుష్ప-2 టీజర్‌తో పాటు గెస్ట్ ఎవరో కూడా హింట్ ఇచ్చింది. ఈ సారి గ్రాండ్ ఫినాలేకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరవుతున్నట్లు ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. కాగా.. తొలి ఇండియన్ ఐడల్ తొలి సీజన్లో నెల్లూరుకు చెందిన యువ ప్రతిభావంతులైన గాయని బీవీకే వాగ్దేవి గెలుచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ఆమెకు ప్రైజ్ మనీతో పాటు రూ.లక్ష విలువైన ట్రోఫీని అందించాడు. చిరుతో పాటు రానా, సాయిపల్లవి ఈ షోలో సందడి చేశారు. (ఇది చదవండి: వారికి అచ్చిరానీ టాలీవుడ్.. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' పరిస్థితి ఏంటీ?) PAN India Charchalu modhalayyayi ante iga thaggede le 🔥🔥🔥 Guess the star 🌟#TeluguIndianIdol2 Masss Finale coming soon. Stay tuned for exclusive updates. #alluarjun @MusicThaman @singer_karthik @GeethaArts @PushpaMovie pic.twitter.com/Y12m87iZVf — ahavideoin (@ahavideoIN) May 19, 2023 -
Chakrapani Nagari: పాటల తుపాకీ...
దేశ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్. వేదికల మీద పాటలు పాడుతూ తనలో ఉన్న కళకు హద్దులు లేవని నిరూపిస్తున్నారు. ‘డ్యూటీలో ఉంటూ గాన సాధన కూడా చేయడంతో ఈ పాట నాకు బాగా వంటపట్టింది’ అంటూ ఇటీవల హైదరాబాద్ వచ్చిన చక్రపాణి నగరి తన గురించి వివరించారు. ‘‘మాది శ్రీకాకుళం జిల్లా, పలాస. టెన్త్‌క్లాస్ వరకు హైదరాబాద్ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. ఆ సమయంలో బీఎస్ఎఫ్కు సంబంధించిన ఒక ప్రకటన చూసి, అప్లై చేశాను. ఆ పరీక్షల్లో సెలక్ట్ అయ్యి 2013లో బీఎస్ఎఫ్లో చేరాను. ఇప్పటి వరకు రాజస్థాన్‌లో పని చేశాను. ఇప్పుడు సెలవు మీద హైదరాబాద్‌కు వచ్చాను. సెలవు పూర్తవగానే జమ్ములో విధులు నిర్వర్తించాలి. డ్యూటీలో ఉంటూ.. ఏదో ఒకటి పాడుకుంటూ ఉండటం అనేది స్కూల్ టైమ్ నుంచే ఉండేది. కానీ, ఎప్పుడూ దానిని నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోలేదు. బీఎస్ఎఫ్లో చేరిన తర్వాత అక్కడ మా టీమ్, క్యాంపుల్లో సరదాగా పాడుతుండేవాడిని. నెలకు ఒకసారి ఏదో ఒక సెలబ్రేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంటుంది. ఆ సమయంలో అన్నీ హిందీ పాటలు పాడేవాడిని. అక్కడున్నవారందరికీ హిందీ తెలుసు కాబట్టి, అవే పాటలు పాడేవాడిని. మా తోటి జవాన్లే కాదు ఆఫీసర్స్ కూడా చాలా ప్రోత్సహించేవారు. డ్యూటీలో ఉన్నా లేకున్నా పాటలు పాడటం మాత్రం ఆగేది కాదు. ఇక మా ఊరికి వచ్చినప్పడు పెళ్లిళ్లు వంటి వేడుకల సందర్భాల్లోనూ నా గాన కచేరీ ఉండేది. ఖాళీ సమయంలో డిజిటల్ మీడియాని ఫాలో అవుతుంటాను. అలా, హైదరాబాద్‌లోని ఓ టీవీ పాటల కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని ప్రకటన చూసి, అప్లై చేసుకున్నాను. వేల మందిలో నాకు అవకాశం రావడంతో చాలా సంతోషంగా అనిపించింది. ఈ విషయాన్ని మా అధికారులకు చెబితే వాళ్లూ వెంటనే ఓకే చేశారు. ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడమే కాదు, గాన గంధర్వుడు బాలుగారి మైక్‌ను కానుకగా అందుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. కష్టపడుతూ.. మా అమ్మానాన్నలకు మేం ముగ్గురం. నా చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో మా అమ్మ చాలా కష్టాలు పడింది. మమ్మల్ని హాస్టల్లో ఉంచి, తెలిసినవారి ద్వారా ఢిల్లీ వెళ్లి, పనులు చేసి, మాకు డబ్బు పంపేది. ఇప్పుడు అమ్మ ఊళ్లో వ్యవసాయం పనులు చేస్తుంది. అన్నయ్య సొంతగా బేకరీ నడిపిస్తున్నాడు. అక్క గ్రామవాలంటీర్గా చేస్తోంది. మాకు కష్టం విలువ తెలుసు, స్వయంగా ఎదగడానికి మా వంతుగా కృషి చేస్తూనే వచ్చాం. ఆ కష్టంలో నుంచే ఈ పాట పుట్టుకు వచ్చిందనుకుంటాను. ఎక్కడ ఉన్నా కళ రాణిస్తుందనడానికి నేనే ఉదాహరణ అనిపిస్తుంటుంది. మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొని సింగర్‌గా రాణించాలనుకుంటున్నాను’’ అని తెలియజేశాడు ఈ జవాన్. – నిర్మలారెడ్డి -
‘ఆహా’ కోసం బాలయ్య కొత్త అవతారం.. న్యూ లుక్ పిక్స్ వైరల్
నందమూరి నట సింహా బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు యాడ్స్.. యాంకరింగ్ చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఆయన హోస్ట్‌గా చేసిన టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సూపర్ హిట్ అయింది. ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షోతో బాలయ్య క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఇదే జోష్‌తో మరోసారి ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు ఈ నందమూరి నటసింహం. ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్నమ్యూజిక్ కాంపిటీషన్ షో ఇండియన్ ఐడల్ రెండో సీజన్లో బాలయ్య గెస్ట్‌గా మెరవబోతున్నాడు. ఇప్పటికే ఈ కాంపిటీషన్ షో కోసం 12 మంది కంటెస్టెంట్స్‌ని ఫైనల్ చేశారు. ఈ 12 మందిని పరిచయం చేస్తూ సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్లో నందమూరి బాలకృష్ణ లైవ్ డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆహా ట్వీట్ చేసింది.. గతంలో ఇంతకు ముందెన్నపుడు చూడని బాలయ్యను చూస్తారంటూ ట్వీటర్లో పేర్కొంది. ప్రస్తుతం బాలయ్యకు సంబంధించిన న్యూ లుక్స్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. The Fire sets the stage on fire, yet again! Inthaku mundhennadu chudani Balayyani Chusthaaru, March 17&18th na #TeluguIndianIdolS2 #GalaWithBala lo🔥@MusicThaman @singer_karthik @geethasinger @itsvedhem@southindiamalls @realmeIndia @KhiladiOfficia3 @BingoSnacks @ShaadiDotCom pic.twitter.com/L7jnmaID5K — ahavideoin (@ahavideoIN) March 13, 2023 -
ఒకే ఒక్క లైఫ్.. నచ్చినవన్నీ చేసెయ్యాలి: సింగర్ గీతా మాధురి
-
తెలుగు ఇండియన్ ఐడల్ 2లో పాల్గొనాలనుకుంటున్నారా? ఇది మీకోసమే!
ఆహా మొదలైనప్పటినుంచి ప్రేక్షకుల కోసం వినోదాత్మక, ఉత్కంఠభరిత కంటెంట్ అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఒరిజినల్స్, రియాలిటీ షోలు ప్రసారమయ్యాయి. వీటికి అదనంగా తెలుగు ఇండియన్ ఐడల్ రియాలిటీ షోని ప్రవేశపెట్టింది. అద్భుతమైన ఆదరణ పొందిన ఈ రియాలిటీ షో త్వరలో రెండో సీజన్‌కు రెడీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని పసందైన గళాల కోసం బ్రాండ్ న్యూ అవతార్‌లో తెలుగు ఇండియన్ ఐడల్ 2 రూపుదిద్దుకుంటోంది. ఫస్ట్ సీజన్ ఇచ్చిన ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా, శ్రావ్యమైన గళాలను ప్రేక్షకులకు పరిచయం చేసేలా మరింత గ్రాండియర్‌గా రూపొందుతోంది సెకండ్ సీజన్. అన్‌స్టాపబుల్ 2లో ఈ షో గురించి అనౌన్స్ చేశారు నందమూరి బాలకృష్ణ. ఫస్ట్ సీజన్లో ఎస్ ఎస్ తమన్, నిత్యామీనన్, కార్తిక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. బీవీకే వాగ్దేవి ట్రోఫీ గెలుచుకున్నారు. శ్రీనివాస్, వైష్ణవి తొలి రెండు రన్నరప్ స్థానాల్లో నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న శ్రావ్యమైన గళాలకు అద్భుత వేదికను ఏర్పాటు చేసి, ప్రపంచానికి పరిచయం చేయాలనే సదుద్దేశంతో ఈ షోని ప్లాన్ చేసింది ఆహా. 16 నుంచి 30 ఏళ్లలోపున్నవారు ఈ షోలో పాల్గొనవచ్చు. హైదరాబాద్, బషీర్‌బాగ్‌లోని సెయింట్ జార్జి గ్రామర్ హై స్కూల్లో జనవరి 29న ఈ ఆడిషన్స్ జరగనున్నాయి. ప్రతిభావంతులైన ఔత్సాహిక గాయనీగాయకులకు ఇదో సువర్ణావకాశం. మీరు నెక్స్ట్ తెలుగు ఇండియన్ ఐడల్ షోలో పాల్గొనాలనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? ఆడిషన్స్‌లో తప్పక పాల్గొనండి. వచ్చే సీజన్లో తెలుగు ఇండియన్ ఐడల్ ట్రోఫీ విజేతగా మిమ్మల్ని మీరు చూసుకోండి! చదవండి: పెళ్లికి రెడీ అయిన కార్తీకదీపం నటి, పెళ్లిచూపులు వీడియోతో సర్ప్రైజ్ ఆస్తి కోసం చిన్న గొడవ.. ప్రేమించి పెళ్లాడిన భర్త వదిలేసి పోయాడు.. 30 ఏళ్లవుతోంది: నటి -
గెట్ రెడీ ఫర్ ఆడిషన్స్.. త్వరలోనే తెలుగు ఇండియన్ ఐడల్
ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-1 సంగీత ప్రియులను అలరించింది. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో ఆహా మరోసారి ప్రేక్షకులకు కనివిందుల చేసేందుకు సిద్ధమైంది. ఎంతో టాలెంట్ ఉన్న యంగ్ అండ్ డైనమిక్ సింగర్స్ ప్రతిభను వెలికితీసేందుకు మరోసారి రెడీ అయింది. త్వరలోనే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ -2తో మీ ముందుకొస్తున్నట్లు ప్రకటించింది ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా. దీనికి సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేసింది. త్వరలోనే ఆడిషన్స్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. మొదటి సీజన్‌కు ప్రేక్షకుల అద్భుతమైన స్పందన లభించింది. తెలుగు ఇండియన్ ఐడల్‌ను బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో సీజన్-2 సరికొత్తగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభ కలిగిన సింగర్స్‌కు ఈ షో చక్కని అవకాశం కల్పించనుంది. ఈ బిగ్గెస్ట్ సింగింగ్ రియాలిటీ షోకి సంబంధించిన ఆడిషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తొలి ఇండియన్ ఐడల్ తొలి సీజన్లో నెల్లూరుకు చెందిన యువ ప్రతిభావంతులైన గాయని బీవీకే వాగ్దేవి గెలుచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆమె ప్రైజ్ మనీతో పాటు రూ.లక్ష విలువైన ట్రోఫీని అందించాడు. చిరుతో పాటు రానా, సాయిపల్లవి ఈ షోలో సందడి చేశారు. -
అన్‌స్టాపబుల్ సీజన్ 2పై బాలయ్య క్లారిటీ
నందమూరి నట సింహాం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వచ్చిన టాక్‌షో అన్‌స్టాబుల్ విత్ ఎన్బీకే. ఈ షో ఎంతటి సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నిర్వహించిన ఈ షోకు కోసం బాలయ్య హోస్ట్‌గా మారి అన్‌స్టాబబుల్ తొలి సీజన్‌ను విజయంతంగా చేశాడు. తన షోకు విచ్చేసిన అతిథులందరినీ కలుపుకుపోతూ ఎన్నో విషయాలు రాబడుతూ ఆడియన్స్‌నే ఆశ్చర్యపరిచాడు. ఆహాలో సూపర్ డూపర్ హిట్టయిన అన్‌స్టాపబుల్ విజయవంతంగా తొలి సీజన్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ 2పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అన్‌స్టాబుల్ సీజన్ 2పై బాలకృష్ణ క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల తెలుగు ఇండియన్ ఐడల్ టాప్ 6 ఎపిసోడ్‌కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా హోస్ట్ శ్రీరామ చంద్ర బాలయ్యను అన్‌స్టాబుల్ సీజన్ 2 ఎప్పుడు సార్? అని ప్రశ్నించాడు. దీనికి బాలయ్య స్పందిస్తూ.. మధుర క్షణాలకు ముగింపు ఉండదు.. కొనసాగింపే.. అంటూ సమాధానం ఇచ్చాడు. అలాగే ఇదే వీడియోను ఆహా వీడియోస్ షేర్ చేస్తూ ‘త్వరలోనే అన్‌స్టాబుల్ టాక్ షో మళ్లీ మీ ముందుకు రాబోతుంది. ఈసారి ఎవరెవరు గెస్ట్‌గా రావాలనుకుంటున్నారో కామెంట్స్ చేయండి’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో డిజిటల్ ప్రేక్షకులు ఖుషి అవుతున్నారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ రాబోతుందని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గెస్ట్‌గా ఎవరో రావాలో చెబుతూ తమ తమ అభిమాన హీరోల పేర్లను కామెంట్లో పేర్కొంటున్నారు. Bigger, Better and Crazier. Your favourite and India's No.1 talk show returns with Season 2 #UnstoppableWithNBK coming soon! Who should we have on the show as guests? Comment below.🥳 P.S: Crazy comments only (Think Unstoppable) 😉😉 pic.twitter.com/RS4o15vT8I — ahavideoin (@ahavideoIN) June 20, 2022 -
‘తెలుగు ఇండియన్ ఐడల్’ విజేత వాగ్దేవి ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ ఫినాలే ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగా సాగింది. శుక్రవారం రాత్రి స్ట్రీమింగ్ అయిన ఈ ఫైనల్ ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కంటెస్టెంట్స్ చేసిన సందడి బాగా ఆకట్టుకుంది. చిరుతో పాటు రానా, సాయిపల్లవిలు ‘విరాటపర్వం’ ప్రమోషన్లో భాగంగా ఈ షోలో సందడి చేశారు. చదవండి: ‘ఆ బుక్ ఆధారంగా కెఫె కాఫీ డే వీజీ సిద్ధార్థ బయోపిక్ తీస్తున్నాం’ కాగా ఈ సింగింగ్ రియాలిటీ షోకు శ్రీరామ్‌చంద్ర హోస్ట్‌గా.. సంగీత దర్శకుడు తమన్, నటి నిత్యామీనన్, సింగర్ కార్తీక్‌లు జడ్జ్‌లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ ఫినాలే ఎపిసోడ్లో వాగ్దేవి, వైష్ణవి, ప్రణతి, జయంత్, శ్రీనివాస్‌లు ఫైనల్‌కు రాగా.. వాగ్దేవి విన్నర్‌గా నిలిచింది. శ్రీనివాస్, వైష్ణవిలు 2, 3 స్థానాల్లో నిలిచి రన్నర్లుగా నిలిచారు. విజేతగా నిలిచిన వాగ్దేవికి చిరంజీవి ట్రోఫీని అందించాడు. అలాగే ట్రోఫీతో పాటు రూ.10 లక్షల ప్రైజ్‌మనీని కూడా ఆమె గెలుచుకుంది. అంతేకాదు ఇకపై గీతా ఆర్ట్స్ నుండి రానున్న సినిమాలో ఓ పాట పాడే అవకాశం కూడా ఆమె అందుకుంది. చదవండి: ఇంటింటికి సబ్బులు అమ్ముకుంటున్న స్టార్ నటి ఐశ్వర్య మొదటి రన్నరప్‌గా నిలిచిన శ్రీనివాస్‌కు రూ. 3 లక్షలు ప్రైజ్‌మని, రెండవ రన్నరప్‌గా నిలిచిన వైష్ణవికి 2 లక్షల రూపాయలు బహుమాతిగా అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి తన తదుపరి సినిమా ‘గాడ్‌ఫాదర్’లో వైష్ణవికి పాట పాడే అవకాశం ఇచ్చాడు. అలాగే సింగర్ కార్తీక్ తను సంగీతం అందించనున్న నెక్స్ట్ సినిమాలో విన్నర్ వాగ్దేవికి ఛాన్స్ ఇస్తున్నట్లు తెలిపాడు. ఆనంతరం చిరుతో ముందుగానే వాగ్ధేవికి చెక్‌ను కూడా అందించాడు. ఇక ఈ ఎపిసోడ్లో నిత్యా మీనన్ పాట పాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. థమన్, కార్తిక్ పాటల ప్రదర్శన, శ్రీరామ్ చంద్ర నృత్య ప్రదర్శనతో షోను మరింత వినోదంగా సాగింది. -
తెలుగు ఇండియన్ ఐడల్ జడ్జ్‌గా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ !
S Thaman As Judge For Telugu Indian Idol Show: టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్లలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పేరు తమన్. 2009లో రవితేజ కిక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత అనేక మంది స్టార్ హీరోలకు మ్యూజిక్ కంపోజ్ చేసి తానేంటో నిరూపించుకున్నాడు. ఇటీవల నందమూరి నటసింహం బాలకృష్ణ 'అఖండ' సినిమాతో తమన్ పేరు మారుమోగిపోయింది. అందులో తమన్ కొట్టిన బీజీఎంకు మాములు క్రేజ్ రాలేదు. ఇదే కాకుండా పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' పాటలు ఇప్పటికే ఫుల్ పాపులర్ అయ్యాయి. దీంతోపాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉన్నాడు తమన్. అయితే ప్రస్తుతం తమన్‌కు సంబంధించిన ఒక క్రేజ్ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్స్‌తో వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. స్టార్ హీరోయిన్ సమంతతో 'సామ్ జామ్', నందమూరి బాలకృష్ణతో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' వంటి టాక్ షోలతో ఆహా అనిపించింది. తాజాగా తెలుగు 'ఇండియన్ ఐడల్' పేరుతో సింగింగ్ రియాలిటీ షోను పరిచయం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ షోకు హోస్ట్‌గా సింగర్, బిగ్‌బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్ శ్రీరామ చంద్ర హోస్ట్‌గా చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుతం ఈ షోకు న్యాయ నిర్ణేతగా తమన్ వ్యవహరించనున్నాడట. ఇండియన్ ఐడల్ మేకర్స్ దాదాపుగా తమన్‌ను కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే షోకు రేటింగ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ షోకు తమన్ జడ్జ్‌గా వస్తే సోషల్ మీడియాలో మీమర్స్‌కు కూడా పని దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే తమన్ చాలా సినిమాల నుంచి మ్యూజిక్ కాపీ కొడతాడన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యేవి. నాగార్జున నటించిన కింగ్ మూవీలోని కొన్ని సీన్లను స్పూఫ్ చేస్తూ తమన్‌పై ట్రోలింగ్, మీమ్స్ చేసినవారు కూడా ఎక్కువే. కాగా న్యాయనిర్ణేతగా తమన్ ఇచ్చే జడ్జిమెంట్‌పై ఆసక్తి నెలకొంది. ఇదీ చదవండి: అందుకే విడిపోయాం.. విడాకులపై చై ఆసక్తికర వ్యాఖ్యలు -
శ్రీరామచంద్రకు 'ఆహా' అనిపించే ఆఫర్.. ఏంటంటే ?
Sreerama Chandra To Host The Telugu Indian Idol On Aha: శ్రీరామ చంద్ర అంటే మొన్నటి వరకు పాపులర్ సింగర్ గానే తెలుసు. కానీ బిగ్‌బాస్ ఐదో సీజన్లో పాల్గొనడంతో మరింత పాపులర్ అయ్యాడు. తెలుగు ప్రేక్షకులకు చేరువ అవ్వాలన్న ఏకైక ఆశయంతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన శ్రీరామచంద్ర.. లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. బిగ్‌బాస్ 5వ సీజన్‌కు విన్నర్‌గా శ్రీరామ చంద్ర గెలుస్తాడని మొదట అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా మూడో స్థానంతో శ్రీరామ బిగ్‌బాస్ జర్నీకి బ్రేక్ పడింది. అలా జరిగిన కూడా ఆయన అభిమానులకు మాత్రం అతడే విన్నర్. అయితే ఈ విన్నర్ తాజాగా అదిరిపోయే ఆఫర్ అందుకున్నాడు. ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా' తర్వలో 'ఇండియన్ ఐడల్' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా శ్రీరామచంద్రను సెలెక్ట్ చేశారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించారు ఆహా మేకర్స్. ఇదివరకు శ్రీరామచంద్ర 2013లో ఇండియన్ ఐడల్‌గా (హిందీ) గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయన గాత్రానికి అనేక మంది సంగీత దర్శకులు, సింగర్స్ మంత్రముగ్ధులయ్యారు. తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి శ్రీరామచంద్ర హోస్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇండియన్ ఐడల్‌లో (హిందీ) సింగర్‌గా అలరించిన శ్రీరామచంద్రం హోస్ట్‌గా ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఆడిషన్స్ జరుపుకుంటున్న తెలుగు 'ఇండియన్ ఐడల్' త్వరలోనే ప్రారంభం కానుంది. 🥁 CAN THIS GET ANY BETTER? #SreeramaChandra to host the first-ever #TeluguIndianIdol mee aha lo 🧡✨Are you excited or AREEE YOUU EXCITEEEDD!@fremantle_india @Sreeram_singer @instagram pic.twitter.com/0uBIIrjatZ — ahavideoIN (@ahavideoIN) December 26, 2021 -
ఘనంగా ఇండియన్ ఐడల్ సింగర్ నిశ్చితార్థం
Sayli Kamble Engagement: తన అద్భుత గాత్రంతో ఎంతోమంది సంగీతప్రియులను అలరించింది సింగర్ సయాలీ కంబ్లే. ఇండియన్ ఐడల్ 12వ సీజన్ సెకండ్ రన్నరప్‌గా నిలిచిన ఆమె తన స్నేహితుడు ధావల్‌ను పెళ్లాడనుంది. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు ఇండియన్ ఐడల్ షో కంటెస్టెంట్లు సహా పలువురు సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా విచ్చేసి సందడి చేశారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను లవ్ బర్డ్స్ సోషల్ మీడియాలో షేర్ చేయారు. 'నీతో చిరునవ్వులు చిందించడానికి, బాధలో ఉన్నప్పుడు సంతోషం వైపు నడిపించడానికి, జీవితాంతం ప్రేమిస్తూ ఎల్లప్పుడూ నీ వెన్నంటే ఉంటాను. నా ఊపిరి ఆగేవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు ధావన్. View this post on Instagram A post shared by Sayli Kamble (@saylikamble_music) కాగా ధావన్ ఓ ప్రభుత్వ ఉద్యోగి. సయాలీ, ధావన్‌లకు మూడేళ్ల నుంచే పరిచయం ఉంది. ఆ చనువుతో ఓరోజు ధావన్ ఆమెకు ప్రపోజ్ చేయగా సయాలీ సిగ్గుపడుతూ దాన్ని అంగీకరించింది. అలా వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక సయాలీ మ్యూజిక్ టూర్ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉండటంతో వచ్చే ఏడాది మే తర్వాతే వీరి పెళ్లి జరిగే అవకాశం ఉందట! View this post on Instagram A post shared by Dhawal (@dhawal261192) తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ సయాలీ తనకు కాబోయే భర్త గురించి మాట్లాడింది. 'ఆశయాలు పెద్దదిగా ఉండాలని, వాటిని సాధించాలంటూ ధావల్ నన్నెప్పుడూ ఇన్స్పైర్ చేస్తుంటాడు. నేనెప్పుడూ పెద్ద కలలు కనలేదు. కానీ అతడు మాత్రం మనం కల ఎప్పుడూ పెద్దదిగా ఉండాలని చెప్పేవాడు. అతడి మాటలు, ప్రోత్సాహం వల్లే నేను ఈ స్టేజ్‌లో ఉన్నాను. లాక్‌డౌన్‌కు ముందు కొన్ని షోలలో పాటలు పాడేదాన్ని. అయితే లాక్డౌన్ వల్ల అవి ఆగిపోయాయి. ఆ సమయంలో ధావల్ ఇండియన్ ఐడల్ 12 ఆడిషన్స్‌లో పాల్గొనమన్నాడు. సరే చూద్దామని నేను పాడిన వీడియో పంపాను. అలా ఈ షోలో అవకాశం దక్కించుకుని ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాను' అని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Sayli Kamble (@saylikamble_music) -
‘తెలుగు ఇండియన్ ఐడల్’ షోను పరిచయం చేయబోతోన్న ఆహా
తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా ఎప్పుడూ ప్రేక్షకులకు సరికొత్తగా వినోదం పంచే దిశగా అడుగు వేస్తోంది. అందుకే ప్రారంభమైన తక్కువ కాలంలోనే రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ప్రేక్షకుడి అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కంటెంట్‌ను అందిస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితం కాకుండా టాక్ షోలతో డిజిటల్ వ్యూవర్స్‌కి సరికొత్త అనుభూతిని పంచేందుకు టాక్ షోలు నిర్వహిస్తోంది. ఇందుకోసం ఆరంభంలోనే ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత సామ్ జామ్ టాక్ షో నిర్వహించి టాలీవుడ్ బిగ్ సెలబ్రెటీలతో సందడి చేయించింది. చదవండి: ‘పుష్ప’లో చేయనని చెప్పాను: నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం ఏకంగా అగ్ర హీరో నందమూరి బాలకృష్ణతో ‘అన్‌స్టాబుల్ విత్ బాలయ్య’ పేరుతో మరో టాక్ షో నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో సంచలనానికి తెర తీసింది ఆహా. త్వరలోనే తెలుగు ఓటీటీలో ఇండియన్ ఐడల్ షోను పరిచయం చేయబోతున్నామంటూ ప్రకటన ఇచ్చింది. ఇప్పటి వరకు ఇండియన్ ఐడల్ అంటే హిందీలో జరిగే సింగింగ్ రియాలిటీ షోని మనకు తెలిసిందే. హీందీలో 12 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పటి వరకు తెలుగులో లేదు. దీంతో ఇండియన్ ఐడల్ తెలుగులో పరిచయం చేసేందుకు ఆహా సన్నాహాలు చేస్తోంది. చదవండి: షాకిస్తున్న అనసూయ లేటెస్ట్ లుక్, ఈ రేంజ్లో గ్లామర్ ఇచ్చిందా! దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది ఆహా. తెలుగు సింగింగ్ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతోనే ఆహా ఈ సరికొత్త రియాలిటీ షోకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఆడిషన్స్‌కు సంబంధించిన వివరాలను ప్రకటించారు ఆహా నిర్వహకుల. డిసెంబర్ 26న తొలి ఆడిషన్స్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 14 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న గాయనీగాయకులకు ఆహ్వానం అందించారు. ఇక ఈ ఆడిషన్స్ హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని ఒయాసిస్ స్కూల్లో నిర్వహించనున్నారు. Can it get better than this? WE THINK NOT. The former Indian Idol winner @singerrevanth to host first-ever #TeluguIndianIdol.@fremantle_india @instagram pic.twitter.com/6Wh6K6vUPW — ahavideoIN (@ahavideoIN) December 18, 2021 -
విజయ్ను కలిసి షణ్ముక ప్రియ, ‘లైగర్’ ఓ పాట పాడే అవకాశం
హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘లైగర్’. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇండియన్ ఐడల్ 12 కంటెస్టెంట్ షణ్ముక ప్రియకు పాట పాడే అవకాశం కల్పించాడు. తన గాత్రంతో సంగీత ప్రియుల్ని అలరిస్తూ..ఇండియన్ ఐడల్ సీజన్ 12లో మెరిసింది షణ్ముఖ ప్రియ. ఇటీవల షో నిర్వహకుల విజ్ఞప్తి మేరకు లైవ్‌లో జూమ్ ద్వారా షణ్ముకతో మాట్లాడిన విజయ్ గెలిచినా, ఓడినా అవకాశం ఇస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయ్ తన హామీని నిలబెట్టుకున్నాడు. ఇండియన్ ఐడల్ 12 సీజన్లో షణ్ముక టాప్ 6 కంటెస్టెంట్స్‌లో ఒకరుగా నిలిచి ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. కానీ షణ్ముక ట్రోఫి మాత్రం గెలుచుకోలేకపోయింది. అయితే ఇటీవల ఈ షో ముగియడంతో తన స్వస్థలం విశాఖపట్నం చేరుకుంది. చదవండి: నేను పాడితే లోకమే ఆడదా.. ఉర్రూతలూగించిన షణ్ముఖప్రియ ఇక ఇటీవల వైజాగ్ చేరుకున్న షణ్ముక సోమవారం విజయ్ను కలిసింది. తన తల్లితో కలిసి హైదరాబాద్‌లో విజయ్ ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో విజయ్ ఆమెతో తనిష్క్ బాఘ్చి మ్యూజిక్ కంపోజిషన్‌లో ప్రియ పాట పాడించాడు. అయితే తుది మిక్సింగ్ అయిపోయిన తర్వాత పాటను వినాలని షణ్ముఖకు చెప్పాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తల్లి షణ్ముకను శాలువతో సత్కరించి చీరలు, ఇతర బహుమతులు అందజేసింది. రొమాంటిక్ స్పోర్ట్స్ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మి నిర్మిస్తోంది. బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. చదవండి: ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన ముక్కు అవినాష్ -
షణ్ముఖప్రియ సుస్వరాల జల్లులో తడిసి ముద్దాయిన వైజాగ్
-
నేను పాడితే లోకమే ఆడదా.. ఉర్రూతలూగించిన షణ్ముఖప్రియ
సాక్షి,విశాఖపట్నం(మద్దిలపాలెం): ఇండియన్ ఐడల్–12 ఫైనలిస్ట్ షణ్ముఖప్రియ రాగాలాపనతో.. విశాఖ సాగరతీరం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆమె సుస్వరాల జల్లులో నగరం తడిసి ముద్దయింది. రాక్ సింగర్‌గా తనదైన శైలిలో ఇండియన్ ఐడల్ వేదికపై ఉర్రూతలూగించిన షణ్ముఖప్రియ.. విశాఖ సంగీత ప్రియులను తన గానంతో మైమరిపించింది. ఇండియన్ ఐడల్ ముగిసిన తర్వాత తొలిసారిగా ఆదివారం విశాఖ వచ్చిన ఆమెకు నగర ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా గుర్రపు బగ్గీపై ఊరేగించారు. అనంతరం సిరిపురంలోని ఫోర్ పాయింట్ హోటల్లో ఆతీ్మయ అభినందన సభ నిర్వహించారు. విబాస్ మూవీస్ ఆధ్వర్యంలో వీరుమామా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో షణ్ముఖప్రియకు నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి విశ్వగాన ప్రియ పురస్కారం ప్రదానం చేశారు. యంగ్ రాక్‌స్టార్ ఆఫ్ ఇండియాగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కల్పిస్తూ.. గిరిజన కార్పొరేషన్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి చేతులమీదుగా ధ్రువీకరణపత్రం అందజేశారు. వి.విజయకుమార్ ఆమెకు రూ.10లక్షలు విలువ చేసే ప్లాట్ పత్రాలను బహూకరించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ అతి చిన్న వయసులో షణ్ముఖప్రియ ఇండియన్ ఐడల్ వేదికగా విశాఖ నగర ఖ్యాతిని ఇనుమడింపజేసిందని కొనియాడారు. రాష్ట్ర విద్యా మౌలిక వసతుల, సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ సంగీత సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి షణ్ముఖప్రియ ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఆమె తల్లిదండ్రులు రత్నమాల, శ్రీనివాస్ మాట్లాడుతూ సొంతగడ్డపై అపూర్వ స్వాగ తం లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తన గానంతో షణ్ముఖప్రియ సంగీత ప్రియులను ఓలలాడించింది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ పాటలను ఆలపించి, అలరించింది. కార్యక్రమంలో మంత్రి రాజశేఖర్, విశాఖ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, రంజిత్, రోటరీ దొర బాబు, రత్నరాజు, వినీతలు పాల్గొన్నారు. చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌కు 9 సెంటిమెంట్ నిజమేనా? -
షణ్ముఖ ప్రియకు విశ్వ గాన ప్రియ బిరుదు
సాక్షి,విశాఖ పట్నం: ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ షణ్ముఖ ప్రియకు ఈ నెల 5వ తేదీన విశ్వ గాన ప్రియ బిరుదుతో పాటు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో యంగస్ట్ సింగర్ ఆఫ్ ఇండియా అవార్డును అందజేస్తున్నట్టు నిర్వహకుడు వీరుమామ తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేడుకులకు రాష్ట్ర మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస రావు, ఎస్.అప్పలరాజు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మేయర్ హరివెంకట కుమారి, జీవీ తదితరు పాల్గొంటారన్నారు ఆరోజు సాయంత్రం 5 గంటలకు హోటల్ ఫోర్ పాయింట్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్టు తెలిపారు. విజయ కుమార్ మాట్లాడుతూ షణ్ముఖ ప్రియకు తమ సంస్థ నుంచి పది లక్షలు విలువైన 108 గజాలు స్థలం బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. వేడుకులకు సంబంధించిన పాస్‌ల కోసం 99129 99949 నంబరుకు సంప్రదించాలన్నారు. చదవండి: బాక్సింగ్ రింగ్‌లోకి..విజయ్ దేవరకొండ -
హైదరాబాద్: ఇండియన్ ఐడల్ గాయకులతో సంగీత కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఐడిల్లో విజేతగా నిలిచిన పవన్‌దీప్ రాజన్, అదే విధంగా తెలుగమ్మాయి షణ్ముక ప్రియతోపాటు మరో ఇద్దరు గాయకులతో హైదరాబాద్‌లో తొలిసారిగా ప్రత్యక్ష సంగత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 11.2, మెటలాయిడ్ ప్రొడక్షన్స్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ సంస్థలు సిద్ధమయ్యాయి. కోవిడ్ నేపథ్యంలో దాదాపు 18నెలల సుదీర్ఘ విరామం తరువాత ప్రత్యక్ష సంగీత కచేరిలకు ఇదే తొలి వేదిక కానుంది. ఈ సందర్భంగా మెటలోయిడ్ ప్రొడక్షన్ ప్రతినిధి ప్రీతిష్ కోలాటి మాట్లాడుతూ.. ఇది రెండో దశ సంగీత వేదికగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభావంతులైన కళాకారులను ప్రేక్షకుల ముందుకు తీసుకచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ‘ఇందులో భాగంగానే కేరళకు చెందిన తైక్కుడం బ్రిడ్జ్, మసాలా కాఫీ, ఇండియన్ ఐడిల్ షోలో ఫైనలిస్టులను ఈ వేదికపైకి తీసుకొస్తున్నాం. తైక్కుడం బ్రిడ్జ్ కళాకారుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న, ఇండియన్ ఐడల్ విజేత పవన్‌దీప్ రాజన్‌తో సెప్టెంబరు 3న హార్ట్‌కప్‌లో ప్రదర్శన నిర్వహించేందుకు సిద్దమవుతున్నాం. ఈ సిరీస్‌లో దేశంలోని అత్యుత్తమమైన సంగీతకారులతోపాటు గాయకులు పాలుపంచుకొని అబిమానులను ఉర్రూతలుగించనున్నారు. సెప్టెంబర్ 2 - తైకుద్దం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ (ప్రిజం, గచ్చిబౌలి) వద్ద సెప్టెంబర్ 3 - ఇండియన్ ఐడల్ పవన్ దీప్ రాజన్ (హార్ట్ కప్ కాఫీ, గచ్చిబౌలి) సెప్టెంబర్ 23 - మసాలా కాఫీ మ్యూజిక్ బ్యాండ్ (ప్రిజం, గచ్చిబౌలి) వద్ద అక్టోబర్ 1 - ఇండియన్ ఐడల్ షణ్ముఖ ప్రియ (గ్రీజ్ మంకీ క్లబ్, జూబ్లీహిల్స్) అక్టోబర్ 2 - చిన్మయి + కాప్రిసియో అక్టోబర్ 9 - స్టాక్కాటో కాంటెంపోరే క్లాసిక్ బ్యాండ్ అక్టోబర్ 15 - శోభన (రవీంద్ర భారతి) వద్ద అక్టోబర్ 23 - ఇండియన్ ఐడల్ టాప్ 5 (హార్ట్ కప్ కాఫీ) వద్ద -
పెద్ద అచీవ్మెంట్.. మాటల్లో చెప్పలేను: షణ్ముఖప్రియ
‘ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్లు ప్రత్యేకత ఉన్న వాళ్లే. ఫైనల్లో గెలవగలిగిన టాలెంట్ అందరిలోనూ ఉంది’ ఇది షణ్ముఖ ప్రియ జవాబు. ‘ఫైనల్లో ఎవరు గెలుస్తున్నారనుకుంటున్నార’ని ఓ వారం కిందట జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు ప్రియ ఇచ్చిన ఈ సమాధానంలో ఎంతో పరిణతి ఉంది. ‘ఈ వేదిక నుంచి ఇంటికి వెళ్తూ ఏమి తీసుకెళ్లబోతున్నార’నే ప్రశ్నకు కూడా... ‘అనేక జ్ఞాపకాలను, నేర్చుకున్న పాఠాలను’ అని స్థితప్రజ్ఞతతో బదులిచ్చింది ఈ పద్దెనిమిదేళ్ల గడుసమ్మాయి. వైజాగ్‌లో పుట్టి టీవీ తెర మీద తెలుగు ప్రేక్షకుల కళ్ల ముందే పెరిగిన షణ్ముఖ ప్రియ గొంతు ప్రతి తెలుగింటిలోనూ వినిపించింది. పదమూడేళ్లుగా ప్రతి తెలుగింటికీ ఇంటి బిడ్డగా మారిపోయింది. అంతటి ప్రేమ ఆప్యాయతలను అందుకుంటోంది. ఒక ‘సారేగమప లిటిల్స్, మరో ‘పాడుతా తీయగా’, సూపర్సాంగ్స్, ద వాయిస్ ఇండియా కిడ్స్‌తో సెలయేరులా సాగిన రాగప్రవాహం ఇండియన్ ఐడల్ 12 రియాలిటీ షో వేదికను చేరింది. ఫైనల్స్‌లో ఆరవస్థానంలో నిలిచిన షణ్ముఖప్రియ ముంబయి నుంచి సాక్షితో పంచుకున్న అనుభవాలు. ఈ షో మలుపు తిప్పింది. ‘‘నాకు చిన్నప్పటి నుంచి ఇండియన్ ఐడల్‌లో పాడాలనే కోరిక ఉండేది. ఆ లక్ష్యాన్ని చేరుకున్నాను. ఫైనల్ వరకు రావడమే పెద్ద అచీవ్మెంట్. దానిని సాధించగలిగాను. సంగీతంతో మమేకమైన నా జీవితంలో ఈ షో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ షో ద్వారా నేను ఎంతమంది సంగీతప్రియుల మనసుకు దగ్గరయ్యానో మాటల్లో చెప్పలేను. ప్రతి పాటలోనూ నా వంతుగా నూటికి నూరుశాతం ఇచ్చాను. మై లెవెల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చానని చెప్పడానికి సందేహించడం లేదు. ఇక గెలుపు ఓటముల విషయం అంటారా? ఇక్కడ గెలుపును ఆన్లైన్ ఓటింగ్ కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి నా పార్టిసిపేషన్ మాత్రమే నాకు ముఖ్యం. ఫలితం మీద నాకు ఎటువంటి అసంతృప్తి లేదు. పైగా ఈ షో నా జీవితంలో గొప్ప మలుపు కాబోతోంది. జావేద్ అక్తర్‌తోపాటు అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు నన్ను ఈ షో ద్వారానే గుర్తించారు. నన్ను అంతర్జాతీయ ప్రముఖులు జస్టిన్ బీబర్, షకీరాలతో పోల్చారు. నాకది ఎంతో సంతోషంగా ఉంది. రెండు వేలుగా ఉన్న నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా రెండు లక్షల ఎనభై వేలకు చేరింది కూడా ఇప్పుడే. ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు కూడా సైన్ చేశాను. ఇరవై పాటలతో విడుదలవుతున్న ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. నేను గెలవాలని ఇంతమంది వీక్షకులు కోరుకోవడమే పెద్ద విజయం’’ అని చెప్పింది షణ్ముఖ ప్రియ. అలాగే ఈ ఇండియన్ ఐడల్ 12 రియాలిటీ షో సందర్భంగా ప్రియ మరో ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా ప్రకటించేసింది. అదేంటంటే... ‘ఇదే నా ఆఖరి రియాలిటీ షో. ఇకపై సంగీత ప్రపంచంలో నా ప్రయాణం కొత్తదారిలో సాగుతుంది’ అని చెప్పింది. – వాకా మంజులారెడ్డి -
ఇండియన్ ఐడల్ 12: షణ్ముక ప్రియకు విజయ్ సర్ప్రైజ్
సోనీ టీవీ నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ 12వ సీజన్ ఫైనలిస్టు తెలుగమ్మాయి షణ్ముక ప్రియకు హీరో విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇండియన్ ఐడల్ ఈ సీజన్లో ఆమె పైనలిస్ట్ జాబితాలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం (అగష్టు 15) ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ 12 గంటల పాటు ప్రసారం కానుంది. ఫైనల్లో షణ్ముక ప్రియ మిగతా టాప్ 5 కంటెస్టెంట్స్‌తో పోటీ పడనుంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఎపిసోడ్లో విజయ్ వీడియో ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. తన ఫేవరేట్ హీరో తనకు విషెస్ చెప్పడంతో షణ్ముక ఆనందంతో మురిసిపోయింది. షణ్ముక ఇండియన్ ఐడల్ స్టేజ్‌పై ఉండగానే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలకరించిన విజయ్ నీకు నా లవ్ అండ్ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను అని అన్నాడు. గెలుపు ఓటములు గురించి పట్టించకోవద్దని, నీ టాలెంట్‌ను పరిచయం చేస్తూ.. ఫైనల్ పోటీని ఎంజాయ్ చేయి అంటూ ధైర్యం ఇచ్చాడు. నీ జీవితానికి సరిపడే అనుభూతిని సొంతం చేసుకోమంటూ షణ్ముకకు విషెస్ తెలిపాడు. అలాగే ఈ ఫోటీలో పాల్గొంటున్న ప్రతీ కంటెస్టెంట్, వారి పేరెంట్స్‌కు, జడ్జీలకు కూడా విజయ్ ఆల్ ది బెసట్ తెలిపాడు. కాగా విజయ్ దేవరకొండకు తను పెద్ద ఫ్యాన్ అనీ, ఆయన సినిమాలో పాడటమే తన కోరిక అని గతంలో షణ్ముక షో నిర్వాహకులకు తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఇక సోనీ టీవీ నిర్వాహకులు విజయ్ను సంప్రదించి షణ్ముకకు విషెస్ తెలపాలని కోరడంతో విజయ్ ఇలా ఆమెను సర్ప్రైజ్ చేశాడు. #IdolShanmukhapriya ke super fan, superstar #VijayDevarakonda ne unhein di apni blessings! Dekhna mat bhooliyega, #IndianIdol2020 #GreatestFinaleEver kal dopahar 12 baje se raat 12 baje tak, sirf Sony par! pic.twitter.com/FztYm37Bvp — sonytv (@SonyTV) August 14, 2021 -
షణ్ముఖప్రియ మన అమ్మాయే.. ఓటేసి గెలిపించండీ ప్లీజ్!
సీతానగరం(పార్వతీపురం): సుమధుర గానంతో దేశంలోని సంగీత ప్రియులు, అభిమానులను ఉర్రూతలూగిస్తున్న గాయని, సోనీ టీవీ 12వ ఇండియన్ ఐడల్ ట్రోఫీ తుది పోటీల్లో తలపడుతున్న షణ్ముఖప్రియ మన పార్వతీపురం అమ్మాయే. ప్రాథమిక విద్యాభ్యాసంతో పాటు స్వరపదనిసలను ఇక్కడే నేర్చుకున్నారు. తన గాన మాధుర్యంతో సంగీత ప్రియులను అలరిస్తున్నారు. లిటిల్ చాంప్స్, పాడుతా తీయగా వంటి పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఈ నెల 15న జరిగే ఇండియన్ ఐడల్ ట్రోఫీ ఫైనల్ పోరులో నిలిచారు. ఓటేసి గెలిపించాలంటూ ఆమెతో పాటు అభిమానులు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. స్వర పరిచయం చేసిన పార్వతీపురం షణ్ముఖ ప్రియకు పార్వతీపురం పట్టణానికి విడదీయరాని బంధం ఉంది. ఆమె తల్లి రత్నమాల పట్టణంలోని అగ్రహారం వీధిలో జన్మించారు. వీణ వాయిద్యంలో దిట్ట. రత్నమాలకు వయోలిన్ విద్వాంసులు శ్రీనివాస్ కుమార్‌తో వివాహం జరిగింది. షణ్ముఖ ప్రియ అమ్మమ్మ పార్వతీపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలో ఉపాధ్యాయిని. తల్లిదండ్రులిద్దరూ సంగీత విద్వాంసులు కావడంతో చిన్నప్పటినుంచే షణ్ముఖప్రియ సంగీతంలో ఓనమాలు దిద్ది అంచెలంచెలుగా ఎదిగారు. ఆమె కుటుంబం కొన్నాళ్లు విశాఖపట్నంలోను, ప్రస్తుతం ముంబయిలో నివసిస్తున్నట్టు ఇక్కడి వివేకానంద కాలనీవాసులు చెబుతున్నారు. మన ఊరు అమ్మాయి గెలుపునకు సోనీలివ్, ఫస్ట్క్రైడాట్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని ఓటేయవచ్చు. -
ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్‌గా బుడ్డోడు.. ఇప్పుడు
సోషల్ మీడియా రాకతో కుగ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తమలోని కళలు, ప్రతిభను ప్రదర్శించడానికి సోషల్ మీడియా మంచి వేదికగా మారింది. సామాజిక మాధ్యమాలతో ఓవర్‌నైట్ స్టార్లుగా మారుతున్న వారిని చూస్తున్నాం. తాజాగా ఓ బుడతడు కూడా ఒక పాట పాడి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ ఒక్క పాటతో ఇప్పుడు ఏకంగా ప్రఖ్యాత పాటల షోలో ప్రత్యక్షమయ్యాడు. (చదవండి: ఆ పాట నన్ను నిద్రపోనివ్వడం లేదు.. అనుష్క శర్మ) ఆ బుడ్డోడే చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన హసదేవ్ డిర్డో. పాఠశాలలో ‘బచ్ పన్ కా ప్యార్ హై’ పాట సరదాగా పాడుతుండగా కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఒక్కసారిగా వైరల్‌గా మారి సామాన్యులతో పాటు సెలబ్రిటీల వరకు చేరింది. ఆ బుడతడి గొంతు విని అందరూ ఫిదా అయ్యారు. జూలై 3వ తేదీన విడుదలైన ఆ వీడియో ఇప్పటివరకు 9 మిలియన్లకు పైగా వ్యూవ్స్ పొందింది. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ఆ బాలుడు హసదేవ్ని ప్రశంసలతో ముంచెత్తారు. తన వద్దకు పిలిచి మరీ ‘బచ్ పన్ కా ప్యార్’ అంటూ పాట పాడించుకుని దీవించారు. అనంతరం ఆ వీడియోను సీఎం నెటిజన్లతో పంచుకున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఫిదా అయిపోయారు. ఇప్పుడు హసదేవ్ సోనీ టీవీ నిర్వహించే ఇండియన్ ఐడల్ పాటల -12 పోటీల్లో ప్రత్యక్షమయ్యాడు. ఈ విషయాన్ని ప్రముఖ నేపథ్య గాయకుడు ఆదిత్య నారాయణ్ తెలిపాడు. సహదేవ్ ఇండియన్ ఐడల్ షోలో సందడి చేస్తున్న వీడియోను ఆదిత్య షేర్ చేశాడు. ఈ సమయంలో సహదేవ్ మళ్లీ బచ్పన్ కా ప్యార్ పాట పాడుతూ కనిపించాడు. బుడ్డోడు పాట పాడుతుంటే జడ్జిలు అను మాలిక్, సోనూ కక్కర్తో పాటు పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన గాయనీగాయకులు చిందేస్తున్నారు. సహదేవ్ రాకతో సందడిగా మారింది. ప్రస్తుతం ఇండియన్ ఐడల్ పోటీలు సెమీ ఫైనల్‌కు చేరాయి. ఆగస్టు 15వ తేదీన ఫైనల్ పోటీలు జరగనున్నాయి. View this post on Instagram A post shared by Aditya Narayan (@adityanarayanofficial) View this post on Instagram A post shared by vishnu_singh91 (@only_mod031zzz) -
indian idol season 12: విజేత ఎవరు?
తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ సంగీత అభిమానులకు ఉత్కంఠనిస్తోంది. ఇండియన్ ఐడెల్ సీజన్ 12 టాప్ 6లో ఉన్న షణ్ముఖప్రియ ఆగస్టు 15న జరిగే ఫైనల్స్‌కు చేరినట్టే లెక్క. షో నిర్వాహకులు ఎలిమినేషన్స్ ఆపేసి ముగ్గురు గాయనులు, ముగ్గురు గాయకులతో ఫైనల్స్‌కు వెళ్లనున్నారని సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటివరకూ ఇండియన్ ఐడెల్‌ను ముగ్గురు స్త్రీలు గెలిచారు. ఈసారి ఫైనల్స్‌కు వెళుతున్న ముగ్గురిలో ఒకరు నాలుగోసారి టైటిల్ గెలుస్తారా? ఇంటర్ పాసైన షణ్ముఖ ప్రియ సంగీత ప్రియుల రివార్డులను డిగ్రీలుగా లెక్క వేస్తే చాలా డిగ్రీలు పాసైనట్టే లెక్క. వైజాగ్ మధురవాడలో నివాసం ఉండే తల్లిదండ్రులు శ్రీనివాస కుమార్, రత్నమాలల ఏకైక కూతురు షణ్ముఖ ప్రియ బహు భాషలలో చిన్నప్పటి నుంచి పాడటం ప్రాక్టీసు చేసింది. టీవీ షోస్‌లో పాల్గొని లెక్కకు మించి ప్రైజులు కొట్టింది. కాని అవన్నీ ఒకెత్తు. ఇప్పుడు ఇండియన్ ఐడెల్‌లో పాల్గొనడం ఒకెత్తు. ఒక్కసారి ఇండియన్ ఐడెల్ వేదికనెక్కితే దాదాపుగా భారతీయులు నివసించే అన్నీ దేశాలకు ఆ గాయకులు తెలిసి పోతారు. అంత పెద్ద వేదిక అది. భారీ కాంపిటీషన్‌ను ఎదుర్కొని పోటీలోకొచ్చిన షణ్ముఖ ప్రియ, ఆమెతో పాటు టాప్ సిక్స్‌లో నిలిచిన మరో ఇద్దరు గాయనులు అరుణిమ, సాయిలీ మేల్ సింగర్స్ పవన్‌దీప్, మహమ్మద్ దానిష్, నిహాల్ తౌరోకు గట్టి పోటీ ఇస్తున్నారు. సవాళ్లను ఎదుర్కొన్న షో నవంబర్ 28, 2020న సోనీ టీవీలో ఇండియన్ ఐడెల్ సీజన్ 12 అనేక వడపోతల తర్వాత మిగిలిన 15 మంది కంటెస్టెంట్లతో మొదలైంది. సాధారణంగా ఆరు నెలల్లో ముగిసే ఈ షో లాక్డౌన్ కారణాల రీత్యా, బయట మరో వినోదం లేకపోవడం వల్ల మరో మూడు నెలలు పొడిగింప బడింది. మధ్యలో గాయనీ గాయకులు కరోనా బారిన పడినా, షూటింగ్ లొకేషన్ ‘డమన్’ (గోవా) కు షిఫ్ట్ అవడం వల్ల జడ్జిలు మారినా ఒక్క వారం కూడా నాగా లేకుండా కొనసాగింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన గాయనీ గాయకుల్లో తెలుగు నుంచి శిరీష భాగవతుల, షణ్ముఖ ప్రియ గట్టి పోటీని ఇచ్చారు. శిరీష 11వ కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ కాగా షణ్ముఖప్రియ టాప్ 6లో చేరింది. యోడలింగ్ క్వీన్ యోడలింగ్ చేయడంలో గాయకుడు కిశోర్ కుమార్ దిట్ట. యోడలింగ్ను గాయనులు చేయరు. అందుకు గొంతు అంతగా వీలు కాదు. కాని షణ్ముఖప్రియ యోడలింగ్లో మహామహులు దిగ్భ్రమ చెందే ప్రతిభను వ్యక్త పరిచింది. యోడలింగ్ చేస్తూ కిశోర్ కుమార్ పాడిన హిట్ సాంగ్ ‘మై హూ ఝుమ్ఝుమ్ ఝుమ్రు’ పాటను షణ్ముఖప్రియ అద్భుతంగా పాడి అందరినీ ఆకట్టుకుంది. షోకు గెస్ట్లుగా హాజరైన ఏ.ఆర్. రహమాన్, ఉదిత్ నారాయణ్, ఆశా భోంస్లే లాంటి పెద్దలు ఎందరో షణ్ముఖప్రియను అభినందించారు. స్టేజ్ మీదే సినిమా ఆఫర్లు కూడా ఇచ్చారు. అయితే అంతమాత్రాన ఆమెకు పోటీ లేదని కాదు. ఉంది. పవన్‌దీప్ మహమ్మద్ దానిష్ నిహాల్ తౌరో బెంగాల్, మహారాష్ట్రల పోటీ షణ్ముఖ ప్రియకు బెంగాల్ గాయని అరుణిమ, ముంబై గాయని సాయిలీ సమవుజ్జీలుగా ఉన్నారు. ముఖ్యంగా అరుణిమ దాదాపు లతా వారసురాలిగా పాడుతూ ఓట్లు పొందుతోంది. మరోవైపు సాయిలీ స్పీడ్, స్లో పాటలు కూడా ప్రతిభావంతంగా పాడుతూ అభిమానులను సంపాదించుకుంది. ముగ్గురూ ముగ్గురేగా వేదికపై సవాలు విసురుతుండటంతో జడ్జీలు ఎవరిని ఎలిమినేట్ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మన షణ్ముఖ ప్రియకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగువారి నుంచి ఓట్ల మద్దతు రావాల్సి ఉంది. 12 గంటల పాటు ఫైనల్స్ ఆగస్టు 15న కనీవినీ ఎరగని స్థాయిలో 12 గంటల పాటు ఇండియన్ ఐడెల్ ఫైనల్స్ జరగనున్నాయి. అతిరథ మహారథులు ఈ ఫైనల్స్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. ఆ వేదిక మీదనే ఈ ఆరు మంది ఫైనలిస్ట్‌లు ప్రతిభ చూపుతారు. లోకమంతా ఈ వేడుక వీక్షించనుంది. విజేతలకు 25 లక్షల నగదు బహుమతి ఉంటుంది. తెలుగు నుంచి గతంలో శ్రీరామచంద్ర ఈ టైటిల్ మొదటగా సాధించి తెలుగు ప్రతిభను చాటాడు. షణ్ముఖప్రియది తర్వాతి పేరు కావాలని ఆశిద్దాం. మగవారూ తక్కువ కాదు ఈసారి ఇండియన్ ఐడెల్ కిరీటాన్ని తన్నుకుపోతాడని అందరూ ఊహిస్తున్న పేరు ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్ దీప్ది. ఇతను పాడటమే కాదు సకల వాద్యాలు వాయిస్తూ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇతనికి ముంబై సెలబ్రిటీలందరూ ఫిదా అయిపోయారు. ఉత్తరాఖండ్ ఆహార్యంలో వినమ్రంగా కనిపించే పవన్ దీప్ పాటలో సోల్ ఉంటుంది. ఆ సోల్ అతనికి కిరీటం తెచ్చి పెట్టవచ్చని ఒక అంచనా. ఇతను కాకుండా ముజఫర్ నగర్‌కు చెందిన మహమ్మద్ దానిష్, మంగళూరుకు చెందిన నిహాల్ తోరో గట్టి ప్రతిభను చూపుతున్నారు. -
షాకింగ్ ఘటన: స్టేజ్‌పై ఉన్నట్టుండి పాడటం ఆపేసిన సింగర్
కొత్త గొంతుకలను వెలుగులోకి తీసుకొచ్చే షో ఇండియన్ ఐడల్. ఈ ప్రఖ్యాత పాటల పోటీల్లో పాల్గొన్న వారు భావి గాయకులుగా మారి సంగీతప్రియుల మది దోచుకుంటున్నారు. మన తెలుగు సినీ గాయకుడు రేవంత్ కూడా ఆ కోవకు చెందిన వాడే. తాజాగా హిందీ ఇండియన్ ఐడల్ 12వ సీజన్ కొనసాగుతోంది. ఈ పోటీల్లో తన పాటలతో మెస్మరైజ్ చేస్తున్న పవన్‌దీప్ రాజన్ అనూహ్యంగా ప్రేక్షకులతో పాటు జడ్జిలను షాక్‌కు గురి చేశాడు. తన్మయత్వంతో పాట పాడుతుండగా అందరూ మరో లోకంలో తేలుతున్న సమయంలో హఠాత్తుగా పవన్‌దీప్ అర్ధాంతరంగా పాట ఆపేసి.. ఇక చాలు అని వెళ్లిపోయాడు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను సోనీ టీవీ విడుదల చేసింది. పవన్‌దీప్ ‘హోతన్ సే చులో తుమ్’ పాట పాడుతూ అకస్మాత్తుగా ఆపేశాడు. అంతసేపు ఆసక్తిగా వింటున్న జడ్జిలు ఒకప్పటి నటీనటులు ధర్మేంద, అనితా రాజ్ పాట ఆగిపోవడంతో జడ్జిలు, తోటి పోటీదారులు షాకయ్యారు. మైక్ ఆపేసి వెళ్తున్న పవన్‌దీప్‌ను మరో పార్టిస్పెంట్ నిలువరించి పాటను గుర్తు చేసే ప్రయత్నం చేసింది. ప్రేమ్‌గీత్ సినిమాలో ఆ పాటను గజల్ కింగ్ జగ్జీత్ సింగ్ పాడారు. ఆయనను మరిపించేలా పాడుతున్న పవన్‌దీప్ ఇలా చేయడంతో ప్రేక్షకులు కూడా నోరెళ్లబెట్టారు. ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్ దీప్ సీజన్ మొదటి నుంచి ప్రేక్షకులను తన పాటలతో రంజింపజేస్తున్నారు. అతడి మధురమైన గాత్రానికి సోషల్ మీడియా ఫిదా అవుతోంది. ఇండియన్ ఐడల్ 12వ విజేతగా పవన్‌దీప్ రాజన్ నిలిచే అవకాశాలు ఉన్నాయి. అలాంటి రాజన్ అకస్మాత్తుగా ఇలా చేయడంతో షోలో అతడిపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న పవన్‌దీప్ గతంలో కరోనా బారినపడ్డాడు. దీంతో పవన్‌దీప్ వర్చువల్‌గా ఇండియన్ ఐడల్ పోటీల్లో పాల్గొని వార్తల్లో నిలిచాడు. #IdolPawandeep ki iss performance se kya rang layega iss shaam ka mausam? Dekhiye #DharmendraAndAnitaRajSpecial #IndianIdol2020 aaj raat 9:30 baje, sirf Sony par! pic.twitter.com/YxptSJS1QO — sonytv (@SonyTV) July 18, 2021 -
బెదిరింపులు రావడంతో చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన యాంకర్
ఇండియన్ ఐడల్ 12వ సీజన్ మరో వివాదంలో చిక్కుకుంది. గత వారం జరిగిన ఎపిసోడ్లో హోస్ట్ ఆదిత్య నారయణ్ తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎపిసోడ్లో మ్యూజిక్ డైరెక్టర్ శ్రవన్ రాథోడ్‌కు నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సన్నిహితులు, ప్రముఖ గాయకులు అమిత్ కుమార్ సను, అనురాధ పౌడ్వాల్, రూప్ కుమార్ రాథోడ్ ఈ షోకు అతిథులుగా హజరయ్యారు. ఈ నేపథ్యంలో హోస్ట్ ఆదిత్య, కుమార్ సనుతో నిజంగానే మీరు కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ నచ్చి వారిని ప్రశంసించారా, లేక షో మేకర్స్ చెప్తే చేశారా అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక ఇదే ఎపిసోడ్లో కంటెస్టెంట్ సవాయ్ భట్, అంజలి గైక్వాడ్‌తో కలిసి ఓ సూపర్ హిట్ పాటను పాడి వినిపించారు. వీళ్ల పర్ఫార్మెన్స్ పూర్తయ్యాక సవాయ్ భట్‌కు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని గెస్ట్ ఒకరు ప్రశ్నించగా లేదు లేదు అని సవాయ్ భట్ సమాధానం చెప్పాడు. అయితే మరో కంటెస్టెంట్ మాత్రం సవావ్ భట్‌కు జపనీస్ గర్ల్‌ఫ్రెండ్ ఉందని, ఆమెతో తరుచూ వీడియో కాల్స్‌లో మాట్లాడుతుంటాడని చెప్పడంతో షోలో నవ్వులు పూశాయి. ఇదే విషయంపై యాంకర్ ఆదిత్య నారాయణ్.. ఎవరా జపనీస్ గర్ల్‌ఫ్రెండ్ అని ప్రశ్నించగా సవాయ్ భట్ అదేం లేదు అని దాటవేసే ప్రయత్నం చేయడంతో..నువ్వు ఏం చెబితే అది గుడ్డిగా నమ్మడానికి మేము అలీభగ్ నుంచి ఏం రాలేదు అంటూ ఫన్నీగా ఆటపట్టించాడు. అయితే ఇప్పుడు ఈ కామెంట్స్ ఆదిత్య మెడకు చెట్టుకున్నాయి. మహారాష్ట్రలోని అలీభగ్ ప్రజలను అవమానించేలా ఆదిత్య వ్యాఖ్యలు ఉన్నాయని మహారాష్ట్ర నవనిర్మాన్ సేన (ఎంఎన్ఎస్) మండిపడింది. వెంటనే అలీభగ్ ప్రాంత ప్రజలకు క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. దీంతో ఆదిత్య నారాయణ తన తప్పును తెలుసుకొని క్షమాపణలు చెప్పాడు. 'రెండు చేతులు జోడించి వినయపూర్వకంగా మీకు క్షమాపణలు చెబుతున్నాను. ఎవరినీ బాధపెట్టాలన్నది నా ఉద్ధేశం కానే కాదు. అలీభగ్ ప్రజలపై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. నేను అన్న మాటలు మిమ్మల్ని బాధించి ఉంటే మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను' అని పేర్కొన్నారు. చదవండి : ఇండియన్ ఐడల్ 12: హోస్ట్ ఆదిత్య నారాయణ తీరుపై నెటిజన్లు ఫైర్ ‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’.. రేఖ ఆన్సర్ -
ఇండియన్ ఐడల్ 12: హోస్ట్ ఆదిత్య నారాయణ తీరుపై నెటిజన్లు ఫైర్
ఇండియల్ ఐడల్ 12 షోలో గత వారం సింగర్, టీవీ హోస్ట్ ఆదిత్య నారాయణ తీరుపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆదిత్య ఇండియన్ ఐడల్ 12కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎపిసోడ్లో అతడు సింగర్ కుమార్ సనుతో చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆదిత్యను ట్రోల్ చేస్తున్నారు. గత వారం జరిగిన ఎపిసోడ్లో ఇటీవల మృతి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రవన్ రాథోడ్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సన్నిహితులు, ప్రముఖ గాయకులు కుమార్ సను, అనురాధ పౌడ్వాల్, రూప్ కుమార్ రాథోడ్ ఈ షోకు అతిథులుగా హజరయ్యారు. ఈ నేపథ్యంలో హోస్ట్ ఆదిత్య, కుమార్ సనుతో నిజంగానే మీరు కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ నచ్చి వారిని ప్రశంసించారా, లేక షో మేకర్స్ చెప్తే చేశారా అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. వెంటనే ఆదిత్య సింగర్ సను ‘వాళ్లు నిజంగానే మంచి గాయకులు. కంటెస్టెంట్స్ అంత అద్భుతమైన పాటగాళ్లు. ఒక రీయాలిటి షోలో ఇంతమంది ప్రతిభవంతులైన సింగర్స్‌ను ఇంతవరకు నేనేప్పుడు చూడలేదు. ఇప్పటికిప్పుడు వీరంత ప్లేబ్యాక్ సింగర్స్ కావోచ్చు. ఒక్కొక్కరు ఒక్క రత్నం’ అంటూ ఆయన కంటెస్టెంట్స్‌ను కొనియాడారు. అనంతరం ఆదిత్య వ్యాఖ్యలను తప్పు బడుతూ ‘ఎంతో మంది గెస్టులను ఈ షోకు ఆహ్వానించిన ఆదిత్య తీరు బాధాకరం, ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు గాయకులు అర్జీత్ సింగ్, ఆర్మాన్ మాలిక్‌లు ఈ స్టేజ్ ద్వారానే ప్రపంచానికి పరిచయమయ్యారనే విషయం అతడు గుర్తుపెట్టుకోవాలి’ అంటూ సోని వారు ఈ వీడియోను షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఆదిత్యను ‘షో నుంచి తీసేయండి’, ‘అతడు లెజండరీ సింగర్స్‌ను అవమానించాడు’, ఆదిత్య అమిత్ కుమార్ వ్యాఖలతో ఇలా వ్యవహరించడం సరికాదు’ అంటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా గత ఎపిసోడ్లో కిషోర్ కుమార్, ఆయన తనయుడు అమిత్ కుమార్ అతిథులగా వచ్చారు.ఈ షో చివరలో సింగర్ అమిత్ కుమార్ మాట్లాడుతూ.. తనకు కంటెస్టంట్స్ పర్ఫామెన్స్ నచ్చిన నచ్చకపోయిన వారిని ప్రశంసించమని షో నిర్వహకులు కోరారని, వారి పాటలు నచ్చకపోతే ఎలా పాజిటివ్ కామెంట్స్ ఇస్తామని ఆయన మండిపడిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
‘మా ఇద్దరిని కలపడానికి ఓ గదిలో పెట్టి తాళం వేశారు’
అందాల తార శ్రీదేవి బాల నటిగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఇండియాలోనే టాప్ హీరోయిన్గా నిలిచారు. అప్పటికే టాలీవుడ్లో టాప్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న జయప్రద, జయసుధలకు.. అటు బాలీవుడ్లో మాధురీ దీక్షిత్‌కు గట్టి పోటీ ఇచ్చారు శ్రీదేవి. ఆ తర్వాత ఆమె ఇండియాలోనే నంబర్ వన్ హీరోయిన్గా ఎదిగారు. ఇక శ్రీదేవికి, జయప్రదకు మధ్య ఉన్న కోల్డ్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మర్యాదపూర్వకంగా పలకరించుకోవడం కానీ.. కనీసం ఒకరిని ఒకరు చూసుకోవడం కానీ చేసేవారు కాదు. ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఎందరో ప్రయత్నించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. తాజాగా వీరిద్దరి మధ్య నడిచిన కోల్డ్ వార్‌కు సంబంధించిన విశేషాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. ఈ సారి ఏకంగా జయప్రదనే దీనిపై స్పందించారు. ఇండియన్ ఐడల్ 12కు గెస్ట్‌గా వచ్చారు జయప్రద. ఈ వేదిక మీద ఆమె తనకు, శ్రీదేవికి మధ్య నడిచిన కోల్డ్ వార్‌ను మరోసారి గుర్తు చేసుకున్నారు. జయప్రద మాట్లాడుతూ.. ‘‘ఇలా చెప్పడానికి నేనేం బాధపడటం లేదు. అలా అని మేం ఇద్దరం ఎప్పుడైనా గొడవ పడ్డామా అంటే అది లేదు. కాకపోతే మా ఇద్దరి మధ్య కెమస్ట్రీ మ్యాచ్ కాలేదు. పైగా అప్పటికే మేం ఇద్దరం టాప్ హీరోయిన్లం. నేనేందుకు తగ్గాలంటే.. నేనేందుకు తగ్గాలి అని ఇద్దరం ఫీల్ అయ్యే వాళ్లం. ఎలా ఉండేవాళ్లం అంటే మా ఇద్దరి మధ్య ఐ కాంటాక్ట్ కూడా ఉండేది కాదు’’ అంటూ గుర్తు చేసుకున్నారు. ‘‘ఇక ప్రతి విషయంలో మేం ఒకరి మీద ఒకరం పోటీ పడుతుండేవాళ్లం. డ్రెస్సులు, డ్యాన్స్‌లు ఇలా అన్ని విషయాల్లో ఒకరిపై ఒకరం పై చేయి సాధించాలని ట్రై చేసే వాళ్లం. తెర మీద మంచి అక్కాచెల్లళ్లలా కనిపించినప్పటికి.. వాస్తవంగా కనీసం పరిచయం ఉన్నవారిలా కూడా ఉండేవాళ్లం కాదు. మేం ఇద్దరం ఎదురుపడిన ప్రతిసారి దర్శకులు, తోటి నటులు మమ్మల్ని ఒకరిని ఒకరికి పరిచయం చేసేవారు. అప్పుడు మాత్రం హలో అని పలకరించుకుని ముందుకు వెళ్లిపోయేవాళ్లం’’ అంటూ చెప్పుకొచ్చారు జయప్రద. ఇక తమ ఇద్దరిని కలపడానికి చాలా మంది ప్రయత్నించారని.. వారిలో రాజేశ్ కుమార్, జితేంద్ర ఖన్నా కూడా ఉన్నారని గుర్తు చేసుకున్నారు జయప్రద. ‘‘ఒకసారి షూటింగ్ లంచ్ టైంలో రాజేశ్ కుమార్, జితేంద్ర మా ఇద్దరిని ఒకే రూమ్‌లో పెట్టి తాళం వేశారు. దాదాపు గంటసేపు అలానే ఉంచారు. అలా అయినా మేం ఒకరితో ఒకరం మాట్లాడుకుంటామని భావించారు. గంట తర్వాత తలుపు తీసి చూస్తే.. మేం ఇద్దరం ఆ పక్క ఒకరం.. ఈ పక్క ఒకరం కూర్చుని ఉన్నాం. ఆ తర్వాత ఇద్దరం బయటకు వెళ్లిపోయాం’’ అని చెప్పుకొచ్చారు జయప్రద. చదవండి: 'అమ్మాయ్... చింపి.. చింపి.. చంపి పడేశావ్' ఆ నటి గొంతు నాకన్నా ఘోరంగా ఉంది -
ఇండియన్ ఐడల్ పాపులర్ కంటెస్టెంట్‌కు కరోనా
ముంబై : దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. అన్ని రంగాలనూ కోవిడ్ కుదిపేస్తుంది. మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రియాలిటీ షో ఇండియన్ ఐడల్‌కు సైతం కరోనా వ్యాపించింది. ఇది వరకే ఈ షో యాంకర్ ఆదిత్య నారాయణ్‌కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోలోని పాపులర్ కంటెస్టెంట్ పవన్‌దీప్ రాజన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే అతన్ని ముంబైలోని ఓ హోటల్ రూంలో క్వారంటైన్లో ఉంచారు. ఈ వారం ప్రసారం కావాల్సిన ఇండియన్ ఐడల్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆనంద్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. అయితే కరోనా కారణంగా పవన్‌దీప్ షోకు హాజరు కాలేదు. దీంతో వీడియో కాల్ ద్వారా తనకు పాడేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా షో జడ్జెస్‌ని అడగ్గా..దీనికి వారు వెంటనే అంగీకరించారు. దీనికి సంబంధించిన ప్రోమోను సోనీ టీవీ రిలీజ్ చేసింది. మరి వర్చువల్‌గా పవన్‌దీప్ పర్మార్మెన్స్ ఎలా ఉందన్నది ఈవారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్లో చూడాల్సి ఉంది. ఇక ఇండియన్ ఐడల్‌తో ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌దీప్ ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టాప్9లో కొనసాగుతున్నాడు. పవన్‌దీప్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఈ షోలోని మిగతా కంటెస్టెంట్లు, యూనిట్ సిబ్బందికి సైతం కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే వీరి టెస్ట్ రిపోర్ట్ ఇంకా తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) చదవండి : ఇండియన్ ఐడల్ : యాంకర్ మారడానికి కారణం అదేనా? ‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’.. రేఖ ఆన్సర్ -
'అమ్మాయ్... చింపి.. చింపి.. చంపి పడేశావ్'
రాబోయ్ ఇండియన్ ఐడెల్‌లో ఆమె పాట కు ఏ.ఆర్.రెహమాన్ పియానో వాయించాడు. గత వారం ‘ఇండియన్ ఐడెల్’ ఎపిసోడ్లో రేఖ పాల్గొని మన వైజాగ్ అమ్మాయి షణ్ముఖ ప్రియ పాట తర్వాత తెలుగులో ‘అమ్మాయ్... చింపి.. చింపి.. చింపి.. చంపి పడేశావ్’ అని పొగడ్తలతో ముంచెత్తింది. ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏకంగా ఏ.ఆర్.రెహమాన్ షణ్ముఖ ప్రియ పాడుతుంటే పియానో వాయించాడు. ఈ వారం ప్రసారం కావాల్సిన ఇండియన్ ఐడెల్‌లో రెహమాన్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. షణ్ముఖ ప్రియ స్టేజ్ మీదకొచ్చి ‘ఉడి ఉడి’ (సఖి), ముకాబలా (ప్రేమికుడు) హిందీ వెర్షన్లు పాడింది. రెహమాన్ ఆ పాటలకు స్టాడింగ్ ఒవేషన్ ఇచ్చాడు. అంతే కాదు ఉడి ఉడిని మళ్లీ పాడించి దానికి తానే స్వయంగా పియానో వాయించాడు. ‘ఇంతకు మించి ఏం కావాలి’ అని షణ్ముఖప్రియ తబ్బిబ్బవుతోంది. మొత్తానికి షణ్ముఖ ప్రియ పాట విరిగి నేతిలో పడ్డట్టుగానే ఉంది. ఇండియన్ ఐడెల్ ప్రారంభమైనప్పటి నుంచి సెలబ్రిటీల ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్న షణ్ముఖ ప్రియ ప్రస్తుతం టాప్ 9లో ఉంది. ఆమె టాప్ 5లో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. -
ఆ దర్శకుడి గరించి ఆసక్తికర విషయం చెప్పిన రేఖ
ఇండియన్ ఐడెల్ సీజన్ 12లో మొన్నటి శని, ఆదివారాల ఎపిసోడ్లను ప్రముఖ నటి రేఖ పేరిట డెడికేట్ చేశారు. ఈ షో అతిథిగా పాల్గొన్నా ఆమె తన పాటలు కంటెస్టెంట్లు పాడుతూ ఉంటే ఎంతో ఎంజాయ్ చేశారు. ఆ సినిమా, పాటల చిత్రీకరణ సమయంలోని అనుభవనాలను ఈ సందర్భంగా ఆమె పంచుకున్నారు. ఒక కంటెస్టెంట్ ‘ఉమ్రావ్ జాన్’లోని ‘ఏ క్యా జగా హై దోస్తో’ పాడుతూ ఉంటే ఆ పాట వెనుక కథ ఇలా వివరించారు. ‘పాటల్లో అభినయం తాను ప్రత్యేకంగా నేర్చుకోలేదని... లతా మంగేష్కర్, ఆశా భోంస్లే పాడేది వింటే ఎక్స్ప్రెషన్స్ వాటికవి వచ్చేస్తాయి’ అని ఆమె అన్నారు. గట్టి చలికాలంలో లక్నోలో ‘ఉమ్రాన్ జాన్’ చేస్తున్నప్పుడు ‘ఏ క్యా జగా హై దోస్తో’ పాట చిత్రీకరణకు గ్లిజరిన్ కంట్లో పెట్టుకుంటే అది గడ్డ కట్టిందా అనిపించిందని ఆమె అన్నారు. షాట్ ప్రకారం చెమర్చిన కళ్లతో పాడాల్సి ఉన్నా చలి వల్ల గ్లిజరిన్ పని చేయక కన్నీరు రాలేదని, కాని ఒక్కసారి నగారాలో పాట మొదలయ్యాక ఆశాభోంస్లే పాటకు హృదయం ద్రవించి కన్నీరు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ గురించి కూడా ఆమె ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.‘ఆయన కాస్ట్యూమ్స్‌కు ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టేవాడు కాదు. ‘ఖూబ్సూరత్’లో నేను నటించేటప్పుడు అది గమనించి ఇంటి దగ్గరి నుంచి మంచి మంచి డ్రస్సులు వేసుకొని వచ్చేదాన్ని. వాటిని ఆయన చూసి ఇవే బాగున్నాయి... వీటిలోనే నటించు అనేవాడు’ అని ఆమె గుర్తు చేసుకుంది. రేఖకు ఇప్పుడు 67 సంవత్సరాలు. కాని రెండు ఎపిసోడ్లలో ఆమె అద్భుతంగా డాన్సు చేసి ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. డోలక్ వాయిస్తున్నట్టు అభినయించింది. రేఖా ఎప్పటికీ రేఖానే అనిపించింది. -
ఇండియన్ ఐడల్ : యాంకర్ మారడానికి కారణం అదేనా?
ముంబై : ఇండియన్ ఐడల్ రియాలిటీ షో దేశ వ్యాప్తుంగా ఎంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్ ఐడల్ సీజన్ 12 నిర్విరామంగా కొనసాగుతుంది. నిన్నటి షోలో ముఖ్య అతిధిగా బాలీవుడ్ అందాల తార రేఖ వచ్చారు. తన ఎనర్జీతో షో ఆద్యంతం చిరునవ్వులు చిందిస్తూ.. సందడి చేశారు. అయితే ఈ షోకు మొదటి నుంచి ఆదిత్య నారాయణ్ యాంకర్‌గా ఉన్నారు. అలాంటిది సడెన్‌గా ఆదిత్య నారాయణ్ స్థానంలో జయ్ భానుశాలి కనిపించారు. దీంతో అసలు ఆదిత్య నారాయణ్‌ను ఏమైంది? సడెన్‌గా హోస్ట్‌ను ఎందుకు మార్చారు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆదిత్యను ఎవరూ రీప్లేస్ చేయడం లేదని, కేవలం కొన్ని రోజులకు మాత్రమే ఆయన స్థానంలో జయ్ భానుశాలి ఉంటారని తెలుస్తుంది. ఈ మార్పులన్నింటికీ కారణం కరోనా వైరస్ అని తేలింది. ప్రస్తుతం మహారాష్ట్రలో కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా యాంకర్ ఆదిత్య నారాయన్‌కు సైతం కరోనా సోకింది. దీంతో తాత్కాలికంగా ఈ షో నుంచి తప్పుకున్నారు. ఆదిత్య నారాయణ్‌తో పాటు ఆయన భార్య శ్వేతా అగర్వాల్‌కు కరోనా పాజిటివ్ అని తేలిందని స్వయంగా ఆదిత్య నారయణ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో ప్రేమ పెళ్లి చేసుకున్న వీరు..ప్రస్తుతం కరోనా కారణంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ కొత్త దంపతుతు త్వరగా కోలుకోవాలని కోరుతూ పలువురు నెటిజన్లు సహా ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ జడ్జిలో ఒకరైన నేహా కక్కర్ సైతం కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Aditya Narayan (@adityanarayanofficial) చదవండి: ‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’.. రేఖ ఆన్సర్ భార్యను ఏడిపించిన సింగర్ -
‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’.. రేఖ ఆన్సర్
బాలీవుడ్ అందాల నటి రేఖకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరికి వయసు పెరుగుతుంటే.. రేఖ విషయంలో మాత్రం అది యుక్త వయసులోనే ఆగిపోయింది. తన అందంతో ఎందరినో పిచ్చి వాళ్లని చేసిన రేఖ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఇక రేఖ-అమితాబ్ బచ్చన్ల ప్రేమ గురించి ప్రపంచానికంతా తెలుసు. ఒకానొక దశలో వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు ప్రచారం అయ్యాయి. అప్పటికే అమితాబ్ బచ్చన్‌కు జయతో వివాహం అయ్యింది. ఆ తర్వాత రేఖ.. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ముఖేష్‌ను వివాహం చేసుకున్నారు. అయితే అది కూడా ఎక్కువ కాలం సాగలేదు. పెళ్లైన ఏడు నెలలకే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు కూడా అందరూ రేఖనే అనుమానించారు. ఇక వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న రేఖ.. బయటకు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ.. సందడి చేస్తూ కనిపిస్తారు. తాజాగా శనివారం నాటి ఇండియన్ ఐడల్ సీజన్ 12లో ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రేఖ.. సెట్స్‌పై సందడి చేశారు. షణ్మఖప్రియ పాడిన పాటకు డ్యాన్స్ కూడా చేశారు. ఇక నిన్నటి షోలో యాంకర్ ఆదిత్య నారాయణ్ స్థానంలో వచ్చిన జయ్ భానుశాలి ఓ కంటెస్టెంట్‌ని ఉద్దేశించి.. ‘‘రేఖాజీ, నేహు(నేహా కక్కర్) ఒక స్త్రీ.. మగాడి కోసం.. అది కూడా పెళ్లైన వాడి కోసం పిచ్చిదానిలా వెంట పడటం ఎక్కడైనా చూశారా’’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు రేఖ వెంటనే ‘‘నన్ను అడగండి’’ అంటారు. ఆమె సమాధానంతో షాక్ తిన్న యాంకర్ రేఖ వైపు చూడగానే ‘‘నేనేం చెప్పలేదు’’ అంటూ దాటవేస్తారు. అందుకు జయ్.. వావ్.. మీరు సిక్సర్ బాదారు అని ప్రశంసిస్తాడు. ఇక రేఖ మాటలకు అక్కడున్న వారంతా పడి పడి నవ్వుతారు. లేచి నిల్చుని చప్పట్లతో ప్రశంసిస్తారు. ఇక నిన్నటి షోలో రేఖ ఇండియన్ ఐడల్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న నేహా కక్కర్‌కి కాంజీవరం పట్టు చీర బహుకరించారు. అలానే మరో జడ్జి విశాల్ దల్దాని గుండు మీద సరదగా తబాలా వాయించారు. శనివారం నాటి ఏపిసోడ్‌లో రేఖ తన చిలిపి చేష్టలతో కంటెస్టెంట్లు, ప్రేక్షకులు హృదయాలను గెలిచారు. చదవండి: సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇలానే.. తెలుగు లేడీ కిశోర్ కుమార్ -
ఆ నటి గొంతు నాకన్నా ఘోరంగా ఉంది
జితేంద్ర అసలు పేరు రవికపూర్. కాని సినిమాల్లో రవీంద్ర కపూర్ అనే నటుడు ఉండటంతో తన పేరును జతేంద్ర అని మార్చుకున్నాడు. దాంతో జతిన్ ఖన్నాగా అసలు పేరు కలిగిన రాజేష్ ఖన్నా జితేంద్రకు దగ్గరగా ఉండే తన పేరు కాదని రాజేష్ ఖన్నా అని మార్చుకోవాల్సి వచ్చింది. రవికపూర్ (ఆర్.కె) అలా జితేంద్ర కపూర్ (జె.కె) అయితే జతిన్ ఖన్నా (జె.కె) పేరు మార్చుకుని రాజేష్ ఖన్నా (ఆర్.కె) అయ్యాడు. ఈ తారుమార్ల సంగతి ఇండియన్ ఐడెల్ తాజా ఎపిసోడ్లో ప్రేక్షకులతో పంచుకున్నారు జితేంద్ర. మార్చి 14న టెలికాస్ట్ అయిన ఇండియన్ ఐడెల్ ‘జితేంద్ర స్పెషల్’లో పాల్గొన్న ఆయన ముంబైలో ‘చాల్’లో తన 20వ ఏట వరకూ జీవించానని చెప్పారు. దాని వల్ల తాను పంజాబీ అయినా మరాఠి చాలా బాగా నేర్చుకోగలిగానని చెప్పారు. ‘మా ఇంట్లో మొదటిసారి ఫ్యాన్ బిగిస్తే దానిని చూడటానికి చాల్లో ఉన్న 60 ఇళ్ల వాళ్లూ వచ్చారు. అదో వింత. ట్యూబ్‌లైట్ బిగించినా వారికి వింతే. గణపతి పూజను కులమతాలకు అతీతంగా చేసేవారం. ఆ రోజులు మళ్లీ రావు’ అన్నాడాయన.‘నాకు జీవితంలో రెండు కోరికలు ఉన్నాయి. కలలు అనొచ్చు. ఒకటి ఇండియా బ్యాంటింగ్‌లో ఆరు వికెట్లు కోల్పోయినప్పుడు నేను బ్యాటింగ్‌కు వెళ్లి ఇండియాను గెలిపించడం. రెండు... మంచి గాయకుణ్ణి కావడం. కాని నా గొంతు చాలా చెడ్డగా ఉంటుంది. పాటల చిత్రీకరణలో నేను పెద్దపెద్దగా పాడుతూ యాక్ట్ చేస్తాను. కాని సౌండ్‌లో నా కఠినమైన గొంతు ఎవరికీ వినిపించేది కాదు. ఒకసారి ఇలాగే షాట్లో పెద్ద పెద్దగా పాడుతూ నటిస్తున్నాను. ఇంతలో ఏదో వైర్ తెగి పాట ఆగిపోయింది. నా గొంతు మాత్రం అసహ్యంగా అందరికీ వినిపించింది. అయితే కొంతలో కొంత మేలు ఏమిటంటే నాతో పాటు నటిస్తున్న ఆశా పరేఖ్ కూడా నాలాగే పెద్దగా పాడుతూ యాక్ట్ చేస్తోంది. ఆమె గొంతు నాకన్నా ఘోరంగా ఉంది’ అని నవ్వించారాయన. జితేంద్ర వయసు ఇప్పుడు 78 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఆయన చలాకీగా స్టెప్పులేయడం విశేషం. -
శిరీష భవిష్యత్తు గానమయంగా సాగిపోవాలి..
ఇండియన్ ఐడెల్‌లో తెలుగువారి ప్రతిభ కొత్తది కాదు. ఇండియన్ ఐడెల్ 5ను తెలుగు గాయకుడు శ్రీరామచంద్ర గెలుచుకున్నాడు. కారుణ్య ఇండియన్ ఐడెల్ 2లో రన్నర్ అప్‌గా నిలిచాడు. తెలుగువారు జాతీయ స్థాయిలో సింగింగ్ టాలెంట్ చూపగలరని ఎప్పుడో నిరూపితం అయ్యింది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఇండియన్ ఐడెల్ 12 లో ఇద్దరు విశాఖ అమ్మాయిలు ప్రతిభ చూపుతూ ఉండటం విశేషం. వారు షణ్ముఖ ప్రియ, శిరీష భాగవతుల. వీరిలో శిరీష భాగవతుల టాప్ 11 వరకూ వచ్చి రెండు రోజుల క్రితం ఎలిమినేట్ అయ్యింది. షణ్ముఖ ప్రియ టాప్ టెన్‌లోకి వెళ్లింది. ఇద్దరిదీ ఘనతే అనుకోవాలి. విశాఖకు చెందిన శిరీష చిన్నప్పటి నుంచి తాతగారి దగ్గర సంగీతం నేర్చుకుంది. పాడాలని ఉంది విజేతగా నిలిచింది. ఇంజినీరింగ్ చేసి చెన్నైలో సంగీతం నేర్చుకుంటూ అక్కడ తమిళంలో పాటలు పాడుతోంది. శిరీష గాయని చిత్రకు వీరాభిమాని. ఆమె పాటలు ఎక్కువగా పాడుతుంది. ఇండియన్ ఐడెల్ ఆడిషన్స్‌లో కూడా శిరీష ‘సాథియా తూనే క్యా కియా’ (ఈనాడే ఏదో అయ్యింది), కెహెనా హై క్యా (కన్నానులే) పాడి చిత్రలాంటి గాయనిగా జడ్జ్‌ల నుంచి ప్రశంసలు అందుకుంది. ఒక ఎపిసోడ్ ‘జియ జలే జాన్ జలే’ పాటతో స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. దాదాపు హేమాహేమీలుగా ఉన్న 16 మంది సింగర్స్‌తో మొదలైన ఈ షో టాప్ 11 వరకూ నిలవడం కూడా సామాన్యం కాదు. సెలబ్రిటీలు హాజరైన ఎపిసోడ్స్‌లో ముఖ్యంగా బప్పీలహరి, ప్యారేలాల్, ఉదిత్ నారాయణ్ వీరందరి సమక్షంలో పాడి శిరీష ప్రతిభ చాటుకుంది. షణ్ముఖ ప్రియతో కలిసి హీరో గోవిందా ఎపిసోడ్లో ‘చికుబుకు చికుబుకు రైలే’ హిందీ వెర్షన్‌ను పాడి క్లాప్స్ అందుకుంది. మెలొడీలే కాకుండా కామెడీ, డిస్కో అన్నీ పాడగలనని శిరీష ఈ డయాస్ నుంచి చాటి చెప్పింది. ఇప్పటికే రహమాన్ దృష్టిలో పడి ఆయన సంగీతం లో ‘విజిల్’లో పాడిన శిరీష ఇప్పుడు ఇండియన్ ఐడల్ తో వచ్చిన గుర్తింపుతో మరిన్ని మంచిపాటలు పాడే అవకాశం ఉంది. ఇండియన్ ఐడెల్కు సంగీత దర్శకులు విశాల్, హిమేష్ రేష్మియా, గాయని నేహా కక్కర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. శిరీష భవిష్యత్తు గానమయంగా సాగాలని కోరుకుందాం. -
మా నాన్నను ధర్మేంద్ర ఏడిపించారు..
‘ఒక విదేశీ షూటింగ్‌కు నాతోపాటు మా నాన్న వచ్చారు. ధర్మేంద్రతో పాటలో యాక్ట్ చేయాలి. నాన్నకు అప్పటికే ధర్మేంద్ర నా వెంట పడటం తెలుసు. అందుకని నాన్న ప్రతిసారి మా కారు ధర్మేంద్ర ఎక్కకుండా అడ్డుకునేవారు. అయినా సరే ధర్మేంద్ర మా కారులోనే వస్తానని అనేవారు. నేను బ్యాక్సీట్లో కూచోగానే మా నాన్న వెంటనే డోర్ తీసుకుని నా పక్కన కూచునేవారు. ధర్మేంద్ర చాలా క్లవర్. ఇంకో డోర్ నుంచి ఆయన ఎక్కి నా పక్కన కూచునేవారు. వాళ్లు ఇలా నా కోసం ప్లాన్లు వేయడం సరదాగా అనిపించేది’ అన్నారు హేమమాలిని. 72 సంవత్సరాల హేమమాలిని నేటికి బాలీవుడ్ ‘డ్రీమ్‌గర్ల్’గా ఉన్నారు. అందుకే మొన్నటి ఆదివారం (మార్చి 7) విమెన్స్ డే సందర్భంగా ఇండియన్ ఐడెల్ ఎపిసోడ్‌ను ఆమె పేరున నిర్వహించారు. హేమమాలిని ఆ ఎపిసోడ్‌కు హాజరయ్యి ఆ సందర్భంగా చాలా విశేషాలు చెప్పారు హేమ మాలిని. అంతేకాదు, అందరినీ ఆశ్చర్యపరుస్తూ డాన్స్ చేశారు. ఆమె స్టెప్పులేసిన పాటల్లో ‘షోలే’లోని ‘జబ్ తక్ హై జాన్’ పాట ఒకటి. ‘షోలే’లో ఈ పాట క్లయిమాక్స్ లో వస్తుంది. గబ్బర్ సింగ్ ముందు మండుటెండలో బండరాళ్ల మీద పగిలిన గాజుపెంకులపై డాన్స్ చేస్తుంది హేమ మాలిని, ధరేంద్రను విడిపించుకోవడానికి. ఆ పాట వెనుక ఉన్న విశేషాలను కూడా ఆమె చెప్పారు– ‘ఆ పాట ఇలా ఉంటుందని దర్శకుడు రమేశ్ సిప్పి చెప్పారు. చేద్దాం... కాని షూటింగ్ నవంబర్, డిసెంబర్లో పెట్టుకోండి. అప్పుడు మైసూరు (షూటింగ్ జరుగుతున్న ప్రాంతం) చల్లగా ఉంటుంది అన్నాను. కాని రమేశ్ సిప్పీ వినలేదు. ఏప్రిల్ నెలఖారున షూటింగ్ పెట్టారు. అంత ఎండ లో రాళ్ల మీద డాన్స్ చేయడం ఎలా అనుకున్నాను. మా అమ్మ పాదాలకు ప్రత్యేకమైన సాక్సులు తయారు చేయించింది. అవి వేసుకుంటే కాళ్లు కాలవు.. సాక్సులు వేసుకున్నట్టు తెలియదు కూడా. వాటిని తొడుక్కుంటుంటే రమేశ్ సిప్పీ దూరం నుంచి చూసి ‘వద్దొద్దు్ద అవి వేయకండి’ అని వార్నింగ్ ఇచ్చారు. సరే... రాళ్ల మీద కాసిన్ని నీళ్లైనా పోయండి చల్లబడతాయి అన్నాను. దానికీ ఒప్పుకోలేదు. చివరకు పాటను అలాగే చేశాను. మొత్తం పాట తీయడానికి పది రోజులు పట్టింది. కాని ఫలితం ఎలా ఉందో మీరే చూశారుగా’ అన్నారామె. ‘జానీ మేరా నామ్ సినిమా సమయానికి నేను ఇంకా ఫీల్డుకి కొత్త. ఆ సినిమాలో వాదా తూ నిభాయా... పాట దేవ్ ఆనంద్ గారితో చేయాలి. రోప్ వేలో ఒక చైర్లో దేవ్ ఆనంద్ కూచుంటే ఆయన వొడిలో నేను కూచోవాలి. సరే.. సినిమాల్లో ఇవన్నీ తప్పవు. నేను దేవ్ గారి వొడిలో కూచున్నాక ప్రతిసారీ కరెంటు పోయేది. నేను అలాగే కూచుని ఉండాల్సి వచ్చేది. ఏమిటా అని చూస్తే తర్వాత తెలిసింది... కావాలనే కరెంట్ తీసేస్తున్నారని. ఇలాంటివి కూడా షూటింగ్లలో జరుగుతుంటాయి’ అన్నారామె. తను ఇంట్లో మూడో సంతానమని, తను గర్భంలో ఉండగానే ఈసారి పుట్టేది ఆడపిల్లే.. దానికి హేమ మాలిని అని పేరు పెట్టాలి అని తన తల్లి అనుకుందని ఆమె చెప్పారు. పుట్టక ముందే పేరు రెడీ చేసుకున్న ఆమె పుట్టాక ఆ పేరును డ్రీమ్ గర్ల్ హేమమాలినిగా నిలబెట్టుకున్నారు. -
తెలుగు లేడీ కిశోర్ కుమార్
ఇండియన్ ఐడెల్ టాప్ 13కు చేరుకున్న తెలుగు అమ్మాయి షణ్ముఖప్రియ తాజా ‘ఆర్.డి.బర్మన్ – కిశోర్ కుమార్’ ఎపిసోడ్లో ‘దమ్ మారో దమ్’ పాట పాడింది. దాంతోపాటు కిశోర్ కుమార్ తన పాటల్లో చేసే యోడలింగ్ కూడా చేసింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా వచ్చిన కిశోర్ కుమార్ తనయుడు అమిత్ కుమార్ షణ్ముఖప్రియ టాలెంట్‌ను చూసి అవాక్కయ్యాడు. ఆమెకు తన తండ్రి ఇష్టంగా తినే రబ్డీని స్వహస్తాలతో తినిపించాడు. విశేషాలు... ఇండియన్ ఐడల్ అంటే భారతీయ యువ సింగర్లకు అతి పెద్ద ప్లాట్‌ఫామ్. ఆ రియాలిటీ షోలో ఎంట్రీ దొరకడమే పెద్ద కష్టం. అలాంటిది టాప్ లిస్ట్‌లో నిలవడం ఇంకా కష్టం. ఆ కష్టాన్ని సాధ్యం చేశారు మన వైజాగ్‌కు చెందిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు షణ్ముఖప్రియ, శిరీష భాగవతుల. ప్రస్తుతం వీరు టాప్ 13కు చేరుకున్నారు. టాప్ 10 చేరుకుంటారన్న ఆశను కూడా కలిగిస్తున్నారు. కాగా శనివారం (జనవరి16) జరిగిన ఎపిసోడ్లో షణ్ముఖ ప్రియ విశేషంగా అందరినీ ఆకర్షించింది. దానికి కారణం ఆ ఎపిసోడ్‌ను కిశోర్ కుమార్ – ఆర్.డి.బర్మన్ పాటలతో తీర్చిదిద్దారు. కిశోర్ కుమార్, అమిత్ కుమార్ ఈ ఎపిసోడ్‌కు స్పెషల్ గెస్ట్‌గా కిశోర్ కుమార్ కుమారుడు అమిత్ కుమార్ హాజరయ్యారు. ఆయన ముందు షణ్ముఖ ప్రియ ఆర్.డి.బర్మన్ కంపోజ్ చేసిన ‘దమ్ మారో దమ్’ పాడింది. ఆ తర్వాత కిశోర్ కుమార్ చేసే యోడలింగ్ ప్రదర్శించింది. ‘యోడలే.. యోడలే... యోడలే’ అని పాడేదే యోడలింగ్. అందులో షణ్ముఖ ప్రియ దాదాపు ఐదు నిమిషాల సేపు యోడలింగ్ చేసి అమిత్ కుమార్‌ను అవాక్కు చేసింది. ఆయన షణ్ముఖ ప్రియను మెచ్చుకున్నారు. ‘మా నాన్నకు రబ్డి తినడం అంటే చాలా ఇష్టం. ఆయన చనిపోవడానికి మూడు నాలుగు గంటల ముందు కూడా ఫ్రిజ్‌లో నుంచి రహస్యంగా రబ్డీ తీసి తినేశారు. ముంబైలోని ఒక షాప్ నుంచి ఆ రబ్డీని కొనేవారు. ఇవాళ అదే షాప్ నుంచి నేను తీసుకొచ్చిన రబ్డీని నీకు తినిపిస్తాను. ఆయన ఆశీర్వాదం నీకు తప్పక అందుతుంది’ అని షణ్ముఖ ప్రియకు రబ్డీ తినిపించారు అమిత్ కుమార్. ఈ సందర్భంగా ఆయన కిశోర్ కుమార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు చెప్పారు. ‘నాన్న తన గొంతు కోసం అప్పుడప్పుడు ఎండిన తమలపాకులు తినేవారు. గొంతు డ్రైగా ఉంటే బాగా పాడొచ్చు అనుకునేవారు. పాట పాడాక చవన్‌ప్రాశ్ పుచ్చుకుని ఎంత తొందరగా రికార్డింగ్ థియేటర్ నుంచి బయటపడదామా అని చూసేవారు’ అన్నారు అమిత్ కుమార్. ఇక్కడ చవన్ ప్రాశ్ అంటే డబ్బులు. ప్రస్తుతం ఇండియన్ ఐడెల్ సీజన్ 12లోని టాప్ 13 కంటెస్టెంట్స్‌లో ఆరు మంది అమ్మాయిలు ఉన్నారు. వారిలో ఇద్దరు తెలుగువారు కావడం గొప్ప విషయం. మిగిలిన నలుగురు అంజలి గైక్వాడ్ (మహరాష్ట్ర), అరుణిత (పశ్చిమ బెంగాల్), శైలి కాంబ్లె (మహారాష్ట్ర), అనుష్క బెనర్జీ (చండీగఢ్). శిరీష భాగవతుల ఈ పోటీలో చిత్ర పాటలను పాడి ఆకట్టుకుంటూ ఉండగా షణ్ముఖప్రియ ఎనర్జీ నిండిన గీతాలతో ప్రతిభ చూపుతోంది. వీరిలో ఒకరైనా టాప్ 5కు చేరుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ షో చూస్తున్న భారతీయులలో వైజాగ్ పేరు రెపరెపలాడినట్టే. -
అత్తగారి తరపువారు ఏడ్చారు
బాలీవుడ్ గాయని, టెలివిజన్ పర్సనాలిటీ, ఇండియన్ ఐడెల్ జడ్జి నేహా కక్కడ్ ఇటీవల చండీగడ్‌కు చెందిన గాయకుడు రోహన్‌ప్రీత్ సింగ్‌ను పెళ్లి చేసుకుంది. 32 ఏళ్ల ఈ గాయని హృషికేశ్ నుంచి ముంబైకి వచ్చి ఎంతో స్ట్రగుల్ చేసి గాయనిగా ఇప్పుడు పేరు తెచ్చుకుంది. చండీగడ్‌కు ఏదో కార్యక్రమానికి వెళ్లిన నేహా అక్కడ రోహన్‌ప్రీత్ సింగ్‌ను చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంది. రోహన్ కూడా గాయకుడే కాని నేహా అంత పేరు లేదు. రెండు రోజుల క్రితం ఇండియన్ ఐడల్ షోలో వీరిద్దరినీ కూచోబెట్టి పెళ్లి అంపకాలప్పుడు నేహా తరఫువాళ్లు బాగా ఏడ్చారా అని అడిగితే దానికి రోహన్ సమాధానం చెప్పాడు. ‘వాళ్లు ఏడ్చారుగాని మా వాళ్లే ఎక్కువ ఏడ్చారు. ఎందుకంటే నా జీవితం అంతా చండీగడ్‌లో గడిచింది. ఇప్పుడు నేహా కోసం ముంబైకి వచ్చేస్తున్నానని మావాళ్లు ఏడ్చారు’ అని చెప్పాడు. ‘నేహా వచ్చి నాకు అన్ని సంతోషాలు ఇచ్చింది. మా ఇంట్లో వాళ్లు నేను పాడుతుంటే నువ్వు పెద్ద పెద్ద చానల్స్‌లో ఎప్పుడు కనపడతావ్ అని అడిగేవారు. ఇవాళ నేహా వల్ల ఇంత పెద్ద చానల్ (సోనీ)లో కనిపించాను’ అని సంతోషం వ్యక్తం చేస్తుంటే నేహా కన్నీరు మున్నీరు అయ్యింది. నేహా కక్కడ్, రోహన్ దుబాయ్‌లో హనీమూన్ జరుపుకుని తిరిగి వచ్చాక నేహా ఇండియన్ ఐడల్ షో జడ్జిగా రొటీన్లో పడింది. -
ఇండియన్ ఐడల్ 12: పిజ్జా పార్టీ ఇచ్చిన జడ్జి
ముంబై: సోనీ టీవీ నిర్వహిస్తున్న ప్రముఖ రియాల్టీ మ్యూజిక్ షో ‘ఇండియన్ ఐడల్ 12’ గురించి సంగీత ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూలైలో ప్రారంభమైన ఈ మ్యూజిక్ షో గ్రాండ్ ప్రీమియర్‌కు చేరుకుంది. డిసెంబర్ 19, 20వ తేదీలో సోని టీవీలో రాత్రి 8 గంటలకు ప్రసారం కానున్న ఈ గ్రాండ్ ప్రిమియర్ షో సందడిగా జరగనుంది. ఇందులోని టాప్ 15 కంటెస్టెంట్స్ ట్రోఫీ కోసం ఒకరితో ఒకరూ పోటీ పడుతూ తమ గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేయనున్నారు. వారాంతంలో జరిగే ఈ షోలో టాప్ 15 ఫైనలిస్టులు అద్భుతమైన ప్రదర్శను ఇవ్వనుండగా.. షో జడ్జిలైన విశాల్ దాద్లానీ, నేహా కక్కర్, హిమేష్ రేష్మియాలు పోటీదారుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జడ్జిలంతా వారికి సంబంధించిన కొన్ని సరద క్షణాలను కంటెస్టెంట్స్‌తో పంచుకొనున్నారు. ఆ తర్వాత సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా గ్రాండ్ ప్రీమియర్ సందర్భంగా షోలోని అందరికి పిజ్జా పార్టీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో షో హోస్ట్ అదిత్య నారాయణ్, జడ్జి నేహా కక్కర్లు కంటెస్టెంట్స్ తల్లిదండ్రులతో కలిసి సరదాగా స్టెప్పులేశారు. (చదవండి: జాతీయ స్థాయిలో షణ్ముఖ స్వరం) The Grand Premiere of #IndianIdol2020 unfolds this weekend!@SonyTV #IndianIdol #SonyTV #Tellychakkar https://t.co/RtlXEHHRRV — princess Arisham khan (@p_Arisham_khan) December 16, 2020 ఇండియల్ ఐడిల్ సీజన్ 12 టాప్ 15 కంటెస్టెంట్స్‌లో ఏపీ నుంచి ముగ్గురు ఈ సీజన్లో మొదటి 12 మంది కంటెస్టెంట్స్ వరుసగా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మొహద్ డానిష్, ఆంధ్రప్రదేశ్‌కు నుంచి.. శిరీష భగవతుల, అంజలి; మహారాష్ట్రకు చెందిన సాయిలీ కిషోర్ కాంబ్లే; న్యూఢిల్లీకి చెందిన సమ్యాక్ ప్రసానా; కేరళకు చెందిన వైష్ణవ్ గిరీశ్; పశ్చిమ బెంగాల్‌కు చెందిన అరుణీతా కంజీలాల్, అనుష్క బెనర్జీ; కర్ణాటకకు చెందిన నిహాల్ టౌరో; హర్యానాకు చెందిన సాహైల్ సోలంకి; ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌దీప్ రాజన్; రాజస్థాన్‌కు చెందిన సవాయి భట్; ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షణ్ముఖ ప్రియా; ముంబైకి చెందిన నాచీకెట్ లేలే; పూణేకు చెందిన ఆశీస్ కులకర్ణిలు. (చదవండి: షణ్ముఖప్రియ పాటకు న్యాయనిర్ణేతలు ఫిదా) View this post on Instagram A post shared by Indian idol 2020 (@indian__idol12) -
జాతీయ స్థాయిలో షణ్ముఖ స్వరం
దాదాపు పదేళ్ల క్రితం ‘జీ తెలుగు’లో వచ్చిన లిటిల్ చాంప్స్ కార్యక్రమం గుర్తుందా? అయితే మీకు తన మధురమైన గళంతో అందరినీ అలరించిన షణ్ముఖ ప్రియ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో చిన్నారి గాయనిగా శ్రోతలను ఆకట్టుకున్న షణ్ముఖ ప్రియ కొంతకాలం పాటు టీవీషోలకు దూరంగా ఉంది. ఇప్పుడు వర్ధమాన గాయనిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, ఏకంగా ఇండియన్ ఐడల్ సీజన్ 12 లో గోల్డెన్మైక్ సాధించి థియేటర్ రౌండ్‌కు చేరుకుంది. అంతర్జాతీయ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ స్వయంగా ఆమెను ‘జాజ్ స్టార్ ఆఫ్ ఇండియా’ అని ప్రశంసించారంటే ఆమె గాత్ర మాధుర్యాన్ని. అందులోని విలక్షణతను అర్థం చేసుకోవచ్చు. నవంబర్ 28వ తేదీ నుంచి ప్రతి శని, ఆదివారాల్లో సోనీ టీవీలో ప్రసారం అవుతున్న 12వ సీజన్ లో ఇప్పటికే సోనీ టీవీ తన ప్రచార మాధ్యమాల ద్వారా ఈమె పాడిన పాటను ప్రోమోగా విడుదల చేసింది. ఈ వీడియోకు లక్షలాది మంది ప్రేక్షకాదరణ లభించింది. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పుట్టి, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో పెరిగి, విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న పాటల ప్రియ జాతీయ స్థాయిలో తన గాత్ర మాధుర్యాన్ని అందరికీ రుచి చూపిస్తున్న షణ్ముఖ ప్రియను 12వ సీజన్ ఆడిషన్లో భాగంగా కలిసిన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ. సాక్షి: ఇండియన్ ఐడల్ సీజన్12లో పాడతానని ఊహించారా ? షణ్ముఖప్రియ : చిన్నప్పటి నుంచి ఇండియన్ ఐడల్ షోలో పాల్గొనాలని కోరిక ఉండేది. అనుకున్నట్టుగానే ఎంపికయ్యాను. ఈ సీజన్ 12 సెలక్షన్లకు ఆన్లైన్ ద్వారా కొన్ని వేల మంది హాజరయ్యారు.వారిలో 350మంది ఎంపిక చేసి పరిక్షించగా టాప్ 14లో నేను చోటు సంపాదించాను. సాక్షి: ఇండియన్ ఐడల్ సీజన్లో గెలుపొందగలరని విశ్వాసం ఉందా? తప్పనిసరిగా... నాకు ఆ నమ్మకం ఉంది. న్యాయ నిర్ణేతల మెప్పు పొంది ముందుకెళ్తాను. ఇండియన్ ఐడల్‌లో ప్రముఖ గాయకుడు కిశోర్ కుమార్ ఆలపించిన జోమ్రు యూడిలింగ్ పాటను ఆలపించాను. అంతేకాకుండా మధ్యలో ఒక ఆడిషన్‌ను జంప్ చేసి థియేటర్ ఆడిషన్‌కు నేరుగా నన్ను పంపించారు. సాక్షి: మీకు స్ఫూర్తి ఎవరు? తల్లిదండ్రులే నాకు స్పూర్తి. మా తల్లిదండ్రులు శాస్త్రీయ సంగీతంలో ఎం.ఎ. పట్టాలు పొందారు. వారే నా తొలి గురువులు. బాలసుబ్రహ్మణ్యంతో, జానకితో... సాక్షి: మీ విజయం వెనక మీ తలిదండ్రుల కృషి ఏమైనా? మూడేళ్ల వయస్సులో నా ఆసక్తిని గుర్తించారు. అప్పటినుంచి నాకోసం మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. వారి వద్దనే సంగీతం నేర్చుకున్నాను. ఎన్నో వ్యయప్రయాసలు భరించి మరీ నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. సాక్షి: గాయనిగా సాధించిన విజయాలు..? కర్ణాటక, కేరళ, తమిళనాడు చిన్నారులకు నిర్వహించిన ‘సూపర్‌స్టార్ సింగర్’ పోటీలో టైటిల్ పొందాను. జీ తెలుగు సరిగమ లిటిల్ ఛాంప్స్ 2008 విజేతగా నిలిచాను. మా టీవీ సూపర్ సింగర్ 2009లో ఫైనల్‌కు చేరుకున్నాను. స్టార్ విజయ్ తమిళ జూనియర్ సూపర్ స్టార్స్ 2010పోటీల్లో విన్నర్‌గా నిలిచాను. 2013లో ఈటీవీ పాడుతా తీయగా పోటీలో ఫైనల్‌కు వచ్చాను. 2015లో మాటీవీ సూపర్ సింగర్ పోటీల్లో విజేతగా నిలబడ్డాను. జీ టీవీ హిందీ సరిగమప లిటిల్ ఛాంప్స్ 2017లో రన్నర్‌గా నిలిచాను. తమిళ సూపర్ సింగర్ జూనియర్ 3, స్టార్ ఆఫ్ ఏపీ, సరిగమప నువ్వానేనా పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచాను. సాక్షి: మీకు గుర్తింపు ఇచ్చిన పాటలేంటి? తమిళంలో ఇంజీఖరుపడగా... (సన్న జాజీ..), ఇందమిసీమినిక్ (ఈ ఎర్ర గులాబీ), కాదళ్ అనుగళి(రోబో), ‘పాడుతా తీయగా’లో ‘గోపమ్మ చేతిలో గోరుముద్ద...’ ‘నిదురపోరా తమ్ముడు...’, ‘ఎన్నెన్నో జన్మల బంధం’ తదితర పాటలతో పాటు గులాం అలీ గజల్స్ ఉన్నాయి. ‘చాంగురే బంగారు రాజా...’ వంటి జానపద గీతాలు కూడా అప్పట్లో నాకు మంచి పేరు తెచ్చాయి. తల్లిదండ్రులు రత్నమాల, శ్రీనివాస్‌కుమార్‌తో షణ్ముఖప్రియ సాక్షి: ప్రముఖుల ప్రశంసలు షణ్ముఖప్రియ: ఏఆర్ రెహమాన్ దగ్గర పాడాను. నా పాటను మెచ్చి జాజ్ స్టార్‌గా ఎదుగుతావని మెచ్చుకున్నారు. మాజీ తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు దర్శకరత్న దాసరి నారాయణరావుతో పాటు చాలా మంది ప్రముఖులు అభినందించారు. ప్రముఖ గాయకులు ఆశాబోస్లే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకీ, చిత్ర, మాల్గాడి శుభ, రమణ గోగుల, ఆర్పీ పట్నాయక్ తదితరులు ఆశీర్వదించారు.ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ముందు ‘పాడుతా తీయగా’లో ‘వీణ వేణువైన..’ పాటతో ప్రస్థానం ప్రారంభించాను. ఆయనెన్నో సలహాలు ఇచ్చారు. ఇప్పుడాయన ఉంటే నన్ను ఎంతగానో ప్రోత్సహించేవారు. మరాఠీలో సోను నిగమ్‌తో కలిసి డ్యూయట్ పాడాను. సాక్షి: మీ లక్ష్యమేంటి? అటు చదువులోనూ, ఇటు గాయనిగానూ ఎదగాలనుకుంటున్నాను. నేపథ్యగాయని కావడడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం నా ముందున్న లక్ష్యం. సాక్షి: గాయనిగా వచ్చిన గుర్తింపు మీకు ఏవిధంగా తోడ్పడుతోంది? వర్థమాన గాయనిగా రాణిస్తూనే, మరోవైపు చదువులో మంచి మార్కులు సాధించుకుని లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగిపోతున్నాను. ఇంటర్ మొదటి సంవత్పరంలో 9.1, రెండో సంవత్సరంలో 9.7మార్కులు సాధించాను. బీఎస్సీ గణితం చదువుతూ ముందుకు సాగాలని ఆలోచిస్తున్నాను. నా ప్రతిభను గుర్తించిన శ్రీ చైతన్య యాజమాన్యం నాకు ఉచితంగా చదువు చెబుతోంది. ఈ వయసులో అంతకన్నా మించి నాకు ఏం కావాలంటారు? సాక్షి: ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంది? ఏ రియాలటీ షోలో పాల్గొన్నా ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. నువ్వు బాగా పాడితే చాలు– మిగతాది మేము చూసుకుంటామంటూ వందల సంఖ్యలో సందేశాలు వస్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి కూడా ప్రోత్సాహం లభిస్తోంది. అభినందనలు అందుతున్నాయి. అందరికీ సాక్షి వేదికగా నా ధన్యవాదాలు. – కందుల శివశంకర్, సాక్షి, శ్రీకాకుళం -
షణ్ముఖప్రియ పాటకు న్యాయనిర్ణేతలు ఫిదా
-
ప్రియుడి ఆత్మహత్య: సింగర్ పరిస్థితి విషమం
-
ప్రియుడి ఆత్మహత్య: సింగర్ పరిస్థితి విషమం
జైపూర్ : ఇండియన్ ఐడల్ ఫేమ్, గాయని రేణు నగర్(26) ఆస్పత్రి పాలయ్యారు. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త తెలియడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో అల్వార్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా దేశంలో మంచి సింగర్‌గా రేణుకు పేరుంది. ఇండియన్ ఐడల్ సీజన్10తోపాటు సరిగమపలో పాల్గొన్నారు. కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ కనిపించారు. అయితే రవిశంకర్ అనే వివాహితుడితో రేణు నగర్ కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారు. (బాలీవుడ్ సింగర్ తల్లి మృతి) ఈ జంట జూన్‌లో ఇంటి నుంచి కూడా పారిపోయారు. కూతురు గురించి తెలిసి రేణునగర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆగష్టు 24న వీరి జాడ తెలుసుకున్న పోలీసులు ప్రేమికులను తిరిగి రప్పించారు. ఈ క్రమంలో బుధవారం విషంతాగి రవి శంకర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. దురదృష్టవశాత్తు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలియడంతో రేణు నగర్ ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, ఐసీయూలో చిక్సిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు రవిశంకర్ ఆత్మహత్యపై పోలీసులు విచారణ చేపట్టారు. రవికి ఇంతక ముందు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేణు ఇంట్లో సంగీత విద్య నేర్చుకోవడానికి వచ్చి ఆమెతో ప్రేమలో పడినట్లు సమాచారం. -
ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ ఆన్లైన్లో..
ముంబై: సోని చానెల్ నిర్వహించే రియాల్టి మ్యూజిక్ షో ‘ఇండియన్ ఐడల్’ గురించి సంగీత ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా ‘ఇండియన్ ఐడల్-12’ సీజన్ ఆడిషన్స్‌ను జూలై 25 నుంచి ప్రారంభిస్తున్నట్లు సోని చానెల్ తెలిపింది. కరోనా వైరస్ కారణంగా ఈసారి ఆడిషన్స్‌ను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన ఒక ప్రోమో వీడియోను సోని టీవీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘ఇడియన్ ఐడల్ ఈజ్ బ్యాక్! ఇండియన్ ఐడల్-12 ఆడిషన్స్‌ను సోని లైవ్ యాప్ ద్వారా జూలై 25 నుంచి ప్రారంభిస్తున్నాము. రెడీగా ఉండండి’ అని క్యాప్షన్ కూడా జత చేసింది. View this post on Instagram Did you see this surprise coming your way? #IndianIdol is back! Online Auditions for Season 12 begin from 25th July only on Sony Liv App, so get ready for your #GharSeManchTak journey! @sonylivindia @adityanarayanofficial A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on Jul 11, 2020 at 7:30am PDT సోని లైవ్ యాప్ ద్వారా ఆసక్తి గల గాయకులు తమ పాటలకు సంబంధించిన వీడియోను పంపించాలని రియాల్టీ షో హోస్ట్ ఆదిత్య నారాయణ్ తెలిపారు. నూతన గాయని, గాయకులకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. ఆన్లైన్ ఆడిషన్స్‌లో ఎంపికైన వారికి ముంబైలో మరో ఆడిషన్ ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది కూడా రియాల్టి మ్యూజిక్ షోకి సింగర్ నేహా కక్కర్, బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా, విశాల్ దడ్లాని న్యాయ నిర్ణేతలుగా వ్యవహిరించనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌కు చెందిన సన్నీ హిందూస్థానీ ఇండియన్ ఐడల్ సీజన్-11 టైటివ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
విలాసవంతమైన బంగ్లా కొన్న ప్రముఖ సింగర్
అద్దె ఇంట్లో అష్టకష్టాలు పడిన పరిస్థితుల నుంచి విలాసవంతమైన బంగ్లా కొనగలిగే స్థాయికి ఎదిగితే ఆ కిక్కే వేరు. అది కూడా.. కష్టార్జితంతో సొంతింటి కలను నెరవేర్చుకుంటే హృదయం సంతోషంతో నిండిపోతుంది. బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ ప్రస్తుతం అలాంటి ఆనందకర క్షణాలను ఆస్వాదిస్తున్నారు. సాధారణ వ్యక్తిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన నేహా.. ప్రస్తుతం సెలబ్రిటీ స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ‘ఇండియన్ ఐడల్’ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆమె.. తర్వాతి సీజన్లో అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి అరుదైన అనుభవాన్ని కూడా సొంతం చేసుకున్నారు. కాలా చష్మా, దిల్బర్ రీమిక్స్ వంటి ఎన్నో పాటలు ఆలపించి ప్రముఖ గాయనిగా గుర్తింపు దక్కించుకున్నారు.(రెండు వేల నోట్లను పంచిన సింగర్) ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నేహా కక్కర్.. తాజాగా తాను ఉత్తరాఖండ్‌లో కొత్త ఇంటిని కొనుగోలు చేసిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘‘నేను పుట్టినచోట .. రిషికేష్‌లో... ఇది ఇప్పుడు మా బంగ్లా.. గతంలో ఇక్కడే మా కుటుంబం ఒకే ఒక్క గదిలో ఉండేది. అందులోనే ఓ టేబుల్ విస్తీర్ణంలో మా ‘కిచెన్’ ఉండేది. అది మా సొంత గది కూడా కాదు. దానికి మేం అద్దె కట్టేవాళ్లం. ఇప్పుడు అదే సిటీలో నా సొంత బంగ్లా చూస్తుంటే... ఉద్వేగం ఉప్పొంగుతోంది’’ అంటూ తమ పాత ఇంటి ఫొటోతో పాటు.. కొత్త బంగ్లా ముందు నిల్చున్న ఫొటోను షేర్ చేశారు. తను ఈ స్థాయికి చేరడానికి కారణమైన, ఎల్లవేళలా తనకు అండగా నిలిచిన తల్లిదండ్రులు, మాతా రాణి(అమ్మవారు), శ్రేయోలాభిలాషులకు ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో.. నేహాపై ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘సెల్ఫ్ మేడ్ వుమెన్. మీ కాళ్లపై మీరు నిలబడ్డారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు’’ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. (‘నేహను క్షమాపణలు కోరుతున్నా’) View this post on Instagram This is the Bungalow we Own now in #Rishikesh and Swipe Right to see the house where I was Born ❤️🙏🏼 In the same house We Kakkar’s used to stay in a 1 Room inside which My Mother had put a table which was our kitchen in that small room. And that Room also was not our own, we were paying rent. And Now Whenever I see Our Own Bungalow in the Same City, I always get Emotional 🥺 . #SelfMade #NehaKakkar ❤️💪🏼 Biggest Thanks to My Family @sonukakkarofficial @tonykakkar Mom Dad Mata Rani (God) ❤️🙏🏼 and Ofcourse My NeHearts and All My Well wishers ❤️🙌🏼 . #NehuDiaries #Utrakhand #KakkarFamily A post shared by Neha Kakkar (@nehakakkar) on Mar 6, 2020 at 3:04am PST -
తనతో నా పెళ్లి ఫేక్.. టీఆర్పీ కోసమే: సింగర్
గత కొంతకాలంగా ప్రముఖ గాయని నేహా కక్కర్ ఇండియన్ ఐడల్ సీజన్ 11 మ్యూజిక్ షో యాంకర్ అదిత్య నారాయణ్‌లు త్వరలో వివాహం చేసుకోబుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా అంగీకరించినట్లు ఇండియన్ ఐడల్ షోలో స్పష్టం చేశారు. ఇక అప్పటి నుంచి నేహా, అదిత్యల జోడి కుదరినట్లేనని అందరూ ఫిక్సైపోయారు. నేహా అభిమానులైతే ఆమె పెళ్లి తేదీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేహా అందరికి షాకిస్తూ... వారి పెళ్లి అంతా అబద్ధమని, కేవలం టీఆర్పీ కోసమే.. పెళ్లి ఎపిసోడ్ పేరుతో షోలో అలా నటించామని వెల్లడించింది. ఇక అదిత్య ఈ ఏడాది చివరిలో తన చిరకాల ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా చెప్పింది. అదే విధంగా దీనిపై అదిత్య తండ్రి, గాయకుడు ఉదిత్ నారాయణ్ ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘అదిత్యను కావాలనే నేహాను పెళ్లి చేసుకోమ్మంటూ ఆటపట్టించేవాడిని.. కానీ అదిత్య కొట్టిపారేస్తూ.. ప్రస్తుతం తన కెరియర్‌పై దృష్టి పెడుతున్నానని.. ఇప్పట్లో పెళ్లి చేసుకొనని చెప్పేవాడు. అయినా వినకుండా అదిత్యతో, నేహాను పెళ్లి చేసుకొమ్మంటూ ఏడిపిస్తూనే ఉంటాను’ అని చెప్పాడు. ఆ షో జడ్జ్‌తో హోస్ట్ పెళ్లి! కాగా ఇండియన్ ఐడల్ షోకి నేహా జడ్జీగా వ్యవహరించగా.. ఆదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్పెషల్ వెడ్డింగ్ ఎపిసోడ్ పేరుతో టెలికాస్ట్ చేసిన ఈ షోలో ఆదిత్య తండ్రి ఉదిత్ నారాయణ్, తల్లి దీప నారాయణ్‌లతో పాటు నేహా తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో షోలో అందరి ముందు నేహాను తమ కోడలిగా చేసుకుంటామని ఉదిత్ నారాయణ్ దంపతులు ప్రకటించగడంతో.. నేహా తల్లిదండ్రులు కూడా తమ కూతురిని వారింటికి కోడలిగా పంపించడానికి ఒప్పుకున్నట్లుగా షోలో చూపించారు. అంతేగాక ఇటీవల న్యూ ఈయర్ వేడుకలో భాగంగా గోవా బీచ్‌లో నేహా, ఆదిత్యలు సందడి చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక నేహా, ఆదిత్యల పెళ్లి ఎపిసోడ్ ఫేక్ అని తెలిసి ఆమె అభిమానులు నిరాశ పడుతుంటే.. మరికొందరు తమని ఫూల్ చేసినందుకు షో నిర్వాహకులపై మండిపడుతున్నారు. ‘గుర్తింపు కోసమే.. నా పేరు వాడుకుంటున్నారు’ -
ఆ షో జడ్జ్‌తో హోస్ట్ పెళ్లి!
ఇండియన్ ఐడల్ సీజన్ 11 హోస్ట్ ఆదిత్య నారాయణ్, జడ్జ్ నేహా కక్కర్లు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా గత కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో ఈ షో ప్రారంభం అయినప్పటి నుంచి ఆదిత్య, నేహాల మధ్య మంచి కెమిస్ట్రీ నడుస్తోంది. దీనికి ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇటీవల ఆదిత్య నేహాకు ప్రపోజ్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. వృత్తిరీత్యా ఇద్దరు సింగర్లు కావడంతో వారి మధ్య మంచి అవగాహన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఆదిత్య, నేహా తల్లిదండ్రులు ఇండియన్ ఐడల్ షోకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆదిత్య తండ్రి ఉదిత్ నారాయణ్.. నేహాను ఆటపట్టించాడు. నేహాను తన కోడలిగా చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. ఆదిత్య తల్లి దీప కూడా అదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఈ షోను ప్రసారం చేస్తున్న చానల్ కూడా నేహా, ఆదిత్యలు ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకోనున్నట్టు ఓ ప్రొమోలో తెలిపింది. అయితే ఇది షో ప్రమోషన్ కోసం చేసిందా లేక నిజంగానే ఫిబ్రవరి 14న నేహా, ఆదిత్యలు పెళ్లి చేసుకోనున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే చాలా మంది మాత్రం నేహా, ఆదిత్యలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా తాము పెళ్లి చేసుకోనున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. మరోవైపు వీరిద్దరు కలిసి గోవా బీచ్‌లో నేహా సోదరుడు టోని కక్కర్ రూపొందించిన ఓ సాంగ్ షూట్లో పాల్గొన్నారు. ఈ వీడియోను ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నేహా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. View this post on Instagram #GoaBeach 🏖 Out on 10th feb ❤️😇 . . #TonyKakkar #NehaKakkar #AnshulGarg #AdityaNarayan #KatKritian #DesiMusicFactory A post shared by Neha Kakkar (@nehakakkar) on Feb 1, 2020 at 11:19pm PST -
పోలీసులను పిలవాలనుకున్నా..
న్యూఢిల్లీ : సోనీలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ 11 షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న నేహాకక్కర్‌ను కంటెస్టెంట్ ముద్దు పెట్టుకున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే షోలో మరో జడ్జిగా వ్యవహరిస్తున్న విశాల్ దడ్లాని తాజా ఎపిసోడ్‌పై ట్విటర్లో ఘాటుగా స్పందించారు. 'కంటెస్టెంట్ చేసిన పనికి పోలీసులను పిలుద్దామని నేహాకక్కర్కు చెప్పాను. కానీ ఆమె ఈ విషయాన్ని ఇక్కడితో మరిచిపోవాలంటూ తనను వారించిందని' పేర్కొన్నాడు. అయితే కంటెస్టెంట్ చేసిన పనిని నెటిజన్లు తీవ్రంగా తప్పు పడుతూ విశాల్ దడ్లానికి వరుస ట్వీట్లు చేశారు. 'విశాల్ జీ ! మీరు కంటెస్టెంట్ చేసిన పనికి అతని చెంపను పగలగొట్టాల్సింది. ఆ పని చేసేందుకు అతనికి ఎంత దైర్యం, అతన్ని ఊరికే వదిలేయద్దు అంటూ' ట్వీట్ చేశాడు. 'నిజంగా కంటెస్టెంట్ తన హద్దు మీరి ప్రవర్తించాడని, ఇటువంటి చర్యలు మరోసారి జరగకుండా జాగ్రత్త పడాలని' మరొకరు ట్వీట్ చేశారు. 'కేవలం టీఆర్పీ రేటింగ్ కోసమే షో నిర్వాహకులు కావాలనే కంటెస్టెంట్‌తో ఆ పని చేయించారని, ముందు షో నిర్వాహకులపై చర్యలు తీసుకుంటే బాగుండేదని' పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. వీటిపై విశాల్ దడ్లాని స్పందిస్తూ.. కంటెస్టెంట్ చేసిన పనికి పోలీసులను పిలవాలని చెప్పానని, నేహాకక్కర్ అందుకు ఒప్పుకోలేదని పేర్కొన్నారు. కానీ అతనికి మానసిక చికిత్స అవసరం ఎంతో ఉందని తెలిపాడు. మళ్లీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్త వహించాలని షో నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని కోరినట్లు తెలిపారు. చదవండి : (వైరల్ : జడ్జిని ముద్దుపెట్టుకున్న కంటెస్టెంట్) I suggested that the Police be called, but Neha decided to let the guy off the hook. He definitely needs psychiatric help, and we will try to help him get that, if we can. #IndianIdol11 https://t.co/CiCLy7u787 — VISHAL DADLANI (@VishalDadlani) October 20, 2019 -
జడ్జిని ముద్దుపెట్టుకున్న కంటెస్టెంట్
-
వైరల్: జడ్జికి కంటెస్టెంట్ ముద్దు
ముంబయి : సోనీ చానెల్ నిర్వహిస్తోన్న రియాల్టీ షోలో కంటెస్టెంట్ మహిళా జడ్జికి ముద్దుపెట్టి అక్కడున్నవారందరినీ షాక్‌కు గురి చేశాడు. ఊహించని ఘటనతో సదరు మహిళా జడ్జి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. కాగా ఇదంతా సోనీ నిర్వహిస్తోన్న 'ఇండియన్ ఐడల్ 11' లో చోటుచేసుకుంది. అయితే దీనిని సోనీ టీవీ ప్రోమో రూపంలో రిలీజ్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే .. ఇండియన్ ఐడల్ 11 కార్యక్రమానికి ప్రముఖ గాయకులు అను మాలిక్, విశాల్ దడ్లానిలతో పాటు నేహా కక్కర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కంటెస్టెంట్ గుజరాతీ వేషదారణలో పలు బహుమతులతో స్టేజీ మీదకు వచ్చినట్లు ప్రోమోలో తెలుస్తుంది. పాట పాడిన అనంతరం తనను గుర్తుపట్టారా అంటూ నేహాకక్కర్‌ను అడిగాడు. దీంతో స్టేజీ మీదకు వెళ్లిన నేహా అతను ఇచ్చిన బహుమతులను తీసుకొని కృతజ్ఞతగా అతన్ని హగ్ చేసుకుంది. ఈ నేపథ్యంలో అతను అందరూ చూస్తుండగానే నేహా బుగ్గమీద ముద్దుపెట్టాడు. దీంతో షో వాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆదిత్య నారాయణ అతన్ని అడ్డుకొని అక్కడి నుంచి పంపించేశాడు. ఈ ఉహించని పరిణామంతో షాక్‌కు గురైన నేహాకక్కర్ కార్యక్రమం మద్యలోనే వెళ్లిపోయినట్లు ప్రోమోలో చూపించారు. కాగా, ఈ ఎపిసోడ్ ఆదివారం సోనీలో టెలికాస్ట్ అవనుంది. -
‘ఇప్పటికి ఆమెను గౌరవిస్తున్నాను’
మాజీ ప్రియురాలు నేహా కక్కర్ని ఇప్పటికి గౌరవిస్తున్నానని.. ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని తెలిపాడు నటుడు హిమాన్ష్ కోహ్లీ. వీరిద్దరూ విడిపోయి దాదాపు సంవత్సరం అవుతుంది. ఈ క్రమంలో తాజాగా తమ బంధం గురించి మీడియాతో మాట్లాడారు హిమాన్ష్. హిందూస్తాన్ టైమ్స్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను దీని గురించి మాట్లాడతానని ఎప్పుడు అనుకోలేదు. జరిగింది ఏదో జరిగి పోయింది. నేను దాన్ని మార్చలేను. కానీ నేహా అంటే నాకు ఇప్పటికి గౌరవమే. ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటాను. క్లిష్ట పరిస్థితుల్లో కూడా మేం ఒకరికి ఒకరం మర్యాద ఇచ్చుకుంటాం. తనో గొప్ప వ్యక్తి. నేహా కోరుకున్న ప్రతీది ఆమెకు దక్కాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆమె పూర్తి ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని దేవుడిని వేడుకుంటున్నాను’ అని తెలిపారు. ఈ క్రమంలో వీరిద్దరు గత ఏడాది వచ్చిన ఓహ్ హమ్‌సఫర్ పాటలో కలిసి నటించారు. దీని గురించి ప్రస్తావిస్తూ.. ‘మళ్లీ నేహాతో కలిసి పని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా’ అని హిమాన్ష్‌ను ప్రశ్నించగా.. ‘ఎందుకు లేను. మంచి అవకాశాలను ఎందుకు జారవిడుచుకోవాలి. ఆసక్తికర ప్రాజెక్ట్స్ వస్తే.. తప్పకుండా నేహాతో కలిసి పని చేస్తాను. నా పనే నటించడం కదా’ అన్నారు హిమాన్ష్. గత ఏడాది ఇండియన్ ఐడిల్ రియాలిటీ షోలో వీరిద్దరు తాము రిలేషన్లో ఉన్నామని ప్రకటించారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో తమ మధ్య బంధం ముగిసిపోయిందని తెలిపారు. తొలత నేహానే ఇన్స్టాగ్రామ్ వేదికగా తాము విడిపోయినట్లు వెల్లడించారు. తన హృదయం ముక్కలైందని.. నిరాశలో కూరుకుపోయానని తెలిపారు నేహా. దాంతో హిమాన్ష్, నేహాను మోసం చేశాడంటూ నెటిజన్లు తనను విమర్శించడం ప్రారంభించారు. అయితే ఈ విమర్శలపై నేహా స్పందించారు. హిమాన్ష్‌కు మద్దతివ్వడమే కాక తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో హిమాన్ష్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు నేహా. ‘నేను ఆన్లైన్లో కొన్ని వార్తలు చదివాను. అవి పూర్తిగా అవాస్తవం. అవును నేను బాధపడుతున్న మాట వాస్తవమే.. కానీ నేను మోసపోలేదు. నిజాయతీగా చెప్పాలంటే హిమాన్ష్ చాలా ఉత్తముడు. తనను విమర్శించడం.. అతనిపై తప్పుడు ఆరోపణలు చేయడం మానండి. వాస్తవాలు తెలియకుండా మేం ఎవరి పేరు చెడగొట్టలేదు’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాక తన వ్యక్తిగత జీవితం గురించి బయట ప్రపంచానికి వెల్లడించడం పట్ల నేహా బాధపడ్డారు. ‘నాకు భావోద్వేగాలు ఎక్కువ. అందుకే నా వ్యక్తిగత జీవితం గురించి ప్రపంచానికి వెల్లడించాను కానీ నేను అలా చేసి ఉండకూడదు’ అన్నారు నేహా. I read some article online which was Fake & Disturbing. Yes I said I’m hurt but I NEVER said I got betrayed. When it comes to being Loyal, He’s TheBest! So plz Stop blaming him & putting Wrong Allegations. We just can’t spoil anybody’s reputation without even knowing the facts!🙏🏼 — Neha Kakkar (@iAmNehaKakkar) February 26, 2019 -
‘డిప్రెషన్లో ఉన్నా... దయచేసి నన్ను బతకన్విండి’
‘అవును.. నేను డిప్రెషన్లో ఉన్నాను. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతికూల భావాలు గల ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. నా జీవితంలో అత్యంత బాధాకరమైన, ఘోరమైన రోజులు కల్పించి మీరు విజయం సాధించారు. అందుకు మీకు శుభాభినందనలు’ అంటూ గాయని నేహా కక్కర్ తన మనసులోని భావాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సింగింగ్ ప్రోగ్రామ్ ‘ఇండియన్ ఐడల్’ ద్వారా వెలుగులోకి వచ్చిన నేహా కక్కర్.. తర్వాతి సీజన్లో అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి అరుదైన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. కాలా చష్మా, దిల్బర్ రీమిక్స్ వంటి పలు బాలీవుడ్ హిట్ సాంగ్స్ ఆలపించిన నేహా ప్రస్తుతం డిప్రెషన్లోకి వెళ్లిపోయాననడం ఆమె అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే నేహా బాధ పడటానికి కారణం నటుడు హిమాంశ్ కోహ్లి అంటూ అతడిపై విమర్శలు రావడంతో... ‘ ఒకటి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఏ ఒక్కరి కారణంగానో నేను ఈ స్థితికి రాలేదు. నా వ్యక్తిగత జీవితాన్ని ప్రశాంతంగా గడపడం ఈ ప్రపంచానికి ఇష్టం లేనట్టుంది. నాలో ఉన్న ప్రతిభను ప్రేమించే, ప్రోత్సహించే ప్రతీ ఒక్కరికి రుణపడి ఉంటాను. కానీ కొంతమంది మాత్రం నా గురించి వారికి ఏమీ తెలియకపోయినా బురద చల్లాలని చూస్తున్నారు. మిమ్మల్ని అడుక్కుంటున్నా. దయచేసి నన్ను సంతోషంగా బతకనివ్వండి. ఒకరి జీవితాన్ని నిర్ణయించే అధికారం తీసుకోకండి. ప్లీజ్ నన్ను బతకనివ్వండి అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నేహా రాసుకొచ్చారు. కాగా నేహా కక్కర్, హిమాంశు ఇండియన్ ఐడల్ 10 వేదిక మీద తమ మధ్య ఉన్న అనుబంధం గురించి రివీల్ చేశారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయనే రూమర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో హిమాంశును అన్‌ఫాలో చేసిన నేహా... ప్రస్తుతం ఈ ఇన్స్టాగ్రామ్ స్టోరీతో ఆ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చారు. -
ఇకపై కొనసాగరు!
బాలీవుడ్లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్‌పై ‘మీటూ’ ఉద్యమం ప్రభావం చూపింది. ఇండియన్ ఐడల్ 10 మ్యూజిక్ షోకు అను మాలిక్ ఇకపై జడ్జ్‌గా కొనసాగరని సంబంధిత సంస్థ ప్రతినిధులు పేర్కొన్నట్లు బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. సింగర్స్ సోనా మహాపాత్ర, శ్వేతా పండిట్లు అను మాలిక్‌పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ‘‘ఇండియన్ ఐడల్ షోకు అను మాలిక్ చాలా కాలం నుంచి జడ్జ్‌గా ఉన్నారు. ఇప్పుడు ఇండియన్ ఐడల్ 10 షోకు విశాల్ దద్లాని, నేçహా కక్కర్తో కలిసి కో–జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇకపై ఇండియన్ ఐడల్ 10 షో జడ్జ్ ప్యానెల్లో అను మాలిక్ కొనసాగరు. ముందుగా ప్లాన్ చేసిన విధంగా షో కొనసాగుతుంది. విశాల్, నేహాలతో పాటు ఇండియన్ మ్యూజిక్‌లో మంచి పేరు సంపాదించుకున్న ఒక వ్యక్తి ఈ షోకు కో–జడ్జ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు’’ అని ఇండియన్ ఐడల్ షో యాజమాన్య ప్రతినిధులు పేర్కొన్నారని బాలీవుడ్ టాక్. -
‘దాని గురించి కూడా కామెంట్ చేయండి’
నేహా కక్కర్.. ఇండియన్ ఐడల్ టీవీ షో చూసేవారికి బాగా పరిచయమున్న పేరు. గత సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న నేహాను ఈసారి అదృష్షం వరించింది. పోటీదారుగా పాల్గొన్న కార్యక్రమానికే న్యాయ నిర్ణేతగా వ్యవహరించే అరుదైన అవకాశం ఆమెకు దక్కింది. త్వరలో ప్రారంభం కానున్న ‘ఇండియన్ ఐడల్ 10’కు ఆమె న్యాయ నిర్ణేతగా వ్యహరించనున్నారు. ఈ నేపథ్యంలో తన సంతోషాన్నిఇన్స్టాగ్రామ్, ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. నేహా ఈ విషయాన్ని పోస్టు చేయగానే కొందరు ఆమెను అభినందించగా చాలామంది మాత్రం ‘క్రైయింగ్ బేబీ’ అంటూ నేహాను ట్రోల్ చేస్తున్నారు. నేహాను ఇలా అనడానికి కారణం ఉంది. గతంలో నేహా ‘ఇండియన్ ఐడల్’లో పాల్గొన్న సమయంలో సహ పోటీదారుల బాధలు విని ఒక్కసారిగా ఏడ్చేశారు. పాపం అదే నేహా చేసిన తప్పు. ఆ రోజు జరిగిన విషయాలను ఇప్పుడు ట్యాగ్ చేసి, నేహాను ‘క్రైయింగ్ బేబీ’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘కంటెస్టెంట్‌గా ఉన్నప్పుడే అంతలా ఏడ్చావు. ఇప్పుడు బాస్‌గా(న్యాయ నిర్ణేతగా) ఇంకెంత ఏడుస్తావో’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తనను కామెంట్ చేసేవాళ్లందరికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు నేహా. తనను విమర్శించేవారిని ఉద్దేశిస్తూ.. ‘నేను ఏడ్చినందుకు నన్ను కామెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పటి నుంచి నా నవ్వును కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక మీదట నేను చాలాసార్లు నవ్వుతూనే కనిపిస్తాను. నన్ను విమర్శించేవారందరిని ఒక్కటే అడుగుతున్నాను. నేను ఏడుస్తున్నానని కామెంట్ చేస్తున్నారు.. మరి నేను ఇతరులకు సాయం చేస్తుంటాను. ఆ విషయం గురించి కూడా కామెంట్ చేయండి. కెమెరా ముందు ఒకలా, బయట ఒకలా ఉండటం నాకు చేత కాదు. నేను కెమెరా ముందు ఎలా ఉంటానో నిజ జీవితంలో కూడా అలానే ఉంటాను. కెమెరా కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోను. నవ్వాలనిపిస్తే నవ్వుతాను, ఏడుపొస్తే ఏడుస్తాను. అంతే తప్ప కెమెరా కోసం నా భావాలను నియంత్రించుకోను. భావోద్వేగాలు గల మనిషిగా నా గురించి నేను ఎప్పుడు గర్వంగా భావిస్తాను. ఈ కాలంలో జనాలు చాలా వరకూ ఎటువంటి భావోద్వేగాలు, స్పందనలు లేకుండా కఠినంగా ఉంటున్నారు. వాళ్లందరితో పోల్చుకుంటే నేను చాలా హాయిగా బతుకుతున్నాను’ అంటూ జవాబిచ్చారు. -
‘ఇండియన్ ఐడల్’కు ఎంపికైన శృతి
హైదరాబాద్: ఇండియన్ ఐడల్–2018కు సోనీ ఎంటర్టైన్మెంట్ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఎంఎల్ఎన్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్, ఎంఎల్ఎన్ ఈవెంట్స్ సంయుక్తంగా అత్తాపూర్‌లో నిర్వహించిన ఆడిషన్స్‌కు భారీ స్పందన లభించింది. ఇందులో సుమారు 1800కు పైగా ఔత్సాహిక సింగర్స్ పాల్గొన్నారు. నగరం నుంచి ఇండియన్ ఐడల్‌కు ప్లేబ్యాక్ సింగర్ శృతి ఎంపికైనట్టు నిర్వాహకులు తెలిపారు. నేహా కక్కర్, విశాల్ దద్లానీ, అనూమాలిక్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఈ ఏడాది ‘కబర్ పహలే దో’ నినాదంతో జరుగుతోంది. ఈవెంట్స్ నిర్వహణపై యువ సింగర్స్ చాలా సంతోషం వ్యక్తం చేశారని ఎంఎల్ఎన్ అకాడమీ నిర్వాహకులు, ఇండియన్ ఐడల్ సౌతిండియా కో ఆర్డినేటర్ డాక్టర్ ఎంఎస్‌రావు వెల్లడించారు. -
ఇండియన్ ఐడల్ ఆడిషన్స్‌కు విశేష స్పందన
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలోని ఐసీబీఎం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్‌లెన్స్‌లో బుధవారం సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్‌లో ప్రసారం కానున్న ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరం నలుమూలల నుంచి 1500 మంది ఔత్సాహిక గాయకులు హాజరయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆడిషన్ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఇండియన్ ఐడల్–9 విజేత ఎల్.వి.రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఎందరో ఔత్సాహిక గాయకులు పరిచయం కానున్నారన్నారు. 10 వ ఇం డియర్ ఐడియల్ హైదరాబాద్‌తో పా టు వై జాగ్లలో ఆడిషన్స్‌ను నిర్వహించనుందన్నా రు. గతంలో కంటే ప్రస్తుతం నిర్వహిస్తు న్న ఆ డిషన్స్కు విశేష స్పందన లభిస్తుందన్నారు. ఈ ఆడిషన్స్‌లో న్యాయ నిర్ణేతలుగా నీరజ్ కా లాకర్, మంగల్ మిశ్రాలు వ్యవహరించారు. ఆడిషన్స్ మేనేజర్ శర్మ మాట్లాడుతూ... మొత్తం 22 రాష్ట్రాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇప్పటికి 22 వేల మందికి పైగా ఈ ఆడిషన్స్‌లో పాలుపంచుకున్నారన్నారు. మొత్తం 200 మందిని ఎం పిక చేసి ముంబాయిలో జరిగే ఆడిషన్స్‌కు ఎంపిక చేస్తామన్నారు. ప్రస్తుతం రెండు రౌం డ్లల్లో పోటీలు నిర్వహించామన్నారు. ఈ ఆడిషన్స్‌కు పలువురు గాయకులు హాజరయ్యారు. -
అందరి సహకారంతోనే ఈ విజయం
ఇండియన్ ఐడల్ రేవంత్.. విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం శంషాబాద్: ఇండియన్ ఐడల్‌ను సొంతం చేసుకున్న తెలుగు గాయకుడు రేవంత్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, అభిమానులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..అభిమానులు, కుటుంబ సభ్యులు, మీడియాతోపాటు శ్రేయోభిలాషులందరి సహకారంతోనే తాను ఇండియన్ ఐడల్‌ను సొంతం చేసుకోగలిగానని అన్నారు. ఆయా వేదికలపై తాను ఆలపించిన ఎన్నో మధురమైన గీతాలు గొప్ప అనుభూతిని మిగిల్చాయన్నారు. -
రేవంత్, రోహిత్‌లకు ఘనస్వాగతం
గాయకుడు రేవంత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగులో ఎన్నో విజయవంతమైన పాటలు పాడిన రేవంత్ ప్రస్తుతం తన గాత్రాన్ని జాతీయ స్థాయిలో వినిపిస్తున్నాడు. రేవంత్‌తో పాటు మరో యువ గాయకుడు రోహిత్ కూడా ఇండియన్ ఐడల్ వేదిక మీద సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఈ కాంపిటీషన్లో ఫైనల్‌కు చేరిన ఈ యువ గాయకులు పోటి మధ్యలో కాస్త కాలీ సమయం దొరకటంతో హైదరాబాద్‌కు వచ్చారు. ఇండియన్ ఐడల్ వేదిక మీద సత్తా చాటిన ఈ ఇద్దరు గాయకులకు ఘనస్వాగతం పలికేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రస్తుతం నడుస్తున్న ఇండియన్ ఐడల్ సీజన్ 9 ఫైనల్స్ ఏప్రిల్ 2న ప్రసారం కానుంది. -
టాప్ సెవన్‌కు వెళ్లిన రేవంత్
-
ఇండియన్ ఐడల్‌లో రో‘హిట్’
- టాప్–8 వరకు చేరిన పి.రోహిత్ - అత్తమ్మ రమణి స్ఫూర్తితో సింగర్‌గా.. - వివిధ తెలుగు చానళ్ల పాటల పోటీల్లో విజేత - ఓటుతో తనకు అండగా ఉండాలని సిటీవాసులకు పిలుపు సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఐడల్‌లో నగర యువ గాయకుడు పి.రోహిత్ గానామృతంతో హైదరాబాద్ పేరును మార్మోగిస్తున్నాడు. అత్తమ్మ ద్రోణం రాజు రమణి రేడియోలో పాటలు విన్నప్పటి నుంచే ఆమె స్ఫూర్తిగా చిన్నతనం నుంచే గొంతు సవరించుకున్న ఈ 24 ఏళ్ల కుర్రాడు... పాడుతా తీయగా, సూపర్ సింగర్ 9, స్టార్ సింగర్ వంటి తెలుగు సంగీత షోల్లో విజేతగా నిలిచాడు. ప్రస్తుతం సోనీ టీవీలో ప్రసారమయ్యే ఇండియన్ ఐడల్‌లో చాలా మందిని వెనక్కి నెట్టి టాప్–8 స్థాయి వరకు చేరుకున్నాడు. ఆదివారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు జరిగే ఈ షోలో తన పాటలతో మైమరిపించేందుకు సిద్ధమవుతున్న ఈ యువకుడిని ‘సాక్షి’ పలకరించింది. ఇష్టంతో పాటల వైపు... మా పెద్ద అత్తమ్మ ద్రోణం రాజు రమణి రేడియోలో పాటలు పాడుతుంటే వినేవాణ్ని. ఆ పాటలకు ఎంతో మైమరిచిపోయా. అప్పటి నుంచే ఓ ప్రొఫెషనల్ సింగర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే నాన్న కృష్ణ, గృహిణి అయిన అమ్మ సుధా కూడా నా ఇష్టాన్ని గుర్తించి ప్రోత్సహించారు. మా ఫ్యామిలీ విద్యానగర్‌లో ఉంటుంది. హిమాయత్‌నగర్‌లోని హోవర్డ్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి వరకు చదివా. పర్వతాపూర్ అరోరా ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ చదివా. క్లాసికల్ గురువు అయినా భాస్కర్ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం వద్ద సంగీతం బాగా సాధన చేశా. ఆ తర్వాత తెలుగు చానళ్లలోని వివిధ పాటల కార్యక్రమాల్లో పాల్గొని విజేతగా నిలిచా. ఇటీవల విడుదలైన శతమానం భవతి మూవీలో నేను పాడిన ‘భగభగ భోగీ మంటలే’ పాటకు ప్రేక్షకుల నుంచి ఆదరణ రావడం లైఫ్‌లో మరచిపోలేను. ఒక్కడున్నాడు, బహుబలిలో కోరస్, బ్యాక్వోరల్ పాడా. బాహుబలి తమిళ వెర్షన్ సినిమాలోనూ పాటలు పాడా. మీ వాడిని...ఓటేయండి ప్రముఖ సోనీ టీవీ ఇండియన్ ఐడల్‌లో టాప్–8లోకి చేరుకున్నా. సెప్టెంబర్ నుంచి ప్రారంభమైన ఈ షోకు ముందు వేలాది మందికి పాటల పోటీ పెట్టి చివరగా 24 మందిని ఎంపిక చేశారు. అలా సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు వివిధ రౌండ్లలో నెగ్గుతూ టాప్–8కి చేరుకున్నా. నాలో ఉన్న గానామృత ప్రతిభ ప్రదర్శనకు మీరు వేసే ఓటు నన్ను మరింత సుదూరాలకు తీసుకెళ్తుంది. టాప్–8 రౌండ్ ఆదివారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు షో ఉంటుంది. ఆ తర్వాత రాత్రి 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు ఓటింగ్ లైన్స్ తెరవబడి ఉంటాయి. http://www.sonyliv.comకి వెళ్లవచ్చు. లేదంటే sonyliv యాప్‌ను మొబైల్లోని గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తరవాత షోస్, ఇండియన్ ఐడల్, పబ్లిక్ ఓటింగ్‌లోకి కెళ్లి క్యాట్‌లాగ్ నుంచి రోహిత్ పేరును సెలక్ట్ చేసి ఓటు వేయాలి. ఇప్పటికే మన హైదరాబాద్ నుంచి కారుణ్య రన్నర్‌గా, శ్రీరామ్ చంద్ర గతంలో ఇండియన్ ఐడిల్లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. -
జైలులో ‘తీహార్ ఐడల్’
న్యూఢిల్లీ: ఇండియన్ ఐడల్ తరహాలో తీహార్ జైలు అధికారులు ఖైదీల కోసం ‘తీహార్ ఐడల్’ రెండో సీజన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోను నిగమ్ మాట్లాడుతూ ఖైదీల ప్రదర్శన చూసిన తాను కంటి నుంచి నీరు కారకుండా తీవ్రంగా ప్రయత్నించానని చెప్పారు. వారి గానం ఆలకించిన తాను చలించి పోయానన్నారు. తన గాన మాధుర్యంతో అటు ఖైదీలను, ఇటు అధికారులను మైమరిపించిన సోను నిగమ్ ఖైదీలు కూడా అద్భుతంగా పాడారని ప్రశంసించారు. పాడాలన్న వారి తపన, అంకిత భావం తన కళ్లను చెమర్చకుండా ఆపలేకపోయిందని అన్నారు. ఓ జైలులో ప్రదర్శన ఇవ్వడం తనకు ఇదే మొదటిసారి అని, ఇక్కడ ఇటువంటి అనుభవాన్ని ఎదుర్కొంటానని తానెప్పుడూ ఊహించలేదని చెప్పారు. ఇకపై తీహార్ ఐడల్ 3, 4, ఐదుతో పాటు భవిష్యత్తులో కూడా అన్ని పాటల పోటీలకు హాజరవుతానని సోను జైలు అధికారులకు హామీ ఇచ్చారు. ప్రముఖ గాయకులు రాజా హసన్, నందినీ దేవ్, నటి ఆకృతి భారతి, సోను నిగమ్ తండ్రి ఆగమ్ నిగమ్ కూడా ఇక్కడ ప్రదర్శనలిచ్చారు. వచ్చే మే నెల వరకూ జైలు ఆవరణలోనే ఈ పోటీలు కొనసాగనున్నాయి. ఢిల్లీ జైళ్ల డీఐజీ ముఖేశ్ ప్రసాద్, ఒకటో నంబరు జైలు సూపరింటెండెంట్ రాజేశ్ చౌహాన్ ఇతర జైలు ఉన్నతాధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ మిషన్‌కు తన మద్దతు తెలిపిన సోను నిగమ్ ముందుగా ప్రభుత్వం తన విధి నిర్వహించాలని, ఆ తరువాత పరిశుభ్రత పాటించని వారికి జరిమానాలు విధించాలన్నారు. -
‘ప్రేమ గీమ జాన్తా నయ్’ మూవీ స్టిల్స్
-
'అమెరికన్ ఐడల్'కు ర్యాన్ సీక్రెస్ట్ గుడ్ బై?
యూఎస్ లో అత్యధిక జనాదరణ పొందిన 'అమెరికన్ ఐడల్' టెలివిజన్ కార్యక్రమానికి యాంకర్, ప్రొడ్యూసర్ ర్యాన్ సీక్రెస్ట్ గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. నిర్మాతగా కార్యక్రమాలను రూపొందించడానికి 'అమెరికన్ ఐడల్'కు వదులుకునేందుకు సిద్దపడినట్టు ఓ వైబ్ సైట్ కథనాన్ని ప్రచురించింది. 2002లో ప్రారంభమైన 'యూఎస్ రియాల్టీ పాటల పోటీ'కి అమెరికాలో అత్యంత జనాదరణ లభించింది. 'అమెరికన్ ఐడల్'కు ఇదే చివరి సీజన్ అని మిత్రులకు ర్యాన్ తెలిపినట్టు ఓ గాసిప్ వెబ్ సైట్ వెల్లడించింది. ఆస్కార్ రేంజ్ లో చిత్రాలను నిర్మించడానికి, మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలకు స్వీకారం చుట్టేందుకు ర్యాన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా 'అమెరికన్ ఐడల్' కుదుర్చుకున్న 30 మిలియన్ డాలర్ల కాంట్రాక్టు పూర్తి కావొస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 'అమెరికన్ ఐడల్'ను స్పూర్తిగా తీసుకుని భారత్ లో 'ఇండియన్ ఐడల్' టెలివిజన్ కార్యక్రమం ఆరంభమై దేశవ్యాప్తంగా జనాదరణ పొందిన సంగతి తెలిసిందే. -
ప్రేమంటే అంత ద్వేషం దేనికి?
ప్రపంచమంతా ప్రేమ మయం. యూత్ అయితే ప్రేమనామస్మరణతో తరించిపోతున్నారు. ఇలాంటి ఈ రోజుల్లో ఈ కుర్రాడు ‘ప్రేమా లేదు.. గీమా లేదు’ అంటున్నాడు. కూరలో కరివేపాకులా ప్రేమను తీసిపారేస్తున్నాడు. ఇంతకీ ఈ కుర్రాడెవరు? ప్రేమపై అంత ద్వేషాన్ని ఎందుకు పెంచుకున్నాడు? చివరకు ఈ కుర్రాడి జీవితంతో ప్రేమ ఎలా ఆడుకుంది? ఆనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమా గీమా జాన్తా నయ్’. ‘ఇండియన్ ఐడల్’ శ్రీరామచంద్ర, బార్బీ హండా జంటగా నటించారు. సుబ్బు ఆర్వీ దర్శకుడు. మద్దాల భాస్కర్(భాను), దాడి బాలభాస్కర్ నిర్మాతలు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ రెండోవారంలో విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ-‘‘గాయకుడు శ్రీరామచంద్రను హీరోగా స్థిరపరిచే సినిమా ఇది. మహానటుడు ఎస్వీఆర్ మనవడు జూనియర్ ఎస్వీరంగారావు విలన్‌గా నటించారు. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. యువతరం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకునే సినిమా అవుతుంది’’ అని తెలిపారు. నరేష్, భానుచందర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: సురేందర్‌రెడ్డి, జగదీష్. -
కిక్ బాక్సింగ్ నేర్చుకున్న శ్రీరామ్
‘ఇండియన్ ఐడిల్’ శ్రీరామచంద్ర కిక్ బాక్సింగ్ నేర్చుకున్నారు. ఎందుకో తెలుసా? ‘ప్రేమా గీమా జాన్తా నయ్’ కోసం. ఈ సినిమాతో ఆయన హీరోగా పరిచయం అవుతున్నారు. కథలో భాగంగా కిక్ బాక్సింగ్ నేర్చుకున్నానని శ్రీరామచంద్ర చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘నన్ను హీరోగా చేయమని గత రెండేళ్ల నుంచి చాలామంది అడుగుతున్నారు. కొన్ని కథలు కూడా విన్నాను. దర్శకుడు సుబ్బు చెప్పిన కథ వినూత్నంగా అనిపించి ఓకే చెప్పాను’’ అని తెలిపారు. సుబ్బు ఆర్.వి. దర్శకత్వంలో శుభం క్రియేషన్స్ పతాకంపై మద్దాల భాస్కర్, డీబీ భాస్కర్ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమా గీమా జాన్తా నయ్’. ఈ నెల 11న పాటల్ని విడుదల చేయబోతున్నామని నిర్మాతలు చెప్పారు. మణిశర్మ స్వరాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని దర్శకుడు పేర్కొన్నారు. ఇందులో కామెడీ ఛాయలున్న విలన్‌గా నటిస్తున్నానని ఎస్వీ రంగారావు తెలిపారు. యువతను ఆకట్టుకునే చిత్రమిదని కథానాయిక బార్బీ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి, సహనిర్మాతలు: ప్రతాప్‌రెడ్డి, అడారి మూర్తి. -
ఇండియన్ ఐడల్ జూనియర్ విజేతగా అంజన
ఆ చిన్నారికి హిందీ రాదు. కానీ అద్భుతమైన గళంతో ఆమె పాడిన హిందీ పాటలకు ప్రేక్షకులతో పాటు జడ్జీలు కూడా మైమరచిపోయారు. అంతే.. పదేళ్ల అంజనా పద్మనాభన్ 'ఇండియన్ ఐడల్ జూనియర్' మొట్టమొదటి టైటిల్‌ను గెలిచేసుకుంది. ముంబైలో పలువురు దిగ్గజాల సమక్షంలో జరిగిన ఈ రియాల్టీ షో గ్రాండ్ ఫినాలేలో అంజన విజేతగా నిలిచింది. ఫైనల్స్‌లో ఆమెతో పాటు నిర్వేష్ సుధాంశుభాయ్ దవే, దేవాంజన కర్మాకర్, అన్మోల్ జస్వాల్ పోటీపడ్డారు. కానీ, వాళ్లందరినీ తోసిరాజని అంజన బహుమతి కొట్టేసింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన అంజన.. తాను ఇది ఏమాత్రం ఊహించలేదని, చాలా సంతోషంగా ఉందని వచ్చీరాని హిందీలో ముద్దుముద్దుగా చెప్పింది. ఈ బహుమతి కింద అంజనకు ట్రోఫీతో పాటు 25 లక్షల రూపాయల నగదు పురస్కారం, ఓ నిసాన్ మైక్రా కారు కూడా అందించారు. ఇంకా... కోటక్ మహీంద్రా, హార్లిక్స్ కంపెనీల నుంచి 5 లక్షలు, 2 లక్షల చొప్పున గిఫ్ట్ చెక్కులు అందాయి. ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్, సంగీత దర్శకులు విశాల్ దద్లానీ-శేఖర్ రావ్‌జియానీ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ స్వయంగా 'మేరే సాథ్ ఆవో మేరే దోస్తోం' అనే పాటను నలుగురు ఫైనలిస్టులతో కలిసి పాడారు. త్వరలో విడుదల కానున్న 'ఫటా పోస్టర్ నిక్లా హీరో' చిత్ర ప్రమోషన్ కోసం షాహిద్ కపూర్ కూడా వచ్చాడు. జంజీర్ జంట రామ్ చరణ్, ప్రియాంకా చోప్రా కూడా వేదికపై డాన్సు చేశారు. శ్రేయా ఘోషల్ ఆషికీ2 లోని తన సూపర్ హిట్ సాంగ్ 'సున్ రహా హైనా తూ', బర్ఫీలోని 'ఇత్నీ సీ హసీ' పాటలు పాడి ప్రేక్షకులను అలరించింది.