కిక్ బాక్సింగ్ నేర్చుకున్న శ్రీరామ్ | Sri Ramchandra learns kick boxing for upcoming movie | Sakshi
Sakshi News home page

కిక్ బాక్సింగ్ నేర్చుకున్న శ్రీరామ్

Published Tue, Oct 8 2013 1:18 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

కిక్ బాక్సింగ్ నేర్చుకున్న శ్రీరామ్ - Sakshi

కిక్ బాక్సింగ్ నేర్చుకున్న శ్రీరామ్

‘ఇండియన్ ఐడిల్’ శ్రీరామచంద్ర కిక్ బాక్సింగ్ నేర్చుకున్నారు. ఎందుకో తెలుసా? ‘ప్రేమా గీమా జాన్‌తా నయ్’ కోసం. ఈ సినిమాతో ఆయన హీరోగా పరిచయం అవుతున్నారు. కథలో భాగంగా కిక్ బాక్సింగ్ నేర్చుకున్నానని శ్రీరామచంద్ర చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘నన్ను హీరోగా చేయమని గత రెండేళ్ల నుంచి చాలామంది అడుగుతున్నారు. 
 
 కొన్ని కథలు కూడా విన్నాను. దర్శకుడు సుబ్బు చెప్పిన కథ వినూత్నంగా అనిపించి ఓకే చెప్పాను’’ అని తెలిపారు. సుబ్బు ఆర్.వి. దర్శకత్వంలో శుభం క్రియేషన్స్ పతాకంపై మద్దాల భాస్కర్, డీబీ భాస్కర్ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమా గీమా జాన్‌తా నయ్’. ఈ నెల 11న పాటల్ని విడుదల చేయబోతున్నామని నిర్మాతలు చెప్పారు. మణిశర్మ స్వరాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని దర్శకుడు పేర్కొన్నారు. 
 
 ఇందులో కామెడీ ఛాయలున్న విలన్‌గా నటిస్తున్నానని ఎస్వీ రంగారావు తెలిపారు. యువతను ఆకట్టుకునే చిత్రమిదని కథానాయిక బార్బీ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి, సహనిర్మాతలు: ప్రతాప్‌రెడ్డి, అడారి మూర్తి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement