
ఆహాలో అలరిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ షో మూడో సీజన్ గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. 26 వారాలుగా సాగిన ఈ షోలో కీర్తి, అనిరుధ్, నసీరుద్దీన్ షేక్ టాప్ 3కి చేరుకున్నారు. వీరిలో నసీరుద్దీన్ విజేతగా నిలిచి టైటిల్‌తో పాటు రూ.10 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. రెండో స్థానంలో నిలిచిన అనిరుధ్ రూ.3 లక్షలు, మూడో స్థానంలో ఉన్న జీవీ శ్రీ కీర్తి రూ.2 లక్షలతో సరిపెట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మోటార్ మెకానిక్ కుమారుడైన నసీరుద్దీన్ తన గాత్రంతో అటు ప్రేక్షకులను, ఇటు షో జడ్జిలను మెప్పించాడు. తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచిన ఇతడు ఓజీ మూవీలో పాట పాడే అవకాశం కూడా దక్కించుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment