ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 2.. గెస్టుగా విజయ్‌ దేవరకొండ | Vijay Devarakonda Special Guest in Telugu Indian Idol Season 3 | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 2.. గెస్టుగా విజయ్‌ దేవరకొండ

Published Thu, Jul 4 2024 6:21 PM | Last Updated on Thu, Jul 4 2024 6:54 PM

Vijay Devarakonda Special Guest in Telugu Indian Idol Season 3

తెలుగు ఇండియన్ ఐడల్ - సీజన్ 3 వినోదాన్ని రెట్టింపు చేస్తూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ వారం ఎపిసోడ్స్‌కి ఓ కొత్త గెస్ట్‌ వచ్చేస్తున్నాడు. 'కల్కి 2898 ఏ.డీ'లో అర్జునుడిగా కనిపించిన టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ షోలో కనిపించనున్నాడు.

ఈ మేరకు ఓ ప్రోమోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ''ఈ షోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆహా మన ప్లాట్‌ఫామ్‌. మన తెలుగు కంటెస్టెంట్స్‌కు సపోర్టుగా ఉండాలి. మీ జర్నీలో ఉండాలని వచ్చాను" అని ప్రోమోలో చెప్పాడు. 

విజయ్ షోకి రావడంతో ఈ వారం ఎపిసోడ్స్ డబుల్ మ్యూజికల్ ట్రీట్‌గా ఉండబోతున్నాయని ఇట్టే తెలిసిపోతుంది. ఈ వారం నుంచే ఓటింగ్ కూడా స్టార్ట్ కానుంది. తెలుగు ఇండియన్ ఐడల్ 3.. ఆహాలో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement