![Indian Idol Shanmukha Priya Got Vishva Gana Priya Title - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/4/photo.jpg.webp?itok=-ROjcxFi)
సాక్షి,విశాఖ పట్నం: ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ షణ్ముఖ ప్రియకు ఈ నెల 5వ తేదీన విశ్వ గాన ప్రియ బిరుదుతో పాటు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో యంగస్ట్ సింగర్ ఆఫ్ ఇండియా అవార్డును అందజేస్తున్నట్టు నిర్వహకుడు వీరుమామ తెలిపారు. నగరంలోని ఓ హోటల్‌లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేడుకులకు రాష్ట్ర మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస రావు, ఎస్.అప్పలరాజు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మేయర్ హరివెంకట కుమారి, జీవీ తదితరు పాల్గొంటారన్నారు
ఆరోజు సాయంత్రం 5 గంటలకు హోటల్ ఫోర్ పాయింట్‌లో ఈ వేడుకను నిర్వహించనున్నట్టు తెలిపారు. విజయ కుమార్ మాట్లాడుతూ షణ్ముఖ ప్రియకు తమ సంస్థ నుంచి పది లక్షలు విలువైన 108 గజాలు స్థలం బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. వేడుకులకు సంబంధించిన పాస్‌ల కోసం 99129 99949 నంబరుకు సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment