vishkapatnam
-
అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత సత్యప్రియ ఆత్మహత్య
-
పర్యాటకం కళకళ
సాక్షి అమరావతి : అందమైన తీర ప్రాంతం.. అపార పర్యాటక వనరులు.. తూర్పు కనుమల్లోని వైవిధ్యం.. విదేశాలను తలపించే హిల్ స్టేషన్లు.. కృష్ణా, గోదావరి అందాలు.. రాష్ట్ర పర్యాటకానికి మణిహారంగా నిలుస్తున్నాయి. దేశంలో అత్యధిక మంది పర్యాటకులు సందర్శిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ప్రధానంగా విశాఖలో బీచ్‌లకు, అరకు వ్యాలీకి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో అంతర్జాతీయ స్థాయి పర్యాటక పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.గతేడాది విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో పర్యాటక రంగంలో 117 ఒప్పందాల ద్వారా రూ.18 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దాదాపు రూ.3049.90 కోట్ల సివిల్ వర్క్స్ ప్రారంభం అయ్యాయి. ఇవి పూర్తయితే 9,022 మందికి ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద రూ.600 కోట్లతో 7 వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా ఒప్పందాలు పూర్తయ్యాయి. మరో రూ.3,757 కోట్లతో 2,750 మందికి ఉపాధి కలి్పంచేలా 15 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద (ఓఅండ్ఎం) 87 ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. రాష్ట్ర పర్యాటక సిగలో ఎన్నెన్నో.. ⇒ రూ.544 కోట్లతో రాజమహేంద్రవరంలోని గోదావరిపై ఉన్న పురాతన హేవ్‌లాక్ (రైల్వే) బ్రిడ్జిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఒప్పందం. తునికి సమీపంలోని చిన్న శంకర్లపూడిలో 18 గోల్ఫ్ కోర్సులు, టూరిజం కాంప్లెక్సులు, అడ్వెంచర్ స్పోర్ట్స్, వెల్నెస్ సెంటర్, బయోడైవర్సిటీ థీమ్ ప్రాజెక్టు. ⇒ విశాఖపటా్నన్ని టూరిజం డెస్టినీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. భోగాపురంలో రూ.750 కోట్లతో 300 ఎకరాల్లో రేసింగ్ ట్రాక్, గోల్ఫ్ కోర్సులు ఏర్పాటు చేయనున్నారు. విశాఖపట్నంలో రూ.243 కోట్లతో 10 ఎకరాల్లో ఐ ఆఫ్ వైజాగ్ (మెగా వీల్), రూ.100 కోట్లతో 5 ఎకరాల్లో స్కై టవర్, రూ.25 కోట్లతో స్నో వరల్డ్‌కు డీపీఆర్ సిద్ధమైంది. కోస్టల్ జోన్ టూరిజంలో భాగంగా 288 బీచ్‌లను గుర్తించి అత్యాధునిక వసతులు కలి్పస్తున్నారు. ⇒ ఆంధ్రా ఊటీగా పేరొందినæ అరకు–లంబసింగి సర్క్యూట్, గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోట ప్రాంతాలను అంతర్జాతీయ పర్యాటక ప్రమాణాలకు అనుగుణంగా రూ.150 కోట్లతో తీర్చిదిద్దనున్నారు. ⇒ రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో రూ.1,350 కోట్ల అంచనాతో 7 స్టార్ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మాణానికి ఒబెరాయ్ ముందుకొచి్చంది. ⇒పెనుకొండలో ఇస్కాన్ చారిటీస్ ఆధ్వర్యంలో రూ.100 కోట్లతో 69.75 ఎకరాల విస్తీర్ణంలో స్పిరుచ్యువల్ కేంద్రం, అరకు, పేరూరు, కాకినాడలో 5 స్టార్ హోటల్, కాకినాడ బీచ్ ఫ్రంట్ అభివృద్ధి.. పలు ప్రాంతాల్లో శిల్పారామాలు, విశాఖ లో టన్నెల్ ఆక్వేరియం హోటల్, పలు ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్ట్లు ఏర్పాటు కానున్నాయి. అన్న వరం ప్రాంతంలో మేఫెయిర్ సంస్థ (భువనేశ్వర్) లగ్జరీ రిసార్ట్‌ను అభివృద్ధి చేయనుంది. -
విశాఖ చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
అదరగొట్టిన ప్రణీత్.. 8 వికెట్ల తేడాతో కోస్టల్ రైడర్స్ విజయం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక కోస్టల్ రైడర్స్ జట్టు 16 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్ 12 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో... బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్ 8 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ఉత్తరాంధ్ర లయన్స్‌కు రెండో స్థానం, రాయలసీమ కింగ్స్‌కు మూడో స్థానం, బెజవాడ టైగర్స్‌కు నాలుగో స్థానం లభించాయి. కోస్టల్ రైడర్స్తోపాటు ఈ మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందాయి. శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్‌తో బెజవాడ టైగర్స్ ... క్వాలిఫయర్–1లో ఉత్తరాంధ్ర లయన్స్‌తో కోస్టల్ రైడర్స్ ఆడతాయి. రాయలసీమ కింగ్స్‌తో చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో కోస్టల్ రైడర్స్ జట్టు వీజేడీ పద్ధతిలో 8 వికెట్లతో గెలిచింది. ముందుగా రాయలసీమ కింగ్స్ 18 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించింది. హనీష్ రెడ్డి (78; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరిశాడు. వర్షం తగ్గాక కోస్టల్ రైడర్స్ జట్టుకు 17 ఓవర్లలో 124 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించారు. కోస్టల్ జట్టు 14 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి గెలిచింది. ప్రణీత్ (64 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), చిరంజీవి (32 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడగా ఆడారు. మరో మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర లయన్స్ ఏడు వికెట్లతో గోదావరి టైటాన్స్‌ను ఓడించింది. చదవండి: ప్రత్యర్థులుగా ఇంగ్లండ్, నెదర్లాండ్స్ -
APL 2023: ఉత్కంఠగా సాగుతున్న ఏపీఎల్.. ఫోటోలు
-
మ్యాచ్ మ్యాచ్‌కు ఉత్కంఠ.. ఉన్నదిపాయే, ఉంచుకున్నది పాయే! జీవితమే!
భారత్‌లో క్రికెట్ అంటే ఒక మతం. మన దేశ జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ క్రికెటే ఎక్కువ మంది అభిమానించే ఆటగా మారిపోయింది. మ్యాచ్ ప్రారంభం కాకముందే టీవీలకు అతుక్కుపోయేవాళ్లు ఇప్పటికి చాలా మంది ఉన్నారు. ఇంతవరకు అంతబాగానే ఉన్న బెట్టింగ్ అనే భూతం మాత్రం మనుషుల జీవితాలను ఛిద్రం చేస్తుంది. బెట్టింగ్ మాయలో పడి చిన్న పెద్ద తేడా లేకుండా తమ జీవితాలను నాశానం చేసుకుంటున్నారు. ముఖ్యంగా బెట్టింగ్‌కు బలయ్యేది ఎక్కువగా యువకులే. టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కడంతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లు పుట్టుగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. ఈజీగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్ ఊబిలోకి దిగుతున్నారు. ఒక్క మ్యాచ్ కాకపోతే.. మరో మ్యాచ్ లో అయినా డబ్బులొస్తాయనే ఆశతో అప్పుల మీద అప్పులు చేస్తుంటారు. ఆ తర్వాత అప్పులు ఊబిలో కూరుకుపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనలు దేశవ్యాప్తంగా తరుచూ ఎదోఒక చోట జరుగుతునే ఉంటున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పదుల సంఖ్యలో బెట్టింగ్‌లు అలవాటు పడి ప్రాణాలను తీసుకుంటున్నారు. మన పక్కరాష్ట్రం తమిళనాడులో కూడా గత మూడేళ్లలో 40 మంది ప్రాణాలను ఈ బెట్టింగ్ భూతం మింగేసింది. ఇది చూస్తే మనం అర్ధం చేసుకోవచ్చు బెట్టింగ్ మనుషులను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో. ఇక యువకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఆన్లైన్ బెట్టింగ్, జూద క్రీడలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా కట్టడి చేయాలి. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాలు ఆన్లైన్ క్రీడలు, బెట్టింగ్‌లను నిషేధించాయి. బెట్టింగ్ భూతానికి బలైన యువకుడు.. తాజాగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ మరో యువకుడు బలైపోయాడు. ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన మణికంఠ సాయికుమార్ (25) క్రికెట్ బెట్టింగ్‌లకు గత కొంత కాలంగా అలవాటు పడ్డాడు. దీంతో బయట అప్పులు చేసి ఆన్లైన్ బెట్టింగ్ ఆడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో క్రికెట్ బెట్టింగ్‌ల్లో తీవ్రంగా నష్టపోయి.. అప్పులపాలు అయ్యాడు. దీంతో బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అంది వచ్చినా కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇది ఒక్క మణికంట కుటంబంలోనే కాదు.. ఈ క్షోభ చాలా మంది కుటుంబాల్లో నెలకొంటోంది. క్రికెట్‌ను అభిమానించండి తప్పులేదు.. బెట్టింగ్‌లకు మాత్రం అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే మీపై మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది. ఇకనైన కళ్లు తెరవండి, బెట్టింగ్ మానండి. -
వేసవి ప్రభావం గురించి విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద
-
YMCA బీచ్ లో అనుమానాస్పద స్థితిలో యువతి
-
గీతం యూనివర్సిటీలో మొత్తం 40 ఎకరాలు ఆక్రమణ: ఆర్డీవో
-
విశాఖలో భారత్-ఆసీస్ రెండో వన్డే.. అభిమానులకు బిగ్ అలర్ట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా భారత జట్లు మూడు వన్డేల సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా మార్చి 19న విశాఖపట్నం వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లను శనివారం(మార్చి 10) నుంచి విక్రయించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసొసియేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. మార్చి 10 నుంచి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఏసీఏ సెక్రటరీ ఎస్ గోపినాథరెడ్డి తెలిపారు. అదే విధంగా 13న ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్లను విక్రయించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. టికెట్ల ధరలు రూ.600, రూ.1,500, రూ.2000, రూ.3000, రూ.3,500, రూ.6000గా నిర్ణయించామని గోపినాథరెడ్డి వెల్లడించారు. ఇక మార్చి 17న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. రెండో వన్డేకు విశాఖ.. ఆఖరి వన్డేకు చెన్నైలోని చెపాక్ స్టేడియం అతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే ఆసీస్‌తో తొలి వన్డేకు మాత్రం టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండనున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు సారథిగా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చహల్, శార్ధూల్ ఠాకూర్ -
ఆర్థిక వ్యవస్థలో ఏపీ నంబర్ వన్
-
దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. భారత జట్టులో మూడు మార్పులు..!
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లో ఓటమి చెందిన టీమిండియా.. మంగళవారం విశాఖపట్నం వేదికగా జరగనున్న మూడో టీ20లో తాడో పేడో తెల్చుకోవడానికి సిద్దమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో భారత్ వెనుకబడి ఉంది. అయితే మూడో టీ20కు టీమిండియా తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాగా తొలి రెండు మ్యాచ్‌ల్లో బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమైన అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా టీమిండియా స్పెషలిస్ట్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడికి మూడో టీ20కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో అతడి స్థానంలో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు పేసర్ ఆవేష్ ఖాన్ కూడా ఈ మ్యాచ్‌కు బెంచ్‌కు పరిమతమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అతడి స్థానంలో ఆర్షదీప్కు సింగ్‌ను ఆడించాలని మేనేజేమెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా జమ్మూ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ మరో సారి బెంచ్‌కే పరిమతమయ్యే అవకాశం ఉంది. తుది జట్టు అంచనా : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్) (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), దినేష్ కార్తీక్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ చదవండి: Joe Root: ఎప్పుడు కొట్టని షాట్ ఆడాడు.. అందుకే ఆశ్యర్యపోయాడా? -
Kommu Konam Fish: చిన్న పడవకు చిక్కిన పెద్ద చేప
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ప్రస్తుతం సముద్రంలో వేట నిషేధం అమలులో ఉంది. వచ్చే నెల వరకు సముద్రం చేప దొరకాలంటే కష్టం. ఈ పరిస్థితుల్లో ఆదివారం మత్స్యకారులకు కొమ్ముకోనం చేప కొమ్ము కాసింది. అదేంటి.. వేట విరామంలో ఇంత పెద్ద చేప ఎలా వలకు చిక్కిందని ఆలోచిస్తున్నారా? తెర పడవలపై పలువురు జాలర్లు రోజంతా కష్టపడితే కొమ్ముకోనం చేపలు విరివిగా పడతున్నాయి. వేట విరామంలో ఇంజిన్ బోట్ల (మరపడవలు)తో వేట నిషేధం. కానీ తెర పడవల మీద వేటకు వెళ్లవచ్చు. వీరి కష్టానికి ఎంతో కొంత ప్రతిఫలం దొరుకుతుంది. అలా ఆదివారం భారీ సంఖ్యలో చేపలు వలకు చిక్కాయి. 80 కిలోల నుంచి 100 కిలోల బరువు ఉండే ఈ కొమ్ముకోనం చేపకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. 100 కిలోల చేప రూ.20 వేల పైబడి ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. 6 అడుగుల నుంచి 12 అడుగుల వరకు ఉండే ఈ చేపను కేరళవాసులు ఎంతో ఇష్టపడి తింటారు. ఒక్క వేటలో భారీగా చేపలు చిక్కడంతో మత్య్సకారులు సంతోషం వ్యక్తం చేశారు. -
ఐపీఎల్లో తెలుగోళ్లు... తొలి సారిగా అంపైర్!
విశాఖ స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విశాఖ నుంచి ప్రాతినిధ్యం లభించింది. ఢిల్లీ కాపిటల్స్ తరఫున ఆడేందుకు కేఎస్ భరత్ సిద్ధమవుతుండగా...మ్యాచ్‌లకు అంపైర్‌గా సీహెచ్ రవికాంత్ బయలుదేరనున్నారు. భరత్‌కు ఇప్పటికే ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తరఫున ఆడిన అనుభవం ఉంది. బీసీసీఐ పానెల్ అంపైర్ రవికాంత్ మాత్రం తొలిసారిగా ఐపీఎల్ మ్యాచ్‌లకు సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా విశాఖకు చెందిన వీరిద్దరికి క్రికెట్ సంఘం ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఈసారి ఢిల్లీ కాపిటల్స్ తరఫున ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ కె. శ్రీకర్ భరత్ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్లో ఆడనున్నాడు. రంజీల్లో ట్రిపుల్ సెంచరీ, వికెట్ కీపర్ బాటర్‌గా రికార్డు సాధించి భరత్ తొలిసారిగా 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు తరఫున ఐపీఎల్ మ్యాచ్‌లాడాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌కు తొలిసారిగా జట్టుకూర్పులో స్థానం సాధించాడు. ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలకు ఎంపికైనా జాతీయ జట్టు తరఫున పూర్తిస్థాయిలో ఆడే అవకాశం దక్కలేదు. ఇటీవలే న్యూజిలాండ్‌తో ఆడిన టెస్ట్ మ్యాచ్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా జట్టు తరఫున ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంక సిరీస్‌లోనూ జట్టుతోనే ఉన్నాడు. అయితే ఐపీఎల్లో మాత్రం మరోసారి ఆడేందుకు అహ్వానం అందుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ తరఫున చివరి బంతిని గాల్లో బౌండరీకి తరలించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో ఐపీఎల్‌లోనూ భరత్‌కు మంచి గుర్తింపు వచ్చింది. సిక్సర్‌ను ఢిల్లీ కాపిటల్స్ జట్టుపైనే సాధించగా...ఈసారి ఆదే ఢిల్లీ కేపిటల్స్ తరఫున జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. టీ20 మ్యాచ్‌ల్లోనూ అర్ధసెంచరీ నమోదు చేసిన భరత్ వికెట్ల వెనుక నిలబడి 29 స్టంపింగ్స్ చేశాడు. ప్యానెల్ అంపైర్‌గా 250 మ్యాచ్‌లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహించిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌ల్లో 250 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించిన సీహెచ్ రవికాంత్ తొలిసారిగా ఐపీఎల్లో అంపైరింగ్‌కు ఆహ్వానం అందుకున్నాడు. పలు టీ20 మ్యాచ్‌లు అంపైరింగ్ చేశారు. తొలిసారి జిల్లా ప్యానల్ అంపైర్‌గా పిచ్‌పైకి వచ్చిన రవికాంత్ అనతికాలంలోనే అనంతపురంలో తొలిసారిగా స్టేట్ ప్యానల్ అంపైర్ అయ్యారు. ఇక 2008లో బీసీసీఐ ప్యానల్ అంపైర్ కావడంతో దేశవాళీ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసే స్థాయికి ఎదిగారు. 2015 నుంచి రంజీల్లో 39 మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. తొలిసారిగా ఇండియా ఏతో తలపడిన న్యూజిలాండ్ ఏ నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేయడంతో అంతర్జాతీయ మ్యాచ్ అరంగేట్రం జరిగింది. దక్షిణాఫ్రికా అండర్–19 జట్టుతో భారత్ ఆడిన మ్యాచ్‌లకు, మహిళల దక్షిణాఫ్రికా–భారత్ టీ20 సిరీస్‌కు అంపైరింగ్ చేశారు. -
న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌లో మెరిసిన శ్రీకర్ భరత్.. విశాఖలో సంబరాలు
విశాఖ స్పోర్ట్స్ : విశాఖ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో రోజు టెస్ట్ మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కింది. వాస్తవానికి తొలిరోజే ఆడాల్సిఉండగా సీనియర్ వికెట్‌కీపర్ వృదిమాన్ సాహా తుది 11 మంది ఆటగాళ్లలో స్థానం సాధించడంతో శ్రీకర్ భరత్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే అనుహ్యంగా రెండోరోజు ఆటలో వృద్దిమాన్ మెడ కండరం పట్టేయడంతో అతని స్థానంలో మూడో రోజు ఆటకు శ్రీకర్ భరత్ బరిలో దిగాడు. ఆకట్టుకున్న శ్రీకర్ భరత్ న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 67వ ఓవర్లో అశ్విన్ వేసిన తొలిబంతిని ఓపెనర్ యంగ్ ఆడగా... ఔట్‌సైడ్ ఎడ్జ్‌గా వచ్చిన బంతిని భరత్ లోలెవల్‌లో ఒడిసి పట్టుకున్నాడు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో భారత్ రివ్యూకు వెళ్లింది. యంగ్‌ను ఔట్‌గా ప్రకటించడంతో భరత్‌కు కాట్బిహైండ్గా తొలి వికెట్ దొరికింది. 89వ ఓవర్లో అక్షర్ వేసిన బంతిని ఇన్సైడ్ ఎడ్జ్‌గా టేలర్ ఇచ్చినా... భరత్ మిస్ అయ్యాడు. తిరిగి 94.3 ఓవర్లో అక్షర్ బంతినే టేలర్ ముందుకువచ్చి డిఫెండ్ చేసుకోబోయి వికెట్ల వెనుక కాట్ బిహైండ్‌గా భరత్‌కు దొరికిపోయాడు. ఓపెనర్ లాథమ్ వికెట్ల వెనుక దొరికిపోయి భరత్‌కు తొలి స్టంపౌట్ ఆటగాడయ్యాడు. దీంతో ప్రత్యమ్నాయంగా బరిలోకి వచ్చిన విశాఖ కుర్రాడు శ్రీకర్ భరత్ సత్తాచాటాడు. గతంలోనే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు స్టాండ్‌బైగా ఎంపికైన భరత్ ఆడే అవకాశాన్ని అందుకోలేకపోయినా నిరుత్సాహపడకుండా ఈసారి నేరుగా జాతీయ తుది జట్టులో ఆడేందుకే అవకాశాన్ని సుగమం చేసుకున్నాడు. శనివారం భారత్ తరఫున శ్రీకర్ భరత్ చేసిన మూడు డిస్మిసల్స్ అధికారిక టెస్ట్ లెక్కల్లోకి చేరకున్నా ప్రత్యమ్నాయ ఆటగాడిగా చక్కటి గుర్తింపు పొందాడు. ఇలా అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని భరత్ అందిపుచ్చుకోవడంతో విశాఖ క్రీడాభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. చాలా థ్రిల్లింగ్‌గా వుంది... జాతీయ జట్టుకు టెస్ట్ మ్యాచ్‌లో ఆడటమనేది కల. ఆ కల ఈరోజు నెరవేరింది. మూడోరోజు ఆట ఆరంభం నుంచే వికెట్ల వెనుక నిలబడటం...తొలి క్యాచ్‌ను, తొలి స్టంపౌట్ చేయడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. టీ20 సిరీస్ ప్రారంభం నుంచే జట్టుతో ఉన్నాను. – శ్రీకర్ భరత్, వికెట్ కీపర్,బ్యాటర్ చదవండి: KS Bharat: ఒక్క వికెట్ పడగొట్టు అక్షర్.. అశూ.. నువ్వు బాగా బౌలింగ్ చేస్తున్నావు! -
షణ్ముఖ ప్రియకు విశ్వ గాన ప్రియ బిరుదు
సాక్షి,విశాఖ పట్నం: ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ షణ్ముఖ ప్రియకు ఈ నెల 5వ తేదీన విశ్వ గాన ప్రియ బిరుదుతో పాటు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో యంగస్ట్ సింగర్ ఆఫ్ ఇండియా అవార్డును అందజేస్తున్నట్టు నిర్వహకుడు వీరుమామ తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేడుకులకు రాష్ట్ర మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస రావు, ఎస్.అప్పలరాజు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మేయర్ హరివెంకట కుమారి, జీవీ తదితరు పాల్గొంటారన్నారు ఆరోజు సాయంత్రం 5 గంటలకు హోటల్ ఫోర్ పాయింట్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్టు తెలిపారు. విజయ కుమార్ మాట్లాడుతూ షణ్ముఖ ప్రియకు తమ సంస్థ నుంచి పది లక్షలు విలువైన 108 గజాలు స్థలం బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. వేడుకులకు సంబంధించిన పాస్‌ల కోసం 99129 99949 నంబరుకు సంప్రదించాలన్నారు. చదవండి: బాక్సింగ్ రింగ్‌లోకి..విజయ్ దేవరకొండ -
మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : మేకపాటి గౌతమ్ రెడ్డి
సాక్షి,చిత్తూరు: మూడు రాజధానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. సీఎం ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అవుతుందని ఆయన తెలిపారు. అది విశాఖ కావచ్చు, విజయవాడ కావచ్చు.. ఇంకొకటి కావచ్చు అని గౌతమ్ రెడ్డి వాఖ్యనించారు. చదవండి: ఏపీలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ -
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కొయ్యూరు మండలం మర్రిపాలెం చెక్‌పోస్ట్ వద్ద ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేసి ఏలూరుకు తరలిస్తున్నట్లు సమాచారం. కాగా నిన్న దెందులూరులో పెట్రోల్ ధరలపై చింతమనేని ఆందోళన చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకుగాను దెందులూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
సింహద్రి అప్పన్నను దర్శించుకున్న పి.వి.సింధు
సాక్షి,విశాఖపట్నం: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలుగుతేజం పి.వి.సింధు ఆదివారం విశాఖ సింహద్రి అప్పన్నను దర్శించుకున్నారు. పి.వి.సింధు కు అధికార లాంఛనాలతో అర్చకులు స్వాగతం పలికారు. సింహాద్రి అప్పన్న విశిష్టతను క్షేత్ర వైభవాన్ని సింధుకు అర్చకులు వివరించారు. ఆమెతో పాటు తండ్రి పి.వి.రమణ కూడా ఉన్నారు. కాగా సోమవారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. చదవండి:మరో టీమ్‌కు ధోని కెప్టెన్.. మిగతా 10 మంది వీళ్లే! -
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ..ఆపై
సాక్షి, విశాఖపట్నం (గాజువాక): కుటుంబ కలహాల నేపథ్యంలో తన ఇద్దరు పిల్లలతో సహా పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం యారాడలో సంచలనం రేపింది. బంధువులు సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొల్లి శ్రీను కుటుంబంతో యారాడలో నివాసం ఉంటున్నాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య మొల్లి సంధ్య కూడా కూలి పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటోంది. శ్రీను ఐదు నెలలుగా పనులకు వెళ్లడం లేదు. భార్య సంపాదనపైనే ఆధారపడుతున్నాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్థాపానికి గురైన శ్రీను తన 14 ఏళ్ల కుమార్తె అనూష, పదేళ్ల కుమారుడు చరణ్‌లకు బాదం పాలల్లో పురుగు మందు ఇచ్చి తాను కూడా తాగాడు. దీంతో వారందరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. బంధువులు గమనించి వెంటనే వారిని గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. సంఘటన తెలిసిన వెంటనే న్యూపోర్టు పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పిల్లల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. వారి స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం..సీనియర్ మేనేజర్ మృతి
సాక్షి,విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. క్రేన్‌పై నుంచి జారిపడి సీనియర్ మేనేజర్ శ్రీనివాసరావు మృతి చెందారు. స్టీల్‌ప్లాంట్ ఎస్ఎంఎస్-1లో మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
వైఎస్సార్సీపీలోకి జనసేన కార్యకర్తలు..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తన ఉనికిని దాదాపు కోల్పోయింది. ఆ పార్టీకి కాస్త పట్టుకున్న జీవీఎంసీ 79వ వార్డులో భారీ షాక్ తగిలింది. మొన్నటి జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన తరఫున కార్పొరేటర్ అభ్యర్దిగా పోటీ చేసిన కింటాడ ఈశ్వరరావు సహా దాదాపు 100 మంది వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. సుజాతనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఈశ్వరరావు సహా జనసేన కార్యకర్తలకు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో తొలి నుంచి ఉన్న వారికి తగిన ప్రాధాన్యమిస్తూనే పార్టీలోకి వచ్చిన వారికి తగిన గౌరవం ఇస్తామన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసుకుంటూ ఆయా ప్రాంతాల అభివృద్ధికి నడుంబిగించాలని పిలుపునిచ్చారు. ఈశ్వరరావుకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఈశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్ చేస్తున్న ప్రజాసేవను, అంకితభావాన్ని చూసి పార్టీలో చేరానన్నారు. పార్టీ సిద్ధాతాలకు అనుగుణంగా సేవలందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి అన్నంరెడ్డి అజయ్‌రాజ్, నాయకులు ఇల్లపు ప్రసాద్, కాసు అంజిరెడ్డి, సుండ్రపు అప్పారావు, సుండ్రపు శ్రీనివాస్, వినోద్, గొర్లె రామునాయుడు, ఎల్బీ నాయుడు, ఆదిరెడ్డి మురళి, చిన్ని, ఐడి బాబు పాల్గొన్నారు. -
విశాఖపట్నం టూ ఢిల్లీ టూర్.. ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు ఇవే
సాక్షి,విశాఖపట్నం: పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే వారికోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు డిప్యూటీ జనరల్మేనేజర్ డీఎస్‌జీపీ కిశోర్ తెలిపారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్ లోని వీఐపీ లాంజ్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరులసమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా యాత్రలకు సంబంధింన బ్రోచర్‌ను ఆవిష్కరించారు.ఐఆర్సీటీసీ ఇప్పటికే పలు పుణ్యక్షేత్రాలు, ఉత్తర భారతయాత్రలను విజయవంతంగా పూర్తిచేసిందని ఆయన తెలిపారు. రానున్న రెండు నెలల్లో రెండు ప్రత్యేక రైళ్లునడుపుతున్నట్టు ఆయన చెప్పారు. మొత్తం 13 కోచ్‌ల రైళ్లను కేవలం ఈ యాత్రల కోసమే నడుపుతున్నట్లు, రైలుమొత్తం 1300 ఉన్నప్పటికీ కోవిడ్ నేపథ్యంలో కేవలం సగం ఆక్యుపెన్సీతో మాత్రమే ఈ రైళ్లు నడుపుతామన్నారు. ప్రయాణికులకు ప్రతి రోజూ కోవిడ్ కిట్లు అందజేస్తామన్నారు. ఈ రైళ్లలో బయటవారికి ఏ విధమైనఅనుమతి లేకుండా ఈ టూర్ ప్యాకేజిలో ఉన్న వారికి ప్రత్యేక ఐడీ కార్డులు ఇచ్చి వారిని మాత్రమే రైళ్లలోకి అనుమతిస్తామని తెలిపారు. ఇటువంటి తీర్థయాత్రలను వెళ్లాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని, దీనికి ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా తక్కువ చార్జీలతోనే సందర్శించే అవకాశం కల్పిస్తుందని సిబ్బంది తెలిపారు. ఈసమావేశంలో స్టేషన్ మేనేజర్ సురేష్, స్టేషన్ డైరెక్టర్ రాజగోపాల్, ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ చంద్రమోహన్ ,సిబ్బంది పాల్గొన్నారు. ఈ యాత్రల గురించి మరింత సమాచారం కోసం విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో గేట్ నం.1 వద్ద గల ఐఆర్సీటీసీ కార్యాలయంలో స్వయంగా గానీ లేదా 82879 32318 / 82879 32281 / 7670908300 / 0891 2500695 నంబర్లలో గానీ సంప్రదించాలని కోరారు. ఉత్తర భారత యాత్ర ఈ యాత్ర మొత్తం 10 రాత్రుళ్లు 11 పగళ్లు ఉంటుంది. ఈ యాత్రలో ఆగ్రా, వైష్ణోదేవి, స్వర్ణదేవాలయం, వాఘాసరిహద్దు, మానస దేవి మందిరం, గంగా ఆర్తి, ఎర్రకోట, అక్షర్ధామ్ టెంపుల్, కుతుబ్మీనార్, లోటస్ టెంపుల్,ఇండియా గేట్ వంటి ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈటూర్ ఆగస్టు 27 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 6వతేదీన ముగుస్తుంది. ఈ టూర్లో ప్రయాణించాలనుకునేవారు విజయవాడ లేదా గుంటూరులో రైలెక్కాల్సి ఉంటుంది. స్లీపర్‌క్లాస్–10,400/–, థర్డ్ ఏసీ–17,330/–(ఒక్కొక్కరికి) జీఎస్టీతో కలిపి ఈ టూర్ చార్జీలు ఉంటాయి. మహాలయ పిండదాన్ తర్పణ్ ఈ యాత్ర మొత్తం 6 రాత్రులు, 7 పగళ్లు ఉంటుంది. ఈయాత్రలో వారణాసి, ప్రయాగరాజ్, గయ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ టూర్ సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభమై అక్టోబరు 1వ తేదీతో ముగుస్తుంది.ఈ టూర్లో చేరాలనుకునేవారు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, బ్రహ్మపూర్లలో రైలెక్కవచ్చు. ఈ టూర్లో స్లీపర్‌క్లాస్–6620/–, థర్డ్ ఏసీ–11,030/–(ఒకొక్కరికి) జీఎస్టీతో కలిపి చార్జీలు నిర్ణయించారు. ఈ స్పెషల్ రైళ్లలో ప్రయాణించాలనుకునేవారికి రైలెక్కినది మొదలు దిగే వరకు అన్ని ఐఆర్సీటీసీ చూసుకుంటుంది. స్లీపర్‌క్లాస్ వారికి హాల్స్, ధర్మశాలలు, డార్మెటరీలలోవసతి కల్పిస్తారు. థర్డ్ ఏసీ వారికి డబులు, లేదా త్రిబుల్ షేరింగ్ హోటల్లో రూంలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం,సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, సైట్ సీయింగ్ అన్నిప్యాకేజీలు పైన నిర్ణయింన ధరలలోనే ఉంటాయన్నారు. -
మావోయిస్టుల పట్టుతప్పుతోంది...
సాక్షి,విశాఖపట్నం: ఆంధ్రా, ఒడిశా సరిహద్దుతోపాటు విశాఖ ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో మావోయిస్టుల ఉద్యమం క్రమంగా నీరుగారుతోంది. పార్టీకి ఏవోబీ వ్యాప్తంగా గిరిజనుల నుంచి ఆదరణ కరువైంది. గతరెండేళ్ల వ్యవధిలో 9 ఎదురుకాల్పలు సంఘటనలుజరగగా.. 12 మంది మావోయిస్టులు, దళ సభ్యులను పార్టీ పోగొట్టుకుంది. 29 మందిమంది మావోయిస్టులు, దళ సభ్యులు ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన పోలీసు యంత్రాంగమంతా మారుమూల గ్రామాల్లో గిరిజనుల అభివృద్ధి నినాదాన్ని విస్తృతం చేసింది. రామ్‌గూడ అటవీ ప్రాంతంలో నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్ కౌంటర్ మావోయిస్టులకు పెద్ద నష్టంగా చెప్పవచ్చు. ఈ ఘటనలో 33మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే కుమారుడు మున్నాతోపాటు, అనేకమంది కీలక మావోయిస్టులను ఆ పార్టీ కోల్పోయింది. ఆ ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టు నేతలుఆర్కే, ఉదయ్, చలపతి, అరుణలు మరలా మావోయిస్టు పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకుప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా సరే ఫలితం కనిపించడం లేదు. ఇటీవల కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌లోను ఐదుగురు కీలక నేతలను పోగొట్టుకోవడంమావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ. అంతేకాక ఇటీవలఅమరవీరుల వారోత్సవాలు విఫలం కావడం..తాజాగా గురువారం డీజీపీ సమక్షంలో ఆరుగురుమావోయిస్టు కీలక నేతల లొంగిపోవడం పార్టీ ప్రాభవానికివిఘాతమే. తగ్గిన కార్యకలాపాలు ఏవోబీలో మావోయిస్టు దళాలు పట్టు తప్పుతున్నాయి. ఒడిశాలోని కలిమెల, నందపూర్,గుమ్మా, నారాయణపట్నం, పెదబయలు, కోరుకొండ దళాల్లో సభ్యుల సంఖ్య తగ్గడంతో దళాల కార్యకలపాలు తగ్గాయని సమాచారం. గాలికొండ దళంలో10మంది, పెదబయలు, కోరుకొండ దళాలకు చెందిన 25మంది, ఒడిశాలోని కటాఫ్ ఏరియాలో50మంది వరకు మావోయిస్టులు గతంలో పనిచేసేవారు.ఈ రెండేళ్ల వ్యవధిలో వారి సంఖ్య 50కి తగ్గినట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో దళాలు తగ్గి ప్రస్తుతం ఒడిశాలోని కటాఫ్ ఏరియా, ఏవోబీస్పెషల్ జోన్ కమిటీలు మాత్రమే పనిచేస్తున్నాయని తెలుస్తోంది. ఏవోబీ వ్యాప్తంగా పోలీసునిర్బంధం అధికమైంది. విశాఖ ఏజెన్సీతోపాటు ఒడిశాలోని కోరాపుట్టు, మల్కన్ గిరి జిల్లాల్లో పోలీసుయంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మావోయిస్టులు సురక్షిత ప్రాంతాలకే పరిమితమవుతున్నారు.పోలీసులకు కలిసొచ్చిన అభివృద్ధి నినాదం మావోయిస్టులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కొంతకాలంగా చేస్తున్న ప్రచారం పోలీసు యంత్రాంగానికి అనుకూలమైంది. ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రకృతిపరమైన సమస్యలున్నాయి. కష్టసాధ్యమైనా వీటిని అధిగమిస్తూ ప్రభుత్వ యంత్రాంగం సౌకర్యాలు కల్పిస్తోంది. పోలీసులు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి గిరిజనులకు దగ్గరవుతున్నారు. ఇన్ఫార్మర్ల పేరిట మావోయిస్టులు గిరిజనులను హతమార్చడం కూడా పోలీసులకు ప్రధాన ఆయుధమైంది. ఈ నేపథ్యంలో మారుమూల గ్రామాలలో గిరిజనులంతా బహిరంగంగానే మావోయిస్టులకు వ్యతిరేకంగా అభివృద్ధి నినాదంతో ర్యాలీలు చేస్తున్నారు. మావోయిస్టులకు గతంలో వలేమారుమూల గ్రామాల గిరిజనుల సహకారం తగ్గిందని పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టు కీలకనేతలు, మిలీషియా సభ్యులు కూడా ఇటీవల కాలంలో లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
ఆడపిల్ల పుట్టిందని ఇంట్లోకి రానివ్వని భర్త
సాక్షి,నర్సీపట్నం: ఆడపిల్ల పుట్టిందని భార్యను ఇంట్లోకి రానివ్వకుండా తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నాడు ఓ ప్రబుద్ధుడు. దీంతో చేసేది లేక పార్వతి అనే మహిళ నర్సీపట్నం మున్సిపాలిటీ పెద బొడ్డేపల్లిలోని తన అత్తవారి ఇంటి వద్ద బుధవారం బైఠాయించింది. ఆమె కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రావికమతం గ్రామానికి చెందిన టి.పార్వతికి నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లికి చెందిన రామకృష్ణతో 2019 మార్చిలో వివాహం జరిగింది. రూ.12 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. రామకృష్ణ విశాఖలో వార్డు సచివాలయం సెక్రటరీగా పని చేస్తున్నాడు. పాప పుట్టి ఏడాదిన్నర అవుతున్నా కాపురానికి తీసుకురాకుండా అత్త, మామలు అడ్డుపడుతున్నారు. ఆడపిల్లల పుట్టిందని, తల్లిపేరు మీద ఉన్న భూమి రాయించుకు రాలేదని కాపురానికి తీసుకురాలేదని పార్వతి తెలిపింది. నెల రోజుల్లో కాపురానికి తీసుకెళ్తానని రావికమతం పోలీసు స్టేషన్లో అంగీకరించిన భర్త ఆ తరువాత పట్టించుకోలేదని వాపోయింది. దీంతో మానసిక వేదనతో తన తల్లి ఇటీవల మృతి చెందిందని, తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తోబుట్టువు వద్ద తలదాచుకుంటున్నానని ఆమె చెప్పింది. బంధువులను వెంట పెట్టుకుని భర్త ఇంటికి వచ్చానని, ఇంటి వద్ద ఉన్న అత్త, మామలు తనను లోపలికి రానివ్వకుండా తలుపులు వేసుకుని బయటకు వెళ్లిపోయారని తెలిపింది. దీంతో న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు బైఠాయించినట్టు చెప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు, భర్త తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు పిలిపించిన టౌన్ ఎస్ఐ లక్ష్మణ్‌రావు కౌన్సెలింగ్ ఇచ్చారు.