
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ నేతలు అహంకారం, అధికారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుడి ముత్యాల నాయుడు, పార్టీ నేత పెట్టా ఉమశంకర్, మండిపడ్డారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాధరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ప్రకటలో పేర్కొన్నారు.
ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ ప్రస్తావించిన ప్రతీ అంశం వాస్తవమే అని, ప్రజలే రుజువులతో సహా వచ్చి ప్రతి సమస్యను ఆయనకు వివరిస్తున్నారని తెలిపారు. చేతనైతే అధికారం ఉన్నవారు ఈ సమస్యలను పరిష్కరించాలని, వైఎస్ జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. వైఎస్‌ఆర్ హయంలో జరిగిన అభివృద్ధికి.. చంద్రబాబు నాయుడు హయంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment