YSR Congress Party
-
ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం: వైఎస్ జగన్
శాసన సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీనే. మరో విపక్ష పార్టీ అంటూ లేదు. మిగతావన్నీ అధికారంలో కొనసాగుతున్న పార్టీలే. మరి ప్రతిపక్ష హోదా ఎవరికి ఇస్తారు? సహజంగానే వైఎస్సార్సీపీకే ఇవ్వాలి కదా! హోదా ఇవ్వకపోతే ఎందుకు నడుపుతున్నారు? అవతలి వారు చెప్పేది మనం వినకూడదనుకుంటే ఇక అసెంబ్లీ ఎందుకు? ప్రతిపక్షం చెప్పేది ఆలకించాలి. తద్వారా లోపాలను సరిదిద్ది ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. ఎంతసేపూ పరనింద.. ఆత్మస్తుతేనా? అలాంటప్పుడు ఇక ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. – వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటాన్ని కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) పునరుద్ఘాటించారు. కూటమి ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో తీవ్ర వ్యతిరేకత నెలకొందని.. టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలిపోయాయని ధ్వజమెత్తారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ‘మనం యుద్ధరంగంలో ఉన్నాం.. విజయం దిశగా అడుగులు వేయాలి.. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలి.. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయాలి.. ప్రజలకు తోడుగా ఉంటూ వారితో మమేకమైతే గెలుపు సాధించినట్లే. ప్రజా సమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయవద్దు. మనం వేసే ప్రతి అడుగూ పార్టీ ప్రతిష్టను పెంచేదిలా ఉండాలి. ఎక్కడా రాజీ పడకూడదు’ అని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మీ భవిష్యత్తుకు నాది భరోసా..ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంలో మన సమర్ధతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నా. మీ భవిష్యత్తుకు నాది భరోసా. నేను మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తా. పార్టీ కోసం, ప్రజల కోసం గట్టిగా పని చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కళ్లు మూసుకుని తెరిచేలోగా ఏడాది గడిచిపోతోంది. జమిలి ఎన్నికలు అంటున్నారు. అదే జరిగితే ఎన్నికలు మరింత మందుగా వస్తాయి. అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దు. ప్రజల తరపున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మనం విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టే ఎన్నో క్లిష్ట పరిస్థితులు అధిగమించాం. ఇంత దూరం ప్రయాణం చేశాం. దేవుడు మనల్ని అందరినీ తప్పకుండా ఆశీర్వదిస్తాడు.అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు..అసెంబ్లీలో మనం మినహా వేరే ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే.. హక్కుగా మనకు సమయం ఇవ్వాల్సి వస్తుంది. సభా నాయకుడితో దాదాపు సమాన స్థాయిలో సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ భయంతోనే ప్రతిపక్ష హోదాను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లాం. శాసన సభలో మనం ఒక్కరమే ప్రతిపక్షం. అందుకే విపక్ష హోదా అడుగుతున్నాం. సభలో ప్రతిపక్షం స్వరాన్ని వినాలి. తప్పులుంటే సరిదిద్దుకోవాలి. నేను ఏ అంశంపై మాట్లాడినా నిందలకు, దూషణలకు దూరం. ప్రతి అంశాన్నీ ఆధారాలు, రుజువులతో మాట్లాడతా. నా ప్రసంగాల్లో కూడా చాలా సార్లు సభలో చంద్రబాబునాయుడు ఉంటే బాగుండేదని చెప్పా. అయితే ప్రభుత్వ స్వరం మినహా వేరే స్వరం వినపడకూడదన్నట్లు అసెంబ్లీని తయారు చేశారు.ప్రజలకు అన్నీ తెలుసు..పేదల ఇళ్ల కాలనీల పేర్లు కూడా మారుస్తున్నారని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశంలో ప్రస్తావించగా.. ‘‘ఎవరు ఇళ్ల స్ధలాలిచ్చారో, ఎవరు కాలనీలు ఏర్పాటు చేశారో ప్రజలకు తెలుసు. విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనాన్ని మనమే నిర్మించాం. కానీ పేరు తీసేయాలన్న దురుద్దేశంతో ఏకంగా అంబేడ్కర్ విగ్రహం మీదే దాడికి దిగారు. ఈ ప్రభుత్వం ఆదేశాలతోనే అదంతా జరిగింది. అధికారులే స్వయంగా దీనికి ఒడిగట్టారు. మరి స్మృతివనం ఎవరు కట్టారో ప్రజలకు తెలియదా? ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ప్రజలకు నేరుగా రూ.2.73 లక్షల కోట్లు అందించి మనం మంచి చేశాం. ఇవాళ మనమిచ్చిన పథకాలన్నీ రద్దు చేశారు. నోటి దాకా వచ్చిన కూడును తీసేశారు. టీడీపీ వాళ్లు ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలాయి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇళ్ల పట్టాలు రద్దు చేస్తే కోర్టుకెళ్తాం..టీడీపీ కూటమి ప్రభుత్వం అన్యాయంగా ఇళ్ల పట్టాలను రద్దు చేస్తోందని సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘‘మన హయాంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఏ పార్టీ అని చూడకుండా, పక్షపాతం లేకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఎవరైనా ఇల్లు కట్టుకోకపోతే ప్రభుత్వమే వారికి ఇల్లు మంజూరు చేసి ఇవ్వాలి. అంతేకానీ పేదలపై కక్షగట్టి పట్టాలు రద్దు చేయడం ఏమిటి? పట్టాలు రద్దు చేస్తే తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం’’ అని స్పష్టం చేశారు. -
రైతు బతికే పరిస్థితి లేదు!: వైఎస్ జగన్
ఇవాళ రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు చూశాం.. ఇవాళ మిర్చి రైతుల కష్టాలను చూస్తున్నాం. ఒక్క మిర్చే కాదు.. పత్తి, మినుము, కందులు, పెసర, టమాటా.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొంది. నాడు సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ధరలను సమీక్షిస్తూ ఎక్కడైనా పతనమైతే వెంటనే రంగంలోకి దిగి రైతులను ఆదుకున్నాం. కానీ నేడు దళారీల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. రైతుల జీవితాల్లో వెలుగులు చూసేందుకు వైఎస్సార్సీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవీ ఈరోజు కనిపించడం లేదు. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయానికి... ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో అన్నదాతలు పడుతున్న అగచాట్లు చంద్రబాబుకు కనిపిస్తున్నా కళ్లు మూసుకుని కూర్చున్నారని వైఎస్సార్ సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అన్నదాతల పాలిట శాపంగా మారింది. ఏ రైతన్నా సంతోషంగా లేడు. అన్నదాతల అవస్థలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు’’ అని మండిపడ్డారు. ‘ఇవాళ రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మరోవైపు దిగుబడులు పడిపోయాయి. మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు చూశాం.. ఇవాళ మిర్చి రైతుల కష్టాలను చూస్తున్నాం. ఒక్క మిర్చే కాదు.. పత్తి, మినుము, కందులు, పెసర, టమాటా.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొంది. దళారులకు తావు లేకుండా పంటల కొనుగోళ్లు జరిపి రైతులను ఆదుకున్న ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ క్రాప్ గాలికి వదిలేశారు. ఉచిత పంటల బీమా ఎత్తివేశారు. సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీకి స్వస్తి పలికారు. ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేశారు. ఇక ఇస్తామన్న దాన్నీ ఎగ్గొట్టారు. సూపర్ సిక్స్‌లో చెప్పినవన్నీ విస్మరించారు. సున్నా వడ్డీ రాయితీ అందడం లేదు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ద్వారా పరీక్షలు నిర్వహించి నాణ్యమైన సాగు ఉత్పాదకాలు అందించే విధానానికి తిలోదకాలిచ్చారు. నాడు సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ధరలను సమీక్షిస్తూ ఎక్కడైనా పతనమైతే వెంటనే రంగంలోకి దిగి రైతులను ఆదుకుంటే నేడు దళారీల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. రైతుల జీవితాల్లో వెలుగులు చూసేందుకు వైఎస్సార్ సీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవీ ఈరోజు కనిపించడం లేదు’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గుంటూరులోని మిర్చి యార్డుకు వచ్చిన వైఎస్ జగన్ రైతులను కలిసి వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కనీస మద్దతు ధర కూడా దక్కకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని మిర్చి రైతులు ఆయన వద్ద మొర పెట్టుకున్నారు. వారి కష్టాలు, బాధలు తెలుసుకుని చలించిపోయారు. సావధానంగా సమస్యలు ఆలకించి ధైర్యం చెప్పారు. అనంతరం మిర్చి యార్డు బయట వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఖాతాలోనూ తన పర్యటన వివరాలను పంచుకున్నారు. రైతన్నలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరావడంతో మిర్చి యార్డు ప్రాంతం కిక్కిరిసిపోయిందని.. అందువల్ల మీడియా ద్వారా పూర్తిగా మాట్లాడలేకపోయానని.. అన్ని అంశాలను ట్వీట్లో పొందుపరుస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..గుంటూరులో భారీగా హాజరైన జన సందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ ఏ పంట చూసినా ‘మద్దతు’ కరువు..టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు అడుగడుగునా కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయి. పంటలకు మద్దతు ధర దేవుడెరుగు.. అమ్ముకుందామన్నా కొనేవారు లేక అల్లాడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.. మళ్లీ రైతులను పట్టి పీడించడం మొదలు పెట్టారు. అటు తెగుళ్లతో దిగుబడి తగ్గిపోవడం.. ఇటు రేటు లేక అమ్ముకోలేని పరిస్థితులతో అన్నదాతల బతుకు దుర్భరంగా మారింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రైతులందరి పరిస్థితి దయనీయంగా ఉంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి.. ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఒక్క రివ్యూ కూడా చేయలేదు. ప్రభుత్వం తరఫున రైతులను పలకరించేవారు లేరు. రాష్ట్ర సచివాలయానికి అత్యంత సమీపంలోనే గుంటూరు మార్కెట్ యార్డు ఉన్నా రైతుల ఆక్రోశం, ఆవేదన చంద్రబాబుకు వినిపించడంలేదు. సీఎం చంద్రబాబు రైతులను దళారీలకు అమ్మేశాడు. మిర్చి రైతన్న కుదేలు..మన ప్రభుత్వంలో నిరుడు అత్యధికంగా క్వింటాలు రూ.21 – 27 వేల దాకా పలికిన మిర్చి ధర ఇప్పుడు రూ.8 – 11 వేలకు పడిపోయింది. పంట బాగుంటే మిర్చి ఎకరాకు సగటున 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. తెగుళ్ల కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయి. ఏ జిల్లాలో చూసినా ఎకరాకు 10 క్వింటాళ్లకు మించి రాలేదు. ఇక పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు కనీసం రూ.1,50,000 పైమాటే అవుతోంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒక్క మిర్చే కాదు.. కంది పండిస్తున్న రైతులు కూడా ధరలు లేక విలవిల్లాడుతున్నారు. కందిపప్పు క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.7,550 అయితే ఇప్పుడు రూ.5,500 కూడా రావడం లేదు. కానీ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150 పైనే ఉంది. అదే గతేడాది రూ.9–10 వేల మధ్య ధర వచ్చేది. గత ఏడాది క్వింటాలు పత్తి రూ.10 వేలు ఉండగా ఇప్పుడు రూ.5 వేలు కూడా దాటడం లేదు. పెసలు కనీస మద్దతు ధర రూ.8,558 కాగా ఇప్పుడు రూ.6 వేలు రావడం కూడా కష్టంగా ఉంది. మినుములు కనీస మద్దతు ధర రూ.7,400. గత ఏడాది క్వింటాలు మినుములు రూ.10 వేలు పలకగా ఇప్పుడు రూ.7 వేలు కూడా రావడం లేదు. టమాటా రైతులకు కిలోకి రూ.3–5 కూడా దక్కడం లేదు. పలావూ.. లేదు! బిర్యానీ లేదు! ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అని కూడా అన్నారు. రైతుకు ఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ సాయం కాకుండా అన్నదాతా సుఖీభవ కింద తాము రూ.20 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మోసం చేశారు. మన ప్రభుత్వంలో ఇచ్చిన రైతు భరోసాను కొనసాగించకుండా రద్దు చేశారు. మన ప్రభుత్వంలో ఒక్క రైతు భరోసా కిందే క్రమం తప్పకుండా సుమారు 54 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు అందచేశాం. ఇప్పుడు పలావూ.. లేదు! బిర్యానీ లేదు! ధరల స్థిరీకరణ నిధికి ఎగనామంఉచిత పంటల బీమాను కూడా చంద్రబాబు రద్దు చేశారు. ఒక సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీని చెల్లించే గొప్ప విధానాన్ని, రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. ఈ–క్రాప్ లేకుండా చేసేశారు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. కనీసం ఎరువుల పంపిణీలోనూ కొరతే. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడం దారుణం. చంద్రబాబూ..! ఇప్పటికైనా కళ్లు తెరవండి. రైతే రాజు అని గుర్తించండి. అన్నదాత కన్నీరు పెట్టుకుంటే అది రాష్ట్రానికే అరిష్టం. చంద్రబాబు గుంటూరు మార్కెట్ యార్డుకు వచ్చి మిర్చి రైతులతో మాట్లాడి వారికి బాసటగా నిలవాలి. ప్రభుత్వమే మిర్చిని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నాం.ఆదుకోకుంటే తీవ్ర పరిణామాలు..‘ఇవాళ రైతులు ప్రతి విషయంలోనూ దారుణంగా నష్టపోతున్నారు. ఇప్పటిౖకైనా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. రైతులకు పెట్టుబడి సహాయం అందించాలి. చంద్రబాబు కళ్లు తెరిచి గుంటూరు మిర్చి యార్డుకు రావాలి. రైతుల కష్టాలను తెలుసుకుని వారికి గిట్టుబాటు ధర లభించే విధంగా అండగా నిలబడకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలుంటాయని రైతుల తరఫున హెచ్చరిస్తున్నా’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి, పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, గుంటూరు, పల్నాడు జిల్లాల పార్టీ పరిశీలకుడు మోదుగుల, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, మేయర్ కావటి మనోహర్‌నాయుడు, మాజీ మంత్రి విడదల రజిని, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, మాజీ ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేతలు వనమా బాలవజ్రబాబు, అన్నాబత్తుని శివకుమార్, బలసాని కిరణ్, అంబటి మురళీకృష్ణ, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.గుంటూరు మిర్చి యార్డులో రైతులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయం చేయకపోగా.. వ్యవస్థలు నిర్వీర్యంచంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతులకు సాయం చేయకపోగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నింటినీ మూలన పడేశారు. ఆర్బీకేలను, ఈ–క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లను నీరుగార్చారు. సీజన్ మొదలయ్యే సరికి రైతులకు పెట్టుబడి సహాయం, రైతులకు సున్నా వడ్డీకే రుణాలు, విత్తనాలు, ఎరువులకు సైతం నాణ్యతకు ఆర్బీకేల్లో గ్యారంటీ.. ఇలా మేం తెచ్చిన ప్రతి విప్లవాత్మక మార్పునూ ఉద్దేశపూర్వకంగా మూలనపెట్టారు. ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచనే ఈ ప్రభుత్వానికి లేదు.. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలన్న ఉద్దేశమే లేదు. ఓ నెంబరుకు ఫోన్ చేస్తే ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం రైతన్నల్లో కనిపించడం లేదు. ఆర్బీకేలు, వాటికి అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లతో సహా ప్రతి వ్యవస్థ ఇవాళ నిర్వీర్యం అయిపోయాయి. గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలంటే భయపడే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వమే దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు, విత్తనాల సరఫరా నిలిపివేసింది. రైతులు ప్రైవేట్ డీలర్ల దగ్గర ఎరువులు కొనాల్సి వస్తోంది. వాళ్లు కనీసం రూ.100 నుంచి రూ.400 అధిక ధరలకు బ్లాకులో అమ్ముతున్నారు. క్వాలిటీ కంట్రోల్ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించిన పరిస్థితి ఉంటే.. ఇవాళ నాణ్యమైనవేవీ అన్నదాతలకు అందని దుస్థితి నెలకొంది. ఇక పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ కాకుండా తాము ఇస్తామన్న రూ.20 వేలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అన్నదాతలను దారుణంగా మోసం చేసింది.గొప్ప మార్పులతో రైతన్నకు అండగా..⇒ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా కేంద్రం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటించని పసుపు, మిర్చి, ఉల్లి, అరటి లాంటి పంటలకే కాదు.. మొత్తంగా 24 పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించి, రైతులకు ఎమ్మెస్పీ ధర రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలుకు రూ.65,258 కోట్లు ఖర్చు చేస్తే... ఇతర పంటల కొనుగోలు కోసం రూ.7,773 కోట్లు వెచ్చించి మన ప్రభుత్వం నాడు రైతులను ఆదుకుంది. ఇవాళ మిర్చి రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే చంద్రబాబు నిద్రపోతున్నాడు.⇒ మన ప్రభుత్వ హయాంలో సీఎం యాప్ అనే గొప్ప మార్పును తెచ్చి ఏపీలో ఏ ప్రాంతంలో ఏ పంట ధర ఎలా ఉందో యాప్ తో సమాచారం సేకరించాం. ఆర్బీకేల సిబ్బంది రైతులకు అందుతున్న ధరలపై ఎప్పటికప్పుడు యాప్‌లో అప్డేట్ చేసేలా చర్యలు తీసుకున్నాం. ఆ సమాచారం ఆధారంగా కనీస మద్దతు ధర రాని పక్షంలో వెంటనే చర్యలు తీసుకునేవాళ్లం. జేసీల ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖతో కలిసి అవసరమైతే ప్రభుత్వం తరఫున కొనుగోళ్లు చేసేవాళ్లం. కనీస మద్దతు ధరలు ఎంతో తెలియజేస్తూ ఆర్బీకేల్లో పెద్ద పెద్ద పోస్టర్లు ఏర్పాటు చేశాం. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించడానికి 14400, 1907 టోల్‌ఫ్రీ నంబర్లు కూడా అందుబాటులోకి తెచ్చాం. ఇప్పుడు ఈ వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారు.⇒ ఇప్పుడు మిర్చికి సోకిన మాదిరిగా పంటలకు వ్యాధులు వస్తే మన హయాంలో ఆర్బీకేల సిబ్బంది, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వెంటనే విషయాన్ని ప్రభుత్వానికి చేరవేసి తగిన చర్యలు చేపట్టేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆర్బీకేల ద్వారా రైతులకు తగిన శిక్షణ అందేది. రైతులకు మెరుగైన అవగాహన కలిగించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్, పొలంబడి లాంటి కార్యక్రమాలు నిర్వహించాం.⇒ రైతులకు అందించే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతపై మన హయాంలో ఎప్పటికప్పుడు పరీక్షలు జరిగేవి. ప్రభుత్వం నెలకొల్పిన 147 ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్‌ల్లో పరీక్షలు జరిగేవి. ఇప్పుడు ఆ ల్యాబ్‌లను గాలికొదిలేశారు. ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారు.⇒ మన ప్రభుత్వంలో మార్కెట్లో క్రమం తప్పకుండా అధికారులు తనిఖీలు చేసేవారు. కలెక్టర్లు, ఎస్పీలు ఈ తనిఖీల మీద, తీసుకుంటున్న చర్యల మీద క్రమం తప్పకుండా రిపోర్టులు ఇస్తూ గట్టి పర్యవేక్షణ చేసేవారు. దీనివల్ల నకిలీలకు అడ్డుకట్ట పడేది. ఎక్కడైనా తప్పు జరిగితే సంబంధిత వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకునేవాళ్లం. ⇒ మనం అధికారంలో ఉన్నప్పుడు మిరప రైతులకు ఎప్పుడూ లేని విధంగా చాలా గొప్పగా పంటల బీమా అందించాం. 2019–20లో రూ.90.24 కోట్లు.. 2020–21లో రూ.36.02 కోట్లు... 2021–22లో రూ.439.79 కోట్లు చొప్పున రైతులకు అందించాం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మన ప్రభుత్వంలో రైతులపై ఒక్కపైసా భారం పడకుండా ఉచిత పంటల బీమాను అమలు చేసి 54.55 లక్షల మందికి రూ.7,802 కోట్లు పంట నష్ట పరిహారం కింద చెల్లించాం. ఇప్పుడు ఉచిత పంటల బీమాను పూర్తిగా రద్దు చేసి రైతులపై భారాన్ని మోపారు. -
కార్యకర్తలకు అన్నలా ఉంటా..: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త తరపున చంద్రబాబుకు చెబుతున్నా... మళ్లీ వచ్చేది జగన్ 2.0 పాలన. అన్యాయాలు చేసే వారెవరినీ వదిలిపెట్టేది లేదు. తప్పు చేసిన వారిని చట్టం ముుందు నిలబెడతాం. కార్యకర్తలకు అన్నలా ఉంటా..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) భరోసానిచ్చారు. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశం సందర్భంగా ఆయన ఏమన్నారంటే..ప్రజలకు తోడుగా.. కార్యకర్తలకు అండగాజగన్ 1.0 పాలనలో అధికారంలోకి వచ్చిన 9 నెలలు కాకమునుపే ఎప్పుడూ చూడని విధంగా కోవిడ్ పరిస్థితుల మధ్యే కాలం గడిపాం. తర్వాత రెండున్నర సంవత్సరాలు కోవిడ్ మధ్యే ఉన్నాం. ఆ టైంలో ప్రజలకు ఎలా తోడుగా ఉండాలనే తపనతో అడుగులు వేశాం. అందుకే కార్యకర్తలకు చేయదగినంత చేయలేకపోయాం. ఈసారి జగన్ 2.0లో ప్రజలకు తోడుగా ఉంటూ.. కార్యకర్తలకు అండగా, వారి ఇంటికి అన్నలా ఉంటా. మార్చి నాటికి స్థానిక సంస్థలకు నాలుగేళ్ల పదవీ కాలం ముగియబోతుంది. తమ వాళ్లను పదవుల్లో కూర్చోబెట్టడానికి ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ప్రయత్నిస్తారు. మన వాళ్లను భయపెట్టడానికి, లొంగదీసుకోవడానికి, ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ ఉన్నా మనం ధైర్యంగా ఉండాలి. ఎల్లకాలం ఇలా ఉండదు. చీకటి తర్వాత వెలుతురు రాక మానదు. రానున్న మూడు సంవత్సరాలు మన క్యారెక్టర్‌ను కాపాడుకుందాం. మన విలువలు కాపాడుకుందాం. ఆ తర్వాత రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తాం.ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ..ఈ ప్రభుత్వంలో ఏ మాదిరిగా పాలన చేస్తున్నారో చూస్తున్నాం. మొన్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. టీడీపీకి ఏమాత్రం సంఖ్యాబలం లేకపోయినా దాడులు చేసి భయపెట్టారు, ప్రలోభపెట్టారు. అన్యాయాలు చేసి గెలిచామంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. తిరుపతి కార్పొరేషన్లో 49 స్థానాలుంటే వైఎస్సార్సీపీ 48 గెలిచింది. టీడీపీ ఒకే ఒక్కటి గెలిచింది. ఒక్కటే గెలిచిన చోట డిప్యూటీ మేయర్ వాళ్ల మనిషి అని గొప్పగా చెప్పుకుంటున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సును పోలీసుల ద్వారా వాళ్లే అడ్డుకుంటారు. వాళ్లే పోలీసుల ఆధ్వర్యంలో కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తారు. మళ్లీ ఎన్నికల్లో మావాడు గెలిచాడని నిస్సిగ్గుగా చెప్పుకుంటారు. ఇక ఏలూరు కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉంటే అందులో 47 వైఎస్సార్సీపీకి రాగా టీడీపీకి వచ్చింది కేవలం 3 మాత్రమే. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉంటే 54 వైఎస్సార్‌సీపీవే. ఇక హిందూపురం మున్సిపాల్టీలో 38 డివిజన్లు ఉంటే వైఎస్సార్సీపీకి 29 వచ్చాయి. టీడీపీకి 6 మాత్రమే వస్తే చంద్రబాబు బావమరిది బాలకృష్ణ అక్కడ తమకు పీఠం దక్కిందని అదో ఘనకార్యంలా చెప్పుకుంటున్నారు. పాలకొండలో 20 స్థానాలకు 17 వైఎస్సార్‌సీపీవే. టీడీపీకి మూడు మాత్రమే ఉన్నాయి. అక్కడ వైఎస్సార్సీపీ వాళ్లను లాక్కోలేక ఎన్నిక వాయిదా వేశారు. తునిలో టీడీపీకి ఒక్కరూ లేరు. అక్కడ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికలు వాయిదా అంటారు. పిడుగురాళ్ల మున్సిపాల్టీలో 33కు 33 వైఎస్సార్‌సీపీవే. దీంతో అక్కడ కూడా ఎన్నికలు వాయిదా అన్నారు. నూజివీడులో 32 ఉంటే 25 వైఎస్సార్సీపీ, ఏడు టీడీపీవి. నందిగామ మున్సిపాల్టీలో కూడా వైఎస్సార్సీపీదే మెజార్టీ. చివరికి గుంటూరులో కూడా 57లో 46 స్థానాలు వైఎస్సార్‌సీపీవే. అవిశ్వాసం పెట్టి మేయర్‌ను దించేస్తామని చెబుతున్నారు. ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? మన ప్రభుత్వం ఏర్పడిన మూడు సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ప్రజలు ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. ఆ రోజు తాడిపత్రి, దర్శి రెండు మున్సిపాల్టీలే పోయాయి. తాడిపత్రిలో 20 స్థానాలు వాళ్లకు... 18 స్థానాలు మనకు వచ్చాయి. ఆ రోజు నేను గట్టిగా తుమ్మి ఉంటే ఆ రెండూ కూడా వాళ్లకు వచ్చి ఉండేవి కావు. ప్రజాస్వామం గెలవాలి... ఈరోజు టీడీపీ చేస్తున్నదేమిటి? ఇదా ప్రజాస్వామ్యం? అని అందరూ ఆలోచన చేయాలి. ఇలాంటి రాజ్యం పోవాలి. ప్రజాస్వామ్యం నిలవాలి. విలువలు, వ్యక్తిత్వంతో కూడిన రాజకీయాలు అవసరం. కార్యకర్తలు ఫలానా వాడు మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకుని తిరగాలి. ప్రజలు గొప్పగా చెప్పుకునేలా నాయకత్వం ఉండాలి. ఇదే వైఎస్సార్సీపీ సిద్ధాంతం.స్కాములు మినహా పాలన ఏది?స్కాములు మినహా ఈ ప్రభుత్వంలో ఏమీ జరగడం లేదు. ముఖ్యమంత్రిగా పాలన సాగించేటప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త ఫలానా వ్యక్తి మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకుని చెప్పుకునేలా ఉండాలని అనుకుంటారు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే... చంద్రబాబు, కూటమి నేతలు అధికారంలో ఉంటూ దోచుకోవడం, దోచుకున్నది పంచుకుని తినడం మాత్రమే జరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం స్కామ్, ఇసుక స్కామ్. ఓ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా, ఫ్యాక్టరీ నడపాలన్నా ఎమ్మెల్యేకు ఇంత ఇవ్వాలి.. ఆయన చంద్రబాబుకి ఇంత ఇవ్వాలి! ప్రతి నియోజకర్గంలోనూ యథేచ్ఛగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తారేమోనని చిన్న పిల్లలని కూడా చూడకుండా 111 సెక్షన్ కేసులు పెడుతున్నారు. తమ తప్పులను సోషల్ మీడియాలో ప్రశ్నించి పోస్టింగులు పెట్టేవారిపై టెర్రరిస్టుల మాదిరిగా వ్యవస్థీకృత నేర చట్టాల కింద కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారు. వివిధ స్టేషన్లు, జిల్లాల చుట్టూ తిప్పుతున్నారు. కానీ చంద్రబాబు మర్చిపోతున్న విషయం ఏమిటంటే... ఇలాంటి అన్యాయాలు చేస్తే ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం. -
చంద్రబాబు చీటర్ కాదా?: వైఎస్ జగన్
ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో ఒకవైపు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్లిపోయింది. ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపు విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్.. ఇలా అన్ని వ్యవస్ధలూ తిరోగమనంలో కనిపిస్తున్నాయి. కేవలం.. ముఖ్యమంత్రి మారాడు..! వైఎస్సార్సీపీ పక్కకు వెళ్లి టీడీపీ వచ్చింది..! అంతే తేడా...! ఈ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ తిరోగమనంలోకి పోయింది. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన ప్రతి పథకాన్ని రద్దు చేశారు. చంద్రబాబు అమలు చేస్తామన్న ప్రతి పథకం మోసం.. అబద్ధం! కేవలం 9 నెలల కాలంలోనే కనిపిస్తున్న మోసాలివి.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘ఎన్నికల ప్రచారంలో.. ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని చంద్రబాబు చెప్పారు. మరి ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ, ప్రతి వ్యక్తీ ఎందుకు బటన్ నొక్కలేదని చంద్రబాబును అడుగుతున్నారు. చంద్రబాబు ఇప్పుడు బటన్ ఎలా నొక్కాలో తన చెవిలో చెప్పమంటున్నారు. మొహమాటం లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. మరి ఈ వ్యక్తి చీటర్ కాదా?.. ప్రజలను మోసం చేసిన వ్యక్తిపై 420 కేసు పెట్టకూడదా..?’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ‘మీరూ, మేమూ.. మనందరం కలిసికట్టుగా నిలబడి ఈ అరాచక ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే పరిస్థితిలోకి తీసుకెళదాం..’ అని పార్టీ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మేయర్, ఇతర స్థానిక సంస్థల ప్రజా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే..సమావేశానికి హాజరైన ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు చరిత్రను మార్చిన జగన్ 1.0 పాలన..2019–2024 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడిచింది. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, చరిత్రను మార్చిన పాలన వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది. మన ప్రభుత్వం రాకమునుపు మేనిఫెస్టో అంటే.. చక్కటి అబద్ధాలను రంగు రంగుల కాగితాల్లో ముద్రించి ఎన్నికల్లో పంచడం..! ఎన్నికలు అయినపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం..! అలాంటి పరిస్థితుల నుంచి పాలనలో తులసి మొక్కలా వ్యవస్థను మార్చిన పాలన కేవలం వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా మేనిఫెస్టోను కేవలం రెండు పేజీలకు కుదించి.. అది మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిదని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వ కార్యాలయం, సీఎంవో, ప్రతి మంత్రి కార్యాలయంలో, ప్రతి కలెక్టర్ కార్యాలయంలోనూ కనిపించేలా ఏర్పాటు చేశాం.బడ్జెట్‌తోపాటే సంక్షేమ క్యాలెండర్..సంక్షేమ క్యాలండర్‌ను కూడా బడ్జెట్‌తోపాటు ప్రవేశపెట్టి ఏ నెలలో ఏ పథకం అమలవుతుందో చెప్పి.. అలా చెప్పిన తేదీకి బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన చరిత్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలో మన పార్టీ హయాంలోనే జరిగింది. అంతగా వ్యవస్థలో మార్పులు చేశాం. గతంలో ప్రభుత్వ సొమ్ము రూపాయి ఇస్తే... 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతుందన్న నానుడిని మార్చి.. లంచాలు, వివక్ష లేకుండా ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు బటన్ నొక్కి ప్రజలకు ఇచ్చింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఒకవైపు కోవిడ్ ఉన్నా.. రాష్ట్రం అతలాకుతలం అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నా.. ఆదాయాలు తగ్గినా.. అనుకోని ఖర్చులు పెరిగినా ఏ రోజూ సాకులు వెతకలేదు. ప్రజలకు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చాం. హామీల అమలుతో పాటు అభివృద్ధి..ఒకవైపు చెప్పిన ప్రతి మాటనూ నెరవేర్చి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ మరోవైపు రాష్ట్రంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి కూడా చేశాం. ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి. నాడు – నేడు అనే ఉజ్వల కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో మొదలైంది. ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రభుత్వ స్కూళ్ల ప్రయాణం మొదలైంది. మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ క్లాసులు మొదలయ్యాయి. మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఆరో తరగతి నుంచి డిజిటల్ బోధన అందించాం. ఎనిమిదో తరగతికి వచ్చేసరికి పిల్లలకు ట్యాబులు అందచేశాం. ఇవన్నీ రావడంతో ప్రైవేట్ స్కూళ్లు.. ప్రభుత్వ బడులతో పోటీ పడాల్సి వచ్చింది. ఒకవైపు తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఇస్తూ.. మరోవైపు ఆ పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా చదువుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం.వైద్యంలోనూ ఊహకందని మార్పులు..తొలిసారిగా గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లు అందుబాటులోకి తెచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత లేకుండా చేశాం. దేశం మొత్తంమీద గవర్నమెంటు ఆసుపత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61 శాతం ఉంటే ఏపీలో మాత్రం స్పెషలిస్టు డాక్టర్ల కొరత కేవలం 4 శాతం మాత్రమే నమోదైంది. జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రులను నాడు నేడు ద్వారా బలోపేతం చేశాం. డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలు గల ఔషధాలను మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులోకి తెచ్చాం. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఏకంగా 17 మెడికల్ కాలేజీలను మన హయాంలోనే కట్టడం ప్రారంభించాం. పేదవాడికి ఉచితంగా వైద్యం అందిస్తూ ప్రొసీజర్లను వెయ్యి నుంచి ఏకంగా 3,300 వరకు తీసుకెళ్లడంతోపాటు రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించాం.రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ముఖ్యం..గతంలో మనకు 50 శాతం ఓటు షేర్ వచ్చింది. ఈ ఎన్నికల్లో మన ఓటు షేర్ 40 శాతం ఉంది. 10 శాతం ఓట్లు తగ్గాయి. కారణం.. మీ జగన్ ఆ రోజు వారిలా అబద్ధాలు చెప్పలేకపోవడమే. కానీ అధికారానికి దూరమైనా మీ జగన్ లీడర్ అంటే ఇలా ఉండాలని మీ గుండెల్లో ముద్ర వేయగలిగాడు. మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాడు. 2019–24 మధ్య మన పాలనను ప్రజలు చూశారు. ఇవాళ చంద్రబాబు పాలన కూడా ప్రజలు చూస్తున్నారు. మనం ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కినా అబద్ధాలు చెప్పలేక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. మరి ఇన్ని మోసాలు చేసిన, ఇన్ని అబద్ధాలు చెప్పిన వ్యక్తి పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. ఇచ్చిన మాటను గాలికొదిలేసిన ఈ పార్టీలు, ప్రభుత్వం ప్రజల ఓటుతో బంగాళాఖాతంలోకో ఇంకా అథఃపాతాళానికో పోతారు. ఎన్నికల తర్వాత కూడా వైఎస్సార్సీపీ కార్యకర్త సగర్వంగా ప్రతి ఇంటికి వెళ్లగలుగుతాడు. చెప్పిన ప్రతి మాటా నెరవేర్చిన ప్రభుత్వం మాది అని గర్వంగా చెప్పగలుగుతారు. కానీ ఈ రోజు టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఏ ఒక్కరూ, ఏ ఇంటికీ వెళ్లే పరిస్థితి లేదు. వాళ్లు ఏ ఇంటికి వెళ్లినా... చిన్నపిల్లలు తల్లికి వందనం కింద ఇవ్వాల్సిన నా రూ.15 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఆ పిల్లల తల్లులు ఆడబిడ్డ నిధి కింద తమకు ఇవ్వాల్సిన రూ.18 వేలు ఏమయ్యాయని నిలదీస్తారు. ఆ అమ్మల అత్తలు, అమ్మలు మాకు 50 ఏళ్ల వచ్చాయి.. మరి మా రూ.48 వేలు పెన్షన్ డబ్బులు ఎక్కడని ప్రశ్నిస్తారు. ఆ ఇంట్లో రైతులు అన్నదాతా సుఖీభవ కింద తమకు ఇవ్వాల్సిన రూ.20 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువకుడు నిరుద్యోగ భృతి కింద ఇవ్వాల్సిన నా రూ.36 వేలు ఏమయ్యాయని ప్రశ్నిస్తాడు.రైతును చేయి పట్టుకుని నడిపిస్తూ ఆర్బీకేలు..గ్రామాల్లో ఆర్బీకేల వ్యవస్థను ఏర్పాటు చేసి ఊరు దాటాల్సిన అవసరం లేకుండా రైతన్నలకు తోడుగా నిలిచాం. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్‌ను అసిస్టెంట్‌గా నియమించి రైతులను చేయి పట్టుకుని నడిపించేలా చర్యలు తీసుకున్నాం. తొలిసారిగా ఇ–క్రాప్ ద్వారా ప్రతి రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశాడో నమోదు చేశాం. రైతులందరికీ ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధర దక్కేలా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయడంతోపాటు దళారీ వ్యవస్థను తొలగించాం. ఇవన్నీ వైఎస్సార్ సీపీ హయాంలోనే జరిగాయి. అంతేకాకుండా ప్రతి గ్రామంలోనూ సచివాలయాన్ని ఏర్పాటు చేశాం. అదే సచివాలయంలో మన ఊరి పిల్లలే సేవలందిస్తూ కనిపిస్తారు. ప్రతి 60–70 ఇళ్లకు ఒక వలంటీర్ ఇంటికే వచ్చి పారదర్శకంగా సేవలు అందించారు.బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు గ్రామాల్లో ఇళ్లకు వెళ్లినప్పుడు తాము సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఇవ్వలేకపోతే కాలర్ పట్టుకోమని చెప్పారు. బాండ్లు కూడా రాసిచ్చారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ అని రాసిచ్చారు. ఇవాళ బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ అని రుజువు అయింది. ఇప్పుడు ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు. త్వరలోనే కాలర్ పట్టుకుని నిలదీసే రోజులు కూడా రానున్నాయి. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మంటలపై విచారణ
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద రోడ్డు వెంబడి ఏర్పడిన మంటలపై తాడేపల్లి పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం విచారణ చేపట్టారు. దీన్లోభాగంగా గుంటూరు జిల్లా లా అండ్ ఆర్డర్ ఎస్పీ రవికుమార్, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజు పర్యవేక్షణలో గుంటూరు జిల్లా ఎఫ్ఎస్ఎల్ బృందం, ఫోరెన్సిక్ బృందాలు మంటలు ఏర్పడిన ప్రాంతం వద్ద ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజు, ఎస్ఐలు ఖాజావలి, జె. శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద, చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కాగా, వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద పార్కులో మంటలు చెలరేగడం వెనుక కుట్ర ఉందనే అనుమానం కలుగుతోందని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని తాడేపల్లి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసినట్టు వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అంకంరెడ్డి నాగనారాయణమూర్తి చెప్పారు. తరచూ టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా గొడవ చేస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతకు భంగం కలిగేలా నిత్యం ఏదో ఒక ఘటన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
స్కామ్‌ల కోసం సంపద సేల్.. ఆర్థిక విధ్వంసకారుడు చంద్రబాబే
చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి, ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలన్న ఆరాటం ఉంది కాబట్టి రూ.2.73 లక్షల కోట్లు బటన్ నొక్కి డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం. లంచం లేని పాలన ఎక్కడైనా జరిగిందంటే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అని గర్వంగా చెప్పగలుగుతున్నా. దేశ చరిత్రలో ఇదో రికార్డు. కమీషన్లు రావు కాబట్టి చంద్రబాబు బటన్ నొక్కడం లేదు.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: నవరత్నాలతో ప్రజలకు మేలు చేయడంతోపాటు ఆర్ధిక క్రమశిక్షణతో తమ ప్రభుత్వం పాలన సాగిస్తే.. తొమ్మిది నెలల్లోనే కూటమి సర్కారు ఆర్ధిక విధ్వంసం, స్కామ్‌ల కోసం సంపదను తెగనమ్ముతోందని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS JaganMohanReddy) విరుచుకుపడ్డారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే తన ఆస్తులు, తమ వారి ఆస్తులు పెంచుకుని జేబులు నింపుకోవటమేనని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో జరగని స్కామ్ అంటూ లేదని దుయ్యబట్టారు. తొమ్మిది నెలల పాలనలో రూ.1.45 లక్షల కోట్ల అప్పులతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన చంద్రబాబు ఆర్థిక విధ్వంసకారుడా? లేక కోవిడ్‌లోనూ వృద్ధి రేటులో దేశంతో పోటీ పడి ఉత్తమ పని తీరు, మెరుగైన వృద్ధి రేటు, తలసరి ఆదాయంలో పెరుగుదల, సామాజిక సేవలపై వ్యయం, మూలధన వ్యయంలో పెరుగుదల నమోదు చేసిన తాము విధ్వంసం సృష్టించినట్లా? అని ప్రశ్నించారు. పారదర్శకంగా ఇసుక విక్రయాల ద్వారా ఖజానాకు ఏటా రూ.750 కోట్ల ఆదాయం సమకూర్చిన తమ ప్రభుత్వం సంపద సృష్టించినట్లా? లేక ఇసుక నుంచి మద్యం దాకా పచ్చముఠాల దోపిడీకి పచ్చజెండా ఊపిన టీడీపీ సర్కారు సంపద సృష్టించినట్లా? అని నిలదీశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన తాము సంపద సృష్టించినట్లా? లేక వాటికి అడ్డుపడి ప్రైవేట్‌కు అప్పగించి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమైన చంద్రబాబు సంపద సృష్టికర్తా? అని ప్రశ్నించారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని తొలగించి జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండర్లతో పారదర్శక విధానాన్ని ప్రవేశపెట్టిన తాము ఆర్థిక విధ్వంసకారులమా? తిరిగి మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ కమీషన్లు వసూలు చేసుకుంటున్న చంద్రబాబు ఆర్ధిక విధ్వంసకారుడా? అని ప్రశ్నించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. గత తొమ్మిది నెలలుగా టీడీపీ కూటమి సర్కారు అరాచకాలు, హామీల ఎగవేత, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై దుష్ఫ్రచారాలను కాగ్, కేంద్ర ఆర్ధిక సంఘం, కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ నివేదికల ఆధారంగా ఎండగట్టి కడిగి పారేశారు.అప్పుల్లో ఆల్‌టైమ్ రికార్డు⇒ తొమ్మిది నెలల పాలనలో అప్పుల విషయంలో మాత్రం చంద్రబాబు రికార్డులు బద్ధలు కొట్టారు. బహుశ ఏ ప్రభుత్వ హయాంలోనూ ఈ స్థాయిలో అప్పులు చేసిన దాఖలాలు లేవు. ఎఫ్ఆర్బీఎం పరిధిలో బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.80,827 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు, తెచ్చే అప్పులు కలిపి మరో రూ.52 వేల కోట్లు ఉంటాయి. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.5వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, సీఆర్డీఏ ద్వారా చేయాలని నిర్ణయించిన అప్పులు మరో రూ.21 వేల కోట్లు ఉంటాయి. మార్క్‌ఫెడ్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ద్వారా మరో రూ.8 వేల కోట్లు, ఏపీఎండీసీ ద్వారా తేనున్న అప్పులు మరో రూ.5 వేల కోట్లు..! తీసుకొచ్చిన అప్పులు, తేనున్న అప్పులు కలిపితే రూ.1.45 లక్షల కోట్ల పైమాటే. ఇదొక రికార్డు. దీన్ని ఎవరూ బద్ధలు కొట్టలేరు.⇒ ఈ మధ్య నీతి ఆయోగ్ పేరుతో చంద్రబాబు ఆడిన కొత్త డ్రామాలు మీరు చూసే ఉంటారు. ఏదైనా పోల్చినప్పుడు తన ఐదేళ్ల పాలనను, మన ఐదేళ్ల పాలనతో పోల్చి వాస్తవాలివీ అని చెప్పేలా ఉండాలి. కానీ ఈ పెద్ద మనిషి ఏం చేశాడంటే.. తన పాలనలో బెస్ట్ ఇయర్ (2018–19)లో వచ్చిన ఫలితాలను మన హయాంలో వరస్ట్ ఇయర్ (2022–23)తో కంపేర్ చేస్తూ రాష్ట్రం చాలా అన్యాయమైన పరిస్థితుల్లో ఉన్నట్టు చూపించారు. చంద్రబాబు ఐదేళ్ల డేటా.. మన హయాంలో ఐదేళ్ల డేటాను పరిశీలించి ఎవరు ఆర్ధిక విధ్వంసం చేశారో మీరే చూడండి. మా హయాంలో రెండున్నరేళ్లు కోవిడ్ ఉందన్న విషయాన్ని మర్చిపోకండి. కానీ చంద్రబాబు హయాంలో ఎలాంటి కోవిడ్లు లేవు.. మహమ్మారులూ లేవు. ⇒ ఏపీ ఎవరి హయాంలో వేగంగా అడుగులు వేసిందో చెప్పేందుకు జీడీపీ (దేశీయ స్థూల ఉత్పత్తి)లో రాష్ట్ర వాటా ఎంత అన్నది కూడా ప్రామాణికం. దేశ జీడీపీలో రాష్ట్ర వాటా చంద్రబాబు హయాంలో 2014–19లో కేవలం 4.47 శాతం కాగా వైఎస్సార్సీపీ హయాంలో 2019–24లో ఆ వాటా 4.80 శాతానికి పెరిగింది. ఎవరి హయాంలో రాష్ట్రం విధ్వంసమైంది? ఎవరి హయాంలో వృద్ధి పరుగులు తీసింది? అనేది చెప్పేందుకు ఇదొక నిదర్శనం. ⇒ కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ఇచ్చిన నివేదికతో మరో ఆధారాన్ని చూపిస్తా. చంద్రబాబు దిగిపోయే నాటికి 2018–19లో తలసరి ఆదాయంలో మన రాష్ట్రం దేశంలో 18వ స్థానంలో ఉంది. అదే వైఎస్సార్సీపీ హయాంలో తలసరి ఆదాయంలో మన రాష్ట్రం 2022–23లో 15వ స్థానానికి ఎగబాకింది. మరి ఎవరి హయాంలో ఆరి్ధక విధ్వంసం జరిగింది? ఎవరి హయాంలో ప్రజలు బాగుపడ్డారో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ⇒ వృద్ధి రేటులో మా ప్రభుత్వ హయాంలో 2019–24లో దేశంతో పోటీ పడ్డాం. ప్రతి రంగంలో దేశం కంటే రాష్ట్రం ఉత్తమ ఫలితాలు సాధించింది. దేశ జీడీపీ 2019–24లో 9.34 శాతం కాగా రాష్ట్రం ఏకంగా 10.23 శాతంతో మెరుగైన పనితీరు కనబరిచింది. ⇒ పారిశ్రామిక రంగం జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్) ర్యాంకింగ్ పరిశీలిస్తే చంద్రబాబు దిగిపోయేనాటికి మన రాష్ట్రం 11 స్థానంలో ఉంటే.. 2023–24లో మా ప్రభుత్వం వైదొలిగే నాటికి 9 స్థానానికి ఎగబాకాం. రెండున్నరేళ్లు కోవిడ్ ఉన్నా సరే.. మంచి పనితీరు కనబరిచాం. మరి ఎవరిది ఆర్థిక విధ్వంసం? టీడీపీ హయాంలో 2014–19 మధ్య ఆస్తుల కల్పనలో భాగంగా సగటు మూలధన వ్యయం రూ.13,860 కోట్లు ఖర్చు చేస్తే.. మా హయాంలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మూలధన వ్యయం కింద రూ.15,632 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు చెప్పండి. ఎవరి హయాంలో ఆర్ధిక విధ్వంసం జరిగింది? ఇక చంద్రబాబు సామాజిక సేవల కింద ఒకే ఒక్క సంవత్సరాన్ని చూపించారు. 2018–19లో సోషల్ సర్వీస్ కింద ఆయన రూ.2,866.11 కోట్లు ఖర్చు చేస్తే.. 2022–23లో రూ.447.78 కోట్లు మాత్రమే వ్యయం చేశారని చెప్పుకొచ్చారు. కానీ 2014–19 మధ్య ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం రూ.2,437 కోట్లు ఖర్చు చేస్తే.. వైఎస్సార్సీపీ హయాంలో దానికి రెట్టింపు.. రూ.5,224 కోట్లు వ్యయం చేశాం. ఇవన్నీ మూలధన వ్యయంలో సోషల్ సర్వీస్ కింద ఖర్చులపై కాగ్ నివేదిక తేల్చిన లెక్కలు. ఒక్క ఏడాదిని మాత్రమే తీసుకుని పోల్చుకోవడం చంద్రబాబు మనస్థత్వానికి, వక్రీకరణలకు అద్దం పడుతోంది. ఏ రకంగా చూసుకున్నా సరే.. మా హయాంలో రాష్ట్రం అన్ని రకాలుగా ముందడుగు వేసింది.ఆర్ధిక అరాచకం..⇒ 2014–19లో టీడీపీ హయాంలో రాష్ట్రం కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు 15.43 శాతం ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వ జీఎస్డీపీ పెరుగుదల 13.46 శాతం. అంటే చంద్రబాబు చెప్పిన సిద్ధాంతం ప్రకారమే డెట్ సస్టెయినబులిటీ ఎక్కువగా ఉంది. ⇒ 2019–24లో దేశం పరిస్థితిని గమనిస్తే వడ్డీలకు సంబంధించి వృద్ధిరేటు సీఏజీఆర్ 12.80 శాతమైతే.. జీడీపీలో సీఏజీఆర్ 9.34 శాతం ఉంది. దేశం జీరో డెట్ సస్టయినబులిటికీ వెళ్లిపోయింది. రాష్ట్రంలో వడ్డీల వృద్ధి రేటు చంద్రబాబు హయాంలో 15.43 శాతం ఉంటే దాన్ని 13.92 శాతానికి తగ్గించగలిగాం. కానీ ఆ విషయాన్ని మాత్రం చెప్పడు. ఇక జీడీపీ వృద్ధి రేటు 9.34 శాతం ఉంటే మా హయాంలో మన రాష్ట్రం దేశం కంటే మెరుగ్గా 10.23 శాతం గ్రోత్ నమోదు చేసింది. అక్కడ కూడా మనం ప్లస్‌లోనే ఉన్నాం. ఇవన్నీ దాచిపెట్టి వడ్డీల పెరుగుదల రేటు 13.92 శాతం.. ఏపీ జీఎస్డీపీ 10.23 శాతం అని చెబుతూ రాష్ట్రం విధ్వంసమైందని చంద్రబాబు చెప్పడం ధర్మమేనా? మొత్తం పిక్చర్ గమనిస్తే చంద్రబాబు హయాంలో రాష్ట్రం ఏ స్థాయిలో విధ్వంసమైందన్నది స్పష్టంగా తెలుస్తోంది. జగన్ హయాంలో రాష్ట్రాన్ని చేయిపట్టుకొని నడిపించే కార్యక్రమం జరిగినట్లు విస్పష్టంగా కనిపిస్తోంది. ⇒ ఇక ఎవరి హయాంలో అప్పులు ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనిస్తే.. రాష్ట్రం అప్పులు రూ.14 లక్షల కోట్లు అని చంద్రబాబు ఊదరగొట్టారు. రాష్ట్రం శ్రీలంకలా అయిపోతోందని బండలు వేశాడు. ఇప్పుడు గవర్నర్ ప్రసంగానికి వచ్చేసరికి రాష్ట్రం అప్పులు రూ.10 లక్షలు కోట్లు అని చెప్పారు. శ్వేత పత్రాలు విడుదల చేసే సమయంలో రూ.12.93 లక్షల కోట్లన్నారు. బడ్జెట్ ప్రవేశపెడితే అప్పులు చెప్పాల్సి వస్తుందని వాయిదా వేస్తూ వచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో నవంబర్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్రం అప్పులు రూ.6,46,531 కోట్లు మాత్రమే అని తనంతట తానే ఒప్పుకోక తప్పలేదు. ఇంత దారుణమైన మనిషి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు. ఈ పెద్దమనిషి చంద్రబాబు ఇలాంటి మోసాలు చేస్తా ఉంటారు. వీటిని ప్రజలు గమనించాలి. ⇒ ఎఫ్ఆర్బీఎం పరిమితులకు లోబడి రాష్ట్ర జీఎస్డీపీలో 3 నుంచి 3.5 శాతం అప్పులు చేయవచ్చని కేంద్రం నిర్దేశిస్తోంది. ఆ ప్రకారమే ఎవరైనా తీసుకోగలుగుతారు. అంతకంటే ఎక్కువ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. చంద్రబాబు పాలనలో 2014–19లో ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటి రూ.31,082 కోట్లు అదనంగా అప్పులు చేశారు. ఆయన తీసుకున్న అదనపు అప్పులతో రూ.17 వేల కోట్లు మా ప్రభుత్వ హయాంలో కోత పెట్టారు. ⇒ చంద్రబాబు హయాంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కూడా తగ్గింది. 2023–24లో జూన్–డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ.50,804 కోట్లు అయితే.. 2024 జూన్ నుంచి డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.50,544 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 10 శాతం ఆదాయం పెరగడం సాధారణం. అలాంటిది చంద్రబాబు హయాంలో 0.5 శాతం తగ్గింది. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు చంద్రబాబు, వారి మనుషులు జేబుల్లోకి పోతున్నాయి!⇒ వృద్ధి రేటు తిరోగమనంలో (నెగిటివ్ గ్రోత్) ఉన్నప్పుడు జీఎస్డీపీలో పెరుగుదల ఉంటుందా? రెవెన్యూ గ్రోత్ తగ్గినప్పుడు జీఎస్డీపీ తగ్గాలి కదా! కానీ చంద్రబాబు తన హయాంలో 13 శాతం పెరిగినట్టు రిపోర్టు ఇచ్చారు. ఆయన ఏ స్థాయిలో అబద్ధాలాడుతున్నారో దీన్నిబట్టి తేటతెల్లమవుతోంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చంద్రబాబుకు కొత్తేమి కాదు.⇒ 2016లో చంద్రబాబు దావోస్ వెళ్లినప్పుడు ఏపీకి రక్షణ పరికరాల ప్లాంట్ వస్తుందన్నారు. 2017లో వెళ్లినప్పుడు విశాఖపటా్ననికి హైస్పీడ్ రైళ్ల కర్మాగారం, హైబ్రీడ్ క్లౌడ్ వస్తుందన్నారు. సౌదీ ఆరాంకో వచ్చేస్తుందన్నారు. 2018 పర్యటనలో రాష్ట్రానికి 150 సంస్థలు వచ్చేస్తున్నాయన్నారు. ఇంకా ఎయిర్ బస్, అలీబాబా ఏపీకి వస్తున్నాయన్నారు. 2019 జనవరిలో వెళ్లినప్పుడు ఏపీకి జెన్ ప్యాక్ వస్తుందని ప్రచారం చేసుకున్నారు(ఈనాడు కథనాల క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు). ఇదంతా దొంగల ముఠా.. దోచుకో పంచుకో తినుకో విధానం. ఇలా బిల్డప్‌లు, అబద్ధాలు చెప్పడం.. మోసాలు చేయడం చంద్రబాబుకు కొత్త కాదు. ⇒ చంద్రబాబు దావోస్ వెళ్లినప్పుడు ఒక్క ఎంవోయూ కూడా చేసుకోలేకపోయారంటే ఇప్పుడు రాష్ట్రానికి ఉన్న పలుకుబడి.. చంద్రబాబు పట్ల పారిశ్రామికవేత్తల్లో ఎలాంటి అభిప్రాయం నెలకొందో చెప్పేందుకు నిదర్శనం. పెట్టుబడులు పెట్టేందుకు జిందాల్ లాంటి సంస్థ వస్తే ఎవరైనా రెడ్ కార్పెట్ పరిచి స్వాగతిస్తారు. కానీ చంద్రబాబు ఏం చేశారంటే.. వాళ్లపై కేసులు పెట్టి, వాళ్ల ప్రతిష్టను నాశనం చేసి భయపెట్టి వెళ్లగొట్టాడు. దీంతో అదే దావోస్‌లో వాళ్లు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నాడు. సంపద సృష్టించిందెవరు?⇒ రాష్ట్రం ఆదాయాలు పెరిగేలా వైఎస్సార్సీపీ హయాంలో నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపట్టాం. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు ప్రభుత్వ రంగంలో చేపట్టాం. రామాయపట్నం 75–80 శాతం పూర్తయింది. మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో 35–40 శాతం పనులు వేగంగా పూర్తయ్యాయి. 10 ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మా హయాంలో కొన్ని ప్రారంభోత్సవం కూడా చేశాం. వీటి ద్వారా కొన్ని లక్షల కోట్ల ప్రభుత్వ సంపద సృష్టించబడుతుంది. రాష్ట్రానికి సొంత రాబడి పెరగాలంటే ఇలాంటిæ ఆస్తులు ప్రభుత్వం చేతిలో ఉండాలి. ఇవన్నీ ఫైనాన్షియల్ టైఅప్ అయిన ప్రాజెక్టులు వీటి నిర్మాణానికి నిధుల కోసం వెతుక్కోవాల్సిన పని లేదు. డబ్బులొచ్చి మేరిటైం బోర్డు అకౌంట్లో ఉన్నాయి. డబ్బులు డ్రా చేస్తూ కంప్లీట్ చేస్తే చాలు. ఈపాటికే రామాయపట్నానికి ప్రారంభోత్సవం చేయవచ్చు. మిగిలినవి ఒకటి రెండేళ్లలో పూర్తి చేయొచ్చు. అలాంటిది వీటిని అడ్డం పెట్టుకొని స్కామ్‌లు చేస్తూ అమ్మకానికి పెట్టారు. ⇒ మా హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వీటిలో ఐదు కాలేజీలను మా హయాంలోనే ప్రారంభిస్తే ఈ విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మరో 5 కొత్త కళాశాలలను అడ్డుకుని తమవారికి ప్రైవేట్‌కు విక్రయించేందుకు సిద్ధపడుతున్నారు. ⇒ వచ్చే ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లు ఇస్తామని ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ ఏడాది 10 వేల సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఇలాంటప్పుడు ఎవరైనా సాధ్యమైనన్ని సీట్లు తమ రాష్ట్రానికి రావాలని ఆరాటపడతారు. కానీ మన రాష్ట్రానికి ఇస్తామన్న మెడికల్ సీట్లను సైతం వద్దంటూ కేంద్రానికి లేఖ రాసిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రమే. ఇలా స్కామ్‌ల కోసం ఉన్న ఆస్తులను అమ్ముతున్నారు. సంపద సృష్టి అంటే బాబు జేబు నింపుకోవడమా? చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే.. తన ఆస్తులు, తమ వారి ఆస్తులు పెంచుకోవడం! ఈ ప్రభుత్వ హయాంలో జరగని స్కామ్ అంటూ లేదు. గతంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది. ఈరోజు ఒక్క రూపాయి రావడం లేదు పైగా గతంలో కంటే రెట్టింపు ధర వసూలు చేస్తున్నారు. సంపద సృష్టి చంద్రబాబు జేబులోనే జరుగుతోంది! రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఆవిరవుతోంది. ⇒ ఇక లిక్కర్ స్కామ్.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులను ప్రైవేటు పరం చేసారు. ఇవే ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారు. చంద్రబాబు తమ ప్రభుత్వంలో స్కామ్‌లు చేస్తూ అక్కడకు వెళ్లి అరవింద్ కేజ్రీవాల్‌ను తిట్టి వస్తాడు. మద్యం షాపులను ప్రైవేౖటుపరం చేసాడు. తనవారికి షాపులు ఇప్పించుకునేందుకు తమ ఎమ్మెల్యేలతో ఎలా కిడ్నాప్‌లు చేయించారో చూశాం. తన పార్టీకి సంబంధించిన వాళ్లు మాత్రమే టెండర్లలో పాల్గొనేలా చేశారు. లాటరీలో కూడా తమ వాళ్లకే షాపులు దక్కేలా చేసుకున్నారు. వేరే వాళ్లు పాల్గొనకుండా పోలీసులు సమక్షంలో చేసారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బెల్టుషాపులకు వేలం పాటలు నిర్వహించారు. ప్రతి గ్రామంలో రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు తమ కార్యకర్తలకు కట్టబెట్టారు. వీటిని పాడుకున్న వారికి పోలీసుల ద్వారా సహకారం అందిస్తున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నా పట్టించుకునే వారే లేరు. అదే ప్రభుత్వ రంగంలో షాపులుంటే ఆ ఆదాయం అంతా ప్రభుత్వానికి వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గుతుంటే చంద్రబాబు ఆదాయం మాత్రం పెరుగుతోంది. ⇒ ఇసుక, మద్యం, సిలికా, క్వార్జ్, ఫ్లైయాష్.. ప్రతిదీ మాఫియానే. అన్నీ పెదబాబు, చినబాబు ఆధ్వర్యంలో నడిపిస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్‌లు..! మండల, గ్రామ స్థాయిలో కూడా నడుపుతున్నారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యేలకు అడిగినంత ముట్టజెప్పాల్సిందే! ఎమ్మెల్యేలు దండుకున్న సొమ్ములో పెదబాబు, చినబాబు, దత్తపుత్రుడికి వాటాలు పంపితే అంతా సాఫీగా జరుగుతుంది. ⇒ కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు 10 శాతం చెల్లించి 8 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారు. మేం పారదర్శకంగా అమలు చేసిన జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండర్ల విధానాన్ని రద్దు చేశారు. ఫలితంగా సంపద సృష్టి జరగక ప్రభుత్వ ఆదాయం ఆవిరైపోతోంది. తమ అక్రమాలను ఎవరైనా ప్రశ్నిస్తే రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ బెదిరిస్తున్నారు. నాడు నవరత్నాలు.. నేడు విధ్వంసాలు..⇒ పిల్లలను బడులకు పంపేలా తల్లులకు చేయూతనిస్తూ మేం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని నిలిపివేశారు. ఇది విధ్వంసం కాదా? ⇒ పాఠశాలల్లో నాడు–నేడు పనులను నిలిపివేశారు. ఇది విధ్వంసం కాదా? ⇒ ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ, మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణను తొలగించి పిల్లలను ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలకు దూరం చేశారు. ఇది విధ్వంసం కాదా?⇒ ఎనిమిదో తరగతి పిల్లలకు ఏటా ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆపేశారు. ఇది విధ్వంసం కాదా? ⇒ సబ్జెక్ట్ టీచర్ విధానానికి గ్రహణం పట్టించారు. వసతి దీవెన పథకాన్ని రద్దు చేసి, విద్యా దీవెన పథకాన్ని అరకొరగా విదిలిస్తున్నారు. చదువులతో చెలగాటం ఆడుతున్నారు. ఇది విధ్వంసం కాదా? ⇒ పథకాలు ఇవ్వకపోగా ఉన్న పథకాలను ఎత్తేసి ప్రజల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. ఇది విధ్వంసం కాదా?⇒ ఆరోగ్యశ్రీ ఊపిరి తీశారు. ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా చేశారు. ఈ రోజు పేదలు అనారోగ్యం బారినపడితే అప్పులపాలు అయ్యే దుస్థితి కల్పించారు. ఇది విధ్వంసం కాదా? ⇒ రైతు భరోసాను నిలిపి వేయడం, ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడం, ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేయడం విధ్వంసం కాదా? ⇒ అక్కచెల్లెమ్మలను చేయి పట్టి నడిపించే ఆసరా, సున్నా వడ్డీ, ఈబీసీ, కాపు నేస్తం లాంటి పథకాలన్నింటినీ రద్దు చేసి వారి జీవితాలను అగమ్యగోచరంగా మార్చారు. ఇది విధ్వంసం కాదా?⇒ నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, చేదోడు, తోడు లాంటి పథకాలను నిలిపివేసి పేదలకు తీరని ద్రోహం తలపెట్టారు. ఇది విధ్వంసం కాదా? ⇒ ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా.. ఉన్న వాటినే ఊడగొట్టారు. వలంటీర్లను రోడ్డుకు ఈడ్చారు. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేయడం విధ్వంసం కాదా? ⇒ రాష్ట్ర ఆదాయాన్ని పెంచకుండా సొంత జేబులో ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ఇసుక, మద్యం, క్వార్ట్జ్, సిలికా లాంటి వనరులను దోచేస్తున్నారు. ఇది విధ్వంసం కాదా? -
జగన్ 2.0: కార్యకర్తల కోసం.. ఎలా పని చేస్తానో చూపిస్తా
వరుసగా రెండేళ్లు కోవిడ్ కారణంగా అనుకోని ఖర్చులు పెరిగాయి. మరోవైపు రాష్ట్ర ఆదాయాలూ తగ్గాయి. అయినా కూడా మనం ఏ రోజూ సాకులు చెప్పలేదు. ప్రజలకు పథకాలు ఇవ్వకుండా ఉండేందుకు కారణాలను వెతుక్కోలేదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాటను ఏరోజూ తప్పలేదని వైఎస్సార్సీపీ కార్యకర్తగా గర్వంగా చెబుతున్నా. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘‘మన ప్రభుత్వ పాలనతో చంద్రబాబు సర్కార్ పరిపాలనను ప్రజలు పోల్చి చూస్తున్నారు.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు తుంగలో తొక్కారు.. వ్యవస్థలన్నింటినీ పూర్తిగా నిర్వీర్యం చేశారు.. మన ప్రభుత్వంలో ప్రతిదీ పకడ్బందీగా జరిగింది. మరి చంద్రబాబు అదే ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారనే చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీ(YSRCP) అఖండ విజయం సాధించడం తథ్యం.. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టడం ఖాయం. రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు పరిపాలిస్తాం’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy)స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ నగర పాలక సంస్ధ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ‘ఒక్కటే గుర్తు పెట్టుకోండి.. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..కష్టాలు ఎల్లకాలం ఉండవు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయాల్లో కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కొంటాం అన్నదే నాయకుల్ని చేస్తుంది. కష్టం వచ్చినా మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. ఒక్కసారి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ప్రజల్లో చులకన అవుతాం. కష్టాలు ఎల్లకాలం ఉండవు. ఎవరికి.. ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తు తెచ్చుకోండి. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. నామీద కేసులు వేసింది కూడా కాంగ్రెస్, టీడీపీ నాయకులే. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నానన్న కారణంతో దొంగ కేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఏం జరిగింది? బయటకు వచ్చి ప్రజల అండతో ముఖ్యమంత్రినయ్యా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు.. దొంగ కేసులు పెడతారు.. జైల్లో పెడతారు. అయినా రెట్టించిన ఉత్సాహంతో పని చేద్దాం. మీకు మంచి చేసిన వారిని, చెడు చేసిన వారినీ ఇద్దరినీ గుర్తు పెట్టుకోండి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ నగర పాలక సంస్థ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులుదృఢంగా నిలబడినందుకు గర్వపడుతున్నా..విజయవాడ కార్పొరేషన్లో 64 స్థానాలు ఉంటే అప్పట్లో మనం 49 గెలిచాం. టీడీపీకి వచ్చిన స్థానాలు కేవలం 14. కమ్యూనిస్టులు ఒక్క సీటు గెలిచారు. వాళ్లకు కేవలం 14 స్ధానాలున్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత రకరకాల ప్రలోభాలకు గురి చేసి, భయపెట్టి 13 మందిని తీసుకున్నారు. అయినా ఇంకా 36 మంది నిటారుగా నిలబడ్డారని చెప్పేందుకు గర్వపడుతున్నా. కార్పొరేషన్, మున్సిపాలిటీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు.. ఏవి తీసుకున్నా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన మూడేళ్ల తర్వాత వాటికి ఎన్నికలు జరిగితే మన పార్టీ క్లీన్‌స్వీప్ చేయగలిగింది. ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేశాం. ప్రతి నెలా ఏ పథకాన్ని అమలు చేస్తామో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే సంక్షేమ క్యాలెండర్‌ను విడుదల చేసి ఏటా క్రమం తప్పకుండా, ప్రజలకు ఎక్కడా నష్టం జరగకుండా, వారు ఇబ్బంది పడకుండా ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే.కాలర్ ఎగరేసి మరీ చెప్పగలం..వైఎస్సార్సీపీ విలువల కోసం నిలబడిన పార్టీ. నా దగ్గర నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకూ ఇది నా పార్టీ అని కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పకునేలా వ్యవహరించాం. ఇవాళ ఎన్నికలు పూర్తయి దాదాపు 9 నెలలు కావస్తోంది. మనం ఓడిపోయినా ఈ రోజుకు కూడా గర్వంగా తలెత్తుకుని ప్రజల దగ్గరకు పోగలుగుతాం. వాళ్ల మధ్య నిలబడి సమస్యలను వినగలుగుతాం. వారితో మమేకం కాగలుతాం. కారణం.. మనం ప్రజలకు మంచే చేశాం. ఏరోజూ మనం వాళ్లను మోసం చేయలేదు. ఏరోజూ అబద్ధాలు చెప్పలేదు. ఏదైతే చెప్పామో.. అది చేసి చూపించిన తర్వాత వాళ్లను ఓట్లు అడిగాం. కాబట్టి ప్రజల దగ్గర మన విలువ తగ్గలేదు.నిలదీస్తారన్న భయంతోనే రెడ్‌బుక్ రాజ్యాంగం..ఎన్నికలు జరిగి 9 నెలలు కూడా తిరక్కముందే కూటమికి చెందిన ఎమ్మెల్యే మొదలు.. కార్యకర్త వరకు ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. కారణం.. ఏ గడపకు వెళ్లినా ఎన్నికల ముందు వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లు గురించి ప్రజలు నిలదీస్తున్నారు. తల్లికి వందనం కింద తమకిస్తామన్న రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు ప్రశ్నిస్తున్నారు. ఆ పిల్లల తల్లులు ఆడబిడ్డ నిధి కింద తమకు ఇవ్వాల్సిన రూ.18 వేలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. ఆ ఇంట్లో 50 ఏళ్లు నిండిన ఆ తల్లుల అత్తలు, అమ్మలు తమకిస్తామన్న రూ.48 వేలు ఏమయ్యాయని అడుగుతున్నారు. అదే ఇంట్లో 20 ఏళ్ల యువకుడు తమకు ప్రతి నెలా నిరుద్యోగ భృతి కింద ఇస్తామన్న రూ.36 వేల గురించి నిలదీస్తున్నాడు. ఇక గ్రామీణ ప్రాంతాలకు వెళితే అన్నదాతా సుఖీభవ కింద తమకు ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సంగతేమిటని కండువా వేసుకున్న రైతన్నలు నిలదీస్తున్నారు. ఇలా ఏ ఇంటికి వెళ్లినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ రోజు ఎన్నికలప్పుడు తాము చేయలేకపోతే కాలర్ పట్టుకోమన్నారు. అదే మాట గుర్తు చేస్తూ.. ఈరోజు ప్రజలు ఎక్కడ కాలర్ పట్టుకుంటారో అని భయపడి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు.ఆ రోజే చెప్పా.. అదే జరిగిందిఎన్నికలు అయిపోయిన 9 నెలల తర్వాత.. ఇవాళ సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెబితే తెలుసుకుంటానని చంద్రబాబు చెబుతున్నారు. ఆ రోజే నేను ఎన్నికల ప్రచారంలో చెప్పా. ‘చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే..! చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమే..!’ అని చెప్పా. మన మేనిఫెస్టో, వాళ్ల హామీలను చూపిస్తూ.. చంద్రబాబు చెప్పినవి అమలు చేయడం సాధ్యం కాదని చెప్పా. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. చంద్రబాబు ఆ పథకాలు అమలు చేయలేక చేతులెత్తేశారు.చేసేదే చెప్పాం.. చెప్పిందే చేశాంరాష్ట్ర బడ్జెట్ ఇదీ.. మనం చేస్తున్న కార్యక్రమాలు ఇవీ.. వీటికింత ఖర్చవుతుంది అని నాడు మనం చెప్పాం. మరోవైపు చంద్రబాబు రూ.1.72 లక్షల కోట్లు ఖర్చయ్యే ప్రతిపాదనలు చెబుతున్నారు.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంతా మోసం.. అని వివరిస్తూ మనం ఏం చేయగలుగుతాం అనేది కూడా ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పాం. ఆరోజు మన ప్రజా ప్రతినిధులు, శ్రేయోభిలాషులు నా దగ్గరకు వచ్చి మనం కూడా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లా హామీలు ఇద్దామన్నారు. కానీ అప్పుడు నేను ఒక్కటే చెప్పా.. విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేయడం అనవసరం అని చెప్పా. ఏదైతే చేయగలుగుతామో అదే చెప్పాలి. చేయలేనిది చెప్పి, ప్రజలను మోసం చేయడం ధర్మం కాదని చెప్పా. ఓడిపోయాం.. ఫరవాలేదు. ప్రతిపక్షంలో కూర్చున్నాం.. అదీ ఫర్వాలేదు. మళ్లీ అదే రోజుకు వెనక్కి వెళ్లినా కూడా ఇదే విధంగానే మరలా చెబుతాం. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్ధం అదే! జమిలి ఎన్నికలు అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అదే విలువలు, విశ్వసనీయత అన్న పదం మీద వైఎస్సార్సీపీ మళ్లీ అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజలకు చంద్రబాబు నైజం పూర్తిగా అర్ధం అవుతోంది.ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పని చేస్తుందో చూపిస్తాం. ఇది కచ్చితంగా చెబుతున్నా. జగనన్న 1.0లో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయి ఉండొచ్చు. ప్రతి పథకం, ప్రతి విషయంలోనూ మొట్టమొదట ప్రజలే గుర్తుకొచ్చి వారి కోసమే తాపత్రయపడ్డా. వారి కోసమే నా టైం కేటాయించా. ప్రజల కోసమే అడుగులు వేశా. కానీ ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశా. కార్యకర్తల బాధలను గమనించా. వారి అవస్థలను చూశా. ఆ కార్యకర్తలకు మీ జగన్ అండగా ఉంటాడు.- వైఎస్ జగన్ ‘‘జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్కూళ్లు బాగుపడ్డాయి. ఇంగ్లిష్ మీడియం వచ్చింది. నాడుృనేడుతో స్కూళ్లు బాగుపడటమే కాకుండా సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రభుత్వ పాఠశాలల ప్రయాణం మొదలైంది. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గది డిజిటలైజ్ అయింది. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 8వ తరగతి పిల్లాడి చేతిలో ట్యాబ్‌లు కనిపించేవి. ప్రైవేట్ స్కూళ్లు ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడే పరిస్ధితిని రాష్ట్రం ఎప్పుడైనా చూసిందంటే.. అది కేవలం వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది. మొదటిసారిగా గవర్నమెంట్ బడులలో నో వేకెన్సీ బోర్డులు కేవలం మన ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే కనిపించాయి..’’- వైఎస్ జగన్ పాలన పోలుస్తున్నారు.. ప్రజలే తేల్చేస్తారుఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా పక్కకు వెళ్లిపోవడం ఒక అంశం అయితే.. రెండో అంశం వ్యవస్ధలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం రాక ముందు మన ప్రభుత్వంలో ప్రతిదీ పకడ్భందీగా జరిగింది. అదే ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారనే చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది. జగన్ ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయి. మన హయాంలో క్రమం తప్పకుండా తల్లులకు అమ్మఒడి ఇచ్చి పిల్లలను చదివించేలా ప్రోత్సహించాం. వారు ప్రపంచంతో పోటీ పడాలని, ఎంతో ఎదగాలని తపిస్తూ చదువుల్లో సమూల మార్పులు తెచ్చిన పరిస్థితి మన పాలనలో కనిపిస్తే.. ఇప్పుడు 9 నెలల్లోనే ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యమైంది. ఇవాళ ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి చూస్తే.. నాడు–నేడు పాయె... అమ్మఒడి పాయే... ఇంగ్లీషు మీడియం పాయే... ఆరో తరగతి నుంచి తరగతి గదులు డిజిటైజేషన్ కార్యక్రమమూ పాయే... ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం పాయే... మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెఫ్ట్ కూడా పాయే..! ఇక వీళ్ల పాంప్లెట్ పేపర్ ఈనాడులో చూశా.. 70% బడుల్లో 70 మంది పిల్లలు కూడా లేరు అని రాశారు. అది వీళ్ల తప్పిదం వల్ల అని రాయకుండా అది కూడా మన తప్పిదం వల్లే జరిగిందని రాశారు.ప్రజారోగ్యానికి భరోసా కరువు..పేదవాడికి ఆరోగ్యం బాగా లేకుంటే వారి పరిస్థితి ఇవాళ దయనీయంగా తయారైంది. నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్తే ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించే పరిస్థితి లేదు.అదే మన ప్రభుత్వంలో ఉచితంగా వైద్యం అందించడంతోపాటు ప్రొసీజర్లు వెయ్యి నుంచి ఏకంగా 3,300కి పెంచాం. రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచాం. నెట్వర్క్ ఆస్పత్రులను 900 నుంచి 2,400కి పెంచాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సుల కొరత పరిపాటే అనే సంప్రదాయాన్ని సమూలంగా మార్చేశాం. మొదటిసారిగా గవర్నమెంటు ఆస్పత్రుల రూపురేఖలను నాడు–నేడు ద్వారా మార్చివేశాం. దేశవ్యాప్తంగా స్పెషలిస్టు డాక్టర్లు కొరత 61 శాతం ఉంటే.. మన రాష్ట్రంలో దాన్ని 4 శాతానికి తీసుకొచ్చిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే మందులు దొరకని దుస్ధితి నుంచి.. డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలున్న ఔషధాలు మాత్రమే లభించేలా చేసిన ప్రభుత్వం కూడా వైఎస్సార్ సీపీదే. రాష్ట్రంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశాం. 105 రకాల మందులు సరఫరా చేస్తూ 24 గంటలూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. 14 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు కూడా అక్కడే నిర్వహించేలా విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశాం. తొలిసారిగా పీహెచ్‌సీలను బలోపేతం చేసి ప్రతి పీహెచ్సీలో ఒక డాక్టరు ఉండేలా, మరో డాక్టర్ 104 అంబులెన్స్‌లో గ్రామాల్లో అందుబాటులో ఉండేలా చూశాం. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేశాం. ప్రతి డాక్టర్ ఏ ఊరికి వెళ్లాలో నిర్ణయించి నెలలో కనీసం రెండు రోజులు అక్కడకు వెళ్లేలా ‘ఫ్యామిలీ డాక్టర్’ కాన్సెఫ్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది కూడా వైఎస్సార్సీపీ ప్రభత్వమే. కనీవీని ఎరుగని విధంగా తొలిసారిగా ప్రివెంటివ్ కేర్ కూడా వైఎస్సార్ సీపీ హయాంలోనే అమల్లోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పోయాయి. విలేజ్ క్లినిక్‌లు పని చేయడం లేదు. పీహెచ్‌సీలు కూడా పని చేయడం లేదు. కూటమి సర్కారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల బిల్లులను చెల్లించలేదు. ఆరోగ్యశ్రీ కింద ప్రతి నెలా రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతోంది. అంటే దాదాపుగా రూ.3 వేల కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవాళ పేదలకు నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందడం లేదు. ఇదీ.. మన ప్రభుత్వానికి, వీళ్ల ప్రభుత్వానికి మధ్య తేడా!అన్ని వ్యవస్థలు నిర్వీర్యం..తొలిసారిగా రైతుల కోసం ఆర్బీకేలు తేవడం.. ఇ–క్రాప్.. దళారీ వ్యవస్థను తొలగించి ఆర్బీకేల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా కొనుగోలు చేయడం.. అక్కడే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ద్వారా వ్యవస్ధను మార్చడం.. ఇలా మనం చేపట్టిన చర్యలన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నాశనం అయ్యాయి. నాడు గ్రామాల్లో సచివాలయాలను నెలకొల్పి ఎవరెవరు ఎలాంటి పౌర సేవలు అందించాలో నిర్ణయించాం. ప్రతి 50–60 ఇళ్లకు వలంటీర్‌ను నియమించి ప్రతి పథకాన్ని పారదర్శకంగా ప్రతి ఇంటికీ చేరవేసిన కార్యక్రమాలన్నీ ఇవాళ నాశనం అయ్యాయి. కేవలం తొమ్మిది నెలల్లోనే వ్యవస్ధలన్నీ నాశనం అయ్యాయి. మరోవైపు ఏది చూసినా స్కామే...! ఏ గ్రామంలో చూసినా బెల్టు షాపులను రూ.2 లక్షలకో, రూ.3 లక్షలకో ఎమ్మెల్యేలు దగ్గరుండి వేలం పాడిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మేలా సపోర్టు చేస్తున్నారు. ఇవాళ ఏ గ్రామంలో చూసినా మద్యమే కనిపిస్తోంది. ప్రభుత్వం నడుపుతున్న మద్యం షాపులను తొలగించి ప్రైవేట్ దుకాణాలను తెచ్చారు. ఎక్కడ చూసినా ఇసుక రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఇండస్ట్రీ నడపాలన్నా, మైనింగ్ చేసుకోవాలన్నా.. ఏ పనికైనా నాకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలై చంద్రబాబు వరకు పంచుకుంటున్నారు. -
వృద్ధాశ్రమంపై ఏలూరు ఎమ్మెల్యే దాష్టీకం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వేధింపుల పర్వం తారాస్థాయిలో కొనసాగుతోంది. ఓ వృద్ధాశ్రమం నిర్వాహకులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడంటూ ముద్ర వేసి అధికారంలోకి వచ్చిన రోజు నుంచీ వేధింపుల తీవ్రత పెంచారు. చివరకు ఆశ్రమం బిల్లులు నగరపాలక సంస్థ నుంచి మంజూరుకాకుండా అడ్డుకోవడంతో పాటు మంగళవారం స్టోర్ రూమ్, మేనేజర్ రూమ్‌కు అధికారులతో సీల్ వేయించి వృద్ధులను వెళ్లిపోవాల్సిందిగా హుకుం జారీ చేయడం పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఏలూరు నగరంలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి సోదరుడు బడేటి బుజ్జి హయాంలో 2017లో నగరపాలక సంస్థ పరిధిలో మెప్మా ద్వారా ‘నిశ్చింత పట్టణ నిరాశ్రయుల సేవా కేంద్రం’ను నగరంలోని పత్తేబాదలో ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ బాధ్యతను మదర్ థెరిస్సా ఫౌండేషన్‌కు అప్పగించి నిర్వహణ కోసం ప్రతి నెలా రూ.50 వేలు నగరపాలక సంస్థ నుంచి మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం ఆశ్రమంలో 48 మంది వృద్ధులున్నారు. వీరికి పూర్తిగా రెండు పూటలా ఆహారం, వసతితో పాటు వైద్యసేవలన్నీ మదర్‌థెరిస్సా ఫౌండేషన్ నిర్వాహకులే ఉచితంగా చూస్తున్నారు. 2017 నుంచి ఈ కేంద్రం కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా యథాతథంగా ఇబ్బంది లేకుండా కొనసాగించారు. ఈ క్రమంలో 2024లో టీడీపీ ఎమ్మెల్యేగా ఏలూరు నుంచి బడేటి చంటి గెలుపొందారు. దీంతో ఆశ్రమంపై వేధింపుల పర్వం తారాస్థాయికి చేరింది. నగరపాలక సంస్థ కూడా ప్రతి నెలా బిల్లులు ఇవ్వకుండా ఏడాదికి రూ.6 లక్షలు చొప్పున ఒకేసారి బిల్లులు మంజూరు చేసింది. అలా మూడేళ్ల నుంచి రూ.18 లక్షల మొత్తం మదర్‌థెరిస్సా ఫౌండేషన్ నిర్వాహకులు రాయి మంగరాజుకు, రాయి విమలాదేవికి రావాల్సి ఉంది. వైఎస్సార్సీపీ పేరుతో వేధింపులు మదర్‌థెరిస్సా ఫౌండేషన్ నిర్వాహకురాలు రాయి విమలాదేవి 37వ డివిజన్ నుంచి గతంలో టీడీపీ నుంచి గెలుపొంది కార్పొరేటర్‌గా పనిచేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే సోదరుడు, అప్పటి టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆశ్రమ బాధ్యతలను నగరపాలక సంస్థ ద్వారా అధికారికంగా అప్పజెప్పారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని సమక్షంలో విమలాదేవి, ఆమె కుమారుడు పార్టీలో చేరారు. ఎక్కడా క్రియాశీలకంగా లేకుండా పూర్తిగా ఆశ్రమ సేవా కార్యక్రమాలకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిర్వాహకులను ఎమ్మెల్యే ముప్పుతిప్పలు పెడుతున్నారు. గతేడాది జూన్‌లో మంజూరైన బిల్లును నగరపాలక సంస్థలో నిలుపుదల చేయించి అప్పటి నుంచి వేధిస్తూనే ఉన్నారు. వేధింపులకు పరాకాష్టగా మంగళవారం ఎలాంటి నోటీసులు, ముందస్తు సమాచారం లేకుండా నగరపాలక సంస్థ అధికారి కృష్ణమూర్తి, సిబ్బంది, త్రీటౌన్ పోలీసుల సహకారంతో ఆశ్రమానికి వచ్చి స్టోర్‌రూమ్, మేనేజర్ రూమ్‌కు సీల్ వేసి వృద్ధులను బయటికి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు. మరోవైపు ఇదే ఆశ్రమ నిర్వహణ బాధ్యతను నగరపాలక సంస్థ ద్వారా మరొకరికి అప్పగించడం గమనార్హం.ఆత్మహత్యే శరణ్యం.. రూ.18 లక్షలు మంజూరైనా బిల్లు ఇవ్వకుండా వేధించడంతో పాటు ఆకస్మాత్తుగా ఖాళీ చేసి వెళ్లిపోండి అంటున్నారు. మొదటి నుంచీ టీడీపీలోనే ఉన్నాం. నా భార్య టీడీపీ కార్పొరేటర్‌గా కూడా పనిచేశారు. తమపై ఉన్న కక్షతో తమనే నమ్ముకుని ఉన్న 48 మంది వృద్ధులను బజారుపాలు చేయడం అన్యాయం. మాకు న్యాయం చేసి వృద్ధులను ఆదుకోవాలి. – రాయి మంగరాజు, ఆశ్రమ నిర్వాహకుడు -
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
తాడేపల్లి: వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు జరిగాయి. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా కరణం ధర్మశ్రీను నియమించారు. చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్తగా బూడి ముత్యాల నాయుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా తిప్పల దేవన్ రెడ్డి, పి.గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్తగా గన్నవరపు శ్రీనివాస రావు, కాగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి అశోక్ బాబును నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. -
మమ్మల్ని గర్వపడేలా చేశావు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫైనాన్స్) పట్టా పుచ్చుకున్న సందర్భంగా కుమార్తె వర్షారెడ్డికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘వర్షమ్మకు అభినందనలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజ్ లండన్‌లో చదివి పట్టభద్రురాలవడంతోపాటు, డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించి మాకు ఎంతో గర్వకారణమయ్యావు. ఆ దేవుడి ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’ అని స్పందించారు. ఈ సందర్భంగా తన కుటుంబంతో దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. Congratulations dear! Not only have you graduated from a prestigious institute such as King’s College London, but you have made us proud passing with distinction! God bless you dear! pic.twitter.com/8QN5qrGOEe— YS Jagan Mohan Reddy (@ysjagan) January 16, 2025 -
జగన్ హయాం ఆర్థిక ప్రగతికి కితాబు
ప్రపంచ చెస్ మాజీ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ రష్యాలో రాజకీయ అణచివేతలకు వ్యతిరేకంగా ఉద్య మిస్తూ, అనేక పుస్తకాలు రచించారు. ప్రస్తుత రష్యా పాలకుల చేత ఉగ్ర వాదిగా కూడా ముద్ర వేయించుకున్నారు. రష్యాలో నిరంతరం జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా ప్రపంచ వేదికలపై తన గళాన్ని తరచుగా వినిపిస్తున్నారు. ఒక సందర్భంలో ఆయన ‘తప్పుడు వార్తలను ప్రచారం చేసేవారి లక్ష్యం మనల్ని పెడతోవ పట్టించి వారి అజెండాను మనపై రుద్దడమే కాదు, నిజాలను తెలుసుకోవాలన్న మన ఆలోచనలను శాశ్వతంగా నాశనం చేయడం కూడా’ అంటారు. ప్రస్తుత సమాజంలో తప్పుడు కథనాలు, ప్రకటనలు ప్రజల మేధను కలుషితం చేస్తున్నాయి. వారు తప్పుడు నిర్ణయాలు తీసు కునేలా చేస్తున్నాయి. దీనికి ఒక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసినప్పటికీ, ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకొన్నప్పటికీ, అద్భుతమైన ఆర్థిక ప్రగతి సాధించినప్పటికీ; ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, వారి అనుకూల మీడియా నిరంతరం చేసిన తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మారు. ఫలితంగా మంచి చేసే ప్రభుత్వాన్ని చేజేతులా గద్దెదించి, కూటమి నిప్పుల కుంపటిని నెత్తిన పెట్టుకున్నారు. దీని దుష్ఫలితా లను ఆంధ్రులు ఇప్పుడు అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయలేక చేతులెత్తేసి దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి నెలకో వివాదాన్ని సృష్టిస్తోంది. ఆంతేగాక గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాల కారణంగా రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందంటూ తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తోంది.కూటమి నేతలు నిత్యం తప్పుడు ప్రచారాలు చేస్తూ జగన్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వృద్ధి కుంటుపడిందనీ, తాము ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నా మనీ అంటున్నారు. అయితే వీరి అవాస్తవ ప్రచారాన్ని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంకు నివేదికలు పటాపంచలు చేశాయి. జగన్ హయాంలో కుప్పలు తెప్పలుగా అప్పులు చేశారనీ, అప్పుల భారం రూ. 14 లక్షల కోట్లకు చేరిందనీ... ఎన్నికల సమయంలోనూ, తర్వాత కూడా కూటమి నేతలు ప్రచారం చేశారు. అయితే ఈ అప్పులు రూ. 7.5 లక్షల కోట్లు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్ధారించాయి. జగన్మోహన్రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించిందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా నివేదిక ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండి యన్ స్టేట్స్’లో పేర్కొంది.కోవిడ్ కారణంగా రెండేళ్ళపాటు దేశం ఆర్థిక ఒడు దుడుకులకు లోనయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం జగన్ పాలనలో అనేక రంగాల్లో రెండంకెల వృద్ధిలో దూసుకు పోయింది. 2022–23లో దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు సుమారు 8 శాతం ఉంటే ఆ ఏడాది ఏపీలో 11.43 శాతం నమోదయ్యింది. జగన్ హయాంలో నాలుగేళ్ళ సగటు వృద్ధి 12.70గా నమోదయ్యింది. ఇది దేశంలోనే అత్యధిక వృద్ధి రేట్లలో ఒకటి. 2018–19 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2018–31 మార్చి 2019) చంద్రబాబు నాయుడు హయాంలో రూ. 7.90 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ జగన్ ప్రభుత్వ హయాంలో రూ. 13.17 లక్షల కోట్లకు పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదికలో తెలిపింది. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2018–19లో రూ. 1,54,031 కాగా, 2023–24లో అది రూ. 2,42,479 పెరిగింది. తయారీ రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సమ కూరిన నికర స్థూల విలువ 2018–19లో రూ. 67.30 వేల కోట్లు కాగా, 2023–24లో జగన్ ప్రభుత్వ హయాం నాటికి రూ. 1.29 లక్షల కోట్లకు పెరిగింది. అలాగే ఆహార పంటల సాగు విస్తీర్ణం తగ్గి, వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ఫలితంగా రైతుల ఆదాయాలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. 2018–19లో రూ. 9.97 లక్షల కోట్లుగా ఉన్న వ్యవసాయ రంగం నికర విలువ 2023–24లో రూ. 16.82 లక్షల కోట్లకు పెరిగింది. 2018–19లో రూ. 56.10 వేల కోట్లుగా ఉన్న నిర్మాణ రంగం నికర విలువ 2023–24లో రూ. 95.74 వేల కోట్లకు పెరిగింది.జగన్ పాలనలో పారిశ్రామిక వేత్తలు పారిపోయారంటూ విష ప్రచారం చేశారు. అయితే పారిశ్రామిక రంగం నికర విలువ 2018–19లో రూ. 1.57 లక్షల కోట్లు కాగా,అది 2023–24లో రూ. 2.82 లక్షల కోట్లకు పెరిగింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల నికర విలువ 2018–19లో రూ. 32.43 వేల కోట్లు కాగా, 2023–24 నాటికి రూ. 56.59 వేల కోట్లకు పెరిగింది. సేవా రంగం నికర విలువ 2018–19లో రూ. 2.96 లక్షల కోట్లు కాగా, అది 2023–24లో రూ. 4.67 లక్షల కోట్లకు పెరిగింది. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగం గత ప్రభుత్వ హయాంలో 38.41 శాతం, నిర్మాణ రంగంలో 26.75 శాతం, మత్స్య రంగంలో 25.92 శాతం, పారిశ్రామిక రంగంలో 25.58 శాతం, తయారీ రంగంలో 24.84 శాతం, ఆతిథ్య రంగంలో 22.70 శాతం, సర్వీస్ సెక్టార్లో 18.91 శాతం, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 14.50 శాతం వృద్ధి సాధించి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం జగన్ ప్రభుత్వ హయాంలో యేటా 50 లక్షల టన్నుల చేపలు – రొయ్యల ఉత్పత్తులతో, 1.76 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆయిల్ పామ్ సాగులో కూడా ఏపీ దేశంలోనే అగ్ర స్థానంలో ఉంది. దేశ ఎగుమతుల్లో సుమారు 11 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే జరిగాయి. ఏపీ నుంచి సుమారు రెండువేల రకాల ఉత్పత్తులు దేశ విదే శాలకు ఎగుమతి అయ్యాయి. జగన్ పాలనలో మహిళలు, పేదలు కనివిని ఎరుగని రీతిలో సంక్షేమ ఫలాలు అనుభవించారు. పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాల్లో రాష్ట్రం దేశానికే దిశానిర్దేశం చేసింది. కాని జగన్ రాజకీయ ప్రత్యర్థుల అబద్ధపు ప్రచారం ప్రజలను ప్రభావితం చేసింది. ఇప్పుడు ప్రజలు తాము మోసపోయామని వాపోతున్నారు. అధికారం కోసం వెంప ర్లాడే వారు, వారి అడుగులకు మడుగులొత్తే మీడియా వర్గాలు నిజాన్ని ఫణంగా పెట్టి చెప్పే ప్రతి అబద్ధానికి ఏదో ఒక రోజు మూల్యం చెల్లించ వలసి ఉంటుంది.వి.వి.ఆర్. కృష్ణంరాజు వ్యాసకర్త ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్మొబైల్: 89859 41411 -
ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దాం
సాక్షి ప్రతినిధి, కడప : ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు.. ఆరు నెలల్లోనే ఇదివరకెన్నడూ లేనంతంగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. ప్రశ్నించిన వారిని ఇక్కట్ల పాలు చేస్తోంది. అందువల్ల ప్రజల గొంతుకగా మనం ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ప్రశి్నద్దాం.. నిలదీద్దాం. ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటానికి సిద్ధమవ్వండి. ధైర్యంగా ఎదుర్కొందాం. కష్టాలు ఎల్లకాలం ఉండవు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ.. ‘నేనున్నాను..’ అని భరోసా ఇచ్చారు. కష్టాలు కొద్ది కాలమేనని.. ఆ తర్వాత మన టైమ్ వస్తుందని ధైర్యం చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అధికార అండ చూసుకుని ఆ పార్టీ నేతలు అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వద్ద వాపోయారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఎవరూ అధైర్య పడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదని భరోసా కల్పించారు. మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పోరాట పంథా ఎంచుకుని ముందుకు సాగాలని చెప్పారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిక్కిరిసిన క్యాంపు కార్యాలయం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో అందుబాటులో ఉన్నారని తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు.పులివెందులలోని క్యాంపు కార్యాలయం గురువారం పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ సూచించారు. వివిధ సమస్యలతో బాధ పడుతున్న పలువురు జగన్‌ను కలిసి విన్నవించుకున్నారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు జరగలేదని వచి్చన వారంతా గోడు వెళ్లబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిస్తూ.. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్ చార్జీలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిoదని చెప్పారు. కాగా కుప్పం అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని.. వారిని కట్టడి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆ ప్రాంత సర్పంచ్‌లు, యూత్ వింగ్ నాయకులు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. ఓ అభిమాని గీసిన జననేత చిత్రం ఫొటో ఫ్రేమ్‌పై జగన్‌తో సంతకం చేయించుకున్నాడు. జగన్‌ను కలిసిన వారిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, డాక్టర్ సుధా, ఎమ్మెల్సీలు డీసీ గోవిందురెడ్డి, రమేష్ యాదవ్, కడప మేయర్ సురేష్ బాబు, జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్బి అంజాద్‌భాషా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శెట్టిపల్లె రఘురావిురెడ్డి, మేకా ప్రతాప్ అప్పారావు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఎస్వీ సతీష్ రెడ్డి, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. వైఎస్సార్ టీచర్స్ క్యాలెండర్ ఆవిష్కరణ వైఎస్సార్ టీచర్స్ అసోషియేషన్ క్యాలెండర్, డైరీని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అవలంభిస్తున్న నియంతృత్వ ధోరణి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు వెంకటనాథరెడ్డి, సురేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సింగారెడ్డి అమర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఊరూవాడా సంబరాలు
సాక్షి, అమరావతి: అభివృద్ధి, సంక్షేమ సారథి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకొన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 26 జిల్లాల్లో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో కేక్‌లు కట్ చేశారు. వీధులు, కూడళ్లలో వైఎస్ జగన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. యువత ర్యాలీలు చేశారు. పేదలు, అనాథలకు వస్త్ర దానాలు చేశారు. భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, ఆహారం పంపిణీ చేశారు. తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు, వైఎస్ జగన్ అభిమానులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్ యునెటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 14 దేశాల్లోనూ జగన్ జన్మదిన వేడుకలను అభిమానులు వైభవంగా నిర్వహించారు.⇒ శ్రీకాకుళం జిల్లా పొందూరులో శివాలయం, మెలియాపుట్టిలోని వేణుగోపాలస్వామి ఆలయం, పాతపట్నంలోని నీలమణి దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టెక్కలి నియోజకవర్గంలో పేద విద్యార్థులకు దుప్పట్లు పంపిణి చేసి, రక్త దాన శిబిరం నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాంలోని సన్ రైజ్ హాస్పిటల్ వద్ద పెద్ద సంఖ్యలో జగన్ అభిమానులు రక్తదానం చేశారు. విజయనగరం పైడితల్లి ఆలయంలో విశేష పూజలు చేశారు. భోగాపురం మండలం ఎ రావివలసలో 52 కిలోల కేక్ కట్ చేసి, అన్నదానం చేశారు.⇒ పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో అనాధాశ్రమంలో అన్నదానం చేశారు. కురుపాం నియోజకవర్గంలో పేద మహిళకు చీరలు పంపిణీ చేశారు. పాలకొండ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మోదకొండమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.⇒ అనకాపల్లి జిల్లా చోడవరం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో పలు చోట్ల అన్నదానం చేశారు. ఆసుపత్రులలో రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ సహా నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.⇒ తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం ఎర్నగూడెంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రాజమండ్రిలో రక్తదాన శిబిరంతో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్, దంత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా ఆస్పత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరిజిల్లా ఉండి నియోజకవర్గంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.⇒ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద 60 కిలోల కేక్ కట్ చేశారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో 500 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి, అన్నదానం చేశారు.⇒ గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేసి, అన్నదానం చేశారు.⇒ కర్నూలు జిల్లాలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ⇒ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీæ చేశారు.⇒ వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు. బద్వేల్ నియోజకవర్గంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కమలాపురంలోని అనాథ∙క్షేత్రాలయంలో అనాథ బాలల మధ్య కేక్ కట్ చేసి, వేడుకలు నిర్వహించారు. కడపలో జిల్లా పరిషత్ సర్కిల్ వద్ద పేదలకు అన్నదానం చేశారు. జమ్మలమడుగులో రక్తదాన శిబిరం నిర్వహించారు.హైదరాబాద్‌లో మెగా రక్తదాన శిబిరంసాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం వైఎస్ జగనన్న అభిమాన సంఘం కేపీహెచ్‌బీ కాలనీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రమ్య గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ నేతలు వై.శివరామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, వేంపల్లి సతీష్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, వై.ఈశ్వరప్రసాద్‌రెడ్డి, పోసింరెడ్డి సునీల్, ఎస్వీఎస్ రెడ్డి, శ్యామల తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. మెగా రక్తదాన శిబిరం నిర్వహించడంతో పాటు ఐదు వేల మందికి అన్నదానం చేశారు. చెవిరెడ్డి ఆధ్వర్యంలో భారీగా పేదలకు దుస్తుల పంపిణీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేలాది మంది మహిళలు, కార్యకర్తలకు దుస్తులు పంపిణీ చేశారు. వేలాదిగా తరలివచి్చన అభిమానులకు అన్నదానం చేశారు. ఒంగోలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదానం శిబిరంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రక్తదానం చేశారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సింగరాయకొండలో అన్నదానం చేశారు.చెన్నైలో ఘనంగా..సాక్షి, చెన్నై: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను చెన్నైలో శనివారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సేవాదళ్ తమిళనాడు అధ్యక్షుడు ఏకే జహీర్ హుస్సేన్ నేతృత్వంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పెరంబూరు, అంబత్తూరు, షొళింగనల్లూరు, తండలం తదితర ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని చోట్లా కేక్‌లు కట్ చేసి, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ జగన్ ఆయురారోగ్యాలను, విజయాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పిల్లలకు బిర్యానీ పంపిణీ చేశారు. వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం చేశారు. షొళింగనల్లూరులో రక్తదాన శిబిరం నిర్వహించారు. చెన్నై శివారులోని తండలంలో బ్రహ్మాండ వేడుకగా బర్త్‌డే కార్యక్రమాన్ని సేవాదళ్ వర్గాలు నిర్వహించాయి. అధ్యక్షుడు జహీర్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి సూర్యారెడ్డి, అధికార ప్రతినిధులు సాయి సింహారెడ్డి, కీర్తి, నేతలు శరవణన్, శరత్‌కుమార్ రెడ్డి, భాను తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్దసంఖ్యలో మహిళలు, యువత, విద్యార్థులు తరలివచ్చారు. -
మద్దతిచ్చిన వైఎస్సార్సీపీ, టీడీపీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన రాజ్యాంగ (129 సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024లను ప్రవేశ పెట్టడానికి జరిగిన ఓటింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మద్దతివ్వగా ఎంఐఎం పార్టీ ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించింది. ఒకే దేశం–ఒకే ఎన్నికలకు సంబంధించి తెచ్చిన బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్‌లో టీడీపీ, వైఎస్సార్సీపీ పార్టీలకు చెందిన ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ఈ సందర్భంగా టీడీపీ తరఫున కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ‘దేశమంతా ఒకే దశలో అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికలను నిర్వహించాలనుకుంటోన్న కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని అన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి ‘ఏకకాల ఎన్నికలతో పార్టీకి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ రాష్ట్రానికి కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నందున మాకు పెద్దగా సమస్యలు లేవు’ అన్నారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తుంది: ఒవైసీజమిలి ఎన్నికల బిల్లును ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఇది స్వయం పాలన హక్కును, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది. ఫెడరలిజం సూత్రాలను ఉల్లంఘిస్తోంది. ఈ తరహా చట్టంతో రాష్ట్రాల అసెంబ్లీలకు మధ్యంతర ఎన్నికలకు వస్తాయి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం. దీనిని ఆమోదించే సామర్థ్యం పార్లమెంటుకు లేదు. రాష్ట్రపతి తరహా ప్రజాస్వామ్యం కోసం నేరుగా ఈ బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల ఉనికిని దెబ్బతీస్తుంది. చివరగా ఈ బిల్లును కేవలం అత్యున్నత నాయకుడి అహాన్ని సంతృప్తి పరచడానికే తీసుకొచ్చారు’ అని పేర్కొన్నారు. -
బాబు సర్కార్ 'బరితెగింపు'
కాళ్లు పట్టుకున్నా కనికరించ లేదువిజయనగరం జిల్లా ఎల్.కోట మండలం కళ్లెంపూడి గ్రామంలోని శ్రీముకికృష్ణంరాజు చెరువు ఆయకట్టు సంఘం ఎన్నికను శనివారం నిర్వహించారు. కూటమి మితృత్వంలో భాగంగా ఇక్కడ ఉన్న ఆరు డైరెక్టర్లలో ఒకటి బీజేపీకి కేటాయించారు. దీంతో ఆయకట్టుకు చెందిన గొలజాం బీజేపీ నాయకుడు కోన మోహన్‌రావు నామినేషన్ వేసేందుకు కళ్లెంపూడి ఎంపీపీ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఆయనను నామినేషన్ వేయకుండా స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే కుర్చీలను పైకి విసిరారు. తన నామినేషన్ స్వీకరించాలని ఆయన డీఈ పి.శ్రీచరణ్ కాళ్లు పట్టుకుని వేడుకున్నా టీడీపీ నాయకుల ఒత్తిడితో పట్టించుకోలేదు. మిగిలిన ఐదు డైరెక్టర్లకు టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి వెను వెంటనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో సాగు నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ నేతలు మాత్రమే విజయం సాధించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం బరితెగించింది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ దౌర్జన్యకాండకు దిగింది. రెవిన్యూ అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. రాష్ట్రంలో సాగు నీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలను చేజిక్కించుకోవడానికి అరాచకాలకు తెరలేపింది. రాష్ట్రంలో 49,020 ప్రాదేశిక నియోజకవర్గాలు (టీసీ), 6,149 సాగునీటి వినియోగదారుల సంఘాల (డబ్ల్యూయూఏ)కు సంబంధించి శనివారం రహస్య ఓటింగ్ పద్దతికి తిలోదకాలిచ్చి ఏకగ్రీవాలే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. ఇతర పార్టీల మద్దతుదారులు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా రెండు మూడు రోజులుగా గ్రామ సచివాలయాల్లో నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుని కుట్రకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ దుర్నీతికి నిరసనగా ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించింది. దీంతో అధికార కూటమి నేతల అరాచకానికి అంతే లేకుండా పోయింది. జి.పెదపూడిలో ఎమ్మెల్యేకు చుక్కెదురు డాక్టర్ బీఆర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం జి.పెదపూడి సాగునీటి సంఘం ఎన్నికలో పి.గన్నవరం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించిన అభ్యర్థిని రైతులు వ్యతిరేకించి.. సూర్య వెంకట కృష్ణారావును గెలిపించుకున్నారు.ఎటు చూసినా అరాచకమే..⇒ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు చెరువు సాగునీటి సంఘం ఎన్నికల్లో టీడీపీ నాయకులు బరితెగించారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘును, అభ్యర్థి దగుమాటి కొండయ్యను పోలీసుల ద్వారా బలవంతంగా స్టేషన్‌కు తరలించి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు హుటాహుటిన స్టేషన్‌కు చేరుకుని మాపార్టీ నాయకులను అర్ధరాత్రి సమయంలో ఎందుకు స్టేషన్‌కు తీసుకువచ్చారంటూ ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ⇒ కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెందుర్రు ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నిక నామినేషన్ పత్రాలను చించేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో తమ మాట వినలేదని టీడీపీ వర్గీయులు రైతులపై అక్రమ కేసులు పెట్టారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లిలో ఓటర్లు ఆందోళనకు దిగారు. 300 మంది ఓటర్లు ఉంటే కేవలం 12 మందిని మాత్రమే లోపలికి ఎలా అనుమతిస్తారని పోలింగ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) సాగునీటి సంఘానికి నామినేషన్ వేయకుండా జెడ్పీటీసీ సభ్యుడు భోగతి ప్రతాప్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మడకశిర మండలం కల్లుమర్రిలో పోటీలో ఉన్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. ⇒ తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తొనుకుమాల రెండు చెరువులకు సంబంధించి పోటీ చేసిన రైతు చక్రపాణిరెడ్డిని అడ్డుకున్నారు. దాదాపు జిల్లా అంతటా టీడీపీ కూటమి నాయకులు చెప్పిన విధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు నడుచుకున్నారు. నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నాకేంట్రా.. ‘రే.. నువ్వు నన్నేమీ చేసుకోలేవు.. ఏమి చూస్తావు.. ఏమి చేస్తావు రా.. ఇక్కడి నుంచి దెం..యి’ అంటూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కర్నూలు సీసీఎస్ సీఐ ఇబ్రహీం దుర్భాషలాడారు. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో ఈ ఘటన జరిగింది. ఓటర్లను అధికార పార్టీ నేతలు అడ్డుకోవడంతో మాట్లాడటానికి వెళ్లడంతో పోలీసులు ఇలా ‘పచ్చ’ నేతల్లా వ్యవహరించారు. దీంతో అక్కడ ఎన్నిక ఏకగ్రీవమైంది. కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్ మండలం బ్రహ్మణదొడ్డిలో టీడీపీ నేత డి.విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు నామినేషన్ పత్రాలను లాక్కొని చింపి వేశారు. పార్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై దురుసుగా ప్రవర్తిస్తున్న సీసీఎస్ సీఐ ఇబ్రహీం ఇది చేతకాని దద్దమ్మ రాజకీయంనిప్పులు చెరిగిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి కడప (కార్పొరేషన్)/పులివెందుల రూరల్: వైఎస్సార్ జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు పూర్తి అప్రజాస్వామ్యంగా జరిగాయని, ప్రభుత్వం చేతగాని దద్దమ్మ రాజకీయం చేస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి తీరుపై నిప్పులు చెరిగారు. ఆయన మాటలు పిట్టలదొరను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రెండు, మూడు రోజులుగా ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతోందన్నారు. రైతులెవరైనా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. నీటి బకాయిలు లేనట్టు వీఆర్వో నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి అని, ఆ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన వీఆర్వోలందరినీ మండల కార్యాలయాలకు తరలించి జైల్లో ఖైదీల్లా బంధించారని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే రైతులు బీటెక్ రవికి చొక్కా, ప్యాంటు విప్పి నిలబెట్టేవారని హెచ్చరించారు. పారదర్శకంగా ఎన్నికలు జరిపే ధైర్యం, తెగువ వారికి ఉన్నాయా.. అని సూటిగా ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకూడదనే ‘నో డ్యూ సర్టిఫికెట్లు’ ఇవ్వలేదన్నారు. దీన్నిబట్టే చేతగాని దద్దమ్మలు ఎవరో అందరికీ తెలుస్తోందన్నారు. ఈ ఎన్నికల కవరేజీకి వెళ్లిన మీడియాపై కూడా దాడి చేయడం సిగ్గు చేటన్నారు. ‘1978 నుంచి ఉన్న మా ఆధిపత్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించాడట. ఓసారి మొహం అద్దంలో చూసుకో. జమ్మలమడుగులో వీఆర్వోలందరినీ వాహనంలో ఎక్కించి దేవగుడిలో బంధించారు. ఓడిపోతామనే భయం వల్లే కదా? వీటికి ఎన్నికలని పేరుపెట్టి గెలుపు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి’ అని రవిపై ధ్వజమెత్తారు. కాగా, ఎంపీ అవినాశ్‌రెడ్డిని శనివారం (రెండో రోజు) కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. -
చంద్రబాబు భాషకు అర్థాలు వేరు.. 'బాదడమే సంపద సృష్టి'!: వైఎస్ జగన్
అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకుండానే సంపద సృష్టి పేరుతో దాదాపు రూ.18 వేల కోట్లు కరెంటు బిల్లులు బాదేశారు. ఇందులో రూ.6,072 కోట్లకు సంబంధించిన బాదుడు నవంబర్ బిల్లుల్లోనే ప్రారంభమైంది. మరో రూ.11 వేల కోట్ల బాదుడు తర్వాతి నెలలో ఉంటుంది. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై జీఎస్టీ మీద ఒక శాతం సర్‌చార్జ్ విధించి, ఆ మేరకు నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. సంపద సృష్టి అంటే ఇలా ప్రజలపై జీఎస్టీ పన్ను భారం మోపడమేనా? చంద్రబాబును సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నా. నీ తల్లి దండ్రులెవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వాళ్లతో కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగాక.. వారిని నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టావా? వాళ్లిద్దరూ కాలం చేస్తే కనీసం తల కొరివి అయినా పెట్టావా? ఎలాంటి మానవతా విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు. ఏ గడ్డయినా తింటాడు. ఏ అబద్ధమైనా ఆడతాడు. ఏ మోసమైనా చేస్తాడు. ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరినీ కోరేది ఒక్కటే. ఈ యుద్ధంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. – వైఎస్ జగన్మోహన్రెడ్డిఇదే పెద్ద మనిషి చంద్రబాబు ప్రజలపై రోడ్డు ట్యాక్స్ వేస్తా అంటున్నారు. అలా వసూలు చేసిన డబ్బుతో రోడ్లు వేయిస్తాడట. ఇది సంపద సృష్టి అట. నిజంగా ఆయన బాదుడే బాదుడును నిస్సిగ్గుగా సమర్ధించుకుంటున్నారు. రోడ్లన్నీ మరమ్మతులు చేస్తానని ఎన్నికల్లో గొప్పగా మాట్లాడి.. ఈ రోజు ప్రజలు రోడ్డెక్కితే పన్నుల వాత పెడతామని చెబుతున్నారు. అలా అయితేనే రోడ్లు బాగు చేయిస్తాం.. లేకపోతే రోడ్ల పరిస్థితి అంతేనని చెబుతున్నారు. చంద్రబాబు ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్పి సీఎం అయ్యారు. సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తానంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టించడమంటే విద్యుత్ చార్జీలు.. యూజర్ చార్జీలు, టోల్ చార్జీలతో బాదడమేనని వ్యాఖ్యానించారు. దాదాపు రూ.18 వేల కోట్ల విద్యుత్తు చార్జీల బాదుడే ఇందుకు నిదర్శనమన్నారు. భావితరాల కోసం గత ప్రభుత్వ హయాంలో సృష్టించిన విలువైన సంపద మెడికల్ కాలేజీలు, పోర్టులను స్కామ్‌ల కోసం అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అప్పులపై అడ్డగోలుగా అబద్ధాలాడుతున్నారని దుయ్యబట్టారు. అప్పులపై బడ్జెట్లో చూపించింది తప్పైతే మరి ఆ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టావు బాబూ? అత నిలదీశారు. ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రతి విషయంలోనూ బొంకిందే బొంకుతున్న నిన్ను ‘బొంకుల బాబు..’ అని ఎందుకు అనకూడదు?’’ అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాఫియా ముఠాలే కనిపిస్తున్నాయన్నారు. ‘మద్యంలో స్కామ్.. ఇసుకలో స్కామ్.. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులతో స్కామ్.. ఎమ్మెల్యేలకు కప్పం కట్టకపోతే నియోజకవర్గాల్లో పనులు సాగని దుస్థితి.. ఎటు చూసినా నాకింత.. నీకింత! అని దోచుకోవడం.. పంచుకోవడమే! ఓవైపు సూపర్ సిక్స్‌లు లేవు.. సూపర్ సెవెన్లు లేవు.. మరోవైపు ఎవరైనా హక్కుల కోసం, న్యాయం కోసం ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో అక్రమంగా నిర్బంధిస్తున్నారు’ అని మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అప్పుల నుంచి పోలవరం దాకా పలు అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రులు పదే పదే అబద్ధాలు చెబుతుండటాన్ని ఎండగట్టారు. రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన పనులు పూర్తిగా పక్కకు వెళ్లిపోయాయి. ఎక్కడ చూసినా మాఫియా ముఠాలు కనిపిస్తున్నాయి. మద్యంలో ఒక స్కామ్, ఇసుకలో ఇంకో స్కామ్, ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు. ఎక్కడ పరిశ్రమలు, నిర్మాణాలు జరుగుతున్నా.. మైనింగ్ చేస్తున్నా.. ఎమ్మెల్యేలకు కప్పం కట్టకపోతే పనులు సాగని పరిస్థితి. అదానీ వాళ్లు ప్లాంట్ కడుతుంటే కూటమి ఎమ్మెల్యే చంద్రబాబు ప్రోద్బలంతో బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో నాకింత.. నీకింత అని దోచుకోవడం.. పంచుకోవడమే జరుగుతోంది. ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, విద్యుత్ చార్జీలు, రోడ్లు.. అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి లడ్డూ, అప్పులు, రాష్ట్ర ప్రగతి, ఇండస్ట్రీ, పారిశ్రామిక వేత్తలు.. ఇవన్నీ గాక తల్లి, చెల్లి అంటూ నా కుటుంబం మీద ఎక్కడ పడితే అక్కడ ఈ చంద్రబాబు మాట్లాడుతూనే ఉన్నాడు.సూటిగా ఆయన్ను ఓ ప్రశ్న అడుగుతున్నా. నీకూ కుటుంబం ఉంది. మా కుటుంబంలో విబేధాలు ఉండొచ్చు. నువ్వు పెట్టే పోస్టులు కానీ, క్రూరమైన రాజకీయాలు కానీ, ఎవరూ చేయరు. నీలాంటి దుర్మార్గుడైతే తప్ప. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన ఆఫీసులో అధికారిక ప్రతినిధితో నన్ను ‘బోస్డికే’ అని తిట్టించాడు. అది దుర్మార్గం కాదా? నా చెల్లెలు షరి్మల మీద హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36లో ఈయన బావమరిది, లోకేశ్ మామ బాలకృష్ణ సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్ నుంచి తప్పుడు రాతలు రాయించి ప్రచారం చేయలేదా? హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో ఇది నిజమని తేలలేదా? స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అక్రమమైతే, నిందితులను ఈడీ ఎందుకు అరెస్ట్ చేసింది? ఈడీ వాళ్ల ప్రాపర్టీస్‌ను అటాచ్ చేసింది. స్కిల్ స్కామ్ నుంచే ఆ డబ్బులన్నీ వెళ్లడంతో పక్కాగా స్కామ్ అని తేలడంతోనే వాళ్లను ఈడీ అరెస్ట్ చేసింది. అలాంటప్పుడు ఈ కేసులో చంద్రబాబును కూడా అరెస్ట్ చేయాలి కదా? డబ్బులు ఇచ్చింది చంద్రబాబే కదా? వాళ్లు ‘వివేకం’పేరిట ఇష్టమొచ్చినట్టు సినిమాలు తీస్తే తప్పు లేదు. రాంగోపాల్ వర్మ సినిమా తీసి సెన్సార్ బోర్డు అనుమతితో రిలీజ్ చేస్తే ఆ సినిమాలో తమను కించపరిచారంటూ ఆయనపై కేసులు పెడుతున్నారంటే వీళ్లను ఏమనాలి? సెన్సార్ బోర్డు అప్రూవల్తో విడుదలైన సినిమాను అడ్డం పెట్టుకొని ఆయన్ని పిలిపించే కార్యక్రమం చేస్తున్నారు. అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఇది ఇల్లీగల్ డిటెన్షన్ కాదా? సెన్సార్ బోర్డులు ఎందుకున్నట్టు?సూమో క్లాసిక్ విస్కీ, బెంగళూరు విస్కీ, రాయల్ లెన్సర్ విస్కీ, ట్రోపికానా వీసా బ్రాందీ, షార్ట్ విస్కీ, బ్రాందీ 99, కేరళా మాల్టెడ్ ఫైన్ విస్కీ.. ఇవన్నీ తీసుకొచ్చారు. ఆశ్చర్యం ఏమంటే.. ఇవన్నీ రూ.99 అని చెబుతున్నారు. నాణ్యతను తగ్గించి ఈ బ్రాండ్లు తీసుకొచ్చారు. ఇదే కేరళ మాల్టెడ్ విస్కీ రూ.85కే దొరుకుతుంది. చంద్రబాబు మాత్రం రూ.99కి అమ్ముతున్నారు. నాణ్యత తగ్గించిన మద్యాన్ని వైఎస్సార్సీపీ హయాంలో కంటే ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. ఇంతకు ముందు ఉండే బ్రాండ్లు ఎమ్మార్పీ ఇప్పటికీ రూ.120నే. కానీ, ఎక్కడా ఆ ధరకు అమ్మట్లేదు. – వైఎస్ జగన్ఉద్యోగులకు ఐఆర్ ఎక్కడ?చంద్రబాబు ఉద్యోగులను మోసం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఒకటవ తేదీనే జీతం అన్నారు. ఈ నెలలో మూడు వారాలు అయిపోతున్నా చాలా మందికి జీతాలు ఇవ్వలేదు. ఉద్యోగులు అందరూ ఐఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిన నెలలోపే 27 శాతం ఐఆర్ ఇచ్చాం. చంద్రబాబు వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఇంకా ఐఆర్ ఊసే ఎత్తట్లేదు. చంద్రబాబు వచ్చిన తర్వాత పీఆర్సీ చైర్మన్‌ను బలవంతంగా రాజీనామా చేయించారు. మరి కొత్త పీఆర్సీ చైర్మన్ నియమించాలా లేదా? మరో వైపు వలంటీర్లు, బేవరేజెస్ కార్పొరేషన్లో పని చేస్తున్న వారి ఉద్యోగాలను పీకేశారు. 104, 108 ఉద్యోగులను పీకడానికి రెడీ అవుతున్నారు. హామీలు అమలు చేయాలని ఆశా వర్కర్లు ధర్నాలు చేస్తున్నారు.తనకు అనుకూలంగా ఉండే ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్పీ ఠాకూర్, యోగానంద్ వంటి రిటైర్డ్ అధికారులను ఓ జట్టుగా తయారు చేసి, చంద్రబాబు తన వద్ద కూర్చో బెట్టుకున్నారు. వీరు జిల్లాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వారి పేర్లను టీడీపీ వర్గాల నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సేకరిస్తున్నారు. ఈ జాబితా ఆధారంగా ఎస్పీలతో ఫాలో అప్ చేస్తున్నారు. తప్పుడు ఫిర్యాదులు అందగానే కనీస విచారణ లేకుండా నిబంధనలకు విరుద్దంగా కేసులు బనాయిస్తున్నారు. అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఆ తర్వాత కోర్టులకు కూడా హాజరు పర్చడం లేదు. ఎక్కడున్నారో తెలుసుకునేందుకు హెబియస్ కార్పస్ పిటీషన్లు వేయాల్సిన పరిస్థితి ఉంది. రోజుల తరబడి వారి వద్దే పెట్టుకుని, కళ్లకు గంతలు గట్టి రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పుతూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. ఇష్టమొచ్చినట్టు కొట్టడమే కాదు.. వీడియోలు తీసి పైనున్న ఈ జట్టు అధికారులకు పంపుతున్నారు. – వైఎస్ జగన్వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తానని దారుణంగా వంచించావు..మాపై బండవేసే ప్రయత్నంలో భాగంగా 2023 ఆగస్టు నుంచే వలంటీర్ వ్యవస్థ లేదంటున్నారు. ఏ ప్రభుత్వమైనా బడ్జెట్ అప్రూవల్ లేకుండా జీతాలు ఇవ్వగలుగుతుందా? హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా జీతాలు ఇస్తారా? ఈయనేమో హెడ్ ఆఫ్ అకౌంట్ లేదంటారు. అయ్యా చంద్రబాబూ.. హెడ్ ఆఫ్ అకౌంట్లో 2515 మేజర్ హెడ్, 198 మైనర్ హెడ్, 52 సబార్డినేట్ హెడ్, 290 డీటైల్డ్ హెడ్, 293 అబ్జెక్ట్ హెడ్.. ఇవన్నీ వలంటీర్లకు సంబంధించి హెడ్ ఆఫ్ అకౌంట్ నంబర్లు. ఇన్నేళ్లూ ఈ హెడ్ల కిందే జీతాలు ఇస్తున్నారు. ఫైనాన్స్ కాంకరెన్స్తో.. బడ్జెట్లో పెట్టి.. చంద్రబాబు సీఎం అయ్యే వరకు జీతాలు ఇస్తున్నా కూడా.. వలంటీర్లకు ఇచ్చిన హామీని ఎగరగొట్టి అబద్ధాలు, దుష్ప్రచారం చేయడం ధర్మమేనా? నోరు తెరిస్తే అబద్ధాలు.. నోరు తెరిస్తే మోసం. ఇదీ చంద్రబాబు పరిపాలన.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్లకు చెల్లించిన గౌరవ వేతనం వివరాలు వలంటీర్లపై దిక్కు మాలిన అబద్ధాలాడుతున్నారు. అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆగస్టు 2023లోనే.. అంటే మా హయాంలోనే ‘ప్రస్తుతం వలంటీర్లు ఎవ్వరూ పని చేయట్లేదు. 2023 ఆగస్టు నుంచి వలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు’ అని చెబుతున్నారు. కానీ, ఈ ఏడాది వారి గౌరవ వేతనం నిమిత్తం విడుదల చేసిన నిధులు ఎన్ని అన్న ప్రశ్నకు మాత్రం రూ.277 కోట్లు అని సమాధానం ఇచ్చారు. అంటే ఈ సంవత్సరం జీతాలు ఇచ్చినట్టే కదా! ఎన్నికలప్పుడు వలంటీర్లకు రూ.5 వేలు కాదు.. రూ.10 వేలు ఇస్తామని ప్రకటించింది వాస్తవం కాదా బాబూ? వలంటీర్ల వ్యవస్థ ఉనికిలోనే లేదని.. వారికి గౌరవ వేతనం పెంపు అన్నది ఉత్పన్నమే కాదని తేల్చిచెప్పిన సర్కార్.. పోలవరంలో విధ్వంసం బాబు ఘనతే⇒ పోలవరంలో విధ్వంసానికి కారణం చంద్రబాబు విధానాలేనని తేల్చి చెబుతూ ఇటీవల అంతర్జాతీయ నిపుణుల కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు కట్టాక.. గోదావరి నదికి అడ్డంగా 2.5 కి.మీల పొడవునా ప్రధాన డ్యాం నిర్మించాలి. తొలుత పునాది డయాఫ్రం వాల్ వేసి, ఆ తర్వాత ప్రధాన డ్యాం పనులు చేపట్టాలి.⇒ కానీ.. కాంక్రీట్ పనుల్లో కమీషన్లు ఎక్కువగా రావని.. మట్టి పనుల్లో అయితే ఎక్కువ కమీషన్లు వస్తాయని స్పిల్ వే పునాది స్థాయిలో ఉండగానే చంద్రబాబు ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్ వేశారు. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల పనులు చేపట్టారు. వరద ప్రవాహం స్పిల్ వే వైపు మళ్లించడం సాధ్యం కాకపోవడంతో కాఫర్ డ్యాంలకు ఇరు వైపులా 400 మీటర్లు, 300 మీటర్ల చొప్పున ఖాళీ ప్రదేశాలు వదిలేశారు. 2.5 కి.మీల వెడల్పున ప్రవహించాల్సిన గోదావరి వరద.. కుంచించుకుపోయి ప్రవహించడంతో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు కోతకు గురయ్యాయి. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం, డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. లేదంటే ఈ పాటికి ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. ⇒ మేం అధికారంలోకి వచ్చాక గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వేను 48 గేట్లతో సహా పూర్తి చేశాం. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలకు మురమ్మతులు చేసి పూర్తి చేశాం. స్పిల్ వే మీదుగా గోదావరి ప్రవాహాన్ని మళ్లించాం. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతానికి మరమ్మతులు చేసి, యథాస్థితికి తీసుకొచ్చాం. దెబ్బతిన్న డయా ఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా? లేక కొత్తది కట్టాలా అన్నది తేల్చాలని కేంద్రాన్ని కోరాం. దాన్ని తేల్చే బాధ్యతను నిపుణుల కమిటీకి కేంద్రం అప్పగించింది. ⇒ ఇప్పుడు ఆ కమిటీ వచ్చింది. వరద ప్రవాహాన్ని మళ్లించే పనులు పూర్తయిన నేపథ్యంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య కొత్త డయా ఫ్రం వాల్ వేసి, ప్రధాన డ్యాంను పూర్తి చేయడానికి మార్గం సుగమం చేశాం. అయినా చంద్రబాబు గోబెల్స్ మాదిరిగా అబద్ధాల మీద అబద్ధాలు చెబుతూనే ఉన్నాడు. వాళ్లకున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయతగ్గ ముఠా మా దగ్గర లేదు.ఐదేళ్లలో ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చావా? ⇒ చంద్రబాబు హయాంలో ఒక్క నిరుపేద కుటుంబానికి కనీసం ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా? మేము 30.60 లక్షల కుటుంబాలకు అక్క చెల్లెమ్మల పేరుపైనే రిజిస్ట్రేషన్ చేసి ఇంటి స్థలాలు ఇచ్చాం. ఇందులో 21 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. 9.02 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన 11 లక్షల ఇళ్లు పునాదులు దాటి వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. ఏకంగా 17 వేల జగనన్న కాలనీల్లో ఏకంగా ఊళ్లే తయారవుతున్నాయి. ఆ ఇళ్లన్నీ పూర్తయితే జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే దురుద్దేశంతో చంద్రబాబు హౌసింగ్ కార్యక్రమాన్ని ఆపేశారు.⇒ మా ప్రభుత్వ హయాంలో సిమెంట్, స్టీలు, ఇతర సామగ్రిని సబ్సిడీపై, ఇసుకను ఉచితంగా ఇచ్చే వాళ్లం. ఇవి కాకుండా రూ.35 వేలు పావలా వడ్డీకి రుణంగా ఇచ్చే వాళ్లం. రూ.1.80 లక్షల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించే వాళ్లం. అంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిలిపి వేసినందుకు నిరుపేదలందరూ చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటున్నారు. పేదల ఇళ్ల గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఎందుకు అసెంబ్లీ నడుపుతున్నారో.. ఎందుకు ప్రభుత్వాన్ని నడుపుతున్నారో వీళ్లకే తెలీదు.బినామీలకు దోచిపెట్టేందుకే అసైన్డ్‌పై దుష్ప్రచారం⇒ అసైన్డ్ భూములపై నిస్సిగ్గుగా అబద్ధాలు.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మా ప్రభుత్వం రాక ముందు పేరుకే దళితులకు భూమి ఉండేది. దానిని అమ్ముకునే స్వేచ్ఛ లేదు. ఇంట్లో వాళ్లకు అత్యవసర పరిస్థితులు ఎదురైనా, వారసుల పేరుపైకి బదిలీ చేయాలన్నా అగమ్య గోచర పరిస్థితి ఉండేది. రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకోలేని నిస్సహాయ స్థితిలో శనక్కాయలకు.. పావలాకు, పది పైసలకు వేరే వాళ్లు కొనుక్కొని అనుభవించే వారు.⇒ మేము అధికారంలోకి వచ్చాక పేదల జీవితాలు మార్చాలని ఆలోచించాం. 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూమి ఉన్న వారికి చట్ట ప్రకారం అన్ని హక్కులు కల్పిస్తూ సొంత భూములుగా మార్చాం. ఆ సొంత భూములను అమ్ముకుంటారా? వాళ్ల పిల్లలకు ఇచ్చుకుంటారా? వాళ్ల ఇష్టం. ఈ లోగా ఎవరైనా భూములు కొనుగోలు చేసి ఉంటే కూడా అవన్నీ ఒరిజినల్ అసైనీలకు వెళ్లిపోతాయి. వాళ్ల పేరుతోనే పట్టా వస్తుంది. కొన్న వాళ్లకు పట్టా రాదు. ఇలా హక్కులిచ్చి 15.21 లక్షల మంది రైతులకు, పేదలకు మంచి చేస్తే కూటమి నాయకులు నిస్సిగ్గుగా బురద వేస్తున్నారు. మళ్లీ పేదల దగ్గర నుంచి హక్కులు తీసుకోవడానికి అడుగులు వేస్తున్నారు. చట్టాన్ని రద్దు చేయడం ద్వారా వారి హక్కులను రద్దు చేయనున్నారు. ఆ తర్వాత అవే భూములను పెత్తందార్లు 10 పైసలకు, 20 పైసలకు కొనుక్కోవచ్చు. వీళ్లకు మాత్రమే మంచి రేటు ఉండాలి. పేదలకు మాత్రం మంచి రేటు రాకూడదు.⇒ చంద్రబాబు ఇచ్చిన ఒక మెమో ద్వారా 2.06 లక్షల ఎకరాలను ఉద్దేశ పూర్వకంగా నిషేధిత జాబితా (22ఏ)లో పెట్టారు. 98 వేల మంది రైతులను నానా కష్టాలకు గురి చేస్తున్నారు. మేము నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించి.. రైతుల భూమిపై చంద్రబాబు చేసిన దాష్టీకం నుంచి విడుదల చేశాం. వారి భూములపై సర్వ హక్కులు కల్పించాం. అది తప్పంటున్నారు. ⇒ ల్యాండ్ పర్చేజ్ స్కీం కింద ఎస్సీ కార్పొరేషన్ రుణాలను రద్దు చేసి 22వేల ఎకరాల భూమిని పంపిణీ చేశాం. ఇది మరో విప్లవం. 2.06 లక్షల ఎకరాల చుక్కల భూముల సమస్యలను పరిష్కరించి ఏకంగా 1.07 లక్షల మంది రైతుల కుటుంబాలకు మేలు చేశాం. 33 వేల ఎకరాల షరతుల భూములపై 22 వేల మంది రైతులకు సర్వ హక్కులు కల్పించాం. ఇదంతా వాళ్లు తప్పంటున్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మహిళలు అందరూ మాయమైపోతున్నారని దుష్ప్రచారం చేశారు. ఇందుకు వలంటీర్లు కారణమని, మానవ అక్రమ రవాణా చేస్తున్నారని రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా దత్తపుత్రుడు.. ఇప్పుడు డెప్యూటీ సీఎం ఊగిపోయాడు. వాళ్లు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్‌లో ఈ దుష్ప్రచారం ఒక భాగం. సాక్షాత్తు అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019–24 మధ్య ఐదేళ్లలో 46 మంది మాత్రమే మానవ అక్రమ రవాణాకు గురయ్యారని, కేవలం 34 కేసులు మాత్రమే నమోదయ్యాయని వాళ్లంతకు వాళ్లే చెప్పారు. గతంలో 30 వేల మంది మానవ అక్రమ రవాణా జరిగిందనే దుష్ప్రచారానికి, వలంటీర్లపై వీళ్లు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్స్టాప్ కాదా? – వైఎస్ జగన్కేవలం 46 మంది మహిళలే అక్రమ రవాణాకు గురయ్యారని తేల్చిన కూటమి సర్కార్ మోసాలు, అక్రమాలు, వైఫల్యాలు నిలదీస్తే అక్రమ కేసులా?సూపర్ సిక్స్‌లు లేవు.. సూపర్సెవెన్లు లేవు.. మరో వైపు అన్ని రకాలుగా రాష్ట్రం వైఫల్యం చెందింది. ఎవరైనా హక్కుల కోసం, న్యాయం కోసం సోషల్ మీడియాలో ప్రస్తావిస్తే చాలు దారుణంగా వేధిస్తున్నారు. పోలీసులను అన్యాయంగా వాడుకుంటున్నారు. ఎమ్మెల్యేల ద్వారా వాళ్ల నియోజకవర్గాల్లో ప్రైవేటు మాఫియా ముఠాను తయారు చేసి కొట్టిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెడుతున్నారు. అక్రమ నిర్బంధాలు (ఇల్లీగల్ డిటెన్షన్) చేస్తున్నారు. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు.⇒ కొట్టాం.. వీడియోలు తీశాం.. చూసి ఆనందించండి.. అని స్థానిక పోలీసులు పై వాళ్లకు పంపిస్తూ శాడిజం ప్రదర్శిస్తున్నారు. పైగా థర్డ్ డిగ్రీ దెబ్బలు చూపిస్తున్నారు. న్యాయ ప్రక్రియ ముందుకు వెళ్లకుండా చేసేందుకు ఎఫ్ఐఆర్లు అప్లోడ్ చేయడం లేదు. ఎఫ్ఐఆర్ల కోసం బాధితుల బంధువులు పోలీస్ స్టేషన్ల ఎదుట ధర్నాలు చేస్తున్నారు. ఇలా తప్పుడు కేసులతో అరెస్ట్ అయిన వారిని న్యాయవాదులు కష్టపడి బెయిల్‌పై బయటకు తీసుకొస్తుంటే మరో కేసు పెట్టి అరెస్ట్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి.⇒ చంద్రబాబు అరాచకాలు ఇంతటితో ఆగిపోలేదు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, చివరకు సినీ దర్శకులపై కూడా కేసులు పెడుతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోటలో ఎస్పీ ప్రోద్భలంతో సీఐ ద్వారా నాటు తుపాకులు పెట్టే కార్యక్రమం చేశారు. తోటలో పని చేస్తున్న 55–60 ఏళ్ల వయసున్న వృద్ధురాలిని కొట్టి ఒప్పించే కార్యక్రమం చేశారు. మేజిస్ట్రేట్ ఎదుట తన దెబ్బలు చూపించి, జరిగిన విషయాన్ని ఆమె చెప్పడంతో ఆ సీఐని మేజిస్ట్రేట్ తిట్టి పంపించిన ఘటన వారం రోజుల క్రితం జరిగింది. తుదకు సినీ దర్శకులను కూడా వదలడం లేదు. వాళ్లేమో ఇష్టానుసారం సినిమాలు తీయొచ్చట.⇒ రాష్ట్రంలో పేకాట జరుగుతుందని, తన నియోజకవర్గంలో నడుస్తోన్న పేకాట క్లబ్‌ను ఉదాహరణగా చూపుతూ పోస్టు పెట్టినందుకు మా ఎమ్మెల్యే చంద్రన్నపై కూడా కేసు పెట్టారు. ఆయనపై ఇప్పటి వరకు 8 కేసులు పెట్టారు. మరో దళిత ఎంపీ నందిగాం సురేష్‌పై కేసుల మీద కేసులు పెడుతూనే ఉన్నారు. తెలుగుదేశం ఆఫీసుపై దాడి చేశాడని కేసు పెట్టారు. ఆ రోజు ఆయన అసలు ఊళ్లోనే లేడు. అయినా అరెస్ట్ చేశారు. ఒక కేసులో బెయిల్‌పై బయటకొచ్చేలోగా మరో కేసు పెడుతున్నారు. అన్నీ దిక్కుమాలిన కేసులే. ఒక దళితుడు, మాజీ ఎంపీ.. 70 రోజులుగా జైలులో ఉన్నాడు. మాజీ మంత్రులు కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజాలపై కూడా ఇష్టానుసారం కేసులు పెట్టారు.⇒ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని తప్పుడు సంప్రదాయానికి నాంది పలుకుతున్నారు. ఒక వైపు కేసులు పెట్టడం, మరొక వైపు ఎవరైనా మాట్లాడితే అన్యాయంగా దూషించడం. ఇంకొక వైపు దుష్ప్రచారాలు చేయడం. ఇది చంద్రబాబు నైజం. టాపిక్ డైవర్షన్, తప్పుడు ప్రచారం, అబద్ధాలు, మోసాలు చేయడంలో చంద్రబాబు స్పెషలిస్ట్. ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం (క్యారెక్టర్ అసాస్నేట్) చేయడంలో ప్రసిద్ధుడు. లక్ష్మీపార్వతితో మొదలు నా వరకు ఎలా ప్రచారం చేశారో చూశాం.నా చెల్లిపై దుష్ఫ్రచారం చేసింది చంద్రబాబే ⇒ చంద్రబాబు తప్పుడు ప్రచారంపై గతంలో నా చెల్లెలు షర్మిల ఏమన్నారో చూడండి. (వీడియోను ప్రదర్శిస్తూ..) ఆ వీడియోలో షర్మిల మాట్లాడుతూ.. ‘ఎన్బీకే బిల్డింగ్ నుంచి దుష్ప్రచారం జరిగిందని ఐపీ అడ్రస్‌ను బట్టి పోలీసులు చెబుతున్నారు. ఈ వెబ్సైట్లన్నీ ప్రొ టీడీపీ ప్రమోట్ చేసినవే. ప్రత్యర్థులను కించపరిచేవి. ఈ పోస్టింగ్‌లన్నీ బాలకృష్ణ బిల్డింగ్ నుంచి, ప్రో టీడీపీ సైట్ల నుంచి జరిగాయంటే బాలకృష్ణకు సంబంధం లేదని నేను ఎలా అనుకోవాలి? సంబంధం ఉంది కనుకే బాలకృష్ణ నా మీద నింద వేశారని, పుకార్లు పుట్టించారని, వాటిని ప్రచారం చేశారని నేను విశ్వసిస్తున్నా. బాలకృష్ణ ఇలా దిగజారుడు తనానికి ఎందుకు పాల్పడ్డారో ఆయనే చెప్పాలి’ అన్నారు.⇒ మా ప్రభుత్వ హయాంలో వర్రా రవీంద్రారెడ్డి పేరిట ఐ టీడీపీ సభ్యుడు ఉదయ్‌భూషణ్ ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మా అమ్మను, మా చెల్లెలిని తిట్టించాడు. వర్రా రవీంద్రరెడ్డి పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఉదయ్ భూషణ్‌ను ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు ఎంత దారుణమైన నికృష్టుడంటే తన స్వార్థం కోసం ఎవరినైనా సరే వ్యక్తిత్వ హననం చేస్తాడు. వాళ్ల సానుభూతిపరులతో ఫేక్ ఐడీ క్రియేట్ చేయించి, వాళ్లతో మన వాళ్లను తిట్టిస్తాడు.మద్యం, ఇసుక అంతా స్కామ్..⇒ రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన పనులు పూర్తిగా పక్కకు వెళ్లిపోయాయి. ఎక్కడ చూసినా మాఫియా ముఠాలు దోచుకుంటున్న పరిస్థితి. చంద్రబాబు అధికారంలోకి వస్తే నాణ్యమైన లిక్కర్ ఇస్తానన్నారు. మద్యం రేటు తగ్గిస్తానన్నారు. ఆశ్చర్యం ఏమంటే.. గతంలో చంద్రబాబు హయాంలో అవే డిస్టిలరీలు.. మా హయాంలో అవే.. ఇప్పుడు కూడా అవే డిస్టిలరీలు. మద్యం ఆదాయంలో చీప్ లిక్కర్ నుంచే 85 శాతం వస్తుంది. చంద్రబాబు వచ్చిన తర్వాత చీప్ లిక్కర్లో నాణ్యత తగ్గించారు. ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. ఎప్పుడూ మనం వినని, చూడని బ్రాండ్లు అవి.⇒ అన్ని చోట్లా బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారు. ఒక్కో బెల్టు షాపునకు.. ఒక్కో గ్రామంలో పోటీ పెట్టి వేలం వేస్తున్నారు. రూ.2 లక్షలకు పాడుకున్న వాడికే ఇస్తున్నారు. ఇలా మాఫియా రాజ్యం నడుస్తోంది. మద్యాన్ని ఎమ్మార్పీకి అమ్మకోవాలంటే పోటీ ఎందుకు? ఎమ్మెల్యేలు మనుషులను ఎందుకు కిడ్నాప్ చేయించాలి.. ఎందుకు ఎవరినీ పాడనివ్వకుండా చేయాలి? వేరేవాళ్లకు వచ్చినా షాపులు నడుపుకోలేని పరిస్థితికి ఎందుకు నెట్టేయాలి? ఎమ్మార్పీ ప్లస్ మాఫియాకు కమీషన్ రావాలనే ఇదంతా చేస్తున్నారు. ఇసుక పరిస్థితి కూడా అంతే. హామీ ఇచ్చినట్లు ఎక్కడా ఉచితంగా ఇవ్వడం లేదు. -
సోషల్ మీడియాకు అండగా ‘వైఎస్సార్సీపీ’ ప్రత్యేక బృందాలు
సాక్షి,అమరావతి: సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిల్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ తరపున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం ఈ బృందాలు పనిచేస్తాయి. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్‌సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ బృందాలు పనిచేస్తాయి. -
Andhra Pradesh: ‘మండలి’లో మంటలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై శాసన మండలి అట్టుడికింది. కూటమి సర్కారు నిరంకుశ వైఖరి, అరాచక విధానాలపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే నెపంతో చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులను అరికట్టాలి.. నిరంకుశ రాజ్యం నశించాలి.. ఉయ్ వాంట్ జస్టిస్.. సేవ్ డెమొక్రసీ అంటూ నినదించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కించపరుస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కూటమి పార్టీలకు చెందిన కొందరు పెట్టిన అభ్యంతరకర పోస్టుల ప్లకార్డులను ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సభ్యులు ప్రదర్శించారు. యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ అరెస్టులపై చర్చకు అనుమతించాలని వైఎస్సార్సీపీ సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్, తుమాటి మాధవరావు, పి.రామసుబ్బారెడ్డి వాయిదా తీర్మానాన్ని ఇవ్వగా మరో ఫార్మాట్లో తేవాలంటూ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు తిరస్కరించారు. దీనిపై చర్చకు అనుమతించాలంటూ పట్టుబట్టిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, తలశిల రఘురాం, వరుదు కళ్యాణి, కల్పలతారెడ్డి, పండుల రవీంద్రబాబు, తోట త్రిమూర్తులు, మహ్మద్ రుహుల్లా తదితరులు పోడియం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నారా లోకేశ్, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, మండలి చీఫ్‌విప్ పంచుమర్తి అనురాధ, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు దీనిపై జోక్యం చేసుకుంటూ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత చర్చకు పట్టుబట్టడం సరికాదన్నారు. దీనిపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ రాష్ట్రంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అనేక మంది యువకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని, దీనిపై సభలో ఖచ్చితంగా చర్చ జరపాల్సిందేనని పట్టుబట్టారు. చర్చ కోసం వైఎస్సార్సీపీ సభ్యులు నిరసన తెలపడంతో సభ 34 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో చైర్మన్ మోషేన్‌రాజు సభను కొద్దిసేపు వాయిదా వేసి మళ్లీ కొనసాగించారు. డీఎస్సీ నోటిఫికేషన్ కాలయాపనపై చర్చించేందుకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని కూడా మండలి చైర్మన్ మోషేన్‌రాజు తిరస్కరించారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై చర్చకు డిమాండ్ చేస్తున్న సభ్యులు మా రాజీనామాలు ఆమోదించండి.. సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై చర్చించాలని వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన చేస్తున్న సమయంలోనే వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ రాజీనామాలు ఆమోదించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, టీడీపీ సభ్యులు కలసి వారిని ముందుకు తీసుకెళ్లడం గమనార్హం. ఆ ముగ్గురూ పోడియం పైకి వెళ్లి చైర్మన్‌ను కలసి తమ రాజీనామాలు ఆమోదించాలని విజ్ఞాపన పత్రాలు అందించారు. మీ రాజీనామాల అంశం పరిశీలనలో ఉందని, వాటిపై తర్వాత నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ స్పష్టం చేశారు. బడ్జెట్‌పై చర్చను అడ్డుకున్న మంత్రులు శాసన మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు బడ్జెట్‌పై మాట్లాడుతున్న సమయంలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీలు పదేపదే అడ్డుపడి రభస సృష్టించారు. వైఎస్సార్సీపీ సభ్యురాలు వరుదు కళ్యాణి బడ్జెట్‌పై చర్చను ప్రారంభించగానే మంత్రులు, కూటమి సభ్యులు చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. చర్చ పక్కదారి పడుతోందని, బడ్జెట్‌పైనే మాట్లాడాలంటూ చైర్మన్ సహనంతో పలుమార్లు కోరినా మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, డోలా బాలవీరాంజనేయస్వామి, అనిత, సవిత పదేపదే అడ్డు తగులుతూ చర్చ కొనసాగనివ్వకుండా చేశారు. విధిలేని పరిస్థితుల్లో చైర్మన్ పది నిమిషాలు సభను వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అధికార పార్టీ సభ్యులు అదే ధోరణి కొనసాగించారు. చర్చ పూర్తిగా తప్పుదోవ పట్టి గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.సర్వనాశనం చేసింది బాబే: బొత్సరాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబేనని, మళ్లీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి నాశనం చేశారని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో అందుకు అనుగుణంగా కేటాయింపులు జరపలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్సీపీ సభ్యులు కోరటాన్ని తప్పుబడితే ఎలా? అని ప్రశ్నించారు. హామీలు ఎలా అమలు చేస్తారు? ఎప్పుడు నెరవేరుస్తారు? అని అడిగితే అందులో తప్పు ఏముందన్నారు. తమ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక చర్చను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.ఏం జరిగిందంటే..?బడ్జెట్‌పై చర్చ సందర్భంగా వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి పారీ్టలు హామీ ఇచ్చినట్లుగా.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.18 వేలు.. రైతులకు రూ.20,000, మహిళలకు నెలకు రూ.1,500 లాంటి పథకాల కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. అయితే బడ్జెట్లో ఈ పథకాలకు ఒక్క పైసా కూడా కేటాయించలేదని చెబుతుండగా.. మంత్రి సవిత, అనిత, పయ్యావుల కేశవ్ ఆమెను పదేపదే అడ్డుకున్నారు. సభ్యులు ప్రసంగించకుండా మంత్రులు ఈ విధంగా పదేపదే అడ్డుపడటం సరికాదని ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. సభ్యుల ప్రసంగంపై అభ్యంతరాలు ఉంటే వాటిని నోట్ చేసుకొని సమాధానం ఇచ్చే సమయంలో వివరణ ఇస్తే సరిపోతుందన్నారు. ఈ సందర్భంగా సభలో ఏ విధంగా నడుచుకోవాలి? ఎలా మాట్లాడాలి? అనే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరగడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. అనంతరం వరుదు కళ్యాణి తిరిగి చర్చను ప్రారంభిస్తూ దీపం–2 పథకం కింద మూడు ఉచిత సిలెండర్లకు రూ.3,000 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో కేవలం రూ.800 కోట్లే కేటాయించారని ప్రస్తావిస్తుండగా.. మంత్రి అనిత నిలబడి ఆమెను అడ్డుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏమైందని కళ్యాణి మాట్లాడుతున్న సమయంలో మంత్రి డోలా వీరాంజనేయస్వామి లేచి నిలబడి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మీ నాయకుడు పారిపోయి ఇంట్లో పడుకున్నారు..! త్వరలో మీరూ పారిపోతారంటూ వైఎస్సార్సీపీ సభ్యులను రెచ్చగొట్టడంతో సభలో అలజడి చెలరేగింది. ఇంతలో హఠాత్తుగా నారా లోకేశ్ లేచి నిలబడి అసందర్భ చర్చను తెరపైకి తెచ్చారు. గౌరవ సభలో మా తల్లిని అవమానించారని, అందుకే ఆగ్రహంతో మాట్లాడుతున్నాం అంటూ ఊగిపోయారు. అయితే రికార్డుల్లో లేని విషయాలు, సభలో లేని వ్యక్తులను ప్రస్తావించి చర్చ చేయడం సరికాదంటూ బొత్స వారించారు. ఇరుపారీ్టల సభ్యులు వాగ్యుద్ధానికి దిగడంతో చైర్మన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. -
బూచిగా అప్పుల భూతం.. సూపర్ సిక్స్‌కు ఎగనామం: వైఎస్ జగన్
‘ఎన్నికల వేళ నువ్వు చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి? ఇదిగో నీ సూపర్ సిక్స్.. వాటిని అమలు చేయడానికి కావాల్సిన బడ్జెట్ రూ.74 వేల కోట్లు. కానీ బడ్జెట్లో కేటాయింపు చేయలేదు. నువ్వు చెప్పింది అబద్ధం కాదా? నువ్వు చేసింది మోసం కాదా? నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు? ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా?’ అని ప్రశ్నిస్తూ నేను ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడతా. వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇదే పోస్టు పెడతారు. ఇదే పోస్టును సోషల్ మీడియాలో పెట్టాలని ప్రతి కార్యకర్తకూ పిలుపునిస్తున్నా. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. అరెస్ట్ చేయడం మొదలు పెడితే.. అది నాతోనే ప్రారంభించండి.– సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సవాల్సాక్షి, అమరావతి: ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇస్తున్నప్పుడే వాటిని అమలు చేయలేనని తెలిసినా, మోసం చేయడమే తన నైజంగా పెట్టుకున్న చంద్రబాబు.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్ర అప్పులు రూ.11 లక్షల కోట్లు.. రూ.12.50 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు అంటూ చేసిన దుష్ప్రచారం బడ్జెట్ సాక్షిగా బట్టబయలైందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులపై ఒక అబద్ధాన్ని సృష్టించి.. దాన్నే ఎల్లో మీడియాతో రాయించి.. ఆ తర్వాత దత్తపుత్రుడు, బీజేపీలోని టీడీపీ నాయకురాలు, తన వదినమ్మ, ఇతర పార్టీల్లోని టీడీపీ నాయకులతో పదే పదే మాట్లాడించి దుష్ప్రచారం చేసిన ఆర్గనైజ్డ్ క్రిమినల్ (వ్యవస్థీకృత నేరగాడు) చంద్రబాబు అని ధ్వజమెత్తారు. రాష్ట్రం శ్రీలంకలా దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో అంటూ ఒక పద్ధతి ప్రకారం దుష్ఫ్రచారం చేశారని గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులపై చంద్రబాబు చేసిన దుష్ఫ్రచారాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. అధికారంలోకి వచ్చాక కూడా ఆర్థిక శాఖపై నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లకు చేరుకుందంటూ సీఎం చంద్రబాబు లీకులు ఇచ్చారని.. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చిత్రీకరిస్తూ సూపర్ సిక్స్, ఇతర హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు రంగం సిద్ధం చేశారని దుయ్యబట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ముందు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లంటూ గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని గుర్తు చేశారు. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్లో రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లేనని తేలిందని ఎత్తి చూపారు. తద్వారా చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారన్నది బట్టయలైందని చెప్పారు. రాష్ట్ర అప్పులపై తాను చెప్పిందంతా అబద్ధమని తేలుతుందని.. సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కేటాయింపులపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ఇన్నాళ్లూ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా సాగదీస్తూ వచ్చారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకాఏమన్నారంటే..ఎనిమిది నెలలయ్యాక బడ్జెట్ ప్రవేశపెట్టడమా? ⇒ ఈ బడ్జెట్ కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే ప్రవేశపెట్టిన డాక్యుమెంట్లా ఉంది. నిజంగా ఎవరైనా ఎన్నికలైన వెంటనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్ కేటాయింపులు చేసి, వాటి అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తారు. కానీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 8 నెలలు గడిచాక.. కేవలం మరో నాలుగు నెలలు సమయం మాత్రమే ఉన్న పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ను చూస్తే ఆశ్చర్యమేస్తోంది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు మోసాలు, అబద్ధాలు అన్నీ బయటకొస్తాయని ఇలా చేశారు. ⇒ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు కేటాయింపులు జరపకపోతే మా సూపర్ సిక్స్ ఏమైంది.. సూపర్ సెవెన్ ఏమైందని ప్రజలు నిలదీస్తారని తెలుసు కాబట్టే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా సాగదీస్తూ వచ్చారు. దీనికి రకరకాల కారణాలు చెబుతూ వచ్చారు. పరిమితికి మించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పులు చేసిందని.. రాష్ట్రాన్ని శ్రీలంక చేసిందని.. ప్రజలను మభ్యపెట్టే విధంగా అబద్ధాలు ప్రచారం చేశారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెబుతూ.. సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే.. ఆయన ఏ స్థాయి డ్రామా ఆర్టిస్ట్ అన్నది స్పష్టమవుతోంది. బడ్జెట్ డాక్యుమెంట్లో పేర్కొన్న అంశాలే ఇందుకు సాక్ష్యం.చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్‌కు ఆధారాలు ఇవిగో..05–04–2022: ‘రాష్ట్రం మరో శ్రీలంకగా తయారవుతుంది’ చంద్రబాబు స్టేట్మెంట్. ‘ఈనాడు’లో బ్యానర్ కథనం 13–04–22: ‘శ్రీలంకలా ఏపీ దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారేమో?’ అని చంద్రబాబు మరో స్టేట్మెంట్ 19–04–22: చంద్రబాబు చెప్పిన అబద్ధాలను పట్టుకుని ‘మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే’ అంటూ ఈనాడు కథనం 17–05–22: ‘శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరం’లోనే ఉందంటూ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ 21–07–22 : ’శ్రీలంక కంటే రాష్ట్రానికి 4 రెట్లు అప్పు’ అని అప్పటి టీడీపీ నేత, ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్టేట్మెంట్17–02–23 : ‘అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు అప్పు రత్న’ అని పేరు పెట్టాలంటూ దత్తపుత్రుడు మరో ట్వీట్ 25–10–23 : ‘రాష్ట్ర రుణం రూ.11 లక్షల కోట్లు’ అని చంద్రబాబు వదినమ్మ, బీజేపీలో టీడీపీ నాయకురాలు స్వయంగా చూసినట్లు, ఆమెకు తెలిసినట్లు స్టేట్మెంట్⇒ వీటిని బట్టి కొత్త పాత్రధారులు, వారి ఎల్లో మీడియా, ఇతర పార్టీల్లోని టీడీపీ నాయకులతో కలిసి ఒక పద్ధతి ప్రకారం అప్పులపై గోబెల్స్ ప్రచారం చేశారని స్పష్టమవుతోంది. అప్పులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని పార్లమెంటులో కేంద్రం ఇచ్చిన సమా«ధానాన్ని అడ్డుపెట్టుకొని వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని రివర్స్ ప్రచారం. ఢిల్లీకి పోవడం.. రకరకాల ఏజెన్సీలకు లేఖలు రాయడం ఎందుకు? ‘వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రాకూడదు.. కేంద్ర ప్రభుత్వం సహకరించకూడదు.. ఇక్కడ ఏమెమో జరిగిపోతోందన్న భయం సృష్టించాలి’ అని పద్దతి ప్రకారం ఇవన్నీ చేసుకుంటూ పోయారు.⇒ ఎన్నికలు సమీపించే సరికి అబద్ధాలు ముమ్మరం చేశారు. 2023 ఏప్రిల్ 7వ తేదీన ‘రాష్ట్ర అప్పు రూ.12.50 లక్షల కోట్లు’ అని ఎన్నికలకు నెల ముందు చంద్రబాబు వదినమ్మ స్టేట్మెంట్. ఇందుకు వత్తాసుగా అదే నెల 21న ఒకాయనను పట్టుకొచ్చి.. ఆయనకు ఎకానమిస్ట్ అని బిళ్ల తగిలించి.. ‘రాష్ట్ర రుణాలు రూ.14 లక్షలు కోట్లు’ అని చెప్పించారు. ఆ తర్వాత మిగిలిన వాళ్లు వరుసగా ఇదే పాట అందుకున్నారు. ఒక పద్దతి ప్రకారం అబద్ధాల ప్రచారం జరిగింది.మాకు రూ.42,183.80 కోట్ల బకాయిల బహుమతి⇒ చంద్రబాబు పోతూ పోతూ రూ.42,183.80 కోట్ల బకాయిలు మాకు గిఫ్ట్‌గా ఇచ్చి పోయాడు. అవన్నీ మేము కట్టాం. ఉపాధి హామీ బకాయిలు రూ.2,340 కోట్లు, ఉద్యోగులకు రెండు డీఏలు బకాయి పెట్టాడు. ఆరోగ్యశ్రీ రూ.640 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ రూ.2,800 కోట్లు, రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు, విత్తన బకాయిలు రూ.380 కోట్లు, పంటల బీమా బకాయిలు రూ.500 కోట్లు, చివరికి పిల్లలకు మధ్యాహ్న భోజనం వండే ఆయాలకు, కోడిగుడ్లకు కూడా బకాయిలు పెట్టాడు.⇒ ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఏ ప్రభుత్వ హయాంలోనైనా కొన్ని బకాయిలు మామూలే. ఏటా ఈ బకాయిలు క్లియర్ అవుతూనే ఉంటాయి. దీన్నేదో చంద్రబాబు వక్రీకరించి.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎగరగొట్టాలనే దూరపు ఆలోచనతో కొత్త కథను బిల్డప్ చేస్తున్నాడు. సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు అబద్ధాలకు రెక్కలు కట్టాడు. ఇలా చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్‌లో ఎవరెవరు భాగస్వాములై ఉన్నారో సాక్ష్యాధారాలతో సహా మీ ముందు పెట్టాను. రాజకీయ లబ్ధి కోసమే అప్పులపై దుష్ఫ్రచారం⇒ ఏ రాష్ట్రమైనా, ఏ ప్రభుత్వమైనా రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా అప్పులు చేయడం బడ్జెట్లో భాగం. ఇది సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం. ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రభుత్వానికి ఎంత పర్సంటేజ్‌లో అప్పులు చేయాలో ఎఫ్ఆర్బీఎం నిర్దేశిస్తుంది. ఏ ప్రభుత్వమైనా జీఎస్డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతంలోపే అప్పులు తీసుకుంటుంది. అంతకు మించి తీసుకునే అవకాశం ఉండదని అందరికీ తెలుసు.⇒ చంద్రబాబు, ఆయన కూటమి, ముఠా సభ్యులు మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులపై ఏ విధంగా ప్రచారం చేశారో అందరికీ తెలిసిందే. ఏ బ్యాంకు అయినా ప్రభుత్వాలకు రుణాలు ఇవ్వాలంటే ఒక పద్ధతి ఉంటుంది. కార్పొరేషన్ల ద్వారా కూడా ఇష్టమొచ్చినట్టు రుణాలు తీసుకోవడానికి అవకాశం లేదు. చంద్రబాబు సుందర ముఖారవిందం చూసో, జగన్ ముఖారవిందం చూసో ఏ బ్యాంకులు అప్పులు ఇవ్వవు. ఇవన్నీ వాస్తవాలు. కేవలం వారు రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఇలా చేశారని స్పష్టమైంది.అధికారంలోకి వచ్చాక కూడా విష ప్రచారమే⇒ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తన తప్పుడు ప్రచారం మానలేదు. అదే విష ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. జూలై 10వ తేదీన ఆర్థిక శాఖపై సమీక్ష చేస్తూ ‘రాష్ట్రం మొత్తం అప్పులు రూ.14 లక్షల కోట్లు’ అని లీకులిస్తాడు. ఈనాడులో రాస్తారు.. ఈటీవీలో చూపిస్తారు. ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేందుకు చంద్రబాబుకు కారణాలు కావాలి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్’కు కేటాయింపులు చేయకపోతే ప్రజలు నిలదీస్తారని తెలుసు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన దుష్ప్రచారం కొనసాగించారు.⇒ ఒక పద్దతి ప్రకారం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లను తెరమరుగు చేసే కార్యక్రమం. హామీలిచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. అయినా ప్రజలను మోసం చేయాలి. మోసం చేసే సమయంలోనైనా కనీసం నిజాయితీతో మిమ్మల్ని మోసం చేస్తున్నాం అని చెప్పడానికి మళ్లీ జగన్ కావాలి. అందుకోసం రంగం సిద్ధం చేస్తున్నాడు.బడ్జెట్ సాక్షిగా దుష్ఫ్రచారం బట్టబయలు⇒ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్టానికి ఎంత అప్పులు ఉన్నాయో చూపించాలి. అది తప్పనిసరి. ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి ఎవరి హయాంలో ఎంత అప్పులున్నాయో స్పష్టంగా వాళ్లే పేర్కొన్నారు. 14, 16 పేజీలను గమనిస్తే.. 2018–19 నాటికి.. అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి అప్పులు రూ.2,57,509 కోట్లు. వీటికి ప్రభుత్వ గ్యారంటీతో వివిధ కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు కూడా కలుపుకుంటే మరో రూ.55వేల కోట్లు. అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి (2018–19) రూ.3.13 లక్షల కోట్ల అప్పులున్నాయి. ⇒ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.3.13 లక్షల కోట్లు ఉన్న అప్పులు, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.4.91,774 కోట్లకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతో వివిధ కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు మరో రూ.1.54 లక్షల కోట్లు.. రెండు కలిపితే రూ.6.46 లక్షల కోట్లు. ఈ వివరాలను వాళ్లే స్పష్టం చేశారు. అలాంటప్పుడు వాళ్లు ప్రచారం చేసినట్టుగా ఎక్కడ రూ.10 లక్షల కోట్లు, ఎక్కడ రూ.11 లక్షల కోట్లు, ఎక్కడ రూ.12.50 లక్షల కోట్లు, ఎక్కడ రూ.14 లక్షలు కోట్లు అప్పులు? ఇవన్నీ దుష్ప్రచారాలే కదా?అప్పుల రత్న బిరుదు ఎవరికి ఇవ్వాలి?⇒ ఎవరెవరి హయాంలో ఎంతెంత అప్పులు చేశారో అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు (డెట్ కాంపౌండ్ గ్రోత్ రేటు) ఎంతుందో ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.1.32 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. ఆయన దిగిపోయేసరికి రూ.3.13 లక్షల కోట్లు అప్పులుగా ఉన్నాయి. అంటే అప్పుల సగటు వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్) 19.54 శాతం. అదే మా హయాంలో అప్పు రూ.3.13 లక్షల కోట్ల నుంచి రూ.6.46 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు 15.61 శాతం. అంటే.. చంద్రబాబు కంటే 4 శాతం తక్కువగా అప్పులు చేశాం.⇒ ఇక ప్రభుత్వ రంగ సంస్థల నాన్ గ్యారంటీ అప్పులు చూసినా.. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.8,638 కోట్లు ఉన్న నాన్ గ్యారంటీ అప్పులు.. ఆయన దిగిపోయే నాటికి రూ.77,228 కోట్లకు చేరాయి. పవర్ సెక్టార్, డిస్కమ్‌లకు చేసిన అప్పులు ఏకంగా 54.98 శాతం పెరిగాయి. మేము డిస్కమ్‌లు కాపాడేందుకు, పబ్లిక్ సెక్టార్, నాన్ గ్యారంటీడ్ లయబులిటీస్ అయినా సరే దాన్ని తగ్గించే కార్యక్రమం చేశాం. రూ.77,228 కోట్ల నుంచి రూ.75,386 కోట్లకు తగ్గించాం. అంటే మా హయాంలో రుణం పెరగకపోగా – 0.48 శాతం తగ్గించాం. ⇒ ప్రభుత్వ అప్పు, గ్యారంటీ అప్పు,. నాన్ గ్యారంటీ అప్పులు అన్ని కలిపి చూస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి అంటే 2014 నాటికి రూ.1.40 లక్షల కోట్లు ఉంటే.. ఆయన దిగేపోయే సరికి రూ.3.90 లక్షల కోట్లు చేరాయి. అంటే అప్పుల వార్షిక వృద్ధిరేటు 22.63 శాతం ఉంటే.. మా హయాంలో రూ 3.90 లక్షల కోట్లు రూ.7.21 లక్షల కోట్లు అయ్యింది. 13.57 శాతంగా అప్పుల వార్షిక వృద్ధి రేటు నమోదైంది. అది కూడా రెండేళ్లు కోవిడ్ దుర్భర పరిస్థితుల్లో. నిజంగా ఏదైనా అవార్డు ఇవ్వాలంటే మా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, అప్పుల రత్న బిరుదు చంద్రబాబుకు ఇవ్వాలి. -
నేడు బడ్జెట్‌పై వైఎస్ జగన్ మీడియా సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2024–25కు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌పై బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ఉంటుందని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది. -
Andhra Pradesh: దమన నీతి.. అరాచక రీతి
‘అమ్మకు నిల్లు.. నాన్నకు ఫుల్లు’ అని సోషల్ మీడియాలో పోస్టు పెడితే పోలీసు కేసు.. పోలీస్ స్టేషన్లోనే వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి చేసిన టీడీపీ నేతలపై మాత్రం కేసే లేదు..‘మద్యం వద్దు... బడి ముద్దు’ అని పోస్టు పెడితే వెంటనే కేసు 3 వేల కుటుంబాలు గ్రామాలు విడిచి వెళ్లేట్టు చేసిన టీడీపీ గూండాలపై మాత్రం కేసులు లేవు.. ‘మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ’ అని పోస్టు పెడితే పోలీసు కేసు.. లోకేశ్ ఫొటో ముందు మోకరిల్లి క్షమాపణ చెప్పకపోతే చంపేస్తామని బెదిరిస్తే మాత్రం కేసు లేదు.. ‘రైతుకు పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారు’ అని పోస్టు పెడితే కేసు..మద్యం దుకాణానికి టెండరుదాఖలు చేసిన ఓ వ్యాపారిపై దాడి చేస్తే మాత్రం కేసే లేదు..ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ విజయభారతికి ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథ్‌రెడ్డి, డాక్టర్ తనూజరాణి, గొల్ల బాబురావు టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. కూటమి పార్టీల విశృంఖలత్వం వికటాట్టహాసం చేస్తోంది. రాజ్యాంగాన్ని కాలరాస్తూ అరాచక కేళి సృష్టిస్తోంది. పాలకులను ప్రశ్నించే హక్కు పౌరులకు లేదని స్వీయ తీర్పు ఇచ్చుకుంది. కాదు కూడదని ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులే లక్ష్యంగా అరాచకానికి తెగబడుతోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజ్యాంగ ధర్మాన్ని మంటగలుపుతూ పౌర హక్కులను కాలరాస్తోంది. వారి ద్వారా ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతోంది. అదుపులోకి తీసుకున్న వారిని 24 గంటల్లో న్యాయ స్థానంలో హాజరు పరచకుండా నిరంకుశంగా వ్యవహరిస్తోంది. మహిళలు, వృద్ధులు.. అన్న విచక్షణ లేకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోంది. ఎఫ్ఐఆర్లలో అక్కసున్న వారి పేర్లు చేరుస్తోంది. ఒక్కొక్కరిపై ఐదారు కేసులు నమోదు చేయిస్తూ రాక్షసానందం పొందుతోంది. నాలుగైదు రోజుల్లోనే 147 అక్రమ కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం.భావ ప్రకటన స్వేచ్ఛకు ఆధునిక కాల వేదికగా నిలుస్తున్న సోషల్ మీడియాను అక్రమ కేసుల ఉక్కు సంకెళ్లతో బంధించేందుకు ఈ సర్కారు విఫలయత్నం చేస్తోంది. ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. - సాక్షి, అమరావతి, నెట్ వర్క్నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఆ చిన్నారిని కనిపించకుండా చేసినా నేటికీ ఆచూకీ కనిపెట్టలేదు... కానీ... అదే నంద్యాల జిల్లాలో పత్రికల్లో ప్రచురితమైన ప్రభుత్వ వ్యతిరేక కథనాలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశాడని ఫిర్యాదు వచ్చిన వెంటనే ఆ వ్యక్తిని కనిపెట్టి అరెస్ట్ చేశారు. మీడియా కథనాలు పోస్టు చేశాడని.. పత్రికల్లో ప్రచురితమైన ప్రభుత్వ వ్యతిరేక కథనాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడని, టీడీపీ నేతలను కించపరిచే పోస్టులను ఫార్వర్డ్ చేశాడని నంద్యాల జిల్లా మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన తిరుమల కృష్ణ అలియాస్ జగన్ కృష్ణపై ఈ నెల 3వ తేదీన కేసు నమోదు చేశారు. అతనిపై కేసు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు అదే రోజు రాత్రి కర్నూలు సీసీఎస్ పోలీసులు వెల్లడించారు. నాలుగో తేదీ కర్నూలు ఎక్సైజ్ కోర్టు ఇన్చార్జ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుచగా రిమాండ్ విధించారు. కృష్ణను పోలీసులు కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. పిల్లలతో బహిరంగంగా మద్యం విక్రయించేవారిపై చర్యలు శూన్యం... విద్య వద్దు.. మద్యం ముద్దు.. అని ప్రభుత్వ తీరును నిరసిస్తూ పోస్టు పెడితే మాత్రం అరెస్ట్... విద్య వద్దు... మద్యం ముద్దు అన్నందుకు..శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం వీరచిన్నయ్యగారిపల్లికి చెందిన మలక అమర్నాథ్రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారని, చంద్రబాబు, లోకేశ్‌లను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడుతున్నారని కదిరికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ నెల 2న కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ‘విద్య వద్దు.. మద్యం ముద్దు, నాన్నకు ఫుల్.. అమ్మకు నిల్’ అనే పోస్టులు పెట్టాడని అమర్నాథ్రెడ్డిపై కేసు నమోదు చేశారు. అమర్ నాథ్రెడ్డిని పోలీసులు విచారణ పేరిట స్టేషన్ చుట్టూ తిప్పు కుని ఇబ్బంది పెట్టారు. చివరకు న్యాయ వాదుల సాయంతో బెయిల్ తెచ్చుకున్నాడు. అయినప్పటికీ మరోసారి అదుపులోకి తీసుకున్నారు.శ్రీకాకుళం నగరంలో ఓ మహిళను వివస్త్రను చేసి ఒంటిపై కారం చల్లి కొడితే చర్యలు లేవు... కానీ... అదే జిల్లాలో ఓ వృద్ధురాలు పింఛను కోసం వెళ్లి సొమ్మసిల్లి పడిపోయిందని సోషల్ మీడియాలో ఫొటో పెడితే మాత్రం నిర్బంధిస్తారు? వృద్ధురాలి వేదనను వివరించిందుకు..శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో ఈ నెల 1న బైనపల్లి దానమ్మ అనే వృద్ధురాలు పింఛన్ల కోసం వేచి చూస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. ఆ విషయాన్ని అదే మండలం కొండపల్లి గ్రామానికి చెందిన మడ్డు జశ్వంత్ సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో టీడీపీ నాయకులు అతనిపై కక్ష కట్టి పోలీసుల చేత అక్రమ కేసులు పెట్టించారు. పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి గంటల కొద్దీ ఉండి కుటుంబ సభ్యులను వేధించారు. ఎలాంటి నోటీసూ ఇవ్వలేదు. జశ్వంత్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి కనీసం భోజనం పెట్టలేదు. ఇప్పటికీ పిలుస్తూనే ఉన్నారు. ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదని బాధితుడు చెబుతున్నాడు. దళిత వైద్యుడి చొక్కా పట్టుకుని ఎమ్మెల్యే దాడికి ప్రయత్నించినా... విధుల్లో ఉన్న ఎస్ఐని మంత్రి భార్య దుర్భాషలాడినా నో యాక్షన్... పవన్‌కళ్యాణ్‌పై మంద కృష్ణమాదిగ తీవ్ర ఆగ్రహం... అని ఓ వ్యక్తి వాట్సాప్ గ్రూపులో పెడితే.. ఆ గ్రూపులో ఉన్నవారికి పోలీసు నోటీసులు వాట్సాప్ గ్రూపులో ఉన్నందుకు..ఎన్టీఆర్ జిల్లా పెండ్యాల గ్రామానికి చెందిన హనుమంతరావు ఒక వాట్సాప్ గ్రూపులో ఉన్నారు. ఆ గ్రూపులో ఇటీవల ‘పవన్‌కళ్యాణ్‌పై మంద కృష్ణమాదిగ తీవ్ర ఆగ్రహం. సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం మంద కృష్ణ... పవన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు.’ అని మరో వ్యక్తి పోస్ట్ పెట్టారు. కానీ, ఆ గ్రూపులో ఉన్నందుకు హనుమంతరావుకు పోలీసులు నోటీసు ఇచ్చారు. ఎన్నికల తర్వాత 179 మంది అత్యంత ఘోరంగా, దారుణంగా హత్యకు గురైనా నిందితులపై చర్యలు శూన్యం... కానీ... ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్టుపై ఫొటోను ఫేస్బుక్లో పెడితే మాత్రం కేసు కట్టి రోజూ స్టేషన్‌కు పిలిచి వేధింపులు... బాబు అరెస్ట్ ఫొటో షేర్ చేసినందుకు..వినోద్ పెట్టిన పోస్టు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామానికి చెందిన పిళ్లెం వినోద్ ప్రైవేట్ ఎలక్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఎన్నికల సమయంలో చంద్రబాబు అరెస్టయినప్పటి ఫొటో ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఈ నెల 2న వినోద్‌పై గ్రామ టీడీపీ నాయకులు పెనుగంచిప్రోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి రోజూ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కూర్చోబెట్టి నేతలపై పోస్టులు పెట్టవద్దని హెచ్చరిస్తున్నారు.తూర్పు గోదావరి జిల్లాలోని నర్సరీల్లో పనికి వచ్చే వలస కూలీలపై వరుస లైంగిక దాడులకు పాల్పతున్న వారిపై కేసులు లేవు... కానీ... విజయవాడలో వరద సాయంపై పోస్టు పెట్టిన వ్యక్తి కోసం అనేక ప్రాంతాల్లో గాలించి ఆఖరికి ఆలయానికి వెళుతుండగా పట్టుకున్నారు! అగ్గిపెట్టెలు.. కొవ్వొత్తులకు కోట్లు.. అంటేనే.. విజయవాడను వరద ముంచెత్తినప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు కోట్ల రూపాయలు ఖర్చుచేశారని పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామానికి చెందిన కల్లా నాగిరెడ్డి ‘ఎక్స్’లో పోస్టు చేశాడు. దీనిపై మార్కాపురానికి చెందిన కుంచాల యశ్వంత్ గత నెల 21వ తేదీన మార్కాపురం టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నవంబర్ 5వ తేదీన ఉదయం తాడేపల్లిలోని అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళుతుండగా అయ్యప్పమాలలో ఉన్న నాగిరెడ్డిని అరెస్టు చేసి మార్కాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అర్ధరాత్రి సమయంలో 41 (ఏ) నోటీసు ఇచ్చి విడుదల చేశారు.మంగళగిరి నియోజకవర్గంలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టి అర్ధనగ్నంగా లోకేశ్ ఫొటో ఎదుట మోకాళ్లపై కూర్బోబెట్టి క్షమాపణలు చెప్పిస్తే కేసు లేదు... టీడీపీ నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయని ప్రజలు తీసి సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను ఫార్వర్డ్ చేస్తే మాత్రం క్షణాల్లోనే అరెస్ట్... వీడియో ఫార్వర్డ్ చేసినందుకు... చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుల ఆగడాలు పెరిగిపోయాయని, మద్యం దుకాణాల్లో వాటా అడుగుతూ వ్యాపారులపై దాడులు చేస్తున్నారని సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను అక్టోబర్ 27వ తేదీన పాలేటి కృష్ణవేణి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశారు. ఆమెను ఈ నెల 2వ తేదీన గుంటూరు జిల్లా తాడేపల్లిలో అరెస్ట్ చేసి చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అదే రోజు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరు చేశారు. వందలాది గ్రామ, వార్డు సచివాలయాలను టీడీపీ మూకలు ధ్వంసం చేసినా ఒక్క కేసు లేదు... రూ.436 కోట్లతో రిషికొండలో అద్భుతమైన భవనం వైఎస్ జగన్ కట్టించారు.. ఐదేళ్లలో నోవాటెల్ హోటల్ అద్దె రూ. 300కోట్లు.. అని పోస్టు పెడితే వెంటనే పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధం.. రిషికొండలో అద్భుత భవనం అన్నందుకు..ఎన్టీఆర్ జిల్లా పరిటాల గ్రామానికి చెందిన జమలయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ‘రూ.436 కోట్లతో రిషికొండలో అద్భుతమైన భవనం వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టించారు. ఐదేళ్లలో నోవాటెల్ హోటల్ అద్దె రూ. 300 కోట్లు. మీకు అర్థమైంది’ అని జమలయ్య ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. దీంతో పోలీసులు అతన్ని స్టేషన్‌కు తీసుకువెళ్లి రెండు రోజులు ఉంచారు. జమలయ్య సెల్‌ఫోన్ స్వా«దీనం చేసుకుని నోటీసు ఇచ్చారు. తప్పుడు ప్రచారం నమ్మవద్దన్నందుకే... ఎన్టీఆర్ జిల్లా పెండ్యాల గ్రామానికి చెందిన షేక్ షబ్బీర్ తిరుమల లడ్డూ వివాదంలో చంద్రబాబు చేసిన అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని వాట్సాప్ గ్రూప్‌లో సమాచారం పెట్టాడు. ఈ విషయాన్ని జీరి్ణంచుకోలేని టీడీపీ మూకలు కేసు పెట్టటంతో షబ్బీర్‌ను రెండు రోజులపాటు పోలీస్‌స్టేషన్‌లో ఉంచి చితకబాదారు. సెల్‌ఫోన్ తీసుకున్నారు. అతనితోపాటు వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న 170 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్‌ను పొగిడినందుకే నోటీసు ఎన్టీఆర్ జిల్లా పెండ్యాలకు చెందిన మహ్మద్ నసరత్ ఇటీవల ఓ వాట్సాప్ గ్రూపులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పొగుడుతూ పోస్టు పెట్టారు. దానిపై కూడా ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహ్మద్ నసరత్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.ఐటీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేస్తే చాలు... శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన బాలాజీరెడ్డి ఫేస్బుక్లో టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా పోస్టు పెడుతున్నాడని ఐటీడీపీకి చెందిన ఎ.పవన్‌కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ నెల 2వ తేదీన పోలీసులు అర్ధరాత్రి వేళ బాలాజీరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అదేరోజున రొద్దం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. విచారణ తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అయితే.. ఈ నెల ఏడో తేదీన మరోసారి అదుపులోకి తీసుకున్నారు. వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన తర్వాత శనివారం విడిచిపెట్టారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వరు.. కేసు వివరాలు చెప్పరు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ షేక్ గౌస్ ఇటీవల ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టారని పోలీసులకు ఫిర్యాదు అందింది. వారం కిందట గౌస్‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి ఫోన్ తీసుకుని నాలుగు రోజులు స్టేషన్ చుట్టూ తిప్పారు. కేసు నమోదు చేసి 41 నోటీసు ఇచ్చారు. కానీ ఎఫ్ఐఆర్ కాపీ, కేసు వివరాలు అడిగితే స్పందించలేదు. పది నెలల కిందట పోస్టు... ఇప్పుడు అరెస్టు ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలం అనిగాండ్లపల్లికి చెందిన హరీశ్వర్‌రెడ్డి ‘ఎక్స్’లో ఈ ఏడాది జనవరి 24న నాటి టీడీపీ మహిళా అధ్యక్షురాలు, ప్రస్తుతం హోంమంత్రి వంగలపూడి అనితను అసభ్య పదజాలంతో దూషించారని కోవూరుకు చెందిన టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హరీశ్వర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు కుటుంబంపై కూడా ‘ఎక్స్’లో హరీశ్వర్‌రెడ్డి అసభ్యంగా పోస్టింగ్ పెట్టారని నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 6వ తేదీన అరెస్ట్ చేశారు. స్టేషన్ బెయిల్‌పై వదిలి పెట్టారు. పొదిలిలో ఫిర్యాదు.. విశాఖలో అరెస్టు విశాఖట్నానికి చెందిన బోస రమణారెడ్డి.. ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్‌లలో పోస్టులు పెట్టడం ద్వారా మంత్రి లోకేష్ గౌరవ మర్యాదలు తగ్గించే ప్రయత్నం చేసినట్లు పొదిలికి చెందిన టీడీపీ నాయకుడు గత నెల 21వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసు విచారణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి విశాఖపట్నం వెళ్లి మరీ రమణారెడ్డిని ఈ నెల 6న అరెస్టు చేసి పొదిలికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి పొదిలి పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నట్లు సమాచారం.కందిపప్పు కిలోకి.. 780 గ్రాములే ఉందన్నందుకు.. ప్రభుత్వం ప్రజలకు పౌరసరఫరాల శాఖ కిలో పేరిట ఇస్తున్న కందిపప్పు 780 గ్రాములు మాత్రమే ఉండటంతో ఆ విషయాన్ని గత నెల 4వ తేదీన ఫేస్బుక్లో పెట్టిన అచ్చంపేట మండలానికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ తుమ్మా బాబుల్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరైన బాబుల్ రెడ్డి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు, మూడు రోజులు తమకు అందుబాటులో ఉండాలని హెచ్చరించి పంపించారు. జోగి రమేష్ వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నందుకు.. మాజీ మంత్రి జోగి రమేష్ వీడియోను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నందుకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన కె.నానిపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. జోగి రమేష్ గతంలో ఒక వేదికపై.. జనసేన నేత పవన్‌కళ్యాణ్‌ను ఎన్ని పార్టీలు మారుస్తావ్, ఎన్ని జెండాలు మారుస్తావని ప్రశ్నించారు. ఈ వీడియోని నాని తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టు చూసినందుకు సాక్ష్యం చెప్పాలని నోటీసులు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామానికి చెందిన బద్దం అశోకరెడ్డి నిర్వహించే ‘వైఎస్సార్ కుటుంబం’ అనే గ్రూప్‌లో ఉన్న చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన దిలీప్ రెడ్డి, చిట్టిబాబు, జిల్లేడయ్య, మోతీలాల్, సతీష్, అంగముత్తు, జలంధర్లను విజయవాడ సిటీ, సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు సాక్షులుగా రావాలని అండర్ 17 బీఎన్ఎస్ఎస్ కింద నోటీసులు అందించారు. వెంటనే రాకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంతకూ ఆ గ్రూపులో ఏ పోస్టు చూసినందుకు తమను రమ్మంటున్నారో చెప్పకుండానే నోటీసులివ్వడం పట్ల వారు లబోదిబోమంటున్నారు.సీఎం వ్యాఖ్యలను ఖండించారని...శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బండగానిపల్లి గ్రామానికి చెందిన బేరి తిరుపతిరెడ్డి గత నెలలో తిరుపతి లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, బెయిల్‌పై విడుదలయ్యారు. పోస్టులు ఫార్వర్డ్ చేశారనికావలి పట్టణంలోని 11 వార్డుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆత్మకూరు రాజేష్, దామెర్ల శ్రావణ్ కుమార్‌లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తున్నారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కావలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వ్యతిరేకత సహించలేక... నెల్లూరు జిల్లాకు చెందిన మద్దిబోయిన వీరరఘు, కుందర్తి శ్రీనివాసులు, మేకల శ్రీనివాసులు(బోగోలు), ఉప్పాల మాచర్ల(ఎస్జీవీ కండ్రిక), ఏకే సుందరరాజు(విశ్వనాథరావుపేట)లు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ప్రభుత్వ వైఫల్యాలపై మీడియాలో వచ్చిన కథనాలు, పోస్టులను ఫార్వర్డ్ చేస్తున్నారని కూటమి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీరిపై నెల్లూరు జిల్లాలో పోలీసులు కేసులు నమోదు చేశారు. తరచూ స్టేషన్లకు పిలిచి ఇబ్బంది పెడుతున్నారు. టీడీపీ నేత మందు పార్టీ ఫొటోలు ఫార్వర్డ్ చేశారని..నెల్లూరు జిల్లా దగదర్తిలో టీడీపీ నేత పమిడి రవికుమార్ చౌదరి తన స్నేహితులతో కలిసి వ్యవసాయ భూముల్లో ఉన్న గెస్ట్‌హౌస్‌లో మందుపార్టీ చేసుకున్నారు. ఆ ఫొటోలు ఒక సోషల్ మీడియా గ్రూపులో వచ్చాయి. ఆ ఫొటోలను సబ్బా ప్రభావతి ఇతరుల వాట్సాప్ గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేశారనే కారణంతో ఆమెపై కేసు నమోదు చేశారు.నోటీసు ఇవ్వకుండానే అరెస్టు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌పై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఈ నెల 3వ తేదీన విశాఖకు చెందిన బోడి వెంకటేష్‌పై బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 5వ తేదీన మార్టూరు పోలీసులు విశాఖకు వచ్చారు. నోటీసు ఇవ్వకుండా వెంకటేష్‌ను దువ్వాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించారు. అడిగిన తరువాత 41ఏ నోటీసు ఇచ్చి విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీన మార్టూరు పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని చెప్పారు. ఇంతలో ఈ నెల 6వ తేదీన గాజువాకకు చెందిన టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు సాకెళ్ల రతన్‌కాంత్.. బోడి వెంకటేష్‌పై దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 7వ తేదీన విచారణకు పిలిచి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. కక్ష కట్టి... కేసు పెట్టి... ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన తమ్మవరపు మురళీకృష్ణ, ఎ.నరేంద్ర సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పోస్టులను సోషల్ మీడియాలో ఫార్వార్డ్ చేశారని వారం రోజుల క్రితం వీరిద్దరిపై జగ్గయ్యపేటలో కేసులు నమోదు చేశారు. వారి ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. రోజూ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు.బూట్లు వేసుకుని సీఎం పూజలు చేయడం తప్పు అన్నందుకు... అనంతపురం జిల్లా శెట్టూరు మండలం యాటకల్లు గ్రామానికి చెందిన లక్ష్మణమూర్తి తిరుపతి లడ్డూ వివాదం సమయంలో ఒక వాట్సాప్ గ్రూప్‌లో ‘పూజా కార్యక్రమాలలో బూట్లు వేసుకుని పాల్గొనే తమరు కూడా హిందూ మతం గురించి మాట్లాడటానికి సిగ్గు ఉండాలి’ అంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి పోస్టు చేశాడని సెపె్టంబర్ 26న టీడీపీ నాయకుడు కళ్యాణదుర్గం అర్బన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి లక్ష్మణమూర్తిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బైండోవర్శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం కె.పూలకుంట గ్రామానికి చెందిన ఆంజనేయులు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నాడనే కారణంతో ఈ నెల 6వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక రోజు అక్రమంగా నిర్బంధించి మరుసటి రోజు బైండోవర్ చేశారు. ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అరెస్టు చూపకుండా... ఆందోళనకు గురిచేసి..అనంతపురం జిల్లా మదిగుబ్బ గ్రామానికి చెందిన జింకల రామాంజినేయులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్టు చేశాడన్న అభియోగాలతో ఇటుకలపల్లి పోలీసులు ఈ నెల 5వ తేదీ అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అరెస్టు చూపకుండా, కుటుంబ సభ్యులకు అతని ఆచూకీ తెలపకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. దీంతో కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి రామాంజినేయులు ఆచూకీ తెలపాలని కోరారు. న్యాయస్థానం సీరియస్ కావడంతో పోలీసులు ఎట్టకేలకు శుక్రవారం (ఈ నెల 8న) అనంతపురంలోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.ఇంటూరిపై15 కేసులు?విశాఖపట్నం మధురవాడ పరిధిలోని ధర్మపురి కాలనీకి చెందిన ఇంటూరి రవికిరణ్ పొలిటికల్ పంచ్ వెబ్ చానెల్ నిర్వహిస్తున్నారు. ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో యాక్టివ్‌గా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ పోలీసులు కేసుల పేరుతో వేధిస్తున్నారు. ఆయనపై దువ్వాడ, గుంటూరు, విజయవాడ, మార్టూర్ పోలీస్స్టేషన్లలో ఒక్కో కేసు.. గుడివాడ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు, రాజమండ్రిలోని ప్రకాష్‌నగర్‌లో పలు కేసులు నమోదు చేశారు. మొత్తంగా ఇతనిపై దాదాపు 15 కేసులు నమోదు చేశారు. తాజాగా రాజమండ్రిలోని ప్రకాష్‌నగర్ పోలీసులు రవికిరణ్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.రెండేళ్ల క్రితం పోస్టులు పెట్టారని... వైఎస్సార్ జిల్లా వేముల మండలం కొండ్రెడ్డిపల్లెకు చెందిన వర్రా రవీందర్‌రెడ్డి రెండేళ్ల క్రితం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర నాయకులపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టారని కడప తాలూకా పోలీసుస్టేషన్లో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 4వ తేదీన కేసు నమోదు చేశారు. అదే రోజు రాత్రి కడప నుంచి పోలీసు బృందం కొండ్రెడ్డిపల్లెలోని వర్రా రవీందర్‌రెడ్డి ఇంటికి వెళ్లింది. ఆయనను 5వ తేదీ తెల్లవారుజామున కడప తాలూకా పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు. 41 నోటీసు ఇచ్చి జామీను ద్వారా పంపించారు. వర్రా రవీందర్‌రెడ్డి కుటుంబ సభ్యులను కూడా చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి వేధింపులకు గురిచేశారు. ఈ విషయం మీడియాలో రావడంతో రాత్రి 7 గంటలసమయంలో కుటుంబ సభ్యులకు 41ఏ నోటీసు ఇచ్చి పంపించారు. ఆ తర్వాత మళ్లీ రవీందర్‌రెడ్డిని ఈ నెల 8వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎట్టకేలకు అతడ్ని సోమవారం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.భార్యాభర్తలకు చిత్రహింసలు పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన పెద్దిరెడ్డి సుధారాణి భర్త వెంకటరెడ్డి కాంట్రాక్టర్. ప్రస్తుతం వీరు తెలంగాణలోని నల్లగొండ జిల్లా వెంకటరమణ కాలనీలో నివాసం ఉంటున్నారు. టీడీపీ, జనసేన నాయకులపై సుధారాణి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఈ నెల 4వ తేదీన ఆమెతోపాటు భర్త వెంకటరెడ్డిని కూడా సిరిసిల్లలోని జొన్నవాడ గ్రామంలో రాజరాజేశ్వరీదేవి దర్శనానికి వెళ్లగా, చిలకలూరిపేట సీఐ రమేష్, మరో ఏడుగురు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారిని వెంటనే చిలకలూరిపేట తీసుకువచ్చి అక్రమంగా నిర్బంధించి వేధించారు. ఆరో తేదీన వారిని అరెస్టు చేసినట్లు తెలియజేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అయితే, ఆ వెంటనే ప్రకాశం జిల్లా ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు సుధారాణి దంపతులను అదుపులోకి తీసుకుని ఒంగోలుకు తరలించారు. వైఎస్సార్సీపీ న్యాయవాదులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో నవంబరు 9న గుంటూరు కొత్తపేట పోలీసులు జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు హడావుడిగా అరెస్టు చూపారు. అంతకు ముందు చిలకలూరిపేట నుంచి ఒంగోలు పోలీసు స్టేషన్‌కు తరలించి, అక్కడ కూడా మహిళ అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘సోషల్’ కుట్రవరుస హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం అట్టుడుకుతుండటం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో హత్యలు, అత్యాచారాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వరుస దాడులు, దౌర్జన్యాలతో యథేచ్ఛగా విధ్వంసకాండ కొనసాగుతోంది. తమకు ఓటేయలేదన్న కారణంతో టీడీపీ గూండాలు కర్రలు, కత్తులు చేత పట్టుకుని స్వైర విహారం చేస్తున్నారు. ఫలితంగా నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 179 మంది హత్యకు గురయ్యారు. మరో నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సుమారు 500 మందిపై హత్యాయత్నాలకు తెగబడ్డారు. ఏకంగా 100 మందిపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయి. వారిలో 11 మందిపై అత్యాచారం చేసి హత్య చేయడం దిగ్భ్రాంతి పరుస్తోంది. 2 వేలకు పైగా దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. టీడీపీ గూండాల దాడులతో భీతిల్లి దాదాపు 3 వేల కుటుంబాలు గ్రామాలు విడిచిపెట్టి ఇతర ప్రాంతాల్లో తల దాచుకుంటున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. బాధితులపైనే ఎదురు కేసులు పెడుతున్నారు. హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు శాఖకు స్పష్టమైన మార్గ నిర్దేశం చేయలేదు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఇసుమంతైనా స్పందించక పోవడం పట్ల ప్రజల్లో తీవ్ర నిరసన వెల్లువెత్తుతోంది. ఈ నిరసన మరింత ఉధృతంగా మారనుందని తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఎప్పటిలాగే డైవర్షన్ రాజకీయాలకు తెర లేపారు. ప్రభుత్వ తీరు పట్ల నిరసన తెలుపుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టిస్తూ తనదైన శైలిలో ప్రజల దృష్టి మళ్లించేందుకు పూనుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. -
ప్రశ్నించే స్వరం వినిపించకూడదా?: వైఎస్ జగన్
డీజీపీ చట్టం, న్యాయం వైపు నిలబడాలి. ఇప్పుడున్న డీజీపీ మా హయాంలో ఆర్టీసీ సీఎండీ స్థానంలో పని చేశారు. మంచి పదవి ఇచ్చి బాగా చూసుకున్నాం. కానీ ఈరోజు ఏ స్థాయికి దిగజారిపోయారంటే.. లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తుంటే.. ఆయన అధికార పార్టీ కార్యకర్తలా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో పోలీసులు సరిగా పనిచేయలేదని చెబుతున్నాడు. మరి ఆయన కూడా ఆ ప్రభుత్వంలో పనిచేశాడు కదా? మరి ఇప్పటి ప్రభుత్వం సవ్యంగా, బ్రహ్మాండంగా పని చేస్తోందా? ఆయన డీజీపీగా ఉన్న ప్రభుత్వం సవ్యంగా పని చేస్తే.. ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు దొంగ కేసులు పెడుతున్నారు? ఐదు నెలలు తిరగక ముందే 91 మంది అక్క చెల్లెమ్మల మీద ఎందుకు అత్యాచారాలు జరిగాయి? ఎందుకు ఏడుగురు మహిళలు చనిపోయారు? చివరకు ప్రజల తరపున గొంతు విప్పుతున్న సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను ఎందుకు అక్రమ నిర్భంధాలు చేస్తున్నారు?సాక్షి, అమరావతి: కూటమి సర్కారు అక్రమాలు, మోసాలు, వైఫల్యాలపై ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తుండటం.. సామాజిక స్పృహ ఉన్నవారు, సోషల్ మీడియా కార్యకర్తలు నిలదీస్తుండటంతో సీఎం చంద్రబాబు తట్టుకోలేక ప్రశ్నించే స్వరం వినిపిస్తే చాలు అక్రమ కేసులు బనాయించి నిర్బంధిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను, సోషల్ మీడియా కార్యకర్తలను హింసిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసు సోదరులారా.. న్యాయం, ధర్మం వైపు నిలబడాలని సూచించారు. పోలీసులు టోపీపై కన్పించే 3 సింహాలకు సెల్యూట్ చేయాలేగానీ రాజకీయ నేతల చెప్పినట్టు తప్పుడు కేసులు బనాయిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే అధికారంలో ఉండదనే విషయాన్ని పోలీసులు గుర్తించుకోవాలన్నారు. రిటైర్ అయిన తర్వాత వెళ్లిపోతాం అని అనుకుంటున్నారేమో..! సప్త సముద్రాల అవతల ఉన్నా రప్పించి చట్టం ముందు దోçÙులుగా నిలబెడతామన్నారు. దొంగ కేసులు పెడుతున్న ప్రతి పోలీస్ అధికారిపై ప్రైవేటు కంప్లైంట్లు ఫైల్ చేస్తామన్నారు. ప్రతి బాధితుడికి వైఎస్సార్ సీపీ న్యాయ సహాయం అందిస్తుందని చెప్పారు. ఎన్నికల్లో మీరు చెప్పిన సూపర్ సిక్స్‌లు ఏమయ్యాయని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారన్నారు. వారం రోజుల్లో 101 మంది సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని.. సుప్రీం తీర్పులనూ అవహేళన చేస్తున్నారన్నారు. తన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ప్రశ్నించే స్వరాలు ఉండకూడదా? అని నిలదీశారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు బాధితులంతా.. రేపు రెడ్ బుక్ పెట్టుకుంటారు...పోలీసు అంటే గౌరవం ఉండాలి. వ్యవస్థలు బతకాలి కానీ నీరుగారిపోకూడదు. రాజకీయ నేతలు చెబుతున్నారని తెలిసి కూడా తప్పులు చేయడం పోలీసులకు మంచిది కాదు. తిరుపతిలో సుబ్బరాయుడు ఉన్నాడు. చంద్రబాబు తెలంగాణ నుంచి డిప్యూటేషన్‌పై తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తెలంగాణ వెళ్లిపోతామని అనుకుంటున్నారేమో? తెలంగాణ నుంచి మళ్లీ పిలిపిస్తాం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా రప్పిస్తాం. రెడ్ బుక్ పెట్టుకోవడం పెద్ద పనికాదు. ఈ రోజు నష్టపోయిన బాధిత కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ రెడ్ బుక్ పెట్టుకుంటారు. వాళ్లందరూ నా దగ్గరకు వచ్చి గ్రీవెన్స్ చెబుతారు. అప్పుడు నేను చూస్తూ ఊరుకోను.వారిని ఎందుకు అరెస్టు చేయరు?రెండేళ్ల క్రితం మా అమ్మ కారు టైర్ బరస్ట్ అయితే.. ఇది ఈరోజు కొత్తగా జరిగినట్లుగా చిత్రీకరించి.. తల్లిని చంపడానికి జగన్ ప్రయత్నించాడని టీడీపీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో వికృత ప్రచారం చేశారు. ఇది ఫేక్ న్యూస్ కాదా..? అది తప్పుడు కథనం అని మా అమ్మ విజయమ్మ లేఖ విడుదల చేస్తే.. ఆ లేఖను కూడా ఫేక్ లెటర్‌గా చిత్రీకరిస్తూ టీడీపీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో దుష్ఫ్రచారం చేయడం వాస్తవం కాదా? చివరకు మా అమ్మ వీడియో ద్వారా టీడీపీ దుష్ఫ్రచారాన్ని ఖండించారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీడీపీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయడం లేదు? లోకేష్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదు? కడప ఎస్పీకి నా భార్య ఫోన్ చేసిందని ఆంధ్రజ్యోతిలో వార్త రాశారు. అది తప్పుడు వార్త కాదా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను ఎందుకు లోపల వేయరు? ‘డీజీపీ..! పోలీసు సోదరులారా..! మీ అందరికీ ఒకటే చెబుతున్నా. సీఎం చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం మీ వృత్తిని మీరే కించపరిచినట్లు అవుతుంది. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదు.. జమిలి ఎన్నికలు వచ్చినా.. నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది మేమే.. తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా నిర్భందించిన పోలీసు అధికారులు ఎక్కడున్నా వదలిపెట్టం.⇒ మహానంది మండలం యు.బొల్లవరం గ్రామానికి చెందిన తిరుమల కృష్ణను సీపీఎస్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్ట్ చేసి కర్నూలు తీసుకెళ్లారు. కృష్ణ దివ్యాంగుడని తెలిసీ అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టారు. ⇒ అన్నమయ్య జిల్లా రాయచోటిలో కె.హనుమంతరెడ్డిని రెండ్రోజుల క్రితం పోలీసులు తీసుకెళ్లారు. అరెస్ట్ చూపలేదు. ఎక్కడకు తీసుకెళ్లారో ఇప్పటివరకూ తెలియదు. ⇒ తెలంగాణలో ఉన్న వారినీ తీసుకొచ్చి వేధిస్తున్నారు. నల్గొండకు చెందిన అశోక్‌రెడ్డిని విజయవాడ సైబర్ పోలీసులు తీసుకొచ్చారు. కుటుంబీకులకూ సమాచారం ఇవ్వలేదు. రాజశేఖరరెడ్డి అనే వ్యకినీ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. ఈ ఇద్దరినీ వేధిస్తున్నారు. ⇒ ఇప్పటివరకు 101 మందిపై కేసులు పెట్టారు. చట్టప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత వాటిని ఆన్లైన్లో ఉంచాలి. కానీ ఆన్లైన్లో పెట్టడం లేదు. కోర్టులకు అప్లోడ్ చేయడం లేదు. దేశంలో ఇంత అరాచక వ్యవస్థ ఎక్కడైనా ఉందా?వారం రోజుల్లో.. 101 మంది అరెస్టువారం రోజులుగా దాదాపు 101 మంది సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. పోలీసులు ఇష్టం వచ్చినట్లు ఇంటికొచ్చి అరెస్ట్‌లు చేయకూడదు. ముందు 41 ఏ నోటీసు ఇచ్చి విచారణ చేయాలి. ఒకవేళ నిజంగా అరెస్ట్ చేయాల్సి వస్తే వారంట్ జారీ చేయాలి. తర్వాత మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి. ఇది సుప్రీంకోర్టు తీర్పు సారాంశం (అమేష్కుమార్ వర్సస్ బిహార్ కేసులో 2014 జూలై 2న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును చదివి వినిపించారు). కానీ మన రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతోంది? తప్పుడు కేసులు.. అక్రమ నిర్బంధాలు.. అరెస్ట్ చేసే అధికారం లేదని పోలీసులకు తెలుసు. 41 ఏ నోటీసు మాత్రమే ఇవ్వాలని తెలుసు. ఒక వేళ అరెస్ట్ చేయాల్సి వస్తే వారంట్ జారీ చేయాలి. మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి. ఇదీ పద్ధతి. కానీ.. ఎవరైనా ప్రభుత్వంపై గొంతు విప్పితే చాలు.. రాత్రికి రాత్రే.. తెల్లవారుఝామున వారి ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు. గంటల తరబడి.. కొన్ని సమయాల్లో రెండు మూడు రోజులు పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు. కొట్టడం, తిట్టడం, అవమానించడం చేస్తున్నారు. ఒక వ్యక్తిపై ఏకకాలంలో పలు స్టేషన్లలో టీడీపీ సానుభూతిపరులతో కేసులు పెట్టిస్తూ అరెస్టు చేస్తున్నారు. రెండు మూడు స్టేషన్లు తిప్పుతున్నారు. పోలీసుల తీరుపై స్థానికులు తిరగబడితే మరో కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఎవరైనా అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తీసుకొస్తున్నారు. కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తీసుకొచ్చే అధికారం ఏ పోలీస్‌కూ లేదు. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం మాట్లాడిన మాటలు గమనిస్తే డీజీపీపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు స్పష్టమవుతోంది. దాంతో డీజీపీ దగ్గరుండి కేసులు పెట్టించి.. అక్రమ నిర్భంధాలు చేయిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న స్వరాలపై కేసులు పెట్టించే స్థాయికి, తట్టుకోలేని స్థాయికి వెళ్లిపోయారు.ప్రశ్నిస్తే.. కేసులు, అక్రమ నిర్బంధాలా?⇒ విజయవాడలో వరదల నియంత్రణ, సహాయ చర్యల్లో ముఖ్యమంత్రి సహా యంత్రాంగం దారుణ వైఫల్యం చెందడంపై ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలు. వరద సహాయం పేరుతో కోట్లాది రూపాయలు మింగేసే చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు. 1.50 కోట్ల మందికి ఆహారం అందించడానికి రూ.534 కోట్లు..! కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, మొబైల్ జనరేటర్లపై రూ.23 కోట్లు కొట్టేశారు అని అందరూ మాట్లాడారు. నీళ్లు ఉన్నప్పుడు అక్కడకు ఎలా వెళ్లారు? కరెంట్ ఇచ్చారో లేదో అందరికీ తెలుసు. కానీ.. ఈ అక్రమాలపై ప్రశ్నిస్తే చాలు అక్రమ నిర్భందాలు. మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే.. వాటిపై ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలు. ఎమ్మెల్యేలు, వారి మనుషులు రౌడీల్లా దౌర్జన్యం చేస్తుండటంపై ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలు. ⇒ ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు.. ఇప్పుడు ఇసుక ధరలు చూస్తే రెట్టింపు అయ్యాయి. ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయని ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలు. రేట్లు తగ్గిస్తామని చెప్పిన మద్యంపై ఒక్కపైసా కూడా తగ్గించకుండా, పైపెచ్చు సిండికేట్లుగా మారి ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముతుండటంపై ప్రశ్నిస్తుంటే కేసులు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులను ప్రైవేటు వారికి ఎందుకు అప్పగించారయ్యా? అని ప్రశ్నిస్తే కేసులు. అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు తగ్గిస్తామని చెప్పారు కదా..!కానీ ఐదు నెలలు కాకమునుపే ప్రజలపై దాదాపు రూ.6 వేల కోట్ల భారం మోపారు. మరో రూ.11 వేల కోట్లు అదనంగా బాదేందుకు సిద్ధం కావడంపై ప్రశ్నిస్తే.. మళ్లీ అక్రమ నిర్బంధాలు.⇒ మీరు వస్తే సంపద సృష్టిస్తామన్నారు కదా..? ప్రజల కోసం జగన్ సృష్టించిన సంపదను ఎందుకు అమ్మేస్తున్నారు? మీ స్కామ్‌ల కోసం కొత్తగా కడుతున్న మెడికల్ కళాశాలలను అమ్మేస్తున్నారు. మూడు ప్రైవేటు పోర్టులు..అందులో ఒకటి 80 శాతం, రెండు 50 శాతం పూర్తయ్యాయి.. వాటి నిర్మాణానికి నిధుల కొరత కూడా లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. ఇవన్నీ వస్తే కదా ప్రభుత్వాదాయాలు పెరుగుతాయి. ప్రభుత్వ సంపద పెరుగుతుంది. ఇటువంటివి ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. అక్రమ నిర్భందాలు.ఇవేంటి.. తప్పుడు కేసులు కాదా?⇒ (సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు నమోదు చేసిన కొన్ని ఎఫ్ఐఆర్లను వైఎస్ జగన్ చదివి వినిపించారు..) ⇒ ‘విద్య వద్దు.. మద్యం ముద్దు’ సోషల్ మీడియా కార్యకర్త రాసిన మాటలు నిజమే కదా..? అమ్మ ఒడి ఇవ్వడం లేదు. విద్యాదీవెన ఇవ్వడం లేదు. వసతి దీవెన ఇవ్వడం లేదు.. నాన్నకు ఫుల్..అమ్మకు నిల్..! అని అన్నాడు. ఏం తప్పు అన్నాడు? ఈ మాట అన్నందుకు అక్రమంగా నిర్భందిస్తారా? చంద్రబాబు అభిమానుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు పెట్టారు. ⇒ ఇది మరో ఎఫ్ఐఆర్.. పోస్ట్‌లను ఫార్వర్డ్ చేసినా కేసులే! జనసేన నాయకులతో కాళ్లు పట్టించుకుంటున్న టీడీపీ నేతలు.. అనే వార్త అన్ని టీవీల్లో వచ్చింది. ఆ పోస్టును ఫార్వర్డ్ చేసిన కార్యకర్తపై కేసు పెట్టారు.⇒ ఇది మరో కేసు.. చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం విజయవాడ వరదల్లో రూ.534 కోట్లు ప్రజాధనం లూటీ చేశారు! 23 కోట్లు అగ్గిపెట్టెలు, క్యాండిల్స్ కోసమే లూటీ చేశారు..! ఇవి అందరూ అన్న మాటలే. వీటిని సోషల్ మీడియాలో పెట్టినందుకు కేసులు పెట్టారు.⇒ ఇంకో కేసు... తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చేసిన అసత్య ఆరోపణలు దేవుడికి నచ్చడం లేదని ఓ సోషల్ మీడియా కార్యకర్త పోస్టు పెట్టారు.. అంతకన్నా ఏమీ అనలేదు. ఆ కార్యకర్తపై కూడా కేసు పెట్టారు.⇒ గాజువాకకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ బోడి వెంకటేష్‌ను దువ్వాడ పోలీసులు మధ్యాహ్నం 3.30 గంటలకు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తల్లిదండ్రులకు చెప్పలేదు. 41 ఏ నోటీసు ఇవ్వలేదు. ఇది సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన కాదా?⇒ తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త, రైతు ఆళ్ల జగదీష్‌రెడ్డి 2018లో పెట్టిన పోస్ట్‌కు సంబంధించి విజయవాడ క్రైమ్ సిటీ పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇంట్లో సభ్యులకు కూడా చెప్పకుండా తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు వెళ్లి అడిగితే మేం తీసుకెళ్లలేదు.. మాకు సంబంధం లేదని చెప్పారు. ఇంట్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తే పోలీసులే దగ్గరుండి తీసుకెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇది అక్రమ అరెస్టు కాదా?⇒ చిలకలూరిపేటకు చెందిన పెద్దింటి సుధారాణి ఎన్నికల తర్వాత అరాచకాలు భరించలేక కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వెళ్లిపోయారు. ఐదు నెలల తర్వాత ఆమెను కుటుంబ సభ్యులతో సహా హైదరాబాద్ నుంచి బలవంతంగా తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతున్నారు. పిల్లలను తల్లికి దూరం చేశారు. ఎక్కడకు తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదు. నిన్న చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో ఉన్న ఆమెను ఒంగోలు పోలీస్‌లు అరెస్ట్ చేశారు. ఇది అక్రమ నిర్భంధం కాదా?⇒ తాడేపల్లిలో అయ్యప్పమాల ధరించిన నాని అనే సోషల్ యాక్టివిస్ట్‌ను మొదట వినుకొండ అని చెప్పి మార్కాపురం తరలించారు.⇒ నందిగామ నియోజకవర్గం పెండ్యాలలో వాట్సప్ గ్రూప్ అడ్మిన్‌ను అరెస్ట్ చేసి కొట్టారు. గ్రూపులో ఉన్న వాళ్లకు నోటీసులిచ్చారు. వీళ్లంతా ఒకే గ్రామానికి చెందినవారు. ⇒ గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన వెంకట్రామిరెడ్డి హైదరాబాద్‌లో ఉంటారు. మాచర్లలో తన బావ ఇంటికి రావడంతో ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు అక్కడకు వెళ్లారు. వెంక్రటామిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన బావను అరెస్ట్ చేశారు. వి«ధి నిర్వహణలో ఆటంకం కలిగించారని కేసు పెట్టారు.⇒ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంకు చెందిన సన్నీ అనే కార్యకర్తను తిరువూరు పోలీసులు ఉదయం తీసుకెళ్లి కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. 36 గంటల పాటు భోజనం కూడా లేకుండా చేశారు. గ్రామంలోని పెద్దలు వెళ్తే విడుదల చేస్తామని చెప్పి మళ్లీ గంపలగూడెం పోలీస్ స్టేషన్లోనే పెట్టారు.బాధితులకు తోడుగా న్యాయ పోరాటంప్రభుత్వం తరఫున అన్యాయంగా బాధలకు గురైన సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రత్యేకంగా న్యాయ సహాయం అందించేందుకు ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చాం. మీ తరఫున పోరాటం చేయడానికి వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉంది. సోషల్ మీడియా పరంగా మా మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ అండగా ఉండి కోర్టులో పోరాటం చేస్తారు. పూర్తిగా ప్రైవేటు కంప్లైంట్లు వేసే కార్యక్రమంలో తోడుగా ఉంటారు. వైఎస్సార్ సీపీ ‘వియ్ స్టాండ్ ఫర్ ట్రూత్’ నినాదంతో ఎక్స్‌లో యాస్ ట్యాగ్‌తో ముందుకెళ్తోంది. జె.సుదర్శన్ రెడ్డి (సీనియర్ న్యాయవాది) 9440284455కొమ్మూరి కనకారావు (మాజీ చైర్మన్, మాదిగ కార్పొరేషన్) 9963425526దొడ్డా అంజిరెడ్డి (రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్) 9912205535 -
గురి తప్పిన బాణం వెనుక..!
గురి తప్పిన బాణాల గురించి కాదు, గురి పెడుతున్న వేటగాడి గురించి మాట్లాడుకోవాలి. ఆ వేటగాడు అల్లుతున్న ఉచ్చుల గురించి ఆలోచించాలి. ఓట్ల కోసం నూకలు చల్లి ఆపై వల వేసి బంధించే అతడి మాయోపాయాలపై మేధోమథనం జరగాలి. హిరణ్యాక్షుడు పొందిన వరాల చందంగా వార్తా ప్రసార మాధ్యమాస్త్రాలను తన అమ్ములపొదిలో దాచిపెట్టుకున్న అతని వ్యూహ రహస్యాల గురించి మాట్లాడుకోవాలి. ఒక్కో బాణాన్ని మంత్రించి వదిలి పాఠకుల మస్తిష్కాలను స్వాధీనపరచుకోవా లని చూసే అతని తంత్రాంగం గురించి జనాన్ని అప్రమత్తం చేయాలి.రామాయణంలో కనిపించే కిష్కింధ రాజైన వాలికి ఒక విచిత్ర లక్షణం ఉన్నది. తన ఎదుటికి ఎంతటి బలవంతుడు వచ్చినా, అతని బలాన్ని తనలోకి లాగేసుకొనే శక్తి అతని సొంతం. వాలి మాదిరి బలశాలి కాదు మన అనుభవశాలి. కానీ అటువంటి లక్షణం ఒకటి ఈయనకూ ఉన్నది. తన రాజకీయ ప్రత్యర్థి ఏ విషయాల్లో బలవంతుడో గ్రహించి ఆ విషయాల్లోనే అతడు బలహీనుడని గోబెల్స్ ప్రచారం నిర్వహించడంలో మన కురువృద్ధుడు నిష్ణాతుడు. సత్య వాక్పాలన రాముడి బలం అను కుంటే, ఆ రాముడు అబద్ధాలాడతాడని ప్రచారం చేయడం, జనాన్ని నమ్మించడమే ఈయనకున్న నైపుణ్యం.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి బలం ఆయన వ్యక్తిత్వం. మాట తప్పకపోవడం, మడమ తిప్పక పోవడం ఆ వ్యక్తిత్వ లక్షణాలు. రాజకీయ అడుగులు వేయడం మొదలు పెట్టిన తొలి రోజుల్లోనే ఇది నిరూపితమైంది. పది హేనేళ్ల కింద ఆయన తండ్రి∙చనిపోయినప్పుడు ఆ షాక్ తట్టుకోలేక గుండె పగిలి చనిపోయినవారూ, ఆత్మహత్యలు చేసుకున్నవారూ వందల సంఖ్యలో ఉన్నారు. ఈ పరిణామం వల్ల ఉద్వేగానికి గురైన జగన్ ఆ అమరులందరినీ తన ఆత్మబంధువులుగా ప్రకటించారు. వారందరి ఇళ్లకు వెళ్లి దుఃఖంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తానన్న సంకల్పాన్ని ప్రకటించారు.ఈ సంకల్పానికి కాంగ్రెస్ అధిష్ఠానం అడ్డుతగిలిన సంగతి తెలుగు పాఠకులకు తెలిసిన విషయమే. తమ మాట వింటే భవిష్యత్తులో ముఖ్యమంత్రిని చేస్తామని, వినకపోతే కేసులు పెట్టి జైల్లో వేస్తామని రాయబారాలు నడిపినట్టు అనంతర కాలంలో కాంగ్రెస్ నేతలే బహిరంగంగా వెల్లడించారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వంలో సోనియా గాంధీ మకుటం లేని మహారాణి. ‘ఫోర్బ్స్’ మేగజైన్ 2010లో ప్రకటించిన ప్రపంచంలోని శక్తిమంతుల జాబితా టాప్ టెన్‌లో ఆమె పేరు ఉన్నది. 2008లో ‘టైమ్’ మేగజైన్ ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో కూడా ఆమె పేరున్నది. అటువంటి రోజుల్లో ఆమె మాటను ధిక్కరించే సాహసం ఎవరు చేస్తారు? కానీ జగన్ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం!ఈ బలమైన వ్యక్తిత్వాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రజలతో పాటు చంద్రబాబు, ఆయన పార్టీ, యెల్లో మీడియా యజమానులు కూడా గుర్తించారు. అందువల్లనే ఆయన వ్యక్తిత్వం మీద దాడిని కేంద్రీకరించారు. యెల్లో సిండికేట్‌కు కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు. జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టుకున్నారు. అప్పుడు తన ఆగర్భశత్రువైన కాంగ్రెస్‌తో జతకట్టి జగన్ వ్యక్తిత్వ హననంలో, జైలు పాలు చేయడంలో బాబు కూటమి ప్రధాన బాధ్యత తీసుకున్నది. ఎందువలన? జగన్ బలమైన వ్యక్తిత్వమే భవిష్యత్తులో తమకు ప్రత్యర్థి కాగల దన్న అంచనాతోనే!ఆ వ్యక్తిత్వం పలుమార్లు నిరూపణైంది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో చేరిన చంద్రబాబు అసాధ్యమైన హామీలను ఇచ్చారు. అప్పుడు రైతులకు రుణమాఫీ ఒక్కటి ప్రకటించాలని శ్రేయోభిలాషులు జగన్‌కు సలహా ఇచ్చారు. అమలు చేయలేని హామీని ఇవ్వడం కన్నా ప్రతిపక్షంలో కూర్చోవడానికే జగన్ సిద్ధ పడ్డారు. అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోని మడత పెట్టేయడం ఈ రోజుల్లో రివాజుగా మారింది. ఇటువంటి వాతా వరణంలో అధికారంలోకి వచ్చిన జగన్ ఈ ఆనవాయితీని మార్చారు. ఎన్నికల మేనిఫెస్టోకు పటం కట్టి ప్రభుత్వ కార్యాల యాల్లో పెట్టించారు. ఆ మేనిఫెస్టో అమలుపై ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేస్తూ వచ్చారు.అమలు చేసిన హామీల గురించి చెప్పడం కాదు, మళ్లీ గెలిస్తే అరచేతిలో వైకుంఠం పెడతాననే హామీలే ముఖ్యమని మళ్లీ సలహాలొచ్చాయి. జగన్ వాటికి చెవి ఒగ్గలేదు. కానీ చంద్రబాబు అటే మొగ్గారు. జనం ముందు బయోస్కోప్ పెట్టెను తెరిచి ‘కాశీ పట్నం చూడరబాబు చూడరబాబు’ అంటూ బొందితో కైలా సాన్ని హామీ ఇచ్చారు. దాంతోపాటు కూటమి సమీకృత కార ణాలు, ‘సాంకేతిక’ కారణాలు అనేకం పనిచేసి బాబు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు హామీలు అమలుచేయాలి. అది సాధ్య మయ్యే పని కాదు. ఒక పక్క జగన్ ప్రభుత్వం హామీలను అమలు చేసిన తీరు జనం మదిలో తాజా జ్ఞాపకంగానే ఉన్నది. ఈ జ్ఞాపకాన్ని మరిపించడం కూటమి పెద్దల తక్షణ కర్తవ్యం. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వారు నెలకో రకంగా ప్రయోగిస్తున్న డెవర్షన్ రాకెట్లు ఈ తక్షణ కర్తవ్యంలో భాగమే!ఆస్తి కోసం తల్లీ, చెల్లి మీద జగన్ కోర్టుకు వెళ్లారనే ప్రచారాన్ని గత రెండు మూడు రోజులుగా బాబు క్యాంప్ విస్తృతంగా చేపట్టింది. ఔను ఆయన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు వెళ్లారు. ఎందుకు వెళ్లారు? ఎవరి కారణంగా అలా వెళ్లక తప్పని అగత్యం ఏర్పడింది? ఈ అంశాల జోలికి మాత్రం యెల్లో మీడియా సహజంగానే వెళ్లదు. జగన్ వ్యక్తిత్వ హననం ఒక్కటే దాని ఎజెండా. ఆ ఎజెండా పరిమితు లకు లోబడే దాని ప్రాపగాండా కార్యక్రమం ఆధారపడి ఉంటుంది. జగన్, షర్మిలల చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి ఈ వివాదానికి సంబంధించిన అంశాలపై మీడియాతో మాట్లా డారు. ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో అన్నాచెల్లెళ్ల మధ్యన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. జగన్ తన సొంత ఆస్తిలోంచి కొంత భాగాన్ని చెల్లెలికి ఇచ్చేలా ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదు ర్చుకున్నారు. ఇవన్నీ బయటకు వచ్చాయి. జగన్ ఎన్సీఎల్టీకి వెళ్లిన డాక్యుమెంట్ టీడీపీ అధికార ట్విట్టర్ హ్యాండిల్‌పై ప్రత్య క్షమైంది. షర్మిల రాసిన బహిరంగ లేఖ విడుదలైంది. ఆమె మీడియాతో కూడా మాట్లాడారు.ఈ మొత్తం డాక్యుమెంట్లు, లేఖలు మీడియా సమావేశాల్లో లేవనెత్తిన అంశాలు విస్తృతంగా రెండు రాష్ట్రాల్లోనూ జనంలోకి వెళ్లాయి. ఈ అంశాలపై పెద్ద ఎత్తున చర్చోపచర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ పంచాయతీని పబ్లిక్‌లోకి తీసుకొచ్చిన సూత్రధారులు, పాత్రధారుల ఉద్దేశం వేరు. జగన్ వ్యక్తిగత ప్రతిష్ఠపై బురద జల్లడం, ఆయన న్యాయ పోరాటాన్ని బలహీన పరచడం, వీలైతే ఆయన బెయిల్‌ను రద్దు చేయించి మళ్లీ జైలుకు పంపించడం! ఈ పరిణామాన్ని నిశితంగా గమనించిన వారికి కుట్రదారుల ఉద్దేశం సులభంగానే అర్థమవుతుంది. జగన్ మోహన్‌రెడ్డి క్రియాశీలకంగా రాజకీయాల్లో లేకపోతే లాభం పొందేదెవరు? ఆ లాభంలో ఎంతోకొంత తమ పార్టీకి కూడా దక్కకపోతుందా అని ఒంటె పెదవులకు నక్క ఆశలు పెట్టు కున్నట్టు పొంచి ఉన్నది ఎవరు?డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టకముందే, ఆ మాటకొస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడి పాత్రను కూడా చేపట్టడానికి ముందే జగన్ మోహన్‌రెడ్డి విజయ వంతమైన వ్యాపారవేత్త. ఆయన సండూర్ పవర్‌ను 1998లోనే ప్రారంభించారు. విజయవంతమైన వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను విస్తరించుకుంటూ వెళ్లడం సహజం. వారి ట్రాక్ రికార్డును బట్టి పెట్టుబడులు రావడం కూడా సహజమే. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. డాక్టర్ వైఎస్సార్ ప్రతిపక్ష నేతగా ఉన్న కాలంలో గానీ, ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గానీ జగన్ మోహన్‌రెడ్డి బెంగళూరు కేంద్రంగానే వ్యాపారాలు చేసు కున్నారు తప్ప హైదరాబాద్‌లో లేరు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన రాజకీయాల్లో క్రియాశీల పాత్రను పోషించ వలసిన అనివార్యత ఏర్పడినప్పుడే ఆయన మకాం హైదరా బాద్‌కు మారింది. జగన్ మోహన్‌రెడ్డి స్థాపించిన భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ సంస్థల్లో ఇతరులు పెట్టుబడులు పెట్టడం వెనుక క్విడ్ ప్రోకో దాగున్నదనే ఆరోపణలు తెచ్చి కాంగ్రెస్–టీడీపీ కుమ్మక్కయి ఆయనపై అక్రమ కేసులు పెట్టి పదహారు నెలలు జైలుకు పంపాయి. ఆ సంస్థలు గడిచిన పదహారు పదిహేడేళ్లుగా విజయవంతంగా నడుస్తూ మదుపరులకు లాభాలు తెచ్చి పెట్టడం క్విడ్ ప్రోకో ఆరోపణల్లోని బూటకత్వాన్ని ఎండగట్టింది. మార్కెట్‌ను విస్తృతంగా అధ్యయనం చేసి సొంత ప్రాజెక్టుతో, సొంత పెట్టుబడులతో పాటు ఇతర ఇన్వెస్టర్లకు తన ప్రాజెక్టుపై నమ్మకం కలిగించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జగన్ తన వ్యాపారాలను విస్తరించుకున్నారు. ఈ ప్రయాణంలో రాజకీ యంగా మాట కోసం నిలబడవలసివచ్చిన కారణంగా ఆయన దారుణమైన వ్యక్తిత్వ హననానికి గురి కావలసి వచ్చింది. ఊహించని నిందలు మోయవలసి వచ్చింది. వ్యక్తిత్వ హననం అనేది హత్యతో సమానమంటారు. ఆ రకంగా చూస్తే కొన్ని వందల సార్లు ఆయన హత్యకు గురి కావలసి వచ్చింది.ఇప్పుడు తల్లీ, చెల్లిపై కోర్టుకెక్కారనే నిందను మోపారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చిన తర్వాత జగన్ మోహన్‌రెడ్డి వ్యక్తిగత ఔన్నత్యం ప్రజలకు తేటతెల్లమైంది. కుట్రదారుల పని కుడితిలో పడ్డట్టయింది. వారసత్వంగా సంక్ర మించిన ఆస్తులతో పాటు తాను సంపాదించిన ఆస్తులను కూడా జగన్, షర్మిల మధ్య డాక్టర్ వైఎస్సార్ పంపకం చేశారు. భారతి సిమెంట్స్ గానీ, జగతి పబ్లికేషన్స్ గానీ జగన్ మోహన్‌రెడ్డి స్వార్జితం కనుక పంపకాల్లో అవి రాలేదు. పైగా ఈ రెండు కంపెనీల్లోనూ జగన్, ఆయన సతీమణి భారతిలకు తప్ప షర్మిలకు వాటా కూడా లేదు. సిమెంట్ పరిశ్రమకు తన భార్య పేరునూ, పబ్లికేషన్స్‌కు భార్యాభర్తలిద్దరి పేర్లూ కలిసేలా ‘జగతి’ అనే పేరును జగన్ పెట్టుకున్నారు. అప్పుడు డాక్టర్ వైఎస్సార్ జీవించే ఉన్నారు. ఒక సందర్భంలో ‘ఈనాడు’ రాసిన అవాకులు చెవాకులకు జవాబునిస్తూ తన భార్య మీద ప్రేమతో తన సిమెంట్ పరిశ్రమకు ఆమె పేరును పెట్టుకున్నానని కూడా జగన్ రాశారు. అప్పుడు వైఎస్సార్ జీవించే ఉన్నారు. ఈ కంపెనీలు వారి కుటుంబ వారసత్వ సంపద కాదనీ, జగన్ స్వార్జితాలే అని చెప్పడానికి ఇటువంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. తండ్రి చనిపోయిన తర్వాత చాలాకాలం పాటు అన్న తనను బాగానే చూసుకున్నారని షర్మిల కూడా తన బహిరంగ లేఖలో అంగీకరించారు. షర్మిల తనకు చెల్లెలు మాత్రమే కాదు, పెద్ద కూతురు వంటిదని జగన్ ఒక సందర్భంలో ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే తండ్రి మనసుతో ఆలోచించి తన స్వార్జితమైన ఆస్తుల్లో వాటాలు చెల్లెలికి ఇవ్వాలని సంకల్పించారు. అందుకోసం ఒక అవగాహనా పత్రాన్ని (ఎమ్ఓయు) కూడా రాసిచ్చారు. ఇదెప్పుడు జరిగింది... తండ్రి చనిపోయిన పది సంవత్సరాల తర్వాత, షర్మిలకు వివాహం జరిగిన 20 సంవత్సరాల తర్వాత! ఇంతకాలం తర్వాత సొంత ఆస్తిలో చెల్లెలికి భాగం కల్పించిన అన్నలెందరుంటారు? ఈ మధ్య కాలంలో 200 కోట్ల సొంత ఆదాయాన్ని కూడా సోదరికి జగన్ అందజేశారు. ఈ వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత జనం దృష్టిలో జగన్ ఔన్నత్యం మరింత పెరిగింది.క్విడ్ ప్రోకో కేసుల కారణంగా ఆస్తులు ఈడీ జప్తులో ఉన్నందువల్ల ఎమ్ఓయూ (అన్‌రిజిస్టర్డ్)ను రాసుకోవలసి వచ్చింది. లేకపోతే ఈ పంపకాల కార్యక్రమం ఇప్పటికే పూర్తయి ఉండేది. కేసుల వ్యవహారం పూర్తిగా పరిష్కారమయిన పిదప ఆస్తుల బదలాయింపు జరిగేలా ఎమ్ఓయూ రాసుకున్నారు. ఈ పత్రంలోని ప్రతి పేజీ మీద జగన్‌తో పాటు షర్మిల కూడా సంతకం చేశారు. పత్రం మొదటి పేజీలోని రెండో అంశంలోనే పంపకానికి ప్రతిపాదిస్తున్న ఆస్తుల సొంతదారు జగన్ మోహన్‌రెడ్డి (the subject properties / owned directly and indirectly through companies by YS Jagan) అనే మాట స్పష్టంగా ఉన్నది. ఈ వాక్యం కింద షర్మిల సంతకం కూడా ఉన్నది.రెండో పేజీలో ఇంకో కీలక అంశమున్నది. తన చెల్లెలి మీద వైఎస్ జగన్‌కున్న ప్రేమాభిమానాల కారణంగా (In consideration of his love and affection for his sister, YSJ here by agrees....) ప్రతిపాదిత ఆస్తులను బదిలీ చేస్తున్నట్టున్నది. అంతేతప్ప హక్కుగా ఆమెకు బదిలీ చేస్తున్నట్టు లేదు. ఈ పేజీ మీద కూడా షర్మిల సంతకం ఉన్నది. ఈ ఒప్పందం రాసుకున్నది 2019లో. అప్పుడు ఈ ప్రతిపాదిత ఆస్తులు అన్న సొంత ఆస్తులని అంగీకరించి సంతకం కూడా చేశారు కదా!భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్‌లో వాటాలతో పాటు సరస్వతి పవర్ పూర్తిగా షర్మిలకే బదిలీ అయ్యేటట్లుగా రాసుకుని తాత్కాలికంగా తల్లిగారి పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసి కేసుల పరిష్కారం తర్వాత అది షర్మిలకు బదిలీ అయ్యేలా ఏర్పాటు చేశారు. కానీ ఆ గిఫ్ట్ డీడ్‌ను తల్లి పేరు మీద షేర్లుగా షర్మిల మార్పించారు. ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు జగన్ దగ్గర ఉన్నాయని తెలిసీ అవి ఎక్కడో పోయాయని చెప్పి, బదిలీ పత్రాలపై జగన్ సంతకం చేయకుండానే షేర్లు మార్పించారు. ఈడీ జప్తులో ఉన్న ఆస్తుల బదిలీ వల్ల కేసుల్లో న్యాయపరమైన చిక్కులను జగన్ ఎదుర్కోవలసి వస్తుందని తెలిసీ షర్మిల ఈ చర్యకు పాల్పడ్డారు. దాంతో ఈ చట్టవిరుద్ధమైన వ్యవహారాన్ని ఆపాలని జగన్ ఆమెకు లేఖ రాశారు. ఆమె ససేమిరా అనడంతో న్యాయ నిపుణుల సలహా మేరకు ఆయన ఎన్సీఎల్టీ తలుపు తట్టి ఈ బదిలీని ఆపేయాలని కోరవలసి వచ్చింది. ఇదే తల్లినీ, చెల్లినీ జగన్ కోర్టుకీడ్చారని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం లోని అసలు గుట్టు. ఈ రకమైన ప్రచారంతో తన పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకోవాలనీ, జగన్ ప్రతిష్ఠను దెబ్బ తీయాలనీ యెల్లో సిండికేట్ తాపత్రయపడుతున్నది. ఈ దుష్ట పన్నాగానికి షర్మిల పూర్తి స్థాయిలో సహకరిస్తున్నదని శనివారం నాటి ఆమె మీడియా సమావేశం బట్టబయలు చేసింది. జగన్ మోహన్‌రెడ్డి బెయిల్ రద్దవుతుంది కాబట్టి అమ్మను కోర్టు కీడుస్తారా అని ప్రశ్నించడం ఆశ్చర్యపరిచింది. జగన్ ముందు గానే ఎన్సీఎల్టీకి లేఖ రాయడంతో బెయిల్ రద్దయ్యే అవకాశం పోయిందని ఆమె ఆశాభంగం చెందారా అనే అనుమానం వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది. చంద్రబాబుతో ఆమె పూర్తిస్థాయిలో కుమ్మక్కు అయ్యారనేందుకు ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావా లని వారు ప్రశ్నిస్తున్నారు. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
తప్పంతా సర్కారుదే: వైఎస్ జగన్
రాష్ట్రంలో జరిగిన ప్రతి ఘటనకు సంబంధించి ప్రభుత్వం తరఫున చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ప్రతి బాధితుడి వద్దకు మంత్రిని పంపించి రూ.10 లక్షలు డబ్బు ఇచ్చి, ఇటువంటి తప్పు ఇంకోసారి జరగనివ్వబోమని లెంపలేసుకోవాలి. ఇలా చేయకపోతే చంద్రబాబు చరిత్ర హీనుడవుతాడు. అత్యాచారం.. ఆపై హత్యకు గురైన చీరాల నియోజకవర్గంలో సుచరిత, నందికొట్కూరు నియోజకవర్గంలో వాసంతి, పొన్నూరు నియోజకవర్గంలో శైలజ, సూళ్లూరుపేట నియోజకవర్గంలో అనికాకుమారి, పాలకొల్లులో కలిశెట్టి అనసూయ, బద్వేల్లో దస్తగిరమ్మ, తెనాలి నియోజకవర్గంలో సహానా కుటుంబాలకు చంద్రబాబు ఇచ్చినా ఇవ్వకపోయినా.. వైఎస్సార్సీపీ రూ.10 లక్షలు చొప్పున ఇచ్చి తోడుగా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న మేమే రూ.10 లక్షలు ఇస్తున్నప్పుడు... ప్రభుత్వంలో ఉన్న మీరు బాధ్యత తీసుకుని ఏమేం చేయగలుగుతారో చెప్పండి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు సిగ్గు తెచ్చుకోవాలి. ఈ ప్రభుత్వం ఏం చేసినా, చేయకపోయినా బాధ పడాల్సిన అవసరం లేదు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. అప్పుడు వీళ్లందరినీ ఏరి ఏరి జైళ్లలో పెట్టే కార్యక్రమం చేస్తాం. – వైఎస్ జగన్నవీన్తో పాటు కొంత మంది కలిసి మృగాలుగా ప్రవర్తించారు. ఆ చెల్లి (సహానా) శరీరం నిండా కందిపోయిన మచ్చలు కనిపిస్తున్నాయి. లైంగికంగా వేధించడమే కాకుండా ప్రైవేట్ పార్టుల్లో కూడా దెబ్బలు ఉన్నాయి. ఆమె ప్రైవేటు పార్టులలో బ్లీడింగ్ కనిపిస్తున్నప్పుడు ఆ దిశగా ఎందుకు చర్యలు లేవు? ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటి? మేము తోడుగా ఉన్నామని చెప్పాల్సిన ధర్మం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందనే భరోసా ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? కళ్లెదుట వాస్తవాలు కనిపిస్తున్నప్పుడు ఎందుకు ఈ విషయాలన్నీ దాచి పెట్టే కార్యక్రమం చేస్తున్నారు?తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు ఈ పని చేసినందుకు సిగ్గు పడాల్సింది పోయి.. నిస్సిగ్గుగా ఆ వ్యక్తిని కాపాడుకోవడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇంతకన్నా హేయమైన పని ఏమైనా ఉంటుందా? మీరు ఏ తప్పు చేసినా మద్దతుగా మేముంటామని సాక్షాత్తు చంద్రబాబునాయుడు దగ్గరుండి ప్రోత్సహిస్తుండటం వల్లే రాష్ట్రంలో అఘాయిత్యాలు మితిమీరిపోయాయి. రెడ్‌బుక్ రాజ్యాంగ పాలనలో రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలు ధైర్యంగా బయటకు వచ్చి తిరగలేని పరిస్థితి నెలకొంది. – వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు బతికే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 77 మందిపై అత్యాచారాలు జరిగాయి. వీరిలో ఏడుగురు హత్యకు గురి కాగా, ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. మహిళల రక్షణను గాలి కొదిలేసింది. మనవాడైతే పర్వాలేదు.. ఏం చేసినా చెల్లుబాటవుతుందనే ధోరణి వల్ల తెలుగుదేశం పార్టీ నేతల అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికైనా మేలుకొని జరిగిన ప్రతి ఘటనకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. దారుణంగా లైంగిక వేధింపులకు గురై, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సహానా కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. ఆస్పత్రిలోని మార్చురీకి వెళ్లి సహానా మృతదేహానికి నివాళి అర్పించారు. ఘటన జరిగిన తీరు, వైద్యం.. తదితర వివరాలను ఆమె కుటుంబ సభ్యులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సహానా కుటుంబ సభ్యులకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్సీపీ నుంచి ‘హత్యా’చార బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..వాస్తవాలను ఎందుకు దాస్తున్నారు?⇒ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారాయో చెప్పేందుకు ఇక్కడ నా దళిత చెల్లి పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. చేసిన వాడు మనవాడైతే చాలు.. వాడు ఏం చేసినా పర్వాలేదని కవర్ చేయడానికి, దొంగ కేసులు పెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉంది. నవీన్ అనే వ్యక్తి చంద్రబాబుతో కలిసి దిగిన ఫొటోలు ఉన్నాయి. స్థానిక ఎంపీతో చాలా సన్నిహితంగా ఉన్న పరిస్థితి. ఫొటోలూ కనిపిస్తున్నాయి.⇒ ఇలాంటి వ్యక్తి సహానా పని చేస్తున్న ప్రదేశానికి వచ్చి, ఆమెను కారులో ఎక్కించుకుని వెళ్లాడు. అతనితోపాటు కొంతమందితో కలిసి మృగాలుగా ప్రవర్తించారు. ఆ చెల్లి శరీరం నిండా కందిపోయిన మచ్చలు కనిపిస్తున్నాయి. శారీరకంగా వేధించడమే కాకుండా ప్రైవేట్ పార్టుల్లో కూడా దెబ్బలు ఉన్నాయి. లైంగికంగా కూడా వేధించినట్లు కనపడుతోంది. ఆమె ప్రైవేటు పార్టులలో బ్లీడింగ్ కనిపిస్తున్నప్పుడు ఆ దిశగా ఎందుకు చర్యలు లేవు? ⇒ దాడి తర్వాత జీజీహెచ్‌లో పడేసి.. ఆమె కుటుంబ సభ్యులు వచ్చే సరికి జారుకున్నాడు. అప్పుడు అక్కడ నవీన్‌తో మరో ఇద్దరు ఉన్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎప్పుడైనా ఇలాంటి ఘటన జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటి? మేము తోడుగా ఉన్నామని చెప్పాల్సిన ధర్మం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? తప్పు చేసిన వాడు ఎవరైనా, ఎలాంటి వాడైనా చట్టానికి అతీతుడు కాదు. కచ్చితంగా శిక్ష పడుతుందనే భరోసా ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ⇒ ఎవరైనా కూడా ప్రభుత్వం నుంచి వచ్చి తప్పు జరిగిందమ్మా.. క్షమించమని కోరుతున్నాం.. అని ఎందుకు అడుగలేకపోతున్నారు? అన్ని రకాలుగా ఆదుకుంటూ మంచి పరిహారం ఇచ్చి ఎందుకు తోడుగా నిలబడలేకపోతున్నారు? నా పక్కనే ఆ పాప తల్లి ఉంది. వాళ్ల చెల్లి ఉంది. వీళ్లు చెబుతున్నా, ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఎందుకు వచ్చింది?⇒ నేను వస్తున్నానని తెలిశాక ఆలపాటి రాజా వచ్చాడట. అంతకు ముందు ఎవరూ రాలేదు. తెనాలి ఎమ్మెల్యే, మంత్రి మనోహర్ కనీసం చూడడానికి రాలేదు. హోం మంత్రిగానీ, ఇంకొకరు గానీ, కనీసం స్పందించిన పరిస్థితులు లేవు. ఆ ఫొటోల్లో నిందితుడు నవీన్‌కు సాక్షాత్తు చంద్రబాబు కండువా కప్పుతా ఉన్నాడు. గుంటూరు ఎంపీకి అత్యంత ఆప్తుడు. వెనకేసుకు తిరిగారు. ఇలాంటి వ్యక్తిని ప్రభుత్వం వెనుకేసుకు వస్తోంది. జరిగిన తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. తప్పుడు ప్రచారం చేయాలని చూస్తోంది. చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఇలా..⇒ చంద్రబాబు నిందితులను వెనకేసుకొస్తుండటం వల్లే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ప్రతి చోటా జరుగుతున్నాయి. బద్వేల్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాక పెట్రోలు పోసి నిప్పంటించారు. ⇒ శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలను అతిదారుణంగా బర్త్ డే పార్టీ అని తీసుకెళ్లి కూల్ డ్రింక్స్‌లో మందు కలిపి తాగించి అత్యాచారం చేశారు. చేసింది శ్రీకాకుళం జిల్లా పలాసాలో టీడీపీ నేతల పిల్లలు. ఏం చేసినా మమ్మల్ని తాకలేరన్న ధీమాతో ఇద్దరు ఆడపిల్లల్ని బర్త్ డే పార్టీ అని చెప్పి తీసుకెళ్లి మందు కలిపి అత్యాచారం చేసిన ఘటన. జరిగిన దారుణాన్ని ఒప్పుకొని క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రభుత్వం ఏం చేస్తోంది? అక్కడ కూడా పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రులు రంగంలోకి దిగి దాన్ని మాఫీ చేయాలని చూస్తున్నారు.⇒ పిఠాపురంలో తెలుగుదేశం నాయకురాలి భర్త 16 ఏళ్ల యువతికి మత్తు మందు ఇచ్చి, ఆటోలో ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడ చెత్త కాగితాలు ఏరుకునేందుకు వచ్చిన వ్యక్తి ఆ బాలిక ప్రాణాలు కాపాడారు. లోకేశ్‌తో, అచ్చెన్నాయుడుతో ఈ పెద్ద మనిషి ఫొటోలు అందరూ చూశారు. ఈ ఘటన జరిగింది డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం. కనీసం ఆయన ఈ పాప ఇంటికి పోయారా? ఆ కుటుంబాన్ని పరామర్శించారా? అని అడుగుతున్నా. ⇒ హిందూపురంలో దసరా పండుగ రోజు అత్తాకోళ్లలపై గ్యాంగ్‌రేప్ చేస్తే, మూడు రోజులైనా అరెస్టు చేయాలనే ఆలోచన రాలేదు. అక్కడి ఎమ్మెల్యే బాలకృష్ణ.. ముఖ్యమంత్రికి బావమరిది. వియ్యంకుడు కనీసం చూడడానికి కూడా పోలేదు. ⇒ అనకాపల్లి జిల్లా రాంబొట్ల మండలం కుప్పగంజిపాలెంలో 9వ తరగతి చదువుతున్న బాలికను టీడీపీ నాయకుడు సురేష్ నరికి చంపేశాడు. అంతకు ముందు తనను వేధిస్తున్నాడని ఆ అమ్మాయి కేసు పెడితే, అరెస్టు అయి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. మళ్లీ బెదిరించడం మొదలు పెట్టాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. రెడ్‌బుక్ పాలనలో నిమగ్నమైనవారు ఈ దారుణాన్ని అరికట్టలేకపోయారు. చివరికి సురేష్ అనే ప్రేమోన్మాది ఆ పాపను దారుణంగా చంపేశాడు.ఏ తప్పు చేసినా సర్కారు మద్దతు⇒ రాష్ట్రంలో ఇంతటి దారుణ పరిస్థితులు కనిపిస్తుంటే ఈ ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటోందా? ఈ రెడ్‌బుక్ పాలనలో టీడీపీకి చెందిన వారు ఏ తప్పు చేసినా, మీరు తప్పు చేయండి.. మేం వెనకేసుకు వస్తాం.. మీకు ఏమీ కాదు.. మేము సపోర్టుగా ఉంటామని సాక్షాత్తు చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. ⇒ పోలీసులు న్యాయంగా దర్యాప్తు చేస్తే, అన్ని వాస్తవాలు బయటకొస్తాయి. ఈ తల్లి (సహానా అమ్మ) 14 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్. నేను పేదలు, దళితులకు తోడుగా ఉంటాను. పేదలు, దళితులంతా మా వారేనని ధైర్యంగా చెబుతాను. పేదలకు తోడుగా ఉన్నామని ప్రభుత్వం చెప్పాలి. కానీ, ఈ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. పైగా మా పార్టీ వారిని నిందించడం సరైనదేనా? ఆ తల్లికి తోడుగా నిలబడినందుకు మాపై నిందలు వేయడం సబబేనా? ⇒ ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, వరదు కళ్యాణి, మురుగుడు హనుమంతరావు, చంద్రగిరి ఏసురత్నం, కల్పలతారెడ్డి, మాజీ మంత్రులు విడదల రజిని, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు అన్నాబత్తుని శివకుమార్, కోన రఘుపతి, పార్టీ నేతలు నూరిఫాతిమా, అంబటి మురళీకృష్ణ, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు పాల్గొన్నారు. -
బలంగా ఎదుగుదాం.. పార్టీని పటిష్టంగా నిర్మిద్దాం: వైఎస్ జగన్
మనం ఇంట్లో కూర్చుంటే.. ఏమీ జరగదు. మనం చొరవ తీసుకుని అన్ని అంశాలపై స్పందించాలి. గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలపై స్పందించాలి. అన్యాయాలపై స్పందించాలి. బాధితులకు అండగా నిలవాలి. మనవైపు నుంచి స్పందన లేకపోతే ఆ అంశం మరుగున పడుతుంది. ప్రజలకు న్యాయం జరగదు. – వైఎస్ జగన్ఇసుక ధర రెట్టింపు.. మద్యం టెండర్లలో దారుణాలు.. యథేచ్ఛగా పేకాట క్లబ్లుఈ సోషల్ మీడియా కాలంలో వాళ్ల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా మనం సిద్ధం కావాలిఎప్పటికప్పుడు నివేదికలతో కష్టపడి పని చేసే వారికి గుర్తింపు, ప్రమోషన్లు సాక్షి, అమరావతి: గ్రామ, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత వ్యవస్థీకృతంగా నిర్మించడం ద్వారా దేశంలోనే బలమైన పార్టీగా నిలుపుదామని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. మన పార్టీ ఏర్పాటు చేసుకుని దాదాపు 15 ఏళ్లు అవుతోందని, ఈ సమయంలో వివిధ రకాల ఎన్నికలు చూశామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నామని.. అధికారంలోనూ ఉన్నామని.. స్థానిక సంస్థలతో పాటు చాలా ఎన్నికల్లో పాల్గొన్నామని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామని, గ్రామ స్థాయి నుంచి ప్రతి అడుగులోనూ పార్టీ యుద్ధం చేస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలను ఇస్తుందని, అప్పుడే మనం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు శక్తివంతంగా ఉంటామని ఉద్బోధించారు. లోటుపాట్లు సరిదిద్దుకోవడానికి ఇప్పుడు తగినంత సమయం ఉందని, దానిని సద్వినియోగం చేసుకుందామని కోరారు. శాసససభ, పార్లమెంటుకు జమిలి ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేద్దామని జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్‌లో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. గ్రామ, బూత్ కమిటీలతో మరింత బలోపేతం ⇒ ఇప్పుడు మనం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా కమిటీలు, నియోజకవర్గ స్థాయి, మండల, గ్రామ స్థాయి కమిటీల వరకు ఎలా ఉన్నాయన్న దానిపై పరిశీలన, అవగాహన పెంచుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ పాత్రలను నిర్వర్తించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. మరో ఆరు నెలల్లో మళ్లీ సమావేశం నాటికి గ్రామ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు కావాలి. అక్కడే యూత్, మహిళా, విద్యార్థి విభాగాలతో పాటు విలేజ్ కమిటీ, బూత్ కమిటీల వంటి అనుబంధ విభాగాలకు గ్రామ స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు కావాలి. ⇒ ఈ కమిటీల ఏర్పాటు కాగితాలకే పరిమితం కాకూడదు. దాని వల్ల పార్టీకి ఎలాంటి లాభం ఉండదు. కమిటీల ఏర్పాటుపై మీ పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. ఇలా చేయగలిగితే.. దేశంలోకెల్లా నంబర్ వన్ పార్టీగా ఎదుగుతాం. పార్టీ క్షేత్ర స్థాయి నిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రామ స్థాయి నుంచి మనకు కమిటీలు, నాయకత్వం లేక కాదు. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ సర్పంచ్ లేదా, పోటీ చేసిన అభ్యర్థి మన పార్టీ వారే ఉన్నారు. కాకపోతే వీరందరినీ నిర్మాణాత్మక వ్యవస్థల్లోకి తీసుకురావాలి. అప్పుడు మనం రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన పిలుపునకు గ్రామ స్థాయి వరకు ఉధృత స్పందన వస్తుంది. అది చేయగలగాలి. వైఎస్సార్సీపీ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితరులు మన కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా⇒ ఇవాళ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవరైనా సగర్వంగా కాలర్ ఎగరేసుకుని ప్రతి ఇంటికీ వెళ్లగలం. కారణం మనం చెప్పిన ఎన్నికల మేనిఫెస్టో అన్నదాన్ని చెత్తబుట్టలో వేసే డాక్యుమెంటు కింద కాకుండా.. దేశ చరిత్రలోనే సరికొత్త అర్థం తీసుకువచ్చిన పార్టీ మనది. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ దానిలో చెప్పినవి తూచ తప్పకుండా అమలు చేశాం. ⇒ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌తో పాటే మనం పథకాలు అమలు చేసే తేదీలతో సహా సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసే వాళ్లం. నేరుగా బటన్ నొక్కి మధ్యలో దళారులు లేకుండా అక్కచెల్లెమ్మలకు ఆయా పథకాలు అందించింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నదేమిటి? వాళ్లు ఎన్నికలప్పుడు చెప్పిన మాటలేమిటి? ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూసి ఉండం. ఎన్నికలప్పుడు ప్రచారంలో వారిలా మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. అదే మనకు వాళ్లకూ తేడా. విలువలు, విశ్వసనీయత అన్నది ముఖ్యం. ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చుంటే తప్పేముంది? ప్రజల్లో ఆలోచన మొదలైంది ⇒ వైఎస్సార్సీపీ, జగన్ వల్ల జరిగిన మంచి ఏమిటి.. అంటూ మనం చేసిన మంచి పనుల గురించి ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. చెప్పినవన్నీ జగన్ చేశాడని ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశాడు. జగన్ మాకు పలావు పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. తీరా చూస్తే పలావు పోయింది.. బిర్యానీ లేదు.. అన్న చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది. ఫలానా మంచి మా హయాంలో జరిగిందని.. ప్రజల్లోకి మనం ధైర్యంగా వెళ్లగలుగుతాం. కానీ టీడీపీ కూటమి కార్యకర్తలు ధైర్యంగా వెళ్లగలుగుతారా? ⇒ టీడీపీ వాళ్లు ప్రజల ఇళ్లకు పోయే పరిస్థితులు లేవు. చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారు. మనం ప్రజల్లోకి వెళ్లినప్పుడు, ప్రతి ఇంటికీ మన నాయకులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు, ఎవరింటికి పోయినా అందరూ సంతోషంగా దీవించారు. అయితే ఒకవైపు ఈవీఎంల వ్యవహారం, మరోవైపు టీడీపీ మోసపూరిత హామీలతోనే ఓడిపోయాం. 4 నెలల్లోనే ఎప్పుడూ లేనంత వ్యతిరేకత ⇒ మనం అమలు చేసిన హామీలే మనకు శ్రీరామ రక్ష. కేవలం నాలుగు నెలల్లోనే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ప్రభుత్వం మీద కనిపిస్తోంది. వాళ్లు ఎవరి ఇంటికైనా వెళితే మా రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు అడుగుతారు. మా రూ.18 వేలు ఏమయ్యాయని మహిళలు, రూ.48 వేలు ఏమయ్యాయని అవ్వలు, మా రూ.20 వేలు ఏమయ్యాయని రైతులు, మా రూ.36 వేలు ఏమయ్యాయని నిరుద్యోగ యువత అడుగుతారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం మరింతగా ప్రిపేర్ అవ్వాలి. ఒకవైపు హామీల అమలు లేకపోగా, మరోవైపు రాష్ట్రంలో పాలన దారుణంగా తయారైంది. దాదాపు రూ.2,400 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆరోగ్య ఆసరా లేదు. ప్రభుత్వం ఆస్పత్రులు నిర్వీర్యం అయ్యాయి. ⇒ మూడు త్రైమాసికాలు వచ్చినా, విద్యా దీవెన, వసతి దీవెన లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. సీబీఎస్ఈ లేదు. టోఫెల్ క్లాసులు లేవు. గోరుముద్ద కూడా పాడైపోయింది. అన్ని రంగాలూ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఖరీఫ్ సీజన్ పూర్తవుతున్నా రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఈ–క్రాప్ ఏమైందో తెలియదు. ఆర్బీకేలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. రైతుల పంటలకు కనీస మద్దతు దక్కని పరిస్థితి. ⇒ ఇంటి వద్దకు వచ్చే అన్ని సేవలూ నిలిచిపోయాయి. ఏం కావాలన్నా మళ్లీ జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పాలన వచ్చింది. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు తొలగించారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఘోరంగా ఉంది. మహిళలకు భద్రత సున్నా. దిశ యాప్ ఏమైందో తెలియదు. గతంలో మన పాలనలో అక్కచెల్లెమ్మలు ఫోన్ తీసుకుని బయటకు వెళ్లినప్పుడు, ఆపద ఎదురై ఫోన్ చేస్తే.. పది నిమిషాల్లో పోలీసులు వచ్చి ఏమైందని అడిగే పరిస్థితి ఉండేది. అవేవీ ఇప్పుడు లేవు. రాష్ట్రంలో దారుణంగా చిన్నారులను సైతం వదలకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీసులు దొంగ కేసులకు పరిమితం అయ్యారు. విధి నిర్వహణ మరిచిపోయి మూడు సింహాలకు కాకుండా, రాజకీయ నాయకులకు మడుగులొత్తుతున్నారు. ఎక్కడ చూసినా స్కాంలే కనిపిస్తున్నాయి. ఇసుక ఉచితం అంటూ టెండర్లేంటి? ⇒ ఇసుక ఉచితం అంటూ రెండు రోజుల్లోనే గుట్టుచప్పుడు కాకుండా టెండర్లు నిర్వహించారు. మన హయాంలో కనీసం రాష్ట్ర ఖజానాకు డబ్బులు రావడంతోపాటు ప్రజలకు రీజనబుల్ రేట్లకు ఇసుక వచ్చేది. ప్రతి ఆదివారం ప్రతి నియోజకవర్గంలో ధరలు ఇచ్చే వాళ్లం. అక్రమాలకు పాల్పడితే కేసులు పెట్టేవాళ్లం. అంత కట్టుదిట్టంగా అమలు చేశాం. కానీ ఇప్పుడు దోచుకోవడానికి పాలసీని మార్చారు. అడ్డగోలుగా స్టాక్ యార్డులు, రీచ్‌ల్లోని ఇసుకను అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఖాళీ చేశారు. ప్రభుత్వానికి సున్నా ఆదాయం. మరోవైపు ధరలు రెండు, మూడు రెట్లు పెరిగాయి. ⇒ మద్యం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మన హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో దుకాణాలు నడిపాం. ఉన్న షాపులు తగ్గించి, పర్మిట్ రూమ్స్ తీసేసి, టైమింగ్స్ పక్కాగా పెట్టి, బెల్టుషాపులు లేకుండా చూసి, అమ్మకం వాల్యూమ్స్ తగ్గించి ప్రజలకు మంచి చేశాం. కానీ ఇప్పుడు మద్యం షాపుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉచిత వాటాలు అడుగుతూ బెదిరింపులకు దిగుతున్నారు. ఎన్నికలప్పుడు ప్రచారంలో వారిలా మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. అదే మనకు వాళ్లకూ మధ్య తేడా. ప్రతిపక్షంలో కూర్చోడానికైనా మనం వెనకాడం కానీ, అబద్ధాలు చెప్పలేం. నేను చెప్పే ఈ మాటలు ఎవ్వరికీ నచ్చకపోవచ్చు. కానీ విలువలు, విశ్వసనీయత అనే పదాలకు అర్థం ఉండాలి. రాజకీయాల్లో అధికారం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కానీ మళ్లీ మనల్ని అధికారంలోకి తెచ్చేది మన విశ్వసనీయత, విలువలే. అవి లేనప్పుడు రాజకీయాలకు అర్థం లేదు. ఎన్నికలప్పుడు ఇంటింటికీ వెళ్లి ఆ ఇంట్లో చిన్న పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు (అమ్మ ఒడి), ఆ పిల్లల తల్లి కనిపిస్తే నీకు రూ.18 వేలు (నెలకు రూ.1,500), వాళ్ల చిన్నమ్మ కనిపిస్తే నీకూ రూ.18 వేలు (నెలకు రూ.1,500), 50 ఏళ్లకుపై బడిన పెద్దమ్మ కనిపిస్తే నీకు రూ.48 వేలు (బీసీలకు 50 ఏళ్లకే పింఛన్), ఉద్యోగం కోసం చూస్తున్న యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు (నిరుద్యోగ భృతి), అదే ఇంట్లో మెడలో కండువాతో రైతు కనిపిస్తే చాలు నీకు రూ.20 వేలు (రైతు భరోసా) అని ఇంట్లో ఎవరు కనిపించినా.. నీకు ఇంత.. నీకు ఇంత.. అని ప్రచారం చేశారు. ఇప్పుడు వాటి మాటేంటి?గ్రామ స్థాయి నుంచి పార్టీ ప్రతి అడుగులోనూ యుద్ధం చేస్తోంది. కాకపోతే మనం వ్యవస్థీకృతం(ఆర్గనైజ్డ్)గా యుద్ధం చేస్తున్నామా? లేదా? అన్నది చాలా ముఖ్యం. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలు ఉంటాయి. గ్రామ స్థాయి నుంచి మనకు కమిటీలు, నాయకత్వం లేక కాదు. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ సర్పంచ్ లేదా, పోటీ చేసిన అభ్యర్థి మన పార్టీ వారే ఉన్నారు. 86 శాతం సర్పంచ్‌లు, 90 శాతం పైచిలుకు ఎంపీటీసీ సభ్యులు మన వాళ్లే ఉన్నారు. దాదాపు 15 ఏళ్లుగా ప్రతి గ్రామంలో మనకు ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే వీటిని నిర్మాణాత్మక వ్యవస్థల్లోకి తీసుకురావాలి. గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం మరింత బలంగా ఉండాలి. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలి ⇒ ఇప్పుడు నడుస్తున్నది సోషల్ మీడియా కాలం. ఇది నియోజకవర్గ ఇన్ఛార్జ్ నుంచి గ్రామ స్థాయి లీడర్ వరకు ధ్యాస పెట్టాల్సిన అంశం. ఇవాళ మనం యుద్ధం చేసేది చంద్రబాబుతోనే కాదు. ఒక చెడిపోయిన వ్యవస్థతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, టీడీపీ తప్పుడు సోషల్ మీడియాలతో యుద్ధం చేస్తున్నాం. వాళ్లే అబద్ధాలు సృష్టిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అందుకే మనం మరింత బలంగా తయారు కావాలి. ప్రతి గ్రామంలోనూ పార్టీ కమిటీలన్నీ సోషల్ మీడియాకు అనుసంధానం కావాలి. ⇒ నియోజకవర్గ స్ధాయిలో జరుగుతున్న అన్యాయాలు, ఆకృత్యాలు చూపించగలగాలి. రెండో వైపున పార్టీ సందేశాలు కూడా గ్రామ స్థాయికి వెళ్లాలి. ఇది సవాల్‌తో కూడిన కార్యక్రమం. ఇది చేయగలిగే వ్యవస్థ మనకుంది. వచ్చే రోజుల్లో దీనిపై బాగా దృష్టి పెట్టాలి. వైఎస్సార్సీపీని దేశంలో అత్యంత బలమైన పార్టీగా తయారు చేయాలి. స్కామ్‌లలో కూడా ప్రజలను ఎలా కొత్తగా పిండాలా అని ఆలోచిస్తున్నారు. కనీసం ఇసుక టెండర్లు పిలుస్తున్నారన్న విషయం ఎవ్వరికీ తెలియదు. రెండే రెండు రోజులు టైం ఇచ్చారు. టెండర్లు వేయడానికి ఎవ్వరూ పోకుండా చూశారు. ఎన్నికలకు ముందు ఇసుక ఉచితం అన్నారు. ఎన్నికలు అయిన తర్వాత ఇసుక రేటు మన హయాం కన్నా డబుల్, ట్రిపుల్ రేటు. మన హయాంలో కనీసం రాష్ట్ర ఖజనాకు డబ్బులు రావడంతో పాటు ప్రజలకు రీజనబుల్ రేట్లకు ఇసుక వచ్చేది.ఈ ప్రభుత్వంలో మద్యం షాపుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు 30 శాతం ఇస్తావా, 40 శాతం ఇస్తావా.. అని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. షాప్‌ల కోసం కిడ్నాప్‌లు కూడా చేస్తున్నారు. నిజంగా లిక్కర్ పాలసీలో దురుద్దేశాలు లేకపోతే ఎమ్మెల్యేలు ఎందుకు పోటీ పడుతున్నారు? అంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు. లిక్కర్ రేట్లు తగ్గిస్తామన్నారు. కానీ, రేట్లు అలాగే ఉన్నాయి. మళ్లీ పర్మిట్ రూమ్స్ తీసుకొస్తున్నారు. బెల్టుషాప్‌లు ఏర్పాటవుతున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుండగా.. ప్రభుత్వ పెద్దలకు, వాళ్ల అనుచరులకు ఆదాయం పెరుగుతోంది.నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వం వద్దురా.. అని ప్రజలు చెప్పే పరిస్థితి వచ్చింది. నేనెప్పుడూ ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. అంత దారుణమైన పరిపాలన సాగుతోంది. ప్రభుత్వం ఎలా విఫలమైందో నాకన్నా.. నాయకులుగా మీరే బాగా చెబుతారు. ఎన్నికలప్పుడు వాళ్లు చెప్పిన మాటలేమిటి.. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్లు చేస్తున్న పాలన ఏమిటిన్నది గమనిస్తే.. ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల మాటేమిటి? సూపర్ సిక్స్‌లు ఏమయ్యాయని ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక కనీసం బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో నడుపుతున్న ప్రభుత్వం ఇది. ప్రతి నియోజకవర్గంలో 10 పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో గ్రావెల్ తోలుకోవాలన్నా, ఫ్యాక్టరీ పెట్టుకోవాలనుకున్నా.. వ్యాపారం చేయాలనుకున్నా.. ఎవరు ఏం చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే. డబ్బు ఇవ్వకపోతే వ్యాపారమే లేదు. పోలీసుల సహాయంతో బెదిరిస్తున్నారు.ప్రతి గ్రామంలోనూ పార్టీ కమిటీలన్నీ సోషల్ మీడియాకు అనుసంధానం కావాలి. కమిటీల్లోని ప్రతి ఒక్కరూ వాళ్ల సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలి. మీ పేజీలను మీరే నడపాలి. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్ పేజీలు తయారు చేసుకోవాలి. గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ ఆయా మాధ్యమాల్లో మీ అకౌంట్, మీ పేజీలు నిర్వహించాలి. ఎప్పుడైతే మీరు మీ పేజీలు నడుపుతారో అప్పుడే గ్రామ స్థాయిలో జరుగుతున్న అన్యాయాలను మనం ఎండగట్టగలుగుతాం.చీకటి తర్వాత వెలుగు సహజం పార్టీ భవిష్యత్తు బాధ్యతను పట్టుదలతో నిర్వర్తిస్తే మీకు, పార్టీకి మంచి జరుగుతుంది. మన పని వల్ల పార్టీకి మంచి జరుగుతుందనేది మనం మర్చిపోకూడదు. పార్టీ అధికారంలోకి వస్తే కొట్ల మంది ప్రజలకు, లక్షల మంది కార్యకర్తలకు, వేల మంది నాయకులకు మంచి జరుగుతుంది. ఇవన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. అందరం కలిసికట్టుగా బాధ్యత తీసుకుని అడుగులు వేస్తున్నప్పుడు.. ఇది మన పార్టీ అనేది మన నరనరాల్లో ఇమిడి ఉండాలి. మనం వేసే ప్రతి అడుగు మన పార్టీ కోసం వేస్తున్నామన్నది మన ఒంట్లో ఎక్కించుకోవాలి. కష్టం లేనిదే మనకు అందలం రాదు. 16 నెలలు నేను జైలుకు పోతేనే ముఖ్యమంత్రి అయ్యాను. ఎవరూ చూడని వేధింపులు చూశాను. అకారణంగా 16 నెలలు ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం అన్నది ఎప్పుడూ జరగలేదు. ఒక పార్టీ లేకుండా చేయాలని, ఒక వ్యక్తిని వేధించాలన్న ఉద్దేశంతోనే ఆ స్థాయి వేధింపులు చేశారు. అన్ని నెలలు జైల్లో పెట్టిన తర్వాత, ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి ప్రజలకు మంచి చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. మనం మంచి చేయగలిగాం. దాని అర్థం అన్యాయం జరిగినప్పుడు ఒక మంచి జరుగుతుంది. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. దేవుడు మంచికి తోడుగా ఉంటాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. నష్టాలుంటాయి. ఒక్కోసారి జైలుకు కూడా పోవాల్సి ఉంటుంది. అయితే ఏంటి? ఇవన్నీ జరిగినప్పుడే మనిషి ఎదుగుతాడు. ప్రజల్లో, నాయకత్వం దగ్గర మన్ననలు ఉంటాయి. అన్నీ ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. మన భవిష్యత్ కోసం మనం చేస్తున్నామని గుర్తు పెట్టుకోండి. మన పార్టీ కోసం, మనం అధికారంలోకి రావాలన్న సంకల్పంతో పేదవాడికి మన వల్ల మంచి జరుగుతుందన్న స్థిరమైన నమ్మకంతో అడుగులు వేస్తున్నాం. ఈ విషయం ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకోండి. పనితీరు ఆధారంగా ప్రమోషన్లు జిల్లా అధ్యక్షులు, కమిటీల్లోని వారు.. మీ మీ పనితీరు ఆధారంగా మీ ప్రమోషన్లు ఉంటాయి. మీరు ప్రూవ్ చేసుకోండి. తప్పకుండా ప్రాధాన్యత, అవకాశాలు కల్పిస్తాం. మీకు ప్రమోషన్ ఇచ్చే బాధ్యత నాది. మనం అధికారంలోకి రాగానే మీలో ఎక్కువ మంది మంత్రివర్గంలో ఉండాలని ఆశిస్తున్నాం. జిల్లా అధ్యక్షులకు ఇదొక సువర్ణావకాశం. కష్టపడండి. మీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. మీ జగన్ మీ కష్టాలకు తప్పకుండా ప్రాధాన్యత ఇస్తాడు. అనుబంధ సంఘాల అధ్యక్షులకూ మంచి అవకాశాలు వస్తాయి. మీ పనితీరుపై పరిశీలన, పర్యవేక్షణ ఉంటుంది. రీజినల్ జనరల్ సెక్రటరీలను తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌ల పనితీరుపైనా మదింపు ఉంటుంది. రిపోర్టుల ప్రకారం నిర్ణయాలు ఉంటాయి. బాగా పని చేసే వారికీ రేటింగ్స్ ఇస్తాం. -
వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి అని ఆయన అన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని పేర్కొన్నారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులు, సిరిసంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
నేడు తిరుమలకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం రాత్రికి తిరుమల చేరుకుంటారు. వైఎస్ జగన్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకుని, అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం 10.20 గంటలకు గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు, అనంతరం తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మానుకోండి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి.. అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గమని మండిపడ్డారు. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పి పంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం అని చంద్రబాబును నిలదీశారు. ‘ఇకనైనా కళ్లు తెరవండి.. వెంటనే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కు తీసుకోండి. ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోండి’ అని హితవు పలికారు. మెడికల్ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తి చేసి, పేద పిల్లలకు వైద్య విద్యను, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ‘మీకు చేతనైనంత మీరు ఖర్చు చేస్తూ వెళ్లండి.. మీకు చేతకాకపోతే మళ్లీ మేం వచ్చిన తర్వాత అయినా పూర్తి చేస్తాం. అంతేకానీ ఇలా మెడికల్ కాలేజీల ప్రైవేటుపరం మాటున స్కామ్‌లు చేయడం మానుకోండి. లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని గుర్తించుకోండి’ అని చంద్రబాబును హెచ్చరించారు. మెడికల్ కాలేజీల వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వ తీరును తూర్పారపడుతూ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే.. బాధ్యతల నుంచి తప్పించుకుంటే దాన్ని ప్రభుత్వం అంటారా? ⇒ నాణ్యమైన విద్య, వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అందించడం అన్నది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి, మంచి వైద్యం అందుకోవడానికి ఏ కుటుంబం కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఈ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తప్పించుకుంటుంది చంద్రబాబూ? అలా తప్పించుకుంటే, దాన్ని ప్రభుత్వం అని అంటారా? ⇒ దీన్ని గుర్తించే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో రూ.8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించాం. దీని వల్ల ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం వస్తుంది? 2023–24 సంవత్సరాల్లో ఐదు కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం నిజం కాదంటారా? తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి రాలేదంటారా? చాలా మంది పేద పిల్లలు సీట్లు సాధించి డాక్టర్ చదువులు చదవడం లేదా? ⇒ నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వెళ్తే ఈ ఏడాదిలో మరో ఐదు కాలేజీలు.. మదనపల్లె, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరుల్లో మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడం ఏంటి? పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ 50 సీట్లు మంజూరు చేస్తే, వద్దంటూ లేఖ రాయడం ఏంటి? మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంచేసే స్కామ్‌లకు ఆలోచన చేయడం ఏంటి? ప్రైవేటు మీద అంతమోజు ఎందుకు? ⇒ కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణాల కోసం రూ.2403 కోట్లు ఖర్చు చేసి, ఐదు కాలేజీల్లో క్లాసులు మొదలుపెట్టి, మరో ఐదు కాలేజీలను ఈ ఏడాది నుంచే బోధనకు సిద్ధం చేశాం. మీ ప్రభుత్వం కూడా క్రమంగా ఖర్చు చేసుకుంటూ వెళ్తే మిగిలిన కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయన్నది వాస్తవం కాదా? ⇒ ఇలా చేయకుండా భారం అంటూ చేతులు దులిపేసుకుని ప్రజారోగ్య సంస్థలను అమ్మేస్తారా? ప్రైవేటు మీద మీకు అంత మోజు ఎందుకు? ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యం ఎందుకు? కోవిడ్‌లో ఆదుకున్నది ప్రజారోగ్య రంగమే ⇒ కొత్త మెడికల్ కాలేజీల నిర్వహణలో ఇబ్బందులు రాకూడదు, అదే సమయంలో పేద విద్యార్థులకు నష్టం కలగ కూడదన్న విధానంలో మేం సీట్లను భర్తీ చేస్తే, ఎన్నికల్లో ఓట్ల కోసం నానా రాద్ధాంతం చేశారు. అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారు. సీట్ల సంగతి దేవుడెరుగు.. ఇప్పుడు ఏకంగా కాలేజీలనే అమ్మేస్తున్నారు. ఇది ఏరు దాటాక తెప్ప తగలేయడం కాదంటారా? మోసం చేయడమే మీ నైజమని మరోసారి బయట పడ్డారు. ⇒ పార్లమెంటు నియోజకవర్గానికో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే, అది ఆ నియోజకవర్గంలో ఉన్న ఏరియా ఆస్పత్రులకు, సీహెచ్‌సీలకు, పీహెచ్‌సీలకు, విలేజ్ క్లినిక్స్‌కు మార్గదర్శిగా ఉంటుంది. ఆ జిల్లా స్థాయిలో సూపర్ స్పెషాల్టీ సేవలు కూడా పేదలకు ఉచితంగా అక్కడే లభిస్తాయి. అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే ముందుగా నష్టపోయేది పేద విద్యార్థులే కాదు, అక్కడి ప్రజలు కూడా. వారికి నాణ్యమైన వైద్యం అందదు సరికదా.. ప్రైవేటు ఆస్పత్రుల మధ్య పోటీ లోపించి వైద్యం కోసం వసూలు చేసే ఫీజులు ఆకాశాన్ని అంటుతాయి. ⇒ ఎప్పుడైనా ప్రైవేటుకు గవర్నమెంటు పోటీగా ఉంటేనే, రేట్లు రీజనబుల్‌గా ఉంటాయి. కాలేజీలను ప్రైవేటీకరించాలన్న మీ విధానం అందరినీ దెబ్బ తీస్తుందనడం వాస్తవం కాదా? అటు ప్రజలను, ఇటు పిల్లలను కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో ఆదుకున్నది ప్రజారోగ్య రంగమే అని గుర్తించకపోతే ఎలా చంద్రబాబూ? పేదలకు ఉచితంగా మంచి వైద్యం అందకూడదన్నదే మీ విధానమని తెలుస్తోంది. -
మాకిచ్చిన హామీ సంగతి ఏమైంది సీఎంగారూ?
సాక్షి రాయచోటి: ఎన్నికలకు ముందు ఒక మాట..తర్వాత మరోమాట చెప్పడం టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాటిగా మారింది. గతంలోనూ 2014లో ఇలాంటి మాటలతోనే ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి రాగా మరొక మారు అనేక వర్గాల వారికి మాయా బాబు మహా శఠగోపం పెడుతున్నారు. ఈసారి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామంటూనే ఇప్పటికీ అమలు చేయని తీరును ప్రజలు చర్చించుకుంటున్నారు. మరోవైపు వైఎస్ జగన్ సర్కార్ 2019 నుంచి వలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తేగా...అందులో వలంటీర్లకు సంబంధించి రూ. 5 వేలు కాదు..రూ. 10 వేలు గౌరవ వేతనం పెంచి ఇస్తామని చెప్పి ఏకంగా వ్యవస్థకే మంగళం పాడేలా కనిపిస్తున్నారు. రూ. 10 వేలు పెంపు లేకపోగా చివరికి వారిని పట్టించుకునే పరిస్థితి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం అందించడంలో కీలకపాత్ర పోషించిన వలంటీర్ల కొనసాగింపే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అధికారంలోకి వచ్చినా ఎదురు చూపులే గత సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి సర్కార్ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. చంద్రబాబు ప్రభుత్వంలో వలంటీర్లు కూడా రూ. 10 వేలు గౌరవంగా తీసుకుంటామని ఆశపడ్డ వారికి భంగపాటు తప్పలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు దాటుతున్నా ఇప్పటివరకు అతీగతీ లేదు. అందులోనూ రెండు దఫాలుగా పింఛన్ల పంపిణీలోనూ వలంటీర్లను పక్కన పెట్టి సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీనిని బట్టి వలంటీర్లను కొనసాగించడం దాదాపు అనుమానమే. మూడు నెలలుగా వలంటీర్లను మళ్లీ తీసుకుంటారేమోనన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమాన్ని పంచిన వలంటీర్లువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి 2024 ఎన్నికల వరకు ప్రజలకు విశేష సేవలు అందించారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం మొదలుకొని ఎప్పటికప్పుడు ప్రజలకు నీటిని అందించే విషయం, ఆధార్ అప్డేట్లు, సర్టిఫికెట్లు, ఆరోగ్య శిబిరాలు, చిన్నపిల్లలకు వేసే వ్యాక్సిన్లు ఇలా ప్రతి ఒక్కటీ వారి ద్వారానే జరుగుతూ వచ్చింది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సైతం ప్రజలకు చేరవేస్తూ వచ్చారు. వలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే పథకాలతోపాటు పాలన కొనసాగేది. వైఎస్ జగన్ హయాంలో ప్రజలతో అనునిత్యం మమేకం అవుతూ ఒక వెలుగు వెలిగిన వలంటీర్లకు ప్రస్తుతం కష్టకాలం వెంటాడుతోంది. వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలిఎన్నికల ముందు ఓట్లు, సీట్ల కోసం చంద్రబాబు వలంటీర్లకు గౌరవ వేతనం పెంపు పేరుతో వల వేశారు. వలంటీర్ల గౌరవ వేతనం సంగతి దేవుడెరుగు...అధికారంలోకి రాగానే వారి గురించే మరిచిపోయారు. అయితే విజయవాడలో వరదలు పోటెత్తడంతోపాటు బుడమేరుకు గండ్లు పడి జలప్రళయం విజయవాడను ముంచెత్తింది. దీంతో వలంటీర్ల వ్యవస్థ కొనసాగి ఉంటే ఎప్పటికప్పుడు అప్రమత్తం కావడంతోపాటు అన్ని విషయాలు తెలిసేవని, పరిస్థితి మరోలా ఉండేదని వలంటీర్ల గురించి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉండడం ద్వారా ఉపద్రవాలు, ఉప్పెనలు, ఇతర అతలాకుతలం పరిస్థితులు, ఇంకా ఎలాంటి సమాచారం ఉన్నా ముందే ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంటుందని.. వలంటీర్లను కొనసాగించాలని ప్రజల నుంచి కూడా డిమాండ్ వినవస్తోంది. ప్రజల అవసరాల నిమిత్తం వలంటీర్లను కొనసాగిస్తారో...లేక పక్షపాత ధోరణితో కూటమి సర్కార్ అణచి వేస్తుందో వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా వలంటీర్లు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనాన్ని పెంచి అందరినీ కొనసాగించాలని వలంటీర్ల సంఘం డిమాండ్ చేస్తోంది.తగిన నిర్ణయం తీసుకోవాలి గ్రామ,వార్డు వలంటీర్లను తిరిగి వెంటనే విధుల్లోకి తీసుకుని న్యాయం చేయాలి. వలంటీర్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక రకాలుగా చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించాలి. గత ఆరు నెలలుగా జీతభత్యాలు లేక, విధులు లేక సందిగ్ధావçస్థలో ఉన్న వలంటీర్లపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలి. – రెడ్డి శివకృష్ణ, కొండయ్యగారి పల్లె, నిమ్మనపల్లె మండలం సీఎం హామీని నిలబెట్టుకోవాలి వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి సీఎం చంద్రబాబునాయుడు తన ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం వలంటీర్లకు గౌరవ వేతనం రూ.10వేలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. గ్రామ, వార్డు వలంటీర్ల అవస్థలు గుర్తించి వెంటనే వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వలంటీర్లకు న్యాయం చేయాలి. – వెంకటేష్, గ్రామ వలంటీర్, నిమ్మనపల్లె.విధుల్లోకి తీసుకోండిప్రజలకు ఎన్నో సేవలందించిన వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి. ఎన్నికల సమయంలో కూటమి ప్రభు త్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని వలంటీర్లకు న్యాయం చేయాలి. గతంలో ప్రజలకు ఎన్నో సేవలందించాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలి. – శివరామ్, సంబేపల్లె వలంటీర్ ఎన్నో సేవలందించాంగత ప్రభుత్వంలో ప్రజలకు ఎన్నో సేవలు అందించాము. కరోనా సమయంలో ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండి మందులను అందజేశాము. సుదూర ప్రాంతాలలోని ఆసుపత్రిలో ఆరోగ్యం బాగాలేక చికిత్స పొందుతున్న వారికి పింఛన్, వివిధ పథకాలు అందజేశాము. మా సేవలను గుర్తించాలి. – సుబ్బరాయుడు, వలంటీర్, శెట్టిపల్లె పాళెంగడ్డ, సంబేపల్లె -
చివరకు తప్పుకున్న టీడీపీ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరి నుంచి అధికార టీడీపీ తప్పుకుంది. బలం లేకపోవడం.. బలగానికీ ఇష్టంలేకపోవడంతో పోటీలో ఉంటే చిత్తుగా ఓడిపోవడం తప్పదని పార్టీ పెద్దలు గ్రహించారు. అయినా, కుతంత్రాలపై ఆశలు పెట్టుకున్నారు. చివరికి.. సామదానభేద దండోపాయాలను ఉపయోగించారు. డబ్బులతో అయినా ఓట్లు కొనాలని చివరి నిమిషం వరకూ చూశారు. కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కించిత్తైనా నమ్మకం లేకపోవడంతో కూటమి చేతులెత్తేసి తోకముడిచింది. దీంతో.. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వైఎస్సార్సీపీ కేడర్ చెక్కు చెదరకపోవడంతో ఆ పార్టీ ఖాతాలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు చేరింది. బొత్స విజయం లాంఛనంగా మారింది. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇది తొలిమెట్టుగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. పోటీకి అందరూ ససేమిరావాస్తవానికి.. ఎలాగైనా ఎవరో ఒకర్ని పోటీలో నిలపాలని కొద్దిరోజులుగా సీఎం చంద్రబాబు భావిస్తూ వచ్చారు. స్థానిక సంస్థల్లో అధికార పక్షానికి బలం లేకపోవడం, వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉండటంతో టీడీపీ అ«భ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద్లలో ఎవరో ఒకర్ని పోటీచేయించాలని చంద్రబాబు ప్రయత్నించారు. కానీ, గెలిచేందుకు ఏమాత్రం అవకాశంలేకపోవడం.. పైగా బలమైన ప్రత్యర్థి బొత్స ఉండడంతో పోటీకి వారిద్దరూ ససేమిరా అన్నారు. దీంతో దిలీప్ చక్రవర్తిని అభ్యర్థిగా నిలిపేందుకు ప్రయత్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దిలీప్ చక్రవర్తి అనకాపల్లి టికెట్ ఆశించారు. ఆ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో అతనికి ఆశాభంగమైంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఆశపెట్టి అతన్ని బరిలో దించాలని విశాఖ జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబుకు ప్రతిపాదించారు. పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న లోకేశ్ కూడా ఈయన పేరును తెరపైకి తెచ్చారు. గెలిచే అవకాశంలేని ఎమ్మెల్సీ సీటుకు పోటీచేసేందుకు ఆయన కూడా ముందుకు రాకపోవడంతో గత్యంతరంలేని స్థితిలో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు చంద్రబాబు మంగళవారం విశాఖ జిల్లా నేతలకు టెలీకాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. ఓటమి భయంతోనే వెనకడుగుఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలని ముందు నుంచి భావించిన టీడీపీ చివరి నిమిషంలో తప్పుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది. విశాఖ స్థానిక సంస్థల్లో సంపూర్ణ మెజారిటీ ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కొని ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవడం సాధ్యంకాదు. ఈ నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో వచ్చే ఓటమి ఘోర పరాభవం కింద లెక్కే. ఇటీవలే తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోను ఇదే జరిగింది.అక్కడ మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పరాజయం పాలైంది. దీంతో.. స్థానిక సంస్థల్లో పూర్తి మెజారిటీ ఉన్న వైఎస్సార్సీపీని తట్టుకుని నిలబడటం టీడీపీకి పెను సవాల్‌గా మారే పరిస్థితి ఉందని.. పైగా, ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర నెలలకే ఓటమి చవిచూస్తే ఆ ప్రభావం తట్టుకోవడం కష్టమనే పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడంతో చంద్రబాబు చేతులెత్తిసినట్టు సమాచారం. బొత్స ఎన్నిక లాంఛనమేమరోవైపు.. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ సవాల్‌గా తీసుకుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యూహాత్మకంగా మాజీమంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణను బరిలోకి దించారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సతోపాటు మరో స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా కూడా నామినేషన్ వేశారు. గడువులోగా ఈయన నామినేషన్ ఉపసంహరించుకుంటే పోలింగ్ లేకుండానే బొత్సను విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ పోటీ జరిగినా బొత్స ఎన్నిక లాంఛనమే. దిలీప్‌కు హితోపదేశం..! ఇదిలా ఉంటే.. దిలీప్ పేరుని ప్రతిపాదించిన లోకేశ్ వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ.. ఆ ప్రతిపాదనలకు చెక్ పెట్టేందుకు వీలుగా టీడీపీ ఉత్తరాంధ్ర సీనియర్లు పావులు కదిపారు. టీడీపీకి చెందిన ఓ మాజీమంత్రి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. దిలీప్ చక్రవర్తికి వ్యాపార భాగస్వామిగా ఉన్న ఓ ఎమ్మెల్సీ ద్వారా మంతనాలు ప్రారంభించారు. సదరు అభ్యర్థిగా భావిస్తున్న వ్యక్తికి హితోపదేశం చేయడం ప్రారంభించారు. రూ.100 కోట్లు కాదు.. రూ.200 కోట్లు ఖర్చుచేసినా.. గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. డబ్బులు, టైమ్ వేస్ట్ అంటూ బ్రెయిన్‌వాష్ చేశారని సమాచారం. ఓట్ల అంతరం చాలా ఉందనీ.. దాన్ని అధిగమించడం కష్టమనీ.. అందుకే ఓడిపోయే సీటును అంటగట్టేందుకు చూస్తున్నారని చెప్పారు. నామినేషన్ వేసి.. కోట్ల రూపాయలు నష్టపోయే కంటే.. అసలు పోటీలో ఉండకపోవడం మంచిదని సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గ్రహించే గండి బాబ్జీ, పీలా గోవింద్‌లు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా వివరించారు. అంతా విన్న దిలీప్ పోటీచేయలేనంటూ లోకేశ్‌కి తెగేసి చెప్పేశారు. -
డబ్బులతో ప్రలోభపెట్టాలని చూస్తున్నారు ఇది అధర్మ యుద్ధం..
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
సాక్షి, అమరావతి: ఎవరూ అధైర్యపడవద్దు.. అన్ని విషయాల్లో చివరి వరకు అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారు. తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీస్‌లో బుధవారం కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా జగన్.. అందరినీ పలకరించి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్సీపీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. -
‘బురిడీ’బాబులు.. అంతా మాయ
ఆంధ్రప్రదేశ్‌లో గత శాసనసభ ఎన్నికలలో మెజార్టీ ప్రభుత్వ ఉద్యోగులు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారన్న అభిప్రాయం ఉంది. దానికి పలు కారణాలు ఉండవచ్చు. ప్రభుత్వపరంగా కొన్నిలోపాలు ఉండవచ్చు. కాని అదే టైమ్ లో ముఖ్యమంత్రి జగన్ ఏ అధికారిని లేదా ఏ ఉద్యోగిని అగౌరవపరచలేదు. ఎవరిని మోసం చేసే యత్నం చేయలేదు. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఇస్తానని ఎన్నికల ముందు చెప్పినా , అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి అర్ధం చేసుకుని ఉద్యోగులకు పాత పెన్షన్ ఇవ్వలేకపోయినా, ఏ రకంగా వారికి మేలు చేయవచ్చన్నదానిపై దృష్టి పెట్టారు. అందులో బాగంగానే వారికి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ను తీసుకు వచ్చారు. ఇందుకోసం చాలా కసరత్తు చేశారు. ఉద్యోగ సంఘాలతో కూడా పలుమార్లు చర్చించారు. అయినా కొంతమంది ఉద్యోగులకు అది నచ్చలేదు. అదే టైమ్ లో అప్పటి విపక్షనేత, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు సీపీఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. వారిని రెచ్చగొట్టడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా చేయని ప్రయత్నం లేదు. అబద్దాలను నిత్యం వండి వార్చేవి. అయినా జగన్ తాను చేయదలచుకున్నది చిత్తశుద్దితో చేసి ఉద్యోగులు రిటైరైనప్పుడు వచ్చే జీతంలో ఏభై శాతం పెన్షన్ వచ్చేలా స్కీమును తెచ్చారు. ఇప్పుడు అది దేశవ్యాప్తంగా చర్చ అయింది. ఆంధ్ర మోడల్ పేరుతో కేంద్రం కూడా దీనిని పరిగణనలోకి తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాలు కూడా ఇది బాగానే ఉందని అభిప్రాయపడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు తాము ఓపీఎస్‌కు వెళుతున్నామని చెప్పినా, ఆచరణలో చేయలేకపోయాయి.ఈ నేపధ్యంలో ఏపీలో ఎన్నికలు జరగ్గా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు మొదలైనవారు జగన్‌కు వ్యతిరేకంగా మారారు. కొన్ని ఆందోళనలు కూడా చేపట్టారు. వారంతా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లతో పాటు, ఈనాడు, జ్యోతి వంటి ఎల్లో మీడియా ట్రాప్ లో పడ్డారు. నిజంగానే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పాత పెన్షన్ స్కీమ్ వస్తుంందని అనుకున్నారు. కాని అలా జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులలోనే చంద్రబాబు ప్రభుత్వం యుటర్న్ తీసుకుని జగన్ ప్రభుత్వం ఇచ్చిన జిఓనే అమలు నిమిత్తం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి కూడా ఈనాడు మీడియా దుర్మార్గంగా జగన్ ప్రభుత్వానిదే తప్పు అన్నట్లు పచ్చి అబద్దపు వార్తను రాసి, టీడీపీ ప్రభుత్వ తప్పేమిలేదన్నట్లు కవరింగ్ ఇస్తూ కధనాన్ని ఇచ్చింది. చంద్రబాబు కాని, పవన్ కళ్యాణ్ కాని దీని గురించి మాట్లాడడం లేదు. కనీసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించలేదు. నిజంగానే వీరికి చిత్తశుద్ది ఉంటే జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీఓని, చట్టాన్ని రద్దు చేసి ఉండవచ్చు కదా! లేని లాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసినట్లు ప్రకటించిన చంద్రబాబు నాయుడు జీపీఎస్‌ను మాత్రం ఎందుకు కొనసాగిస్తున్నారు. ఇది ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేసినట్లు కాదా? అబద్దాలు చెప్పడంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పోటీపడినట్లు కాదా?అంటే ఎవరు బదులు ఇవ్వాలి. కూటమికి మద్దతు ఇచ్చిన ఉద్యోగులు అవాక్కవడం తప్ప ఇంక చేయగలిగింది లేదు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు దీనిపై నిరసన బాట పట్టినా పెద్దగా ఫలితం ఉండదన్న అభిప్రాయం ఉంది. గత ప్రభుత్వం కొద్దిగా ఆలస్యం చేసినా జీతాలు ఏ నెల ఆపలేదు. పేదల స్కీములకు ప్రాధాన్యత ఇచ్చిన కారణంగా ఈ ఇబ్బంది వచ్చింది. అలాగే వారికి సంబంధించిన జిపిఎఫ్,గ్రాట్యుటి తదితర చెల్లింపులలో కొంత ఆలస్యమైన మాట నిజమే. అదే టైమ్ లో ఉద్యోగుల మీద ఎక్కడా వేధింపులు లేవు. గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలు తెచ్చిన తర్వాత వీరిపై పని ఒత్తిడి కూడా తగ్గింది. నేరుగా లబ్దిదారులకు నగదు బదిలీని విజయవంతంగా అమలు చేయడంతో అవినీతి తగ్గింది. అయితే ఈ పద్దతుల వల్ల తమ ప్రాధాన్యత తగ్గిందని కొంతమంది భావించి ఉండవచ్చు. కాని ప్రజల విశాల ప్రయోజనాల రీత్యా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు చేయక తప్పు. ఉద్యోగులను జగన్ ఎప్పుడూ అన్నా.. అంటూ సంబోధించి చాలా మర్యాద ఇచ్చేవారు. అదే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఒకలా, అధికారం వచ్చాక మరొలా ఉంటారని మరోసారి రుజువు చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఒక శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఏదో చిన్న సమస్య వచ్చింది. కొద్ది సెకన్లపాటు అంతరాయం కలిగింది.దానికే ఆయన ఉద్యోగులపై మండిపడ్డారు. వారు ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని, తమాషాగా ఉందా అని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ తాను 1995 నాటి పాలన తెస్తానని అన్నారు. ఆ రోజుల్లో ఆయన తన గుర్తింపు కోసం ఆకస్మిక తనిఖీలు చేపట్టేవారు. ఎక్కడబడితే అక్కడ ఉద్యోగులను, అధికారులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. వారిని బహిరంగంగా మందలించేవారు.ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఒక అధికారి గుండెపోటుకు గురై మరణించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అది పెద్ద సంచలనం అయింది. అంతేకాదు.2014 టరమ్‌లో చంద్రబాబు తెలుగుదేశం మీడియా ప్రముఖుడు ఒకరితో కూర్చుని ఉద్యోగుల జీతభత్యాల గురించి ఏమి మాట్లాడుకుంది అంతా విన్నారు. అయినా చంద్రబాబు గొప్పతనం ఏమిటంటే ఉద్యోగులను మళ్లీ తనవైపు తిప్పుకోగలగడం, వారిని నమ్మించడం.అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చినా, చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయకపోయినా ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేయడం. 19952004 మద్య ఏభైకి పైగా ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయించారు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం వారు పెట్టిన కండిషన్ల ప్రకారం ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవడానికి అంగీకరించారన్న విమర్శ ఉండేది. అదే చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించేవారు. టీచర్ల పోస్టులను భర్తీ చేయడం లేదని, మెగా డీఎస్సీ అంటూ ఊదరగొడతారు. విశేషం ఏమిటంటే సుమారు లక్షన్నర ఉద్యోగాలను సృష్టించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అయితే, ఆయన ఉద్యోగాలు ఇవ్వలేదని చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ లు ప్రచారం చేస్తే, ఈనాడు, ఆంధ్రజ్యోతి డప్పు కొడితే దానిని కూడా కొంతమేర ప్రజలు నమ్మడం. ఇలా ఎన్నో జిమ్మిక్కులు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు యథాప్రకారం యుటర్న్‌లు తీసుకోవడం ఆరంభించారు. ఈసారి ఆయనకు పవన్ కళ్యాణ్ జత అయ్యారు. అంతే తేడా. గతంలో సోషల్ మీడియా ఉండేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు వారు ఎన్నికలకు ముందు ఏమి చెప్పారు? ఇప్పుడు ఏమి చేస్తున్నారు ?అన్నదానిపై విశ్లేషణలు వచ్చేస్తున్నాయి. ప్రజలను ఒకటి, రెండుసార్లు మోసం చేయవచ్చుకాని, ఎల్లకాలం మోసం చేయలేరన్న సూక్తి ఉంది. కాని అది చంద్రబాబు విషయంలో వాస్తవం కాదని రుజువు అయింది. ఈ సందర్భంలో మోసం చేసేవారి తప్పుకన్నా, మోసపోయేవారి తప్పే అధికమని అనుకోవాలన్న నానుడి కరెక్టేనేమో! – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మహానేత వైఎస్సార్‌కు వైఎస్ జగన్ ఘన నివాళి
సాక్షి కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని సోమవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయకు జనవాహిని పోటెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా తరలి వచ్చిన అభిమానులు వైఎస్సార్ ఘాట్ వద్ద ఘన నివాళులర్పించారు. ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డి, మేనత్త వైఎస్ విమలమ్మ, చిన్నాన్న వైఎస్ సుధీకర్‌రెడ్డి, అత్తమ్మ ఈసీ సుగుణమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో కలసి ఇడుపులపాయలో వైఎస్సార్‌కు నివాళులర్పించారు. సమాధి ఘాట్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ జగన్ కాసేపు అక్కడే మోకాళ్లపై కూర్చొని తండ్రిని స్మరించుకున్నారు. నివాళులర్పించే సమయంలో వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.ప్రత్యేక ప్రార్థనలు..సమాధి ఘాట్ వద్ద వైఎస్ జగన్, వైఎస్సార్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రానున్న కాలంలో కొన్ని సమస్యలు ఎదురైనా రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో జగన్ ధైర్యంగా ఎదుర్కొనేలా దేవుడు ఆశీర్వదించాలని మేనత్త విమలమ్మ ప్రార్థన చేశారు. కష్టాలు తాత్కాలికమేనని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్లడం ద్వారా ఎదిరించే శక్తిని ప్రసాదిస్తాడని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్సార్, వైఎస్ జగన్ చేసిన మంచిని ప్రస్తావించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన రమేష్, హేమ దంపతులు వైఎస్ జగన్‌ను కలిసి తమ మూడు నెలల చిన్నారికి పేరు పెట్టాలని కోరగా విజయశ్రీగా నామకరణం చేశారు.వైఎస్సార్ విగ్రçహం వద్ద నివాళులు..ఇడుపులపాయలోని ఘాట్ ప్రాంగణంలో వైఎస్సార్ విగ్రహానికి వైఎస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. కొద్దిసేపు అక్కడే నిలబడి వైఎస్సార్‌ను స్మరించుకున్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతిరెడ్డి, విమలమ్మ, వైఎస్ సుధీకర్‌రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, అరకు, తిరుపతి ఎంపీలు తనూజారాణి, గురుమూర్తి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల పార్టీల అధ్యక్షులు కె.సురేష్‌బాబు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, డాక్టర్ సుధ, టి.చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, గోవిందరెడ్డి, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ శారదాదేవి, పులివెందుల మాజీ మున్సిపల్ చైర్మన్ వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ మ«ధురెడ్డి సతీమణి వైఎస్ మాధవి, వైఎస్సార్సీపీ నాయకులు యువరాజ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి కుమారుడు థామస్‌రెడ్డి, స్టాన్లీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అందరికీ అభివాదం.. అభిమానులతో సెల్ఫీఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి ఘాట్ ప్రాంగణానికి తరలి వచ్చిన జనవాహినికి వైఎస్ జగన్ అభివాదం చేశారు. వైఎస్సార్ అమర్‌రహే, వైఎస్ జగన్ నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలతో ఘాట్ ప్రాంగణం హోరెత్తింది. పలువురి వద్దకు స్వయంగా వెళ్లి పలుకరించిన వైఎస్ జగన్ అడిగిన వారందరితో సెల్ఫీ దిగారు. భారీగా వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మూడు రోజుల జిల్లా పర్యటన ముగించుకుని అనంతరం అక్కడి నుంచి ఉదయం 11.10 గంటలకు గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్‌కు విమానాశ్రయంలో పలువురు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అడపా శేషు, గౌడ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మాదు శివరామకృష్ణ గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. గొల్లపూడి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కొమ్మ కోటేశ్వరరావు(కోట్లు), జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ గౌసాని, విజయవాడ రూరల్ ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి, జడ్పీటీసీ కాకర్లమూడి సువర్ణరాజు, నిడమానూరు సర్పంచి శీలం రంగారావు, పార్టీ నాయకులు దేవభక్తుని చక్రవర్తి, అశోక్, మేచినేని బాబు, కాట్రు శేషు, రామిశెట్టి వెంకటేశ్వరరావు, సమ్మెట సాంబశివరావు, నిడమర్తి రామారావు, పలువురు విజయవాడ కార్పొరేటర్లు, కార్యకర్తలు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించిన వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో తాడేపల్లికి బయలుదేరారు. -
అండగా ఉంటాం.. ఆందోళనొద్దు: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: ‘టీడీపీ వర్గీయులు అరాచకాలు సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. కట్టడి చేయాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోయింది. ఇలా ఐదేళ్లలో మనం ఎప్పుడూ దౌర్జన్యాలు చేయలేదు’ అంటూ అనంతపురం జిల్లాకు చెందిన బాధితులు వాపోతుంటే, అధైర్య పడొద్దని.. టీడీపీ దుర్మార్గాలను ధైర్యంగా ఎదుర్కొందామని మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు. ‘మీ ప్రాంతానికి వస్తా.. మీకు అండగా నిలుస్తా.. ఆందోళన పడొద్దు, అందర్నీ కలుస్తా.. టీడీపీ దుర్మార్గాన్ని దీటుగా ఎదుర్కొందాం’ అని ఊరడించారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందుల క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ జిల్లాతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ శ్రేణులు, నాయకులతో ఆయన మమేకమయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నేతలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, వీరాంజనేయులు, మగ్బూల్ బాషా, సాంబశివారెడ్డి తదితరులు వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాల అనంతరం ఆ జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ‘పోరాటాలు మనకు కొత్త కాదు. పోరాటం నుంచే పుట్టిన పార్టీ మనది. ఎంతో కాలం టీడీపీ దౌర్జన్యాలు నడవవు. మనోధైర్యం కోల్పోవద్దు. పార్టీ శ్రేణులకు అండగా ఉండండి. టీడీపీ బాధితులను నేను స్వయంగా కలుస్తా. అండగా నిలుస్తా. టీడీపీ దౌర్జన్యాలను సహించేది లేదు. మనందరం కలసికట్టుగా ఎదుర్కొందాం. మన కాలం వస్తోంది. అంత వరకూ కేడర్‌కు భరోసా ఇవ్వాలి’ అని ఆయన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. హామీలను విస్మరించి దాడులకు ప్రోత్సాహం ‘ప్రజలకిచ్చిన హామీలను విస్మరించి, చంద్రబాబు సర్కార్ వైఎస్సార్సీపీ కేడర్‌ను టార్గెట్ చేసి దాడులను ప్రోత్సహిస్తోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదు. టీడీపీ సర్కార్ వ్యక్తిగత దాడులకు ఉసిగొల్పుతోంది. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ధైర్యంగా ఉండండి. పార్టీ తరఫున అండగా ఉంటాం’ అని మాజీ ఎమ్మెల్యేలు ఎస్ రఘురామిరెడ్డి, డాక్టర్ సుదీర్‌రెడ్డి తదితరులతో వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబునాయుడు ఇదివరకెన్నడూ లేని రీతిలో దుర్మార్గ సంప్రదాయానికి బీజం వేస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే ఫలితం అనుభవించక తప్పదన్నారు. మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్ఈత కొడుతూ ప్రాణాపాయ స్థితిలోకెళ్లిన యువకుడుతన అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపువైఎస్ జగన్ సకాలంలో స్పందించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడి ప్రాణాలు కాపాడారు. ఆదివారం వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో పర్యటించారు. కోమన్నూతల గ్రామానికి చెందిన నారాయణ స్వామి కుమారుడు నరేష్ (25) సాయంత్రం దిగుడు బావిలో ఈత కొడుతుండగా శ్వాస తీసుకోవడం కష్టమైంది. స్నేహితులు గమనించి, అతన్ని బైక్‌పై కూర్చోబెట్టుకుని ఆస్పత్రికి పయనమయ్యారు. అదే సమయంలో చిన్నకుడాల వద్ద జగన్ కాన్వాయ్ ఆగింది. వెంటనే ఆ యువకులు తమ స్నేహితుడి పరిస్థితిని కాన్వాయ్‌లో ఉన్న వారికి వివరించారు. 108కు కాల్ చేసినా రాలేదని చెప్పారు. విషయం తెలుసుకున్న జగన్ ఆలస్యం చేయకుండా తన వెంట ఉన్న అంబులెన్స్‌లో ఆ యువకుడిని పులివెందుల ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స చేయడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది.మాజీ ఎంపీపీ కుటుంబానికి పరామర్శ వైఎస్సార్సీపీ లింగాల మండల కన్వీనర్, మాజీ ఎంపీపీ పెద్ద సుబ్బారెడ్డి సతీమణీ లక్ష్మీనరసమ్మ ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన నేపథ్యంలో వైఎస్ జగన్ ఆదివారం పెద్దకూడాల గ్రామంలో వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులందర్నీ పలుకరించి, ధైర్యం చెప్పారు. లింగాల మండలానికి చెందిన వివిధ గ్రామాలకు చెందిన నాయకుల్ని పేరుపేరునా పలుకరించారు. పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. చక్రాయపేట మండలం గొంది గ్రామానికి చెందిన మబ్బు రామయ్య తన పట్టా భూమిలో దౌర్జన్యంగా టీడీపీ వర్గీయులు రోడ్డు వేస్తున్నారని వాపోయారు. అడ్డుకున్న తనపైనే తప్పుడు కేసు బనాయిస్తున్నారని వివరించారు. ఈ ఘటనపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. బాధితుడికి అన్యాయం చేయొద్దని పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు ఓపికగా విన్నారు. అవసరమైన చర్యలకు సిఫారసు చేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కే సురేష్‌బాబు, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోటూరు చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు. -
కాలయాపనకే తప్ప.. కార్యాచరణ లేదు
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన తీరు, తీసుకున్న నిర్ణయాలను గమనిస్తే అదంతా కాలయాపనకే తప్ప.. కార్యాచరణ లేదనే విషయం స్పష్టమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. అధికారులతో కమిటీ ఏర్పాటుచేస్తూ తీసుకున్న నిర్ణయం విభజన సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెనక్కిలాగే నిర్ణయంగా చూడాల్సి వస్తోందని పేర్కొంది. ఇందుకు సంబంధించి వైఎస్సార్సీపీ స్పందనను మాజీమంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి శనివారం రాత్రి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో వారు ఏం పేర్కొన్నారంటే..» రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలేంటి? అపరిష్కృత అంశాలేంటి? పంచాల్సిన ఆస్తులేంటి? ఎందుకు ముందుకెళ్లడంలేదు? వీటిపై కోర్టుల్లో ఉన్న కేసులేంటి? అనే వాటిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ స్పష్టత కూడా ఉంది. కొత్తగా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాల గుర్తింపునకు మళ్లీ కమిటీ అన్నట్లుగా చెప్పడం విభజిత సమస్యల పరిష్కారంలో మరింత జాప్యానికే దారితీస్తుందన్న సంకేతాన్ని ఇద్దరు సీఎంల సమావేశం ఇచ్చిందని అభిప్రాయపడుతున్నాం.» పార్లమెంటు చేసిన విభజన చట్టంలోని అంశాల అమలుపై కేంద్ర ప్రభుత్వం గతంలో సీనియర్ అధికారి షీలా బేడీ కమిటీని ఏర్పాటుచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆస్తుల వివాదంపై కూడా ఈ కమిటీ పలు సిఫార్సులు చేసింది. వీటిపై అనేక దఫాలుగా పదేళ్లపాటు చర్చలు జరిగాయి. కొన్ని సిఫార్సులను తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. చర్చలను ఆ దశ నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి మళ్లీ కమిటీ ఏర్పాటుచేయడమంటే వ్యవహారాన్ని మళ్లీ మొదటికి తీసుకెళ్లడమేనని భావిస్తున్నాం.» ఇక తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అపరిష్కృత అంశాలపై దృష్టిపెట్టాలని, దశాబ్దకాలంగా అంగుళం కూడా ముందుకు పడకపోవడంతో ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి ఎదుట గొంతెత్తారు. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టి నిర్ణీత కాలపరిమితిలోగా సమస్యలు తీరుస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కూడా రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు కూడా విభజిత సమస్యలపై చర్చల ప్రక్రియ వేగం అందుకుంది. వీటిని కూడా ముందుకు తీసుకెళ్లే అంశాలపై దృష్టిపెట్టకుండా మళ్లీ కమిటీని ఏర్పాటుచేయడమంటే.. మళ్లీ వెనక్కి లాగడమే అవుతుందని భావిస్తున్నాం.» పైగా ఇప్పుడు కమిటీ ఏర్పాటు అన్నది కేంద్ర ప్రభుత్వంతో సంబంధంలేకుండా, వారి ప్రమేయంలేకుండా ఏర్పాటవుతోంది. విభజన చట్టం చేసింది పార్లమెంటు, దాన్ని అమలుచేయాల్సింది కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు, కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా కమిటీ ఏర్పాటు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. » ఇక రాష్ట్రానికి రావాల్సిన దాదాపు రూ.7వేల కోట్ల విద్యుత్ బకాయిల విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. తద్వారా ఆ బకాయిలు చెల్లింపునకు ఆదేశాలు కూడా ఇచ్చింది. తర్వాత ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. దీనిపై దృష్టిపెట్టి పరిష్కారం సాధించే ప్రయత్నం ఇప్పుడు జరిగిన సమావేశంలో పెద్దగా జరిగినట్లు లేదు. » ముఖ్యంగా నీటి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తీవ్ర అన్యాయాన్ని ఎదుర్కొంటోంది. రాయలసీమ ప్రాంతం గొంతెండుతున్న పరిస్థితుల్లో కూడా విద్యుత్ రూపేణా తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం ఎడమ కాల్వ నుంచి నీటిని ఇష్టానుసారం విడిచిపెడుతోంది. దీనిపై తక్షణం పరిష్కారానికి ప్రయత్నించి ఒక నిర్ణయాన్ని తీసుకోకుండా సమావేశం అసంపూర్తిగా ముగియడం రాష్ట్రానికి అన్యాయం చేసినట్లే. » ఏపీ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ కుడికాల్వ, స్పిల్‌వే భాగాన్ని వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర హోంశాఖ ఇచ్చిన హామీ మేరకు సంయమనం పాటించాం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చంద్రబాబు దీనిపై కూడా దృష్టిపెట్టిన దాఖలాలు కనిపించకపోవడంతో విభజిత సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.» ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీ పోర్టులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల్లోనూ తెలంగాణ వాటా కోరినట్లుగా మీడియా సంస్థలు వార్తలను ప్రసారం చేశాయి. అలాగే, ఏడు మండలాల్లోని కొన్ని గ్రామాలను కూడా విలీనానికి ఏపీ సుముఖంగా ఉన్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు దీనిపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి ఒక మంత్రి కాని, ఒక అధికారి కాని ఎలాంటి ప్రకటనా చేయకపోవడం ప్రజల అనుమానాలను బలపరిచినట్లే అవుతుందని వైఎస్సార్సీపీ భావిస్తోంది. -
టీడీపీ నేతల దౌర్జన్యం.. కుటుంబమంతా రాత్రి అడవిలోనే..
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకానికి భయపడి ఓ కుటుంబం రాత్రంతా అడవిలో తలదాచుకుంది. రాత్రివేళలో క్రూర మృగాలు, పాములు, ఇతర విష పురుగుల మధ్య అడవిలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ప్రజాస్వామ్య దేశ చరిత్రలో ఇంతటి అరాచకం ఎప్పుడైనా కన్నామా? విన్నామా?.. కానీ ఇది పచ్చి నిజం. సోమల మండలం కమ్మపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేత సుబ్రమణ్యంరెడ్డి కుటుంబం దీనగాథ ఇది. శుక్రవారం టీడీపీ గూండాలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటిపై దాడి చేశారు. సుబ్రమణ్యంరెడ్డిని బయటకు ఈడ్చుకు వచ్చి తీవ్రంగా కొట్టారు. రకరకాలుగా హింసించారు. ఆయన ఇటుకల బట్టీలోని ఇటుకలన్నింటినీ తరలించుకుపోయారు. బట్టీ మొత్తాన్ని ధ్వంసం చేశారు. సుబ్రమణ్యంరెడ్డి పొలంలో పండించిన టమాటా కోతకొచ్చింది. ఈ పంటను మార్కెట్‌కు తరలించకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. ఆయన పశువులకు గడ్డి కూడా వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు తెలిపినా స్పందన లేకపోవడంతో సుబ్రమణ్యం రెడ్డి కుటుంబం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సమీపంలోని అడవిలోకి పారిపోయింది. శుక్రవారం రాత్రంతా అడవిలోనే గడిపింది. శనివారం కొందరు వ్యక్తులు వారి వద్దకు వెళ్లి ఆ కుటుంబాన్ని బయటకు తీసుకువచ్చి వేరే ప్రాంతంలో ఉంచారు. ఆయన తమను శరణుకోరి.. టీడీపీలో చేరితే క్షమించి వదిలేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. లేదంటే విడిచిపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు. టీడీపీ నేతల తీరుపై పుంగనూరు ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో ఎవరికి నచ్చిన పార్టీలో వారు పనిచేసే వారని, ఇటువంటి అరాచకం ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చిత్తూరు జిల్లావ్యాప్తంగా దాడులుటీడీపీ నేతలు వారిపై కేసులు రాకుండా బెంగళూరు నుంచి గూండాలను తెచ్చి దాడులు చేయిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గ పరిధిలో ఎవరెవరు వైఎస్సార్సీపీకి పనిచేశారో గుర్తించి మరీ దాడులు చేయిస్తున్నారు. కొద్ది రోజులుగా టీడీపీ నేతలు, వారి గూండాల దౌర్జన్యాలు, దాడులతో చిత్తూరు జిల్లా అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పుంగనూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు ఊర్లొదిలి వేరే ప్రాంతాల్లో తలదాచుకొంటున్నారు. ఇప్పటివరకు 55 కుటుంబాలు స్వగ్రామాలను వీడి వెళ్లాయి. శ్రీకాళహస్తి రూరల్ మండలం ఈశ్వరయ్యకాలనీ, వాగివేడు, నారాయణపురం గ్రామాల నుంచి 75 కుటుంబాలను టీడీపీ నేతలు వెళ్లగొట్టారు. వీరంతా తమను శరణు కోరి, టీడీపీలో చేరితేనే వారిని, వారి ఆస్తులను వదిలేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.రక్షణ కోరినా స్పందించని పోలీసులుటీడీపీ కూటమి దాడులు, దౌర్జన్యాలపై అనేకమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు పోలీసులకు ఫోన్లు చేసి ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన సమయంలో ఇరువురి మధ్య సంభాషణలను బాధితులు రికార్డు చేసుకున్నారు. ఆ రికార్డులను వింటే.. రక్షణ కల్పించాల్సిన పోలీసులేనా అలా మాట్లాడేది అనిపించకమానదు. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతల దౌర్జన్యాలు, దాడులు ఆగకపోవడం, పోలీసులు స్పందించకపోవడంతో బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించటానికి సిద్ధమవుతున్నారు. -
రాజ్యాంగేతర శక్తుల కరాళ నృత్యం
భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించటానికీ, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం వంటి ఉదాత్త అంశాలను అందుబాటులోకి తేవడానికీ మన ‘రాజ్యాంగ పరిషత్’ రాజ్యాంగాన్ని రూపొందించింది. ప్రజాస్వామ్య సాధారణ లక్ష్యాల గురించి రాజ్యాంగ ప్రవేశికలో స్పష్టంగా ఉంది. ప్రధానంగా నిష్పక్షపాత ఎన్నికలు, ప్రజాస్వామ్య పాలన, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం; స్వేచ్ఛ, సమానత్వం, ప్రాథమిక హక్కుల గురించిన ప్రస్తావన అందులో ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రమాణ స్వీకారం చేసే ముందు రాజ్యాంగం మీద పూర్తి విశ్వాసం ఉంచుతామని ప్రమాణం చేస్తారు. కానీ ఇటీవలి (2024) సార్వత్రిక ఎన్నికల్లో చోటు చేసుకున్న రాజ్యాంగ విరుద్ధమైన సంఘటనల గురించి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుతున్నారంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత రాజ్యాంగ విరుద్ధంగా మారిందో చెప్పక తప్పదు. ఆధునిక విజ్ఞాన చక్రవర్తి ‘ఎలెన్ మస్క్’ లాంటి వాళ్ళు ఈవీఎమ్‌ల పనితీరును ఆక్షేపించారంటేనే ఎంత ఘోరంగా ఎన్నికలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. అమెరికా కూడా ఈసారి మన ఎన్నికలను తప్పు పట్టింది. 20 లక్షల ఈవీఎమ్‌లు ఎటుపోయాయో ఎవరూ సమాధానం చెప్పరు. న్యాయబద్ధంగా గెలవాల్సిన ఆంధ్ర, ఒరిస్సా ముఖ్యమంత్రులకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా మాయాజాలం జరిగింది. ‘మాకు మంచి చేసిన జగన్ ప్రభుత్వానికి వేసిన మా ఓటు ఏమయ్యింద’ని సామాన్య ఓటరు అడుగుతున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడి చేతిలో 1995 లోనూ ప్రజాస్వామ్యం కుప్ప కూలటం చూశాం. కానీ ఏకంగా ఎన్నికల కమిషన్ సాయం అందించి కూటమి గెలుపు కోసం శ్రమించడం ఇప్పుడే చూస్తున్నాం. ‘దారులన్నీ పెట్టుబడిదారి యంత్రాల కోరల్లోకే అని అర్థమయ్యాక నా వాదనే నాకు బలహీనంగా అనిపిస్తున్నది’ అంటారు కార్ల్ మార్క్స్. ఆధునిక భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అధికారం, డబ్బుల మయం అయిన వైనాన్ని కళ్ళారా చూస్తున్నాం. ‘గెలవటానికి ఏ అడ్డదారైనా ఫర్వాలేదు, గెలవటమే ప్రధానం. ఎన్ని అవినీతి మార్గాలున్నాయో వాటన్నిటి ద్వారా డబ్బు సంపాదించు, వ్యవస్థల్ని అదుపులో పెట్టుకో’ అనే ఎత్తుగడతో చంద్రబాబులాంటి వారు వ్యవహరించారు. వీరి నిఘంటువులో న్యాయం, ధర్మం, మానవత్వం అనేవి లేవు. అబద్ధాలు, అక్రమాలు వీరి ప్రాథమిక సూత్రాలు. గెలుస్తుందన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అడ్డ దారిలో ఓడించారు. గత ఐదేళ్లుగా జగన్ ఏ మంచి చేసినా దానిని ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా గోబెల్స్ ప్రచారాలు సాగిస్తూ, అరాచకాలూ వాళ్ళే చేస్తూ వాటిని జగన్ ప్రభుత్వం మీద రుద్దుతూ వచ్చారు. కూటమి గెలుపు తర్వాత ఇప్పుడు దానిదైన నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అందులో రెడ్‌బుక్ పాలసీ కూడా ఒకటి. దానిలో భాగంగానే వీళ్ళు చేయబోయే ఆకృత్యాలను ప్రజలకు చేరకుండా ఉండటానికి ముందుగా పచ్చమీడియా తప్ప మిగిలిన అన్ని ఛానెల్స్‌ను బ్యాన్ చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందే వీళ్ళు ప్రేరేపించిన రౌడీమూకలు రాష్ట్ర్రంలో చెలరేగిపోయారు. వైఎస్సార్సీపీకి ఓట్లేసిన... ఓటర్ల దగ్గర నుండి నాయకుల వరకు ఎవ్వరినీ విడిచిపెట్టటం లేదు. ఏకంగా ఈ మూక ఇళ్ళ మీదకు ఎగబడుతూ తమ వ్యతిరేకుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కత్తిపోట్లతో ప్రాణాలు తీయటానికి ప్రయత్నిస్తున్నారు. గర్భిణీ స్త్రీలను కొడుతున్నారు. నాయకులను చంపటానికి ప్రయత్నిస్తున్నారు. ఒకప్పటి బిహార్‌లో ఉన్న అరాచకం నేడు ఆంధ్రాలో వర్ధిల్లుతోంది. చివరకు చంద్రబాబు నిరంకుశత్వం ఎంత పరాకాష్టకు చేరిందంటే... వైఎస్సార్సీపీ ఆఫీసును కోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా ఉత్తర ప్రదేశ్‌లో లాగా పొక్లెయిన్ లతో తెల్లవారేసరికి కూల్చేశారు. కానీ ఏ వార్తా పచ్చ మీడియా రాయదు. చూపించదు. ఈ దుర్ఘటనలు దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళ నమ్మకాన్నీ పోగొడుతున్నాయి. ఇక్కడ గ్రీకు తత్త్వవేత్త ‘ఎపిక్యురస్’ అన్న మాటలు... ‘పదే పదే దుర్మార్గాలు చేస్తున్న వారిని చూస్తుంటే దేవుడు చెడును ఆపాలనుకుంటున్నా ఆపలేకపోతున్నాడా? అలా అయితే ఈ సృష్టి స్థితిలయలు అతని అదుపులో లేవన్నమాట. సమర్థుడే అనుకుంటే చెడును ఎందుకు నివారించటం లేదు. ఈ పగ, ద్వేషాలను, చెడును ఆపే సామర్థ్యం లేకపోతే ఇక ఎందుకండీ దేవుడు. రక్షకుడనే బిరుదులు?’ గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడో క్రీస్తుకు పూర్వం అన్న ఈ మాటలు నిజంగా ఆలోచించతగినవే కదా. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ఒక్కసారి జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి పద్యాల్లో చూద్దాం. పోలిక ఎంత బాగా సరిపోతుందో– కర్కశ కరాళ కారుమేఘాల నీడలెగురుతున్నవి/ప్రజల నెమ్ముగములందు/క్రౌర్య కౌటిల్య గాఢాంధకార పటలి /క్రమ్ముకున్నది దిగ్దిగంతమ్ములెల్ల నిజంగానే ‘ఏ నిరర్థ్ధక నిర్భాగ్య నీరస గళాలు ఎలుగెత్తి వాపోతున్నయ్యో– వెలయవో ప్రాభాతశోభావళుల్ అన్నట్లు నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం సుపరిపాలన అందించిన జగన్ మోహన్ రెడ్డి పునరాగమనం కోసం ఆశతో ఎదురుచూద్దాం.డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి -
కోర్టు ఆదేశాలు తుంగలో తొక్కేస్తారా?
సాక్షి, హైదరాబాద్ : తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీయే అధికారులు కూల్చి వేయడం చట్ట విరుద్ధమని, హైకోర్టు ఉత్తర్వులున్నా లెక్క చేయకుండా వ్యవహరించారని మాజీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను ఖాతరు చేయని దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ‘అధికారంలోకి రావడంతోనే టీడీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యహరిస్తోంది.గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కార్యాలయాలు కట్టుకునేందుకు 2016లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే 340 జీవో తెచ్చారు. దీని ప్రకారం 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ఎకరం వెయ్యి రూపాయల చొప్పున చాలా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం భూములు పొందారు. పాలకులు మారిపోయినా చట్టం మాత్రం మారదు. అదే చట్ట ప్రకారం కేంద్ర కార్యాలయ నిర్మాణం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2 ఎకరాలు తీసుకుంది.భవన నిర్మాణానికి అనుమతి కోసం దరఖాస్తు చేశాం. ఈ ప్రభుత్వం రావడంతోనే మాకు ప్రొవిజినల్ ఆర్డర్ జారీ చేశారు. నోటీసుపై 10వ తేదీ అని ఉన్నా, మాకు ఇచ్చింది మాత్రం 15వ తేదీ. దీనిపై హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసి ఉపశమన ఆదేశాలు పొందాం. చట్ట ప్రకారమే ముందుకు సాగాలని న్యాయస్థానం సీఆరీ్డయేను ఆదేశించింది. న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేనితనంతో ఆ ఆదేశాలను తుంగలో తొక్కారు’ అని మండిపడ్డారు. ప్రజావేదికతో సంబంధం లేదు ప్రజా వేదికతో కొందరు పోలుస్తుండటం సరికాదని.. దానికి, దీనికి సంబంధం లేదని పొన్నవోలు తెలిపారు. ‘నదీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి నిర్మాణం చేపట్టడానికి వీల్లేదు. అలా ఎవరు చేసినా అది పూర్తి చట్ట వ్యతిరేకం. అలా చేస్తే ప్రజలు ముంపు సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే.. చట్ట ప్రకారం నాటి ప్రభుత్వం ముందుకు వెళ్లింది. అంతే తప్ప అందులో కక్ష పూరితం లేదు.వైఎస్సార్సీపీకి ప్రభుత్వం ఇచ్చిన భూమిలో నిర్మాణం చేసుకోవడం చట్ట వ్యతిరేకం కాదు. ఈ వివాదం ఇప్పుడు అధికారులకు, కోర్టుకు మధ్య అన్న విధంగా మారింది. అధికారంలో ఉండగా వైఎస్సార్సీపీ ఏ ఒక్క అధికారిని ప్రభావితం చేయలేదు. టీడీపీ కట్టుకున్న పార్టీ కార్యాలయాలను కూల్చలేదు. వారు పొందిన స్థలాలను వెనక్కు తీసుకోలేదు. ఐదేళ్లు హూందాగా వ్యవహరించింది. సామాన్యుడు నిర్మాణం కోసం ఎలా అనుమతి పొందుతాడో అలాగే వైఎస్సార్సీపీ ముందుకు వెళ్లింది. ఏదేమైనా చట్ట విరుద్ధంగా కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కిన అధికారుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకునేలా పోరాడతాం’ అని వివరించారు.సీఆర్డీయే ప్రకటనలో అంశాలు వాస్తవం కాదు తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి ఈనెల 1వ తేదీనే కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చామంటూ సీఆరీ్డయే పేరుతో ఒక ప్రకటన సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందన్న విషయం మా దృష్టికి వచ్చిందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. అయితే ఇందులోని అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. సీఆరీ్డయే ప్రొవిజనల్ ఆర్డర్‌పై ఈనెల జూన్ 10వ తేదీ వేసి, మాకు జూన్ 15వ తేదీన ఇచ్చారు. నిన్న (శుక్రవారం) కోర్టులో దీనిపైనే వాదోపవాదాలు జరిగాయన్నారు. చట్టాన్ని ఫాలో అవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఇందుకు సంబంధించిన పత్రాలను మీ ముందు (మీడియా) ఉంచుతున్నామన్నారు.కూల్చి వేయము అని కోర్టుకు చెప్పి..విచారణ సందర్భంగా న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తూ ఎలాంటి కూల్చివేతలు చేపట్టబోమని అధికారులు చెప్పారని పొన్నవోలు తెలిపారు. చట్ట ప్రకారమే వ్యవహరిస్తామని చెప్పారన్నారు. రాత్రికి రాత్రే జేసీబీలు తీసుకొచ్చి కూల్చివేత చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సూర్యోదయానికి ముందు.. సూర్యాస్థమయానికి తర్వాత ఎలాంటి కూల్చివేత కార్యక్రమాలు చేపట్టవద్దని హైకోర్టు ఫుల్ బెంచ్ ప్రభుత్వాలకు గతంలోనే తేల్చి చెప్పింది. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చేంత వరకు కూల్చి వేయడానికి వీల్లేదు. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అవతలి వారి వాదనలు వినాల్సి ఉంటుంది.అందుకు 15 రోజుల సమయం ఉంటుంది. అయినా ప్రభుత్వం ముందుకు వెళితే.. బాధితులు ట్రిబ్యునల్‌కు కూడా వెళ్లవచ్చు. ట్రిబ్యునల్‌లో మాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. అప్పుడు ల్యాండ్ వ్యాల్యూపై 20 శాతం ఫైన్ స్వీకరించాలి. అట్లా పర్మిషన్ తీసుకోకుండా కడితే శిక్షార్హులు. కూల్చి వేత అనేది ఆఖరి అస్త్రం. అది కూడా ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే. ప్రొవిజినల్ ఆర్డర్ మీద కూల్చి వేయడం చట్ట వ్యతిరేకం. ఇది చట్ట ప్రకారం పాటించాలి్సన విధానం. కానీ, ఇలాంటివేవీ పాటించ లేదు. ఈ కేసులో న్యాయవాదిగా ఉన్న నేనే కోర్టు ఆదేశాలను సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్‌కు మెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా పంపించా. సీఆర్డీఏ చర్య కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. వారిపై సివిల్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరతాం’ అని వెల్లడించారు. -
నేడు వైఎస్సార్సీపీ విస్తృత సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈనెల 20న గురువారం తాడేపల్లిలో నిర్వహించనున్నారు. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో సమావేశం ప్రారంభం అవుతుంది. -
జగన్ ఓటమిని జీర్ణించుకోలేక..
కొవ్వూరు : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలుకావడం ఆ వీరాభిమాని జీర్ణించుకోలేకపోయాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. మొన్నటి ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉంటారని.. తన ఆవేదనను రాష్ట్రపతి దృష్టికి వెళ్తే మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తూ మిత్రులకు పంపిన వీడియో సందేశంలో వివరించాడు. తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిపై ఉన్న గామన్ బ్రిడ్జిపై మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఏమిటంటే.. తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన తాళ్లూరి రాజు, తన భార్య నాగలక్ష్మి, కుమార్తె హర్షిత, కుమారుడు మోక్షిత్‌తో కలిసి మంగళవారం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య కోవాలని నిర్ణయించుకున్నాడు. కొవ్వూరు–కాతేరు మధ్య గోదావరిపై ఉన్న గామన్ బ్రిడ్జి పైకి వేకువజామునే చేరుకున్నాడు. తాను, తన కుటుంబమంతా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నామని మిత్రులకు వీడియో సందేశం పెట్టాడు. పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, రాజు కుటుంబ సభ్యులు, కొవ్వూరు పట్టణ పోలీసులు ఈ సమాచారం తెలుసుకుని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్రిడ్జిపై రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై ఉన్న రాజుకు, ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్సార్సీపీ కార్యకర్త చిన్నం హరిబాబు, కొవ్వూరు పట్టణ సీఐ వి. జగదీశ్వరరావు, ఇతర సిబ్బంది నచ్చజెప్పి బయటకు తీసుకుకొచ్చారు.ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉంటారు..అనంతరం.. రాజు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడిగినా వైఎస్సార్సీపీకే ఓటు వేశామంటున్నారని, కానీ, జగన్ ఎలా ఓటమి పాలయ్యారో తెలీడంలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. తన కుటుంబ చావుతోనైన ఎన్నికల్లో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ చేస్తారని ఆశిస్తున్నానన్నాడు. ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి ఉంటారని, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని రాజు చెప్పాడు. తన ఆవేదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకువెళ్తే రీపోలింగ్‌కు ఆదేశిస్తారన్న ఉద్దేశంతో వీడియో ద్వారా తన సందేశాన్ని తెలిపి కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానన్నాడు. తన కుటుంబం చావు ద్వారా జగనన్నకు మేలు చేకూరితే చాలని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంత మంచి చేసిన జగన్ ఓడిపోతారనుకోలేదు..తనకు రెండుసార్లు యాక్సిడెంట్ అయితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం చేశారని.. కాలులో స్టీల్‌రాడ్లు వేసి, వైద్యం చేసి, ఇంటికి పంపించారని రాజు తనకు జరిగిన మేలును వివరించాడు. మంచంపై ఉన్న రెండునెలలూ తన కుటుంబ పోషణకు వైఎస్సార్ ఆసరా పేరిట ఆర్థిక సాయం చేశారని.. అలాగే, తనకు ఏళ్ల తరబడి సొంతిల్లు లేదని, జగనన్న దయతో ఇంటి స్థలం ఇచ్చారని, ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పాడు. ఈ ఏడాది తన కుమార్తె చదువుకు అమ్మఒడి సొమ్ము పడుతుందని ఆశపడ్డానని, తన తమ్ముడికీ అమ్మఒడి సాయం అందుతోందని తెలిపాడు. అలాగే, నాన్నమ్మకు రూ.3 వేల పింఛను అందిస్తున్నారని, అందరికీ ఇంత మంచి చేసిన జగన్ ఘోరంగా ఓటమి పాలవుతారని కలలో కూడా ఊహించలేదని కన్నీటితో చెప్పాడు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచీ తనకు కంటి మీద కునుకులేదని, జగనన్న ఓటమి నిరంతరం తనను కలచివేస్తోందని ఆవేదన చెందాడు. ఏదో మోసం జరిగిందనేదే తన బాధ అని, ఈ ఎన్నికలపై విచారణ చేయిస్తే వాస్తవాలు బయటపడతాయన్నాడు.ఇక బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తే ఎన్నికలపై విచారణకు అవకాశం ఉండదన్నారు. అందుకనే తెల్లవారుజామున 5.30 గంటలకు భార్యాపిల్లల్ని తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు బ్రిడ్జిపైకి వచ్చానని చెప్పాడు. రాజు, ఆయన భార్యకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
వెల్డన్ గురు..
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మద్దెల గురుమూర్తి విజయం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫలితాలన్నీ కూటమి అభ్యర్థులకే అనుకూలంగా వస్తుండడంతో తిరుపతి పార్లమెంట్ కూడా బీజేపీ అభ్యర్థే గెలుస్తారని ధీమాగా అనుకున్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో తిరుపతి పార్లమెంట్ అభివృద్ధికి చేసిన కృషిని, ఆయన మంచితనంపై అసత్యాలు, అబద్ధాలు విస్తృతంగా ప్రచారం చేసినా.. ఓటర్లు మద్దెల గురుమూర్తికే పట్టం కట్టారు. ఊహించని విధంగా తిరుపతి ఎంపీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడంపై కూటమి నేతలు జీరి్ణంచుకోలేకపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌లో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే తిరుపతి పార్లమెంట్ కూటమి అభ్యర్థి వరప్రసాద్ పరాజయం పాలవ్వగా వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి 14,569 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం గొప్ప గెలుపు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘క్రాస్’ చేయాలని చూసి బోల్తా పడిన కూటమి.. తిరుపతి ఎంపీ నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తికి అనుకూలంగా భారీస్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగిందనేది స్పష్టం అవుతోంది. ప్రజల కష్టం తెలిసిన వ్యక్తి ఎంపీ కావడంతో నియోజకవర్గానికి ఏదో ఒక మంచి చేయాలనే తపనతో పని చేశారనేది గురుమూర్తికి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. కూటమి ఎంపీ అభ్యర్థి చేసిన దు్రష్పచారాలు ఫలించలేదు. క్రాస్ ఓటింగ్ చేయించి గట్టెక్కాలని భావించారు. కానీ గురుమూర్తి మంచితనం, కృషి ముందు కూటమి కుట్రలు ఏవీ పనిచేయలేదు. అదెలా అంటారా? తిరుపతి లోక్‌సభ పరిధిలోని తిరుపతిలో 60,255 ఓట్లు, శ్రీకాళహస్తిలో 41,979, సూళ్లూరుపేటలో 28,362, వెంకటగిరిలో 15,454, గూడూరులో 19,915, సర్వేపల్లిలో 15,994 ఓట్ల తేడాతో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఈ మెజారిటీలను చూస్తే కూటమి అభ్యర్థే ఘనవిజయం సాధించాలి. కానీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గరికి వచ్చేసరికి ఓటర్లు వైఎస్సార్సీపీ వైపే మొగ్గుచూపారు. సత్యవేడు, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే మెజారిటీ వచ్చింది. ఈ మెజారిటీతో పాటు కూటమి అభిమానులు తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యరి్థని గెలిపించుకున్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో టీడీపీ అభ్యర్థులంతా గెలిచి, ఎంపీ అభ్యర్థి ఓడిపోవడంపై రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయానికి గురవుతున్నారు. తిరుపతి జిల్లాకు పరిశ్రమలను తీసుకువచ్చేందుకు ఎంపీ గురుమూర్తి గత మూడేళ్లుగా అనేక ప్రయత్నాలు చేశారు. కంపెనీల చుట్టూ తిరుగుతూ వారిని జిల్లావ్యాప్తంగా తిప్పి కంపెనీలు, కార్యాలయాలు ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన వసతులు అన్ని తామే సమకూర్చగలమని విన్నవించారు. తద్వారా ప్రజల్లో గురుమూర్తి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నిస్వార్థంగా ప్రజలకు ఎంతో కొంతమేలు చేయాలనే తత్వం, ఆ కష్టానికి ప్రజల ఆశీర్వాదం మళ్లీ లభించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులు చాలామంది ఓడిపోయినా గురుమూర్తి గెలిచారంటే అది ఆయన కష్టాలకు తగిన ఫలితమే అని పలువురు చర్చించుకుంటున్నారు. ఎంపీగా గురుమూర్తి అధికారాన్ని పదిమందికి సాయం చేయడంతో పాటు కార్యకర్తలకు, ఓటర్లకు దగ్గర కావడమే ఆయనకు విజయానికి కారణమని రాజకీయ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కలిసొచ్చిన అంశాలు ఇవే.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో 2021 ఉప ఎన్నికల్లో గురుమూర్తి తొలిసారి రాజకీయ ప్రవేశం చేసి తిరుపతి ఎంపీగా 6,2 6,108 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యరి్థ, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీపై 2,71,592 లక్షల మెజారీ్టతో గెలుపొందారు. 👉 ఎంపీగా గత మూడేళ్ల కాలంలో స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సహకారంతో తిరుపతి పార్లమెంట్ అభివృద్ధికి విశేష కృషి చేశారు. 👉 గత మూడేళ్లలో ఎంపీగా గురుమూర్తి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. 👉 తిరుపతి పరిధిలో కొత్త జాతీయ రహదారుల ఏర్పాటు, పులికాట్ సరస్సు పరిధిలోని గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారంలో చొరవ చూపారు. రోడ్ల నిర్మాణానికి ఆటంకంగా ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్ నిబంధనలు సడలించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన సహకారంతో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. వందలాది గ్రామాలకు సంబంధించిన ప్రధాన సమస్య పరిష్కారానికి అధికారిక ప్రక్రియ ప్రారంభింపజేశారు. 👉 అలాగే 16 వేల కేంద్రప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు ఆరోగ్య సంరక్షణకు వెల్నెస్ సెంటర్ తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. 👉 వేలాదిమంది యువతకు ఇంజినీరింగ్ నైపుణ్యం పెంచేలా శిక్షణ ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వ నైలెట్ సంస్థ తిరుపతికి మంజూరు చేయించారు. 👉 స్విమ్స్, డీఆర్డీఓ అనుబంధ సంస్థ డేబెల్‌తో తక్కువ ఖరీదుకే రోగులకు మెడికల్ ఇంప్లాంట్స్ తయారు చేసే ప్రాజెక్టు తీసుకొచ్చారు. 👉 రైల్వే ప్రాజెక్టుల పురోగతిలో తనదైన ముద్ర వేశారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను రూ.350 కోట్లతో ప్రాజెక్టు పనుల వేగం పెంచారు. 👉 తిరుపతి ప్రజలకు నరకంగా ఉన్న రాయలచెరువు రైల్వే గేటును తొలగించి అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయించారు. 👉 ఏర్పేడు, వెంకటగిరి రైల్వే ఫ్లైఓవర్లు మంజూరు చేయించారు. 👉 తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌కు ఎదురుగా రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.80 లక్షలు నిధులు ఇచ్చారు. 👉 యూనివర్సిటీ రోడ్డులో ఉన్న రైల్వే డీఐకాన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. 👉 వెంకటగిరి కేంద్రీయ విద్యాలయాలన్ని ఇంటరీ్మడియెట్ స్థాయికి పెంచి విద్యార్థులు అక్కడే చదువుకునేలా చర్యలు చేపట్టారు. -
విజయోత్సవాల్లో టీడీపీ శ్రేణుల దాడులు
సాక్షి నెట్వర్క్ : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో టీడీపీ–జనసేన శ్రేణులు మంగళవారం విజయోత్సాహంతో అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఇళ్లపై దాడులు చేశారు. గుంటూరులోని మంత్రి విడదల రజిని కార్యాలయం, పల్నాడు జిల్లాలో ఓ సచివాలయంతోపాటు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చెందిన కళ్యాణమండపాన్ని ధ్వంసం చేశారు.విజయవాడలోని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరులోని వైఎస్‌ను తొలగించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి ఊరేగింపులు చేయరాదని, బాణాసంచా కాల్చరాదని రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఎంత ప్రచారం చేసినా టీడీపీ–జనసేన శ్రేణులు ఎక్కడా పట్టించుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ దాడులు జరిగాయంటే..» ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం విప్పగుంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముఖ ద్వారం, గేట్‌ను టీడీపీ నేతలు జేసీబీతో కూల్చివేశారు. ఈ ముఖ ద్వారం, గేట్‌ను గ్రామానికి చెందిన దాత ముప్పా సుబ్బారావు కుటుంబ సభ్యులు ముప్పా రోశయ్య పేరు మీద 2010లో సుమారు రూ.5 లక్షలతో పాఠశాలకు వీటిని నిర్మించారు. అనంతరం టీడీపీ నేతలు గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు, బీసీ కులానికి చెందిన పెరుగు మాల్యాద్రి ఇంటిని కూల్చడానికి జేసీబీని తీసుకొచ్చి గొడవకు దిగారు. దీంతో మాల్యాద్రితోపాటు అతని భార్య ఆదిలక్ష్మి అడ్డుకోవడంతో టీడీపీ నేతలు వారిపై దాడికి ప్రయత్నించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. జెడ్పీ పాఠశాల ముఖ ద్వారాన్ని కూల్చివేసిన జేసీబీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే, తెలుగు తమ్ముళ్లు దాని నెంబర్ ప్లేట్‌ను తొలగించడం గమనార్హం. » పల్నాడు జిల్లా కొండూరులో టీడీపీ శ్రేణులు నిబంధనలకు విరుద్ధంగా పార్టీ జెండాలతో గ్రామంలో ప్రదర్శనలు నిర్వహించారు. ఎస్సీ కాలనీలోకి వెళ్లగానే కొంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు వచ్చి మీ ఓట్లు ఇక్కడలేవు కదా వెళ్లి గ్రామాల్లోనే ప్రదర్శనలు చేసుకోండి అనడంతో గొడవలు ప్రారంభమై ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీకి చెందిన పోతిపోగు సమాధానం, బండారు వందనం, బుర్రి పుల్లయ్య, పోతిపోగు దేవయ్య, పోతిపోగు యాకోబు, పోతిపోగు మణమ్మ తదితరులకు గాయాలయ్యాయి. బాధితులను అచ్చంపేట పీహెచ్‌సీకి తరలించారు. కోనూరులోను ఇదే పరిస్థితి నెలకొంది. విజయోత్సవం పేరుతో టీడీపీ నాయకులు ఎస్సీ కాలనీలో దాడులు నిర్వహించడంతో పలువురు గాయపడ్డారు. బందరులో రాళ్ల దాడి..కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బందరు పార్లమెంట్ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, బందరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర కార్యకర్తలు పెద్దఎత్తున వాహనాలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలుండే ప్రాంతాలకు వెళ్లి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కూడా ఇలాగే రెచ్చగొట్టారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రతిఘటించేందుకు యత్నించారు. కొంతమంది సీనియర్ నేతలు కార్యకర్తలను సముదాయిస్తుండగా కూటమి కార్యకర్తలు కొడాలి నాని అనుచరుల కారు అద్దాలు పగులగొట్టారు. దీంతో కూటమి కార్యకర్తలు, వైఎస్సార్సీపీ కార్యకర్తల మద్య ఘర్షణ మొదలైంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల విసురుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.కొవ్వూరులో విధ్వంసం..ఎన్నికల్లో విజయం సాధించిన ఆనందంలో టీడీపీ కార్యకర్తలు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోనూ విధ్వంసం సృష్టించారు. 144 సెక్షన్ ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు కార్యాలయానికి మోటార్ సైకిళ్లపై ర్యాలీగా వెళ్లి అక్కడున్న రెండు కార్లను పూర్తిగా ధ్వంసం చేశారు. పోలీసులు వారిస్తున్నా వారిని గెంటేసి కార్యాలయంపై రాళ్లు రువ్వారు. వైఎస్సార్సీపీ ప్రచార రథంతో పాటు ఇన్నోవా కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. సుమారు 50 మంది యువకులు పది నిమిషాల పాటు భయానక వాతావరణం సృష్టించారు. ఆ సమయంలో వెంకట్రావు కుటుంబ సభ్యులందరూ కార్యాలయంలోనే ఉన్నారు. టీడీపీ దాడితో వారు తీవ్ర భయాందోళన చెందారు. అక్కడ నుంచి టీడీపీ శ్రేణులు బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని మెప్మా కార్యాలయం తాళాలు పగులగొట్టి అందులోని కంప్యూటర్లు, టేబుళ్లు, కుర్చీలు, ఇతర ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కార్యాలయంలోని రికార్డులన్నింటినీ బయటకు విసిరేశారు. టీడీపీ హయాంలో ఇదే కార్యాలయంలో అన్న క్యాంటీన్ నడిచేది. తాను అన్ని పార్టీల వారితో స్నేహ భావంతో ఉంటానని, ఇలాంటి వి«టద్వంసం తానెన్నడూ చూడలేదని తలారి వెంకట్రావు అన్నారు. » పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ, జనసేన కార్యకర్తలు వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్ల వద్ద బాణసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మండలంలోని మండపాక గ్రామంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు బోడపాటి వీర్రాజు ఇంటిముందు వీరు బాణసంచా కాల్చడంతో ఆ నిప్పురవ్వలు పడి ఇంట్లోని దుప్పట్లు, ఇతర సామగ్రి దగ్థమయ్యాయి. » ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు భౌతిక దాడులకు దిగారు. దీంతో పల్లెల్లో భయానక వాతావరణం నెలకొంది. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మెను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పలువురు టీడీపీ కార్యకర్తలు ఫ్యాన్ల రెక్కలు విరిచి ద్విచక్ర వాహనాలకు కట్టి వీధుల్లో ఈడ్చుకుంటూ కేకలు వేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పాపిరెడ్డిపల్లిలో వైఎస్సార్సీపీ నేత జయచంద్రారెడ్డి కారును పరిటాల సునీత అనుచరులు ధ్వంసం చేశారు. మరికొన్ని గ్రామాల్లో కూడా వైఎస్సార్సీపీ నాయకులు, సానుభూతిపరులను ఇళ్ల వద్దకెళ్లి కవ్వించి కొందరిని గాయపరిచారు. టపాసులు పేల్చి ఇళ్లపైకి వేశారు. జిల్లా వ్యాప్తంగా ఇలా ఎన్నో ఘటనలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయం ధ్వంసం..గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం సమీపంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘మండలి’ విప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయాన్ని టీడీపీ కార్యకర్తలు పూర్తిగా ధ్వంసం చేశారు. పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్తూ లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయంలోకి చొరబడ్డారు. ఫర్నిచర్, కంప్యూటర్ సామాగ్రి ధ్వంసం చేశారు. అక్కడున్న సిబ్బందిని చంపేస్తామంటూ బెదిరించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బూతులు తిడుతూ కార్యాలయంలోని మొత్తం సామగ్రి పగులగొట్టారు. » చిత్తూరు నగరంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ కార్యాలయాన్ని ధ్వంసంచేసి, పెట్రోలు పోసి నిప్పంటించారు. మార్కెట్ హరి అనే వ్యక్తికి చెందిన రూ.కోటి విలువైన సిగరెట్ స్టాకు గోదాముకు నిప్పంటించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులుగా ఉన్న కన్నన్ నాయకర్, మండీ ప్రభాకర్‌రెడ్డి, ప్రసన్నకు చెందిన హోటళ్లను, బేకరీలను నేలమట్టం చేశారు. పూతలపట్టులోని పాలకూరులో వైఎస్ విగ్రహాన్ని కూలదోశారు. ఎగువ పాలకూరు, బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లెలో దళితుల ఇళ్లలోకి చొరబడి వారిపై దాడులు చేయగా పలువురు గాయపడ్డారు. పూతలపట్టు నయనంపల్లెలో కిరణ్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్త ట్రాక్టర్‌కు నిప్పుపెట్టారు. తవణంపల్లెలోని తెల్లగుండ్లపల్లెలో కృష్ణమూర్తి యాదవ్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్త జేసీబీను అపహరించి, అతని ఇంటి ప్రహరీనే కూల్చేశారు.» పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎండుగుంపాలెం బీసీ కాలనీలోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని గడ్డపారలు, గొడ్డళ్ళలో ధ్వంసం చేశారు. విగ్రహాన్ని పెకిలించి ట్రాక్టర్‌కు కట్టి ఎన్ఎస్పి కాలువ వద్దకు ఈడ్చుకెళ్లారు. పోలీసులు ధ్వంసమైన విగ్రహాన్ని యథాస్థానానికి చేర్చారు. అలాగే, మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ వర్గీయులు మద్యం సేవించి ద్విచక్ర వాహనాలకు ఫ్యాన్లు కట్టి ఈడ్చుకెళ్లారు. పోలీసుల ఆంక్షలున్నా బాణాసంచా కాల్చి భయభ్రాంతులకు గురిచేశారు. తూబాడు గ్రామంలో టీడీపీ వర్గీయులు రోడ్ల మీద పసుపు నీళ్లు చల్లారు. » గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలో తెలుగు తమ్ముళ్లు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని కూల్చేశారు. గ్రామానికి చెందిన దుర్గారావు అనే నేత ట్రాక్టరుతో గుద్దించి విగ్రహాన్ని కూలగొట్టాడు. అతని కోసం వెతుకుతున్నారు. గ్రామస్తులు అక్కడకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. » గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా సోదరుడు కర్నుమా ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు అద్దాలను టీడీపీ శ్రేణులు పగలగొట్టి దాడికి యత్నించారు. కౌంటింగ్ సందర్భంగా కర్నుమా నాగార్జున యూనివర్శిటీకి వచ్చి అనంతరం కుటుంబ సభ్యులతో కారులో గుంటూరు బయల్దేరారు. టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకొచ్చి రాళ్లు, కర్రలతో కారుపై అద్దాలు పగలగొట్టి దాడికి యత్నించారు. కారులో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. కర్నుమా కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. » పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో జరిగిన విజయోత్సవ ర్యాలీ వైఎస్సార్సీపీ నాయకురాలు, గ్రామ సర్పంచ్ చికిలే మంగతాయారు ఇంటి సమీపంలోకి రాగానే కూటమి అభిమానులు తారాజువ్వలు వేస్తూ, మోటార్ సైకిళ్ల సైలెన్సర్లను తొలగించి భీకర శబ్దాలతో నానా హంగామా చేశారు. ఇదే సమయంలో పెదపేటకు చెందిన యువకులతో టీడీపీ–జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగి ఘర్షణలకు పాల్పడ్డారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. » అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాలచెర్ల గ్రామ సచివాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దాదాపు పదిమంది గ్రామ సచివాలయానికి చేరుకుని విధుల్లో ఉన్న సిబ్బందిని బెదిరించారు. కిటికీ అద్దాలను పగలగొట్టారు. కంప్యూటర్‌పై నీళ్లు పోశారు. ప్రింటర్‌ను, బాత్రూమ్ డోర్లను పగలగొట్టారు. సచివాలయంపైన ఉన్న సింథటిక్ ట్యాంకు పైపులను ధ్వంసం చేశారు. సుమారు రూ.50 వేల మేర నష్టపరిచారు. ఇదే గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్ల దాడిచేశారు.» ఏలూరు జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడులో ఓ పెట్రోలు బంకుతోపాటు దాని యజమాని ఇంటిపై కొందరు టీడీపీ కార్యకర్తలు దాడిచేసి రాళ్లు రువ్వారు. దీంతో ఆ యజమాని, మండల వైస్ ఎంపీపీ అయిన వేమూరి జితేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. » ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని దొరసానిపాడులో ఒక కూల్‌డ్రింక్ షాపు వద్ద వైఎస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఎన్నికల ఫలితాలపై వాగ్వివాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు కూల్‌డ్రింక్ సీసాలతో దాడి చేసుకున్నారు.ఈ దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన గ్రామ సర్పంచ్ లక్కాబత్తుల సిద్ధిరాజు, లక్కాబత్తుల సురేష్, బిరుదుగడ్డ కిరణ్, అల్లాడ సురేష్, లక్కాబత్తుల జాన్‌బాబు, బిరుదుగుడ్డ కల్యాణ్, డీజే రాజు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను కవర్ చేస్తున్న ఒక విలేకరి సెల్‌ఫోన్‌ను లాక్కుని అతడిని గాయపరిచారు. మరోవైపు.. ఇక్కడి కూటమి కార్యకర్తలు బైక్ ర్యాలీ నిమిత్తం ఎస్సై సతీష్‌తో ఘర్షణకు దిగారు.» ఇదే జిల్లా భీమడోలు మండలంలోని పోలసానిపల్లి, అంబర్‌పేట, సూరప్పగూడెం, కురెళ్లగూడెం, భీమడోలు తదితర గ్రామాల్లోనూ గొడవలు చోటుచేసుకున్నాయి. పోలసానిపల్లిలో జనసేన కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ చేసుకుంటూ ఎంపీటీసీ అంబటి దేవీ నాగేంద్రప్రసాద్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలకు, ఎంపీటీసీ కుమారుడు, కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అధిక సంఖ్యలో ఉన్న జనసేన కార్యకర్తలు ఎంపీటీసీ కుమారుడితో పాటు కుటుంబ సభ్యులపై దాడిచేశారు. వారి దుస్తులను చించివేశారు. అలాగే, అంబర్‌పేట రైతుభరోసా కేంద్రంలోకి చొరబడిన టీడీపీ కార్యకర్తలు రూ.1.50 లక్షల విలువైన కంప్యూటర్, íప్రింటర్లు, ర్యాక్‌లు, కుర్చీలను ధ్వంసం చేశారు. సిబ్బంది ఎంత వారించినా టీడీపీ కార్యకర్తలు వినలేదు.విడదల రజిని కార్యాలయం అద్దాలు ధ్వంసం..గుంటూరులో టీడీపీ శ్రేణులు ఎన్నికల విజయోత్సవంలో భాగంగా పెద్దఎత్తున ర్యాలీగా బయల్దేరి వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడదల రజిని కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ కొంతసేపు నినాదాలు చేసి కార్యాలయంపై రాళ్లు విసిరారు. అక్కడున్న పోలీసు సిబ్బంది వారిని వారించినా లెక్కచేయకుండా కార్యాలయం అద్దాలను పగులగొట్టారు. కార్యాలయం షట్టర్లు బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసు అదనపు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని కార్యకర్తలను చెదరగొట్టారు. అయినా టీడీపీ కార్యకర్తలు పోలీసులను లెక్కచేయకుండా కార్యాలయంపై రాళ్లు విసిరారు. » పల్నాడు జిల్లా కొచ్చర్ల సచివాలయంపై మంగళవారం తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు దాడిచేశారు. ఇరు పార్టీలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు కర్రలు, గడ్డపార్లతో సచివాలయంపై దాడిచేసి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అనంతరం లోపల ఉన్న ఫర్నిచర్‌ను ధ్వంసంచేసి సర్పంచ్ కుర్చీని బయటపడేసి తగలబెట్టారు. లోపలున్న కంప్యూటర్ను, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయం పైకెక్కి టీడీపీ జెండాను ఏర్పాటుచేశారు. దీంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కార్యాలయంపైకి రావడంతో సచివాలయ సిబ్బంది పరుగులు తీశారు. పోలీసులు వీరిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. » ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరులోని వైఎస్సార్ పేరును టీడీపీ నేతలు తొలగించారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో టీడీపీకి సానుకూలంగా ఫలితాలు రావడంతో కొందరు టీడీపీ కార్యకర్తలు యూనివర్శిటీ వద్దకు వెళ్లి, మెయిన్ గేటు వద్ద ఉన్న పేరును కాళ్లతో తన్ని ఊడగొట్టడంతో పాటు, భవనం పైకెళ్లి పేరులోని వైఎస్ అక్షరాలను తొలగించారు. ఆ స్థానంలో ఎన్టీ అక్షరాలను పెట్టారు. » పల్నాడు జిల్లా వినుకొండ కారంపూడి రోడ్డులోని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చెందిన కళ్యాణ మండపాన్ని మంగళవారం కొంతమంది అల్లరి మూకలు రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. కళ్యాణ మండపంలోని అద్దాలను పగలగొట్టడమే కాకుండా అక్కడున్న కారును కూడా కాళ్లతో తన్నుతూ సుమారు అరగంటసేపు విధ్వంసం సృష్టించారు. టీడీపీ జెండాలను పట్టుకుని ద్విచక్ర వాహనాలపై కల్యాణ మండపంలోకి ప్రవేశించి ప్రధాన ద్వారం వద్ద అద్దాలు పగలగొట్టి వెళ్లిపోయారు. దీంతో అక్కడ సిబ్బంది కూడా భయభ్రాంతులకు గురయ్యారు. -
ఈసీ నోరుమెదపదేం?!
కోట్లాదిమంది పౌరులు నచ్చినవారిని, సమర్థులనుకున్నవారిని తమ ప్రతినిధులుగా ఎంపిక చేసుకునే అసాధారణ ప్రక్రియ ఎన్నికలు. ఆ ప్రక్రియను ఎంత పారదర్శకంగా...ఎంత వివాదరహితంగా...ఎంత తటస్థంగా నిర్వహిస్తే అంతగా ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఆదినుంచీ ఇందుకు విరుద్ధమైన పోకడలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడింది మొదలు చిత్ర విచిత్ర ధోరణులు కనబడ్డాయి. పోలింగ్ రోజైన ఈనెల 13న, ఆమర్నాడు రాష్ట్రంలో జరిగిన ఉదంతాలు వీటికి పరాకాష్ఠ. వివిధ జిల్లాల్లో చెదురుమదురుగా చోటుచేసుకున్న ఘటనలు ఒక ఎత్తయితే నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరిగిన ఉదంతాల పరంపర మరో ఎత్తు. టీడీపీ రౌడీ మూకలు పోలింగ్ కేంద్రాల్లోకి జొరబడి వైఎస్సార్ కాంగ్రెస్ ఏజెంట్లపై దౌర్జన్యం సాగించి వెళ్లగొట్టడం, వోటేయడానికి క్యూలో నించున్న బలహీనవర్గాలవారినీ, మహిళలనూ కొట్టి వెనక్కిపంపడం వంటి ఉదంతాలపై ఫిర్యాదు చేసినా అరణ్యరోదనే అయింది. అసాంఘిక శక్తులు చొరబడి పోలింగ్ ప్రక్రియను దెబ్బతీయకుండా చూడటానికీ, అవసరమైనప్పుడల్లా కిందిస్థాయి అధికారులకు తగిన ఆదేశాలివ్వడానికీ, సమస్యాత్మక ప్రాంతాలకు బలగాలు తరలించటానికీ వీలుంటుందని ఏర్పాటుచేసిన వెబ్‌కాస్టింగ్‌ను ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. దాని నియంత్రణ టీడీపీ చేతుల్లోకి పోయింది. ఆ తర్వాత రెండురోజులూ పచ్చమూకలు తెగబడి రోడ్లపై స్వైరవిహారం చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌కు వోటేశారనుకున్నవారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించాయి. ఈ మూకలకు భయపడి వందలమంది ఇళ్లూ వాకిళ్లూ వదిలి వేరేచోట తలదాచుకోవాల్సివచ్చింది. ఇదంతా చానెళ్లలో ప్రసారం అవుతున్నా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు బాధ్యతవహించాల్సిన అధికారులకుగానీ, శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సిన పోలీసు అధికారులకుగానీ చీమకుట్టినట్టయినా లేదు. ఎన్నికలకు రెండురోజుల ముందు త్రికూటమి సౌజన్యంతో విధుల్లో చేరిన ఉన్నతాధికారులు ఈ విధ్వంసకాండ సాగుతున్న సమయంలో మౌనదీక్షలో మునిగిపోయారు. పరువు బజార్నపడిందనుకున్నదో ఏమో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని నివేదిక తెప్పించుకుని ముగ్గురు ఎస్పీలనూ, ఒక కలెక్టర్‌నూ బదిలీచేసింది. మూడు జిల్లాల్లో 12 మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేసింది. సిట్ ఏర్పాటుచేసి దర్యాప్తు చేయించింది. ఇంత జరిగినా కారంపూడి సీఐగా ఉంటూ టీడీపీ విధ్వంసకాండకు కొమ్ముకాసిన నారాయణస్వామికి మాత్రం ఏం కాలేదు. ఐజీ త్రిపాఠి సరేసరి. వీరు కొత్త కొత్త కేసులు బనాయిస్తూ స్వామిభక్తిని చాటుకుంటున్నారు.త్రికూటమి ఆడించినట్టల్లా ఆడటానికి ఎన్నికల సంఘం రెడీ అయిపోయిందని ఉన్నతాధికారుల ఏకపక్ష బదిలీలు మొదలైనప్పుడే అందరికీ అర్థమైపోయింది. ఎవరిని ఎక్కడ నియమించాలో ఆదేశిస్తూ కూటమి ఇచ్చిన ఆదేశాలకు ‘జీ హుజూర్’ అంటూ కొత్త అధికారులను దించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా కొందరు అధికారులను నియమించటంతో మొదలైన కుట్రపై లోతుగా దర్యాప్తు చేస్తే తప్ప ఎన్నికల రోజునా, ఆ తర్వాతా కొనసాగిన హింస, విధ్వంసకాండ వెనక ఏయే శక్తులున్నాయో వెల్లడి కాదు. మన దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియను చూసి ముచ్చటపడి అనేక దేశాలు దాన్ని అనుసరించటం మొదలెట్టాయి. ఎప్పటికప్పుడు అభివృద్ధి అవుతున్న కొత్త సాంకేతికతలతో ఎన్నికల ప్రక్రియ మరింత మెరుగ్గా, సాఫీగా సాగేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్నది. మరి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఏమైంది? ఈ ఉదంతాల సమయంలో ఎందుకాయన మౌనంగా ఉండిపోయారు? కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునేవరకూ తన వంతుగా చేసిందేమిటి? ఎన్నికల రోజున మాచర్ల వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 8 గ్రామాల్లో టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న వైనం గురించి వరసగా రెండు లేఖలు రాసినా, అలాంటిచోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండు చేసినా మీనా ఎందుకు జవాబీయలేదు? ఈవీఎం పగలగొట్టినట్టు టీడీపీ ఒక వీడియో విడుదల చేసేవరకూ ఆ ఉదంతం తెలియనట్టే ఎందుకున్నారు? 23 గంటల నిడివికిపైగా ఉన్న ఆ వీడియోలో ముందూ వెనకా ఏం జరిగిందో అసలు ఎన్నికల సంఘం చూసిందా? చూస్తే ఎందుకు మౌనం వహించింది? అన్నిటికన్నా చిత్రమేమంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి అదే రోజు రీ పోలింగ్ కోసం డిమాండ్ చేయగా నాలుగైదు రోజుల తర్వాత ఆ వీడియో బయటపెట్టిన టీడీపీ ఇంతవరకూ రీపోలింగ్ కోరనేలేదు. వెబ్‌కాస్టింగ్ మొత్తం టీడీపీ ముఠా నియంత్రణలో ఉందన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం నోరు మెదపటం లేదు.ఇంత బరితెగింపుతో దేశంలో ఎక్కడా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు. తన బాధ్యతేమిటో, కర్తవ్యవేమిటో మరిచి తోకపట్టుకుని పోయే చందంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం ఇప్పటికైనా మౌనం వీడాలి. నర్సరావుపేట పరిధిలోనే కాదు... ఇతర నియోజకవర్గాల్లోనూ ఈవీఎంలు ధ్వంసం చేసిన ఉదంతాలు వెల్లడయ్యాయి. మంత్రి అంబటి రాంబాబు కొన్నిచోట్ల రీపోలింగ్ కోరారు. వీటన్నిటికీ జవాబు రావాలి. సంజాయిషీ ఇవ్వాల్సిన స్థానంలోవున్నవారు మూగనోము పడితే అనుమానాలు మరింత బలపడతాయి. కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా సాగుతుందా అన్న సందేహాలు తలెత్తుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఈ తలకిందుల వ్యవస్థను నిటారుగా నిలబెట్టాలి. ప్రజాస్వామ్యంపై ప్రజలకుండే విశ్వసనీయతను కాపాడాలి. -
పోటెత్తిన వోటర్లు!
సార్వత్రిక ఎన్నికల తొలి మూడు దశల తీరు వేరు... సోమవారంనాటి నాలుగో దశ పోలింగ్ తీరు వేరు. దేశవ్యాప్తంగా మొత్తం 96 లోక్‌సభ స్థానాల్లో జనం పెద్దయెత్తున వోటింగ్‌లో పాల్గొన్నారు. ఈ నాలుగో దశలో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందుకోసమే కాక ఈ రాష్ట్రంవైపు దేశమంతా ఆసక్తిగా చూడటానికి ప్రత్యేక కారణం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అయిదేళ్ల పాలన తర్వాత ప్రజల ఆశీస్సులు కోరుతూ నిర్వహించిన ‘సిద్ధం’ సభలకూ, బస్సు యాత్రకూ పోటెత్తిన జనవాహినిని చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. ‘మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు వోటేయండి’ అంటూ ప్రజానీకానికి పిలుపునీయటం, అందుకు వచ్చిన సానుకూల స్పందన అసాధారణమైనవి. విపక్షం పూనకం వచ్చినట్టు వ్యక్తిగత దూషణలకు దిగినా, కులాల పేరిట ప్రాంతాల పేరిట చిచ్చురేపాలని చూసినా జగన్, ఆయన పార్టీ హుందాగా వ్యవహరించారు. ఈ ఎన్నికలు ‘పేదలకూ, పెత్తందార్లకూ జరిగే యుద్ధం...ఇందులో మీరు ఎటువైపో తేల్చుకోండ’ని ఇచ్చిన ఆయన పిలుపును పల్లెసీమల నుంచి నగరాలు, పట్టణాల వరకూ అన్నిచోట్లా అందరూ అందుకున్నారు. కొత్తగా వోటు హక్కు వచ్చిన యువత మొదలుకొని వృద్ధుల వరకూ...వికలాంగులు మొదలుకొని అనారోగ్యంతోవున్న పెద్దల వరకూ... వేసవి తీవ్రతను కూడా లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు తరలిరావటంలోని ఆంతర్యం అదే. కనుకనే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. వోటేయటానికి బారులు తీరిన మహిళలు, వృద్ధుల్ని చూసి టీడీపీ కూటమి వణికింది. దానికి తోడు గతంలో ఎవరూ సాహసించని, యోచించని ఒక వినూత్న ప్రయోగం చేశారు జగన్. అన్ని సామాజిక వర్గాలకూ పాలనలో సమ భాగస్వామ్యం కల్పించాలన్న పట్టుదలతో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సగభాగం అట్టడుగు వర్గాలకు కేటాయించారు. అందువల్లే జనం వైఎస్సార్ కాంగ్రెస్‌ను గుండెల నిండా హత్తుకున్నారు. సాధారణంగా అయిదేళ్ల పాలన ఏ ప్రభుత్వం పైన అయినా ఎంతో కొంత అసంతృప్తి తీసుకొస్తుంది. అత్యంత జనాకర్షణగల సినీ దిగ్గజం ఎన్టీరామారావు కొత్తగా పార్టీ స్థాపించినప్పుడు రోడ్లపైకి భారీయెత్తున వచ్చిన జనమే... ఆయన పాలన చూశాక మొహం చాటేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. దాన్నుంచి కోలుకుని ప్రజాభిమానాన్ని చూరగొనడానికి ఆయనకు మరో అయిదేళ్లు పట్టింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 4న వెల్లడయ్యాక దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది. జనరంజక పాలన అంటే ఏమిటో... ఏం చేస్తే ప్రజల ఆదరాభిమానాలు సాధించుకోవచ్చునో అన్ని రాష్ట్రాల రాజకీయ నాయకులూ గ్రహిస్తారు. సంక్షేమం అంటే కేవలం తాయిలాలు పంచటం కాదని, వారి భవిష్యత్తును వారే నిర్మించుకునే విధంగా ఆసరాగా నిలబడటమని నిరూపించిన జగన్‌ను ఇకపై వారంతా రోల్ మోడల్‌గా తీసుకుంటారు. పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తేనే కుటుంబాలు బాగుపడతాయని గుర్తించి ఆ రంగాన్ని ప్రక్షాళన చేయటం, ప్రామాణికమైన విద్యనందించటం, ‘నాడు–నేడు’ పేరిట బడులన్నిటినీ తీర్చిదిద్దటం కనీవినీ ఎరుగనిది. వైద్యరంగంపైనా ఆయన అంతే శ్రద్ధ పెట్టారు. భారీయెత్తున సిబ్బందిని నియమించి ఆస్పత్రులను తీర్చిదిద్దటం, ఆధునాతన వైద్య పరికరాలు, ఔషధాలు సమకూర్చటం, పల్లెలకు సైతం వైద్య సేవలు చేరేయటం మామూలు విషయం కాదు. అలాగే రైతు కోసం ఏర్పాటైన వ్యవస్థలైతేనేమి... వలంటరీ వ్యవస్థద్వారా ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లటమైతేనేమి జగన్ విజయాల్లో మచ్చుకు కొన్ని. దేశంలో ప్రజాభిమానాన్ని చూరగొనాలనుకునే నాయకులెవరైనా వీటిని అనుసరించక తప్పదు.అయితే జనం మనస్సుల్లోంచి దీన్నంతటినీ తుడిచేయాలని చూసిన జిత్తులమారి టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి గురించీ, వారి చేష్టలకు వంతపాడిన ఎన్నికల సంఘం గురించీ ప్రస్తావించుకోవాలి. వారి నుంచి ఫిర్యాదు రావటమే తడవుగా ఉన్నతాధికారులను బదిలీ చేయటం, అయిదేళ్ల నుంచి అమలవుతున్న పథకాలకు మోకాలడ్డటం,వారు కోరిన విధంగా అడ్డగోలుగా అధికారుల్ని నియమించటం... టీడీపీ పోకడలపై ఫిర్యాదు చేసినా బేఖాతరు చేయటం లేదా ఆలస్యంగా స్పందించటం తటస్థంగా వుండాల్సిన వ్యవస్థకు తగదు. సాక్షాత్తూ బాబే ఎన్నికల సభల్లో సీఎంనుద్దేశించి దూషించినా... ఆయన్ను రాళ్లతో కొట్టాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా బాబును ఆపే ప్రయత్నం చేయలేదు. వేరే రాష్ట్రాల్లో ప్రధానినుద్దేశించి చిన్న వ్యాఖ్య చేసినా నొచ్చుకున్న ఆ వ్యవస్థ ఏపీలో వీటన్నిటినీ ఎలా కొనసాగనిచ్చింది? అన్నీ ఒక ఎత్తయితే ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై బాబు అండ్ కో సాగించిన దుష్ప్రచారం, ప్రజలను భయపెట్టడం మరో ఎత్తు. బాబు, లోకేష్‌లపై కేసులు పెట్టాలని ఆదేశించారు సరే... కానీ ఆ తర్వాత అదే అంశంపై నిబంధనలకు విరుద్ధంగా మీడియాలో పూర్తి పేజీ ప్రకటనలిస్తే ఎందుకు సంజాయిషీ కోరలేదు? నిజానికి పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగిందంటే అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ సంయమనమే కారణం. అయినదానికీ, కానిదానికీ రాయలసీమపై అభాండాలేయటం బాబు దురలవాటు. కానీ చిత్రంగా అక్కడ అత్యంత ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఇతరచోట్లే టీడీపీ బరితెగింపుతో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈవీఎంల ధ్వంసం, పెట్రోల్ బాంబులతో దాడి, పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలను బెదిరించటం, బౌన్సర్లతో హడలెత్తించటం, పోలీస్ స్టేషన్‌పై దండయాత్ర చేయటం దేనికి సంకేతం? ఎన్ని అవరోధాలెదురైనా నిర్భయంగా పోటెత్తి వోటేసిన ప్రజానీకం అభీష్టానిదే అంతిమ విజయం. -
వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చీల్చి, చంద్రబాబుకు మేలు చేకూర్చడమే లక్ష్యంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్పష్టమైంది. పాడేరులో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి వంతల సుబ్బారావును విరమింపజేయడానికి షర్మిల చేసిన ప్రయత్నం షర్మిల ఎల్లో రాజకీయాన్ని తేటతెల్లం చేసింది. వైఎస్సార్సీపీ ఓట్లు కోసమే బుల్లిబాబుకి టికెట్ ఇచ్చామంటూ సుబ్బారావుతో షర్మిల మాట్లాడిన ఆడియో లీకవడంతో అడ్డంగా దొరికిపోయారు.పాడేరు కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల తొలుత వంతల సుబ్బారావును ఎంపిక చేశారు. ఇటీవల పాడేరులో జరిగిన సభలో కూడా సుబ్బారావే అభ్యర్థి అని ప్రకటించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ నుంచి బుల్లిబాబు కాంగ్రెస్‌లోకి రావడంతో షర్మిల ప్లేటు ఫిరాయించారు. సుబ్బారావును కాదని బుల్లిబాబుకు టికెట్ ఇచ్చారు. దీంతో వంతల సుబ్బారావు రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో షర్మిల సుబ్బారావుతో ఫోన్లో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చేందుకే బుల్లిబాబుకి టికెట్ ఇస్తున్నామనీ.. పోటీ నుంచి తప్పుకోవాలని కోరారు. రెబల్‌గా బరిలో ఉంటే పార్టీలోకి మళ్లీ రాలేరంటూ హెచ్చరించారు. మీ సభలకంటే నా సభలకే జనాలు ఎక్కువ మంది వస్తున్నారంటూ సుబ్బారావు కూడా ఘాటుగా సమాధానమిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న ఆడియోలో ఏముందంటే..షర్మిల: నమస్తే అన్నా.. ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా. నెక్ట్స్ టైమ్ తప్పకుండా ఆపర్చ్యూనిటీ ఇస్తాం. పార్టీలో సముచితమైన స్థానం, గౌరవమిస్తాను. మీరు నా సొంత అన్న లెక్క అన్నా. అర్థం చేసుకోకపోతే ఎలా అన్నా. నేనైతే మీకియ్యాలనే అనుకున్నానన్నా. కానీ రఘువీరారెడ్డి గారు ఆల్రెడీ అరకు సీపీఎంకు ఇచ్చేశారు. ఈ సీటు బల్లిబాబుకు ఇమ్మన్నారు. మీకు అన్నీ తెలిసి మేమేదో డబ్బుల కోసమో.. నా టీమ్ ఏదో డబ్బుల కోసమో బుల్లిబాబుకి ఇచ్చామని ప్రచారం చెయ్యడం కూడా కరెక్ట్ కాదు కదా మీరు. అది వాస్తవం కాదు కదా అన్నా..సుబ్బారావు: నేనేమీ ప్రచారం చెయ్యలేదు. నేనైతే ఎక్కడా మీ గురించి కానీ, పార్టీ గురించి కానీ ప్రచారం చెయ్యలేదు.షర్మిల: సరే అన్నా.. ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు. మీరు రెబల్ కావద్దు. నెక్ట్స్‌టైమ్ తప్పకుండా అవకాశం ఉంటుంది. కమ్ బ్యాక్.సుబ్బారావు: ఇంత అన్యాయం ఏంటి మేడం. ఏ రోజూ జెండా మోయని వాడికీ, పార్టీలో లేనివాడికీ ఇచ్చెయ్యడం వల్ల నాకు బాధ ఉంది. మరొక్క విషయం.. మీరు వేలాది మంది జనం ముందు ప్రకటన చెయ్యకపోయినా బాగుండేది. మీరు ప్రకటన చెయ్యడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను. మా వాళ్లు కూడా ఫీలయ్యారు.షర్మిల: అన్నా.. మీకు అన్నీ తెలుసు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ముఖ్యం, మనకు వైసీపీ ఓటు బ్యాంకు కూడా ముఖ్యము. రెండూ కలిసొస్తాయనే కదా తీసుకుంది. నేను తీసుకుంది ఎందుకు? వైసీపీ ఓటు బ్యాంకు కోసమే కదా.సుబ్బారావు: నేనిప్పుడు చూశాను.. మీరు మాట్లాడింది, మీరు ప్రచారం చేసింది. మొన్న నా జనాల్ని చూస్తే.. మీకంటే ఐదు రెట్లు ఎక్కువ మంది వచ్చారు. రూపాయి ఖర్చు పెట్టకుండా. వీడియోలు పెట్టమంటే పెడతాను. చూడండి. నేను ఓటు బ్యాంకు ఉన్నవాడిని. కానీ.. గ్రౌండ్ లెవల్లో రిపోర్ట్ లేదు అని అన్నారు. నా రిపోర్ట్ ఏంటో ఎవరికెన్ని ఓట్లు వస్తాయో చూడండి. నేను కాంగ్రెస్‌లోనే ఉంటాను.షర్మిల: అన్నా.. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే ఇంక కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి.సుబ్బారావు: మర్చిపోవాలంటే.. మర్చిపోతానిక.షర్మిల: మర్చిపోండి.. మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది. మళ్లీ కుటుంబంలోకి రావడానికి. మీరు రెబల్‌గా పోటీ చేసినాక, కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసినాక మళ్లా మీరు కాంగ్రెస్‌లోకి రాలేరు.సుబ్బారావు: నా భవిష్యత్తే డ్యామేజ్ అయ్యింది. నాకింకేముంది మరి.షర్మిల: అదే అన్నా.. ఇప్పుడు ఆలోచించుకోండి. మళ్లీ మీకు కాంగ్రెస్ పార్టీ అవసరము అని వెనక్కొస్తే మీకిక్కడ స్థానం ఉండదు.సుబ్బారావు: మంచిదే కదా. -
తెరపైకి తెలుగు కాంగ్రెస్!
సాక్షి ప్రతినిధి, కడప: సార్వత్రిక ఎన్నికల పర్వంలో రాజకీయ పక్షాల అపవిత్ర కలయికలు తెరపైకి వస్తున్నాయి. తాము గెలవడం కంటే తమ ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టడమే లక్ష్యంగా రాజకీయ పార్టీల మధ్య అవగాహన కుదురుతోంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య కొనసాగుతున్న మైత్రి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. తాము ఎటూ గెలవలేం, వైఎస్సార్సీపీని నియంత్రించడమే లక్ష్యం కావాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ సద్వినియోగం చేసుకుంటోంది. వెరసి తెలుగు కాంగ్రెస్ రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి.ప్రజల ముంగిట్లోకి పాలన తీసుకువచ్చాం. క్షేత్రస్థాయిలో ఎంతో అభివృద్ధి చేశాం.. రాజకీయాలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాం. మరోమారు అవకాశం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను అభ్యర్థిస్తోంది. తమ పాలనలో లబ్ధి చేకూరి ఉంటేనే ఆశీర్వదించండని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం కోరుతున్నారు. చరిత్రలో తన వల్ల మేలు చేకూరి ఉంటే ఓట్లు వేయండనే రాజకీయ నేత ఇంతవరకూ ఎవరూ లేరని ప్రజలు కొనియాడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కుట్రలు, కుయుక్తులతో లబ్ధి పొందాలనే వైఖరిని తెలుగుదేశం పార్టీ అవలంబిస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీకి గణనీయంగా పట్టు ఉన్న ఓటర్లలో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధానంగా మైనార్టీ ఓట్లు చీల్చడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు.వ్యూహాత్మకంగానే అఫ్జల్ఖాన్ అభ్యర్థిత్వంజిల్లాలో వైఎస్ కుటుంబం అన్నా, వైఎస్సార్సీపీ అన్నా పార్టీలకు అతీతంగా ముస్లిం మైనారీ్టలు అండగా నిలుస్తూ వస్తున్నారు. గతంలో అనేక ఎన్నికల్లో ఆ విషయం తేటతెల్లమైంది. ఇప్పటికే కడపలో రెండు పర్యాయాలు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎస్బి అంజద్‌బాషా విజయకేతనం ఎగురవేశారు. ప్రస్తుతం మరోమారు తలపడుతున్నారు. ఈమారు వైఎస్సార్సీపీని ఎన్నికల్లో ఎలాగైనా నియంత్రించాలనే లక్ష్యంతో టీడీపీ కుయుక్తులు పన్నుతోంది. ఓవైపు విద్వేషాలు రెచ్చగొడుతూ కుట్ర రాజకీయాలు చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్న ముస్లిం మైనారీ్టల ఓట్లు చీల్చేందుకు శతవిధాలా ప్రయతి్నస్తోంది. ఆమేరకే కడపలో అఫ్జల్‌ఖాన్‌ను కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీలో దించారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అఫ్జల్ఖాన్ అభ్యర్థిత్వం ఎంచుకోవడం వెనుక కూడా కారణం లేకపోలేదు. ముస్లిం మైనార్టీలలో పఠాన్ తెగకు చెందిన వారిని తమ వైపు మరల్చుకోవాలనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఆర్థిక సహకారం అందించేందుకు రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కడప శివార్లలోని జయరాజ్ గార్డెన్లో తెలుగు కాంగ్రెస్ నేతలు సమావేశమై అఫ్జల్ఖాన్ అభ్యరి్థత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.కడప, ప్రొద్దుటూరు, రాయచోటిలలో ఎందుకంటే... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనారిలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ముస్లిం కుటుంబాలకు ఎంతో లబ్ధి చేకూరింది. తద్వారా వైఎస్ కుటుంబానికి అండగా ఉంటున్నారు. కడపలో ముస్లిం మైనార్టీ ఓటర్లు దాదాపు 90వేలు ఉన్నారు. వీరి మద్దతు ఏకపక్షంగా వైఎస్సార్సీపీకి కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ, జనసేనతో పొత్తు కారణంగా కూడా టీడీపీకి వ్యతిరేకంగా నిలవనున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారి ఓట్లలో చీలిక తీసుకువస్తే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందనే దిశగా టీడీపీ నాయకులు అడుగులు వేశారు. ఆ మేరకు కాంగ్రెస్ పారీ్టతో చేతులు కలిపి కడపలో అఫ్జల్‌ఖాన్‌ను కాంగ్రెస్అభ్యర్థిగా ఎంపిక చేయించారు. ప్రొద్దుటూరు, రాయచోటి నియోజకవర్గాల్లో కూడా ఇదే పంథాను కొనసాగించారు. ప్రొద్దుటూరులో దాదాపు 45వేలు ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరిలో భారీగా చీలికలు తీసుకురావాలనే ఉద్దేశంతో మహమ్మద్ నజీర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాయచోటిలో కూడా అల్లాబ„Š ఎంపిక వెనుక కూడా టీడీపీకి లబ్ధి చేకూర్చడమే అసలు లక్ష్యమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో ఇలా అవసరమైన మేరకు సహకరించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో నిత్యం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్లో టచ్‌లో ఉన్నట్లు కూడా పలువురు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి జిల్లాలో తెలుగు కాంగ్రెస్ రాజకీయాలు తెర ముందుకు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
యూటర్న్ చంద్రబాబు బాగోతం ఇది
వలంటీర్లకు పది వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పడం ద్వారా మన పాలన గొప్పగా ఉందని ఆయన సర్టిఫికెట్ ఇచ్చారు... ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్య.. రాష్ట్రం విధ్వంసం అయింది..జగన్ ఇంతకాలం ప్రజలకు కనిపించలేదు.. ఇప్పడు మళ్లీ జనంలోకి వస్తున్నారు. అది ఓట్ల మీద ప్రేమ.. జగన్‌ను ఎవరూ నమ్మవద్దు.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగంలో ఒక భాగం ఐదుకోట్ల మందికి ఏ ఒక్క నాయకుడో సరిపోరు. మూడు పార్టీల బలమైన నాయకత్వం కావాలి.కేంద్ర సహకారం, చంద్రబాబు అనుభవం, జనసేన పోరాట శక్తి కావాలి..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన కొత్త విషయం పవన్ శక్తి, చంద్రబాబు యుక్తి ,మోదీ సంకల్పం ..టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి బలం.. బీజేపీ ఎపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్య ఈ నలుగురు కొద్ది రోజుల క్రితం తణుకు వద్ద జరిగిన సభలో చేసిన ప్రసంగాలను విశ్లేషించండి. జగన్ తాను ఐదేళ్ల పాలన సమయంలో చేసిన వివిధ అబివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సాకల్యంగా వివరించడంతో పాటు, చంద్రబాబు వలంటీర్ల వ్యవస్థపై యూ టర్న్ తీసుకున్న తీరును సమర్ధంగా వివరించగలిగారు.అంతేకాక చంద్రబాబు 2014 లో ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలు, వాటిని అమలు చేయని వైనాన్ని విపులంగా ప్రజలకు తెలియచెప్పారు. జగన్ సభ ఒక ఖాళీ ప్రదేశంలో భారీ ఎత్తున జరిగితే, కూటమి సభ ఒక రోడ్డుమీద జరిపి జనం బాగా వచ్చారని సంతోషపడడం కూటమి నేతల వంతుగా మారింది. జగన్ ఎక్కడా ఎవరిని దూషించకుండా , ప్రత్యేకించి ఆయా నియోజకవర్గాలలో పోటీచేస్తున్న టీడీపీ ,ఇతర పార్టీల అభ్యర్దుల ప్రస్తావన తేకుండా ,తన పార్టీ అభ్యర్ధులను మాత్రం పరిచయం చేసి గెలిపించాలని కోరుతున్నారు. కాని కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఎక్కడకు వెళితే అక్కడ ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్ధిపై తీవ్రమైన విమర్శలు, అడ్డగోలు ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించాలని యత్నించారు. జగన్ తన స్కీముల గురించి ప్రజలకు తెలియచెప్పి, తాను ప్రతి ఇంటికి మంచి చేశానని ధైర్యంగా చెబుతున్నారు. కాని చంద్రబాబు మాత్రం అలా చెప్పలేకపోతున్నారు.పైగా వలంటీర్ల వ్యవస్థపై ఆయన యుటర్న్ తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ పరువు పోయింది.ఇంతకాలం వలంటీర్లను బండబూతులు తిట్టిన టీడీపీ నేతలు తలలు పట్టుకుని కూర్చున్నారు. చంద్రబాబు మాదిరి ఎప్పటికప్పుడు నాలుక మడతపెట్టి మాట మార్చినట్లు ఎలా చేయాలో తెలియక సతమతమవుతున్నారు. వలంటీర్లు పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లకుండా చేసిన నేపద్యంలో టీడీపీకి అది పెద్ద ఇబ్బందిగా మారింది. దానిని జగన్ తన స్పీచ్‌లో క్యాష్ చేసుకుంటున్నారు. చంద్రబాబు తను కూడా అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి పదివేల వేతనం ఇస్తానని చెప్పడం ద్వారా తన పాలనకు సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పి విపక్షనేతను డిఫెన్స్ లో పడేశారు. అయితే చంద్రబాబు చేసే వాగ్ధానాలు ప్రజలను మోసం చేయడానికే కాని, అమలు చేయడానికి కాదని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు తీసుకుని ప్రజలతో అవునని చెప్పించారు. ఉదాహరణకు రుణమాఫీ,నిరుద్యోగ భృతి వంటివాటిలో చంద్రబాబు మాట తప్పిన వైనాన్ని జగన్ తెలియచెప్పారు.అలాగే తన ప్రభుత్వంలో పోర్టుల నిర్మాణం, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, పరిశ్రమలకు పునాది పడుతున్న తీరు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో గత మూడేళ్లుగా నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న వైనాన్ని జగన్ విరించారు. కాని అదే చంద్రబాబు,లేదా పవన్ కళ్యాణ్ లు తమ ప్రసంగాలలో ఎక్కడా స్పెసిఫిక్‌గా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములను విమర్శించలేకపోతున్నారు. పైగా వాటిని మరింతగా ఎక్కువ చేసి అమలు చేస్తామని చెప్పారు. మరి అలాంటప్పుడు రాష్ట్రం విధ్వంసం అయిందని ఆ నేతలు ఎలా చెబుతున్నారో అర్దం కాదు. మోడీ సంకల్పం ఉంది కనుక రాష్ట్రానికి ఉపయోగం అని అంటున్నారే తప్ప, కేంద్రం నుంచి ఏమి సాధిస్తామో చెప్పలేని దయనీయ స్థితి కూటమి నేతలకు ఏర్పడింది. ఉదాహరణకు ప్రత్యేక హోదా అంశాన్ని కూటమి నేతలు ప్రస్తావించలేకపోతున్నారు.ప్రత్యేక హోదా కాకుండా కేంద్రం నుంచి వీరు ఏమి సాధిస్తారో ఎవరికి వివరించలేకపోతున్నారు.రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం డ్రామాలు ఆడుతుండడం, విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ మొదలైన వాటి గురించి వీరు ఒక్క ముక్క మాట్లాడడం లేదు. గతంలో చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలని అన్నప్పుడు కేంద్ర నేతలతో పాటు బీజేపీ రాష్ట్ర నేత దగ్గుబాటి పురందేశ్వరి అది ముగిసిన అధ్యాయం అని అన్నారు. అందుకు చంద్రబాబు ఒప్పుకున్నట్లేనా?బీజేపీ ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్ లను తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దీనిపై చంద్రబాబు అభిప్రాయం ఏమిటి? ఇలాంటివాటిపై అటు చంద్రబాబు కాని, ఇటు పవన్ కళ్యాణ్ కాని మాట్లాడకుండా ఉమ్మడి ఎజెండాతో ,ప్రజా మానిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నామని చెబితే ఎవరు నమ్ముతారు? అసలు ఉద్యోగాలే రాలేదని ఒకసారి, సచివాలయాలలో కొత్తగా వచ్చిన లక్షన్నర మంది ఉద్యోగుల గురించి మరోసారి చంద్రబాబు మాట్లాడుతారు. వీటిలో ఏది విద్వంసం,ఏది నాశనమో చెప్పలేరు.అప్పుల గురించి మాట్లాడతారు.రాష్ట్రం అప్పులపాలైతే సూపర్ సిక్స్ పేరుతో ఏడాదికి లక్షన్నర కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ కార్యక్రమాలకు ఎలా చంద్రబాబు ఖర్చు చేస్తారో వివరించరు. జగన్ అమలు చేసిన అమ్మ ఒడిని తల్లికి వందనం పేరుతో ఎందరు పిల్లలు ఉంటే అందరికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇస్తుంటారు.అది ఎలా సాధ్యమో ఆయన చెప్పరు. ఆ పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్,పురందేశ్వరిలు మాట్లాడరు.ఇవన్ని చూస్తుంటే వీళ్లకు ఒక ఎజెండా లేదు. ముగ్గురు కలిసి జనాన్ని ఎలా మభ్య పెట్టాలా అన్నదానపైనే దృష్టి పెడుతున్నట్లు అనిపిస్తుంది. అయితే జగన్ ను తిట్టడం, లేదంటే రాష్ట్రం విధ్వంసం అయిందని ఆరోపించడం,లేకుంటే జగన్ ఇచ్చిన స్కీములను మరింత ఎక్కువ ఇస్తామని బొల్లడం..జగన్ సభలకు, చంద్రబాబు సభలకు తేడా ఇంత స్పష్టంగా కనిపిస్తుంది.పురందేశ్వరి మాత్రం ఒక మాట చెప్పారు. పవర్ స్టార్ పవన్ శక్తి, చంద్రబాబు యుక్తి, మోడీ సంకల్పం రాష్ట్రానికి ఉపయోగపడతాయని అన్నారు. చంద్రబాబుదంతా కుయుక్తులేనని గతంలో ఈమె అన్నారు. ఇప్పుడేమో ఆ కుయుక్తే ఏమైనా తనకు ఎంపీ పదవి వచ్చేలా చేస్తుందేమోనన్న ఆశతో పురందేశ్వరి ఉన్నారు. పవన్ అయితే ఐదు కోట్ల మందికి ఒక్క నాయకుడు చాలడని అన్నారు. మూడుపార్టీల బలమైన నాయకత్వం కావాలి అని ఆయన చెబుతున్నారు. చంద్రబాబు అనుభవం, జనసేన పోరాట శక్తి కావాలట.కేంద్ర సహయం ఉండాలట. అంటే చంద్రబాబు ఒక్కడు ముఖ్యమంత్రిగా సరిపోడని పవన్ చెబుతున్నట్లే కదా! చంద్రబాబుకు అంత సామర్ధ్యం లేదనే కదా పవన్ ఉద్దేశం? అధికారం వచ్చాక ఈయన కూడా అందులో భాగస్వామి అవుతారా?అవ్వరా? ఎవరిమీద పోరాడుతారు?లేదంటే ఈయన బయట ఉండి మళ్లీ స్పీచ్ లు ఇస్తూ తిరుగుతారేమో తెలియదు.ఒకటి మాత్రం జనానికి చెప్పారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం సరిపోదని చెబుతున్నారని అర్ధం అవుతుంది.రాష్ట్రం కొన ఊపిరితో ఉందట ఎన్డీఏ కూటమి ఆక్సిజన్ అట. అలాగైతే ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోడీతో ఎందుకు చెప్పించలేకపోయారు.ఆయన అసలు రాష్ట్రానికి ఒక్క వరం అయినా ఇచ్చి వెళ్తారా?కేవలం తన కేసులకోసం, కొన ఊపిరితో ఉన్నటీడీపీని బతికించుకోవడం కోసం పొత్తు పెట్టుకుని అదేదో రాష్ట్రం కోసం అని చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినే రోజులు కావివి. వైఎస్సార్సీపీ విధ్వంసం చేస్తోందనే పొత్తు పెట్టుకున్నామని పవన్ అంటున్నారు. ఏమి విధ్వంసమో ఈ మూడు పార్టీల నేతలు చెప్పలేకపోతున్నారు. ఏదో పిచ్చి,పిచ్చి ప్రకటనలు చేసి, సినిమా డైలాగులు మాట్లాడి జనాన్ని బురిడి కొట్టించాలన్న ఉద్దేశం వారిలో కనిపిస్తోంది.తమ పార్టీలను బతికించుకోవడానికి, తాము గెలవలేమన్న భయంతో ఈ మూడు పార్టీలు కలిశాయి తప్ప ఇంకొకటి కాదు. ఓట్లు చీలకూడదని ఎప్పుడైతే అన్నారో, అప్పుడే వీరంతా ఓటమిని అంగీకరించిన్లే అనుకోవాలి.వైఎస్సార్సీపీ వెంటిలేటర్ పై ఉందని అంటున్న చంద్రబాబు దానిని నిజమని నమ్మి ఉంటే ఒంటరిగా పోటీచేసి సవాలు విసిరేవారు. ఇలా అధికారం కోసం జనసేన, బీజేపీ వంటి చిన్నపార్టీలను కాళ్లావేళ్లపడి ఎందుకు బతిమలాడుకుంటారు.ఢిల్లీ వెళ్లి పరువు పోగొట్టుకుని మరీ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు. జగన్ అడిగే ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరిల వద్ద సమాధానం లేదు. అందుకే వీరు ఇలా సోది ప్రసంగాలు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారనుకోవాలి. తాను గెలుస్తానన్న ధైర్యం ఉంది కనుక జగన్ ఒంటరిగా బరిలో దిగి ప్రత్యర్దులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ ప్రజలు ఈ కిచిడి కూటమి కావాలా? లేక జగన్ సాహసవంతమైన నాయకత్వం కావాలా? అన్నది తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..
సాక్షి, అమరావతి : మేమంతా సిద్ధం 7వ రోజు బుధవారం (ఏప్రిల్ 3) షెడ్యూల్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం విడుదల చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ మంగళవారం రాత్రి బస చేసిన అమ్మగారిపల్లె ప్రాంతం నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. సదుం, కల్లూరు, దామలచెరువు, తలుపులపల్లి మీదుగా తేనెపల్లి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం రంగంపేట క్రాస్ మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు పూతలపట్టు బైపాస్కు చేరుకుంటారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత పి.కొత్తకోట, పాకాల క్రాస్, గదంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్, రేణిగుంట మీదుగా గురువరాజుపల్లె రాత్రి బసకు చేరుకుంటారు. అన్నమయ్య జిల్లా సిద్ధమా? మేమంతా సిద్ధమంటూ బస్సుయాత్రకి ఆరవ రోజు అన్నమయ్య జిల్లా సిద్ధమా? అంటూ మంగళవారం సీఎం జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మేమంతా సిద్ధమంటూ బస్సుయాత్రలో ముఖ్యమంత్రితో పాటు జనప్రభంజనం కదం తొక్కి ముందుకు సాగింది. –సాక్షి,అమరావతి -
YSRCP.. జయహో ‘బీసీ’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత 58 నెలలుగా సమాజానికి వెన్నెముకగా బీసీలను తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారికి 48 శాసనసభ, 11 లోక్‌సభ స్థానాలు వెరసి మొత్తం 59 స్థానాలు కేటాయించి వారికి పెద్దపీట వేశారు. తద్వారా తన భవిష్యత్తు ప్రణాళికను కూడా ఆయన సుస్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 294 శాసనసభ, 48 లోక్‌సభ స్థానాలు ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో బీసీలకు ఎవరూ అవకాశం ఇచ్చిన దాఖలాల్లేవు. ఉత్తరప్రదేశ్‌లో బీసీ నేత అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూడా సీఎం జగన్ ఇచ్చిన రీతిలో బీసీలకు అవకాశం ఇవ్వలేదని.. దేశ చరిత్రలో ఇదో రికార్డు అని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. నిజానికి.. రాష్ట్ర విభజనకు ముందు 2012, జూలై 9న ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీనీ ఆయన అధికారంలోకి వచ్చాక అమలుచేయకుండా తమను వంచించారని బీసీలు రగలిపోతున్నారు. అదే వైఎస్ జగన్ గత ఎన్నికలకు ముందు 2019, ఫిబ్రవరి 17న ఏలూరులో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో తమకు చెప్పిన దానికంటే అధికంగా చేస్తుండడంపై బీసీలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు చంద్రబాబును ఛీకొట్టగా.. బీసీలు కూడా తమను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అక్కున చేర్చుకున్న సీఎం జగన్‌కు జేజేలు పలుకుతున్నారు. భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలకు తరలివచ్చిన జనసందోహం ఇందుకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు వైఎస్సార్సీపీ వెంట నడుస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో వార్ వన్‌సైడేనని వారు స్పష్టంచేస్తున్నారు. మొత్తం మీద శాసనసభ, లోక్‌సభ స్థానాలు కలిపి గత ఎన్నికల కంటే ఇప్పుడు అదనంగా 11 స్థానాలను సీఎం జగన్ తమకు కేటాయించడంపై వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అవమానించి, అవహేళన చేసిన బాబు.. నిజానికి.. రాష్ట్ర విభజనకు ముందు 2012, జూలై 9న చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. 2014 ఎన్నికల్లో 100 అసెంబ్లీ స్థానాల్లో టికెట్లు ఇస్తామని.. బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఏటా రూ.పది వేల కోట్లు చొప్పున కేటాయిస్తామని.. చేనేత, పవర్‌లూమ్స్ రుణాలను మాఫీ చేస్తానని అందులో ప్రకటించారు. కానీ.. 2014 ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనే బీసీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వారి సబ్‌ప్లాన్‌కు పాతరేశారు. అలాగే, ఐదేళ్లలో బీసీ సబ్‌ప్లాన్ ద్వారా రూ.50 వేల కోట్ల వరకు ఆ వర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేస్తానని హామీ ఇచ్చి.. అందులో సగం కూడా ఖర్చుచేయలేదు. పైగా.. మంత్రివర్గంలో వారికి సముచిత స్థానం కల్పించని చంద్రబాబు.. 2014–19 మధ్య ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. అంతేకాక.. న్యాయమూర్తులుగా బీసీలు పనికిరారంటూ వారిని అవహేళన చేశారు. ఇచ్చిన హామీలు అమలుచేయాలని అడిగిన బీసీలను తాటతీస్తా.. తోకలు కత్తిరిస్తానంటూ బెదిరించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తమపై వల్లమాలిన ప్రేమను ఒలకబోస్తున్న చంద్రబాబు.. ఇప్పటిదాకా ఖరారు చేసిన 128 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 24 స్థానాలనే తమకు కేటాయించడంపై బీసీలు భగ్గుమంటున్నారు. ఇచ్చిన మాటకంటే అధికంగా.. ఇక గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. అందులో వారికిచ్చిన మాట కంటే గత 58 నెలలుగా అధికంగానే న్యాయం చేశారు. ఉదా.. ► గత ఎన్నికల్లో 41 శాసనసభ స్థానాలు, ఏడు లోక్‌సభ స్థానాల్లో బీసీ వర్గాల అభ్యర్థులను బరిలోకి దించిన జగన్.. అధికారంలోకి వచ్చాక కేబినెట్లో ఆ వర్గాలకు చెందిన 11 మందికి మంత్రి పదవులిచ్చారు. ఒకరిని డిప్యూటీ సీఎంగా నియమించడంతోపాటు ప్రధానమైన రెవెన్యూ, విద్యా, పౌరసరఫరాలు, వైద్యం, ఆరోగ్యం లాంటి ప్రధానమైన శాఖలను ఆ వర్గాలకే అప్పగించి పరిపాలనలో వారికి సముచిత భాగస్వామ్యం కల్పించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కు అవకాశమిచ్చారు. ► ఈ వర్గాలకే చెందిన నలుగురిని రాజ్యసభకు పంపిన సీఎం జగన్ శాసనమండలిలో సైతం సింహభాగం పదవులు వారికే ఇచ్చారు. ► ఇక స్థానిక సంస్థల్లో వైఎస్సార్సీపీకి దక్కిన 13 జెడ్పీ చైర్మన్ పదవులకుగాను ఆరు బీసీలకే ఇచ్చారు. ► 84 మున్సిపల్ చైర్మన్ పదవులకుగానూ 44 వారికే కేటాయించారు. 14 కార్పొరేషన్ల మేయర్ పదవులకుగానూ తొమ్మిది బీసీలకే దక్కేలా చేశారు. ► అలాగే, నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు కేటాయించేలా ఏకంగా చట్టం చేసి మరీ ఇచ్చారు. ► మరోవైపు.. గత 58 నెలలుగా సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.1.23 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.50 వేల కోట్లు వెరసి రూ.1.73 లక్షల కోట్ల ప్రయోజనాన్ని బీసీలకు చేకూర్చారు. దీంతో.. రాజకీయ, ఆర్థిక, విద్యా, మహిళా సాధికారత ద్వారా బీసీలు సామాజిక సాధికారతను సాధించారు. -
విలన్ డెన్‌లో విదూషకుడు!
శంఖం మోగింది. యుద్ధం మొదలైంది. ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటల ముందుగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను పూర్తిగా ప్రకటించింది. జాతీయ స్థాయిలోనే ఈ ఘనత సాధించిన మొదటి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఒక్క అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిని మాత్రమే పెండింగ్‌లో పెట్టింది. ఈ దూకుడు వల్ల పోల్ పొజిషన్లో దానికి అడ్వాంటేజ్ దక్కినట్టే. విప్లవాత్మక ఆలోచనలతో మరో ఘనతను కూడా అది సొంతం చేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలున్నాయి. ఈ రెండొందల స్థానాల్లో వంద స్థానాలను బలహీనవర్గాలకు కేటాయించి రాజకీయ ప్రపంచాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆశ్చర్యంలో ముంచెత్తారు. సామాజిక న్యాయం తమ నినాదం మాత్రమే కాదు, విధానం కూడానని ఆయన చేతల ద్వారా మరోసారి నిరూపించుకున్నారు. బీసీ వర్గాలకు 48 శాసనసభ స్థానాలు, 11 లోక్‌సభ స్థానాలను వైసీపీ కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 అసెంబ్లీ సీట్లు, 42 లోక్‌సభ సీట్లు ఉన్నప్పుడు కూడా బీసీలకు ఈ సంఖ్యలో సీట్ల కేటాయింపు ఎప్పుడూ జరగలేదు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసని తరుచూ జగన్ మోహన్ రెడ్డి చెప్పే మాట. ఆ మాటను చేతల్లో చూపించారు. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా తన కోటాలో ఉన్న 144 సీట్లలో 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందులో 24 స్థానాలు మాత్రమే బీసీలకు దక్కాయి. ఆ పార్టీ కోటాలో ఇంకో 16 స్థానాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో ఏడుగురు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. ఇందులో ఒక్క బీసీకే చోటు దక్కింది. మిగిలిన పధ్నాలుగులో ఇదే నిష్పత్తి కొనసాగుతుందో, పెరుగుతుందో వేచిచూడాలి. బీజేపీకి కేటాయించిన 10 సీట్ల అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. కూటమి తరఫున ఇంకో నలభై సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయవలసి ఉన్నది. ఇందులో 23 స్థానాలను బీసీలకు కేటాయించగలిగితేనే వైసీపీ బీసీ స్కోర్‌ను అది చేరుకోగలుగుతుంది. బ్రహ్మాండం బద్దలైతే తప్ప అది సాధ్యమయ్యే పనికాదు. ముస్లిం మైనారిటీలకు వైసీపీ 7 అసెంబ్లీ సీట్లను కేటాయించింది. కూటమి తరఫున ఇప్పటికి ముగ్గురే ఎంపికయ్యారు. మిగిలిన 40లో నాలుగు స్థానాలు దక్కే అవకాశాలు మృగ్యం. ఏకంగా 11 లోక్‌సభ స్థానాలకు బీసీ అభ్యర్థులనే వైసీపీ ఎంపిక చేసింది. ఈ రికార్డును అందుకోవడం కూడా సాధ్యమయ్యే పని కాదు. కూటమి కట్టిన తర్వాత ప్రచారాన్ని పరుగెత్తించగల ఒక శుభ శకునం కోసం బాబు ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తాడేపల్లిగూడెం సభ అట్టర్‌ఫ్లాప్ కావడంతో తెలుగుదేశం శిబిరం డీలా పడిపోయింది. ఇప్పుడు ప్రధానమంత్రి పేరుతోనైనా చిలకలూరిపేట సభ సక్సెస్ చేయాలని ఆ పార్టీ శ్రేణులు చెమటోడ్చుతున్నాయి. మొత్తం 175 నియోజక వర్గాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. ‘సిద్ధం’ పేరిట వైసీపీ నిర్వహించిన నాలుగు ప్రాంతీయ సభలు చరిత్ర సృష్టించడం టీడీపీ కూటమికి పెనుసవాల్‌గా మారింది. ఒక్కో సభకు యాభై కంటే తక్కువ నియోజకవర్గాల నుంచే అభిమానుల సమీకరణ జరిగింది. మొదటి రెండు సభలు ఐదు లక్షల మార్కును దాటితే, చివరి రెండు సభలు పది లక్షల మార్కును దాటాయి. జాతీయ స్థాయిలోనే ఇదొక రికార్డు. రాష్ట్రవ్యాప్త సమీకరణ చేస్తే తప్ప గతంలో ఎన్నడూ కూడా ఐదు లక్షల పైచిలుకు జనసమీకరణ జరగలేదు. ఇప్పుడు ప్రధాని సభ టీడీపీ కూటమికి జీవన్మరణ సమస్యగా మారింది. అందుకే రాష్ట్రవ్యాప్త సమీకరణకు టార్గెట్లు పెట్టారు. రెండు మూడు లక్షలమంది హాజరైనా సరే యెల్లో మీడియా సహకారంతో సభ విజయవంతమైనట్టు ప్రకటించుకోవచ్చని ప్రయాసపడుతున్నారు. నరేంద్రమోదీ రూపంలో ఓ శుభశకునం కోసం ఎదురుచూస్తున్న కూటమికి అమిత్ షా రూపంలో అపశకునం ఎదురైంది. అది కూడా సరిగ్గా ఎన్నికల ప్రకటనకు ఒకరోజు ముందు! శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన ‘ఇండియా టుడే’ కాన్క్లేవ్లో అమిత్ షా పాల్గొన్నారు. ‘ప్రధానిని టెర్రరిస్టని విమర్శించిన చంద్రబాబుతో మీరెలా పొత్తుపెట్టుకున్నార’న్న ప్రశ్నకు అమిత్ షా బదులిచ్చారు. ‘అలా అని ఆయనే ఎన్డీయే నుంచి వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు బుద్ధొచ్చింది. మళ్లీ మా దగ్గరకు వచ్చాడు’ అనగానే అక్కడున్న అతిథులందరూ పడిపడి నవ్వడం కనిపించింది. ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు పరువుపై పంచనామా జరిగింది. ఇదే కాన్క్లేవ్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వచ్చినప్పుడు అమిత్ షా హుందాగా మాట్లాడారు. ఒక వ్యక్తి ఇతరుల నుంచి గౌరవాన్ని పొందాలంటే ఆ వ్యక్తికి నిబద్ధత, క్యారెక్టర్ ఎంత ముఖ్యమో ఈ ఘటన ఎత్తిచూపింది. ‘పార్లమెంట్లో కొన్ని బిల్లులకు వైసీపీ మద్దతు ఇచ్చింది కదా... మరి ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేద’ని అమిత్ షాను యాంకర్ ప్రశ్నించారు. ‘‘మేం పెట్టిన ప్రతి బిల్లుకూ ఆ పార్టీ మద్దతు ఇవ్వలేదు. కొన్నిటికి మాత్రమే ఇచ్చింది. అది కూడా ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటేనే ఇచ్చింది తప్ప బీజేపీ కోసం కాద’’ని అమిత్ షా చెప్పారు. అమిత్ షా మాటల సారాంశాన్ని విడమర్చి చెప్పుకుంటే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిల వ్యక్తిత్వం మధ్యన ఉన్న తేడా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబుకు సిద్ధాంతాలతో, రాద్ధాంతాలతో సంబంధం లేదు. అవకాశవాది! అవసరం ఉంటే వస్తాడు. లేకపోతే వెళ్లిపోతాడని అమిత్ షా భావన. జగన్మోహన్ రెడ్డికి సైద్ధాంతిక నిబద్ధత ఉన్నది. ఆ పార్టీ విధానాలకు అనుగుణమైతే మద్దతు ఇస్తారు. లేకపోతే లేదు. సిద్ధాంతపరంగా ఆయన పార్టీకీ, మాకూ పొత్తు పొసగదని కూడా ఆయన పరోక్షంగా చెప్పినట్టు! మనం సినిమాల్లో చూస్తూ వుంటాం, విలన్ డెన్‌లో ఉండే విదూషక క్యారెక్టర్‌కు ఆ డెన్లోనే ఏపాటి గౌరవం ఉంటుందో! చంద్రబాబు పరిస్థితి కూడా అంతే! ఎన్డీఏ కూటమిలో చేరినా, కూటమి సభ్యుల దృష్టిలో ఆయనో విదూషకుడు, అసందర్భ ప్రేలాపి, అవకాశవాది. అవకాశవాదంతో అటూ ఇటూ తిరిగినా, బీజేపీ ప్రవచించే పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనాతో చంద్రబాబుకు కెమిస్ట్రీ బాగానే కుదురుతుంది. ఈ నమూనా వ్యవస్థలో అధికారంలో ఉన్నవాడు పెత్తందారీ శక్తుల భజంత్రీగా మారితే భారీగా వెనకేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ వెసులుబాటును పద్నాలుగేళ్లపాటు బాబు బాగానే ఒడిసిపట్టుకున్నాడు. కొద్దిమంది పెట్టుబడిదారుల అభివృద్ధే దేశాభివృద్ధిగా, వారి పెరుగుదలే దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలగా పరిగణించే బీజేపీ శిబిరమే చంద్రబాబుకు సహజ ఆవాసం. అందుకే మూడుసార్లు విడాకులు తీసుకున్నా మళ్లీ నాలుగోసారి అదే పార్టీని మనువాడేందుకు ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. పైగా వాజ్‌పేయి కార్గిల్ ఊపుమీద ఉన్నప్పుడు, మోదీ గుజరాత్ మోడల్ ఊపుమీద ఉన్నప్పుడు వారి గాలితో గెలిచిన అనుభవం బాబుది. ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి బలహీనంగా కన్పిస్తున్నందువల్ల మళ్లీ మోదీ గాలివాటు బాబుకు అవసరమైంది. అన్నిటినీ మించి తరుముకొస్తున్న అవినీతి కేసుల నుంచి రాబోయే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను కాపాడాలి. ఆ రాబోయే ప్రభుత్వం మోదీ సర్కారేనని బాబు నమ్ముతున్నారు. దేశంలో చాలామందికి బాబుకున్న అభిప్రాయమే ఉండవచ్చు. ప్రతిపక్ష శిబిరం బాగా బలహీనంగా కనిపించడం అందుకు ఒక కారణం కావచ్చు. స్వతంత్ర మీడియా సంపూర్ణంగా అంతర్ధానం కావడం మరో కారణం కావచ్చు. ఈ కారణాల వల్ల, దేశానికి అన్నంపెట్టే రైతు తన పంటకు చట్టబద్ధమైన మద్దతు ధర కావాలని ఎలుగెత్తడం మనకు న్యాయమైన కోర్కెగా కనిపించడం లేదు. రోజురోజుకూ వేలాదిమంది యువకులు నిరుద్యోగ సైన్యంలో చేరిపోతున్నా మన కళ్లకు వికసిత భారత విశ్వరూపమే కనిపిస్తున్నది. తరతరాలుగా ఈ నేలపైనే పుట్టి ఈ నేలపైనే శ్వాసిస్తున్న కోట్లాదిమంది ‘మైనారిటీ’ ముద్రకు భయపడి వణికిపోతుంటే విజయోద్వేగంతో మన హృదయాలు ఉప్పొంగుతున్నవి. కనుక చాలామంది మళ్లీ మోదీయే గెలుస్తాడని అనుకుంటే అనుకోవచ్చు. వారికా స్వేచ్ఛ ఉన్నది. మన బాబు కూడా ఆ గుంపులోని గోవిందుడే! ఉత్తరాది మోదీ గాలి అంతో ఇంతో దండకారణ్యాన్ని దాటుకుని రాకపోతుందా, తనను కరుణించకపోతుందా అనే ఆశ ఆయనలో మిణుకుమిణుకుమంటూ ఉండవచ్చు. కానీ తూరుపు కనుమలది తలలు వంచే నైజం కాదు. ఉత్తరాదిలో లేనిదీ... ఏపీలో ఉన్నదీ ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమం. పేదల సాధికారతే తారకమంత్రంగా సాగుతున్న ప్రభుత్వ ప్రాయోజిత విప్లవోద్యమం. భారత రాజ్యాంగ స్ఫూర్తిని తు.చ. తప్పకుండా అమలుచేస్తూ, ఆ రాజ్యాంగ కర్తను నగరం నడిబొడ్డున విశ్వరూపంతో నిలబెట్టిన రాష్ట్రమిది. ఆ భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే కేంద్రానికి పెద్ద ఎత్తున సీట్లు కావాలి. అందుకు కూటములు కావాలి. రాజ్యాంగ రక్షణ కవచంతో సాధికారత సంతరించుకుంటున్న ప్రజలు ఈ ప్రయత్నాలను ఓడిస్తారు. ఆ కూటములనూ ఓడిస్తారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తును గానం చేసిన విశ్వకవి రవీంద్రుని కవిత అందరికీ తెలిసిందే. ‘‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తుకుని తిరుగుతారో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా ఉంటుందో, ఎక్కడ సంకుచిత భావాలతో సమాజం ముక్కలుగా విడిపోదో... ఓ తండ్రీ! అటువంటి స్వర్గసీమకు నా దేశాన్ని తీసుకుని వెళ్లు’’. కవీంద్రుని కలను నిజం చేసే శక్తి మన రాజ్యాంగానికి ఉన్నది. అటువంటి రాజ్యాంగాన్ని మార్చి అసమానతలకు, భయం బతుకులకు బాటలు వేసే ప్రయత్నాలను ఇక్కడి ప్రజలు సహించే పరిస్థితి ఉండదు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యంలో రాజ్యాంగ మార్పుల చర్చ మళ్లీ ముందుకొచ్చింది. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే మార్చే సవరణలు చెల్లబోవని గతంలోనే సుప్రీంకోర్టు చాటి చెప్పింది. ప్రస్తుత చట్టం (సీఏఏ) పౌరసత్వానికి మత ప్రాతిపదికను రుద్దుతున్నదని విమర్శకులు గట్టిగా భావిస్తున్నారు. ఇది రాజ్యాంగ లౌకిక స్వభావానికి విరుద్ధం కనుక చెల్లదని వారి వాదన. ఈ వ్యాజ్యం సుప్రీంకోర్టు విచారణకు రాబోతున్నది. ఒకవేళ న్యాయస్థానం కొట్టివేస్తే భారీ మెజారిటీతో వచ్చే ప్రభుత్వం కొత్త రాజ్యాంగాన్ని ముందుకు తేబోతున్నదని విమర్శకులు అనుమానిస్తున్నారు. మన దేశంలోనే కాదు, ప్రపంచమంతటా దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతున్నది. ఇంత గంభీరమైన అంశంపై నాలుగోసారి బీజేపీతో జతకట్టిన చంద్రబాబు ఎంత సింపుల్‌గా సమాధానం చెబుతున్నారో చూడండి. ‘‘ఏ దేశానికి వెళ్లినా సిటిజన్‌షిప్ అనేది పారదర్శకంగా ఉంటుంది. అక్కడి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాల’’ని తేల్చేశారు. కానీ, మత ప్రాతిపదిక అవసరమా అనే కీలక విషయం జోలికి వెళ్లలేదు. పోనీ, ఈ ప్రాతిపదిక చట్టంలో చెప్పినట్టు మూడు దేశాలకూ, నిర్ణీత కాలానికే పరిమితం కావాలి. అంతకుమించి అనుమతించేది లేదని చెప్పినా అదొక లెక్క. కానీ మన నాయకుడు బ్లాంక్ చెక్ ఇచ్చేశాడు. అంతే మరి! విలన్ డెన్‌లో చేరిన విదూషకుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సీఎం జగన్‌కు ప్రజలందరూ ఆశీస్సులివ్వాలి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదని ఎమ్మెల్సీ, శాసన మండలి చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. ప్రజల అవసరాలే తన ఎజెండా అని చెప్పిన ఏకైక నాయకుడు ఆయనేనని కొనియాడారు. ఇలాంటి నాయకుడికి ప్రజలందరి ఆశీస్సులు ఇవ్వాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించి భారీ కేక్‌ను కట్ చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. చంద్రబాబుకు అధికారం మీద మాత్రమే ప్రేమ అని.. ప్రజలు, వారి అవసరాల మీద ఏమాత్రం లేదన్నారు. ఈ ఐదేళ్లలో నేను మంచి చేశాననిపిస్తేనే ఓటెయ్యమని సీఎం జగన్ అంటున్నారని.. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి నాయకుడ్ని చూడలేదని ఉమ్మారెడ్డి అన్నారు. అన్నిచోట్లా వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్.. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ముగ్గురు కాదు 30 మంది కలిసొచ్చినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే గెలుపు అని స్పష్టంచేశారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలను వైఎస్సార్సీపీ స్వీప్ చేయబోతోందన్నారు. వైఎస్ జగన్ లాంటి సీఎం మాకు కూడా ఉంటే బాగుంటుందని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నారన్నారు. చరిత్ర సృష్టించటం సీఎం జగన్‌కే సాధ్యమని.. కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో లోకేశ్‌ని ఓడించి తీరుతామని మంత్రి ధీమా వ్యక్తంచేశారు. గుంట నక్కలు, తోడుదొంగలు చేసే నీచ రాజకీయాలను ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని జోగి రమేష్ పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ‘మండలి’లో విప్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ అంటేనే విశ్వసనీయతకు మారుపేరని.. ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోను అమలుచేసిన ఘనత ఆయనదేనని కొనియాడారు. అన్ని వర్గాలకూ అండగా సీఎం జగన్.. ఇక వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. 13 ఏళ్లుగా ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని తెలిపారు. రైతులు, కార్మికులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాలకు ఆయన అండగా నిలిచారన్నారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. సీఎం జగన్ ఉంటేనే అందరికీ మేలు జరుగుతుందని స్పష్టంచేశారు. ఆయన్ని అణచివేయాలని ఎంతోమంది చూశారని.. కానీ, ఎన్ని కుట్రలు పన్నినా ఎదుర్కొని సీఎం జగన్ విజేతగా నిలిచారన్నారు. ఐదేళ్లలో హామీలన్నీ నెరవేర్చారు.. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. పార్టీ పెట్టినప్పటి నుండి సీఎం జగన్ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావని.. వాటన్నింటినీ ఎదుర్కొని, తట్టుకుని అధికారం సాధించారన్నారు. ఈ ఐదేళ్లలో ఆయన చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చారని గుర్తుచేశారు. ఇక చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ నేతల ఇళ్ల ముందు పడిగాపులు కాశారని.. ఇలాంటి వారు ప్రజలకు ఏం చేస్తారని సురేశ్ ప్రశ్నించారు. మోసాలలో పుట్టి మోసాలు చేసే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసునన్నారు. అంతకుముందు.. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేత పానుగంటి చైతన్య నాయకత్వంలో విద్యార్థులు, యువజనులు జైజై నినాదాలతో భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు సలహాదారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు, ఎన్ఆర్ఐ ప్రతినిధులూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, పార్టీ 14వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల సేవా కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ‘జగన్ అనే నేను’.. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద డిజిటల్ బోర్డు ఏర్పాటుచేశారు. మంత్రి జోగి రమేష్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు ‘జగన్ అనే నేను..’ ఈ కౌంట్‌డౌన్ బోర్డును ఆవిష్కరించారు. 73 రోజుల్లో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారని చెప్పేందుకు చిహ్నంగా ఈ బోర్టు పెట్టినట్లు పార్టీ నేతలు తెలిపారు. మరోసారి గొప్ప విజయం సాధించేందుకు మీరంతా సిద్ధమా? వైఎస్సార్సీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ పిలుపు సాక్షి, అమరావతి: ‘నేడు మన వైఎస్సార్సీపీ 14వ వ్యవస్థాపక దినోత్సవం. ఆనాడు వందమంది ఏకమై మనపై యుద్ధానికి వస్తే.. అప్పుడు నాకు రక్షణగా నిలిచిన ప్రజల కోసం ప్రారంభమైన పార్టీ మన వైఎస్సార్సీపీ. ఇన్నాళ్లూ నా ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ ఎక్స్‌లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ మంగళవారం పోస్ట్ చేశారు. ప్రజాక్షేత్రంలో మరోసారి మనం గొప్ప విజయం సాధించేందుకు మీరంతా సిద్ధమా? అంటూ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి పేర్కొన్నారు. -
Bapatla: జైత్ర యాత్రకు సిద్ధం
సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి, నరసరావుపేట: సిద్ధం... ఈ మాట వింటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమరోత్సాహంతో ఎన్నికల యుద్ధానికి కదం తొక్కుతున్నారు.. మరోవైపు ఈ సభలకు వస్తున్న ప్రతిస్పందన చూసి ప్రతిపక్ష నేతలు మాత్రం ఓటమి భయంతో వణికిపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధం పేరిట ఇప్పటికే మూడు సభలు నిర్వహించి గడచిన నాలుగేళ్ల పది నెలల కాలంలో ప్రజలకు చేసిన మేలును వివరించడంతో పాటు ప్రజలకోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న మూకుమ్మడి కుట్రను వివరిస్తున్నారు. ► అందులో భాగంగా నేడు చివరి సిద్ధం సభ బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని పి.గుడిపాడులో జరగనుంది. ఇందులో పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల నుంచి పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలు హాజరుకానున్నారు. ► చరిత్రలో నిలిచేపోయే ఈ సభలో పాల్గొనాలని పల్నాడు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. జననేత సందేశం వినాలని ఆత్రుతతో ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రసంగాన్ని ప్రతి ఇంటికీ చేర్చి మరోసారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడేలా చూడటమే లక్ష్యంగా నేడు వీరు సిద్ధం సభకు వెళ్లనున్నారు. ► గుంటూరు జిల్లాలో గుంటూరు పశ్చిమ నుంచి మంత్రి విడదల రజని, తూర్పు నుంచి నూరి ఫాతిమా, తాడికొండ నుంచి మేకతోటి సుచరిత, ప్రత్తిపాడు నుంచి బలసాని కిరణ్‌కుమార్, తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి నుంచి ఎమ్మెల్యే ఆర్కే, సమన్వయకర్త మురుగుడు లావణ్య, పొన్నూరు నుంచి అంబటి మురళీకృష్ణ, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య నేతృత్వంలో జన సమీకరణకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. ఇప్పటికే వాహనాలు సిద్ధం చేశారు. ►పల్నాడు జిల్లాలో సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు, మాచర్ల నుంచి ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల నుంచి ఎమ్మెల్యే కాసు మహే‹Ùరెడ్డి, నరసరావుపేట నుంచి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పెదకూరపాడు నుంచి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, వినుకొండ నుంచి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, చిలకలూరిపేట నుంచి సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో శ్రేణులు పెద్ద ఎత్తున సభకు తరలి వెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు. ► బాపట్ల జిల్లాలో బాపట్ల నుంచి ఎమ్మెల్యే కోన రఘుపతి, అద్దంకి నుంచి సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి, రేపల్లె నుంచి సమన్వయకర్త ఈవూరి గణే‹Ù, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, చీరాల నుంచి ఎమ్మెల్యే కరణం బలరాం, సమన్వయకర్త వెంకటేష్, పర్చూరు నుంచి సమన్వయకర్త ఎడం బాలాజీ, వేమూరు నుంచి సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో శ్రేణులు కదం తొక్కనున్నాయి. సొంత వాహనాల్లో ప్రయాణం పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఇప్పటికే పలు మార్లు సిద్ధం సభ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి భారీ సంఖ్యలో ప్రజలు సభకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ సీపీ అభిమానుల కోరిక మేరకు సభకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో వాహనాలు ఏర్పాటు చేశారు. మరికొంత మంది కార్యకర్తలు తాము సొంతగా వాహనాలు ఏర్పాటు చేసుకొని సభకు వెళ్లనున్నారు. వీటితో నేడు దారులన్నీ సిద్ధం సభ వైపునకు మళ్లాయి. ఇప్పటికే మంచి జోష్ మీద ఉన్న వైఎస్సార్ సీపీ క్యాడర్ నేడు సిద్ధం సభ వేదికగా సీఎం వైఎస్ జగన్ ఇచ్చే సందేశంతో మరింత పెరిగిన ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో పనిచేసి, పార్టీ అఖండ విజయానికి కృషి చేయనున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. నగరంపాలెం: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో ఆదివారం జరగనున్న ‘సిద్ధం’ సభకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. సభకు ప్రజలు భారీగా తరలిరానున్నారు. అటుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు/ వాహనచోదకులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను దారి మళ్లించినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇలా వెళ్లాలి.. ► విజయవాడ, గుంటూరు నుంచి జాతీయ రహదారిపై ఒంగోలు, చెన్నై వైపు వెళ్లే వాహనాలు బుడంపాడు అడ్డరోడ్ మీదగా పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట వైపుగా వెళ్లాలి. ► గుంటూరు నగరం నుంచి ఒంగోలు వెళ్లే వాహనాలు ఏటుకూరు జంక్షన్ నుంచి ప్రత్తిపాడు, పర్చురు, ఇంకొల్లు, నాగులుప్పలపాడు, త్రోవగుంట వైపు వెళ్లాలి. ► గుంటూరు నుంచి నరసరావుపేట మీదుగా ఒంగోలు వెళ్లే వాహనాలు చుట్టుగుంట, పేరేచర్ల, ఫిరంగిపురం, నరసరావుపేట, సంతమాగులూరు అడ్డరోడ్డు జంక్షన్, అద్దంకి, మేదరమెట్ల మీదుగా వెళ్లాలి. ► 16వ నంబర్ జాతీయ రహదారిపై బొల్లాపల్లి టోల్ ప్లాజా నుంచి బొల్లాపల్లి, మేదరమెట్ల వరకు ఎటువంటి వాహనాలకు అనుమతిలేదు. సిద్ధం సభ వాహనాలకు మాత్రమే అనుమతి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి వాహనాల దారి మళ్లింపు అమల్లోకి వస్తోందని జిల్లా ఎస్పీ తెలిపారు. -
175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు గెలుస్తాం
మేదరమెట్ల: రానున్న ఎన్నికల్లో ఎంతమంది ఎన్ని పొత్తులతో వచ్చినా నష్టంలేదని, 175 ఎమ్మెల్యేలతో పాటు 25 ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చెప్పారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని పి.గుడిపాడు జాతీయ రహదారి సమీపంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న సిద్ధం సభకు ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. నాలుగవ సిద్ధం సభను భారీఎత్తున విజయవంతం చేయడానికి సర్వ సన్నద్ధమవుతున్నామని చెప్పారు. గత ఐదేళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరిస్తారన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాక రానున్న ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేయబోతుందనే అంశాలను సీఎం ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన సిద్ధం సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ఆదివారం జరిగే సిద్ధం మహాసభకు సుమారు 15 లక్షల మంది హాజరవుతారని, వచ్చిన వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులతో ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈసభ విజయవంతం చేసేందుకు బూత్ లెవల్ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సభ నిర్వహించే వంద ఎకరాలకు పక్కన మరో వంద ఎకరాలను కూడా సిద్ధం చేశామన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి.. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిందని చెప్పారు. ఇప్పటికే రామాయపట్నం పోర్టును దాదాపు పూర్తిచేశామని.. తీర ప్రాంతంలో మిగిలిన పోర్టుల పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయన్నారు. ఎన్నో పారిశ్రామిక సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నాయన్నారు. ఏపీలో తలసరి ఆదాయం పెరుగుదలకు అభివృద్ధి పనులే కారణం అన్నారు. అభివృద్ధి లేకపోతే తలసరి ఆదాయం పెరగదని చెప్పారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందజేశామని చెప్పారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం పైగా అమలు చేశామని తెలిపారు. బీసీలకు తెలివితేటలు లేవని, బీసీలు జడ్జిలుగా పనికిరారు అని గతంలో అన్న చంద్రబాబు ఇప్పుడు బీసీ డిక్లరేషన్ అంటే ఎవరూ నమ్మరని చెప్పారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 75 శాతం పదవులు ఇచ్చారని చెప్పారు. వైనాట్ 175 ఎందుకంటున్నామో.. సిద్ధం సభ ద్వారా చూపిస్తామన్నారు. నేషనల్ మీడియా నుంచి కూడా అనేక మంది సిద్ధం సభకు హాజరవుతున్నారని, సిద్ధం సభల గురించి తెలుసుకోవడానికి వారు ఎంతో ఆసక్తితో ఉన్నారన్నారు. మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నాం రానున్న ఎన్నికల కోసం మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ, జనసేనలు పొత్తుల కోసం వెంపర్లాడే పార్టీలని.. తాము ముఖ్యమంత్రిని చూపించి ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. అభ్యర్థులను వేరే చోటికి మార్చినంత మాత్రాన తమ పార్టీకి ఎటువంటి నష్టం లేదన్నారు. మార్చి 13, 14 లేదా 15 తేదీల్లో ఎన్నికల ప్రకటన రావచ్చన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన సిద్ధం టీ షర్టులను విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి పానెం చిన హనిమిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి తాటిపర్తి చంద్రశేఖర్, పొన్నూరు ఇన్చార్జి అంబటి మురళి, గుంటూరు తూర్పు ఇన్చార్జి ఫాతిమా, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
సిద్ధం సభకు సర్వం సమాయత్తం
ఒంగోలు: ఈనెల 10న ప్రకాశం జిల్లా మేదరమెట్ల సమీపంలో నిర్వహించనున్న సిద్ధం సభకు సర్వం సమాయత్తంగా ఉన్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, గుంటూరు, బాపట్ల జిల్లాల పార్టీ కోఆర్డినేటర్ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులోని వీకేబీ రెస్టారెంట్ కాన్ఫరెన్స్‌హాలులో సిద్ధం నాలుగో సభ పోస్టర్‌ను, ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ పాటను రీజినల్ కోఆర్డినేటర్, ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన శనివారం ఆవిష్కరించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. భీమిలి, ఏలూరు, రాప్తాడులలో నిర్వహించిన సిద్ధం సభలు విజయవంతమయ్యాయని చెప్పారు. ఈ నెల 10వ తేదీన మేదరమెట్ల వద్ద నిర్వహించే సిద్ధం సభలో ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారన్నారు. ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో బడుగు బలహీన వర్గాలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి, రాజకీయంగా, సామాజికంగా వారి అభ్యున్నతికి చేసిన కృషిని వివరిస్తారన్నారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోలో పొందుపరచబోయే అంశాలను వివరిస్తారని చెప్పారు. 15 లక్షల మందికిపైగా హాజరవుతారు నాలుగో సిద్ధం సభకు గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి 15 లక్షల మందికిపైగా హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. 100 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నామని, అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని మరో వంద ఎకరాలను కూడా సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. తొలి సిద్ధం సభకు, ప్రస్తుత సభలకు మధ్య సర్వేల ద్వారా పరిశీలిస్తే పార్టీ గ్రాఫ్ విపరీతంగా పెరిగిందన్నారు. దీనిని బట్టి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 పార్లమెంట్ స్థానాల గెలుపు అతిశయోక్తి కాదని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. ఈ సభ అనంతరం సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సమన్వయకర్తలు, నియోజకవర్గ ఇన్చార్జులు, పరిశీలకులు అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. సభకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఆహారం, తాగునీరు, మౌలిక సౌకర్యాలు, వారు తిరిగి వెళ్లేందుకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో కార్యక్రమాన్ని అప్పజెప్పడం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చర్యలు చేపట్టామన్నారు. వాహనాల పార్కింగ్, వాటి నిర్వహణ బాధ్యతలను విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, సభా ప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్సీ తలశిల రఘురాం పర్యవేక్షిస్తారన్నారు. గత ప్రభుత్వాల పాలనతో పోల్చిచూసుకుంటే బీసీల అభివృద్ధికి ఎవరు పాటుపడుతున్నారో ప్రతి ఒక్కరికీ అర్థమవుతోందని, ఈ నేపథ్యంలోనే బీసీలంతా వైఎస్సార్సీపీ వైపు ఉన్నారన్నారు. బీసీల అభివృద్ధి కాంక్షిస్తూ అటు పార్లమెంట్, ఇటు శాసనసభలో వారికి ఇస్తున్న ప్రాధాన్యత కూడా ఇందుకు నిదర్శనంగా ఉందన్నారు. విజయవంతానికి కృషి చేస్తాం: బాలినేని స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్సీపీ అభిమానులు హాజరయ్యేలా చర్యలు చేపడతామన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన రెండూ కలిసినా వైఎస్సార్సీపీకి వచ్చిన నష్టం ఏమీలేదన్నారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేయాలన్నారు. అంతకు ముందు విజయసాయిరెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, పరిశీలకులు, సమన్వయకర్తలతో భేటీ అయ్యారు. సిద్ధం సభకు సంబంధించి నాయకుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. తనను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్సీలు పోతుల సునీత, తలశిల రఘురాం, తూమాటి మాధవరావు, శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్, కుందూరు నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు, మేకపాటి విక్రమ్‌రెడ్డి, దర్శి ఇన్చార్జి బూచేపల్లి శివప్రసాదరెడ్డి, చీరాల ఇన్చార్జి కరణం వెంకటేష్, వేమూరు ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు, అద్దంకి ఇన్చార్జి పాణెం హనిమిరెడ్డి, తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ విభాగం ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు, లోకేశ్‌వి దుర్మార్గమైన ఆలోచనలు: గొల్లపల్లి
సాక్షి, అమరావతి/విజయవాడ స్పోర్ట్స్: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు వైఎస్సార్సీపీలో చేరారు. వారు బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువాలు కప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్‌రెడ్డి, ఎంపీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్లనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ పెత్తందార్లకు అనుకూలంగా, దళిత వర్గాలకు, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ టీడీపీ నేతలు, కార్యకర్తల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నిబద్దతతో పనిచేసిన తనను తీవ్రంగా అవమానించారని, చంద్రబాబు మెడపట్టి పార్టీ నుంచి గెంటేశారని వాపోయారు. సీఎం వైఎస్ జగన్ దేవుడి రూపంలో తనను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. టీడీపీ పుట్టిన నాటి నుంచి తాను కష్టపడి పనిచేశానని, పదవి ఉన్నా లేకపోయినా, గెలిచినా గెలవకపోయినా పార్టీ కోసం పనిచేశానని చెప్పారు. 2014లో అమలాపురం పార్లమెంట్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత మొండి చేయి చూపించారన్నారు. అయినా క్రమశిక్షణ కలిగిన నేతగా తాను ఎంతో కష్టపడి జిల్లాలో పార్టీని కాపాడుకున్నానని అన్నారు. జనసేన, టీడీపీ పొత్తు పేరు చెప్పి తనకు సీటు లేకుండా చేశారని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ ఉంటే ఉండు పోతే పో అన్నట్లు చూశారని, జీవితంలో ఎప్పుడూ అనుభవించని అవమానం టీడీపీలో ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ తనకు ధైర్యాన్నిచ్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారని చెప్పారు. లోకేశ్ ముఠా రాష్ట్రాన్ని కబళించాలని చూస్తోందని తెలిపారు. చంద్రబాబు స్వార్థపూరిత ఆలో చనలకు పవన్ బలి అయ్యారని, పోత్తులో మోసం చేసి బాబు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. జనసేన మనుగడ కష్టమేనన్నారు. దేవుడిలాంటి మనిషైన వైఎస్సార్ నన్ను ఎంతో దగ్గరకు తీసి రాజకీయంగా ప్రోత్సహించి మంత్రి పదవి ఇచ్చి గౌరవించారని అన్నారు. ఆ మహానుభావుడి కుమారుడైన సీఎం జగన్ దగ్గరకి చేరటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ కోసం శాయశక్తులా పనిచేస్తానని చెప్పారు. తుది శ్వాస వరకు సీఎం వైఎస్ జగన్ వెంటే ఉంటానని, ఆయన ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని తెలిపారు. మిథున్‌రెడ్డి, కేశినేని నానితో చర్చలు గొల్లపల్లి సూర్యారావు మంగళవారం రాత్రి విజయవాడలోని కేశినేని భవన్లో ఎంపీలు కేశినేని నాని, మిథున్‌రెడ్డితో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు సూర్యారావు ప్రకటించారు. చంద్రబాబు ఆలోచనశైలి పెత్తందార్లకు అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్య క్రమాల పట్ల ఆకర్షితుడినయ్యానని తెలిపారు. -
175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాల్లో మొత్తం గెలుద్దాం: సీఎం జగన్
ప్రతి ఇంటికి మంచి జరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ మనకు అత్యధిక మెజారిటీ ఎందుకు రాదు? గ్రామంలో వచ్చిన మెజారిటీ ప్రతి మండలంలోనూ ఎందుకు రాకుండా ఉంటుంది? ప్రతి నియోజకవర్గంలోనూ ఎందుకు రాకూడదు? అది కుప్పమైనా.. ఇచ్చాపురమైనా ఎందుకు జరగకూడదు? పేదవాడు బతకాలంటే, బాగుండాలంటే వైఎస్సార్సీపీ మళ్లీ రావాలి. ఈ విషయం ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలి. ప్రజలకు నేను చేయగలిగినంత మంచి చేశా. ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకుడూ ఎప్పుడూ ఇవ్వని ‘మంచి’ ఆయుధాలను మీ అందరి చేతుల్లో పెట్టా. వీటితో ముందుకు వెళ్లి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రతి ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు అడుగులు వేయాలి. – వైఎస్సార్సీపీ నాయకులతో సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో మరో 45 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. గత 57 నెలలుగా లంచాలు, వివక్షకు తావులేకుండా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ 87 శాతం కుటుంబాలకు మంచి చేయగలిగాం. దేశ చరిత్రలో ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడూ ఇవ్వని ఆయుధాలను మీ చేతుల్లో పెట్టా. ఇప్పటికే మన పార్టీ టిక్కెట్లన్నీ దాదాపుగా ఖరారయ్యాయి. రెట్టించిన ఉత్సాహంతో క్షేత్ర స్థాయిలోకి వెళ్లండి. ప్రజలకు మంచి చేసి ఓట్లు అడుగుతున్నామన్న గొప్ప సంతృప్తితో ఇంటింటికీ వెళ్లండి. ఎన్నికల్లో అత్యధిక మెజార్టీలతో గెలిచి రావాల్సిన బాధ్యత మీదే’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో చరిత్రాత్మక విజయం సాధించామని గుర్తు చేశారు. ప్రతి కుటుంబానికీ మంచి చేసిన నేపథ్యంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లోనూ గెలవాల్సిందేనని శ్రేణులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ‘మేము సిద్ధం.. మా బూత్ సిద్ధం’ పేరుతో మంగళవారం సీఎం జగన్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. 175 నియోజకవర్గాల నుంచి సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, జగనన్న సచివాలయాల కన్వీనర్లు సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. విశ్వసనీయతే మన బలం.. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా, ఏ ఇంటికి వెళ్లి అడిగినా విశ్వసనీయత ఉన్న పార్టీ ఏదంటే ఒక్క వైఎస్సార్సీపీనే అనే మాట వినపడుతుంది. ఒక పార్టీకి, రాజకీయ నాయకుడికి ఇది చాలా చాలా అవసరం. బహుశా దేశ రాజకీయాల్లో ఇలాంటి గౌరవం ఒక్క వైఎస్సార్సీపీకే దక్కింది. ప్రతి కార్యకర్త తమ నాయకుడిని చూపించి కాలర్ ఎగరేసే పరిస్థితి ఉన్నప్పుడే ఆ పార్టీకి గౌరవం లభిస్తుంది. పార్టీ నాయకుడు కూడా అలాగే వ్యవహరించాలి. విశ్వసనీయతే మన బలం. మనం కూడా అలాంటి వాగ్దానాలిద్దామన్నారు! 2014లో చంద్రబాబు 650 పేజీలతో మేనిఫెస్టో తెచ్చి అందరినీ మోసగించారు. అసాధ్యమని తెలిసినా రైతన్నలకు రూ.87,612 కోట్లు రుణమాఫీ మొదట సంతకంతోనే చేస్తానని నమ్మబలికారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నాడు. దాదాపు రూ.15 వేల కోట్ల పొదుపు సంఘాల రుణాలనూ మాఫీ చేస్తానన్నాడు. ఇంటింటికీ ఉద్యోగం లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి అని అన్నాడు. అప్పుడు మన పార్టీలో కూడా చాలామంది శ్రేయోభిలాషులు మనం కూడా అలాంటి వాగ్దానాలు ఇద్దామన్నారు. ఇప్పుడు హామీలిచ్చి ఎన్నికలు అయిపోయిన తరువాత చూద్దామన్నారు. ఒకవైపు చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతుంటే మనం నీతిగా, నిజాయితీగా యుద్ధం చేయడం కుదరదని నాకు సలహా ఇచ్చారు. అప్పుడు నేను ఒక్కటే అన్నాను. విలువలు, విశ్వసనీయత అనే పదాలకు అర్ధం చెబుతూ మనం చేయగలిగిందే చెబుదామని సూచించా. ఒక పని చేయలేమని తెలిసినప్పుడు మన నోటి నుంచి ఆ మాట రాకూడదని చెప్పా. నాడు ఆ మోసాలకు తోడు ప్రధాని మోదీ గాలి వీస్తుండటంతో దత్తపుత్రుడి సహకారంతో చంద్రబాబు గద్దెనెక్కారు. మోసం చేసి అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను చంద్రబాబు చెత్తబుట్ట పాలు చేశారు. వెబ్సైట్ నుంచి కూడా మాయం చేశారు. మోసం ఎల్లప్పుడూ నిలబడదు. చివరకు ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారంటే టీడీపీ తరపున గ్రామాల్లో ప్రచారం చేయడానికి కూడా ఆ పార్టీ క్యాడర్ సాహసించలేదు. 99 % హామీలు అమలు చేశాం 2019లో మనం కేవలం రెండు పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చాం. రెండు పేజీలు ఎందుకంటే ఆ మేనిఫోస్టో ప్రజలకు గుర్తుండాలి. అధికారంలోకి వచ్చాక మనకూ గుర్తుండాలి. నాడు మేనిఫెస్టో అంశాల గురించి చర్చిస్తుంటే విజయనగరం జిల్లాలో అప్పల నరసయ్య ఇవన్నీ సాధ్యమేనా? అని నాతో అన్నారు. ఇవన్నీ కచ్చితంగా చేసి తీరుతామని చెప్పా. అన్నీ ఆలోచన చేసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకున్నాం. ప్రతిమాట నెరవేరుస్తానని చెప్పా. చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా 151 స్ధానాలతో అధికారంలోకి వచ్చాం. 22 ఎంపీ స్ధానాలు గెల్చుకున్నాం. ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చాం, మీరే చూసి టిక్కు పెట్టాలని ప్రతి ఇంటికీ వెళ్లి చిత్తశుద్ధితో అడుగుతున్నాం. నాడు నవ్వుకుని ఉంటారు.. మనం సాధ్యం చేశాం 57 నెలల కాలంలో పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చాం. ఇన్ని వందల కోట్లు, ప్రతి ఇంటికీ రూ.లక్షలు ఇవ్వడం.. అది కూడా పారదర్శకంగా అందించడం సాధ్యమేనా? అని గత ఎన్నికలకు ముందు ఎవరైనా ప్రశ్నిస్తే చాలా మంది నవ్వుకుని ఉంటారు. అయితే అది సాధ్యమేనని మనం వచ్చాక చూపించగలిగాం. గ్రామాల్లో స్కూళ్లు మారాయి. ఊహకు కూడా అందని విధంగా ఇంగ్లీషు మీడియం చదువులు, ట్యాబ్‌లు, క్లాస్‌రూమ్‌లలో డిజిటల్ బోధన తీసుకొచ్చాం. ప్రతి పేద బిడ్డకూ నాణ్యమైన విద్య అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం మనదే. పొరపాటు జరిగితే మళ్లీ అరాచకమే ఎవరైనా పొరపాటున వైఎస్సార్సీపీకి ఓటు వేయకపోతే మళ్లీ జన్మభూమి కమిటీలు సంతకం పెట్టినట్టే. ఇంటివద్దే పారదర్శకంగా అందిస్తున్న పథకాలన్నీ వద్దని మనంతట మనం సంతకం పెట్టినట్టే. పొరపాటు చేస్తే పేదవాడి గురించి ఆలోచించే పరిస్థితే ఉండదు. విశ్వసనీయత అన్న పదానికి అర్ధం ఎక్కడా ఉండదు. మళ్లీ పేదవాడి బతుకు చిన్నాభిన్నమే అవుతుందనే సంకేతం ప్రతి గడపకూ చేరవేయాలి. అమ్మా..! జగన్ ఏదైనా చెబితే చేస్తాడు. చెప్పే ముందు నాలుగు సార్లు ఆలోచన చేస్తాడు. చేయగలిగింది మాత్రమే చెబుతాడు. కానీ చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఆయన ఏమైనా చెబుతాడు. అవసరం కోసం ఎవరినైనా మోసం చేస్తాడన్నది మన కళ్లెదుటే కనిపించిన సత్యం. 2014లో ఇదే చూశాం. దానికన్నా మందు కూడా అదే చూశాం. ఇవాళ కేజీ బంగారం, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తానంటున్నాడు. పొరపాటు చేస్తే మళ్లీ అరాచకం వస్తుందని ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలి. సచివాలయం యూనిట్‌గా.. ప్రతి గ్రామంలో బూత్ స్ధాయిలో మన ఆర్గనైజేషన్ ఎలా ఉందన్నది ఎమ్మెల్యేలు పరిశీలించాలి. నియోజకవర్గస్ధాయి, మండలస్థ్ధాయి నుంచి అన్ని కమిటీలను అసెస్ చేసుకోవాలి. మీ అందరికీ ఒక్కటే సలహా ఇస్తున్నా. ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోండి. మీకు కళ్లు, చెవులుగా వ్యవహరించే అత్యంత నమ్మకమైన వ్యక్తులను గుర్తించి ఈ నెలన్నర రోజులు అక్కడే పెట్టండి. ఆ సచివాలయం పరిధిలోని కేడర్, అభిమానులు, వలంటీర్లను వారు మీకు దగ్గర చేయాలి. అది మీరు రెగ్యులర్‌గా పర్యవేక్షించాలి. ప్రతి నియోజకవర్గంలో 80 సచివాలయాలు ఉంటాయి. వాళ్లకు మీ ఫోన్ అందుబాటులో ఉండాలి. వాళ్లు ఏ సచివాలయంలోనైనా, ఎక్కడైనా గ్యాప్ కనిపిస్తున్నట్లు గుర్తిస్తే ఎప్పుడు ఫోన్ చేసినా మీరంతా రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో ఉండాలి. సచివాలయం పరిధిలో ప్రతి అభిమాని, ప్రతి వలంటీర్, కేడర్‌లో ప్రతి ఒక్కరూ మన ఎమ్మెల్యే అభ్యర్ధికి దగ్గర కావాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. మీరు సచివాలయంలో పెట్టిన వ్యక్తి ద్వారా బూత్ కమిటీల మీద ధ్యాస పెట్టండి. ప్రతి వలంటీర్‌కు అనుసంధానంగా గృహసారధులతో కలిసి బూత్ కమిటీ సభ్యులను నియమించాం. నలుగురు మనుషులు (ఒక బూత్ ఇన్‌ఛార్జి, ముగ్గురు కన్వీనర్లు) ఆ బూత్ కింద ఉన్న క్లస్టర్‌ను పర్యవేక్షించాలి. ఈ ఆర్గనైజేషన్ చాలా ముఖ్యం. దీన్ని గుర్తుపెట్టుకొండి. 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. ఆర్గనైజేషన్ అత్యంత కీలకం.. మన పార్టీలో టిక్కెట్లన్నీ దాదాపుగా ఖరారు అయ్యాయి. మార్చాల్సినవన్నీ 95 శాతం మార్పు చేశాం. ఇంకా ఏదైనా ఒకటి అరా మాత్రమే ఉంటాయి. కచ్చితంగా ఆర్గనైజైషన్ మీద ధ్యాస పెట్టండి. ఇందులో మీరు విఫలమైతే ఎవరూ కాపాడలేరు. ఎందుకంటే... ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి, ఇన్ని లక్షలు మీకు మంచి జరిగిందని ఏకంగా లెటర్లు తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశంలో ఎక్కడా ఉండకపోవచ్చు. ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమే మన ఎమ్మెల్యేలకు ఆ అవకాశం కల్పి స్తోంది. కాబట్టి మీరు ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టిండి. ప్రతి ఇంటికి ఇంత మంచి జరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ మనకు అత్యధిక మెజార్టీ ఎందుకు రాదు? గ్రామంలో వచ్చిన మెజార్టీ ప్రతి మండలంలోనూ ఎందుకు రాకుండా ఉంటుంది? ప్రతి నియో జకవర్గంలోనూ ఎందుకు రాకూడదు? అది కుప్పమై నా.. ఇచ్చాపురమైనా ఎందుకు జరగకూ డదు? పేద వాడు బతకాలంటే, బాగుండాలంటే వైఎస్సార్ సీపీ మళ్లీ రావాలి. ఈ విషయం ప్రతి ఇంటికి వెళ్లి చెప్ప గ లిగాలి. ప్రజలకు నేను చేయగలిగినంత మంచి చేశా. ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకుడూ ఎప్పుడూ ఇవ్వని ఆయుధాలను మీ అందరి చేతుల్లో పెట్టా. వీటితో ముందుకు వెళ్లి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఈ 45 రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్ బలంపై ఆధారపడి ఉంది. ప్రతి ఒక్కరూ రెట్టించిన ఉత్సా హంతో, అంతే విశ్వాసంతో ముందుకు అడుగులు వేయాలి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ విషెష్.. క్లాస్ వార్.. ఇవాళ జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఇది క్లాస్ వార్ అని గుర్తు పెట్టుకోండి. పేదవాడు ఒకవైపున.. పెత్తందార్లు మరొకవైపున నిలిచి యుద్ధం జరుగుతోంది. మీ జగన్ ఉంటే పేదవాడు బాగుపడతాడు. మీ జగన్ ఉంటే లంచాలు, వివక్ష లేకుండా పథకాలు కొనసాగుతాయి. ఇంటికే వలంటీర్ వస్తాడు. అవ్వాతాతలకు తోడుగా ఉంటూ సహాయం అందుతుంది. మీ జగన్ ఉంటేనే బడులు బాగుంటాయి. పేద బిడ్డలకు ఇంగ్లీషు మీడియం అందుతుంది. మీ జగన్ ఉంటేనే గ్రామాలలో విలేజ్ క్లినిక్‌లు పనిచేయడం కొనసాగుతుంది. విస్తరించిన ఆరోగ్యశ్రీ గొప్పగా సేవలు అందిస్తుంది. ఏ పేదవాడు ఆరోగ్యం కోసం అప్పులు పాలు కాకుండా వైద్యం అందే పరిస్థితి కొనసాగాలంటే జగన్ ఉంటేనే జరుగుతుంది. విద్య, వైద్యం, వ్యవసాయంలో ఎవరి ఊహకూ అందని మార్పులు తీసుకొచ్చాం. అక్క చెల్లెమ్మలకు దిశ యాప్‌తో భద్రత కల్పిస్తున్నాం. ఇవన్నీ కొనసాగాలంటే మీ జగన్‌తోనే సాధ్యమనే సందేశాన్ని అందరికీ చేరవేయాలి. కుప్పానికి రూ.1,400 కోట్లు.. ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు రాష్ట్రవ్యాప్తంగా ఏ నియోజకవర్గాన్ని తీసుకున్నా 87 శాతం పైచిలుకు ఇళ్లకు మంచి చేయగలిగాం. కుప్పం గ్రామీణ నియోజవర్గం కాబట్టి అక్కడ 93.29 శాతం ఇళ్లకు మంచి చేయగలిగాం. నేను చెప్పే విషయం చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైనా నేను కుప్పంలో చెప్పిన మాటలు వినకపోతే కచ్చితంగా యూట్యూబ్‌లో డౌన్లోడ్ చేసుకుని వినండి. ఎందుకంటే కుప్పంలో నేను ప్రస్తావించిన అంశాలే ప్రతి నియోజకవర్గంలోనూ అవే మాదిరిగా పరిస్థితులున్నాయి. కుప్పంలో 87 వేల పైచిలుకు ఇళ్లు ఉంటే ఏకంగా 83 వేల ఇళ్లకు మంచి జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మీ జగన్ బటన్ నొక్కి రూ.2.55 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తే అందులో రూ.1,400 కోట్లు కుప్పం నియోజకవర్గంలో 83 వేల ఇళ్లకు ఇవ్వగలిగాం. కుప్పంలో గతంలో 30 వేల ఇళ్లకు మాత్రమే పెన్షన్ వస్తుంటే మనం 45 వేల కుటుంబాలకు ఇస్తున్నాం. ఒక్క పెన్షన్లకే కుప్పంలో రూ.507 కోట్లు ఇచ్చాం. చేయూత, ఆసరా, విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి కూడా అలాగే అందించాం. ఇళ్ల స్థ్ధలాలు 30 వేలకు పైగా కుటుంబాలకు అందుతున్నాయి. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కాకుండా మనం అన్ని వందల కోట్లు ఇచ్చినప్పుడు ప్రత్యర్ధి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. ఈ డేటా మీ అందరికీ అందుబాటులోకి ఉంది. వైఎస్సార్సీపీ గెలుపును ఏ శక్తులూ ఆపలేవు నిత్యం ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యలను ఎక్కడిక్కడ పరిష్కరిస్తున్నాం. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దగ్గరి నుంచి ప్రజల్లో మమేకమై పనిచేస్తున్నాం. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపును ఏ శక్తులు ఆపలేవు. ఎంతమంది జతకట్టుకుని వచ్చినా సీఎం జగన్ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ముందు నిలవలేరు. వీటి గురించి ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటు అతుకుల బొంతగా కనిపిస్తోంది. ఎన్నికలను ఎదుర్కోవడానికి వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు. – ఆర్కే రోజా, మంత్రి సీఎం జగన్‌ను వాళ్లు తట్టుకోలేరు.. అభ్యర్థులు మాకు దొరక్కపోవటం ఏమిటి? ప్రకటించకపోవటం ఏంటీ? చూస్తున్నారు గదా మా కోలాహలం.. వారు రా కదలిరా.. అంటే ప్రజలు ఎవ్వరూ రావటంలేదు. బాబు–పవన్‌లు సీట్లు ప్రకటించారు కదా? వారి పార్టీల్లో ఏం జరుగుతోందో చూస్తున్నారు కదా? కాపు సోదరులు, జనసేన కేడర్ పవన్‌ను సీఎం సీఎం అంటుంటే, పవన్ మాత్రం చంద్రబాబును సీఎం సీఎం అంటున్నారు. ప్యాకేజీ లేకుంటే ఎందుకు అంటారు. 45 రోజులు వేచి చూస్తే సరి. సీఎం జగన్ ముందు వీళ్లు తట్టుకోలేరు. – అంబటి రాంబాబు, మంత్రి ఖాళీ బిందెలే సౌండ్ ఎక్కువ చేస్తాయి... ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి అనే దానిపై సీఎం జగన్ కొన్ని సూచనలు, సలహాలిచ్చారు. సమావేశం విజయవంతంగా జరిగింది. చాలామంచి సందేశం ఇచ్చారు. కేడర్‌లో నూతనోత్తేజం నెలకొంది. వైఎస్సార్సీపీ 175కు 175 స్థానాల్లో విజయం సాధిస్తుంది. దీన్ని ఎవరూ అడ్డుకోలేరు. పవన్, లోకేశ్, చంద్రబాబు ఆటలు సాగవు. ఎవరు మమ్మల్ని అడ్డుకోలేరు. విశ్వసనీయత ఉన్న పార్టీ వైఎస్సార్సీపీ అని ప్రజలు నమ్ముతున్నారు. టీడీపీ–జనసేన–కాంగ్రెస్–బీజేపీ తీరు ఖాళీ బిందెల టైపు అన్నట్లు ఉంది. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి పవన్, బాబులకు ప్రజల్లో బలంలేదు జనసేన–టీడీపీ పొత్తు హిట్ కాదు. వారికి ప్రజల్లో బలంలేదు. సీఎం జగన్‌ను ఒంటరిగా ఎదిరించలేం అని తెలిసింది కాబట్టే వారు పొత్తులతో వస్తున్నారు. సంక్షేమ పథకాలు పొందిన ప్రజలు ఒక్కటే చెబుతున్నారు.. మా కుటుంబాల్లో ఎప్పుడు ఇంత మార్పు రాలేదని.. మా కుటుంబాల్లో పెదరికం పోయిందంటున్నారు. కాబట్టి సీఎం జగనన్నకే మళ్లీ ఓటువేసి రెండోసారి ఆయన్ను సీఎంను చేసుకొంటాం అంటున్నారు. బాబు మోసాన్ని, జగన్ మంచిని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. గెలుపు ఖాయం. – తానేటి వనిత, మంత్రి 99 శాతం హామీలు నెరవేర్చారు జగన్.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 99 శాతం హామీలు నెరవేర్చారు. అందుకే ఈరోజు మా కార్యకర్తలు ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. చంద్రబాబు 600 పైగా హామీలు ఇచ్చి అందులో 10 శాతం కూడా నెరవేర్చలేదు. అసలు మ్యానిఫెస్టోనే వెబ్సైట్ నుంచి తీసేసిన చరిత్ర ఆయనది. డ్వాక్రా రుణమాఫీ, రైతు రూణమాఫీ, ఇంటికొక ఉద్యోగం.. నిరుద్యోగభృతి ఏదీ చేయలేదు. ఏం ముఖం పెట్టుకుని చంద్రబాబు ప్రజల వద్దకు వెళ్తారు. ఈరోజు ఏం చేశామో చెప్పి 175కు 175 ఎమ్మెల్యే స్థానాలు గెలవబోతున్నాం. సంక్షేమం–అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం జగన్ పాలన సాగించారు. – వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ ‘వైనాట్ 175’కు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఏ ప్రభుత్వం కూడా ఇంత సంక్షేమం అందించలేదు. సీఎం జగన్ చెప్పిన పథకాలే కాకుండా చెప్పనివి మరో 24 అమలుచేశారు. సచివాలయంలో డిస్ప్లే బోర్డు చూస్తే వైఎస్సార్సీపీ ప్రజలకు ఏం చేసిందో తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబం జీవన స్థితిగతులు మారాయి. నరసాపురం పార్లమెంట్ స్థానం గతంలో అగ్రవర్ణాల వారికి, ఆర్థికంగా బలమైన వారికే కేటాయించేవారు. ఇప్పుడు నాలాంటి బీసీ మహిళలను సీఎం జగన్ పోటీచేయిస్తున్నారు. ఇది కదా మహిళా సాధికారత. వైనాట్ 175 అందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. – గూడూరు ఉమాబాల, వైఎస్సార్సీపీ నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ -
ఎన్నికలకు ‘సిద్ధం’ కావాలని తెలియజేసేలా సభ
నెల్లూరు(దర్గామిట్ట): బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలో మార్చి 3న సిద్ధం సభను విజయవంతంగా నిర్వహిస్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని తెలియజేసేలా సభ ఉంటుందని చెప్పారు. సిద్ధం సభ విషయమై నగరంలోని జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలసి ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. తిరుపతి, ప్రకాశం, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమన్వయకర్తలు పాల్గొన్నారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు మూడు సిద్ధం సభలు భీమిలి, ఏలూరు, రాప్తాడులో నిర్వహించామని, మేదరమెట్లలో నిర్వహించే ఆఖరి సభకు 15 లక్షల మంది రావొచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. సభలో సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు నాలుగేళ్ల 10 నెలల కాలంలో అందించిన పాలన, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు తమ పాలనలో అందించిన మేలును వివరిస్తారని చెప్పారు. భీమిలి, ఏలూరు తర్వాత రాప్తాడులో జరిగిన సభ అజరామరమని, ప్రజలను ఉత్తేజ పరిచేలా ఉందన్నారు. తమ పార్టీ మేనిఫెస్టో తయారవుతోందని, త్వరలో విడుదలవుతుందని తెలిపారు. నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్య ర్థిగా శరత్ చంద్రారెడ్డి పోటీ చేయరన్నారు. త్వరలోనే జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిని, నెల్లూరు ఎంపీ అభ్య ర్థిని ప్రకటిస్తామన్నారు. ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నల్లçపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, అన్నా రాంబాబు, కె.నాగార్జునరెడ్డి, ఎమ్మెల్సీలు పి.చంద్రశేఖర్‌రెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేరిగ మురళీ«ధర్, సమన్వయకర్తలు మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, మహ్మద్ ఖలీల్, దద్దాల నారాయణయాదవ్, తాటిపర్తి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, చెవిరెడ్డి అభినవ్‌రెడ్డి, విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, మేయర్ స్రవంతి,పాల్గొన్నారు. -
భువనేశ్వరి పోటీ చేసినా ఓటమి తప్పదు
సత్తెనపల్లి: చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పోటీ చేసినా కుప్పంలో ఓటమి తప్పదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ కుర్చీని ఎప్పుడో మడత పెట్టేశారని, రాజ్యసభలోనూ, కుప్పంలోనూ సీటు ఖాళీ అయిందని ఎద్దేవా చేశారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీళ్లు కూడా ఇప్పించలేక పోయారన్నారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం కుప్పం ప్రజలకు మంచినీళ్లు ఇస్తోందని చెప్పారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మరో 50 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని, టీడీపీ పని అయిపోయిందని ప్రజలకు అర్థమైందన్నారు. -
YSRCP: సందేహం లేదు సునామీయే
సాక్షి, అమరావతి: ‘సందేహమే లేదు.. రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ సునామీ సృష్టించడం తథ్యం.. అందుకు తార్కాణమే చరిత్రాత్మక రాప్తాడు సభ’ అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం వైఎస్సార్సీపీ నిర్వహించిన ‘సిద్ధం’ సభకు సుమారు పది నుంచి 11 లక్షల మంది అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారని అంచనా. అదీ రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 52 శాసనసభ స్థానాల పరిధి నుంచే ఇంత భారీ స్థాయిలో ప్రజలు కదలిరావడం గమనార్హం. రాప్తాడులో 250 ఎకరాల సువిశాల మైదానంలో ‘సిద్ధం’ సభను వైఎస్సార్సీపీ నిర్వహించింది. ఇందులో 200 ఎకరాల విస్తీర్ణంలో సభను వీక్షించడానికి ఏర్పాట్లు చేసింది. నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో ఇసుకేస్తే రాలనంత స్థాయిలో సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో 1982లో పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలో విజయవాడలో కృష్ణా నది ఇసుక తిన్నెలపై సీపీఎం నిర్వహించిన సభకు 5 లక్షల మంది హాజరయ్యారని అప్పట్లో అంచనా. 1990లో వరంగల్‌లో వంద ఎకరాల మైదానంలో పీపుల్స్ వార్ నిర్వహించిన రైతు కూలీ సభకు పది లక్షల మంది హాజరయ్యారని నిర్వాహకులు ప్రకటించారు. కానీ.. వాస్తవంగా ఆ సభకు ఆరు నుంచి ఏడు లక్షల మంది వచ్చారని అంచనా. ఉమ్మడి రాష్ట్రంలో 1994లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఎన్టీఆర్ ఆధ్యర్యంలో టీడీపీ నిర్వహించిన సభకు పది లక్షల మంది ప్రజలు హాజరయ్యారని నిర్వాహకులు చెప్పుకున్నారు. కానీ.. పరేడ్ గ్రౌండ్స్‌తోపాటు పక్కనున్న జింఖానా గ్రౌండ్స్, బౌసన్పోలో గ్రౌండ్ కలిసినా దాని విస్తీర్ణం 90 ఎకరాలే. ఈ లెక్కన ఆ సభకు వాస్తవంగా హాజరైంది ఐదు లక్షల మందేనని అంచనా. ఈ మూడు సభలకు ఉమ్మడి రాష్ట్ర పరిధిలోని 23 జిల్లాల నుంచి ప్రజలను సమీకరించడం గమనార్హం. ఇక 2010లో వరంగల్‌లో వంద ఎకరాల విస్తీర్ణంలో టీఆర్ఎస్ నిర్వహించిన తెలంగాణ గర్జన సభకు పది లక్షల మంది హాజరయ్యారని నిర్వాహకులు చెప్పుకున్నారు. కానీ.. ఆ సభకు వాస్తవంగా హాజరైంది ఏడు లక్షల మందికి కాస్తా అటూ ఇటూ అని అంచనా. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు సభే అతి పెద్ద ప్రజా సభ అని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పెత్తందారులపై పోరుకు సిద్ధమా? అంటూ సీఎం జగన్ పిలుపునిస్తే.. 10 నుంచి 11 లక్షల మంది ఒక్కసారిగా పిడికిలి పైకెత్తి, దిక్కులు పిక్కటిల్లేలా ‘మేం సిద్ధమే’ అంటూ ప్రతిస్పందించారు. ఇది రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జైత్ర యాత్రతో సునామీ సృష్టించడం ఖాయమనడానికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. రణనినాదమై మారుమోగుతున్న ‘సిద్ధం’ ‘మేమంతా సిద్ధం’ అని వైఎస్సార్సీపీ శ్రేణుల ప్రతిస్పందన రణ నినాదమై రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి జనవరి 27న భీమిలి.. ఈనెల 3న దెందులూరు.. ఆదివారం రాప్తాడులలో ‘సిద్ధం’ పేరుతో వైఎస్సార్సీపీ నిర్వహించిన సభలు ఒకదాన్ని మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. భీమిలి సభకు సముద్రంతో పోటీపడుతూ ఉత్తరాంధ్ర ప్రజానీకం కదలివచ్చారు. దెందులూరు సభకు భీమిలి సభ కంటే రెట్టింపు స్థాయిలో ఉత్తర కోస్తా ప్రాంత అభిమానులు పోటెత్తారు. ఇక రాప్తాడు సభ తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతి పెద్ద ప్రజా సభగా నిలిచింది. మూడు సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణుల్లో సరి కొత్త జోష్ నింపింది. మూడు ప్రాంతాల్లో నిర్వహించిన మూడు సభల్లోనూ.. పెత్తందారులపై యుద్ధానికి సిద్ధమా? మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు సిద్ధమా? పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు.. మరోసారి మన పార్టీ వైఎస్సార్సీపీని గెలిపించేందుకు సిద్ధమా? అని సీఎం జగన్ ప్రశ్నిస్తే.. మేం సిద్ధమే అంటూ ఒక్కసారిగా లక్షలాదిమంది ప్రతిస్పందించారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ చేసిన దిశా నిర్దేశం మేరకు 175కు 175 శాసనసభ.. 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా జైత్రయాత్రకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. సీఎం జగన్ నాయకత్వంపై విశ్వాసానికి ప్రతీక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అధికారం చేపట్టిన తొలి ఏడాదే 95 శాతం సీఎం జగన్ అమలు చేశారు. ఇప్పటికి 99.5 శాతం హామీలు అమలు చేశారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.55 లక్షల కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.1.76 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. దేశ చరిత్రలో డీబీటీ, నాన్‌డీబీటీ రూపంలో రూ.4.31 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చిన దాఖలాలు లేవు. ఓ వైపు సంక్షేమాభివృద్ధి పథకాలు.. మరో వైపు విద్య, వ్యవసాయ, వైద్య, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలు.. ఇంకో వైపు సుపరిపాలనతో ప్రతి ఇంట్లో.. ప్రతి గ్రామంలో.. ప్రతి నియోజకవర్గంలో సీఎం జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. దాంతో సీఎం జగన్‌పై ప్రజల్లో మద్దతు రోజు రోజుకూ పెరుగుతోంది. ‘మేం వైఎస్సార్సీపీ కార్యకర్తలం, అభిమానులం’ అంటూ కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పుకునే రీతిలో సీఎం జగన్ పరిపాలిస్తుండటం ఆయన నాయకత్వంపై శ్రేణుల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచింది. ఇది ‘సిద్ధం’ సభల్లో మరోసారి ప్రతిబింబించిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ–జనసేన శ్రేణులు కకావికలం టీడీపీ–జనసేనల మధ్య పొత్తుల లెక్కలు ఇప్పటికీ తేలలేదు. రెండు పార్టీల మధ్య సిగపట్లు కొనసాగుతున్నాయి. రా కదలి రా.. పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేస్తున్నారు. ఇటు ‘సిద్ధం’ సభల్లో లక్షలాది మంది ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్త్తలు, అభిమానులు ‘పోరుకు మేం సిద్ధమే’ అంటూ చేసిన రణనినాదం మోరుమోగుతుండగా.. అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభలకు జన స్పందన కన్పించకపోవడంతో టీడీపీ–జనసేన అగ్రనేతల వెన్నులో వణుకు పుట్టించింది. సిద్ధం సభలు నింపిన జోష్‌తో ప్రజా క్షేత్రంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ముందుకు దూసుకెళ్తున్నాయి. మరో వైపు పొత్తులు తేలక, చంద్రబాబు–పవన్‌ల సభలకు జన స్పందన లేక టీడీపీ–జనసేన శ్రేణులు కకావికలమయ్యాయి. ఎన్నికల షెడ్యూలు వెలువడక ముందే వైఎస్సార్సీపీ శ్రేణులు చారిత్రక విజయమే లక్ష్యంగా కదం తొక్కుతుంటే.. టీడీపీ–జనసేన శ్రేణులు నైతిక స్థైర్యం కోల్పోయి చెల్లాచెదురయ్యాయి. ఇది 2019 ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి సునామీ సృష్టించడం ఖాయమనడానికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
మంచి పాలనకు మళ్లీ ‘సిద్ధం’
జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జల సముద్రం వస్తే ఈరోజు రాప్తాడుకు జన సముద్రం తరలి వచ్చింది. ఈ జన సముద్రానికి, రాయలసీమ గడ్డకు, ప్రతి సీమ బిడ్డకూ మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. పెత్తందార్లకు – పేదలకు మధ్య సంగ్రామం. మన పథకాలతో కోట్లాది మంది గుండె తలుపుతట్టాం. ఈ మంచి కొనసాగాలన్నా, భవిష్యత్‌లో ఇంకా మంచి పనులు జరగాలన్నా మనం మళ్లీ గెలవాలి. పొరపాటు జరిగితే చంద్రముఖి మన ఇంట్లోకి గ్లాసు పట్టుకొని సైకిల్‌పై వస్తుంది. పేదల రక్తం తాగేస్తుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, అనంతపురం: విశ్వసనీయతకు–వంచనకు మధ్య జరగబోతున్న ఎన్నికల యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కోసం వారి తరఫున నిలబడటానికి మీరంతా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ యుద్ధం.. వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడూ మన రాష్ట్రానికి వచ్చిపోతున్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్కు, ఈ గడ్డమీదే పుట్టి ఇక్కడే ఇల్లు కట్టుకుని ప్రజల మధ్యే ఉన్న మనకూ మధ్య జరగబోతోందన్నారు. మనందరి ప్రభుత్వం 57 నెలలుగా అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధిని అడ్డుకుంటూ వాటిని రద్దు చేయడమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. బాబు మార్కు ఎక్కడైనా ఉందా? ఈ వేదిక నుంచి చంద్రబాబుకు ఒక సవాల్ విసురుతున్నా. మీరు 14 ఏళ్లు పరిపాలన చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. కానీ మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా? మీ పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? మీ పేరు చెబితే విద్యార్థులకు గుర్తొచ్చే పథకం ఏదైనా ఉందా? మీ పేరు చెబితే కనీసం అవ్వాతాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు.. మా పెన్షన్ మా ఇంటికే పంపాడనే పరిస్థితి ఏనాడైనా ఉందా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఫలానా మంచి చేశాడని చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క గ్రామంలోనైనా ఏర్పాటు చేసిన పరిపాలన వ్యవస్థ ఒక్కటైనా కనిపిస్తుందా? బాగుపడిన స్కూళ్లు, ఆస్పత్రులు ఏ గ్రామంలోనైనా ఉన్నాయా? కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలోనైనా సరే మీ మార్క్ ఉందా చంద్రబాబూ? పథకాలను పక్కనపెడితే చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా? మేనిఫెస్టోకు రంగులు పూసి ప్రతి సామాజికవర్గాన్ని మోసం చేయడం చంద్రబాబుకు ఆనవాయితీ. ఏనాడైనా కనీసం 10శాతం వాగ్దానాలను అమలు చేశారా? బంగారు కడియం ఇస్తానంటూ ఊబిలోకి దింపి మనుషుల్ని తిన్న పులి మాదిరిగా మరోసారి ఎర వేస్తున్నాడు. అబద్ధాలు చెప్పేటప్పుడు భావ దారిద్య్రం ఎందుకన్నది బాబు నైజం. నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించినవాడు దోచుకోగలుగుతాడన్నది ఆయన సిద్ధాంతం. చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి చెప్పాలి. బాబు మోసాల్ని భరించలేకే కదా ఐదేళ్ల క్రితం అన్ని సామాజికవర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలంతా చొక్కా మడతేసి కుర్చీని లాగేసి చీపుర్లతో ఊడ్చి ఆయన పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు. అదే పని మరోసారి చేయడానికి, చొక్కాలు మడత వేయడానికి మీరంతా సిద్ధంగా ఉండాలి. లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్లు మన ప్రభుత్వ హయాంలో పథకాలు అందుకున్న ప్రతి కుటుంబం మనకు స్టార్ క్యాంపెయినర్‌గా బయటకు రావాలి. వైఎస్సార్ సీపీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాల్సిన అవసరాన్ని చెప్పాలి. మనం చేసినవి తెలియజేస్తూ వాటి కొనసాగింపు ఎంత అవసరమో ప్రతి ఇంటికీ వివరించాలి. ఒక్కసారి అధికారం ఇస్తేనే ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా గ్రామాల్లో రైతన్నను చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థను తెచ్చి తోడుగా నిలిచాం. సాగుకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చాం. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం మొదలు పెట్టింది మీ బిడ్డ ప్రభుత్వమే. ఉచిత పంటల బీమా ఇస్తున్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. ఈ పథకాలన్నీ కొనసాగాలన్నా, బాబు మార్క్ దళారీ వ్యవస్థ మళ్లీ రాకూడదన్నా ప్రతి రైతన్న మన స్టార్ క్యాంపెయినర్‌గా ముందుకొచ్చి ఇంకో వంద మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. విందు భోజనం, బిర్యానీ పెడతానంటూ ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెను లాక్కోవడానికి అడుగులు వేస్తున్నాడు. గతంలో ఇదే పెద్దమనిషి రూ.87,612 కోట్ల రుణ మాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకూ గుర్తుచేయాలి. అమ్మ ఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్లపట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం, దిశ యాప్, మహిళా పోలీస్.. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రతి అక్కచెల్లెమ్మకు కొనసాగాలంటే జగనన్న ప్రభుత్వానికి అండగా ఉండాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని, మరో వంద మందితో ఓటు వేయించాల్సిన బాధ్యత ఉందని మీరంతా చెప్పాలి. ఏ గ్రామానికైనా వెళదాం.. ఇవాళ రాష్ట్రంలోని ఏ గ్రామానికి వెళ్లి నిల్చున్నా ఓ విలేజ్ సెక్రటేరియట్ కనిపిస్తుంది. పది మంది శాశ్వత ఉద్యోగులు కనిపిస్తారు. నాలుగడుగులు ముందుకేస్తే ఆర్బీకే కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్, కడుతున్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. నాడు–నేడుతో రూపురేఖలు మారిన బడులు, హాస్పిటల్స్ కనిపిస్తాయి. ప్రతి 50–60 ఇళ్లకు చేయి పట్టుకొని నడిపించే మంచి వలంటీర్ వ్యవస్థ ఉంది. ఇవన్నీ ఈ 57 నెలల కాలంలోనే జరిగాయి. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలో ఆగి చూసినా, ఏ సామాజికవర్గాన్ని పలుకరించినా మీ జగన్ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రజలు మనను మొదటిసారి ఆశీర్వదిస్తేనే దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగాం. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుందో ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ‘నా’ వాళ్లకు గరిష్టంగా లబ్ధి అణగారిన వర్గాలను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలంటూ చరిత్రలో చూడని విధంగా నామినేషన్ పనులు, కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి మరీ ఇస్తున్నది ఎవరంటే మీ జగన్ అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మీ జగన్ బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేసిన రూ.2.55 లక్షల కోట్లలో 75 శాతం ‘నా..’ అని ఆప్యాయంగా పిలుచుకునే వర్గాలకే ఇచ్చాడు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే ఈ 57 నెలల పాలనలోనే ఏకంగా 2.13 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాం. ఆ ఉద్యోగాల్లో 80 శాతం నా ఎస్సీలు, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలకే దక్కాయి. ఇంతటి సామాజిక న్యాయం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే కనిపిస్తోంది. 35 లక్షల ఎకరాలపై అనుభవదారులు, గిరిజనులు, రైతన్నలు, నిరుపేదలకు సర్వహక్కులు ఇచ్చింది ఎవరంటే మీ జగనే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో సింహభాగం వాటా దక్కింది మీ జగన్ వచ్చాకే. చంద్రబాబుకు ఓటేయడం అంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటేయడమే. డీబీటీకి వ్యతిరేకంగా ఓటు వేయడమే. ఈ విషయాన్ని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. మీరంతా గతంలో చంద్రబాబు పాలన చూశారు. ఇంకా చాలామంది పరిపాలన చూశారు. కానీ మేనిఫెస్టోను 99శాతం అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తున్నది మీ జగన్ మాత్రమే. మొదటి చాన్స్ ఇస్తేనే మీ జగన్ ఇంత గొప్పగా అన్ని వర్గాలనూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. మరి మూడుసార్లు సీఎంగా, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయాడని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి అడగండి. మీ జగన్ పేరు చెబితే.. మీ జగన్ పేరు చెబితే.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం, విద్యాకానుక, గోరుముద్ద, బాగుపడ్డ పాఠశాలలు, బైజూస్ కంటెంట్, బైలింగ్యువల్ బుక్స్, ట్యాబ్‌లు, డిజిటల్ బోధనతో ఐఎఫ్‌పీ ప్యానళ్లు, తొలిసారిగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, టోఫెల్ శిక్షణ, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం గుర్తొస్తాయి. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యా దీవెన, వసతి దీవెన, జాబ్ ఓరియెంటెడ్‌గా కరిక్యులమ్‌లో మార్పులు, ఆన్లైన్ వర్టికల్స్ చదువులతో అనుసంధానం.. ఇవన్నీ తల్లిదండ్రులకు వివరించాలి. ఇవన్నీ కొనసాగాలంటే, పిల్లలు అనర్గళంగా ఇంగ్లిషులో మాట్లాడాలంటే, పెత్తందార్ల పిల్లలతో పోటీ పడే పరిస్థితి రావాలంటే మీ అన్న మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుందని చెప్పండి. ఇవాళ ఒకటో తరగతిలో ఉన్న పేదింటి పాప, పేదింటి బాబు మరో 10–15 ఏళ్లలో అంతర్జాతీయ చదువులతో గొప్ప ఉద్యోగాలు సాధించాలంటే మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుందని ప్రతి ఇంటికీ చెప్పండి. సైకిల్‌కు ఓటేయడం అంటే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం రద్దుకు ఓటేస్తున్నామని గుర్తు పెట్టుకోవాలి. ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దే రూ.3 వేల పెన్షన్లు కొనసాగాలన్నా, భవిష్యత్‌లో పెరగాలన్నా, కొందరికే పింఛన్లు ఇచ్చిన రోజులు మళ్లీ రాకూడదన్నా, లంచాల జన్మభూమి కమిటీలు కాటేయకూడదన్నా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని ఇంటింటికీ వెళ్లి చెప్పాలి. ఇవాళ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరినీ సేవలతో విస్తరించిన ఆరోగ్యశ్రీ, 104, 108 వాహనాలు, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష ఆదుకుంటున్నాయి. వీటి పేరు వింటే కోవిడ్ కష్టకాలంలో అందించిన సేవలు గుర్తుకొస్తాయి. పేదలు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్నా, గడపగడపకూ వైద్యం అందించే పరిస్థితి కొనసాగాలన్నా లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలని కోరాలి. 57 నెలల్లో మీకోసం 125 సార్లు బటన్లు ఈ 57 నెలల్లో నేను ప్రజల కోసం 125 సార్లు బటన్లు నొక్కా. ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు వెళ్లాయి. ఇంత మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా, ఈ పాలనకు కొనసాగింపుగా ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్ కోసం రెండు బటన్లు నొక్కాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద శాశ్వతంగా పోతుంది. పొరపాటు చేశారంటే చంద్రముఖి మళ్లీ సైకిలెక్కుతుంది. టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికొస్తుంది. పేదల రక్తం తాగేందుకు లకలకా అంటూ మీ ఇంటి తలుపులు తడుతుందని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ చెప్పండి. మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి మన పాలనలో మీకు మంచి జరిగితే నాకు ఓటు వేయండి అని, మీ బిడ్డకు మీరే సైనికులుగా తోడుగా నిలబడాలని మనం నిబద్ధతతో సిద్ధం అంటుంటే ఏ ఒక్కరికైనా ఏం చేశారో చెప్పుకొనేందుకు ఒక్కటీ కనిపించని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. మేమూ సిద్ధం.. సంసిద్ధం అంటూ చంద్రబాబు పోస్టర్లు వేయిస్తున్నారు. ప్రజలకు మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధం? ఎందుకు సంసిద్ధం? ఎవరితో యుద్ధం? పెత్తందార్ల తరఫున చంద్రబాబు సంసిద్ధం అంటున్నాడంటే ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తున్నావ్? కృష్ణుడిలా కోట్ల గుండెలు తోడున్నాయి.. దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడుగా కృష్ణుడి రూపంలో ప్రతి పేదవాడి ఇంట్లో కోట్ల గుండెలున్నాయి. ప్రజలే అండగా, ప్రజలతోనే పొత్తులతో ఎన్నికల పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. ఇది మీ అందరి పార్టీ. జగన్‌ను నమ్మిన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికి అంచెలంచెలుగా అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్సార్సీపీ. ప్రతి కార్యకర్తకూ మీ అన్న జగన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని తెలియజేస్తున్నా. ప్రతి కార్యకర్త, ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత నాది. మా నాయకుడు మాటిచ్చాడంటే చేస్తాడంతే అని ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పుకునేలా ఉండాలి. 99 శాతం వాగ్దానాలు అమలుచేసి ప్రతి ఇంటికీ వెళ్లి మేనిఫెస్టో చూపించి మరీ ప్రజల ఆశీస్సులు కోరుతున్న పార్టీ మనదే. అందుకే ఎన్నికల్లో 175కు 175 మన టార్గెట్. మన టార్గెట్ 25కు 25 ఎంపీ సీట్లు. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ తగ్గేందుకు వీలేలేదు. మరో 55 రోజుల్లో మరో రెండు నెలల్లోనే ఎన్నికలు. ఈరోజు నుంచి చూస్తే మరో 55 రోజులు కూడా ఉండవేమో. చంద్రబాబు అబద్ధాలు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5, ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ఎదుర్కొంటూ పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలి. చీకటి రాతల్ని, చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు సంసిద్ధంగా ఉండాలి. మీరంతా సెల్‌ఫోన్ టార్చిలైట్లు వెలిగించి సిద్ధమే అని చెప్పండి. ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ సభ్యులు, వలంటీర్లు, గృహ సారథుల పాత్ర అత్యంత కీలకం. సమరభేరి మోగిద్దాం.. సమరనాదం వినిపిద్దాం. చంద్రబాబుకు ఇప్పటికే 75 ఏళ్లు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు 80కి చేరుతుంది. ఎన్నికల తర్వాత టీడీపీ రూపురేఖలు ఎక్కడా కనిపించవు. ఈ ఎన్నికలు చాలా కీలకం కావడంతో పెత్తందార్లంతా ఏకం అవుతున్నారు. వీరంతా సరిపోరని జాతీయ పార్టీలతో పరోక్షంగా ఒకరితో, ప్రత్యక్షంగా మరొకరితో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. ఒకే ఒక్కడిపై యుద్ధం చేయడానికి ఇన్ని తోడేళ్లు ఏకం అవుతున్నాయి. ఈ తోడేళ్లను ఎదుర్కోవాలంటే మీ జగన్ ఒక్కడికే సాధ్యం కాదు. మీ జగన్‌కు ప్రతి గుండె తోడుగా నిలబడాలి. ప్రతి ఇంట్లో అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, తల్లీతండ్రీ, ప్రతి రైతన్న మీ జగన్‌కు తోడుగా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాల్సిన అవసరం ఉంది. మీరు వేసే ఓటు పేదవాడి భవిష్యత్‌ను, జీవితాన్ని నిర్ణయించే ఓటు అవుతుంది. పొరపాటు జరిగిందంటే పేదవాడి బతుకులు అతలాకుతలం అవుతాయి. మీకెందుకు ఓటేయాలి బాబూ? జగన్ మార్కు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నప్పుడు, ప్రతి పేద ఇంట్లో, ప్రతి సామాజికవర్గంలో, ప్రతి ప్రాంతంలో మంచి మార్పు కనిపిస్తున్నప్పుడు బాబుకు ఎందుకు ఓటు వేయాలని అడుగుతున్నా. జగన్ పాలనలో ప్రజలకు మంచి చేయలేదని, జగన్‌కు ప్రజాబలం లేదని చంద్రబాబు నిజంగా నమ్మితే ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబూ? అని అడుగుతున్నా. ఊతం కోసం అటో కర్రా, ఇటో కర్ర ఎందుకయ్యా? సైకిల్ తోయడానికి నీకొక ప్యాకేజీ స్టార్ ఎందుకయ్యా? జగన్ ప్రతి ఇంటికీ మంచి చేశాడని తెలుసు కాబట్టే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
Babu : కరకట్టపై పొత్తులు.. బాబు ఏమన్నాడంటే.?
కరకట్ట నివాసం వేడేక్కింది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత వారం రోజులుగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని స్వగృహానికే పరిమితమయిన చంద్రబాబు.. ఇవ్వాళ ఉండవల్లిలోని కరకట్ట నివాసానికి వచ్చాడు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పొత్తులపై ఆధారపడి అత్యధికంగా ప్రయోజనం పొందిన చంద్రబాబులో.. ఈ సారి మాత్రం ఆ వెలుగు కనిపించడం లేదు. రాజ్యసభలో సైకిల్ మాయం రాజ్యసభ ఎన్నికలకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. గత పది రోజులుగా తెలుగుదేశం వర్గాలు పోటీ చేస్తామంటూ రంకెలేస్తున్నాయి. మా బాబు మామూలోడు కాదని నేతలు పకడ్భందీగా ప్రకటనలిచ్చేశారు. చంద్రబాబు మీద పార్టీ సీనియర్లకు ఎంత నమ్మకం అంటే.. తమ పార్టీ తరపున గెలిచింది 23 మందే అయినా.. తమకు బలం లేదని తెలిసినా.. తమకు అవకాశమిస్తే.. గెలుస్తామని చెప్పుకున్నారు. ఓటుకు కోట్లు విషయంలో చంద్రబాబుకు ఉన్న అపారమైన అనుభవానికి ఇది ఒక నిదర్శనం. ఎన్నిక ఏదైనా ఎమ్మెల్యే ఎవరైనా.. ఎంత డబ్బైనా ముట్టజెప్పి.. తమవైపుకు తీసుకురాగల శక్తి చంద్రబాబుకు ఉందని నమ్మారు. అయితే ఇవ్వాల్టి కరకట్ట మీటింగ్‌లో ఈ విషయం తేలిపోయింది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఏదీ లేదని చంద్రబాబు ప్రకటించారు. YSRCPకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేల కోసం తెరవెనక టిడిపి బృందం ఆహర్నిశలు కృషి చేసినా.. ఫలితం దక్కలేదన్న ఆవేదన బాబు మాటల్లో కనిపించింది. పొత్తులుంటాయి.. కానీ..! కరకట్ట మీటింగ్‌లో ప్రధానంగా చర్చ జరిగిన రెండో అంశం పొత్తులు. బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నాయంటున్నారు, మరి మనతో ఎవరున్నారని చంద్రబాబును పార్టీ సీనియర్లు అడిగారు. దీనిపై సుదీర్ఘంగా మాట్లాడిన చంద్రబాబు.. పొత్తులు ఉంటాయని, ఆయా పార్టీల వాళ్లకు సీట్లు కేటాయించాలన్నారు. అయితే బీజేపీతో పొత్తు ఉంటుందా? ఉండదా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. కొత్త వాళ్లు పోటీ చేయడం వల్ల ఇప్పటివరకున్న కొందరికి సీట్లు దొరకవని, అయితే వారికి నష్టం కలగకుండా ఉండేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. (వాలంటైన్స్ డే సందర్భంగా చంద్రబాబు పొత్తుల గురించి సోషల్ మీడియాలో చురకలు) ఇంకా మారని తీరు చంద్రబాబు అంటేనే ఫిరాయింపులు. ఫిరాయింపులు అంటేనే చంద్రబాబు. ఎంత సేపు పక్కపార్టీ నేతలపై కన్నేసి పెట్టే చంద్రబాబు.. తాజాగా కరకట్ట మీటింగ్‌లో YSRCP నేతలెవరయినా వస్తారా అంటూ ఆరా తీసినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌ల మార్పు నిర్ణయం తర్వాత YSRCP నుంచి భారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారని భావించామని నేతలు ప్రస్తావించినట్టు తెలిసింది. కొందరు నేతలకు అక్కడ టికెట్ లేదనడంతో తమ దగ్గరకు వస్తున్నారని, అక్కడ గెలవలేని వాళ్లు.. ఇక్కడ కూడా గెలుస్తారని అనుకోలేమని, అయినా అవకాశం ఉన్నచోట వారే పార్టీకి పెద్ద దిక్కని చెప్పినట్టు తెలిసింది. లోకేష్‌తో లాభమా? నష్టమా? ఎన్నికలు మరీ దగ్గరకు వచ్చాయని, ఇప్పటివరకు అభ్యర్థులు సరికదా.. పొత్తులు కూడా ఖరారు కాలేదని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అలాగే పార్టీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఒక్క సభ కూడా పెట్టలేదని చెప్పినట్టు తెలిసింది. త్వరలో ‘‘రా....కదలి రా’’ పేరిట తాను సభలు పెట్టబోతున్నట్టు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. అలాగే లోకేష్ శంఖారావం మీటింగ్ గురించి నేతలతో ప్రస్తావించినప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినట్టు తెలిసింది. తరచుగా లోకేష్ చేస్తున్న ప్రకటనలు అసలుకే మోసం తెచ్చేలా ఉన్నాయంటూ కొందరు బాబుకు చెప్పినట్టు తెలిసింది. ఎన్నికలకు కేవలం 56 రోజులే ఉన్నాయని, ఇంకా పార్టీ నేతలు ఎలక్షన్ మూడ్ లోకి రాకపోతే ఎలా అని చంద్రబాబు అడిగినట్టు సమాచారం. పొత్తులపై క్లారిటీ ఎప్పుడు.? బీజేపీతో పొత్తు పై ఇప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం లేదంటున్నారు టీడీపీ నేతలు. ఈనెల 16 సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో బీజేపీ జాతీయ విస్తృతస్థాయి సమావేశాలున్నాయి. ఈ సమావేశాలు ముగిసేవరకు ఢిల్లీకి రావొద్దని పవన్, బాబులకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి. బీజేపీ హైకమాండ్ పిలుపు కోసం వారం రోజుల నుంచి వేచి చూస్తున్నా పవన్‌ను పట్టించుకోవడం లేదు. బీజేపీ సమావేశాలు ముగిశాక ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తహతహలాడుతున్నారు. ఈలోగా 17న పర్చూరులో రా కదలిరా సభకు భారీగా జనాన్ని తీసుకురావాలని చంద్రబాబు నేతలకు ఆదేశాలిచ్చాడు. పార్టీలో ఎవరైనా చేరేవాళ్లుంటే.. తీసుకురావాలని చంద్రబాబు సూచించినట్టు తెలిసింది. -
Adudam Andhra: విజేతల జాబితా ఇదే..
విశాఖ స్పోర్ట్స్: యువత క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తూ నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా..’ తొలి సీజన్ విజేతలకు ముఖ్యమంత్రి జగన్ మంగళవారం విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియంలో ట్రోఫీలతో పాటు మెడల్స్, నగదు ప్రోత్సాహకాల్ని అందించారు. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ మెన్, వుమెన్ విజేతలకు చెక్కులను ట్రోఫీలతో పాటు అందించారు. బ్యాడ్మింటన్ తొలి మూడు స్థానాల్లో నిలిచిన జోడీలకు ట్రోఫీలతో పాటు నగదు ప్రోత్సాహకాల్ని అందించారు. క్రికెట్ పురుషుల విభాగంలో ఏలూరు జట్టు విజేతగా నిలవగా మహిళా విభాగంలో ఎన్టీఆర్ జిల్లా జట్టు గెలుపొందింది. వాలీబాల్ మెన్, వుమెన్ రెండు విభాగాల్లోనూ బాపట్ల విజేతగా నిలిచింది. ఖోఖో మెన్లో బాపట్ల, వుమెన్‌లో ప్రకాశం జిల్లాలు విజేతలుగా నిలిచాయి. బ్యాడ్మింటన్ మెన్లో ఏలూరు జోడి, వుమెన్‌లో బాపట్ల జోడి విజేతగా నిలిచింది. కబడ్డీ మెన్లో బాపట్ల, వుమెన్‌లో విశాఖ జట్లు విజేతలుగా నిలిచి సీఎం జగన్ చేతుల మీదుగా ట్రోఫీలతో పాటు చెక్కులను అందుకున్నాయి. క్రికెట్ విజేత ఏలూరు విశాఖ వైఎస్ఆర్ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో డే నైట్‌గా సాగిన పురుషుల క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నక్కవానిపాలెం (విశాఖ) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులు చేసింది. ప్రతిగా అశోక్ పిల్లర్ రోడ్ (ఏలూరు) జట్టు తొలి యాభై పరుగుల్ని వికెట్ కోల్పోకుండానే చేసింది. పది ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయినా 69 పరుగులు చేసి నాలుగో వికెట్‌ను 87 పరుగుల వద్ద కోల్పోయింది. అనంతరం వికెట్ కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. 16వ ఓవర్లో చివరి రెండు బంతుల్ని సిక్సర్లుగా మలచడం ద్వారా టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఏలూరు జట్టు గెలుపొందగా విశాఖ రన్నరప్‌గా నిలిచింది. మెన్ క్రికెట్ టైటిల్ పోరును సీఎం జగన్ స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించారు. కబడ్డీలో బాపట్ల ఆధిక్యం.. కబడ్డీ పురుషుల ఫైనల్ పోటీ ఏయూ గ్రౌండ్స్‌లో జరిగింది. టాస్ గెలిచిన నాగులాపురం–1 (తిరుపతి) జట్టు కోర్టును ఎంచుకోగా కొత్తపాలెం–2 (బాపట్ల) జట్టు తొలి రైడ్ నుంచే ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తొలి అర్ధభాగంలో బాపట్ల 15–7తో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తిరుపతి జట్టు రెండో అర్ధభాగంలో కాస్త పుంజుకున్నా ఆధిక్యాన్ని తగ్గించలేకపోయింది. ఇరు జట్లు రెండో అర్ధభాగంలో తొమ్మిదేసి పాయింట్లతో సమ ఉజ్జీగా నిలిచాయి. చివరికి కొత్తపాలెం 2 (బాపట్ల) 26–17తో నాగులాపురం 1 (తిరుపతి)పై గెలుపొంది మెన్ కబడ్డీ విజేతగా నిలిచింది. నాగులాపురం జట్టు రన్నరప్‌గా నిలిచింది. బాపట్ల తరపున లక్ష్మీనారాయణ, రామకృష్ణ, శ్రీకాంత్, వెంకటేశ్వర, హరిప్రసాద్, బాలకృష్ణ, అనిల్ ప్రసాద్ కోర్టులోకి దిగగా తిరుపతి జట్టు తరపున సతీష్, తరుణ్‌కుమార్, సుమన్, చిన్నముత్తు, దేవేంద్ర, తమిళైర్సన్, నరసింహ కోర్టులోకి దిగారు. -
రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యం
పట్నంబజారు: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్కాంగ్రెస్పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రీజినల్ కో –ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సమన్వయకర్తలతో సమీక్షాసమావేశం జరిగింది. అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, పరిశీలకులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలు, లోక్‌సభ స్థానం గెలుపే లక్ష్యంగా దృష్టి సారించి ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఏడు సీట్లలో విజయం తధ్యమని, మంగళగిరిని సైతం గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీకి అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. సీట్ల మార్పు అంశంలో ఎవరైతే గెలుస్తారో, వారిని మార్పు చేశామని, మిగతా వారు అలాగే అభ్యర్థులుగా కొనసాగుతారని తెలిపారు. ఈ సమావేశంలో శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, మేకతోటి సుచరిత, అన్నాబత్తుని శివకుమార్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్యవరప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనిక్రిస్టినా, సమన్వయకర్తలు బలసాని కిరణ్‌కుమార్, షేక్ నూరిఫాతిమా, గంజి చిరంజీవి, నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు, పార్టీ నేత రావెల కిషోర్‌బాబు, విడదల గోపి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. -
అటు ఆటలు.. ఇటు ఆరోగ్యం
మన ఊరిలో.. మన వార్డులో మట్టిలో మాణిక్యాలు ఎందరో ఉన్నారు. వారందరినీ గుర్తించి సాన పట్టగలిగితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయవచ్చు. అలాంటి వారిని గుర్తించేందుకే ‘ఆడుదాం ఆంధ్రా..’ అనే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సచివాలయ స్థాయి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ, ఆటలపై మక్కువ పెంచేందుకు ‘ఆడుదాం ఆంధ్రా..’ ఎంతో దోహదపడుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 25.45 లక్షల మంది క్రీడాకారులు ఇందులో పాలుపంచుకున్నారని, ఈ కార్యక్రమాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. 47 రోజుల పాటు ఉత్సాహభరితంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు ఉత్సవాలు మంగళవారం విశాఖలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి జగన్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆరోగ్యం, వ్యాయామంపై అవగాహన పెంచేలా.. మన ఆరోగ్యానికి వ్యాయామం, క్రీడలు ఎంత అవసరం అనే అంశంపై రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో, ప్రతి గ్రామంలో అవగాహన పెరగాలి. ఆడుదాం ఆంధ్రా ద్వారా ఆరోగ్యం, వ్యాయామం పట్ల అవగాహన పెరగాలన్నది ఒక ఉద్దేశమైతే గ్రామ స్థాయి నుంచి మట్టిలోని మాణిక్యాల్ని గుర్తించి వారి ప్రతిభకు సాన పెట్టి శిక్షణ ఇవ్వడం మరో లక్ష్యం. తద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన యువత రాణించేలా ప్రోత్సహించవచ్చు. ఉత్తరాంధ్ర గడ్డపై సగర్వంగా... ఆడుదాం ఆంధ్రా ద్వారా క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్మాడ్మింటన్ తదితర ఐదు క్రీడల్లో గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టాం. 25.40 లక్షల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు. 3.30 లక్షల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయి. 1.24 లక్షల పోటీలు మండల స్థాయిలో, 7,346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో, 1,731 పోటీలు జిల్లా స్థాయిలో, 260 మ్యాచ్‌లు రాష్ట్ర స్థాయిలో నిర్వహించాం. ఫైనల్స్ ముగించుకొని మన విశాఖలో, మన ఉత్తరాంధ్రలో, మన కోడి రామ్మూర్తి గడ్డమీద సగర్వంగా ముగింపు సమావేశాలను నిర్వహిస్తున్నాం. దాదాపు 37 కోట్ల కిట్లు గ్రామ స్థాయి నుంచి పోటీ పడుతున్న పిల్లలందరికీ ఇచ్చాం. రూ.12.21 కోట్ల విలువైన బహుమతులు పోటీలో పాలుపంచుకున్న పిల్లలందరికీ అందిస్తున్నాం. తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఆల్ ది బెస్ట్.. క్రికెట్లో ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెమ్మలను టాలెంటెడ్ ప్లేయర్స్‌గా గుర్తించాం. కబడ్డీలో ముగ్గురు తమ్ముళ్లు, ఒక చెల్లెమ్మను గుర్తించాం. వాలీబాల్‌లో ఒక తమ్ముడు, ఒక చెల్లెమ్మ ప్రతిభను చాటుకున్నారు. ఖోఖోలో ఒక తమ్ముడు, చెల్లెమ్మ ప్రతిభను గుర్తించాం. బ్యాడ్మింటన్‌లో ఒక తమ్ముడు, చెల్లెమ్మ ప్రతిభ నిరూపించుకున్నారు. వారికి సరైన శిక్షణ ఇవ్వగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రోత్సహిస్తూ అడుగులు వేస్తున్నాం. ఎంపికైన తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఆల్ ద బెస్ట్. 14 మంది టాలెంటెడ్ ప్లేయర్స్ దత్తత... ఈ బృహత్తర కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌తో పాటు ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ పాల్గొని ప్రతిభ చాటుకున్న 14 మందిని దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. క్రికెట్ నుంచి పవన్ (విజయనగరం), చెల్లెమ్మ కేవీఎం విష్ణువరి్ధని (ఎన్టీఆర్ జిల్లా)ని చెన్నై సూపర్ కింగ్స్ దత్తత తీసుకొని మరింత మెరుగైన శిక్షణ ఇస్తుంది. క్రికెట్ నుంచే శివ (అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా), చెల్లెమ్మ గాయత్రి (కడప జిల్లా)ని దత్తత తీసుకోవడానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ముందుకొచ్చింది. సతీష్ (తిరుపతి), బాలకృష్ణారెడ్డి (బాపట్ల)ని ప్రో కబడ్డీ టీమ్ దత్తత తీసుకుంది. సుమన్(తిరుపతి), సంధ్య (విశాఖ)ను ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. వాలీబాల్‌కు సంబంధించి ఎం.సత్యం (శ్రీకాకుళం), మహిళల విభాగానికి సంబంధించి మౌనిక (బాపట్ల)ను దత్తత తీసుకునేందుకు బ్లాక్ హాక్స్ సంస్థ ముందుకొచ్చింది. ఖోఖోకు సంబంధించి కె.రామ్మోహన్ (బాపట్ల), హేమావతి (ప్రకాశం)లకు తర్ఫీదు ఇచ్చేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది. బ్యాడ్మింటన్‌లో ఎ.వంశీకృష్ణంరాజు (ఏలూరు), ఎం.ఆకాంక్ష (బాపట్ల)ను ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ దత్తత తీసుకొనేందుకు ముందుకొచ్చింది. ఈ 14 మందికి రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఆ సంస్థలు మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చేందుకు అడుగులు ముందుకొచ్చాయి. ఇక ఏటా ‘ఆడుదాం ఆంధ్రా’...! ఈరోజు మనం వేసిన అడుగు ఇక ప్రతి సంవత్సరం ముందుకు పడుతుంది. క్రీడల్లో మన యువత ప్రతిభను గుర్తించి మరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేస్తాం. సచివాలయాల స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహిస్తూ వ్యాయామం ఆవశ్యకత, ఆరోగ్య జీవన విధానాలను ముందుకు తీసుకెళతాం. వీటివల్ల ఆటలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ఆకట్టుకున్న లేజర్ షో ముగింపు ఉత్సవాల సందర్భంగా ‘ఆడుదాం ఆంధ్రా’ ప్రత్యేక గీతాన్ని స్టేడియంలో ప్రదర్శించారు. ఈ పాటకు దాదాపు 5 నిమిషాల పాటు కళ్లు మిరుమిట్లు గొలిపేలా ప్రదర్శించిన లేజర్ షో ఆకట్టుకుంది. కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర వైఎస్సార్ సీపీ ఇన్చార్జీ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి ఆర్కే రోజా, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు విడదల రజని, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కలెక్టర్ మల్లికార్జున, ఏసీఏ కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ప్రభుత్వ విప్ కరణం ధర్మ శ్రీ, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి వెంకటసత్యవతి, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త బొత్స ఝాన్సీ, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర పాల్గొన్నారు. కమాన్.. క్రికెట్ టీమ్! క్రికెట్లో విజేతగా నిలిచిన ఏలూరు జట్టుకు చెందిన కెప్టెన్, వైస్ కెప్టెన్‌ని వేదికపైకి రావాలని తొలుత నిర్వాహకులు ఆహ్వానించగా ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకుని క్రికెట్ టీమ్ మొత్తం వేదికపైకి రావాలంటూ స్వయంగా చేతులు చాచి ఆహ్వానించడంతో జట్టు సభ్యులంతా ఉత్సాహంగా స్టేడియంలో పరుగులు తీస్తూ వచ్చారు. సీఎంతో కరచాలనం కోసం పోటీపడ్డారు. సెక్యూరిటీని వారించి సీఎం వారితో ఎక్కువ సేపు గడిపారు. విజేతలకు ట్రోఫీతో పాటు రూ.5 లక్షల ప్రైజ్ మనీని సీఎం జగన్ అందజేశారు. మహిళా క్రికెట్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్ విజేతలు, రన్నరప్‌లకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందించారు. ఐదు విభాగాల్లో ప్రతిభ చాటిన క్రీడాకారుల జాబితాను స్వయంగా ప్రకటించి బహుమతులు అందించారు. సీఎం జగన్ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారి పేర్లు అడిగి తెలుసుకున్నారు. జగనన్నని కలిశామన్న ఆనందం వారిలో కొట్టొచ్చినట్లు కనిపించింది. అరగంట పాటు మ్యాచ్ వీక్షణ క్రికెట్ మైదానానికి సాయంత్రం 6 గంటలకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ క్రీడాకారులు, ప్రేక్షకులకు అభివాదం చేస్తూ వేదికపైకి చేరుకున్నారు. ఏలూరు, విశాఖ జట్ల మధ్య జరిగిన క్రికెట్ ఫైనల్స్ని అరగంట పాటు ఆసక్తిగా వీక్షించారు. వికెట్ పడినా.. ఫోర్లు, సిక్స్ కొట్టినా.. ఇరు జట్లనూ చప్పట్లతో ప్రోత్సహిస్తూ ఉత్సాహపరిచారు. ఈ మ్యాచ్‌లో ఏలూరు జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గి విజేతగా నిలిచింది. -
అబద్ధాలే ఆయుధాలు!
వర్తమాన భారత రాజకీయాల్లో అలవోకగా అబద్ధాలు చెప్పగలిగే నేర్పరి ఎవరు? ఈ ప్రశ్నకు తెలుగు రాష్ట్రాల్లోని 90 శాతం మంది ప్రజలు ఠకీమని సమాధానం చెప్పగలరు. అబద్ధం – ఆయనా కవల పిల్లలన్నంతగా అపఖ్యాతిపాలైన ఆ నాయక శిరోమణి పేరు చంద్రబాబని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘నిజం చెబితే ఆయన తల వేయి ముక్కలవుతుందని ముని శాపం వున్నది, అందువల్లనే ఆయన నిజం చెప్పడ’ని వైఎస్సార్ తరుచూ చెబుతుండేవారు. ‘కళ్లార్పకుండా అబద్ధం చెప్పగలిగే వాడే చంద్రబాబ’ని జగన్మోహన్ రెడ్డి పలుమార్లు చెప్పారు. అటువంటి చంద్రబాబు రామోజీరావు చెంతకు చేరారు. లేదా, రామోజీయే చంద్రబాబును చేరదీశారు. రామోజీది గోబెల్స్ అంశ. అంతకంటే నైపుణ్యం గలవాడు. గోబెల్స్‌ను తొండ అనుకుంటే, రామోజీని ఊసరవెల్లి అనుకోవాలి. భౌతిక శాస్త్రంలో న్యూటన్ వంటివాడు గోబెల్స్ అనుకుంటే, ఐన్‌స్టీన్ మాదిరిగా అప్డేటెడ్ వెర్షన్ రామోజీ. ఆయనకు రాసు కోవడానికి పత్రికా, చూసుకోవడానికి టీవీలూ, తీసుకోవడానికి స్టూడియో ఉన్న సంగతి తెలిసిందే. వాటి సాయంతో ప్రాప గాండా అనే సబ్జెక్టును అసత్యశాస్త్రంగా అభివృద్ధి చేశారు. రామోజీ–బాబులకు ఇంకొందరు పిల్ల గోబెల్స్ తోడయ్యారు. ఇంకేముంది? అసలే కోతి... కల్లు తాగింది. ఆపై నిప్పు తొక్కింది. దాన్ని ఎగరకుండా ఆపడం ఎవరి తరం? ఆ కల్లు తాగిన కోతికే జనం యెల్లో మీడియా అనే వాడుక పేరు తగిలించారు. ఈ యెల్లో మీడియాకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నదనే సంగతి తెలియనిది కాదు. పొలిటికల్ బాసు బాబు మీద మన యెల్లో మీడియా ఈగనైనా వాలనీయదు. ఆయన్ను కుర్చీలోంచి లాగి గిరాగిరా తిప్పి నేల కేసి కొడుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోదు కనుకనే 2014లో, ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కోటి అబద్ధాల నోము నోచింది. నూరు అబద్ధాలాడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు కదా పెద్దలు. ఇదే స్ఫూర్తితో కోటి అబద్ధాలా డైనా సరే బాబును కుర్చీలో కూర్చోబెట్టాలనే సంకల్పాన్ని యెల్లో మీడియా తలదాల్చింది. ఈసారి ఇంకా పెద్దఎత్తున శతకోటి అబద్ధాల నోమును ప్రారంభించినట్టున్నారు. యెల్లో పత్రికలూ, ఛానెళ్లూ అబద్ధాల మందుగుండును అడ్డదిడ్డంగా పేలుస్తున్నాయి. ఈ అడ్డగోలు కాల్పులు లక్ష్యాన్ని తాకలేకపోతున్నాయి. జనంలో విశ్వసనీ యత పూర్తిగా సన్నగిల్లింది. వీళ్లు పొరపాటున ఎప్పుడో ఒక నిజం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దాంతో కొత్త వార్ఫ్రంట్స్ను చంద్రబాబు ఓపెన్ చేశారు. తెలుగుదేశం – యెల్లో మీడియాల స్క్రిప్టును చదవడానికి, అబద్ధాలను వల్లె వేయడానికి వేరే గొంతులు కావాలి. వేరే ముఖాలు కనిపించాలి. ఇటువంటి పరకాయ ప్రవేశపు వ్యూహాలను చంద్రబాబు చాలా కాలంగానే అమలు చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ వ్యూహా లకు మరింత పదును పెట్టారు. ఇతర పార్టీల్లో, వ్యవస్థల్లో, సంస్థల్లో తన మనుషులను జొప్పించి తనకు అవసరమైనట్టుగా ఆడించుకోవడం చంద్ర బాబు వెన్నుపోటుతో నేర్చిన విద్య. చంద్రబాబు ఉచ్చులోపడి ఆయన మెప్పుకోసం ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక న్యాయమూర్తి పరిస్థితిని నిన్ననే చూశాము. ఆ న్యాయమూర్తి వ్యవహారశైలిని తప్పుపడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తొలగించింది. పైనున్న వారి అండ చూసుకొని అభ్యంతరకరంగా వ్యవహరించిన న్యాయమూర్తికి శృంగభంగం తప్పలేదు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గద్దె నెక్కాలన్న లక్ష్యంతో అధికార పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీలతోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొత్తులు పెట్టుకోవడానికి చంద్ర బాబు పడుతున్న ప్రయాస కనిపిస్తూనే ఉన్నది. ఇప్పటికే జనసేనను హత్తుకున్న బాబు బీజేపీ పెద్దల కటాక్షం కోసం నిరీక్షిస్తున్న సంగతి గమనిస్తూనే ఉన్నాము. ఇక రాష్ట్రంలో ఖాయిలాపడిన కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు కౌలుకు తీసుకున్న సంగతి కూడా జగమెరిగిన సత్యమే. జనసేన, బీజేపీలు తనకు ఓట్లను జోడించాలి. కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఓట్లను చీల్చాలి. ఇదీ చంద్రబాబు–రామోజీల స్వీట్డ్రీమ్. ప్రత్యక్ష పొత్తు పార్టీలతో పాటు పరోక్ష పొత్తు పార్టీ కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలను ప్రచారం చేయాలి. అపోహలు సృష్టించాలి. అవసరమైన అబద్ధాల స్క్రిప్టును టీడీపీ అందజేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అదే పనిలో ఉన్నది. చంద్రబాబు ఆకాంక్షల మేరకే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షు రాలి నియామకం కూడా జరిగింది. పీసీసీ అధ్యక్షురాలితో పాటు ఆ పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం, యెల్లో మీడియా భాషనే మాట్లాడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావుకు ఇంచుమించు చంద్రబాబు కున్నంత రాజకీయ అనుభవం ఉన్నది. ఆయన నిన్న విజయ వాడలో ఒక ప్రెస్‌మీట్ పెట్టారు. అందులో ఒక అద్భుతమైన, అనూహ్యమైన పొట్టలు పగిలేలా విరగబడి నవ్వించే సంచలన ఆరోపణ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీకి ముడుపులు అందుతున్నాయట! కుబేరుడికి చందాలివ్వడమేమిటో! ప్రపంచంలోనే అత్యంత సంపన్న పార్టీగా బీజేపీకి పేరున్నది. పదేళ్లుగా అవిచ్ఛిన్నంగా కేంద్రంలో అధికారం చలాయిస్తున్నది. మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలూ వారివే. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలంతా ఆ పార్టీ కను సన్నల్లోనే మసులుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పు డిప్పుడే కాలు చేయి కూడదీసుకుంటున్న రాష్ట్రం నుంచి వారికి ముడుపులు కావాలా? ఈ నికృష్టమైన ఆరోపణ చేయడానికి టీడీపీకి ధైర్యం సరిపోదు గనుక ‘బంతి’ని కాంగ్రెస్‌కు పాస్ చేసింది. బాల్ దొరికిందని గోల్ కొట్టబోయి కేవీపీ బొక్కబోర్లా పడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీతో కలిసి ఉమ్మడిగా అక్రమ కేసును బనాయించి జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా పదహారు నెలలు జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఉత్తి పుణ్యానికి అంతకాలం జైల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయ కత్వం సంతృప్తి చెందినట్లు లేదు. అంధ్రప్రదేశ్ మంత్రులెవరూ అరెస్టు కావడం లేదేమిటని ఆయన చాలా బాధపడ్డారు. రాష్ట్రంలో అవినీతి జరుగుతున్నదని టీడీపీ యెల్లో మీడియా చేస్తున్న విషప్రచారానికి వంత పాడటమన్న మాట. ఇక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలి సంగతి సరేసరి. వైసీపీకి మద్దతునిస్తున్న మైనా రిటీల ఓట్లు చీల్చడానికి బాబు అప్పగించిన బాధ్యత నిర్వహణ కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మణిపూర్‌లో క్రైస్తవులపై దాడులు జరిగితే జగన్మోహన్ రెడ్డి ఖండించలేదట! అసలు మణిపూర్‌లో జరిగిందేమిటి? మతాల మధ్యన ఘర్షణగా ఎందుకు చిత్రిస్తున్నారు? రోజూ పత్రికలు చదివే వారికి మణిపూర్ ఘటనల నేపథ్యం తెలిసే ఉంటుంది. అది రెండు తెగల మధ్యన ఏర్పడిన పరస్పర అపనమ్మకం. ఒకరి పట్ల ఒకరిపై అనుమానం. ఇక్కడ మతం లేదు. కొండ ప్రాంత షెడ్యూల్డ్ తెగ కుకీలకు, మైదాన ప్రాంత మెయితీలకు మధ్యన ఏర్పడిన విభేదాలు కారణం. మెయితీల్లో మెజారిటీ ప్రజలు హిందువులు కావడం, కుకీల్లో అత్యధికులు క్రైస్తవులు కావడం యాదృచ్ఛికం. ఈ వివాదానికి అది కారణం కాదు. మెయితీల్లో క్రైస్తవులు, మహ్మదీయులు కూడా ఉన్నారు. మెయితీలకు షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించే ప్రతిపాదన పట్ల కుకీల్లో అభద్రతాభావం ఏర్పడింది. తమ భూములు కూడా క్రమంగా మైదాన ప్రాంతాల వారి చేతుల్లోకి వెళ్లి పోతాయే మోననే భయం కుకీలను ఆందోళనకు పురికొల్పింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం వల్ల ఘర్షణలు చెలరేగి కొన్ని సిగ్గుపడా ల్సిన సంఘటనలు జరిగాయి. కేంద్రం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పరిష్కరించవలసిన స్థానిక సమస్యకు మతం రంగులు పులమడం, మత వైషమ్యాలు లేని రాష్ట్రంలో చిలువలు పలువలు చేర్చి రెచ్చ గొట్టడం అవాంఛనీయం. తమ పబ్బం గడుపుకోవడానికి కుటుంబాలను చీల్చడం, కులాల మధ్య కుంపట్లు పెట్టడం, మతాల మధ్య చిచ్చుపెట్టడం వంటి పనులకు కొందరు రాజకీయవేత్తలు వెనుకాడరు. తమ నోటి వెంట వస్తే రక్తి కట్టవనుకున్న సంభాషణల్ని ఇతరుల చేత పలికిస్తారు. ఆ స్క్రిప్టును చదివేవాళ్లు ఒకటికి పదిసార్లు ఆలోచించి చదవడం మంచిది. అధికారపక్షం మీద అబద్ధాలనే ఆయుధాలుగా ప్రయోగించే కార్యక్రమంలో భాగంగా యెల్లో మీడియా, జనసేనలతోపాటు ఈ వారం కాంగ్రెస్ పరివారాన్ని కూడా చంద్రబాబు రంగంలోకి దించారు. దాంతోపాటు ఒకానొక సర్వే సంస్థను కూడా ప్రయో గించారు. దాని పేరు సీ–వోటర్. ఈ సంస్థకు విశ్వసనీయత లేదనీ, ఈ సంస్థతో చంద్రబాబుకు అక్రమ సంబంధం ఉన్నదనీ చెప్పడానికి కావలసినన్ని రుజువులున్నాయి. ఒక ప్రొఫెషనల్ సంస్థ ఎన్నికల కంటే ముందే ప్రజల మూడ్‌ను అంచనా కట్టి రిపోర్టు ఇస్తే అది కనీసం 90 శాతమన్నా వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అప్పుడే దాని ప్రొఫెషనలిజం మీద నమ్మకం కుదురుతుంది. గత రెండు దశాబ్దాలుగా మన దేశంలో సెఫాలజీ ఒక శాస్త్రంగా బాగా వేళ్లూనుకున్నది. 90 నుంచి 95 శాతం వరకు కచ్చితత్వంతో చాలా సంస్థలు రిపోర్టులు ఇవ్వ గలుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కచ్చితత్వం లేకపోయినా ట్రెండ్నయితే సరిగ్గానే పట్టుకుంటున్నారు. విజేతను ముందు గానే గుర్తించగలుగుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 86 శాతం (151) అసెంబ్లీ సీట్లను, 88 శాతం (22) పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నది. ఇటువంటి భారీ విజయాల సందర్భాన్ని వేవ్‌గా, ప్రభంజనంగా పేర్కొంటారు. ప్రభంజనం ఉన్న సందర్భాల్లో ఔత్సాహిక సర్వే సంస్థలు సైతం విజేతను సరిగ్గానే ఊహిస్తాయి. సీట్ల సంఖ్యను చెప్పడంలో ప్రొఫెషనల్ సంస్థలు కొంతమేరకు దగ్గరగా రావచ్చు. ఇటు వంటి సందర్భాల్లో కూడా సీట్ల సంఖ్యను పక్కనబెట్టి అసలు విజేతనే తప్పుగా ఊహించేవాడు ఎవడైనా ఉంటాడా? ఒక్కడున్నాడు. వాడే సీ–వోటర్. ముందస్తు సర్వేలో వైసీపీకి 10 సీట్లు, టీడీపీకి 15 సీట్లు వస్తాయని రిపోర్టు ఇచ్చాడు. పోలింగ్ జరిగిన రోజు ఎగ్జిట్ పోల్‌లో కొద్దిగా సవరించి వైసీపీకి 11, టీడీపీకి 14 ఇచ్చాడు. వాస్తవ ఫలితం తెలిసిందే. వైసీపీకి 22, టీడీపీకి 3 సీట్లు వచ్చాయి. ఆ మూడు సీట్లను కూడా పదివేల లోపు ఓట్ల తేడాతోనే టీడీపీ గెలిచింది. అంత వేవ్‌ను అంచనా వేయలేకపోతే అది ఒక ప్రొఫెషనల్ సంస్థగా పని చేయడం తగునా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో జరిగిన ఎన్నికలను పరిశీలిద్దాం. పోలింగ్ ముగిసిన రోజున సీ–వోటర్ సంస్థ ప్రెస్‌మీట్ పెట్టి తెలుగుదేశం 160 సీట్లు గెలవబోతున్నదని ప్రకటించింది. వాస్తవానికి ఆ ఎన్నికల్లో టీడీపీకి 47 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి. ప్రొఫెషనల్ సంస్థ చేసే సర్వే ఇంత దారుణంగా వికటిస్తుందా? వచ్చే ఎన్నికలకు సంబంధించి గడిచిన నెల రోజుల్లో 13 సర్వేలు వచ్చాయి. అందులో పన్నెండు సర్వేలు వైసీపీ గెలుస్తుందని చెప్పాయి. 47.7 నుంచి 51 శాతం వరకు ఆ పార్టీ వోట్ షేర్‌ను అంచనా వేశాయి. టీడీపీ గెలుస్తుందని అంచనా వేసినవాడు మళ్లీ ఒకే ఒక్కడు. వాడే సీ–వోటర్. టీడీపీకి 17 పార్లమెంట్ సీట్లు, వైసీపీకి 8 పార్లమెంట్ సీట్లు వస్తాయని ఆ సంస్థ ఆంచనా వేసింది. వైసీపీకి 41 శాతం, టీడీపీ కూటమికి 45 శాతం ఓటు షేర్ ఉన్నట్టు ప్రకటించింది. ఊరంద రిదీ ఒక దారైతే ఉలిపి కట్టెది ఇంకో దారి అంటారు. ఇప్పుడు సీ–వోటర్ అనే సంస్థదీ అదే దారి. చంద్రబాబుకు సంబంధించిన ఎన్నికలు జరిగే ప్రతి సంద ర్భంలోనూ ఈ సంస్థ ఆయన పార్టీయే గెలుస్తుందని రిపోర్టులు ఇచ్చింది. గడిచిన 25 సంవత్సరాలుగా ఈ సంస్థది ఇదే కథ. చంద్రబాబు అనగానే ఆటోమేటిక్‌గా విజేత అని వచ్చేట్టు కంప్యూటర్ ప్రోగ్రామింగేదో వీళ్ల దగ్గర ఉన్నట్టున్నది. సీ–వోటర్ అనే సంస్థ చంద్రబాబు పెంపుడు చిలక అనడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయి. ఈ పెంపుడు చిలక పలికిందని గడిచిన రెండు రోజులుగా యెల్లో మీడియా పండుగ చేసుకుంటున్నది. కానీ క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ ప్రకారం ఐదేళ్ల కిందటి ఫలితాలే ఆంధ్రప్రదేశ్‌లో పునరావృతం కాబోతున్నాయని ఘంటాపథంగా చెప్పవచ్చు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
షర్మిలను నిలదీసిన సామాన్యుడు
అనకాపల్లి: కొన్ని రోజుల క్రితం ఏపీలోని కాంగ్రెస్ పార్టీలో చేరి రచ్చబండ కార్యక్రమం పేరుతో ప్రజలకు వద్దకు వెళుతున్న షర్మిలకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ప్రధానంగా వైఎస్సార్ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్ పార్టీ కండువా మళ్లీ మీరు ఎందుకు కప్పుకున్నారని షర్మిలను ఓ సామాన్యుడు నిలదీశాడు. గతంలో జగనన్న వెంట నడిచి, ఇప్పుడు మళ్లీ మీరు కాంగ్రెస్ పార్టీ అనడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. జగన్‌ను అన్యాయంగా జైల్లో పెడితే.. అప్పుడు మీరు పాదయాత్ర చేశారని, అప్పుడున్న నిజాయితీ ఇప్పుడెందుకు లేదని నిలదీశాడు. అనకాపల్లి నియోజకవర్గంలో నర్సీపట్నంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో సామాన్యుడి నుంచి ఎదురైన ఈ హఠాత్తు పరిణామంతో షర్మిల ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఈ సందర్భంగా సదరు వ్యక్తి మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబాన్ని వేధించింది. వైఎస్సార్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చింది. జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టింది. ఆ సమయంలో మీరు పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వైఎస్ కుటుంబానికి అండగా నిలబడ్డారు. వైఎస్ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని మా కార్యకర్తలమంతా తప్పుపట్టాం. ఆ సమయంలో మేమంతా మీకు, మీ కుటుంబానికి అండగా నిలబడ్డాం. మీ పాదయాత్రలో మీతో నడిచాం. ఇప్పుడు మళ్లీ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటున్నారు. అందుకే నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి’ అంటూ షర్మిలపై ప్రశ్నల వర్షం కురిపించాడు. వైఎస్ జగన్ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, పింఛన్లు మొదలుకొని ప్రతీ పథకం అర్హుడైన పేదవాడికి అందుతుందని స్పష్టం చేశాడు . -
వాగ్దానాల అమలే పాలనకు గీటురాయి
ఎన్నికల మేనిఫెస్టో అనేది కేవలం ఎన్నికల సందర్భంగా ఇచ్చే అహేతుకమైన హామీల పత్రం కాదు. అలవికాని హామీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా తప్పించుకోవడానికి కొన్ని పార్టీలు తమ శక్తియుక్తులను ఉపయోగించడం కనిపిస్తుంది. అయితే ప్రజలు ఇటువంటి పార్టీలను గమనిస్తూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు ఓటు ద్వారా బుద్ధి చెబుతారు. ఇందుకు మంచి ఉదాహరణ 2014లో తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన విధానాన్ని గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి అధికారం కట్టబెట్టడమే. దీన్ని సద్వినియోగం చేసుకొని వైసీపీ 99 శాతం హామీలను నెరవేర్చి మరో విజయం వైపు దూసుకుపోతోంది. ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు తాము ఏం చేస్తామో చెబుతూ ఒక రాజకీయ పార్టీ తన సిద్ధాంతాలు, ఉద్దేశాలు, విధానాలను ప్రతిబింబిస్తూ ఇచ్చే హామీ పత్రమే ఎన్నికల మేనిఫెస్టో. దీని ఆధారంగా, తమ అంచనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా, ఏ పార్టీ మేనిఫెస్టో ఉందో ప్రజలు నిర్ణయించుకొని ఓటువేయడానికి వీలవుతుంది. అందువల్ల, రాజకీయ పార్టీ హామీలు స్పష్టంగా ఉండాలి. అమలులో ఎలాంటి అస్పష్టతకు ఆస్కారం ఇవ్వకూడదు. భారత ఎన్నికల సంఘం 2013 సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా, రాజకీయ పార్టీలకు ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ కింద మార్గదర్శకాలను రూపొందించడానికీ, వారు చేసిన వాగ్దానాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించిన విషయాలపై చర్చించడానికీ, రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కానీ వాటిపై స్పష్టత రాలేదని చెప్పాలి. చట్ట ప్రకారం, ఎన్నికల మేనిఫెస్టోలోని వాగ్దానాలు అవినీతి అక్రమాల కిందకు రావని అందరికి తెలిసిన విషయమే. కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పార్టీల మధ్య సమాన పోటీ స్థాయిని నిర్ధారించ డానికీ, ఎన్నికల స్వచ్ఛతనూ, ప్రజలకు చేసిన వాగ్దానాలనూ కాపా డటం కోసం మాత్రమేనని నిర్ధారించడమైనది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేయడం సర్వసాధారణం. అమెరికాలో, ఇది ఆర్థిక, విదేశీ విధానాలు, ఆరోగ్య సంరక్షణ, పాలనా సంస్కరణలు, పర్యావరణ సమస్యలు, వలసలు వంటివాటిపై వారు చేయబోయే పనులను తెలియచేస్తుంది. అనేక పశ్చిమ ఐరోపా దేశాలలో, మేనిఫెస్టోలు మరింత నిర్దిష్ట విధాన ఎంపికలు, బడ్జెట్ చిక్కులను ప్రస్తావిస్తాయి. 2022లో ఆర్జేడీ ఎంపీ మనోజ్ కె. ఝా రాజ్యసభలో మాట్లా డుతూ, ఎన్నికల మేనిఫెస్టోకు చట్టబద్ధత కల్పించాలని, ఎన్నికల తర్వాత, రాజకీయ పార్టీలు తాము చేసిన వాగ్దానాలను మరచిపోయి ఆడంబరమైన వాదనలు చేయకుండా చట్టం ఉండాలని చెప్పిన విష యాలను గుర్తు చేసుకోవడం సముచితం. మేనిఫెస్టో ఔచిత్యం తగ్గు తోందని వారు ఆవేదన పడుతూ, 1952, 1957, 1962 ఎన్నికలప్పుడు విడుదల చేసిన మేనిఫెస్టోలను ఉటంకించారు. పార్టీలు చేయదగిన అంశాలను మాత్రమే ఆ యా మేనిఫెస్టోల్లో చేర్చేవారని పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ 2014లో విడుదల చేసిన మేనిఫెస్టోను, ‘దశ–దిశ చూపించే ఒక పవిత్ర పత్రం’గా అభివర్ణించారు ఆ పార్టీవారు. దీనిలో ‘కష్టాలలో ఉన్న రైతులను రుణ మాఫీతో ఆదుకొంటాం’ అని చెప్పారు. రుణమాఫీ గురించి ఇంతకు మించి వివరణ మేనిఫెస్టోలో కనపడదు. అనగా ఏ తారీఖు వరకున్న రుణాలు, ఎంత మేరకు మాఫీ చేస్తారనే విషయం ఎక్కడా లేదు. ఈ విషయమై ఆ పార్టీ అధ్యక్షులు బహిరంగ సభలలో చెప్పిన వాగ్దానాలు మేనిఫెస్టోలో లేవు. గెలిచిన తర్వాత ఈ వాగ్దానం అమలును ‘మమ’ అనిపించడానికి పార్టీ పెద్దలు చాలా శ్రమించారు. ప్రొఫెసర్ కె.వి. రమణారెడ్డి, ఇదే పత్రికలోనూ, డెక్కన్ క్రానికల్ ఆంగ్ల పత్రికలోనూ తెలుగుదేశం పార్టీ ఈ విషయమై రైతులను ఏవిధంగా మభ్య పెట్టిందో తన పరిశోధన ద్వారా విశదంగా వివరించారు. ‘వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, రూ 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రైతువారి ఇన్సూరెన్స్’ వంటి హామీలనూ ఇదే మేనిఫెస్టోలో పెట్టారు. కానీ గెలిచాక, వీటి ఊసే లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ‘రైతుభరోసా కేంద్రా’లను ఏర్పాటు చేసి, రైతుకు కావలసినవన్నీ ఒకే చోట అందుబాటులో ఉంచడంతో బాటు, నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడం, ధరల స్థిరీకరణ నిధి ద్వారా గిట్టుబాటు ధర అందించడం, పంటనష్ట నివారణకు ఇన్సూరెన్స్ అమలుచేసి రైతుకు అండగా నిలవడం వంటి నిర్మాణాత్మక పనులు చేసింది. తెలుగుదేశంవారు ‘మహిళా సాధికారత కోసం డ్వాక్రా రుణాల రద్దుతో బాటు, వారి అభివృద్ధికి, భద్రతకు పెద్దపీట వేయాలని నిర్ణ యించారు.’ కాని, వాస్తవానికి ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ఐదు సంవత్సరాలలో ఏమి జరిగిందో మహిళలకు తెలుసు. ౖవైసీపీ ప్రభుత్వం వచ్చినాక, డ్వాక్రా రుణాలను వడ్డీతో బాటు మాఫీ గావించారు. ఇలా ఎన్నికల వాగ్దానాలను పార్టీలు మరచిపోతే, ప్రజలు మరచిపోతారు లేదా క్షమిస్తారనుకోవడం పెద్ద పొరబాటు. తెలుగు దేశం తన పార్టీ మేనిఫెస్టోలో, ‘రానున్న అయిదేళ్ళలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం/ ఉపాధి అవకాశం కల్పిస్తా’మని మాటిచ్చింది. కానీ దాని గురించి ఏమీ పట్టనట్లు ఐదేళ్లు గడిపేసింది. యువత 2019లో జరిగిన ఎన్నికల్లో, ఎలా గుణపాఠం చెప్పారో అందరికీ తెలిసిందే. ‘గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్, ప్రతి గ్రామానికీ తారు రోడ్డు, ప్రతి వీధికి సిమెంటు రోడ్డు, ప్రతి ఇంటికి ఉచితంగా మరుగుదొడ్డి నిర్మించి ఇచ్చుట’ వంటి హామీలూ తెలుగుదేశం ఇచ్చింది. అయిదేళ్లు ప్రభు త్వంలో ఉండి, ఎన్ని ఇండ్లు కట్టించారో, మిగతా హామీలు ఏమిచేశారో తెలిసిన విషయమే. ఈ విషయమై ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పనులు, కట్టిస్తున్న కాలనీల గురించి, పచ్చ పత్రికలకు కనబడక పోయినా, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తెలుస్తూనే ఉంది. అలాగే పేద పిల్లలకు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామనీ, హెల్త్ కార్డ్ ద్వారా అన్నిరకాల వ్యాధులకు కార్పొరేట్, ప్రభుత్వ ఆసు పత్రులలో ఉచిత వైద్యం అందిస్తామనీ మాటిచ్చి గెలిచాక టీడీపీ అమలు చేయలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం పదహారు ప్రభుత్వ ఆసు పత్రులను నిర్మించడంతో బాటు డాక్టర్ల నియామకాలు గావించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి ఇస్తున్న ప్రాధాన్యతను కేంద్రం సైతం కొనియాడింది. ఈ మధ్యకాలంలో ప్రారంభించిన ఇంటింటికి వెళ్లి వైద్యపరీక్ష చేయడంతో పాటు ఇతర సేవలందించడం వంటి కార్య క్రమం ఇండియాలోనే ఆరోగ్యరంగంలో ఒక విప్లవం లాంటిది. పేద లకు చదువే ఒక స్థిరమైన ఆస్తిగా గుర్తించి ‘నాడు–నేడు’ ద్వారా చదు వులో తీసుకొచ్చిన సంస్క రణలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. తెలుగుదేశం 2012లో ప్రకటించిన బీసి డిక్లరేషన్ ప్రకారం 100 శాసనసభ స్థానాలు వారికి కేటాయించడం, వారికి ప్రత్యేక బడ్జెట్, బీసీ సబ్–ప్లాన్ పెట్టి అమలు చేస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రక టించారు. గెలిచాక ఇవన్నీ మూలబడ్డాయి. బీసీలకు ప్రస్తుత ప్రభుత్వం ఏమి చేస్తున్నదో అందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాల ద్వారా అందిస్తున్న అనేక సేవలు గుర్తుకు వస్తే, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో అమలు అవుతున్నదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగుదేశం తన మేనిఫెస్టోలో, ‘ప్రతి ఒక్క హామీనీ, పథకాన్నీ, చిత్తశుద్ధితో అమలు చేస్తాం, ఆచరణలో ఆదర్శంగా నిలుస్తాం’ అని చెప్పింది. కానీ ఏ ఒక్క హామీనీ సంపూర్ణంగా అమలు చేయలేక పోయింది. కానీ వైసీపీ నాయకత్వం 2019లో ప్రకటించిన మేని ఫెస్టోను ప్రజలకిచ్చిన ‘బాండు పేపరు’గా పరిగణించి నూటికి 99 శాతం అమలుచేసి... చిక్కుముడులు విప్పి, ఆ ఒక్కశాతం కూడా అమ లుకు ప్రయత్నిస్తామని ప్రజలకు చెబుతోంది. సహజంగా అటువంటి నాయకులను ప్రజలు ఆదరిస్తారు, చిరకాలం గుర్తుపెట్టుకొంటారు. ఎన్నికైన ప్రభుత్వానికి వారిచ్చిన మేనిఫెస్టో కీలకంగా ఉండాలి. వాస్తవిక ఎన్నికల మేనిఫెస్టో కోసం, రాజకీయాలను మరింత జవాబు దారీగా, పారదర్శకంగా చేయడానికి ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ అఫ్ కండక్ట్‌కు పదును పెట్టి ప్రజలికిచ్చిన హామీలను కనీసం మూడు వంతులైనా పాటించేట్లుగా నిబంధనలు పెట్టాలి. లేని పక్షంలో, ప్రజల కిచ్చిన మాట తప్పినట్లుగా పరిగణించి తగిన శిక్ష విధించాలి. అలా కానిచో పార్టీల మధ్య సమాన పోటీ స్థాయి ఉండదు. ఓటర్ల నమ్మ కాన్ని వమ్ము చేసినట్లవుతుంది. డా‘‘ పి. పృథ్వీకర్ రెడ్డి వ్యాసకర్త హైదరాబాద్‌లోని ‘సెస్’(సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్) సీనియర్ పరిశోధకుడు ‘ prudhvikar@cess.ac.in -
వైఎస్సార్సీపీని తప్పించడమంటే.. టీడీపీకి రాజ్యాధికారం ఇవ్వడం కాదు
పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజ్యాధికారం నుంచి తప్పించడమంటే టీడీపీకి పూర్తిగా రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామ జోగయ్య చురకలు అంటించారు. పవన్ తనకు అధికారం ముఖ్యంకాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అంటుంటారని, అలాగైతే అధికారం చంద్రబాబుకు ధారపోస్తే మీరు కలలుగంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దక్కుతాయని జనసైనికులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారని జోగయ్య ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం ఆయన పవన్‌నుద్దేశించి సూటిగా పలు ప్రశ్నలు సంధిస్తూ ఒక లేఖ రాశారు. దానిని ఆయన మీడియాకు విడుదల చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. ► జనసైనికులు సంతృప్తిపడేలా సీట్ల పంపకంలో కాకపోయినా ముఖ్యమంత్రి పదవిలోనైనా రెండున్నర సంవత్సరాలు జనసేనకు కట్టబెట్టనున్నట్లు ముందుగానే చంద్రబాబు నోటితో చెప్పించగలరా? ► పవన్‌కళ్యాణ్, చంద్రబాబునాయుడు అసెంబ్లీ సీట్ల పంపకం, ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో దఫదఫాలుగా సమావేశాలు నిర్వహిస్తుండడం గమనిసూ్తనే ఉన్నాం. కానీ వారిద్దరి మధ్యలో ఏయే చర్చలు జరిగాయో, ఎవరికెన్ని సీట్లు ఇస్తారో, ఏయే అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అంగీకరించారో వివరిస్తూ ఓ ఎల్లో టీవీ ఛానల్లో జనసేనకు 30 సీట్లని, మరో ఎల్లో వార్తా పత్రికలో 27 సీట్లని ప్రకటనలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ► ఎన్నికల నోటిఫికేషన్‌లోగా ఇద్దరు నాయకులు పైవిధంగా ప్రకటించబోతున్నట్లుగా ఎల్లో మీడియాలో రావడం ఎవరిని ఉద్ధరించడానికి? ► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపాలంటే జనసేన పార్టీకి ఇష్టం ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీతో జతకట్టి ముందుకెళ్లడం తప్పని పరిస్థితిగా ఏర్పడింది. ► అయితే, వైఎస్సార్సీపీని రాజ్యాధికారం నుంచి తప్పించడం అంటే టీడీపీకి పూర్తిగా రాజ్యాధికారం కట్టబెట్టడం కాదు. జనసేన సపోర్టు లేకుండా టీడీపీ ఒంటరిగా వెళ్తే మెజారిటీ సీట్లు దక్కించుకోవడం జరిగే పనికాదు. ఇందుకు 2019 ఎన్నికలే నిదర్శనం. ►దీన్ని దృష్టిలో పెట్టుకుంటే జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందనేది ప్రధాన అంశంకాదు.. జనసేన టీడీపీకి ఎన్ని సీట్లు ఇస్తుందనేది ముఖ్యమైన అంశం. ►కానీ, 25 శాతం జనాభా ఉన్న కాపులు అధికంగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన టీడీపీ నుంచి ఎన్ని సీట్లు దక్కించుకుంటోంది? 20 లక్షల జనాభా ఉన్న రాయలసీమలో బలిజలు ఎన్ని సీట్లు, ఉత్తరాంధ్రలో ఎక్కువ జనాభా ఉన్న తూర్పు కాపులు ఎన్ని సీట్లు దక్కించుకోగలుగుతున్నారనేది కాపులకు జనసేన సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. చంద్రబాబును అధికారంలోకి తేవడానికి కాదు కాపులు పవన్ వెంట నడిచేది. 175 సీట్లు ఉన్న రాష్ట్రంలో కనీసం 50 సీట్లయినా జనసేన దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా దక్కే అవకాశం ఉంటుంది. -
దుష్ట చతుష్టయాన్ని తరిమి కొడదాం
సాక్షి, భీమవరం: ‘రాష్ట్రంలో మరో యుద్ధానికి సమయం ఆసన్నమైంది. ఇది మంచికి, చెడుకీ... ప్రజా సేవకునికి, ప్రజా ద్రోహులకూ... సంక్షేమానికి, విధ్వంసానికీ మధ్య యుద్ధం. ఇందులో మంచినే అందరూ కోరుకోవాలి. దుష్ట చతుష్టయాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలి. జననేత సారథ్యంలో పేదల ఇంట సంక్షేమ కాంతులు విరజిల్లాలంటే ప్రతి ఒక్కరూ చేతులు కలపాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకునేందుకు మరలా వైఎస్సార్సీపీని గెలిపించుకోవాలి. ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలంటే మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి.’ అని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ సమర శంఖారావం పూరిస్తూ ఏలూరు జిల్లా దెందులూరులోని సహారా గ్రౌండ్స్‌లో శనివారం నిర్వహించిన సిద్ధం సభలో నాయకుల ప్రసంగాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఆ ప్రసంగాల వివరాలు వారి మాటల్లోనే.. జగన్ పాలన వల్లే ధైర్యంగా జనంలోకి గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెబుతాడు ఓ వ్యక్తి. పదేళ్లుగా పార్టీ నడుపుతున్నానంటూ ప్యాకేజీకి అమ్ముడుపోతాడు మరో నాయకుడు. వీళ్లంతా మన నాయకుడిని ఎదుర్కొనేందుకు వస్తున్నామని చెప్తున్నా... ఇప్పటివరకు తమ అభ్యర్థుల పేర్లనే చెప్పలేకపోతున్నారు. కానీ సీఎం జగన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. గతంలో చంద్రబాబు పాలనలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా ప్రజల వద్దకు వచ్చారా... ఈ రోజు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నారంటే అది సీఎం జగన్ సుపరిపాలన వల్లే. – వెలంపల్లి శ్రీనివాస్, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే ఇక వార్ వన్ సైడే ఇది జనమా జన సంద్రమా, లేక జగనన్న ప్రభంజనమా. ప్రజలకు అండగా నిలవడమే తప్ప మడమ తిప్పని నాయకుడు జగన్. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారతకు కొత్త భాష్యం చూపించిన కార్యసాధకుడు మన సీఎం. అందుకే ఆయన్ని చూస్తే పేదలకు కొండంత బలం. మా బలం పేరు జగన్, మా కమిట్మెంట్ పేరు కూడా జగన్. ఈ రోజు 175 స్థానాల్లో పిచ్ ఏదైనా విజయం మనదే. జగనన్న రంగంలోకి దిగాక ఇక వార్ వన్ సైడే. – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు ఎమ్మెల్యే హామీలన్నీ అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్ నమ్మకానికి మారుపేరు జగన్మోహన్రెడ్డి అయితే.. మోసానికి మారుపేరు చంద్రబాబు. పేదల పక్షపాతి జగన్మోహన్రెడ్డి సమాజం కోసం పాటుపడుతుంటే.. పనికిమాలిన కొడుకు కోసం చంద్రబాబు పాకులాడుతున్నారు. దాదాపు పదేళ్లు టీడీపీలో ఉండి ఎంపీగా పనిచేశాను. ఈ నాలుగున్నరేళ్లు సీఎం జగన్మోహన్రెడ్డి పరిపాలన చూశాను. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి హామీనీ అమలు చేసిన సీఎం ఈయన ఒక్కరే. పేదల కోసం రెండున్నర లక్షల కోట్లు ఖర్చు చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిదే. తన పిల్లల మాదిరి పేదల పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలని, అంబేడ్కర్ అంతటి గొప్పవాళ్లు కావాలని ఆలోచన చేసిన నాయకుడు జగన్. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. – కేశినేని నాని, ఎంపీ జనం హృదయాల్లో జగన్ సుస్థిర స్థానం పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న సమరంలో పేదల పక్షాన పోరాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాష్ట్ర ప్రజానీకం అండగా ఉంది. దానికి నిదర్శనం ఈ సభకు తరలివచి్చన అశేష జనవాహిని. ఐదేళ్ల క్రితం అనితర సాధ్యమైన 3,650 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో చేసిన వాగ్దానాలనే మేనిఫెస్టోగా చేసుకుని ఐదేళ్ల పాలనలో వాటన్నింటినీ నెరవేర్చి కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. మీకు మంచి జరిగిందనుకుంటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడిగిన సీఎం జగన్ లాంటి దమ్మున్న నాయకుడు దేశ చరిత్రలో ఎవ్వరూ లేరు. – ఆళ్ల నాని, ఏలూరు ఎమ్మెల్యే అబద్ధం అంటే చంద్రబాబు... జగన్ అంటే నిజం... ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి జ్యూడీíÙయరీ, లెజిస్లేటరీ, ఎగ్జిక్యూటివ్, జర్నలిజం నాలుగు స్తంభాలు. దురదృష్టం ఏమిటంటే ఈ నాలుగో స్తంభాన్ని ఈనాడు అనే కల్తీ సిమెంట్‌తో, ఆంధ్రజ్యోతి అనే కల్తీ రాళ్లతో, ఏబీఎన్ అనే బొండి ఇసుకతో, పవన్ కళ్యాణ్ అనే ఉప్పు నీటితో చంద్రబాబు నిరి్మంచిన ప్రజాస్వామ్యం పడిపోదా ? ఆలోచించండి. 600 హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయని చంద్రబాబు అబద్ధం అయితే, నిజం అనే మన నాయకుడు నవరత్నాలే ఇచ్చాడు. పేదవాడికి ఇంగ్లిష్ విద్య అందిస్తుంటే ఈ అబద్దపు చంద్రబాబు అడ్డుపడుతున్నాడు. తెలుగుదేశం కార్యకర్త అవినీతికి కేరాఫ్ అయితే, వైఎస్సార్సీపీ కార్యకర్త ఎవరైనా నిజాయితీకి నిలువుటద్దం. – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర మంత్రి జగనన్న పిలుపే ఒక ప్రభంజనం సిద్ధం.. ఈ పదమే ఒక వైబ్రేషన్. జగనన్న పిలుపే ఒక ప్రభంజనం. ఐదేళ్ల కాలంలో చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఊరూవాడా తిరిగి డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మహిళలను నమ్మించి అధికారంలోకి వచ్చాక ఏవిధంగా వంచించాడో రాష్ట్రంలోని 79 లక్షల డ్వాక్రా అక్కచెల్లెమ్మలందరికీ తెలుసు. వారంతా మరలా జగన్‌ను సీఎం చేసేందుకు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. బాబు హయాంలో 30 లక్షలమందికి పింఛన్లిస్తే ఈ రోజు 65 లక్షల 35 వేల మందికి మన జగన్ అందిస్తున్నారు. నాడు ఒక్క ఇంటి పట్టా ఇవ్వకపోగా... ఈ ప్రభుత్వం 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచి్చంది. 45 ఏళ్లు నిండిన 26 లక్షల మంది మహిళలకు చేయూత పథకం ద్వారా సాయం అందిస్తున్నారు. పిల్లలను చదివించుకునేందుకు 50 లక్షల మందికి అమ్మ ఒడి పథకం అందిస్తున్నారు. – పినిపే విశ్వరూప్, రాష్ట్ర మంత్రి -
జగన్ ప్రభం‘జనం’
సిద్ధం సభ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జనం.. జగన్ కలిస్తే ప్రభంజనమేనని గోదారమ్మ సాక్షిగా మరోసారి ప్రజలు చాటిచెప్పారు. రాష్ట్రంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణులను సన్నద్ధం చేయడానికి శనివారం ఏలూరుకు సమీపంలో ‘సిద్ధం’ పేరుతో నిర్వహించిన సభకు కెరటాల్లా జనం పోటెత్తారు. ఉభయగోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి వేలాది వాహనాల్లో లక్షలాది మంది కదలివచ్చారు. సభా వేదికపైకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకోకముందే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. లక్షలాది మంది ప్రజలు కోల్‌కత–చెన్నై జాతీయరహదారిపై నిలబడిపోయారు. సభా ప్రాంగణం నిండిపోవడం, జాతీయ రహదారిపై లక్షలాది మంది ప్రజలు బారులు తీరడంతో.. హైవేపై కలపర్రు టోల్ ప్లాజ్ నుంచి విజయవాడ వైపు 15 కి.మీల పొడవున.. రాజమహేంద్రవరం వైపు గుండుగొలను వరకూ 17 కి.మీల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. సభా ప్రాంగణం, జాతీయ రహదారిపై ఎన్ని లక్షల మంది ఉంటారో.. అదే స్థాయిలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వాహనాల్లో జనం ఉంటారని చెబుతున్నారు. దుష్టచతుష్టయంపై యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన రణగర్జనకు... సిద్ధమంటూ లక్షలాది గొంతులు ప్రతిధ్వనించాయి. ఎండ తీవ్రత పెరిగినా జనం లెక్క చేయలేదు. సీఎం జగన్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ జై జగన్ అంటూ నినదించారు. జగన్ ఒంటరివాడని దుష్టచతుష్టయం అనుకుంటోందని అంటే.. ‘మీరేలా ఒంటరి అవుతారు.. మేమంతా మీ వెంటే.. మీ సైన్యం మేమే’ అంటూ లక్షలాది గొంతులు నినదించాయి. భీమిలి సభ కంటే రెండు రెట్లు అధికంగా ఏలూరు సభకు జనం తరలివచ్చారు. ‘చంద్ర’ముఖిపై అప్రమత్తం చేద్దాం రాష్ట్రంలో గత 57 నెలలుగా అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన వల్ల ప్రతి ఇంట్లో.. గ్రామంలో.. నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పును కళ్లకు కట్టినట్లు వివరిస్తూ సీఎం జగన్ ప్రసంగించారు. సంక్షేమ పథకాల ద్వారా రూ.2.55 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని.. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేసినప్పుడు ఇచ్చిన హామీల్లో పది శాతమైనా అమలు చేశారా? అని ప్రతి ఇంటికెళ్లి అడగాలంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీకి ఓటేయకపోవడం.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి ఓటేయడమంటే సంక్షేమ పథకాల రద్దుకు ఆమోదం తెలిపినట్లేనన్నది ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా 124 సార్లు సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధి చేకూర్చారని.. ఇప్పుడు ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాను గుర్తు మీద బటన్ రెండు సార్లు నొక్కాలని.. లేదంటే.. చంద్రముఖి సైకిలెక్కుతుందని హెచ్చరించారు. టీ గ్లాసు పట్టుకొని పేదల రక్తం తాగేందుకు ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుందని గడపగడపకు చెప్పాలని పిలుపునిచ్చారు. పోటెత్తిన యువత సభకు హాజరైన వారిలో అత్యధికులు 20 నుంచి 35 ఏళ్లలోపు వారే ఉండటం గమనార్హం. యువతను అభిప్రాయ నిర్ణేతలుగా రాజకీయ పరిశీలకులు భావిస్తారు. ఏలూరు సభకు యువత పోటెత్తడానికి ప్రధాన కారణం సీఎం వైఎస్ జగన్ విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులేనని అంటున్నారు. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకుంటేనే.. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని బలంగా విశ్వసిస్తుండటం వల్లే యువత వైఎస్సార్సీపీ పక్షాన సైనికుల్లా నిలబడుతున్నారని చెబుతున్నారు. ఈ సభకు యువతతో పోటీపడి వృద్ధులు కూడా తరలివచ్చారు. ఉదయం నుంచే బారులు సభకు సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు వస్తారని తెలిసినా.. ఉదయం 11 గంటల నుంచే జనం తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకే సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దీంతో కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారిపై లక్షలాది మంది జనం నిలబడిపోయారు. సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తున్నంత సేపు ఇంకా వాహనాలు వస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో వేలాది మంది సభకు రాలేక వెనుదిరిగారు. -
జగన్‌ను మళ్లీ సీఎం చేయడానికి మేమూ సిద్ధం
ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నారు మా ఇంటి ముంగిటకే సీఎం జగన్ పింఛన్ అందిస్తున్నారు. నెలకు రూ.1000 మాత్రమే చంద్రబాబు ఇస్తే సీఎం జగన్ రూ.3 వేలు ఇస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్నకే మా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. – మేకా శ్రీనివాస్, బుద్దాలపాలెం, మచిలీపట్నం జగనన్న మేలు మరువలేం సీఎం వైఎస్ జగన్ మేలు మరువలేం. గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ బియ్యం, ఒకటో తేదీనే పింఛన్లు వలంటీర్లు ఇంటివద్దకే వచ్చి అందిస్తున్నారు. పేద ప్రజలకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది? గ్రామ సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలు ఇంటికే పంపిస్తున్నారు. – ఎం.కృష్ణారెడ్డి, డీఎన్ పాలెం, రంపచోడవరం జగనన్నకే మా మద్దతు సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేశారు. 99 శాతం హామీలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ నెరవేర్చిన దాఖలాలు లేవు. 86 శాతం ప్రజలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తోంది. మేనిఫెస్టోను వెబ్సైట్లో నుంచి తొలగించిన ప్రబుద్ధులు కూడా ఉన్నారు. వారు ప్రజల్లోకి ఎలా వెళ్లగలుగుతారు? – కరుటూరి ఉమాదేవి, తణుకు ముఖ్యమంత్రి సేవలు శ్లాఘనీయం సీఎం జగన్ సేవలు అద్భుతంగా ఉన్నాయి. సంక్షేమ పథకాల ద్వారా రూ.2.5 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లోకి వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాత్రమే. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన దాఖలాలు లేవు. గతంలో నగదు అంతా ఏమైందో ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు దీనికి బదులు చెప్పాలి. – కంభం రాణి అయ్యంకి, పామర్రు నియోజకవర్గం డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు డ్వాక్రా రుణాలు మాఫీ చేసి సీఎం మహిళలకు చేయూత అందిస్తున్నారు. ఒక్కొక్క మహిళకు రూ.5 వేల నుంచి రూ. లక్ష వరకు రుణాల మాఫీ జరిగింది. వైఎస్సార్ చేయూత ద్వారా మరో రూ.18,750 అందించి మహిళలకు ఆసరాగా నిలుస్తున్నారు. గతంలో చంద్రబాబు పసుపు–కుంకుమ పేరుతో మోసం చేశాడు. – ఉడతా రమణ, చిన్నాయగూడెం, గోపాలపురం నియోజకవర్గం రైతులను ఆదుకుంటున్నారు గ్రామాల్లో సుమారు రూ.1 కోటి వ్యయంతో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్ మిల్క్ సెంటర్లు, వెల్ నెస్ సెంటర్లు నిర్మించారు. రైతులకు అందుబాటులో ఎరువులు, సబ్సిడీ విత్తనాలు, యంత్రాలు, పనిముట్లు, ట్రాక్టర్లు సబ్సిడీపై అందిస్తున్నారు. గ్రామాల్లోనే ఆధునిక వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. – జి.ముసలయ్య, బావయ్యపాలెం, ఉంగుటూరు అర్హులైన పేదవారందరికీ ఇళ్ల స్థలాలు అందించారు భారత దేశ చర్రితలో కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అర్హులైన పేదవారందరికీ 33 లక్షల ఇళ్ల స్థలాలు అందించారు. గత పాలకులు ఎవరూ భూమి కొని ఇళ్ల స్థలాలు అందించిన దాఖలాలు లేవు. పేదవానికి ఇంటి స్థలం, నిర్మాణానికి రుణం అందించారు. విద్యుత్, రోడ్లు, నీటి సౌకర్యంతో మరో ఊరు నిర్మాణం చేపడుతున్నారు. – కాటి నాగరాజు, ఉప సర్పంచ్, అప్పాపురం, మండవల్లి, కైకలూరు ప్రతిపక్షాల మాటలు నమ్మం జగనన్న సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు రాష్ట్రం శ్రీలంకలా అయిపోతుందని ప్రతిపక్ష నాయకులు ప్రచారం చేశారు. ఇప్పడు అవే పథకాలు ఇస్తానని చెబుతున్న చంద్రబాబు.. మరి ఇప్పుడు సింగపూర్ అవుతుందా అనే ప్రశ్నకు జవాబివ్వాలి. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రతిపక్షాల మాటలు నమ్మం. – బొజ్జా రామకృష్ణ సోమేశ్వరరావు, అచ్యుతాపురం, మండపేట నియోజకవర్గం నమ్మకానికి ప్రతీక జగన్ సీఎం వైఎస్ జగన్ దూరదృష్టితో ప్రజలు, రాష్ట్రం బాగు కోసం శ్రమిస్తారు. చంద్రబాబు కేవలం వ్యాపార దృక్పథంతో పాలన చేస్తారు. జగన్ నమ్మకానికి ప్రతీక. రాష్ట్ర ప్రజలంతా ఏకపక్షంగా ఆయన్ని మరోసారి ముఖ్యమంత్రిని చేయడం ఖాయం. 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించి చరిత్ర సృష్టిస్తారు. – ఘంటా శ్రీలక్ష్మి, ఎంపీపీ, ఉంగుటూరు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు గ్రామ సచివాలయాల ద్వారా 2.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఏకైక సీఎం జగన్ మాత్రమే. వైద్య ఆరోగ్య శాఖలో వేలాది మందికి ఉపాధి కల్పించారు. వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వీరు కరోనా సమయంలో ప్రజలకు బాసటగా నిలిచారు. – వై.నర్సింహారావు, పెదపాడు, దెందులూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి కరోనా ప్రభావం లేకపోయినా, రాష్ట్రం విడిపోకపోయినా ఏపీ ఎంతో అభివృద్ధి జరిగేది. ప్రత్యేక పరిస్థితుల్లో సీఎం జగన్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రం విడిపోయి కేంద్రం ఆర్థికంగా మద్దతు ఇవ్వకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిలుపు చేయలేదు. యథావిధిగా కొనసాగించారు. – ఇళ్ల సాయిబాబా, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా ఏ ప్రాంతంలో చూసినా ఒకే తరహాలో ఆదరణ సీఎం జగన్‌కు ఏ ప్రాంతంలో చూసినా ఒకే తరహాలో ఆదరణ లభిస్తుంది. తండ్రి బాటలో పయనిస్తూ ఇచ్చిన హామీని మాట తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఏ రకంగా మరొక వ్యక్తికి అవకాశం ఇస్తారు? జగనే మరోసారి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. – కె.కృష్ణ, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా చంద్రబాబు ఇచ్చే హామీలు ఎవరూ నమ్మరు ఎన్నికల ముందు చంద్రబాబు ఓట్ల కోసం ఇచ్చే హామీలను ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్ని సామాజిక వర్గాల ప్రజలకూ న్యాయం చేస్తున్నారు. ఎవరికి ఏ పథకం అవసరమో గతంలో నిర్వహించిన పాదయాత్రలోనే తెలుసుకున్నారు. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తోంది. – బాబూరావు, గన్నవరం, కృష్ణాజిల్లా నూతన ఒరవడి సృష్టించారు వైఎస్ జగన్ రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించారు. విద్యావంతులు, వివిధ రంగాల్లో నిష్ణాతులను ప్రజాప్రతినిధులుగా ఎంచుకున్న తీరే పాలనపై ఆయనకు ఉన్న ప్రణాళికను తెలి యజేసింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతారు. – దేవబత్తుల శిరీష, ఉప్పులూరు, ఉండి నియోజకవర్గం ఇంతకన్నా మార్పు ఏం కావాలి? ఏ ముఖ్యమంత్రి హయాంలోనైనా ఎమ్మెల్యేలు ఇంటింటా తిరిగినా దాఖలాలు లేవు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఎమ్మెల్యేలు, మంత్రులను సైతం ఇంటింటికీ పంపారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తున్నారు. ఇంతకన్నా మార్పు ఏం కావాలి? – కె.రోజావాణి, పి.గన్నవరం, తూర్పుగోదావరి జిల్లా నేరుగా నగదు బదిలీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి నేటి వరకు ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేశారు. సంక్షేమం లబ్ధి అందని వారికి సైతం ఒకటికి, రెండు సార్లు అవకాశం కల్పించారు. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రంలోనైనా ఉంటారా? – చిట్టూరి శివప్రసాద్, పి.గన్నవరం, తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు వారధిగా ప్రణాళిక ప్రజలకు ప్రజాప్రతినిధులు వారధిగా ఉండేలా సీఎం ప్ర ణాళికను రూపొందించారు. తద్వారా రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించారు. ప్రజలకు, అభివృద్ధి పనులకు మధ్య దళారీలు ఉండకుండా నగదు బదిలీని అమలు చేస్తున్నారు. – ఎన్.సూర్యకుమారి, ఉండి నియోజకవర్గం -
ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కండి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, మీ అన్నను అభిమానించే ప్రతి కార్యకర్తకు, నాయకుడికీ, అభిమానికీ, వలంటీర్‌కు ఒక విషయం చెబుతున్నా. వార్డు మెంబర్ల దగ్గర నుంచి సర్పంచుల వరకు, ఎంపీటీసీల దగ్గర నుంచి ఎంపీపీల వరకు, జెడ్పీటీసీల దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు, మున్సిపల్ కౌన్సిలర్ల దగ్గర నుంచి చైర్మన్ల వరకు, కార్పొరేటర్ల దగ్గర నుంచి మేయర్ల వరకూ, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న డైరెక్టర్లు, చైర్మన్లు వైఎస్సార్సీపీ ఇతర ప్రజా ప్రతినిధులందరికీ ఒక్కటే చెబుతున్నా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీది. మీ బిడ్డ జగన్ మీ అందరికీ ఒక మంచి సేవకుడు. పెత్తందారులతో యుద్ధానికి నేను సిద్ధం. ఈ యుద్ధం 15 ఏళ్లుగా నాకు అలవాటే. నాతో నడిచారు కాబట్టి మీకూ అలవాటే. ఈ ఒక్కడి మీద కలబడి వంద మంది వంద బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లోంచి పుట్టిన ప్రజల పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఒక్కడి మీద దేశంలోకెల్లా బలమైన 10 వ్యవస్థల్ని ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా. 100 బాణాల్ని, కౌరవ సైన్యాన్ని ప్రజా క్షేత్రంలో మరోసారి ఎదుర్కొని మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు అడుగులు ముందుకు వేద్దాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘57 నెలల్లో మన జగనన్న 124 సార్లు బటన్ నొక్కి రూ.2.55 లక్షల కోట్లు నేరుగా లంచాలు, వివక్షకు తావు లేకుండా మనందరి ఖాతాల్లో నగదు జమ చేశారు. అలాంటి ఆయన కోసం మనం కేవలం రెండు బటన్లు నొక్కలేమా.. అని ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. జగనన్నకు ఓటు వేయక పోవడం అంటే ప్రతిపక్షాలకు ఓటు వేయడమే అర్థం అన్నారు. అంటే సంక్షేమాభివృద్ధి పథకాల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్లవుతుందని ప్రతి ఒక్కరికీ చెప్పాలని కోరారు. ప్రతిపక్షానికి ఓటు వేయడం అంటే మళ్లీ వివక్ష చూపించే జన్మభూమి కమిటీలను బతికించినట్లవుతుందని వివరించాలన్నారు. శనివారం ఆయన ఏలూరు జిల్లా దెందులూరు వద్ద నిర్వహించిన ఎన్నికల శంఖారావం సభలో అశేష జనవాహినినుద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఇంటి వద్దకే పెన్షన్ రావాలన్నా, డీబీటీ స్కీములు రావాలన్నా.. జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని ఇంటింటా ప్రచారం చేయాలని కోరారు. తనకు తోడేళ్ల మద్దతు లేదని, నక్కజిత్తులు, మోసం చేసే అలవాటు అంత కంటే లేదని చెప్పారు. ‘మీరు రెండు ఓట్ల ద్వారా చంద్రముఖిని శాశ్వతంగా బంధించవచ్చు. లేదంటే అది సైకిలెక్కి, టీ గ్లాసు పట్టుకుని.. పేదల రక్తం తాగేందుకు లక లక అంటూ ఇంటింటికీ వచ్చి అబద్ధాలతో, మోసాలతో ఒక డ్రాక్యులా మాదిరిగా తలుపు తడుతుంది. అప్రమత్తంగా ఉండాలని గడపగడపకు వెళ్లి ప్రతి ఒక్కరికీ చెప్పండి. 14 ఏళ్లు సీఎంగా పని చేసినా, చంద్రబాబు చెప్పుకొనేందుకు ఏమీ లేదు. కాబట్టి చంద్రబాబు రాజకీయం అంతా పొత్తులు, జిత్తులు, నక్కజిత్తులుగా సాగుతోంది. నేను ఇది చేశాను.. నాకు ఓటేయండి అని అడగలేని దుస్థితి ఆయనది. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచింది ఆయనే.. మళ్లీ ఎన్నికలప్పుడు ఎన్టీఆర్‌ను గుర్తు తెచ్చుకునేదీ ఆయనే. తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా అని ప్రజల్ని కాదు.. పార్టీలను పిలుస్తున్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదలిరా అని దత్తపుత్రుడిని ప్రత్యేకంగా పిలుస్తున్నాడు. వదినమ్మను పిలుస్తున్నాడు. కమలం పార్టీలో చేరిన ఆయన మనుషులను రా కదలిరా అని పిలుస్తున్నారు’ అని సీఎం జగన్ నిప్పులు చెరిగారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. వాళ్లు నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ ♦ రాష్ట్రాన్ని అన్యాయంగా, అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని, వైఎస్సార్ మరణం తర్వాత ఆయన పేరును అన్యాయంగా ఛార్జ్‌షీట్‌లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని కూడా ‘రా.. కదలిరా’ అని చంద్రబాబు పిలుస్తున్నాడు. బాబుకు, దత్తపుత్రుడికి, వదినమ్మకు, చంద్రబాబు బ్యాచ్‌కు.. అసలు ఈ స్టేట్తోనే సంబంధమే లేదు. వీరిలో ఏ ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఉండరు. వీరంతా నా¯Œన్ రెసిడెంట్ ఆంధ్రాస్. పని పడినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారు. ♦ ఆయన సైకిల్ తొక్కడానికి ఇద్దర్ని, దాన్ని తోయటానికి మరో ఇద్దర్ని, పొత్తులో తెచ్చుకొని రా కదలిరా అని పిలుస్తున్నాడు. చంద్రబాబుకు పొత్తే లేకపోతే 175 చోట్ల ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు. ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగనన్నే టార్గెట్‌గా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి. పేదవాడి భవిష్యత్ టార్గెట్‌గా, పేద వాడి సంక్షేమం టార్గెట్‌గా వీరంతా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నారు. ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం ♦ కార్యకర్తల్ని, నాయకులుగా అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లను, చైర్మన్లను నియమించిన చరిత్ర మనది. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లు, చైర్మన్లు పదవులు ఇవ్వడం మీ జగనన్నకు మాత్రమే సాధ్యం. ♦ గతంలో తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు, పక్షపాతంతో కొద్ది మందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే, ఆ స్ధానంలో మనందరి ప్రభుత్వం మన చదువుకున్న పిల్లలతో తీసుకువచ్చిన మనదైన వలంటీర్ వ్యవస్థ, ఇంటింటికీ వెళ్లి పని చేస్తున్న మన ప్రభుత్వానికి దన్నుగా, ప్రజల మన్ననలు పొందుతోంది. ♦ పార్టీని అభిమానించే వారికి చరిత్రలో ఎవరూ ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం. నామినేషన్ పనులు కేటాయింపులో ఇదే పంథా, న్యాయం కొనసాగించాం. ఎవ్వరూ గెలవనన్ని పదవులు, గతంలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వనన్ని అవకాశాలు.. వార్డు మెంబరు మొదలు సర్పంచులు, ఎంటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీచైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రి మండలి సభ్యుల వరకు అవకాశాలు కల్పించాం. ♦ ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం. ఇక్కడున్న మనలో ఎవరైనా ఏ పదవికైనా పోటీ పడితే.. రాష్ట్ర ప్రజలు తమకు జరిగిన మంచికి మనల్ని గుండెల్లో పెట్టుకుని ఎప్పుడూ గెలవనంత మెజార్టీతో గెలిపించే కార్యక్రమం జరుగుతోంది. అందుకే భవిష్యత్‌లో ఇంతకంటే గొప్పగా వారికి పదవులిచ్చే పార్టీ మనది. ఎంతో భవిష్యత్ ఉన్న పార్టీ. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం ♦ వ్యక్తిగతంగా ఒక్క విషయం చెబుతున్నా. పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాం. ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ అన్న, మీ తమ్ముడు సలహా ఇచ్చేది ఒక్కటే. గొప్పగా సేవ చేయండి. గొప్పగా మంచి చేయండి. లంచాలు, వివక్ష లేని పరిపాలనలో మీ వంతు కృషి మీరు చేయండి. మీలో ప్రతి ఒక్కరినీ మరో రెండు మెట్లు ఎక్కించే బాధ్యత నాది. టార్గెట్ 175 కి 175 ఎమ్మెల్యేలు, 25 కి 25 ఎంపీలు. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎంపీగానీ, ఒక్క ఎమ్మెల్యేగానీ తగ్గడానికి వీల్లేదు అని తెలియజేస్తున్నా. ఈ లక్ష్యాన్ని చేరుకునేలా గడపగడపకూ వెళ్లి ప్రతి ఒక్కరితో ఓటు వేయించేందుకు మీరంతా సిద్ధం కావాలి. ♦ ఎన్నికల శంఖం మోగుతోంది. బాబు కుట్రలు, కుతంత్రాలను చిత్తు చేసేందుకు మనందరికీ ఉన్న అస్త్రం.. మీ జేబులో ఉన్న మీ సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్‌తో సోషల్ మీడియా పరంగా సిద్ధంగా ఉండండి. మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు. మనకు తోడు పైన దేవుడు, మంచి జరిగిన ఇంట్లో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మ, అన్నదమ్ములు, అవ్వాతాత మనకు తోడు. రాబోయే 60 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రజాక్షేత్రంలో పోరాడటానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నా. -
మీరే సారథులు.. మీ జగన్ సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే: సీఎం జగన్
జరగబోయే ఎన్నికల రణ క్షేత్రంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు, మీ అందరికీ తోడు అర్జునుడిలా నేను.. మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మన అస్త్రాలుగా మల్చుకుని, కౌరవ సైన్యం మీద యుద్ధం చేద్దాం. ఎన్నికల యుద్ధంలో మన సంక్షేమం మీద, ప్రతి ఇంటికీ మనం చేస్తున్న మంచి, అభివృద్ధి మీదే వాళ్ల దాడి ఉంటుంది. పేద వాడి భవిష్యత్, సంక్షేమం, గ్రామ గ్రామాన అభివృద్ధి, సామాజిక వర్గాల అభివృద్ధి మీద, మనందరి ప్రభుత్వం రాబోయే తరం కోసం అమలు చేస్తున్న విద్యా విధానం మీద ఈ పెత్తందారులు దాడి చేస్తున్నారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, నాడు–నేడుతో మారుతున్న స్కూళ్లు, హాస్పిటళ్లు, పారిశ్రామిక అభివృద్ధి, మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ దండయాత్ర చేస్తోంది. చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రల్ని, కుతంత్రాల్ని, చీల్చి చెండాడటానికి మళ్లీ మనం సిద్ధమవుదాం. మేనిఫెస్టో రిలీజ్ చేయడం, తర్వాత మోసం చేయడం, దాన్ని చెత్తబుట్టలో పడేయడం.. సంప్రదాయంగా వస్తోంది. మొట్టమొదటిసారిగా ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. మేనిఫెస్టోను చూపించి 99 శాతం వాగ్దానాలను అమలు చేసింది మన వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఇవన్నీ కనిపిస్తున్నా, కళ్లుండీ ఈర్ష్యతో చూడలేని కబోదులు టీవీ చానళ్లు, పేపర్ల రూపంలో ఉన్నాయి. మనల్ని తిట్టే వాళ్ల నోరు మంచిది కాదు. వాళ్లు ఎప్పుడూ అంటూనే ఉంటారు. అబద్ధాల పునాదుల మీద వారు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. మీ ఇంట్లో మంచి జరిగిందా.. లేదా అన్నదే కొలమానంగా తీసుకోవాలి. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘రాష్ట్రంలో మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్‌ను మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా సిద్ధమా? పేదల భవిష్యత్‌ను, పేదలని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తున్న కరోనా లాంటి ఆ దుష్టచతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహా సంగ్రామానికి ప్రతి ఒక్కరూ సిద్ధమేనా?’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అశేష జనవాహినిని ప్రశ్నించారు. పేదల భవిష్యత్తును, సంక్షేమాన్ని నిర్దేశించే ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి గడపకూ వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి, అందులో చెప్పిన 99 శాతం హామీలు నెరవేర్చిన తరుణంలో ఈ ఎన్నికల సంగ్రామానికి మీరే సారథులు అని స్పష్టం చేశారు. మంచి కొనసాగాలంటే మళ్లీ మనందరి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలన్నారు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావం ‘సిద్ధం’ సభలో పాల్గొని ప్రసంగించారు. రామాయణం, మహాభారతం.. ఈ రెండింటిలో ఉన్న విలన్లంతా.. ఓ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడి రూపంలో, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు కోవర్టుల రూపంలో ఉన్నారన్నారు. ఇంత మంది తోడేళ్లలా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకుని రెడీగా ఉన్నారని చెప్పారు. ‘వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుందంటే.. ఇన్ని తోడేళ్ల మధ్య జగన్ ఒంటరి వాడిలా కనిపిస్తాడు. కానీ ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్‌కు మీరు స్థానమిచ్చి, మీ ఇంటి బిడ్డగా మీ గుండెల్లో ఉంచుకున్నారన్నదే నిజం. జగన్ ఏనాడూ ఒంటరి కాదు. వారికి ఎల్లో పత్రికలు, టీవీలు, పొత్తుల సైన్యం తోడుగా ఉంటే నాకున్న తోడు, నా ధైర్యం, నా బలం.. పైనున్న ఆ దేవుడు, నన్ను గుండెల్లో పెట్టుకున్న మీరు. ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకంతో పుట్టిన సైన్యం. ఒక నాయకుడిని ప్రజలు నమ్మారు అంటే వాళ్ల స్పందన, ప్రేమ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇక్కడ కనిపిస్తున్న నా అన్నదమ్ములు, అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యమే నిదర్శనం’ అని అన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. 14 ఏళ్లు సీఎంగా ఉండీ ఏం చేశారని అడగండి ► గోదారమ్మ సీమలో నిలబడి మనకు, ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను, ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించడానికి మీ వద్దకు వచ్చాను. ఇంటింటా మనం చేసిన అభివృద్ధి, గ్రామంలో మనం తెచ్చిన మార్పు, లంచాలు, వివక్షకు తావు లేకుండా తెచ్చిన వ్యవస్థ, చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా చూడని విధంగా జరిగిన సామాజిక న్యాయం.. వీటన్నింటికీ మనందరి ప్రభుత్వమే కేరాఫ్ అడ్రస్. ఈ మాటను ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పడానికి, కావాల్సినన్ని అంశాలు పంచుకోవడానికి, తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 175కు 175 ఎమ్మెల్యేలు.. 25కు 25 ఎంపీలు గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు మీ వాడిగా, మీ ముందుకు వచ్చి నా మనసు పంచుకుంటున్నా. నా మాటలు అన్నింటినీ ప్రతి ఇంటికీ తీసుకువెళ్లి ప్రతి ఒక్కరితో పంచుకోవాలి. ► 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజల కోసం ఏం చేశాడు? అని గ్రామాల్లోకి వెళ్లినప్పుడు అమ్మ, అక్క, అన్న, తమ్ముళ్లను అడగండి. గత 10 ఏళ్లుగా వారి బ్యాంకు అకౌంటు వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి. ఆ పదేళ్లు.. అంటే చంద్రబాబు 5 సంవత్సరాలు, మీ బిడ్డ జగన్ పాలనలో 5 సంవత్సరాలు.. బ్యాంకు అకౌంటు వివరాల్లో అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బులు పడిందన్నది వారినే చూడమనండి. 1994, 1999, 2014లో ఇచ్చిన టీడీపీ మేనిఫెస్టోలో ఏనాడైనా 10 శాతం అమలు చేశాడా అని అడగండి. ఈ మార్పును ప్రతి ఇంటా వివరించాలి ► మీ బిడ్డ జగన్ 57 నెలల్లో ఏం చేశారనేది ప్రతి ఇంట్లో వివరించండి. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామం తీసుకున్నా, అభివృద్ధి కళ్లకు కనిపిస్తుంది. విలేజ్ సెక్రటేరియట్.. పట్టణంలో వార్డు సెక్రటేరియట్ కనిపిస్తుంది. సచివాలయాల ద్వారా 540 రకాల సేవలు అందిస్తూ, 10 మంది మన పిల్లలే అక్కడే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. ప్రతి నెలా 1వ తేదీ ఉదయాన్నే ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపుతట్టి.. అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు.. ఇలా ఏకంగా 66 లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరించి, వారి చేతిలో 3 వేల పెన్షన్ పెడుతున్నది మన వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ► లంచాలు, వివక్షకు నాటి జన్మభూమి కమిటీలు మారుపేరు. ఈ రోజు ఏ గ్రామంలో కూడా అలా లంచాలు, వివక్ష లేకుండా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ తెచ్చింది మీ జగనే. డీబీటీ ద్వారా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపుతున్నదీ మీ జగన్, మీ ప్రభుత్వమే. మీ గ్రామంలో గవర్నమెంట్ బడి, ప్రభుత్వ ఆస్పత్రి మారటానికి నాడు–నేడు చేసినది, చేస్తున్నది మీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. గవర్నమెంట్ బడిలో ఇంగ్లిషు మీడియం, బైలింగ్వల్ టెక్ట్స్ బుక్కులు, చిన్నారుల చేతుల్లో ట్యాబ్‌లు, డిజిటల్ బోధన, క్లాస్ రూముల్లో ఐఎఫ్‌పీలు, సీబీఎస్ఈ, ఐబీ వరకు ప్రయాణం అంటే గుర్తుకొచ్చేది మీ జగనే. ► రైతు భరోసా, ఆర్బీకేల ద్వారా రైతన్నను చేయి పట్టుకుని నడిపించేదీ మీ వైఎస్సార్సీపీనే. పేదలు, రైతన్నలకు మంచి చేస్తూ అసైన్డ్ భూముల మీద, 22ఏ భూములు 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు ఇచ్చింది మీ జగనే. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటూ ఈ 57 నెలల్లో అందించిన రూ.2.55 లక్షల కోట్లలో ఏకంగా 75 శాతం పైగా ఈ వర్గాలకే అందించి దేశంలోనే రికార్డు సృష్టించింది మీ జగన్ ప్రభుత్వమే. ► నామినేటెడ్ పోస్టులు, నామినేషన్‌పై ఇచ్చే కాంట్రాక్టులు, ఆలయ బోర్డులు, వ్యవసాయ మార్కెట్ యార్డులు, కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పోస్టులు చట్టం చేసి మరీ ఇచ్చింది మీ ప్రభుత్వమే. కేబినెట్లో 68 శాతం మంత్రి పదవులు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు దక్కాయి. నలుగురికి డిప్యూటీ సీఎం పదవులు, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్ పర్సన్ మొదలు.. స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ కనీవినీ ఎరుగని రీతిలో, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందీ మీ బిడ్డ జగన్ పాలనలోనే. 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం ► గత ప్రభుత్వ హయాంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే.. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. అందులోనూ 80 శాతం నేను నా.. నా.. అని పిలుచుకొనే నా చెల్లెమ్మలు, తమ్ముళ్లు కనిపిస్తున్నారు. అక్కచెల్లెమ్మలను లక్షాధికారులుగా చేయాలని, వారికి గూడు ఉండాలని ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చిందీ మీ జగనే. అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నదీ మన ప్రభుత్వమే. అక్కచెల్లెమ్మలు పిల్లల్ని బడులకు పంపిస్తే చాలు వారికి తోడుగా ఉంటూ.. అమ్మ ఒడి, పిల్లలకు అండగా ఉంటూ విద్యా దీవెన, వసతి దీవెన, అక్కచెల్లెమ్మలకు ఆసరా, చేయూత, సున్నా వడ్డీ.. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, దిశ యాప్.. మొత్తంగా మహిళా సాధికారత.. ఇవన్నీ మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ► ప్రతి గ్రామంలో ఇవాళ ఒక మహిళా పోలీస్, విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. ఆ గ్రామానికి ఫ్యామిలీ డాక్టర్ వచ్చారు. ప్రతి ఇంట్లోనూ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేస్తూ, వైద్యం చేసి, మందులిస్తున్నది మీ బిడ్డ పాలనలోనే. 108, 104, ఆరోగ్యశ్రీ, రైతన్నలకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు తీసుకొచ్చింది మహానేత దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే, వాటిని మరో నాలుగు అడుగులు ముందుకు వేయిస్తున్నది మీ బిడ్డ హయాంలోనే. ► రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. నాలుగు సీ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, కొత్త ఎయిర్ పోర్టులు వస్తున్నాయి. ఉన్న చోట విస్తరణ పనులు జరుగుతున్నాయి. పారిశ్రామిక కారిడార్లలో ఉరుకులు పరుగులతో పనులు జరుగుతున్నాయి. పారిశ్రామిక వేత్తలతో పాటు సంస్థలు మన రాష్ట్రం వైపు లైను కడుతున్నాయి. ఈ వాస్తవాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి. 2019లో మనం అధికారంలోకి రాకపోయింటే ఇవన్నీ సాధ్యమయ్యేవా? ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిæలంచాలు లేకుండా, కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయ పార్టీ చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ అందుతున్నది ఒక్క జగనన్న పాలనలోనే దేశానికే చూపించగలిగాం. ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్ ► ఈ ఎన్నికలు ఎంత ముఖ్యం అనేది ప్రతి అవ్వాతాతకు, అక్కాచెల్లెమ్మకు, అన్నదమ్ములందరికీ చెప్పాలి. కేవలం ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకొనే ఎన్నికలు కావు. 57 నెలలుగా పేదలకు అందుతున్న సంక్షేమాన్ని, వారి పిల్లల భవిష్యత్‌ను నిర్ణయించనున్న ఎన్నికలని ప్రతి ఇంట్లో వివరించాలి. ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గం, ప్రతి ప్రాంతం భవిష్యత్, రైతన్న భవిష్యత్, అక్కచెల్లెమ్మల సంక్షేమం, ఇంటింటా అభివృద్ధి, పిల్లల భవిష్యత్ అన్నీ ఈ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయని గమనించండి. చదువు, వైద్యం కోసం పేదవాడు అప్పులపాలు కాకుండా ఉండాలన్నా అది మనందరి ప్రభుత్వమే ఆ పని చేయగలదని ఇంటింటికీ వెళ్లి చెప్పండి. ► అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, వైద్య సేవలు అందుకుంటున్న వారు, ఇలా ప్రతి ఇంట్లో నుంచి ఒకరు స్టార్ క్యాంపెయినర్లుగా రావాలని చెప్పండి. బయటకొచ్చి ప్రతి ఒక్కరూ కనీసం 100 మందితో జరుగుతున్న మంచి గురించి చెప్పాలని వివరించండి. మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యం అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. అమ్మ ఒడి, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ, సొంతిల్లు.. ఇవన్నీ కొనసాగాలంటే అక్కచెల్లెమ్మలే స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలని చెప్పండి. పిల్లల తల్లిదండ్రులంతా మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పండి. రైతు భరోసా కొనసాగాలన్నా, ప్రతి రైతన్నకూ మెరుగైన ఆర్బీకే సేవలు అందాలన్నా, ఉచితంగా ఇన్సూరెన్స్ రావాలన్నా, ఇన్పుట్ సబ్సిడీ దొరకాలన్నా, పగటిపూటే ఉచిత విద్యుత్, దళారీ వ్యవస్థ పోయి రైతన్నకు మద్దతు ధర అందాలన్నా.. కేవలం జగనన్న మాత్రమే చేయగలడని.. ప్రతి రైతన్న స్టార్ క్యాంపెయినర్ కావాలని చెప్పండి. -
అక్షౌహిణులు సిద్ధం!
ఇసుకేస్తే రాలనట్టుగా, నేల ఈనినట్టుగా, ఆకాశానికి చిల్లులు పడి కుండపోతలు కురిసినట్టుగా జనం కనిపిస్తే... వారి సంఖ్యను లక్షల్లో చెబుతారు. అదే స్థాయిలో ఒక సైన్యం కని పిస్తే... పూర్వకాలంలోనైతే అక్షౌహిణుల్లో కొలిచేవారు. ఇదిగో ఇప్పుడు దెందులూరు వైసీపీ సభలో కనుచూపు మేర చీమల దండులా కనిపిస్తున్న వారంతా సైన్యమే! కార్యకర్తల సైన్యం! ఎంతమంది ఉంటారు? రెండు అక్షౌహిణులు? అంతకంటే ఎక్కువ? రథ గజ తురగ పదాతి విభాగాలు కలిసిన ఒక అక్షౌహిణిలో సుమారు 2 లక్షల 20 వేలమంది ఉంటారు. ఇది మహా భారతం లెక్క. పోయిన వారం భీమిలిలో, ఇవ్వాళ దెందులూరులో కార్యకర్తలు ఎందుకిలా పోటెత్తారు? ప్రతి పల్లె నుంచి పదుల సంఖ్యలో ఎందుకు కదిలారు? ప్రభంజనంలా ఎందు కిలా సాగుతున్నారు? వారికేం లాభం? ఏం ఒరిగింది వారికి?... ఎందుకంటే సమాజానికి ఏదో లాభం జరుగుతున్నది. ప్రతి కుటుంబానికీ సంక్షేమం అందుతున్నది. తాము అభిమానిస్తున్న నాయకుని సారథ్యంలోని ప్రభుత్వ పనితీరును వారు గమనించారు. ఈ స్వల్పకాలంలోనే రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచి కలు చిగురించడం, మొగ్గ తొడగడం వారి అనుభవంలోకి వచ్చింది.చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీ కార్యకర్తలు ‘జన్మభూమి కమిటీ’ పేరుతో జనాన్ని చెండుకు తిన్నారు. ప్రతి పనికీ రేటు కట్టి పిండుకున్నారు. ఇప్పుడా అవకాశం వైసీపీ కార్యకర్తలకు ఎంతమాత్రం లేదు. ప్రజాహిత కార్యక్రమాల్లో పార్టీ చొరబాట్లు లేవు. అర్హతే ప్రాతిపదికగా పారదర్శక పాలన ప్రతి గ్రామంలోనూ అందుబాటులోకి వచ్చింది. వ్యవస్థలో చోటుచేసుకుంటున్న అభ్యుదయ మార్పులే అధికార పార్టీ కార్యకర్తలను ఉత్తేజితం చేస్తున్నాయి. అందువల్లనే లక్షలాది మంది కార్యకర్తలు సొంత లాభం కోసం పాకులాడకుండా పార్టీ గెలుపు కోసం కెరటాలు కెరటాలుగా తరలివస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ‘సిద్ధం’ సభల్లో కార్యకర్తలనుద్దేశించి ఒక మాట తప్పనిసరిగా చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య కర్తలందరి సమష్టి పార్టీ అని ఆయన చెబుతున్నారు. తనతో పాటు పార్టీ వారంతా ఇందులో భాగస్వాములేనని ప్రకటించారు. తొలి నుంచీ పరిశీలిస్తే ఆయన పార్టీని నడుపుతున్న తీరు కూడా ఇందుకు అనుగుణంగానే కనిపిస్తుంది. పార్టీని తన సొంత సంస్థగా, ప్రైవేట్ ఎంటర్‌ప్రైజ్‌గా భావించి ఉంటే తన కుటుంబసభ్యులకే అధికారిక పదవుల్లో కీలక బాధ్యతలు అప్పగించి ఉండేవారేమో! ఆయన ఆ పని చేయలేదు. విస్తృత ప్రజా పునాదితోనే జగన్ పార్టీని నిర్మిస్తున్నారు. అందువల్లనే బహుళ ప్రజానీకపు ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే విధంగా పార్టీ ఆశయాలను, కర్తవ్యాలను రూపొందించు కున్నారు. ఇవాళ ప్రభుత్వ పాలనలోనూ ఆ ఆశయాలే మార్గదర్శ కాలుగా మారాయి. కుటుంబానికి పెద్దపీట వేయకపోవడం వల్ల కొందరు నొచ్చుకొని ఉండవచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు. ఆ పరి ణామం ఆయనకు కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అయినా సరే తన ఆశయపథం నుంచి పక్కకు జరగలేదు. అదేవిధంగా తన పార్టీ కార్యకర్తల అక్రమార్జనకు అవకాశం కల్పించే అడ్డ దారులూ తొక్కలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఆకాంక్షించిన లక్ష్యాల పట్ల జగన్మోహన్రెడ్డి ఎంత నిబద్ధతతో ఉంటారో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అవగతమైంది. ‘మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటు వేయండ’ని గతంలో ఏ నాయ కుడైనా అనగలిగాడా? అలా అనడానికి ఎంత నైతిక బలం ఉండాలి! లక్ష్యాల పట్ల తనకున్న నిబద్ధత వల్లనే ఆ నైతిక బలం ఆయనకు సమకూరింది. వెనుకబాటుతనం కారణంగా సమాజంలోని దగాపడిన తమ్ముళ్లూ, చెల్లెమ్మలూ రాజ్యాంగబద్ధమైన అవకాశాలను అంది పుచ్చుకోలేకపోతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నందువల్ల ఎంతో కొంత ప్రాతినిధ్యం చట్టసభల్లో లభిస్తున్నది. సగం జనాభా ఉన్న బీసీలు మాత్రం ధనస్వామ్యంగా మారిన ఎన్నికల పోరాటంలో నెగ్గుకురాలేకపోతున్నారు. కంటితుడుపుగా ఒకటీ అరా సీట్ల కేటాయింపులకే గతంలో పార్టీలన్నీ పరిమిత మయ్యేవి. కార్మిక – కర్షక పార్టీలుగా తమను తాము చెప్పుకునే కమ్యూనిస్టుల కంటే, బీసీల నాయకత్వంలో ఉన్న ప్రాంతీయ పార్టీల కంటే మిన్నగా జగన్మోహన్రెడ్డి ఈ వర్గాలకు రాజకీయ అవకాశాలను కల్పిస్తున్నారు. లోక్‌సభ స్థానాలకు పార్టీ ప్రకటించిన 16 సీట్లలో తొమ్మిదింటిని బీసీలకు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు పోను మిగిలిన వాటిలో నికరంగా బీసీలకు సగం సీట్లు దక్కనున్నాయి. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించారా? ఛాన్సే లేదు! కానీ అది జగన్ మోహన్ రెడ్డి నిబద్ధత. ఊకదంపుడు ఉపన్యాసాల్లో కాకుండా అభ్యు దయాన్ని ఆచరణలో చూపించిన తొలి రాజకీయవేత్త జగన్ మోహన్‌రెడ్డి. ‘ఎమ్మెల్యే టిక్కెట్టిస్తాం... ఎన్ని కోట్లు ఖర్చు పెడతావ్, పార్టీకెంత చందా ఇస్తావ’ని ఒక పక్క తెలుగుదేశం నాయకులు అడుగుతున్న రోజులివి. ఉపాధి హామీ కూలీగా పనిచేసే ఒక సాధారణ వ్యక్తిని మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయగల సాహసం ఒక్క జగన్‌కు తప్ప ఇంకెవరికి ఉంటుంది? పార్టీ కార్యకర్త కావడం, పార్టీ పట్ల విధేయత అతని అర్హతలు. సూపర్ రిచ్ సామాజిక వర్గాలు పెద్ద సంఖ్యలో ఉండే ప్రాంతాలైన రాజమండ్రి, నర్సాపురం లోక్‌సభ స్థానాలను బీసీ సామాజిక వర్గమైన శెట్టి బలిజలకు కేటాయించవచ్చని ఎవరి ఊహకైనా ఎప్పుడైనా తట్టి వుంటుందా? ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి, నరసరావుపేట లోక్‌సభా స్థానం నుంచి యాదవ కులానికి చెందిన బీసీ అభ్యర్థులను నిలబెట్టే ఔదార్యం ఎవరైనా కనబరిచారా? విజయవాడ నగర శివార్లలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండే పెనమలూరులో గౌడ అభ్యర్థిని, మైలవరంలో యాదవ అభ్యర్థిని నిలబెట్టగలగడం ఒక్క జగన్‌కు మాత్రమే సాధ్యమైన విషయం. రాజకీయ రంగంపై పెత్తందారీ వర్గ ఆధిపత్యాన్ని సవాల్ చేసే విధంగా పేద వర్గాలను సాయుధం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆ వర్గాలను ఉత్తేజితం చేస్తున్నాయి. కనుకనే ప్రతిఫలాపేక్ష లేకుండా పార్టీ గెలుపు కోసం పనిచేయడానికి వారు ముందుకొస్తున్నారు. శ్రీమంతుల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను, నాణ్యమైన వైద్యాన్ని పేదవర్గాలకు అందు బాటులోకి తేవడం రాష్ట్ర ప్రజలను అమితంగా ప్రభావితం చేసింది. వ్యవసాయం దండగనే నాయకుడికి చెంపపెట్టు మాదిరిగా ప్రస్తుత ప్రభుత్వ విధానాలున్నాయి. చిన్న, సన్నకారు రైతులను చేయిపట్టుకొని ముందుకు నడిపించే బాధ్యతను ఆర్బీకే సెంటర్లు చేపట్టాయి. ప్రభుత్వ చేయూత నందుకొని ఈ స్వల్పకాలంలోనే సుమారు రెండు లక్షల సూక్ష్మ పరిశ్రమలు ఏర్పడి 16 లక్షల మందికి ఉపాధినందించాయి. ఏ ప్రమాణాల ప్రకారం చూసినా... పారిశ్రామిక వృద్ధిలో గానీ, మౌలికరంగ అభివృద్ధిలోగాని, మానవాభివృద్ధిలోగానీ, ప్రజల ఆస్తుల కల్పనలోగానీ, సంక్షేమ రంగంలోగానీ ఈ ఐదేళ్ల కాలంతో పోల్చదగిన మరో పదవీకాలం ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే లేదు. ఇది వాస్తవ పరిస్థితి. కానీ చంద్రబాబు – రామోజీ ముఠా ఈ వాస్తవాన్ని వక్రీకరించడానికీ, తలకిందు లుగా చూపడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నది. చేతిలో ఉన్న యెల్లో మీడియా సాయంతో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్న ట్టుగా చూపెట్టే పాతకాలపు కనికట్టు విద్యల్ని ప్రదర్శిస్తున్నది. యెల్లో మీడియా రాతలు, మాటలు ఉన్మాద స్థాయికి చేరుకున్నాయి. ఏరకంగానైనా జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి పెత్తందారీ శక్తులు పడరాని పాట్లు పడు తున్నాయి. మరోపక్కన అవకాశవాద పొత్తుతో కుట్రలు పన్ను తున్నాయి. పవన్ కల్యాణ్ పార్టీ అనే తమ బినామీ పార్టీని ఇప్పటికే ముడివేసుకున్నారు. ఇద్దరూ కలిసి బీజేపీ కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌తో పరోక్ష పొత్తు కుదిరింది. వైసీపీ ఓట్లను ఎంతోకొంత చీల్చాలన్న ఏకైక టార్గెట్‌ను రాష్ట్ర కాంగ్రె స్కు చంద్రబాబు అప్పగించారు. బాబు టార్గెట్‌ను శిరసా వహిస్తూ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన షర్మిల తన క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభించారు. జగన్ వ్యతిరేక ప్రచారాన్ని మరింత రక్తి కట్టించడం కోసం ఆమె తన కజిన్ సోదరి సునీత సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. చంద్ర బాబు సహాయ సహకారాలు సరేసరి! రాష్ట్రంలో పెత్తందారీ శక్తుల ప్రతినిధులు జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. పేదల ప్రభుత్వం తరఫున వైసీపీ కార్యకర్తలు ఉరిమే ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు. భీమిలిలో, దెందు లూరులో జరిగినవి కార్యకర్తల సభలు మాత్రమే. జనసభలు కావు. కార్యకర్తలే లక్షల సంఖ్యలో పాల్గొనడం చిన్న విషయం కాదు. ‘జన్మభూమి కమిటీ’ల పేరుతో చంద్రబాబు మాదిరిగా జగన్ దోచిపెట్టలేదు కనుక ఈ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు పెద్దగా కష్టపడకపోవచ్చని కలలు కన్నవారి కడుపు మండేలా ఈ సభలు జరిగాయి. సభల్లో పాల్గొనడమే కాదు, యుద్ధానికి తాము సిద్ధమేనంటూ సమరనాదాలు కూడా కార్యకర్తలు చేశారు. ‘ఈ పార్టీ నాదీ, నా కుటుంబానిదీ కాదు... ఇది మీది, కార్యకర్తలందరిదీ’ అన్న జగన్ మాటను మంత్రంగా స్వీకరించారు. ‘ఈ యుద్ధంలో అర్జునుడి పాత్ర నాది. సారథ్యం వహించే కృష్ణపరమాత్మలు మీరే’నని కార్యకర్తలను ఆయన ఉత్సాహ పరిచారు. ‘పార్టీ మీదే, పదవులూ మీవే... ముందు ముందు మరిన్ని పదవులు పార్టీకి విశ్వాసపాత్రులైన కార్యకర్తలకే లభిస్తాయ’ని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జన్మ భూమి కమిటీల మాదిరిగా ఆదాయం కోసం పనిచేసే కార్య కర్తలం కాదనీ, ఆశయం కోసం పనిచేసేవారమని ఇప్పటికే రుజువు చేసుకున్న వైసీపీ కేడర్ నాయకుని భరోసాతో మరింత స్ఫూర్తిని పొందింది. ప్రాంతాల వారీగా పెత్తందార్లపై ఎన్నికల యుద్ధానికి వైసీపీ అక్షౌహిణులు సిద్ధమవుతున్నాయి. ఈ కార్య కర్తల సమరశీలత లోపించడం ప్రతిపక్ష శిబిరానికి అతిపెద్ద మైనస్ పాయింట్. మీడియా మాయాజాలంతో, కుట్రలతో ఈ మైనస్‌ను ప్లస్‌గా మార్చుకోవడం సాధ్యమయ్యే పని కాదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఏలూరు ‘సిద్ధం’కు చురుగ్గా ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షిఅమావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల మూడో తేదీన ఏలూరు జిల్లాలో నిర్వహించనున్న ‘సిద్ధం’ బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ప్రజాప్రతినిధులు గురువారం పరిశీలించారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు సభకు తరలిరానున్న క్రమంలో ఆ మేరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల సువిశాల ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది. ఏలూరు ఆటోనగర్, దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ వేదిక పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ సభా వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీల ఏర్పాటు, పార్టీ శ్రేణులందరి దగ్గరకు వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా పార్టీ గుర్తయిన ‘ఫ్యాన్’ ఆకారంలో భారీ వాక్‌వేను ఏర్పాటు చేశారు. జిల్లా చరిత్రలోనే లక్షలాది మందితో నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో జాతీయ రహదారిపైన ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లూ చేశారు. గోదావరి ప్రజలు సిద్ధం : మంత్రి కారుమూరి ఎన్నికలకు జగన్మోహన్రెడ్డి సిద్ధమంటే గోదావరి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని, ఉభయగోదావరి జిల్లాలు జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటాయని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి ప్రతి ఇంటి బిడ్డ అని, సంక్షేమాన్ని ప్రతి ఇంటికి చేర్చి దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించిన నేత అని కొనియాడారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ దెందులూరులో జనసునామీ చూడబోతున్నారని, చంద్రబాబునాయుడు కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదు ఎకరాల్లోనే సభలు పెడుతుంటే జనం రాని పరిస్థితి ఉందని, కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక పిలుపుతో 110 ఎకరాల్లో జరిగే సభకు లక్షలాది మంది తరలిరానున్నారని చెప్పారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు, సీఎం ప్రోగ్రామ్స్ కోఆరి్డనేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ళ నాని తదితరులు ఉన్నారు. 3న దెందులూరుకు సీఎం ‘సిద్ధం’ బహిరంగ సభకు ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారైంది. మూడో తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లిలోని హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 3.20 గంటలకు దెందులూరులో సభా ప్రాంగణం వెనుక భాగంలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులను కలిసిన అనంతరం 3.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని 4.55 గంటలకు సభ ముగిస్తారు. ఐదు గంటలకు హెలికాప్టర్లో తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. -
‘సాధికారత’తో మురిసిన మంగళగిరి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: బడుగు, బలహీన వర్గాల సాధికారతతో గుంటూరు జిల్లా మంగళగిరి మురిసింది. బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో తాము సాధించిన సాధికారతను సగర్వంగా ప్రదర్శించారు. యువత నుంచి వృద్ధుల వరకు ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ‘మళ్లీ నీవే ముఖ్యమంత్రివి కావాలి జగన్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త గంజి చిరంజీవి అధ్యక్షతన మిద్దె సెంటర్లో జరిగిన భారీ బహిరంగ సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన నేతలు సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన అభివృద్ధిని వివరించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సామాజిక న్యాయానికి మంగళగిరే నిదర్శనమని చెప్పారు. మంగళగిరి సీటును అగ్రకులానికి చెందిన అభ్యర్థి నుంచి మార్చి బీసీలకు కేటాయించడమే బీసీలకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను తెలుపుతుందని అన్నారు. సామాజిక విప్లవం తెచ్చిన తొలి సీఎం జగన్ దేశంలో సామాజిక కులాల గురించి ఆలోచించి, సామాజికి విప్లవాన్ని తెచ్చిన తొలి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డే అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అందలం ఎక్కించారని, ఈరోజు ఇలా తలెత్తుకొని తిరగడానికి సీఎం జగనే కారణమని చెప్పారు. చంద్రబాబు ఆణగారిన వర్గాలను అవమానించేవారని, ఈ వర్గాలను ఓటు బ్యాంకులా మాత్రమే తప్ప ఏనాడూ సాటి మనిషిగా చూడలేదని అన్నారు. మంగళగిరిలో స్థానికుడిగా ఉన్న గంజి చిరంజీవిని గెలిపించుకోవాలని, హైదరాబాదులో ఉండే టీడీపీ అభ్యర్థిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అగ్రస్థానం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ అన్నింటా అగ్రస్థానం ఇస్తున్నారని మంత్రి జోగి రమేష్ చెప్పారు. మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా, నామినేటెడ్ పదవుల్లోనూ ఈ వర్గాలకే పెద్ద పీట వేసిన తొలి సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. అగ్రవర్ణ అభ్యర్థులు గెలిచిన మంగళగిరిలో బీసీ అభ్యర్థి గంజి చిరంజీవిని నిలబెడుతున్నారని, సీఎం జగన్ సామాజిక న్యాయానికి ఇదే నిదర్శనమని చెప్పారు. మంగళగిరి అని స్పష్టంగా పలకటం రాని లోకేశ్‌కి మంగళగిరి ఎందుకు అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని, బడుగు వర్గాలకు ఆయన చేసిన మేలు మరెవరూ చేయలేరని పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్ అన్నా రు. రెండుసార్లు రెడ్డి సామాజిక వర్గం గెలిచిన మంగళగిరిలో బీసీ అభ్యర్ధిని రంగంలోకి దింపే సాహసం ఒక్క జగన్ మాత్రమే చేయగలరని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. మంగళగిరిలో బీసీ నేతను గెలిపించుకొనే అవకాశాన్ని వదులుకోవద్దని పిలుపునిచ్చారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, బీసీ విభాగం ఉపాధ్యక్షులు చిల్లపల్లి మోహనరావు పాల్గొన్నారు. -
ఎల్లో మీడియా మాయలో షర్మిల.. వైఎస్సార్ ఆశయాలకు తూట్లు!
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితురాలైన తెలంగాణ నేత వైఎస్ షర్మిల తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వైఎస్ఆర్ అభిమానులలో తీవ్ర ఆగ్రహం తెప్పించాయని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలలో వైఎస్ఆర్ అంటే ఇష్టపడేవారి హృదయాలను ఆమె గాయపరిచేలా మాట్లాడుతున్నారు. తన అన్న తనకేదో అన్యాయం చేశారన్న భావన వచ్చేలా ప్రజలకు సంకేతం ఇస్తున్నారు. షర్మిల ప్రసంగాలు తెలుగుదేశం మీడియా అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటికి మొదటి పేజీ వార్తలుగా ఉపయోగపడుతున్నాయి తప్ప, ఆమెకు దీనివల్ల ప్రత్యేకంగా కలిసి వచ్చే ప్రయోజనం ఏమీ లేదని స్పష్టం అవుతోంది. ప్రభుత్వపరంగా ఆమె చేస్తున్న విమర్శలు అవగాహనా రాహిత్యానికి దర్పణం పడుతుంటే, సీఎం జగన్‌పై చేసిన వ్యక్తిగత విమర్శలు అర్ధరహితంగా ఉన్నాయని చెప్పాలి. రాజకీయాలలో ఆమె ఏ పార్టీలో అయినా చేరవచ్చు అది ఆమె ఇష్టం. కానీ, కుటుంబ విషయాలను, రాజకీయాలను కలగలిపి మాట్లాడడం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వారి ఏజెంట్లుగా ఉన్న రామోజీరావు, రాధాకృష్ణ వంటివారి కళ్లలో ఆనందం చూడడానికే అయితే మనం చెప్పగలిగేది ఏమీ ఉండదు. షర్మిల, ఆమె భర్త అనిల్ ఇద్దరిని రాజకీయంగా వీరంతా కలిసి వాడుకుని వదలివేస్తారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. షర్మిల స్టేట్మెంట్ల వల్ల కాంగ్రెస్ నేతలు ఎవరూ ఆనందపడుతున్నట్లు లేదు. వారెవరూ పెద్దగా స్పందించడం లేదు. కానీ, టీడీపీ, జనసేన, ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం తెగ ప్రాధాన్యం ఇచ్చి ప్రచారం చేస్తున్నాయి. దీనిని బట్టే ఆమె ఎవరికి సేవ చేస్తున్నది అనే విషయం తెలిసిపోతుంది. ముఖ్యమంత్రి జగన్ తిరుపతిలో జరిగిన ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో రాజ్ దీప్ సర్దేశాయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ జవాబిస్తూ కాంగ్రెస్ పార్టీకి డర్టీ రాజకీయాలు అలవాటేనని, రాష్ట్రాన్ని దారుణంగా విభజించిందని, అలాగే తమ కుటుంబాన్ని కూడా విభజిస్తోందని అన్నారు. గతంలో తన బాబాయి వివేకానందరెడ్డిని వేరుచేసి తమకు వ్యతిరేకంగా పోటీ చేయించిందని, ఇప్పుడు తమ చెల్లిని విడదీసిందని తప్పుపట్టారు. అంతే తప్ప వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనలేదు. కానీ, షర్మిల మాత్రం తమ కుటుంబం విడిపోవడానికి జగనన్న కారణమని ఆరోపించారు. అందుకు సాక్ష్యం తను, తన తల్లి అని ఆమె వ్యాఖ్యానించారు. తనకు అన్యాయం చేసిన ఫర్వాలేదని, కాని రాష్ట్రానికి జగన్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా తనకేదో అన్యాయం జరిగినట్లు చెప్పడానికి యత్నించారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ షర్మిలకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పాలని కోరారు. ఏపీ రాజకీయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన బదులు ఇచ్చారే తప్ప, షర్మిలపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా హుందాగా వ్యవహరించారు. షర్మిల తనకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పలేకపోయారు కాని, పరిధి దాటి మాట్లాడుతున్నారు. ఇక అభివృద్ది జరగలేదని ఆమె చెబుతున్న అబద్దాలకు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారానికి తేడా లేకుండా పోయింది. ఆమె అబద్దాలను వైఎస్ జగన్ అబిమానులు తీవ్రంగా ఖండిస్తూ, ఏపీలో ఎక్కడికక్కడ జరిగిన అభివృద్ది పనుల వద్దకు వెళ్లి వీడియో తీసి షర్మిల చూడాలని చెబుతూ యూట్యూబ్‌లో పెడుతున్నారు. ఉదాహరణకు జగన్ అభిమాని ఒకరు విజయవాడ కృష్ణానది కరకట్ట వద్దకు వెళ్లి అక్కడ జగన్ ప్రభుత్వం నిర్మించిన భారీ రిటైనింగ్ వాల్ చూపించి, దీనిని అభివృద్ది కాదంటారా అని తీవ్రంగా ప్రశ్నించారు. షర్మిల ఇక్కడకు వచ్చి చూడాలని ఆయన సవాల్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ హయాంలో పూర్తి చేసిన వంతెనలపై తిరుగుతూ వీడియోలు తీసి షర్మిలకు తెలియచేయాలని తలపెట్టారు. బాగు పడ్డ స్కూళ్లు, ఆస్పత్రులు, తీర ప్రాంతంలో నిర్మాణంలో ఓడరేవులు, నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు మొదలైన వాటిని షర్మిల చూడాలని అంటున్నారు. షర్మిల శ్రీకాకుళం జిల్లాకు కూడా వెళ్లారు. అక్కడ పలాస వద్ద ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జగన్ ప్రభుత్వం నిర్మించిన సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి, 800 గ్రామాలకు ఉపయోగపడే మంచినీటి ప్రాజెక్టును చూసి ఉంటే అభివృద్ది ఎలా జరుగుతోందో తెలుసుకునే అవకాశం ఉండేది. నిజానికి వైఎస్ఆర్ ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా షర్మిల వ్యవహరిస్తున్నారని, సీఎం జగన్ మాత్రం తన తండ్రి పేరును గొప్పగా నిలబెడుతున్నారని వైఎస్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, టీడీపీ మాయలో ఉన్న షర్మిలకు ఇవేవీ కనిపించడం లేదు. షర్మిల మరో ఆరోపణ కూడా చేశారు. సీఎం జగన్ తనను నమ్మినవారిని ముంచారని పిచ్చి ఆరోపణ చేశారు. తనకోసం రాజీనామా చేసిన వారికి మంత్రి పదవులు ఇవ్వలేదని తెలిసి, తెలియని ఆరోపణ చేశారు. నిజానికి జగన్ తన వెంట 2011 నుంచి ఉన్నవారిలో తొంభైఐదు శాతం మందికి ఏదో విధంగా పదవులు వచ్చేలా చేశారు. ఉదాహరణకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని, రోజా, అంబటి రాంబాబు మొదలైనవారికి మంత్రి పదవులు ఇచ్చారు. కాకపోతే పరిమితులను బట్టి కొందరికి ముందు, మరికొందరికి వెనుకా పదవులు ఇచ్చారు. పలువురికి ప్రభుత్వంలో పదవులు ఇచ్చారు. అంతేకాదు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్నివేల మందికి కార్పొరేషన్ డైరెక్టర్లు, ఇతర పదవులు ఇచ్చి అందరిని సంతృప్తి పరచే యత్నం చేశారు. కానీ, షర్మిల ఏమి చేశారు. తెలంగాణలో వైఎస్సార్టీపీ పెడతానని వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులందరిని పిలిచి, వారిని పార్టీలోకి తెచ్చి, తదుపరి వారితో చెప్పాపెట్టకుండా పార్టీని ఎత్తివేశారు. ఏ కాంగ్రెస్‌పై ఉమ్ము వేయాలని వైఎస్ చెప్పి ఉండేవారని ఆమె అన్నారో, అదే కాంగ్రెస్‌లో ఆమె తన పార్టీని విలీనం చేసి వైఎస్ అభిమానులందరిని షాక్‌కు గురి చేశారు. ఆమె పార్టీలో చేరి కొంత మంది కోట్ల రూపాయలు చేతి చమురు వదిలించుకుని అప్పుల పాలయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమెతో పాటు వైఎస్సార్టీపీలో పనిచేసిన సీనియర్ నేత కొండా రాఘవరెడ్డి ఓపెన్‌గా చెప్పారు. షర్మిల అహంకారంతో, ప్రస్టేషన్‌తో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. షర్మిల భర్త అనిల్ మరికొందరితో కలిసి సీఎం జగన్ నుంచి ప్రభుత్వపరంగా అనుచిత లబ్ది పొందాలని చూశారని, దానికి జగన్ అంగీకరించలేదని ఆయన నిర్మొహమాటంగా తెలిపారు. ఆ కారణంతోనే ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా మారారని ఆయన వెల్లడించారు. అక్రమ కేసులలో జగన్ అరెస్టు అయి జైలులో ఉన్నప్పుడు తనకు తానే పాదయాత్ర చేస్తానని షర్మిల ప్రకటించుకున్నారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం జగన్‌పై షర్మిల ఆరోపణలు చేయడం ఏ మాత్రం సమర్ధనీయం కాదని అన్నారు. ఈ విషయంలో విజయమ్మ కూడా షర్మిల తీరుపై బాధ పడుతుంటారని కూడా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడిన విషయాల వీడియోలను లక్షల సంఖ్యలో ఆసక్తిగా గమనిస్తున్నారంటేనే ముఖ్యమంత్రి జగన్ పట్ల ప్రజలలో ఎంత అభిమానం ఉందన్నది అర్ధం అవుతుంది. అలాగే షర్మిల మాటలను వారెవ్వరు అంగీకరించడం లేదని తెలుస్తుంది. రాఘవరెడ్డి వ్యాఖ్యలపై స్పందించినా ఆమె ఆత్మరక్షణలో పడినట్లు అనిపిస్తుంది. విజయమ్మతో ఈ విషయాలు చెప్పించాలని అన్నారట. ఆ పని చేయవలసిన అవసరం రాఘవరెడ్డికి ఏమి ఉంటుంది. పైగా కొద్ది రోజుల క్రితమే విజయమ్మ ఇడుపుల పాయలో సీఎం జగన్ పట్ల ఎంత అప్యాయంగా వ్యవహరించింది అందరూ చూశారు. ఈ ఘటనలతో విజయమ్మ బాధపడుతుండవచ్చు. కానీ, షర్మిల కాంగ్రెస్‌లో చేరడాన్ని ఆమె కూడా సమర్ధించారనే అంతా అనుకుంటున్నారు. అందువల్ల షర్మిల ఇప్పటికైనా అనవసర వ్యర్ధ ప్రసంగాలుమాని ,రాజకీయంగా తనకు తోచిన నాలుగు మాటలు చెప్పుకుని తిరిగితే మంచిది. ఏపీలో షర్మిల పర్యటనలు చేసినా కాంగ్రెస్‌కు ప్రయోజనమేమీ ఉండదు. కాకపోతే ముఖ్యమంత్రి జగన్‌కు నష్టం చేయాలన్న దుష్ట తలంపుతో కాంగ్రెస్ పార్టీ ఆమెను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకు వచ్చింది. ఏపీలో కాంగ్రెస్‌కు ఎవరూ నేతలే లేనట్లు, ఇక్కడ ఉన్న నేతలందరిని చెత్తబుట్టలోకి విసిరేసి, తెలంగాణ నుంచి షర్మిలను తీసుకురావడం ఒక రకంగా ఏపీ ప్రజలను సోనియాగాందీ మరోసారి అవమానించడమే అనిపిస్తుంది. ఇదంతా తెలుగుదేశంతో ఉన్న రహస్య అవగాహన తప్ప మరొకటి కాకపోవచ్చు. ఈ చదరంగంలో షర్మిల పావుగా మిగిలిపోవడం తప్ప సీఎం జగన్‌కు జరిగే నష్టం ఏమీ ఉండదని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురు
సాక్షి, అమరావతి : అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలతో పాటు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు జరుపుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే.. స్పీకర్, చైర్మన్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు నాలుగు వారాల గడువునిచ్చేలా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న వారు చేసిన అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్, అసెంబ్లీ స్పీకర్లతో పాటు ఫిర్యాదుదారు అయిన మదునూరి ప్రసాదరాజును ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇదీ నేపథ్యం.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి గెలుపొందిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో వైఎస్సార్సీపీ వారిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తరువాత వారు టీడీపీలోకి ఫిరాయించారు. ఈ నేపథ్యంలో.. వీరిపై ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలంటూ చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే రీతిలో ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యపై కూడా శాసన మండలిలో చీఫ్‌విప్ అయిన మేరిగ మురళీధర్ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. వీటిపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ విచారణ చేపట్టారు. అనర్హత వేటు ఎందుకు వేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఫిరాయింపుదారులకు ఇటీవల నోటీసులిచ్చారు. ఈనెల 29న విచారణ జరుపుతానని అందులో పేర్కొన్నారు. కానీ, ఈ నోటీసులను రద్దుచేయాలని కోరుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు నలుగురు, ఎమ్మెల్సీ సోమవారం అత్యవసరంగా హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు వేర్వేరుగా దాఖలు చేశారు. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు మరింత గడువునిచ్చేలా స్పీకర్, చైర్మన్లను ఆదేశించాలని, అలాగే విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని వారు తమ పిటిషన్లలో కోర్టును కోరారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం.. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ప్రసాదరావు ఫిర్యాదుపై స్పీకర్ తమకు నోటీసులిచ్చి, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఈ నెల 8న ఆదేశించారన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నందున ఆ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు మరింత గడువు కావాలని ఆ నలుగురు కోరడంతో ఈ నెల 26 వరకు స్పీకర్ గడువునిచ్చారన్నారు. తిరిగి ఈనెల 24న స్పీకర్‌కు లేఖ రాసి, వివరణకు నాలుగు వారాల గుడువునివ్వాలని కోరామన్నారు. అయితే, స్పీకర్ తమ అభ్యర్థనను తిరస్కరించి, ఈ నెల 29న విచారణ జరుపుతామని చెప్పారన్నారు. స్పీకర్ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఏ నిమిషంలోనైనా ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉందని, అందువల్ల అనర్హత పిటిషన్లలో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేయాలని ఆయనతో పాటు ఎమ్మెల్సీ న్యాయవాది కోర్టును కోరారు. ఫిరాయింపుదారులను విచారించిన స్పీకర్ మరోవైపు.. వెలగపూడిలోని తాత్కాలిక శాసనసభలోని తన కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు నలుగురిని స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం విచారించారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని స్పీకర్ వారిని కోరారు. వివరణ ఇవ్వడానికి తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని వారు చేసిన విజ్ఞప్తిని స్పీకర్ సున్నితంగా తోసిపుచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే మూడుసార్లు సమయం ఇచ్చామని గుర్తుచేస్తూ వారిని విచారించారు. అలాగే, స్పీకర్‌కు టీడీపీ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్ కూడా విచారణకు హాజరయ్యారు. వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం హాజరుకాలేదు. నోటీసులివ్వడం సహజ న్యాయ సూత్రాలకు ఎలా విరుద్ధం? అనంతరం.. అసెంబ్లీ తరఫున న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు వాదనలు వినిపిస్తూ.. అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ గానీ, మండలి చైర్మన్‌గానీ ఓ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. అందువల్ల వారి నిర్ణయాలను అధికరణ 226 కింద కోర్టుల్లో సవాలు చేయడానికి వీల్లేదన్నారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపే పరిధి హైకోర్టుకు లేదన్నారు. కాలయాపన చేయాలన్న ఉద్దేశంతోనే వివరణ ఇచ్చేందుకు పిటిషనర్లు గడువు కోరుతున్నారని తెలిపారు. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలకు వారి వారి విధులు, బాధ్యతలున్నాయని, ఒక వ్యవస్థలోకి మరొకరు చొరబడటానికి వీల్లేదన్నారు. చట్టం నిర్ధేశించిన మేరకే స్పీకర్, చైర్మన్ నోటీసులిచ్చి వివరణ కోరారన్నారు. వివరణ కోరకుండా ఉత్తర్వులిస్తే అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమవుతుందే తప్ప, నోటీసులు ఇచ్చి వివరణ కోరడం ఎలా విరుద్ధమవుతుందని ప్రశ్నించారు. స్పీకర్, మండలిౖ చైర్మన్ తుది ఉత్తర్వులు జారీచేయడానికి ముందే దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలు అపరిపమైనవని మెట్టా చంద్రశేఖర్‌రావు వివరించారు. ఇలా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్.. పిటిషనర్లు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమని తేల్చిచెప్పారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేశారు. -
రాజ్యసభకు మోగిన నగారా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఏప్రిల్ 2న ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూలు జారీచేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 8న జారీచేయనుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఫిబ్రవరి 15 కాగా.. ఫిబ్రవరి 16న నామినేషన్లను పరిశీలిస్తారు. వాటి ఉపసంహరణకు తుది గడువు ఫిబ్రవరి 20. పోలింగ్‌ను ఫిబ్రవరి 27న ఉ.9 గంటల నుంచి సా.4 గంటల వరకూ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపును ఫిబ్రవరి 27న సా.5 గంటల నుంచి చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. గతంలో రాష్ట్ర కోటాలో రాజ్యసభకు ఎన్నిౖకైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వైఎస్సార్సీపీ), కనకమేడల రవీంద్రకుమార్ (టీడీపీ), సీఎం రమేష్ (బీజేపీ)ల పదవీకాలం ఏప్రిల్ 2తో పూర్తికానుంది. ఖాళీ కానున్న ఈ మూడు రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రస్తుతం శాసనసభలో ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే ఈ మూడు రాజ్యసభ స్థానాలూ వైఎస్సార్సీపీ ఖాతాలోకి చేరడం ఖాయం. దీంతో రాష్ట్ర కోటాలో మొత్తం 11 స్థానాలూ వైఎస్సార్సీపీ పరమవుతాయి. అంటే.. ఏప్రిల్ 2 తర్వాత రాజ్యసభలో టీడీపీ ఉనికే లేకుండాపోతోంది. ఆ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు 41 ఏళ్లలో రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోవడం ఇదే ప్రథమం అవుతుంది. అప్పట్లో ఆ ఎనిమిదీ వైఎస్సార్సీపీకే.. ఇక రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 250 లోపు ఉండాలి. ప్రస్తుతం ఆ సభ్యుల సంఖ్య 245. ఇందులో 233 మందిని దేశంలోని రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మిగతా 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మన రాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యుల సంఖ్య 11. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీకి ఇద్దరు.. టీడీపీకి 9 మంది సభ్యులు ఉండేవారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 50 శాతం ఓట్లతో 151 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు నెరిపి.. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేష్‌లను బీజేపీలోకి ఫిరాయించేలా చంద్రబాబు చక్రం తిప్పారు. రాష్ట్ర కోటాలో ఎన్నికైన రాజ్యసభ సభ్యుల్లో 2020లో నలుగురు (టీడీపీ), 2022లో నలుగురు (ముగ్గురు టీడీపీ, ఒకరు వైఎస్సార్సీపీ) పదవీకాలం పూర్తవడంతో ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. అసెంబ్లీలో వైఎస్సార్సీపీకి ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఈ ఎనిమిది స్థానాలు వైఎస్సార్సీపీకే దక్కాయి. ఇందులో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి సీఎం జగన్ చాటిచెప్పారు. ఒక్కో స్థానం గెలవాలంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు.. మరోవైపు.. రాష్ట్ర కోటాలో ఖాళీకానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. టీడీపీ సభ్యుడు గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించడంతో ప్రస్తుతం అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 174కు తగ్గింది. ఇందులో సాంకేతికంగా చూస్తే వైఎస్సార్సీపీ బలం 151.. టీడీపీ బలం 22.. జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. వీటిని పరిగణలోకి తీసుకుంటే.. రాజ్యసభకు ఒక స్థానం నుంచి ఎన్నిక కావాలంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రస్తుతం శాసనసభలో వైఎస్సార్సీపీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే.. మూడు స్థానాలు ఆ పార్టీ ఖాతాలో చేరడం ఖాయం.