సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత సూర్యారావు, ఆయన కుమారుడు శ్రీధర్, కండువా కప్పి స్టాలిన్‌బాబును పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం జగన్
పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు కూడా..
చంద్రబాబు, లోకేశ్‌వి దుర్మార్గమైన ఆలోచనలు
మీడియాతో గొల్లపల్లి సూర్యారావు
సాక్షి, అమరావతి/విజయవాడ స్పోర్ట్స్: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు వైఎస్సార్‌సీపీలో చేరారు. వారు బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువాలు కప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్‌రెడ్డి, ఎంపీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్‌లనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ పెత్తందార్లకు అనుకూలంగా, దళిత వర్గాలకు, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ టీడీపీ నేతలు, కార్యకర్తల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నిబద్దతతో పనిచేసిన తనను తీవ్రంగా అవమానించారని, చంద్రబాబు మెడపట్టి పార్టీ నుంచి గెంటేశారని వాపోయారు. సీఎం వైఎస్ జగన్ దేవుడి రూపంలో తనను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. టీడీపీ పుట్టిన నాటి నుంచి తాను కష్టపడి పనిచేశానని, పదవి ఉన్నా లేకపోయినా, గెలిచినా గెలవకపోయినా పార్టీ కోసం పనిచేశానని చెప్పారు.
2014లో అమలాపురం పార్లమెంట్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత మొండి చేయి చూపించారన్నారు. అయినా క్రమశిక్షణ కలిగిన నేతగా తాను ఎంతో కష్టపడి జిల్లాలో పార్టీని కాపాడుకున్నానని అన్నారు. జనసేన, టీడీపీ పొత్తు పేరు చెప్పి తనకు సీటు లేకుండా చేశారని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ ఉంటే ఉండు పోతే పో అన్నట్లు చూశారని, జీవితంలో ఎప్పుడూ అనుభవించని అవమానం టీడీపీలో ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ తనకు ధైర్యాన్నిచ్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారని చెప్పారు. లోకేశ్ ముఠా రాష్ట్రాన్ని కబళించాలని చూస్తోందని తెలిపారు.
చంద్రబాబు స్వార్థపూరిత ఆలో చనలకు పవన్ బలి అయ్యారని, పోత్తులో మోసం చేసి బాబు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. జనసేన మనుగడ కష్టమేనన్నారు. దేవుడిలాంటి మనిషైన వైఎస్సార్ నన్ను ఎంతో దగ్గరకు తీసి రాజకీయంగా ప్రోత్సహించి మంత్రి పదవి ఇచ్చి గౌరవించారని అన్నారు. ఆ మహానుభావుడి కుమారుడైన సీఎం జగన్ దగ్గరకి చేరటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ కోసం శాయశక్తులా పనిచేస్తానని చెప్పారు. తుది శ్వాస వరకు సీఎం వైఎస్ జగన్ వెంటే ఉంటానని, ఆయన ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని తెలిపారు.
మిథున్‌రెడ్డి, కేశినేని నానితో చర్చలు
గొల్లపల్లి సూర్యారావు మంగళవారం రాత్రి విజయవాడలోని కేశినేని భవన్‌లో ఎంపీలు కేశినేని నాని, మిథున్‌రెడ్డితో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు సూర్యారావు ప్రకటించారు. చంద్రబాబు ఆలోచనశైలి పెత్తందార్లకు అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్య
క్రమాల పట్ల ఆకర్షితుడినయ్యానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment