
సాక్షి, విజయవాడ: కూటమి సర్కార్ వచ్చాక తమపై కక్ష సాధింపులకు దిగుతున్నారని.. కట్టు కథలు అల్లి తప్పుడు ప్రచారాలకు తెగబడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ తమ ప్రతిష్టను దిగజారుస్తున్నారని.. తమ సొంత భూములను అటవీ భూములు అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీ మిథున్‌రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బెయిల్ పిటిషన్ కోర్టు పరిధిలో ఉందని.. అందుకే మద్యం కేసు గురించి తాను పూర్తిగా మాట్లాడలేనని తెలిపారు. మద్యం కేసు కూడా రాజకీయ వేధింపుల్లో భాగంగా పెట్టిన కేసు మాత్రమే. నాపై పెట్టడానికి డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి’’ అని మిథున్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
‘‘మద్యం కేసు తప్పుడు కేసు అని చెప్పగలను. ఈ కేసును ధైర్యంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానంలో కేసు గురించి తేలిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ అంశంపై వివరంగా మాట్లాడతాను’’ అని మిథున్‌రెడ్డి చెప్పారు.