vijayawada
-
ఓటు వేసి తప్పు చేసాం కన్నీళ్లు తెప్పిస్తున్న పెన్షన్ దారుల కష్టాలు
-
విజయవాడలో హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)
-
‘చలో విజయవాడ’పై ఉక్కుపాదం.. వాలంటీర్ల గృహ నిర్బంధం
సాక్షి, విజయవాడ: వాలంటీర్ల ‘చలో విజయవాడ’(Chalo Vijayawada) కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల(Volunteers)ను హౌస్ అరెస్ట్ చేశారు. కేబినెట్లో వాలంటీర్ల అంశంపై ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సెక్రటేరియట్‌కు వెళ్లి సీఎంను కలుస్తామన్న వాలంటీర్లపై ప్రభుత్వం నిర్బంధం విధించింది. విజయవాడలోని దాసరి భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.చలో విజయవాడను అడ్డుకోవడంపై వాలంటీర్లు మండిపడ్డారు. గత ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం. వాలంటీర్లకు ఉద్యోగం కల్పించడంతో పాటు బకాయి పడ్డ ఎనిమిది నెలల వేతనం ఇవ్వాలి. పోలీసులతో అడ్డుకున్నంత మాత్రాన మా పోరాటం ఆగదు’’ అని గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుమాయున్ బాషా అన్నారు.‘‘ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చే వరకూ వదిలిపెట్టం. చంద్రబాబు అబద్ధాల ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నాడు. మమ్మల్ని మోసం చేసిన ఈ ప్రభుత్వం ఎప్పుడుపోతుందోనని వాలంటీర్లు ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట తప్పి మహిళలను మోసం చేశారు. పుట్టని బిడ్డకు పేరెలా పెడతామని మంత్రి డోలా బాలవీరాంజనేయులు మాట్లాడటం సిగ్గుచేటు’’ అని షేక్ హుమాయున్ బాషా మండిపడ్డారు.వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: చంద్రశేఖర్‌రెడ్డి 2.50 లక్షల మంది వాలంటీర్లను చంద్రబాబు మోసం చేశారని ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. చలో విజయవాడ పేరుతో నిరసనకి పిలుపు ఇస్తే వారిని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. వాలంటీర్లను అరెస్టు చేయటం హేయమైన చర్య. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు పది వేల జీతం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్, లోకేష్ కూడా వాలంటీర్లకు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎగ్గొట్టారు’’ అని ఆయన ధ్వజమెత్తారు.‘‘పది వేలకు జీతం పెంచకపోగా గత ఏడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వటం లేదు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు అమలు చేయాలి. ఇప్పుడేమో అసలు వాలంటీర్ల వ్యవస్థే ప్రభుత్వంలో లేదంటూ హేళన చేస్తున్నారు. వాలంటీర్లకు సంబంధించిన జీవో లేకపోతే ఈ ప్రభుత్వం తొలిరోజుల్లో వారిని ఎలా వాడుకుంది?. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి’’ అని చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ‘నాది రాజకీయ పాలన..’ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం -
పల్లె నుంచి నగరానికి తిరుగు పయనం
చౌటుప్పల్/ చౌటుప్పల్ రూరల్: సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన వారు తిరుగుపయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వైపు వాహనాలు బారులుతీరాయి. దీంతో గురువారం హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. హైదరాబాద్ మార్గంలో ఉదయం నుంచి వాహనాల రాక పెద్ద ఎత్తున సాగుతూనే ఉంది. జంక్షన్లు, క్రాసింగ్‌ల వద్ద వాహనాలు సాఫీగా ముందుకుసాగేందుకు, ప్రమాదాల నివారణకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాల కూడలి ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద సాఫీగా.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు సాఫీగా సాగాయి. టోల్‌ప్లాజాలో 16 గేట్లు ఉండగా, హైదరాబాద్ వైపు 12 గేట్ల నుంచి వాహనాలను పంపించారు. విజయవాడ వైపు నుంచి వస్తున్న వాహనాలకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా జాతీయ రహదారిపై హైవే అథారిటీ అధికారులు గుర్తించిన 17 సమస్యాత్మక ప్రాంతాలతోపాటు ప్రతి గ్రామ స్టేజీ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. -
మా ఆయనకు ఆ వీడియోలు అంటే ఇష్టం
నా వయస్సు 30. నా భర్తకు 35 ఏళ్లు. ఆయన ఈ మధ్య తీవ్రమైన పోర్నోగ్రఫీ వ్యసనానికి గురయ్యాడు. ఇది మా కుటుంబ జీవితంతోపాటు అతని పనితీరునూ ప్రభావితం చేస్తోంది. అతను తన మొబైల్లో పోర్నో వీడియోలు స్క్రోల్ చేయడంలో గంటల తరబడి గడుపుతున్నాడు. నన్ను, మా ఇద్దరు పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆస్లైన్ సెక్స్ చాట్లకు డబ్బు కూడా చెల్లిస్తున్నాడని ఈ మధ్యే తెలిసింది. ఆయన బాస్‌తో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. నా మీద కూడా ఏమీ ఆసక్తి చూపడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో మా వివాహబంధాన్ని ఎలా రక్షించుకోవాలో సలహా ఇవ్వగలరు.– అరుణకుమారి, చెన్నైమీ ఆందోళన మీ మాటల్లోనే అర్థమవుతోంది. పోర్నోగ్రఫీ వ్యసనం అనేది కుటుంబ జీవితం, వృత్తిపరమైన పనితీరుపై తీవ్రమైన ప్రభావాలను కలిగించే సంక్లిష్టమైన సమస్య. అతని ప్రవర్తన, మీ కుటుంబంపై దాని ప్రభావం గురించి అతనితో మాట్లాడే ప్రయత్నం (అతన్ని నిందించేటట్లు లేకుండా) చేయండి. మీ ఆందోళనలు, భావాలను ప్రశాంతంగా వ్యక్తపరుస్తూ అతని చర్యలు మీపైన, మీ పిల్లలపైనా ఎంత ప్రభావం చూపుతున్నాయో వివరంగా మాట్లాడి చూడండి. ఒక మంచి సైకియాట్రిస్ట్ లేదా థెరపిస్ట్ సలహాతో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఇతర చికిత్సా విధానాలతో అతన్ని ఈ వ్యసనానికి దూరం చేయవచ్చు.ఇద్దరూ కలిసి కపుల్ థెరపీకి హాజరు కావడం వల్ల కూడా మరింత మెరుగైన ఫలితాలుంటాయి. ఇది మీ సమస్యలను పరిష్కరించడానికి, మీ మధ్య సాన్నిహిత్యం పెంచడానికి కూడా దోహదపడుతుంది. ఇంట్లో ఇంటర్నెట్ వినియోగం గురించి స్పష్టమైన హద్దులను ఏర్పాటు చేసుకోండి. మీరు ఈ సమస్యల నుండి ధైర్యంగా సమర్థంగా బయటపడేందుకు వ్యక్తిగత కౌన్సెలింగ్ సహాయపడుతుంది. ఇక ఆయన ఈ వ్యసనం నుండి బయట పడటం, మీరు ఆ పరిస్థితుల ప్రభావం నుంచి కోలుకోవడం చాలా సమయం ఓర్పు, క్రమశిక్షణతో కూడుకున్న ప్రక్రియ అని గుర్తుంచుకోండి. ధైర్యంగా ఉండండి. ఈ క్లిష్ట పరిస్థితుల నుండి బయట పడడానికి నమ్మకమైన బంధుమిత్రులు లేదా నిపుణుల సహకారం తీసుకోవడానికి వెనుకాడకండి. మీ భర్త తన వ్యసనాన్ని అంగీకరించడానికి లేదా దాని నుంచి బయట పడడానికి ఇష్టపడకపోతే మీరు మీ శ్రేయస్సు, మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని న్యాయనిపుణుడిని సంప్రదించడం అవసరం కావచ్చు.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
విజయవాడలో సంక్రాంతి వేడుకలు
-
17న విజయవాడలో రైతుల మహా ధర్నా
సాక్షి, అమరావతి : రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం పట్ల రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలలో దాదాపు 80కు పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నప్పటికీ మొక్కుబడిగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకుందే తప్ప పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. 2023–24లో ఖరీఫ్‌తో పాటు రబీ సీజన్లలో వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన 3.91 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు విడుదల చేయలేదు.ఖరీఫ్–2023 సీజన్లో రైతుల తరఫున రూ.930 కోట్ల ప్రీమియం బకాయిలు చెల్లించకపోవడం వల్ల రైతులకు న్యాయంగా దక్కాల్సిన రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారం అందలేదు. ఇలా రైతులకు చెల్లించాల్సిన రూ.12,563 కోట్లు ఎగ్గొట్టింది. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో భారీ ధర్నా నిర్వహణకు ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కే ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తామన్న హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని నిలదీశారు.ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామని గొప్పగా చెబుతున్న చంద్రబాబు.. రైతులకు ఇచ్చిన హామీల సంగతేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి సాయం హామీ ముఖ్యమంత్రికి గుర్తులేదా? గుర్తు ఉన్నా రైతులకు ఇవ్వటం ఇష్టం లేక అమలు చేయటం లేదా.. అన్నది స్పష్టం చేయాలన్నారు. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యల సాధనకు డిమాండ్ చేస్తూ ఈ నెల 17న విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించబోతున్నామని వారు స్పష్టం చేశారు. -
రూ.14.37 కోట్ల బంగారం స్వాదీనం
సాక్షి, అమరావతి: విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.14.37 కోట్ల విలువైన 17.90 కిలోల బంగారాన్ని విజయవాడ కస్టమ్స్ అధికారులు స్వాదీనం చేసుకొని.. ఒక మహిళ సహా 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను విజయవాడ కస్టమ్స్ కమిషనర్ ఎస్.నరసింహారెడ్డి ఆదివారం మీడియాకు తెలియజేశారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారనే సమాచారం మేరకు విజయవాడ కస్టమ్స్(ప్రివెంటివ్) కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించామని చెప్పారు.తాడిపత్రి, నెల్లూరు రైల్వేస్టేషన్‌తో పాటు బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద కస్టమ్స్(ప్రివెంటివ్), తిరుపతి, గుంటూరు సెంట్రల్ జీఎస్టీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయని తెలిపారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్న 17.90 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని 16 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల్లో ఒక మహిళ కూడా ఉన్నారని చెప్పారు. నిందితులను విశాఖపట్నం ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్టు నరసింహారెడ్డి తెలిపారు. -
విజయవాడ- ఏలూరు హైవేపై ఘోర ప్రమాదం
సాక్షి, కృష్ణాజిల్లా: విజయవాడ- ఏలూరు హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వేగంగా వచ్చి కారు.. మరో కారు ఢీకొట్టింది. ముందు భాగంలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. ఐదుగురి ప్రయాణీకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం తోషిబా విద్యుత్ కంపెనీలో పని చేస్తున్న శివప్రసాద్‌కు చెందిన కారుగా గుర్తించారు. గన్నవరం పిన్నమనేని ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు.మరో ఘటనలో...మరో ఘటనలో నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రహదారిపై ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపి మరో వాహన చోదకుడిని బలితీసుకున్నాడు. పట్టపగలు నడిరోడ్డు పై జరిగిన ఈ ఘటనలో వ్యక్తి మృతి దుర్మరణం చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద ఏలూరు రోడ్డుపై శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం చిన ఆగిరిపల్లి ప్రాంతానికి చెందిన బడుగు సోమయ్య (54) వ్యవసాయం చేస్తుంటాడు. ఈయనకు భార్య నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె మమతతో కలసి కోర్టు పనుల నిమిత్తమై ద్విచక్రవాహనంపై విజయవాడ వచ్చారు. ఏలూరు రోడ్డు గుణదల నుంచి చుట్టుగుంట వైపు వెళుతుండగా వెనుకగా వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై వెళుతున్న సోమయ్య, మమత రోడ్డుపై పడిపోయారు. అంతటితో ఆగకుండా ఆ డ్రైవర్ తన ట్రాక్టర్‌ను ముందుకు నడిపాడు.ఈ ఘటనలో రోడ్డుపై పడి ఉన్న సోమయ్యపై ట్రాక్టర్ ఎక్కడంతో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మమత కొద్ది దూరంలో పడగా ముఖానికి, చేతులకు గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు 108 సహాయంతో బాధితులను వైద్యం నిమిత్తం గుణదలలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన తరువాత సోమయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మమతకు ప్రాణాపాయం లేదని ఆమె కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ సాంబశివరావును అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. సోమయ్య కుమారుడు బడుగు దీపక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా నిర్లక్ష్యంగా ట్రాక్టర్‌ను నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్ సాంబశివరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
పవన్ పరామర్శ కోసం గేమ్ ఛేంజర్ బాధిత కుటుంబాల పడిగాపులు
-
విజయవాడ : కమనీయంగా గోద, రంగనాథుల కల్యాణం (ఫొటోలు)
-
విజయవాడ మొగల్రాజపురంలో నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు (ఫొటోలు)
-
విద్యుత్ చార్జీల భారంపై వామపక్షాలు వినూత్న నిరసన
-
విజయవాడ : హోరాహోరీగా జాతీయ వాలీబాల్ టోర్నీ (ఫొటోలు)
-
పుస్తకం.. జ్ఞాన మస్తకం
‘పుస్తకాలను ప్రేమించండి. అవి మీ జీవితాన్ని సుఖమయం చేస్తాయి. భావాల, ఉద్రేకాల, సఘటనల, భయంకర గందరగోళంలోంచి బయటపడేసేందుకు మీకు అవి స్నేహపూర్వకమైన సలహాలనిస్తాయి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం, పరులను గౌరవించడం నేర్పుతాయి. హృదయాన్ని, మేధస్సును, మనిషి పట్ల, ప్రపంచం పట్ల ప్రేమతో నింపేస్తాయి’ అన్నారు రష్యాకు చెందిన రచయిత మాక్సీమ్ గోర్కీ. అంతటి ప్రాధాన్యత గల పుస్తకాల పఠనం తగ్గిపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 2 నుంచి 12వతేదీ వరకు విజయవాడలో పుస్తక ప్రదర్శన జరుగుతున్న సందర్భంగా..తెనాలి: ఒకప్పుడు చరిత్ర, సామాజిక పరిజ్ఞానం, కాల్పనిక సాహిత్య రచనలను చదివేవారు. అపరాధ పరిశోధన నవలలు మార్కెట్లోకి వస్తే హాట్కేకులయ్యేవి. పెద్దలు చదువుతుంటే.. పిల్లలు కూడా వాటిపై దృష్టి పెట్టేవారు. ఊళ్లోని లైబ్రరీకి తరచూ వెళ్లటం, పుస్తకాలు ఇంటికి తెచ్చుకుని, చదవటం ఒక అలవాటుగా ఉండేది. పాఠశాలలు, కళాశాలల్లో పుస్తకాల లైబ్రరీ అందుబాటులో ఉండేవి. దిన, వార, మాసపత్రికలతో సహా ప్రముఖ రచయితల రచనలన్నీ వాటిలో లభ్యమయేవి. అప్పట్లో వచ్చే వారపత్రికలు, దినపత్రికల్లో సీరియల్స్‌గా వచ్చే నవలల కోసం పాఠకులు ఎదురుచూసేవారు. అన్నీ దాచుకుని, సీరియల్ అయిపోగానే నవలగా బైండింగ్ చేయించుకునేవారు. తగ్గుతున్న ప్రచురణకర్తలు పుస్తకానికి గడ్డుకాలం దాపురించడంతో ప్రచురణకర్తలు తగ్గిపోతున్నారు. విజయవాడ కంటే ముందే 1950 కాలంలో తెనాలి ప్రచురణ కేంద్రంగా విరాజిల్లింది. సుప్రసిద్ధ కవులు, రచయితలకు నిలయమైంది. అప్పట్లోనే ఇక్కడినుంచి వార, మాసపత్రికలు వచ్చాయి. ఆ తర్వాత ప్రచురణ కేంద్రంగా వర్ధిల్లిన విజయవాడలో ఒకప్పుడు 50కు పైగా ప్రచురణకర్తలు ఉండగా ప్రస్తుతం అయిదారుగురే ఉన్నారు. చదువరులు తగ్గిపోవటంతో పుస్తకాలు కొనటం లేదు. ప్రచురణకర్తలు గతంలో ఒక్కో పుస్తకాన్ని కనీసం వెయ్యి ప్రతులు ముద్రించేవారు. ఇప్పుడు ఏ పుస్తకమైనా 200కు మించి మార్కెట్ ఉండటం లేదంటున్నారు. నీరసించిన గ్రంథాలయాలు ప్రభుత్వ గ్రంథాలయాలు నీరసించిపోవటం కూడా పుస్తక ప్రాభవం తగ్గటానికి కారణాల్లో ఒకటి. రాష్ట్రంలో ప్రజల నుంచి వసూలు చేసే పన్నులో రూపాయికి 8 పైసలు స్థానిక సంస్థలకు వెళుతున్నా.. గ్రంథాలయాలకు ప్రభుత్వాలు ఏమీ చేయటంలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మూడేళ్ల క్రితం ఒక్కసారి మాత్రమే గ్రంథాలయాలకు కొత్త పుస్తకాలు కొనుగోలు చేశారు. పాఠశాలలు, కాలేజీల్లో లైబ్రరీలు తగ్గిపోయాయి. పుస్తకం గత వైభవాన్ని కోల్పోయింది.జీవనశైలి మారడంతో..క్రమంగా మారుతూ పుస్తకాల వైపు ప్రజల చూపు తగ్గిపోయింది. పిల్లలకు సామాజిక పరిజ్ఞానం, సాహిత్యంపై అభిలాష, చారిత్రక నేపథ్యంపై ఆసక్తిని కలిగించేలా పెద్దల జీవనశైలి ఉండటం లేదు. చిన్నతనం నుంచి పుస్తకాల్ని చదివించాల్సిన అవసరాన్ని గుర్తించటంలో ఇంటినుంచి బడి వరకు అంతా విఫలమయ్యారు. కార్పొరేట్ స్కూళ్ల రాకతో ర్యాంకుల వైకుంఠపాళీలో పిల్లలకు స్కూల్ క్లాసులతోనే పొద్దుపోతోంది. కంప్యూటర్ సైన్స్ కోర్సులతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడ చూసినా ఇంజినీరింగే. జనరల్ నాలెడ్జి, కరెంట్ ఎఫైర్స్ కోసం కూడా చాలామంది దినపత్రికలు చూడటం లేదంటే అతిశయోక్తి కాదు. ‘గూగుల్ తల్లి’నే అన్నీ అడుగుతున్నారు. సాఫ్ట్వేర్ కొలువులు పుస్తకానికి తీసుకొచ్చిన తంటా ఇది.పుస్తక ప్రచురణ కష్టసాధ్యంగా ఉంది పుస్తకాలు వెయ్యి కాపీలు వేసే ప్రొఫెషనల్ పబ్లిషింగ్ ఇప్పుడు లేదు. యూనికోడ్ వచ్చాక ఎవరికివారు యూనికోడ్లో రాసుకుని తక్కువ కాపీలను డిజిటల్ ప్రింటింగ్ చేయిస్తున్నారు. పుస్తకాలను కొనకపోవటంతో వచ్చిన పరిస్థితి ఇది. సామాజిక శా్రస్తాలు, రాజకీయ నేపథ్యం ఉన్న పుస్తకాలను అధ్యయనం కోసం కొంటున్నారు. చదివినా చదవకున్నా, ఆధ్యాత్మిక పుస్తకాలు పోతున్నాయి. దళిత సాహిత్యం బాగానే అమ్ముడవుతోంది. – వెంకట నారాయణ, పల్లవి పబ్లికేషన్స్, విజయవాడప్రభుత్వ సహకారం ఉంటేనే మనుగడ ప్రభుత్వ సహకారం ఉంటేనే పుస్తకానికి మనుగడ ఉంటుంది. లైబ్రరీల ద్వారా పుస్తకాలు కొనుగోలు చేయించాలి. ఎప్పటికప్పుడు డబ్బులు విడుదల చేయాలి.ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ల్రైబరీలను ఏర్పాటు చేయాలి. వాటికీ పుస్తకాలు సరఫరా చేయాలి. మూడేళ్ల క్రితం కొనుగోలు చేసిన పుస్తకాలకు డబ్బులు వెంటనే విడుదల చేయాలి. – బి.రవికుమార్, నవరత్న బుక్‌హౌస్, విజయవాడ నవతరం దారి మళ్లింది నవతరం పుస్తక పఠనం నుంచి దారి మళ్లింది. సంపాదనే ముఖ్యమైంది. మానవీయ విలువలపై అవగాహన లేకుండాపోయింది. తెలుగు భాష, సంస్కృతులపై చిన్నచూపు ఏర్పడింది. వ్యక్తిగత స్వార్థం పెరిగి, సాహిత్య పఠనం లేక జరుగుతున్న అనర్థాలివి. గ్రంథాలయాలను ఆధునికీకరించి, పుస్తకాలన్నీ అందుబాటులో ఉంచేలా చేసినపుడే పుస్తకానికి మంచి రోజులొస్తాయి. – వల్లూరు శివప్రసాద్, కన్వీనర్, గ్రంథాలయాల పునర్వికాసం ఉద్యమ వేదిక -
విజయవాడలో సంక్రాంతి సందడి (ఫొటోలు)
-
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రేణూ దేశాయ్, యాంకర్ రవి (ఫోటోలు)
-
యూటర్న్ బాబు.. వాలంటీర్ల వినూత్న నిరసన
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్‌పై వాలంటీర్ల(Volunteers) పోరాటం కొనసాగుతోంది. తాజాగా విజయవాడ(Vijayawada)లో వాలంటీర్ల నిరసన ఉధృతంగా మారింది. రోడ్డుపై వెనక్కి నడుస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ యూటర్న్ విధానానికి వ్యతిరేకంగా బ్యాక్ వాక్ చేశారు. ఈ సందర్భంగా బాబు వచ్చారు.. జాబ్ తీశారంటూ నినాదాలు చేశారు. అలాగే, పెండింగ్ జీతాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.ఏపీలో వాలంటీర్ల(Volunteers) పోరాటం ఉధృతంగా కొనసాగుతోంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ప్రాధాన్యత ఇస్తామని, వేతనాన్ని కూడా పెంచుతామని కూటమి నాయకులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల సేవలను చంద్రబాబు ప్రభుత్వం వినియోగించుకోలేదు. ఈ నేపథ్యంలో కూటమి మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి నెలకు రూ.10వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, విశాఖలోనూ వాలంటీర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనల్లో వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమను విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిలించాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తూ నిరనసలు చేపట్టారు. చంద్రబాబు సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే అమరావతిలో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
తెలుగు రచయితల సభలా లేక...
ఈ మధ్య విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు జరిగాయి. అయితే వీటి తీరు చూస్తే అవి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభలు అనిపిస్తుంది. ఒక కులం వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశారా? అనిపించకమానదు. అదే సమయంలో తెలుగు భాషోద్దణ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని పేద పిల్లలకు విద్యను దూరం చేయడానికి కుట్ర జరుగుతుందా అన్న అనుమానమూ రాకమానదు. ధనిక ఆసాములంతా ఒక చోట చేరి కడుపు నిండిన కబుర్లు చెప్పుకున్నట్లుగా ఉందన్న భావన కలుగుతుంది. వీరి మాటలు ప్రభుత్వ స్కూళ్లను నీరు కార్చి, ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహించేలా ఉన్నాయి. ఈ రచయితల సభలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రముఖులు లేదంటే వారికి మద్దతు ఇచ్చే మేధావి వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారన్న అభిప్రాయం వచ్చింది. వేదికకు రామోజీరావు పేరు పెట్టడం, ఆయన కోడలు శైలజ వచ్చి తెలుగు గురించి ఉపన్యాసం ఇవ్వడం వంటివి ఈ సభల అజెండాను స్పష్టం చేస్తోంది. ఈ సభలలో పాల్గొన్న ప్రముఖులు ఎవరైనా తమ పిల్లలు, లేదా మనుమళ్లు తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారని చెప్పినట్లు కనిపించలేదు. ప్రధాన అతిధిగా పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈసారి మరింతగా ఓపెన్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి జగన్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోని రద్దు చేయాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. బహుశా ఇదంతా ముందస్తుగానే ఒక అవగాహనతో జరిగి ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ టైమ్‌లో విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత లభించింది. ‘నాడు నేడు’ కార్యక్రమం కింద స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలను మార్చివేశారు. ఆంగ్ల మాధ్యమంతోపాటు సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ వంటి జాతీయ, అంతర్జాతీయ సిలబస్‌లను ప్రవేశపెట్టి పేద పిల్లలకు అతి ఖరీదైన విద్యను ఉచితంగా అందించడానికి జగన్ కృషి చేశారు. అది సహజంగానే పెత్తందారి వర్గానికి నచ్చదు. ప్రైవేటు స్కూళ్లలో ఖర్చు చేసి చదువుకుంటున్న తమ పిల్లలకు, ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు తేడా లేకుండా పోవడం కూడా అంతగా నచ్చదు. అలాంటి తరుణంలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు ఐక్య రాజ్య సమితి వరకు వెళ్లారు.ప్రైవేటు స్కూళ్ల పిల్లలతో పోటీ పడి ఆంగ్లంలో మాట్లాడగలిగే స్థితికి చేరుకుంటున్నారు. అలాగని తెలుగును తక్కువ చేయలేదు. తెలుగును నిర్భంద సబ్జెక్ట్‌గా చేర్చారు. అయినా కొందరు హైకోర్టుకు వెళ్లారు.ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించారు.జగన్ వెనక్కి తగ్గకుండా ద్విభాష పుస్తకాలు తయారు చేయించారు. దీని తర్వాత కూడా ఈ ఫ్యూడల్ శక్తులకు తృప్తి కలగలేదు. ఇప్పుడు రచయితల సభల పేరుతో ప్రభుత్వ విద్యపై విరుచుకుపడ్డారని అనుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోక పోతే దేశ, విదేశాలలో మన పిల్లలు పోటీ పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చైనాలో ఆ భాషలోనే చదువుతున్నారు కదా అని కొందరు అనవచ్చు. కాని అక్కడి పరిస్థితి వేరు. మన దేశ వాతావరణం వేరు. అయినా చైనాకు చెందిన లక్షల మంది ఇప్పుడు ఆంగ్ల భాషను అభ్యసించి అమెరికా తదితర దేశాల దారి పడుతున్న విషయాన్ని విస్మరించరాదు. ఎన్వీ రమణ ఉపన్యాసాన్ని పరిశీలించండి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెడుతూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన ‘జీవో8’ను రద్దు చేయాలని అన్నారు. ఆ జీవో పై ఒకరు హైకోర్టుకు వెళ్లి విజయం సాధించారని, దానిపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, ఇప్పుడు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. బహుశా చంద్రబాబు ప్రభుత్వంతో ఉన్న అవగాహన వల్లే ఇలా మాట్లాడి ఉంటారా? అని ప్రముఖ విద్యా వేత్త కంచె ఐలయ్య ప్రశ్నించారు. గత ప్రభుత్వం తెలుగు భాషను అణచివేయడానికో, అభివృద్ది చేయడానికో ఆ జీవో తెచ్చిందని రమణ అన్నారు. నిజంగా అంత పెద్ద స్థాయికి వెళ్లిన వ్యక్తి ఇలా మాట్లాడడం శోచనీయం. ఆంగ్లంలోనే ఉద్యోగాలు వస్తాయని అనుకోవడం భ్రమ అని ఆయన చెబుతున్నారు. ప్రజలు తెలుగు భాషను ఆదరిస్తే ప్రభుత్వాలు దిగివస్తాయని మాజీ చీఫ్ జస్టిస్ అన్నారు. సరిగ్గా ఇదే అంశంపై రమణ స్వయంగా కొన్ని గ్రామాలకు, ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి పిల్లలు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా! తెలుగు భాషకు ఎవరూ వ్యతిరేకం కాదు. దానిని రక్షించుకోవల్సిందే. కాని అదే సమయంలో పేదల బతుకు తెరువు కూడా ముఖ్యమే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. పైరవి చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకోవడమో, ఉన్నత స్థాయికి చేరుకోవడం అందరికి సాధ్యం కాదు. మంచి విద్య వారికి కీలకంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా వెళ్లి స్థిరపడిన లక్షలాది మంది తెలుగువారు ఆంగ్లం నేర్చుకున్న తర్వాతే వెళ్లగలిగారన్నది వాస్తవం. అంతెందుకు! ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత, మాజీ ఎంపీ యార్గగడ్డ లక్ష్మీప్రసాద్ కుమారుడు అమెరికాలోనే నివసిస్తున్నారు. ఆయనకు ఆంగ్లంపై పట్టు వచ్చాకే వెళ్లగలిగారా? లేదా? తెలుగు మీడియంలోనే చదువుకుని ఉంటే అది సాధ్యం అయ్యేదా? ఒకవేళ సాధ్యమైనా ఎంత కష్టపడి ఉండాలి? మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ కూడా తెలుగు గురించి మాట్లాడారు. మరి వారి ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ స్కూల్ లో తెలుగు మీడియం ఉందో, లేదో చెప్పి ఉండాల్సింది. ఆమె కుంటుంబంలోని పిల్లలంతా ఎక్కడ, ఏ భాషలో చదివారో చెప్పినట్లు లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఆంగ్ల మీడియంలోనే చదివారు. ఇప్పుడు మనుమడు దేవాన్ష్ కూడా ఇంగ్లీష్ మీడియంలో అభ్యసిస్తున్నారు కదా? ఇటీవల దేవాన్ష్ చెస్‌లో మెడల్ సాధించారని వార్తలు వచ్చాయి. ఆయన తెలుగు మీడియంలో చదివి ఉంటే ఈ చెస్ లో గెలవగలిగేవారా అని కంచె ఐలయ్య ప్రశ్నించారు.ప్రైవేటు స్కూళ్లలో అత్యధిక శాతం ఆంగ్ల మీడియమే ఉంది కదా? రాష్ట్ర మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థలలో ఏ మీడియం ఉందో చెప్పాలి కదా? ఇంకా నయం. ఆయనను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెట్టలేదు. ప్రభుత్వ స్కూళ్లలోనే తెలుగు మీడియం ఎందుకు? ప్రైవేటు స్కూళ్లలో కూడా అదే ప్రకారం తెలుగు మీడియం ఉండాలని వీరంతా ఎందుకు డిమాండ్ చేయలేదు? ఇక్కడే వీరి స్వార్దం కనిపిస్తుంది. రామోజీ జ్ఞాపకార్డం అంతా శుభోదయం అని పలకరించుకోవాలని శైలజా కిరణ్ సూచించారు. తెలుగు మీద అంత ప్రేమ ఉంటే కనీసం తెలుగు రాష్ట్రాలలో అయినా తమ సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ పేరులో ఆంగ్లం లేకుండా చూసుకోవాలి కదా! చిట్ ఫండ్స్‌ను తెలుగీకరించిన తర్వాత ఆమె సలహాలు ఇస్తే బాగుంటుందని కొందరు వ్యంగ్యంగా అంటున్నారు. ఈనాడు దినపత్రికలో తెలుగు రచయితల సభల వార్తలను కవర్ చేసిన సందర్భంలో పలు ఆంగ్ల పదాలు ఎందుకు వాడారో తెలియదు. ఉదాహరణకు కేబీఎన్ కళాశాల అని అన్నారే కాని, దానిని తెలుగులో రాయలేదు. సుప్రీంకోర్టు, జస్టిస్ వంటి ఆంగ్ల పదాలనే వినియోగించారు. నెట్ లో పెట్టిన వార్తల కింద ఎడిషన్ నేమ్, ఆంధ్రప్రదేశ్ అని, పేజ్ నెంబర్ అంటూ ఆంగ్ల ఆక్షరాలతోనే రాశారు. అంటే దాని అర్థమేమిటి? తెలుగు భాషను రక్షించుకుంటూనే ఆంగ్ల భాషపై తెలుగు పిల్లలు పట్టు పెంచుకుంటేనే వారికి భవితవ్యం ఉందన్నది వాస్తవం. అందుకే 95 శాతం మంది ప్రజలు తమ పిల్లలను ఆంగ్ల మీడియంలోనే చదివించుకుంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో అయితే అది నూటికి నూరు శాతం ఉంటోంది. ప్రభుత్వ విద్యా సంస్థలలోనే ఎందుకు తెలుగు మాధ్యమం అన్నదానికి ఈ పెద్దలు ఎవరూ సమాధానం చెప్పలేరు. ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇలా ఆంగ్ల మీడియం కూడా పూర్తిగా ఎత్తివేస్తే ఏపీలో పేద పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదివించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా వారి చదువులకు గండం ఏర్పడుతుంది. తెలుగు రచయితల సభ చివరికి పేదల పాలిట శాపంగా మారితే వారి రచనలకే విలువ లేకుండా పోతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విజయవాడలో పుస్తకాల పండుగ ప్రారంభం (ఫొటోలు)
-
కష్టాలు చెబితే కస్సు బస్సు..
-
విజయవాడ : 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు (ఫొటోలు)
-
విజయవాడలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు