mithun reddy
-
జగన్ ప్రాణాలకు ముప్పు కేంద్రానికి ఎంపీ సంచలన లేఖ
-
ప్రధాని, హోంమంత్రులకు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లేఖ
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్‌కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్ళిన వైఎస్ జగన్‌కు పోలీసులు రక్షణ కల్పించలేదు. జగన్ పర్యటనలో తీవ్రమైన భద్రత వైఫల్యం తలెత్తింది’’ అని లేఖలో మిథున్‌రెడ్డి వివరించారు.జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి. ఇటీవల వైఎస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయి. ఇవి భారీ ఎత్తున పన్నిన కుట్రలో భాగంగా జరుగుతున్న ఘటనలు. వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా భద్రత వైఫల్యం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం విధానాల వల్ల మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడిచేలా ప్రమాదకర ధోరణికి తెరలేపుతోంది’’ అని లేఖలో మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: జనం గుండెల్లో జగన్.. కూటమి గుండెల్లో రైళ్లుకాగా.. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించింది. మాజీ సీఎం పర్యటనలో భద్రత కల్పనపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ వైఫల్యంపై వైఎస్సార్సీపీ నేతలు గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. -
ఈడీ విచారణ జరిపించాల్సిందే: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణమైన మార్గదర్శి కుంభకోణంపై ఈడీ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. లోక్‌సభ వేదికగా మార్గదర్శి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రమేష్ సివిల్ కాంట్రాక్టులు కావాలంటే చంద్రబాబుతో మాట్లాడుకోవాలే తప్ప తమపై ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు. సీఎం రమేష్ బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టు అని, ఆయన బీజేపీ కోసం పనిచేయడం లేదని చెప్పారు.మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ప్రసంగానికి ఎంపీ మిథున్‌రెడ్డి అడ్డుపడ్డారు. సీఎం రమేష్ అస్పష్టమైన ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. అంతకుముందు సీఎం రమేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పాలసీని 2019–2024 మధ్య మార్చారన్నారు. మద్యం ప్రైవేట్ షాపుల నుంచి ప్రభుత్వ షాపుల వైపు మళ్లిందని, ఐదేళ్లలో మొత్తం రూ.లక్షకోట్ల అమ్మకాలు జరిగాయని చెప్పారు. ఈ లావాదేవీలన్నీ నగదు ద్వారానే జరిగాయని, ఒక్క డిజిటల్ చెల్లింపు లేదని ఆరోపించారు. అన్ని మద్యం షాపుల ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికనే ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం రూ.30 వేలకోట్ల మద్యం కుంభకోణం చేసిందని ఆరోపించారు. ఇది రూ.2,500 కోట్ల ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే 10 రెట్లు పెద్ద కుంభకోణమన్నారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సీఎం రమేష్ వైఖరిపై మండిపడ్డారు. లోక్‌సభ వేదికగా మార్గదర్శి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే ప్రతీకారంగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మిథున్‌రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆర్గానిక్ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సాహంఏపీలో 2021–22 నుంచి మూడేళ్లలో 21.56 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువుల ఉత్పత్తి జరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ తెలిపారు. పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) కింద కేంద్రం ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి మంగళవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో 2021–22లో 25,006 మెట్రిక్ టన్నులు, 2022–23లో 2,72,572 మెట్రిక్ టన్నులు, 2023–24లో 18,58,652 మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువుల ఉత్పత్తి జరిగిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఏపీలోని 13,321 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తికేంద్రం ప్రవేశపెట్టిన ‘స్వామిత్వ’ పథకంలో భాగంగా ఏపీలో 13,321 నోటిఫైడ్ జనావాస గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తిరుపతి జిల్లాలో 1045 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందని తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లోక్‌సభలో మంగళవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానమిచ్చారు. స్వామిత్వ పథకం అమలు కోసం 2020 డిసెంబర్ 8న ఉప్పదం కుదుర్చుకుందని, 2025 పిబ్రవరి 11నాటికి రాష్ట్రంలోని 26జిల్లాల్లో ఈ మొత్తం డ్రోన్ సర్వే నిర్వహించామని తెలిపారు. ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ (ఐఈసీ) కార్యకలాపాలు, స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ (ఎస్పీఎంయూ) ఏర్పాటు కోసం రాష్ట్రానికి రూ.26.7 లక్షలు విడుదల చేశామన్నారు. ఆస్తి కార్డు ఫార్మాట్ రాష్ట్రం ద్వారా ఇంకా ఖరారు చేయని కారణంగా..వాటిని ఇంకా తయారు చేయలేదని పేర్కొన్నారు. -
మార్గదర్శి స్కాం దేశంలోనే చాలా పెద్దది: మిథున్ రెడ్డి
-
‘మార్గదర్శి’ని ఎందుకు వదిలేశారు?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి కారణమైన మార్గదర్శిని ఎందుకు వదిలేశారు? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలన్నారు. మార్గదర్శికి ఒక మీడియా సంస్థ ఉన్నందున విడిచిపెట్టాల్సిన అవసరమేంటన్నారు. సోమవారం లోక్‌సభలో 2025–26 కేంద్ర బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చలో పాల్గొన్న ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. రూ.2,600 కోట్లు డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన మార్గదర్శి, ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఆ నిధులను దారి మళ్లించిందన్నారు.ఈ రకంగా నిధులు సేకరించడం తప్పని ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. ఆదాయ పన్ను విభాగం మార్గదర్శికి రూ.1000 కోట్ల జరిమానా విధించడంతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని విమర్శించారు. లక్షలాది మంది డిపాజిటర్లకు న్యాయం జరిగేలా రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా మార్గదర్శి కుంభకోణంపై పోరాటం చేస్తామని చెప్పారు. ఇంత పెద్ద ఆర్థిక కుంభకోణం జరిగితే ఈడీ ఎందుకు విచారణ జరపట్లేదని ప్రశ్నించారు.17 మెడికల్ కాలేజీల పనుల నిలిపివేశారు వచ్చే ఐదేళ్లలో దేశంలో 75 వేల మెడికల్ సీట్లను అందుబాటులోకి తెస్తామని బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. ఏపీలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొందని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే తమకు కేటాయించిన మెడికల్ సీట్లను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి మెడికల్ కమిషన్ కు లేఖ రాశారని లోక్‌సభ దృష్టికి తెచ్చారు. ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించారని, అయితే ఇప్పుడు ఆ పనులన్నింటినీ ప్ర స్తుత ప్రభుత్వం ఆపేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చే శారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి జోక్యం చేసుకుని నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.⇒ మిథున్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎంపీ పురందేశ్వరి అడ్డుపడే ప్రయత్నం చేశారు.. పురందేశ్వరి భౌతికంగా బీజేపీలో ఉన్నా.. ఆమె మనస్సు మాత్రం టీడీపీలోనే ఉందని మిథున్‌రెడ్డి ఎద్దేవా చేశారు. విపక్షాలు ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించని పురందేశ్వరి.. చంద్రబాబు గురించి మాట్లాడగానే స్పందిస్తున్నారని విమర్శించారు. ⇒ బడ్జెట్లో పోలవరం ఎత్తు తగ్గించమని ఎవరు అడిగారంటూ మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. 41.15 మీటర్లకు ఎత్తు తగ్గించడం వల్ల పోలవరం సామర్థ్యం తగ్గిపోతుందని.. జాతీయ ప్రాజెక్టుకు రావాల్సిన రూ.60 వేల కోట్లలో కేవలం రూ.30 వేల కోట్లు ఇస్తే, మిగతా రూ.30 వేల కోట్ల పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు. ⇒ రైల్వేజోన్‌ను 10 ఏళ్ల తర్వాత ఇచ్చినా వాల్తేర్ డివిజన్‌ను రెండుగా విభజించి ఏపీకి అన్యాయం చేశారన్నారు. ఇప్పటికైనా మొత్తం వాల్తేర్ డివిజన్‌ను కొత్త రైల్వే జోన్లోకి కలపాలని డిమాండ్ చేశారు.⇒ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోందని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి స్పష్టమైన ప్రకటన ఇవ్వాలన్నారు. -
మార్గదర్శి అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోవాలి
-
‘మార్గదర్శి’పై ఎంపీ మిథున్‌రెడ్డి ఫైర్
సాక్షి,న్యూఢిల్లీ: మార్గదర్శి స్కామ్ దేశంలోనే చాలా పెద్ద స్కామ్ అని, ఈ స్కామ్‌లో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం(ఫిబ్రవరి10) మిథున్‌రెడ్డి లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా మాట్లాడారు.‘ మార్గదర్శి లక్షల మంది డిపాజిటర్లను మార్గదర్శి ముంచేసింది. మార్గదర్శి అక్రమాలపై కేంద్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు. ప్రతిసారి ఈ అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావిస్తూనే ఉన్నాం. ఇంత పెద్ద స్కాం జరిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఏం చేస్తోంది. రూ.2వేల600కోట్లు డిపాజిట్లుగా సేకరించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నారా..కేంద్రం దీనికి సమాధానం చెప్పాలి.మిథున్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..మార్గదర్శి రూ. 2600 కోట్ల రూపాయలు వసూలు చేసిందిఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి వసూలు చేసిందిడిపాజిటర్లకు న్యాయం జరగాలిదీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకోవాలిఒకవైపు 75 వేల మెడికల్ సీట్లని కేంద్రం చెబుతోందికానీ ఏపీ ప్రభుత్వం మాత్రం మాకు మెడికల్ సీట్లు వద్దని సరెండర్ చేస్తుంది ఏపీలో 17 మెడికల్ కళాశాల నిర్మాణాన్ని ఆపేశారు.కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు ఇప్పించాలికేంద్రం విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలిపోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించవద్దుపోలవరం నిర్మాణానికి అరకొరగా నిధులు ఇస్తున్నారురాజధాని అమరావతికి నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలిపదేళ్ల తర్వాత రైల్వే జోన్ ఇచ్చారువాల్తేర్ డివిజన్ రెండుగా విభజించి అన్యాయం చేశారువాల్తేర్ డివిజన్ విశాఖ జోన్లోనే ఉంచాలివిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాంతిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో నాపై దాడిచేశారు: ఎంపీ గురుమూర్తి తిరుపతిలో తనపై జరిగిన దాడి అంశాన్ని లోక్‌సభలో 377 నిబంధన కింద లేవనెత్తిన ఎంపీ గురుమూర్తిఏపీలో ప్రజాస్వామ్య విలువలపై దాడి జరిగిందితిరుపతి కార్పొరేషన్ ఎన్నికల సమయంలో నాపైన, మహిళా కార్పొరేటర్లపై దాడికి పాల్పడ్డారుఎన్నికల నేపథ్యంలో రాజ్యాంగ విధులు నిర్వహిస్తున్న సమయంలో మమ్మల్ని అడ్డుకున్నారుతిరుపతి జిల్లా పోలీసులు దాడులు నిరోధించడంలో ఫెయిల్ అయ్యారుబాధ్యులపై చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర చూస్తున్నారుఈ దాడులపై వెంటనే దర్యాప్తు జరపాలిదాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి -
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం
-
ఈ అన్యాయాన్ని ఆంధ్రా ప్రజలు క్షమించరు: ఎంపీ మిథున్ రెడ్డి
న్యూఢిల్లీ, సాక్షి: పోలవరం విషయంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే పార్టీలకతీతంగా ఎంపీలతో కలిసి పోరాడేందుకు సిద్ధమని లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై చర్చలో ఆయన ఏపీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. ‘‘పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని తగ్గించవద్దు. ఒరిజినల్‌గా పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 194 టీఎంసీలు. ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు అందేలా దీన్ని డిజైన్ చేశారు. ఇరిగేషన్ తో పాటు తాగునీటి కోసం ఉపయోగించాలనేది ఉద్దేశం. కానీ, 41.15 మీటర్లకు ప్రాజెక్టును తగ్గిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టారు. దీనివల్ల పోలవరం కెపాసిటీ 194 నుంచి 115 టీఎంసీలకు పడిపోతుంది. ఈ తగ్గించడం వల్ల కేవలం 3.2 లక్షల ఎకరాలకి నీరు అందుతుంది. ఇది రైతులకు, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్లే. ఈ అన్యాయం ఎదిరించేందుకు టిడిపి ఎంపీలతో కలిసి పోరాటానికి సిద్ధం. లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు’’ అని అన్నారాయన. ‘‘ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇప్పుడు పోలవరం కెపాసిటీని తగ్గించారు. విభజన చట్టం మేరకు ఒరిజినల్ గా ఉన్న పోలవరం సామర్ధ్యాన్ని కొనసాగించాలి. కెపాసిటీ తగ్గించిన తర్వాత బనకచర్లకు నీరు ఎలా అందుతుంది?. రాయలసీమకు నీరేలా ఇస్తారు? అని ప్రశ్నించారాయన. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 👉ఏపీ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని మెల్లగా రద్దు చేస్తున్నారు. ఇంగ్లీష్ చదివితేనే విదేశాల్లో కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉంది. ఇంగ్లీష్ మీడియం తో పాటు తెలుగు కొనసాగించాలి. 👉ఆర్బీఐ నిబంధనల విరుద్ధంగా మార్గదర్శి సంస్థ రూ. 2,600 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడింది. ప్రజల డబ్బును ఇతర కంపెనీలకు మళ్ళించారు. సహారా, శారద కుంభకోణం కంటే మార్గదర్శక కుంభకోణం పెద్దది. మార్గదర్శిపై రూ. 1,000 కోట్ల రూపాయల జరిమానా విధించారు. డిపాజిటర్ల డబ్బు తిరిగి చెల్లించకుండా వాటిని రెన్యువల్ చేస్తున్నారు. మార్గదర్శి కుంభకోణం పై దర్యాప్తు జరపాలి. ఈ అంశంపై ప్రధాని జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలి👉విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో జిందాల్ గ్రూపును పిలిచి మాట్లాడాలి. 👉విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి -
చంద్రబాబు పెట్టే కేసులకు మేం భయపడం: మిథున్ రెడ్డి
-
గాలివీడు ఘటనపై పవన్ కళ్యాణ్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన మిథున్ రెడ్డి
-
జమిలి బిల్లుకు మా మద్దతు అందుకే...
-
సోలార్ పవర్ ఒప్పందంపై బాబు తప్పుడు ప్రచారం
-
లోక్‌సభలో టీడీపీ బండారం బయటపెట్టిన మిథున్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో సోలార్ పవర్ విషయంలో వైఎస్సార్సీపీపై గత కొన్నాళ్లుగా టీడీపీ, దాని అనుకూల మీడియా అడ్డగోలు ప్రచారానికి దిగాయి. ప్రముఖ వ్యాపారవేత్త అదానీపై అమెరికాలో నమోదైన అభియోగాలను.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అన్వయిస్తూ ఇష్టానుసారం కథనాలతో వైఎస్ జగన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించాయి. అయితే.. ఈ కుట్రను తాజాగా లోక్‌సభలోనూ వైఎస్సార్సీపీ బయటపెట్టింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. ఇదే సమయంలో అదానీతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని పార్టీ తరఫున ఆయన మరోసారి వివరణ ఇచ్చారు.పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘సోలార్ పవర్ విషయంలో మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు . ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకుంది. అదానీతో ఒప్పందం చేసుకోలేదు. సెకీతో అనేక రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. చాలా తక్కువ రేటుకు మేము ఒప్పందం చేసుకున్నాం. 2021లో సోలార్ పవర్ 5.90 యూనిట్‌కు ఉంది. మేము 2.49కు మాత్రమే కొనడానికి ఒప్పందం చేసుకున్నాము. ఇటీవల కాలంలో కూడా ఐదు రూపాయలకు పైగా యూనిట్‌కు చెల్లించి పవర్ కొన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఒక వర్గం మీడియా, మేధావులు మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చట్ట సభ దృష్టికి తీసుకెళ్లారు. దేశంలో బ్యాంకింగ్ రంగం గణనీయంగా వృద్ధి చెందుతుంది. దేశంలో 62% జనాభా వ్యవసాయంపైన ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగం అభివృద్ధికి తగిన చర్యలు కనిపించడం లేదు. రుణమాఫీ, అందుబాటులోని రుణాలు క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడం లేదు. చాలా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. చిన్నతరహ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. విద్యార్థులకు ఇచ్చే రుణాలకు సరైన విధానం రూపొందించాలి’ అని మిథున్ రెడ్డి సూచనలు చేశారు. -
AP: రాష్ట్రం ఒప్పందం సెకీతోనే కదా?: మిథున్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంపై టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత, ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పారు. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రక్షణశాఖ రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. వైఎస్సార్సీపీ తరపున రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి హాజరయ్యారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రంగసంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) తనంతకు తాను అత్యంత చౌకగా యూనిట్ విద్యుత్ రూ.2.49తో ఇస్తామని ముందుకొచ్చిందన్నారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం అని, ఇందులో లంచాలకు తావెక్కడ ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సెకీతోనే ఒప్పందాలు జరిగాయి తప్ప.. అదానీతో కాదని తేల్చిచెప్పారు. కావాలనే టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందన్నారు. పోలవరంపై భిన్న వ్యాఖ్యలుఅనంతరం లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం విషయంలో ఇటీవల మంత్రుల నుంచి భిన్నమైన స్టేట్మెంట్స్ వస్తున్నాయన్నారు. మొదట్లో ఉన్న ఎత్తు ఇప్పుడు ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఈ విషయంపై పార్లమెంట్లో చర్చిస్తామన్నారు. పునర్విభజన చట్టంలోని అనేక హామీలను కేంద్రం అమలు చేయలేదని విమర్శించారు. ఈ హామీలను అమలు చేయాలని కోరామన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దని అఖిలపక్షం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ సమావేశాల్లోనే కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిపిందన్నారు. మైనార్టీలకు అన్యాయం జరగకుండా, వారి పక్షాన వైఎస్సార్సీపీ నిలబడుతుందన్నారు. ఇప్పటికే వక్ఫ్ బిల్లుపై రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి తమ పార్టీ వైఖరేమిటో తెలిపారన్నారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు కఠిన విధానాలు అవసరమని చెప్పామన్నారు.‘సోషల్’ అరెస్టులపై గొంతెత్తుతాంకూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి వైఎస్సార్సీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై దారుణంగా వ్యవహరిస్తున్నారని, అక్రమంగా అరెస్టులు చేస్తున్న విషయాన్ని అఖిలపక్షం దృష్టికి తీసుకెళ్లామని మిథున్‌రెడ్డి తెలిపారు. సోషల్ మీడియా పోస్టులపై కార్యకర్తలపై పెట్టాల్సిన సెక్షన్లు కాకుండా.. సంబంధం లేని సెక్షన్లు నమోదు చేస్తూ జైలుకు పంపుతున్న విషయాన్ని వివరించామన్నారు. దీనిపై పార్లమెంట్ సమావేశాల్లో గొంతెత్తుతామని చెప్పారు. -
పార్లమెంట్ లో మా టార్గెట్ ఒక్కటే - ఎంపీ మిథున్ రెడ్డి
-
అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్ సమావేశాలపై చర్చ
సాక్షి,ఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభమవనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేవం నిర్వహిస్తోంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం ఆదివారం(నవంబర్ 24) సమావేశమైంది. అఖిలపక్ష సమావేశానికి పలు పార్టీల ఫ్లోర్‌లీడర్లతో పాటు వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి , లోక్ సభపక్ష నేత మిథున్‌రెడ్డి హాజరయ్యారు.పోలవరం ఎత్తు , ప్రత్యేక హోదా, వక్ఫ్ బిల్లు , విశాఖ స్టీలు ప్రైవేటీకరణ అంశాలను వైఎస్సార్సీపీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు లేవనెత్తనున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల అక్రమ కేసులను నేతలు ప్రస్తావించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పార్లమెంట్లో గళం విప్పనున్నారు.కాగా, సోమవారం(నవంబర్ 25) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవనున్నాయి. డిసెంబర్ 20దాకా సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ చట్టం సవరణ బిల్లు, ఒకే దేశం ఒకే ఎన్నికలు(జమిలి ఎన్నికలు) బిల్లులతో పాటు మరో 16 బిల్లులను ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వక్ఫ్, జమిలి ఎన్నికల చట్టాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.ఇదీ చదవండి: మహాయుతి దెబ్బకు ఎల్వోపీ సీటు గల్లంతు -
టీడీపీ నేతలకు మిథున్ రెడ్డి వార్నింగ్..
-
‘హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే.. వేధింపులా?’
చిత్తూరు: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్సీపీ సోషల్‌మీడియా కార్యకర్తలు ప్రశ్నిస్తే వారిని అక్రమ కేసులతో వేధింపులకు గురిచేయడం అత్యంత దారుణమమన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిని పూతలపట్టు వైఎస్సార్సీపీ మండల పార్టీ కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డిని మిథున్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కక్ష్య పూరిత రాజకీయాలకు టీడీపీ నాయకులు స్వస్తి పలకాలి. సొంత ఊర్లో తిరగలేని పరిస్థితి ఈరోజు పూతలపట్టు మండల పార్టీ కన్వీనర్ విషయంలో మీరు తీసుకు వచ్చారు. పోలీసులు చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పై దృష్టి పెట్టండి, డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. సోషల్ మీడియా కార్యకర్తలు పై కేసులు పేరుతో వేధింపులు మానుకోవాలి.గతంలో టీడీపీ ప్రోద్బలంతో వైఎస్ జగన్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయండి అని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు పై వేధింపులు మానుకోవాలి.ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి.. ఇలానే చేస్తే ముగింపు అనేది ఉండదు’ అని మండిపడ్డారు మిథున్‌రెడ్డి. -
ఇస్తాంబుల్ లో గ్రీన్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సు
-
పెట్టుబడుల అనుమతులకు ఒకే మంత్రిత్వ శాఖ: ఎంపీ మిథున్ రెడ్డి
ఢిల్లీ, సాక్షి: పరిశ్రమల అనుమతుల కోసం మూడు, నాలుగు మంత్రిత్వ శాఖలకు తిరిగే బదులుగా ఉమ్మడిగా ఒకే శాఖ ఉండాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. తమ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ మినిస్ట్రీ ద్వారా అనుమతులు ఇచ్చి పెట్టుబడులకు సులభతరం చేశామని తెలిపారు. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వాతావరణ మార్పుల సదస్సుకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరైన ఈ సదస్సుకు భారత్ తరపున ఎంపీ మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడారు. ‘‘ పెట్టుబడులకు సంబంధించి రెండు ప్రధాన సవాళ్లు వస్తున్నాయి. ఒకటి భూమి, రెండోది రెగ్యులేటరీ ఏజెన్సీలు. గ్రీన్ జోన్లలో పెట్టుబడుల దిశగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఈ అంశాలను సులభతరం చేయాలి. అనుమతులకు సంబంధించి ఒకే మంత్రిత్వ శాఖ ఉండాలి’’ అని అన్నారు.మారుతున్న వాతావరణ పరిస్థితులు,అనుసరించాల్సిన వ్యూహాలపై ఇస్తాంబుల్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు నిర్వహించారు. గ్రీన్ జోన్లలో పెట్టుబడుల ద్వారా సమీకరణకు ఎదురవుతున్న సవాళ్లపై చర్చలు జరిపారు. గ్రీన్ ఇన్వెస్ట్మెంట్లు చేసే దిశగా పారిశ్రామికవేత్తలను ఎంపీలు ప్రోత్సహించాలని సదస్సు లక్ష్యం పెట్టుకుంది. ఎంపీలు టార్చ్ బేరర్లుగా గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ల దిశగా పనిచేయాలని సదస్సు పిలునిచ్చింది. -
వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట..
-
వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట
సాక్షి, గుంటూరు : వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట దక్కింది. పుంగనూరు కేసులో మిథున్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందంటూ ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం మిథున్‌రెడ్డికి బెయిల్ ఇచ్చింది. మిథున్‌రెడ్డితో పాటు మరో ఐదుగురికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
పుంగనూరుకు టీడీపీ మంత్రులు.. ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్
-
వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి
-
పుంగనూరుకు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి.. బాలిక కుటుంబానికి పరామర్శ
-
పుంగనూరుకు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి
-
ఈ చిన్నారి ఘటన మీకు కనిపించలేదా?
పుంగనూరు((చిత్తూరు జిల్లా): కిడ్నాప్‌కు గురై ఆపై హత్య గావించబడ్డ పుంగనూరుకు చెందిన అశ్వియా కుటుంబాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలు పరామర్శించారు. శనివారం పుంగనూరుకు వెళ్లిన పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిలు.. అశ్వియా కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. కుమార్తె అశ్వియా హత్యకు గురి కావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తండ్రి హజ్మతుల్లాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిలు ఓదార్చి ధైర్యం చెప్పారు.అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘పుంగనూరులో ఇలాంటి దారుణ ఘటన ఎప్పుడూ జరగలేదు. ఇంటి ముందు ఆడుకుంటున్న రెండవ తరగతి చదువుతున్న చిన్నారి కిడ్నాప్ , హత్య జరిగితే ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై దోషులను శిక్షించకపోతే అందుకు తగిన విధంగా స్పందిస్తాం. ఈ ఘటనలో పోలీసుల అసమర్థత కనిపిస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనలో డీజీపీ, సీఐడీ అధికారులను ప్రత్యేక ఫ్లైట్, హెలికాప్టర్ ఇచ్చి పంపించి దర్యాప్తు చేశారు. మరి ఈ చిన్నారి ఘటన పోలీస్ ఉన్నతాధికారులకు కనిపించడం లేదా?, ఈ నెల9వ తేదీన వైఎస్ జగన్మోహన్రెడ్డి పుంగనూరుకు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టనుంది. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. ‘కానరాని లోకాలకు చిట్టితల్లి’9న పుంగనూరుకు వైఎస్ జగన్ -
ఇది మంచి పద్ధతి కాదు.. ఎంపీ మిథున్ రెడ్డి వార్నింగ్
-
మిమ్మల్ని చూస్తుంటే మాకు ధైర్యం మరింత రెట్టింపు అవుతుంది
-
పుంగనూరు నియోజకవర్గం నాకు తల్లితో సమానం
-
పుంగనూరులో ఉద్రిక్తత
-
విజయవాడలో అంత బీభత్సం
-
‘మార్గదర్శి స్కాం’ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, గుంటూరు: మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటనపై దుష్ఫ్రచారం చేస్తున్నారని.. దీనిపై పరువు నష్టం దావా కూడా వేశామని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. నాపై దాడులు చేసి.. మళ్లీ నాపైనే హత్యాయత్నం కేసు పెట్టారని మండిపడ్డారు.‘‘టీడీపీ కరపత్రంలా ఈనాడు మారింది. ఇప్పటికే ఎల్లో మీడియాకు నోటీసులు పంపాం. మదనపల్లె ఘటనపై విచారణ చేయమని మొదట్నుంచీ కోరుతున్నాం. దేశంలోనే అతిపెద్ద స్కామ్ మార్గదర్శి స్కామ్.. నిజాలు నిగ్గు తేలేవరకు తాను పార్లమెంట్లో పోరాడతా’’ అని మిథున్‌రెడ్డి తెలిపారు.వైఎస్సార్సీపీలో కొంత మంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం తమ అనుకూల మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, ఇంకోవైపు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందన్నారు. గడిచిన కొద్ది రోజులగా ఎక్కడ ఏం జరిగినా.. కనీసం వివరణ కూడా తీసుకోకుండా పూర్తి అవాస్తవాలనే ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మదనపల్లి ఘటనలో నిజానిజాలు తేలాలని ఇప్పటికే మూడుదఫాలు మీడియా ముందు చెప్పామని… ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ చేతుల్లో ఉంది, తప్పు ఎక్కడ జరిగిందో తేల్చాలని ఆయన ప్రభుత్వాన్ని మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఈనాడులో తమపై వరుసగా వస్తున్న తప్పుడు కథనాలన్నీ ఒక పద్దతిప్రకారం జరుగుతున్నాయన్నారు. ఈ తప్పుడు వార్తలపై పరువునష్టం దావా కోసం నోటీసులు కూడా ఇచ్చామని.. అయినా ఇంకా వరుసగా తప్పుడు కథనాలు రాస్తూ.. దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వీటిపై ఆధారాలు చూపమంటే స్పందించడం లేదన్నారు. ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి తప్పుడు కథనాలతో ప్రచారం చేసినా తాము ఎన్నికల్లో విజయం సాధించామని.. దీంతో ఓర్వలేక అదే పద్దతి కొనసాగిస్తున్నారన్నారు.దేశంలో అతిపెద్ద కుంభకోణమైన మార్గదర్శిపై తాను పార్లమెంటులో ప్రస్తావిస్తానని.. ఆర్బీఐ కూడా మార్గదర్శి వ్యవహారంలో తప్పుపడుతూ కోర్టుకెళ్లిందన్నారు. అడిగేవాళ్లు లేరని అవాస్తవాలు ప్రచురించి బ్లాక్‌మెయిల్‌కి పాల్పడుతున్న ఈనాడు సంస్ధలు, మార్గదర్శి చిట్‌ఫండ్స్ తో సహా వీళ్ల అక్రమాలన్నీ బయట పెడతామన్నారు. తమను మానసికంగానూ, రాజకీయంగా దెబ్బతీసేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ఈనాడు ఈ కథనాలు రాస్తోందని.. వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.ఈనాడు యాజమాన్యం పూర్తిగా తెలుగుదేశం పార్టీ కరపత్రంలా మారిపోయి.. టీడీపీ నేతలు ఎవరిని నిర్ణయిస్తే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ రకమైన కథనాలు రాస్తూ బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ సహా హామీలను నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో.. ప్రజల దృష్టి మరల్చడానికే ఈ తరహా రాతలు రాస్తున్నారని తేల్చి చెప్పారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై చేస్తున్న దాడులతో టీడీపీ నేతలు పైశాచికానందం పొందుతున్నారని.. తమపై దాడి చేసి కేసులు కూడా తిరిగి తమపై పెడుతున్నారని మిథున్ రెడ్డి నిప్పులు చెరిగారు. -
టీడీపీలో చేరమని ఒత్తిడి చేస్తున్నారు: కుప్పం ఎంపీపీ
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సోమవారం కుప్పం ఎంపీపీ అశ్విని, ఎంపీటీసీలు కలిశారు. తన తండ్రి కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ మండలం కన్వీనర్ మురుగేశ్, సోదరుడు శ్రీను రాజేంద్ర ప్రసాద్ అక్రమంగా అరెస్టు చేశారంటూ ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేశారు. మిథున్‌రెడ్డిని కలిసిన అనంతరం ఎంపీపీ అశ్విని మీడియాతో మాట్లాడారు. ‘‘ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా నిలుస్తుందని ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పారు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నారు. జనవరి నెలలో మల్లనూరు పంచాయితీ ట్రాక్టర్ పోయిందని మేము పిర్యాదు చేశాం, ఇప్పుడు మాపైనే కేసు పెట్టారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరమని ఒత్తిడి చేస్తున్నారు, లేదంటే కుప్పం ఎంపీపీ పదవికి రాజీనామా చేయమంటున్నారు. కుప్పంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుపై తప్పుడు కేసులు బనాయించి సీఐ ఇబ్బందులు పెడుతున్నారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు.. ఐదేళ్ల తర్వాత పరిస్థితి మారుతుంది.. అప్పుడు మీ పరిస్థితి ఆలోచన చేసుకోండి’’ అని ఆమె అన్నారు. -
లోక్‌సభ ముందు వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు.. ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్న మిథున్‌రెడ్డి
-
Lok Sabha: వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు ముస్లిం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. అలాగే, ఈ బిల్లుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అభిప్రాయాలతో తాము ఏకీభవిస్తున్నామని వెల్లడించారు.కాగా, ఈరోజు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఈ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. బిల్లును సభలో ప్రవేశపెట్టే మందు ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఇక, ఈ బిల్లును వైఎస్సార్సీపీ, టీఎంసీ, ఎస్పీ, కాంగ్రెస్, మజ్లిస్, కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకించాయి. అలాగే, టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి.ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కామెంట్స్..వక్ఫ్ బిల్లుతో మత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. వక్ఫ్ సవరణ బిల్లు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, అధికారాల విభజనకు విఘాతం కలిగిస్తుంది. వక్ఫ్ ఆస్తులు మతపరమైన కార్యక్రమాల నిర్వహణ కోసం ఉన్నాయి. ఆర్టికల్-25కి భంగం కలిగేలా ఈ బిల్లు ఉంది. అల్లా పేరు మీద ఆస్తిని విరాళంగా ఇచ్చే అవకాశం లేకుండా చేశారు. దర్గా, మసీదుల ఆస్తులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వైఎస్సార్సీపీ ఎంపీల విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను వైఎస్సార్సీపీ లోక్‌సభ ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనుజరాణిలు సోమవారం కలిశారు. ఈ సందర్బంగా కడప-బెంగళూరు మధ్య నూతన రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని కేంద్రమంత్రిని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి కోరారు.కడప-బెంగళూరు రైల్వే లైన్‌తో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల సరఫరా మెరుగవుతుందని తెలిపారు. పీలేరు-పుంగనూరు- మదనపల్లిల మీదుగా వెళ్లే ఈ రైల్వే లైన్ వల్ల రాయలసీమ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కాగా కడప నుంచి బెంగళూరుకు కొత్త రైల్వే లైన్‌ను 2008-09 రైల్వే బడ్జెట్లోనే మంజూరు చేశారని, ప్రాథమికంగా సర్వే నిర్వహించి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అయితే కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చేయాలని కోరారు. -
ఏపీకి అప్పులు కాదు... అభయం ఇవ్వండి
-
‘సూపర్‌సిక్స్’ అమలు ఎప్పుడు?: లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి,ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సారీ సిక్స్ గా మార్చవద్దని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కోరారు. సోమవారం(జులై 29) లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడారు. ఏపీలో సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదని, సూపర్ సిక్స్ అమలుకు గడువు ప్రకటించాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతలు లేకుండా పెట్టుబడులు ఎలా..ఏపీలో శాంతిభద్రతలు దిగజారితే పెట్టుబడులు ఎలా వస్తాయి. నా నియోజకవర్గంలో నన్ను తిరగకుండా అడ్డుకున్నారు. నాపైన దాడి చేశారు. నా వాహనాన్ని ధ్వంసం చేశారు. అన్ని టీవీ చానల్స్ చూస్తుండగానే దాడి జరిగింది. నాపైనే దాడి చేసి నాకు వ్యతిరేకంగా హత్యాయత్నం కేసు పెట్టారు. ఏపీలో శాంతిభద్రతలను కాపాడాలి. హింసకు చరమ గీతం పాడాలి. అమరావతికి రుణం వద్దు.. గ్రాంట్‌గా కావాలి..పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి బాధ్యులు ఎవరు. అమరావతికి ఇచ్చే రూ. 15వేల కోట్లు రుణంగా కాకుండా గ్రాంట్‌గా ఇవ్వాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. పదేళ్లు గడిచిన విశాఖ మెట్రో, కడప స్టీల్ ప్లాంట్ ఊసే లేదు. ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. బడ్జెట్లో రూ. 11 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించవద్దు’అని మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
అధికారం ఉంటే సరిపోదు.. కొంచెం జ్ఞానం ఉండాలి..
-
వారిపై పరువు నష్టం దావా వేస్తా.. ఎంపీ మిథున్‌రెడ్డి వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: తమపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. వ్యక్తిగత ఆరోపణలు చేసే ముందు వివరణ తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మదనపల్లి ఆర్డీవో ఆఫీసు ఫైళ్ల దహనంపై పసలేని ఆరోపణలు చేస్తున్నారు.. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.మా వ్యక్తిగత ఇమేజ్ దెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తున్నారు. మా ఆస్తుల వివరాలన్నీ ఎలక్షన్ అఫిడవిట్లలోనే ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి నిజానిజాలు ప్రభుత్వం బయటపెట్టాలి. ఈ ఘటనకు సంబంధించి అరెస్టయిన అనురాగ్ టీడీపీకి చెందిన వ్యక్తే.. మాపై పత్రికలు కథనాలు ప్రచురించే ముందు మా వివరణ తీసుకోవాలి. ఏకపక్షంగా కథనాలు వేయవద్దు. ఇదిలాగే కొనసాగితే పరువు నష్టం దావా వేస్తాం’’ అని మిథున్‌రెడ్డి హెచ్చరించారు.‘‘మా ఆస్తుల వివరాలు అఫిడవిట్లలో ఉన్నాయి. చట్టబద్ధంగా ఆదాయ పన్ను కడుతూ వ్యాపారం చేస్తున్నాం. ఎవరి దగ్గర ఒక్క రూపాయి ఎలక్షన్ ఫండ్ తీసుకోలేదు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు నేను సిద్ధం. రికార్డులు తారుమారు చేశారని ఆరోపణలు చేస్తున్నారు. మా ఇమేజ్ దెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తున్నారు. సాక్ష్యాధారాలు చూపమంటే తోక ముడిచారు. ఆరోపణలు నిరూపించకుంటే క్షమాపణ చెప్పాలి.. లేదంటే, పరువు నష్టం దావా వేస్తా’’ అని మిథున్‌రెడ్డి మండిపడ్డారు. -
బాబు హత్యలు దేశం మొత్తం తెలిసేలా ఢిల్లీలో ధర్నా..
-
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందే.. విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని వైఎస్సార్ సీపీ రాజ్యసభ, లోక్‌సభ పక్ష నేతలు వి.విజయసాయిరెడ్డి, పి.మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు నిర్వహించిన అఖిలపక్ష భేటీలో వారిద్దరూ ఆంధ్రప్రదేశ్‌లో అదుపు తప్పిన శాంతి భద్రతలు, అధికార పార్టీ దాడులు, విభజన హామీల అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎంపీలకే రక్షణ లేని దుస్థితి..ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్ సభ్యులకు సైతం భద్రత లేకుండా పోయిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లిన ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాలు దాదాపు 500 మందితో వచ్చి రాళ్లు, కర్రలతో దాడి చేశారన్నారు. దాడులకు బరి తెగించిన టీడీపీ గూండాలను వదిలేసి వైఎస్సార్ సీపీకి చెందిన బాధితులపై నే కేసులు బనాయించడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన సాగించేందుకు టీడీపీ ప్రభుత్వానికి ఏమాత్రం అర్హత లేదని, రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో 45 రోజుల టీడీపీ పాలనలో 490 ప్రభుత్వ భవనాలు, 560 ప్రైవేట్ ఆస్తులపై దాడులు జరిగాయన్నారు. యథేచ్ఛగా హత్యలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై వేలాదిగా దాడులు జరిగాయన్నారు. టీడీపీ గూండాలు వినుకొండలో వైఎస్సార్ సీపీ కార్యకర్త రషీద్‌ను నడిరోడ్డుపై నరికి చంపుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమన్నారు. ఇలాంటి వాళ్లా రాష్ట్రాన్ని పాలించేది? అని ప్రజలు ఆలోచిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 300 హత్యాయత్నాలు జరిగాయంటే ఎలాంటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయో ఊహించవచ్చన్నారు. మౌనపాత్ర పోషిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వచ్చే బుధవారం ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తారని తెలిపారు. గత 45 రోజులుగా రాష్ట్రంలో ఏం జరిగిందో ఫోటో ప్రదర్శన కూడా ఉంటుందన్నారు. ప్రజల బాగోగుల పట్ల చిత్తశుద్ధితో రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రుల అపాయింట్మెంట్లు కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు వ్యతిరేకంగా ఏం జరిగినా కేంద్రం, రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రజల కోసం వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమన్నారు.అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక హోదా, బడ్జెట్లో ఎక్కువ వాటా, విభజన హామీల్లో ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న పెట్రో కెమికల్, రైల్వే జోన్, గిరిజన వర్సిటీ తదితర అంశాలపై డిమాండ్ చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో కోరగా మరో కీలక భాగస్వామి టీడీపీ మాత్రం దీనిపై నోరు మెదపకపోవడం దారుణమన్నారు. మాపై దాడి చేసి.. మాపైనే కేసులా?రెండుసార్లు తన నియోజకవర్గానికి వెళ్లేందుకు సిద్ధమైనా టీడీపీ గూండాలు అడ్డుకుని భౌతిక దాడులకు దిగినట్లు ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పారు. గృహ నిర్భంధం విధించి భద్రత కల్పించలేమని పోలీసులు చేతులెత్తేశారన్నారు. పోలీసుల సమక్షంలోనే మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేసి వాహనాలను దగ్ధం చేస్తే హత్యాయత్నం, నాన్ బెయిలబుల్ కేసులు తమపై బనాయించడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధికే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యుల సంగతి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. వినుకొండలో రషీద్‌ది రాజకీయ హత్య అని మృతుడి తల్లిదండ్రులు చెబుతున్నా ప్రభుత్వం ఆలకించడం లేదని మండిపడ్డారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపులో లేవన్నారు. -
ఏపీలో రాష్ట్రపతి పాలన..!
-
వాళ్లు తప్పు చేసి.. మాపైనే కేసులు
సాక్షి, అమరావతి: ‘అన్ని తప్పులు వాళ్లే చేసి.. తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దౌర్జన్యాలు, దాడు లు, విధ్వంసాలకు లెక్కే లేదు. ఈ 45 రోజుల్లో 36 మంది రాజకీయ హత్యలకు గుర య్యారు. హత్యలు, దాడులు చేయడానికే టీడీపీ వాళ్లకు లైసెన్స్ ఇచ్చినట్టుగా ఉంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి నిప్పులు చెరిగారు.తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్.. టీడీపీ కార్యకర్తలపై ఎన్ని కేసులు ఉంటే అంత బాగా పని చేసినట్లు అని ప్రచారం చేశారు. ఎ న్నికల తర్వాత టీడీపీ గెలిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ చూసిన రెడ్ బుక్ ఫొటోలతో కూడిన హో ర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ కార్యకర్త లపైకి, ప్రజలపైకి ఉసిగొల్పుతున్నారు’ అని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ‘పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంట్లో ఉండగా నా పైనే దాడి చేసి, నాపైనే హత్యా నేరం మోపడం దారుణం. వందలాది మంది టీడీపీ కార్యకర్తలను సమకూ ర్చుకొని ఇంట్లో ఉన్న నా పై దాడి చేశారు. పుంగనూరు నేను ప్రాతినిథ్యం వహిస్తున్న రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలోనిదే. పుంగనూరు నియోజకవర్గానికి మా నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. కావాలనే అక్కడ టీడీపీ మనుషులు ఉండేలా, పోలీసులతో ప్లాన్ చేసి మరీ దాడులు చేశారు. 75 ఏళ్ల వయసున్న మాజీ ఎంపీ రెడ్డె్డప్ప ఒక న్యాయవాది.ఆయన ఇంటిపైనే రాళ్లతో దాడి చేసి, వాహనాలు ధ్వంసం చేశారు. మాజీ ఎంపీ రెడ్డె్డప్పకు చెందిన వాహ నాన్ని దగ్ధం చేశారు. వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. తిరిగి ఆయనపైనే హత్య నేరం కేసు పెట్టడం దారుణం’ అని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో ఏపీలో విధ్వంసకాండ, ఆటవిక పాలన గురించి గట్టిగా ప్రస్తావిస్తామని చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల నేతలందరినీ ఒకే విధంగా, సమానంగా చూడాలని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చెప్పారన్నారు.వినుకొండలో ‘రషీద్ హంతకుడైన జిలానీ.. లోకేశ్ పుట్టిన రోజున స్థానిక ఎమ్మెల్యే భార్యకు స్వయంగా కేక్ తినిపించిన ఫొటోలు, ఎమ్మెల్యేతో ఉన్న ఫొటోలను.. రషీద్ తల్లిదండ్రులు చూపారు. అయినా వినుకొండ ఎమ్మెల్యే ప్రెస్‌మీట్ పెట్టి జిలానీ గురించి అబద్ధాలు చెబుతున్నారు. ఫొటోల్లో స్పష్టంగా కన్పిస్తుంటే చంద్రబాబు, పవన్‌లు మాట్లాడక పోవటం, ఖండించక పోవటం ఆశ్చర్యకరం అన్నారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై దాడి : ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డిరాష్ట్రంలో జరుగుతున్న ఈ ఆకృత్యాలు ఒక రాజకీయ పార్టీపై జరుగుతున్న దాడిగా కాకుండా, ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా దేశ ప్రజలు చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీ ఎంపీలతో సమావేశం అనంతరం.. ఆ వివరాలను అయోధ్య రామిరెడ్డి మీడియాకు వివరించారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులపై చేస్తున్న భౌతిక దాడులు, ప్రజల్లో నెలకొన్న భయాందోళల గురించి, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించామని చెప్పారు. వాటన్నింటినీ పార్లమెంట్‌లోనూ ప్రస్తావించాలని నిర్ణయించామన్నారు. ‘రాష్ట్రంలో జరిగిన విధ్వంసకాండపై ఢిల్లీలో బుధవారం జరిగే ధర్నాలో ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేస్తాం. వీడియోల ద్వారా దేశ ప్రజలందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు ఇప్పటికే అపాయింట్మెంట్ అడిగాం. లోక్‌సభ, రాజ్యసభలో పెద్ద ఎత్తున మా వాణి వినిపిస్తాం’ అని చెప్పారు. -
ఇదేం పాలన పాక్ చంద్రబాబు.. తప్పు సరిచేసుకో..
-
చంద్రబాబు రక్తచరిత్ర పాలన.. ఢిల్లీలో బయటపెడతాం
-
ఇంకెంతమందిని చంపాలనుకుంటున్నారు?: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకకాండ నడుస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకకాండ నడుస్తోంది. పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్సీపీ యువకార్యకర్త రషీద్ హత్య అత్యంత కిరాతకం. ప్రభుత్వంలో ఉన్న పెద్దల సహకారంతోనే ఇలాంటి దారుణ హత్యలు జరుగుతున్నాయి. నామీద కూడా దాడులు చేశారు. గతంలో యాక్టివ్‌గా పని చేసిన నేతలందరినీ టీడీపీ టార్గెట్ చేసింది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయటం ఏంటి?. ఇంకెంతమందిని చంపాలనుకుంటున్నారు?. పార్లమెంటులో వీటిపై చర్చిస్తాం. దేశమంతా ఏపీలోని దారుణాల గురించి విస్తుపోతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఎందుకు నోరుమెదపటంలేదు?. .. బుధవారం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీపై దాడులపై ఢిల్లీలో ధర్నా చేయనున్నారు.దేశమంతా ఏపీలోని కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాలపై చర్చించేలా చేస్తాం’ అని అన్నారు.చదవండి: మీ కోసమే.. మీతోనే నా ప్రయాణం.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్ -
AP: నిన్న దాడి.. ఇవాళ సెక్యూరిటీ తగ్గించారు
సాక్షి, చిత్తూరు: ఏపీలో కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. అలాగే, పోలీసుల సమక్షంలో నిన్న తమపై టీడీపీ నేతలు దాడులు చేశారని చెప్పుకొచ్చారు.కాగా, రాజంపేటలో ఎంపీ మిథున్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘పుంగనూరులో పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. అనంతరం, మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిపై రాళ్ల దాడులు చేశారు. అంతటితో ఆగకుండా వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఎపిసోడ్ అంతా జరిగింది. మళ్లీ అదే పోలీసులు మాపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టారు. నిన్న నాపై దాడి జరిగింది. ఈరోజు నా భద్రతను తగ్గించారు.ఈరోజు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. మీరు అధైర్యపడవద్దు. కార్యకర్తలకు, పార్టీ నాయకులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాను. విద్యార్థి దశ నుంచే మా తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదిసార్లు ఎన్నికలు చూశారు. చంద్రబాబు చేసే దుర్మార్గపు రాజకీయాలను ఎప్పుడూ చూడలేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
కేసులకు భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, చిత్తూరు: మన ప్రభుత్వంలో ఇలాంటి దాడులు చూడలేదని.. కేసులకు భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి’’ అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ధైర్యం చెప్పారు. శుక్రవారం ఆయన సదుం మండలంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ, నాపై కూడా నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టారు. పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించం. పోలీసులు పట్టించుకోకుంటే న్యాయపోరాటం చేస్తాం. నేను ఎవ్వరినీ వదిలి పెట్టను, కార్యకర్తలకు అండగా ఉంటా. పోలీసులు పట్టించుకోకుంటే కోర్టు ద్వారా ప్రైవేట్ కేసులు వేస్తాం.. మీకు ధైర్యం చెప్పేందుకే నేను వచ్చాను’’ అని మిథున్‌రెడ్డి చెప్పారు.వైఎస్సార్సీపీ నేత పోకల అశోక్‌కుమార్ మాట్లాడుతూ, చట్టానికి ఎవరు అతీతులు కారు, కుట్ర పూరితంగా కేసులు పెడుతున్నారు. ప్రజలు అందరు గమనిస్తున్నారు. వాళ్లకు తగిన బుద్ధి చెప్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి వెన్నంటే మన కార్యకర్తలు, నాయకులు ఉన్నారన్నారు. -
టీడీపీ నేతలకు మిథున్ రెడ్డి వార్నింగ్
-
Midhun Reddy: మాటువేసి మూకుమ్మడి దాడి ..
-
ఎంపీ మిథున్‌పై దాడి.. పుంగనూరులో టీడీపీ గూండాల విధ్వంసకాండ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వినుకొండలో నడిరోడ్డుపై వైఎస్సార్ సీపీ కార్యకర్తను నరికి చంపిన టీడీపీ గూండాలు 12 గంటలు గడవక ముందే పుంగనూరులో మరో విధ్వంస కాండను సృష్టించారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా జరిగిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన వారు, ఆస్తులు, పంటలను కోల్పోయిన బాధితులను పరామర్శించి భరోసా కల్పించేందుకు వచ్చిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అంతమొందించే ప్రణాళికతో పచ్చముఠాలు గురువారం రోజంతా మారణాయుధాలతో తిష్ట వేసి దాడులకు దిగాయి.నాలుగు గంటలు స్వైర విహారం..రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని హతమార్చడమే లక్ష్యంగా అసాంఘిక శక్తులు పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తతలు రేకెత్తించాయి. గురువారం ఉదయం 8 గంటల సమయంలో మిథున్‌రెడ్డి పుంగనూరు ఎల్ఐసీ కాలనీలోని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలతో సమావేశమైన విషయం తెలుసుకున్న టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. ఎంపీ మిథున్‌రెడ్డిని రాళ్లు, కర్రలతో కొట్టి చంపేందుకు మూకుమ్మడిగా దాడులకు తెగబడ్డాయి. టీడీపీ గూండాలను నిలువరించేందుకు యత్నించిన మాజీ ఎంపీ, దళిత నాయకుడు రెడ్డప్పపైనా టీడీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. దుర్భాషలాడుతూ రెడ్డప్ప నివాసంలోకి చొరబడ్డారు. ప్రమాదాన్ని పసిగట్టిన వైఎస్సార్సీపీ శ్రేణులు తలుపులు మూసివేయడంతో బద్ధలు కొట్టేందుకు యత్నించారు. రెడ్డప్ప నివాసంలోకి రాళ్లు రువ్వారు. ఇంటి ముందు ఉన్న పలు వాహనాలను ధ్వంసం చేసి రెడ్డప్ప వాహనానికి నిప్పు పెట్టి తగలబెట్టారు. నిలువరించేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనా దాడులు చేశారు. ఘటన గురించి తెలియడంతో అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులపైనా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. 4 గంటలపాటు సాగిన ఈ విధ్వంసంతో పుంగనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా ఓ ఎంపీనే హత్య చేసేందుకు తెగించినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయంతోపాటు టీడీపీ శ్రేణులు కూల్చివేసిన ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించి ఎంపీ మిథున్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుసుకున్న అల్లరిమూకలు హింసాకాండకు బుధవారం రాత్రే పక్కా పథకం రూపొందించినట్లు సమాచారం. మూకుమ్మడిగా చంపాలన్నదే టార్గెట్!ప్రణాళికలో భాగంగా టీడీపీ మూకలు ఉదయం నుంచి స్థానిక ఎంపీడీవో కార్యాలయం సమీపంలో రాళ్లు, కర్రలు, ఇతర ఆయుధాలతో మాటు వేశాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ముగించి మిథున్‌రెడ్డి బయటకు వస్తున్నట్లు గుర్తించి ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. రాళ్లు రువ్వుతూ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసాన్ని చుట్టుముట్టాయి. వారిని అడ్డుకునేందుకు యత్నించిన రెడ్డప్పపైనా దాడికి దిగాయి. ‘రేయ్.. బయటకు రారా..’ అంటూ దుర్భాషలకు దిగాయి. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడగా 25 మందికిపైగా వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు సాక్షి విలేకరులతోపాటు మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.గాల్లోకి కాల్పులు జరిపిన ఎంపీ గన్మెన్ఎంపీ, మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేతలకు చెందిన 15 వాహనాలను టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. మరో 12 ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనానికి నిప్పుపెట్టి తగలబెట్టారు. రెడ్డెప్ప నివాసం వద్ద పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అల్లరి మూకల నుంచి రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని రక్షించేందుకు గన్‌మెన్ రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అడుగడుగునా పోలీస్ వైఫల్యంపుంగనూరులో జరిగిన విధ్వంస కాండలో అడుగడుగునా పోలీసుల నిర్లక్ష్యం కనిపించింది. పోలీసుల సమక్షంలోనే రాళ్లు రువ్వుతూ, కర్రలతో స్వైర విహారం చేస్తున్నా చూస్తుండిపోయారు. భారీగా టీడీపీ మూకలు మోహరించినా వెంటనే స్పందించాల్సిన ఉన్నతాధికారులు తీరిగ్గా కొంత మంది పోలీసులను పంపి చేతులు దులుపుకోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎంపీ మిథున్‌రెడ్డి అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. బాబు ఆదేశాలతో హౌస్ అరెస్టు..ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి గత నెల 15న పుంగనూరులో పర్యటించాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పోలీసులు వారిద్దరినీ తిరుపతిలో హౌస్ అరెస్ట్ చేశారు. తాజాగా పార్టీ కార్యకర్తలను, బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఎంపీ మిథున్‌రెడ్డిని ఏకంగా హతమార్చేందుకు పచ్చమూకలు పథకం వేశాయి.బెదిరింపులకు భయపడం: ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డికూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలే అజెండాగా పని చేస్తోంది. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పురిగొల్పడం దారుణం. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. నియోజకవర్గంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు గతంలో ఎప్పుడూ చూడలేదు. అభివృద్ధి అంటే వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లను కూల్చడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, పిల్లలు ఆడుకునే బ్యాడ్మింటన్ కోర్టును ధ్వంసం చేయడమా? ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదు. చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. డీఎస్పీ, సీఐ స్థాయి అధికారుల ఎదుటే దాడులు జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణం. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని మరో బిహార్‌లా మార్చే యత్నం చేస్తున్నారు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తేలేదు. ప్రజలకు అండగా ఉంటాం. ప్రజల్లోనే ఉంటూ మరోసారి వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తాం. తిరిగి ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుంది. అమ్మ ఒడి పథకం పేరు మార్చి తల్లికి వందనం అంటూ ఒక్కరికే ఇస్తామని మాట మార్చారు. అభివృద్ధిని విస్మరించి, సంక్షేమ పథకాలను ఆపివేసి ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి పొందకుండా తమ పెట్టుబడితో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన సంస్థను చంద్రబాబు సర్కారు కుటిల యత్నాలతో అడ్డుకోవడం సరికాదు. హింసాత్మక ఘటనలు పునరావృతమైతే టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.రాళ్లతో కొట్టి చంపే యత్నం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని రాళ్లతో కొట్టి చంపాలని టీడీపీ రౌడీమూకలు యత్నించాయి. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఎక్కడా లా అండ్ ఆర్డర్ లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. దళిత నాయకుడైనా నాపైనా దాడి చేశారు. నా ఇంటిని చుట్టుముట్టి రాళ్లు, మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. నా కారుకి నిప్పుపెట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక విధ్వంసకాండకు తెర తీసింది. ప్రశాంతంగా ఉండే పుంగనూరులో 12 సార్లు దాడులు జరిగాయి.– మాజీ ఎంపీ రెడ్డప్పపాలనపై దృష్టి పెట్టండిచంద్రబాబు దాడులపై కాకుండా పాలనపై దృష్టి సారించాలి. ప్రజా ప్రతినిధులకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ నిర్వీర్యంగా మారింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు తగవు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి వారి మెప్పు పొందాలే కానీ దాడులకు పాల్పడడం సరి కాదు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం నిర్వీర్యం కాకుండా చూసే బాధ్యత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులదే. వారి తీరు చూస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించే పరిస్థితి కనిపించటం లేదు.– నారాయణస్వామి, మాజీ డిప్యూటీ సీఎంహేయమైన చర్యరాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేయడం అత్యంత హేయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఓ ఎంపీకే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్యులను ఎలా కాపాడుతుంది? ఎంపీపై రాళ్ల దాడి జరుగుతున్నా పోలీసులు చోద్యం చూశారంటే రాష్ట్రంలో ఎలాంటి ఆటవిక పాలన కొనసాగుతుందో తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని దాడుల సంస్కృతిని టీడీపీ పాలనలో చూస్తున్నాం. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలి. దాడులకు తగిన మూల్యం చెల్లించుకునే రోజు కచ్చితంగా వస్తుంది. – మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎంపీ -
పుంగనూరులో టీడీపీ విధ్వంసకాండ.. ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యాయత్నం!
చిత్తూరు, సాక్షి: పుంగనూరులో ఇవాళ తెలుగుదేశం పార్టీ విధ్వంసకాండ కొనసాగింది. టీడీపీ దాడుల్లో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తల్ని, సానుభూతిపరుల్ని పరామర్శించేందుకు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఆ నియోజకవర్గానికి వెళ్లారు. అయితే ఆయన పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ యత్నించడం, ఆయనపై దాడికి యత్నించడంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొంది.మిథున్‌రెడ్డిని అడ్డుకునేందుకు రాళ్ల దాడికి దిగాయి టీడీపీ శ్రేణులు. ఆ కవ్వింపు చర్యలను ప్రతిఘటించేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు యత్నించాయి. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎంపీ గన్‌మెన్ గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం ఆయన మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకోగా.. పచ్చ పార్టీ కార్యకర్తలు అక్కడా వీరంగం సృష్టించారు. రెడ్డప్ప ఇంటిపైకి రాళ్లు రువ్వారు. ఆయన కారుకు నిప్పు పెట్టారు. అంతేకాదు.. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. ఈ క్రమంలో 15 కార్లు, పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. మరోవైపు రెడ్డప్ప ఇంటి నుంచి కదిలేదే లేదని, తన పర్యటన కొనసాగుతుందని ఎంపీ మిథున్‌రెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ఏఎస్పీ రెడ్డప్ప నివాసానికి చేరుకుని మిథున్‌రెడ్డితో చర్చలు జరిపారు. చివరకు.. కట్టుదిట్టమైన భద్రత నడుమ పుంగనూరు నుంచి తిరుపతిలోని మారుతినగర్ నివాసానికి ఎంపీ మిథున్‌రెడ్డిని పోలీసులు తరలించారు. ఇది హత్యాయత్నమే.. ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన వైఎస్సార్సీపీ.. దీన్నొక హత్యాయత్నంగా అభివర్ణించింది. మాజీ ఎంపీ రెడ్డప్ప పుంగనూరు ఉద్రిక్తతలపై స్పందిస్తూ.. ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యయత్నం జరిగిందన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ పాలనలో దాడులు ఎక్కువ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.సంబంధిత వార్త: ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడిభయపడేది లేదు: మిథున్రెడ్డిపుంగనూరులో గతంలో ఈ తరహా దాడులు ఏనాడూ జరగలేదని, చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్లోనే దాడులు జరగుతున్నాయని, టీడీపీ నేతలు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, ఇలాంటి దాడులకు మేం భయపడమని ఎంపీ మిథున్‌రెడ్డి అంటున్నారు. -
ఎల్లోబాన్లపై వైఎస్సార్సీపీ ఆగ్రహం
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచకాలపై వైయస్సార్సీపీ నేతలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా వినుకొండలో పార్టీ కార్యకర్త దారుణహత్య. పుంగనూరులో ఎంపీ పి.మిధున్‌రెడ్డిపై రాళ్లతో దాడి. వాహనాల «ధ్వంసం ఘటనలను వారు ముక్త కంఠంతో ఖండించారు.అ«ధికారం చేపట్టిన టీడీపీ తొలి రోజు నుంచి పాలన గాలికి వదిలేసి, కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, ఎక్కడికక్కడ దాడుల చేస్తోందని వారు ఆక్షేపించారు. ఇకనైనా టీడీపీ తన వైఖరి మార్చుకోకపోతే, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదని వైయస్సార్సీపీ నేతలు, నాయకులు హెచ్చరించారు.వైయస్సార్సీపీ నేతలు.. ఎవరు, ఏమన్నారంటే..: ప్రశాంతంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం సృష్టించారు. రాళ్ళతో, మారణాయుధాలతో దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ డైరెక్షన్లోనే పుంగనూరు ఘటన చోటు చేసుకుంది. పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధిని అడ్డుకోవాలన్న కుట్రలో భాగమే ఈరోజు అక్కడ రాళ్ల దాడి, వాహనాల ధ్వంసం జరిగింది. రూ.5 వేల కోట్లతో ఎలక్ట్రిక్ కార్ల ఫ్యాక్టరీ పుంగనూరులో ఏర్పాటవుతుంటే, దాన్ని ఎలాగైనా ఆపాలన్న కుట్ర చేస్తున్నారు. ఎల్లకాలం మీ ఆటలు సాగవు. ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. నా సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా ఉండాలని చూస్తున్నారు. అందుకే మా వాహనాలు ధ్వంసం చేశారు. నాపై రాళ్ల దాడి చేశారు.:::పి.మిధున్‌రెడ్డి. రాజంపేట ఎంపీపుంగనూరు నా ఇంటికి వచ్చిన ఎంపీ పి.మిధున్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. మారణాయుధాలు, రాళ్లతో ఎంపీ మిథున్‌రెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. నా వాహనాలతో పాటు, మిథున్‌రెడ్డి వాహనాలు కూడా ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా, పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. వారు టీడీపీ తొత్తులుగా వ్యవహరించారు.:::రెడ్డప్ప. చిత్తూరు మాజీ ఎంపీఎంపీ మిధున్‌రెడ్డిపై రాళ్ళ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దాడులు హత్యలు దారుణంగా పెరిగిపోయాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమంజసం కాదు. దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. దాడులు చేస్తున్న వారికి ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారు.:::గొల్ల బాబురావు. ఎంపీ (రాజ్యసభ సభ్యుడు)చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద ఎంపీ మిధున్‌రెడ్డిపై దాడి అమానుషం. ఎంపై రాళ్ల దాడి చేసి, వారి వాహనాలు« «ధ్వంసం చేయడం అత్యంత హేయం. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో రాక్షస, ఆరాచక పాలన సాగుతోంది. ఈ దాడులపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. ప్రజలు అధికారాన్ని ఇస్తే, సభ్య సమాజం తలదించుకునేలాగా టీడీపీ నాయకులు ప్రవర్తించడం సిగ్గుచేటు.:::ఇస్సాక్ బాషా. వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ.రేపు (19వ తేదీ, శుక్రవారం) ఉదయం మా పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి వినుకొండలో పర్యటిస్తారు. టీడీపీ కార్యకర్త చేతిలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. ఆ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పడానికే, ఆయన రేపు వినుకొండలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది, వందలాది ప్రజలు, పోలీసులు చూస్తుండగానే, వినుకొండ నడిరోడ్డులో మా పార్టీ కార్యకర్తను నరికి చంపడం అంటే.. అంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా?. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది.. ఇలా పార్టీ కార్యకర్తలను నరికి చంపడానికా?. వినుకొండలో తెలుగుదేశం పార్టీ కొత్త సాంప్రదాయానికి బీజం వేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పని చేస్తున్నాడన్న కారణంతోనే రషీద్‌ను దారుణంగా నరికి చంపారు.:::బొల్లా బ్రహ్మనాయుడు. మాజీ ఎమ్మెల్యే (వినుకొండ)వినుకొండ టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ ఘటన.. మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. అంత కిరాతకమైన దృశ్యాలు ఆ వీడియోలో కన్పిస్తున్నాయి. రషీద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను.ఆంధ్రప్రదేశ్‌ను అత్యాచారప్రదేశ్‌గా మార్చొద్దు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ కనిపించడం లేదు. కేవలం నారా లోకేష్ ఆర్డర్ కనిపిస్తోంది. వినుకొండ లాంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటిపై ప్రధాని మోదీ గారు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాగారు దృష్టి పెట్టాలి. అలాగే రాష్ట్రంలో ఈ ఒకటిన్నర నెలల్లో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి.:::సి.అనిల్‌కుమార్ యాదవ్. మాజీ మంత్రి.వినుకొండలో జరిగిన హత్య ఒక రాజకీయ హత్య. అలాగే ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి అత్యంత హేయం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. వినుకొండలో మా పార్టీ కార్యకర్తను అత్యంత పాశవికంగా హత్య చేసి, దాన్ని వ్యక్తిగత హత్యగా చిత్రీకరించడం దారుణం. టీడీపీ దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరు వెళ్లిన ఎంపీ మిధున్‌రెడ్డిపై రాళ్లతో దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యుడికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం, సామాన్య కార్యకర్తలకు ఏ విధమైన రక్షణ కల్పిస్తుంది?. ఏకంగా ఒక ఎంపీపైనే రాళ్లతో దాడి చేస్తున్నా, రక్షణ కల్పించకుండా పోలీసులు చోద్యం చూశారంటే, ఇక్కడ ఏ విధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలి. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని ఇప్పుడు చూస్తున్నాం. అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకొంటే బాగుంటుంది.:::ధర్మాన కృష్ణదాస్. మాజీ మంత్రి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన తాలిబన్ల పాలనను తలపిస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్‌పై దృష్టి పెట్టకుండా సూపర్ మ్యాజిక్ చేసి మోసం చేస్తున్నారు. కూటమి నాయకులు దళితులనే టార్గెట్ చేసి దాడులు చేయడం హేయమైన చర్య. ఈ కూటమి తాలిబన్లను తరమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. మీ దాడులపై మా పార్టీ ప్రతి దాడులకు దిగితే తట్టుకోలేరు.:::కోరుముట్ల శ్రీనివాసులు. మాజీ ఎమ్మెల్యే (రైల్వే కోడూరు)రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. చంద్రబాబు మార్క్ రాజకీయాలు నడుస్తున్నాయి. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. హత్యలు, దొమ్మీలు ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. ఈ తరహా పద్ధతి మారకపోతే తిరగబడాల్సి వస్తుంది. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడి దారుణం. వెంటనే రాజ్యాంగ వ్యవస్థలు జోక్యం చేసుకోవాలి. ఇకనైనా చంద్రబాబు తన పద్ధతి మార్చుకోవాలి.:::జక్కంపూడి రాజా. మాజీ ఎమ్యెల్యే. (తూ.గో.జిల్లా)కూటమి పాలనలో రాష్ట్రంలో అరాచకం నడుస్తోంది. టీడీపీ నాయకులు దాడులు, మర్డర్లు ,మానభంగాలతో చెలరేగిపోతున్నారు. ఇందుకేనా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది?. మీ పాలనలో గ్రామాలలో ఎన్నో కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. వినుకొండలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే మా పార్టీ కార్యకర్తను నరికి చంపడం దారుణం.:::కాసు మహేష్‌రెడ్డి. మాజీ ఎమ్మెల్యే (గురజాల).తెలుగుదేశం నాయకులు అసలు ఎందుకు దాడులు చేస్తున్నారు?. నడిరోడ్డుపైన పోలీసులు ఉండగానే రషీద్‌ను అత్యంత దారుణంగా చంపడం దుర్మార్గపు చర్య. గతంలో జిల్లా ఎస్పీగా మల్లికాగార్గ్, నెల రోజులపాటు పని చేసినప్పుడు, ఈ తరహా దాడులు కాస్త తగ్గాయి. జిల్లాకు చెందిన ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, సీఎం చంద్రబాబును కలిసి, ఎస్పీని మార్చమని కోరారు. ఆయన వెంటనే ఆ పని చేశారు. ఇప్పుడు వినుకొండలో మా పార్టీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. ఘటన జరిగిన వెంటనే, ఎలాంగి దర్యాప్తు చేయకుండానే, అర్ధరాత్రి మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ, అది వ్యక్తిగత, పాత కక్షల వల్లనే జరిగిందని చెప్పడం దారుణం. మరోవైపు రషీద్‌ను నరికి చంపిన జిలానీ, వాస్తవానికి టీడీపీకి చెందినవాడైనా, అతడు తమ పార్టీ కార్యకర్త అంటూ, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో జిలానీ, టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు కోసం పని చేశారు.:::మర్రి రాజశేఖర్. ఎమ్మెల్సీ.చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేయటమే తెలుగుదేశం కార్యకర్తలు పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వారు గాలికి వదిలేశారు. హత్య జరిగిన తరవాత అర్ధరాత్రి ప్రెస్‌మీట్ పెట్ని ఎస్పీ, పాతకక్షల వల్లే రషీద్ హత్య జరిగిందని చెప్పడం దారుణం.:::గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి. మాజీ ఎమ్మెల్యే (నర్సారావుపేట) పక్కా ప్లాన్‌తో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. గడిచిన 45 రోజులుగా ఏపీలో జరుగుతున్న హింస ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. 31 హత్యలు, 35 మంది ఆత్మహత్యలు జరిగాయి. ఏకంగా 2,750 కుటుంబాలు ప్రాణభయంతో వలస పోయాయి. ప్రతిపక్షాన్ని టెర్రరైజ్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ ని తలపిస్తున్నారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. హైకోర్టు కోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలి. వినుకొండ హత్యకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. అటు పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి చేశారు. ఇందుకేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది?. వారం లోగా పరిస్థితిని చక్కదిద్దాలి. లేకపోతే రాజీనామా చేయాలి. మా ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుంది.:::కనుమూరు రవిచంద్రారెడ్డి, వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల కూడా గడవక ముందే మా పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలపై టీడీపీ దాడులు తీవ్రమయ్యాయి. ఎంపీ మిధున్‌రెడ్డిపై పుంగనూరులో రాళ్లదాడిని ఖండిస్తున్నాం. సౌమ్యుడిగా, మంచి వ్యక్తిగా పేరున్న మిథున్‌రెడ్డిపై టీడీపీ దాడి ఎంత వరకు సబబు?. తమ నియోజకవర్గంవలో పర్యటించే హక్కు, ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధికి, ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. ఆ హక్కును కాలరాయాలని టీడీపీ చూడడం దారుణం.:::అకేపాటి అమర్నాథ్రెడ్డి. రాజంపేట ఎమ్మెల్యే.రాష్టంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. గుంటూరు జిల్లాలో వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ వారి దాడులు తీవ్రమవుతున్నాయి. వినుకొండలో నడి రోడ్డుపై రషీద్‌ను దారుణంగా నరికి చంపారు. వ్యక్తిగత వివాదాలు, పాతకక్షల వల్లే ఆయన హత్య జరిగిందని, అర్థరాత్రి హడావిడిగా ఎస్పీ చెప్పడం దారుణం. అలాంటి ఎస్పీకి రాష్ట్రంలో పని చేసే అర్హత లేదు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దాడులు పెరిగాయి. దాదాపు 3 వేల కుటుంబాలు ఇళ్లు, ఊళ్లు వదిలి వెళ్లాయి. మరోవైపు మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు అధికమయ్యాయి. మా పార్టీ వారిపై నానాటికీ దాడులు పెరుగుతున్నా, పోలీసులు అస్సలు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు 40 రోజుల పాలనలో అనేక దారుణాలు జరిగాయి. ఆడపిల్లల జోలికి వస్తే.. భయపడేలా చేస్తామన్న పవన్‌కళ్యాణ్.. ఇప్పుడు నోరు మెదపడం లేదు.:::కాకాణి గోవర్థన్‌రెడ్డి. మాజీ మంత్రి.పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాల «ధ్వంసం హేయమైన చర్య. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యుడు మిథున్‌రెడ్డి. పుంగనూరులో మాజీ ఎంపీ ఇంటికి వెళ్లిన ఆయనపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేయడం, ఆయన వాహనాలు ధ్వంసం చేయడం పిరికిపంద చర్య. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వరుసగా జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల ధ్వంసం, కూల్చివేతల సంఘటనలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. గతంలో ఏనాడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. నెల రోజులుగా వరుసగా పసిపిల్లలపై అత్యాచారాలు జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం. నంద్యాల జిల్లా నందికొట్కూరు ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారానికి గురై, హత్యకు గురైనా, ఇప్పటికీ ఆ బాలిక మృతదేహం కనుక్కోక పోవడం దారుణం.:::జి.శ్రీకాంత్‌రెడ్డి. వైయస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడురాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిపై దాడి అత్యంత హేయం. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏవిధమైన రక్షణ కల్పిస్తుంది. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏవిధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంçస్కృతిని ఇప్పుడు చూస్తున్నాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి. అధికారం శాశ్వతం కాదు.:::గురుమూర్తి. ఎంపీ (తిరుపతి) -
టీడీపీ నేతలపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్
-
లా అండ్ ఆర్డర్ విఫలం.. చేతులెత్తేసిన పోలీసులు
-
వినుకొండ ఘటనపై మిథున్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
-
ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ దాడి
-
పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ దాడి
సాక్షి, చిత్తూరు: టీడీపీ అరాచకాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. మాజీ ఎంపీ రెడప్ప నివాసానికి మిథున్‌రెడ్డి రాగా.. రెడ్డప్ప ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లదాడికి దిగాయి.టీడీపీ దాడిలో గాయపడ్డ నేతలతో మిథున్‌రెడ్డి సమావేశం జరుగుతుండగా.. ‘పచ్చ’మూకలు రెచ్చిపోయాయి. రాళ్లతో దాడులకు తెగబడ్డాయి. రెడ్డప్ప ఇంటిని చుట్టిముట్టిన టీడీపీ గూండాలు.. మీడియా ప్రతినిధులపైనా రాళ్లతో దాడి చేశారు. రెడ్డప్ప ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేతల వాహనాలను కూడా టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు.చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్లోనే దాడులు: మిథున్‌రెడ్డి ప్రశాంతంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం సృష్టించారని మిథున్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘రాళ్లతో మారణాయుధాలతో ఈ రోజు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ డైరెక్షన్ లోనే ఈరోజు పుంగనూరులో దాడులు జరుగుతున్నాయి. పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి అడ్డుకోవాలని కుట్రలో భాగమే. 5 వేల కోట్లతో ఎలక్ట్రికల్ కారు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే, దాన్ని రాకుండా కుట్రలు చేస్తున్నారు. ఎల్లకాలం మీ ఆటలు సాగవు, ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. నా పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించే వాతావరణం లేకుండా దాడులు చేస్తున్నారు. మా వాహనాలు ధ్వంసం చేశారు. ఇప్పటికీ రాళ్లు దాడి చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేస్తూనే ఉన్నారు’’ అని మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు.దాడులు అత్యంత హేయం: ఎంపీ గురుమూర్తితెలుగుదేశం నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లిన మిధున్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు. మిథున్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు.ప్రజాస్వామ్య బద్దంగ ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు ఏవిధమైన రక్షణ కల్పిస్తుందన్నారు. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏవిధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకొంటే బాగుంటుందని ఆయన అన్నారు. నేడు మీ వెనుక ఉండి దాడులకు ప్రోత్సహించే నాయకులూ నాడు ఎవరూ ఉండరు అనేది ఆలోచించించాలని అన్నారు. -
KSR Live Show: టీడీపీ అరాచకం.. అరెస్టుకైనా.. ప్రాణ త్యాగానికైనా సిద్ధం
-
ఎంపీ మిథున్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డిలపై ఆంక్షలు
సాక్షి, తిరుపతి టాస్క్‌ఫోర్స్: రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పుంగనూరు ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిని ఆ నియోజకవర్గంలో పర్యటించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. శాంతి భద్రతల పేరుతో వారి పర్యటనలకు అడ్డు చెబుతున్నారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొనడంతో పాటు కూటమి నేతల దాడుల్లో నష్టపోయిన వారిని పరామర్శించి, భరోసా కల్పించాలని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నిర్ణయించారు.ఆదివారం పార్లమెంట్ సమావేశాలు ఉండవు కాబట్టి ఢిల్లీ నుంచి తిరుపతి చేరుకున్నారు. ఇక్కడి నుంచి పుంగనూరుకు వెళ్లే సమయంలో పోలీసులు ఆదివారం ఆయన నివాసానికి చేరుకుని అక్కడికి వెళ్లడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ఎంపీకి నోటీసులు ఇచ్చేందుకు గోడలు దూకి హడావుడి చేశారు. తిరుపతిలోని వకుళామాత ఆలయానికి కూడా వెళ్లడానికి వీలు లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.పర్యటిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని సాకు చెప్పారు. అంతటితో ఆగని పోలీసులు.. ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని కలిసేందుకు వచ్చిన నియోజకవర్గ ప్రజలను సైతం లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. వంద మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, పెద్దిరెడ్డి నివాసంలోకి ఎవరూ వెళ్లేందుకు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలను కలిసేందుకు కూడా ఒప్పుకోలేదు. ఇదే సమయంలో పుంగనూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పలువురు వైఎస్సార్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. తమ ఆదేశాలను పాటించకపోతే కేసులు పెడతామని బెదిరించారు. నా నియోజకవర్గానికి నేను వెళ్లకూడదా?ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి నేతలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, గతంలో ఎన్నడూ లేని సంస్కృతికి తెరలేపారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో ఆదివారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందన్నారు. నియోజకవర్గంలో ఎలక్ట్రికల్ బస్సు కంపెనీ రాకుండా, పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.ఇన్ని గొడవల నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల ఫ్యాక్టరీ యాజమాన్యం సందిగ్ధంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పుంగనూరుకు ఏ పరిశ్రమలు రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన నియోజక వర్గంలో పర్యటించకుండా, ప్రజల్ని కలవకుండా అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జేసీబీలు తీసుకొచ్చి వైఎస్సార్సీపీ నాయకుల మామిడి తోటలు, ఆస్తులు, కుటుంబ సభ్యుల వాహనాలను ధ్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.నియోజకవర్గంలో పేదల ఆవులు కూడా ఎత్తుకెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తాం. కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణం. మా వారిని పరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటి? నా నియోజకవర్గంలో నేను పర్యటించకూడదా? ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. వైఎస్సార్సీపీకి 40 శాతం మంది ఓటేశారని, వారందరినీ రాష్ట్రం నుంచి తరిమేస్తారా?’ అని నిప్పులు చెరిగారు. అరెస్టుకైనా, ప్రాణ త్యాగానికైనా సిద్ధం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటామని ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారాలని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాను బీజేపీలోకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చల్లా బాబును అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నప్పటికీ, ఇలాంటివి ఎప్పుడూ లేవని, బాబు ట్రాప్‌లో పడొద్దని హితవు పలికారు. గతంలో పోలీసులపై దాడి చేసిన చల్లా బాబు జైలుకు వెళ్లారన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల కోసం తాను అరెస్టుకైనా, ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మంత్రి పదవిని కాపాడుకోవడానికే రాంప్రసాద్ తమపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు.పుంగనూరులో ఉద్రిక్తత పుంగనూరు: ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీలు తమ సొంత నియోజకవర్గాలలో తిరగరాదని హెచ్చరికలు చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న ఘటనలు ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఆదివారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి పుంగనూరులో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కూటమి నేతలు పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో ధర్నా చేపట్టి, నల్లజెండాలతో నిరసనకు దిగారు.ఎమ్మెల్యే, ఎంపీలు రాకూడదంటూ దూషణల పర్వం కొనసాగించారు. సుమారు రెండు గంటల సేపు హైడ్రామా సాగింది. ఈ నెల15న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పుంగనూరు పర్యటన సమయంలో కూడా కూటమి నేతలు ఇలాగే అడ్డుకున్నారు. కూటమి నేతల తీరుతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు ఎంపీ మిథున్‌రెడ్డిని తిరుపతిలో హౌస్ అరెస్ట్ చేశామని తెలపడంతో కూటమి శ్రేణులు శాంతించారు. -
రాష్ట్రంలో ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది
-
పుంగనూరుకు పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారు: ఎంపీ మిథున్ రెడ్డి
సాక్షి, తిరుపతి: తిరుపతిలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంట్లోకి కొత్త వారిని రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.కాగా, ఆదివారం తెల్లవారుజామునుంచే ఎంపీ మిథున్ రెడ్డి నివాసానికి పోలీసులు చేరుకున్నారు. మిథున్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. అనంతరం, ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే, నేడు మిథున్ రెడ్డి పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయనను అడ్డుకునేందుకు ముందస్తుగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎంపీ మిథున్ రెడ్డికి ఏఎస్పీ కులశేఖర్, ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి నోటీసులు ఇచ్చారు.ఇక, మిథున్ రెడ్డి ఇంట్లోకి కొత్త వారిని కూడా పోలీసులు అనుమతించడం లేదు. ఎవరైనా వస్తే వారికి అడ్డుకుంటున్నారు. ప్రజలను కలిసేందుకు కూడా మిథున్ రెడ్డిని అనుమతించడం లేదు. దీంతో, భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ అభిమానులు మిథున్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సీరియస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘గతంలో ఎప్పుడూ లేని విధంగా పేదలు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకుల మామిడి తోటలు, ఆస్తులు, కుటుంబ సభ్యుల వాహనాలు ధ్వంసం చేస్తున్నారు. పుంగనూరు నియోజక వర్గంలో పేదలు ఆవులు ఎత్తుకుని పోతున్నారు. నియోజకవర్గంలో ప్రజల్ని కలవడానికి కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు.నా నియోజకవర్గంలో ప్రజల్ని కలవకుండా అడ్డుకుంటున్నారు.. ఇదే విషయం స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తాను. రాష్ట్రంలో 40 శాతం ప్రజలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారు. వీళ్లందరినీ రాష్ట్రం నుంచి బయటకు పంపించి వేస్తారా?. గతంలో ఎప్పుడూ ఈ సంస్కృతి లేదు. రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాము. పుంగనూరు నియోజక వర్గంపై కక్ష సాధిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎలక్ట్రికల్ బస్ కంపెనీ రాకుండా, పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారు .పదవులు కావాలి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని తిడితే వస్తాయి అనుకుంటున్నారు. టీడీపీ పుంగనూరు ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్తల్ని భయపెడుతున్నారు, భౌతిక దాడులు చేస్తున్నారు. నన్ను చంపినా పర్వాలేదు, మేము ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం’ అని చెప్పారు.అలాగే, బీజేపీలో చేరుతున్నారు అంటూ చేస్తున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మిథున్ రెడ్డి. కొందరు పనిగట్టుకుని నాపై విష ప్రచారం చేస్తున్నారు. పుంగనూరులో ఫ్యాక్షన్ తరహాలో రాజకీయాలు చేస్తున్నారు. పార్టీ మారకుండా కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. జేసీబీలతో ఇళ్లను కూలుస్తున్నారని అన్నారు. -
కూటమి నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారు: మిథున్ రెడ్డి
-
బీజేపీలో చేరాల్సిన ఖర్మ నాకు లేదు: ఎంపీ మిథున్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారు. బీజేపీలో చేరాల్సిన ఖర్మ తనకు లేదన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. అలాగే, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్లో తాను పనిచేస్తానని చెప్పుకొచ్చారు.కాగా, పార్లమెంట్లో ప్రమాణం చేసేందుకు ఎంపీ మిథున్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా పార్లమెంట్ వద్ద మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజంపేట ప్రజల మద్దతుతో మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యాను. హ్యాట్రిక్ విజయాలతో పార్లమెంట్లో అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. మా పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్లో పని చేస్తాను.జాతీయ, రాష్ట్ర ప్రయోజనాలు ఉండే బిల్లులకు మద్దతిస్తాం. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే వ్యతిరేకిస్తాం. బీజేపీలో చేరాల్సిన ఖర్మ నాకు లేదు. కూటమి నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారు. గతంలో నేను విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే బీజేపీలో చేరుతానని ప్రచారం చేశారు. వైఎస్ జగన్ నన్ను సొంత తమ్ముడిలా భావిస్తారు. వైఎస్సార్సీపీకి పూర్వవైభవం సాధించే వరకు కష్టపడతాను. రాజంపేటలో అత్యధిక రోడ్డు వేయించిన ఘనత మాదే’ అంటూ కామెంట్స్ చేశారు. -
యథేచ్ఛగా హింసాకాండ.. ఇదేమి రాజ్యం?: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజు లుగా అరాచక శక్తులు సాగిస్తున్న హింసాకాండను చూస్తుంటే టీడీపీ కార్యకర్తలా? గూండాలా? అన్న ప్రశ్న తలెత్తుతోందని వైఎస్సార్ సీపీ ఎంపీలు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేయడంతోపాటు ఇళ్లు, ఆస్తుల విధ్వంసాలకు పాల్ప డటం ఆటవిక చర్యగా అభివర్ణించారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయక ముందే ఇలాంటి దారుణాలు జరిగాయంటే రాబోయే ఐదేళ్లు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చన్నారు. టీడీపీ గూండాల దాడులపై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి, ఎన్హెచ్ఆర్సీ కార్యాలయాల్లో బుధవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందచేసిన అనంతరం వైఎస్సార్ సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్‌రావు, రఘునాధరెడ్డి, బాబూరావు, తనూజరాణి, గురుమూర్తిలతో కలిసి పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ మూకల దాడులకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఏమన్నారంటే..చంద్రబాబుది ఆటవిక పాలనటీడీపీ అధినేత చంద్రబాబుది ఆటవిక పాలనకు నిదర్శనంగా నిలుస్తోంది. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. టీడీపీ గూండాల అకృత్యాలను రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రంలో చట్టాలు, స్వేచ్ఛ, న్యాయ పాలన లేదు. అన్యాయం రాజ్యమేలుతోంది. కనీసం ఫిర్యాదు తీసుకునేందుకు కూడా అధికారులు జంకడం చంద్రబాబు పాలన ఎలా ఉంటుందో బోధపడుతుంది. ప్రమాణ స్వీకారం కంటే ముందే రాష్ట్రాన్ని అత్యంత భయానక వాతావరణంలోకి నెట్టారు. ఇప్పటి వరకూ ఎన్నో ఎన్నికలు జరిగాయి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్లాయి కానీ ఇలాంటి దుష్ట సంప్రదాయాలకు నాంది పలికింది చంద్రబాబే.ముందే దాడులకు పురిగొల్పి..ఎన్నికల కోడ్ వచ్చిన నాటి నుంచి మొదలైన దాడులు ఫలితాల తర్వాత తీవ్రరూపం దాల్చాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు, మద్దతుదారుల ప్రాణాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని టీడీపీ గూండాలు స్వైర విహారం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అంటేనే గూండాగిరీ అని రుజువు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే దాడులకు పురిగొల్పి చంద్రబాబు బాధ్యత నుంచి తప్పించుకునే ఎత్తుగడ వేశారు. వీటిని అరికట్టాల్సిన పోలీసు వ్యవస్థ నీరుగారిపోయింది. బాధితుల ఆక్రందనలు తమ కుటుంబ సభ్యులివిగానే భావించి ఈ రక్త చరిత్రను అరికట్టాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది.మూడుసార్లూ బీజేపీతో అండతో పీఠం1999, 2014, 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మూడుసార్లూ బీజేపీ సహకారం వల్లే పీఠం దక్కించుకున్నారు. హింసాకాండకు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. భావితరాలకు హింసా సంస్కృతిని నేర్పడం ఎవరూ హర్షించరు. అధికారం అంటే బాధ్యత అని గుర్తుంచుకోవాలి. అధికారం అంటే రౌడీయిజం గూండాయిజం కాదు. బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదలపై టీడీపీ సాగిస్తున్న దౌర్జన్యకాండ సభ్య సమాజం తలదించుకొనేలా ఉంది. యూనివర్సిటీలు, వీసీలపై దాడులు తగవు. అమానవీయ ఘటనలకు పాల్పడడమే కాకుండా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. మంగళగిరిలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజ్‌కుమార్‌పై లోకేష్ మనుషులు చేసిన దాడిని సోషల్ మీడియాలో అందరూ చూశారు. బంగారం లాంటి రాష్టం తగలడుతుంటే బాధగా ఉంది. ఏపీలో ఘటనలకు కేంద్రం కూడా తలవంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మీడియాపైనా అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. టీవీ 9, ఎన్టీవీ, సాక్షి తదితర చానెళ్లను ఎంఎస్‌వోల నుంచి తొలగిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందన్న భావన కలుగుతోంది. ఏపీలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రిని మరోసారి నేరుగా కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై ఫిర్యాదు చేస్తాం.రాష్ట్రం, దేశ ప్రయోజనాలే లక్ష్యంపార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు సంబంధించి రాష్ట్రం, దేశ ప్రయోజనాలే పరమావధిగా వైఎస్సార్సీపీ వ్యవహరిస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. గతంలోనూ అదే రీతిలో బిల్లులకు మద్దతు ఇచ్చామని మీడియా ప్రశ్నలకు సమాధానంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉభయ సభల్లో టీడీపీకి 16 మంది ఎంపీలుండగా వైఎస్సార్ సీపీకి 15 మంది సభ్యులున్నారని చెప్పారు. రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందాలంటే ఎన్డీఏ ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ అవసరం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి అటు టీడీపీ, ఇటు వైఎస్సార్సీపీ అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంట్లో వైఎస్సార్సీపీదే బలమెక్కువ అని తెలిపారు. ఎన్డీఏ కూటమా? ఇండియా కూటమా? అనేది కాకుండా రాష్ట్రం, దేశ ప్రయోజనాలే లక్ష్యంగా బిల్లులకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఎన్డీఏ సంఖ్యాబలం ఆధారంగా కొద్ది మెజారిటీతోనైనా లోక్‌సభ స్పీకర్ ఎంపిక జరిగిపోతుందని చెప్పారు. ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫైడ్ సివిల్ కోడ్)కి తాము మద్దతు ఇవ్వబోమన్నారు. ఒకే దేశం – ఒకే ఎన్నికలపై తమ పార్టీ అధినేత సూచనలు తీసుకొని ముందుకెళ్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపడతామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, టీఆర్ఎస్.. ఇలా దేశంలో అన్ని పార్టీలతోనూ జత కట్టిన మహానాయకుడు చంద్రబాబు మినహా మరెవరూ లేరని వ్యాఖ్యానించారు. నూతన ప్రభుత్వానిదే బాధ్యత: ఎంపీ మిథున్‌రెడ్డి రాష్ట్రంలో కొద్ది రోజులుగా చెలరేగుతున్న హింసాత్మక ఘటనలకు నూతన ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఎన్నికల తర్వాత కూడా రాజకీయాలు చేయడం సరికాదు. ప్రజాతీర్పును గౌరవిస్తూ హామీలను నెరవేర్చి చిత్తశుద్ధి చాటుకోవాలి. వైఎస్సార్సీపీకి 40 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. కొత్త ప్రభుత్వం అందరినీ సమాన దృష్టితో చూడాలి.న్యాయ పోరాటం: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతల దారుణ వైఫల్యంపై రాష్ట్రపతి, ప్రధాని, హోంశాఖ, ఎన్హెచ్ఆర్సీలకు ఫిర్యాదు చేశాం. తగిన స్పందన లేకుంటే న్యాయ పోరాటం చేస్తాం. టీడీపీ గూండాయిజం భరించలేక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు నెలకొన్నాయి. కుట్రపూరితంగా ప్రమాణ స్వీకారం కంటే ముందే కార్యకర్తల్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఉసిగొల్పారు. మా కార్యకర్తల్ని కాపాడుకుంటాం. బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటాం. అల్లరి మూకలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఊరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నందున కేంద్రం తక్షణమే స్పందించి శాంతి భద్రతలు పరిరక్షించాలి. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలను పార్లమెంట్ దృష్టికి తెస్తాం. -
టీడీపీ దాడులపై మిధున్ రెడ్డి రియాక్షన్
-
టీడీపీ దొంగ మేనిఫెస్టో నమ్మి ఈసారి ప్రజలు మోసపోరు
-
కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబుపై మిథున్ రెడ్డి సీరియస్ కామెంట్స్
-
Rajampet Lok Sabha: లోకల్ లీడర్ vs గెస్ట్ పొలిటిషన్
అన్నమయ్య: రాజంపేట లోక్‌సభకు అరుదైనపోరు ఆవిర్భవించింది. ఆరుదశాబ్దాల తర్వాత ఏక సామాజికవర్గం మధ్య లోక్‌సభ ఎన్నికల రణరంగానికి రాజంపేట వేదికగా మారింది. ఈ లోక్‌సభపై రాష్ట్రం దృష్టి సారించింది. కారణం కూటమి అభ్యర్థిగా, బీజెపీ నుంచి ఉమ్మడిరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీచేస్తుండగా, ఈ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీ అయిన పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి వైఎస్సార్సీపీ నుంచి బరిలోకి దిగారు. ఇప్పటి వరకు రాజంపేట లోక్‌సభకు బలిజ,రెడ్డి సామాజికవర్గాలకు చెందిన అభ్యర్థుల మధ్య పోటీ కొనసాగుతూ వచ్చింది. ఈ సారి ఇద్దరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే లోక్‌సభ ఎన్నికబరిలో ఉండటంతో అరుదైన పోరుగా రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. 1957 నుంచి... రాజంపేట లోక్‌సభ ఆవిర్భవించిన తర్వాత 1957 నుంచి 2019 వరకు 16 సార్లు జరిగిన ఎన్నికల్లో మొదటి రెండు, చివరి రెండుసార్లు మినహా మొత్తం 12 సార్లు కాపు (బలిజ)లే దక్కించుకున్నారు.ఈ నేపథ్యంలో ప్రధాన అభ్యర్థులుగా ఇద్దరు ఓకే సామాజికవర్గానికి వారు తలపడి 62 సంవత్సరాలు అయింది. 1962 తర్వాత.. 2019 ఎన్నికల్లో బలిజ సామాజికవర్గానికి చెందిన ఆదికేశవులనాయుడు సతీమణి సత్యప్రభతో వైఎస్సార్సీపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి తలపడి గెలుపొందారు. 2014లోనూ బీజెపీ అభ్యర్థి, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై పోటీ చేసి గెలుపొందడం విశేషం. 1962 తర్వాత ఒకే సామాజికవర్గానికి చెందిన అభ్యర్థుల మధ్య పోరు 2024 ఎన్నికల్లో ఆవిష్కృతంకావడంతో రాజంపేట లోక్‌సభ స్థానం ప్రత్యేకతను సంతరించుకుంది. బహుశా రాష్ట్రంలో కూడా రెండు ప్రధాన పార్టీల నుంచి ఒకే సామాజికవర్గం వారు పోటీ పడిన సందర్భం ఎక్కడా ఉండకపోవచ్చు. 9 సార్లు కాపుల మధ్యే పోరు రాజంపేట లోక్‌సభ ఏర్పడిన 1957 నుంచి 2019 వరకు ఎన్నికల చరిత్రలోకి వెళితే...ఇప్పటికి 16సార్లు ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నికల్లో 1957లో టీవీఎన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కాగా , 1962లో ఇండింపెండెట్గా సీవీఎల్రెడ్డి చేతిలో టీవీఎల్ఎన్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమిపాలయ్యారు. అంటే 1962లో ఇద్దరు ఒకే సామాజికవర్గ అభ్యర్థుల మధ్య పోరు జరిగింది. తర్వాత ఈ వర్గానికి మధ్య ఇప్పటి వరకు పోరు జరగలేదు. 1967లో బలిజ సామాజికవర్గానికి చెందిన పార్థసారధి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో ఆయనపై సీఎల్ఎన్రెడ్డి స్వతంత్య్రఅభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1971లో కాంగ్రెస్ అభ్యర్థిగా తిరిగి పోటీ చేసిన పార్థసారధిపై,ఎన్సీవో పార్టీ అభ్యర్ధిగా యశోదరెడ్డి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1977లో మూడోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పార్థసారధి, బీఎల్డీ అభ్యర్ధి తిమ్మారెడ్డి పై పోటీ చేసి గెలుపొందారు. 1980లో నాలుగోసారి పార్థసారధి కాంగ్రెస్(ఐ) అభ్యర్థిగా పోటీచేశారు. ఈ సారి బలిజ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ (యు) అభ్యర్థిగా ఆర్,సభాపతిపై పోటీ చేసి గెలుపొందారు. బలిజసామాజికవర్గానికి చెందిన 1984లో పాలకొండ్రాయుడు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి సాయిప్రతాప్ గెలుపొందారు. 1989లో సాయిప్రతాప్, టీడీపీ నుంచి పోటీ చేసిన సీ.రామచంద్రయ్యపై గెలుపొందారు. 1991లో సాయిప్రతాప్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా, పాలకొండ్రాయుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1996లో సాయిప్రతాప్ కాంగ్రెస్ అభ్యర్థిగా , టీడీపీ అభ్యర్థి పోతురాజు ప్రతాప్‌పై పోటీ చేసి గెలుపొందారు. 1998లో టీడీపీ అభ్యర్థి గునిపాటిరామయ్యపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1999లో గునిపాటి గెలుపొందారు. అంటే 1977 నుంచి 2004 వరకు జరిగిన తొమ్మిది ఎన్నికల్లో బలిజసామాజికవర్గం అభ్యర్థుల మధ్య పోటీ సాగింది. నాలుగుసార్లే... 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సాయిప్రతాప్ టీడీపీ అభ్యర్థి రమేష్‌రెడ్డిపై పోటీ చేసి గెలుపొందారు. 2014లో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసి ,బీజెపీ అభ్యర్థి పురందేశ్వరిపై గెలుపొందారు. 2019లో మిథున్‌రెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై పోటీ చేసి గెలుపొందారు. అంటే మొత్తం 67 నుంచి జరిగిన ఎన్నికల్లో నాలుగుసార్లు రెడ్డి, బలిజ అభ్యర్ధుల మధ్య పోటీ జరగ్గా , మిగతా అన్నిసార్లు బలిజ,బలిజల మధ్యే ఎన్నికల పోరు కొనసాగింది. లోక్‌సభ స్వరూపమిలా.. ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో రాజంపేట ఒకటి. ఈ నియోజకవర్గ పరిధి ఆధారంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటుచేశారు. ఇందులో ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో పుంగనూరు నియోజకవర్గం జిల్లాకేంద్రానికి దగ్గరగా ఉండటానికి చిత్తూరు జిల్లాలో కలిపారు. ► మిథున్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్య పోరు... రాజంపేట సిట్టింగ్ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, మాజీ సీఎం నలారి కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్య పోరు సాగుతోంది.1962లో జరిగిన ఎన్నికల్లో తప్ప ఇప్పటి వరకు రెడ్డి, రెడ్డి మధ్య జరగని పోరు ఈ సారి ఎన్నికల్లో ఆవిష్కృతం కావడంతో రాజంపేట పార్లమెంట్ పోరు అరుదైన ఘట్టంగా మారిందని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
పిఠాపురం లో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు
-
పవన్ కళ్యాణ్ ను ఓడిస్తాం వంగా గీత విజయం తథ్యం
-
పవన్‌ను పట్టించుకోవాల్సిన పనిలేదు: మిథున్ రెడ్డి
సాక్షి, కాకినాడ: ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారో వారికే ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ మిథున్‌రెడ్డి. పవన్ కల్యాణ్‌ను వాళ్ల కేడరే చేరుకోలేదు. ఆయన ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే వంగా గీతను గెలిపించాలని కోరారు. కాగా, మిథున్ రెడ్డి శనివారం మాట్లాడుతూ.. పిఠాపురంలో వంగా గీత బలమైన అభ్యర్థి. పవన్ కల్యాణ్ రాక ముందే ఆమె ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. గతంలో వంగా గీత ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. నిత్యం ప్రజల్లోనే ఉంటారు. ఇబ్బందులు ఉంటే ఎవరు ప్రజల్లో ఉంటారని ప్రజలు కోరుకుంటారు. పిలిస్తే పలికే వ్యక్తులకే ప్రజలు మద్దతు ఇస్తారు. పవన్ కల్యాణ్‌ను వాళ్ల కేడరే చేరుకోలేరు. ఆయన ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. పిఠాపురంపై మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. 175 నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. పిఠాపురంలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. పిఠాపురంలో కష్టపడాల్సింది పవన్. డబ్బులు తీసుకుని ప్రజలు ఓటు వేయరు. నేను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఇంత వరకు నేను పిఠాపురంలో అడుగుపెట్టింది లేదు. తాను ఓడిపోతే చెప్పుకోడానికి పవన్ కొన్ని కారణాలు వెతుక్కుంటున్నాడు. పవన్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డబ్బుల గురించి పవన్ కల్యాణ్ మాట్లాడటం విడ్డూరం ఉంది. డబ్బులు తీసుకుని సీట్లు ఇచ్చిందే పవన్ కల్యాణ్’ అంటూ కౌంటరిచ్చారు. ఈనెల 19వ తేదీన కాకినాడ రూరల్‌లో మేమంతా సిద్దం సభ ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలో పాల్గొంటారు. రాజకీయాల్లో మేమంతా సిద్ధం యాత్ర ఒక గేమ్ ఛేంజర్. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరుతున్నాం అని అన్నారు. -
ముద్రగడను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు.. పార్టీలోకి ఆహ్వానం
సాక్షి, కాకినాడ: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లి వైఎస్సార్సీపీ నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం, ముద్రగడ నివాసంలోనే ఆయనతో మిథున్ రెడ్డి, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబు, జగ్గంపేట ఇన్ఛార్జ్ తోట నరసింహం భేటీ అయ్యారు. ఇక, వీరి భేటీ అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ముద్రగడను కలిశాం. ఈ సందర్బంగా ముద్రగడను వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించాం. త్వరలోనే ముద్రగడ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. కాపు రిజర్వేషన్ల కోసం గొప్ప ఉద్యమం చేసిన నేత ముద్రగడ. ఆఫర్ల కోసం పార్టీలో చేరే వ్యక్తి కాదు. స్వతహాగా ఆయనే పార్టీలో చేరుతారు. సీఎం జగన్‌కు పెద్దలను ఎలా గౌరవించాలో తెలుసు. ముద్రగడకు సముచిత స్థానం ఇస్తారు’ అని కామెంట్స్ చేశారు. -
జగన్ పాలన మళ్లీ వస్తేనే ఇంటింటికీ సంక్షేమం
సాక్షి, అమలాపురం: వైఎస్ జగన్ పాలన మళ్లీ వస్తేనే ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతాయని.. టీడీపీ గెలిస్తే అన్నీ ఆగిపోతాయని వైఎస్సార్సీపీ ఉమ్మడి గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. వలంటీర్, సచివాలయాల వ్యవస్థలు లేకుండా పోతాయని.. సచివాలయాలన్నీ జన్మభూమి కమిటీల కార్యాలయాలుగా మారిపోతాయనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం చాకలిపాలెంలో జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగిన సభలో వైఎస్సార్సీపీ కార్యకర్తలతో మిథున్‌రెడ్డి మాట్లాడారు. ‘ఇంటింటికీ వెళ్లినప్పుడు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చెప్పడంతో పాటు ఆయన మళ్లీ సీఎం కాకపోతే జరిగే నష్టాలను కూడా ప్రజలకు వివరించండి. చంద్రబాబు అధికారంలోకి వస్తే జరిగే అనర్థాలను తెలియజేయండి. జన్మభూమి కమిటీల పెత్తనం మళ్లీ పెరుగుతుందని వివరించండి. వైఎస్ జగన్ పాలన మళ్లీ వస్తేనే ఇంటింటికీ సంక్షేమాభివృద్ధి అందుతుందని తెలియజేయండి’ అని సూచించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. పొత్తుల విషయంలో టీడీపీ, జనసేన గందరగోళంలో ఉన్నాయన్నారు. అభ్యర్థులు ఎవరనేది తేల్చుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పుడు వారి పరిస్థితి చూస్తుంటే ఉమ్మడి గోదావరి జిల్లాలను క్లీన్‌స్వీప్ చేస్తామనే నమ్మకం తనకు పెరిగిందన్నారు. సీఎం జగన్ కోసం నెల రోజులు కష్టపడితే.. ఆయన మళ్లీ సీఎం అయిన తర్వాత అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటారని చెప్పారు. మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ.. ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని పాచ్చిలు పొత్తు పెట్టుకున్నా.. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న సీఎం జగన్‌ను ఓడించడం సాధ్యం కాదన్నారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రధానులు, ముఖ్యమంత్రులు ఇప్పటి వరకు ఎవ్వరూ లేరన్నారు. సీఎం జగన్ ఒక్కరే మేనిఫెస్టోలోని ప్రతి హామీనీ నెరవేర్చారని చెప్పారు. సమావేశంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయెల్, కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. -
3న ఏలూరులో ‘సిద్ధం’ బహిరంగ సభ!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం బహిరంగసభ ‘సిద్ధం’కు ఏలూరు ముస్తాబవుతోంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది పార్టీ కేడర్ సభకు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను పార్టీ ముఖ్యులు పరిశీలించారు. గోదావరి జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌కుమార్‌యాదవ్, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సభా ప్రాంగణంలో ‘సిద్ధం’ పోస్టర్లను ఆవిష్కరించారు. 110 ఎకరాల ప్రాంగణంలో.. ఏలూరు నగర సమీపంలో, దెందులూరు జాతీయ రహదారి వద్ద 110 ఎకరాల స్థలంలో సభావేదిక నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీలు.. కార్యకర్తలందరికీ దగ్గరగా వెళ్లి అభివాదం చేసేందుకు సభా వేదిక నుంచి వాక్‌వే ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సభా ప్రాంగణం వెనుక భాగంలో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. 50 నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది రానున్న క్రమంలో వాహనాల పార్కింగ్తో సహా ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. సభా ప్రాంగణానికి సమీపంలోని దెందులూరు ఊరు ప్రారంభంలో 40 ఎకరాల ప్రాంగణాన్ని, అలాగే సభా ప్రాంగణానికి, ఆటోనగర్‌కు మధ్యలో 25 ఎకరాల ప్రాంగణం, మరో రెండు పార్కింగ్ స్థలాలు, ఆటోనగర్ లోపల, ఆశ్రం కళాశాల, ఏలూరు ప్రారంభంలోని రియల్ ఎస్టేట్ వెంచర్లో మొత్తం 150 ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించి జిల్లాల వారీగా వచ్చే వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. బుధవారం ఎంపీ మిథున్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ ఏలూరు జిల్లా రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ‘సిద్ధం’ బహిరంగ సభ జరుగుతుందని, 3న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ సభా ప్రాంగణానికి చేరుకుని పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తారని వివరించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, ఎస్పీ డీ.మేరీప్రశాంతి తదితరులున్నారు. -
షర్మిల దుష్టశక్తుల ట్రాప్ లో పడింది: ఎంపీ మిథున్ రెడ్డి
-
చంద్రబాబు పై మిథున్ రెడ్డి ఫైర్