ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సన్ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ది హండ్రెడ్ లీగ్ ఫ్రాంచైజీ నార్తర్న్ సూపర్‌చార్జర్స్ పేరును సన్‌రైజర్స్ లీడ్స్‌గా (Sunrisers Leeds) గా మార్చాలని సన్ గ్రూప్ నిర్ణయించింది. ఐపీఎల్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లలో ఫ్రాంచైజీలు కలిగి ఉన్న సన్‌గ్రూప్.. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌కు చెందిన ది హండ్రెడ్ లీగ్‌లో కూడా అడుగుపెట్టింది.
నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీని కావ్యా మారన్ కొనుగోలు చేసింది. అయితే తొలుత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కేవలం 49% వాటాను మాత్రమే సన్ గ్రూపుకు విక్రయించింది. మిగితా 51 శాతం వాటా యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కలిగి ఉండేది. కానీ ఆ తర్వాత కావ్య మారన్ యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తో చర్చలు జరిపి మిగిలిన వాటాను కూడా కొనుగోలు చేసింది.
దీంతో నార్తర్న్ సూపర్‌చార్జర్స్ పూర్తి వాట సన్ గ్రూప్‌కు లభించింది. ఈ క్రమంలోనే 2026 సీజన్‌కు ముందు ఫ్రాంచైజీ పేరును నార్తర్న్ సూపర్‌చార్జర్స్ నుండి సన్‌రైజర్స్ లీడ్స్ (Sunrisers Leeds) గా సన్ గ్రూపు మార్చింది.
కాగా ది హాండ్రడ్ లీగ్‌లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యాజమాన్యాలు కూడా ఫ్రాంచైజీలను కలిగి ఉన్నారు. ముంబై ఇండియన్స్ ఓవల్ ఇన్విన్సిబుల్స్‌లో 49% వాటాను కొనుగోలు చేయగా.. లక్నో మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో 70% వాటాను కలిగి ఉంది.
చదవండి: ఆర్సీబీకి కొత్త హెడ్ కోచ్..


