
ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్‌కు (Rashid Khan) ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్యామిలీతో బంధం మరింత బలపడింది. ఇప్పటికే మూడు లీగ్‌ల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల్లో సభ్యుడిగా ఉన్న రషీద్.. తాజాగా మరో ఎంఐ ఫ్రాంచైజీతో జతకట్టాడు. రషీద్‌ను ద హండ్రెడ్ లీగ్‌లో ఎంఐ యాజమాన్యంలో నడుస్తున్న ఓవల్ ఇన్విన్సిబుల్స్ (డిఫెండింగ్ ఛాంపియన్) సొంతం చేసుకుంది. ఓవల్ ఇన్విన్సిబుల్స్‌లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇటీవలే పెట్టుబడులు పెట్టింది. ఇందులో 49 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) కొనుగోలు చేసింది.
ప్రస్తుతం రషీద్ ఒక్క ఐపీఎల్ మినహా మిగతా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల్లో (ఫారిన్ లీగ్‌ల్లో) సభ్యుడిగా ఉన్నాడు. రషీద్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్నాడు. రషీద్ సౌతాఫ్రికా టీ20 లీగ్ ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌కు.. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌కు.. మేజర్ లీగ్ క్రికెట్‌లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ద హండ్రెడ్ లీగ్ ప్రారంభం నుంచి (2021) ట్రెంట్ రాకెట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రషీద్‌ను ఓవల్ ఇన్విన్సిబుల్స్ డైరెక్ట్ ఓవర్సీస్ సైనింగ్ ద్వారా దక్కించుకుంది.
కాగా, ద హండ్రెడ్ లీగ్-2025 సీజన్ కోసం ప్లేయర్ల రిటెన్షన్ జాబితాలను ఎనిమిది ఫ్రాంచైజీలు ఇవాళ ప్రకటించాయి. గత సీజన్‌లో తమతో ఉన్న 10 మంది సభ్యులను ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోవచ్చు. రిటెన్షన్ జాబితాలో ఒక ఇంగ్లండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ తప్పక ఉండాలి. అలాగే ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్లు ఉండవచ్చు. అదనంగా ఓ విదేశీ ఆటగాడిని డైరెక్ట్ సైనింగ్ చేసుకోవచ్చు. ఈ పద్దతిలోనే ఇన్విన్సిబుల్స్ రషీద్ ఖాన్‌ను దక్కించుకుంది. ఫ్రాంచైజీల్లో మిగిలిన స్థానాల భర్తీ డ్రాఫ్ట్ ద్వారా జరుగుతుంది. డ్రాఫ్ట్ తేదీ ప్రకటించాల్సి ఉంది.
ద హండ్రెడ్ లీగ్‌లో ఇటీవలే ఐపీఎల్ ఫ్రాంచైజీలు పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఓవల్ ఇన్విన్సిబుల్స్‌లో ముంబై ఇండియన్స్.. నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో లక్నో సూపర్ జెయింట్స్.. సథరన్ బ్రేవ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ షేర్ దక్కించుకున్నాయి. వీటిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీ మొత్తాన్ని కొనుగోలు చేసింది. మిగతా ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆయా ప్రాంచైజీల్లో 49 శాతం వాటాను దక్కించుకున్నాయి.
రిటెన్షన్స్ జాబితా..
బర్మింగ్హమ్ ఫీనిక్స్- బెన్ డకెట్, ట్రెంట్ బౌల్ట్ (ఓవర్సీస్), లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, ఆడమ్ మిల్నే (ఓవర్సీస్), బెన్నీ హోవెల్, టిమ్ సౌథీ (ఓవర్సీస్), డాన్ మౌస్లీ, విల్ స్మీడ్, క్రిస్ వుడ్, ఆనురిన్ డొనాల్డ్
లండన్ స్పిరిట్- లియామ్ డాసన్, డాన్ వారోల్, కేన్ విలియమ్సన్ (ఓవర్సీస్), రిచర్డ్ గ్లీసన్, ఓలీ స్టోన్, ఓలీ పోప్, కీటన్ జెన్నింగ్స్
మాంచెస్టర్ ఒరిజినల్స్- జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్, హెన్రిచ్ క్లాసెన్ (ఓవర్సీస్), మ్యాటీ హర్స్ట్, జోష్ టంగ్, స్కాట్ కర్రీ, టామ్ హార్ట్లీ, సోనీ బేకర్, టామ్ ఆస్పిన్‌వాల్
నార్త్రన్ సూపర్ ఛార్జర్స్- హ్యారీ బ్రూక్, డేవిడ్ మిల్లర్ (ఓవర్సీస్), ఆదిల్ రషీద్, మిచెల్ సాంట్నర్ (ఓవర్సీస్), బ్రైడన్ కార్స్, బెన్ డ్వార్షుయిస్ (ఓవర్సీస్), మాట్ పాట్స్, పాట్ బ్రౌన్, గ్రహం క్లార్క్, టామ్ లాస్
ఓవల్ ఇన్విన్సిబుల్స్- సామ్ కర్రన్, విల్ జాక్స్, రషీద్ ఖాన్ (ఓవర్సీస్), జోర్డన్ కాక్స్, సామ్ బిల్లింగ్స్, సాకిబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, డొనొవన్ ఫెరియెరా (ఓవర్సీస్), నాథన్ సౌటర్, ట్వాండా ముయేయే
సథరన్ బ్రేవ్- జోఫ్రా ఆర్చర్, జేమ్స్ విన్స్, క్రిస్ జోర్డన్, టైమాల్ మిల్స్, డుప్లెసిస్ (ఓవర్సీస్), లూయిస్ డు ప్లూయ్, లారీ ఈవాన్స్, క్రెయిగ్ ఓవర్టన్, ఫిన్ అలెన్ (ఓవర్సీస్), డ్యానీ బ్రిగ్స్, జేమ్స్ కోల్స్
ట్రెంట్ రాకెట్స్- జో రూట్, మార్కస్ స్టోయినిస్ (ఓవర్సీస్), టామ్ బాంటన్, సామ్ కుక్, జాన్ టర్నర్, సామ్ హెయిన్, టామ్ అల్సోప్, కాల్విన్ హ్యారీసన్
వెల్ష్ ఫైర్- జానీ బెయిర్‌స్టో, స్టీవ్ స్మిత్ (ఓవర్సీస్), టామ్ కొహ్లెర్ కాడ్‌మోర్, టామ్ ఏబెల్, లూక్ వెల్స్, స్టీవీ ఎస్కినాజీ
Comments
Please login to add a commentAdd a comment