The Hundred League
-
Hundred League: దీప్తి శర్మ సిక్సర్.. వైరలవుతున్న వీడియో
మహిళల హండ్రెడ్ లీగ్ 2024 ఎడిషన్ ఫైనల్లో వెల్ష్ ఫైర్‌పై లండన్ స్పిరిట్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో వెల్ష్ ఫైర్ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని లండన్ స్పిరిట్ 98వ బంతికి ఛేదించి విజేతగా నిలిచింది. 98వ బంతికి ముందు లండన్ విజయానికి మూడు బంతుల్లో నాలుగు పరుగులు అవసరం కాగా.. దీప్తి శర్మ సిక్సర్ బాది మ్యాచ్‌ను గెలిపించింది. దీప్తి సిక్సర్ కొట్టేప్పుడు లండన్ డగౌట్లో కనిపించి ఆసక్తికర దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. దీప్తి సిక్సర్ కొట్టే సమయంలో సహచరుల ముఖాల్లో కనిపించిన హావభావాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.The reaction of London Spirit dugout when Deepti Sharma smashed the six. 😄👌pic.twitter.com/x1uKDjSSes— Mufaddal Vohra (@mufaddal_vohra) August 18, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. వెల్ష్ ఫైర్ ఇన్నింగ్స్‌లో జెస్ జోనాసెన్ (54), బేమౌంట్ (21), హేలీ మాథ్యూస్ (22) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లండన్ బౌలర్లలో ఈవా గ్రే, సారా గ్లెన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. టారా నోరిస్, దీప్తి శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లండన్.. జార్జియా (34), హీథర్ నైట్ (24), డేనియెలా గిబ్సన్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో 98 బంతుల్లో విజయతీరాలకు చేరింది. వెల్ష్ ఫైర్ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఫ్రేయా డేవిస్, జార్జియా డేవిస్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
హండ్రెడ్ లీగ్ విజేత ఓవల్ ఇన్విన్సిబుల్స్
పురుషుల హండ్రెడ్ లీగ్ విజేతగా ఓవల్ ఇన్విన్సిబుల్స్ అవతరించింది. నిన్న (ఆగస్ట్ 19) జరిగిన ఫైనల్లో ఆ జట్టు సథరన్ బ్రేవ్‌పై 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్విన్సిబుల్స్.. నిర్ణీత 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. విల్ జాక్స్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. సామ్ కర్రన్ 25, జోర్డన్ కాక్స్ 25, టామ్ కర్రన్ 24 పరుగులు చేశారు. సథరన్ బ్రేవ్ బౌలర్లలో టైమాల్ మిల్స్, అకీల్ హొసేన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్ 2, క్రిస్ జోర్డన్ ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సథరన్ బ్రేవ్.. నిర్ణీత బంతుల్లో 130 పరుగులకే పరిమితమై, ఓటమిపాలైంది. అలెక్స్ డేవిడ్ 35, జేమ్స్ విన్స్ 24, క్రెయిగ్ ఓవర్టన్ 22 పరుగులతో సథరన్ బ్రేవ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఇన్విన్సిబుల్స్ బౌలర్లలో సకీబ్ మహమూద్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా 2, నాథన్ సౌటర్, విల్ జాక్స్ తలో వికెట్ పడగొట్టారు. హండ్రెడ్ లీగ్‌ను ఇన్విన్సిబుల్స్ గెలుచుకోవడం వరుసగా ఇది రెండో ఏడాది. ఈ లీగ్ తొలి ఎడిషన్‌ను సథరన్ బ్రేవ్ గెలవగా.. 2022 ఎడిషన్‌ను ట్రెంట్ రాకెట్స్ గెలుచుకుంది. మరోవైపు నిన్ననే జరిగిన మహిళల హండ్రెడ్ లీగ్‌లో లండన్ స్పిరిట్ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు వెల్ష్ ఫైర్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లో..!
హండ్రెడ్ లీగ్‌లో వెల్ష్ ఫైర్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసం సృష్టించాడు. సథరన్ బ్రేవ్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేశాడు. ఫిలిప్స్‌తో పాటు లూక్ వెల్స్ (30 బంతుల్లో 53; 7 ఫోర్లు, సిక్స్), టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (12 బంతుల్లో 23; ఫోర్, 2 సిక్సర్లు), స్టెఫెన్ ఎస్కినాజీ (21 బంతుల్లో 28; 3 ఫోర్లు, సిక్స్), జానీ బెయిర్‌స్టో (11 బంతుల్లో 17; 2 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సథరన్ బ్రేవ్ బౌలర్లలో టైమాల్ మిల్స్ 2, అకీల్ హొసేన్, జోఫ్రా ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, హండ్రెడ్ లీగ్ 2024 నుంచి వెల్ష్ ఫైర్ ఇదివరకు ఎలిమినేట్ అయ్యింది. సథరన్ బ్రేవ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. ఓవల్ ఇన్విన్సిబుల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోగా.. సథరన్ బ్రేవ్‌తో పాటు నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ బర్మింగ్హమ్ ఫీనిక్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచాయి. వెల్ష్ ఫైర్, ట్రెంట్ రాకెట్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్, లండన్ స్పిరిట్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. -
కళ్లుచెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే(వీడియో)
ది హాండ్రడ్ లీగ్-20224లో న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ తన ఫీల్డింగ్ విన్యాసాలను కొనసాగిస్తున్నాడు. ఈ లీగ్‌లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సాంట్నర్ మరోసారి సంచలన క్యాచ్‌తో మెరిశాడు.మంగళవారం(ఆగస్టు 13) లండన్ స్పిరిట్‌తో జరిగిన మ్యాచ్‌లో నమ్మశక్యం కాని క్యాచ్‌ను ఈ కివీ స్టార్ అందుకున్నాడు. సూపర్ క్యాచ్‌తో లండన్ స్పిరిట్ బ్యాటర్ మైఖేల్ పెప్పర్‌ను సాంట్నర్ పెవిలియన్‌కు పంపాడు.లండన్ ఇన్నింగ్స్ 11వ బంతిని పేసర్ రీస్ టాప్లీ.. పెప్పర్‌కు ఫుల్ అండ్ మిడిల్లో సంధించాడు. పెప్పర్ ఆ బంతిని మిడ్ ఆన్ మీదగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో ఈ క్రమంలో మిడాన్‌లో ఉన్న సాంట్నర్ వెనక్కి పరిగెత్తుతూ అద్భుతమైన బ్యాక్వర్డ్ రన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. చివరి క్షణం వరకు బంతిపై తన దృష్టిని కోల్పోకుండా వెనక్కి వెళ్లిన సాంట్నర్.. డైవ్ సంచలన క్యాచ్‌ను తీసుకున్నాడు. ఇది చూసిన బ్యాటర్ ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో లండన్ స్పిరిట్‌పై నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఘన విజయం సాధించింది. Mitchell Santner, that is UNBELIEVABLE 🤯Enjoy every angle of 𝘵𝘩𝘢𝘵 catch 👇#TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/oJupXTP3hR— The Hundred (@thehundred) August 13, 2024 -
ఐదేసిన సౌథీ.. హండ్రెడ్ లీగ్ నుంచి రాకెట్స్ ఔట్
హండ్రెడ్ లీగ్ 2024 పురుషుల ఎడిషన్ చివరి అంకానికి చేరింది. ప్లే ఆఫ్స్‌కు చేరే నాలుగు జట్లపై క్లారిటీ రానప్పటికీ.. టోర్నీ నుంచి నిష్క్రమించే జట్లేవో తేలిపోయాయి. నిన్న బర్మింగ్హమ్ ఫీనిక్స్ చేతిలో ఓటమితో ట్రెంట్ రాకెట్స్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. రాకెట్స్‌తో పాటు వెల్ష్ ఫైర్, మాంచెస్టర్ ఒరిజినల్స్, లండన్ స్పిరిట్ ఈ ఎడిషన్ నుంచి నిష్క్రమించాయి. ఓవల్ ఇన్విన్సిబుల్స్ మాత్రం అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. సథరన్ బ్రేవ్, బర్మింగ్హమ్ ఫీనిక్స్, నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ రేసులో ఉన్నాయి.బర్మింగ్హమ్ ఫీనిక్స్, ట్రెంట్ రాకెట్స్ మధ్య నిన్న (ఆగస్ట్ 12) జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్ టిమ్ సౌథీ (20-13-12-5) ఐదు వికెట్ల ఘనతతో చెలరేగడంతో నిర్ణీత 100 బంతుల్లో 118 పరుగులకు ఆలౌటైంది. రాకెట్స్ ఇన్నింగ్స్‌లో అల్సోప్ (51), ఇమాద్ వసీం (29) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌథీతో పాటు క్రిస్ వుడ్ (20-7-30-2), ఆడమ్ మిల్నే (20-14-17-1) వికెట్లు తీశారు.అనంతరం 119 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఫీనిక్స్.. లివింగ్‌స్టోన్ (30 నాటౌట్), జేకబ్ బేతెల్ (38 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌లతో రాణించడంతో 93 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫీనిక్స్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ 30, మొయిన్ అలీ 13 పరుగులు చేయగా.. జేమీ స్మిత్, డాన్ మౌస్లీ గోల్డెన్ డకౌట్లయ్యారు. రాకెట్స్ బౌలర్లలో లూక్ వుడ్, జాన్ టర్నర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. -
వరుసగా ఐదు సిక్సర్లు.. రషీద్ ఖాన్‌కు చుక్కలు.. చరిత్ర సృష్టించిన పోలార్డ్
హండ్రెడ్ లీగ్‌లో సథరన్ బ్రేవ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విండీస్ దిగ్గజం కీరన్ పోలార్డ్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. నిన్న (ఆగస్ట్ 10) ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన పోలార్డ్.. క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో ఐదు అంతకంటే ఎక్కువ సిక్సర్లు రెండుసార్లు బాదిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు పోలార్డ్ శ్రీలంకతో జరిగిన అంతర్జాతీయ టీ20లో అఖిల ధనంజయం బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. తాజాగా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఓ సెట్లో (హండ్రెడ్ లీగ్‌లో ఐదు బంతులను ఓ సెట్‌గా పరిగణిస్తారు) ఐదుకు ఐదు సిక్సర్లు కొట్టాడు. పొట్టి క్రికెట్లో రషీద్‌ను ఈ స్థాయిలో చితక్కొట్టిన బౌలర్ కూడా లేడు. ఈ మ్యాచ్‌కు ముందు రషీద్ బౌలింగ్‌లో ఓ ఓవర్లో అత్యధికంగా నాలుగు సిక్సర్లు మాత్రమే వచ్చాయి. Kieron Pollard against yellow teams. 🥶- Rashid Khan taken to the cleaners, 5 sixes in a row. 🤯pic.twitter.com/CjrB63JwWD— Mufaddal Vohra (@mufaddal_vohra) August 11, 20242016 టీ20 వరల్డ్‌కప్‌లో ఏబీ డివిలియర్స్ రషీద్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. 2018 ఐపీఎల్లో క్రిస్ గేల్, 2023 సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మార్కో జన్సెన్, 2024 ఐపీఎల్లో విల్ జాక్స్ రషీద్ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదారు.మ్యాచ్ విషయానికొస్తే.. స్వల్ప లక్ష్య ఛేదనలో నిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పోలార్డ్.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఒక్కసారిగా గేర్ మార్చి సిక్సర్ల వర్షం కురిపించాడు. 127 పరుగుల ఛేదనలో 14 బంతులు ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే చేసిన పోలార్డ్.. రషీద్ వేసిన 16వ సెట్లో పూనకం వచ్చినట్లు ఊగిపోయి ఐదు సిక్సర్లు బాదాడు. 20 బంతుల్లో తన జట్టు విజయానికి 49 పరుగులు అవసరం కాగా.. పోలార్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రషీద్ బౌలింగ్‌ను ఊచకోత కోసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 23 బంతులు ఎదుర్కొన్న పోలార్డ్ 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. పోలార్డ్ విధ్వంసం ధాటికి బ్రేవ్ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. -
'మెరుపు తీగ' మంధన.. కళ్లు చెదిరే రనౌట్
మహిళల హండ్రెడ్ లీగ్‌లో సథరన్ బ్రేవ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధన కళ్లు చెదిరే రీతిలో ఓ అద్భుతమైన రనౌట్ చేసింది. ట్రెంట్ రాకెట్స్‌తో నిన్న (ఆగస్ట్ 10) జరిగిన మ్యాచ్‌లో మంధన.. బ్రైవోని స్మిత్‌ను డైరెక్ట్ త్రోతో పెవిలియన్ బాట పట్టించింది. మంధన మెరుపు విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరవలవుతంది. ఇన్నింగ్స్ తొలి బంతికే మంధన స్మిత్‌ను పెవిలియన్‌కు పంపడం విశేషం.A direct hit by Smriti Mandhana! 🎯pic.twitter.com/FIlRG1Jo4g— CricTracker (@Cricketracker) August 10, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ నాట్ సీవర్ బ్రంట్ (60 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రాకెట్స్ ఇన్నింగ్స్‌లో గ్రేస్ స్క్రీవెన్స్ (36) ఓ మోస్తరు పరుగులు చేయగా.. నటాషా (12), గార్డ్నర్ (18), హీథర్ గ్రహం (15) రెండంకెల స్కోర్లు చేశారు. సథరన్ బ్రేవ్ బౌలర్లలో లారెన్ బెల్ 3, లారెన్ చియాటిల్, ఆడమ్స్, క్లో టైరాన్ తలో వికెట్ పడగొట్టారు.156 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రేవ్.. నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. స్మృతి మంధన (27 బంతుల్లో 42; 7 ఫోర్లు), క్లో టైరాన్ (31 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వీరిద్దరు మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ జార్జియా ఆడమ్స్ 29 బంతులు ఎదుర్కొని 27 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాకెట్స్ బౌలర్లలో స్టోన్‌హౌస్ 2, ఆష్లే గార్డ్నర్, హీథర్ గ్రహం తలో వికెట్ పడగొట్టారు. -
సామ్ కర్రన్ ఆల్‌రౌండ్ షో
హండ్రెడ్ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఆటగాడు సామ్ కర్రన్ అద్భుత ఫామ్ కొనసాగుతుంది. ఈ టోర్నీలో బ్యాట్‌తో, బంతితో చెలరేగిపోతున్న సామ్.. తాజాగా మరోసారి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. సథరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో సామ్.. తొలుత బంతితో (20-7-28-2), ఆతర్వాత బ్యాట్‌తో (18 బంతుల్లో 35; 5 సిక్సర్లు) చెలరేగి తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో సామ్ సోదరుడు టామ్ కూడా రాణించాడు. టామ్ నాలుగు వికెట్లు తీసి సథరన్ బ్రేవ్ పతనాన్ని శాశించాడు. సామ్, టామ్ బంతిలో సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్రేవ్ ఇన్నింగ్స్‌లో జేమ్స్ విన్స్ (39 బంతుల్లో 52; 6 ఫోర్లు, సిక్స్) ఒక్కడే రాణించాడు. అలెక్స్ డేవిస్ (5), ఆండ్రీ ఫ్లెచర్ (1), లూస్ డి ప్లూయ్ (4), లారీ ఈవాన్స్ (4), కీరన్ పోలార్డ్ (18), జోఫ్రా ఆర్చర్ (10), అకీల్ హొసేన్ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఇన్విన్సిబుల్స్ బౌలర్లలో సామ్, టామ్‌తో పాటు విల్ జాక్స్, ఆడమ్ జంపా తలో వికెట్ తీశారు.119 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్.. సామ్ కర్రన్, జోర్డన్ కాక్స్ (29 బంతుల్లో 46 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) రాణించడంతో 85 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇన్విన్సిబుల్స్ ఇన్నింగ్స్‌లో విల్ జాక్స్ 6, డేవిడ్ మలాన్ 14, సామ్ బిల్లింగ్స్ 5 పరుగులు చేసి ఔటయ్యారు. బ్రేవ్ బౌలర్లలో క్రెయిగ్ ఓవర్టన్, టైమాల్ మిల్స్, క్రిస్ జోర్డన్, అకీల్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు. -
సామ్ కర్రన్ ఆల్‌రౌండ్ షో.. మెరుపు హాఫ్ సెంచరీ.. హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు
మెన్స్ హండ్రెడ్ లీగ్ 2024లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఆటగాడు సామ్ కర్రన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. లండన్ స్పిరిట్‌తో నిన్న (ఆగస్ట్ 4) జరిగిన మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో (22 బంతుల్లో 51 నాటౌట్; 6 సిక్సర్లు) పాటు హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ప్రదర్శన (20-11-16-5) నమోదు చేశాడు. సామ్ కర్రన్ వీర లెవెల్లో విజృంభించడంతో ఇన్విన్సిబుల్స్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హండ్రెడ్ లీగ్‌లో సామ్ కర్రన్ నమోదు చేసిన హ్యాట్రిక్ మూడవది. సామ్‌కు ముందు టైమాల్ మిల్స్, ఇమ్రాన్ తాహిర్ హ్యాట్రిక్ వికెట్లు తీశారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సామ్ కర్రన్‌తో పాటు డేవిడ్ మలాన్ (38) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. విల్ జాక్స్ (2), జోర్డన్ కాక్స్ (14), డొనోవన్ ఫెరియెరా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సామ్ బిల్లింగ్స్ 17 పరుగుల వద్ద రిటైర్డ్ అయ్యాడు. లండన్ బౌలర్లు ఓలీ స్టోన్, లియామ్ డాసన్, నాథన్ ఇల్లిస్, క్రిచ్లీ తలో వికెట్ పడగొట్టారు.148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లండన్ స్పిరిట్.. 95 బంతుల్లో 117 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. సామ్ కర్రన్ హ్యాట్రిక్ వికెట్లు సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. ఆడమ్ జంపా 3, విల్ జాక్స్, నాథన్ సౌటర్ తలో వికెట్ పడగొట్టారు. లండన్ ఇన్నింగ్స్‌లో కైల్ పెప్పర్ (20), డానియల్ లారెన్స్ (27), హెట్‌మైర్ (20) మాత్రమే 20 అంతకంటే ఎక్కువ పరుగులు స్కోర్ చేశారు.నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌పై నార్త్ర్నన్ సూపర్ ఛార్జర్స్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ ఛార్జర్స్.. నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఒరిజినల్స్ 100 బంతుల్లో 153 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. మాథ్యూ హర్స్ట్ (78) ఒరిజినల్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (58) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
విధ్వంసం సృష్టించిన పూరన్
హండ్రెడ్ లీగ్‌లో భాగంగా సథరన్ బ్రేవ్‌తో నిన్న (జులై 30) జరిగిన మ్యాచ్‌లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సథరన్ బ్రేవ్.. నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. అలెక్స్ డేవిస్ (28), జేమ్స్ కోల్స్ (26), కీరన్ పోలార్డ్ (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సూపర్ ఛార్జర్స్ బౌలర్లలో పార్కిన్సన్ 2, జోర్డన్ క్లార్క్, పాట్స్, సాంట్నర్, ఆదిల్ రషీద్, షార్ట్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్ ఛార్జర్స్.. నికోలస్ పూరన్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో (34 బంతుల్లో 62; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడటంతో 85 బంతుల్లోనే విజయతీరాలకు చేరింది. హ్యారీ బ్రూక్ (20 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సథరన్ బ్రేవ్ బౌలర్లలో అకీల్ హొసేన్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డన్ తలో వికెట్ పడగొట్టారు.నార్త్రన్ సూపర్ ఛార్జర్స్, సథరన్ బ్రేవ్ మధ్య నిన్న జరిగిన మహిళల హండ్రెడ్ లీగ్ మ్యాచ్ టైగా ముగిసింది. ఇరు జట్లు నిర్ణీత 100 బంతుల్లో 100 పరుగులు చేశారు. హండ్రెడ్ లీగ్‌లో సూపర్ ఓవర్ రూల్ లేకపోవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. -
హండ్రెడ్ లీగ్‌లో రసవత్తర సమరం.. పరుగు తేడాతో రషీద్ ఖాన్ టీమ్ విజయం
హండ్రెడ్ లీగ్ 2024లో నిన్న (జులై 29) ఓ రసవత్తర సమరం జరిగింది. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్ రాకెట్స్ పరుగు తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో మాంచెస్టర్ గెలుపుకు చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. క్రీజ్‌లో ఓపెనింగ్ బ్యాటర్ మ్యాక్స్ హోల్డన్ ఉన్నాడు. జోర్డన్ థాంప్సన్ బౌలింగ్ చేస్తున్నాడు. మామూలు షాట్ ఆడినా ఓ పరుగు సులువుగా వచ్చేది. అయితే హోల్డన్ భారీ షాట్‌తో మ్యాచ్ ముగిద్దామని ప్రయత్నించి సామ్ హెయిన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా రాకెట్స్ మ్యాచ్‌ను చేజార్చుకుంది. 2 runs needed off 1 ball and then this happened 🤯🤯🤯The craziest match of the year already 🔥#TheHundred #tapmad #HojaoADFree pic.twitter.com/2ByQfycxNJ— Farid Khan (@_FaridKhan) July 29, 2024ఈ మ్యాచ్‌లో రాకెట్స్ సునాయాసంగా గెలవాల్సింది. చివరి ఐదు బంతుల్లో ఆ జట్టు ఆరు పరుగులు చేస్తే గెలిచి ఉండేది. సికందర్ రజా తొలి రెండు బంతులకు రెండు డబుల్స్ తీసి రాకెట్స్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. మూడో బంతికి పరుగు రాకపోగా.. నాలుగో బంతికి సికందర్ రజా రనౌటయ్యాడు. దీంతో చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి వచ్చింది. జోర్డన్ థాంప్సన్ లెంగ్త్ డెలివరిని వేయగా హోల్డన్ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి బ్యాక్వర్డ్ స్వేర్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్.. నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. టామ్ బాంటన్ (45), రోవ్‌మన్ పావెల్ (27), రషీద్ ఖాన్ (15 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మాంచెస్టర్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 3, సికందర్ రజా 2, పాల్ వాల్టర్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో మాంచెస్టర్ 100 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులకు పరిమితమైంది. ఫలితంగా రాకెట్స్ పరుగు తేడాతో విజయం సాధించింది. మాంచెస్టర్ ఇన్నింగ్స్‌లో హెల్డన్ (40) టాప్ స్కోరర్‌గా కాగా.. మ్యాడ్సన్ (28), వాల్టర్ (29), సికందర్ రజా (21) ఓ మోస్తరు పరుగులు చేశారు. రాకెట్స్ బౌలర్లలో ఇమాద్ వసీం, రషీద్ ఖాన్, సామ్ కుక్ తలో 2 వికెట్లు, థాంప్సన్ ఓ వికెట్ పడగొట్టారు.నిన్ననే ఇరు జట్ల మధ్య జరిగిన మహిళల మ్యాచ్‌లో ఫలితం రివర్స్ అయ్యింది. ట్రెంట్ రాకెట్స్‌పై మాంచెస్టర్ ఒరిజినల్స్ పరుగు తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ నిర్ణీత 100 బంతుల్లో 137 పరుగులు చేయగా.. రాకెట్స్ 100 బంతుల్లో 136 పరుగులకే ఓటమిపాలైంది. -
రాణించిన ఆడమ్ జంపా.. ఘనంగా బోణీ కొట్టిన డిఫెండింగ్ ఛాంప్స్
ద హండ్రెడ్ లీగ్ 2024 ఎడిషన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఘనంగా బోణీ కొట్టింది. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో బర్మింగ్హమ్ ఫీనిక్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫీనిక్స్.. 81 బంతుల్లో 89 పరుగులకే ఆలౌటైంది. ఆడమ్ జంపా (20-10-11-3) ఫీనిక్స్ పతనాన్ని శాశించగా.. మొహమ్మద్ ఆమిర్, సకీబ్ మహమూద్, విల్ జాక్స్ తలో రెండు వికెట్లు, నాథన్ సౌటర్ ఓ వికెట్ దక్కించుకున్నారు. ఫీనిక్స్ ఇన్నింగ్స్‌లో రిషి పటేల్ (25), బెన్నీ హోవెల్ (24), బెతెల్ (22) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్ కేవలం 69 బంతుల్లోనే విజయతీరాలకు (2 వికెట్ల నష్టానికి) చేరింది. విల్ జాక్స్ 6, తువండ మెయేయే 23 పరుగులు చేసి ఔట్ కాగా.. డేవిడ్ మలాన్ (24), సామ్ బిల్లింగ్స్ (31) అజేయంగా నిలిచారు. ఫీనిక్స్ బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టాడు.కాగా, ఫీనిక్స్, ఇన్విన్సిబుల్స్ జట్లు నిన్ననే ప్రారంభమైన మహిళల హండ్రెడ్ లీగ్‌లోనూ పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లోనూ ఫీనిక్స్‌పై ఇన్విన్సిబుల్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఫీనిక్స్ 92 బంతుల్లో 105 పరుగులు చేసి ఆలౌటైంది. తద్వారా ఇన్విన్సిబుల్స్ 45 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇన్విన్సిబుల్స్ ఇన్నింగ్స్‌లో పేజ్ స్కోల్ఫీల్డ్ (71), అలైస్ క్యాప్సీ (52) అర్ద సెంచరీలతో రాణించగా.. ఫీనిక్స్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు మాత్రమే 20 పరుగుల మార్కును దాటగలిగారు. ఇన్విన్సిబుల్స్ బౌలర్లలో అమండ 3, మ్యాడీ విల్లియర్స్ 2, మారిజన్ కాప్, సోఫీ స్మేల్, ర్యానా మెక్ డొనాల్డ్ గే తలో వికెట్ దక్కించుకున్నారు. -
‘ఐపీఎల్ ఆడతానో.. లేదో తెలియదు’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ద హండ్రెడ్(వంద బంతుల లీగ్) లీగ్‌లో తాను ఆడుతున్నానంటూ వచ్చిన వార్తలను టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఖండించాడు. ఆ లీగ్‌లో తాను ప్రాతినిథ్యం వహించడం లేదని వివరణ ఇచ్చుకునే యత్నం చేశాడు. ‘ నేను ఆ లీగ్‌లో ఆడటానికి ఆసక్తిగా లేను. అయినప్పటికీ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతానో.. లేదో తెలియదు. ఒకవేళ ఐపీఎల్ ఆడతావా.. లేక ద హండ్రెడ్ ఆడతావా అంటే ఐపీఎల్‌కే మొగ్గుచూపుతా. ఒకవేళ వచ్చే సీజన్లో సీఎస్కే నాకు అవకాశం ఇస్తే కచ్చితంగా ఆ జట్టుకు ఆడతా. నాకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిబంధనలు తెలుసు. నేను వాటిని తప్పకుండా అనుసరిస్తా. నేను అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి ద హండ్రెడ్ ఆడాల్సిన అవసరం నాకు ప్రస్తుతం లేదు. దాంతో నేనేమీ రిటైర్మెంట్ ప్రకటించడం లేదు’ అని భజ్జీ పేర్కొన్నాడు. 2016లో చివరిసారి భారత జెర్సీ ధరించిన హర్భజన్ సింగ్.. గత రెండేళ్ల నుంచి ఐపీఎల్లో సీఎస్కే తరఫున ఆడుతున్నాడు. గత సీజన్లో హర్భజన్ 16 వికెట్లు సాధించాడు. వచ్చే ఏడాది వంద బంతుల క్రికెట్‌ను నిర్వహించడానికి ఈసీబీ రంగం సిద్ధం చేయగా, అందులో హర్భజన్ సింగ్ పాల్గొనడానికి సంసిద్ధత వ్యక్తం చేశాడని వార్తలు వచ్చాయి. ద హండ్రెడ్ లీగ్‌ను గురువారం అధికారికంగా లాంచ్ చేయగా, పలువురు ఆటగాళ్లు పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో భారత్ నుంచి హర్భజన్ సింగ్ పేరు వినిపించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పందిస్తూ.. రిటైర్మెంట్ కాని ఆటగాళ్లు ఎవరికీ విదేశీ లీగ్ ఆడటానికి అనుమతి ఇవ్వడం లేదనే విషయాన్ని స్పష్టం చేసింది. అదే సమయంలో హర్భజన్ సింగ్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ బీసీసీఐ నియమావళిని గౌరవిస్తానని పేర్కొన్నాడు. -
హర్భజన్ రిస్క్ చేస్తున్నాడా?
న్యూఢిల్లీ: భారత క్రికెట్ వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రిస్క్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకు కారణం ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్(ఈసీబీ) నిర్వహించనున్న ‘ ద హండ్రెడ్’ లీగ్ కారణంగా తెలుస్తోంది. వచ్చే ఏడాది వంద బంతుల క్రికెట్‌ను నిర్వహించడానికి ఈసీబీ రంగం సిద్ధం చేయగా, అందులో హర్భజన్ సింగ్ పాల్గొనడానికి సంసిద్ధత వ్యక్తం చేశాడని సమాచారం. ద హండ్రెడ్ లీగ్‌ను గురువారం అధికారికంగా లాంచ్ చేయగా, పలువురు ఆటగాళ్లు పేర్లు తెరపైకి వచ్చాయి. దీనిలో భాగంగా భారత్ నుంచి హర్భజన్ సింగ్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ప్రధానంగా భారత పురుష క్రికెటర్లు విదేశీ టీ20 లీగ్‌లో ఆడటానికి ఇంకా బీసీసీఐ అనుమతి ఇవ్వని నేపథ్యంలో హర్భజన్ పేరు రావడం చర్చనీయాంశంగా మారింది. దీనిలో భాగంగా ద హండ్రెడ్ లీగ్‌లో హర్భజన్ సింగ్ పాల్గొనడానికి తమ నుంచి ఎటువంటి అనుమతులు లేవని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) స్పష్టం చేయడంతో ఈ వెటరన్ ఆడటానికి మొగ్గుగా ఉన్నాడని వాదనకు బలం చేకూరుస్తుంది. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)కు ప్రాతినిథ్యం వహిస్తున్న భజ్జీ.. ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పలేదు. భారత్‌కు జట్టుకు ఆడి దాదాపు మూడేళ్లు అయినప్పటికీ ఇంకా తన రిటైర్మెంట్ను ప్రకటించలేదు హర్భజన్. ఒకవేళ హర్భజన్ సింగ్ ద హండ్రెడ్ లీగ్‌లో ఆడదల్చుకుంటే ముందుగా తన రిటైర్మెంట్ను ప్రకటించాల్సి ఉంది. అది కూడా వచ్చే ఏడాది ఐపీఎల్ ఆరంభానికి ముందే తన అంతర్జాతీయ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అసలు ద హండ్రెడ్ లీగ్ అంటే ఏమిటి.. క్రికెట్ కొత్త పుంతలు తొక్కించాలనే ప్రయత్నమే ద హండ్రెడ్ రావడానికి కారణం. 2020లో నిర్వహించ తలపెట్టిన 8 జట్ల దేశవాళీ టోర్నీలో వంద బంతుల టోర్నీ నిర్వహించాలని ఈసీబీ నిర్ణయించింది. ఈ మేరకు కొంతకాలం క్రితమే తమ నిర్ణయాన్ని వెల్లడించింది. వంద బంతుల ఫార్మాట్లో 15 సాధారణ ఓవర్లు ఉంటే.. ఒక్క ఓవర్లో మాత్రం పది బంతులు ఉంటాయి. ట్వంటీ20 ఫార్మాట్ కన్నా ఇందులో ఓవరాల్‌గా 40 బంతులు తక్కువగా వేస్తారు. దాదాపు రెండున్నర గంటల సమయం తగ్గుతుంది. బంతులు తక్కువగా ఉండటంతో పాటు క్రికెట్ మరింత రసవత్తరంగా మారుతుంది. ఎన్ఓసీ ఇంకా కోరలేదు.. తాజా వార్తలపై బీసీసీఐ స్పందించింది. ‘ మా నుంచి హర్భజన్ సింగ్ ఎటువంటి ఎన్ఓసీ సర్టిఫికేట్ కోరలేదు. బీసీసీఐ రూల్స్ ప్రకారం హర్భజన్ సింగ్ ఏ లీగ్ కోసం పేరును ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే అది బీసీసీఐకి వ్యతిరేకం’ అని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇదిలా ఉంచితే, ఇటీవల కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20లో యువరాజ్ సింగ్ ఆడాడు. అది కూడా అతను అంతర్జాతీయ టీ20 తర్వాత మాత్రమే జరిగింది. అంతర్జాతీయ క్రికెట్‌తో బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్‌కు కూడా యువీ వీడ్కోలు చెప్పడంతోనే విదేశీ లీగ్‌లో ఆడే అవకాశం యువీకి దక్కింది. ఇలా చూస్తూ భజ్జీ కూడా దీన్ని అనుసరించక తప్పదు. ద హండ్రెడ్‌లో ఆడాలనుకుంటే మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడంతో పాటు ఐపీఎల్‌ను కూడా వదులుకోవాలి. గత ఐపీఎల్లో భజ్జీకి సీఎస్కే చెల్లించిన మొత్తం రూ. 2 కోట్లు. అతన్ని కనీస ధరకే సీఎస్కే దక్కించుకుంది. అంటే భజ్జీ రిస్క్ చేయదలుచుకుంటే ఐపీఎల్ ద్వారా సంపాదించే అవకాశాన్ని కోల్పోవాలి.