Hundred League: దీప్తి శర్మ సిక్సర్‌.. వైరలవుతున్న వీడియో | Women's Hundred League 2024 Final: Reaction Of London Spirit Dugout When Deepti Sharma Smashed Six | Sakshi
Sakshi News home page

Hundred League: దీప్తి శర్మ సిక్సర్‌.. వైరలవుతున్న వీడియో

Published Mon, Aug 19 2024 12:16 PM | Last Updated on Mon, Aug 19 2024 12:22 PM

Women's Hundred League 2024 Final: Reaction Of London Spirit Dugout When Deepti Sharma Smashed Six

మహిళల హండ్రెడ్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌ ఫైనల్లో వెల్ష్‌ ఫైర్‌పై లండన్‌ స్పిరిట్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొంది ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో వెల్ష్‌ ఫైర్‌ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని లండన్‌ స్పిరిట్‌ 98వ బంతికి ఛేదించి విజేతగా నిలిచింది. 98వ బంతికి ముందు లండన్‌ విజయానికి మూడు బంతుల్లో నాలుగు పరుగులు అవసరం కాగా.. దీప్తి శర్మ సిక్సర్‌ బాది మ్యాచ్‌ను గెలిపించింది. 

దీప్తి సిక్సర్‌ కొట్టేప్పుడు లండన్‌ డగౌట్‌లో కనిపించి ఆసక్తికర దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. దీప్తి సిక్సర్‌ కొట్టే సమయంలో సహచరుల ముఖాల్లో కనిపించిన హావభావాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెల్ష్‌ ఫైర్‌ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. వెల్ష్‌ ఫైర్‌ ఇన్నింగ్స్‌లో జెస్‌ జోనాసెన్‌ (54), బేమౌంట్‌ (21), హేలీ మాథ్యూస్‌ (22) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లండన్‌ బౌలర్లలో ఈవా గ్రే, సారా గ్లెన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. టారా నోరిస్‌, దీప్తి శర్మ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లండన్‌.. జార్జియా (34), హీథర్‌ నైట్‌ (24), డేనియెలా గిబ్సన్‌ (22) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో 98 బంతుల్లో విజయతీరాలకు చేరింది. వెల్ష్‌ ఫైర్‌ బౌలర్లలో షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. ఫ్రేయా డేవిస్‌, జార్జియా డేవిస్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement