
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఓటమి పాలైంది. సన్‌రైజర్స్ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 6 ఓటుమలతో తమ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో తొమ్మిదివ స్ధానంలో కొనసాగుతోంది. కాగా ఎస్ఆర్‌హెచ్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ అనంతరం భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్,అమిత్ మిశ్రాలు క్రిక్‌బజ్ లైవ్ షోలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా అమిత్ మిశ్రాకు సెహ్వాగ్ కౌంటరిచ్చాడు.
అసలేమి జరిగిందంటే?
పోస్ట్ మ్యాచ్ లైవ్ షోలో మిశ్రా, సెహ్వాగ్‌లు సన్‌రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు గురించి చర్చించారు. అయితే మిశ్రా మాత్రం ఈ అంశం నుండి దృష్టి మరల్చి, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు ప్లేఆఫ్‌కు చేరుకునే వారి అవకాశాల గురించి మాట్లాడాడు.
"సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు చేరడం దాదాపు అసాధ్యం అనుకుంటున్నాను. వారు ప్రస్తుతం ఆడుతున్న క్రికెట్ బ్రాండ్ ప్రకారం.. వరుసగా ఆరు మ్యాచ్‌లను గెలవడం కష్టం. ఒకవేళ గెలవాలంటే చెన్నై అన్ని విభాగాల్లోనూ బాగా రాణించాలి. ధోని బ్యాటింగ్‌కు వస్తే కనీసం 30 బంతులు ఆడాలి. వారి టాప్ ఆర్డర్ కూడా రాణించాలి" అని మిశ్రా పేర్కొన్నాడు.
వెంటనే సెహ్వాగ్ జోక్యం చేసుకుని ప్రశ్న సీఎస్‌కే గురుంచి కాదు, ఎస్ఆర్‌హెచ్ గురించి అని మిశ్రాతో అన్నాడు. దీంతో మిశ్రా వెంటనే క్షమాపణలు చెప్పాడు. అందుకు ఇదంతా ధోనికి ఉన్న పేరు వల్లే అంటూ సెహ్వాగ్ సమాధానమిచ్చాడు.
చదవండి: అతడొక అద్భుతం.. రెండేళ్లలో టీమిండియాకు ఆడుతాడు: శాంసన్