viral videos
-
హైదరాబాద్- బీజాపూర్ రహదారిపై ఓ విద్యార్థి విన్యాసం
-
World Kindness Day 2024 : హృదయాన్ని కదిలించే వీడియోలు!
ప్రపంచ దయ దినోత్సవాన్ని (World Kindness Day ) ఏటా నవంబర్ 13న జరుపుకుంటారు. వ్యక్తులుగా ఒకరిపట్ల ఒకరు, తమ పట్ల , వారి చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల దయ చూపేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశం. మానవులుగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ, తోటివారితోపాటు ఈ ప్రకృతి, జంతువుల పట్ల ప్రేమతో, దయతో కృతజ్ఞతగా ఉండడంలోని ప్రాధాన్యతను గుర్తించే రోజు ప్రపంచ దయ దినోత్సవం. చుట్టూ ఉన్న సమాజం పట్ల దయతో ఉండటం మనుషులుగా మనందరి ప్రాథమిక లక్షణం,ప్రపంచ దయ దినోత్సవం: చరిత్రవరల్డ్ కైండ్‌నెస్ డేని 1998లో వరల్డ్ కైండ్‌నెస్ మూవ్మెంట్ ప్రారంభించింది. సామరస్య ప్రపంచాన్ని సృష్టించడంలో దయ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం లక్ష్యం. 1997లో జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన మొదటి ప్రపంచ దయ ఉద్యమ సదస్సు తర్వాత ప్రపంచ దయ ఉద్యమం ఏర్పడింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్‌గా మారాయి.మనసు అందరికీ ఉంటుందికానీ అది గొప్పగా కొందరికి మాత్రమే ఉంటుంది..❤️✨#WorldKindnessDay2024 pic.twitter.com/MwM1NRPexm— Do Something For 👉Better Society ✊ (@ChitraR09535143) November 13, 2024 It is called true happiness which gives peace to the heart and smile to the faces. In fact, the beauty of nature lies in its precious creations, animals and birds. Make your contribution in protecting nature, environment, animals, birds and creatures.#WorldKindnessDay2024 pic.twitter.com/kpXDNaRRZ8— Munesh Kumar Ghunawat (@GhunawatMunesh) November 13, 2024 -
సూపర్ క్యాచ్.. వైరల్ వీడియో
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2024లో ఓ సూపర్ క్యాచ్ నమోదైంది. తోయమ్ హైదరాబాద్, మణిపాల్ టైగర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఈ సూపర్ క్యాచ్‌కు వేదికైంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు షాన్ మార్ష్ ఆడిన భారీ షాట్‌ను టైగర్స్ ఆటగాడు ఏంజెలో పెరీరా అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. గుణరత్నే బౌలింగ్‌లో పెరీరా ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది.A great juggling catch by Angelo Perera in the LLC. 😄 pic.twitter.com/t5GyFNJ4hb— Mufaddal Vohra (@mufaddal_vohra) October 4, 2024మ్యాచ్ విషయానికొస్తే.. మణిపాల్ టైగర్స్, తోయమ్ హైదరాబాద్ మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ 'టై'గా (ఇరు జట్ల స్కోర్లు సమం) ముగియడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో హైదరాబాద్‌పై మణిపాల్ టైగర్స్ విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. తిసార పెరీరా మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి టైగర్స్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఏంజెలో పెరీరా (18), పియెనార్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో గురుకీరత్ సింగ్, బిపుల్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. ఉడాన, నువాన్ ప్రదీప్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్లు కోల్పోయి టైగర్స్ చేసినన్ని పరుగులే (144) చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. హైదరాబాద్‌ను గెలిపించేందుకు స్టువర్ట్ బిన్నీ (20 నాటౌట్), గురుకీరత్ సింగ్ మాన్ (37 నాటౌట్), షాన్ మార్ష్ (38) విఫలయత్నం చేశారు.సూపర్ ఓవర్ సాగిందిలా..సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన తోయమ్ హైదరాబాద్ వికెట్ నష్టానికి కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఐదు పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మణిపాల్ టైగర్స్ మూడు బంతుల్లోనే విజయతీరాలకు చేరింది. బిపుల్ శర్మ బౌలింగ్‌లో డేనియల్ క్రిస్టియన్ సిక్సర్ బాది టైగర్స్‌ను గెలిపించాడు.చదవండి: డబుల్ సెంచరీ చేజార్చుకున్న అభిమన్యు ఈశ్వరన్ -
IND vs BAN: కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న సిరాజ్.. వైరల్ వీడియో
భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు దూకుడు ప్రదర్శించారు. 107/3 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. బుమ్రా (3/50), సిరాజ్ (2/57), అశ్విన్ (2/45), ఆకాశ్‌దీప్ (2/43), జడేజా (1/28) ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌటైంది. మొమినుల్ హక్ అజేయ సెంచరీతో (107) బంగ్లాదేశ్‌ను ఆదుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో జకీర్ హసన్ 0, షద్మాన్ ఇస్లాం 24, నజ్ముల్ హసన్ షాంటో 31, ముష్ఫికర్ రహీం 11, లిట్టన్ దాస్ 13, షకీబ్ అల్ హసన్ 9, మెహిది హసన్ మిరాజ్ 20, తైజుల్ ఇస్లాం 5, హసన్ మహమూద్ 1, ఖలీద్ అహ్మద్ 0 పరుగులు చేసి ఔటయ్యారు.నిప్పులు చెరిగిన బుమ్రానాలుగో రోజు ఆటలో బుమ్రా చెలరేగిపోయాడు. ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ముష్ఫికర్ రహీంను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా, ఆతర్వాత మెహిది హసన్, తైజుల్ ఇస్లాంలను పెవిలియన్‌కు పంపాడు. బుమ్రా ధాటికి బంగ్లా బ్యాటింగ్ లైనప్ విలవిలలాడిపోయింది.WHAT A BLINDER BY CAPTAIN ROHIT SHARMA. 🔥- Captain Rohit leads by example for India...!!!! 🙌 pic.twitter.com/XqJORqHvF6— Tanuj Singh (@ImTanujSingh) September 30, 2024రోహిత్ సూపర్ క్యాచ్నాలుగో రోజు తొలి సెషన్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సూపర్ క్యాచ్ పట్టుకున్నాడు. సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్ నమ్మశక్యం కాని రీతిలో గాల్లోకి ఎగురుతూ అద్బుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. రోహిత్ విన్యాసం చూసి గ్రౌండ్లో ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు.• @fairytaledustt_ pic.twitter.com/yqDDcJcTCq— V. (@was_fairytale) September 30, 2024కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న సిరాజ్నాలుగో రోజు ఆటలో భారత ఫీల్డర్లు రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టుకున్నారు. తొలుత లిట్టన్ దాస్ క్యాచ్‌ను రోహిత్.. ఆతర్వాత షకీబ్ క్యాచ్‌ను సిరాజ్ నమ్మశక్యం కాని రీతిలో అద్భుతమైన క్యాచ్‌లుగా మలిచారు. షకీబ్ క్యాచ్‌ను సిరాజ్ వెనక్కు పరిగెడుతూ సూపర్ మ్యాన్‌లా అందుకున్నాడు. రోహిత్, సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. కాగా, వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో రెండు, మూడు రోజుల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే.చదవండి: IPL 2025: ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్లు వీరే..? -
మరో రైలు ప్రమాదానికి భారీ కుట్ర..
-
రిషబ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్.. వైరల్ వీడియో
బెంగళూరు వేదికగా జరిగిన దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా-బి వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. నవ్‌దీప్ బౌలింగ్‌లో పంత్ లెగ్ సైడ్ దిశగా వెళ్తున్న బంతిని పక్షిలా గాల్లో ఎగిరి సూపర్ క్యాచ్‌గా మలిచాడు. పంత్ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. పంత్ పట్టుకున్న క్యాచ్ ఇండియా-ఏ బ్యాటర్ ఆవేశ్ ఖాన్‌ది. Flying Rishabh Pant with a terrific catch. 🙇♂️pic.twitter.com/kmwmextgKx— Mufaddal Vohra (@mufaddal_vohra) September 8, 2024ఈ మ్యాచ్‌లో పంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఇండియా-బి.. ఇండియా-ఏపై 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం చేసి ఇండియా-బి విజయానికి పునాది వేసిన ముషీర్ ఖాన్‌కు (181) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులకు ఆలౌటైంది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును ముషీర్ ఖాన్, నవ్‌దీప్ సైనీ (56) ఆదుకున్నారు. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్‌దీప్ 4, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ తలో 2, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు.ఇండియా-బి బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌటైంది. ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైనీ తలో 3, సాయికిషోర్ 2, యశ్ దయాల్, సుందర్ చెరో వికెట్ పడగొట్టారు. ఇండియా-ఏ ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఇండియా-ఏ బౌలర్ ఆకాశ్‌దీప్ ఐదు వికెట్లతో రాణించడంతో ఇండియా-బి రెండో ఇన్నింగ్స్‌లో 184 పరుగులకు ఆలౌటైంది. ఖలీల్ అహ్మద్ 3, ఆవేశ్ ఖాన్, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (61), సర్ఫరాజ్ ఖాన్ (46) మాత్రమే రాణించారు. వికెట్‌కీపర్ ధృవ్ జురెల్ ఏడు క్యాచ్‌లు పట్టుకున్నాడు.275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-ఏ.. 198 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (57) ఇండియా-ఏను ఆదుకునేందుకు విఫలయత్నం చేశాడు. ఆఖర్లో ఆకాశ్‌దీప్ (43) వేగంగా పరుగులు సాధించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇండియా-బి బౌలర్లలో యశ్ దయాల్ 3, ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైనీ తలో 2, సుందర్, నితీశ్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. -
శుభ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్.. పంత్‌కు ఫ్యూజులు ఔట్
దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా బెంగళూరు వేదికగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఏ ఆటగాడు శుభ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. లాంగ్ ఆఫ్ దిశగా ఇండియా-బి ఆటగాడు రిషబ్ పంత్ ఆడిన షాట్‌ను గిల్ పక్షిలా గాల్లోకి ఎగిరి ఒడిసిపట్టుకున్నాడు. గిల్ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ మ్యాచ్‌లో పంత్ కేవలం ఏడు పరుగులు చేసి ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.SHUBMAN GILL - THE STAR. ⭐- What a brilliant catch by Shubman Gill. 🔥pic.twitter.com/cKHuLPvG0k— Tanuj Singh (@ImTanujSingh) September 5, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-బి 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా ముషీర్ ఖాన్ (97), నవ్‌దీప్ సైనీ (21) ఆదుకున్నారు. మూడో సెషన్ సమయానికి ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ సెంచరీకి చేరువయ్యాడు. నవ్‌దీప్.. ముషీర్‌కు సరైన సహకారం అందిస్తున్నాడు. వీరిద్దరూ ఈ రోజంతా ఆడగలిగితే ఇండియా-బి గౌరవప్రదమైన స్కోర్ చేయగలుగుతుంది.ఇండియా-బి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 30, అభిమన్యు ఈశ్వరన్ 13, సర్ఫరాజ్ ఖాన్ 9, రిషబ్ పంత్ 7, నితీశ్ రెడ్డి 0, వాషింగ్టన్ సుందర్ 0, సాయికిషోర్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్‌దీప్, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.ఇవాళే మొదలైన మరో మ్యాచ్‌లో ఇండియా-సి, ఇండియా-డి జట్లు తలపడుతున్నాయి. ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌటైంది. అక్షర్ పటేల్ 86 పరుగులు చేసి ఇండియా-డిని ఆదుకున్నాడు. 76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్.. అర్ష్‌దీప్ సింగ్‌తో (13) కలిసి తొమ్మిదో వికెట్‌కు 84 పరుగులు జోడించాడు.అక్షర్ మినహా ఇండియా-డిలో ఎవ్వరూ రాణించలేదు. అథర్వ తైడే 4, యశ్ దూబే 10, శ్రేయస్ అయ్యర్ 9, దేవ్‌దత్ పడిక్కల్ 0, రికీ భుయ్ 4, శ్రీకర్ భరత్ 13,సరాన్ష్ జైన్ 13, హర్షిత్ రాణా 0, అర్ష్‌దీప్ సింగ్ 13 పరుగులు చేశారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహన్ చెరో 2, మానవ్ సుతార్, హృతిక్ షొకీన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి 28 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (5), సాయి సుదర్శన్ (7), ఆర్యన్ జుయెల్ (12), రజత్ పాటిదార్ (13) ఔట్ కాగా.. బాబా ఇంద్రజిత్ (13), అభిషేక్ పోరెల్ (19) క్రీజ్‌లో ఉన్నారు. -
Hundred League: దీప్తి శర్మ సిక్సర్.. వైరలవుతున్న వీడియో
మహిళల హండ్రెడ్ లీగ్ 2024 ఎడిషన్ ఫైనల్లో వెల్ష్ ఫైర్‌పై లండన్ స్పిరిట్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో వెల్ష్ ఫైర్ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని లండన్ స్పిరిట్ 98వ బంతికి ఛేదించి విజేతగా నిలిచింది. 98వ బంతికి ముందు లండన్ విజయానికి మూడు బంతుల్లో నాలుగు పరుగులు అవసరం కాగా.. దీప్తి శర్మ సిక్సర్ బాది మ్యాచ్‌ను గెలిపించింది. దీప్తి సిక్సర్ కొట్టేప్పుడు లండన్ డగౌట్లో కనిపించి ఆసక్తికర దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. దీప్తి సిక్సర్ కొట్టే సమయంలో సహచరుల ముఖాల్లో కనిపించిన హావభావాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.The reaction of London Spirit dugout when Deepti Sharma smashed the six. 😄👌pic.twitter.com/x1uKDjSSes— Mufaddal Vohra (@mufaddal_vohra) August 18, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. వెల్ష్ ఫైర్ ఇన్నింగ్స్‌లో జెస్ జోనాసెన్ (54), బేమౌంట్ (21), హేలీ మాథ్యూస్ (22) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లండన్ బౌలర్లలో ఈవా గ్రే, సారా గ్లెన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. టారా నోరిస్, దీప్తి శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లండన్.. జార్జియా (34), హీథర్ నైట్ (24), డేనియెలా గిబ్సన్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో 98 బంతుల్లో విజయతీరాలకు చేరింది. వెల్ష్ ఫైర్ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఫ్రేయా డేవిస్, జార్జియా డేవిస్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్.. వైరల్ వీడియో
క్రికెట్ చరిత్రలో మరో అత్యద్భుత క్యాచ్ ఆవిష్కృతమైంది. ఇంగ్లండ్‌లో జరిగిన ఓ ఛారిటి మ్యాచ్ ఈ సూపర్ క్యాచ్‌కు వేదికైంది. వివరాలు పూర్తిగా తెలియని ఓ మ్యాచ్‌లో సోమర్సెట్ క్లబ్‌కు ఆడిన బెంజమిన్ స్లీమన్ నమ్మశక్యం కాని రీతిలో కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. బెంజమిన్ విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ క్యాచ్‌ను చూసిన వారు ఔరా అంటున్నారు. నేటి ఆధునిక క్రికెట్లో ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు చూసుంటాం. ఈ క్యాచ్ వాటన్నిటిలో ప్రత్యేకమనకుండా ఉండలేం.THAT'S A SCREAMER... BENJAMIN SLEEMAN...!!! 🤯pic.twitter.com/H2RvoD8Rou— Mufaddal Vohra (@mufaddal_vohra) August 12, 2024ఈ వీడియోలో లెగ్ స్పిన్ బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ బౌలర్ తలపై నుంచి గాల్లోకి భారీ షాట్ ఆడాడు. లాంగ్ ఆన్‌లో ఉన్న బెంజమిన్ అమాంతం గాల్లో ఎగురుతూ సిక్సర్‌గా వెళ్లాల్సిన బంతిని ఒడిసిపట్టుకున్నాడు. ఇది చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ అయితే తలపై చేతులు పెట్టుకుని ఇదెక్కడి క్యాచ్ రా సామీ అని ఎక్స్ప్రెషన్ పెట్టాడు. -
IND VS SL 2nd ODI: శ్రేయస్ అయ్యర్ సూపర్ త్రో.. నమ్మశక్యంకాని రీతిలో రనౌట్
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సూపర్ త్రోతో అలరించాడు. ఈ మ్యాచ్‌లో అయ్యర్.. క్రీజ్‌లో కుదురుకున్న కమిందు మెండిస్‌ను (40) అద్భుతమైన డైరెక్ట్ త్రోతో పెవిలియన్‌కు పంపాడు. ఈ విన్యాసాన్ని చూసిన వారంతా ఔరా అనుకున్నారు. శ్రేయస్ సూపర్ త్రోకు సంబంధించిన వీడియో నెట్టింట షికార్లు చేస్తుంది.What a direct hit from Shreyas Iyer. 🤯🎯pic.twitter.com/VqZeVfbetk— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రోహిత్ శర్మ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సిరీస్‌లో వరుసగా రెండో ఫిఫ్టీ పూర్తి చేశాడు. రోహిత్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీని పూర్తి చేయడం విశేషం.19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 123/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 118 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో కోహ్లి (14), అక్షర్ పటేల్ (7) ఉన్నారు. -
లక్నో ఎయిర్‌పోర్టును ముంచెత్తిన వర్షాలు.. వరదనీటిలో రన్‌వే
లక్నో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని రోడ్లు, ఇళ్లు జలమయం అయ్యియి. దీంతో రాజధాని కోల్కతాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును వరదనీరు ముంచెత్తింది. విమానాశ్రయంలోని రన్‌వే, టాక్సీవేలు జలమయమయ్యాయి. ఎయిర్ పోర్ట్‌లో రన్‌వేపై మోకాళ్ల లోతులో నీరు చేరి.. విమనాల టేక్ ఆఫ్, ల్యాండ్ అవ్వడానికి వీలు లేకుండా ఉంది. దీంతో పలు విమానాల రాకపోకలు రద్దు చేశారు. అయితే వరదనీటిలోనే విమానాలు పార్క్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరోవైపు కోల్‌కతా, దాని పరిసర ప్రాంతాలైన హౌరా, సాల్ట్, మరియు బరాక్‌పూర్‌లో భారీ వర్షం కురుస్తోంది. 📍Kolkata | Flight operations at Kolkata Airport are proceeding normally despite heavy rainfall. Both the runway and all taxiways are fully operational. However, a few parking stands are affected by waterlogging for which additional pumps have been deployed. pic.twitter.com/ddrEu4rmVE— NDTV (@ndtv) August 3, 2024 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం ప్రస్తుతం బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ వైపు కదులుతోందని, పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ జిల్లాలపై చురుకైన రుతుపవన ద్రోణిని మోస్తోందనిఎడతెగని వర్షాలకు కారణమైందని పేర్కొన్నారు. -
తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఫన్నీ సీన్
తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2024లో ఓ ఫన్నీ సీన్ జరిగింది. మధురై పాంథర్స్-చెపాక్ గిల్లీస్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ బ్యాటర్ భారీ సిక్స్ కొట్టగా.. బంతి స్టేడియం బయట పడింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి బంతిని తీసుకుని తిరిగి ఉచ్చేందుకు నిరాకరించాడు. ఇవ్వను పో ఏం చేసుకుంటారో చేసుకోండన్నట్లు ఆ వ్యక్తి ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.A must watch moment in TNPL. 😀👌- Peak gully cricket vibe when an outsider took the ball & not giving it back...!!! pic.twitter.com/N5iah4NmUT— Johns. (@CricCrazyJohns) July 29, 2024కాగా, ఆ మ్యాచ్‌లో చెపాక్ గిల్లీస్‌పై మధురై పాంథర్స్ 9 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాంథర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయగా.. ఛేదనలో పోరాడిన చెపాక్ గిల్లీస్ లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 55 పరుగులు చేసి పాంథర్స్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన లోకేశ్వర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ప్రదోష్ రంజన్ పాల్ (52) పోరాడినప్పటికీ.. చెపాక్‌ను గెలిపించలేకపోయాడు. కార్తీక్ మణికందన్ 3 వికెట్లు తీసి చెపాక్‌కు దెబ్బకొట్టాడు. -
IRE Vs ZIM: బౌండరీని ఆపబోతే ఇలా అయ్యిందేంటి..?
ఐర్లాండ్, జింబాబ్వే మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఓ ఆరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆట నాలుగో రోజు ఐర్లాండ్ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. ఫీల్డర్ బౌండరీని ఆపబోతే బ్యాటర్లు ఐదు పరుగులు తీశారు. ఈ ఆసక్తికర పరిణామానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతంది.Fielder saves 4, batters run 5.pic.twitter.com/UgZqOp7iBc— CricTracker (@Cricketracker) July 28, 2024వివరాల్లోకి వెళితే.. 158 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 5 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఈ దశలో రిచర్డ్ నగరవ బౌలింగ్‌లో ఆండీ మెక్‌బ్రైన్ కవర్ డ్రైవ్ ఆడగా.. టెండాయ్ చటార బౌండరీ లైన్ వరకు ఛేజింగ్ చేసి బంతిని బౌండరీ వెళ్లకుండా ఆపగలిగాడు. అయితే ఈ లోపు ఆండీ మెక్‌బ్రైన్, లోర్కాన్ టక్కర్ ఐదు పరుగులు తీశారు. క్రికెట్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి.కాగా, ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో 21 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్.. లొర్కాన్ టక్కర్ (56), ఆండీ మెక్‌బ్రైన్ (55 నాటౌట్) వీరోచితంగా పోరాడటంతో చారిత్రక విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోర్ 33/5 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఐర్లాండ్.. టక్కర్ వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మెక్‌బ్రైన్.. మార్క్ అదైర్ (24) సహకారంతో ఐర్లాండ్‌ను గెలిపించాడు. టెస్ట్‌ల్లో ఐర్లాండ్‌కు ఇది రెండో విజయం. ఈ ఏడాదే ఐర్లాండ్ తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 210, రెండో ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 250, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. -
బెన్ స్టోక్స్ డూప్.. వైరల్ వీడియో
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను పోలిన ఓ వ్యక్తి స్టాండ్స్‌లో తారసపడ్డాడు. సదరు వ్యక్తిని చూసి బెన్ స్టోక్స్ ఆశ్చర్యపోయాడు. గడ్డం, హెయిర్ స్టయిల్, ముఖ ఆకృతి తనలాగే ఉండటంతో స్టోక్స్ కళ్లప్పగించి చూశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.TWO BEN STOKES IN THE TEST MATCH....!!!! 🤯 pic.twitter.com/qU3kQm9Zyy— Johns. (@CricCrazyJohns) July 21, 2024ఇదిలా ఉంటే, రెండో టెస్ట్‌లో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ 241 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేయగా.. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 457, రెండో ఇన్నింగ్స్‌లో 143 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఓలీ పోప్ (121), హ్యారీ బ్రూక్ (109), జో రూట్ (122).. విండీస్ ఆటగాడు కవెమ్ హాడ్జ్ (120) సెంచరీలు చేశారు. సిరీస్‌లో నామమాత్రపు మూడో టెస్ట్ జులై 26న మొదలవుతుంది. -
విండీస్ ప్లేయర్ క్రేజీ సెలెబ్రేషన్స్
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ (121) సెంచరీ.. బెన్ డకెట్ (71), బెన్ స్టోక్స్ (69) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 3, జేడన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, కవెమ్ హాడ్జ్ తలో 2, షమార్ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్.. లంచ్ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ 48, మికైల్ లూయిస్ 21, కిర్క్ మెక్కెంజీ 11 పరుగులు చేసి ఔట్ కాగా..అలిక్ అథనాజ్ 5, కవెమ్ హాడ్జ్ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, అట్కిన్సన్ ఓ వికెట్ పడగొట్టారు. వెస్టిండీస్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 327 పరుగులు వెనుకపడి ఉంది.The Crazy Celebration of Kevin Sinclair.🤯- ONE OF THE BEST CELEBRATION IN CRICKET. 🔥 pic.twitter.com/o9OZOwhSWu— Tanuj Singh (@ImTanujSingh) July 19, 2024సింక్లెయిర్ క్రేజీ సెలెబ్రేషన్స్ఈ మ్యాచ్ తొలి రోజు విండీస్ ఆటగాడు కెవిన్ సింక్లెయిర్.. హ్యారీ బ్రూక్ వికెట్ తీసిన ఆనందంలో వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్న వైనం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. సింక్లెయిర్.. బ్రూక్ ఔట్ అవ్వగానే గాల్లోకి పల్టీలు కొడుతూ క్రేజీగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. సింక్లెయిర్‌కు ఇలాంటి సెలబ్రేషన్స్ కొత్తేమీ కాదు. ఆస్ట్రేలియాతో జరిగిన తన తొలి మ్యాచ్‌లోనూ ఇలాంటి సంబురాలే చేసుకున్నాడు. -
మైక్రోసాప్ట్ విండోస్ క్రాష్
-
ముచ్చుమర్రి బాలిక కేసులో పోలీసుల సీన్ రికన్ స్ట్రక్షన్ తేలిన నిజాలు
-
జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది.
-
110 మీటర్ల భారీ సిక్సర్ బాదిన సంజూ శాంసన్
జింబాబ్వేతో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సంజూ శాంసన్ 110 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. బ్రాండన్ మవుటా బౌలింగ్‌లో సంజూ కొట్టిన సిక్సర్ స్టేడియం బయట పడింది. ఈ భారీ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. Sanju Samson Smashed 110M SIX 🤯 #ZIMvIND #CricketTwitter pic.twitter.com/fQLHkjZvaX— Mano (@manoj_tweezz) July 14, 2024ఈ మ్యాచ్‌లో సంజూ ఈ సిక్సర్‌తో పాటు మరో మూడు సిక్సర్లు బాదాడు. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న సంజూ.. నాలుగు సిక్సర్లు, బౌండరీ సాయంతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌లో సంజూ మినహా భారత బ్యాటర్లెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. శివమ్ దూబే 26, రియాన్ పరాగ్ 22, అభిషేక్ శర్మ 14, శుభ్‌మన్ గిల్ 13, యశస్వి జైస్వాల్ 12 పరుగులకు ఔట్ కాగా.. రింకూ సింగ్ 11, వాషింగ్టన్ సుందర్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. జింబాబ్వే బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో భారత్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ముజరబాని 2, సికందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మవుటా తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్ -
వారెవ్వా ఫిలిప్స్.. క్రికెట్ చరిత్రలో ఇంతటి అద్భుత విన్యాసం ఎవరూ చేసి ఉండరు..!
లంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా డంబుల్లా సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కొలొంబో స్ట్రయికర్స్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ ఓ అద్భుత విన్యాసం చేశాడు. ఈ మ్యాచ్ ఆరో ఓవర్లో కుశాల్ పెరీరా కొట్టిన భారీ షాట్‌ను ఫిలిప్స్ కళ్లు చెదిరే విన్యాసం చేసి సిక్సర్ వెళ్లకుండా అడ్డుకున్నాడు. డీప్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్ పక్షిలా గాల్లోకి ఎగిరి గాల్లోనే బంతిని బౌండరీ రోప్ లోపలికి నెట్టాడు. GLENN PHILLIPS IS NEXT LEVEL. 🤯- Probably the greatest athlete from New Zealand. 🫡 pic.twitter.com/DIheKFMVCn— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2024ఫిలిప్స్ చేసిన ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోను చూసిన వారంతా ఫిలిప్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్ జరిగి ఐదు రోజులైనా నెట్టింట ఈ వీడియో ఇంకా చక్కర్లు కొడుతూనే ఉంది. క్రికెట్ చరిత్రలో ఇంతటి అద్భుత విన్యాసం ఎవరూ చేసి ఉండరని నెటిజన్లు జేజేలు పలుకున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. అద్భుతమైన క్యాచ్‌తో అబ్బురపరిచిన ఫిలిప్స్ ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ రాణించాడు. అయినా ఈ మ్యాచ్‌లో అతను ప్రాతినిథ్యం వహించిన కొలొంబో టీమ్ ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కొలొంబో.. ఫిలిప్స్ (52), ఏంజెలో పెరారీ (41), గుర్బాజ్ (36) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డంబుల్లా.. కుశాల్ పెరీరా (80), రీజా హెండ్రిక్స్ (54) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీకరాలకు చేరింది. -
కిడ్నీ మార్పిడి కేసులో NRI ఆసుపత్రి కీలక పాత్ర
-
ఇకపై అలా చేస్తే భారీ జరిమానా: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ వార్నింగ్!
ఐపీఎల్-2024 నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇకపై మైదానంలో ఉన్నపుడు.. మ్యాచ్‌లకు సంబంధించిన ఫొటోలు, లైవ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఐపీఎల్ ఫ్రాంఛైజీలను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానా విధిస్తామని బీసీసీఐ స్పష్టం చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. జట్ల యజమానులు, కామెంటేటర్లు, ఆటగాళ్లు, ఐపీఎల్ ఫ్రాంఛైజీల సోషల్ మీడియా టీమ్‌లను ఉద్దేశించి ఈమేరకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బ్రాడ్కాస్టర్లు బోర్డుకు భారీ మొత్తం చెల్లిస్తున్నారు. కామెంటేటర్లు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎలాంటి ఫొటోలు, వీడియోలు గానీ షేర్ చేయకూడదు. ఒక్కోసారి కొంతమంది కామెంటేటర్లు ఇన్స్టాగ్రామ్ లైవ్ చేసినపుడు, మైదానం ఉన్నపుడు ఫొటోలు తీసి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ వీడియో గనుక ఒక మిలియన్ వ్యూస్ సంపాదించిందంటే అప్పుడు బ్రాడ్కాస్టర్లకు ఒక రకంగా అది నష్టమే. నిజానికి ఐపీఎల్ జట్లు సైతం లైవ్ మ్యాచ్‌ల వీడియోలు షేర్ చేయకూడదు. కొన్ని ఫొటోలు, లైవ్ మ్యాచ్ అప్డేట్స్ మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు పాటించడంలో విఫలమైతే ఆ ఫ్రాంఛైజీకి జరిమానా పడుతుంది’’ అని పేర్కొన్నారు. ఇటీవల కొంత మంది ఆటగాళ్లు సైతం మ్యాచ్ డేకు సంబంధించిన ఫొటోలు పంచుకున్నారని.. వెంటనే వాటిని డిలీట్ చేయాల్సిందిగా తాము ఆదేశించినట్లు సదరు అధికారి వెల్లడించారు. కాగా ఐపీఎల్ 2023-2027 ప్రసార హక్కులను స్టార్ ఇండియా(టెలివిజన్- రూ. 23,575 కోట్లు), వయాకామ్ 18(డిజిటల్- రూ. 20,500 కోట్లు- జియో సినిమా) దక్కించుకున్నాయి. ఈ రెండింటిలో మాత్రమే మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. ఒకవేళ ఏదైనా ఐపీఎల్ టీమ్ గనుక లైవ్ గేమ్‌ను షేర్ చేస్తే రూ. 9 లక్షల మేర బోర్డు ఫైన్ విధించనున్నట్లు సమాచారం. -
Ashish Chanchlani: టాలెంట్‌తో.. బిలియన్ల వ్యూస్.. మిలియన్ల సబ్స్క్రైబర్స్..
'Ashish Chanchlani Vines అనే యూట్యూబ్ చానెల్‌తో clout అయ్యాడు. కామెడీ వీడియోస్‌కి వెల్‌నోన్. అమ్మాయిగా.. తండ్రిగా.. కొడుకుగా.. ఇలా డిఫరెంట్ రోల్స్ వేయడంలో ఆశీష్ని మించిన క్రియేటర్ లేడు. సోషల్ మీడియాలో, స్టూడెంట్ లైఫ్, ఎగ్జామ్స్, ఆఫీస్ డ్రామా, ఫ్యామిలీ ఇష్యూస్.. ఇలా ఈ కుర్రాడు ఫోకస్ చేయని టాపిక్ లేదు.' సబ్జెక్ట్ ఏదైనా హిలేరియస్ ట్విస్ట్స్ కడుపుబ్బా నవ్వించే కంటెంట్‌ని చూపిస్తాడు. ఆశీష్ పుట్టి, పెరిగింది మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్లో. ఇంజినీరింగ్ చదువు కోసం నవీ ముంబై చేరాడు. ఫ్రమ్ ద చైల్డ్ హుడ్ అతనిలో యాక్టింగ్ ఇన్స్టింక్ట్ ఉండటంతో టీన్స్‌లో అది డామినేట్ చేసింది. దాంతో మధ్యలోనే ఇంజినీరింగ్‌కి గుడ్ బై చెప్పేశాడు. ఆ గట్స్ అండ్ గట్ ఫీలింగ్‌తో సోషల్ మీడియాలో జర్నీ స్టార్ట్ చేశాడు. యూట్యూబ్ చానెల్ పెట్టి.. చదువు మధ్యలోనే వదిలేసినందుకు రిగ్రెట్ ఫీలయ్యే చాన్స్ ఆశీష్కివ్వలేదు డెస్టినీ! ఫన్నీ వీడియోస్‌తో వితిన్ ద షార్ట్ టైమ్ వెరీ పాపులర్ అయిపోయాడు. ఎంతలా అంటే బాలీవుడ్ బిగ్గీస్ తమ మూవీస్‌కి అతనితో ప్రమోషనల్ వీడియోస్ చేయించుకునేంతలా! అంతేకాదు షాహిద్ కపూర్, కార్తిక్ ఆర్యన్, సారా అలీఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్‌తో కలసి యాడ్స్ చేశాడు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్.. 'మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్' అనే హాలీవుడ్ మూవీలో కూడా యాక్ట్ చేశాడు. 'ఆఫ్రీ సఫర్' అనే షార్ట్ హారర్ ఫిల్మ్ తీసి తనలోని డైరెక్షన్ చూపించాడు. ఆశీష్ యూట్యూబ్ చానెల్, ఇన్‌స్టా హ్యాండిల్ వంటి వేరియస్ సోషల్ మీడియా అకౌంట్స్‌కి బిలియన్ల వ్యూస్.. రెండు అంకెల మిలియన్ల ఫాలోవర్స్.. అంతకన్నా ఎక్కువ రేంజ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెలకు లక్షల్లో ఆమ్దనీ వస్తోంది. అవార్డులు కూడా బాగానే గెలుచుకున్నాడు. 'బెస్ట్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్' కేటగిరీలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ అందుకున్నాడు. వరల్డ్ బ్లాగర్స్ అవార్డ్స్ ప్రారంభించిన ఏడాదే (2019) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'బెస్ట్ కామెడీ ఇన్ఫ్లుయెన్సర్' అవార్డును సాధించాడు. ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లోనూ లిస్ట్ అయ్యాడు. కాన్ఫిడెన్స్ ఉంటే కేన్స్ దాకా వెళ్లొచ్చని భలే ప్రూవ్ చేశాడు కదా! ఇవి చదవండి: అక్షయ్ కుమార్ నుంచి కత్రినా వరకు .. డైట్ సీక్రెట్స్ ఇవే.. -
అతడు అద్భుతం.. మా గురించి అలా అనుకోవద్దు: గిల్ కౌంటర్
ఆఖరి బంతికి విజయం సాధించడం ఎల్లప్పుడూ గొప్పగానే ఉంటుందంటూ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ హర్షం వ్యక్తం చేశాడు. రషీద్ భాయ్ వల్లే తమకు రాజస్తాన్ రాయల్స్‌పై గెలుపు దక్కిందని వైస్ కెప్టెన్‌పై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్-2024లో ఆరంభం నుంచి ఓటమి ఎరుగని రాజస్తాన్ జైత్రయాత్రకు గుజరాత్ బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. జైపూర్‌లో బుధవారం ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో చివరి బంతికి టైటాన్స్ జయభేరి మోగించింది. మెరుపు ఇన్నింగ్స్(11 బంతుల్లో 24*)తో గుజరాత్ శిబిరంలో ఆశలు నింపిన రషీద్ ఖాన్.. అంచనాలు నిలబెట్టుకుంటూ ఆఖరి బంతికి ఫోర్ బాది గెలుపును ఖరారు చేశాడు. రాహుల్ తెవాటియా(11 బంతుల్లో 22) సైతం విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక కష్ట సమయంలో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్(44 బంతుల్లో 72) ఆడటం టైటాన్స్‌కు కలిసి వచ్చింది. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 ఈ నేపథ్యంలో విజయానంతరం కామెంటేటర్ హర్షా భోగ్లేతో ముచ్చటిస్తున్న సమయంలో శుబ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గెలుపు నేపథ్యంలో గిల్‌ను అభినందిస్తూ.. ‘‘బాగా ఆడారు. మీకు రెండు పాయింట్లు వచ్చాయి. అయితే, నాలాంటి చాలా మంది మీరు ఆలస్యం చేస్తున్నారు కాబట్టి ఏమవుతుందోనని కంగారు పడ్డారు. కానీ మీరు బాగా ఆడారు’’ అని హర్షా భోగ్లే అన్నాడు. ఇందుకు స్పందిస్తూ.. ‘‘థాంక్యూ.. మేము ఆడుతున్నపుడు ఇంకెప్పుడూ అలా అనుకోకండి’’ అంటూ తమ జట్టు గురించి గొప్పగా చెబుతూ ఒకరకంగా హార్ష భోగ్లేకు గట్టి కౌంటరే వేశాడు శుబ్‌మన్ గిల్. ఇక తమ విజయం గురించి మాట్లాడుతూ.. ‘‘అప్పటికీ.. మూడు ఓవర్లలో 45 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒక్కో బ్యాటర్ తొమ్మిది బంతుల్లో 22 పరుగులు చేయాలనుకున్నాం. నిజంగా మ్యాచ్ ఫినిష్ చేయడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఈరోజు నేను ఆపని చేయాలనుకున్నాను. అయితే, రాహల్- రషీద్ భాయ్ ఆ పని పూర్తి చేశారు. ఆఖరి బంతికి విజయం సాధించడం ఎప్పుడూ గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. రషీద్ ఖాన్ లాంటి వాళ్లు జట్టులో ఉండాలని ప్రతి ఒక్క కెప్టెన్ కోరుకుంటాడనడంలో సందేహం లేదు’’ అని శుబ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 IPL 2024: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ స్కోర్లు ►రాజస్తాన్: 196/3 (20) ►గుజరాత్: 199/7 (20) ►ఫలితం: మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం ► ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రషీద్ ఖాన్(ఒక వికెట్, 24 పరుగులు- నాటౌట్). చదవండి: IPL 2024: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..! #ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్‌తో గొడవపడ్డ గిల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రతిసారీ ధోని ఎంట్రీ ఏంటి?.. కెప్టెన్ అతడు కదా: సెహ్వాగ్
#CSKvsRCB- #MSDhoni: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా అరుదైన ఘనతలు సాధించిన మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదు. ధోని భాగమై ఉన్న జట్టును సారథిగా ముందుకు నడిపించలేక.. ఒత్తిడిలో చిత్తై రవీంద్ర జడేజా 2022 సీజన్లో పగ్గాలు చేపట్టి మధ్యలోనే వదిలేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ధోనినే మళ్లీ రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. అయితే, 2023లో తన అద్బుతమైన కెప్టెన్సీ నైపుణ్యాలతో సీఎస్కేను చాంపియన్‌గా నిలిపాడు ధోని. వయసు పైబడటం, భవిష్యత్ కెప్టెన్‌ను తయారు చేసే క్రమంలో ఐపీఎల్-2024 సీజన్‌కు ముందే తన బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు తలా. ఎవరి స్థానాన్నో భర్తీ చేయడానికి రాలేదు కెప్టెన్సీ పగ్గాలను ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అందించాడు. రుతు సైతం.. గతేడాది నుంచే ధోని భయ్యా తనకు ఈ విషయం గురించి సంకేతాలు ఇచ్చాడని పేర్కొన్నాడు. అంతేకాదు.. ‘‘సీఎస్కే కెప్టెన్‌గా ఎంపిక కావడం నాకు దక్కిన గౌరవం. అయితే, ఇక్కడ నేను ఎవరి స్థానాన్నో భర్తీ చేయడానికి రాలేదు. నన్ను నేను నిరూపించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా’’ అని టోర్నీ ఆరంభానికి ముందే స్పష్టం చేశాడు రుతురాజ్ గైక్వాడ్. ఫీల్డింగ్ సెట్ చేసిన ధోని అందుకు తగ్గట్లుగానే ఆరంభ మ్యాచ్‌లో కెప్టెన్‌గా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో సారథిగా అరంగేట్రంలోనే గెలుపు రుచి చవిచూశాడు. అయితే, మ్యాచ్ మధ్యలో ధోని రుతురాజ్‌కు సలహాలు ఇస్తూ కనిపించాడు. అంతేకాదు.. ఫీల్డింగ్ సెట్ చేసే విషయంలో ఈ వికెట్ కీపర్ చొరవ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ధోని అభిమానులను అలరించాయి. ధోని క్రేజ్ దృష్ట్యా కెమెరామెన్ సైతం ప్రతిసారి అతడిపైనే ఫోకస్ చేయడం విశేషం. Just a reminder: 𝙏𝙝𝙖𝙡𝙖 𝙣𝙚𝙫𝙚𝙧 𝙢𝙞𝙨𝙨𝙚𝙨 😉#CSKvsRCB #TATAIPL #IPLonJioCinema #IPL2024 #JioCinemaSports pic.twitter.com/KMhidAc9Sp — JioCinema (@JioCinema) March 22, 2024 అతడు ఇప్పుడు కెప్టెన్ ఈ నేపథ్యంలో హర్యానా కామెంట్రీ బాక్స్‌లో ఉన్న టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ఛలోక్తులు విసిరాడు. ‘‘భయ్యా.. దయచేసి రుతురాజ్ ముఖాన్ని కూడా కాస్త చూపించండి. అతడు ఇప్పుడు కెప్టెన్. ఏంటో.. ఈ కెమెరామెన్ ఎప్పుడూ ధోని ఫేస్ మాత్రమే చూపిస్తున్నాడు’’ అని వీరూ భాయ్ కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా రుతురాజ్‌కు మంచి మార్కులే పడ్డాయి. Shining on #CSK Debut ✨ Home Support 💛 Finishing touch 💪 Summing up @ChennaiIPL's opening win of the season with Shivam Dube & Debutant Rachin Ravindra 👌👌 - By @RajalArora #TATAIPL | #CSKvRCB pic.twitter.com/r65i4T0zb9 — IndianPremierLeague (@IPL) March 23, 2024 రుతురాజ్ కెప్టెన్సీ బాగుంది భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. రుతు కెప్టెన్సీ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘తొలి 26 బంతుల తర్వాత సీఎస్కే అద్భుతరీతిలో తిరిగి పుంజుకుంది. ఒత్తిడిలోనూ రుతురాజ్ బౌలింగ్ విభాగాన్ని ప్రయోగించడంలో చేసిన మార్పులు ఆకట్టుకున్నాయి’’ అని ఎక్స్ వేదికగా ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా రుతురాజ్ కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు.