
క్రికెట్ చరిత్రలో మరో అత్యద్భుత క్యాచ్ ఆవిష్కృతమైంది. ఇంగ్లండ్‌లో జరిగిన ఓ ఛారిటి మ్యాచ్ ఈ సూపర్ క్యాచ్‌కు వేదికైంది. వివరాలు పూర్తిగా తెలియని ఓ మ్యాచ్‌లో సోమర్‌సెట్ క్లబ్‌కు ఆడిన బెంజమిన్ స్లీమన్ నమ్మశక్యం కాని రీతిలో కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. బెంజమిన్ విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ క్యాచ్‌ను చూసిన వారు ఔరా అంటున్నారు. నేటి ఆధునిక క్రికెట్‌లో ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు చూసుంటాం. ఈ క్యాచ్ వాటన్నిటిలో ప్రత్యేకమనకుండా ఉండలేం.
THAT'S A SCREAMER... BENJAMIN SLEEMAN...!!! 🤯pic.twitter.com/H2RvoD8Rou
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 12, 2024
ఈ వీడియోలో లెగ్ స్పిన్ బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ బౌలర్ తలపై నుంచి గాల్లోకి భారీ షాట్ ఆడాడు. లాంగ్ ఆన్‌లో ఉన్న బెంజమిన్ అమాంతం గాల్లో ఎగురుతూ సిక్సర్‌గా వెళ్లాల్సిన బంతిని ఒడిసిపట్టుకున్నాడు. ఇది చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ అయితే తలపై చేతులు పెట్టుకుని ఇదెక్కడి క్యాచ్ రా సామీ అని ఎక్స్‌ప్రెషన్ పెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment