Catch
-
క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన క్యాచ్.. నమ్మశక్యం కాని రీతిలో..!
క్రికెట్ చరిత్రలో అత్యంత అద్భుతమైన క్యాచ్‌కు న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ వేదికైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ నమ్మశక్యం కాని రీతిలో ఒంటిచేత్తో డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసి బ్యాటర్ ఓలీ పోప్ సహా ఫీల్డ్‌లో ఉన్న వారందరికి మతి పోయింది. ఫిలిప్స్ విన్యాసం చూసి నెటిజన్లు ముగ్దులైపోతున్నారు. ఇదేం క్యాచ్ రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.Glenn Phillips adds another unbelievable catch to his career resume! The 151-run Brook-Pope (77) partnership is broken. Watch LIVE in NZ on TVNZ DUKE and TVNZ+ #ENGvNZ pic.twitter.com/6qmSCdpa8u— BLACKCAPS (@BLACKCAPS) November 29, 2024వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్ బ్యాటింగ్ 53వ ఓవర్లో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ టిమ్ సౌథీని బౌలింగ్‌కు దించాడు. అప్పటికే ఓలీ పోప్.. హ్యారీ బ్రూక్‌తో కలిసి ఐదో వికెట్‌కు 151 పరుగులు జోడించాడు. సౌథీ వేసిన షార్ట్ పిచ్ డెలివరీకి ఓలీ పోప్ కట్ షాట్ ఆడగా.. గ్లెన్ ఫిలిప్స్ అకస్మాత్తుగా ఫ్రేమ్‌లోకి వచ్చి అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. ఫలితంగా పోప్ 77 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ బాట పట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఓలీ పోప్ ఔటైన అనంతరం కెప్టెన్ బెన్ స్టోక్స్ క్రీజ్‌లోకి వచ్చాడు. బ్రూక్ 86 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్ స్కోర్ 232/5గా ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 0, బెన్ డకెట్ 46, జాకబ్ బేతెల్ 10, జో రూట్ 0, ఓలీ పోప్ 77 పరుగులు చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ 2, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో వికెట్ పడగొట్టారు.అందకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (58 నాటౌట్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశాడు. టామ్ లాథమ్ (47), రచిన్ రవీంద్ర (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో 4 వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. -
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్.. వైరల్ వీడియో
క్రికెట్ చరిత్రలో మరో అత్యద్భుత క్యాచ్ ఆవిష్కృతమైంది. ఇంగ్లండ్‌లో జరిగిన ఓ ఛారిటి మ్యాచ్ ఈ సూపర్ క్యాచ్‌కు వేదికైంది. వివరాలు పూర్తిగా తెలియని ఓ మ్యాచ్‌లో సోమర్సెట్ క్లబ్‌కు ఆడిన బెంజమిన్ స్లీమన్ నమ్మశక్యం కాని రీతిలో కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. బెంజమిన్ విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ క్యాచ్‌ను చూసిన వారు ఔరా అంటున్నారు. నేటి ఆధునిక క్రికెట్లో ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు చూసుంటాం. ఈ క్యాచ్ వాటన్నిటిలో ప్రత్యేకమనకుండా ఉండలేం.THAT'S A SCREAMER... BENJAMIN SLEEMAN...!!! 🤯pic.twitter.com/H2RvoD8Rou— Mufaddal Vohra (@mufaddal_vohra) August 12, 2024ఈ వీడియోలో లెగ్ స్పిన్ బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ బౌలర్ తలపై నుంచి గాల్లోకి భారీ షాట్ ఆడాడు. లాంగ్ ఆన్‌లో ఉన్న బెంజమిన్ అమాంతం గాల్లో ఎగురుతూ సిక్సర్‌గా వెళ్లాల్సిన బంతిని ఒడిసిపట్టుకున్నాడు. ఇది చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ అయితే తలపై చేతులు పెట్టుకుని ఇదెక్కడి క్యాచ్ రా సామీ అని ఎక్స్ప్రెషన్ పెట్టాడు. -
అహో!
వీడియో వైరల్ కావడానికి అసాధారణ అద్భుతాలతో పనిలేదు. ‘ఆహా’ అనిపిస్తే చాలు. ఇది అలాంటి వైరల్ వీడియోనే. ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ మార్క్ స్మిత్ తీసిన వీడియో నెటిజనులను మంత్రముగ్ధులను చేసింది. చేపను క్యాచ్ చేస్తున్న ఒక డేగకు సంబంధించిన క్లోజ్–అప్ షాట్ ఇది.కెమెరామన్‌గా మార్క్ స్మిత్ అద్భుతమైన పనితనం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ స్టన్నింగ్ వీడియో 124 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. -
‘‘పులులను పట్టండి... ఓట్లు అడగండి’’!
స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొన్నిచోట్ల ఎన్నికలను బహిష్కరించారనే వార్తలను మనం వినేవుంటాం. అయితే ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ పరిధిలో గల పండరి గ్రామస్తులు ఇప్పుడు విచిత్రమైన డిమాండ్ వినిపిస్తున్నారు. అది నెరవేరాకే ఓటు వేస్తామని తెగేసి చెబుతున్నారు. లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. పండరి గ్రామస్తులు కొన్నాళ్లుగా పులుల దాడులతో భీతిల్లిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించకుంటే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాము ఓటువేయమని చెబుతున్నారు. పండరి గ్రామం టైగర్ రిజర్వ్‌కు ఆనుకుని ఉంటుంది. దీంతో గ్రామంలో తరచూ పులుల దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఎంతకాలమైనా ఈ సమస్య పరిష్కారం కావడం లేదని, అందుకే తాము రాబోయే లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించనున్నామని పేర్కొంటూ గ్రామస్తులు పలుచోట్ల పోస్టర్లు అంటిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రధాన సమస్య పులుల భీభత్సమని, వాటి కారణంగా ఇక్కడి రైతులు పొలాలకు కాపలా కాసేందుకు వెళ్లలేకపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. పాఠశాల విద్యార్థులు కూడా పులుల భయంతో స్కూలుకు వెళ్లడం లేదని దీంతో ఇక్కడి పిల్లల భవిష్యత్తు అయోమయంగా తయారయ్యిందని వారు వాపోతున్నారు. ప్రభుత్వం ఈ ప్రాంతంలోకి పులుల రాకను అరికట్టేవరకూ తాము ఓటు వేసేందుకు వెళ్లేదిలేదని గ్రామస్తులు చెబుతున్నారు. -
దొరకునా ఇటువంటి దోశ!
‘వ్యాపారం అన్నాక నమ్మకమే కాదు కాస్త స్పెషాలిటీ కూడా ఉండాలి’ అంటూ రకరకాల పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తుంటారు కొందరు వ్యాపారులు. ముంబైలో ‘వికెట్–కీపర్ దోశవాలా’ అనే టిఫిన్ సెంటర్ ఉంది. బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టినట్లు ‘వికెట్ కీపర్‌కు, దోశకు ఏమిటి సంబంధం?’ అనే కొశ్చెన్ వస్తుంది. ఈ టిఫిన్ సెంటర్ స్పెషాలిటీ ఏమిటంటే... పెనం మీద తయారైన వేడి వేడి దోశను కస్టమర్‌కు ప్లేట్లో పెట్టి ఇవ్వరు. కస్టమర్ ఒక ప్లేటు పట్టుకొని కాస్త దూరంలో నిలబడాలి. పెనం మీద ఉన్న వేడి వేడి దోశను బాల్ని విసిరినట్లు గాల్లో విసిరేస్తారు. కస్టమర్ మహాశయుడు ఈ దోశను తన ప్లేటుతో క్యాచ్ పట్టాలి. ‘ఇదేమి పిచ్చి నాయనా’ అని మనం అనుకున్నా సరే ‘ఆ కిక్కే వేరప్పా’ అంటున్నారు ఈ టిఫిన్ సెంటర్‌కు రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్లు. -
Viral Video: కళ్లు చెదిరే క్యాచ్..!
పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య ఇవాళ (జులై 16) మొదలైన తొలి టెస్ట్ మ్యాచ్‌లో కళ్లు చెదిరే క్యాచ్ ఒకటి నమోదైంది. పాక్ ఆటగాడు ఇమామ్ ఉల్ హాక్ ఈ క్యాచ్ పట్టాడు. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఇమామ్.. గాల్లోకి ఎగురుతూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. అఘా సల్మాన్ బౌలింగ్‌లో ఈ ఫీట్ నమోదైంది. ఇమామ్ సూపర్ క్యాచ్ పట్టడంతో సమరవిక్రమ పెవిలియన్ బాట పట్టక తప్పలేదు. Imam ul Haq with a superb catch@ImamUlHaq12#PakistanCricket #PAKvSL #CricketTwitter pic.twitter.com/gXtjHezRF4 — Hamza Siddiqui (@HamzaSiddiqui56) July 16, 2023 ఇమామ్ విన్యాసానికి ఫిదా అయిపోయిన క్రికెట్ అభిమానులు, సోషల్‌మీడియా వేదికగా అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వాటే క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇమామ్ క్యాచ్ పట్టిన వెంటనే అంపైర్లు తొలి రోజు ఆటకు ముగించారు. పలు మార్లు వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు కేవలం 65.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వ (94) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. డిసిల్వతో పాటు ఏంజెలో మాథ్యూస్ (64) అర్ధసెంచరీలతో రాణించారు. నిషాన్ మధుష్క (4), కుశాల్ మెండిస్ (12), దినేశ్ చండీమాల్ (1) విఫలం కాగా.. దిముత్ కరుణరత్నే (29), సదీర సమరవిక్రమ (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, అబ్రార్ అహ్మద్, అఘా సల్మాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
స్టీవ్ స్మిత్ వివాదాస్పద క్యాచ్.. థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు!
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 325 పరుగులకే పరిమితం చేసిన ఆసీస్ 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్ వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. ప్రస్తుతం 149 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆసీస్ పట్టు బిగించేలా కనిపిస్తోంది. ఈ విషయం పక్కనబెడితే.. ఇటీవలే ఆస్ట్రేలియా ఆటగాళ్లు తీసుకుంటున్న పలు క్యాచ్‌లు వివాదాస్పదంగా మారుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో గిల్ క్యాచ్‌ను గ్రీన్ అందుకున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం యాషెస్ సిరీస్‌లోనూ బర్మింగ్హమ్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ మళ్లీ గ్రీన్ మరో వివాదాస్పద క్యాచ్‌తో వార్తల్లో నిలిచాడు. బెన్ డక్కెట్ ఇచ్చిన క్యాచ్‌ను థర్డ్ స్లిప్‌లో ఉన్న గ్రీన్ అందుకున్నాడు. అయితే బంతి నేలను తాకినట్లు క్లియర్‌గా ఉన్నా థర్డ్ అంపైర్ మరోసారి గ్రీన్‌కే ఓటు వేశాడు. ఈ రెండు సందర్భాల్లో గ్రీన్ విలన్‌గా మారితే.. తాజాగా స్టీవ్ స్మిత్ వివాదాస్పద క్యాచ్‌ల జాబితాలో చేరాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 416 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో మంచి ఆరంభం లభించింది. అయితే రూట్ (10 పరుగులు) ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. స్టార్క్ వేసిన బంతిని(46.3వ ఓవర్లో) రూట్ ఎదుర్కొనే క్రమంలో బ్యాక్వర్డ్ స్క్వేర్ వద్ద స్మిత్ చేతికి చిక్కాడు. అయితే క్యాచ్ అందుకున్న విధానంపై అనుమానంతో ఫీల్డ్ అంపైర్లు నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు నివేదించారు. రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. రిప్లేలో బంతి నేలను తాకుతుందని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి.. ఔట్ ఇవ్వడం ఏంటని ఇంగ్లండ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Nine wickets ☝ Three hundred and thirty-five runs 🏏 Another day of Test match cricket to savour 👇 pic.twitter.com/48K4lXmk2J — England Cricket (@englandcricket) June 30, 2023 -
ఆటోగ్రాఫ్ ఇవ్వని ధోని బతిమాలుకున్న చాహర్..!
-
అభిషేక్ సంచలన క్యాచ్.. రోహిత్‌కు దిమ్మ తిరిగిపోయింది! వీడియో వైరల్
-
సంచలన క్యాచ్.. బిక్క ముఖం వేసిన బ్యాటర్! ఇంతకీ అది సిక్సరా? అవుటా?
Big Bash League 2022-23- Sensational Catch: బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ క్రికెటర్ మైఖేల్ నీసర్ అందుకున్న క్యాచ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘‘ఇంతకీ అది.. అవుటా? కాదా’’ అన్న అంశంపై చర్చ నడుస్తోంది. కొంతమందేమో ఇదో గొప్ప క్యాచ్ అని నీసర్ను ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇలా కూడా అవుట్ ఇస్తారా అని అంపైర్ల నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆస్ట్రేలియా బిగ్‌బాష్ టీ20 లీగ్‌లో భాగంగా ఆదివారం సిడ్నీ సిక్సర్స్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన హీట్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సిడ్నీ.. గెలుపు కోసం తీవ్రంగా పోరాడింది. అయితే, 209 పరుగులకు ఆలౌట్ కావడంతో బ్రిస్బేన్ హీట్ 15 రన్స్ తేడాతో విజయం సాధించింది. అయితే, సిడ్నీ ఫ్యాన్స్ మాత్రం తమ జట్టు మిడిలార్డర్ ఆటగాడు జోర్డాన్ సిల్క్ అవుట్ కాకపోయి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సిల్క్ పెవిలియన్ చేరాడు. హీట్ బౌలర్ స్టీకెటీ బౌలింగ్‌లో మైకేల్ నాసర్ పట్టిన సంచలన క్యాచ్ కారణంగా అవుటయ్యాడు. పందొమ్మిదో ఓవర్ రెండో బంతిని సిల్క్ షాట్ ఆడే క్రమంలో లాంగాఫ్‌లో నీసర్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయిన నీసర్ బౌండరీ దాటే సమయంలో బాల్‌ను గాల్లోకి ఎగిరేశాడు. బౌండరీ అవతల బంతి గాల్లో ఉండగా.. తన అడుగులు కిందపడకుండా.. బంతిని ఒడిసిపట్టి.. మళ్లీ ఇవతలకు విసిరేసి.. బౌండరీ దాటి క్యాచ్ పట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది దీనిని అవుట్ ఇవ్వడం కరెక్టే అంటూ ఉండగా.. మరికొందరు మాత్రం పాపం సిల్క్ అంటూ జాలిపడుతున్నారు. అది సిక్సరా లేదంటే అవుటా అన్న విషయం తేల్చలేక ఇంకొందరు అయోమయంలో పడిపోయారు. అది సిక్సర్ అయి ఉంటే సిల్క్ తమ జట్టును తప్పక విజయతీరాలకు చేర్చేవాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా నిబంధనల ప్రకారం.. బౌండరీ లైన్ అవతల క్యాచ్ అందుకునే, దానిని విసిరేసే సమయంలో ఫీల్డర్ గ్రౌండ్‌కు టచ్ కాక.. ఇవతల బాల్‌ను అందుకుంటే అది క్యాచే! చదవండి: BCCI: కీలక టోర్నీల్లో వైఫల్యాలు.. భారీ మూల్యం! ఇక ఆటగాళ్లకు కఠిన పరీక్ష.. ఏమిటీ ‘యో–యో’ టెస్టు? WC 2023: సర్వ సన్నద్ధం కోసం... బీసీసీఐ సమావేశం! 20 మందితో ప్రపంచకప్ సైన్యం Michael Neser's juggling act ends Silk's stay! Cue the debate about the Laws of Cricket... #BBL12 pic.twitter.com/5Vco84erpj — cricket.com.au (@cricketcomau) January 1, 2023 -
అందుకే అత్యుత్సాహం పనికి రాదంటారు..
మనకు రానిది ప్రయత్నించి కొన్నిసార్లు చేతులు కాల్చుకున్న సందర్బాలున్నాయి. తాజాగా ఒక అభిమాని క్యాచ్ అందుకోవడం సాధ్యం కాదని తెలిసినా అత్యుత్సాహం ప్రదర్శించి అనవసరంగా ముక్కు పచ్చడి చేసుకున్నాడు. ఇదంతా బిగ్‌బాష్ లీగ్ సీజన్-12లో చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇక మంగళవారం బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. సిడ్నీ థండర్స్ ఇన్నింగ్స్ సమయంలో జట్టు ఓపెనర్ మాథ్యూ గిల్క్స్ దూకుడుగా ఆడుతున్నాడు. 56 పరుగుల వద్ద ఉన్నప్పుడు మిచెల్ స్వీప్సన్ బౌలింగ్‌లో లాంగాన్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. అయితే బంతి నేరుగా స్టాండ్స్‌వైపు దూసుకొచ్చింది. అయితే స్టాండ్స్‌లో నిలబడిన ఒక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. తనవైపు వస్తున్న క్యాచ్‌ను అందుకోవాలని ప్రయత్నించాడు. కానీ పాపం క్యాచ్ పట్టడంలో విఫలం కావడంతో బంతి నేరుగా అతన్ని ముక్కు మీద గట్టిగా తాకి పక్కకు పడింది. అయినా కూడా తనకేం కాలేదన్నట్లుగా అంతా ఒకే అని సింబల్ చూపించాడు. అయితే కాసేపటికే సదరు అభిమాని ముక్కు నుంచి రక్తం దారలా కారసాగింది. ఇది గమనించిన బ్యాటర్ మాథ్యూ గిల్క్స్ అతని వైపు చూడగా.. ముక్కుకు కర్చీఫ్ అడ్డుపెట్టుకున్న అభిమాని పర్లేదులే అన్నట్లుగా సైగ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. పియర్సన్ 27, గ్జేవియర్ బార్లెట్ 28 నాటౌట్ రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండానే కేవలం 11.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. అలెక్స్ హేల్స్ 59 నాటౌట్, మాథ్యూ గిల్క్స్ 56 నాటౌట్ జట్టును గెలిపించారు. Anyone know this guy who can let us know if his nose is all good?! 🫣@KFC #BucketMoment #BBL12 pic.twitter.com/YVjvgg6a9v — KFC Big Bash League (@BBL) December 27, 2022 చదవండి: Ashwin-Shreyas Iyer: మొన్న గెలిపించారు.. ఇవాళ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపారు దెబ్బ అదుర్స్.. ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్ -
chamika Karunaratne: 'ఊడిన పళ్లు వెనక్కి.. మూతికి 30 కుట్లు'
శ్రీలంక క్రికెటర్ చమిక కరుణరత్నే క్యాచ్ పట్టబోయి మూతిపళ్లు రాలగొట్టుకున్న సంగతి తెలిసిందే. లంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గాలే గ్లాడియేటర్స్, జఫ్నా కింగ్స్ మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. కాగా నోటి నుంచి రక్తం కారడంతో ప్రథమ చికిత్స తీసుకొని మళ్లీ మైదానంలోకి వచ్చాడు. మ్యాచ్ తర్వాత కరుణరత్నేను ఆసుపత్రికి తరలించి మూతికి సర్జరీ నిర్వహించారు. మూతికి 30 కుట్లు కూడా పడ్డాయి. ప్రస్తుతం కరుణరత్నే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదే విషయాన్ని కరుణరత్నే తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చాడు. ''నాలుగు పళ్లు ఉడినా తిరిగి వచ్చాయి.. మూతికి 30 కుట్టు పడ్డాయి.. కానీ నేను ఇప్పటికి నవ్వగలను. త్వరలోనే కోలుకొని తిరిగి జట్టులోకి వస్తా.. సీ యూ సూన్'' అంటూ మెసేజ్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కాండీ ఫాల్కన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గాలే గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మోవిన్ శుభసింగా 38 బంతుల్లో 40 పరుగులు, ఇమాద్ వసీమ్ 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్ 30 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. కమిందు మెండిస్ 44, పాతుమ్ నిస్సాంక(22), ఆండ్రీ ఫ్లెచర్(20) పరుగులు చేశారు. Chamika Karunaratne lost 4 teeth while taking a catchpic.twitter.com/WFphzmfzA1 — Out Of Context Cricket (@GemsOfCricket) December 8, 2022 View this post on Instagram A post shared by Chamika Karunaratne (@chamikakarunaratne) చదవండి: LPL 2022: మూతిపళ్లు రాలినా క్యాచ్ మాత్రం విడువలేదు ఆట గెలవడం కోసం ఇంతలా దిగజారాలా? -
మూతిపళ్లు రాలినా క్యాచ్ మాత్రం విడువలేదు
లంక ప్రీమియర్ లీగ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్యాచ్ తీసుకునే క్రమంలో మూతి పళ్లు రాలగొట్టుకున్నాడు లంక క్రికెటర్ చమిక కరుణరత్నే. కాండీ ఫాల్కన్స్, గాలె గ్లాడియేటర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. గాలె గ్లాడియేటర్ ఇన్నింగ్స్ సమయంలో బ్యాటర్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునేందుకు కరుణరత్నే పరిగెత్తుకొచ్చాడు. అదే సమయంలో మరో ఇద్దరు ఫీల్డర్లు కూడా రావడం చూసిన కరుణరత్నే వారిని వద్దని వారించాడు. ఇక క్యాచ్‌ను సులువుగా పట్టుకున్నట్లే అని మనం అనుకుంటున్న దశలో బంతి అతని మూతిపై బలంగా తాకింది. ఆ దెబ్బకు అతని ముందు పళ్లు ఊడివచ్చాయి. నోటి నుంచి రక్తం కారుతున్నప్పటికి క్యాచ్‌ను మాత్రం జారవిడవలేదు. ఆ తర్వాత పెవిలియన్ వెళ్లి ప్రథమ చికిత్స తీసుకొని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కాండీ ఫాల్కన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గాలే గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మోవిన్ శుభసింగా 38 బంతుల్లో 40 పరుగులు, ఇమాద్ వసీమ్ 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్ 30 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. కమిందు మెండిస్ 44, పాతుమ్ నిస్సాంక(22), ఆండ్రీ ఫ్లెచర్(20) పరుగులు చేశారు. Chamika Karunaratne lost 4 teeth while taking a catchpic.twitter.com/WFphzmfzA1 — Out Of Context Cricket (@GemsOfCricket) December 8, 2022 చదవండి: క్రిప్టో కరెన్సీ కంటే దారుణంగా పడిపోతున్నారు.. టీమిండియాపై సెహ్వాగ్ సెటైర్ -
విశాఖ: మత్స్యకారుల వలకు భారీగా చిక్కిన చేపలు (ఫొటోలు)
-
క్రికెట్ చరిత్రలో ఇలాంటి క్యాచ్ చూసి ఉండరనుకుంటా!
'క్యాచెస్ విన్ మ్యాచెస్' అని అంటారు. కొన్ని క్యాచ్‌లు మ్యాచ్‌లు గెలిపించిన సందర్బాలు ఉన్నాయి. ఒక్కోసారి బెస్ట్ ఫీల్డర్ అని చెప్పుకునే ఆటగాళ్లు కూడా క్యాచ్‌లు జారవిడుస్తుంటారు. ఒక్కోసారి ఈజీ క్యాచ్‌లు అందుకునే క్రమంలో చేసే తప్పిదాలు నవ్వును తెప్పిస్తుంటాయి. తాజాగా వీటిన్నింటిని మించిన క్యాచ్.. చరిత్రలో మనం ఎప్పుడు చూడని క్యాచ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. విషయంలోకి వెళితే.. విలేజ్ లీగ్ గేమ్‌లో భాగంగా.. ఆల్డ్విక్ క్రికెట్ క్లబ్, లింగ్‌ఫీల్డ్ క్రికెట్ క్లబ్ మధ్య మ్యాచ్ జరిగింది. లింగ్‌ఫీల్డ్ క్రికెట్ క్లబ్ బ్యాటింగ్ సమయంలో 16 ఏళ్ల అలెక్స్ రైడర్ బౌలింగ్‌కు వచ్చాడు. అతను వేసిన బంతిని బ్యాటర్ షాట్ ఆడే ప్రయత్నంలో గాల్లోకి లేపాడు. దీంతో అలెక్స్ రైడర్ కాట్ అండ్ బౌల్డ్‌తో బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్ చేరుస్తాడని భావించారు. అయితే క్యాచ్ అందుకున్నట్లే అందుకున్న రైడర్ చేతి నుంచి బంతి జారిపోయింది. ఇక్కడే ఎవరు ఊహించని ట్విస్ట్ జరిగింది. క్యాచ్ అందుకునే క్రమంలో అప్పటికే కింద పడిపోయిన రైడర్ తన కాలును పైకి లేపడం.. అదే సమయంలో బంతి జారి అతని కాలు మీద పడి మళ్లీ గాల్లోకి లేవడం.. ఈసారి రైడర్ ఎలాంటి మిస్టేక్ లేకుండా క్యాచ్ తీసుకోవడం జరిగిపోయాయి. రైడర్ క్యాచ్ అందుకునే చర్యలో బిజీగా ఉన్నప్పుడు తోటి ఆటగాళ్లు సహా ప్రత్యర్థి ఆటగాళ్లు నోరెళ్లబెట్టి చూడడం విశేషం. మొత్తానికి అలెక్స్ రైడర్ క్యాచ్ అందుకోవడం.. బ్యాటర్ పెవిలియన్ చేరడం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను స్టంప్ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోనూ దట్స్ సో విలేజ్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు.. 'గ్రేటెస్ట్ క్యాచ్ డ్రాప్ ఎవెర్' అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Cricket District (@cricketdistrict) The greatest dropped catch ever!? 😂 Brilliant clip from @AldwickCC's stump cam! pic.twitter.com/Cpmd80QdGP — That’s so Village (@ThatsSoVillage) June 16, 2022 చదవండి: క్రికెట్లో ఇలాంటి అద్భుతాలు అరుదుగా.. 134 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన పృథ్వీ షా -
క్యాచ్–22 సిచ్యువేషన్ అంటే ఏంటో తెలుసా?
జీవితంలో మనకు అప్పుడప్పుడూ కొన్ని రకాల సందర్భాలు ఎదురవుతుంటాయి. కింద ఇచ్చిన పరిస్థితి మీకు ఎప్పుడైనా ఎదురైతే ‘క్యాచ్–22 సిచ్యువేషన్’లో ఉన్నట్లు. ► ఏదైనా ఒక సందర్భంలో ఒక అడుగు ముందుకు వేయబోతే సమస్యల్లో చిక్కుకునే పరిస్థితి ఎదురుకావడం. (క్లిక్: ఉత్త ప్యాంగసియన్ ఆశ.. ఇంతకీ ఎవరు ఇతను?) ► మీరు మీ కళ్లజోడును ఎక్కడో పెట్టి మరిచిపోతారు. అయితే అవి ఎక్కడున్నాయో వెదకాలంటే కళ్లజోడు తప్పనిసరి. ఇదొక విచిత్ర పరిస్థితి. ∙మీరు కారు డ్రైవ్ చేస్తూ ఒక సైకిలిస్ట్‌ను ఢీకొట్టారు. ‘నువ్వు సైకిలిస్ట్‌ను చూశావా?’ అని జడ్జి అడుగుతాడు. ‘చూశాను’ అని అంటే ‘చూస్తూ కూడా ఎందుకు ఢీకొట్టావు?’ అని అడుగుతాడు. ‘చూడలేదు’ అని చెబితే ‘అంత నిర్లక్ష్యమా!’ అంటాడు. ఇదొక సంకట పరిస్థితి. (నయా ఇంగ్లిష్: ఘోస్ట్ కిచెన్ అంటే?) జోసెఫ్ హెలీ రాసిన క్యాచ్–22 సెటైరికల్ నవలతో ఈ ‘క్యాచ్–22’ అనే ఎక్స్ప్రెషన్ మొదలైంది. రెండో ప్రపంచయుద్ధ నేపథ్యం తీసుకొని రాసిన ఈ నవలలో యుద్ధంలో ఉండే క్రూరత్వం, వినాశనాన్ని వ్యంగ్యాత్మకంగా చెబుతారు రచయిత. (క్లిక్: అక్కడి పరిస్థితి హెలైసియస్గా ఉంది..!) -
లడ్డు లాంటి క్యాచ్ వదిలేసిన పుజారా.. మిన్నకుండిపోయిన కోహ్లి
Pujara Drops Simple Catch Of Keegan Petersen: దక్షిణాఫ్రికా గడ్డపై తొట్టతొలి టెస్ట్ సిరీస్ గెలిచే అవకాశాన్ని టీమిండియా చేజేతులా జారవిడిచింది. నిర్ణయాత్మకమైన మూడో టెస్ట్‌లో పేలవ ఫీల్డింగ్ కారణంగా మ్యాచ్‌ను ప్రత్యర్ధికి వదులుకుంది. ప్రత్యర్ధికి 212 పరుగుల ఫైటింగ్ టార్గెట్ నిర్ధేశించినప్పటికీ సునాయాసమైన క్యాచ్‌లు వదిలేయడం ద్వారా మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. నాలుగో రోజు ఆట కీలక దశలో(126/2) కీగన్ పీటర్సన్ ఇచ్చిన లడ్డు లాంటి క్యాచ్‌ను పుజారా నేలపాలు చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో పీటర్సన్ బ్యాట్ అంచును ముద్దాడిన బంతి, నేరుగా పూజారా చేతుల్లో ల్యాండైంది. అయితే పూజారా వదిలేసాడు. ఇది చూసిన కోహ్లి మిన్నకుండిపోయాడు. కాగా, పుజారా.. పీటర్సన్ క్యాచ్ వదిలేసే సమయానికి దక్షిణాఫ్రికా.. విజయానికి ఇంకా 83 పరుగుల దూరంలో ఉండింది. పీటర్సన్ కీలక ఇన్నింగ్స్(113 బంతుల్లో 10 ఫోర్లతో 82) ఆడి టీమిండియాకు విజయాన్ని దూరం చేశాడు. కాగా, దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టింద్దామనుకున్న టీమిండియాకు భంగపాటు ఎదురైంది. నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కీగన్ పీటర్సన్(82) సమయోచితమైన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాను విజయపు అంచులదాకా తీసుకెళ్లగా.. డస్సెన్(41 నాటౌట్), బవుమా(32 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, షమీ, శార్ధూల్‌లు తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223, రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తొలి టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలువగా, ఆతర్వాత దక్షిణాఫ్రికా వరుసగా రెండు, మూడు టెస్ట్‌లు గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకుంది. సీనియర్ల గైర్హాజరీలో సఫారీ జట్టు అద్భుతంగా రాణించి, టీమిండియాపై చారిత్రక సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. చదవండి: IND Vs SA 3rd Test: విరాట్ కోహ్లిపై నిషేధం..? -
వార్నీ.. ప్రతీకారం ఇలా కూడా తీర్చుకుంటారా!
Joshua da Silva Vs Dhananjaya de Silva.. క్రికెట్ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్ల మధ్య మాటలయుద్ధం జరగడం సహజం. వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇక ఆటగాళ్లు ప్రతీకారం ఈ విధంగా కూడా తీసుకుంటారా అని అనిపించడం ఖాయం. వారిద్దరే ధనుంజయ్ డిసిల్వా.. జోషువా ద సిల్వా. ధనుంజయ్ డిసిల్వా శ్రీలంక ఆల్‌రౌండర్ కాగా... జోషువా ద సిల్వా వెస్టిండీస్ వికెట్ కీపర్. ఇక విషయంలోకి వెళితే.. లంక, విండీస్ మధ్య జరిగిన తొలి టెస్టులో విండీస్ కీపర్ ద సిల్వా.. లసిత్ ఎంబుల్దేనియా బౌలింగ్‌లో ధనుంజయ్ డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ మ్యాచ్‌లో 54 పరుగులు చేసిన జోషువా.. కీలక సమయంలో రాణించినప్పటికి జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. చదవండి: WI vs SL: క్రీజులో పాతుకుపోయాడు.. తెలివైన బంతితో బోల్తా తాజాగా రెండో టెస్టులో ఈసారి 2 పరుగులు చేసిన ధనుంజయ్ డిసిల్వా.. వీరాస్వామి పెరుమాల్ బౌలింగ్‌లో జోషువా ద సిల్వాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పెవిలియన్‌కు వెళ్తున్న ధనుంజయ్‌ను ఉద్దేశించి జోషువా ..''నువ్వు నా క్యాచ్ పట్టావు.. నేను నీ క్యాచ్ పట్టా.. క్రికెట్లో జరిగేది ఇదే'' అనడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో మూడోరోజు ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సాంక 21, చరిత్ అసలంక 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌట్ అయింది. రమేశ్ మెండిస్ 6 వికెట్లు తీయగా.. ఎంబుల్డేనియా 2, జయవిక్రమ 2 వికెట్లు తీశారు. చదవండి: ICC Test Rankings: టాప్-5లోకి దూసుకొచ్చిన షాహిన్.. దిగజారిన విలియమ్సన్ "You catch me, I catch you - that's how it works in cricket" - @joshuadasilva08 😂 After being caught by (Dhananjaya) de Silva in the first Test, (Joshua) Da Silva promised revenge - and he got it! #SLvWI pic.twitter.com/GqkKR4NM3U — 🏏FlashScore Cricket Commentators (@FlashCric) November 30, 2021 -
సూపర్ భరత్... సాహా స్థానంలో వచ్చీరాగానే..
IND Vs NZ Highlights Superb low catch by KS Bharat: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ ఎట్టకేలకు విల్ యంగ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. వృద్ధిమాన్ సాహా స్థానంలో సబ్ట్యూట్గా వచ్చిన వికెట్ కీపర్ కేఎస్ భరత్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ 66 ఓవర్ వేసిన ఆశ్విన్ బౌలింగ్‌లో.. విల్ యంగ్ బ్యాట్‌ను తాకి బంతి వికెట్ కీపర్ కేఎస్ భరత్ చేతికి వెళ్లింది. అయితే ఆప్పీల్ చేయగా అంపైర్ దాన్ని తిరస్కరించాడు. వెంటనే భరత్ పట్టు పట్టిమరీ కెప్టెన్ రహానే సహాయంతో రివ్యూకు వెళ్లాడు. ఈ క్రమంలో రీ ప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు సృష్టంగా కన్పించింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనుక్కు తీసుకుని ఔట్‌గా ప్రకటించాడు. దీంతో ఎట్టకేలకు ఒక్క వికెట్ దక్కడంతో భారత శిబిరంలో ఆనందం నెలకొంది. కాగా వృద్ధిమాన్ సాహా మెడ నొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. మెడికల్ టీం అతడి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో సాహా స్థానంలో తెలుగు క్రికెటర్ భరత్‌ను మైదానంలోకి పంపినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి సాహా తీవ్రంగా నిరాశపరచడంతో భరత్‌ను జట్టులోకి తీసుకోవాలంటూ నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యాదృచ్చికంగా మూడో రోజు ఆటలో భాగంగా భరత్ కీపింగ్ చేయడం గమనార్హం. చదవండి: India Vs Nz 1st Test: వారెవ్వా భరత్... విల్ యంగ్ అవుట్ KS Bharat takes a good low catch to dismiss Will Young 👏🔥 Ravi Ashwin the wicket taker ❤️#INDvNZ #INDvsNZ#NZvIND #NZvsINDpic.twitter.com/Fo4JOdtn7T — CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) November 27, 2021 WHAT. A. CATCH! 🙌 Let's relive this brilliant glovework & DRS call from @KonaBharat 🎥 https://t.co/MkkXnnuc6M #TeamIndia #INDvNZ @Paytm — BCCI (@BCCI) November 27, 2021 UPDATE - Wriddhiman Saha has stiffness in his neck. The BCCI medical team is treating him and monitoring his progress. KS Bharat will be keeping wickets in his absence.#INDvNZ @Paytm — BCCI (@BCCI) November 27, 2021 -
ఫీల్డింగ్, కీపింగ్, క్యాచ్.. ఆల్‌రౌండర్ ప్రదర్శన.. జట్టులో చోటుందా..!
సాధారణంగా ఇంట్లో పెంపుడు జంతువులుగా.. శునకాన్ని పెంచుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. కుక్కను విశ్వాసానికి గుర్తుగా భావిస్తారు. చాలా మంది వీటిని.. తమ ఇంట్లో ఒక సభ్యుడి మాదిరిగానే ట్రీట్ చేస్తారు. శునకం కూడా తమ యజమాని పట్ల ఎనలేని ప్రేమను, అభిమానాన్ని చూపిస్తుంటుంది. బయటకు వెళ్లిన తమ యజమాని వచ్చేవరకు గుమ్మం వద్దనే కాచుకుని ఉంటాయి. యజమాని తప్ప వేరే వారు ఏది తినడానికి పెట్టిన కనీసం ముట్టుకోవు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కుక్కలతో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. మరికొంత మంది కుక్కలకు చిన్నచిన్న పనులు నేర్పిస్తుంటారు. ఏదైన వస్తువును లేదా బాల్‌ను విసిరి.. దాని వెనుక పరిగెడతారు. కుక్క నోటికి అందించి తెచ్చేలా దానికి ట్రైనింగ్ ఇస్తారు. ఇలాంటివి తరచుగా మనం సోషల్ మీడియాలోను.. మనచుట్టు చూస్తునే ఉంటాం. తాజాగా, భారత్ మాజీ క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండుల్కర్ ఒక ఆసక్తికర వీడియోను తన ట్విటర్‌ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో ఒక వీధిలో కొందరు చిన్న పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. ఒక బాలిక లెఫ్ట్‌హ్యాండ్‌తో బ్యాటింగ్ చేస్తుంది. ఒక బాలుడు వేగంగా బౌలింగ్ చేస్తున్నాడు. అక్కడ ఒక శునకం కీపింగ్ చేస్తుంది. ఆ బాలుడు స్పీడ్‌గా బౌలింగ్ చేయగానే ఆ కుక్క.. దాన్ని తన నోటితో క్యాచ్ పట్టేసుకుంటుంది. అదే విధంగా ఆ బాలిక.. షాట్ కొట్టగానే వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ బాల్‌ను తీసుకొస్తుంది. ఈ వీడియోలో శునకం.. కీపింగ్, ఫీల్డింగ్, క్యాచ్‌లతో.. ఆల్‌రౌండర్ ప్రతిభ కనబరుస్తుంది. ఈ ఆసక్తికర వీడియోను తన స్నేహితుడు పంపించినట్లు సచిన్ తెలిపాడు. ఆల్ రౌండర్ ప్రతిభ కనబరుస్తున్న శునకానికి మీరు ఏమని పేరుపేడతారంటూ సచిన్.. ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని’, ‘ ఆల్ రౌండర్ శునకం’, ‘లగాన్ సినిమా గుర్తొస్తుందంటూ..’ కామెంట్లు చేస్తున్నారు. Received this from a friend and I must say, those are some 'sharp' ball catching skills 😉 We've seen wicket-keepers, fielders and all-rounders in cricket, but what would you name this? 😄 pic.twitter.com/tKyFvmCn4v — Sachin Tendulkar (@sachin_rt) November 22, 2021 -
రషీద్ సూపర్ డైవింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే
Adil Rashid takes spectacular diving catch: టి20 ప్రపంచకప్2021లో భాగంగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఆదిల్ రషీద్ అద్బుతమైన క్యాచ్‌తో ఆభిమానులను ఆశ్చర్యపరిచాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో.. షకీబ్ అల్ హసన్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అది కాస్త మిస్ టైమ్ అయ్యి బంతి గాల్లోకి లేచింది. అయితే షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రషీద్ పరిగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్‌ను అందకున్నాడు. కాగా ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇనస్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది. చదవండి: T20 World Cup 2021: అలా అయితేనే టీమిండియా సెమీస్‌కు.. లేదంటే.. View this post on Instagram A post shared by ICC (@icc) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జగదీశ సుచిత్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
Jagadeesha Suchith Stunning Catch: ఐపీఎల్ 2021లో వరుస అపజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆప్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. అయితే శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జగదీశ సుచిత్ స్టన్నింగ్ క్యాచ్‌తో అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో దీపక్ హుడా మిడాన్ దిశగా కొట్టిన షాట్‌ను మెరుపు వేగంతో గాల్లోకి ఎగురుతూ సుచిత్ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ పట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. చదవండి: హోల్డర్ మెరిసినా... సన్‌రైజర్స్ అవుట్ pic.twitter.com/jvRijSA0pS — Sardar Khan (@SardarK07004661) September 25, 2021 -
విలియమ్సన్ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్
Kane Williamson Taken Wonderful Catch: దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్రైజర్స్ఓటమి చెందినప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆధ్బతమైన క్యాచ్‌తో అభిమానుల మనసును గెలుచుకున్నాడు. 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆదిలోనే ఓపెనర్ పృథ్వీ షా వికెట్‌ను కోల్పోయింది. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పృథ్వీ షాను కేన్ విలియమ్సన్ ఆధ్బతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఢిల్లీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానానికి చేరుకోగా, సన్‌రైజర్స్ ప్లేఆఫ్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. చదవండి: Shreyas Iyer: ఆ నిజాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయా.. ఇప్పుడు కూడా pic.twitter.com/lie44CD0Ks — Simran (@CowCorner9) September 22, 2021 -
Viral Video: సూపర్ ఉమెన్ స్మృతి మంధాన.. జస్ట్ వావ్
ఉత్కంఠభరితంగా సాగిన చివరి వన్డేలో టీమిండియా, ఇంగ్లండ్ మహిళల జట్టుపై విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు ఇంగ్లండ్ బ్యాటింగ్ టైంలో టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్ఉమెన్ స్మృతి మంధాన ఒడిసి పట్టిన క్యాచ్.. మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. 59 బంతుల్లో 5 ఫోర్లతో 49 పరుగులు చేసిన నాట్ స్కివర్ (49; 5 ఫోర్లు).. దీప్తి బౌలింగ్‌లో లాంగ్ షాట్ కోసం ప్రయత్నించింది. ఆ టైంలో బౌండరీ లైన్ దగ్గర స్మృతి మంధాన డైవ్ చేస్తూ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకుని పెవిలియన్‌కు చేర్చింది. Out of 10, how much would you rate this stunner by Smriti Mandhana? 😍🙌 #ENGvIND #ENGWvINDW pic.twitter.com/M66ivgC88v — Female Cricket (@imfemalecricket) July 3, 2021 కాగా, ఈ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ ఉమెన్ అంటూ తెగపొగిడేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే 2-1తేడాతో సిరీస్ ఓడిన టీమిండియా.. జులై 9న మొదలుకాబోయే టీ20 సమరానికి సిద్ధమవుతోంది. -
సలాం జడ్డూ భాయ్..
క్రైస్ట్‌చర్చ్: త్రీ డైమెన్షన్ ప్లేయర్‌కు పర్ఫెక్ట్ పర్యాయపదం రవీంద్ర జడేజానే అని మరో సారి రుజువైంది. బ్యాట్‌తో మెరుపులు మెరిపించగలడు.. బౌలింగ్‌తో మాయ చేయగలడు.. అంతకుమించి ఫీల్డింగ్‌తో మెస్మరైజ్ చేయగలడు. కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టుల్లో జడేజా సూపర్ మ్యాన్‌ను తలపించే ఓ విన్యాసం చేశాడు. మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ 72వ ఓవర్ చివరి బంతిని వాగ్నర్ స్వ్కెర్ లెగ్‌లో భారీ షాట్ ఆడాడు. ఆ బంతి బౌండరీ వెళ్లడం పక్కా అన్నట్టు కెమెరా కూడా బౌండరీ లైన్‌నే చూపించింది. కానీ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జడేజా ఎవరూ ఊహించని విధంగా కళ్లు చెదిరే రీతిలో గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ అందుకుని ఓ మై గాడ్ అనిపించాడు. ఆ ఊహించని సూపర్‌మ్యాన్ క్యాచ్‌కు వాగ్నర్ షాక్‌కు గురికాగా.. సహచర క్రికెటర్లు ఆనందంలో మునిగిపోయారు. ప్రస్తుతం రవీంద్ర జడేజా సూపర్ మ్యాన్ క్యాచ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘జడ్డూ కాదు జాదు’, ‘మానవమాత్రులకు సాధ్యం కాదు.. సూపర్ మ్యాన్ అతడు’, ‘సలాం జడ్డూ భాయ్’, ‘త్రీ డైమెన్షన్ ప్లేయర్ అంటే అర్థం జడేజా’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘రెండో రోజు ఆటలో జడేజా విభిన్న కోణాలను మనం చూశాం. తొలుత గ్రాండ్‌హోమ్‌ను బంతితో ఔట్ చేశాడు. అనంతరం వాట్లింగ్‌ను ఆ తర్వాత వాగ్నర్‌ను తన సూపర్ ఫీల్డింగ్‌తో ఔట్ చేశాడు’అంటూ హర్ష భోగ్లే ట్వీట్ చేశాడు. #INDvsNZ #NZvsIND #ravindrajadeja what a spectacular catch. pic.twitter.com/FnqRTqZrcB — Captain Kantor (@Bhramshastra) March 1, 2020 చదవండి: హమ్మయ్య.. ఆధిక్యం నిలిచింది సెమీస్ రేసులో కివీస్...