తిరువనంతపురం: కేరళలో వామపక్ష పార్టీ నాయకుడు దొంగతనం చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతని నిర్వాకం వెలుగులోకి వచ్చింది. కాసర్ గోడ్ జిల్లాకు చెందిన ప్రముఖ సీపీఎం నాయకుడు రాఘవన్ ఒక విదేశీయుడి ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించినపుడు రికార్డైన దృశ్యాలను పోలీసులు బుధవారం విడుదల చేశారు. దీంతో కలకలం రేగింది.
పోలీసులు అందించిన ప్రకారం మొహమ్మద్ యూనుస్ అనే వ్యాపారి కుటుంబం విదేశాల్లో ఉంటోంది. వారికి సంబంధించిన ఒక విలాసవంతమైన భవనంలో దొంగతనం జరిగినట్టుగా చుట్టు పక్కల వారు యూనుస్ బంధువులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడతో ఈ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.
అక్కడి సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు నిందితుడు సీపీఎం నాయకుడు రాఘవన్ గా గుర్తించారు. పెద్ద ఐరన్ రాడ్, ఒక బ్యాగు పట్టుకొని ఆ వ్యాపారి ఇంటిముందు తచ్చాడుతున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. నిందుతుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. విచారణ జరుగుతోందని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడి చేస్తామని పోలీసులు తెలిపారు.
అటు తమ నాయకుడి నిర్వాకంపై వెంటనే స్పందించిన పార్టీ అతడిని పార్టీనుంచి సస్పెండ్ చేసింది.
కాగా కేరళ విదేశాలలో నివసించే భారతీయులకు, ఎన్నారైలు కు చెందిన విలువైన ఆస్తలుకు, లగ్జరీ గృహాలకు కేరళ నిలయం. దీంతో ఈజీగా ఇక్కడి ఇళ్లు దొంగలకు టార్గెట్ గా మారాయి. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా అమర్చుకోవాలని పోలీసులు యజమానులను హెచ్చరించారు. ఫలితంగా 2013 లో తిరువంతపురంలో కరుడు కట్టిన నేరస్తుడు బంటీ చోర్ ఆటకట్టించిన సంగతి తెలిసిందే.