ఏపీజీవీబీ బ్యాంక్‌లో చోరీ | Robbery In Srikakulam APGVB Bank | Sakshi
Sakshi News home page

ఏపీజీవీబీ బ్యాంక్‌లో చోరీ

Published Thu, Mar 15 2018 9:31 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

 Robbery In Srikakulam APGVB Bank - Sakshi

శ్రీకాకుళం : జిల్లాలోని బూర్జ మండలం, కొల్లివలస  గ్రామంలోని ఏపీజీవీబీ బ్యాంకులో బుధవారం రాత్రి చోరీ జరిగింది. అర్థరాత్రి సమయంలో దుండగులు బ్యాంక్‌ కిటికి గ్రిల్స్‌ పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. అంతేకాకుండా సాక్షాలు దొరక్కుండా ఉండేందుకు సీసీ టీవీ కెమరాలను ధ్వంసం చేశారు. తెల్లవారుజామున బ్యాంకు కిటికి తెరిచి ఉండటం, సీసీ కెమరాలు ధ్వంసం అయి ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు, బ్యాంకు అధికారులకు సమాచారం అదించారు. విషయం తెలుసుకుని బ్యాంకు వద్దకు చేరుకున్న అధికారులు పెద్ద మొత్తంలోనే నగదు లూటీ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement