cctv camera
-
శంషాబాద్ ఓయో హోటల్ లో సీసీ కెమెరాలు
-
శంషాబాద్ ఓయో హోటల్ లో సీసీ కెమెరాలు
-
Wayanad: రాత్రికి రాత్రే.. భయానక దృశ్యాలు వైరల్
కేరళ వయనాడ్ ప్రకృతి విపత్తుతో కకావికలం అయ్యింది. భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడి.. బురద ప్రవాహం గ్రామాల్ని ముంచెత్తింది. సుమారు 300 మంది మరణించగా.. వందల మంది నిరాశ్రయులయ్యారు. మరో వంద మందికి పైగా జాడ లేకుండా పోయారు. ఈ విలయం ధాటికి దెబ్బతిన్న గ్రామాలు.. అక్కడి ప్రజలూ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.CCTV footage of the devastating #Wayanadlandslide in #Kerala which occurred 20 days ago, has gone viral.The disaster claimed 231 lives, with 212 body parts recovered, while 118 people remain missing.The footage, now circulating widely, captures the catastrophic moment,… pic.twitter.com/5FV9NbgaW9— South First (@TheSouthfirst) August 19, 2024అయితే.. కొండచరియలు విరిగినపడిన సమయంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇళ్లపై కొండచరియలు విరిగిపడటంతో ఒక్కసారి బురద కలగలిసిన జలప్రవాహం ఎగిసిపడి ముంచెత్తిన దృశ్యాలు వీడియోల్లో కనిస్తున్నాయి. -
మహిళపై అత్యాచారయత్నం : వీధి కుక్క అలర్ట్...దెబ్బకి..!
ఇటీవలి కాలంలో వీధికుక్కలు చిన్నపిల్లలపై దాడిచేస్తూ స్వైరవిహారం చేస్తున్న వార్తలు చదివి చాలా ఆందోళన చెందాం కదా. విశ్వాసానికి మారుపేరైన పెంపుడు కుక్కలు కూడా స్వయంగా యజమానిపై దాడి ఘటనలూ చేశాం. కానీ సాధారణంగా కుక్కలు యజమానులను ప్రేమిస్తాయి. ఆ మాటకొస్తే కాస్త గంజి పోయినా చాలు బోలెడంత విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. చిన్న పిల్లలంటే ఇంకా మక్కువ చూపిస్తాయి. అవసరమైతే తమ ప్రాణాలకు తెగించి మరీ మనుషులను ఆదుకుంటాయి. తాజాగా కుక్కల మీద మనుషులకు విశ్వాసాన్ని పెంచే ఘటన ఒకటి మహరాష్ట్రలోని ముంబై చోటు చేసుకుందిఅత్యాచారానికి యత్నించిన వ్యక్తినుంచి 32 ఏళ్ల మహిళను వీధి కుక్క రక్షించిన ఘటన జూన్ 30న ముంబైలోని వసాయ్‌లో జరిగింది. మాణిక్పూర్ సందులో నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై సందీప్ ఖోట్ అనే వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడు. అకౌంటెంట్ అయిన మహిళ ఇంటికి వస్తుండగా సందీప్ ఆమె వెంబడించాడు. నిర్మానుష్య ప్రదేశానికి వచ్చాక చంపేస్తాని బెదిరించి, నోరు నొక్కి కిందపడేశాడు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. ఇంతలో ప్రమాదాన్ని పసిగట్టిన ఓ వీధికుక్క గట్టిగా అరవడం మొదలు పెట్టింది. దెబ్బకి భయపడిన అతగాడు, లేచి అక్కడినుంచి ఉడాయించాడు. అయితే పోతూ పోతూ ఆమె ఐఫోన్‌ను లాక్కొని పారిపోయాడు. దీంతో బాధిత మహిళ తప్పించుకుంది. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని అరెస్టు చేశారు. -
శివ..శివా..! క్షణం ఆలస్యమైతే.. ప్రాణాలే పోయేవి..!
భూమ్మీద నూకలుంటే ఎలాంటి ప్రమాదం నుంచి అయినా ఇట్టే బయటపడవచ్చు. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. స్టోరీ ఏంటంటే.. బెంగళూరులోని మహాలక్ష్మీపురం లేఅవుట్ ప్రాంతంలో పెద్దగా హడావిడి లేకుండా, ప్రశాతంగా ఉంది. అయితే ఇరుకైన రోడ్డులో ఓ మహిళ ఒక ఎద్దును తోలుకుంటూ వెడుతోంది. తాను ముందు పోతూ ఎద్దును తాడుతో లాగుతోంది. ఇంతలో ఉన్నట్టుండి ఆ ఎద్దు వింతగా ప్రవర్తించింది. బైక్‌పై ఎదురుగా వస్తున్న వాహనదారుడి పైకి దూకింది. ఏదో పగ బట్టినట్టు, కావాలని చేసినట్టు అతడిపై లంఘించింది. ఈ హఠాత్మపరిణామానికి అదుపుతప్పిన అతడు ఎదురుగా వస్తున్న లారీ కిందకి దూసుకుపోయాడు. అయితే లారీ డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా, ఎద్దు కదలికలను గమనించిన డ్రైవర్ వేసిన బ్రేక్ పనిచేయక పోయినా అతగాడి ప్రాణాలు గాల్లో కలిసి పోయేవే. అదృష్టవశవాత్తూ డ్రైవర్ అలర్ట్ అయి వాహనదారుడి ప్రాణాలను కాపాడాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. Bangalore: The bull suddenly attacked the scooty rider. The person fell under the truck coming from the front. The truck driver immediately applied the brakes. The man narrowly escaped being hit by the tire of the truck. pic.twitter.com/Jpiei3CoIL — Mayank Arhat 𝕏 (@iMayankIndian_) April 6, 2024 -
సామర్లకోట లో లాడ్జ్ బాయ్‌ను చితక్కొట్టిన యువకులు
-
ఈ రైతు తెలివి మామూలుగా లేదు.. టమోట తోటకు అవే కాపాలా!
మైసూరు: ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు దేశంలోను, విదేశాల్లోనూ టమాటకు భారీ ధర ఉంది. కేజీ వంద రూపాయల దాకా ఉండడంతో రైతులకు కనకవర్షం కురుస్తోంది. కానీ దొంగలు రాత్రిపూట పంటను ఎత్తుకెళ్లడం అక్కడక్కడ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భద్రత కోసం రైతులు రకరకాల ఉపాయాలను అనుసరిస్తున్నారు. మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలోని కుప్పె గ్రామంలో నాగేష, కృష్ణ ఆనే ఇద్దరు రైతులు తమ టమాటా తోటలకు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. నాగేష 10, కృష్ణ 4 ఎకరాలలో టమాటా పంటను సాగు చేశారు. ధర ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే రెండుసార్లు తోటల్లో దొంగలు పడి ఎత్తుకుపోయినట్లు రైతులు వాపోయారు. నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తూ దొంగలను అడ్డుకుంటామని రైతులు చెబుతున్నారు. చదవండి పోలాండ్ మహిళకు తాళి కట్టనున్న జార్ఖండ్ యువకుడు! -
దొంగలకు ఊహించని అనుభవం.. పైసలు దొరక్క.. తిరిగి రూ. 100 చేతిలో పెట్టి
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోతున్నాయి. పట్టపగలే నడిరోడ్డుపై కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రద్దీ ప్రాంతాల్లోనూ దర్జాగా నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టి, ఏమార్చి అందినకాడికి దోచుకుంటున్నారు.ప్రగతి మైదాన్ టన్నెల్లో కారును అడ్డగించి రూ.2 లక్షలను ఎత్తుకుపోయిన ఉదంతం మరవకముందే మరో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ భారీ దొంగతనానికి స్కెచ్ వేసిన దొంగలకు షాకింగ్ అనుభవం ఎదురైంది. తూర్పు ఢిల్లీలోని షాహదారాలోని ఫార్ష్ బజార్లో ఓ జంటను అడ్డగించిన దోపిడి దొంగలు వారి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. అయితే ఊహించని విధంగా వారి వద్ద కేవలం రూ. 20 నోటు తప్ప మరేం లభించకపోవడంతో.. బదులుగా వారికే రూ. 100 రూపాయలు చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వింత ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.హెల్మెట్ ధరించి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వస్తున్న ఓ జంటను అడ్డగించారు. వెంటనే డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. ఇంతలో చోరికి వచ్చిన వారిలో ఓ వ్యక్తి ఎదుటి వారిని తనిఖీ చేయడం ప్రారంభించాడు. అయితే అతని వద్ద ఏం లభించలేదు. దీంతో తిరిగి దొంగలే సానుభూతితో దంపతుల చేతులో డబ్బులు పెట్టిన్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అనంతరం దొంగలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చదవండి: పెళ్లి మండపంలో ఇదేంది.. వధువు చేసిన పనికి నవ్వుకుంటున్న నెటిజన్లు! దీంతో ఆ జంట సరాసరీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగినదంతా చెప్పారు. తమ వద్ద ఏం దొరక్కపోవడంతో దొంగతానికి వచ్చిన వారే రూ. 100 నోటు చేతిలో పెట్టినట్లు తెలిపారు. దీంతో పోలీసులు దాదాపు 200 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 30 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరినీ దేవ్ వర్మ, హర్ష్ రాజ్‌పుత్‌గా గుర్తించారు. వర్మ ఒక ప్రైవేట్ జీఎస్టీ సంస్థలో అకౌంటెంట్, రాజ్‌పుత్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. యూట్యూబ్‌లో గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా వీడియోల ద్వారా ఇద్దరు ప్రభావితమయ్యారని, అతని గ్యాంగ్‌లో చేరాలనుకుంటున్నామని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. #WATCH | In a bizarre turn of events, two drunk men who were trying to rob a Delhi couple at gunpoint, handed Rs 100 to them instead. They did so when they realised that the couple only had Rs 20 with them. pic.twitter.com/9BpIp0JEFs — Daily Excelsior (@DailyExcelsior1) June 26, 2023 -
వీళ్ల తెలివి తగలెయ్య! కళాశాల టాయిలెట్లో సీసీ కెమెరా.. ఆ తర్వాత
ప్రపంచంలో రకరకాల దొంగలను మనం చూస్తూనే ఉంటాం. వీరిలో కొందరు విలువైన వస్తువులను దోచుకోగా, మరికొందరు తక్కువ విలువైన వస్తువులను దోచుకుంటుంటారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లోని ఓ దొంగ కళాశాలలోని కుళాయిలను తరచూ మాయం చేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన కాలేజీ సెక్యూరిటీ టీమ్ దొంగలను పట్టుకునేందుకు తీసుకున్న చర్యల కారణంగా విద్యార్థులు నిరసనకు దిగారు. అసలు అక్కడ ఏం జరిగిందంటే.. సీసీకెమెరా.. పొరపాటు జరిగింది. అజంగఢ్‌లోని డీఏవీ పీజీ కళాశాల విద్యార్థులు 'తోటి చోర్' (నీటి కుళాయి దొంగ)ను పట్టుకునేందుకు ప్లాన్ చేశారు. అందుకోసం కళాశాలలోని పలు చోట్ల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో టాయిలెట్ల వెలుపల కూడా ఒక కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో మండిపడ్డ విద్యార్థులు కళాశాల యాజమాన్యం తీరుపై మండిపడుతూ నిరసనకు దిగారు. ఈ పరిణామాలపై యాజమాన్యం స్పందిస్తూ.. క్యాంపస్‌లో నిత్యం నీటి కుళాయిలు చోరీకి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని నివారించేందుకు కుళాయిలపై నిఘా ఉంచాలనుకున్నాం. అందులో భాగంగానే సీసీటీవీ కెమరాలు ఏర్పాటు చేశాం. అయితే, పొరపాటున టాయిలెట్‌వైపు ఒక కెమెరా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాన్ని తీసివేసి మరో చోట మళ్లీ ఇన్స్టాల్ చేయమని ఆర్డర్ కూడా జారీ చేసినట్లు చెప్పింది. కళాశాల ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. బాత్రూం దగ్గర సీసీటీవీ కెమెరా ఒకటి ఏర్పాటు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే దిద్దుబాటు చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పారు. మరో వైపు కళాశాల అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనకు దిగిన విద్యార్థులు వారి నిరసనను విరమించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
Hyd: సీసీటీవీలో అసభ్యప్రవర్తన.. చితకబాదేశారు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎస్సార్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న ఓ బాలికను వేధింపులు గురిచేశాడు ఓ యువకుడు. దీంతో ఆగ్రహానికి గురైన బాలిక బంధువులు అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాలికతో సదరు యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. బాధితురాలు విషయం చెప్పడంతో.. సీసీటీవీలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు ఆమె బంధువులు. ఆపై వేధింపులపై అతన్ని నిలదీస్తూ.. చితకబాదారు. చివరకు పోలీసులకు అప్పగించారు. -
ఇంటర్ బోర్డు భద్రత వ్యవస్థ ట్యాంపర్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డులో భద్రత వ్యవస్థ ట్యాంపరింగ్‌కు గురైందని, కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారని బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ వెల్లడించారు. బోర్డులో అత్యంత కీలకమైన సీసీ కెమెరా లకు సంబంధించిన పాస్వర్డ్ చోరీ అయిందని తెలియడంతో అప్రమత్తమైనట్టు తెలిపారు. ఈ విషయం గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దీని వెనుక సూత్రధా రులెవరో, ఏ అవసరాల కోసం ఈ కుట్రకు పాల్పడ్డారో దర్యాప్తులో తేలుతుందన్నారు. నేర చరిత్ర ఉన్న ఓ వ్యక్తి బోర్డు అధికారిని బెదిరించి, భయపెట్టి పాస్‌వర్డ్‌ను తస్కరించినట్టు ప్రాథమికంగా తెలిసిందన్నారు. దీనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలిచ్చినట్టు మిత్తల్ వెల్లడించారు. ఆన్లైన్ మూల్యాంకనం పూర్తి పారదర్శకం అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే ఈ ఏడాది నుంచి ఇంటర్ సమా ధాన పత్రాల ఆన్లైన్ మూల్యాంకనం చేపడుతున్నట్లు మిత్తల్ తెలిపారు. దీనివల్ల మూల్యాంకనం పారదర్శకంగా ఉండటంతోపాటు తప్పుల నివారణ సాధ్య మవుతుందని తెలిపారు. గతంలో విద్యార్థి రీవ్యాల్యూయేషన్ కోరితే జిల్లాల నుంచి పేపర్లు తెప్పించడంలో తీవ్ర జాప్యం జరిగేదని, ఇప్పుడు ఆన్లైన్ చేయడం వల్ల వేగవంతంగా పూర్తవుతుందని చెప్పారు. పేపర్లు దిద్దేవారికి ఇచ్చే టీఏ, డీఏ ఖర్చునూ నివారించవచ్చన్నారు. ఇప్పటికే అన్ని దేశాలూ, విశ్వవిద్యా లయాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని, ఆన్లైన్ మూల్యాంకనం కోసం అధ్యాపకు లకు అవసరమైన శిక్షణ కూడా ఇస్తామని వివరించారు. ఈ ఏడాది ప్రయోగాత్మ కంగా ఆర్ట్స్, కామర్స్, లాంగ్వేజ్‌లకు సంబంధించిన 35 లక్షల పేపర్లను ఆన్లైన్ ద్వారా వ్యాల్యుయేషన్ చేస్తున్నామని, రెండేళ్లలో ఈ విధానాన్ని పూర్తిగా విస్తరిస్తా మన్నారు. గతంలో జరిగిన విధానంలో ప్రైవేటు కాలేజీలు సమాధాన పత్రాలు ఎక్కడకు వెళ్తున్నాయో తెలుసుకుని వారికి అనుకూలమైన విధానాలు అనుసరించారనే ఆరోపణలున్నాయని, ఇలాంటివి ఇప్పుడు సాగవనే ఉద్దేశంతో ఏసీబీ కేసులున్న ఓ వ్యక్తి పనిగట్టుకుని బోర్డు ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడని మిత్తల్ చెప్పారు. -
TSRTC: ప్యానిక్ బటన్.. సీసీ కెమెరాలు.. అందుబాటులోకి ఆధునిక బస్సులు!
సాక్షి, హైదరాబాద్: ప్యానిక్ బటన్.. ప్రయాణ సమయాల్లో మహిళలు తాము ప్రమాదంలో ఉన్నామని.. తమను కాపాడాలని పోలీసులకు తెలిపేందుకు వినియోగించే సాంకేతిక సాధనం. అలాగే రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, వరదల వంటి ప్రకృతి విపత్తుల్లో వాహనాలు చిక్కుకున్నప్పుడు సహాయం కోరేందుకు దోహదపడే పరికరం. కేవలం ఒక్క బటన్‌ను నొక్కడం ద్వారా వాహన లైవ్ లొకేషన్‌ను నేరుగా పోలీసులు లేదా సహాయ బృందాలకు తెలియజేయగలగడం దీని ప్రత్యేకత. ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చిన ఈ సాధనం ఇప్పుడు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో కూడా అందుబాటులోకి రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్భయ పథకంలో భాగంగా మహిళా భద్రత కోసం అన్ని ప్రజారవాణా వాహనాల్లో ప్యానిక్ బటన్లు, వాహన లొకేషన్ ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఇప్పుడు కొత్తగా కొంటున్న బస్సుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఆర్టీసీకి చేరిన 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను సంస్థ శనివారం వినియోగంలోకి తెస్తోంది. ఈ బస్సులను అశోక్ లేలాండ్ కంపెనీ రూపొందించింది. మొత్తం 630 సూపర్ లగ్జరీ బస్సుల ఆర్డర్ పొందిన ఆ కంపెనీ తాజాగా 50 బస్సులను అందించింది. మిగతావి రోజుకు కొన్ని చొప్పున జనవరి నాటికి పూర్తిగా సరఫరా చేయనుంది. ఈ బటన్ నొక్కడం ద్వారా సమాచారాన్ని పొందే కమాండ్ కంట్రోల్ రూమ్ బస్‌భవన్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే అది ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి రాగానే బస్సుల్లోని ప్యానిక్ బటన్‌తో ఆ వ్యవస్థ అనుసంధానమై పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రతి బస్సులో రెండు వీడియో కెమెరాలు.. బస్సుల్లో అవాంఛిత ఘటనలు చోటుచేసుకున్నప్పుడు కారణాలను గుర్తించే వీలు ప్రస్తుతం లేదు. కొత్తగా వచ్చే బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. డ్రైవర్ కేబిన్ వద్ద ఉండే ఓ సీసీ కెమెరా.. బస్సులోకి ఎక్కే ప్రయాణికులను గుర్తిస్తుంది. డ్రైవర్ వెనుక భాగంలో ఉండే మరో కెమెరా బస్సు చివరి వరకు లోపలి భాగాన్ని చిత్రిస్తుంది. ఈ రెండు కెమెరాలు చిత్రించిన వీడియో ఫీడ్ 15 రోజుల వరకు నిక్షిప్తమవుతుంది. ఇక బస్సును రివర్స్ చేసేటప్పుడు డ్రైవర్‌కు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కొత్త బస్సుల్లో రివర్స్ కెమెరాలను బిగించారు. బస్సు వెనుకవైపు ఉండే కెమెరా రివర్స్ చేసేటప్పుడు డ్రైవర్‌కు వెనుక ప్రాంతాన్ని చూపుతుంది. త్వరలో బస్సు ట్రాకింగ్ వ్యవస్థ కూడా అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా బస్సులో ఉండనున్నాయి. ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం కూడా ఏర్పాటు చేశారు. మోతాదుకు మించి వేడి ఉత్పన్నమైనా లేక పొగ వచ్చినా ఈ వ్యవస్థ గుర్తించి అలారం మోగిస్తుంది. దీంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపేసి ప్రయాణికులను కిందకు దించేందుకు వీలవుతుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల తరచూ బస్సుల్లో చోటు చేసుకొనే అగ్రిప్రమాదాలను ముందే గుర్తించి ప్రయాణికులకు ప్రాణాపాయాన్ని తప్పించేందుకు ఈ అలారంతో అవకాశం కలుగుతుంది. అలాగే ఈ బస్సుల్లో సెల్‌ఫోన్ చార్జింగ్ కోసం ఏర్పాట్లు చేయడంతోపాటు వినోదం కోసం టీవీలను ఏర్పాటు చేశారు. 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శనివారం ట్యాంక్‌బండ్‌పై ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రెండ్రోజుల క్రితం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ప్రకటించినప్పటికీ సీఎం ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో రవాణాశాఖ మంత్రి ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. మొత్తం 1,016 కొత్త బస్సులకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో 630 సూపర్ లగ్జరీ బస్సులు, 370 డీలక్స్/ఎక్స్‌ప్రెస్ బస్సులు, 16 ఏసీ స్లీపర్ బస్సులున్నాయి. త్వరలో 130 డీలక్స్ బస్సులు కూడా అందనున్నాయి. శబరిమల.. సంక్రాంతి స్పెషల్‌గా సేవలు.. ప్రస్తుతం శబరిమల అయ్యప్ప భక్తుల కోసం దాదాపు 200 బస్సులు బుక్ అయ్యాయి. మరిన్ని బుక్ కానున్నాయి. శబరిమల దూర ప్రాంతమైనందున వీలైనంత వరకు కొత్త బస్సులు కేటాయించనున్నారు. ఇప్పుడు అందుతున్న సూపర్ లగ్జరీ బస్సుల్లో కొన్నింటిని అందుకు వినియోగించనున్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా దూర ప్రాంతాలకు స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. కొత్త బస్సుల్లో కొన్నింటిని అందుకు కేటాయించనున్నారు. (క్లిక్ చేయండి: తెలంగాణ భవన్ ముందు ట్రాఫిక్ నరకం) -
జస్ట్ మిస్....లేదంటే పాపం ఆ చిన్నారి....
ఘజీయిబాద్: ఇటీవలకాలంలో చిన్నారులపై తరుచుగా వీధికుక్కల దాడులు గురించి వింటున్నాం. మొన్నటికి మొన్న ఒక మూడేళ్ల బాలుడు కుక్కల దాడిలో మృతి చెందాడు. అంతకుముందు ఒక పదేళ్ల చిన్నారి కుక్కల దాడిలో దారుణంగా గాయపడింది. ఈ ఘటనలు మరువక మునుపే అచ్చం అలాంటి ఘటనే ఘాజియా బాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....ఘజియాబాద్‌లోని 11 ఏళ్ల బాలికపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసేందుకు యత్నించాయి. ఆ చిన్నారి తన అపార్టమెంట్ కమ్యూనిటీ నుంచి బయటకు వెళ్లగా ఒక్కసారిగా ఎక్కడ నుంచి వచ్చాయో ఏమో! ఒక కుక్కల గుంపు ఆ చిన్నారి వెంట పడ్డాయి. దీంతో ఆ చిన్నారి ఒక్క ఊదుటన వేగంగా పరుగుతీసి తన అపార్టమెంట్స్ కమ్యూనిటీ గేట్లోకి వెళ్లిపోవటంతో ఆ కుక్కల బారి నుంచి తప్పించుకోగలిగింది. ఆమె ఇలా గేట్లోకి రాగానే వెంటనే అక్కడ ఉన్నసెక్యూరిటీ సిబ్బంది బయటకు వచ్చారు. దీంతో ఆ క్కుక్కల తోక ముడిచి వెనుదిరిగాయి. జస్ట్ మిస్ లేదంటే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ కుక్కల దాడి కి బలయ్యి ఉండేది. ➡स्ट्रीट डॉग के झुंड ने बच्ची पर किया हमला ➡कुत्तों के हमले की घटना CCTV में कैद ➡बच्ची चिल्लाते हुए वापस सोसायटी में घुसी ➡लेकिन एक कुत्ते ने बच्ची के पैर में काट लिया ➡बच्ची के चिल्लाने पर गार्ड दौड़कर पुहंचे ➡वैशाली की रामप्रस्था ग्रीन सोसायटी का मामला।#Ghaziabad pic.twitter.com/3Dmh0HGh6L — भारत समाचार | Bharat Samachar (@bstvlive) November 20, 2022 (చదవండి: 'నా పేరు సరిచేయండి' మహా ప్రభో! కుక్కలా మొరుగుతూ నిరసన) -
సీసీటీవీ కెమెరాలు తీసేయకుంటే జైల్లో నిరాహార దీక్ష: సాయిబాబా
నాగపూర్: జైలులో తాను కాలకృత్యాలు తీర్చుకొనేచోట, స్నానం చేసే చోట అధికారులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారని, వాటిని వెంటనే తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా డిమాండ్ చేశారు. లేదంటే జైలులో నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. మావోయిస్టులతో సంబంధాల కేసులో ఆయన ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగపూర్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. అధికారులు అతనికి వాటర్ బాటిల్ ఇవ్వడానికి నిరాకరించారని ఆరోపించారు. జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా సాయిబాబా మంచం పక్కన స్టీల్ బాటిల్‌ను ఉంచారని, అతని ఆరోగ్య పరిస్థితి కారణంగా బాటల్‌ను ఎత్తలేడని, దీని ఫలితంగా తీవ్రమైన వేడిలో తరచుగా నీరు త్రాగడానికి అతని వద్ద బాటిల్ లేదని వారు పేర్కొన్నారు. -
అద్దెకు దొరకవు... అధిక కిరాయిలు!
సాక్షి, హైదరాబాద్: ఈనెల 23 నుంచి మొదలయ్యే టెన్త్ పరీక్షలకు సీసీ కెమెరాల ఏర్పాటు సమస్యగా మారింది. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ ఈసారి సీసీ కెమెరా పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాల బండిల్‌ను తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. పరీక్ష కేంద్రం నుంచి రాష్ట్రస్థాయి వరకు ఆన్లైన్ లింక్ ఉండాలని, అన్ని స్థాయిల్లోనూ పర్యవేక్షణ ఉండాలని స్పష్టంచేసింది. అయితే, ఇందుకోసం వాడే సీసీ కెమెరాలను అద్దెకు మాత్రమే తీసుకోవాలని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. హైదరాబాద్‌లో పెద్ద ఇబ్బందులు లేనప్పటికీ.. జిల్లా కేంద్రాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఇదో సమస్యగానే అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,400 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతీ కేంద్రంలో చీఫ్ ఎగ్జామినర్ వద్ద సీసీ కెమెరా ఉండాలి. అక్కడి నుంచి ఇంటర్నెట్ ద్వారా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి లింక్ ఉంటుంది. అయితే, ప్రతీ జిల్లాలోనూ కనీసం 200 పరీక్ష కేంద్రాలుంటే, అన్ని సీసీ కెమెరాలు అద్దెకు లభించడం కష్టంగా ఉంది. జిల్లా కేంద్రాల్లో కొద్ది మొత్తంలో ఉన్నా, రోజుకు కనీసం రూ.1,500 వరకూ అద్దె అడుగుతున్నారు. వైఫై, ఇతర ఇన్స్టలేషన్ చార్జీలు అదనం. కనీసం పది రోజులు ఒక కెమెరా పరీక్ష కేంద్రంలో ఉంచినా, రూ.15 వేల వరకూ చెల్లించాలి. అయితే, మార్కెట్లో ఒక్కో కెమెరా కొనుగోలు చేసినా ఇంతకంటే తక్కువగా దొరుకుతుందని అంటున్నారు. పెద్ద మొత్తంలో సమకూర్చుకోవడం కష్టమైనప్పుడు వేరే ప్రాంతాల నుంచి ఇంత తక్కువ సమయంలో తెప్పించడం ఎలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇదే అదనుగా ప్రైవేటు వ్యక్తులు సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎక్కువ మొత్తాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలాఉంటే, జిల్లా కలెక్టరేట్ అధికారులు మాత్రం తక్కువ రేటుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీఈవోలపై ఒత్తిడి తెస్తున్నారు. కొంతమంది కలెక్టర్లు మాత్రం ఈ బాధ్యతను రాష్ట్రస్థాయిలోనే ఏదైనా సంస్థకు ఇస్తే బాగుంటుందని, జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయలేమని విద్యాశాఖకు చెప్పినట్లు తెలిసింది. అయితే, పాఠశాల విద్య డైరెక్టర్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జాగు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మాకు మిగిలేదేంటి కొద్దిరోజుల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా, బిగింపునకు అయ్యే ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. వీటన్నింటినీ కలుపుకొనే మేం రోజుకు రూ.1,500 అద్దెతో ఇవ్వాల్సి ఉంటుంది. పరీక్షల తర్వాత వాటిని తొలగించినా, వాడిన వైరు, ఇతర ఉపకరణాలను ఏమీ చేసుకోలేం. అదీగాక నెట్ సౌకర్యం లేని ప్రాంతంలో తాత్కాలిక నెట్ సౌకర్యం కల్పించాలి. ఇవన్నీ కలుపుకొంటే మాకు మిగిలేది పెద్దగా ఏమీ ఉండదు. – డి.వేణు (సీసీ కెమెరాల నిర్వాహకుడు) -
మిస్టరీగా మారిన గజ ఈతగాని మృతి.. సీసీకెమెరాలో షాకింగ్ విషయాలు
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా, బైంసా గడ్డేన్న ప్రాజెక్టులో గజ ఈతగాని మృతి మిస్టరీగా మారింది. రెండు రోజుల క్రితం ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లిన సాయినాథ్ శవమై తెలాడు. అయితే సాయినాథ్ డ్యామ్‌లోకి దూకిన సమయంలో ఆ సంఘటన సీసీ కెమెరాలలో రికారయ్యింది. ఈ సీసీ పుటేజీలో డ్యామ్‌లో దూకిన సాయినాథ్ కొద్ది దూరం ఈతకోట్టినట్లు రికార్డైంది. (చదవండి: వంకర మనుషులున్నారు.. నా వల్ల కాదు) ఆ తర్వాత నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గజ ఈతగాడు ఎలా మ్రుతిచెందాడనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చదవండి: హాస్టల్లో ఏదో ఉందని! ఒంటిపై రక్కుతున్నట్లు, తమను లాగుతున్నట్లు అనిపిస్తోందని.. -
తల్లి, కుమార్తెలపై ఎమ్మెల్యే అనుచరుల దాడి.. ఇనుప రాడ్‌తో..
న్యూఢిల్లీ: దేశ రాజాధానిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆప్ ఎమ్మెల్యే అనుచరులు కొందరు తల్లికుమార్తెలపై కర్రలు, ఐరన్ రాడ్‌తో విచక్షణారహితంగా వారిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వివరాలు.. ఈ సంఘటన నవంబర్ 19న, ఢిల్లీ, శాలిమార్ బాగ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు.. 38 ఏళ్ల మహిళ, ఆమె కుమార్తెపై ఇనుప రాడ్డు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. నిందితుల్లో మహిళలు కూడా ఉండటం గమనార్హం. ఇక తమను ఇంత దారుణంగా హింసించింది ఆప్ ఎమ్మెల్యే బందన కుమారి అనుచరులని.. అందుకే పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సదరు మహిళ వాపోయింది. (చదవండి: Cheena Kapoor: కొత్త దారి...కెమెరా చెప్పే కథలు) వీడియోలో ఉన్న దాని ప్రకారం మహిళ, ఆమె కుమార్తె కారు నుంచి దిగగానే.. కొందరు వ్యక్తులు వారి మీద విచక్షణారహితంగా దాడి చేశారు. వారిపై పిడిగుద్దులు కురిపించడమే కాక ఇనుప రాడ్డు, కర్రలతో చితకబాదారు. ఇంతలో మరికొందరు వ్యక్తులు కూడా అక్కడకు చేరుకుని.. మిగతావారితో కలిసి.. ఏమాత్రం జాలి, దయ లేకుండా వారిని చితకబాదారు. బాధితులు తమను కాపాడాల్సిందిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడ నుంచి పారరయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. మంగళవారం అనగా నవంబర్ 30న వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మహిళలపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆప్ ఎమ్మెల్యే బందన కుమారి మద్దతుదారులైన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు తమపై దాడి చేశారని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. (చదవండి: క్యాబ్ డ్రైవర్‌పై మహిళ వీరంగం.. నడి రోడ్డుపై చొక్కా పట్టుకొని) "నవంబర్ 19 రాత్రి, ఆప్ ఎమ్మెల్యే బందన కుమారికి తెలిసిన వ్యక్తులు నాతో పాటు నా కుమార్తెపై దాడి చేశారు. 2019లో ఎమ్మెల్యే భర్తపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసినందున ఈ దాడి జరిగింది. నేను ఎమ్మెల్యే చేసిన తప్పులను బయటపెట్టాను. వారిపై గతంలో కూడా అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి" అని ఆ మహిళ తెలిపింది. చదవండి: ఎంపీకే టోకరా.. రూ. 25 కోట్లకు కుచ్చుటోపి #WATCH | A group of persons beat up a woman with sticks in a residential colony in Shalimar Bagh area of Delhi on November 19 Based on the woman's complaint, Delhi Police has registered an FIR against unknown persons, it said. (CCTV footage of the incident) pic.twitter.com/YmZRtD7COu — ANI (@ANI) December 1, 2021 -
అమ్మతనానికే కళంకం.. పిల్లల ముందే ప్రియుడితో కలిసి వ్యభిచారం
లక్నో: అమ్మ ప్రేమ గురించి కవులు, పుస్తకాలు ఎంతో గొప్పగా వర్ణించారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే తల్లి ప్రేమ గురించి వర్ణించడానికి మాటలు చాలవు. కానీ నేటి కాలంలో కొందరు మహిళలు బరితెగించి ప్రవర్తిస్తూ.. అమ్మ అనే మాటకే మాయని మచ్చగా మిగులుతున్నారు. శారీరక సుఖం కోసం కన్న బిడ్డలను బలి తీసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్ కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం నిందుతురాలైన మహిళతో వివాహం అయ్యింది. వారికి ఓ అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు సంతానం. కొన్నేళ్లపాటు వారి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత సదరు వ్యక్తి భార్యకు ఓ క్యాబ్ డ్రైవర్‌తో పరిచయం ఏర్పడి.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో భర్త పని కోసం ఇంటి నుంచి వెళ్లగానే.. క్యాబ్ డ్రైవర్ వారి ఇంటికి వచ్చేవాడు. (చదవండి: నాడు యువతి చేతిలో చెంప దెబ్బలు.. నేడు రాజకీయాల్లో ప్రవేశం) ఇక ఇంట్లో పిల్లల ముందే.. సదరు మహిళ, క్యాబ్ డ్రైవర్ విచ్చలవిడిగా ప్రవర్తించేవారు. పిల్లల ముందే వారి తల్లి.. క్యాబ్‌డ్రైవర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించేది. అంతేకాక ప్రియుడి కోరిక మేరకు అతడు చెప్పిన వారికి నగ్నంగా మారి వీడియో కాల్స్ చేసేది. వీరి వికృత చేష్టలు చూసి పిల్లలు తీవ్రంగా భయపడేవారు. వారి అరచకాలు అంతటితో ఆగలేదు. సదరు క్యాబ్ డ్రైవర్ తన ప్రియురాలి పిల్లలతో కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీని గురించి ఎవరికైనా చెబితే.. తండ్రిని చంపేస్తామని బెదిరించేవాడు. ఇలా సాగుతున్న వీరి వికృత చేష్టల గురించి ఓ సారి సదరు మహిళ భర్తకు తెలిసింది. ఇరుగుపొరుగు వారు.. అతడు బయటకు వెళ్లాక ఇంటికి ఎవరో ఒక వ్యక్తి వస్తున్నాడని.. రోజు ఇలానే జరుగుతుందిన తెలిపారు. (చదవండి: పోలీస్ కస్టడీలో యువకుడు మృతి.. హత్యా? ఆత్మహత్యా?) అప్పటికే భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం వచ్చిన సదరు వ్యక్తి.. భార్యకు తెలియకుండా ఇంట్లో సీసీటీవీ కెమెరా అమర్చాడు. ఇక దానిలో రికార్డయిన దృశ్యాలు చూసి.. అతడికి ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. భార్య, ఆమె ప్రియుడి వికృత వేషాలు అతడి కంటపడ్డాయి. దీని గురించి భార్యను నిలదీయగా.. నా ఇష్టం.. నా దారికి అడ్డువచ్చావంటే చంపేస్తానని బెదిరించింది. దాంతో సదరు వ్యక్తి పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. ఫిర్యాదు చేశాడు. తన భార్య, ఆమె ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే వ్యభిచారం చేస్తుందని పేర్కొన్నాడు. తనను, పిల్లలను చంపుతామని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో పోలీసులు బాధితుడి భార్య, ఆమె లవర్ మీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. చదవండి: భయపెట్టమంటే.. భయానికే భయం పుట్టించాడు! -
దొంగతనం: 3 నెలలుగా ఒంటిపూట భోజనం.. 10 కేజీలు బరువు తగ్గి మరీ
గాంధీనగర్: ఆరోగ్యంగా, అందంగా ఉండాలని బరువు తగ్గే వారి గురించి చదివాం.. విన్నాం. కానీ దొంగతనం చేయడం కోసం బరువు తగ్గిన వ్యక్తి గురించి ఎప్పుడైనా విన్నారా.. లేదా.. అయితే ఇది చదవండి. గుజరాత్‌కు చెందిన మోతీ సింగ్ చౌహాన్ దొంగతనం చేయడం కోసం కఠినమైన డైట్ ఫాలో అయ్యి.. మూడు నెలల్లో 10 కేజీల బరువు తగ్గాడు. దొంగతనం అనంతరం పోలీసులకు చిక్కడంతో ఇతగాడి వెయిట్‌లాస్ జర్నీ బయటకు వచ్చింది. ఆ వివరాలు.. రెండేళ్ల క్రితం భోపాల్‌లోని బసంత్ బహార్ సొసైటీలో మోహిత్ మరాడియా అనే వ్యక్తి ఇంట్లో నిందితుడు మోతీ సింగ్(34) పనిచేసేవాడు. ఈ క్రమంలో మరాడియా ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడ ఉంటాయి.. సీసీటీవీ కెమరాలు ఎక్కడ ఫిట్ చేశారు వంటి వివరాలన్ని మోతీ సింగ్‌కు పూర్తిగా తెలుసు. ఇంటి తలుపులు కూడా ఎలక్ట్రిక్‌వి కావడంతో వాటిని సాధారణ పద్దతుల్లో బ్రేక్ చేయడం కష్టమని అర్థం చేసుకున్నాడు మోతీ. (చదవండి: పట్టపగలే సినీ ఫక్కీలో ఘరానా మోసం) ఈ క్రమంలో కిటికీ గుండా ఇంట్లోకి ప్రవేశించాలని భావించిన మోతీ.. ఇందుకు తగ్గట్లు తన శరీరాన్ని మార్చుకున్నాడు. ఈ క్రమంలో బరువు తగ్గడం కోసం మూడు నెలలుగా ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకున్నాడు. ఎందుకిలా అని తోటి పనివారు ప్రశ్నిస్తే.. బరువు పెరుగుతున్నాను.. అందుకే డైటింగ్ చేస్తున్నాని చెప్పుకొచ్చాడు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం.. మరాడియా ఇంట్లో ఉన్న సీసీకెమరాలకు చిక్కకుండా మోతీ ఆ ఇంట్లో దొంగతనం చేశాడు. అనంతరం తాను దొంగిలించిన సొత్తును ఓ హార్డ్‌వేర్ షాపులో 37 లక్షల రూపాయలకు విక్రయించాడు. ఇక మోతీ చర్యలు షాప్ ఎదురుగా ఉన్న సీసీకెమరాలో రికార్డయ్యాయి. మరో విశేషం ఏంటంటే ఇదే హార్డ్‌వేర్ షాపులో మోతీ దొంగతనానకి ముందు రంపం, తాపీని కొనుగోలు చేశాడు. వీటి సాయంతో మరాడియా ఇంటి వంటగది కిటికీని కత్తిరించి లోపలికి ప్రవేశించి తన పని కానిచ్చాడు. (చదవండి: హ్యాండ్సప్ అని గన్ గురిపెట్టాడో లేదో.. వాటే రియాక్షన్!) అప్పటికే మరాడియా ఇంటి సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడి కోసం గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో హార్డ్‌వేర్ షాప్ బయట ఉన్న సీసీటీవీ కెమరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా అతడిని అరెస్ట్ చేశారు. మోతీ నవంబర్ 5న మరాడియా ఇంట్లో 37 లక్షల రూపాయలకు చోరీకి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మోతీని అరెస్ట్ చేసే సమయంలో అతడి వద్ద ఉన్న ఇతర విలువైన వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కూడా దొంగిలించిన సొత్తే అని పోలీసులు తెలిపారు. మోతీ సెల్ ఫోన్ లొకేషన్ పోలీసులకు అతడి గురించి సమాచారం ఇచ్చింది. చివరకు మోతీ తన స్వస్థలమైన ఉదయపూర్‌కు పారిపోతుండగా ఎస్పీ రింగ్ రోడ్ వద్ద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మోతీ వద్ద నుంచి చోరీకి గురైన నగదు, విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: తమ గుట్టు రట్టు కాకుండా ఉండేందుకు.. మహిళ ప్రాణం తీసి! -
చైనా షాపులో మహిళా దొంగల హల్చల్
-
వైరల్ : అది దెయ్యమా.. భూతమా..!
నేరాలు, ఘోరాల నియంత్రణకు, నిర్ధారణకు సీసీటీవీ కెమెరాలు సాయపడతాయని మనందరికీ తెలుసు. అయితే, వీవీయాన్ గోమెజ్ అనే మహిళకు మాత్రం తన ఇంటి పరిసరాల్లో సంచరిస్తున్న ఓ వింత ఆకారాన్ని పరిచయం చేసాయి. రోజూ ఉదయం నిద్రలేవగానే తమ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ఫుటేజీలు పరిశీలించడం ఆమెకు అలవాటు. గత ఆదివారం ఉదయం కూడా ఆమె అలానే చేశారు. కానీ, ఊహించని షాక్‌కు గురయ్యారు. వీడియో ప్రకారం.. బిల్డింగ్ సెల్లార్ నుంచి ఓ వింత ఆకారం బయటి కొచ్చింది. ఎముకల గూడుగా ఉన్న ఆ అతి పలుచని శరీరాన్ని చూసి ఆమె భయంతో వణికిపోయారు. ‘ఆదివారం ఉదయం నిద్రలేవగానే ఇంటి ఆవరణలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించాను. సెల్లార్లో నుంచి ఏదో ఆకారం బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది. తొలుత దాని నీడ చూసి ఏదైనా జంతువు కావచ్చు అనుకున్నాను. కానీ అది భయంగొల్పే ఆకారంలో ఉంది. కారు ముందుకు వచ్చి అదోరకమైన ఆనందంతో చిందులు వేసింది. స్టన్ అయ్యాను’ అని తన ఫేస్బుక్ పేజీలో ఆ ఘటన తాలూకు అనుభవాలను చెప్పుకొచ్చారామే. ఇక ఈ వీడియోలో ఉన్న ఆ వింత జీవి గురించి ఎవరికి వారు తమవైన విశ్లేషణలు, అనుభవాలు జోడించి చెప్తున్నారు. ఇది దెయ్యమే అని ఒకరు.. ‘కాదు అంతా నాటకం కావాలనే మమ్మల్ని తప్పదోవ పట్టిస్తున్నారు. ఇది పక్కా ప్రాంక్ వీడియో’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇది హ్యారీపొటర్ సినిమాలోని డాబీ మ్యాజికల్ హౌజ్‌లో ఉన్న జీవిగా ఉందని మరొకరు చెప్పారు. ఈ వీడియోకు 30 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. -
అక్కడ సీసీటీవీ కెమెరా ఎందుకోసం పెట్టారు?
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. తన ఇంటి సరిహద్దుల్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడంపై ట్విటర్లో స్పందించిన తేజస్వీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వరుస ట్వీట్లతో నితీశ్‌పై విరుచుకుపడ్డారు. నితీశ్ ప్రతిపక్ష పార్టీ నేతలపై నిఘా పెట్టడం మానుకోవాలని సూచించారు. ఆయన తన భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న సదుపాయాలు ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. పట్నాలో తన ఇంటి పక్కనే నితీశ్ ఉంటుందని తేజస్వి తెలిపారు. తమ ఇళ్ల మధ్య ఉన్న సరిహద్దు గోడపై చాలా ఎత్తులో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం వెనుక అర్థమెంటని తేజస్వీ ప్రశ్నించారు. దీని ద్వారా అవతలి వ్యక్తుల ప్రైవసీకి భంగం కలుగుతోందని వాపోయారు. ఇలాంటి పనులు చేయవద్దని నితీశ్‌కు ఎవరైనా సూచించడని వ్యంగ్యంగా స్పందిచారు. పట్నాలో నేరాలు సంఖ్య పెరిగిపోతున్న పట్టించుకోని సీఎం.. ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారనే దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టారని ఎద్దేవా చేశారు. పౌరులకు భద్రత కల్పించాల్సింది పోయి.. వారి గోపత్యకు విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు. Bihar CM’s residence is surrounded by main roads from 3 sides & Leader of Opposition's residence from the fourth side. But CM felt the need for CCTV only on the wall bordering his political adversary's residence? Someone should tell him that these petty tricks will prove futile! pic.twitter.com/HISzUEW1Gr — Tejashwi Yadav (@yadavtejashwi) 15 November 2018 అలాగే నితీశ్ విలాసవంతమైన జీవితం గుడుపుతున్నాడని ఆరోపించారు. నితీశ్‌కు మూడు సీఎం నివాసాలు ఉంటే.. అందులో 2 పట్నాలో, ఒకటి ఢిల్లీలో ఉన్నాయని పేర్కొన్నారు. వాటితో పాటు బిహార్ భవన్లో మరో విలాసంతమైన సూట్ ఉందని తెలిపారు. ఒక పేద రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంత విలాసవంతమైన జీవితం అవసరమా అని నిలదీశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే నైతికత నితీశ్‌కు ఉందా అని ప్రశ్నించారు. -
ఏదీ పురోగతి?
అనంతపురంలోని సాయినగర్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచిలో ఖాతాదారుడి వద్ద నుంచి నగదు అపహరించిన కేసు దర్యాప్తు అటకెక్కింది. ఆరు నెలలు గడిచినాదర్యాప్తులో ఎలాంటి పురోగతీ లేదు. జేఎన్టీయూ ఎస్బీఐ బ్రాంచిలో లాకర్ తెరిచి రూ.39లక్షలు దోచుకుని వెళ్లిన కేసును 15 రోజుల్లో ఛేదించిన పోలీసులు... మెయిన్ బ్రాంచి చోరీ నిందితులను గుర్తించడంలో విఫలమయ్యారు.దర్యాప్తును పూర్తిగా అటకెక్కించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం సెంట్రల్: అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపానున్న డీఎస్పీ రెడ్డి భారత్‌గ్యాస్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న తలారి బాలరాజు ఫిబ్రవరి 12న గ్యాస్ ఏజెన్సీ డబ్బులను ఖాతాలో జమ చేసేందుకని ఎస్బీఐ సాయినగర్ మెయిన్బ్రాంచ్కు వెళ్లాడు. రూ. 5.15 లక్షల నగదుతో క్యూలో నిల్చొని ఉన్నాడు. అప్పటికే రెక్కీ నిర్వహించిన నలుగురు దొంగలు చాకచక్యంగా బాలరాజు వద్దనున్న నగదు బ్యాగును అపహరించుకుపోయారు. క్షణాల్లోనే బాధితుడు బ్యాంకు అధికారులను, పోలీసులను అప్రమత్తం చేశాడు. అయితే అప్పటికే బ్యాంకు నుంచి దొంగలు ఉడాయించినట్లు సీసీ కెమెరాల ద్వారా తేలింది. దర్యాప్తులో వేగం లేదు.. తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు చాలెంజింగ్‌గా తీసుకొని దర్యాప్తు చేసే పోలీసులు సాయినగర్ స్టేట్‌బ్యాంకు చోరీ కేసుపై పెద్దగా దృష్టి సారించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు సీసీ కెమెరా ఫుటేజీల్లో స్పష్టంగా కనిపించారు. అయినప్పటికీ వారెవరనేది గుర్తించలేకపోయారు. ఎంతటి పెద్ద నేరంలోనైనా నిందితులు ఇసుమంత క్లూ అయినా వదిలేసి పోయి ఉంటారని భావిస్తారు. జేఎన్టీయూ స్టేట్‌బ్యాంకు లాకర్లో నగదు దోపిడీ కేసులో కూడా ఇది నిరూపితమైంది. ఇనుప కడ్డీలను తొలగించేందుకు తెచ్చుకున్న గ్యాస్‌కట్టర్, సిలిండర్లను దుండగులు అక్కడే వదిలేసిపోయారు. ఎక్కడి నుంచి గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిందని ఆరా తీస్తే బెంగుళూరులో తీసుకున్నట్లు తేలింది. అక్కడ నగదును ట్రాన్స్ఫర్ చేయడంతో అకౌంట్ ఖాతా ఆధారంగా నిందితులను గుర్తించారు. హర్యానాకు చెందిన ప్రొఫెషనల్ ముఠాను 15 రోజుల్లోగా పట్టుకోగలిగారు. మరి సాయినగర్ స్టేట్‌బ్యాంకు చోరీ కేసును మాత్రం పోలీసులు ఈ స్థాయిలో చాలెంజింగ్‌గా తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీస దర్యాప్తు కూడా చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్వరలో పట్టుకుంటాం సాయినగర్ స్టేట్‌బ్యాంకు చోరీ కేసులో నిందితులను హోజికుప్పం ముఠా సభ్యులుగా గుర్తించాం. ఘటన జరిగిన వెంటనే ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపాం. అయితే వారి ఆచూకీ దొరకలేదు. నిందితుల కోసం వేట కొనసాగుతోంది. కచ్చితంగా నిందితులను పట్టుకుంటాం. – జె.వెంకట్రావ్, డీఎస్పీ, అనంతపురం -
నేర పరిశోధనలో ‘నేను సైతం’
హైదరాబాద్: నగరానికి చెందిన ఓ తల్లీకుమార్తె రూ.30 లక్షలతో గత బుధవారం విజయవాడకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఆటోలో రైల్వేస్టేషన్‌కు వస్తుండగా నగదు బ్యాగు ‘మాయమైంది’. దర్యాప్తు చేసిన గోపాలపురం పోలీసులు గురువారం ఉదయానికే ఆ బ్యాగు జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ వర్కర్ వద్దకు ‘చేరినట్లు’ గుర్తించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని సోమవారం అదుపులోకి తీసుకుని రూ.28.4 లక్షలు రికవరీ చేశారు. ‘నేను సైతం’ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో ఇది సాధ్యమైందని నార్త్‌జోన్ డీసీపీ బి.సుమతి వెల్లడించారు. తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. నగదుతో ఉన్న బ్యాగు మాయం... విజయవాడకు చెందిన సుశీల తల్లి (102) నల్లకుంటలో మనుమరాలు భాగవతుల మోహిని (50) వద్ద ఉండేది. ఈమె ఇటీవల మరణించడంతో సుశీల నగరానికి వచ్చారు. ఇక్కడ పనులు ముగించుకుని గత బుధవారం తిరుగు ప్రయాణమ య్యా రు. విజయవాడలో కుమారుడికి ఇవ్వడానికి రూ.30 లక్షలు సిద్ధం చేసుకున్నారు. ఐదు బ్యాగులతో మోహిని, సుశీల ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. స్టేషన్‌కు చేరుకున్నాక చూస్తే నగదు ఉన్న బ్యాగు కనిపించలేదు. అదే ఆటోలో వెనక్కు వెళ్లి గాలించినా ఫలితం లేకపోవడంతో గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రాస్‌రోడ్స్‌లో పడిపోయినట్లు గుర్తింపు... పోలీసులు వెంటనే నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నల్లకుంట–సికింద్రాబాద్ స్టేషన్ మధ్య ఉన్న సీసీ కెమెరాలపై దృష్టిపెట్టారు. 42 కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను సేకరించిన అధికారు లు విశ్లేషించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చీ హోటల్ వద్ద ఉన్న కెమెరాలో ఉదయం 6:28 గంటల ప్రాంతంలో బ్యాగు జారిపోవడం స్పష్టంగా రికార్డయింది. ఆ బ్యాగు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఆనుకుని ఉండటంతో ఎవరూ గమనించలేదు. 25 నిమిషాల తర్వాత అటుగా వచ్చిన జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ స్వీపర్ ఆ బ్యాగ్‌ను తీసుకున్నట్లు రికార్డ యింది. పోలీసులు గురువారం జీహెచ్ఎంసీ సూపర్వైజర్ శ్రీనివాస్‌ను విచారించారు. బ్యాగు తీసుకున్న వ్యక్తి కె.రాములు అని, అత నిది ఇబ్రహీంపట్నం సమీపంలోని గంగారం అంటూ చెప్పాడు. రాములు కోసం ప్రయత్నించగా ఆచూకీ లభించలేదు. సోమవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బవార్చీ హోటల్ ఎదురుగానే అదుపులోకి తీసుకున్నారు. డంపింగ్ యార్డ్‌లో రూ. 5 లక్షలు... బ్యాగులో అంత డబ్బు చూసేసరికి ఏం చేయాలో పాలుపోలేదని రాములు పోలీసులకు చెప్పాడు. అందులో రూ. 5 లక్షల్ని ముషీరాబాద్‌లోని డంపింగ్ యార్డ్‌లో పాతిపెట్టానన్నాడు. తన కుమారుడు కె.శ్రీశైలం ద్విచక్ర వాహనం ఖరీదు చేసుకోవడానికి రూ. 59,700, తన బావమరిది వి.శ్రీశైలానికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఇచ్చానని అంగీకరించాడు. మరో రూ. 23,40,300లు తన ఇంట్లో ఉన్నాయని వెల్లడించాడు. దీంతో డంపింగ్ యార్డ్, రాములు ఇంటి నుంచి పోలీసులు రూ. 28,40,300లు రికవరీ చేశారు. పరారీలో ఉన్న ‘శ్రీశైలాల’ కోసం గాలిస్తున్నారు. కాగా ప్రతి ఒక్కరూ ‘నేను సైతం’కింద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సుమతి కోరారు. ఈ కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన గోపాలపురం ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్, డీఐ కిరణ్‌కుమార్, ఎస్సై రామకృష్ణలతో పాటు క్రైమ్ బృందాలను అభినందించారు. వీరికి ప్రత్యేక రివార్డులు అందించారు. -
ఆ 30 లక్షలు దొరికాయ్!
సాక్షి, హైదరాబాద్ : 30 లక్షల రూపాయల మిస్సింగ్ కేసును సికింద్రాబాద్, గోపాలపురం పోలీసులు సోమవారం చేధించారు. ఈ నెల1న (బుధవారం) నల్లకుంటకు చెందిన భగవతుల మోహిని(50), ఆమె తల్లి సుశీల(85)లు విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆటోలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బయల్దేరారు. మధ్యలో రూ.30 లక్షల రూపాయలున్న బ్యాగును పోగొట్టుకున్నారు. రైల్వే స్టేషన్‌కు వచ్చాక నగదు ఉన్న బ్యాగు కనిపించకపోవడంతో తిరిగి అదే రూటులో ఎంత వెతికినా దొరకలేదు. దీంతో గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా అన్ని కోణాల్లో పరిశీలించిన వారు సీసీ కెమెరాల సాయంతో కేసును చేధించారు. వారు ప్రయాణించిన మార్గంలోని మొత్తం 42 సీసీ కెమెరా వీడియోలను పరిశీలించిన పోలీసులు.. బ్యాగ్‌ను మహేశ్వరానికి చెందిన మున్సిపల్ కాంట్రాక్ట్ స్వీపర్ రాములు(48) తీసుకున్నట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని రూ.28 లక్షలు రికవరీ చేశారు. కేసును త్వరగా చేధించిన పోలీసులకు డీసీపీ సుమతి రివార్డులు అందజేశారు. ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా అందరూ తప్పనిసరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. -
గురుకులాల్లో నిఘా నేత్రాలు
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు గురుకుల సొసైటీలు చర్యలు చేపట్టాయి. ప్రతి గురుకులంలో అధునాతన పద్ధతిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. గురుకులాల సంఖ్య పెరగటంతో అక్కడక్కడా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వాటిని నియంత్రించేందుకు నిఘా వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తేనున్నాయి. ఒక్కో గురుకుల పాఠశాలలో కనిష్టంగా రూ.1.5 లక్షలతో డిజిటల్ సీసీ కెమెరాలు, స్టోరేజీ సిస్టం ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 565 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ వ్యవస్థను పాఠశాల స్థాయిలో ఆపరేటింగ్ చేసేలా వెసులుబాటు ఉన్నప్పటికీ.. నిర్వహణ తీరును పరిశీలించేందుకు గురుకుల సొసైటీలో ప్రత్యేకంగా కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. అన్ని గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో వీటి ఏర్పాటుకు రూ.15 కోట్లు ఖర్చు చేసేలా సొసైటీలు సుముఖత వ్యక్తం చేయడంతో అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. -
భద్రత శివ.. శివా..!
అది దక్షిణ కాశిగా వినుతికెక్కినపల్లవుల నాటి ఆలయం..వాయులింగక్షేత్రం.. రాహుకేత పూజలకు నిలయం.. నిత్యంవేలాది మంది భక్తుల రాక.. ఏటా రూ.వంద కోట్ల పైబడిన రాబడి..ఇదీ ముక్కంటి ఆలయప్రశస్తి్త. అలాంటి ఆలయ సెక్యూరిటీ సిబ్బందిని పర్యవేక్షించే ప్రధానభద్రతాధికారి లేరు. దీంతోఆలయ భద్రత ఆ శివయ్యకే ఎరుక. శ్రీకాళహస్తి:ముక్కంటి ఆలయానికి నాడు పదుల సంఖ్యలో మాత్రమే భక్తులు వచ్చేవారు. ఆలయానికి వచ్చే ఆదాయం నిత్యకైంకర్యాలకే సరిపోయేది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. వేలాది మంది భక్తులు ముక్కంటీశును దర్శనార్థం వస్తున్నారు. దీంతో నేడు ఆలయ ఆదాయం ఏడాదికి రూ.వంద కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో దేవస్థానానికి పదేళ్లుగా సెక్యూరిటీ పెంచారు. ఇందులో భాగంగా ఆలయ భిక్షాలగోపురం, శివయ్య, తిరుమంజనం, దక్షిణగోపుర మార్గాల్లో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. అయితే కొంతకాలం క్రితం ఆ మెటల్ డిటెక్టర్లను తొలగించారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులను తనిఖీలు చేయడం మానేశారు. ఆలయంలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మాస్టర్‌ప్లాన్ నేపథ్యంలో దేవస్థానానికి అన్ని వైపుల దారులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆలయానిక భద్రత కరువైంది. ఆలయానికి సీఎస్ఓ కరువు శ్రీకాళహస్తి దేవస్థానానికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్(సీఎస్ఓ) కరువయ్యారు. మూడు నెలలుగా ఆలయానికి సీఎస్ఓ లేరు. దీంతో ఎవరు పడితే వారు తామే ఆలయ భద్రాతా సిబ్బందికి ఇన్చార్జి అని చెప్పుకుంటూ చెలమణి అవుతున్నారు. దేవస్థానంలో 120 మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది(ఏజెన్సీల ద్వారా), 35 మంది హోంగార్డులు, 18 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది పని చేస్తున్నారు. ప్రధానంగా ఆలయంలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బం దికి డ్యూటీలు వేయడంతో పాటు ఎవరూ ఏ పాయింట్లో ఉండాలి, భక్తులతో మర్యాదపూర్వకంగా ఎలా మెలగాలి, భక్తుల సమస్యలను ఎలా పరిష్కరించాలనే విషయాలతోపాటు ఎవరూ ఏ ప్రాంతంలో డ్యూటీలు నిర్వహించాలన్న విషయాలను సీఎస్ఓ పర్యవేక్షించాల్సి ఉంది. ఆలయానికి సీఎస్ఓ లేకపోవడంతో పలువురు పెత్తనం చేస్తున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. దీంతోనే ఆలయంలో సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితులు గందరగోళంగా మారాయి. ఇదే అదునుగా భక్తులను దళారీలు మోసం చేస్తున్నారు. మరోవైపు దేవస్థానంలో పనిచేస్తున్న 35 మంది హోంగార్డులు శ్రీకాళహస్తి డీఎస్పీ కంట్రోల్లో పనిచేస్తుంటారు. ఇక 18 మంది ఎస్పీఎఫ్ ఉద్యోగులు తిరుపతిలోని వారి బ్రాంచ్ కార్యాలయ డీఎస్పీ కంట్రోల్లో పనిచేస్తున్నారు.అయితే వీరిలో పలువురు భక్తులను అడ్డదిడ్డంగా దర్శనాలు చేయించి, వారి నుంచి డబ్బులు గుంజుతున్నారనే విమర్శలున్నాయి. దీనికితోడు ఆలయంలో ఇటీవల కాలంలో చోరీలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయానికి భద్రత కరువైందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. అభద్రతకు నిదర్శనాలివీ.. ♦ దేవస్థానంలో గతంలో హుండీలతోపాటు హుండీల లెక్కింపు సమయంలోను చోరీలు జరిగాయి. ♦ ఆలయానికి చెందిన మింట్‌లో నాగ పడగలను చోరీ చేశారు. ♦ పోటులో నూనె, నెయ్యి డబ్బులు సైతం చోరీకి గురయ్యాయి. ♦ బ్రహ్మగుడి వద్ద దేవస్థానానికి చెందిన కొన్ని ఆభరణాలను కొందరు తరలించే ప్రయత్నం చేయగా భక్తుల సమాచారంతో వాటిని దక్కించుకున్నారు. ♦ దేవస్థానంలో పలువురు భక్తుల పర్సులతోపాటు సింగపూర్‌కు చెందిన ఓ మహిళా భక్తురాలికి చెందిన డైమండ్ నెక్లస్ చోరీకి గురైంది. భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తాం దేవస్థానానికి సం బంధించి భద్రత విషయంలో ప్రత్యే క శ్రద్ధ చూపుతాం. ఆలయానికి త్వరలో సీఎస్ఓను ని యమిస్తాం. భక్తులతో మర్యాదగా వ్యవహరించని వారిపై చర్యలు తప్పవు. మెటల్ డిరెక్టర్ల పునరుద్ధరణ విషయంపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మాస్టర్‌ప్లాన్‌లో బిజీబిజీగా ఉన్నమాట వాస్తవమే. అయినా ఆలయ పరిపాలనపై ప్రత్యేక నిఘా ఉంచాం. –రామస్వామి, ఈఓ,శ్రీకాళహస్తీశ్వరాలయం -
ఆదర్శ గ్రామంగా వన్నెల్(బి)
బాల్కొండ నిజామాబాద్ : నేరాల నియంత్రణకు పోలీసులతో సహకరించడంలో మండలంలోని వన్నెల్(బి) గ్రామం ఆదర్శంగా నిలుస్తుందని సీపీ కార్తికేయ అన్నారు. గ్రామస్తులు రూ.2.7 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆర్మూర్ డివిజన్లో నేరాల నియంత్రణ కోసం గ్రామస్తులే స్వంతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో వన్నెల్(బి) ముందుందన్నారు. సమాజంలో జరుగుతున్న నేరాల నియంత్రణలో ప్రజలు అందరూ పోలీసులతో సహకరించాలన్నారు. అప్పుడే నేర రహిత సమాజం ఏర్పడుతుందన్నారు. సీసీ కెమెరాలతో అనేక ప్రయోజనలు ఉన్నాయని వివరించారు. కోర్టుల్లో పోలీసులు ప్రవేశపెడుతున్న సాక్ష్యాలకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఇతర గ్రామాల్లో కూడా వన్నెల్(బి) గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామస్తులను చైతన్యవంతులు చేసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేల కృషి చేసిన బాల్కొండ ఎస్ఐ స్వామీగౌడ్ను, గ్రామస్తులను అభినందించారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ శివకుమార్, ఆర్మూర్ రూరల్ సీఐ రమణరెడ్డి, స్థానిక సర్పంచ్ తాళ్ల భూషణ్, ఎంపీటీసీ రాజు, బాల్కొండ సహకార సంఘం అధ్యక్షుడు తూర్పు రమేశ్‌రెడ్డి, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కమ్యూనికేషన్ కార్యాలయం ప్రారంభం నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): జిల్లా కేంద్రంలోని పోలీస్‌లైన్‌లో ఏర్పాటు చేసిన పోలీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ కార్యాలయాన్ని శుక్రవారం సీపీ కార్తికేయ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నూతన హంగులతో ఏర్పాటు చేసిన ఈ భవనాన్ని సిబ్బంది చక్కగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నూతన భవనంలో కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ సామగ్రి కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటూ వీటిని చక్కగా వినియోగిస్తూ నేరాల నియంత్రణ కోసం వాడాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ ఆకుల రాంరెడ్డి, ఎన్ఐబీ, ఏఆర్ ఏసీపీలు సీహెచ్ మహేశ్వర్, రవీందర్, ఎస్బీ సీఐ రాజశేఖర్, ఆర్ఐ శేఖర్, శైలేందర్, రాంనిరంజన్, కమ్యూనికేషన్, ఎస్ఐలు నవీన్‌కుమార్, ఆర్ చంద్రబోస్ పాల్గొన్నారు. -
‘మహా సంప్రోక్షణలో సీసీ కెమెరాలు ఆపాల్సిన అవసరం లేదు’
విజయనగరం టౌన్ : తిరుపతి వేంకటేశ్వరాలయంలో చేసేవి శాంతి, సంప్రోక్షణలే అయితే సీసీ కెమెరాలు ఆపాల్సిన అవసరం లేదని ఉత్తరాంధ్ర సాధు సంతు పరిషత్ అధ్యక్షుడు సమతానంద స్వామి అన్నారు. కోట జంక్షన్ వద్ద బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహో సంప్రోక్షణం పేరిట తొమ్మిది రోజుల పాటు భక్తుల దర్శనానికి నిరాకరించడం, సీసీ కెమెరాలు ఆపేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆగస్టు 7 నుంచి 17 వరకూ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించడం మంచిదే కానీ, ఆ విషయాలను లక్షలాది మంది భక్తులకు సీసీల ద్వారా చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు. సంప్రోక్షణ కార్యక్రమాలు ఎంతో శ్రద్ధతో చేయాలన్నారు. ఇప్పటికే ర్యాలీలు, నిరసనలు వెల్లువెత్తిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం మార్చుకుని రోజుకు 50వేల మందికి దర్శనానికి అనుమతి ఇస్తామన్నా, సీసీ కెమెరాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదన్నారు. ఇప్పటికే టీటీడీపై భక్తులకు ఎన్నో అనుమానాలున్నాయని, ఇటువంటి సమయంలో ఇలా చేస్తే ఆ అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఆలయ సంప్రోక్షణ ముహూర్తం ఏ పీఠాధిపతి ధర్మాచార్యుడిని అడిగి ఖరారు చేశారని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రవణ్ చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
వసతి గృహాల్లో నిఘా నేత్రం
రామాయంపేట(మెదక్): వంద మంది చేయలేని పనిని ఒక సీసీ కెమెరా చేస్తుందంటారు. రోజురోజుకు సీసీ కెమెరాల వినియోగం పెరుగుతోంది. తాజాగా జిల్లాలో సాంఘీక సంక్షేమశాఖ అధ్వర్యలో కొనసాగుతున్న అన్ని గిరిజన హాస్టళ్లలో సీసీ కెమెరాలు బిగించారు. గిరిపుత్రులకు మంచి భోజనంతో పాటు హాజరు శాతాన్ని పెంచడం, అవినీతి, అక్రమాలను అరికట్టడానికిగాను ఈ సీసీ కెమెరాలను బిగించినట్లు సమాచారం. ఒక్కో హాస్టల్లో సుమారుగా రూ. 50 వేల ఖర్చుతో నాలుగు కెమరాలతో పాటు ఒక మానిటర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలోని ఆరు ఎస్టీ హాస్టళ్లలో, మూడు ఆశ్రమ పాఠశాలల్లో వీటిని ఇప్పటికే ఏర్పాటు చేశారు. కెమెరాలు బిగించిన తర్వాత హాస్టళ్లలో విద్యార్థుల హాజరుశాతం పెరగడంతో పాటు హాస్టళ్ల సంక్షేమాధికారులు క్రమం తప్పకుండా విధులకు హాజరవుతున్నట్లు సమాచారం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం కూడా అందుతుంది. కెమెరా కనుసన్నల్లో సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థులుసైతం క్రమశిక్షణతో మెదులుతున్నారని జిల్లా పరిధిలోని ఒక హాస్టల్ సంక్షేమాధికారి తెలిపారు. హాస్టళ్లలోని ప్రధాన ద్వారం, సామగ్రి ఉంచే ప్రదేశం, భోజనం, ప్రార్థన చేసే ప్రాంతంలో, వీటిని ఏర్పాటు చేశారు. నాలుగు కెమెరాల నుంచి వచ్చే వీడియోలకు సంబంధించి సమాచారం ఒక గదిలో ఉంచిన మానిటర్(టీవీ సెట్టు)లో నిక్షిప్తమవుతుంది. దీంతో హాస్టళ్లకు ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పటివరకు కెమెరాలు బిగించిన గిరిజిన హాస్టళ్లు రామాయంపేట, చిన్నశంకరంపేట, మెదక్, నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి, టేక్మాల్ (బాలికల హాస్టల్) ఆశ్రమ సంక్షేమ వసతి గృహం, మహమ్మదాబాద్( నర్సాపూర్) ఆశ్రమ వసతి గృహం, కౌడిపల్లి (ఆశ్రమ వసతి గృహం). -
కవల పిల్లల అపహరణపై విచారణ
భిక్కనూరు: మండల కేంద్రంలో సంచలనం కలిగించిన కవల పిల్లల అపహరణకు విఫలయత్నం పోలీసుల చొరవతో కథ సుఖాంతమైంది. వివరాలిలా ఉన్నాయి. భిక్కనూరు ఎస్ఐ రాజుగౌడ్ తెల్పిన మాట్లాడుతూ మండల కేంద్రంలో రాజస్థాన్‌కు చెందిన రంజిత్ అనే వ్యక్తి భిక్కనూరులో స్వీటు బండిని తోలుతూ మిఠాయిలను విక్రయిస్తాడు. అదే రాష్ట్రానికి చెందిన దినేష్ స్వీటు దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు రంజిత్ పిల్లలు శ్రీసాయి పబ్లిక్ స్కూల్లో చదువుతారు. దినేష్ పిల్లలు చైతన్య విద్యానికేతన్‌లో చదువుతున్నారు. రంజిత్ నాలుగు రోజుల క్రితం వేరే గ్రామానికి వెళ్లడంతో రంజిత్ భార్య రేష్మ తమ వద్ద పనిచేస్తున్న సుజాత కూతురు వెన్నెలను పిల్లలను స్కూల్ నుంచి తీసుకురమ్మని పంపించింది. వెన్నెల సాయి పబ్లిక్ స్కూల్‌కు వెళ్లాల్సి ఉంది. కాగా చైతన్య విద్యానికేతన్ స్కూల్‌కు వెళ్లి రాజస్థాన్ స్వీటు హోం పిల్లలను పంపించమని అక్కడి సిబ్బంది కోరింది. సిబ్బంది ఈ విషయాన్ని హెచ్ఎం అశోక్‌కు తెలిపారు. దీంతో హెచ్ఎం దినేష్‌కు ఫోన్ చేసి మీ పిల్లలను పంపించుమన్నారా అని అడిగారు. అదేమి లేదని దినేష్ చెప్పాడు. దీంతో అశోక్ వెన్నెలను దబాయించడంతో వెన్నెల పరిగెత్తింది. ఆదివారం ఈ విషయమై దినేష్ భిక్కనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్ఐ రాజుగౌడ్ సీసీ కెమెరాలను పరిశీలించి వెన్నెలను గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు ఆదివారం పిలిపించాడు. విచారించి ఎస్ఐ నిజానిజాలు తెలుసుకున్నాడు. వెన్నెల ఒక పాఠశాలకు వెళ్లే బదులు వేరే పాఠశాలకు వెళ్లడంతో ఈ సమస్య తలెత్తిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. -
ఆరేళ్ల చిన్నారిని ఢీ కొన్న కారు
-
సీసీటీవీలో రికార్డయిన షాకింగ్ వీడియో
ముజఫర్‌నగర్(ఉత్తరప్రదేశ్) : రోడ్డు దాటేటపుడు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి లేదా అనుకోకుండా చేసే చిన్న తప్పిదాలే భారీ ప్రమాదాలకు కారణమవుతాయి. ఆరేళ్లబాలిక మెయిన్ రోడ్డు క్రాస్ చేస్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముజఫర్ నగర్‌లోని ఓ మెయిన్ రోడ్డును క్రాస్ చేయాలనుకున్న బాలికను ప్రమాదవశాత్తూ కారు ఢీకొట్టింది. మెయిన్ రోడ్డు సగం క్రాస్ చేసిన బాలిక అనంతరం డివైడర్‌ను దాటి రోడ్డు అవతలి వైపు వెళ్లడానికి ప్రయత్నించగా, వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో బాలిక గాల్లో ఎగిరి దూరంలో పడిపోయింది. బాలికకు తీవ్రగాయాలవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈతతంగం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. జూలై మూడున చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించామని, డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
అమ్మవారి సన్నిధిలో ఇంత అపచారమా!
ఇంద్రకీలాద్రి/చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత లేదన్న విషయం మరోసారి రుజువైంది. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో మహిళలకు తీరని అవమానం జరిగింది. ఓ డార్మిటరీలో దుస్తులు మార్చుకునే చోట సీసీ కెమెరా ఏర్పాటు చేసి రికార్డ్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. మూడు నెలలుగా జరుగుతున్న ఈ తంతు సోమవారం వెలుగులోకి వచ్చింది. గతంలో దీనిపై సిబ్బందే ఫిర్యాదుచేసినా అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. వారి వైఖరి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అధికారుల నిర్వాకం చూసి భక్తులంతా అవాక్కవుతున్నారు. మహిళలు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు రికార్డ్ చేయడం దారుణమంటున్నారు. దీనిపై మహిళాలోకం భగ్గుమంటోంది. అమ్మవారి సన్నిధిలోనే తమకు రక్షణలేక పోవడంపై మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డార్మిటరీలో సీసీ కెమెరా.. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో పాడి వీధిలో సీవీ రెడ్డి చారిటీస్ పేరిట కాటేజీ నిర్వహిస్తోంది. ఈ కాటేజీ మెయిన్ హాల్లో లక్ష్మి పేరిట మహిళలకు ప్రత్యేకమైన ఏసీ డార్మిటరీని ఏర్పాటు చేశారు. ఆ డార్మిటరీలో 8 మంచాలు ఉండగా, కొంత ఖాళీ స్థలం కూడా ఉంది. కాటేజీలో వివాహాలు తదితర శుభకార్యాలు జరుపుకొనే సమయంలో మహిళలకు ఏసీ డార్మిటరీని అద్దెకు ఇస్తారు. అక్కడే వారు స్నానాలు చేసి దుస్తులు మార్చుకుంటూ ఉంటారు. ఆ డార్మిటరీ మొత్తం కనిపించేలా మూడు నెలల కిందట సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం కాటేజీలో ఓ వివాహం జరగగా, డార్మిటరీలో పెళ్లి కుమార్తెతో పాటు మరి కొంతమంది ఆమె బంధువులు విశ్రాంతి తీసుకున్నారు. పెళ్లి కుమార్తెతో పాటు మిగిలిన మహిళలందరూ అక్కడే దుస్తులు మార్చుకున్నారు. పెళ్లి తంతు అంతా అయిపోయిన తర్వాత తిరిగి వెళ్లే క్రమంలో మగవారు లగేజీని తీసుకువెళ్లేందుకు డార్మిటరీలోకి వచ్చారు. ఆ సమయంలో అక్కడ గోడకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను గుర్తించారు. సీసీ కెమెరా పని చేస్తున్నట్లుగా చిన్న లైటు వెలుగుతుండటంతో అనుమానం వచ్చి కాటేజీ కామన్ హాల్లో ఉన్న ఆలయ సిబ్బంది కార్యాలయంలోకి సదరు వ్యక్తులు వెళ్లి చూడగా అక్కడ సీసీ కెమెరా ఫుటేజీ స్పష్టంగా కనిపించింది. దీంతో పెళ్లి వారి బంధువులు ఆలయ సిబ్బందితో పాటు సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డింగ్‌పై నిలదీశారు. బుకాయిస్తున్న అధికారులు.. సీసీ కెమెరాల రికార్డు అంశం విషయం రచ్చకెక్కడంతో తప్పు సరిదిద్దుకునే ప్రయత్నాలు ఆలయ అధికారులు ప్రారంభించారు. ఈలోగా విషయం తెలిసి మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లి పరిశీలించగా కార్యాలయంలోని టీవీలో రెండు కెమెరాలు పని చేస్తున్నట్లు విజవల్స్ కనిపించాయి. దీంతో ఆలయ అధికారుల తీరుపై ఇతర భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆలయ ఈఈ భాస్కర్ ఘటనా స్థలానికి వచ్చి మహిళల డార్మిటరీలో సీసీ కెమెరాలు పని చేస్తున్నప్పటికీ ఫుటేజీ రికార్డు కావడం లేదని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం పెల్లుబుకుతున్న సమయంలో కెమెరాలను ఆఫ్‌లైన్‌లోకి మార్చి వెళ్లిపోయారు. మూడు నెలలుగా ఇదే తీరు... మహిళలు ఉండే కాటేజీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం సరికాదని పలు మార్లు ఇంజనీరింగ్ సిబ్బందిని హెచ్చరించినట్లు సీవీరెడ్డి చారిటీస్ నిర్వహణ చూస్తున్న ఆలయ ఉద్యోగి మేరీ స్వరూప తెలిపారు. కెమెరాలపై ఫిర్యాదులను ఆలయ ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోలేదని, మూడు నెలలుగా సీసీ కెమెరాలు పని చేస్తున్నాయని కాటేజీలో పని చేసే సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే సీసీ కెమెరాల్లో రికార్డు అయిన విజవల్స్ బయటకు వస్తే తమ పరిస్థితి ఏంటని మహిళా భక్తులు ఆందోళన చెందుతున్నారు. భక్తుల మనోభావాలతో ఆటలా.. డార్మిటరీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆలయ అధికారులు భక్తుల మనోభావాలతో ఆటలాడుతున్నారు. డార్మిటరీలో అనుమానితులు ప్రవేశకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామంటున్నారు. లోపలకు ప్రవేశించే మార్గంలో ఏర్పాటు చేస్తే సరిపోతుంది కదా! లోపల ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏంటి?. ఇలాంటి ఘటనలు దురదృష్టం దుర్గగుడి పాలనాధికారిగా మహిళ ఉన్న సమయంలో ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. జరిగిన దానిని సమర్థించుకునే కన్నా బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఇంత మంది అధికారులు, పాలక మండలి సభ్యులు ఉన్నా ఆలయంలో ఏం జరుగుతోందో భక్తులు చెబితే గాని తెలుసుకోకపోవడం సరికాదు. మహిళలకు రక్షణ లేదు ఆలయాల్లోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇంత వరకు షాపింగ్‌మాల్స్, హోటల్స్‌లోనే ఇటువంటి ఘటనలు జరిగినట్లు విన్నాం. ఇప్పుడు ఆలయాల్లోనూ... కాటేజీల్లోనూ ఇదే తంతు అంటే ఆడవారికి రక్షణ ఎక్కడ ఉంది? అధికారులు తీరు సరిగా లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. విశ్రాంతి కోసమే డార్మిటరీలు: ఎం.పద్మ, దుర్గగుడి ఈవో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు విశ్రాంతి కోసమే డార్మిటరీలు ఏర్పాటు చేశాం. డార్మిటరీలో బెడ్డు అద్దె ప్రాతిపదికన ఇస్తున్నాం. కేవలం విశ్రాంతి కోసమే వాటిని వినియోగిస్తున్నాం తప్ప.. దుస్తులు మార్చుకునే స్థలంలా కాదు. మహిళల భద్రత కోసమే డార్మిటరీ అంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. -
ఇంద్రకీలాద్రి: మహిళల గదిలో కెమెరాలు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిలో అధికారుల నిర్వాకం బయటపడింది. సి.వి.రెడ్డి ఛారిటీస్ ట్రస్టు డార్మిటరీలో మహిళలు దుస్తులు మార్చుకునే రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సోమవారం వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలలుగా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. మహిళలు ఉండే గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు ఓ పెళ్లి బృందం సీసీ కెమెరాలను గుర్తించి బయటపెట్టింది. అయితే ఈ సంఘటనపై ఆలయ సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. కెమెరాలకు కనెక్షన్ ఇవ్వలేదని, అంతేకాకుండా మూడు రోజుల నుంచి పనిచేయడం లేదని అంటున్నారు. ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. -
మహిళల డ్రెస్సింగ్‌రూంలో కెమెరాలు
-
ఎక్స్‌ట్రాలు చేస్తే.. ఇత్తడే!
మార్కాపురం: నేర నియంత్రణే లక్ష్యంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పోలీసులు ముందుకెళ్తున్నారు. పశ్చిమ ప్రకాశంలో మొత్తం 13 పోలీసుస్టేషన్లు ఉండగా 8 పోలీసుస్టేషన్ల పరిధిలో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు సర్కిల్స్ ఉండగా వీటిలో మార్కాపురం పట్టణం, కంభం, గిద్దలూరు, బేస్తవారిపేట, యర్రగొండపాలెం, పెద్దారవీడు, త్రిపురాంతకం, దోర్నాల పట్టణాల్లో పోలీసుల ఆధ్వర్యంలో సుమారు 150కిపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవిగాక రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నుంచే మార్కాపురం, గిద్దలూరు పట్టణాల్లో జరిగే సంఘటనలు గమనించేందుకు అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. మార్కాపురం పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో 74 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా అల్లూరి పోలేరమ్మ గుడి నుంచి ఎస్వీకేపీ కళాశాల వరకు, జవహర్ నగర్ కాలనీ నుంచి నాగులవరం రోడ్డు వరకు, కంభం రోడ్డు నుంచి శ్రీనివాస థియేటర్ వరకు ప్రతి 50 అడుగులకు ఒక సీసీ కెమెరా బిగిస్తున్నారు. ఇవీ..ఉపయోగాలు ప్రధానంగా నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించడం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, ఈవ్‌టీజర్స్ ఆటకట్టించడం, దొంగతనాలు నివారించడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను తెలుసుకోవడం కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో బిగించారు. మార్కాపురం, గిద్దలూరు, దోర్నాల, యర్రగొండపాలెం తదితర ప్రాంతాల్లో వ్యాపారం రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, క్లాత్ షాపులు, బంగారు దుకాణాల వద్ద కెమెరాలు అమర్చారు. కనిపిస్తున్న ఫలితం ఆయా ప్రాంతాల్లో పోలీసులు ఏర్పాటు చేసిన కెమెరాలు నేరాలను నియంత్రించేందుకు, నిందితులను పట్టుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. నాలుగు రోజుల కిందట పుల్లలచెరువు మండలం నరజాముల తండా వద్ద కారు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. కారు నంబర్ తెలియకపోవడంతో పుల్లలచెరువు నుంచి యర్రగొండపాలెం వచ్చే రోడ్డులో ఉన్న సీసీ కెమెరా ద్వారా కారును గుర్తించి మార్కాపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకున్నారు. మూడు రోజుల కిందట యర్రగొండపాలెంలో ఒక వస్త్ర దుకాణానికి వెళ్లి చీరాలకు చెందిన మహిళలు 20 చీరలు దొంగిలించి వెళ్తుండగా కుంట వద్ద పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో కంభం మండలం తురిమెళ్ల వద్ద ట్రాక్టర్ దొంగతనం జరగ్గా సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను కడపలో పట్టుకున్నారు. సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రిస్తున్నారు. ఆరు రకాల కెమెరాల ఏర్పాటు మార్కాపురం సబ్ డివిజన్లో వివిధ ప్రాంతాల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ఇందులో 6 రకాలు ఉన్నాయి. ప్రధానంగా వాహనాలపై ఉన్న నంబర్ ప్లేట్లు, వాహనాలు నడిపే వారి ముఖాలు గుర్తించే కెమెరాలు ఏర్పాటు చేశాం. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్, పేషియల్ రికగ్నైజేషన్ వంటి రకాలు ఉన్నాయి. వీటితో పాత నేరస్తులను కూడా సులభంగా గుర్తించవచ్చు. దొంగతనాలు, అల్లర్లకు పాల్పడిన వారి వివరాలు సీసీ కెమెరాల్లో నమోదైతే స్పష్టంగా కనిపిస్తాయి. నేర నియంత్రణ సులభమవుతుంది. – రామాంజనేయులు, డీఎస్పీ, మార్కాపురం -
ఇంద్రకీలాద్రిపై ఉత్కంఠ రేపిన చిన్నారి మిస్సింగ్
సాక్షి, విజయవాడ/నరసరావుపేట టౌన్: ఇంద్రకీలాద్రిపై చిన్నారి మిస్సింగ్ ఉదంతం 12 గంటల పాటు ఉత్కంఠ రేపింది. చివరకు చిన్నారి ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం అరసబలగాకు చెందిన పైడిరాజు, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె నవ్యశ్రీ (4)కాగా రెండో కుమార్తె నెలల పిల్ల. నవ్యశ్రీ విజయవాడ చిట్టినగర్‌లోని తాతయ్య కోరగంజి కృష్ణ ఇంట్లో ఉంటోంది. పైడిరాజు దంపతులు, కృష్ణ దంపతులు ఇటీవల తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు విజయవాడకు చేరుకున్నారు. ఉదయం 8 గంటలకు కొండపైన మల్లికార్జున మహామండపం వద్దకు చేరుకున్నారు. సెల్ఫోన్లు భద్రపరుచుకునే కౌంటర్ వద్దకు వెళ్లిన సమయంలో కొద్ది నిమిషాలు నవ్యశ్రీని తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఆ తర్వాత పాప కనపడకపోవడంతో ఆ దంపతులు ఆందోళన చెందారు. ఆలయం వద్ద మైక్‌లో చెప్పించినా ఉపయోగం లేకపోవడంతో 10 గంటల ప్రాంతంలో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అర్జునవీధిలోని ఓ సీసీ కెమెరాను పరిశీలిస్తుండగా.. ఓ మహిళ చిన్నారిని తీసుకెళుతున్నట్లు గుర్తించారు. ఆమెతో పాటు మరో మహిళ, ఓవ్యక్తి కూడా ఉన్నారు. దీంతో పోలీసులు రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలను పరిశీలించగా.. పాప పదో నంబర్ ప్లాట్‌ఫాంపై మహిళతో ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో బయలుదేరిన రైళ్లు గుంటూరు వైపుగా వెళ్లడంతో అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. నరసరావుపేటలో పాప ఆచూకీ ఉదయం కనకదుర్గమ్మ ఆలయంలో తప్పిపోయిన బాలిక రాత్రి గుంటూరు జిల్లా నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. నరసరావుపేటకు చెందిన చల్లా సుబ్బలక్ష్మి పాపను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తాము ఆదివారం ఉదయం దుర్గమ్మ దర్శనానికి వెళ్లామని, తిరిగి వస్తుండగా పాప ఏడుస్తూ కనిపించిందని తెలిపారు. పాప వివరాలు చెప్పలేకపోయిందని, తమతో పాటే వచ్చేసిందని పేర్కొన్నారు. విజయవాడలో ఎవరికి అప్పగించాలో తెలియక నరసరావుపేట పోలీసులకు పాపను అప్పగించామని తెలిపారు. పాపను రాత్రి 10 తర్వాత పోలీసులు విజయవాడకు పంపారు. అమ్మదయతోనే తమ పాప దొరికిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. రాత్రి 8 గంటల సమయంలో పాప ఆచూకీ తెలిసిందన్నారు. బయటపడ్డ భద్రత డొల్లతనం దుర్గగుడిలో 79 కెమెరాలు ఉన్నాయి. అయినా పాప తప్పిపోయిన విషయం గుర్తించలేకపోయారు. అయితే మల్లికార్జున మహామండపం వద్ద ఉన్న కెమెరా వర్షానికి పాడైపోయిందని అధికారులు చెబుతున్నారు. ఘాట్‌రోడ్డు వద్ద, కొండపైన క్లోక్ రూమ్ వద్ద ఉన్న కెమెరాలు స్పష్టంగా కనపడటం లేదంటున్నారు. కీలకమైన ఈ ప్రాంతాల్లో కెమెరాలు పనిచేయకపోయినా అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈ మూడు కెమెరాలే పనిచేయడంలేదని అధికారులు చెబుతున్నా.. వాస్తవంగా సగం కెమెరాలు పనికిరానివేనని సమాచారం. అమ్మవారి ప్రధాన ఆలయం, ఉపాలయాలు వద్ద కెమెరాలు తప్ప మిగిలినవేవీ పనిచేయడం లేదు. అయినా అధికారులు కానీ, పాలకమండలి కానీ పట్టించుకోవడంలేదు. సీసీ కెమెరాలు పనిచేస్తే దేవస్థానం ఉద్యోగుల అక్రమాలు బయటపడతాయని సిబ్బంది కూడా ఈ విషయంపై శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. -
నేరాల నియంత్రణకు మూడో కన్ను
నర్సాపూర్(జి)(నిర్మల్) : నేరాల నియంత్రణకు పోలీసులు పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సత్ఫలితాలిస్తున్నాయి. దీంతో గ్రామాల్లోనూ వీటిని ఏ ర్పాటు చేయాలని పోలీసు అధికారులు నిర్ణయిం చారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నా రు. దీంతో గ్రామాల్లో నేరాలు, అక్రమాలకు అడ్డుకట్ట పడుతోంది. పోలీసులు ఆయా గ్రామాభి వృద్ధి కమిటీలు, వ్యాపారులతో చర్చించి సీసీ కెమెరా లు ఏర్పాటు చేసేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. అనుమానితులను పట్టేయొచ్చు.. పట్టణాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో సీసీ కె మెరాలు ఏర్పాటు చేయడంతో అనుమానిత వ్యక్తులను పోలీసులు ఇట్టే పట్టేస్తున్నారు. అపరిచిత వ్యక్తుల వివరాలు ఆరా తీస్తున్నారు. దీంతో నేరా ల సంఖ్య తగ్గుతోంది. వ్యాపార సముదాయాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల ని పోలీసులు వారికి సూచిస్తున్నారు. ఈ మేరకు వారికి ఆయా పోలీస్స్టేషన్లలో అవగాహన కల్పిస్తున్నారు. నిఘా నేత్రాల ఏర్పాటుతో వ్యాపార సముదాయాల్లో దొంగతనాలు జరగకుండా నివారించే వీలుంది. అంతేకాకుండా ఆయా గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రతీవారం అంగడి ఉంటుంది. సంతలోనూ ఎలాంటి దొంగతనాలు, అక్రమాలకు తావు లేకుండా నిఘానేత్రాలు సహకరిస్తున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకం.. శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కొన్ని కేసుల్లో సీసీ కెమెరా పుటేజీలు సాక్ష్యాలుగా కూడా ఉపయోగపడుతున్నాయంటే సీసీ కెమెరాల ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పలు దొంగతనాలు, కిడ్నాప్ కేసుల్లో సీసీ కెమెరాల సాయంతో పోలీసులు కేసులను ఛేదించారు. అలాగే చైన్‌స్నాచింగ్ కేసుల్లో సీసీ కెమెరాలే కీలకపాత్ర పోషిస్తున్నాయి. చైన్‌స్నాచింగ్ చేసిన వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివ్వడం సీసీ పుటేజీలు సాక్ష్యాలుగా ఉపయోగపడుతున్నాయి. జాతీయరహదారిపై జరిగే రోడ్డు ప్రమాదాల్లోనూ కీలక సాక్ష్యాలను పోలీసులు సేకరించగలుగుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు నిఘా నేత్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. హైస్పీడ్ డ్రైవ్, ట్రిపుల్ రైడ్, ఓవర్ లోడ్వాహనాలపై సీసీ కెమెరాల సాయంతో పోలీసులు దృష్టి సారిస్తున్నారు. వ్యాపారస్తులకు అవగాహన.. జిల్లాలో దొంగతనాలను పూర్తిగా నివారించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ఆయా పోలీస్స్టేషన్లు, కాలనీలు, రహదారులు, వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం వ్యాపారులు, గ్రామస్తులకు సీసీ కెమెరాల వినియోగం, వాటి పనితీరుపై అవగాహన కల్పిస్తున్నారు. వీటితో కలిగే లాభాలను వారికి వివరించి తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునేలా పోత్సహిస్తున్నారు. వ్యాపారులు సీసీ కెమెరాలు సొంత డబ్బులతో ఏర్పాటు చేసుకుంటుండగా, గ్రామాల్లో ప్రజల నుంచి విరాళాలు, వీడీసీల సహకారంతో నిఘానేత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లు, ప్రయాణ ప్రాంగణాలు తదితర రద్దీ ప్రాంతాలు, మండల కేంద్రాల ముఖద్వారంగా ఉన్న గ్రామాల్లో సుమారు 400 వరకు సీసీ కెమెరాలు సేవలందిస్తున్నాయి. అలాగే వీటికి అదనంగా వ్యాపార సముదాయాల్లోనూ సీసీ కెమెరాలతో నిఘా పెడుతున్నాయి. కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం.. జిల్లాలోని నిర్మల్, భైంసా సబ్‌డివిజన్ పోలీస్ కార్యాలయాల్లోని కమాండ్ కంట్రోల్‌రూంతో ఆయా డివిజన్ కేంద్రాల్లోని సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. అలాగే ఆయా మండలకేంద్రాల్లోని సీసీ కెమెరాలను ఆయా పోలీస్స్టేషన్లలోని కంట్రోల్‌రూంకు అనుసంధానం చేశారు. దీంతో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో పోలీసులు తెలుసుకుని స్పందించగలుగుతున్నారు. దీంతో నేరనియంత్రణ వారికి సులువవుతోంది. ఏదేమైనా శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయనడంలో సందేహం లేదు. -
దొంగలు బాబోయ్ దొంగలు
పార్వతీపురం : మున్సిపాలిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా దొంగలు చెలరేగిపోతున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లతో పాటు ఊరికి దూరంగా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఉదయం వేళ పట్టణం వ్యాప్తంగా కలియదిరుగుతూ ఎక్కడ తాళాలు వేసి ఇళ్లు ఉన్నాయో, ఊరికి దూరంగా ఎక్కడ ఇళ్లు ఉన్నా యో గుర్తించి రాత్రి సమయంలో పథకం ప్రకారం చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల పార్వతీపురం పురపాలకసంఘ పరిధిలోని వైకేఎం కాలనీలో ఒకే రోజు ఏడిళ్లలో దొంగతనాలకు పాల్పడడం సంచలనం రేపింది. అలాగే ఆ సంఘటన జరిగిన రెండోరోజే మళ్లీ నర్సిపురం పంచాయతీ ఓలేటి ఫారం వద్ద తలుపులు వేసి ఉన్న ఇంటిలో చోరీ జరిగింది. రెండురోజుల కిందట 15వ వార్డు అగురవీధిలో పట్టపగలు ఉదయం 8 గంటలకే ఇంటి లో చోరీ జరిగింది. ఇలా వరుస చోరీలతో పట్టణ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఒకపక్క పార్థి గ్యాంగ్ తిరుగుతున్నట్లు వాట్సాప్‌లో విస్తృత ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలాంటి దొంగతనాలు జరగడం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. చుక్కలు చూపిస్తున్న దొంగలు... వరుస దొంగతనాలతో దొంగలు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. నిఘా విభాగం ఎంతో అభివద్ధి చెందిన రోజుల్లో కూడా దొంగలు పోలీసుల చేతికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. రాత్రి, పగలు పోలీసులు పహారా కాస్తున్నా వారి కళ్లు గప్పి మరీ దొంగలు తమ చేతికి పనిచెబుతున్నారు. పోలీసులకు ఎటువంటి ఆనవాళ్లు దొరకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా ఒకదాని వెంట ఒకటి వరుసగా జరుగుతున్న దొంగతనాలతో పోలీసులకు చెమటలు పడుతున్నాయి. ఇటీవల ఒకేరోజు వైకేఎం కాలనీలో ఏడు ఇళ్లలో దొంగతనాలు జరగడంతోనే ఆ ప్రభావం పట్టణ ఎస్సై ఎం. రాజేష్‌పై పడిందని.. అందులో భాగంగానే ఆయన ఇక్కడ నుంచి బదిలీ చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. సమాచారం ఇవ్వాలి దూర ప్రాంతాలకు వెళ్లేవారు ముందస్తుగా సమీపంలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సమీపంలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి వీధుల్లో అనుమానాస్పదంగా తిరిగే వారిని గుర్తిస్తాం. దీంతో వెంటనే సిబ్బంది ఆయా ప్రాంతాలకు క్షణాల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. ఇంటిలో లేనప్పుడు విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉంచకూడదు. – ఎం. దీపికాపాటిల్, పార్వతీపురం ఏఎస్పీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ప్రస్తుతం సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతున్న తరుణంలో బహుళ అంతస్తులు, గ్రూప్ హౌస్‌ల్లో ఉన్నవారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. కెమేరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరస్తులను సులువుగా పట్టుకోవచ్చు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇస్తే ఇంటిపై నిఘా పెడతాం. – జి.రాంబాబు, సర్కిల్ ఇన్స్పెక్టర్ . -
నేరాల నియంత్రణకు మూడో నేత్రం
జిల్లాలో పెరుగుతున్న ట్రాఫిక్, నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్(ఏపీఎస్‌ఎప్‌ఎల్) ఆధ్వర్యంలో భారీ వ్యయంతో తెనాలి పట్టణంలో ప్రధాన కూడళ్లు, రహదారుల్లో అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి నేర నియంత్రణకు ముందడుగు వేసింది. తెనాలి రూరల్ : సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో నిఘా నేత్రాల ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే నిఘా కెమెరాల ఏర్పాటు పూర్తికావడంతో కొద్ది రోజుల్లో ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. కేవలం పట్టణం, ప్రధాన కూడళ్లే కాకుండా మారుమూల గ్రామాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యనే కాకుండా శాంతి భద్రతల రక్షణ, నేరాల అదుపు వంటి బహుళ ప్రయోజనాలకు ఈ వ్యవస్థను వినియోగించుకునేందుకు పోలీసుల శాఖ ముందడుగు వేసింది. సీసీ కెమెరాలతో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి చలాన్లు రాసేందుకేనన్న విమర్శలున్నాయి. దీనికి భిన్నంగా రాష్ట్రంలో ఆధునతన పరిజ్ఞానంతో కెమెరాలను ఏర్పాట చేస్తున్నారు. నేరాల నియంత్రణకు వీటిని ఎంచుకోవడం విశేషం! హైటెక్ సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సాఫ్ట్‌వేర్‌ను ఇందుకోసం ఉపయోగించనున్నారు. రూ. వెయ్యి కోట్లతో.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్(ఏపీఎస్‌ఎప్‌ఎల్) ఆధ్వర్యంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించి, రూ.969 కోట్లు కేటాయించింది. మేట్రిక్స్ సంస్థ ఈ పనులు చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 14,764 కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జిల్లా హెడ్‌క్వార్టరు, సబ్ డివిజన్ హెడ్‌క్వార్టర్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం కెమెరాల ఏర్పాటు పూర్తి కావచ్చింది. త్వరలో కంట్రోల్ రూమ్‌ల కేటాయింపులు చేపట్టనున్నారు. అడ్వాన్స్డ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్పీఆర్), రెడ్ లైట్ వయోలేషన్ రికగ్నిషన్(ఆర్ఎల్వీడీ), ఫస్త్రస్ రికగ్నిషన్(ఎఫ్ఆర్ఎస్), వీడియో అనలైటిక్స్(వీఏ) వంటి నాలుగు రకాల ఆధునాతన కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. తెనాలి సబ్ డివిజన్లోని 10 పోలీస్స్టేషన్లకు గాను 107 కెమెరాలను కేటాయించారు. వీటిలో ఏఎన్పీఆర్ – 45, ఎఫ్ఆర్ఎస్ – 5, వీఏ – 20, ఆర్ఎల్వీడీ, సాధారణ కెమెరాలు 37 ఉన్నాయి. ఆధునిక కెమెరాల ప్రయోజనాలు ♦ ఏఎన్పీఆర్ కెమెరాలు వాహనాల నంబర్ప్లేట్లను గుర్తిస్తాయి. ప్రత్యేక సాఫ్ట్వేర్ నంబర్ ప్లేట్ల వివరాలను డేటాబేస్‌తో సరిపోల్చి, యజమాని వివరాలను తక్షణమే కంట్రోల్ రూమ్ సిబ్బందికి తెలియజేస్తుంది. అంతే కాక, నేరానికి పాల్పడి, వాహనాలపై పరారవుతున్నా వారిని గుర్తించడం సులువవుతుంది. ♦ ఆర్ఎల్వీడీ కెమెరాలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్‌లైట్ పడి ఉన్నా, అతిక్రమించే వారిని గుర్తించి, వాహన వివరాలను కంట్రోల్‌రూమ్‌కు చేరవేస్తాయి. ట్రాఫిక్ సిబ్బంది లేకపోయినా, చలానాలు వస్తుంటాయి, వాహనదారులు ఇక సిగ్నల్ పడితే బ్రేక్ వేయాల్సిందే. ♦ ఎఫ్ఆర్ఎస్ కెమెరాలు డేటాబేస్‌లోని వ్యక్తుల ముఖాలను ఎప్పటికప్పుడు పోల్చుకుంటూ ఉంటాయి. పరారీలో ఉన్న నేరగాళ్లు, బహిష్కృత నేరగాళ్లు, అంతకు ముందే పోలీసుల రికార్డుల్లో ఉన్న అసాంఘిక శక్తులు ప్రవేశిస్తే వంటనే ఈ కెమెరాలు కంట్రోల్ రూమ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. ♦ వీఏ కెమెరాలు వీడియో రికార్డింగ్‌ను చేస్తుంటాయి. నెల, రెండు నెలలే కాకుండా కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజిలతో నేర దర్యాప్తును చేసేందుకు వీలవుతుంది. కంట్రోల్ రూములో వీటిని పర్యవేక్షించే సీఐ స్థాయి అధికారి ఎక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తినా వెంటనే ప్రత్యామ్నాయ మార్గాల్లో క్లియర్ చేసే వీలుంటుంది. ఏర్పాటు సరే.. నిర్వహణ.. అధునాతన కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయడం ఏ ఎత్తయితే, దీని నిర్వహణ తలకు మించిన భారం కానుంది. తెనాలి పట్టణంలో 2012లోనే 48 కూడళ్లలో అధునాతన కెమెరాలను ఏర్పాటు చేశారు. పురపాలక సంఘం రూ. 15 లక్షలు కేటాయించి, మార్కెట్ కాంప్లెక్సులో కంట్రోల్ రూమ్ ఏర్పాటుకూ అనుమతిచ్చింది. నేర పరిశోధనల్లో ఈ కెమెరాలూ ఉపయోగపడ్డాయి. అయితే తదనంతర కాలంలో వీటి నిర్వహణపై ఇరు శాఖలు పట్టించుకోలేదు. దీంతో కెమెరాలు నిరుపయోగమయ్యాయి. కెమెరాల దీర్ఘకాలిక నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
చూడలేకపోతున్న ‘మూడో కన్ను’..
జంగంపల్లిలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన దారుణం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఒకేసారి ఇద్దరు హత్యకు గురికావడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామంలో సీసీ కెమెరాలు ఉన్నా.. అవి పంచాయతీ పరిసరాల్లోనే ఉండడంతో నేరాన్ని రికార్డు చేయలేకపోయాయి. ఆర్థికభారం కావడంతో గ్రామంలో వేరే చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదు.. గ్రామ పోలీస్ అధికారి వ్యవస్థ కూడా నిర్వీర్యం కావడంతో నేరాలు పెరుగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భిక్కనూరు : ప్రశాంతంగా నిద్రపోతున్న పల్లె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. జంగంపల్లి వీడీసీ అధ్యక్షుడు అత్తెలి రమేశ్, మరో వ్యక్తి ముదాం రాములు దారుణంగా హత్యకు గురైన ఘటన గ్రామంలో కలకలం రేపింది. ప్రతి గ్రామంలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసు ఉన్నతాధికారులు గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను ఏర్పాటు చేశారు. చిన్నచిన్న వివాదాలే శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవిగా మారుతాయని భావించిన పోలీసు అధికారులు.. వాటిని నివారించడం కోసం ప్రతి గ్రామానికి పోలీసు అధికారిని నియమించారు. గ్రామంలోని గోడలపై గ్రామ పోలీస్ అధికారి పేరు, ఫోన్ నంబర్ రాయించారు. ఆ గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే గ్రామ పోలీస్ అధికారికి సమాచారం వెళ్లేది. మొదట్లో ఈ వ్యవస్థ సత్ఫలితాలు ఇచ్చినా.. ఆ తర్వాత ఈ వ్యవస్థను పట్టించుకోవడం మానేశారు. గ్రామ పోలీస్ అధికారి వ్యవస్థ నామ్‌కే వాస్తేగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో వారు పల్లెలవైపు చూడడం లేదని తెలుస్తోంది. కొనుగోలు భారం.. నేరాల నియంత్రణకు పోలీసులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాల ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని, వాటిని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే వాటిని కొనుగోలు చేయడానికి పంచాయతీల వద్ద ఎలాంటి నిధులు లేవు. దాతలు ముందుకు వస్తే ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాల కొనుగోలు భారం కావడంతో చాలా గ్రామాలు వీటి ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. కొన్నిచోట్ల నాలుగైదు కెమెరాలు మాత్రమే ఏర్పాటు చేశారు. అవి పంచాయతీ వద్దో.. కూడళ్లలోనే ఉన్నాయి. అంతగా సీసీ కెమెరాలు లేకపోవడంతో మిగతా చోట్ల నేరాలు జరిగినప్పుడు నిందితులను పట్టుకోవడం కష్టంగా మారుతోంది. గ్రామ ముఖద్వారం వద్ద లేకపోవడంతో.. భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలో గతంలో దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గ్రామంలో సీసీ కేమెరాలు ఉన్నాయి. కానీ గ్రామ ముఖద్వారం వద్ద ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడంతో పోలీసులు దుండగుల ఆచూకీ కనుక్కోలేకపోయారు. జంగంపల్లిలోనూ సీసీ కెమెరాలున్నా.. గ్రామ ముఖద్వారం వద్ద ఒక్కటీ లేకపోవడంతో హంతకులను గుర్తించలేకపోయారు. అక్కరకు రాని కెమెరాలు.. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే నేరాలను సులువుగా ఛేదించవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే అవి నాణ్యమైనవి కాకపోవడంతో తరచుగా చెడిపోతూ సరిగా పనిచేయడం లేదని తెలుస్తోంది. భిక్కనూరు మండలంలోని జంగంపల్లిలో జంట హత్యలు జరిగిన ప్రదేశానికి సమీపంలో గ్రామ స్వాగత తోరణం ఉన్నప్పటికీ అక్కడ సీసీ కేమెరాలు లేవు. గ్రామపంచాయతీ సమీపంలోనే నాలుగు సీసీ కేమేరాలు ఉన్నాయి. అవి కూడా చెడిపోవడంతో ఇటీవల పోలీసుల సూచన మేరకు మరమ్మతులు చేయించారు. ఈ మరమ్మతులు చేయించిందీ హత్యకు గురైన అత్తెల్లి రమేశ్ కావడం గమనార్హం. సీసీ కెమెరాలను ప్రారంభ కార్యక్రమాల్లో పోలీసులు కనబడతారు కానీ వాటి పనితీరు ఎలా ఉందో అని మాత్రం తెలుసుకోరని ప్రజలు ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, ప్రారంభించడడమే కాదు వాటి పనితీరు కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలంటూ ప్రజలు కోరుతున్నారు. పోలీసులకు సవాల్.. సంఘటన స్థలంలో లభించే చిన్న క్లూతోనయినా పోలీసులు నేరాన్ని ఛేదిస్తారు. జంగంపల్లి జంట హత్యల కేసులో మాత్రం హంతకులు హతుల సెల్ఫోన్లు ఎత్తుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. ఇద్దరిని చంపిన హంతకులు.. హతుల ఫోన్లను తీసుకుని జాతీయ రహదారి మీదుగా పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసు జాగిలం కూడా జాతీయ రహదారి వద్దకు వచ్చి ఆగిపోయింది. ఈ హత్య కేసు మిస్టరీ కూడా ముందుకు సాగడం లేదు. భయాందోళనల్లో గ్రామస్తులు జంట హత్యలు జంగంపల్లివాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎవరిని కదిలించినా భయంభయంగా మాట్లాడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో జంట హత్యలు కల్లోలం రేపాయని పేర్కొంటున్నారు. పదేళ్ల క్రితం గ్రామ శివారులో గ్రామానికి చెందిన దుమాల బాలవ్వ హత్యకు గురైంది. ఆ సంఘటన తర్వాత బుధవారం వేకువ జామున జరిగిన హత్యల సంఘటనే పెద్ద సంఘటనగా చెప్పవచ్చు. మృతులు రమేశ్, రాములు వరుసకు బావమరుదులు అయినప్పటికీ వారి మధ్య పెద్దగా సాన్నిహిత్యం లేదు. ఏడాది క్రితం భూమి విషయంలో రమేశ్‌తో రాములు వాగ్వాదానికి దిగాడని, అప్పటి నుంచి ఇద్దరి మధ్య పెద్దగా మాటలు లేవని గ్రామస్తులు తెలిపారు. అయితే వీరిరువురు హత్యకు మూడు రోజుల ముందు నుంచే మత్తడి పోచమ్మ ఆలయం వద్ద బోనాలు తీసే విషయమై మాట్లాడుకుంటున్నారని తెలిసింది. ఈ ఇద్దరూ హత్యకు గురికావడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. హంతకులను పట్టుకునేందుకు.. జంట హత్యల కేసుపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఆమె గురువారం ఉదయం సంఘటన స్థలాన్ని మరోమారు సందర్శించారు. హత్య జరిగిన చుట్టుపక్కల ప్రదేశాలనూ పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. హంతకులను పట్టుకునేందుకు పలు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. జంగంపల్లి పంచాయతీ వద్దనున్న సీసీ కెమెరా -
ప్రకృతిలో వికృత చేష్టలు!
పేరేచర్ల(గుంటూరు): పేరేచర్ల ప్రధాన రహదారి పక్కనే 531 ఎకరాల్లో ప్రకృతి రమణీయతను ఆకళింపు చేసుకుని ఉంది నగరవనం. ఇక్కడ ఎత్తైన కొండలు, చెట్లు, వన్యప్రాణులు, ఔషధ మొక్కలు ప్రకృతి ప్రేమికులను ఇట్టే కట్టిపడేస్తాయి. పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సేదదీరేందుకు ప్రభుత్వం నగరవనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 2017 నవంబర్ 4న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నగరవనానికి శంకుస్థాపన చేశారు. ఔషధ మొక్కల పెంపకం, పిల్లల పార్కు, సైక్లింగ్, ట్రెక్కింగ్, జంతుప్రదర్శనశాల తదితరాల ఏర్పాటుకు రూ.5 కోట్లు నిధులు కేటాయిస్తున్నామని ప్రకటించారు. నగరవనం అందుబాటులోకి వచ్చి ఆహ్లాదం చేరువవుతుందని ప్రజలు ఆశపడ్డారు. కానీ నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. దీంతో ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది. కొరవడిన నిఘా.. నగరవనంలో నిఘా వ్యవస్థ పూర్తిగా నిద్రావస్థలోకి జారుకుంది. దీనికి తోడు వనంలో ఒక్కచోట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో పర్యవేక్షణ కొరవడడంతో వివిధ ప్రాంతాల నుంచి ఆకతాయితీలు ప్రకృతి రమణీయతలో వికృతి చేష్టలకు పాల్పడుతున్నారు. దీంతో కుటుంబాలతో నగరవన వీక్షణకు వెళ్లేవారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇక అటవీశాఖకు చెందిన అధికారులు ఎప్పుడో ఒకసారి చుట్టం చూపుగా కనిపిస్తారు లేకపోతే అదీ కూడా లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వనంలో కనీసం ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. బోర్డుకే పరిమితమైన పిల్లల పార్కు.. నగరవనంలోకి అడుగుపెట్టగానే కొద్ది దూరంలో పిల్లల పార్కు అని కనబడుతుంది తప్ప పార్కు కనిపించదు. పిల్లల కోసం ఇంత దూరం వస్తే ఇక్కడ పరిస్థితి వేరేలా ఉందని పర్యాటకులు వాపోతున్నారు. కనీసం పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, వారు ఆసక్తిగా తిలకించేందుకు బొమ్మలు లాంటివి కూడా ఏర్పాటు చేయలేదు. నగరవనానికి సమీపంలోనే కొన్ని క్రషర్లు, కంపెనీలు ఉండడంతో వాటి నుంచి వచ్చే పొగ వనాన్ని కమ్మేస్తోంది. దీంతో పర్యాటకులు కొంతమేర ఇబ్బంది పడుతున్నారు. నగరవనానికి చుట్టుపక్కల ఉన్న క్రషర్లు, కంపెనీలను వేరే చోటకి మారుస్తానని అప్పుడు అధికారులు, మంత్రులు చెప్పారు కానీ ఆచరణలో పాటించలేదు. పిల్లలను అతిగారాబం చేయకూడదు తల్లిదండ్రులు తమ పిల్లలను అతి గారాబం చేయకూడదు. కొంతవారి పట్ల కఠినంగానే వ్యవహరించాలి. పిల్లల కదలికలపై నిఘా ఉంచాలి. ముఖ్యంగా సంస్కృతీ, సంప్రదాయాలు పట్ల కాసేపు వారితో ప్రేమగా మాట్లాడాలి. తల్లిదండ్రులు ప్రమేయం లేకుండా తీసుకొనే కొన్ని నిర్ణయాల వలన జరిగే సంఘటనలు వారికి ఉదాహరణగా తెలియపరచాలి. అంతేకాకుండా నగరవనంలో ప్రత్యేకమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలి. – కాసు విజయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ప్రభుత్వ పనితీరు లోపం కనిపిస్తుంది ఇలాంటి వనాల్లో ప్రభుత్వ పనితీరు లోపం కనిపిస్తుంది. రూ.5 కోట్లు మంజూరు చేసి దానిని గుత్తేదార్లుకు అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకొంటుంది. దీని వలన అక్కడ సరైన వసతులు లేకుండా పోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నగరవానికి కుటుంబ సభ్యులతో రాలేని దుస్థితి. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలి. వనంలో నిఘానేత్రాలు ఏర్పాటు చేయాలి. – రమాదేవి, ఐద్వా నాయకురాలు -
అరుణ్ కేసుపై ఆరా తీస్తున్నాం
యాదగిరిగుట్ట (ఆలేరు) : ఏడాది క్రితం అదృశ్యమై.. తిరిగొచ్చిన బాలుడు అరుణ్ కేసుపై ఆరా తీస్తున్నామని యాదగిరిగుట్ట టౌన్ సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది మే 16వ తేదీన అరుణ్ (బిట్టు)ను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని తల్లిదండ్రులు అశోక్–నిర్మల దంపతులు యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. అప్పటినుంచి బాలుడి అదృశ్యం కేసు మిస్టరీని ఛేదించేందుకు కృషిచేస్తున్నామన్నారు. తీసుకెళ్లిన అగంతకుడే బాలుడిని తిరిగి తీసుకువచ్చి వదిలివెళ్లడం సంతోషకరమన్నారు. అయినా అతను ఎవరు..? ఏ కారణంతో బాలు డిని తీసుకెళ్లాడు..? అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నామన్నారు. బాలుడిని వదిలి వెళ్లే క్రమంలో అతడు యాదగిరిగుట్టలో ఎక్కడెక్కడ సంచరించాడు. అతడి ఆచూకీ తెలుసుకునేందుకు సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నట్టు సీఐ వివరించారు. గారాబంగా చూసుకున్నారు : అరుణ్ తనను ఇంటివద్ద నుంచి తీసుకెళ్లిన వ్యక్తి, వారి కు టుంబ సభ్యులు గారాబంగా చూసుకున్నారు. మీ నాన్న నా దగ్గరే ఉన్నాడంటే అతడి వెంట వెళ్లా. అనంతరం బస్సులో తెలియని ఊరికి తీసుకెళ్లా డు. అక్కడ నన్ను ఎవరూ కొట్టలేదు.. తిట్టలేదు. ఇటీవల ఫోన్లో మా తల్లిదండ్రి ఫొటోలు చూపిం చాడు. నేను గుర్తుపట్టడంతో ఆదివా రం సాయంత్రం యాదగిరిగుట్టకు తీసుకువచ్చి.. నా చేతిలో ఒక చిట్టీ పెట్టి తెల్లబట్టలు వేసుకున్న పోలీస్ అంకుల్‌కు అది ఇవ్వమని చెప్పి వెళ్లాడు. ఎవరా అగంతకుడు..? బాలుడిని యాదగిరిగుట్టకు తీసుకువచ్చిన వ్యక్తి ఎవరు అనే అంశాలపై ఆరా తీస్తున్నామని సీఐ తెలిపారు. బాలుడిని సుమారు 30 సంవత్సరాల వ్యక్తి యాదగిరిగుట్ట బస్టాండ్ నుంచి గ్రామపంచాయతీ వరకు తీసుకెళ్లాడని, అతడు తలపై టోపీ ధరించి ఉన్నట్లు సీసీ కెమెరాలో కనపిస్తోందన్నారు. ఆ వ్యక్తి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని, అతడు పట్టుబడితేనే బా లు డిని ఎందుకు తీసుకెళ్లారు.. ఎక్కడికి తీసుకెళ్లారు అనే అంశాలు తెలుస్తాయని చెప్పారు. త్వరలోనే కిడ్నాప్ చేసిన వ్యక్తిని పట్టుకుంటామన్నారు. -
‘కెమెరా’పురం..
అమలాపురం టౌన్: అమలాపురం పట్టణంపై ఇక నుంచి నిఘా నేత్రాలు పనిచేయనున్నాయి. అటు ఇరుకు రోడ్లతో ట్రాఫిక్ పద్మవ్యూహం...ఇటు 122 మంది రౌడీ షీటర్లు, 178 సస్పెక్ట్ షీటర్లతో ఉండే పట్టణంలో క్రైమ్ రేటు కూడా అధికంగానే ఉంటుంది. ఈ క్రమంలో నేరాలు, ప్రమాదాల అదుపునకు పట్టణమంతా సీసీ కెమెరాలతో నిఘా అత్యవసరం. అందుకే ఏపీ ఫైబర్ నెట్ వర్కింగ్ లిమిటెడ్ పట్టణాన్ని సీసీ కెమెరాల నిఘా కిందకు తెస్తోంది. పట్టణంలో ఎంపిక చేసిన 19 ప్రధాన కూడళ్లలో 50 సీసీ కెమెరాల ఏర్పాటు పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే గడియారం స్తంభం సెంటర్, హైస్కూలు సెంటర్, ఎర్రవంతెన, నల్ల వంతెన, ఈదరపల్లి వంతెన, ముమ్మిడివరం గేటు సెంటర్, పేరూరు వై జంక్షన్ తదితర రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు పనులు పూర్తయయ్యాయి. అంతా ఆన్లైన్లోనే.. ఏపీ ఫైబర్ నెట్ వర్కింగ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పట్టణంలో సీసీ కెమెరాలు అమరిక పనులు జరుగుతున్నాయి. పట్టణంలో నెలకొల్పుతున్న 50 సీసీ కెమెరాలు పూర్తిగా ఆన్లైన్ విధానంతో ఆ సంస్థ పర్యవేక్షణలో పనిచేయనున్నాయి. వీటి నియంత్రణ అంతా విజయవాడలోని ఆ సంస్థకు చెందిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జరుగుతుంది. అక్కడి నుంచే అమలాపురం పోలీసు స్టేషన్‌కు అనుసంధానం అవుతుంది. పట్టణంలో ఎక్కడైనా చోరీలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తినా... కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో గమనించి తక్షణమే అమలాపురం పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తుంది. వారి సెల్ఫోన్లకు ఈ సర్వర్ అనుసంధానమై ఉండడం వల్ల వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండే వీలుంటుంది. కొద్ది రోజుల్లోనే అమలాపురంలో సీసీ కెమెరాల వ్యవస్థ పనిచేయనుందని ఏపీ ఫైబర్ నెట్ వర్కింగ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. వీటితో పాటు స్థానిక మున్సిపాలిటీ కూడా పట్టణ ముఖ్య వ్యాపార కూడళ్లలో పలు వ్యాపార సంస్థల సహకారంతో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ సీసీ కెమెరాలు కూడా అందుబాటులోకి వస్తే పట్టణమంతా పూర్తిగా నిఘా నీడలోకి రానుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు కానున్న 19 ముఖ్య కూడళ్లు పేరూరు వై జంక్షన్, గడియారం స్తంభం సెంటరు, హైస్కూలు సెంటరు, ముమ్మిడివరం గేటు సెంటరు, నల్ల వంతెన, ఎర్ర వంతెన ఈదరపల్లి వంతెన, సుబ్బారాయుడు చెరువు జంక్షన్, ఆర్టీసీ బస్ స్టేషన్ అవుట్ గేట్, ఆర్టీసీ బస్ స్టేషన్ ఇన్‌గేట్, రాష్ట్ర హోం మంత్రి హౌస్ ఇన్ గేట్, ఎస్కేబీఆర్ కళాశాల, శ్రీదేవి అమ్మవారి ఆలయం, శ్రీదేవి మార్కెట్, గోల్డ్ మార్కెట్, సాకుర్రు టి.జంక్షన్, అమలాపురం రూరల్ మండలం, కిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాల గేట్–1, కిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాల గేట్–2, కనకదుర్గ ఆలయం, భటవిల్లి, అమలాపురం రూరల్ మండలం, సమనస, అమలాపురం రూరల్ మండలం. -
ఓ పల్లె.. 20 సీసీ కెమెరాలు
సాక్షి, హైదరాబాద్ : ఉన్మాదులు రెచ్చిపోతున్నారు.. ముక్కుపచ్చలారని చిన్నారులను కాటేస్తున్నారు.. వీటికి తోడు దొంగల బెడద.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి.. అడుగడుగునా పోలీసులున్న పట్టణాల్లోనే లెక్కలేనన్ని ఘోరాలు జరుగుతుంటే మరి నిఘాలేని పల్లెల పరిస్థితేంటి? అక్కడ రక్షణ మాటేమిటి? ఇదే అంశం ఆ ఊరి యువతను కునుకు లేకుండా చేసింది. పోలీసు ఔట్ పోస్టు కూడా లేని తమ ఊరి భద్రతపై వారిలో అలజడి మొదలైంది. వెంటనే స్పందించి వాట్సాప్ వేదికగా సమాచారం చేరవేశారు.. చర్చోపచర్చలు జరిపారు.. పక్షం రోజులైంది.. కట్ చేస్తే ఇప్పుడా ఊరికి 20 సీసీ కెమెరాలతో నిఘా.. ఇది సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం అయినాపూర్ గ్రామ యువత ‘నిఘా’గాథ. 4 వేల జనాభా.. సుమారు 4 వేల జనాభా ఉన్న అయినాపూర్ గ్రామం విద్యాధికులకు నిలయం. ఇక్కడి యువకులు అనేకమంది సాఫ్ట్వేర్ సహా ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. ఎక్కువ మంది ఉపాధ్యాయులుగా ఇతర గ్రామాల్లో పని చేస్తున్నారు. అయితే ఇటీవల తరచూ వార్తల్లో కనిపిస్తున్న అవాంఛనీయ ఘటనలతో గ్రామస్తులు ఆందోళన చెందుతుండటం.. చీకటి పడగానే తలుపులు వేసుకుంటుండటం గమనించిన ఆ ఊరి యువత ఆలోచనలో పడ్డారు. గ్రామ భద్రత విషయమై కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై సతీశ్‌కుమార్‌తో చర్చించారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా స్వచ్ఛందంగా సీసీటీటీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. వారంలో రూ.70 వేలు.. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని నేరుగా సంప్రదించడం జాప్యమవుతుందని తాము నిర్వహిస్తున్న అయినాపూర్ సన్‌రైజర్స్, అయినాపూర్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపుల్లో అభిప్రాయాలు పంచుకున్నారు. ఇందుకు అందరి నుంచీ ఆమోదం లభించడంతో వెంటనే అయినాపూర్ డెవలప్మెంట్ ఫోరం పేరుతో ఓ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని విరాళాల సేకరణ మొదలెట్టారు. గ్రూపు సభ్యులు మహిపాల్‌రెడ్డి, వినయ్‌రెడ్డి, అశోక్, వూడెం జైపాల్‌రెడ్డి, కాయిత జైపాల్‌రెడ్డి, యాదగిరి, శ్రీధర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, జిల్లా రవీందర్, మురళీధర్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, చెంబురెడ్డి, సంజీవ్‌రెడ్డి తదితరులు తొలుత విరాళాలు ఇవ్వడంతో మిగతావారు కూడా ముందుకొచ్చారు. వారం రోజుల్లో రూ.70 వేలు జమవడంతో తొలుత కొన్ని కెమెరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. తొలి విడత 9 కెమెరాలు గ్రామ భద్రతపై సర్పంచ్ పబ్బోజు విజయేందర్ కూడా స్పందించారు. మరిన్ని కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఇదే గ్రామానికి అనుబంధంగా ఉన్న రసూలాబాద్ను కూడా కలుపుకొని 20 కెమెరాలును ఏర్పాటు చేయాలని తీర్మానించారు. తొలివిడత 9 కెమెరాలు కొనుగోలు చేసి శనివారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సమక్షంలో చేర్యాల సీఐ రఘు, కొమురవెల్లి ఎస్ఐ సంతోశ్‌కుమార్‌లకు అందించారు. మిగిలిన కెమెరాలను మరో వారం రోజుల్లో సిద్ధం చేయనున్నారు. అలాగే ఇటీవలి 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 11 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రూ.1,000 చొప్పున నగదు బహూకరించారు. ఇలా సిద్దిపేట జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన తొలి గ్రామం అయినాపూర్. -
ఇక రైలు మధ్యలో మహిళా బోగీలు
న్యూఢిల్లీ: మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన బోగీలను ఇక నుంచి రైలు చివరలో కాకుండా మధ్యలో ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ బోగీలను ప్రయాణికులు తేలికగా గుర్తించేందుకు ప్రత్యేకమైన రంగును వేయనున్నట్లు తెలిపింది. రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతపై రైల్వే బోర్డు చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై తమ అభిప్రాయాలను తెలపాల్సిందిగా అన్ని రైల్వే జోన్లను కోరింది. మహిళా బోగీల్లోకి పురుషులు ప్రవేశించకుండా ఏర్పాటు చేయాలని సూచించింది. మహిళా బోగీల కిటికీలకు మెష్‌లు, బోగీల్లో సీసీ కెమెరాలను అమర్చాలని పేర్కొంది. -
సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.1.52లక్షల విరాళం
కరీంనగర్ క్రైం : నేను సైతం కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం త్రీటౌన్ ఇన్స్పెక్టర్ విజయకుమార్ చొరవతో బ్యాంక్‌కాలనీ, మోహర్‌నగర్‌కాలనీవాసులు రూ.1.52లక్షల విరాళాన్ని శుక్రవారం సీపీ కమలాసన్‌రెడ్డి సమక్షంలో అందజేశారు. ఎస్సై మాధవరావు, బ్లూకోట్ సిబ్బంది శ్రీకాంత్‌రెడ్డి, నరేందర్, కాలనీవాసులు మన్మోహన్రావు, సంజీవరావు, నర్సింగరావు పాల్గొన్నారు. వాహనాల వేలం వివిధ రకాల ప్రమాదాలు, సరైన ధ్రువపత్రాలు లేక పట్టుబడిన వాహనాలను వేలం వేయనున్నామని సీపీ తెలిపారు. మతిస్థిమితం కోల్పోయి మానేరు డ్యాం పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న వ్యక్తిని శుక్రవారం లేక్ పోలీసులు గుర్తించి ఆర్ఎస్సై శ్రీశైలం ఆధ్వర్యంలో దుస్తులు ధరింపజేశారు. -
ఆ ఇద్దరు ఎవరు?
నిప్పు ఉంటేనే నీడలుంటాయి... నిజానికి నిప్పు మండుతుంటేనే నీడలు కూడా ఎగసి పడుతుంటాయి. ఈ కథలో ఆ నిప్పుకు కారణమే రెండు నీడలు. ఆ నీడలు ఏమిటి? నిప్పు ఎందుకు పెట్టాయి? చనిపోయే ముందు ఇచ్చే వాంగ్మూలం ఏ కేసులో అయినా కీలకమైనది.ఆ అక్కాచెల్లెళ్లు రోజూ సాయంత్రం పూట గార్డెన్‌కు వస్తారు వాకింగ్‌కు. అక్క పేరు అశ్విని. చెల్లి పేరు ఉష. అక్కకు వయసు 27 ఉంటాయి. చెల్లెలికి 22. ఇద్దరూ çకబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఉంటారు.కాని చాలాసార్లు అక్క పూర్తిగా నడవదు. సిమెంటు బెంచీ మీద కూలబడుతూ ఉంటుంది.‘రా.. అక్కా... నడూ’ అని పిలుస్తుంటుంది చెల్లెలు.అక్క సమాధానం చెప్పదు. ఏదో చిరాగ్గా అయిపోతుంది.‘ఎంత నడిచినా ఏం ప్రయోజనం నువ్వెళ్లు’ అంటుంది.‘నడవాలక్కా... నడిస్తేనే తగ్గుతావ్ నువ్వు’ చెల్లెలు బతిమాలుతుంది.అక్క మళ్లీ లేచి నిలబడుతుంది.వాకింగ్ చేస్తున్న ఒక ముసలావిడ రోజూ చెల్లెలితో ఒకే మాట అంటుంటుంది– ‘ఏయ్ పిల్లా.. నా కొడుకును చేసుకోవే. మంచి అందగాడు’....చెల్లెలికి ఆమెను చూస్తే భయం. అక్క వైపు భయం భయంగా చూస్తుంది.‘అదీ... అక్క పెళ్లయ్యాక’ నసుగుతుంది. ఆమె అక్కను ఎగాదిగా చూసి ‘మీ అక్క పెళ్లా... ఎప్పటికి జరిగేను’ అని వెళ్లిపోతుంది.అక్క కళ్లల్లో ఆ క్షణంలో నీళ్లు చిమ్ముతాయి. చెల్లెలు ఊరడింపుగా అంటుంది–‘అక్కా... అలా బాధ పడకు. ఏదో ఒక అబ్బాయికి నువ్వు నచ్చుతావు. అలాంటివాడు వస్తాడు. అసలు నువ్వు పట్టించుకోవుగాని వాకింగ్‌లో నిన్ను గమనించేవాళ్లు ఎంతమంది ఉంటారో తెలుసా?’‘నీ ముఖం నన్నెవరు చూస్తారే?’‘అయ్యో... నీకేం తక్కువక్కా... సూపర్‌గా ఉంటావు’చెల్లెలు నవ్వించే ప్రయత్నం చేసింది.అక్క ఆ నవ్వులో నవ్వు కలుపుతూ నిస్పృహగా నవ్వింది.2017 డిసెంబర్ నెల 6:30. విజయనగరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫోన్ అదే పనిగా రింగ్ అవుతోంది. ఎస్.ఐ ఫోన్ ఎత్తాడు.‘సార్... గార్డెన్లో అమ్మాయి చావుబ తుకుల్లో ఉంది. ఎవరో తగులబెట్టారు’.. వాచ్మెన్ వగరుస్తూ చెబుతున్నాడు.వెంటనే పోలీసులు హడావిడిగా సంఘటనా స్థలానికి బయల్దేరారు. పోలీసు జీప్తో పాటు 108 వెహికల్ కూడా క్షణం తేడాతో వచ్చి ఆగాయి. చుట్టూ జనం. మంటల్లో కాలి, కొనఊపిరితో పడి ఉన్న యువతి. ఒకమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి గుండెలు బాదుకుంది.‘అక్కా.. అక్కా’ క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.బర్నింగ్ వార్డ్‌లో ఎక్కువ సేపు కూర్చోవడం కష్టంగా ఉంటుంది. అదో రకమైన కమురు వాసన నిండి ఉంటుంది. చావుబతుకుల్లో ఉన్న వారి హాహాకారులు వినడం చాలా కష్టం. జిల్లా ఎస్పీ, మెజిస్ట్రేట్ స్టేట్మెంట్ రికార్డు చేయడానికి ముక్కులకు కర్చీఫ్ కట్టుకుని కూర్చున్నారు.‘దాహం.. దాహం’ అందా అమ్మాయి.‘నీళ్లు తర్వాత ఇస్తారు... ముందు ఏం జరిగిందో చెప్పమ్మా’అతి కష్టం మీద చెప్పడం మొదలుపెట్టింది.‘నా పేరు అశ్విని. సాయం త్రం ఐదు గంటల సమయంలో ఊరి చివరన ఉన్న గార్డెన్‌కి రోజులాగే వాకింగ్‌కి వెళ్లాను. చెల్లెలు పనిఉండి రాలేదు. సాయంత్రం ఆరున్నర వరకు అక్కడే ఉన్నాను. అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు నా ముందుకొచ్చారు. వాళ్లను చూసి భయపడ్డాను. పారిపోవడానికి ప్రయత్నించాను. కానీ, వారిద్దరిలో ఒకరు నన్ను పట్టుకున్నారు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ నా మీద పోసి, నిప్పంటించి పరారయ్యారు...’ చెబుతూనే అపస్మారక స్థితిలోకి వెళ్లింది అశ్వని. పోలీస్ యంత్రాంగం ఆలోచనలో పడిపోయింది.సంఘటనా స్ధలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎటువంటి ఆధారాలు దొరకలేదు.అశ్వని రాత్రి 12 గంటలకు చనిపోయింది.పోలీసులకు తెల్లవార్లూ నిద్రల్లేవు. ఆమె బతికి ఉంటే ఇంకొన్ని వివరాలు తెలిసేవి. ఇప్పుడు ఆమె ఇచ్చిన వాంగ్మూలమే ముఖ్యమైన క్లూగా మిగిలింది. చనిపోయే వ్యక్తి ఇచ్చే వాంగ్మూలం చాలా ముఖ్యమైనది. దాని ఆధారంగా చూస్తే ఆమె మీద దాడి చేసిన వారు ఎవరు? అశ్వని తల్లీ, తండ్రి, చెల్లెలు ఉషతో మాట్లాడారు పోలీసులు.‘రోజులాగే గార్డెన్‌కి వాకింగ్‌కని వెళ్లింది సార్. ఇలా ఎలా జరిగిందో తెలియడం లేదు’ అంది దుఃఖాన్ని దిగమింగుకుంటూ తల్లి. గార్డెన్ పరిసర ప్రాంతాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. వాకబు చేస్తే ఇద్దరు యువకులు ఆ సమయంలో గార్డెన్ నుంచి బయటకు వెళ్లారని స్థానికులు చెప్పారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరా లేకపోవడంతో వాళ్లెవరో గుర్తించలేకపోయారు. కాని ఒక రిటైర్డ్ టీచర్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.‘సార్... వాళ్లు నాకు తెలుసు. ఇక్కడకు దగ్గరలోనే ఉంటారు’ అని చెప్పాడు.పోలీసులు నిమిషం ఆలస్యం చేయలేదు. రవి, శ్రీకాంత్ అనే ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.‘సార్.. మాకేమీ తెలియదు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాం. బోరు కొడుతుందని రోజూ సాయంత్రం వాకింగ్‌కి వస్తూ ఉంటాం’ అన్నారు వాళ్లు.వయసులో ఉన్న కుర్రవాళ్లు. వీళ్లు చేస్తే అత్యాచార యత్నం చేయాలి. హత్య ఎందుకు చేశారు. వాళ్లను గట్టిగా మళ్లీ విచారించారు.‘ఎన్నిసార్లు విచారించినా అదే సమాధానం చెప్తున్నారంటే వీళ్లు ట్రైన్డ్ నేరస్తుల్లా ఉన్నారు’ అనుకున్నారు పోలీసులు. వాళ్ల నోరు విప్పించే ఆధారాల కోసం మళ్లీ అన్వేషణ సాగించారు. ఈసారి రెండు మూడు బృందాలు రంగంలోకి దిగాయి. పగలూ రాత్రీ గార్డెన్‌ని జల్లెడపట్టాయి. దొరికిన ఆధారాలు ఇలా ఉన్నాయి.∙సంఘటన జరిగిన ప్రాంతంలో నేలంతా పచ్చగా ఉంది. ఒక్క మొక్క కూడా కాలలేదు. ఆమె శరీరం 80 శాతానికి పైగా కాలింది కనుక దుండగులతో పెనుగులాట జరిగి ఉంటే మొక్కలు కాలడమో గడ్డి డిస్ట్రబ్ కావడమో జరగాలి. అలాంటి దాఖలాలు లేవు. ∙సంఘటన జరిగిన స్ధలం వద్ద రెగ్యులర్‌గా చాలా మంది వస్తుంటారు. దాడి జరిగి అరిచి ఉంటే ఎవరికో ఒకరికి వినిపించి ఉండాలి.∙ఎవరైనా పెట్రోల్ పోస్తే రెండువైపులా కాలిపోవాలి. కానీ ఇక్కడ ఒకవైపే కాలింది.∙అక్కడి తుప్పల్లో ఓ పెట్రోల్ బాటిల్ దొరికింది. అక్కడ కొన్ని మొక్కలు కాలినట్టుగా ఉన్నాయి. విడిచిన జత చెప్పులు దొరికాయి. అవి ఆ అమ్మాయివే. పెనుగులాట జరిగి ఉంటే చెప్పులు విడిగా అలా విడిచి పెట్టినట్టుగా ఉండవు.ఈ క్లూస్‌తో పోలీసులు ఈసారి ఆ యువతి ఇంటి నుంచి గార్డెన్ వరకూ గల ఆరు సీసీ పుటేజ్‌లను పరిశీలించారు. 5 గంటల ప్రాంతంలో ఓ యువతి ఆ ప్రాంతం గుండా వెళ్లి, పెట్రోల్ బంక్ వద్ద ఆగి, బాటిల్లో పెట్రోల్ పోయించుకున్నట్టు కనిపించింది. గార్డెన్లో దొరికిన బాటిల్, యువతి చేతిలో ఉన్న బాటిల్ మ్యాచ్ అయ్యాయి. బాటిల్‌పై ఉన్న వేలిముద్రలను సరిచూడగా అశ్వని వేలిముద్రలతో మ్యాచ్ అయ్యాయి. ఆ బాటిల్ ఇంట్లోదే అని తల్లి నిర్థారించింది. అంటే?ఇది హత్య కాదు. ఆత్మహత్య అన్నమాట. సాధారణంగా మరణ వాంగ్మూలంలో ఎవరూ అబద్ధం చెప్పరు. ఈ అమ్మాయి చెప్పింది. ఎందుకు? పోలీసులు ఆమె సెల్‌ఫోన్ గమనించారు. షాక్ అయ్యారు. అందులో కేవలం రెండు నంబర్లే ఉన్నాయి. తల్లిదీ తండ్రిది. ఇలా రెండు నంబర్లు మాత్రమే పెట్టుకుందంటే స్నేహితులు ఎవరూ లేనంత ఒంటరిగా ఉందన్న మాట. తల్లిదండ్రులను పిలిపించారు.‘సార్! అశ్వని లావుగా ఉండేది. పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. తను ఇంట్లో పెద్ద కూతురు. తన పెళ్లి అయితేనే చెల్లెలి పెళ్లి అవుతుంది. పెళ్లి అవడం లేదని కొన్నాళ్లుగా బాధపడుతోంది. ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. స్నేహితులు కూడా తనకెవరూ లేరు. తనకిక పెళ్లికాదనే ఉద్దేశంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకుందంటే మా కుటుంబానికి ఏ ఇబ్బందులు వస్తాయో అనుకుని ఉంటుంది. అందుకే అలా అబద్ధం చెప్పి ఉంటుంది’ అని తండ్రి కన్నీళ్లతో అసలు సంగతి చెప్పారు.అశ్విని హంతకులు ఎవరో తెలిసింది. ఆత్మన్యూనత. డిప్రెషన్.కాని అప్రమత్తంగా లేకుంటే నిర్దోషులైన ఇద్దరు అమాయకులు ఆ వాంగ్మూలానికి బలయ్యేవారు.గౌరవం మరణాన్ని కూడా ఎంతలా శాసించిందీ! – గౌరీశంకర్, సాక్షి ప్రతినిధి, విజయనగరం. -
ఊరికి వెళితే..
ఎండాకాలం మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం ఆరు గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడం లేదు. రాత్రిళ్లు చల్లని గాలికోసం ఆరుబయట నిద్రించేవాళ్లు కొందరు. పిల్లలకు పరీక్షలు పూర్తయ్యాయని విహార యాత్రలకు వెళ్లేవారు మరికొందరు. ఉద్యోగ రీత్యా బదిలీలు కావడంతో దంపతుల్లో ఒకరు వారం పాటు కొత్త ప్రదేశాల్లో ఉండాల్సిన పరిస్థితి. కారణం ఏదైనా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చిన్నపాటి అప్రమత్తత అవసరం. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే ఇంటిపై పోలీసుల నిఘా ఉంటుంది. లేకుంటే దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకుపోతారు. చిత్తూరు అర్బన్:పోలీసులు కొత్తగా తీసుకువచ్చిన విధానమే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్). స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్‌లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక నంబర్ వస్తుంది. ఇంటికి తాళం వేసి వెళ్లేటప్పుడు యాప్‌లో రిక్వెస్ట్ ప్రొటెక్షన్‌ను క్లిక్ చేస్తే పోలీసులు ప్రత్యేక సీసీ కెమెరాలను అమరుస్తారు. ఈ కెమెరా యజమాని మొబైల్‌కు, జిల్లా పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానవుతుంది. ఎవరైనా ఇంటి ముందు కనిపించినా, గేటు తీసినా అలారమ్ మోగుతుంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని దొంగను పట్టుకుంటారు. బయట నిద్రిస్తే.. ఏసీలు, ఫ్యాన్లు ఉన్నా వేసవిలో చల్లటి గాలి కోసం చాలా మంది ఆరుబయట పడుకుంటూ ఉంటారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం టెర్రస్‌పై నిద్రించాలనుకుంటే తలుపులకు తప్పనిసరిగా తాళం వేయాలి. బంగారు ఆభరణాలు ధరించకూడదు. బీరువాలోని లాకర్లో భద్రపరచాలి. వీలైనంత వరకు నగలను బ్యాంకుల్లో దాచుకోవాలి. కిటికీల పక్కన చొక్కా, ప్యాంటులను తగిలించరాదు. ఒకవేళ ఉంచినా వాటిలో నగదు పెట్టకూడదు. వీలైనంత వరకు అన్ని కిటీకీలు, తలుపులు మూసివేయాలి. ఇంటి బయట బెడ్ ల్యాంపు వెలుగుతూ ఉండాలి. పడుకునేచోట పక్కనే టార్చిలైటును పెట్టుకోవాలి. ఉద్యోగస్తులు ఇలా.. ప్రభుత్వ, ప్రైవేటు శాఖల్లోని ఉద్యోగులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మగవారు ఉద్యోగ రీత్యా బయటకు వెళ్లినప్పుడు మనకు తెలియని వారిని ఇంట్లోకి రానివ్వకూడదు. అపరిచితులు ఎవరైనా వస్తే గేటు బయట నుంచి పంపించేయాలి. తలుపులు తీయకుండానే, గ్రిల్ లోపలి నుంచే సమాధానం చెప్పాలి. పలు రకాల వస్తువులు, గిఫ్ట్ వస్తువులు అంటూ వచ్చే వారితో మాట్లాడకపోవడం ఉత్తమం. వారితో బేరసారాలు చేస్తూ కూర్చోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. మార్కెటింగ్ పేరుతో వచ్చే ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల్ని నమ్మకూడదు. ఒకవేళ అపరిచితులు మార్కెటింగ్ పేరుతో విసిగించినా, ఇబ్బంది పెట్టినా తక్షణం 100 నంబర్‌కు ఫోన్ చేయా లి. లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 9440900005కు ఇంటి బయట ఉన్న వారి ఫొటో తీసి పంపాలి. సహకరించండి... వేసవిలో చోరీలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రజలు పోలీసుశాఖకు సహకరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చోరీలు జరగవు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో మేమే కెమెరాలు పెట్టి దొంగల్ని పట్టుకుంటాం. ఒకవేళ వద్దనుకుంటే కంపెనీలు, సంపన్నులు వాళ్లే సొంతంగా కెమెరా పెట్టుకుని పోలీసుల కంట్రోల్ రూమ్‌కు కాకుండా వాళ్ల ఫోన్లకే అనుసంధానం చేసుకోండి. ఊర్లకు, విహారయాత్రలకు వెళ్లాలంటే ఇంట్లో ఒకర్ని ఉంచండి. అలాకాకపోతే తాళం వేసిన ఇంటి బయట రాత్రుళ్లు లైట్లు వెలిగేలా చూడాలి. రెండు, మూడు జత చెప్పులను తలుపు బయట వదిలివెళ్లడం చేయాలి. ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు, నగదును పెట్టకండి. సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చి సహకరించండి.– ఐ.రామకృష్ణ, డీఎస్పీ, చిత్తూరు క్రైమ్ -
నో కామెంట్ ప్లీజ్!
దురుసుగా పరుగెడితే కాలు మడత పడొచ్చు మన కాలేగా. రిపేర్ చేసుకోవచ్చు. కానీ, అదే దురుసుతో నాలుక పరిగెడితే మడత పడదుగానీ మడతలు పెట్టొచ్చు బీ కేర్ ఫుల్.. నో కామెంట్ ప్లీజ్! కాల్డేటాయే కాదు సెల్‌టవర్ టెక్నాలజీ కూడా నేరస్తుడిని పట్టిస్తుంది అని నిరూపించారు కాజిపేట పోలీసులు ఏసీపీ జనార్ధన్ అండ్ టీం (మడికొండ ఇన్స్పెక్టర్ సంతోష్, సిబ్బంది జి. దేవేందర్, బి. సాంబయ్య, కె.కిషన్, రవి, శ్రీకాంత్). నేరస్తుడికి శిక్ష పడేలా వృత్తిధర్మం నిర్వహించారు. మాట హత్యకు దారి తీయవచ్చు.మాట హంతకుణ్ణి పట్టి ఇవ్వవచ్చు కూడా.మిట్టమధ్యాహ్నం.కాజీపేట స్టేషన్.ఏసీపీ ఎదురుగా ఓ కేసు తాలూకు ఫైల్ ఉంది. ఆ ఫైల్‌ను చూస్తే అతనికి కోపం. చికాకు. అసహనం. ఏడాది నుంచి అది అతని టేబుల్ మీద పడి ఉంది. కేసు తేలదు. ఫైల్ క్లోజ్ కాదు. క్లోజ్ కాని ఏ ఫైల్ అయినా పోలీసు గుండెల మీద ఫిరంగే.ఇన్స్పెక్టర్ వచ్చి రొటీన్‌గా సెల్యూట్ చేశాడు. ఏసీపీ ఆ ఫైల్ వైపు చూపుడు వేలు ఆడించి అన్నాడు–‘ఏంటయ్యా ఇది. ఒక్క క్లూ కూడా దొరకుండా అంత పకడ్బందీగా మర్డర్ ఎలా చేశారు? ఎంత తెలివైన నేరస్తుడైనా ఎక్కడో చోట దొరికి తీరాల్సిందే కదా. అసలు నేరస్తుడు ఎవరో ఇంతవరకూ పట్టుకోకపోతే ఇక మనమెందుకు. ఏం... రిజైన్ చేసి వెళ్లిపోదామా’...ఇన్స్పెక్టర్ ఏమీ అనకుండా స్టడీగా నిలుచున్నాడు.ఏసీపీ కే సు తాలూకు ఫైల్ మీద చేత్తో గట్టిగా తడుతూ మళ్లీ ఓపెన్ చేశాడు. కేస్ ఫైల్ తేదీ: 2016 సెప్టెంబరు 14. మృతుడు: పులిగిల్ల చందు. వయసు: 19 జరిగింది: హత్య. చేసినవారు: ఆధారాలు లభించలేదు. మూసేశాడు. ‘ఛాన్సే లేదు. ఏదో ఒక క్లూ దొరకాల్సిందే. ఏంటా క్లూ. సాక్ష్యాధారాలతో నేరస్తుడిని పట్టుకుతీరాలి. ఎలా?’ తనలో తనే అనుకుంటూ గట్టిగా పైకే విసుక్కున్నాడు. 2016 సెప్టెంబర్ 13.గణేష్ నిమజ్జనంలో పోలీసులకు ఊపిరి సలపనంత పనిగా ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బృందమంతా వేయికళ్లతో పహారా కాస్తోంది. తెల్లవార్లూ నిమజ్జన హడావిడితో కంటి మీద కునుకు కూడా లేదు.మరుసటి రోజు. నిమజ్జనం సజావుగా సాగినందుకు పోలీసులు అప్పుడప్పుడే ఊపిరి తీసుకుంటున్నారు. ఇంతలో ఫోన్ మోగింది.ఎత్తి ‘హలో’ అన్నాడు కానిస్టేబుల్.అటువైపు ఎవరో అపరిచితుడు.‘భట్టుపల్లి కోటచెరువు దగ్గర ముళ్లపొదల్లో ఎవరిదో బాడీ పడి ఉందండీ. చూస్తే కుర్రాడిలా ఉన్నాడు’పోలీసులు వెంటనే అలెర్ట్ అయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకునే సరికి చాలామంది పోగై ఉన్నారు. పంతొమ్మిది ఇరవై ఏళ్ల కుర్రాడి శవం పడి ఉంది. శవం పడి ఉన్న తీరు చూస్తే ఏదో ఆయుధంతో హత్య చేసినట్టు అర్థమవుతోంది.కాసేపటికి ఆ కుర్రాణ్ణి జనంలో ఎవరో గుర్తించారు.‘వీడు చందులా ఉన్నాడే’వెంటనే చందు తల్లిదండ్రులకు సమాచారం అందింది. చెట్టంత కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి వాళ్ల దుఃఖానికి అంతులేదు. ‘మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరిపైన అయినా అనుమానం ఉందా’ పోలీసులు అడిగిన ప్రశ్నకు తల్లి ‘అయ్యా! నా బిడ్డ ఎవరితోనూ గొడవకు పోయే రకం కాదు’ ఏడుస్తూనే చెప్పింది. తల్లీదండ్రి నుంచి వివరాలు తీసుకొని, శవాన్ని పోస్టుమార్టానికి పంపించారు. చందు ఫోన్ కాల్స్ ఆధారంగా వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు పోలీసులు. ఆ రోజు అతనితో ఫోన్లో మాట్లాడిన వారి వివరాలను సేకరించారు. దర్గా కాజీపేట సెల్‌ఫోన్ టవర్ల పరిధిలోని అన్ని ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్‌ను సేకరించి, విశ్లేషించారు. అనుమానితులుగా అనిపించిన 12 మందిని విచారించారు. వారికి ఏ సంబంధం లేదని తేలింది. చందు నివసించే దర్గా కాజీపేటలో ఇరుగుపొరుగు వారినీ ప్రశ్నించారు. ‘ఆ పిల్లాడు చీమకు కూడా హాని తలపెట్టే రకం కాదు’ అని జవాబు వచ్చింది. కేసు ఇంకా క్లిష్టంగా మారింది.ఫైల్ చూస్తున్న ఏసీపీ కళ్లు మూసుకొని ఆలోచనలో పడ్డాడు. మృతుడి స్నేహితులను, ఇరుగుపొరుగును విచారించినా ఏమీ తెలియలేదు. కాల్‌డేటా ద్వారా కూడా ఎటువంటి క్లూ లభించలేదు.. ఇంకేమిటి దారి అనుకుంటూ ఉంటే ‘టవర్ లొకేషన్ టెక్నాలజీ’ గుర్తుకొచ్చింది.ఇన్స్పెక్టర్ని పిలిచాడు.హతుడు పడి ఉన్న చోట ఆ సమయంలో అక్కడి టెలిఫోన్ టవర్ పరిధిలో యాక్టివ్‌గా ఉన్న ఫోన్ నంబర్ల వివరాలను టవర్ లోకేషన్ టెక్నాలజీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ యాంగిల్లో ట్రై చేద్దాం’ అన్నాడు.ఇన్స్పెక్టర్ తల ఊపాడు.పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం హత్య జరిగినట్లుగా భావిస్తున్న సమయం రాత్రి 11 గంటలు. శవాన్ని చెరువు దగ్గర పడేశారంటే మరో అరగంట పట్టే ఉంటుంది. ఆ సమయంలో అక్కడున్న సెల్ టవర్ లోకేషన్ మ్యాప్‌ను టెలికాం ఆపరేటర్ల నుంచి తెప్పించారు. ఆ సమయంలో సెల్‌టవర్ పరిధిలో యాక్టివ్‌గా ఉన్న వేలాది నెంబర్లను తరచి తరచి చూశారు. అన్నింటిని వడపోయగా హత్య జరిగిన సమయంలో, సంఘటనా స్థలానికి కేవలం 200 మీటర్ల దూరంలో ఒక వ్యక్తి ఫోన్ సిగ్నల్ యాక్టివ్‌గా ఉన్నట్టు తేలింది.అతని పేరు గుగులోతు శివ.శివను విచారించారు పోలీసులు. అతను చెప్పినది విన్నాక చందూకి, గుగులోతు శివకు ఎటువంటి çశతృత్వమూ లేదని తెలిసింది. కానీ, పోలీసులకు అనుమానం పోలేదు.శివ చెప్పిన వివరాలతో వెంటనే సీసీ కెమెరాల ఫుటేజీలను జల్లెడ పట్టారు.గుగులోతు శివ మరో యువకునితో హోండా అక్సెంట్ కారులో పదే పదే తిరగడం కనిపించింది.ఎవరా అని ఆరా తీస్తే అతని పేరు రాంకీ అని తేలింది. కాల్స్ అన్నీ వీళ్లిద్దరి మధ్య నడిచాయి.ఇద్దరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. ‘ఎందుకు చంపారు’ అడిగారు పోలీసులు.రాంకీ వైపు చూశాడు శివ.‘ఏమిటి కారణం?’ రాంకీని అడిగారు.‘నా గర్ల్‌ఫ్రెండ్‌ను కామెంట్ చేశాడు’ అన్నాడు రాంకీ.ఒక కామెంట్ హత్య దాకా వచ్చింది. వర్థన్నపేటకు చెందిన రెడ్డిమల్ల రాంకీ దర్గా కాజీపేట లో ఉండే తన బావ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. అక్కడే ఒకమ్మాయితో ప్రేమలోపడ్డాడు. 2016 సెప్టెంబరు 13న వినాయక నిమజ్జనంలో రాంకీ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి డాన్స్ చేశాడు. ఆ టైంలో చందు అక్కడే ఉన్నాడు.చూసి ఊరుకుని ఉంటే బాగుండేది.అమ్మాయిని కామెంట్ చేశాడు.‘ఏంట్రా కూశావ్’ అని రాంకీ చందూ కాలర్ పట్టుకున్నాడు. ఏదో మామూలు నిమజ్జనం గొడవ అనుకున్న చుట్టుపక్కలవాళ్లు వాళ్లను విడిపించారు. కాని రాంకీ తన కోపాన్ని వీడలేదు. తన లవర్ని కామెంట్ చేసినవాడిని హత్య చేయాలని నిశ్చయించుకున్నాడు. దర్గా కాజిపేటలో ఉండే ఫ్రెండ్ గుగులోతు శివ ద్వారా చందును పిలిపించాడు. ‘‘గొడవలొద్దు, అన్నీ మర్చిపోయి ఫ్రెండ్స్‌లా కలిసిపోదాం. పార్టీ చేసుకుందాం’’ అన్నాడు. చందు సరే అనడంతో ముగ్గురూ కలిసి వర్థన్నపేట వరకు వెళ్లారు. అక్కడ తన ఇంట్లో పదునైన ఇనుప చువ్వను చందు చూడకుండా కారులో పెట్టాడు రాంకీ. కారులోనే ముగ్గురూ మద్యం సేవించారు. చందును రెచ్చగొట్టి బాగా తాగించారు శివ, రాంకీలు. చందు మత్తులోకి వెళ్లాడు. వెంటనే ఇనుప చువ్వతో చందు మెడ, గొంతు భాగంలో విచక్షణారహితంగా రాంకీ దాడి చేశాడు. చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత కారులోనే రోడ్లన్నీ తిరిగి తిరిగి చివరకు భట్టుపల్లి కోటచెరువు ముళ్ల పొదల్లో మృత దేహాన్ని పడేసి వెళ్లిపోయారు. హత్య చేయడానికి ఉపయోగించిన ఇనుపచువ్వను స్వాధీనం చేసుకొని, 2017 అక్టోబరు నాటికి నిందుతులకు బేడీలు వేసి కోర్టుముందు హాజరుపరిచారు పోలీసులు. – కృష్ణ్ణగోవింద్, బ్యూరో ఇంచార్జీ, సాక్షి, వరంగల్ -
సీసీ కెమెరాల నిఘాలో స్పాట్ వాల్యుయేషన్
గుంటూరు ఎడ్యుకేషన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థుల జవాబు పత్రాలకు మూల్యాంకనం (స్పాట్ వాల్యూయేషన్) ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. జిల్లా కేంద్రంలోని స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖాధికారులు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మూల్యాంకన విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు విధిగా గుర్తింపు కార్డును ధరించడంతో పాటు సెల్ఫోన్లు వెంట తీసుకురాకూడదని నిబంధనలు విధించారు. ఒక్కసారి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలోకి అడుగుపెట్టిన ఉపాధ్యాయులు సాయంత్రం మూల్యాంకనం ముగిసేవరకూ బయటకు వెళ్లేందుకు అవకాశం లేని విధంగా విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 2,100 మంది ఉపాధ్యాయుల నియామకం నగరంపాలెం స్టాల్ బాలికోన్నత పాఠశాలలోని స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో క్యాంప్ అధికారి, డీఈవో ఆర్.ఎస్ గంగా భవాని పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న 2,100 మంది ఉపాధ్యాయులను విద్యాశాఖ నియమించింది. వీరిలో అసిస్టెంట్ క్యాంప్ అధికారులతో పాటు చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు ఉన్నారు. సోమవారం ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ ఈనెల 15వ తేదీ వరకూ కొనసాగుతుంది. మూల్యాంకన విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు తాగునీరు, క్యాంటిన్, టాయిలెట్లు వంటి మౌలిక వసతులను కల్పించారు. స్పాట్ వాల్యుయేషన్ కేంద్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యాంటిన్లో నామమాత్రపు ధరకు ఆహారంతో పాటు ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మినరల్ వాటర్ సదుపాయం కల్పిస్తున్నారు. గతేడాది వరకు నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటినే నేరుగా ఉపాధ్యాయులకు అందిస్తూ రాగా గుంటూరు నగరంలో ఇటీవల డయేరియా ప్రబలిన నేపథ్యంలో కూలింగ్ వాటర్ క్యాన్లు తెప్పించేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాకు చేరుకున్నఆరు లక్షల స్క్రిప్ట్‌లు పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు సంబంధించి వివిధ జిల్లాల నుంచి ఆరు లక్షల స్క్రిప్ట్‌లు జిల్లాకు వచ్చాయి. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ రోజుకు 40 స్క్రిప్ట్‌లకు మూల్యాంకనం నిర్వహించాల్సి ఉందని డీఈవో ఆర్.ఎస్ గంగా భవానీ చెప్పారు. స్పాట్ వాల్యుయేషన్ విధి నిర్వహణకు నియామకం పొందిన ఉపాధ్యాయులు సోమవారం ఉదయం 8.30 గంటలకు స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. సంబంధిత ఉపాధ్యాయులను రిలీవ్ చేసి పంపాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. విధులకు గైర్హాజరైన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంతో శ్రమకోర్చి పరీక్షలు రాసిన ఏ ఒక్క విద్యార్థికీ నష్టం కలిగించని రీతిలో ప్రశ్నపత్రాలకు పకడ్బందీగా మూల్యాంకనం జరపడంతో పాటు వచ్చిన మార్కులను చీఫ్ ఎగ్జామినర్లు, కోడింగ్ అధికారులతో పాటు అసిస్టెంట్ క్యాంప్ అధికారులతో క్షుణ్ణంగా పరిశీలించే విధంగా చర్యలు చేçపడుతున్నట్టు చెప్పారు. -
మకాంపై మూడోకన్ను!
సాక్షి, సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 19 నగరాల్లోని ప్రముఖ హోటళ్లలో చేతివాటం ప్రదర్శించిన ‘స్టార్ చోర్’ జయేష్ రావ్జీ సెజ్పాల్ సిటీలోనూ మూడుసార్లు చోరీలు చేశాడు. అలా నగరానికి వచ్చిన ప్రతిసారీ లాడ్జీల్లోనే బస చేశాడు. కేవలం ఇక్కడే కాదు... ఎక్కడకు వెళ్లినా, ఎన్నిసార్లు పంజా విసిరేందుకు పథకం వేసినా ఇలానే చేస్తుంటాడు. కేవలం జయేష్ ఒక్కడే కాదు అనేక మంది ‘వలస నేరగాళ్లకు’ లాడ్జిలు షెల్టర్ జోన్లుగా మారుతున్నాయి. కర్ణాటక నుంచి వచ్చి మార్కెట్ పరిధిలో 55 తులాల బంగారం తస్కరించిన జిలానీ, మేవాట్ రీజియన్ నుంచి వచ్చి అటెన్షన్ డైవర్షన్లకు పాల్పడిన టట్లు బాజీ గ్యాంగ్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ‘మస్కా’రాలతో అందినకాడికి దండుకుపోయిన ముఠాలను అరెస్టు చేసిన తర్వాత వారు నగరంలోని లాడ్జిల్లో బస చేసినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆయా ముఠాలకు ఆశ్రయం కల్పిస్తున్న లాడ్జిలు, హోటళ్లపై నిఘా కట్టుదిట్టం చేయాలని నగర పోలీసు విభాగం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా సిటీలోని అన్ని లాడ్జిలు, హోటళ్లను అనుసంధానించాలని యోచిస్తోంది. వాటిలో బస చేస్తున్న వారి వివరాలు ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులకు అందేలా, సెంట్రలైజ్డ్ డేటాబేస్‌లో ఇవి నిక్షిప్తమయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. భవిష్యత్తులో ఓ నేరగాడు సిటీలోని ఏదైనా లాడ్జ్/హోటల్లో దిగిన వెంటనే తమను అప్రమత్తం చేసేలా ఆధునిక హంగులు సైతం అందిపుచ్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం కొంతమేర మాన్యువల్‌గా... లాడ్జిలు, హోటళ్లలో బస చేసే వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని, వాటిని సమీప పోలీసుస్టేషన్లో ఏరోజుకారోజు అందించాలనే నిబంధన అమలులోనే ఉంది. అయితే వాటి నిర్వాహకులు కస్టమర్ల వివరాలను మాన్యువల్‌గా నమోదు చేసుకుంటున్నారు. వీటినే ప్రతుల రూపంలో పోలీసులకు అందిస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత ఏదైనా అంశం క్రాస్‌చెక్ చేయాలంటే ప్రస్తుతం కష్టసాధ్యంగా ఉంది. ఈ మాన్యువల్ వ్యవహారానికి బదులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని సిటీ పోలీసులు నిర్ణయించారు. ఇందులో నగరంలోని లాడ్జిలు, హోటళ్లను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అనుసంధానిస్తారు. ఆయా చోట్ల బస చేయడానికి వచ్చే వారి వివరాలు సిబ్బంది తమ కంప్యూటర్లో నమోదు చేసిన వెంటనే అవి సర్వర్ అనుసంధానంతో పోలీసులకు చేరిపోతాయి. నిర్ణీత కాలం వీటిని భద్రంగా ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తప్పుడు వివరాలు చెప్పే చాన్స్ ఎక్కువే... బయటి ప్రాంతాల నుంచి వచ్చి నగరంలోని లాడ్జిల్లో బస చేస్తున్న నేరగాళ్లు తప్పుడు వివరాలు చెప్పేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వాటి నిర్వాహకులు కచ్చితంగా వినియోగదారులకు చెందిన గుర్తింపుకార్డులను పరిశీలించడంతో పాటు దాని ప్రతిని సైతం తీసుకుంటున్నారు. అయితే ఈ గుర్తింపుకార్డులే నకిలీవి అయినప్పుడు చేసేదేమీ ఉండదు. దీంతో దాదాపు ఆయా వ్యక్తులకు చెందిన పేర్లు, చిరునామాలు పక్కాగా గుర్తించేందుకు ప్రస్తుతం పోలీసు విభాగం దగ్గర ఉన్న ‘360 డిగ్రీస్ వ్యూ’ తరహా సాఫ్ట్వేర్ వాడాలని భావిస్తున్నారు. ఇలా రికార్డైన బస చేసిన నేరగాళ్ల వివరాలు పోలీసులకు ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో నిత్యం పర్యవేక్షించే ఆస్కారం ఏర్పడుతుంది. అనుమానిత ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై తక్షణం కన్నేసి ఉంచడానికి అనువుగా మారనుంది. నగరంలో నేరాలు చేసే ‘వలస నేరగాళ్లకు’ ఈ విధానం ద్వారా చెక్ చెప్పే ఆస్కారం ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. భవిష్యత్‌లో ప్రత్యేక ఎనలటిక్స్ జోడించి... ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను భవిష్యత్తులో మరింత పరిపుష్టం చేయడానికీ నగర పోలీసు విభాగం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికోసం ఎనలటిక్స్‌గా పిలిచే సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తారు. నగరానికి సంబంధించిన, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన నగరంలో నేరాలు చేసిన వారి ఫొటోలు పోలీసు విభాగం వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈ డేటాబేస్‌ను అనలటిక్స్ సాయంతో లాడ్జిలు/హోటళ్లకు చెందిన ఆన్లైన్ కనెక్టివిటీతో అనుసంధానిస్తారు. ఓ పాత నేరగాడు ఏదైనా లాడ్జిలో దిగినప్పుడు దాని నిర్వాహకులు అతడి వివరాలు నమోదు చేయడంతో పాటు వెబ్‌క్యామ్‌లో ఫొటో సైతం తీస్తారు. ఈ ఫొటో పోలీసు సర్వర్లోకి వచ్చిన వెంటనే ఎనలటికల్ సాఫ్ట్వేర్ పాత నేరగాళ్ల డేటాబేస్‌లో సరిచూస్తుంది. సదరు వ్యక్తి నేరచరితుడైనా, వాంటెడ్‌గా ఉన్నా తక్షణం గుర్తించి పోలీసులను అప్రమత్తం చేస్తుంది. ఇలా సిటీలో అడుగుపెట్టిన వెంటనే నేరగాళ్లను పట్టుకోవడానికి ఆస్కారం ఏర్పడనుంది. గరిష్టంగా మరో మూడు నెలల్లో ఈ సాఫ్ట్వేర్ అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
జయ వార్డులో సీసీ కెమెరాలు ఆపేశాం
టీ.నగర్ (చెన్నై): దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో చికిత్స పొందిన సమయంలో.. ఒక ఐసీయూ యూని ట్ మొత్తాన్ని ఆమెకే కేటాయించామని, ముందు జాగ్రత్తగా ఆమె వార్డులోని సీసీ కెమెరాలను ఆపేశామని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి వెల్లడించారు. సంబంధం లేని వ్యక్తులు చూడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కొలొరెక్టల్ సర్జరీ, యూఎస్ఏ క్లీవ్‌ల్యాండ్ క్లినిక్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24, 25న నిర్వహించనున్న సదస్సు గురించి మీడియాతో మాట్లాడుతూ.. జయకు అందించిన చికిత్స వివరాల్ని వెల్లడించారు. ‘24 గదుల ఐసీయూ యూనిట్ మొత్తాన్ని జయకే కేటాయించినా.. ఒక గదిని మాత్రమే ఉపయోగించాం. చికిత్స పొందిన 75 రోజులు అన్ని సీసీటీవీల్ని ఆపుచేశాం. మిగతా రోగుల్ని వేరే ఐసీయూలోకి మార్చాం’ అని చెప్పారు. కొద్దికాలం సన్నిహిత బంధువులు తప్ప ఎవరినీ ఐసీయూలోకి అనుమతించలేదని, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్న వైద్యుడి సమ్మతి మేరకే అనుమతించేవారిమని తెలిపారు. జయలలితకు ఆస్పత్రిలో అత్యుత్తమ వైద్య చికిత్స అందించామని, విదేశీ వైద్యులు కూడా సాయపడ్డారని, ఆమె పూర్తిగా కోలుకున్నారని భావించిన తరుణంలో తీవ్ర గుండెపోటు రావడంతో ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయామన్నారు. -
గాడీ నెం.6768
‘మృత్యువు నుంచి తప్పించు కోలేం’ అని అంటారు. కానీ, మృత్యువుకు కారణమైనవాడిని కూడా తప్పించుకోనివ్వదు క్లూ! తప్పు జరగవచ్చు... చిన్నవి, పెద్దవి ఎలాంటి తప్పులైనా జరగవచ్చు. ఆ తప్పును ఒప్పుకోవడంలో ధైర్యం ఉంది. తప్పు నుంచి పారిపోవడంలో ఉన్నది శిక్ష. 2016 డిసెంబర్ 10. హైదరాబాద్.తెల్లవారుజాము 6 గంటలు. మనసు కీడు శంకిస్తూ ఉంది. సాధారణంగా ఉదయాలు ప్రశాంతంగా అనిపిస్తాయి ఆమెకు. కాని ఆరోజు తెల్లవారుజాము ఏదో దుశ్శకునంగా ఉంది. అసలే రాత్రి పడ్డ పీడకల తాలుకు కలత వదల్లేదు. ఇప్పుడు ఈ గుబులు. అవునూ... ఈయన ఇంకా రాలేదేమిటి?వాకిలిలోకి వచ్చింది. గేటువైపు చూసింది. మరో అరగంట గడిచింది. గుబులు పెరిగిపోతోంది. ఇలా ఎప్పుడూ జరగలేదు. రోజూ ఐదింటికి వాకింగ్‌కు వెళ్లడం మామూలే. ఆరు లోపే వచ్చేస్తాడు. కొంచెం ఆలస్యం అయితే ఫోన్ చేస్తాడు. ఇవాళ రాలేదు. ఫోనూ చేయలేదు.సెల్ తీసుకొని కాల్ చేసింది. నో రెస్పాన్స్.. ఏమై ఉంటుంది?! స్నేహితులు ఎవరైనా కలిసి ఉంటారులే అని మనసుకు సర్దిచెప్పుకుంది. కాని గుబులు. పేపర్ తిరిగేసింది. గమ్మం గుండా గేటు వరకు కళ్లను అప్పగించింది. కిచెన్‌లోకి వెళ్లింది. అప్పటికే ఒకసారి కలిపి ఉంచిన డికాషన్ చల్లారిపోతే మళ్లీ వేడి చేసింది. ఆయన వస్తే రోజూ కలిసి కాఫీ తాగడం అలవాటు.ఇంకా రాలేదేమిటి?గుబులు పెరిగిపోతూ ఉంది.ఫోన్ రింగ్ అయ్యింది. ఈ టైమ్‌లో ఫోన్ చేసేదెవరు? ఈయనే అయి ఉంటుంది. సెల్ చేతిలోకి తీసుకుంది. కొత్త నెంబర్. ఇది కీడే... మనసు చెబుతూ ఉంది. వణుకుతన్న చేతిని కంట్రోల్ చేసుకుంటూ గ్రీన్ బటన్ ప్రెస్ చేసింది. అవతలి నుంచి విషయం వింటూనే ఫోన్ జారి నేలన పడింది.. రాయదుర్గం గచ్చిబౌలీ రోడ్.రోడ్డు మీద ఆయన పడి పోయి ఉన్నాడు. కళ్లద్దాలు ఒకవైపు పడి ఉన్నాయి. చెప్పులు జారిపోయాయి. పేరు దేవదానం అని పోలీసులకు అర్థమయ్యాక ఇంటికి ఫోన్ చేశారు. ‘ఎలా జరిగింది?’ ఆమె అతి కష్టం మీద అడిగింది.‘హిట్ అండ్ రన్ కావచ్చు’ అని జవాబు వచ్చింది. ఆ గుర్తు తెలియని వాహనం ఎవరిది? ప్రత్యక్షసాక్షులు ఎవరూ లేరు. ఓ చిన్న గోడ అడ్డు రావడంతో ఆ స్పాట్లో ఉన్న సీసీ కెమెరాలో యాక్సిడెంట్ రికార్డు కాలేదు. రోడ్లు ఊడ్చే వాళ్ళు, పాలు పోసే వాళ్ళు, పాల ప్యాకెట్లు వేసే వాళ్ళు ఎవరిని ప్రశ్నించినా ఫలితం లేదు. ‘మాకు తెలియదు... మేం చూళ్లేదు’ అన్నారు.కేసు మిగిలిన ‘హిట్ అండ్ రన్’ కేసుల మాదిరిగా మిస్టరీగా మారింది. ఎవరైనా కావాలనే దేవదానంను హత్య చేసి ఉంటారా? అంత అవసరం ఎవరికి ఉంటుంది? కుటుంబసభ్యులకు ఎడతెరిపిలేని సందేహాలు.వాటిని పోలీసుల ముందుంచారు. ‘సార్... ఈ కేసులో అనఫీషియల్‌గా ఇన్వాల్వ్ కావడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి’ అన్నారు సీసీఎస్ స్పెషల్ టీమ్ ఇన్స్పెక్టర్ వి.శ్యాంబాబు.‘ఏం అవసరం శ్యాంబాబు... లోకల్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారుగా’ అన్నాడు పై అధికారి.‘చనిపోయింది మా నాన్న సార్. నేనొక పోలీసై ఉండి అతణ్ణి పట్టుకోలేకపోతే మనసుకు కష్టంగా ఉంది. మా నాన్న కోసమే కాదు... ఇలా హిట్ అండ్ రన్ చేసితప్పించుకోవచ్చు అనుకునేవారందరికీ ఈ కేసొక గుణపాఠం కావాలి’ పట్టుదలగా అన్నారు శ్యాంబాబు.‘ఓకే... గో అహెడ్’ పర్మిషన్ దొరికింది.శ్యాంబాబు ఘటనాస్థలికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు.దేవదానం మృతదేహం దొరికిన ప్రాంతంలో ఓ చిన్న ప్లాస్టిక్ ముక్క కనిపించింది. అది తప్ప ఇంకేమీ దొరకలేదు. ఈ కేసుకు ఇదే ముఖ్యమైన క్లూ అని శ్యాంబాబుకు అనిపించింది. దానిని పరీక్షగా చూశారు. ‘ఫోర్డ్’ అనే అక్షరాలు ఉండటం వల్ల అది ఫోర్డ్ కారుకు చెందిన మడ్‌గార్డ్ కుడివైపు లైనర్దిగా గుర్తించారు. దీన్ని తీసుకుని షోరూమ్‌కు వెళ్ళిన ఆయన దాన్ని అక్కడి మెకానిక్స్‌కు చూపించారు. ‘ఇది 2012 మోడల్‌కు చెందిన ఫోర్డ్ ఫిగో కారుది సార్’అని తేల్చారు వాళ్లు. తండ్రి మరణానికి ఈ ఫోర్డ్ ఫిగోకి లంకె ఉందని శ్యాంబాబుకు అర్థమైంది. వెంటనే గచ్చిబౌలి నుంచి మెహదీపట్నం మార్గంలో ఉన్న సీసీ కెమెరాలపై దృష్టిపెట్టారు. యాక్సిడెంట్ అయిన రోజు అనేక కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను సేకరించి పరిశీలించారు. ముఖ్యంగా ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి ఏడు గంటల మధ్య వెళ్ళిన ఫోర్డ్ ఫిగో మోడల్స్‌పై దృష్టిపెట్టారు. ఓ సీసీ కెమెరాలో రికార్డు అయిన ఫీడ్ మరికొంత క్లూ ఇచ్చింది.‘నెంబర్ జూమ్ చేయండి’ ఆదేశించారు శ్యాంబాబు.జూమ్ అయ్యింది.ఏపీ 10 బీసీ 6768.ఎస్. ఈ కారే అయి ఉండాలి. వెంటనే ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న అడ్రస్ దొరికింది. 2017 జనవరి 2.తన తండ్రిని చంపింది ఎంటెక్ విద్యార్థి గుత్తికొండ ప్రశాంత్కుమార్గా శ్యాంబాబు తేల్చారు. ఆ రోజు ఏమైందంటే... ప్రశాంత్ ముందురోజు రాత్రి ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్నాడు. తెల్లవారుజామున ఇంటికి బయల్దేరాడు. నిద్ర, మద్యం మత్తు.... ఎక్స్‌లేటర్ మీద అదుపులేని కాలు.. దారిలో వాకింగ్ చేస్తున్న దేవదానాన్ని ప్రశాంత్ గుర్తించలేదు. దారుణంగా యాక్సిడెంట్ చేసి ఆయన మృతికి కారకుడయ్యాడు. అయితే ఆ యాక్సిడెంట్‌ని ఎవరూ చూడలేదని గ్రహించి నేరుగా సికింద్రాబాద్‌లోని బాపుబాగ్కాలనీలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. ప్రశాంత్ తండ్రి గుత్తికొండ రమేష్ ఎలక్ట్రికల్ గూడ్స్ దుకాణం నిర్వహించడంతో పాటు ఎలక్ట్రికల్ కాంట్రాక్టులు చేస్తుంటారు. ఇంటికి వెళ్ళిన ప్రశాంత్ తాను కూకట్పల్లి నుంచి వస్తుండగా కారు గుంతలో పడి మడ్‌గార్డ్ దెబ్బతిందని తల్లిదండ్రుల్ని నమ్మించాడు. కొన్ని రోజులపాటు బండిని బయటకు తీయలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రశాంత్ బోయిన్‌పల్లిలోని ఓ గ్యారేజ్‌లో కార్ రిపేర్ చేయించాడు. రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించుకోవడానికి కారు నెంబర్ ప్లేట్‌తో పాటు మడ్‌గార్డ్ తదితరాలను మార్చేందుకు పూనుకున్నాడు. ఈ క్రమంలోనే బోయిన్‌పల్లిలోని గ్యారేజ్‌లో ఉన్న కారును స్వాధీనం చేసుకున్న శ్యాంబాబు ఘటనాస్థలిలో దొరికిన లైనర్ ముక్కను దానికి అమర్చి చూడగా సరిగ్గా సరిపోయింది. ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన సమయంలో నిందితుడు మద్యం తాగి ఉన్నాడనేది నిరూపించడం కోసం పోలీసులు ఆ రోజు అతడు వెళ్ళిన పబ్స్‌లో నమోదైన సీసీ కెమెరా ఫుటేజ్‌తో పాటు అతడు తన డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించిన బిల్లుల్నీ సేకరించారు. సాక్ష్యాల తారుమారుకు యత్నించిన ప్రశాంత్‌పై నమోదైన కేసులో ఆ సెక్షన్లనూ జోడించి అరెస్టు చేశారు. కేసు విచారణలో ఉంది. ఎవరీ దేవదానం? నాయబ్ సుబేదార్ హోదాలో దేశ రక్షణ కోసం విధులు నిర్వర్తించిన దేవదానం ఇండో–పాక్, ఇండో–బంగ్లాదేశ్ యుద్ధాల్లో పాల్గొన్నారు. సంగ్రామ్ మెడల్, వార్ మెడల్, ‘25 ఇయర్స్ ఇండిపెండెన్స్ మెడల్’ పొందారు. పదవీ విరమణ తర్వాత రాయదుర్గంలో తన భార్యతో కలిసి నివసిస్తూ 72 ఏళ్ళ వయస్సులోనూ ఫస్ట్‌మ్యాన్ సెక్యూరిటీ సర్వీసెస్‌లో సెక్యూరిటీ సూపర్వైజర్గా పని చేసేవారు.. ముగ్గురు కుమారులూ ఉన్నత స్థితిలోనే ఉన్నప్పటికీ తాను మాత్రం ఖాళీగా కూర్చోనంటూ ఉద్యోగం కొనసాగించారు. హైదరాబాద్ దర్గా ప్రాంతంలో అందరికీ సుపరిచితుడైన దేవదానం ఎప్పటిలాగే 2016 డిసెంబర్ 10 తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్ళారు. వాకింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న ఆయన్ను 5.30 గంటల ప్రాంతంలో మాతా మందిర్ వద్ద ఓ కారు ఢీ కొట్టి వెళ్ళిపోయింది. తీవ్రగాయాల పాలైన ఆయన అక్కడే రక్తపు మడుగులో మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలారు. క్లూ కథనాలు పంపండి రెండు రాష్ట్రాలలో ఎందరో గొప్ప పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. ఎన్నో గొప్ప కేసులను క్లూల ద్వారా సాల్వ్ చేసి ఉంటారు. అలాంటి ఆఫీసర్లకు ఇదే మా ఆహ్వానం. మీరు సాల్వ్ చేసిన కేసులను సాక్షి పాఠకులతో పంచుకోండి. నేరస్తుడు తప్పించుకోలేడన్న భావన నేరాన్ని సగం నిరోధిస్తుంది. నేరం లేని సమాజం కోసం సాక్షి చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ సహకారాన్ని ఆశిస్తూ... మీరు సాల్వ్ చేసిన కేసు వివరాలు పంపాల్సిన ఈ మెయిల్: sakshiclue@gmail.com ఇన్పుట్స్: కామేశ్, సాక్షి ప్రతినిధి -
ఏపీజీవీబీ బ్యాంక్‌లో చోరీ
శ్రీకాకుళం : జిల్లాలోని బూర్జ మండలం, కొల్లివలస గ్రామంలోని ఏపీజీవీబీ బ్యాంకులో బుధవారం రాత్రి చోరీ జరిగింది. అర్థరాత్రి సమయంలో దుండగులు బ్యాంక్ కిటికి గ్రిల్స్ పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. అంతేకాకుండా సాక్షాలు దొరక్కుండా ఉండేందుకు సీసీ టీవీ కెమరాలను ధ్వంసం చేశారు. తెల్లవారుజామున బ్యాంకు కిటికి తెరిచి ఉండటం, సీసీ కెమరాలు ధ్వంసం అయి ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు, బ్యాంకు అధికారులకు సమాచారం అదించారు. విషయం తెలుసుకుని బ్యాంకు వద్దకు చేరుకున్న అధికారులు పెద్ద మొత్తంలోనే నగదు లూటీ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏపీజీవీబీ బ్యాంక్‌లో చోరీ
-
ఆశ్రమ పాఠశాలల్లో సీసీ నిఘా
ఉట్నూర్(ఖానాపూర్): ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలపై ప్రభుత్వం నిరంతరం నిఘా కోసం చర్యలు చేపట్టింది. ప్రతీ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. ఆశ్రమాల్లో జరిగే ప్రతీ సంఘటన.. విషయం క్షణాల్లో అధికారులకు తెలిసేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతీచోట ఆరు సీసీ కెమెరాలకు తగ్గకుండా ఏర్పాటు చేయడంతో పాటు ఇంటర్నెట్ లేదా వైఫై ద్వారా నేరుగా ఆయా జిల్లాల డీటీడీవో కార్యలయాలు, అక్కడి నుంచి నేరుగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యలయానికి అనుసంధానం చేసేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆశ్రమాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాగానే ప్రత్యేక ఐపీల ద్వారా కార్యాలయాలు, అధికారులు స్మార్ట్ఫోన్లకు ప్రత్యక్షంగా వీక్షించేలా అనుసంధానం చేయనున్నారు. ఫలితంగా ఆశ్రమాల్లోని గిరిజన విద్యార్థులకు మేలు జరగనుంది. నిరంతరం సీసీ నిఘా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో 127 ఆశ్రమ పాఠశాలల్లో 39,123 మంది, ఏడు వసతి గృహాల్లో 1254 మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖ ద్వారా ఉచితంగా విద్య, భోజన, ఇతర మౌలిక వసతులు కల్పిస్తోంది. వీరందరికీ నిర్దేశిత మెనూ ప్రకారం పోషకాహారం అందిస్తూ వసతి సౌకర్యాలు క ల్పిస్తోంది. ఆశ్రమ పాఠశాలలపై పటిష్ట పర్యవేక్షణ ద్వారా గిరిజన విద్యార్థులకు మెరుగైన పోషకాహారం, విద్యనందించాలని ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖకు ఆదేశాలు జారీ చేయడంతో చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒక్కో ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సం ఖ్యకు అనుగుణంగా ఆరుకు తగ్గకుండా సీసీ కెమెరాలు, డీవీఆర్, మానిటర్లను ఏర్పాటు చేస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమాల్లో ఇప్పటికే 40శాతం పాఠశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయినట్లు తెలిసింది. ఆశ్రమం ప్రధాన ద్వారం, సరుకుల గది, మైదానం, వరండాలు, చుట్టు పక్కల ప్రాంతాలు కవర్ అయ్యేలా ఏర్పాటు చేస్తూ కార్యాలయ గదిలో టీవీలకు అనుసంధానం చేయడం ద్వారా సిబ్బంది నిత్యం పర్యవేక్షణ చేసేలా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పాఠశాలపై నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టింది. ఇంటర్నెట్ లేదా వైఫై సాయంతో ప్రత్యే క ఐపీల ద్వారా నేరుగా డీటీడీవో కార్యాలయానికి అక్క డి నుంచి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యాలయానికి అనుసంధానం చేయనున్నారు. అంతేకాకుండా అధికా రుల స్మార్ట్ఫోన్లలో ప్రత్యేక యాప్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించేలా గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. మహిళా సిబ్బంది హర్షం, బాలికలకు భరోసా.. ఆశ్రమ పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై ఆశ్రమాల్లో విధులు నిర్వహించే మహిళా సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాలికలకు గిరిజన సంక్షేమశాఖ పూర్తి స్థాయి భద్రత కల్పిస్తుందని బాలికల తల్లిదండ్రులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా బాలికల ఆశ్రమ పాఠశాలల్లో బాలికలపై వేధింపులు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం నార్నూర్‌లోని బాలికల ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న విజయ్‌కుమార్ అనే ఉపాధ్యాయుడు గిరిజన బాలికలపై అసభ్యకరంగా వ్యవహరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆశ్రమాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుతో విధులు నిర్వహించే మహిళా సిబ్బందికి, బాలికల భద్రతకు భరోసా ఏర్పడనుంది. డుమ్మా సిబ్బందికి గుబులు.. గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలోని ఆశ్రమ పాఠశాలలు అంటేనే అక్రమాలకు నిలయమని ఎన్నో ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగా చా లా మంది సిబ్బంది ఆశ్రమాల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించడం కంటే హెచ్‌డబ్ల్యూవో (వార్డెన్)లుగా విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూ పిస్తుంటారు. ఇందుకోసం ఉన్నతా«ధికారులపై రాజకీయంగా, ఇతర రకాలుగా ఒత్తిడి తీసుకువచ్చి హెచ్‌డబ్ల్యూవోలుగా కొనసాగుతున్నవారు ఉన్నారు. చాలా చోట్ల విద్యార్థులకు పెట్టే మెనూలో కోత పెట్టి బి య్యం, ఇతర నిత్యావసర వస్తువులను పక్కదారి పట్టిస్తూ పలువురు సిబ్బంది అక్రమాలకు పాల్పడిన సం దర్భాలున్నాయి. అలాగే ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహించే బోధన, బోధనేతర సిబ్బంది వంతులవారీగా ఆశ్రమాల్లో విధులు నిర్వహిస్తున్న సంఘటనలున్నాయి. జిల్లాలో ఓ ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ నెలల తరబడి వి ధులకు హాజరు కాకుండా రిజిష్టర్‌లో వేరే సిబ్బందితో తన సంతకం పెట్టిస్తూ సొంత పనులు చేసుకుంటున్నారనే ప్రచారం ఉంది. సిబ్బంది తరచూ ఆశ్రమాలకు ఎగనామం పెడుతూ సొంత వ్యాపారాలు, వ్యవసాయం లాంటి పనులు చేసుకుంటున్నారు. అధికా రులకు తెలిసిన పైరవీలు, రాజకీయ ఒత్తిడిల కారణంగా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రతీ ఆశ్రమ పాఠశాలలో సీసీ నిఘా ఏర్పాటు కావడంతో ఆశ్రమాల్లో చోటు చేసుకునే అక్రమాలకు అడ్డుకట్ట పడడంతో విధులకు ఎగనామం పెట్టే సిబ్బంది క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాల్సిన పరిస్థితులు ఏర్పడడంతో విద్యార్థులకు మేలు జరగనుంది. నిరంతర పర్యవేక్షణకు అవకాశం ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల విషయంలో మాకు ఎలాంటి సమాచారం లేదు. గిరిజన సంక్షేమ శాఖ కార్యాల యం నుంచి నేరుగా ఏర్పాటు చేస్తున్నారు. ఆశ్రమాల్లో సీసీల ఏర్పాటు ద్వారా పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణకు అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనంతో పాటు నాణ్యమైన విద్య అందనుంది. సీసీల నిఘాతో గిరిజన విద్యార్థులకు అన్ని రకాలుగా మేలు జరగనుంది. – పోషం, గిరిజన సంక్షేమశాఖ, డీటీడీవో, ఐటీడీఏ జిల్లాలవారీగా ఆశ్రమ పాఠశాలలు జిల్లా పేరు ఆశ్రమ, వసతి గృహాలు విద్యార్థులు ఆదిలాబాద్ 54 19,706 కుమురంభీం 46 12,327 మంచిర్యాల 17 3,359 నిర్మల్ 17 4,940 -
కఠిన పరీక్ష
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం కఠినచర్యలు చేపడుతోంది. పరీక్ష విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా, కాపీయింగ్‌కు పాల్పడినా కొరడా ఝుళిపించేందుకు సన్నద్ధమవుతోంది. పర్యవేక్షకులుగా వేళ్లేవారు విధుల్లో అప్రమత్తంగా లేకుంటే మాత్రం చర్యలు తప్పవు. ఈనెల15 నుంచి నిర్వహించనున్న పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో అమలు చేయనున్న నిబంధనలు చూస్తే విద్యార్థులకు పరీక్ష అయినా సిబ్బందికి మాత్రం అగ్నిపరీక్షే అని పలువురు అంటున్నారు. పరీక్ష నిర్వహణ విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే గతంలో పరీక్ష విధుల నుంచి తొలగించేవారు. కానీ ఇప్పుడు సంబంధిత నిబంధనలను కఠినతరంగా చేశారు. 1997 చట్టం 25 సెక్షన్ 10లోని నిబంధనలను అమలు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ చట్టం ప్రకారం పదో తరగతి పరీక్షల విధుల్లో సక్రమంగా పనిచేయలేదని రుజువైతే క్రిమినల్ కేసు నమోదుతోపాటు ఆరునెలల నుంచి 3 సంవత్సరాల వరకూ జైలు, రూ.5 వేలు నుంచి రూ.లక్ష దాకా జరిమానా విధించనున్నట్ల తెలిసింది. కాఫీలకు పాల్పడితే..: పరీక్ష కేంద్రంలోకి స్క్వాడ్ వచ్చినప్పుడు విద్యార్థులు చీటిలతో పట్టుబడినా పక్కవారి పేపర్లో చూచిరాస్తున్నా అందుకు సంబంధించిన ఇన్విజిలేటర్‌తోపాటు డిపార్టుమెంట్ ఆఫీసర్, చీఫ్ సూపరిండెంట్పైనా చర్యలు చేపట్టనున్నారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థిని తనిఖీ చేసి లోపలికి పంపాలని సూచించినట్లు తెలుస్తోంది. సమస్యాత్మక కేంద్రాలలో సీసీ కెమెరాలు జిల్లాలోని 8 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇందులో దువ్వూరు, చక్రాయపేట(గండి), కమలాపురం(బాయిస్), నందిమండలం, బి.మఠం, పెనగలూరు మండలం చక్రంపేట, కొండాపురం మండలం తాళ్లపొద్దుటూరు, వనిపెం ట జెడ్పీ హైస్కూల్స్ ఉన్నాయి. æవీటిలో విద్యాశాఖాధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఆందోళనలో ఇన్విజిరేటర్లు పరీక్ష కేంద్రాల్లోని గదుల్లో ఉపాధ్యాయిని ఇన్విజిలేటర్‌గా ఉంటే బాలికలను తనిఖీ చేయడం వీలవుతుంది. పురుష ఉపాధ్యాయుడైతే బాలురను తనిఖీ చేయడం కుదురుతుంది. కానీ చాలా పరీక్ష గదుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ఉండేచోట సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల కొందరు వద్ద చీటీలు ఉండిపోయే ప్రమాదం ఉందని ఇన్విజిలేటర్ల ఆందోళన చెందుతున్నారు. ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు సంఘాలు అంటున్నాయి. ఈ ఏడాది 35,737 మంది ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న పదవ తరతగతి పరీక్షలను జిల్లావ్యాప్తంగా 35,737 మంది విద్యార్థులు రాయనున్నారు. వీరికోసం 164 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పకడ్బందీగా నిర్వహిస్తాం ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలను మొదలుపెట్టాం. జిల్లావ్యాప్తంగా ఉన్న 164 పరీక్ష కేంద్రాలలో ఎవరు కూడా కింద కూర్చోని పరీక్షలు రాయకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. దీంతో పాటు అన్ని కేంద్రాలలో విద్యార్థులకు తాగునీరు వంటి వసతులను ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షల విధుల పట్ల ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని లేనిపక్షంలో చట్టం 25ను అమలుచేయాల్సి వస్తుంది. ఏమాత్రం నిర్యక్ష్యం, అలసత్వం ప్రదర్శించినా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. – పొన్నతోట శైలజ, డీఈఓ -
మహిళలకు మరింత రక్షణ
సంగారెడ్డి క్రైం: ఆటోల్లో ప్రయాణించే వారి భద్రతకు, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణించే మహిళల రక్షణ కోసం సంగారెడ్డి జిల్లా పోలీసులు రాష్ట్రంలోనే మొదటిసారిగా ‘‘మై వెహికల్ ఈజ్ సేఫ్’’పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లా పరిధిలోని ఆటోలన్నింటికీ ప్రత్యేకంగా ఓ బార్కోడ్ కేటాయించారు. స్మార్ట్‌ఫోన్‌తో ఆ బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే క్షణాల్లో డ్రైవర్‌కు సంబంధించిన వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఆటో ఎక్కిన మరుక్షణమే కోడ్‌ను స్కాన్ చేసి ఆ వివరాలను కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఇలా ఎవరికైనా ముందు జాగ్రత్తగా పంపించుకోవచ్చు. దీని సాయంతో డ్రైవర్లు ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, నేరాలకు పాల్పడినా పోలీసులు వారిని సులువుగా గుర్తించి అదుపులోకి తీసుకునే వీలుంటుంది. గత సంఘటనల నేపథ్యంలోనే.. పల్లె జనం, ముఖ్యంగా మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు ఆకతాయిలు గతంలో పలు అఘాయిత్యాలకు పాల్పడిన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం నేరాల నియంత్రణకు ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసి ఆటోవాలాల్లో బాధ్యతను, భయాన్ని నింపేందుకు ప్రతి ఆటోకు ప్రత్యేక నంబర్ కేటాయించి అతని పూర్తి వివరాలు సేకరించింది. అక్రమాలు అరికట్టేందుకే.. ఆటోలో ప్రయాణించేటప్పుడు మీ వస్తువులు మర్చిపోయినా, మిమ్మల్ని వేధింపులకు గురి చేసినా, మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా స్కాన్ చేసిన కోడ్ నుంచి వచ్చిన వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. జిల్లాలో మొత్తం 4,000 ఆటోలు ఉండగా పోలీసులు ఇప్పటికే 2,200 ఆటోల వివరాలను సేకరించారు. ఒక్క సంగారెడ్డి పట్టణంలోనే 1,600 ్డఆటోలను గుర్తించారు. వాటన్నింటికీ కోడ్‌తో కూడిన బోర్డులను అమర్చారు. ప్రయాణికులను చేరవేసే టాటా సుమోలు, తుపాన్‌లాంటి వాహనాలకు సైతం ఇదే విధానాన్ని అమలు చేసేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఆటో ముందు, వెనుక కోడ్‌తో కూడిన స్టిక్కర్లు ఆటో ముందు అద్దానికి ప్రింట్ మిర్రర్ స్టిక్కర్ అతికిస్తారు. అలాగే ఆటో వెనకాల సైతం ఓ స్టిక్కర్ ఉంటుంది. వీటిపై ఆటో సీరియల్ నంబర్, ఆటో నంబర్‌తో కూడిన క్యూఆర్ కోడ్ ఉంటాయి. ఆటోను ఎవరైనా నేరం చేయడానికి ఉపయోగిస్తే జిల్లావ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా గుర్తించి నేరానికి పాల్పడిన డ్రైవర్ వివరాలను సులువుగా గుర్తించవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. డ్రైవర్ సీటు వెనకాల ‘మై వెహికల్ ఈజ్ సేఫ్’అనే క్యాప్షన్‌తో యూవీ ప్రింటెడ్ బోర్డు ఉంటుంది, దీనిపై ఆటో సీరియల్ నంబర్, ఆటో నంబర్, ఆటో డ్రైవర్ పేరు, అడ్రస్ ఉంటాయి. ఆటోలో ప్రయాణించే వారి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. ప్లేస్టోర్ నుంచి క్యూఆర్ కోడ్ స్కానర్ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రింటెడ్ బోర్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఆటో వివరాలతో పాటు, డ్రైవర్, ఓనర్ వివరాలు తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఆటోడ్రైవర్ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. దర్యాప్తులో పోలీసులకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. సురక్షిత ప్రయాణానికి భరోసా పోలీసులు చేపట్టిన ఈ చర్య ప్రయాణికులకు ఎంతో భరోసా కల్పిస్తుంది. గతంలో ఒంటరిగా ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో సురక్షితమైన ప్రయాణం చేయడానికి ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుంది. –దేవవాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్, సంగారెడ్డి -
జిల్లా అంతటా సీసీ కెమెరాలు
కృష్ణాజిల్లా, నూజివీడు : ప్రజల భద్రతా అవసరాల రీత్యా జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో ఇప్పటివరకు 936 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఈ నెలాఖరు నాటికి మరో వెయ్యి ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి చెప్పారు. నూజివీడులోని డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పట్టణాల్లో పూర్తయిన తరువాత గ్రామీణ ప్రాంతాలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. వీటి ఏర్పాటు కోసం వ్యాపారస్తులు, దాతల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. సామాజిక బాధ్యతగా వీటిని ఏర్పాటు చేస్తామని, ఏదైనా సంఘటన జరిగినప్పుడు కచ్ఛితంగా ఆధారాలు లభిస్తాయని, ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు. ఇప్పటి వరకు వాహనదారులకు పోలీసులే రసీదులు రాసి జరిమానాలు విధించేవారని, ఇక నుంచి త్వరలోనే ఈ–చలానా విధానాన్ని అమలుచేస్తామని తెలిపారు. ఈ–చలానా ఇచ్చిన తరువాత వాహనదారుడే నేరుగా వెళ్లి సంబంధిత కార్యాలయంలో జరిమానా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే విజయవాడలో ఈ విధానం ఉందని, మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ, అవనిగడ్డ, నందిగామల్లో ఈ–చలానా విధానాన్ని అమలు చేస్తామన్నారు. చిలకలపూడి, అవనిగడ్డ, మైలవరం, కైకలూరు పోలీసుస్టేషన్లను మోడల్ పోలీస్స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసింగ్‌ను నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, ప్రమాద మరణాల సంఖ్యను తగ్గించడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రతి శనివారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి ఎక్కువ సివిల్ తగాదాలకు సంబంధించిన సమస్యలు తన దృష్టికి వస్తున్నాయన్నారు. పొలాలకు సంబంధించిన తగాదాలు, భార్యభర్తల గొడవలు తదితర సంబంధిత సమస్యలు ఉంటున్నాయన్నారు. కేసులను సెటిల్మెంట్ చేసే బ్యాచ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి జిల్లా నుంచి బయటకు పంపించి వేస్తామని అన్నారు. విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు, సీఐ మేదర రామ్‌కుమార్‌లు పాల్గొన్నారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సుల్తానాబాద్(పెద్దపల్లి): మార్చి 15 నుంచి 28 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని విద్యాశాఖ కమిషనర్ జి కిషన్ ఆదేశాల మేరకు అమలు చేస్తున్నట్లు డీఈవో వెంకటేశ్వర్రావు స్పష్టం చేశారు. ఉదయం 9:15 నిముషాల నుంచి 12:15 వరకు పరీక్ష ఉంటుందని ఆయన తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 20 నిమిషాల ముందే హాజరు కావల్సి ఉంటుందని తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12.15 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు 500 మంది ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా, 49మంది సూపరింటెండెంట్లు, మూడు ష్లైయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో స్క్వాడ్‌లో డిప్యూటీ తహసీల్దార్, ఎంఈవో, ఇద్దరు కానిస్టేబుళ్లు, డీఈవోతో ప్రత్యేక టీం, స్టేట్ పరిశీలకుల టీం, ఫస్ట్ ఏయిడ్ కోసం ఏఎన్ఎంల టీం సైతం కేంద్రాల వద్ద ఉంటారని తెలిపారు. 49 పరీక్షా కేంద్రాల ఏర్పాటు జిల్లాలో 47 రెగ్యులర్ సెంటర్లు, 2 ప్రైవేట్ సెంటర్లలో 10,307 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని జిల్లా పరీక్షల ఇన్చార్జి హన్మంతు తెలిపారు. 105 సర్కారు, ప్రైవేటు, ఆదర్శ పాఠశాలలు 7, కేజీబీవీ 7, గురుకుల వసతి గృహాలు 6, మైనారిటీ హైస్కూల్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్ పదో తరగతి పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖకు సిఫారసు చేసినట్టు డీఈవో తెలిపారు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ కేంద్రాలు సైతం తెరిచి ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు లేనట్టే.. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని స్థానిక అధికారులు తెలిపారు. గత సంవత్సరం ధర్మారం మండలం మల్లాపూర్ ప్రభుత్వ హైస్కూల్లో మాత్రం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వానికి నివేదికను అందించారు. ఇప్పుడు ఏర్పాటు చేయాలా వద్దా అనే దానిపై అధికారులు సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఆదేశాలు వచ్చినా సీసీ కెమెరాలు 9 రోజుల్లో ఏర్పాటు చేయడం కష్టమే. ఎలాంటి ఉత్తర్వులు రాలేదు సీసీ కెమెరాలు పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని ఎలాంటి ఉత్తర్వులు ఇప్పటికీ అందలేదు. పరీక్షలు పకడ్బందీగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. నిమిషం ఆలస్యమైనా అనుమతి ఇవ్వద్దని కమిషనర్ కిషన్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. – వెంకటేశ్వర్రావు, డీఈవో, పెద్దపల్లి -
దేవుడికే శఠగోపం పెట్టాడు
-
దేవుడికే శఠగోపం పెట్టాడు
ఢిల్లీ: గుడిలో ఉన్న దేవుడికే రక్షణ లేకుండా పోయింది. మరీ సామాన్య మానవుడి పరిస్థితి తలచుకుంటే భయమేస్తోంది. ఓ వ్యక్తి మాస్క్ ధరించి ఇటీవల సాయి బాబా గుడిలో దేవుడి వస్తువులను దొంగతనం చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకంది. మాస్క్ ధరించిన వ్యక్తి గుడిలో దర్జాగా తిరుగుతూ విలువైన వస్తువలను ఎత్తుకెళ్లాడు. ఆ సమయంలో అతనిలో ఎలాంటి భయమూ, బెణుకు కనిపించలేదు. ఆ దృశ్యాలన్ని ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
చౌటుప్పల్ (మునుగోడు) : వాళ్లంతా విద్యార్థులు. చదువుకోవాల్సిన వారు జల్సాలకు అలవాటుపడ్డారు. విందులు, వినోదాల పేరిట బలాదూర్ తిరుగుతున్నారు. కల్లు, మద్యం సేవించడం అలవాటు చేసుకున్నారు. జల్సాలకు అలవాటుపడిన వీరు డబ్బు కోసం చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే భారీ దొంగతనానికి పాల్పడ్డారు. కానీ చోరీ జరిగిన దుకాణంలో ఉన్న సీసీకెమెరాలకు చిక్కడంతో వీరి భాగోతం బట్టబయలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రామోజు రమేష్ వెల్లడించారు. సంస్థాన్‌నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామానికి చెందిన మేకల రామకృష్ణ(17), మేకల ప్రశాంత్(15), కొప్పు వినోద్(15)లు చదువుకుంటున్నారు. రామకృష్ణ నారాయణపురంలో ఇంటర్ చదువుతుండగా మిగతా ఇద్దరు నల్లగొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పల్ హైస్కూల్లో చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నారు. కొంతకాలంగా వీరు ముగ్గురు జల్సాలకు అలవాటు పడ్డారు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని నిర్ణయానికి వచ్చారు. ఇందుకు సులువైన మార్గం దొంగతనమేనని భావించారు. ముందస్తుగా రెక్కీ.. దొంగతనం చేసేందుకు నిర్ణయించుకున్న ఈ ముగ్గురు అనువైన ప్రాంతాల కోసం అన్వేషించారు. తరచుగా సినిమాలు చూసేందుకు చౌటుప్పల్‌కు వచ్చే వీరు ఇక్కడే దొంగతనం చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఆ క్రమంలో గత ఏడాది డిసెంబర్ 29న అనుకూలమైన దుకాణాల కోసం అన్వేషణ చేశారు. చిన్నకొండూరు చౌరస్తా వద్ద ఉన్న ఎంఎం మొబైల్ దుకాణాన్ని ఎంచుకున్నారు. అందులో భాగంగా దుకాణంలోకి రెండుసార్లు వెళ్లి పూర్తి స్థాయిలో రెక్కి నిర్వహించారు. రాత్రి తొమ్మిదిన్నరకు దుకాణం బంద్ కాగానే వెనక భాగం నుంచి పై అంతస్తు మీదుగా లోనికి ప్రవేశించారు. దుకాణంలోని విలువైన 20సెల్ఫోన్లు, 35వేల నగదు, ల్యాప్‌టాప్‌ను ఎత్తుకెళ్లారు. దొంగలను పట్టించిన సీసీకెమెరాలు మొబైల్ షాపులో దొంగతనం చేసిన ముగ్గురు నిందితుల చిత్రాలు అక్కడి సీసీకెమెరాల్లో నమోదయ్యాయి. కెమెరాలు ఉన్న విషయాన్ని అలస్యంగా గుర్తించిన సదరు దొంగలు గుర్తుపట్టకుండా ఉండేందుకు వేశాలు మార్చారు. కానీ అప్పటికే రికార్డయిన వీరి చిత్రాలు పోలీసులకు పెద్ద ఆధారంగా లభించాయి. సీసీఫూటేజీలను వివిధ స్టేషన్లకు పంపించి ఎంక్వైరీ చేసిన పోలీసులకు వీరి వివరాలు లభించాయి. చోరీసొత్తుతో విందులు, వినోదాలు సెల్‌ఫోను షాపులో ఎత్తుకెళ్లిన నగదుతో ఈ ముగ్గురు విందులు, వినోదాలు చేసుకున్నారు. సహచర మిత్రులను పిలిచి పార్టీలు ఇచ్చారు. 35వేలల్లో 15వేలను ఖర్చు చేశారు. వాహన తనిఖీల్లో .. మండలంలోని దామెర గ్రామం వద్ద మంగళవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా నిందితులు ముగ్గురు బైక్‌పై చౌటుప్పల్ వైపు వస్తున్నారు. పోలీసులను చూడగానే బయపడి పారిపోయే ప్రయత్నం చేయగా సిబ్బంది పట్టుకున్నారు. వారి వద్ద 2లక్షల రూపాయల విలువైన 20 సెల్ఫోన్లు, 20వేల నగదు, ఒక ల్యాప్‌టాప్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లను అమ్మేందుకు వీలు కాకపోవడంతో చిల్లాపురం గ్రామంలోని తమ బావి వద్ద ఉన్న గుట్టలో ఇంత కాలం దాచిపెట్టారు.ఎలాగైన అమ్మాలని తీసుకువస్తున్న క్రమంలో పట్టుబడ్డారు. వీరు మైనర్లు కావడంతో అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం నల్లగొండలోని బాల నేరస్తుల న్యాయస్థానానికి తరలించారు. సమావేశంలో సీఐ ఏ.వెంకటయ్య, ఎస్సైలు చిల్లా సాయిలు, నవీన్‌బాబు, సిబ్బంది ఉన్నారు. -
సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్ పరీక్షలు
ఒంగోలు: ఇంటర్మీడియెట్ పరీక్షలను సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి పి.మనోహర్‌బాబు తెలిపారు. తన ఛాంబర్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 25 ప్రభుత్వ, 12 ఎయిడెడ్, 3 సాంఘిక సంక్షేమ కళాశాలలు, 53 ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ కాలేజీల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ ఏడాది జూనియర్ ఇంటర్ జనరల్ విభాగంలో 26,675 మంది, ఒకేషనల్ విభాగంలో 1,110 మంది, సీనియర్ ఇంటర్ జనరల్ విభాగంలో 26,941 మంది, ఒకేషనల్ విభాగంలో 988 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని, విద్యార్థి 8:30 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఆర్టీసీ, విద్యుత్, రెవెన్యూ, పోలీసు, ఆరోగ్యశాఖ, తపాలాశాఖ, విద్యాశాఖ అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారన్నారు. పటిష్ట నిఘాలో పరీక్షలు.. ప్రతి పరీక్షా కేంద్రంలో డిపార్టుమెంటల్ ఆఫీసర్ రూంలో ఒకటి, వరండాలో రెండు లేక మూడు, పరీక్షా గదిలోను ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ఏడాది మార్కాపురంలో గౌతమి జూనియర్ కాలేజీలో పరీక్షా కేంద్రం ఉండేదని, ఈ ఏడాది అక్కడ తొలగించి మెరుగైన వసతులు ఉన్న ఎస్ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది అదనంగా సీఎస్‌పురంలో రత్నం జూనియర్ కాలేజీలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల సెంటర్ల వద్ద కూడా పోలీసు బందోబస్తు ఉంటుందని, సెంటర్ల వద్ద జిరాక్స్ సెంటర్లు నెట్ సెంటర్లు విధిగా మూసివేయాలని ఆదేశాలు ఉన్నాయన్నారు. అశ్రద్ధ వహిస్తే చర్యలు.. పరీక్షల నిర్వహణలో ఏమాత్రం ఆశ్రద్ధగా ఉన్నా అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్ఐఓ పి.మనోహర్‌బాబు పేర్కొన్నారు. స్థానిక ఆంధ్రకేసరి విద్యాకేంద్రంలో డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, కస్టోడియన్లు, ప్రైవేటు సెంటర్ల ప్రిన్సిపాళ్లు, డీఈసీ సభ్యులు, హైపవర్ కమిటీ సభ్యులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో కేవలం డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్ల వద్ద మాత్రమే మొబైల్ ఉండాలని, మిగిలిన ఏ ఒక్కరి వద్ద సెల్‌ఫోన్ ఉండరాదన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల వసతి కల్పించాలన్నారు. విద్యుత్‌కు అంతరాయం లేకుండా విద్యుత్ శాఖాధికారులు తగు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామన్నారు. అదే విధంగా పోలీసుస్టేషన్ వద్ద నుంచి ప్రశ్నాపత్రాలను తీసుకువెళ్లేందుకు, జవాబు పత్రాలను తపాలాశాఖకు చేర్చేవరకు పోలీసు బందో బస్తు ఉంటుందన్నారు. మాల్‌ప్రాక్టీస్, వి ద్యార్థులు చిట్టీలు తీసుకుని రావడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో సెంటర్ లొకేటర్.. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రానికి ఎలా చేరుకోవాలో సూచించే ఐపీఈ సెంటర్ లొకేటర్ అనే యాప్‌ను గూగుల్‌ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఏ వాహనంలో వెళ్లేందుకు ఎలాంటి మార్గం ఉందనేది కూడా సులువుగా తెలుసుకోవచ్చన్నారు. యాప్‌లో సెంటర్ కోడ్ నమోదు చేస్తే సరిపోతుందన్నారు. పరీక్షల నిర్వహణకు 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు, మరో 5 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించామన్నారు. తనతో పాటు హైపవర్ కమిటీ, డీఈసీ సభ్యులు ఆకస్మిక తనిఖీలు చేస్తారని, పరీక్షల విధులలో ఉన్న వారు అప్రమత్తంగా ఉండి ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించేందుకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. -
గిరిజన హాస్టళ్లలో ‘సీసీ’ నిఘా
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో వసతి పొందుతున్న విద్యార్థుల భద్రతతో పాటు నిఘా పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీసీ కెమెరాలను బిగిస్తోంది. ఇప్పటికే జిల్లాలోని ప్రీమెట్రిక్ హాస్టళ్లలో ఏర్పాటు చేస్తుండగా, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో కూడా ఈ నెలాఖరు వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో మొత్తం ఎనిమిది హాస్టళ్లు ఉండగా నాలుగు ప్రీ మెట్రిక్, నాలుగు పోస్ట్‌మెట్రిక్ హాస్టలున్నాయి. వీటిలో దాదాపు 950కి పైగా మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. అయితే విద్యార్థులతో పాటు వార్డెన్, వర్కర్ల కదలికలు గమనించడానికి, ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే వెంటనే తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడనున్నాయి. ఇటీవల జిల్లాలో ఎస్సీ హాస్టళ్లలో సన్న బియ్యం తరలింపు వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంలో సీసీ కెమెరాలే అధికారులకు ఆధా రాలయ్యాయి. ఈ నేపథ్యంలో బియ్యం, సరుకులు పక్కదారి పట్టించినా, లారీల్లోంచి బియ్యం బస్తాల ను లెక్క ప్రకారమే దింపుతున్నారా అనే విషయాలు సీసీ కెమెరాల్లో రికార్డయిన పుటేజీల ద్వారా తెలిసిపోనుంది. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు. అయితే కిచెన్, స్టోర్ రూం, గ్రౌండ్, హాస్టల్ ఎంట్రెన్స్ ఇలా దాదాపు ఒక్కో హాస్టల్లో 7–8 సీసీ కెమెరాలను బిగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నుంచి ప్రీ మెట్రిక్ హాస్టళ్లకు సీసీ కెమెరాలు చేరుకోగ, ఈ నెలాఖరులోగా పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లకు కూడా సీసీ కెమెరాలు రానున్నాయి. కంప్యూటర్లు, బయోమెట్రిక్ విధానం... విద్యార్థుల హాజరు శాతాన్ని రోజు వారీగా నమోదు చేసేందుకు ఈ గిరిజన హాస్టళ్లలో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆన్లైన్లో హాజరు శాతాన్ని నమోదు చేసి వార్డెన్లు అధికారుల కు పంపాల్సి ఉంటుంది. తద్వారా విద్యార్థుల రాకు న్నా వారి పేరిట రేషన్‌ను డ్రా చేసేందుకు వీలుపడదు. దీంతో అక్రమాలను అడ్డుకట్ట పడనుంది. అలాగే కంప్యూటర్లను కూడా ప్రతీ హాస్టల్‌కు సరఫరా కానున్నాయి. బయోమెట్రిక్‌ను కంప్యూటర్‌కు అనుసంధానం చేయడంతో పాలు బిల్లులను తయా రు చేయడానికి ఉపయోగపడనున్నాయి. కంప్యూటర్లను కూడా రాష్ట్ర శాఖనే సరఫరా చేయనుంది. పారదర్శకత ఏర్పడుతుంది.. గిరిజన సంక్షేమ హాస్టళ్లలో సీసీ కెమెరాలతో కంప్యూటర్లు, బయోమెట్రిక్ మెషిన్లు ఏర్పాటు కానున్నాయి. హాస్టళ్లకు భద్రతతో పాటు నిఘా ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న పై నిర్ణయాల వల్ల హాస్టళ్లలో పారదర్శకత ఏర్పడుతుంది. – సంధ్యారాణి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి -
అష్ట దిగ్బంధం
గద్వాల క్రైం : ‘సార్! కొత్త బస్టాండ్ వద్ద బైక్ నిలిపి పక్కనే ఉన్న దుకాణంలో మందులు తీసుకుని వచ్చేసరికి అక్కడ వాహనం కనిపించలేదు..’ ‘అయ్యా! ఇంట్లో దొంగలు చొరబడి విలువైన వస్తువులు, బంగారు నగలు ఎత్తుకెళ్లారు...’ మరో బాధితుడు. ‘ఓ సారో..ఒక్కగానొక్క కుమార్తె రెండు రోజులుగా కనిపించడం లేదు, యాడికి బోయిందో తెలియదు, ఎలాగైనా నా బిడ్డ ఆచూకీ తెలుసుకుని అప్పగించండి..’ అంటూ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు.. సదరు ఎస్ఐ సరే.. సరే రెండు రోజుల్లో మీ సమస్యలను పరిష్కరిస్తాం.. అం టూ సమాధానం వస్తుంది. ఇక కేసు దర్యాప్తులో భా గంగా సీసీ కెమెరాల కంట్రోల్ విభాగంలోని పర్యవేక్షకుడు వద్దకు సమాచారం.. సిబ్బంది గంటల తరబడి అక్కడే ఉండి అన్ని సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా క్షుణంగా గుర్తించి నిందితులను ఛేదించి బాధితులకు న్యాయం చేస్తారు.. సార్! గాంధీచౌక్‌లో ట్రాఫిక్ జాం అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు..’ అంటూ ఓ వాహనదారుడు ఉన్నతాధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తాడు.. ఇలాం టి తరుణంలో సీసీ కెమెరాల పర్యేవేక్షకుడి సాయం కోసం అక్కడ సమస్యపై కంట్రోలర్ విభాగానికి ఫోన్ చేసి ఎంత మేర ట్రాఫిక్ జాం అయిందని వెంటనే కంట్రోల్ రూంకు వెళ్లి సూచనలు ఇవ్వు.. ఉన్నతాధికారులు సీసీ కెమెరాల మానిటర్‌కు ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఉండదు.. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తన మొబైల్లో ఇంటర్నెట్ లింకు ఆధారంగా నిక్షిప్తం చేసుకున్నది అనుసంధానమై నేరుగా సీసీ కంట్రోలర్ సిబ్బంది ఉన్న చోటు నుంచి సమస్యలపై నేరుగా చూసి చెప్పవచ్చు. ఇలా జిల్లాలో పోలీసు శాఖ టెక్నాలజీని వినియోగించడంలో ముందుంది. జిల్లా కేంద్రంలో 55సీసీ కెమెరాలు గద్వాల పట్టణంలోని 55సీసీ కెమెరాల దృశ్యమాలికలను మొబైల్ ద్వారా ఎక్కడి నుంచైనా చూసుకునేలా సాంకేతిక విప్లవంతో నాంది పలికింది. సీసీ కెమెరాల విభాగంలో పర్యవేక్షకుడు వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలోనూ అరచేతిలో ఉన్న మొబైల్ సాయంతో ఏ ప్రాంతంలో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు తతెత్తినప్పుడు వెంటనే గుర్తించి తగు చర్యలు తీసుకునేందుకు దోహదపడుతుంది. ఇక సీసీ కెమెరాల విభాగం సీఐ కార్యాలయంలోని ప్రత్యేక భవనంలో పర్యవేక్షకుడు నిత్యం మానిటరింగ్ చేస్తూ పట్టణంలో జరిగిన పలు సంఘటనలపై దృష్టి సారించి ఉన్నతాధికారులకు సమాచారం అందించి శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నారు. పరుగులకు చెక్ పట్టణంలో అనుమానాస్పదంగా గుర్తు తెలియని నిందితులు ఉన్నట్లు సమాచారం వస్తే ఉన్నతాధికారులు గతంలో వెంటనే సీసీ కెమెరాల కంట్రోలర్‌కు సమాచారం అందించేవారు. అయితే సిబ్బంది భోజనం సమయం కావడంతో బయటకు వెళతారు. ఈ క్రమంలో తిరిగి కార్యాలయానికి రావడంలో అలస్యమవుతుంది. ఇక నిందితులు అక్కడి నుంచి తప్పించుకుని మరోచోట ప్రత్యక్షమవుతారు. సిబ్బంది సైతం కార్యాలయానికి పరుగులు తీస్తారు. ఈలోపు నిందింతులు సునాయసంగా చేజారిపోతారు. ఇలాంటి వాటికి కొత్త విధానంతో చెక్ పెట్టినట్టే. సిబ్బంది ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్ లింకు ఆధారంగా తన అరచేతిలో ఉన్న మొబైల్ ద్వారా గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి నిందితులు ఎటు వెళ్తున్నారనే విషయం ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయొచ్చు. దీంతో నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టడానికి వీలుంటుంది. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ క్షణాల్లో కేసులను ఛేదించి బాధితులకు ఊరట కల్పించవచ్చు. సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజ కొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో జిల్లా పోలీసు శాఖ ముందంజలో ఉంది. ఇదే విషయమై ఇటీటల పోలీసు ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో సీఎం, డీజీపీ సైతం ఎస్పీ విజయ్‌కుమార్‌ను అభినందించారు. ఇక మొబైల్ యాప్‌కు సంబంధించి ఇంటర్నెట్ లింకు ద్వారా కెమెరాల అనుసంధానంతో పట్టణంలో మరింత నిఘా పెట్టేందుకు వివిధ సీసీ కెమెరాల పాయింట్లు వీక్షించే సిబ్బందికి ఇటీవలే హైదరాబాద్‌లో శిక్షణకు పంపించి ప్రావీణ్యం తెలుసుకునేలా ప్రోత్సహించారు. శాంతిæభద్రతల పర్యవేక్షణలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజలకు పోలీసులంటే జావాబుదారీగా ఉండాలంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. సిబ్బంది పెట్రోలింగ్, ట్రాఫిక్ తదితర విధులను ఎంత మేర చేస్తున్నారో తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇక ఎక్కడ ఏం జరిగినా ఈ కొత్త పరిజ్ఞానంతో చెక్ పెట్టొచ్చంటున్నారు. నిరంతర నిఘా జిల్లాలో విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటిని నిలువరించి ప్రజలకు జావాబుదారీగా ఉండాలనేది మా సంకల్పం. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ కేసులు, సమస్యలను ఎక్కడి నుంచైనా సులువుగా తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా మొబైల్ యాప్‌తో సీసీ కెమెరాలను సిబ్బంది పరిశీలించి తగు వివరాలను ఉన్నతాధికారులకు సమాచారం అంది స్తారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమవుతారు. – ఎస్.ఎం.విజయ్‌కుమార్, ఎస్పీ, గద్వాల -
నిఘాపై నీలినీడలు!
మహబూబ్‌నగర్ క్రైం : ఇటీవల పట్టణానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు కలెక్టరేట్లో వాహనం పెడితే భద్రంగా ఉంటుందని భావించి తన బైక్‌ను కలెక్టరేట్లో పెట్టి డ్యూటీకి వెళ్లి సాయంత్రం వచ్చి చూసే సరికి పార్క్ చేసిన ప్రాంతంలో బైక్ లేదు. చివరకు అంతట గాలించిన దొరకలేదు చివరకు ఎవరో అపహరించారని గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇలా ఒక్కటే కాదు పట్టణంలో బైక్ దొంగతనాల దగ్గర నుంచి ఇళ్ల చోరీల వరకు ప్రతి ఒక్కటి దోచుకొని దర్జాగా వెళ్తున్నారు. జిల్లా కేంద్రంలో నేరాల అడ్డుకట్టకు చర్యలు కరవవుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా.. వాటి సాయంతో నేరాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల్లో అధికారులు తత్సారం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నేరాల సంఖ్య ఎక్కువగా నమోదైన సందర్భాలున్నాయి. మహబూబ్‌నగర్ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణపై పోలీస్ యంత్రాంగం మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం నెలకొంది. జిల్లా కేంద్రంలో ఆకతాయిలు ఆగడాలు సృష్టిస్తూ పోలీసులకు చిక్కకుండాపోతున్నారు. మహిళలపై జరిగే ఎన్నో వేధింపులు వెలుగులోకి రాకుండా పొతున్నాయి. ట్రాఫిక్ సమస్యలు పెచ్చుమీరుతున్నాయి. వీటన్నింటిని అరికట్టేందుకు నిఘా కెమెరాలు(సీసీ కెమెరాలు) ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉంది. ప్రతి జిల్లాలోని ప్రధాన పట్టణాలు, ప్రాంతాల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు సైతం సూచిస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం అవి అందుబాటులో రావడం లేదు. జిల్లా కేంద్రంలో కొన్ని దుకాణాల్లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిని, దొంగతనాలకు పాల్పడిన వారి గుర్తించి సొమ్ములను రికవరీ చేసిన కొన్ని సందర్భాలున్నాయి. కెమెరాల ఏర్పాటులో జాప్యం జిల్లా కేంద్రంలోని శ్రీనివాసకాలనీ, మెట్టుగడ్డ, జనరల్ ఆస్పత్రి ఎదుట, అవంతి హోటల్ సమీపంలో, న్యూటౌన్ పంచవటి హోటల్ నుంచి సుభాష్ చంద్రభోస్ విగ్రహాం వరకు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా బాలికల జూనియర్ కళాశాల ఎదుట, బస్టాండ్‌లో, కలెక్టరెట్లో, అంబేద్కర్ చౌరస్తాలో, తెలంగాణ చౌరస్తాలో, పాత బస్టాండ్‌లో, క్లాక్‌టవర్, ఆకుల చౌరస్తా, వన్‌టౌన్ ప్రాంతాల్లో ప్రధానంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. బండమీదిపల్లి శివారు, కోయిలకొండ ఎక్స్‌రోడ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు సైతం తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. వితరణ కోసం వెంపర్లాట జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవకాశం లేదని తెలుస్తోంది. భద్రతా చర్యల నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు అనివార్యంగా పోలీసులు భావిస్తున్నా వితరణ కోసం వెంపర్లాడుతున్నారు. పట్టణ ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు ముందుకొస్తే వాటిని ఏర్పాటు చేయడానికి అవకాశాలుంటాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎంపిక చేసిన ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకురాలేక పోతున్నామంటున్నారు. పోలీసుల సూచనల మేరకు వ్యాపారుల ఎవరికి వారు దుకాణాల్లో మాత్రమే వీటిని ఏర్పాటు చేసుకున్నారు. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్, ఇతర అసాంఘిక కార్యకలాపాలను గుర్తించేందుకు అవకాశం లేకుండాపోతుంది. -
ఆ యువకుడిని పట్టుకుంటాం : డీఎస్పీ
చిన్నశంకరంపేట(మెదక్): ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోవాలని దళిత యువతిని వేధిస్తున్న యువకుడిని త్వరలో అరెస్టు చేస్తామని తూప్రాన్ డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు తెలిపారు. సోమవారం చిన్నశంకరంపేట పోలీస్‌స్టేషన్‌లో బాధితులతో మాట్లాడిన అనంతరం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. చిన్నశంకరంపేటకు చెందిన దళిత యువతిని అదే గ్రామానికి చెందిన నిద్రబోయిన స్వామి ఐదు నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని తెలిపారు. పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తున్నాడని యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపినట్లు తెలిపారు. యువకుడిని త్వరలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలతో నేరాల అదుపు సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయడానికి చర్యలు చేపట్టినట్లు తూప్రాన్ డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు తెలిపారు. తూప్రాన్ సబ్‌డివిజన్‌లో ఇప్పటికే 450 సీసీ కెమెరాలను అమర్చినట్లు తెలిపారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలు అదుపు
కొత్తకోట: సమాజంలోని ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములుకావాలని.. అప్పుడే వందశాతం నేరాలు అదుపు చేయవచ్చని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. మండల కేంద్రంలోని బీపీఆర్ గార్డెన్లో ఆదివారం ఆమె సీసీ కెమెరాల ఏర్పాటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పట్టణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వలన కలిగే లాభాలను ఎస్పీ వివరించారు. వీటిని ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్టణవాసులు, వ్యాపారులు, వివిధ కులసంఘాల నాయకులు, గ్రామ పంచాయతీ పాలకమండలి సభ్యులు సహకరించడం అభినందనీయమన్నారు. ఇటీవల పట్టణ కేంద్రాల్లో ఎక్కువగా చోరీలు జరుగుతుండటం మూలంగా వాటిని అరికట్టడానికి పట్టణంలో 70కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల దొంగలను గుర్తించడమే కాకుండా.. రోడ్డు ప్రమాదాలు జరిగిన వారికి ఇన్సూరెన్స్ కల్పించడం, అమ్మాయిలను రాగింగ్ చేసే వారిని గుర్తించడంతోపాటు ఇతర చట్టవ్యతిరేక సంఘటనలకు పాల్పడుతున్న దుండగులను పట్టుకోచ్చని తెలిపారు. పట్టణంలో సీసీల ఏర్పాటుకు కృషి చేసిన కొత్తకోట సీఐ సోమ్‌నారాయణŠసింగ్, ఎస్ఐ రవికాంత్‌రావును అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సురేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ డా. పీజే బాబు, ఎంపీపీ గుంత మౌనిక, కొత్తకోట సర్పంచ్ చెన్నకేశవరెడ్డి, సీడీసీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, కొత్తకోట సింగల్‌విండో చైర్మన్ సురేంద్రనాథ్‌రెడ్డి, ఆయా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
పల్లెలపై సీసీ నిఘా
ఉట్నూర్(ఖానాపూర్) : నేరాల నియంత్రణ కోసం గ్రామ స్థాయి నుంచి చర్యలు చేపట్టేందుకు పొలీసుశాఖ సన్నాహాలు ప్రారంభించింది. గ్రామం మొదలుకొని మండల, జిల్లాస్థాయి వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నిఘా పెంచేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే జిల్లా ఎస్పీలకు, కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామ అభివృద్ధి, పొలీసుశాఖ, వ్యాపారులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, జెడ్పీనిధులు నుంచి కొంత మొత్తం సేకరించి ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు యోచిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి నిఘా... గ్రామస్థాయిలో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా గ్రామాల్లో చోటు చేసుకోనే సంఘటనలు అందులో నిక్షిప్తం అవుతాయి. దాడులు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, ఇతర నేరాలకు పాల్పడే వారిని పట్టుకునేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటికే పలు చోట్ల పోలీసు యంత్రాంగం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ నిఘా నేత్రాలను గ్రామానికి సంబంధించిన పోలీస్‌స్టేషన్‌లో కంట్రోల్‌రూంకు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. తద్వారా ఎమైనా సంఘటనలు చోటుచేసుకుంటే సత్వరం స్పందించే అవకాశం ఉంటుంది. అలాగే నేరస్తుల గుర్తింపు, కేసుల విచారణలో ఇవి దోహదపడుతాయి. ప్రతి గ్రామంలో 5 నుంచి 10 సీసీ కెమెరాలు పోలీసు శాఖ ఇప్పటికే మండల, పట్టణ, జిల్లా కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తోంది. వీటి మాదిరిగానే గ్రామాల్లో సైతం ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో 70 మండలాలు, 866 గ్రామపంచాయతీలున్నాయి. వీటి పరిధిలో 1,756 రెవెన్యూ గ్రామాలు, 3,680 అనుసంధాన గ్రామాలతో పాటు 6,49,888 గృహ సముదాయాలు, 27,41,239 జనాభా ఉంది. ఈమేరకు ప్రతి గ్రామంలో 5 నుంచి 10 సీసీ కెమెరాలు, మండల కేంద్రాల్లో 30, పట్టణ ప్రాంతాల్లో 500, జిల్లా కేంద్రాల్లో 1000 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. గ్రామస్థాయిలో ఈ విధానం అమలు జరిగితే నేరాలు, దొంగతనాలు చాలావరకు అదుపులోకి వస్తాయని ప్రజలు అంటున్నారు. -
గ్రామాల్లో సీసీ కెమెరాలు!
సాక్షి, హైదరాబాద్: నేర నియంత్రణ కోసం గ్రామస్థాయి నుంచే చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో కమ్యూనిటీ సీసీ కెమెరాలు విస్తృతంగా ఏర్పాటు చేసిన విష యం తెలిసిందే. ప్రతీ చిన్న ఘటన కూడా వాటిలో నిక్షిప్తమవుతోంది. కిడ్నాపులు, దాడులు, బాంబుపేలుళ్లు, రోడ్డు ప్రమాదాల్లో నేరస్తులను పట్టుకునేందుకు వీలవుతుంది. గ్రామ అభివృద్ధి నిధులు, పోలీస్ శాఖ , వ్యాపారులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, జెడ్పీ నిధుల నుంచి కొంత మొత్తాన్ని సేకరించి ప్రతీ గ్రామంలో కనీసం 5 నుంచి 10, మండల కేంద్రాల్లో 30, పట్టణాల్లో కనీసం 50, జిల్లా కేంద్రాల్లో 1,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ శాఖ ప్రతిపాదనలు చేసింది. -
పోలీసులకు సవాల్
దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘాను పటిష్టం చేశామని పోలీస్ శాఖ పేర్కొంటుండగా.. ఎంత నిఘా ఉన్నా మమ్మల్నెవరూ ఆపలేరన్నట్లు చోరులు రెచ్చిపోతున్నారు. మొన్న వేణుగోపాలస్వామి ఆలయంలో చోరీ జరగ్గా.. నిన్న ఏకంగా జేసీ ఇంటి తాళాలే బద్ధలయ్యాయి. వరుస ఘటనలు పట్టణవాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలో జరిగిన వరుస చోరీలు పోలీసులకు సవాల్‌గా మారాయి. రెండు రోజుల్లో రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని పెద్దబజార్లో గల వేణుగోపాలస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. చోరులు అత్యంత విలువైన పంచలోహ విగ్రహాలను అపహరించారు. ఈ సంఘటన మరిచిపోకముందే ఆదివారం రాత్రి అశోక్‌నగర్ కాలనీలో నివాసం ఉండేజాయింట్ కలెక్టర్ సత్తయ్య ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించారు. అయితే జేసీ ఇంట్లో ఎలాంటి వస్తువులు, నగదు పోలేదని తెలుస్తోంది. తాళాలు పగులగొట్టిన విషయమై జేసీ సీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రంలో పోలీసులు రాత్రంతా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా.. దొంగలు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇటీవల కామారెడ్డి మండలం గర్గుల్‌లో, రామారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో చోరీలు జరిగాయి. తాజాగా జిల్లా కేంద్రంలో రెండు రోజుల్లో రెండు సంఘటనలు జరిగాయి. పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా.. నిత్యం బీట్ కానిస్టేబుళ్లు తమకు కేటాయించిన కాలనీల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పెట్రోలింగ్ జీపులు కూడా పట్టణంలో తిరుగుతున్నప్పటికీ దొంగలు రెచ్చిపోతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. పెద్దబజార్‌కు సమీపంలోని వేణుగోపాలస్వామి ఆలయంలోకి దొంగలు దర్జాగా వెళ్లి విగ్రహాలను ఎత్తుకెళ్లిన సంఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. దొంగల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సీసీ ఫుటేజీలు, సెల్ సిగ్నల్స్ ఆధారంగా కేసును ఛేదించే పనిలో ఉన్నారు. రూ. కోటి విలువ చేసే విగ్రహాలు ఎత్తుకెళ్లిన సంఘటన పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ సంఘటన జరిగి 24 గంటలు కూడా గడవకముందే జేసీ నివసిస్తున్న ఇంటికి దొంగలు కన్నం వేశారు. ఆదివారం సెలవు కావడంతో జేసీ హైదరాబాద్‌కు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు తాళాలు పగులగొట్టి ఇళ్లంతా వెతికారు. వారికి ఎలాంటి డబ్బులు, సామగ్రి దొరకలేదని తెలుస్తోంది. ఈ రెండు సంఘటనలు పోలీసులకు సవాల్‌గా మారాయి. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టణవాసుల్లో భయం... ఇంటికి తాళం వేసి ఎటు వెళ్లాలన్నా పట్టణ ప్రజలు భయపడుతున్నారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు.. పగటిపూట తిరిగి, రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్నట్టు స్పష్టమవుతోంది. బంధువుల ఇళ్లకో, ఇతర పనుల రీత్యానో ఇంటికి తాళాలు వేసి వెళ్తే గ్యారంటీ లేకుండాపోతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చైన్‌స్నాచింగ్ సంఘటనలు ఎక్కువగా జరిగేవి. చైన్‌స్నాచర్లు పోలీసులకు చిక్కడంతో అవి కొంతమేర తగ్గాయి. వరుసగా జరిగిన రెండు చోరీలు పట్టణ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దొంగతనాలు జరుగకుండా పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలి. అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి. దొంగతనాలు జరుగకుండా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్లలో బంగారం, నగదు ఉంచి తాళాలు వేసి ఎటూ వెళ్లవద్దు. తప్పనిసరి వెళ్లాల్సి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – ఎ.శ్రీధర్‌కుమార్, ఎస్‌హెచ్‌వో, కామారెడ్డి -
20 లక్షల మంది భక్తులు!
సాక్షి, హైదరాబాద్: నాలుగు వేల బస్సులు.. 11 వేల మంది సిబ్బంది.. 20 లక్షల మంది ప్రయాణికుల తరలింపు లక్ష్యం.. సీసీ కెమెరాలు, ఉపగ్రహం ద్వారా ట్రాకింగ్‌తో పర్యవేక్షణ.. గిరిజన కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు ఆర్టీసీ ప్రణాళిక ఇది. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. అప్పటికప్పుడు సిద్ధంగా ఉన్న ప్రయాణికులెందరు, వారికి ఎన్ని బస్సులు అవసరమన్నది క్షణాల మీద గుర్తించి.. అంతేవేగంగా బస్సులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తుండటం ఈసారి ప్రత్యేకత. కనీసం 20 లక్షల మంది భక్తులను గమ్యస్థానాలకు చేర్చటం లక్ష్యంగా పెట్టుకున్నందున 4 వేల బస్సులను సిద్ధం చేసింది. మరో ఐదారు వందల బస్సులను స్పేర్‌లో పెట్టుకుంది. హైదరాబాద్ నుంచి మేడారం వద్దకు బస్సును తరలించే వరకు మొత్తం 11 వేల మంది సిబ్బందిని ఇందుకోసం వినియోగిస్తున్నారు. మేడారంలో పెద్ద పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రద్దీని తెలుసుకునేందుకు.. సీసీ కెమెరాలు జాతర జరిగే ప్రాంతంలో ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు 20 సీసీ కెమెరాలను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఆర్టీసీ ప్రాంగణంవైపు వస్తున్న భక్తులు, బస్సుల కోసం క్యూ లైన్లలో వేచి ఉండే ప్రయాణికుల సంఖ్యను క్షణక్షణం పర్యవేక్షిస్తూ బస్సులను సమాయత్తం చేయనుంది. ఏ బస్సు ఎక్కడుందో ట్రాక్ చేసేందుకు వీలుగా జాతరకు ఏర్పాటు చేసిన బస్సులన్నింటినీ ఉపగ్రహం ద్వారా ట్రాక్ చేసే విధానంతో అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల బస్సులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తిస్తారు. సిబ్బంది వద్ద వాకీటాకీలు ఉంటాయి. జంపన్నవాగు నుంచి ఉచిత బస్సులు జాతరకు వచ్చే వారు తమ వాహనాలను సమీపంలో ఉండే నార్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ యార్డులో నిలపాలి. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో జాతర వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ బస్సుల్లో ఉచితంగా తరలించనున్నారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే జంపన్నవాగుకు కూడా మినీ బస్సులను ఏర్పాటు చేశారు. వీటిలోనూ ప్రయాణికులను ఉచితంగా తరలించనున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం: ఆర్టీసీ ఎండీ రమణారావు ‘ఈ సారి జాతరలో ఆర్టీసీ కీలక సేవలందించనుంది. దాదాపు 20 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు తరలించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశాం. మేడారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాంకేతికతను వాడుకుంటున్నాం. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. నేను జాతర పూర్తయ్యే వరకు అక్కడే ఉండి పర్యవేక్షిస్తాను’. -
భద్రత కట్టుదిట్టం..!
ఇకపై కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాల లోపలికి వెళ్లాలంటే అర్జీదారులు కాస్త ఇబ్బంది పడాల్సిందే. దరఖాస్తుదారులు ఎవరైనా సరే తమ వెంట తెచ్చుకున్న వస్తువులు, పత్రాలను ఆయా కార్యాలయాల బయట పోలీస్ సిబ్బందికి చూపించాకే లోపలికి వెళ్లాల్సిన పరిస్థితులొచ్చాయి. వివిధ సమస్యలతో జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్న బాధితులు ఇటీవల ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు ఆయా కార్యాలయాల వద్ద భద్రతను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. సాక్షి, జగిత్యాల : సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్, ఎస్పీలను కలిసేందుకు వచ్చి పురుగుల మందు తాగడం.. ఒంటిపై కిరోసిన్ పోసుకోవడం వంటి అఘాయిత్యాలకు చెక్ పెట్టడానికి పోలీస్ బాస్ భద్రత చర్యలను కట్టుదిట్టం చేశారు. ఈక్రమంలో ఇప్పటికే ఆయన తన క్యాంప్ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా ఓ క్యాబిన్ ఏర్పాటుచేశారు. ఇందులో ఓ ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఓ హోంగార్డుకు విధులు కేటాయించారు. వీరు ఎస్పీ కార్యాలయానికి వచ్చే ఆర్జీదారులు క్షేమంగా తిరిగి వెళ్లేవరకు వారిపై దృష్టిపెట్టనున్నారు. ఎవరైన పురుగుల మందు డబ్బాలు.. కిరోసిన్‌తో వస్తే వారిని బయటే అడ్డుకుని వెంట తీసుకొచ్చిన వాటిని స్వాధీనం చేసుకుంటారు. కేవలం ఫిర్యాదుదారుడిని లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. మరోపక్క.. ఇప్పటికే ప్రతి సోమవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) భవనంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి నలుగురైదుగురు పోలీసులకు విధులు కేటాయిస్తున్నారు. అయితే.. ఇకపై ప్రతి సోమవారం వారి సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రస్తుతం ఒక హోంగార్డు విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇకపై కనీసం ఇద్దరైనా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయం వద్ద నలుగురు.. కలెక్టరేట్లో మరో నలుగురు.. మొత్తం ఎనిమిది మంది హోంగార్డులను నియమించి వారికి అవసరమైన శిక్షణ ఇవ్వాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. ‘నిఘా’ ఏదీ..? ప్రభుత్వ కార్యాలయాల ముందు ప్రజల ఆత్మహత్యాయత్నాల వెనక దళారులు ఉన్నట్లు కలెక్టర్ శరత్ ఇప్పటికే గుర్తించారు. ప్రభుత్వ కార్యక్రమాలు.. పథకాల్లో పెరుగుతున్న దళారుల ప్రమేయంపై సీరియస్ అయ్యారు. అనర్హులకూ లబ్ధి చేకూరుస్తామని మాయమాటలు చెప్పి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్న వారిపై కొరడా ఝుళిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 8న ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించే ఐఎంఏ భవనం, పరిసర ప్రాంతాల్లోనూ బాధితులు, వారి వెంట వచ్చి వెళ్లే వారిని గుర్తించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటికీ సీసీ కెమెరాలు ఏర్పాటు కాలేదు. ఇప్పటికైనా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ విషయమై జిల్లా రెవెన్యూ అధికారి శ్యాం ప్రకాశ్ వివరణ ఇస్తూ.. ‘ ఐఎంఏ భవనంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే సాంకేతిక సిబ్బంది వచ్చి కెమెరాల ఏర్పాటుపై పరిశీలన చేశారు. త్వరలోనే కెమెరాలు ఏర్పాటు చేస్తాం’ అన్నారు. -
అచ్చంపేటలో భారీ చోరీ
సాక్షి, అచ్చంపేట: గుంటూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. అచ్చంపేటలోని ఓనగల దుకాణంలో చోరీకి పాల్పడి అందినకాడికి దోచుకుపోయారు. వెళ్తూ వెళ్తూ తమను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను సైతం ఎత్తుకెళ్లిపోయారు.. వివరాల్లోకి వెళ్తే అచ్చంపేట ఆలీ ఆభరణాల దుకాణంలో గత రాత్రి భారీ చోరీ జరిగింది. షాప్ వెనుకపైపు ఉన్న తలుపు పగలకొట్టి లోపలకి ప్రవేశించిన దొంగలు, సుమారు యాభైలక్షల విలువ చేసే ఆభరణాలతో పాటు పెద్దమెత్తంలో నగదును దోచుకెళ్లారు. పారిపోతూ పోలీసులకు పట్టుపడకుండా ఉండేందుకు అతితెలివి ప్రదర్శించారు. దుకాణం భద్రతకోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను ఎత్తుకెళ్లారు. ఉదయం షాపు తలుపు తెరచి చూసిన యజమానులు విషయం అర్థమై అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ చోరీపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
అలరించే అడవి అందాలు
చింతలమానెపల్లి(సిర్పూర్): జిల్లాలో అలరించే ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయి. కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలోని కాగజ్‌నగర్, కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్, దహెగాం మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతం ఎన్నో రకాల వన్యప్రాణులకు నెలవు. డివిజన్లోని అడవులలో ప్రవహించే ప్రాణహిత నది, పెద్ద వాగు (బీబ్రానది) అందాలు పర్యాటకంగా ప్రకృతి ప్రేమికుల మనసును దోస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో వన్యప్రాణులు సందడి చేస్తూ అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిక్కాయి. మరికొన్ని చిత్రాలను అధికారులు ప్రత్యేక కెమెరాలతో చిత్రీకరించారు. ఈ చిత్రాలను కాగజ్‌నగర్ అటవీ అధికారుల వద్ద నుంచి ‘సాక్షి’ సేకరించింది. -
రైళ్లలో 12 లక్షల సీసీటీవీ కెమెరాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రయాణీకులకు భద్రతతో కూడిన ప్రయాణానుభూతులను కల్పించేందుకు దేశవ్యాప్తంగా అన్ని రైళ్లు, రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాయి. త్వరలోనే 11,000 రైళ్లు, 8500 రైల్వే స్టేషన్లలో దాదాపు 12 లక్షల సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు రైల్వే శాఖ కసరత్తు సాగిస్తోంది. 2018-19 రైల్వే బడ్జెట్లో దీనికోసం రూ 3000 కోట్లతో నిధి ఏర్పాటు కానుంది. రైల్వేల ప్రణాళిక ప్రకారం ప్రతి కోచ్‌లో ఎనిమిది సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. రైల్వే స్టేషన్లలో ప్రవేశ ద్వారాల నుంచి అన్ని ప్రదేశాలను కవర్ చేసేలా నిఘా నేత్రాల పర్యవేక్షణ ఉండేలా ప్రణాళికలు రూపొందించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 395 స్టేషన్లు, 50 రైళ్లలో సీసీటీవీ వ్యవస్థ అందుబాటులో ఉంది. రాబోయే రెండేళ్లలో రాజధాని, శతాబ్ధి, దురంతో సహా అన్ని ఎక్స్‌ప్రెస్, ప్రీమియర్ రైళ్లలో ఆధునిక నిఘా వ్యవస్థలను అందుబాటులోకి తెస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి పేర్కొన్నారు. వివిధ మార్గాల ద్వారా ఈ కార్యక్రమానికి భారీగా నిధులు సమీకరించేందుకు రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలు పెరుగుతున్న క్రమంలో రానున్న రైల్వే బడ్జెట్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు తెలిపారు. -
మాటలు కలిపి.. మత్తులో దించి
మొయినాబాద్(చేవేళ్ల): అమ్మలా ఉన్నావంటూ మాయమాటలతో వృద్ధురాలిని బుట్టలో వేసుకున్న ఓ కి‘లేడీ’ మద్యం తాగించి బంగారు, వెండి నగలు కాజే సింది. ఒక్క రోజులోనే నిఘానేత్రానికి చి క్కిన ఈ పాత నేరస్తురాలిని పోలీసులు శ నివారం రిమాండ్‌కు తరలించారు. మొ యినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్, మొయినాబాద్ సీఐ సు నీత వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతానికి చెందిన చాంద్‌బీ(45) గత కొంతకాలంగా నగ రంలోని బార్కాస్ బండ్లగూడ గౌస్‌నగర్ లో నివాసముంటుంది. పరిసర ప్రాంతా ల్లో బిక్షాటన చేస్తూ అమాయక మహిళలను మాయమాటలతో బుట్టలో వేసుకు ని దొంగతనాలకు పాల్పడుతుంది. కాగా ఈ నెల 18న మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వృ ద్ధురాలు బుచ్చమ్మ(65) మొయినాబాద్ లో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చింది. కూరగాయలు కొనుక్కుని తిరిగి వెళ్తుండగా ఒంటిపై నగలతో చాంద్‌బీ కంట పడింది. చాంద్‌బీ ఆమె వద్దకెళ్లి నీవు మా అమ్మలా ఉన్నావంటూ మాటలు కలిపింది. మాయ మాటలతో బుట్టలో పడిసేంది. చనువుగా వ్యవహరింస్తూ మద్యం సేవించేందుకు తీసుకెళ్లింది. సురంగల్ రోడ్డులో ఉన్న మద్యం షాపు వద్దకు తీసుకెళ్లి విస్కీ క్వార్టర్, ఒక బీరు బాటిల్ తీసుకుంది. రెండూ కలిపి వృద్ధురాలికి తాగించింది. మద్యం మత్తులో ఉన్న వృద్ధురాలి మెడలో నుంచి తులంన్నర బంగారు గుండ్లు, అర తులం బంగారు కమ్మలు, 30 తులాల వెండి నడుము వడ్డానం తీసుకుని పారిపోయింది. తేరుకున్న తరువాత బుచ్చమ్మ మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పట్టించిన నిఘానేత్రం... కేసు విచారణలో భాగంగా పోలీసులు వృద్ధురాలు ఎక్కడెక్కడ తిరిగిందో ఆ పరిసరాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. మద్యం షాపు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఓ మహిళ మద్యం సీసాలు తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వృద్ధురాలు నగలు దోచుకుంది ఆ మహిళే అని గుర్తించిన పోలీసులు ఆమె కోసం వెతుకుతుండగా ఈ నెల 19న శుక్రవారం మొయినాబాద్‌లో కనిపించింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకుని చాంద్‌బీని శనివారం రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి వచ్చిన 45 రోజులకే తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న చాంద్‌బీ జైలు నుంచి వచ్చిన 45 రోజులకే మళ్లీ దొంగతనానికి పాల్పడింది. గతంలో చాంద్‌బీ రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లుగా పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ సలాంను ఏసీపీ అశోక్ ప్రత్యేకంగా అభినందించి రివార్డు ఇవ్వనున్నట్లు చెప్పారు. నేరస్తులను పట్టించడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని.. ప్రతి గ్రామంలో సీసీ కెమరాలు ఏర్పాటు చేసేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని ఏసీపీ కోరారు. సమావేశంలో సీఐ సునీత, ఎస్సై రాందాస్‌నాయక్, కానిస్టేబుల్ కవిత ఉన్నారు.