ఆరేళ్ల చిన్నారిని ఢీ ‌కొన్న కారు | Speeding car hits 6-year-old girl | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల చిన్నారిని ఢీ ‌కొన్న కారు

Jul 5 2018 3:44 PM | Updated on Mar 21 2024 5:20 PM

రోడ్డు దాటేటపుడు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి లేదా అనుకోకుండా చేసే చిన్న తప్పిదాలే భారీ ప్రమాదాలకు కారణమవుతాయి. ఆరేళ్లబాలిక మెయిన్‌ రోడ్డు క్రాస్‌ చేస్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముజఫర్‌ నగర్‌లోని ఓ మెయిన్‌ రోడ్డును క్రాస్‌ చేయాలనుకున్న బాలికను ప్రమాదవశాత్తూ కారు ఢీకొట్టింది. మెయిన్‌ రోడ్డు సగం క్రాస్‌ చేసిన బాలిక అనంతరం డివైడర్‌ను దాటి రోడ్డు అవతలి వైపు వెళ్లడానికి ప్రయత్నించగా, వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో బాలిక గాల్లో ఎగిరి దూరంలో పడిపోయింది. బాలికకు తీవ్రగాయాలవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement