Caught on Cam
-
ఆ... ఆరుగురు మహా ముదుర్లు..!
సాక్షి, హిమాయత్‌నగర్: వృత్తిరిత్యా కూలిపనులు చేసుకునే ఆరుగురు యువకులు చోరీలు చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నారు. జల్సాల కోసం ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు, ద్విచక్రవాహానాలు దొంగిలిస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డారు. ఆరుగురిలో ఇద్దరు మేజర్లు కాగా..నలుగురు మైనర్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు జైలుకు వెళ్లి వచ్చినా తమ పంథా మార్చుకోలేదు. తాజాగా నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడి నుంచి సెల్‌ఫోన్, నగదు దోపిడీ చేసి సీసీపుటేజీ ఆధారంగా కొన్ని గంటల్లోనే పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌కు చెందిన అనూజ్‌ప్రసాద్ హైటెక్‌సిటీలో క్యాటరింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ నెల 26 రాత్రి అతను లిబర్టీ సిగ్నల్ నుంచి నారాయణగూడ ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఉన్న బస్టాప్‌కు వచ్చాడు. అయితే హైటెక్ సిటీకి వెళ్లేందుకు బస్సులేకపోవడంతో బస్టాప్‌లోనే పడుకున్నాడు. అర్థరాత్రి రాంనగర్ ఫిష్‌మార్కెట్ ప్రాంతానికి చెందిన చంద్రకాంత్, మధు, సోహల్, గౌతమ్, రంజిత్, షరీఫ్ రెండు బైక్‌లపై వచ్చి అనూజ్‌ప్రసాద్‌ను బెదిరించి అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్, పర్సు, రూ.150 నగదు లాక్కుని పరారయ్యారు. వీరిలో చంద్రకాంత్, మధు మేజర్లు కాగా, మిగతా నలుగురూ మైనర్లు కావడం గమనార్హం. మరుసటి రోజు బాధితుడు అనూజ్‌ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీల ద్వారా గుర్తింపు.. సీసీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు సెల్‌ఫోన్ చోరీ అనంతరం నిందితులు రాంనగర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. రాంనగర్ ఫిష్‌మార్కెట్ వద్ద స్థానికులను విచారించగా నిందితులపై కీలక సమాచారం అదించారు. దీంతో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. షరీఫ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. అందరికీ నేరరచరిత్ర.. పోలీసు స్టేషన్లో పోలీసులు నిందితులను విచారించగా పలు చోరీలు వెలుగులోకి వచ్చాయి. సోహల్, చంద్రకాంత్, మధు నగరంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. చంద్రకాంత్ ఉప్పల్ పీఎస్ పరిధిలో ల్యాప్‌టాప్‌లు దొంగిలించి రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చా డు. మధు చిక్కడపల్లి, నల్లకుంట పోలీసు స్టేషన్ పరిధిలో బైక్, ల్యాప్‌టాప్ చోరీ కేసులో పోలీసులకు పట్టుబడటంతో రెండు సార్లు జైలుకు వెళ్లాడు. సోహాల్ గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో నగదు, సెల్ఫోన్లు చోరీ చేసి జైలుకు వెళ్లాడు. గంజాయి కోసమే.. గంజాయికి అలవాటు పడిన వీరు డబ్బుల కోసం చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మధు కార్‌వాషింగ్‌లో పనిచేస్తుండగా.. సోహల్ మటన్‌షాప్‌లో పనిచేస్తున్నాడు. వీరు మిగతా నలుగురితో కలిసి గంజాయి తాగేవారు. గంజాయి కొనేందుకు చోరీలకు పాల్పడుతున్నట్లు ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. -
ఆరేళ్ల చిన్నారిని ఢీ కొన్న కారు
-
సీసీటీవీలో రికార్డయిన షాకింగ్ వీడియో
ముజఫర్‌నగర్(ఉత్తరప్రదేశ్) : రోడ్డు దాటేటపుడు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి లేదా అనుకోకుండా చేసే చిన్న తప్పిదాలే భారీ ప్రమాదాలకు కారణమవుతాయి. ఆరేళ్లబాలిక మెయిన్ రోడ్డు క్రాస్ చేస్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముజఫర్ నగర్‌లోని ఓ మెయిన్ రోడ్డును క్రాస్ చేయాలనుకున్న బాలికను ప్రమాదవశాత్తూ కారు ఢీకొట్టింది. మెయిన్ రోడ్డు సగం క్రాస్ చేసిన బాలిక అనంతరం డివైడర్‌ను దాటి రోడ్డు అవతలి వైపు వెళ్లడానికి ప్రయత్నించగా, వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో బాలిక గాల్లో ఎగిరి దూరంలో పడిపోయింది. బాలికకు తీవ్రగాయాలవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈతతంగం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. జూలై మూడున చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించామని, డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
ఆరేళ్ల చిన్నారిని ఢీకొన్న కారు
-
ఆగలేక ముద్దు పెట్టాడు.. పదవి పోయింది
-
ఆగలేక ముద్దు పెట్టాడు.. పదవి పోయింది
న్యూయార్క్ : సాధరణ పౌరులేమోగానీ నాయకులు మాత్రం ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలి. అలా కాకుండా అతి చేయాలని చూస్తే మొదటికే మోసం వస్తుంది.. పదవి పోయి తీరుతుంది. అమెరికాలో ఓ సెనేటర్ పరిస్థితి అంతే అయింది. ఓ బార్‌కు వెళ్లిన షెల్ రాక్ లోవా సెనేటర్ బిల్ డిక్స్ ఓ లాబీయిస్ట్ మహిళకు అందరి ముందే గాటు ముద్దు పెట్టాడు. ఆ దృశ్యాన్ని వీడియో తీసిన కొంతమంది ఆన్లైన్లో పెట్టడంతో అది కాస్త వైరల్ అయింది. బాధ్యత గల వ్యక్తి ఇలాగేనా ప్రవర్తించేదంటూ తీవ్ర స్థాయి దుమారం రేపింది. దాదాపు 52 నిమిషాలపాటు ఉన్న ఆ వీడియోను లిబరల్ న్యూస్ వెబ్సైట్ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో చూపిన ప్రకారం బార్లో ఉండే స్లూల్స్పై డిక్స్ మరో మహిళతో కూర్చొని ఉన్నాడు. దర్జాగా మందుకొడుతూ రెచ్చిపోయి ఆమెను గాఢంగా చుంబించాడు. అయితే, ఆ మహిళ వివరాలు మాత్రం బయటపెట్టకుండా ఆమె ఒక లాబీయిస్ట్ అంటూ సదరు న్యూస్ సంస్థ తెలిపింది. పలు మున్సిపాలిటీ గ్రూపులకు ఆమె లాబీయిస్టుగా పనిచేస్తారని వెల్లడించింది. ఈ ఘటన ఇదే నెల (మార్చి) 1న చోటు చేసుకుంది. దీంతో లోవా సెనేట్ ప్రెసిడెంట్ జాక్ వైట్వర్ ఓ కీలక ప్రకటన చేశారు. మార్చి 12 అర్ధరాత్రి 2గంటల నుంచి డిక్స్ సెనేటర్ బాధ్యతలకు ముగింపు అని వెల్లడించారు. డిక్స్ తన కుటుంబంలో మూడో తరం రైతు. బట్లర్, గ్రండి, హార్డిన్, ఇతర జిల్లాల్లో తన వ్యవసాయ కార్యకలాపాలు చూసుకునేవారు. పదేళ్లపాటు లోవా హౌస్‌లో పనిచేశారు. 2010 నుంచి వరుసగా సెనేటర్‌గా ఎంపికవుతూ వస్తున్నాడు. అయితే, ఈ ఘటనపై డిక్స్ వ్యక్తిగతంగా ఒక్క ప్రకటన కూడా చేయలేదు. అతడి పూర్తి వివరాలను అప్పుడే లోవా సెనేట్ రిపబ్లికన్స్ వెబ్సైట్ నుంచి కూడా తొలగించారు. -
కెమెరాకు చిక్కిన పోలీస్ బాస్
సాక్షి, లక్నో : వివాదాస్పదమైన అయోధ్యలోని రామమందిరం నిర్మిస్తామంటూ ప్రతిజ్ఞ చేస్తూ ఓ పోలీసు ఉన్నతాధికారి కెమెరా కంటికి చిక్కారు. లక్నో యూనివర్సిటీలో కొంతమంది వ్యక్తులతో కలిసి ఆయన ఈ ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు ఈ విషయం పెను ధుమారం రేపుతోంది. వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లో సూర్యా కుమార్ అనే వ్యక్తి హోమ్ గార్డ్ విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోనే సెకండ్ మోస్ట్ ఐపీఎస్ అధికారి. 1982 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అయిన ఆయన పోలీసు బాస్‌గా అయ్యేందుకు రేసులో కూడా ఉన్నారు. అయితే, ఇటీవల లక్నోలోని యూనివర్సిటీలో కొంతమందితో కలిసి 'రామ్ మందరిర్ నిర్మాణ్ సమస్య ఎవం సమధాన్' అనే కార్యక్రమంలో పాల్గొని రామమందిరం నిర్మాణానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని అఖిల భారతీయ సమగ్ర విచార్ మంచ్ నిర్వహించింది. 'మనందరం రాముని భక్తులం.. వీలయినంత త్వరలో భారీ రామమందిరం నిర్మాణం పూర్తి చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం.. జైశ్రీరాం' అని ప్రతిజ్ఞ చేశారు. కాగా, దీనిపై ఆయన స్పందిస్తూ తాను కేవలం ఒక అతిథిగానే అక్కడికి వెళ్లానని, సమస్యకు పరిష్కారం ఆలోచించే దిశగా మాత్రమే అక్కడ చర్చలు జరిగాయని అన్నారు. దానికి సంబంధించిన కొద్ది వీడియో మాత్రమే బయటకు వచ్చిందని తెలిపారు. -
గురు ద్వార్లోకి చొరబడి ఏం చేశారంటే..
గుర్గావ్: హర్యానాలో దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. గురు ద్వార్లోకి చొరబడి అందులో హుండీని ఎత్తుకెళ్లారు. ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దానిలో ఏముందంటే తొలుత నల్లటి కోటు తలపై మంకీ క్యాప్‌ను ధరించి గురు ద్వార్లోకి వచ్చిన ఓ వ్యక్తి పీఠం ముందు ఉన్న పెద్ద హుండీని కదిలించేందుకు ప్రయత్నించాడు. అది కదలకపోవడంతో మరో దొంగను పిలిచాడు. అతడు వీపుకు నల్లటి బ్యాగు తగిలించుకొని తెల్లటి షర్ట్, నలుపు ప్యాంట్ తో ఉన్నాడు. ఆ తర్వత ఇద్దరు కలిసి దానిని ఏం చక్కా బయటకు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత అందులో రెడ్ మంకీ క్యాప్ పెట్టుకున్న వ్యక్తి తిరిగి వెనక్కు వచ్చి ఎలాంటి అనుమానం రాకుండా పీఠం ముందు టేబుల్లాంటిదాన్ని సర్దుబాటు చేసి వెళ్లాడు. పోలీసుల విచారణలో భాగంగా గురు ద్వార్ ఈ వీడియో ఫుటేజీని విడుదల చేసింది.